దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు ఆయన ఆచరణాత్మకతకు ఖచ్చితంగా లోబడేవారు
ఆచరణాత్మకమైన జ్ఞానమును మరియు దేవుని కార్యము గురించిన సమగ్ర అవగాహనను పొందడం అనే ఈ రెండూ ఆయన వాక్యాల్లో కనిపిస్తాయి, ఈ భాషణల ద్వారా మాత్రమే నీవు జ్ఞానోదయం పొందగలవు. కాబట్టి నిన్ను నీవు దేవుని వాక్యాలతో మరియెక్కువగా సంసిద్ధం చేసుకోవాలి. సహవాసములో దేవుని వాక్యాలపట్ల నీవు కలిగియున్న అవగాహనను పంచుకోవాలి, ఈ విధంగా నీవు ఇతరులను వెలిగించి మరియు వారికొక మార్గాన్ని అందించవచ్చు. ఇదే ఆచరణాత్మకమైన మార్గము. దేవుడు నీ కొరకు ఒక వాతావరణాన్ని సిద్దపరిచే ముందు, మీలో ప్రతి ఒక్కరు ఆయన వాక్యాలతో మిమ్మల్ని మీరు సిద్దపరచుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని; ఇది తక్షణమే చేయవలసిన ప్రాధాన్యతయైయున్నది. మొదట, దేవుని వాక్యాన్ని ఎలా తిని త్రాగాలో తెలిసిన స్థితికి మీరు చేరుకోవాలి. మీరు చేయలేనిది ఏదైనా ఉంటే, ఒక ఆచరణ మార్గం కోసం ఆయన వాక్యాలను వెదకాలి, మరియు మీకు అర్ధం కాని సమస్యల కొరకు, లేక మీకున్న ఇబ్బందుల కొరకు ఈ మాటలను క్షుణ్ణంగా పరిశీలన చేయండి. దేవుని వాక్యాలను నీ పోషణగా చేసుకుని. మీ ఆచరణాత్మక ఇబ్బందులు మరియు సమస్యలను పరిష్కరించడంలో నీకు సహాయపడటానికి వాటిని అనుమతించాలి; అలాగే ఆయన వాక్యాలను నీ జీవితంలో సహాయముగా మారడానికి కూడా అనుమతించాలి. ఈ విషయాలపట్ల నీ వంతు కృషి అవసరం. దేవుని వాక్యాన్ని తిని త్రాగడంలో, మీరు ఫలితాలను సాధించాలి; ఆయన యెదుట మీరు మీ హృదయాన్ని నిమ్మళ పరచకోగలగాలి, మరియు ఎప్పుడైనా మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కున్నప్పుడు మీరు ఆయన మాటలకు అనుగుణముగా నడుచుకోవడమును అభ్యసించాలి. మీకు ఎటువంటి సమస్యలు లేనప్పుడు, నీవు ఆయన వాక్యాన్ని తిని త్రాగడం గురించి మాత్రమే శ్రద్ధ కలిగి ఉండాలి. కొన్నిసార్లు మీరు ప్రార్థించి దేవుని ప్రేమను తలంచవచ్చు, ఆయన వాక్యాల పట్ల మీకున్న అవగాహనను సహవాసములో పంచుకోవచ్చు, మీలో మీరు అనుభవించే వెలిగింపును గూర్చి మరియు జ్ఞానోదయమును గురించి మరియు ఈ వాక్యాలను చదివేటప్పుడు మీరు పొందుకునే ప్రతిస్పందనలను గురించి తెలియజేయవచ్చు. అంతేగాకుండా, మీరు ప్రజలకు ఒక మార్గాన్ని అందించవచ్చు. ఇది మాత్రమే ఆచరణాత్మకమైనది. దేవుని వాక్యాలను నీ ఆచరణాత్మక సరఫరాగా మారేలా చేయడమే ఇలా చేయడం యొక్క లక్ష్యమై ఉన్నది.
ఒక రోజు కాల వ్యవధిలో, నీవు దేవుని యెదుట ఎన్ని గంటలు యదార్థంగా గడుపుతావు? నీవు ఒక్క రోజులో ఎంత భాగం నిజంగా దేవునికి ఇచ్చావు? శరీరానికి ఎంత ఇచ్చావు? ఒకరి హృదయాన్ని ఎల్లప్పుడూ దేవుని వైపు మళ్ళించడమనేదే ఆయన ద్వారా పరిపూర్ణత పొందడం కోసం సరైన మార్గములో ఉండటానికి వేసే మొదటి అడుగుయైయున్నది. నీవు గనుక నీ హృదయం, శరీరం, మరియు నీ యదార్థమైన ప్రేమ మొత్తాన్ని దేవునికి అర్పించగలిగితే, వాటిని ఆయన ఎదుట ఉంచి, ఆయనపట్ల సంపూర్ణ విధేయత కలిగి, మరియు ఆయన చిత్తాన్ని పూర్తిగా గ్రహించినట్లయితే, అంటే ఆ దేవుని చిత్తం శరీరము కొరకు కాకుండా, కుటుంబం కొరకు కాకుండా, నీ వ్యక్తిగత కోరికల కొరకు కాకుండా, దేవుని ఇంటి ఆసక్తుల విషయమై, ప్రతి విషయములో దేవుని వాక్కును ఒక సూత్రముగాను మరియు పునాదిగాని తీసుకొని జరిగించినట్లయితే, నీ ఉద్దేశాలు మరియు నీ దృక్పథాలు అన్నీ సరైన స్థానంలో ఉంటాయి, మరియు నీవు దేవుని యెదుట ఆయన మెప్పును పొందే వ్యక్తిగా ఉంటావు. దేవునికి ఇష్టమైన ప్రజలు ఆయన వైపు ఖచ్చితంగా ఉంటారు; వారు మాత్రమే ఆయనకు పూర్తిగా అంకిత భావముతో సమర్పించుకుంటారు. దేవుడు అసహ్యించుకునేవారు ఆయనపట్ల అనాసక్తితోను మరియు ఆయనకు విరుద్ధముగాను తిరుగుబాటు చేస్తుంటారు. ఆయనను విశ్వసించి మరియు ఇంకా ఆయన కోసము తమని తాము పూర్తిగా వెచ్చించకుండా ఆయనను ఆస్వాదించాలని అనుకునేవారిని ఆయన అసహ్యించుకుంటాడు. ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పుకొని, తమ హృదయాలలో ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేసే వారిని ఆయన అసహ్యించుకుంటాడు; మోసపుచ్చడానికి అనర్గళమైన మరియు అలంకారమైన మాటలు వాడేవారిని ఆయన అసహ్యించుకుంటాడు. దేవునికి యధార్థముగా సమర్పించుకొననివారు, లేక ఆయన యెదుట నిజముగా లోబడనివారందరు స్వభావ సిద్ధంగానే ద్రోహులు మరియు అత్యంత అహంకారులు. సాధారణమైన మరియు ఆచరణాత్మకమైన దేవుని యెదుట నిజముగా లోబడనివారు మిక్కిలి దురహంకారులు మరియు వారు ప్రత్యేకముగా ప్రధాన దూత యొక్క విధిగల సంతానము. దేవుని కోసం నిజముగా తమను తాము వెచ్చించుకునే ప్రజలు వారి సర్వస్వాన్ని అయనకు సమర్పించుకొని మరియు తమునుతాము ఆయనముందు ఉంచుతారు; వారు ఆయన మాటలన్నిటికి మరియు ఆయన కార్యమంతటికి నిజంగా సమర్పించుకుంటారు మరియు వారు ఆయన మాటలను ఆచరణలో పెట్టగలుగుతారు. వారు దేవుని వాక్కులను అంగీకరించగలుగుతారు మరియు వాటిని వారి అస్తిత్వానికి పునాదులుగా ఎంచుకుంటారు మరియు ఏ పద్దతులను అనుసరించాలో తెలుసుకోడానికి దేవుని వాక్యాలలో యధార్ధముగా పరిశోధిస్తారు. అటువంటి ప్రజలు దేవుని యెదుట నిజంగా జీవించేవారు. నీవు ఇలా చేస్తే, నీ జీవిత ప్రవేశానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందిమరియు ఆయన వాక్యమును తిని త్రాగడం ద్వారా నీ అంతర్గత అవసరతలు మరియు కొరతలను నీవు తీర్చుకోగలవు, తద్వారా నీ జీవిత స్వభావము రూపాంతరము చెందుతుంది, అప్పుడు ఇది దేవుని చిత్తాన్ని మెప్పిస్తుంది. దేవుని ఆశయాలకు అనుగుణముగా నీవు ప్రవర్తించి, శరీరాన్ని తృప్తి పరచడానికి బదులుగా ఆయన చిత్తాన్ని బట్టి ఆయనను మెప్పించగలిగితే, అప్పుడు మీరు దేవుని వాక్యాల వాస్తవికతలోనికి ప్రవేశించినవారవుతారు. దేవుని మాటల వాస్తవికతలోనికి ప్రవేశించడం అంటే నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించగలిగి, దేవుని కార్యపు ఆశయాలను నెరవేర్చడమే. ఈ విధమైన ఆచరణాత్మక కార్యాలని మాత్రమే ఆయన మాటల వాస్తవికతలోనికి ప్రవేశించడం అని అంటారు. నీవు గనుక ఈ వాస్తవికతలోనికి ప్రవేశించగలిగితే, నీవు సత్యాన్ని కలిగి ఉంటావు. ఇది వాస్తవికతలోనికి ప్రవేశించియున్నారనుటకు ఆరంభమైయున్నది; ముందుగా నీవు శిక్షణ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే నీవు మరింత లోతైన వాస్తవికతలోనికి ప్రవేశించగలుగుతారు. ఆజ్ఞలను ఎలా పాటించాలో మరియు దేవుని యెదుట నమ్మకముగా ఎలా ఉండాలో పరిశీలన చేసుకుంటూ ఉండాలి; దేవుని రాజ్యములోనికి ఎప్పుడెప్పుడు ప్రవేశించాలనే దానిని గూర్చి నీవు తరచుగా ఆలోచన చేయవద్దు. నీ స్వభావము మారకపోతే, నీవేది అనుకున్నా వ్యర్ధమే! దేవుని వాక్యముల వాస్తవికతలోనికి ప్రవేశించడానికి, మీ తలంపులు మరియు ఆలోచనలన్నిటిని దేవుని కొరకు కలిగియుండాలి—ఇది ఎంతో అవసరం.
ప్రస్తుతం శ్రమల మద్య ఉన్న అనేకమంది ప్రజలు దేవుని కార్యమును అర్ధం చేసుకోవడము లేదు, కానీ నేను చెప్పేది ఏమంటే: నీవు దీనిని అర్ధం చేసుకోకపోతే, నీవు దాని గురించి తీర్పులు తీర్చకపోవడమే మంచిది. బహుశా సత్యము పూర్తిగా వెలుగులోకి వచ్చే రోజు వస్తుంది, అప్పుడు నీకు అర్ధం అవుతుంది. తీర్పులు తీర్చకపోవడమే నీకు ప్రయోజనకరము, అయినా నీవు ఖాళీగా ఎదురుచూడలేవు. చురుకుగా ప్రవేశించడానికి నీవు ప్రయత్నించాలి; అప్పుడే నీవు నిజంగా ప్రవేశించే వ్యక్తిగా ఉంటావు. వారి తిరుగుబాటుతనాన్ని బట్టి, ప్రజలు ఎల్లప్పుడూ ఆచరణాత్మక దేవుని గురించిన భావనలు వృద్ధి చేసుకుంటారు. ఆచరణాత్మక దేవుడు మానవజాతికి ఒక గొప్ప పరీక్ష కాబట్టి, ఇది ప్రజలందరూ ఎలా లోబడి ఉండాలో నేర్చుకోవాల్సిన అవసరాన్ని కలిగిస్తుంది. నీవు గనుక దృఢంగా నిలబడకపోతే, ఇక అంతా నాశనమవుతుంది; ఆచరణాత్మక దేవుని యొక్క ఆచరణాత్మకతను గురించి నీకు అవగాహన లేకపోతే, నీవు దేవునిచేత పరిపూర్ణమవలేవు. ప్రజలు పరిపూర్ణత పొందగలరా లేదా అనే దానిలో దేవుని ఆచరణాత్మకత గురించిన వారి అవగాహన అనేది ఒక కీలకమైన దశ. శరీరధారియైనదేవుని ఆచరణాత్మకత భూమి మీదికి రావడం అనేది ప్రతి వ్యక్తికి ఒక పరీక్షయైయున్నది; ఈ విషయంలో నీవు స్థిరముగా నిలబడగలిగితే, నీవు దేవుని ఎరిగిన వ్యక్తిగానుమరియు ఆయనను నిజముగా ప్రేమించే వ్యక్తిగాను ఉంటావు. ఈ విషయములో నీవు స్థిరంగా నిలబడకుండా, ఆత్మను మాత్రమే నమ్ముతూ దేవుని ఆచరణాత్మకతను నమ్మకపోతే, దేవునిపై నీ విశ్వాసము ఎంత గొప్పదైనా, అది వ్యర్ధమే. నీవు కనిపించే దేవుడినే నమ్మకపోతే, ఇక దేవుని ఆత్మను నీవు ఎలా నమ్ముతావు? నీవు కేవలం దేవుణ్ణి అపహసించడానికి చేసే ప్రయత్నం కాదా? కనిపించే మరియు ప్రత్యక్షమైన దేవునికి నీవు లోబడకుండా, ఆత్మకు నిన్ను నీవు అర్పించుకోగలవా? ఆత్మ అదృశ్యమైనది మరియు కనిపించదు, కాబట్టి నీవు దేవుని ఆత్మకు లోబడతానని నీవు చెప్పేటప్పుడు, నీవు వ్యర్ధంగా మాట్లాడటం లేదా? ఆజ్ఞలు అనుసరించడంలో ఆచరణాత్మకమైన దేవుని గురించి అర్ధం చేసుకోవడం కీలకమైనది. ఆచరణాత్మకమైన దేవుని గురించి మీరు అవగాహన పొందుకున్న తర్వాత, మీరు ఆజ్ఞలను పాటించగలుగుతారు. వాటిని పాటించుటకు రెండు విభాగాలు ఉన్నాయి; వాటిలో ఒకటి ఆయన ఆత్మ యొక్క గుణగణాలను పట్టుకొని, ఆత్మ ఎదుట, ఆత్మ పరిశీలనకు అనుమతించడం; మరొకటి ఏమనగా శరీరావతారమును గురించి నిజమైన అవగాహన కలిగి, నిజమైన సమర్పణ సాధించడం. శరీరం ఎదుటైనా లేక ఆత్మ ఎదుటైనా, ఒకరు దేవునిపట్ల సమర్పణ మరియు భక్తి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అటువంటి వారు మాత్రమే పరిపూర్ణత పొందడానికి అర్హులు. ఆచరణాత్మకమైన దేవుని ఆచరణాత్మకత గురించి నీకు అవగాహన ఉంటే—అనగా, ఈ పరీక్షలో నీవు ధృఢంగా నిలబడి ఉంటే—ఇక ఏదీ నీకు కష్టంగా ఉండదు.
“ఆజ్ఞలు పాటించడం సులభం; దేవుని యెదుట యథార్థముగా మరియు భయభక్తితో మాట్లాడుతూ, ఎలాంటి సైగలు చెయ్యకుండా ఉంటే, అదే ఆజ్ఞలు పాటించడం” అని కొంతమంది అంటారు, అది నిజమేనా? అంటే, దేవుని వెనుక ఆయనకు విరోధమైన కొన్ని పనులు నీవు చేస్తే, అది ఆజ్ఞలను పాటించినట్లు పరిగణించబడుతుందా? ఆజ్ఞలు పాటించడంలో ఏమేమి ఉంటాయో నీకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఇది దేవుని ఆచరణాత్మకత గురించి నీకు నిజమైన అవగాహన ఉందా లేదా అనే దానిని సూచిస్తుంది; ఆచరణాత్మకత గురించి నీకు అవగాహన ఉండి, శ్రమ కాలంలో తడబడి పడిపోకుండా ఉంటే, అప్పుడు నీవు బలమైన సాక్ష్యము కలిగి ఉన్నట్లుగా పరిగణించబడతావు. దేవునికి అద్భుతమైన సాక్ష్యమివ్వడం అనేది మొదటిగా ఆచరణాత్మకమైన దేవుని గురించి నీకు అవగాహన ఉన్నదా లేదా అనే డానికి సంబంధించి ఉంటుందిమరియు సామాన్యుడే కాకుండా సాధారణమైన ఈ వ్యక్తి ముందు మరణ పర్యంతము వరకు లోబడి ఉండగలవా లేదా అనే దానికి కూడా సంబంధించి ఉంటుంది. ఒకవేళ ఇటువంటిసమర్పణ ద్వారా, నీవు దేవునికి నిజంగా సాక్ష్యమిస్తే, నీవు దేవునిచే సంపాదించబడ్డావని అర్ధం. నీవు మరణం వరకు, ఆయన యెదుట ఎలాంటి ఆరోపణలు లేకుండా, తీర్పులు తీర్చకుండా, నిందించకుండా, ఎలాంటి భావనలు లేకుండా, మరియు ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఉంటే, దీని ద్వారా దేవుడు మహిమను పొందుతాడు. ఒక మనిషి ద్వారా చిన్న చూపు చూసే ఒక సాధారణ వ్యక్తి యెదుట లోబడి ఉండటం, మరియు ఎలాంటి భావనలు లేకుండా మరణం వరకు లోబడి ఉండటం అనేదే నిజమైన సాక్ష్యం. ప్రజలు ప్రవేశించడానికి దేవునికి కావాల్సిన వాస్తవం ఏమంటే నీవు ఆయన వాక్యాలను పాటించి, వాటిని అనుసరించి, నీ దుర్నీతిని గ్రహించి ఆచరణాత్మకమైన దేవుని యెదుట, ఆయన యెదుట నీ హృదయాన్ని తెరిచి, మరియు చివరిగా, ఆయన పలికిన ఈ వాక్యాల ద్వారా నీవు ఆయనచేత సంపాదించబడాలి. ఈ మాటలు నిన్ను జయించి, నిన్ను ఆయనకు పూర్తిగా విధేయుడయ్యేలా చేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు; దీని ద్వారా, ఆయన సాతానును సిగ్గుపరిచి ఆయన కార్యమును పూర్తిచేస్తాడు. శరీరధారియైన దేవుని ఆచరణాత్మకత గురించి నీకు ఎలాంటి భావనలు లేనప్పుడు—అంటే, నీవు ఈ శ్రమలో స్థిరముగా నిలబడినప్పుడు—నీవు సాక్ష్యాన్ని మంచిగా కలిగి ఉంటావు. నీవు ఆచరణాత్మకముగా కార్యమును జరిగించే దేవుని గురించి పూర్తి అవగాహన కలిగి, పేతురు లాగా మరణానికి అప్పగించబడే రోజు వస్తే, అప్పుడు నీవు దేవుని ద్వారా సంపాదించబడి పరిపూర్ణుడవుతావు. నీ తలంపులకు అనుగుణముగా లేనిది ఏదైనా దేవుడు చేస్తే అది నీకు ఒక పరీక్షే. దేవుని కార్యము నీ తలంపులకు అనుగుణంగా ఉంటే, నీవు బాధపడి మరియు శుద్ధి చేయబడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన కార్యము చాలా ఆచరణాత్మకమైనది మరియు నీ ఆలోచనలకు అనుగుణంగా లేదు కాబట్టి నీవు అటువంటి తలంపులను విడిచిపెట్టవలసి ఉన్నది. అందుకే ఇది నీకు ఒక పరీక్ష. దేవుని ఆచరణాత్మకతను బట్టి ప్రజలందరూ పరీక్షలలో ఉన్నారు; ఆయన కార్యము ఆచరణ యోగ్యమైనది, అద్భుతమైనది కాదు. ఆచరణాత్మకమైన ఆయన వాక్యాలు మరియు ఆయన ఆచరణాత్మకమైన మాటలను ఎటువంటి భావనలు లేకుండా పూర్తిగా అర్ధం చేసుకోవడం, ఆచరణాత్మకంగా ఆయన కార్యము పెరుగుతున్న కొలది ఆయనను నిజముగా ప్రేమించడం ద్వారా, ఆయన చేత సంపాదించబడతావు. దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తుల సమూహము దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు; అంటే, అయన ఆచరణాత్మక కార్యమును గురించి తెలిసినవారైయున్నారు. అంతేగాకుండా, వారు దేవుని ఆచరణాత్మకమైన కార్యానికి లోబడేవారుగా ఉన్నారు.
దేవుడు శరీరధారిగా ఉన్న సమయంలో, ప్రజల నుండి ఆయనకు కోరుకున్న విధేయతలో వారు ఊహించినట్లుగా నిరోధించడం లేక తీర్పులు తీర్చడంలాంటివి ఉండవు; బదులుగా, ప్రజలు జీవించడానికి మరియు వారి మనుగడకు పునాదిగా ఆయన వాక్యాలను ఉపయోగించాలని, ఆయన వాక్యాల భావాన్ని ఖచ్చితముగా అనుసరించి, ఆయన చిత్తాన్ని పూర్తిగా సంతృప్తి పరచాలని ఆయన కోరుతున్నాడు. శరీరధారియైన దేవునికి ప్రజలు లోబడి ఉండాలని కోరడంలో ఒక అంశం ఆయన వాక్యాలను అనుసరించడాన్ని సూచిస్తుంటే, మరొక అంశం ఆయన ఆచరణాత్మకతకు మరియు సాధారణతకు లోబడి ఉండటాన్ని సూచిస్తుంది. ఈ రెండూ తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండు అంశాలను సాధించినవారందరూ తమ హృదయాల్లో దేవునిపట్ల నిజమైన ప్రేమను కలిగి ఉన్నవారని అర్థం. వారందరూ దేవునిచేత ఎన్నుకోబడిన వారు. వారందరూ తమ స్వంత జీవితాలను ప్రేమిస్తున్నట్లుగా దేవుణ్ణి ప్రేమిస్తారు. శరీరధారియైన దేవుడు ఆయన కార్యమందు సాధారణమైన మరియు ఆచరణాత్మకమైన మానవ స్వభావాన్నే కలిగి ఉన్నాడు. ఈ విధంగా, ఆయన సాధారణ మరియు ఆచరణాత్మకమైన మానవ స్వభావపు బాహ్య కవచము ప్రజలకు ఒక గొప్ప పరీక్ష అవుతుంది; ఇది వారికి మహా కష్టతరంగా మారింది. అయితే, దేవుని సాధారణత మరియు ఆచరణాత్మకత అనేవి తప్పించుకోలేని విషయాలు. ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ఆయన ప్రతిదాన్ని ప్రయతించాడు, కానీ చివరికి తన సాధారణ మానవ స్వభావపు బాహ్య కవచాన్ని మాత్రం వదిలించుకోలేకపోయాడు. ఎందుకంటే, అంతిమంగా, ఆయన శరీరునిగా మారిన దేవుడు, పరలోకమందున్న దేవుని ఆత్మ కాదు. ఆయన ప్రజలు చూడలేని దేవుడు కాదు, కానీ సృష్టిలోని పాలిభాగస్తుని కవచాన్ని ధరించిన దేవుడు. అందువలన, ఆయన సాధారణ మానవ స్వభావపు తన కవచాన్ని వదిలించుకోవడం ఏ రకంగానూ సులభం కాదు. కాబట్టి, ఏదేమైనా, ఆయన ఇప్పటికి శరీర దృక్పథములో నుండే ఆయన చేయాలనుకున్న కార్యాన్ని ఆయన చేస్తాడు. ఈ కార్యము సాధారణ మరియు ఆచరణాత్మకమైన దేవుని వ్యక్తీకరణయైయున్నది, కాబట్టి ప్రజలు లోబడకుండా ఉండటం అనేది ఎలా సరియైన విషయంగా పరిగణించబడుతుంది? దేవుని క్రియలను గురించి భూమి మీద ప్రజలు ఏమి చేయగలరు? ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తాడు; దేనిని బట్టి ఆయన సంతోషిస్తాడో అది అలానే ఉంటుంది. ప్రజలు లోబడకపోతే, వారు ఏ ఇతర ప్రణాళికలు కలిగి ఉంటారు? లోబడటం మాత్రమే ఇప్పటివరకు ప్రజలను రక్షించింది; ఎవరికీ వేరే ఎలాంటి మంచి ఆలోచనలూ లేవు. దేవుడు ప్రజలను పరీక్షించాలి అనుకుంటే, వారు దాని గురించి ఏమి చేయగలరు? అయితే, ఇదంతా పరలోకమందున్న దేవుని ద్వారా వచ్చింది కాదు గాని శరీరధారియైన దేవుని ద్వారా కలిగిందే. ఏ మనిషి మార్చలేని విధంగా ఆయన దీన్ని చేయాలనుకున్నాడు. శరీరధారియైన దేవుడు చేసేదానిలో పరలోకమందున్న దేవుడు జోక్యం చేసుకోడు, కాబట్టి ప్రజలు ఆయనకు లోబడటానికి ఇది ఇంకా పెద్ద కారణం కాదా? ఆయన సాధారణ మరియు ఆచరణాత్మకమైన రెండు అంశాలను కలిగియున్నవాడైనప్పటికినీ, ఆయన శరీరధారిగా మారిన సంపూర్ణమైన దేవుడైయున్నాడు. ఆయన తన స్వంత ఆలోచనల ఆధారముగా, ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తాడు. పరలోకమందున్న దేవుడు సమస్త బాధ్యతలు ఆయనకు అప్పగించాడు; ఆయన ఏమి చేసినా నీవు లోబడాలి. ఆయన మనిషిగా చాలా సాధారణముగా ఉన్నప్పటికీ, ఆయన ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ ఏర్పాటు చేశాడు, కాబట్టి ప్రజలు తిరస్కారంతో వారి కళ్ళు పెద్దవి చేసి ఎలా చూస్తారు? ఆయన సామాన్యముగా ఉండాలి అనుకున్నాడు, కాబట్టి సామాన్యముగా ఉన్నాడు. ఆయన మనుష్యుల మధ్య నివసించాలి అనుకున్నాడు, కాబట్టి ఆయన మానవుల మద్య నివసించాడు. ప్రజలు దీన్ని ఎలా కోరుకుంటే అలా చూడవచ్చు, కానీ దేవుడు ఎప్పటికైనా దేవుడే, మానవులు ఎప్పటికైనా మానవులే. చిన్న చిన్న కారణాలను బట్టి ఆయన గుణగణాలు తిరస్కరించబడవు, ఒక చిన్న కారణాన్ని బట్టి దేవుని “వ్యక్తిత్వము” వెలుపలకి త్రోసివేయబడదు. మనుష్యులకు మనుష్యులకుండే స్వేచ్ఛ ఉంది, దేవునికి దేవునికుండే హుందాతనం ఉంది; ఈ రెండు ఒకదానితో ఒకటి జోక్యం చేసుకోవు. ప్రజలు దేవునికి కాస్త స్వేచ్ఛను ఇవ్వలేరా? దేవుడు మరింత ఎక్కువ సాధారణంగా ఉండటాన్ని వారు సహించలేరా? దేవునితో అంత కఠినముగా ఉండవద్దు! ప్రతిఒక్కరు ఒకరిపట్ల ఒకరు సహనము కలిగి ఉండాలి; అప్పుడు ప్రతిదీ పరిష్కరించబడదా? ఇంకా విరోధమేమైనా మిగిలి ఉంటుందా? ఒకరు ఇంత చిన్న విషయాన్నే సహించలేకపోతే, “ఒక పెద్ది పడవను నడిపించడానికి ప్రధాన మంత్రి హృదయం సరిపోదా?” అని వారు ఎలా చెప్పగలరు? వారు నిజమైన మనుష్యులు ఎలా కాగలరు? మానవజాతికి కష్టం కలిగించేది దేవుడు కాదు, కానీ దేవునికి కష్టం కలిగించేది మాత్రం మానవులే. వారు ఎప్పుడూ చిన్న మంటి దిబ్బలతో పర్వతాలను తయారు చేసి పరిస్థితులను అదుపుచేస్తారు. నిజంగా వారు శూన్యములో నుండి ఏదో చేస్తారు, ఇది చాలా అనవసరమైనది! దేవుడు సాధారణ మరియు ఆచరణాత్మకమైన మానవాళి మధ్య కార్యము చేసినప్పుడు, అది దేవుడు చేసే కార్యమే గాని, మనుష్యులు చేసే కార్యము కాదు. అయితే మనుష్యులు దేవుని కార్యపు భావాన్ని చూడరు; వారు ఎప్పుడూ ఆయన మానవ స్వభావపు బాహ్య కవచాన్ని మాత్రమే చూస్తారు. వారు అంతటి గొప్ప కార్యాన్ని చూడలేదు, అయినప్పటికీ ఆయన సామాన్యమైన సాధారణ మానవ స్వభావాన్ని చూడాలని బలవంతం చేస్తారు, మరియు దానిని విడిచిపెట్టరు. దీనిని దేవుని యెదుట లోబడటం అని ఎలా అంటారు? పరలోకమందున్న దేవుడు ఇప్పుడు భూలోకమందున్న దేవునిగా “మారాడు,” భూలోకమందున్న దేవుడు ఇప్పుడు పరలోకమందున్న దేవుడు. వారి బాహ్య స్వరూపాలు ఒకేలా ఉన్నాయా, లేక వారు ఎంత ఖచ్చితంగా పని చేస్తారు అనే దానితో సంబంధం లేదు. చివరికి, దేవుని కార్యము చేసేవాడు దేవుడే. నీకు అవసరం ఉన్నా లేకపోయినా లోబడి తీరాలి—ఇది నీవు ఎంపిక చేసుకునే విషయం కాదు! మానవులందరూ దేవుని అనుసరించి తీరాలి, కపటం కాస్తయినా లేకుండా మనుష్యులు పూర్తిగా దేవునికి లోబడాలి.
శరీరధారియైన దేవుడు నేడు సంపాదించాలి అనుకున్న వ్యక్తుల సమూహము ఆయన చిత్తానికి అనుగుణముగా ఉంటారు. వారు ఆయన కార్యానికి మాత్రమే లోబడాలి మరియు పరలోకమందున్న దేవుని ఆలోచనలతో వారంతట వారు ఆలోచించడం, అస్పష్టతలో జీవించడం, శరీరమందు దేవునికి కష్టాన్ని కలిగించే పనులు చేయడం మానివేయాలి. ఖచ్చితంగా ఆయనను అనుసరించే వారు, ఆయన వాక్యాలను వింటూ ఆయన ఏర్పాట్లకు లోబడి ఉంటారు. అలాంటి వ్యక్తులు పరలోకంలో ఉన్న దేవుడు నిజానికి ఎలా ఉంటాడో లేక పరలోకమందున్న దేవుడు మనుష్యుల మధ్య ప్రస్తుతం ఎలాంటి కార్యము చేస్తున్నాడని ఆలోచించరు; వారు భూలోకమందున్న దేవునికి వారి హృదయాలను పూర్తిగా అర్పించి వారికున్న సమస్తాన్ని ఆయన ముందు ఉంచుతారు. వారి భద్రత గురించి వారు ఎన్నడూ పట్టించుకోరు, శరీరునిగా ఉన్న దేవుని సాధారణత మరియు ఆచరణాత్మకత మీద ఎన్నటికి వివాదం సృష్టించరు. శరీరుడైన దేవునికి లోబడేవారు, ఆయన ద్వారా పరిపూర్ణ పరచబడతారు. పరలోకమందున్న దేవుని నమ్మేవారు ఏమీ పొందుకోరు. ఎందుకంటే ప్రజలకు వాగ్దానాలు మరియు ఆశీర్వాదాలను అనుగ్రహించేది భూలోకమందున్న దేవుడే గానీ, పరలోకమందున్న దేవుడు కాదు. ప్రజలు ఎన్నడూ భూలోకమందున్న దేవుని సగటు వ్యక్తిగా పరిగణిస్తూ పరలోకమందున్న దేవుని మహిమపరచకూడదు; ఇది సరైనది కాదు. పరలోకమందున్న దేవుడు మహా జ్ఞానంతో ఉన్న గొప్పవాడు మరియు అద్భుతకరుడు, అయినప్పటికీ ఇది అసలు ఉనికిలోనే లేదు; భూలోకమందున్న దేవుడు సగటు ప్రాధాన్యత లేనివాడు, చాలా సామాన్యుడు కూడా. ఆయన అసాధారణమైన మనస్సు కలిగి ఉండడు లేక భూలోకాన్ని వణికించే కార్యాలు చేయడు; ఆయన చాలా సామాన్యమైన మరియు ఆచరణాత్మకమైన పద్దతిలో మాట్లాడతాడు మరియు కార్యము చేస్తాడు. ఆయన ఉరుములలో నుండి మాట్లాడడు మరియు గాలి వానలకు ఆజ్ఞాపించడు గానీ, ఆయన నిజముగా పరలోకమందున్న దేవుని శరీరావతారమైయున్నాడు, మరియు ఆయన నిజముగా మానవాళి మధ్య నివసిస్తున్న దేవుడు. వారు అంగీకరించలేని మరియు నిస్సందేహముగా ఊహించలేని ఒకరిని చూస్తూ, ప్రజలు తాము అర్ధం చేసుకోగలిగి వారి సొంత ఆలోచనలకు అనుగుణముగా ఉన్న వ్యక్తిని దేవునిగా మహిమపరచకూడదు. ఇదంతా ప్రజల తిరుగుబాటుతనము నుండి వస్తుంది; ఇది సర్వ మానవాళి దేవుణ్ణి ఎదిరించడానికి మూలమై ఉన్నది.