దేవుని దర్సనం కొత్త యుగానికి నాంది పలికింది
దేవుని ఆరువేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ముగియబోతోంది, మరియు ఆయన దర్శనాన్ని కోరుకునే వారందరికీ రాజ్యద్వారం ఇప్పటికే తెరవబడింది. ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? మీరు వెతుకుతున్నది ఏమిటి? దేవుడు దర్శనమివ్వాలని ఎదురు చూస్తున్నారా? మీరు ఆయన అడుగుజాడల కోసం వెతుకుతున్నారా? దేవుని స్వరూపం కోసం ఎంతగా ఆరాటపడాలి! మరియు దేవుని అడుగుజాడలను కనుగొనడం ఎంత కష్టం! ఇలాంటి యుగంలో, ఇలాంటి ప్రపంచంలో దేవుడు దర్శనమిచ్చే రోజు చూసేందుకు మనం ఏమి చేయాలి? దేవుని అడుగుజాడల్లో నడవాలంటే మనం ఏమి చేయాలి? దేవుడు దర్శనమివ్వాలని ఎదురుచూస్తున్న వారందరికీ ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మీరందరూ వాటిని ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో పరిగణించారు—కాని ఏ ఫలితంతో? దేవుడు ఎక్కడ కనిపిస్తాడు? దేవుని అడుగుజాడలు ఎక్కడ ఉన్నాయి? మీకు సమాధానం దొరికిందా? చాలా మంది ఈ విధంగా సమాధానమిస్తారు: “దేవుడు తనను అనుసరించే వారందరిలో కనిపిస్తాడు మరియు ఆయన అడుగుజాడలు మన మధ్యలోనే ఉన్నాయి; ఇది చాలా సులభం!” ఇలాంటి సూత్రబద్ధమైన సమాధానాన్ని ఎవరైనా అందించగలరు, కానీ దేవుని దర్శనం లేదా ఆయన అడుగుజాడలు అంటే ఏమిటో మీకు అర్థమైందా? దేవుని దర్శనం తన పనిని స్వయంగా తానే చేయడానికి భూమిపైకి రావడాన్ని సూచిస్తుంది. తన స్వంత గుర్తింపు మరియు స్వభావంతో, మరియు ఆయనకి సహజసిద్ధమైన మార్గంలో, ఆయన ఒక యుగాన్ని ప్రారంభించి, ఒక యుగాన్ని ముగించే కార్యాన్ని నిర్వహించడానికి మానవజాతి మధ్యకు దిగివస్తాడు. ఈ రకమైన ప్రదర్శన వేడుక వంటిది కాదు. ఇది ఒక సంకేతం, చిత్రం, అద్భుతం, లేదా ఒక రకమైన గొప్ప దృష్టి కాదు, మరియు ఇది ఒక రకమైన మతపరమైన ప్రక్రియ కూడా కాదు. ఇది ఎవరైనా స్పృశించదగిన మరియు చూడదగిన నిజమైన మరియు అసలైన వాస్తవం. ఈ రకమైన రూపు కదలికల ద్వారా వెళ్ళడం కొసమో, లేదా ఏదైనా స్వల్పకాలిక పని కొసమో కాదు; ఇది ఆయన నిర్వహణ ప్రణాళికలోని ఒక దశ యొక్క పని. దేవుని దర్శనం ఎల్లప్పుడూ అర్థవంతంగా ఉంటుంది మరియు ఆయన నిర్వహణ ప్రణాళికకు ఎల్లప్పుడూ కొంత సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ దర్శనం అని పిలవబడేది దేవుడు మనిషికి మార్గనిర్దేశం చేసే, నడిపించే మరియు జ్ఞానోదయం చేసే “దర్శనానికి” పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దేవుడు తనను తాను బహిర్గతం చేసిన ప్రతిసారీ తన గొప్ప కార్యం యొక్క ఒక దశను నిర్వహిస్తాడు. ఈ కార్యం ఇతర యుగాలలో కంటే భిన్నంగా ఉంటుంది. ఇది మనిషికి ఊహకందనిది, మనిషికి ఎప్పుడూ అనుభవంలోకి రానిది. ఇది కొత్త యుగాన్ని ప్రారంభించి, పాత యుగాన్ని ముగించే పని, మరియు ఇది మానవజాతి యొక్క మోక్షానికి కొత్త మరియు మెరుగైన కార్యం; అంతేకాకుండా, ఇది మానవజాతిని కొత్త యుగంలోకి తీసుకువచ్చే కార్యం. దేవుని దర్శనం యొక్క ప్రాధాన్యతను ఇది తెలియజేస్తుంది.
దేవుని స్వరూపం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్న తర్వాత, మీరు దేవుని అడుగుజాడలను ఎలా వెతకాలి? ఈ ప్రశ్నను వివరించడం కష్టం కాదు: దేవుడు ఎక్కడ కనిపిస్తాడో, అక్కడ మీరు ఆయన అడుగుజాడలను కనుగొంటారు. ఇటువంటి వివరణ సూటిగా అనిపిస్తుంది, కానీ ఆచరణలో అంత సులభం కాదు, ఎందుకంటే దేవుడు ఎక్కడ కనిపిస్తాడో చాలా మందికి తెలియదు, ఆయన ఇష్టపడే చోట కాని, లేదా ఆయన ఎక్కడ కనిపించాలి అనేది ఇంకా తెలియదు. పరిశుద్ధాత్మ ఎక్కడ పని చేస్తుందో అక్కడ దేవుడు కనిపిస్తాడని కొందరు అకస్మాత్తుగా నమ్ముతారు. లేదంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక వ్యక్తులు ఉంటారో, అక్కడ దేవుడు కనిపిస్తాడని నమ్ముతారు. లేదంటే ఎక్కడైతే ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులు ఉన్నారో, అక్కడ దేవుడు కనిపిస్తాడని నమ్ముతారు. ప్రస్తుతానికి, అలాంటి నమ్మకాలు తప్పా లేదా ఒప్పా అనేది పక్కన పెడదాం. ఇటువంటి ప్రశ్నను వివరించడానికి, ముందుగా మనకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి: మనం దేవుని అడుగుజాడల కోసం వెతుకుతున్నాము. మనం ఆధ్యాత్మిక వ్యక్తులను వెతకడం లేదు, ఇక మనం ప్రసిద్ధి చెందిన వ్యక్తులను అనుసరించడం అంతకంటే తక్కువ. మనం దేవుని అడుగుజాడలను వెతుకుతున్నాము. ఈ కారణంగా, మనం దేవుని అడుగుజాడల కోసం వెతుకుతున్నాము కాబట్టి, దేవుని సంకల్పం కోసం, దేవుని వాక్కుల కోసం, ఆయన పలుకులు కోసం వెతకడం మనకు విలువైనది—ఎందుకంటే దేవుడు మాట్లాడే కొత్త పదాలు ఎక్కడున్నాయో అక్కడ దేవుని స్వరం ఉంటుంది. మరియు దేవుని అడుగుజాడలు ఎక్కడున్నాయో అక్కడ దేవుని కార్యాలు ఉంటాయి. దేవుని యొక్క వ్యక్తీకరణ ఎక్కడ ఉందో, అక్కడ దేవుడు కనిపిస్తాడు మరియు దేవుడు ఎక్కడ కనిపిస్తాడో అక్కడ సత్యం, మార్గం, మరియు జీవం ఉన్నాయి. దేవుని అడుగుజాడలను వెతకడంలో, మీరు “దేవుడే సత్యము, మార్గము మరియు జీవము” అనే పదాలను విస్మరించారు. కాబట్టి, చాలా మంది ప్రజలు, వారు సత్యాన్ని స్వీకరించినప్పుడు కూడా, వారు దేవుని అడుగుజాడలను కనుగొన్నారని నమ్మరు, మరియు వారు దేవుని రూపాన్ని ఇంకా తక్కువగా అంగీకరిస్తారు. ఎంత ఘోరమైన తప్పు! దేవుని రూపాన్ని మనిషి ఆలోచనలతో సరిదిద్దలేము, దేవుడు మనిషి యొక్క ఆజ్ఞతో ఇంకా తక్కువ కనిపించగలడు. దేవుడు తన పనిని చేసినప్పుడు తన స్వంత ఎంపికలను మరియు తన స్వంత ప్రణాళికలను చేస్తాడు; అంతేకాకుండా, ఆయన తన స్వంత లక్ష్యాలు మరియు ఆయన స్వంత పద్ధతులు ఉన్నాయి. ఆయన ఏ పని చేసినా, ఆయన మనిషితో చర్చించాల్సిన అవసరం లేదు లేదా అతని సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక ఆయన తన పనిని ప్రతి వ్యక్తికి తెలియజేయడం అంతకంటే తక్కువ. ఇది దేవుని ప్రవృత్తి, పైగా, ఇది అందరిచేత గుర్తించబడాలి. మీరు దేవుని రూపాన్ని చూడాలనుకుంటే, దేవుని అడుగుజాడలను అనుసరించాలని కోరుకుంటే, మీరు మొదట మీ స్వంత భావముల నుండి దూరంగా నడవాలి. దేవుణ్ణి ఇలా చేయమని లేదా అలా చేయమని నువ్వు ఆజ్ఞాపన చేయకూడదు, ఇక నువ్వు ఆయనను నీ స్వంత పరిమితుల్లో ఉంచాలని మరియు నీ స్వంత భావములకు పరిమితం చెయ్యాలని అంతకంటే తక్కువగా అనుకోవాలి. బదులుగా, మిమ్మల్ని మీరు ఆజ్ఞాపన చేయల్సింది ఏంటంటే దేవుని అడుగుజాడలను ఎలా వెతకాలి, దేవుని రూపాన్ని మీరు ఎలా అంగీకరించాలి మరియు దేవుని యొక్క కొత్త పనికి మీరు ఎలా లొంగిపోవాలి: ఇది మనిషి చేయవలసినది. మనిషి సత్యం కాదు, మరియు సత్యాన్ని కలిగి లేడు కాబట్టి, అతను వెతకాలి, అంగీకరించాలి మరియు పాటించాలి.
మీరు అమెరికన్, బ్రిటీష్ లేదా మరే ఇతర జాతీయతతో సంబంధం లేకుండా, మీరు మీ స్వంత జాతీయత యొక్క పరిమితుల వెలుపల అడుగు పెట్టాలి, మిమ్మల్ని మీరు అధిగమించాలి మరియు సృష్టించబడిన జీవి యొక్క నివాసము నుండి దేవుని పనిని చూడాలి. ఈ విధంగా, మీరు దేవుని అడుగుజాడలపై పరిమితులు విధించరు. ఎందుకంటే, ఈ రోజుల్లో, దేవుడు ఒక నిర్దిష్ట దేశంలో లేదా నిర్దిష్ట ప్రజల మధ్య కనిపించడం అసాధ్యం అని చాలా మంది భావించారు. దేవుని పని యొక్క ప్రాముఖ్యత ఎంత లోతైనది మరియు దేవుని స్వరూపం ఎంత ముఖ్యమైనది! వాటి కొలతలను మనిషి భావనలు మరియు ఆలోచనలు ఎలా తీసుకోగలవు? కాబట్టి నేను చెప్తున్నాను, మీరు దేవుని రూపాన్ని వెతకడానికి జాతీయత మరియు జాతి భావనలను విచ్ఛిన్నం చేయాలి. ఈ విధంగా మాత్రమే మీరు మీ స్వంత ఆలోచనలచే నిర్బంధించబడరు; ఈ విధంగా మాత్రమే మీరు దేవుని రూపాన్ని స్వాగతించడానికి అర్హులవుతారు. లేకపోతే, మీరు శాశ్వతమైన చీకటిలో ఉంటారు మరియు దేవుని ఆమోదాన్ని పొందలేరు.
దేవుడు మొత్తం మానవ జాతికి దేవుడు. ఆయన తనను తాను ఏ దేశం లేదా ప్రజల వ్యక్తిగత ఆస్తిగా పరిగణించడు, కానీ ఏ రూపానికి, దేశానికి లేదా ప్రజలకు పరిమితం కాకుండా తన పనిని తాను అనుకున్నట్లుగా చేస్తూనే ఉంటాడు. బహుశా నువ్వు ఈ రూపాన్ని ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు, లేదా బహుశా ఈ రూపం పట్ల నీ వైఖరి అసమ్మతితో ఉండవచ్చు, లేదా దేవుడు తనను తాను బహిర్గతం చేసే దేశం మరియు ఆయన తనను తాను బహిర్గతం చేసుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరి చేత వివక్షకు గురవతుండవచ్చు మరియు భూమిపై అత్యంత వెనుకబడిన వారు అయ్యి ఉండవచ్చు. అయినా దేవునికి తన జ్ఞానం ఉంది. ఆయన తన గొప్ప శక్తితో, మరియు తన సత్యం మరియు తన స్వభావం ద్వారా, ఆయన నిజంగా తన లాంటి మనస్సు గల వ్యక్తుల సమూహాన్ని పొందాడు, మరియు ఆయన పూర్తి చేయాలనుకున్న వ్యక్తుల సమూహాన్ని పొందాడు—ఒక సమూహం, ఆయనచే జయించబడింది, వారు అన్ని రకాల పరీక్షలు మరియు కష్టాలు మరియు అన్ని రకాల హింసలను భరించి, చివరి వరకు ఆయనను అనుసరించగలిగారు. ఏ రూపానికి లేదా దేశానికి మాత్రమే పరిమితం కాని దేవుని ప్రత్యక్షత యొక్క లక్ష్యం, ఆయన అనుకున్నట్లుగా తన పనిని పూర్తి చేయడానికి వీలు కల్పించడం. జుడేయలో దేవుడు శరీరధారియైనప్పుడు ఇది ఇలాగే ఉంది: మొత్తం మానవ జాతిని విమోచించడంలో సిలువ వేయడం యొక్క పనిని పూర్తి చేయడం ఆయన లక్ష్యం. అయినప్పటికీ యూదులు దేవునికి ఇది అసాధ్యమని విశ్వసించారు, మరియు దేవుడు మాంసముగా మారి ప్రభువైన యేసు రూపాన్ని ధరించడం అసాధ్యమని వారు భావించారు. వారి “అసాధ్యం” వారు దేవుణ్ణి ఖండించడానికి మరియు వ్యతిరేకించడానికి ఆధారంగా మారింది, మరియు చివరికి ఇజ్రాయెల్ నాశనానికి దారితీసింది. నేడు, చాలా మంది ఇలాంటి తప్పు చేశారు. వారు దేవుని ఆసన్న రూపాన్ని తమ శక్తితో ప్రకటిస్తారు, అయితే అదే సమయంలో ఆయన రూపాన్ని ఖండిస్తారు; అందుకే చాలా మంది ప్రజలు దేవుని వాక్కును విన్న తర్వాత విపరీతమైన మరియు కరుకుగా నవ్వడం నేను చూశాను. అయితే ఈ నవ్వు యూదుల ఖండన మరియు దూషణకు భిన్నంగా ఉందా? మీరు సత్య సన్నిధిలో పూజ్యులు కారు, మీలో ఆరాటపడే వైఖరి అంతకంటె తక్కువ కలిగి ఉంది. మీరు చేసేదంతా విచక్షణారహితంగా చదువుకోవడం మరియు నిస్సహాయతతో వేచి ఉండడం. ఇలా చదువుకోవడం, వేచి ఉండడం వల్ల ఏం లాభం? నువ్వు దేవుని నుండి వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందుతావని భావిస్తున్నావా? నువ్వు దేవుని వాక్కులను గుర్తించలేకపోతే, దేవుని రూపాన్ని చూసేందుకు నువ్వు ఏ విధంగా అర్హుడవు? దేవుడు ఎక్కడ కనిపిస్తాడో అక్కడ సత్యం వ్యక్తమవుతుంది మరియు అక్కడ దేవుని స్వరం ఉంటుంది. సత్యాన్ని అంగీకరించగలిగిన వారు మాత్రమే దేవుని స్వరాన్ని వినగలుగుతారు మరియు అటువంటి వ్యక్తులు మాత్రమే దేవుని స్వరూపాన్ని చూసేందుకు అర్హులు. నీ ఆలోచనలను విడనాడు! నిశ్శబ్దంగా ఉండి మరియు ఈ వాక్కులను జాగ్రత్తగా చదువు. నువ్వు సత్యం కోసం ఆరాటపడితే, దేవుడు నీకు జ్ఞానోదయం చేస్తాడు మరియు నువ్వు ఆయన ఇష్టాన్ని మరియు ఆయన వాక్కులను అర్థం చేసుకుంటావు. “అసాధ్యం” గురించి మీ అభిప్రాయాలను వదిలేయండి! అసాధ్యమని ప్రజలు ఎంతగా విశ్వసిస్తే, అది జరిగే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దేవుని జ్ఞానం స్వర్గం కంటే ఎక్కువగా ఉంటుంది, దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనల కంటే ఉన్నతమైనవి, మరియు దేవుని పని మనిషి యొక్క ఆలోచన మరియు భావనల పరిమితులను అధిగమిస్తుంది. ఏదైతే ఎంత ఎక్కువ అసాధ్యమైనదో, అంతే ఎక్కువగా అందులో సత్యాన్ని వెతకవచ్చు; ఏదయినా అబద్ధం ఎంత మనిషి ఆలోచనలు మరియు ఊహలకు అతీతంగా ఉంటే, అది అంత దేవుని చిత్తాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే, ఆయన తనను తాను ఎక్కడ బహిర్గతం చేసినా, దేవుడు ఇప్పటికీ దేవుడే, మరియు ఆయన స్వరూపం యొక్క స్థానం లేదా పద్ధతి కారణంగా ఆయన సద్భావము ఎప్పటికీ మారదు. దేవుని స్వరూపం ఆయన అడుగు జాడలు ఎక్కడ ఉన్నా అలాగే ఉంటుంది, మరియు దేవుని అడుగు జాడలు ఎక్కడ ఉన్నా, ఆయన సమస్త మానవాళికి దేవుడు, యేసుప్రభువు ఇజ్రాయెలీయుల దేవుడే కాదు, ఆసియా, యూరప్ మరియు అమెరికా ప్రజలందరికీ కూడా దేవుడు, మరియు అంతకంటే ఎక్కువగా, ఆయన మొత్తం విశ్వంలో ఏకైక దేవుడు. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని వెదకుదాం మరియు ఆయన వాక్కులో ఆయన రూపాన్ని కనుగొని, ఆయన అడుగుజాడలతో వేగాన్ని కొనసాగిద్దాం! దేవుడే సత్యము, మార్గము మరియు జీవము. ఆయన వాక్కులు మరియు ఆయన స్వరూపం అనుషక్తములో ఉన్నాయి మరియు ఆయన స్వభావం మరియు అడుగుజాడలు మానవాళికి అన్ని సమయాలలో తెరిచి ఉంటాయి. ప్రియమైన సోదర మరియు సోదరీమణులారా, మీరు ఈ వాక్కులలో దేవుని రూపాన్ని చూడగలరని నేను ఆశిస్తున్నాను, మీరు కొత్త యుగంలోకి అడుగులు వేస్తున్నప్పుడు ఆయన అడుగుజాడలను అనుసరించడం ప్రారంభించండి, మరియు దేవుడు తన దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం సిద్ధం చేసిన అందమైన కొత్త ఆకాశం మరియు భూమిలోకి ప్రవేశించండి!