సర్వశక్తిమంతుడైన దేవుని నిట్టూర్పు
నీ హృదయంలో అపరిమితమైన రహస్యముంది, అది నీవెప్పుడూ గుర్తెరగలేదు, ఎందుకంటే వెలుగు లేకుండా నీవు ఈ లోకంలో జీవిస్తున్నావు. నీ హృదయం, నీ ఆత్మ దుష్టుని చేత బంధించబడ్డాయి. చీకటితో నీ కన్నులు మూసుకుపోయాయి, ఆకాశంలోని సూర్యుడిని కానీ రాత్రి పూట మెరుస్తున్న నక్షత్రాన్ని కానీ నువ్వు చూడలేవు. మోసకరమైన మాటలు నీ చెవులకు అడ్డుపడ్డాయి, అందుకే ఉరుము వంటి యెహోవా స్వరమును కానీ, ఆయన సింహాసనం నుంచి ప్రవహించే నీటి శబ్దం కానీ వినలేవు. నీకు న్యాయబద్ధంగా రావలసిన ప్రతీదీ, సర్వశక్తుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇచ్చిన ప్రతీదీ నీవు కోల్పోయావు. నిన్ను నువ్వు రక్షించుకునే శక్తి లేక, మనుగడ పై ఆశ లేక నీవు దుఃఖముతో నిండిన అంతం లేనటువంటి సముద్రములోనికి ప్రవేశించావు, మరియు నీవు చేసేదల్లా దాని గురించి పోరాడడం, పరుగులు పెట్టడం, ఆ క్షణం నుంచి నీవు దుష్టుని చేత శ్రమ పెట్టబడుటకు ఆజ్ఞాపించబడడం మాత్రమే.... సర్వశక్తుడైన దేవుని ఆశీర్వాదాలకు దూరమయ్యారు, సర్వశక్తుడైన దేవుని ఏర్పాటులకు అందనంత దూరమయ్యారు, వెనుదిరుగుటకు వీలులేని మార్గంలో నడుస్తున్నావు. లక్షల పిలుపులు కూడా నీ హృదయాన్ని, నీ ఆత్మను ఏ మాత్రం ప్రేరేపించలేవు. ఎటువంటి దిశానిర్దేశనము లేనటువంటి లేక దిక్సూచి లేనటువంటి సరిహద్దులు లేనటువంటి ప్రపంచములోనికి నిన్ను ఆకర్షించే దుష్టుని చేతుల్లో గాఢ నిద్రలో ఉంటారు. ఇది మొదలుకొని, నీ అసలు నిర్దోషత్వమును, పవిత్రతను కోల్పోతావు, సర్వశక్తుని సంరక్షణను విస్మరించడం మొదలుపెడతావు. నీ హృదయం దుష్టుడు ఉండి అన్ని విషయాలలో నిన్ను నియంత్రిస్తూ ఉంటాడు, వాడు నీ జీవితమైపోయాడు. వాడి విషయంలో నీవు ఏమాత్రం భయపడడం లేదు, వాని నుండి తప్పించుకోవడం లేదు, వానిని అనుమానించడం లేదు; దానికి బదులుగా, వాడిని నీ హృదయంలో దేవునిగా పెట్టుకుంటావు. వాడిని ప్రతిష్టించుకుని, ఆరాధించడం మొదలుపెడతావు, మీరిద్దరూ శరీరం, నీడలా విడదీయలేని బంధములా మారి, కలసి జీవించడానికైనా, మరణించడానికైనా కట్టుబడి ఉంటారు. నీవు ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకు జన్మించావో, ఎందుకు మరణిస్తావో నీకు తెలీదు. నీవు సర్వ సక్తుడైన దేవుణ్ణి పరిచయం లేని పరాయి వ్యక్తిగా చూస్తావు; ఆయన మూలాలు నీకు తెలీదు, ఆయన నీ కొరకు చేసిన కార్యాలలో నీకు కొన్ని మాత్రమే తెలుసు. ఆయన నుంచి వచ్చే ప్రతీది నీకు అసహ్యముగా ఉంటోంది; నీవు దానిలో సంతోషించవు సరి కదా దాని విలువ కూడా నీకు తెలీదు. నీవు సర్వశక్తుని సహాయ సహకారాలు పొందుకున్న రోజు మొదలుకొని దుష్టునితో కలిసి నడుస్తావు. దుష్టునితో నీవు వేల సంవత్సరాలుగా గాలి తుఫానులు, ఆటుపోట్లు భరించినప్పటికీ, నీ జీవన ఆధారమైన దేవునికి వ్యతిరేకంగా వాడితో కలిసి నిలబడతావు. నీకు పశ్చాత్తాపం అంటే బొత్తిగా తెలీదు, అదే కాదు నీవు నాశనపు అంచుకు చేరుకున్నావని కూడా బొత్తిగా తెలియదు. దుష్టుడు నిన్ను ఆకర్షించి, బాధించిన సంగతిని మర్చిపోయావు; నీ నీ ఆరంభ దశలను నీవు మర్చిపోయావు. ఇలా దుష్టుడు నీవు పైకి ఎక్కే ప్రతి దశ నుంచి ఈ రోజు వరకు నిన్ను బాధిస్తూనే ఉన్నాడు. నీ హృదయం, ఆత్మ మొద్దుబారి క్షీణించిపోయాయి. మనిషి ప్రపంచపు వేదనల గురించి ఫిర్యాదు చేయడం మానివేశావు; ఈ లోకం అన్యాయమైన లోకమని నీవెంత మాత్రమూ నమ్మడం లేదు. సర్వశక్తిమంతుడు ఉనికిలో ఉన్నాడా లేదా అనే సంగతిని నీవు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే, నువ్వెప్పుడో దుష్టుని నీ నిజమైన తండ్రిగా నమ్మి, అతనిని వీడలేనంత స్థితికి వెళ్లిపోయావు. ఇదే నీ హృదయములో దాగియున్న రహస్యం.
ఉదయకాలమున తూర్పు దిక్కున ఉదయ నక్షత్రం ప్రకాశిస్తుంది. ఈ తార ఇంతకు ముందెప్పుడూ అక్కడ లేదు, అది ప్రశాంతతను వెలిగింపజేస్తుంది, ఆకాశాలను మెరిచేలా చేస్తుంది, మనుషుల హృదయాల్లో ఆరిపోయిన దీపాన్ని తిరిగి వెలిగిస్తుంది. ఏ వెలుగైతే నీపై, ఇతరుల మీద ఒకేలా ప్రకాశిస్తుందో. ఆ వెలుగుకు కృతజ్ఞతలు, మనుషులు ఇక ఈ మాత్రం ఒంటరిగా లేరు అయినప్పటికీ, నీవు చీకటి రాత్రిలో ఒంటరిగా గాఢ నిద్రలో ఉంటావు. నీకు ఏ శబ్దము వినిపించదు, ఏ వెలుగూ కనిపించదు; కొత్త ఆకాశం కొత్త భూమి, కొత్త యుగ ఆగమనం గురించి నీకేమీ తెలీదు, ఎందుకంటే—నీ తండ్రి నీతో, “నా బిడ్డా, లేవకు, ఇంకా తెల్లవారలేదు. వాతావరణం చల్లగా ఉంది, కనుక బయటకు వెళ్లకు, లేకుంటే కత్తి, ఈటెలతో నీ కళ్ళలో పొడుస్తారు” అని చెప్తాడు. నీవు నీ తండ్రి బోధించే ఉపదేశాలనే నమ్ముతావు, ఎందుకంటే నీ తండ్రి నీకంటే పెద్దవాడు గనుక, నిన్ను ప్రియంగా ప్రేమిస్తాడు కనుక ఆయన మాత్రమే సరైన వాడని నమ్ముతావు. అటువంటి ఉపదేశాలు మరియు అటువంటి ప్రేమ లోకంలో వెలుగు ఉంది అనే చరిత్రను నీవు నమ్మకుండా చేస్తాయి; ఈ లోకంలో ఇంకా సత్యం నిలిచి ఉందా లేదా అనే విషయముపై నీవు పట్టించుకోకుండా అవి ఆపుతాయి. సర్వశక్తుడు నిన్ను కాపాడుతాడనే నిరీక్షణను కలిగియుండడానికి సాహసించవు. నీకున్న స్థితినిబట్టి నీవు తృప్తి కలిగి ఉంటావు, రాబోయే వెలుగును గూర్చి నీవు ఎదురు చూడవు, చరిత్రలో చెప్పినట్లు సర్వశక్తుని రాకడ గురించి ఇక ఏమాత్రం ఎదురుచూడవు. నీకు సంబంధించినంత వరకు అందమైనదంతా పునరుజ్జీవింపబడవు, అవి ఉనికిలో ఉండవని అనుకుంటావు. నీ దృష్టిలో మానవ భవిష్యత్తు మాయమై, తుడిచిపెట్టుకుపోయింది. నీ బలమంతా కూర్చుకొని నీ తండ్రి దుస్తులను గట్టిగా పట్టుకుని, అయన శ్రమలను పంచుకునేందుకు సిద్ధపడి, నీ సుదూర ప్రయాణపు దిశను, నీ ప్రయాణపు సహవాసాన్ని వదులుకోవడానికి చాలా ఎక్కువగా భయపడతావు. మనుషుల సువిశాలమైన ఈ మసక ప్రపంచం మీలో చాలామందిని ఈ లోకములో విభిన్నమైన పాత్రలను పోషించడానికి మిమ్మల్ని జంకని, బెదరని వారలనుగా తయారుచేసి పెట్టింది. ఇది మరణ భయంలేని ఎందరో “యోధులను” సృష్టించింది. అంతకంటే ఎక్కువగా, సృష్టి ఉద్దేశమును నిర్లక్ష్యము చేసే మొద్దుబారిపోయిన, కదలని స్థితిలో పక్షవాతము కలిగిన కుప్పలు తెప్పలు మనుష్యులను తయారు చేసింది. తీవ్రంగా బాధింపబడుతున్న మానవ జాతిలోని ప్రతీఒక్కరినీ సర్వశక్తుని కనులు పరిశీలిస్తున్నాయి. బాధపడుతున్న వారి విలాపం ఆయన వింటున్నారు, బాధింపబడుచున్నవారి సిగ్గుమాలిన స్థితిని అయన చూస్తున్నారు, రక్షణ కృపను కోల్పోయిన మానవ జాతి నిస్సహాయ, భయాందోళనను ఆయన గ్రహిస్తున్నారు. మానవాళి ఆయన సంరక్షణను తృణీకరిస్తోంది, తమ సొంత దారిని ఎంచుకొని నడుస్తోంది, ఆయన కన్నుల పరిశీలన నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది, శత్రువు సహచర్యంలో లోతైన సముద్రంలోని చేదును, చివరి బిందువు వరకు రుచి చూసేందుకు మొగ్గు చూపుతోంది. సర్వశక్తుని నిట్టూర్పు ఇకపై మానవాళికి వినబడదు; దుఖఃభరిత మానవాళిని ఓదార్చేందుకు సర్వశక్తుని చేతులకు ఇకపై ఇష్టం ఉండదు. పదే పదే ఆయన తిరిగి పట్టుకోవడం, పదే పదే అయన తిరిగి ఓడిపోవడం, ఆ పనినే అయన పునరావృతం చేస్తూనే ఉన్నాడు. ఆ క్షణం నుంచి, ఆయన అలసిపోవడం మొదలై, తన చేతిలో పని ఆపివేసి, మానవజాతి మధ్య సంచరించడం మానివేస్తారు…. ఈ మార్పులన్నిటిలో దేని గురించి మనుష్యులకు పూర్తిగా అవగాహన లేదు, సర్వశక్తుని విచారం, దుఃఖం, ఆయన రావడం, వెళ్ళడం అనే విషయాలను గూర్చి కూడా పూర్తిగా అవగాహన లేదు.
సర్వశక్తుని తలంపులు, అయన కనుదృష్టితో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదానిలో శరవేగంగా మార్పులు సంభవిస్తాయి. మనుష్యులు మునుపెన్నడూ వినని సంగతులు అకస్మాత్తుగా వచ్చిపడతాయి, వారు చాలాకాలం నుంచి కలిగి ఉన్నవి తెలియకుండానే చేజారిపోతాయి. సర్వశక్తుని ఆచూకీ ఎవరూ గ్రహించలేరు, సర్వశక్తుని జీవ శక్తి యొక్క గొప్పతనం, ఔన్నత్యం ఏ కొందరికి మాత్రమే తెలుస్తుంది. ఆయన ఔన్నత్యముగలవాడు కనుక, మనుషులు గ్రహించలేనివి కూడా ఆయన గ్రహించగలడు. ఆయన గొప్పవాడు గనుక మనుష్యులు ఆయనను విడిచిపెట్టినప్పటికీ అయన మానవజాతిని రక్షిస్తున్నారు, ఆయనకు జీవ, మరణముల పరమార్థం తెలుసు, దాని కంటే ఎక్కువగా సృష్టించబడిన మనుష్యులందరూ తమ ఉనికి కోసం అనుసరించాల్సిన నియమ నిబంధనలు ఆయనకు తెలుసు. మానవుల ఉనికికి ఆయనే పునాది, మానవాళికి మరలా పునరుత్తానం కలిగించే విమోచకుడు ఆయనే. అయన తన కార్యసిద్ధి కోసం, తన ప్రణాళిక నిమిత్తం సంతోష హృదయాలను దుఃఖంతో బరువెక్కించగలరు, అలాగే దుఃఖముతో నిండిన హృదయాలను సంతోషంతో తేలిపోయేలా చేయగలడు.
సర్వశక్తుడు అనుగ్రహించే జీవము యొక్క ఏర్పాటుకు మానవాళి దూరంగా ఉండి, తమ ఉనికి యొక్క ఉద్దేశాన్ని గ్రహించడం లేదు, అయితే వారికి మరణమంటే భయమే. వారు సహాయం, తోడ్పాటు లేకయే ఉన్నారు కానీ వారి కనులు మూసుకొనుటకు విముఖత కలిగి ఉన్నారు, తమను తామే దోచుకొనుచూ ఈ లోకంలో తమ హేయమైన ఉనికిని కలుగుజేసుకొనుచున్నారు, తమ సొంత ఆత్మల విషయమై కనీస ఆలోచన లేకుండా కేవలం మాంసపు మూటలవలే వారున్నారు. నీవు ఈ విధంగా, ఇతరులవలెనే నిరీక్షణ లేకుండా, లక్ష్యం లేకుండానే జీవిస్తున్నావు. చరిత్రలోని పరిశుద్ధుడు మాత్రమే శ్రమలలో విలపించేవారిని, ఆయన రాక కొరకు మిక్కిలిగా ఎదురు చూసే వారిని రక్షిస్తాడు. ఇప్పటివరకూ ఎరుక లేనివారిలో అటువంటి విశ్వాసం కలుగలేదు. అయినప్పటికీ, మనుషులు ఇంకా దాని కొరకు ఆరాట పడుతూనే ఉంటారు. తీవ్రంగా శ్రమపడిన ఈ మనుషులపై సర్వశక్తుని కనికరం ఉంది; అదే సమయంలో, ఎరుక లోపించిన మనుషులతో అయన విసిగిపోయారు, ఎందుకంటే మానవాళి నుండి జవాబు వస్తుందేమోనని అయన సుదీర్ఘ కాలం వేచి చూచారు. ఆయన నీ హృదయాన్ని, ఆత్మను వెదకడానికి ఇష్టపడుచున్నారు, నీ ఆకలిదప్పులు లేకుండునట్లు, నీవు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలని, నీకు కావలసిన భోజన, పానాలు తీసుకు రావాలని ఆయన ఇష్టపడుచున్నారు. నీవు అలసిపోయినప్పుడు, ఈ లోకం పాడైపోయిందని నీకు అనిపించినప్పుడు, తప్పిపోవద్దు, దుఃఖించవద్దు. మనల్ని ఎల్లప్పుడు చూస్తూ ఉండే సర్వశక్తుడైన దేవుడు ఏ సమయంలోనైనా నిన్ను కౌగిలించుకుంటాడు. అయన నీ పక్కన ఉండి నిన్నే చూస్తూ, వెనుతిరిగి వస్తావని నీ కొరకు వేచి ఉన్నాడు. నీవు అకస్మాత్తుగా నీ జ్ఞాపక శక్తిని తిరిగి పొందుకొనే ఆ రోజు కోసం అయన ఎదురుచూస్తున్నాడు: నీవు దేవుని నుంచి వచ్చావని, నీకు తెలియని సమయంలో నీవు పయనించే నీ మార్గము నుండి తప్పిపోయావని, తెలియని సమయంలో నువ్వు నడిచే మార్గ మధ్యములో నీకున్న ప్రజ్ఞను కోల్పోయావని, నీవు ఎరుగని సమయంలో “తండ్రి ని” పొందుకున్నావని నీవు తెలుసుకునే ఆ రోజు కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు; అంతేగాకుండా, నీవు తిరిగి వస్తావని చాలా, చాలా, సుదీర్ఘ కాలం నుంచి, సర్వశక్తుడు ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉన్నాడని. ఆయన తీవ్రమైన ఆకాంక్షతో వేచి చూస్తున్నాడని, జవాబు లేని ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాడని నువ్వు తెలుసుకునే ఆ రోజు కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఆయన ఎదురుచూడడం, వేచి ఉండడం అనేవి వెలకట్టలేనివి, అవి మనుషుల హృదయాల కొరకు, ఆత్మల కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. బహుశా, ఈ ఎదురుచూడడం, వేచి ఉండడం అనేవి నిరవధికం కావచ్చు మరియు, అవి బహుశా అవే ముగింపు కావచ్చు. అయితే, నీ హృదయం, నీ ఆత్మ ఇప్పుడు ఎక్కడున్నాయో నీకే స్పష్టంగా తెలియాలి.
మే 28, 2003