దేవుని యందు నీవు నిజమైన విశ్వాసివా?
నీవు ఒకటి లేదా రెండు సంవత్సరాలకు పైగా దేవుని యందు విశ్వాసపు మార్గంలో నడిచి ఉండవచ్చు, అంతేకాక ఈ సంవత్సరాల్లో నీవు నీ జీవితంలో అనేక కష్టాలను భరించి ఉండవచ్చు; లేదా బహుశా నీవు ఎక్కువ కష్టాలు అనుభవించడానికి బదులుగా దేవుని నుండి గొప్ప కృపను పొంది ఉండవచ్చు. అది కూడా కాదంటే, నీవు కష్టాలను లేదా దయను దేనినీ అనుభవించకుండానే ఒక గుర్తింపు లేని జీవితాన్ని గడిపి ఉండవచ్చు. అయితే వీటితో సంబంధం లేకుండా, నీవు మాత్రం దేవుని అనుచరుడిగానే కొనసాగుతూ ఉన్నావు కాబట్టి దేవుణ్ణి అనుసరించే విషయంపై మనం సహవాసాన్ని ప్రారంభిద్ధాం. అయితే, ఈ వాక్యాలను చదివే వారందరికీ నేను గుర్తుచేయదలచుకున్నది ఏంటంటే, ఆయనను అంగీకరించి, ఆయన్ను అనుసరించే వారి వైపునకు దేవుని వాక్యం మళ్ళించబడుతుంది కానీ, ఆయనను అంగీకరించని వారి తట్టుకు మళ్ళీంచబడదు. ఒకవేళ దేవుడు ప్రపంచంలోని సర్వ జనులతోనూ మాట్లాడతాడని నీవు విశ్వసిస్తే, అప్పుడు దేవుని వాక్కు నీపై ఎటువంటి ప్రభావమూ చూపదు. అందువల్ల, నువ్వు ఈ వాక్కులన్నింటినీ నీ హృదయంలో గుర్తుంచుకొని ఎల్లప్పుడూ వాటి నుండి నిన్ను నీవు వేరు చేసుకోకూడదు. ఏది ఏమైనప్పటికీ, మన ఇంట్లో ఏమి జరుగుతుందో మాట్లాడుకుందాం.
దేవునిపై విశ్వాసం కలిగి ఉండడమంటే నిజమైన అర్థమేమిటో మీరందరూ ఇప్పుడు అర్థం చేసుకోవాలి. దేవునిపై విశ్వాసం యొక్క అర్థం గురించి నేను ఇంతకుముందు మాట్లాడినది మీ సానుకూల దృక్పథానికి సంబంధించినది. కానీ ఈరోజు నేను మాట్లాడబోతున్నది వేరు; ఈ రోజు నేను దేవునిపై మీ విశ్వాసం ఎలాంటిదో విశ్లేషించాలనుకుంటున్నాను. ఇది మిమ్మల్ని ఒకానొక ప్రతికూల అంశం ద్వారా మార్గనిర్దేశం చేయడమే; నేను అలా చేయకపోతే, మీరు మీ అసలు స్వభావాన్ని ఎప్పటికీ తెలుసుకోకుండా ఉండిపోయి మీ భక్తి విశ్వాసాల గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. మీ హృదయపు లోతుల్లోని వికారాన్ని నేను బయటపెట్టకపోతే, మీరందరూ మీ తలపై కిరీటం పెట్టుకుని, మీరెంతో ఘనులనే భావనలోనే మిగిలిపోతారని చెప్పడం న్యాయమే అవుతుంది. మీ అహంకారపూరితమైన మోసపు స్వభావాలు మీ స్వంత మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించడానికి, క్రీస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి మరియు ప్రతిఘటించడానికి, మరియు మీ వికార స్వభావాలను బహిర్గతం చేయడానికి మిమ్మల్ని నడిపిస్తాయి, తద్వారా మీ ఉద్దేశాలు, ఆలోచనలు, విపరీత కోరికలు మరియు దురాశతో నిండిన నేత్రాలను వెలుగులోకి తీసుకు వస్తాయి. అయితే, మీరు క్రీస్తు కార్యము పట్ల మీ జీవితకాల ఆర్తి గురించి కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు, మరియు చాలా కాలం క్రితం క్రీస్తు ద్వారా చెప్పబడిన సత్యాలను మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తుంటారు. ఇది మీ “విశ్వాసం”—మీ “నిష్కపటమైన విశ్వాసం”. నేను మనిషిని సర్వత్రా కఠినమైన ప్రమాణంలో ఉంచాను. నీ విధేయత అనేది ఉద్దేశాలు మరియు షరతులతో వచ్చినట్లయితే, అప్పుడు అలాంటి విధేయత నాకు అక్కర్లేదు, ఎందుకంటే వారి ఉద్దేశాల ద్వారా నన్ను మోసం చేసే వారిని మరియు షరతులతో నన్ను దోపిడీ చేసే వారిని నేను అసహ్యించుకుంటాను. మనిషి నాకు పూర్తిగా విధేయుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరియు విశ్వాసం అనే ఒకే ఒక పదం కోసం, ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడమే సమస్త కార్యాలనూ చేయాలని నేను కోరుకుంటాను. నన్ను సంతోషపెట్టడానికి మీరు పలికే తియ్యని మాటలంటే నాకు అసహ్యం, ఎందుకంటే నేను మీతో ఎల్లప్పుడూ యదార్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాను, కాబట్టి మీరు కూడా నా పట్ల నిజమైన విశ్వాసంతో ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. విశ్వాసం విషయానికి వస్తే, తమకు విశ్వాసం ఉంది కాబట్టే దేవుణ్ణి అనుసరిస్తున్నామని, లేకపోతే అలాంటి బాధలను భరించలేమని చాలామంది అనుకోవచ్చు. మీరు ఇలాంటి భావనతో ఉన్నవారైతే మీకు నాదొక ప్రశ్న: నీవు దేవుని ఉనికిని విశ్వసిస్తే, నువ్వు ఆయనను ఎందుకు ఆరాధించవు? నువ్వు దేవుని ఉనికిని విశ్వసిస్తే, నీ హృదయంలో కొంచెమైనా ఆయన పట్ల భయం ఎందుకు లేదు? క్రీస్తు దేవుని అవతారమని నీవు అంగీకరిస్తున్నప్పుడు ఎందుకు ఆయనను ధిక్కరిస్తావు? ఆయన పట్ల ఎందుకు అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నావు? ఆయనని బహిరంగంగా ఎందుకు విమర్శిస్తావు? ఎల్లప్పుడూ ఆయన కదలికలపై ఎందుకు అనుమానిస్తూ ఉంటావు? ఆయన ఏర్పాట్లకు ఎందుకు లోబడవు? ఆయన వాక్యానికి అనుగుణంగా ఎందుకు ప్రవర్తించవు? ఆయన ఇచ్చేవాటిని బలవంతంగా లాక్కోవడానికి, దోచుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నువ్వు క్రీస్తు స్థానంలో నుండి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన కార్యం మరియు ఆయన వాక్కు సరైనదేనా అని నీవెందుకు తీర్పు ఇస్తున్నావు? ఆయన వెనుక దూషించడానికి మీరెందుకు ధైర్యం చేస్తున్నారు? మీ విశ్వాసంలో ఉన్నవి ఇవి మరియు ఇలాంటి ఇతరాలేనా?
మీ మాటల్లో మరియు ప్రవర్తనలో క్రీస్తుపై మీకున్న అవిశ్వాసం వెల్లడి అవుతుంది. విశ్వాసం లేకపోవడమనేది మీ క్రియల ఉద్దేశ్యాలు వాటి లక్ష్యాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. క్రీస్తు పట్ల మీకుండే అవిశ్వాసం ద్వారా మీరు చూసే మీ కనుదృష్టి కూడా ప్రభావితం చెందుతుంది. నిమిష నిమిషానికి, మీలో ప్రతి ఒక్కరు అవిశ్వాసపు అంశాలను ఆశ్రయమిస్తున్నారని చెప్పవచ్చు. అంటే దీని అర్థం, ప్రతి క్షణం, మీరు క్రీస్తుకు ద్రోహం చేసే ప్రమాదంలో ఉన్నారు, ఎందుకంటే మీ శరీరంలో ప్రవహించే రక్తం అవతారమూర్తి అయిన దేవునిపై అవిశ్వాసంతో నిండి ఉంది. కాబట్టి, దేవునిపై విశ్వాసపు మార్గంలో మీరు వదిలిన అడుగుజాడలు నిజమైనవి కాదని నేను చెప్తున్నాను; మీరు దేవునిపై విశ్వాసపు మార్గంలో నడుస్తున్నప్పుడు, మీరు మీ పాదాలను నేలపై స్థిరంగా నిలిపి ఉంచరు—మీరు కేవలం కదలికల గుండా వెళుతున్నారు. మీరు క్రీస్తు వాక్కును ఎప్పుడూ పూర్తిగా విశ్వసించరు మరియు వెంటనే ఆచరణలో పెట్టే సామర్ధ్యం కలిగి ఉండరు. మీకు క్రీస్తుపై విశ్వాసం లేకపోవడానికి ఇదే కారణం. ఎల్లప్పుడూ ఆయన గురించి ఉద్దేశాలు కలిగి ఉండటం కూడా ఆయనపై మీకు విశ్వాసం లేకపోవడానికి మరో కారణం. క్రీస్తు కార్యం గురించి ఎప్పటికీ సందేహిస్తూ, క్రీస్తు వాక్కుని పెడచెవిని పెడుతూ, క్రీస్తు చేసిన ప్రతి పనిపైనా అభిప్రాయం కలిగి ఉండి, ఆయన పనిని సరిగ్గా అర్థం చేసుకోలేక, ఏ వివరణ ఇచ్చినా మీ ఉద్దేశాలను పక్కన పెట్టడానికి సతమతమవుతూ, మరియు ఈరీతిగా—ఇవన్నీ మీ హృదయాలలో బలంగా పెనవేసుకుపోయిన అవిశ్వాసపు అంశాలు. మీరు క్రీస్తు కార్యాన్ని ఎన్నడూ వెనుకపడకుండా అనుసరిస్తున్నప్పటికీ, మీ హృదయాలలో చాలా తిరుగుబాటు స్వభావం ఉంది. ఈ తిరుగుబాటు దేవునిపై మీకున్న విశ్వాసంలో గల మాలిన్యం. నీవు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావని అనుకోకపోవచ్చు, కానీ వీటిలో నుండి నీ ఉద్దేశాలను గుర్తించలేకపోతే, అప్పుడు నువ్వు నశించే వారిలో ఒకడిగా ఉండాటానికి బద్దుడివి అవుతావు, ఎందుకంటే తనను నిజంగా విశ్వసించేవారిని మాత్రమే దేవుడు పరిపూర్ణం చేస్తాడు, ఆయన పట్ల సందేహాస్పదంగా ఉన్నవారిని కాదు, మరియు ఆయనే దేవుడని ఎన్నడూ విశ్వసించనప్పటికీ, అయిష్టంగా ఆయనను అనుసరించే వారిని ఆయన అసలే పట్టించుకోడు.
కొంతమంది సత్యంలో సంతోషించరు, తీర్పును బట్టి ఐతే మరింత తక్కువగానే సంతోషిస్తారు. బదులుగా, వారు అధికారం మరియు సంపదల్లో సంతోషిస్తారు; అలాంటి వారిని అధికారం కోరేవారు అంటారు. వారు ఆ రకమైన ప్రభావాన్ని కలిగి ఉండే డినామినేషన్ల కోసం మాత్రమే అన్వేషిస్తారు, మరియు వారు సెమినరీల నుండి వచ్చే సంఘ కాపరులు మరియు బోధకుల కోసం మాత్రమే చూస్తారు. వారు సత్య మార్గాన్ని అంగీకరించినప్పటికీ, వారు కేవలం అర్ద విశ్వాసంతోనే ఉంటారు; వారికి తమ పూర్ణ మనస్సును, పూర్ణ హృదయాన్ని అర్పించగల సామర్ధ్యం లేదు, వారి నోర్లు దేవుని కోసం తమను తాము వెచ్చించడం గురించి మాట్లాడతాయి, కాని వారి కళ్ళు గొప్ప సంఘ కాపరులు మరియు బోధకులపై కేంద్రీకృతమై ఉంటాయి, వారు రెండవ సారి క్రీస్తు వైపుకు తిరిగి చూడరు. వారి హృదయాలు పేరు, ధన ఘనతల పైనే ఉంటాయి. అలాంటి అల్పమైన వ్యక్తి చాలా మందిని జయించగల సామర్ధ్యం కలిగి ఉండే, అంతగా గుర్తింపు లేని వ్యక్తి మనిషిని పరిపూర్ణంగా చేయగలిగే ప్రశ్నే లేదని వారు అనుకుంటారు. దుమ్ము, పెంటకుప్పల మధ్య ఉన్న ఈ అనామకులు దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తులయ్యే ప్రశ్నే లేదని వారు అనుకుంటారు. ఒకవేళ అలాంటి వ్యక్తులు దేవుని విమోచనకి సంబంధించిన సాధనాలైతే, అప్పుడు పరలోకం మరియు భూమి తలక్రిందులైపోతాయనీ మరియు జనులందరూ తమలో తాము వెర్రిగా నవ్వుకుంటారనీ వారు నమ్ముతారు. ఒకవేళ దేవుడు అటువంటి అనామకులనే పరిపూర్ణులుగా మార్చడానికి ఎంచుకుంటే, అప్పుడు ఆ ధనవంతులైన, ఘనత ప్రతిష్టలు కలిగిన వారైతే ఇక దేవుని అవతారమూర్తులని నమ్ముతారు. వారి తలంపులు అవిశ్వాసంతో కల్మషమయ్యాయి; విశ్వసించకపోవడమే కాకుండా, వారు కేవలం మూర్ఖమైన మృగాలు. ఎందుకంటే, వారు హోదా, ప్రతిష్ట మరియు అధికారానికి మాత్రమే విలువ ఇస్తారు మరియు వారు పెద్ద సమూహాలు మరియు వర్గాలను మాత్రమే గౌరవిస్తారు. క్రీస్తుచే నడిపించబడే వారి పట్ల వారికి కనీస గౌరవం లేదు; వారు కేవలం క్రీస్తుకు, సత్యానికి మరియు జీవితానికి వెన్నుచూపిన ద్రోహులు.
నువ్వు క్రీస్తు వినయాన్ని కాకుండా, ప్రముఖ స్థానంలో ఉన్న ఆ తప్పుడు కాపరులను ఆరాధిస్తున్నావు. నువ్వు క్రీస్తు యొక్క మనోహరతను లేదా జ్ఞానాన్ని కాకుండా, ప్రపంచంలోని మురికిలో మునిగిపోయే స్వేచ్ఛావాదులని ఆరాధిస్తావు. తన తల వాల్చుటకు చోటు లేని క్రీస్తు బాధను చూసి నీవు నవ్వుతావు, కానీ కానుకల కోసం వేటాడే మరియు వ్యభిచార కూపంలో జీవించే శవాలను మెచ్చుకుంటావు. నువ్వు క్రీస్తుతో పాటు వేదన అనుభవించడానికి ఇష్టపడవు, కానీ, వాళ్ళు నీకు కేవలం మాంసం, మాటలు మరియు నియంత్రణను మాత్రమే అందిసున్నప్పటికీ, సంతోషంగా ఆ నిర్లక్ష్యపు క్రీస్తు వ్యతిరేకుల చేతుల్లోకి నిన్ను నువ్వు విసిరివేసుకుంటావు. ఇప్పుడు కూడా నీ హృదయం వారి వైపు, వారి కీర్తి వైపు, వారి పలుకుబడి వైపు, వారి ప్రభావం వైపు తిరుగుతుంది. ఇంకనూ నీవు క్రీస్తు కార్యము అంటే మింగుడు పడనిదిగా, దానిని అంగీకరించడానికి ఇష్టపడనివాడివిగా ఉండే వైఖరినే కలిగి ఉంటున్నావు. అందుకే క్రీస్తుని అంగీకరించే విశ్వాసం నీకు లేదని నేను చెప్తుంటాను. నీవు ఈ రోజు వరకు ఆయనను అనుసరించడానికి కారణం నీకు వేరే మార్గం లేకపోవడమే. పెద్ద పెద్ద ప్రతిమలు వరుసగా నీ హృదయంలో ఎప్పటికీ పేరుకుపోతున్నాయి; వారి ప్రతి మాట మరియు పనిని లేదా వారి ప్రభావవంతమైన మాటలు మరియు చేతలను మరచిపోలేకపోతున్నావు. వారు నీ హృదయంలో, ఎప్పటికీ అత్యున్నతమైనవారు మరియు వీరులు. కానీ నేటి క్రీస్తుకు ఇలాంటి స్థానం నీ హృదయంలో లేదు. ఆయన నీ హృదయంలో ఎప్పటికీ అప్రధానంగా ఉంటున్నాడు మరియు ఆరాధనకు ఎప్పటికీ అర్హుడు కాదు. ఎందుకంటే, ఆయన అతి సామాన్యుడు, చాలా తక్కువ ప్రభావం కలిగి ఉన్నాడు, మరియు గర్వానికి దూరంగా ఉన్నాడు.
ఏ సందర్భంలోనైనా, సత్యానికి విలువ ఇవ్వని వారందరూ అవిశ్వాసులనీ మరియు సత్య ద్రోహులనీ నేను అంటాను. అలాంటి మనుష్యులు ఎప్పటికీ క్రీస్తు ఆమోదాన్ని పొందలేరు. నీలో ఎంత అపనమ్మకం ఉందో మరియు నీలో ఎంత క్రీస్తు ద్రోహం ఉందో ఇప్పటికైనా గుర్తించగలిగావా? నేను నీకు ఈ విధంగా భోదిస్తున్నాను: నువ్వు సత్య మార్గాన్ని ఎంచుకున్నావు కాబట్టి, నిన్ను నువ్వు హృదయపూర్వకంగా అంకితమిచ్చుకోవాలి; ద్వంద ప్రవృత్తితో లేదా అర్ధహృదయంతో ఉండవద్దు. దేవుడు ఆయనను నిజంగా విశ్వసించే వారందరికీ, నిజంగా ఆరాధించే వారందరికీ, మరియు ఆయనకి సమర్పించుకొని నమ్మకస్తులుగా ఉన్నవారికి చెందుతాడు తప్ప, ప్రపంచానికి లేదా ఏ ఒక్క వ్యక్తికో కాదు అని నీవు అర్థం చేసుకోవాలి.
నేడు, మీలో చాలా అపనమ్మకం మిగిలి ఉంది. మీ అంతరంగాన్ని ఒకసారి పరిశీలించుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా సమాధానాన్ని కనుగొంటారు. మీరు నిజమైన సమాధానాన్ని కనుగొన్నప్పుడు, మీరు దేవుణ్ణి నమ్మేవారు కాదనీ, ఆయనను మోసం చేసేవారనీ, దూషించేవారనీ మరియు ద్రోహం చేసేవారనీ మరియు అవిధేయులనీ మీరు ఒప్పుకుంటారు. అప్పుడు క్రీస్తు మనిషి కాదనీ, ఆయన దేవుడనీ మీరు గ్రహిస్తారు. ఆ రోజు వచ్చినప్పుడు, మీరు క్రీస్తుని గౌరవిస్తారు, భయపడతారు మరియు నిజంగా ప్రేమిస్తారు. ప్రస్తుతం, మీ హృదయం ముప్పై శాతం మాత్రమే విశ్వాసంతో నిండి ఉంది, మిగిలిన డెబ్భై శాతం సందేహంతో నిండి ఉంది. క్రీస్తు చేసేది మరియు చెప్పేదంతా మీకు ఆయన గురించిన ఉద్దేశాలు మరియు అభిప్రాయాలను కలిగించవచ్చు, అంటే ఆయనపై మీకున్న పూర్తి అవిశ్వాసం నుండి ఉత్పన్నమయ్యే ఉద్దేశాలు మరియు అభిప్రాయాలను కలిగించవచ్చు. మీరు పరలోకంలోని కనిపించని దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు మరియు ఆయనకే భయపడతారు మరియు భూమిపై సజీవుడైన క్రీస్తును పట్టించుకోరు. ఇది కూడా మీ అవిశ్వాసం కాదా? మీరు గతంలో కార్యము చేసిన దేవుని కోసం మాత్రమే ఆరాటపడతారు, కానీ నేటి క్రీస్తుకు మాత్రం ముఖం తిప్పేస్తారు! ఇదంతా మీ హృదయాలలో ఎప్పటికీ మిళితమై ఉన్న “విశ్వాసం”, నేటి క్రీస్తుని నమ్మని విశ్వాసం. నేను మిమ్మల్ని ఏ విధంగానూ తక్కువ అంచనా వేయడం లేదు, ఎందుకంటే మీ లోపల చాలా అపనమ్మకం ఉంది, మీలో చాలా మట్టుకు అపరిశుద్ధంగా ఉంది మరియు అది తప్పకుండా తొలగించబడాలి. మీకు విశ్వాసం ఏ మాత్రమూ లేదనడానికి ఈ మలినాలే సంకేతం; మీరు క్రీస్తును త్యజించినందుకు అవి గుర్తుగా ఉన్నాయి మరియు అవి మిమ్మల్ని క్రీస్తు ద్రోహిగా ముద్ర వేస్తాయి. అవి క్రీస్తును గూర్చిన మీ జ్ఞానాన్ని కప్పి ఉంచే ముసుగులు, క్రీస్తు మిమ్మల్ని పొందేందుకు అడ్డుగా ఉన్న అవరోధాలు, క్రీస్తుతో మీ అనుకూలతకు అడ్డంకి మరియు క్రీస్తు మిమ్మల్ని అంగీకరించడం లేదనడానికి ఋజువు. మీ జీవితంలోని అన్ని భాగాలను పరిశీలించాల్సిన సమయం ఇదే. ఇలా చేయడం వల్ల ఊహించదగిన అన్ని విధాలుగా మీకు ప్రయోజనం కలుగుతుంది.