నీవు క్రీస్తుతో ఏకీభవించగల మార్గాన్ని అన్వేషించాలి

నేను మానవుని యందు చాలా పని చేశాను, ఆ సమయములో అనేక మాటలు కూడా పలికాను. ఈ మాటలన్నీ మానవ రక్షణ కోసం మరియు మానవుడు నాతో ఏకీభవించుట కొరకు చెప్పబడ్డాయి. ఏదేమైనా, భూమి మీద నాతో ఏకీభవించే వారిని కొద్ది మందిని మాత్రమే నేను కలిగి ఉన్నాను, కాబట్టి మానవుడు నా మాటలను అమూల్యమైనవిగా పరిగణించడు అని నేను చెప్పగలను—ఎందుకంటే, మానవుడు నాతో ఏకీభవించడు. ఈ క్రమములో, మానవుడు నన్ను ఆరాధించాలని మాత్రమే కాదు కానీ; మరీ ముఖ్యంగా, మానవుడు నాతో ఏకీభవించాలని నేను కార్యము చేస్తాను. మనిషి భ్రష్టుడై సాతాను ఉచ్చులో జీవిస్తున్నాడు. మనుష్యులందరూ శరీరానుసారముగా, స్వార్ధపూరితమైన కోరికలతో జీవిస్తున్నారు అలాగే వారిలో ఒక్కరు కూడా నాతో ఏకీభవించడం లేదు. నాతో ఏకీభవిస్తున్నాను అని చెప్పేవారూ కొందరున్నారు, కానీ అటువంటి వారందరూ మాయా విగ్రహాలను పూజిస్తారు. వారు నా నామమును పరిశుద్దమైనదిగా పరిగణించినప్పటికీ, వారు నాకు విరోధమైన మార్గములో నడుచుచున్నారు, అలాగే వారి మాటలన్నీ అహంకారము మరియు ఆత్మ విశ్వాసముతో నిండి ఉన్నాయి. ఎందుకంటే, అనాదిగా, వారందరూ నాకు వ్యతిరేకముగా మరియు విరుద్ధముగా ఉన్నారు. ప్రతిరోజూ, పరిశుద్ద గ్రంధములో నా జాడలను కనిపెడుతూ, మరియు వారికి “అనుకూలమైన” భాగాలను వెదికి, వాటినే నిర్విరామంగా చదువుతూ వాటినే లేఖనాలుగా వర్ణిస్తారు. నాతో ఎలా ఏకీభవించాలో మాత్రమే కాకుండా, నన్ను వ్యతిరేకించడమంటే ఏమిటో కూడా వారికి తెలియదు. వారు కేవలం లేఖనాలను గుడ్డిగా చదువుతారు. వారి తీరిక సమయాల్లో తీసి చూసుకునేందుకు వీలుగా, తాము ఎన్నడూ చూడని ఒక అస్పష్టమైన దేవుని రూపాన్ని వారు బైబిల్ వరకు మాత్రమే నిర్భందించారు. నా ఉనికి బైబిల్ పరిధిలో మాత్రమే ఉందని వారు విశ్వసిస్తారు, మరియు బైబిల్ లేకుండా నేను లేనని, నేను లేకుండా బైబిల్ లేదని వారు విశ్వసిస్తారు; వారు నన్ను పరిశుద్ద గ్రంధముతో సమానముగా చూస్తారు. వారు నా ఉనికిని మరియు క్రియలను పట్టించుకోరు, బదులుగా లేఖనాలలోని ప్రతి వాక్యము పట్ల అత్యంత భక్తిని మరియు ప్రత్యేక శ్రద్దను కనుపరుస్తారు. ఇంకా అనేకమంది, నేను చేయాలనుకున్నది లేఖనముల ద్వారా ముందుగానే చెప్పబడి ఉంటేనే తప్ప నేను చేయకూడదని విశ్వసిస్తారు. వారు లేఖనాలకు చాల ప్రాముఖ్యతనిస్తారు. నేను పలికే ప్రతి మాటను కొలవడానికి, మరియు నన్ను నిందించడానికి, బైబిల్ నుండి వాక్యాలను ఉపయోగించునంత వరకు, వారు వాక్యాలను మరియు వ్యక్తీకరణలను ఎంతో ప్రాముఖ్యమైనవిగా చూస్తారని చెప్పవచ్చు. వారు బైబిల్ లోని వాక్యాలతో ఏకీభవించే మార్గాన్ని వెదుకుచున్నారు కానీ, అది నాతో ఏకీభవించే మార్గమో లేక సత్యముతో ఏకీభవించే మార్గమో కాదు, అలాగే బైబిల్‌నకు అనుగుణముగా లేనిది ఏదైనా, దాపరికము లేకుండా, అది నా పని కాదు అని వారు నమ్ముతారు. మరి, అలాంటి వారు విధి బద్దమైన పరిసయ్యుల సంతతివారు కాదా? యేసును నిందించడానికి యూదులైన పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రాన్ని ఉపయోగించారు. వారు ఆ కాలపు యేసుతో సామరస్యాన్ని కాంక్షించలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో అక్షరాలా పాటించారు, ఎంతవరకు అంటే—పాత నిబంధన కట్టడను పాటించలేదని ఆయనపై అభియోగము మోపి—చివరకు నిర్దోషి అయిన యేసును వారు సిలువ వేశారు. వారి మనోభావము ఏమిటి? సత్యముతో ఏకీభవించే మార్గాన్ని వెతకలేదు కదా? వారు నా చిత్తము పట్ల గానీ నా కార్యము యొక్క దశలు మరియు విధానాల పట్ల గానీ శ్రద్ధ చూపకుండా, లేఖనములోని ప్రతి ఒక్క మాటమీద స్థిరమైన భావమును కలిగియున్నారు. వారు వాక్యాలను గట్టిగా అంటిపెట్టుకుని ఉండేవారే కానీ, సత్యాన్వేషకులు కాదు; వారు బైబిల్‌ను నమ్మేవారే కానీ, దేవుని నమ్మేవారు కారు. ముఖ్యంగా, వారు బైబిల్‌నకు కాపలా కుక్కలు లాంటివారు. బైబిల్ ప్రయోజనాలను కాపాడటానికీ, బైబిల్ యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికీ, బైబిల్ యొక్క ప్రతిష్టను సంరక్షించడానికీ, వారు కరుణామయుడైన యేసును సిలువ వేసేంత వరకు వెళ్ళారు. వారు కేవలము బైబిల్‌ను సమర్థించడానికి, మరియు ప్రజల హృదయాలలో బైబిల్‌లోని ప్రతి వాక్యపు స్థాయిని కొనసాగించడానికి మాత్రమే వారు అంత పని చేసారు. కాబట్టి వారు లేఖనము యొక్క సిద్దాంతానికి అనుగుణముగా లేని యేసుకు మరణ శిక్షను విధించడానికి, వారు తమ భవిష్యత్తును మరియు పాప పరిహారార్ధబలిని విడనాడుటకు మొగ్గుచూపారు. వారందరూ లేఖనములోని ప్రతి ఒక్క పదానికి బంట్రోతులు కారా?

మరి నేటి ప్రజల పరిస్థితేమిటి? సత్యాన్ని ప్రచురము చేయడానికి క్రీస్తు వస్తే, బదులుగా వారు మాత్రము పరలోకములో ప్రవేశము కొరకు మరియు కృపను పొందుకోవడానికి ఈ లోకమునుండి ఆయనను నిర్మూలించారు. బైబిల్ ప్రయోజనములను కాపాడుటకు వారు సత్యము యొక్క రాకడను పూర్తిగా నిరాకరించారు, మరియు బైబిల్ యొక్క నిత్య అస్తిత్వాన్ని స్థిరపరచడానికి శరీరధారిగా తిరిగివచ్చిన క్రీస్తును సిలువవేశారు. మానవుని హృదయము అంత ఘోరముగా మరియు నా పట్ల తన స్వభావము అంత విరోధముగా ఉన్నపుడు, ఏ విధముగా తను నా రక్షణ పొందగలడు? నేను మానవునియందు నివసిస్తున్నాను, అయినప్పటికీ మానవుడు నా ఉనికిని ఎరుగడు. నేను మానవునిపై నా కాంతిని ప్రకాశింపచేసినప్పుడు, మానవుడు ఇంకనూ నా ఉనికి పట్ల నిర్లక్ష్యముగా ఉన్నాడు. నేను మానవుని మీదకు నా ఉగ్రతను పంపినప్పుడు, మరి ఎక్కువ బలముగా నా అస్తిత్వాన్ని తిరస్కరిస్తాడు. మానవుడు వాక్యాలతో మరియు బైబిల్‌తో సత్సంబంధము కొరకు వెదుకుతాడు, అయినప్పటికీ సత్యముతో ఏకీభవించే మార్గాన్ని వెతికే ఒక్క వ్యక్తి అయినా నా ముందుకు రాలేదు. మానవుడు పరలోకములో నున్న నా వైపు చూస్తాడు, పరలోకములో ఉన్న నా అస్థిత్వము పట్ల ప్రత్యేకమైన భక్తిని కలిగిఉంటాడు, నేను మానవుని నడుమ చాలా సాధారణముగా జీవించుటను బట్టి, ఇప్పటికీ శరీరధారిగా ఉన్న నన్ను ఎవడూ పట్టించుకోడు. బైబిల్ వాక్యాలతో మాత్రమే సారూప్యత కోరుకునేవారు మరియు అస్పష్టమైన దేవునితో మాత్రమే అనుకూలతను కోరుకునేవారంతా నా పట్ల సిగ్గుమాలిన దృష్టి గలవారు. ఎందుకంటే, వారు నిర్జీవమైన మాటలను మరియు చెప్పలేనంత సంపదనిచ్చే ఒక దేవుని ఆరాధిస్తున్నారు; వారు ఆరాధించే దేవుడు మనిషి దయమీద బ్రతికే దేవుడు—లేని దేవుడు. మరి అలాంటి మనుష్యులు నా యోద్ద నుండి ఏమి పొందగలరు? మానవుడు మాటలకు చాలా స్వల్పమైన వాడు. నాకు విరోధముగా ఉన్నవారు, నా నుండి అమితముగా ఆశించేవారు, సత్యము పట్ల ప్రేమ లేనివారు, నాపై తిరుగుబాటు చేసేవారు—నాతో ఎలా ఏకీభవించగలరు?

నాకు విరోధముగా ఉన్నవారంతా నాతో ఏకీభవించనివారే. సత్యాన్ని ప్రేమించనివారు కూడా అలాంటివారే. నాపై తిరుగుబాటు చేసేవారు అత్యంత విరోధులు మరియు నాతో ఏకీభవించనివారు. నాతో ఏకీభవించని వారందరినీ నేను దుష్టుని చేతికప్పగిస్తాను, నేను వారిని అపవాది దుర్నీతికి విడిచిపెడతాను, వారి దుష్ప్రవర్తనను బయలుపరచడానికి వారికి స్వేచ్ఛను ఇస్తాను, చివరికి మ్రింగివేయబడటానికి అపవాది చేతికి వారిని అప్పగిస్తాను. నన్ను ఎంతమది ఆరాధిస్తున్నారో, అనగా, నన్ను ఎంతమంది విశ్వసిస్తున్నారో అనేది నేను పట్టించుకోను. నాతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు అనేది మాత్రమే నేను పట్టించుకుంటాను. ఎందుకంటే, నాతో ఏకీభవించని వారందరూ నాకు ద్రోహము చేసే దుర్మార్గులే; వారు నా శత్రువులు, మరియు నా శత్రువులను నా గృహములో నేను “ప్రతిష్టించను”. నాతో ఏకీభవించు వారు నా గృహములో నిత్యము నన్ను సేవిస్తారు, మరియు నాకు విరోధముగా వెళ్ళువారు నా శిక్షను నిత్యమూ అనుభవిస్తారు. బైబిల్ లోని వాక్యాల పట్ల మాత్రమే శ్రద్ధ కలిగినవారు, సత్యము గురించి కానీ లేదా నా అడుగుజాడలు వెతుకుట గురించి కానీ అవగాహన లేని వారు—వారు నాకు విరోధులు, ఎందుకంటే వారు కేవలము నన్ను బైబిల్‌కు పరిమితం చేస్తారు, బైబిల్‌లోని రాతలకే నన్ను నిర్బంధిస్తారు, నా పట్ల వారు ఘోరమైన దైవ దూషణ చేస్తారు. అటువంటి వ్యక్తులు నా ఎదుటకు ఎలా రాగలరు? వారు నా కార్యాలు లేక నా చిత్తము లేక సత్యము పట్ల లక్ష్ ముంచరు, బదులుగా చంపే మాటలంటే—వారికి ఎంతో మక్కువ. అటువంటి మనుష్యులు నాతో ఎలా ఏకీభవిస్తారు?

నేను చాలా మాటలు చెప్పాను అలాగే నా చిత్తాన్ని మరియు స్వభావాన్ని కూడా వ్యక్త పరిచాను, అయినప్పటికీ, మనుష్యులు ఇప్పటికీ నా గురించి గ్రహింపు లేక మరియు నా యందు విశ్వాసం ఉంచలేకయున్నారు. లేదా, మనుష్యులు ఇప్పటికీ నా పట్ల విధేయత చూపలేకపోతున్నారని చెప్పవచ్చు. బైబిల్‌ను బట్టి మాత్రమే జీవించేవారు, ధర్మశాస్త్రమందు జీవించేవారు, సిలువ యందు జీవించేవారు, సిద్దాంతమును బట్టి జీవించేవారు, ఈ దినమందు నేను చేయు కార్యమును బట్టి జీవించు వారు—వీరిలో ఎవరు నాతో ఏకీభవిస్తారు? మీరు కేవలం ఆశీర్వాదాలు మరియు బహుమానాలు పొందడము గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ నిజముగా నాతో ఎలా ఏకీభవించాలి లేక నాకు విరోధముగా ఉండకుండా మిమ్మల్ని మీరు ఎలా నిరోధించుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. మిమ్మల్ని బట్టి నేను చాలా చింతిస్తున్నాను, ఎందుకంటే నేను మీకు చాలా ఇచ్చాను, అయినప్పటికీ నేను మీ నుండి పొందినది మాత్రము చాలా తక్కువ. మీ మోసము, మీ అహంకారము, మీ దురాశ, విపరీతమైన మీ కోరికలు, మీ ద్రోహము, మీ అవిధేయత—వీటిలో ఏది నా దృష్టినుండి తప్పించుకోగలదు? మీరు నా పట్ల నిర్లక్ష్యముగా ఉన్నారు, మీరు నన్ను హేళన చేశారు, మీరు నన్ను అవమానించారు, మీరు నన్ను వంచించారు, బలులను బట్టి మీరు నన్ను బలవంత పెట్టి నన్ను చేసిన దోపిడీ—అలాంటి దుర్మార్గత నా శిక్ష నుండి ఎలా తప్పించుకోగలదు? ఈ దుష్ప్రవర్తన అంతా నాపై మీకున్న శత్రుత్వానికి మరియు నాతో మీరు కలిగియున్న పొసగనితనానికి రుజువై ఉన్నది. మీలో ప్రతి ఒక్కరూ, మీకు మీరే నాతో మంచి సారూప్యత కలిగియున్నారని విశ్వసిస్తున్నారు, ఒకవేళ అదే అయితే, మరి ఆ తిరుగులేని సాక్ష్యము ఎవరికి వర్తిస్తుంది? మీరు నా పట్ల అత్యంత నిజాయితీ మరియు విధేయతను కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నారు. మీరు దయార్దహృదయం గలవారని, ఎంతో జాలి కలిగినవారని, అలాగే నా పట్ల ఎంతో భక్తి కలిగి ఉన్నారని అనుకుంటున్నారు. మీరు నాకు చేయాల్సినంత కంటే ఎక్కువనే చేశారని అనుకుంటున్నారు. కానీ, మీరు ఎప్పుడైనా మీ క్రియలకు విరోధముగా దీనిని చేశారా? మీరు చాలా అహంకారులని, చాలా దురాశ కలవారని, చాలా పనికిమాలిన వారని చెప్తాను; నన్ను మోసపుచ్చడానికి మీరు వేసే పన్నాగాలు ఏంతో తెలివైనవి, అలాగే మీరు సిగ్గుమాలిన ఆలోచనలు మరియు నీచమైన పద్దతులు కలిగి ఉన్నారు. మీకు విధేయత చాలా తక్కువ, మీరు శ్రద్ధ విహీనులు, మీరు మనస్సాక్షి లేనివారు. మీ హృదయాలో చాలా దుర్మార్గత ఉన్నది, నాతో సహా, మీ దుర్మార్గము నుండి ఎవడూ తప్పించుకోలేడు. మీ బిడ్డల కోసమో లేక నీ భర్త కోసమో, లేక మీ స్వంత ఆత్మ సంరక్షణ కోసమో, మీరు నన్ను నిరోధిస్తారు. నా గురించి శ్రద్ధ వహించకుండా, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ స్థాయి, మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మ సంతృప్తి గురించి మీరు శ్రద్ధ వహిస్తారు. మీరు మాట్లాడుతున్నప్పుడు లేక పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు నా గురించి ఆలోచించారా? శీతలమైన దినాలలో, మీ ఆలోచనలు మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య లేక మీ తల్లిదండ్రుల వైపు మళ్ళుతాయి. ఉక్కపోత దినాలలో మీ ఆలోచనలలో నాకు స్థానం కూడా ఉండదు. మీరు మీ బాధ్యతను నిర్వర్తించేటప్పుడు, మీ స్వంత ప్రయోజనాలు గురించి, మీ వ్యక్తిగత భద్రత, మీ స్వంత కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు. మీరు నా కోసం ఏమి చేశారు? మీరు నా గురించి ఎప్పుడు ఆలోచించారు? ఎప్పుడు మీరు, ఎంత కష్టమైనా సరే, నా కొరకు మరియు నా కార్యము కొరకు మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు? మీరు నాతో ఏకీభవించగల ఆధారాలు ఎక్కడున్నాయి? నా పట్ల మీ సద్భక్తి యొక్క వాస్తవికత ఎక్కడుంది? నా పట్ల మీ విధేయత యొక్క వాస్తవికత ఎక్కడుంది? నా ఆశీర్వాదాలు పొందటం కోసం ఆలోచించకుండా ఎప్పుడు ఉన్నారు? మీరు నన్ను హేళన చేసి అలాగే మోసము చేస్తున్నారు, మీరు సత్యముతో ఆటలాడుచున్నారు, మీరు సత్యము యొక్క ఉనికిని దాచిపెట్టి అలాగే సత్య సారాంశమునకు ద్రోహము చేస్తున్నారు. ఈ విధముగా మీరు నాకు విరోధముగా వెళ్ళుటను బట్టి భవిష్యత్తులో మీ కోసం ఏమి ఎదురు చూస్తుంది? మీరు కేవలము అస్పష్టమైన దేవునితో మరియు అస్పష్టమైన విశ్వాసముతో సారూప్యతను కోరుతున్నారు, అయినప్పటికీ మీరు క్రీస్తుతో సారూప్యత కలిగి లేరు. దుష్టులు తగిన ప్రతిఫలాన్ని పొందిన విధముగా మీరూ మీ దుర్మార్గమునకు పొందుకుంటారు కదా? ఆ సమయములో, క్రీస్తుతో ఏకీభవించలేని వారెవరూ ఉగ్రత దినము నుండి తప్పించుకోలేరని మీరు గ్రహిస్తారు, మరియు క్రీస్తు విరోధులపై ఎలాంటి ప్రతీకారము తీర్చబడుతుందో మీరు కనుగొంటారు. ఆ దినము వచ్చినప్పుడు, దేవుని యందు మీకున్న విశ్వాసాన్నిబట్టి ఆశీర్వదింపబడాలని అలాగే పరలోక ప్రవేశము పొందాలనే మీ కలలన్నీ చెదిరిపోతాయి. ఏదేమైనప్పటికీ, క్రీస్తుతో ఏకీభవించే వారికి ఇలా ఉండదు. వారు చాల నష్టపోయినప్పటికీ, వారు చాలా కష్టాలు అనుభవించినప్పటికీ, నేను మానవాళికి సంక్రమింపజేసే వారసత్వం అంతా వారు పొందుకుంటారు. చివరిగా, నేను మాత్రమే నీతిమంతుడైన దేవుడని, నేను మాత్రమే మానవాళిని తన సుందరమైన గమ్యస్థానానికి తీసుకెళ్లగలనని మీరు తెలుసుకుంటారు.

మునుపటి:  అనేకులు పిలువబడుతారు, కానీ కొందరే ఎంచుకోబడుతారు

తరువాత:  దేవుని యందు నీవు నిజమైన విశ్వాసివా?

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger