అనుబంధం 4: దేవుని తీర్పు మరియు శిక్షలలో ఆయన ప్రత్యక్షతను చూచుట
ప్రభువైన యేసు క్రీస్తును వెంబడించే ఇతర కోట్లాది మంది ప్రజల వలె, మనం బైబిల్ యొక్క ఆజ్ఞలకు మరియు నిబంధనలకు కట్టుబడి ఉన్నాం, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపారమైన కృపలో ఆనందిస్తున్నాం. అందరం సమకూడి ప్రార్థించి, స్తుతించి, ప్రభువైన యేసు క్రీస్తు నామములో సేవ చేసుకుంటున్నాం—ఇవన్నీ మనం ప్రభువు సంరక్షణలోను మరియు ఆయన కాపుదలలోను చేస్తున్నాం. మనం అనేకమార్లు ఎంత బలహీనంగా ఉంటామో, మనం అనేకమార్లు అంతే బలవంతులుగాను ఉంటాం. ప్రభువు బోధనలను బట్టియే మన క్రియలన్నీ ఉంటాయని మనం నమ్ముతాం. అయితే పరలోకమందున్న తండ్రి చిత్తమును జరిగించే మార్గమందున్నామని మన విషయమై మనం నమ్ముతున్నామని చెప్పనవసరం లేదు. ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చుట కొరకు, ఆయన మహిమ ప్రభావము చూచుట కొరకు, భూమి మీద మన జీవితాల ముగింపు కొరకు, దేవుని రాజ్యమును ప్రత్యక్షంగా చూచుట కొరకు, మరియు ప్రకటన గ్రంథములో ముందుగానే చెప్పినట్లుగా ప్రతిదాని కొరకు మనం ఎంతగానో ఎదురుచూస్తూ ఆశ కలిగియున్నాం: ప్రభువు వస్తాడు, ఆయన గొప్ప విపత్తును తీసుకు వస్తాడు, ఆయన మంచివారికి బహుమానాలను ఇస్తాడు మరియు దుష్టులను శిక్షిస్తాడు, మరియు ఆయనను వెంబడించే ప్రతియొక్కరిని మరియు మధ్యాకాశములో ఆయనను కలవడానికి ఆయన రాకను స్వాగతించే వారిని ఆయన పిలుచుకుంటాడు. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు, మనం భావోద్వేగాలకు గురి కాకుండా ఉండలేము, అంత్య దినాలలో మనం జన్మించినందుకు ఆనందించకుండా ఉండలేము మరియు రాబోయే ప్రభువును గూర్చి సాక్ష్యమివ్వడానికి మంచి భవిష్యత్తును కలిగియుంటాం. మనం హింసను అనుభవించినప్పటికీ, దానికి తగ్గ బహుమానంగా మనకు తిరిగి, “మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక.” ఎంత గొప్ప ఆశీర్వాదం! ప్రభువు ద్వారా అనుగ్రహించబడిన ఈ కృప మరియు ఈ నిరీక్షణ అంతయు మనల్ని నిరంతరం ప్రార్థనలో ఉండునట్లు, అందరము సమకూడి సహవాసం చేయడానికి మరింత శ్రద్ధ కలిగియుండునట్లు చేస్తుంది. బహుశా రానున్న సంవత్సరము, లేక రేపే, లేక మనిషి ఊహించని తక్కువ సమయములో ప్రభువు ఆకస్మికంగా దిగి వచ్చి, ఎంతో అత్యాసక్తితో ఆయన కొరకు ఎదురుచూస్తున్న ప్రజల మధ్యన కనిపిస్తాడు. మనం ఒకరికొకరము ముందుకు వెళ్ళడానికి తొందర పడతాం, ఏ ఒక్కరూ వెనుక ఉండిపోరు, దేవుని ప్రత్యక్షతను ఎదుర్కోవడానికి వెళ్ళే మొదటి గుంపులో ఉండాలని, ఎత్తబడిన వారి మధ్యలో ఉండాలని అందరూ దూసుకు వెళ్తారు. రాబోయే ఈ రోజు కొరకు, వెలతో సంబంధము లేకుండా మనం సమస్తమును వదులుకున్నాం; కొంతమంది తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారు, ఇంకొంతమంది తమ కుటుంబాలను వదిలేస్తున్నారు, మరికొంతమంది వివాహాలను వద్దనుకుంటున్నారు మరియు ఇంకా కొంతమంది తమ దగ్గర దాచుకున్న డబ్భును విరాళంగా ఇచ్చేస్తున్నారు. ఆహా, ఇవన్నీ భక్తిలో నిస్వార్థమైన గొప్ప క్రియలు! అటువంటి నిజాయితీగల భక్తి మరియు నమ్మకత్వాలు గతించిన యుగాలలోని పరిశుద్ధులకు కూడా అతీతమైనవి. ప్రభువు తన కృపను, కరుణను ఆయనకిష్టమైన వారి మీద ఉంచినట్లుగా, భక్తి సంబంధమైన మన క్రియలను, ప్రయాసలను ఎంతో కాలము నుండి ఆయన దృష్టిస్తున్నాడని మనం నమ్ముచున్నాం. అందుచేతనే, హృదయ పూర్వకముగా చేసిన మన ప్రార్థనలన్నియు ఆయన చెవుల వరకు చేరుతున్నాయి, మరియు మనం కలిగియున్న సమర్పణ కొరకు ప్రభువు మనకు ప్రతిఫలమిస్తాడని మనం నమ్ముచున్నాం. అంతకంటే ఎక్కువగా, దేవుడు ప్రపంచమును సృష్టించక మునుపు ఆయన మనపట్ల కృపగలవాడైయుండెను, మరియు ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలన్నిటిని ఎవ్వరూ మన నుండి దూరం చేయరు. మనమందరం భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేసుకొనుచున్నాం, మరియు మధ్యాకాశములో ప్రభువును కలవడానికి ఎత్తబడుట కొరకు మన సమర్పణను మరియు మనం వ్యయ ప్రయాసములను మార్చుకొనుట కొరకు అవి మూల ధనంగా మార్చబడతాయి. ఇంకా ఏమిటంటే, ఎటువంటి చిన్న సంకోచం అనేదే లేకుండా, మనం రాజులుగా ఏలడానికి లేక సమస్త దేశముల మీద మరియు సమస్త ప్రజల మీద అధ్యక్షత వహించడానికి భవిష్యత్తు సింహాసనము మీద మనల్ని మనమే పెట్టుకున్నాం. వీటన్నిటిని మనం ఎదురుచూసేవిగా, ఇవ్వబడినవిగా మనం ఎంచుకొనుచున్నాం.
ప్రభువైన యేసుకు విరుద్ధముగా నడుచుకునే వారినందరిని మేము తిరస్కరించుచున్నాము; వారందరి అంతము నాశనమే. ప్రభువైన యేసు రక్షకుడని నమ్మవద్దని వారికి ఎవరు చెప్పారు? అవును, లోకములోని ప్రజల పట్ల కనికరం చూపుచున్నట్లుగా యేసును పోలి మేము నడుచుకున్న సందర్భాలు ఉన్నాయి, అయితే వారు అర్థం చేసుకోలేదు, మరియు వారిని క్షమించడం, వారిని ఓర్చుకోవడం అనేది సరియైనదే. బైబిల్ వాక్కులను అనుసరిస్తూ మనం ప్రతీది చేస్తాం, ఎందుకంటే బైబిలుకు సంబంధములేని ప్రతీది భక్తి విరుద్ధమైనది మరియు తప్పుడు సిద్ధాంతమైయున్నది. ఇటువంటి వాటిని నమ్మడం అనేది మనలోని ప్రతియొక్కరి మనస్సులో చాలా లోతుగా వేరుపారింది. మన ప్రభువు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాడు, మరియు మనం బైబిలు నుండి దూరముగా వెళ్ళకపోతే, మనం ప్రభువు నుండి దూరముగా వెళ్ళము; ఈ నియమానికి మనం కట్టుబడి ఉన్నట్లయితే, మనం రక్షణను సంపాదించుకోగలం. మనం ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం, మనం ఒకరినొకరం బలపరచుకుంటాం, మరియు ప్రతిసారి మనమందరం కలిసి సమకూడుతాం, మనం మాట్లాడుకునే ప్రతీది మరియు చేసే ప్రతి క్రియ ప్రభువు చిత్తానుససారముగానే జరిగిస్తామని మనకు నిరీక్షణ ఉంది, ప్రభువు దానినే ఎదురుచూస్తున్నాడు. మన చుట్టూ ఉండే వాతావరణము తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ, మన హృదయాలు ఆనందముతో నిండి ఉన్నాయి. అంత తేలికగా ఉండే ఆశీర్వాదములను గూర్చి మనం ఆలోచించినప్పుడు, మనం ప్రక్కకు పెట్టలేనిది ఏదైనా ఉంటుందా? విడిపోవడానికి మనం ఇష్టపడనిదంటూ ఏమైనా ఉంటుందా? ఇదంతా ఏమి చెప్పకుండానే జరిగిపొతూ ఉంటుంది, మరియు ఇదంతా దేవుని కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటుంది. పెంట కుప్ప మీద నుండి పైకి ఎత్తబడిన పేద జనాంగమైన మనం, ప్రభువైన యేసుకు సాధారణ అనుచరులవలె ఉన్నాం, ఎత్తబడే వారిలోను, ఆశీర్వదించబడినవారిలోను, మరియు దేశాలన్నిటిని పరిపాలన చేసేవారిలోను ఉన్నామని కలగంటున్నాం. మన భ్రష్టత్వం దేవుని ఎదుట బట్టబయలయింది. మన కోరికలు మరియు మన దురాశలన్నియు దేవుని కన్నుల ఎదుట ఖండించబడ్డాయి. అయినప్పటికీ, ఇవన్నియు సాధారణంగానే జరుగుతాయి, మరియు తార్కిక బద్ధంగానే జరుగుతాయి, మనం ఆశించేవి సరియైనవా, కావా అని మనలోని ఏ ఒక్కరు ఆశ్చర్యపోరు, మనం పట్టుకున్న ప్రతిదానిని మనలో చాలా తక్కువ మంది అనుమానిస్తారు. దేవుని చిత్తాన్ని ఎవరు తెలుసుకోగలరు? మనిషి నడిచే మార్గము వాస్తవానికి ఎటువంటిది, మనకు వెదకడం తెలియదు లేక అన్వేషించడం తెలియదు; మరియు కనీసం మనకు విచారణ చేయాలనే ఆసక్తి కూడా ఉండదు. ఎందుకంటే, మనం ఎత్తబడతామా లేదా అనే విషయాన్ని, మనం ఆశీర్వదించబడ్డామా లేదా అనే విషయాన్ని, పరలోక రాజ్యములో మన కొరకు ఒక స్థలముందా లేదా అనే విషయాన్ని, మరియు జీవ వృక్షము యొక్క ఫలములోను మరియు జీవ నది జలములోను మనకు పాలు దొరుకుతుందా లేదా అనే విషయాన్ని మాత్రమే పట్టించుకుంటాం. వీటిని పొందడం కోసమే కదా మనం ప్రభువును విశ్వసించాము మరియు ఆయన అనుచరులుగా మారిపోయాము? మన పాపాలు క్షమించబడ్డాయి, మనం పశ్చాత్తాపపడ్డాము, మనం గిన్నెలోని చేదు ద్రాక్ష రసమును త్రాగాము, మరియు మన వీపుపై సిలువను మోస్తున్నాం. మనం చెల్లించిన వెలను ప్రభువు అంగీకరించడని ఎవరు చెప్పగలరు? మనం తగినంత నూనెను సిద్ధము చేయలేదని ఎవరు చెప్పగలరు? బుద్ధిలేని కన్యకల వలె లేక విడవబడిన కన్యకల వలె మనముండం. అంతేగాకుండా, మనం నిరంతరం ప్రార్థన చేస్తాం, అబద్దపు క్రీస్తుల ద్వారా మోసగించబడకుండా మిమ్మల్ని కాపాడమని మనం ప్రభువును అడుగుతాం, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఇలా వ్రాయబడింది: “ఆ కాలమందు ఎవడైనను—ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు” (మత్తయి 24:23-24). జ్ఞాపకముంచుకోవడానికి బైబిలులో ఉన్నటువంటి ఈ వచనాలన్నిటికి మనమందరం కట్టుబడి ఉంటాం; వాటిని మనం కంఠత పడతాం, మరియు వాటిని మనం విలువైన నిధిగాను, జీవముగాను మరియు మనం రక్షించబడతామో లేదో, ఎత్తబడతామో లేదోనని నిర్ణయించే ప్రామాణిక పత్రికవలె చూస్తాం …
ఎందుకంటే, వేలాది సంవత్సరాలుగా జీవించిన వారందరు చనిపోయారు, వారితోపాటు తమకిష్టమైన కోరికలను మరియు కలలను తీసుకెళ్ళిపోయారు, అయితే వారు పరలోక రాజ్యములోనికి చేరారో లేదో అనే విషయం ఏ ఒక్కరికి తెలియదు. ఒకప్పుడు జరిగిన కథలన్ని మరిచిపోయి, చనిపోయినవారు తిరిగి వస్తారు, మరియు వారు ఇంకా పితరుల మార్గాలను మరియు బోధనలను అనుసరిస్తారు. ఈ విధంగా రోజులు, సంవత్సరాలు గడిచే కొలది, మన దేవుడైన మన ప్రభువైన యేసు మనం చేసే ప్రతిదానిని అంగీకరిస్తాడో లేదో ఎవరికీ తెలియదు. మనం చేయగలిగిందంతా ఫలితం కోసం ఎదురుచూడడం మరియు జరగబోయే ప్రతిదాని గురించి ఊహించుకోవడమే. అయినా దేవుడు అంతటా మౌనం వహించాడు, మనకు ఎప్పుడూ కనిపించడు, మనతో ఎప్పుడూ మాట్లాడుట లేదు. అందుచేత, సూచనల ప్రకారంగా బైబిలును అనుసరించడం ద్వారా మనం ఉద్దేశపూర్వకముగానే దేవుని చిత్తమును గూర్చి మరియు ఆయన స్వభావమును గూర్చి తీర్పు తీరుస్తుంటాం. మనం దేవుని మౌనానికి అలువాటు పడ్డాం; మనకున్న స్వంత ఆలోచనలనుబట్టి మన ప్రవర్తన మంచిదా కాదా అనే విషయాన్ని కొలత వేసుకోవడానికి మనం అలువాటు పడ్డాం; మన స్వబుద్ధిపైన, స్వంత ఆలోచనలపైన, మరియు దేవుడు మన నుండి ఎదురుచూసే నైతిక విషయాల మీద ఆధారపడటానికి మనం అలువాటు పడ్డాం; మనం దేవుని కృపను ఆనందించడానికి అలువాటు పడ్డాం; మనకు అవసరమైనప్పుడు దేవుని సహాయమును పొందుకోవడానికి అలువాటు పడ్డాం; ప్రతిదాని కొరకు దేవుని దగ్గరకు వెళ్లి చేతులు చాచడం, వాటిని ఇవ్వమని దేవుణ్ణి ఆదేశించడం అలువాటు చేసుకున్నాం; పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపిస్తాడనే విషయమై శ్రద్ధ చూపకుండా, మనం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడానికి అలువాటు పడ్డాం; మరియు అంతేగాకుండా, మనకు మనమే యజమానులమనే ఈ రోజులకు మనం అలువాటు పడ్డాం. ఈ విధంగా మనం ఎన్నడూ ముఖా ముఖిగా కలవని దేవునియందు నమ్మిక ఉంచాము. ఆయన స్వభావము ఏమిటి, ఆయన ఏమి కలిగియున్నాడు, ఆయన స్వరూపము ఎలా ఉంటుంది, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను మనం తెలుసుకుంటామో లేదోననే ఇలాంటి మొదలగు ప్రశ్నలన్నీ ప్రాముఖ్యమైనవి కాదు. ఆయన మన హృదయాలలో ఉన్నాడన్నది మరియు మనమందరం ఆయన కొరకు ఎదురు చూస్తున్నామన్నదే చాలా ప్రాముఖ్యము, మరియు ఆయన ఇలా ఉంటాడు లేక అలా ఉంటాడని మనం ఊహించుకోవడానికి ఇది చాలు. మన విశ్వాసాన్ని మరియు మన ఆధ్యాత్మిక నిధిని మనం అభినందించాలి. మనం అన్నిటిని పెంటలా చూస్తాం మరియు మనం అన్నిటిని పాదాల క్రింద ఉంచుకుంటాం. ఎందుకంటే, మనం మహిమగల ప్రభువు యొక్క విశ్వాసులం, యాత్ర ఎంత సుదూరమైన మరియు ఎంత క్లిష్టమైన, మనకు ఎన్ని కష్టాలు వచ్చిన మరియు ఎన్ని అపాయాలు సంభవించిన, మనం ప్రభువును వెంబడిస్తుండగా మన అడుగు జాడలను ఏదీ కదపలేదు. “మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనముచేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు” (ప్రకటన 22:1-5). మనం ఈ మాటలను పాడుకున్న ప్రతిసారి, మన హృదయాలు హద్దులులేని ఆనందముతో మరియు సంతృప్తితో పొంగి పొర్లుతాయి, మరియు మన కళ్ళనుండి కన్నీరు ప్రవహిస్తుంటాయి. మనల్ని ఎన్నుకున్నందుకు ప్రభువుకు వందనాలు, ఆయన కృప కొరకై ప్రభువుకు వందనాలు. ఈ జీవితములో ఆయన మనకు నూరంతలు ఇచ్చియున్నాడు మరియు రాబోవు లోకమందు నిత్యజీవమును మనకు అనుగ్రహించియున్నాడు. ఇప్పటికిప్పుడు చనిపోవాలని ఆయన మనల్ని అడిగితే, ఎటువంటి చిన్న ఫిర్యాదు చేయకుండానే మనం చేస్తాం. ఓ ప్రభువా! దయచేసి త్వరగా రండి! మేము మీ కొరకు ఎలా ఆరాటపడుతున్నామో చూడండి, మరియ నీ కొరకు సమస్తమును వదులుకొనియున్నాము, ఇక ఒక క్షణమైనా, ఒక నిమిషమైనా ఆలస్యం చేయవద్దు.
దేవుడు మౌనంగా ఉంటాడు, మరియు ఆయన మనకు కనిపించడు, అయినా ఆయన తన పనిని ఆపడు. ఆయన సమస్త భూమిని పరిశీలన చేస్తుంటాడు, మరియు సమస్తమును ఆజ్ఞాపిస్తుంటాడు, మరియు మనిషి చేయు క్రియలను, మనిషి పలికే మాటలన్నిటిని పట్టుకొనియుంటాడు. ఆయన ప్రణాళికను బట్టి, కొలమానమును బట్టి, నిశ్శబ్దంగాను మరియు నాటకీయ ప్రభావం లేకుండా ఆయన తన కార్య నిర్వహణను జరిగిస్తుంటాడు. అయినా, ముందు చూపుతో ఆయన వేసే ఒక్కొక్క అడుగు మనుష్యులకు మరింత దగ్గరగా మారుతుంది, మరియు ఆయన న్యాయ సింహాసనం మెరుపు వేగంతో విశ్వములో స్థిరపరచబడుతుంది, ఆయన సింహాసనం ఆకస్మికంగా లేక వేగంగా మన మధ్యకు దిగి వస్తుంది. ఆహా! ఎంత మహిమ ప్రభావముగల సన్నివేశం ఇది, ఎంత అద్భుతమైన గంభీర దృశ్యమిది! ఒక పావురమువలె, గర్జించు సింహమువలె ఆత్మ మన మధ్యకి దిగివచ్చును. ఆయన జ్ఞానము, ఆయన నీతి మరియు మహిమ ప్రభావమునైయున్నాడు, మరియు ఆయన మన మధ్యకు రహస్యంగా వస్తాడు, అధికారాన్ని ప్రయోగిస్తాడు మరియు ప్రేమ కనికరములతో నిండి ఉంటాడు. ఆయన రాకను గూర్చి ఎవరికీ తెలియదు, ఆయన రాకను ఎవరూ స్వాగతించరు. అంతేగాకుండా, ఆయన చేయబోయే కార్యములను గూర్చి ఎవరికీ ఏమి తెలియదు. మనిషి జీవితము మునుపు ఉన్నట్లుగానే జరుగుతుంది, అతని హృదయం భిన్నంగా ఉండదు, మరియు ఎప్పటిలాగానే రోజులు గడిచిపోతాయి. ఇతర మనుష్యులవలె ఒక మనిషిగా, వెంబడించువారిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ఒక సామాన్య విశ్వాసిగా దేవుడు మన మధ్యన నివసిస్తాడు. ఆయన తన స్వంత ఉద్దేశాలను, లక్ష్యాలను కలిగి ఉంటాడు; అంతేగాకుండా, సామాన్య మనుష్యులు కలిగియుండని దైవత్వము ఆయనకు ఉంటుంది. ఆయన దైవత్వపు ఉనికిని ఎవరూ గుర్తించరు. ఆయన గుణగణాలకు మరియు మనిషి గుణగణాలకు మధ్య ఉండే వ్యత్యాసమును ఏ ఒక్కరు గుర్తించరు. మనమందరం ఎటువంటి నిర్బంధం లేకుండా, భయభీతులు లేకుండా ఆయనతోపాటు కలిసి జీవిస్తాం. ఎందుకంటే, మన దృష్టిలో ఆయన ఒక ప్రాముఖ్యమున విశ్వాసిగా ఉంటాడు. ఆయన మన ప్రతి కదలికను గమనిస్తాడు. మన తలంపులు మరియు ఆలోచనలన్నియు ఆయన ఎదుటే ఉంటాయి. ఆయన ఉనికి విషయములో ఎవరు అంత పెద్ద ఆసక్తిని కనుపరచరు, ఆయన చేయబోయే కార్యమును ఏ ఒక్కరూ ఊహించలేరు. అంతేగాకుండా, ఆయన గుర్తింపు విషయమై ఏ ఒక్కరికి ఒక చిన్న అనుమానం ఉండదు. ఆయన మన విషయమై ఏమి చేయడం లేదన్నట్లుగానే మనమందరం మన పనులను చేసుకుంటూ వెళ్తుంటాం…
ఒకవేళ, పరిశుద్ధాత్మ ఆయన “ద్వారా” వాక్కుల వాక్యభాగాన్ని వ్యక్తపరుస్తాడు, ఇది ఊహించని అనుభూతియైనప్పటికీ, అవి దేవుని నుండి వచ్చిన వాక్కులని మనం గుర్తించి, అవి దేవుని నుండి వచ్చినవని వెంటనే గుర్తిస్తాం. అది ఎలాగంటే, ఈ వాక్కులను ఎవరు వ్యక్తపరుస్తున్నారన్న దానితో సంబంధం లేకుండా, అవి పరిశుద్ధాత్మ నుండి వచ్చినందున, మనం వాటిని అంగీకరించాలి మరియు వాటిని మనం తిరస్కరించలేము. తరువాత వచ్చే మాటలు నా నుండి రావచ్చు, లేక నీ ద్వారా రావచ్చు, లేక ఇతరుల ద్వారాను రావచ్చు. వారు ఎవరైనా సరే, అది అంతా దేవుని కృపయే. వాక్కులను పలికినవారు ఎవరన్నదానితో సంబంధం లేకపోయిన, మనం ఆ వ్యక్తిని ఆరాధించకపోయినా, ఏది ఏమైనా, ఆ వ్యక్తి దేవునిగా ఉండడం సాధ్యపడదు, లేక అటువంటి సామాన్యమైన వ్యక్తి మన దేవునిగా ఉండడానికి మనం ఎన్నుకోం. మన దేవుడు గొప్పవాడు మరియు ఘనతకు యోగ్యుడు; అటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన స్థానములో ఎలా నిలబడగలడు? అంతేగాకుండా, దేవుడు వచ్చి, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకు వెళ్తాడని మనం ఎదురుచూస్తున్నాం. అందుచేత, అంత ముఖ్యమైన మరియు కష్టతరమైన ఆ పనిని అల్పమైన వ్యక్తి ఎలా చేయగలడు? ప్రభువు మరలా వచ్చినట్లయితే, అది తప్పకుండా మేఘాల మధ్యనే ఉంటుంది, అప్పుడు జన సమూహములందరూ చూడగలరు. అది ఎంత మహిమకరంగా ఉంటుందో! ఆయన సాధారణ ప్రజల మధ్య రహస్యంగా ఉండడం ఎలా సాధ్యం?
ఈ వ్యక్తి సాధారణ వ్యక్తియైనప్పటికీ, మనలను రక్షించే క్రొత్త కార్యమును జరిగించేందుకు ప్రజల మధ్యలో దాగుకొని ఉంటాడు. ఈయన ఎటువంటి వివరణలను మనకివ్వడు, లేక ఈయన ఎందుకు వచ్చాడో మనకు చెప్పడు, అయితే ఈయన ప్రణాళికను బట్టి, ఈయనకున్న కొలమానపు అడుగులతో ఈయన చేయాలనుకున్న కార్యమును చేసుకుంటూ వెళ్తాడు. ఆయన వాక్కులు మరియు ఆయన మాటలు మరింత తరచుగా వస్తుంటాయి. ఆదరించుట, ఉపదేశించుట, జ్ఞాపకము చేయుట మరియు హెచ్చరించుట దగ్గర నుండి ఎత్తి చూపడం వరకు మరియు క్రమశిక్షణ చేయుట వరకు ఆయన మాటలు పలకబడుతూ ఉంటాయి; మంచిగా, నమ్రతగా చెప్పే స్వరము దగ్గర నుండి భయంకరమైన మరియు ప్రభావవంతమైన మాటల వరకు వస్తూనే ఉంటాయి—ఇవన్ని మనిషి చూపించే కరుణను గూర్చి మాట్లాడుతాయి మరియు అతనిలో భయాన్ని కలుగజేస్తాయి. ఆయన పలికే ప్రతి వాక్కు మనలో లోతుగా దాగియున్న రహస్యాల ఇంటిని బద్దలు చేస్తుంది; ఆయన వాక్కులు మన హృదయాలకు గుచ్చుకుంటాయి మరియు భరించలేని అవమానముతో మనల్ని నింపుతాయి, మనం ఎక్కడ దాక్కోవాలో మనకు తెలియని పరిస్థితిలోనికి వెళ్తాము. ఈ వ్యక్తి హృదయములో ఉన్న దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా, లేక ఆయన ఖచ్చితంగా ఏమి చేస్తున్నాడో మనం ఆశ్చర్యపోతాం. మనం ఈ శ్రమలన్నిటిని సహించిన తరువాతనే ఎత్తబడతామేమో? మన తలలో మనం రాబోయే గమ్యమును గూర్చి మరియు మన భవిష్యత్తు విధిని గూర్చి లెక్కలు వేసుకుంటూ ఉంటాం … ముందు చెప్పుకున్నట్లుగా, మన మధ్యలో పనిచేయడానికి దేవుడు మన మధ్యలో శరీరాన్ని దాల్చియున్నాడని ఇంకా మనలో ఏ ఒక్కరూ నమ్మడం లేదు. ఎంతో కాలము వరకు ఆయన మనతో కలిసి ఉన్నప్పటికీ, ఆయన ఇప్పటికే మనతో ఎన్నో మాటలు ముఖాముఖిగా మాట్లాడినప్పటికీ, మన భవిష్యత్తులోని దేవునిగా ఈ సాధారణ వ్యక్తిని అంగీకరించడానికి ఇష్టపడలేకపోవుచున్నాం. ఇటువంటి సాధారణమైన వ్యక్తికి మన భవిష్యత్తును మరియు మన విధిని అప్పగించి, నియంత్రించడానికి మనలో చాలా మంది ఇష్టపడటం లేదు. ఆయన నుండి మనం జీవ జలములను అంతులేకుండా అనుభవించి ఆనందిస్తాం మరియు ఆయన ద్వారా మనం దేవునితో ముఖాముఖిగా కలిసి జీవిస్తాం. అయితే పరలోకమందున్న యేసు ప్రభువు కృప కొరకు మాత్రమే మన కృతజ్ఞత కలిగి జీవిస్తాం మరియు దైవత్వాన్ని పొందుకొనిన ఈ సాధారణ వ్యక్తి భావాలకు మనం ఎటువంటి శ్రద్ధను చూపించలేదు. మునుపటివలె మానవాళి అంత ఆయనను తిరస్కరించినప్పటికీ పట్టించుకోకుండా, మనిషి చేసే చిన్నపిల్లల చేష్టలను మరియు నిర్లక్ష్యమును శాశ్వతంగా క్షమిస్తూ, ఆయనపట్ల మానవుని అగౌరవపు ధోరణిని శాశ్వతంగా సహిస్తూ, ఆయన తన శరీరములో ఉండి, తన పనిని తాను చేసుకుంటాడు.
మనకు తెలియకుండానే, ఇటువంటి అప్రాముఖ్యమైన వ్యక్తి మనలను దేవుని పనిలో ఒకదాని తరువాత మరొక పనిలోనికి నడిపించాడు. మనం లెక్కలేనన్ని శ్రమలు, అసంఖ్యాకమైన శిక్షలు గుండా వెళ్లి, మరణం ద్వారా పరీక్షించబడతాం. మనం దేవుని నీతిని మరియు ఆయన గంభీరమైన స్వభావమును గూర్చి నేర్చుకుంటాం, ఆయన ప్రేమ మరియు కరుణ యందు ఆనందిస్తాం. ఆయన గొప్ప శక్తిని మరియు గొప్ప జ్ఞానాన్నిబట్టి ఆయనను పొగుడుతాం, దేవుని ప్రేమకు సాక్ష్యులమవుతాం. మనిషిని రక్షించాలనే దేవుని కోరికను చూడండి. ఈ సాధారణ వ్యక్తి యొక్క మాటలలో, మనం దేవుని స్వభావమును గూర్చి మరియు దేవుని గుణలక్షణాలను గూర్చి తెలుసుకుంటాం, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటాం, మానవుని స్వభావమును మరియు మానవ గుణలక్షణాలను గూర్చి తెలుసుకుంటాం, మరియు రక్షణకు మరియు సంరక్షణకు మార్గమును చూస్తాం. ఆయన మాటలు మనల్ని “చనిపోవునట్లుగా” చేస్తాయి, మరియు అవి మనల్ని “తిరిగి జన్మించునట్లుగా” చేస్తాయి; ఆయన మాటలు మనకు ఆదరణను కలుగజేస్తాయి, మనల్ని అపరాధ భావముతోను మరియు ఋణ భావముతోను ఉండిపోవునట్లుగా చేస్తాయి కూడా; ఆయన మాటలు మనకు ఆనందమును మరియు సమాధానమును తీసుకు వస్తాయి, అయితే వాటితోపాటే అంతులేని బాధను తీసుకు వస్తాయి. కొన్నిమార్లు మనం ఆయన చేతుల్లో వధకు తేబడిన గొర్రెలవలె ఉన్నాం; ఇంకొన్నిమార్లు మనం ఆయన కంటిపాపవలె ఉన్నాం మరియు ఆయన మెత్తని సున్నితమైన ప్రేమను ఆస్వాదించువారమైయున్నాం; మరి కొన్నిమార్లు మనం ఆయన ఉగ్రతనుబట్టి ఆయన కంటి చూపు ద్వారా బూడిదగా మారిపోయే శత్రువులవలె ఉన్నాం. మన మానవ జాతియంత ఆయన ద్వారా రక్షించబడియున్నాం, ఆయన దృష్టిలో మనం పురుగులవలె ఉన్నాం, మరియు మనం తప్పిపోయిన గొర్రెలం, రాత్రింబవళ్ళు ఆయన వెతకాలనే తపనతో ఉన్నాడు. ఆయన మన ఎడల కరుణ చూపువాడైయున్నాడు, ఆయన మనల్ని తృణీకరిస్తాడు, ఆయన మనల్ని లేవనెత్తుతాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు మరియు ఆయన మనకు ఉపదేశిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనకు జ్ఞానోదయం కలిగిస్తాడు, ఆయన శిక్షిస్తాడు మరియు మనల్ని క్రమపరుస్తాడు, మరియు ఆయన మనల్ని శపిస్తాడు కూడా. రాత్రింబవళ్ళు ఆయన మనల్ని గూర్చి చింతించడం మానడు, మనల్ని పట్టించుకుంటాడు మరియు మనల్ని సంరక్షిస్తాడు. రాత్రింబవళ్ళు మన పక్షాన ఉండడం మానడు, అంతేగాకుండా ఆయన మన కొరకు తన గుండెను పిండి రక్తాన్ని చిందిస్తాడు మరియు మన కొరకు ఎంత వెలనైనా చెల్లిస్తాడు. ఈ చిన్నదైనా మరియు సాధారణమైన మాంసపు శరీరము యొక్క మాటలలోపు, మనం దేవుని సంపూర్ణత్వమును ఆనందించియున్నాము మరియు దేవుడు మనకు ప్రసాదించిన గమ్యాన్ని పట్టుకొనియున్నాం. ఇది ఏకమైనప్పటికీ, అహంకారము ఇంకను మన హృదయాలలో సమస్యను సృష్టిస్తోంది. ఇలాంటి వ్యక్తిని మన దేవునివలె అంగీకరించడానికి మనమింకను ఇష్టపడక ఉన్నాం. ఆయన ఎంతో ఎక్కువ ఇచ్చినప్పటికీ, ఆనందించడానికి ఎంతో అనుగ్రహించినప్పటికీ, మన హృదయాలలోని ప్రభువు స్థానాన్ని ఇవేమీ తీసుకొనజాలవు. ఈ వ్యక్తి ప్రత్యేకమైన గుర్తింపును మరియు స్థాయిని మనం గొప్ప ఆహిష్టతతో గౌరవిస్తాం. ఆయన దేవుడని గుర్తించునట్లు ఆయన తన నోటిని తెరచి అడగనంత కాలం, ఆయన త్వరగా రాబోవుచున్న దేవుడని మరియు ఎంతో కాలంగా మన మధ్యలో పని చేస్తున్నవాడని ఆయనను గుర్తించునట్లు మనకు మనం ఎప్పటికీ పట్టించుకోము మరియు తెలుసుకోలేము.
ఇలాంటి సమయములో మనం ఏమి చెయ్యాలనేదానిని గూర్చి మనకు ఉపదేశించడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అనేక విభిన్నమైన పద్ధతులను మరియు దృష్టికోణాలను ప్రవేశ పెడుతూ ఉంటాడు. అదే సమయములో, ఆయన హృదయానికి స్వరాన్ని అనుగ్రహిస్తుంటాడు. ఆయన వాక్కులలో జీవపు శక్తి ఉంటుంది, మనం ఎలా నడుచుకోవాలో చూపిస్తుంది, మరియు సత్యాన్ని అర్థము చేసుకోవడానికి మనల్ని బలపరుస్తుంది. మనం ఆయన వాక్కుల ద్వారా ఆకర్షించబడుటకు ప్రారంభిస్తాం, మనం ఆయన స్వరం మీద మరియు ఆయన మాట్లాడే విధానము మీద దృష్టి సారించుటకు ప్రారంభిస్తాం, మరియు ఉపచేతనంగా మనం గుర్తుపట్టలేని ఈ వ్యక్తి అంతరంగిక భావాల విషయమై ఆసక్తిని కనుపరచుటకు ప్రారంభిస్తాం. ఆయన మన కొరకు పని చేయుటలో తన గుండె రక్తాన్ని చిందిస్తాడు, మన పక్షాన ఆయన ఆకలిని మరియు నిద్రను కోల్పోతాడు, మన కొరకు ఏడుస్తాడు, మన కొరకు నిట్టూర్పులు విడుస్తాడు, మనకొరకు అనారోగ్యముతో మూలుగుతాడు, మన రక్షణ మరియు గమ్యం విషయమై అవమానము భరిస్తాడు, మరియు మన నిర్లక్ష్యత మరియు తిరుగుబాటుతనం అనేవి కన్నీటిని మరియు ఆయన గుండె నుండి రక్తమును తెప్పిస్తున్నాయి. ఈ విధంగా ఉండడం ఎటువంటి సాధారణ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, లేక భ్రష్టుడైన ఎటువంటి మనిషి ద్వారా పొందుకునే విషయం కాదు. ఎటువంటి సాధారణ వ్యక్తి పొందుకోలేని సహనాన్ని మరియు ఓర్పును ఆయన కనుపరుస్తాడు, మరియు ఆయన ప్రేమ అనేది సృష్టించబడిన ఏదియు పొందదగినది కాదు. ఆయన కాకుండా ఏ ఒక్కరూ మన ఆలోచనలను తెలుసుకోలేరు, లేక మన స్వభావమును గూర్చి మరియు గుణగణాలను గూర్చి స్పష్టంగా మరియు సంపూర్ణంగా గ్రహించలేరు, లేక మానవాళి భ్రష్టత్వాన్ని మరియు తిరుగుబాటుతనాన్ని తీర్పు తీర్చలేరు, లేక పరలోకమందున్న దేవుని పక్షాన ఈ విధంగా మనతో మాట్లాడలేరు మరియు మన విషయములో పని చేయలేరు. ఆయన కాకుండా ఏ ఒక్కరూ అధికారమును, జ్ఞానమును, మరియు దేవుని గంభీరతను పొందకోనజాలరు; దేవుని స్వభావము మరియు దేవుడు కలిగియున్నవి, వాటి సమస్తము ఆయనలో ఉన్నాయి. ఆయన కాకుండా ఏ ఒక్కరూ మనకు మార్గమును చూపించలేరు మరియు మనకు వెలుగును ప్రసాదించలేరు. ఆయన తప్ప ఏ ఒక్కరూ సృష్టి ఆరంభం మొదలుకొని నేటి వరకు దేవుడు బయలుపరచని మర్మాలను బయలుపరచలేరు. ఆయన కాకుండా ఏ ఒక్కరూ సాతాను బంధకము నుండి మరియు మన స్వంత భ్రష్ట స్వభావమును నుండి విడిపించలేరు. ఆయన దేవునికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయన దేవుని అంతరంగిక హృదయాన్ని, దేవుని ఉపదేశాలను మరియు సర్వ మానవాళిపట్ల తీర్పుకు సంబంధించిన దేవుని వాక్కులను వ్యక్తపరుస్తాడు. క్రొత్త భూమి ఆకాశములలో ఆయన ఒక సరిక్రొత్త యుగానికి, ఒక క్రొత్త శకానికి, ఒక క్రొత్త కార్యానికి నాంది పలుకుతాడు. ఆయన మనకు ఒక నిరీక్షణను తీసుకొని వచ్చాడు, అస్పష్టతలో బ్రతికిన జీవితానికి ముగింపు పలికి, సంపూర్ణమైన స్పష్టతలో రక్షణకు నడిపించే మార్గమును గట్టిగా పట్టుకోవడానికి ఆయన బలపరుస్తాడు. ఆయన మనల్ని జయించియున్నాడు మరియు మన హృదయాలను గెలుచుకొనియున్నాడు. ఆ క్షణమునుండి, మన మనస్సులు జ్ఞానమైనవిగా మారిపోయాయి, మరియు మన ఆత్మలు ఉజ్జీవించబడ్డాయి: మన మధ్యన నివసించే ఇటువంటి సాధారణమైన, ప్రాముఖ్యతలేని వ్యక్తి ఎంతో కాలముపాటు మన ద్వారా తిరస్కరించబడియున్నాడు—రాత్రింబవళ్లు మనం ఎదురుచూస్తున్న వ్యక్తి, నిదుర నుండి లేచినా లేక కలలోనైనా మన తలంపులలో ఎల్లప్పుడూ ఉండే యేసు క్రీస్తు ఈయన కాడా? అవును ఆయన ఈయనే! నిజంగా ఆయన ఈయనే! ఈయన మన దేవుడు! ఈయన సత్యమును, మార్గమును మరియు జీవమునైయున్నాడు! మనం మరలా జీవించి బ్రతకడానికి ఈయన మనల్ని బలపరచియున్నాడు మరియు అటూ ఇటూ వెళ్ళిపోతున్న హృదయాలను నిలిపి వేసియున్నాడు. మనం తిరిగి దేవుని ఇంటికి వచ్చాం, మనం తిరిగి ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉన్నాం, మనం ఆయనతో ముఖాముఖిగా నిలిచియున్నాం, ఆయన అనుగ్రహానికి సాక్ష్యులమయ్యాం, మరియు మన ముందున్న రహదారిని చూశాం. ఇటువంటి సమయములో, మన హృదయాలు ఆయన ద్వారా సంపూర్ణముగా జయించబడ్డాయి; ఆయన ఎవరోననే సందేహం మనకు లేదు, ఆయన వాక్యమును మరియు ఆయన కార్యమును మనం తిరస్కరించం, మరియు ఆయన ఎదుట మనం సాష్టాంగ పడ్డాం. మన జీవిత కాలమంతా ఆయన అడుగుజాడలను అనుసరించడం, ఆయన ద్వారా పరిపూర్ణం చేయబడడం, మన కొరకు ఆయన చూపిన ప్రేమను మరియు ఆయన కృపను తిరిగి ఇవ్వడం, మరియు ఆయన ప్రణాళికలకు, కార్యనిర్వహణలకు లోబడడం, ఆయన కార్యమునకు సహకరించడం, మరియు ఆయన మనకు అప్పగించిన ప్రతిదానిని పూర్తిగా మనం చేయగలిగిన ప్రతిదానిని చేయడం తప్ప మనకు మరొకటి లేదు.
దేవుని ద్వారా జయించబడడం అనేది కుస్తి పోటిలాంటిది.
దేవుని మాటలలో ప్రతీది మన అనిత్యమైన మచ్చలను కోసి పడేస్తుంది, భయముతో నింపి గాయాలతో మనలను వదిలేస్తుంది. ఆయన మన ఆలోచనలను, మన ఊహలను మరియు మన భ్రష్ట స్వభావమును ఎత్తి చూపుతాడు. మనం చెప్పి చేసే వాటన్నిటి నుండి మనలోని ప్రతియొక్కరి ఆలోచనలను మరియు తలంపుల వరకు, మన స్వభావము మరియు గుణగణాలన్నియు ఆయన వాక్కులలో బయలుపరచబడ్డాయి, మనలను భయపడే స్థితిలో ఉంచుతాయి మరియు సిగ్గును దాచుకోలేక వణికిపోయే స్థితిలో ఉంచుతాయి. ఆయన మన క్రియలన్నిటిని గూర్చి, మన గురి గమ్యాలు మరియు ఉద్దేశాలను గూర్చి, మనంతటికి మనమే ఎప్పుడూ బయట పెట్టుకోలేని మన భ్రష్ట స్వభావమును గూర్చి ఒకటి తరువాత ఒకటి ఆయన మనకు చెబుతూ వస్తాడు, మనకున్న దౌర్భాగ్యపు అసంపూర్ణత విషయములో మనకన్నిటిని గూర్చి తెలిసేలా చేస్తాడు, అంతేగాకుండా, సంపూర్ణముగా మనలను గెలుస్తాడు. ఆయనను తిరస్కరించినందుకు ఆయన మనకు తీర్పు తీరుస్తాడు, ఆయనను మనం దూషించినందుకు మరియు ఖండించినందుకు మనలను శిక్షిస్తాడు, మరియు ఆయన మనలను చూసినప్పుడు ఒక మంచి గుణం కూడా మనలో లేదని, మనలో సాతానుడు జీవిస్తున్నాడని మనం తెలుసుకునేలా చేస్తాడు. మన ఆశలన్నీ అడి ఆశలయ్యాయి; మనం ఇక మీదట ఇతర ఏ విధమైన అసమంజసమైన కోరికలను ఆయనను అడగలేము, లేక ఆయన మీద ఇతర ఎటువంటి ప్రణాళికలను కలిగియుండలేము, మనకున్న కలలు కూడా రాత్రికి రాత్రే చెదిరిపోయాయి. మనలో ఏ ఒక్కరు కూడా ఊహించని మరియు అంగీకరించని వాస్తవ సంగతి ఇదే. కొన్ని క్షణాలలోనే మనలోని సమతుల్యతను కోల్పోతాం మరియు ముందున్న మార్గములో ఎలా ముందుకు వెళ్ళాలో మనకు అర్థం కాదు, లేక మనం నమ్మిన వాటియందు ఎలా ముందుకు కొనసాగాలో మనకు తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే మన విశ్వాసం మొదటి దశకు తిరిగి వచ్చినట్లుగా ఉంటుంది, ప్రభువైన యేసును మనమెప్పుడూ కలవలేదన్నట్లుగాను లేక ఇప్పుడే ఆయనను గురించి తెలుసుకుంటున్నామన్నట్లుగాను ఉంటుంది. మన కళ్ళ ఎదుట కనిపించే ప్రతీది మనలను తికమకతో నింపుతాయి మరియు మనం అనిశ్చితంగా ఊగిపోయేలా చేస్తాయి. మనం విస్మయం చెందుతాం, మనం నిరుత్సాహం చెందుతాం, మరియు మన హృదయపు లోతుల్లో ఎక్కడో తట్టుకోలేని కోపాన్ని మరియు అవమానాన్ని కలిగియుంటాం. మనం తప్పించుకోవాలని ప్రయత్నిస్తాం, ఏదైనా వేరొక దారి దొరుకుతుందా అని వెదుకుతూ ఉంటాం. అంతేగాకుండా, మన రక్షకుడైన యేసు కొరకు ఎదురు చూస్తూనే, ఆయన ఎదుట మన హృదయాలను కుమ్మరిస్తాం. మనం బహిరంగంగా మోకాళ్లు ఊని కనపడే సందర్భాలు ఉన్నప్పటికీ, ఆహంకారంగానో లేక దీనంగానో కనిపించే సందర్భాలు ఉన్నప్పటికీ, మన హృదయాలలో ఎప్పుడు అనిపించని రీతిగా ఏదో నష్టపోయామనే బాధతో ఉండిపోతాం. మనం బహిరంగంగా అరుదుగా నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నట్లు కొన్నిమార్లు కనిపించినప్పటికీ, గాలి తుఫాను అలలతో కొట్టబడుచున్న సముద్రమువలె మన మనస్సులు వేదనతో రగిలిపోతూ ఉంటాయి. ఆయన తీర్పు మరియు ఆయన శిక్షలు మనలోని ఆశలను కలలను చెదరగొడుతాయి, మనలోని మితిమీరిన ఆశలకు ముగింపు పలుకుతాయి మరియు ఆయన రక్షకుడని, మనలను రక్షించుటకు సమర్థుడని నమ్మడానికి ఆయిష్టత కలిగేలా చేస్తాయి. ఆయన తీర్పు మరియు ఆయన శిక్షణ అనేవి ఆయనకు మరియు మనకు మధ్యన అగాధమును కలుగజేస్తాయి, ఈ అగాధమును దాటడానికి ఎవరికీ ఇష్టములేనంత లోతుగా ఉంటుంది. ఆయన తీర్పు మరియు ఆయన శిక్షణలను మనం మొట్ట మొదటిసారిగా మన జీవితాలలో ఎదుర్కొని, అంత ఘోర పరాజయాన్ని, అంత ఘోరమైన అవమానాన్ని మనం చవిచూశాము. ఆయన తీర్పు మరియు ఆయన శిక్షలు అనేవి దేవుని ఘనతను మరియు మనిషి అపరాధమును అభినందించేలా చేశాయి. దీనికి మనల్ని పోల్చుకుంటే మనం చాలా తక్కువ స్థితిలో ఉన్నాం మరియు చాలా అపవిత్రమైన స్థితిలో ఉన్నాం. ఆయన తీర్పు మరియు ఆయన శిక్షణలు అనేవి ప్రప్రథమంగా మనం ఎంత ఆహంకారులమో మరియు ఎంత గర్విష్టులమోనని మనకు అర్థమయ్యేలా చేశాయి. అంతేగాకుండా, మనిషి దేవునితో సరిపాటి ఎలా అవుతాడని, లేక మనిషి దేవునితో సమానుడు కాలేడని మనకు తెలియజేశాయి. సాధ్యమైనంతవరకు భ్రష్ట స్వభావమునుండి మరియు దాని గుణగణాలనుండి బయట పడుటకు, భ్రష్ట స్వభావములో ఇక ఎన్నడూ జీవంచకుండా ఉండునట్లు ఆయన తీర్పు మరియు ఆయన శిక్షలు మనలను తీర్చిదిద్దాయి. ఆయనకు చెడుగానో మరియు అసహ్యకరంగానో ఉండకుండా చేశాయి. ఆయన తీర్పు మరియు ఆయన శిక్షణలు ఆయన వాక్కులకు సంతోషంగా లోబడునట్లు చేశాయి, ఆయన కార్య నిర్వహణలకు మరియు అయన కార్య క్రమములకు ఎన్నడూ తిరుగుబాటు చేయకుండా చేశాయి. ఆయన తీర్పు మరియు ఆయన శిక్షణలు ఆయన మన రక్షకుడని మనం సంతోషంగా అంగీకరించుటకు మరియు మరియొకమారు ఆయన కొరకు జీవించుటకు ఆశను మనకు కలుగజేశాయి…. మనం మరణచ్చాయ లోయనుండి, నరకమునుండి, జయించు కార్యము నుండి అడుగు బయటపెట్టాం…. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ గుంపు ప్రజలమైన మనలను గెలుచుకున్నాడు! ఆయన సాతాను మీద విజయభేరిని మ్రోగించాడు మరియు ఆయన శత్రువులైన అనేక జన సమూహములను ఓడించాడు!
మనం కేవలం సామాన్య ప్రజల గుంపు మాత్రమే, సాతాను భ్రష్ట స్వభావమును అందిపుచ్చుకున్నవారం, యుగయుగాల దేవునిచేత ముందుగానే ప్రవచించబడినవారం, మరియు పెంట కుప్పల మీద నుండి దేవుడు పైకి లేపిన నిరుపేదలము. మనం ఒకసారి దేవుణ్ణి తిరస్కరించాం, దేవుణ్ణి దూషించాం గానీ ఇప్పుడు ఆయన మనలను గెలిచాడు. మనం దేవుని నుండి జీవమును, నిత్య జీవపు మార్గాన్ని పొందుకొనియున్నాం. మనం భూమి మీద ఎక్కడ ఉన్నప్పటికీ, మనం ఎటువంటి హింసలను మరియు శ్రమలను సహించినప్పటికీ, మనం సర్వశక్తిమంతుడైన దేవుని రక్షణ నుండి వేరుపర్చబడం. ఎందుకంటే, ఈయనే మన సృష్టికర్త, మరియు మన ఏకైక విమోచకుడు!
దేవుని ప్రేమ నీటి బుగ్గవలె పెల్లుబుకుతూ విస్తరిస్తూనే ఉంది, ఇది నీకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడింది మరియు ఇతరులకు ఇవ్వబడింది, అంతేగాకుండా దేవుని ప్రత్యక్షత కొరకు మరియు సత్యాన్ని వెదకువారందరికీ అనుగ్రహించబడింది.
సూర్య చంద్రులు తమ వంతులువారిగా వచ్చునట్లుగా, దేవుని కార్యము ఎన్నటికి ఆగిపోదు, మరియు నీ మీదను, నా మీదను, ఇతరుల మీదను మరియు దేవుని అడుగుజాడలలో నడుచువారందరి మీదను, అలాగే ఆయన తీర్పును, శిక్షను అంగీకరించువారందరి మీదను ఆయన కార్యము జరిగించబడుచున్నది.
మార్చి 23, 2010