నీవు యేసు ఆధ్యాత్మిక శరీరాన్ని చూసే సమయానికి, దేవుడు సరికొత్త పరలోకాన్ని మరియు భూలోకాన్ని సృష్టించి ఉంటాడు

నీవు యేసును చూడాలనుకుంటున్నావా? నీవు యేసుతో జీవించాలనుకుంటున్నావా? నీవు యేసు చెప్పిన వాక్యములు వినాలనుకుంటున్నావా? అలా అయితే, నీవు యేసు పునరాగమనాన్ని ఎలా స్వాగతిస్తావు? నీవు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నావా? యేసు పునరాగమనాన్ని నీవు ఏ విధంగా స్వాగతిస్తావు? యేసును అనుసరించే ప్రతి సోదరుడు మరియు సోదరి ఆయనకు గొప్ప స్వాగతం పలకాలనుకుంటారని నేను భావిస్తున్నాను. కానీ మీరు ఇది ఆలోచించారా: యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనను నీవు నిజంగా తెలుసుకుంటావా? ఆయన చెప్పే ప్రతి విషయాన్ని మీరు నిజంగా అర్థం చేసుకుంటారా? ఆయన చేసే అన్ని కార్యములను మీరు నిజంగా బేషరతుగా అంగీకరిస్తారా? బైబిల్ చదివిన వారందరికీ యేసు పునరాగమనం గురించి తెలుసు మరియు బైబిల్ చదివిన వారందరూ ఆయన రాక కోసం మనస్ఫూర్తిగా ఎదురు చూస్తారు. మీరందరూ ఆ క్షణం ఆగమనం కోసం స్థిరమైన నిర్ణయానికొచ్చారు మరియు మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమైనది, మీ విశ్వాసం నిజంగా అసూయపడదగినది, కానీ మీరు ఒక భయంకరమైన పొరపాటు చేశారని మీరు గుర్తించారా? యేసు ఏ విధంగా తిరిగి వస్తాడు? యేసు తెల్లటి మేఘం మీద తిరిగి వస్తాడని మీరు నమ్ముతారు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను: ఈ తెల్లటి మేఘం దేనిని ప్రస్తావిస్తుంది? యేసు తిరిగి రావడానికి ఆయన అనుచరులు ఎంతో మంది ఎదురుచూస్తుండగా, ఆయన ఏ వ్యక్తుల మధ్యలో దిగుతాడు? యేసు ఎవరి మధ్య దిగుతాడో వారిలో మీరు మొదటి వ్యక్తి అయితే, ఇది ఇతరులకు పూర్తి అన్యాయంగా కనిపించదా? మీకు యేసు పట్ల గొప్ప చిత్తశుద్ధి మరియు విధేయత ఉన్నాయని నాకు తెలుసు, అయితే మీరు ఎప్పుడైనా యేసును కలిశారా? మీకు ఆయన స్వభావం తెలుసా? మీరు ఎప్పుడైనా ఆయనతో కలిసి జీవించారా? మీరు నిజంగా ఆయన గురించి ఎంత అర్థం చేసుకున్నారు? ఈ మాటలు వారిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయని కొందరు అంటారు. వారు అంటారు: “నేను బైబిల్‌ను మొదటి నుండి చివరి వరకు అనేకసార్లు చదివాను. నేను ఎలా యేసును అర్థం చేసుకోలేను? యేసు స్వభావం గురించి అటుంచి—ఆయన ధరించడానికి ఇష్టపడే దుస్తుల రంగు కూడా నాకు తెలుసు. నేను ఆయనను అర్థం చేసుకోలేదని నీవు అన్నప్పుడు నీవు నన్ను తక్కువ చేసినట్టు కాదా?” ఈ అంశాలను నీవు వివాదం చేయవద్దని నేను సూచిస్తున్నాను; నీవు శాంతించడం మరియు ఈ కింది ప్రశ్నల గురించి మనసు పెట్టడం మంచిది: మొదటగా, వాస్తవికత అంటే ఏమిటో మరియు సిద్ధాంతం అంటే ఏమిటో నీకు తెలుసా? రెండవదిగా, అభిప్రాయాలు అంటే ఏమిటో మరియు సత్యమంటే ఏమిటో నీకు తెలుసా? మూడవదిగా, ఊహించినది అంటే ఏమిటో మరియు నిజం అంటే ఏమిటో నీకు తెలుసా?

వారు యేసును అర్థం చేసుకోలేరనే వాస్తవాన్ని కొంత మంది ఒప్పుకోరు. నేను ఇప్పటికీ చెబుతాను, మీరు ఆయనను కొద్దిగా కూడా అర్థం చేసుకోరు మరియు యేసు ఒక్క మాటను కూడా అర్థం చేసుకోరు. ఇలా ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరు బైబిల్ కథనాల కారణంగా, ఇతరులు చెప్పిన వాటి కారణంగా ఆయనను అనుసరిస్తారు. మీరు ఆయనతో కలిసి జీవించడం మాట అటుంచి, అసలు యేసును ఎన్నడూ చూడనే లేదు మరియు మీరు ఆయన సహచర్యంలో కొద్దికాలం కూడా లేరు. కాబట్టి, యేసు గురించి మీకున్న అవగాహన అనేది సిద్ధాంతం కాకుండా మరొకటి ఎలా అవుతుంది? అందులో వాస్తవికత లోపించలేదా? బహుశా కొంతమంది యేసు చిత్రపటాన్ని చూసి ఉండవచ్చు లేదా కొందమంది యేసు ఇంటిని వ్యక్తిగతంగా సందర్శించి ఉండవచ్చు. కొందమంది యేసు దుస్తులను తాకి కూడా ఉండవచ్చు. యేసు తిన్న ఆహారాన్ని మీరు స్వయంగా రుచి చూసినప్పటికీ ఆయన గురించి మీ అవగాహన ఇప్పటికీ సిద్ధాంతపరమైనదే గానీ వ్యావహారికమైనది కాదు. ఏది ఏమైనా, నీవు యేసును ఎన్నడూ చూడలేదు మరియు శరీర రూపంలోని ఆయన సహచర్యంలో ఎప్పుడూ లేవు, కాబట్టి యేసుపై నీ అవగాహన ఎల్లప్పుడూ వాస్తవికత లోపించిన డొల్ల సిద్ధాంతమే. బహుశా నా మాటలు నీకు అతి తక్కువ ఆసక్తిగా ఉండవచ్చు, కానీ నేను నిన్ను ఇలా అడుగుతున్నాను: నీవు అత్యధికంగా అభిమానించే రచయిత రచనలు అనేకం నీవు చదివి ఉండినప్పటికీ, అతనితో నీవు ఎప్పుడూ సమయం గడపకుండానే అతనిని పూర్తిగా అర్థం చేసుకోగలవా? అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో నీకు తెలుసా? అతను ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాడో నీకు తెలుసా? అతని మానసిక స్థితి గురించి నీకు ఏమైనా తెలుసా? నీవు అభిమానించే వ్యక్తి గురించే పూర్తిగా అర్థం చేసుకోలేనప్పుడు, నీవు యేసు క్రీస్తును ఎలా అర్థం చేసుకోగలవు? యేసు గురించి నీవు అర్థం చేసుకున్నవన్నీ పూర్తిగా ఊహలు మరియు అభిప్రాయాలు మరియు వాటిలో సత్యం లేదా వాస్తవికత ఉండదు. అది దుర్గంధం వేస్తుంది మరియు పూర్తిగా శారీరకమైనది. అలాంటి అవగాహన యేసు పునరాగమనాన్ని స్వాగతించడానికి మీకు అర్హతను ఎలా ఇస్తుంది? పూర్తి కల్పనలు మరియు శారీరక అభిప్రాయాలు గలవారిని యేసు స్వీకరించడు. యేసును అర్థం చేసుకోని వారు ఆయనను విశ్వసించేవారుగా ఎలా సరిపోతారు?

యేసును పరిసయ్యులు వ్యతిరేకించడానికి గల మూల కారణాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? పరిసయ్యుల తత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వారికి మెస్సీయ గురించి పూర్తి కల్పనలు ఉండేవి. ఇంకా చెప్పాలంటే, వారు మెస్సీయ వస్తాడని మాత్రమే విశ్వసించారు, అంతేగానీ జీవిత సత్యాన్ని అనుసరించలేదు. కాబట్టే, వారు నేటికీ మెస్సీయ కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే వారికి జీవన మార్గం గురించి పరిఙ్ఞానం లేదు మరియు సత్య మార్గం అంటే ఏమిటో తెలియదు. అలాంటి మూర్ఖులు, మొండివారు మరియు అజ్ఞానులు దేవుడి ఆశీర్వాదాన్ని ఎలా పొందగలరని మీరు చెప్పగలరు? వారు మెస్సీయను ఎలా దర్శించగలరు? వారికి పరిశుద్ధాత్మ కార్యపు దిశ తెలియదు కాబట్టి, యేసు చెప్పిన సత్య మార్గం వారికి తెలియదు కాబట్టి, వారు మెస్సీయను కూడా అర్థం చేసుకోలేదు కాబట్టి వారు యేసును వ్యతిరేకించారు. వారు మెస్సీయను ఎన్నడూ చూడలేదు మరియు ఎన్నడూ మెస్సీయ సహచర్యంలో ఉండలేదు కాబట్టి, వారు మెస్సీయ తత్వాన్ని వీలైన అన్ని విధాలుగా వ్యతిరేకిస్తూ కేవలం మెస్సీయ నామాన్ని పట్టుకొని వేలాడే పొరపాటు చేశారు. ఈ పరిసయ్యులు వాస్తవానికి మొండివారు, అహంకారులు మరియు సత్యానికి విధేయత చూపలేదు. దేవుడిపై వారి విశ్వాసానికి మూలసూత్రం: నీ బోధన ఎంత గంభీరమైనదైనా, మీ అధికారం ఎంత ఉన్నతమైనదైనా, నీవు మెస్సీయ అని పిలవబడకపోతే నీవు క్రీస్తు కాదు. ఈ విశ్వాసం అర్థరహితమైనది మరియు హాస్యాస్పదమైనది కాదా? నేను ఇంకా మిమ్మల్ని అడుగుతున్నాను: మీకు యేసు గురించి అతిస్వల్పంగా కూడా అవగాహన లేదు కాబట్టి, మీరూ తొలి పరిసయ్యులు చేసిన తప్పులనే చేయడం అత్యంత సులభం కాదా? నీవు సత్య మార్గాన్ని తెలుసుకోగలవా? నీవు క్రీస్తును వ్యతిరేకించవని నిజంగా హామీ ఇవ్వగలవా? నీవు పరిశుద్ధాత్మ కార్యమును అనుసరించగలవా? నీవు క్రీస్తును వ్యతిరేకిస్తావో లేదో నీకు తెలియకపోతే, నీవు ఇప్పటికే మరణం అంచున జీవిస్తున్నావని నేను చెప్తాను. మెస్సీయ అంటే తెలియని వారందరూ యేసును వ్యతిరేకించడానికి, యేసును తిరస్కరించడానికి, ఆయనపై అపవాదు వేయడానికి సమర్థులు. యేసును అర్థం చేసుకోని మనుష్యులందరూ ఆయనను తిరస్కరించగలరు మరియు ఆయనను దూషించగలరు. అంతేకాకుండా, వారు యేసు పునరాగమనాన్ని సాతాను మోసంగా చూడగలుగుతారు మరియు ఎంతోమంది మనుష్యులు యేసు శరీరధారియై తిరిగి రావడాన్ని ఖండిస్తారు. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడం లేదా? మీరు ఎదుర్కొనేవి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దైవదూషణ, చర్చిలకు పవిత్ర ఆత్మ చెప్పిన వాక్యములను నాశనం చేయడం మరియు యేసు వెల్లడించిన అన్నింటిని తిరస్కరించడమే అవుతాయి. మీరు అంత అయోమయంగా ఉంటే, యేసు నుండి మీరు ఏమి పొందగలరు? మీరు మూర్ఖంగా మీ తప్పులను తెలుసుకోవడానికి నిరాకరిస్తే, తెల్లటి మేఘం మీద యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన కార్యమును మీరు ఎలా అర్థం చేసుకోగలరు? నేను మీకు ఇది చెప్తాను: సత్యాన్ని స్వీకరించకుండా, తెల్లటి మేఘాల మీద యేసు రాక కోసం గుడ్డిగా ఎదురుచూసే మనుష్యులు తప్పకుండా పరుశుద్దాత్మను దూషిస్తారు మరియు వారు నాశనం చేయబడే వర్గం అవుతారు. మీరు కేవలం యేసు కృపను కోరుకుంటారు మరియు కేవలం పరలోకపు ఆనందమైన రాజ్యాన్ని అనుభవించాలని అనుకుంటారు, అయినా మీరు యేసు వాక్యములను ఎన్నడూ పాటించలేదు మరియు యేసు శరీరధారియై తిరిగి వచ్చినప్పుడు ఆయన చెప్పిన సత్యాన్ని ఎన్నడూ స్వీకరించలేదు. తెల్లటి మేఘం మీద యేసు తిరిగి వచ్చిన దానికి ప్రతిగా మీరు ఆయనకు ఇవ్వడానికి ఏమి పట్టుకుని ఉంటారు? మీరు మళ్లీమళ్లీ పాపాలు చేసి, ఆపై అపరాధాన్ని పదే పదే బయటికి చెప్పే నిజాయితీనా? తెల్లటి మేఘం మీద తిరిగి వచ్చే యేసుకు సమర్పణగా మీరు ఏమి ఇస్తారు? మిమ్మల్ని మీరు స్తుతించుకోనే పనిచేసిన సంవత్సరాలా? తిరిగి వచ్చిన యేసు మిమ్మల్ని విశ్వసించేలా చేయడానికి మీరు ఏమి పట్టుకుని ఉంటారు? ఎలాంటి సత్యాన్ని పాటించని మీ అహంకార స్వభావాన్నా?

మీ విధేయత కేవలం మాటలల్లోనే, మీ జ్ఞానం కేవలం మేధోపరమైనది మరియు ఊహాత్మకమైనది, మీ పాట్లు పరలోకపు ఆశీర్వాదాలను పొందడం కోసమే, కాబట్టి మీ విశ్వాసం తప్పకుండా ఎలా ఉండాలి? నేటికి కూడా, మీరు ఇంకా ప్రతి సత్యవాక్కును పెడచెవిన పెడతారు. దేవుడు అంటే ఏమిటో మీకు తెలియదు, క్రీస్తు అంటే ఏమిటో మీకు తెలియదు, యెహోవాను ఎలా ఆరాధించాలో మీకు తెలియదు, పరిశుద్ధాత్మ కార్యంలోకి ఎలా ప్రవేశించాలో మీకు తెలియదు, స్వయంగా దేవుని కార్యము మరియు మనిషి మోసాలకు మధ్య తేడాను ఎలా గుర్తించాలో మీకు తెలియదు. మీ సొంత ఆలోచనల ప్రకారం లేని దేవుడు వెల్లడించిన ఏదైనా సత్యవాక్కును ఖండించడం మాత్రమే మీకు తెలుసు. మీ వినమ్రత ఎక్కడ ఉంది? మీ అణుకువ ఎక్కడ ఉంది? మీ విధేయత ఎక్కడ ఉంది? సత్యాన్ని అన్వేషించాలనే మీ కోరిక ఎక్కడ ఉంది? దేవుని పట్ల మీ ఆరాధన ఎక్కడ ఉంది? నేను మీకు చెప్తున్నాను, సంకేతాల కారణంతో దేవుడిని విశ్వసించే వారు ఖచ్చితంగా నాశనం చేయబడే వర్గం అవుతారు. శరీరధారియై తిరిగి వచ్చిన యేసు వాక్యములను స్వీకరించలేనివారు ఖచ్చితంగా నరకపు సంతతి, ప్రధాన దేవదూత వారసులు, శాశ్వతమైన నాశనానికి లోను చేయబడే వర్గం అవుతారు. నేను చెప్పే దానిని అనేకమంది పట్టించుకోకపోవచ్చు, కానీ యేసును అనుసరించే సాధువు అని పిలవబడే ప్రతి ఒక్కరికీ నేను ఇప్పటికీ చెప్పాలనుకుంటున్నాను, యేసు పరలోకం నుండి తెల్లటి మేఘంపై వచ్చి దిగడాన్ని మీ సొంత కళ్లతో మీరు చూసినప్పుడు, ఇది ధర్మస్వారూప సూర్యుని బహిరంగ దర్శనం అవుతుంది. బహుశా అది మీకు గొప్ప ఉద్వేగభరితమైన సమయం కావచ్చు, అయినా యేసు పరలోకం నుండి దిగడాన్ని మీరు చూసిన సమయమే మీరు శిక్షించబడటానికి నరకానికి పోయే సమయమని మీరు తెలుసుకోవాలి. అదే దేవుడి నిర్వహణ ప్రణాళిక అంత్య సమయం అవుతుంది మరియు అదే దేవుడు మంచివారికి బహుమానం ఇచ్చే మరియు చెడ్డవారిని శిక్షించే సమయం అవుతుంది. ఎందుకంటే మనిషి సంకేతాలను చూడకముందే దేవుని తీర్పు అంతమై ఉంటుంది, అప్పుడు సత్యం వ్యక్తీకరణ మాత్రమే ఉంటుంది. సత్యాన్ని అంగీకరించి, సంకేతాలను అన్వేషించనివారు మరియు ఆవిధంగా పరిశుద్ధి చేయబడినవారు, దేవుని సింహాసనం ఎదుటకు తిరిగి వచ్చి, సృష్టికర్త కౌగిలిలోకి ప్రవేశిస్తారు. “తెల్లటి మేఘం మీద ప్రయాణించని యేసు అబద్ధపు క్రీస్తు” అనే నమ్మకంతో మొండిగా ఉండేవారు మాత్రమే శాశ్వత శిక్షకు లోనవుతారు, ఎందుకంటే వారు తీవ్రమైన తీర్పును ప్రకటించే, సత్యమైన మార్గాన్ని మరియు జీవాన్ని వెల్లడించే యేసును గుర్తించకుండా సంకేతాలను ప్రదర్శించే యేసును మాత్రమే విశ్వసిస్తారు. కాబట్టి యేసు తెల్లటి మేఘంపై బహిరంగంగా తిరిగి వచ్చినప్పుడు మాత్రమే ఆయన వారితో వ్యవహరించడం జరుగగలదు. వారు చాలా మొండిగా, తమపై తాము చాలా నమ్మకంగా, చాలా అహంకారంగా ఉంటారు. అటువంటి దిగజారినవారు యేసు నుండి ఎలా బహుమానం పొందగలరు? సత్యాన్ని అంగీకరించగలిగిన వారికి యేసు పునరాగమనం గొప్ప రక్షణ, కానీ సత్యాన్ని అంగీకరించలేని వారికి ఇది దండన పొందడానికి సంకేతం. మీరు మీ సొంత మార్గాన్ని ఎంచుకోవాలి మరియు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దైవదూషణ చేయకూడదు మరియు సత్యాన్ని తిరస్కరించకూడదు. మీరు అజ్ఞాని మరియు అహంకారి కాకూడదు, కానీ పరిశుద్ధాత్మ మార్గదర్శనాన్ని అనుసరించే మరియు సత్యం కోసం పరితపించే మరియు వెతికే వ్యక్తి కావాలి; కేవలం ఈవిధంగానే మీరు ప్రయోజనం పొందుతారు. దేవునిపై విశ్వాసం యొక్క మార్గంలో మీరు జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయమని నేను మీకు సలహా ఇస్తున్నాను. ఉన్నట్టుండి నిర్ణయాలకు రాకండి; ఇంకా చెప్పాలంటే, దేవునిపై మీ నమ్మకం విషయంలో ఆషామాషీగా మరియు ఆలోచనారహితంగా ఉండకండి. దేవుడిని విశ్వసించే వారు ప్రతి అతి చిన్న విషయంలో కూడా వినమ్రతతో మరియు భక్తితో ఉండాలని మీరు తెలుసుకోవాలి. సత్యాన్ని విన్నప్పటికీ తిరస్కరించే వారు మూర్ఖులు మరియు అజ్ఞానులు. సత్యాన్ని విన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నట్టుండి నిర్ణయాలకు వచ్చేవారిని లేదా దానిని ఖండించే వారిని అహంకారం ఆవరిస్తుంది. యేసును విశ్వసించే ఎవరికీ ఇతరులను శపించే లేదా ఖండించే అర్హత లేదు. మీరందరు వివేకంగల మరియు సత్యాన్ని అంగీకరించే వ్యక్తి అయి ఉండాలి. బహుశా, సత్య మార్గాన్ని వినిన మరియు జీవిత వాక్యాన్ని చదివిన తర్వాత, ఈ 10,000 పదాలలో ఒక్కటి మాత్రమే నీ నమ్మకాలకు మరియు బైబిల్‌కు అనుగుణంగా ఉందని నీవు విశ్వసిస్తావు, ఆపై ఈ పదాలలో 10,000 వ పదాన్ని నీవు అన్వేషించడం నీవు కొనసాగించాలి. నీవు వినమ్రతతో ఉండమని, అతి విశ్వాసంతో ఉండవద్దని మరియు నీ గురించి నీవు విపరీతంగా గొప్పలు చెప్పుకోవద్దని నేను ఇప్పటికీ నీకు సూచిస్తాను. నీ హృదయంలో దేవుడి పట్ల అంత అత్యల్ప ఆరాధన ఉన్నప్పటికీ నీవు గొప్ప కాంతిని పొందుతావు. నీవు ఈ పదాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మరియు పదే పదే వాటి గురించి ఆలోచిస్తే, అవి సత్యమైనవా కాదా, అవి జీవమా కాదా అని నీవు అర్థం చేసుకుంటావు. బహుశా, కొద్ది వాక్యములను మాత్రమే చదివి, కొంతమంది ఈ వాక్యములను గుడ్డిగా ఖండిస్తూ ఇలా అంటారు, “ఇది పరిశుద్ధాత్మ యొక్క కొంత బోధకు మించి మరేమీ కాదు” లేదా “ఈయన ప్రజలను మోసగించడానికి వచ్చిన అబద్ధపు క్రీస్తు.” అలాంటి మాటలు మాట్లాడేవారు అజ్ఞానంతో గుడ్డివారైనవారు! నీవు దేవుడి కార్యము మరియు వివేకం గురించి చాలా తక్కువ అర్థం చేసుకున్నావు మరియు నీవు తిరిగి మొదటి నుండి ప్రారంభించమని నేను సలహా ఇస్తున్నాను! అంత్య దినాలలో అబద్ధపు క్రీస్తులు కనిపించిన కారణంగా మీరు దేవుడు వెల్లడించిన వాక్యములను గుడ్డిగా ఖండించకూడదు మరియు మీకు మోసమంటే భయం కాబట్టి పరిశుద్ధాత్మను దైవదూషణ చేసేవారుగా ఉండకూడదు. అది ఒక గొప్ప జాలిపడే విషయం అవ్వదా? ఎంతో పరిశీలన తర్వాత, ఒకవేళ ఈ వాక్యములు సత్యం కావనీ, మార్గం కాదనీ మరియు దేవుడు వ్యక్తపరచినవి కావనీ నీవు ఇప్పటికీ విశ్వసిస్తే, నీవు కడకు శిక్షించబడతావు మరియు నీవు ఆశీర్వాదాలు లేకుండా ఉంటావు. అంత విశదంగా మరియు స్పష్టంగా చెప్పిన అలాంటి సత్యాన్ని నీవు అంగీకరించలేకపోతే, నీవు దేవుని రక్షణ పొందడానికి అనర్హుడవు కాదా? నీవు దేవుని సింహాసనం ముందుకు తిరిగి రావడానికి తగినంత ఆశీర్వాదం పొందని వ్యక్తివి కాదా? దీని గురించి ఆలోచించండి! దూకుడుగా మరియు ఉద్వేగపూరితంగా ఉండకండి మరియు దేవునిపై విశ్వాసాన్ని ఒక ఆటగా పరిగణించకండి. మీ గమ్యం కోసం, మీ అవకాశాల కోసం, మీ జీవితం కోసం ఆలోచించండి మరియు మీతో మీరు ఆటలాడకండి. ఈ మాటలను నీవు అంగీకరించగలవా?

మునుపటి:  దేవుడు మరియు మనిషి కలిసి విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు

తరువాత:  క్రీస్తుతో అనుకూలించని వారందరూ నిశ్చయముగా దేవుని విరోధులే

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger