మనిషిని దేవుడు వినియోగించడానికి సంబంధించి
పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేక నిర్దేశనం మరియు మార్గదర్శకత్వం అందుకున్నవారు తప్ప మిగిలిన వారెవరూ స్వతంత్రంగా మనుగడ సాగించలేరు, ఎందుకంటే, దేవుని ద్వారా వినియోగించబడిన వారి పరిచర్య మరియు కాపుదల వారికి అవసరం. ఈ విధంగా, ప్రతి యుగంలోనూ దేవుడు తన కార్య ప్రయోజనం కోసం సంఘముల కాపుదల పనిలో తీరిక లేకుండా ఉండే విభిన్నమైన వ్యక్తులను తెరమీదకు తీసుకొస్తాడు. సరిగ్గా చెప్పాలంటే, దేవుని కార్యము అనేది ఆయన కృపకు పాత్రులైన మరియు ఆయన ఆమోదం పొందిన వారి ద్వారా మాత్రమే జరగాలి; పరిశుద్ధాత్మ కార్యము చేయడానికి వారిలోని యోగ్యమైన అంశాలను పరిశుద్ధాత్మ తప్పనిసరిగా ఉపయోగించాలి, మరియు వారు పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణులు కావడం ద్వారా మాత్రమే దేవుని ద్వారా వినియోగింపబడడానికి సరైన వారుగా తయారు కాగలరు. దేవుని చిత్తమును అర్థం చేసుకోగల సామర్థ్యం మనిషికి అత్యంత తక్కువగా ఉన్న కారణంగా, దేవుని ద్వారా వినియోగించబడుతున్న వారి ద్వారా మనిషి కాపుదల అందుకోవాలి; మోషేను కూడా దేవుడు ఈ కారణం కోసమే వినియోగించాడు, ఆ సమయంలో తాను వినియోగించడానికి అవసరమైన దానిని అతనిలో దేవుడు పెద్ద మొత్తంలో కనుగొన్నాడు, మరియు ఆ కారణంగానే, ఆ దశలో దేవుడి కార్యము చేయడానికి అతను వినియోగించబడ్డాడు. ఈ దశలో, దేవుడు ఒక మనిషిని ఉపయోగించుకోవడంతో పాటు, అదేసమయంలో, దేవుని కార్యము చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఉపయోగించగల అతనిలోని అంశమును తనకు అనుకూలంగా ఎంచుకున్నాడు, మరియు అదేసమయంలో, పరిశుద్ధాత్మ అతనికి మార్గ నిర్ధేశనం చేయడంతో పాటు అతనిలోని మిగిలిన నిరుపయోగ అంశాలను కూడా వినియోగానికి పనికి వచ్చేలా చేసింది.
దేవుని ద్వారా వినియోగించబడే వ్యక్తి చేసే పని అనేది క్రీస్తు లేదా పరిశుద్ధాత్మ కార్యమునకు సహకరించడంగా ఉంటుంది. ఈ వ్యక్తి మనుష్యుల మధ్య నుండి దేవుని ద్వారా ఎంచుకోబడ్డాడు, దేవుడు ఎన్నుకున్న వారందరినీ నడిపించడం కోసమే కాకుండా, మనుష్యుల మధ్య సహకారం అనే పని చేయడానికి కూడా దేవుని ద్వారా అతను ఎంచుకోబడ్డాడు. మనుష్యులతో సహకారం కొనసాగిస్తూ పని చేయగలిగిన ఇటువంటి వ్యక్తి ద్వారా, మనుష్యుల కోసం దేవుడు చేయదల్చుకున్నవి చాలా చేయవచ్చు మరియు మనుష్యుల్లో పరిశుద్ధాత్మ చేయవలసిన పనిని కూడా అతని ద్వారా సాధించవచ్చు. దీనిని మరొక విధంగా కూడా చెప్పవచ్చు: ఈ వ్యక్తిని వినియోగించడంలో దేవుని లక్ష్యం ఏమిటంటే, దేవుని అనుసరించే వారందరూ ఇతని ద్వారా దేవుని చిత్తాన్ని బాగా అర్థం చేసుకోగలరు మరియు దేవుడు కోరుకునే వాటిని మరింతగా సాధించగలరు. దేవుని వాక్యములను లేదా దేవుని చిత్తాన్ని మనుష్యులు నేరుగా అర్థం చేసుకోలేరు కాబట్టి, ఆ పనిని నిర్వర్తించడం కోసం దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు. దేవుడి ద్వారా ఉపయోగించబడే ఈ వ్యక్తి ఒక మాధ్యమంగా అభివర్ణించబడుతాడు, ఎందుకంటే, ఇతని ద్వారా మనుష్యులకు దేవుడు మార్గనిర్దేశం చేస్తాడు, అలాగే, ఇతనొక “అనువాదకుడు” గా దేవుడు మరియు మనిషికి మధ్య సంభాషణను సాధ్యం చేస్తాడు. ఈవిధంగా, ఇలాంటి వ్యక్తి దేవుని గృహంలో పని చేసేవారిలో లేదా ఆయన అపొస్తలులలోని ఇతరుల కంటే భిన్నంగా ఉంటాడు. వారిలాగే, ఇతను కూడా దేవునికి సేవ చేసే ఒక వ్యక్తి అని చెప్పబడినప్పటికీ, అతని పని సారాంశము మరియు దేవుడు అతనిని ఉపయోగించే నేపథ్యంలో అతను ఇతర సేవకులు మరియు అపొస్తలుల నుండి అత్యంత భిన్నంగా ఉంటాడు. అతని పని సారాంశము మరియు అతని పరిచర్య నేపథ్యం నుండి చూస్తే, దేవుని ద్వారా వినియోగించబడే వ్యక్తి ఆయన ద్వారానే ఎంచుకోబడుతాడు, అతను దేవుని పని కోసం దేవుని ద్వారా సిద్ధపరచబడ్డాడు, మరియు అతను స్వయంగా దేవుని కార్యమునకు సహకరిస్తాడు. మరే ఇతర వ్యక్తి అతని స్థానంలో, అతనికి బదులుగా అతని పని చేయలేడు. ఎందుకంటే, ఈ పని దేవుని కార్యముతో పాటు అనివార్యమైన మనుష్యుల మధ్య సహకారం అనే రూపంలో ఉంటుంది. అదే సమయంలో, ఇతర సేవకులు లేదా అపొస్తలలు చేసే పని అనేది ప్రతి కాలములో సంఘముల ఏర్పాట్ల కోసం అనేక అంశాలు తెలియజేయడం మరియు అమలు చేయడం లేదా సంఘము మనుగడ కోసం కొన్ని సాధారణ నియమాలు పాటించడం అనే పనిగా ఉంటుంది. ఈ సేవకులు మరియు అపొస్తలలు దేవుని ద్వారా నియమించబడినవారు కాదు కానీ, వారిని పరిశుద్ధాత్మ ద్వారా వినియోగించబడిన వారుగా పేర్కొనవచ్చు. వీళ్లు సంఘముల నుండి ఎంపిక చేయబడతారు, మరియు కొంత కాలం శిక్షణ పొంది, తర్ఫీదు చేయబడిన తర్వాత, అర్హత కలిగినవారు అందుబాటులో ఉంచబడి, అర్హత లేని వారు ఎక్కడ నుండి వచ్చారో అక్కడికే తిరిగి పంపబడుతారు. వీళ్లు సంఘముల నుండి ఎంపికైన కారణంగా, వీరిలో కొందరు నాయకులుగా మారిన తర్వాత వారి అసలు రంగు ప్రదర్శిస్తారు మరియు కొందరు అనేక చెడ్డ పనులు చేసి చివరికి పరిత్యజించబడతారు. అయితే, దేవుని ద్వారా వినియోగించబడే వ్యక్తి, దేవునిద్వారా సిద్ధపరచబడిన వ్యక్తిగా మరియు ఒక నిర్దిష్ట పటుత్వం కలిగిన మరియు మానవత్వం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే సిద్ధం చేయబడి పరిపూర్ణుడు అయ్యాడు మరియు పూర్తిగా పరిశుద్ధాత్మచే నడిపించబడతాడు కాబట్టి, అతని పని విషయానికి వస్తే, అతను పరిశుద్ధాత్మచే నిర్దేశించబడ్డాడు మరియు ఆజ్ఞాపించబడ్డాడు. కాబట్టే, దేవుడు ఎంచుకున్న వారు నడిచే రీతిలో ఎటువంటి విచలనం కనపడదు, ఎందుకంటే, దేవుడు తన స్వంత కార్యమునకు ఖచ్చితంగా తానే బాధ్యత వహిస్తాడు మరియు దేవుడు అన్ని సమయాలలో తన కార్యమును తానే చేస్తాడు.