కొత్త యుగం ఆజ్ఞలు

దేవుని పనిని అనుభవించాలంటే, మీరు దేవుని వాక్యములను జాగ్రత్తగా చదవాలి మరియు సత్యంతో మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవాలి. కానీ, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు లేదా మీరు దానిని ఎలా చేయాలనుకుంటున్నారనే దాని గురించి, మీ హృదయపూర్వక ప్రార్థన లేదా విన్నపము అవసరం లేదు. నిజానికి, ఈ విషయాలన్నీ పనికిరానివి. అయితే, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం, దేవుని పనిని ఎలా అనుభవించాలో మీకు తెలియకపోవడం మరియు మీలో అత్యంత నిష్క్రియాత్మకత దాగి ఉండడమే. మీకు చాలా సిద్ధాంతాలు తెలిసినప్పటీ, మీకు అత్యంత వాస్తవికత లేదు. ఇది అన్యాయానికి సంకేతం కాదా? ఈ గుంపులోని మీలో తప్పిదం కనిపిస్తుంది. నేడు, మీరు “సేవ-చేయువారు” గా అటువంటి శోధనలను జయించడంలో అసమర్థులుగా ఉన్నారు, అంతేగాక దేవుని మాటలకు సంబంధించిన ఇతర శోధనలు మరియు నిర్మలత్వాన్ని ఊహించడానికి లేదా సాధించడానికి మీరు అసమర్థులుగా ఉన్నారు. మీరు ఆచరణలో పెట్టాల్సిన అనేక విషయాలకు మీరు కట్టుబడి ఉండాలి. అంటే, మనుష్యులు తాము నిర్వర్తించాల్సిన అనేక విధులకు కట్టుబడి ఉండాలి. మనుష్యులు దీనికే కట్టుబడి ఉండాలి, మరియు వారు దీనినే చేపట్టాలి. పరిశుద్ధాత్మ ఏమి చేయాలో దానిని పరిశుద్ధాత్మనే చేయనివ్వండి; ఇందులో మనిషి ఏ పాత్రనూ పోషించలేడు. పరిశుద్ధాత్మతో సంబంధం లేని మనిషి చేయవలసిన పనులకు మాత్రమే మనిషి కట్టుబడి ఉండాలి. ఇది మానవుడు చేయవలసినది తప్ప మరొకటి కాదు, పాత నిబంధనలోని కట్టడకు కట్టుబడినట్లే, అదొక ఆజ్ఞగా కట్టుబడి ఉండాలి. ఇప్పుడున్నది న్యాయ కాలము కానప్పటికీ, న్యాయ కాలములో మాట్లాడిన పదాలకు అనుబ౦ది౦చాల్సిన పదాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ మాటలు కేవలం పరిశుద్ధాత్మ స్పర్శపై ఆధారపడటం ద్వారా మాత్రమే నిర్వహించబడవు, కానీ అవి మానవుడు కట్టుబడి ఉండాల్సిన ఒక విషయమై ఉన్నాయి. ఉదాహరణకు:

ఆచరణాత్మకమైన దేవుని కార్యముపై మీరు తీర్పు చెప్పకూడదు.

దేవుని చేత సాక్ష్యమివ్వబడిన వ్యక్తిని మీరు వ్యతిరేకించ కూడదు.

దేవుని యెదుట, మీరు మీ స్థానాన్ని కాపాడుకోవాలి మరియు అది చెదరిపోకూడదు.

మాట్లాడటంలో మీరు మిత౦గా ఉ౦డాలి, మీ మాటలు మరియు చర్యలు దేవుడు సాక్ష్యమిచ్చిన వ్యక్తి ఏర్పాట్లను అనుసరించాలి.

మీరు దేవుని సాక్ష్యాన్ని గౌరవించాలి. మీరు దేవుని కార్యాన్ని, ఆయన నోటి నుండి వచ్చిన మాటలను విస్మరించకూడదు.

దేవుని మాటలు అనే స్వరాన్ని, లక్ష్యాలను మీరు అనుకరి౦చకూడదు.

బాహ్యంగా, దేవునిచే సాక్ష్యమివ్వబడిన వ్యక్తిని స్పష్టంగా వ్యతిరేకించే ఏదీ మీరు చేయకూడదు. ఇలాంటి ఇతర విషయాల్లోనూ ఇలాగే చేయాలి.

ప్రతి వ్యక్తి వీటికి కట్టుబడి ఉండాలి. ప్రతి కాలములోనూ, చట్టాలకు సమానమైన మరియు మనిషి కట్టుబడి ఉండాల్సిన అనేక నిబంధనలను దేవుడు నిర్దేశిస్తాడు. వీటి ద్వారా, ఆయన మనిషి యొక్క స్వభావాన్ని నియంత్రించి, అతని చిత్తశుద్ధిని గుర్తిస్తాడు. ఉదాహరణకు, “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.” అనే పదాలను పరిశీలి౦చ౦డి. ఈ పదాలు ఈ రోజుకు వర్తించవు; ఆ కాలంలో వారు కేవల౦ మానవుని బాహ్య స్వభావాన్ని నిర్బ౦ధి౦చారు, దేవునిపై మానవుని విశ్వాసంలోని చిత్తశుద్ధిని ప్రదర్శి౦చడానికి ఉపయోగి౦చబడ్డారు, దేవుణ్ణి విశ్వసించేవారికి గుర్తుగా ఉ౦డేవారు. ఇప్పుడు దేవుని రాజ్యకాలము అయినప్పటికీ, మానవుడు కట్టుబడి ఉ౦డాల్సిన అనేక నియమాలు ఇప్పటికీ ఉన్నాయి. గతంలోని నియమాలు ఇప్పుడు వర్తించవు. నేడు మానవుడు అమలు చేయడానికి ఇంకా అనేక యుక్తమైన పద్ధతులు ఉన్నాయి మరియు అవి అవసరమైనవి. అవి పరిశుద్ధాత్మ యొక్క క్రియలను కలిగి ఉండవు మరియు అవి తప్పకుండా మానవుడే చేయాలి.

కృపా కాలములో, న్యాయకాలము నాటి అనేక పద్ధతులు విస్మరించబడ్డాయి ఎందుకంటే ఈ నియమాలు ఆ సమయంలో పనికి ప్రత్యేకించి ప్రభావవంతంగా లేవు. వాటిని పారవేసిన తర్వాత, కాలమునకు తగిన అనేక పద్ధతులు పేర్కొనబడ్డాయి, నేడు అవి అనేక నియమాలుగా మారాయి. నేటి దేవుడు వచ్చినప్పుడు, ఈ నియమాలు తొలగించబడ్డాయి మరియు వాటిని ఏ మాత్రం పాటించాల్సిన అవసరం లేకుండా పోయింది అంతేకాకుండా, నేటి పనికి తగిన అనేక పద్ధతులు ఏర్పాటు చేయబడ్డాయి. నేడు, ఈ పద్ధతులు నియమాలు కావు, బదులుగా ప్రభావాలను సాధించడానికి ఉద్దేశించబడ్డాయి; అవి నేటికి సరిపోతాయి—రేపటికి, బహుశా అవి నియమాలుగా మారవచ్చు. మొత్తానికి, మీరు వీటిలో నేటి క్రియకు ఫలభరితమైన దానికి కట్టుబడి ఉండాలి. రేపటిని గురించి పట్టించుకోకండి: ఈరోజు చేసేది ఈరోజు కోసమే. రేపు అనేది వచ్చినప్పుడు, మీరు చేపట్టాల్సిన మంచి పద్ధతులు ఉండవచ్చు—కానీ దాని గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. బదులుగా, దేవుణ్ణి వ్యతిరేకి౦చకు౦డా ఉ౦డే౦దుకు నేడు కట్టుబడి ఉ౦డాల్సిన దానికి కట్టుబడి ఉ౦డ౦డి. నేడు, మానవుడు ఈ క్రింది దానికి కట్టుబడి ఉండటాని కంటే కీలకమైనది మరొకటి లేదు. అది:

మీరు మీ కళ్ళ ముందు ఉన్న దేవుణ్ణి బాధించడానికి ప్రయత్నించకూడదు లేదా ఆయన నుండి దేనినీ దాచకూడదు.

మీరు దేవుని ఎదుట అపవిత్రత లేదా అహంకారపూరితమైన మాటలు మాట్లాడకూడదు.

దేవుని నమ్మకాన్ని పొందడం కోసం తేనె పలుకులు మరియు సరసమైన ప్రసంగాల ద్వారా మీ కళ్ళ ముందు మీరు దేవుడిని మోసగించకూడదు.

మీరు దేవుని యెదుట అమర్యాదగా ప్రవర్తించకూడదు. మీరు దేవుని నోటి నుండి చెప్పబడినదంతా పాటించాలి మరియు ఆయన మాటలను ఎదిరించకూడదు, వ్యతిరేకించకూడదు లేదా వివాదం చేయకూడదు.

దేవుని నోటి నుండి పలికిన మాటలను మీకు తగినట్లుగా మీరు అర్థం చేసుకోకూడదు. దుష్టుల మోసపూరిత పన్నాగాలకు మీరు బలికాకుండా ఉండటానికి మీరు మీ నాలుకను కాపాడుకోవాలి.

దేవుడు మీ కోసం నిర్దేశించిన సరిహద్దులను అతిక్రమించకుండా ఉండేందుకు మీరు మీ అడుగుజాడలను సంరక్షించుకోవాలి. మీరు అతిక్రమించినట్టయితే, అది మిమ్మల్ని దేవుని స్థానంలో నిలబడేలా చేస్తుంది అంతేకాకుండా అహంకారం మరియు ఆడంబరమైన మాటలు మాట్లాడేలా చేస్తుంది, తద్వారా మీరు దేవునిచే అసహ్యించుకోబడతారు.

మీరు దేవుని నోటి నుండి వచ్చే మాటలను నిర్లక్ష్యంగా వ్యాపింప చేయకూడదు, అలా చేస్తే ఇతరులు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, దెయ్యాలు మిమ్మల్ని వెర్రివాళ్ళను చేస్తాయి.

నేటి దేవుని కార్యాలన్నింటికి మీరు కట్టుబడి ఉండాలి. మీరు దానిని అర్థం చేసుకోకపోయినా, మీరు దానిపై తీర్పు తీర్చకూడదు; మీరు చేయగలిగినదల్లా వెదకడం మరియు సహవాసం మాత్రమే.

దేవుని వాస్తవ స్థలాన్ని ఎవరూ అతిక్రమించకూడదు. మానవుని స్థానం నుండి నేటి దేవునికి సేవ చేయడం తప్ప మీరు ఏమీ చేయలేరు. మీరు నేటి దేవునికి మనిషి స్థానం నుండి బోధించలేరు—అలా చేయడమనేది తప్పుదారి పట్టించడమే అవుతుంది.

దేవుడు సాక్ష్యమిచ్చిన వ్యక్తి స్థానంలో ఎవరూ నిలబడలేరు; మీ మాటలు, చర్యలు మరియు అంతర్గత ఆలోచనలలో, మీరు మనిషి స్థానంలో నిలబడతారు. దీనికి కట్టుబడి ఉండాలి, ఇది మనిషి బాధ్యత మాత్రమే కాకుండా దీనిని ఎవరూ మార్చలేరు; దానికి ప్రయత్నించడం పరిపాలక ఆజ్ఞలను ఉల్లంఘించనట్టవుతుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి.

దేవుడు మాట్లాడుతూ మరియు పలుకుతూ గడిపిన చాలా కాలమనేది మనిషి దేవుని వాక్యాలను చదవడం మరియు కంఠస్థం చేయడం అతని ప్రాథమిక పనిగా పరిగణించేలా చేసింది. అయినప్పటికీ, ఆచరణలో మాత్రం ఎవరూ శ్రద్ధ చూపరు మరియు మీరు కట్టుబడి ఉండాల్సిన వాటిని కూడా మీరు పట్టించుకోరు. ఇది మీ సేవకు అనేక ఇబ్బందులు మరియు సమస్యలను తెచ్చిపెట్టింది. ఒకవేళ, దేవుని వాక్యాలను ఆచరించే ముందు, మీరు కట్టుబడి ఉండవలసిన దానికి మీరు కట్టుబడి ఉండకపోతే, మీరు దేవునిచే అసహ్యించబడిన మరియు తిరస్కరించబడిన వారిలో ఒకరవుతారు. ఈ పద్ధతులకు కట్టుబడి ఉండటంలో, మీరు నిజాయితీ మరియు చిత్తశుద్ధితో ఉండాలి. మీరు వాటిని సంకెళ్లలాగా పరిగణించకూడదు, కానీ వాటిని ఆజ్ఞలుగా పాటించాలి. ఈ రోజు, మీరు ఏ ప్రభావాలను సాధించాలనే దాని గురించి మీకు మీరే చింతించకండి; క్లుప్తంగా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ ఈ విధంగానే పనిచేస్తుంది అంతేకాదు నేరం చేసిన ఎవరైనా సరే తప్పక శిక్షించబడాలి. పరిశుద్ధాత్మ భావోద్వేగ రహితమైనది మరియు మీ ప్రస్తుత అవగాహన గురించి పట్టించుకోదు. నేడు మీరు దేవుణ్ణి నొప్పించినట్టయితే, ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన అధికార పరిధిలో ఆయనను మీరు నొప్పించినట్లయితే, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. యేసు మాటలకు కట్టుబడి ఉండటంలో మీరు ఎంత తీవ్రంగా ఉన్నారో ఆయన పట్టించుకోడు. మీరు నేటి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తే, ఆయన మిమ్మల్ని శిక్షించడమేగాక మరణశిక్ష విధిస్తాడు. మీరు వాటికి కట్టుబడి ఉండకపోవడం ఎలా ఆమోదయోగ్యం కాగలదు? కొంచెం నొప్పి అనిపించినా, శ్రమగా ఉన్నా మీరు కట్టుబడి ఉండాల్సిందే! అది ఏ మతమైనా, రంగమైనా, దేశమైనా, వర్గమైనా సరే, భవిష్యత్తులో వారందరూ ఈ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిందే. ఎవరికీ మినహాయింపు లేదు, ఎవరూ విడిచిపెట్టబడరు! పరిశుద్ధాత్మ నేడు ఏమి చేస్తుందో అదే వారు, ఎవరూ వాటిని అతిక్రమించలేరు. అవి గొప్ప విషయాలు కానప్పటికీ, అవి ప్రతి వ్యక్తి చేత చేయబడాలి మరియు అవి పునరుత్థానం చేయబడిన మరియు పరలోకానికి ఆరోహణమైన యేసు ద్వారా మానవునికి నిర్దేశించిన ఆజ్ఞలు. నీవు నీతిమంతుడవా లేదా పాపాత్ముడవా అనే విషయంలో యేసు ఇచ్చిన నిర్వచనమనేది నేడు దేవుని పట్ల నీ వైఖరికి అనుగుణంగా ఉంటుందని “మార్గము … (7)” చెప్పలేదా? ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోకపోవచ్చు. న్యాయ కాలములో, పరిసయ్యుల ప్రతి తరం దేవుణ్ణి విశ్వసించింది, కానీ, కృపా కాలము రాకతో వారు యేసును తెలుసుకోలేదు మరియు ఆయనను వ్యతిరేకించారు. కాబట్టి, వారు చేసినదంతా ఫలించక వృధా అయినది అంతేకాదు దేవుడు వారి పనులను అంగీకరించలేదు. మీరు దీనిని చూడగలిగితే, మీరు అంత సులభంగా పాపం చేయలేరు. చాలా మంది, బహుశా, దేవునికి వ్యతిరేకంగా తమను తాము కొలుచుకుంటారు. దేవుణ్ణి వ్యతిరేకించడం ఎలా రుచిస్తుంది? అది చేదా లేదా తీపియా? మీరు దీన్ని అర్థం చేసుకోవాలి; తెలియనట్లు నటించకూడదు. వారి హృదయాలలో, బహుశా, కొంతమంది నమ్మకం లేకుండానే ఉంటారు. ఇంకా నేను మీకు సలహా ఇస్తున్నాను, దీనిని ప్రయత్నించి చూడండి—ఇది ఎలా రుచిస్తుందో చూడండి. దీని వల్ల చాలా మందికి ఎప్పుడూ అనుమానం రాకుండా చేస్తుంది. చాలా మంది మనుష్యులు దేవుని వాక్యాలను చదివినా తమ హృదయాలలో ఆయనను రహస్యంగా వ్యతిరేకిస్తారు. ఆయన్ను ఇలా ఎదిరించిన తర్వాత మీ గుండెల్లో కత్తి తిప్పినట్లు అనిపించడంలేదా? ఇది కుటుంబ అశాంతి కాకపోతే, అది శారీరక అసౌకర్యం, లేదా కొడుకులు మరియు కుమార్తెల బాధలుగా ఉంటుంది. మీ శరీరము మరణము నుండి తప్పించబడినప్పటికీ, దేవుని హస్తం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. ఇది అంత సులభం అని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా, దేవునికి దగ్గరగా ఉన్న అనేకమంది దీనిపై దృష్టి సారించడం మరింత అవసరం. సమయం గడిచేకొద్దీ, మీరు దానిని మరచిపోతారు, దానిని గ్రహించకుండా, మీరు శోధనలో మునిగిపోతారు, ప్రతిదానిని పట్టించుకోకుండా ఉంటారు అంతేకాకుండా ఇది మీ పాపానికి నాంది అవుతుంది. ఇది మీకు చిన్నవిషయంగా అనిపిస్తోందా? మీరు దీన్ని బాగా చేయగలిగితే, దేవుని ఎదుటకు వచ్చి ఆయన స్వంత నోటి నుండి ఆయన మార్గదర్శకత్వం పొందడానికి మీరు పరిపూర్ణులుగా తయారయ్యే అవకాశం ఉంది. మీరు అజాగ్రత్తగా ఉంటే, అప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది—మీరు దేవుని అవిధేయులుగా ఉంటారు, మీ మాటలు మరియు చర్యలు చెడిపోతాయి అంతేగాక త్వరలో లేదా తరువాత మీరు పెనుగాలులు మరియు బలమైన అలల ద్వారా కొట్టుకు పోతారు. మీలో ప్రతి ఒక్కరు ఈ ఆజ్ఞలను గమనించాలి. మీరు వాటిని ఉల్లంఘించినట్లయితే, దేవునిచే సాక్ష్యమివ్వబడిన వ్యక్తి మిమ్మల్ని ఖండించకపోయినప్పటికీ, దేవుని ఆత్మకు మీతో సంబంధం అనేది అసంపూర్ణమై పోతుంది, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. మీ నేరం పరిణామాలను మీరు భరించగలరా? కాబట్టి, దేవుడు ఏమి చెప్పినా, మీరు ఆయన మాటలను ఆచరణలో పెట్టాలి మరియు మీరు చేయగలిగిన విధంగా వాటికి కట్టుబడి ఉండాలి. ఇది సాధారణ విషయం కాదు!

మునుపటి:  మనిషిని దేవుడు వినియోగించడానికి సంబంధించి

తరువాత:  వెయ్యేండ్ల రాజ్యం వచ్చేసింది

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger