బైబిల్ పరిచయం (1)
దేవుడిపై విశ్వాసంతో బైబిల్‌ను ఎలా చూడాలి? ఇది నియమ సంబంధిత ప్రశ్న. మేము ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాము? ఎందుకంటే, భవిష్యత్తులో మీరు సువార్తను వ్యాపింపజేస్తారు, దేవుని రాజ్యకాలపు కార్యమును విస్తరిస్తారు మరియు నేటి దేవుడి కార్యము గురించి కేవలం మాట్లాడగలిగితే సరిపోదు. ఆయన కార్యమును విస్తరించడానికి, ప్రజల పాత మతపరమైన ఆలోచనలను మరియు విశ్వాసపు పాత సాధనాలను మీరు పరిష్కరించగలిగేలా మరియు వారిని పూర్తిగా ఒప్పించగలిగేలా ఉండటం చాలా ముఖ్యం—మరియు దానిని సాధించడంలో బైబిల్ పాత్ర ఉంటుంది. అనేక సంవత్సరాలుగా, ప్రజల సాంప్రదాయక విశ్వాసపు (ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలలో ఒకటైన క్రైస్తవ్యం) సాధనంగా బైబిల్ చదవబపడుతోంది; బైబిల్ నుండి వైదొలగడం అంటే ప్రభువుపై విశ్వాసం ఉంచడం కాదు, బైబిల్ నుండి వైదొలగడం అంటే మతవైపరీత్యం మరియు మతివిరోధం, ప్రజలు ఇతర గ్రంథాలను చదివినప్పుడు కూడా, ఆ గ్రంథాల పునాది తప్పక బైబిల్ వివరణగా ఉండాలి. ఇక్కడ చెప్పేదేమిటంటే, నీవు ప్రభువును విశ్వసిస్తే, తప్పనిసరిగా బైబిల్ చదవాలి మరియు బైబిల్ బయట బైబిల్ ప్రమేయం లేని ఏ గ్రంథాన్ని నీవు ఆరాధించకూడదు. నీవు అలా చేస్తే, నీవు దేవుడికి నమ్మకద్రోహం చేస్తున్నట్టు లెక్క. బైబిల్ ఉనికిలోకి వచ్చినప్పటి నుండి, ప్రభువుపై ప్రజల విశ్వాసమనేది బైబిల్ మీద విశ్వాసంగా కూడా ఉంటూ వచ్చింది. ప్రజలు ప్రభువును విశ్వసిస్తున్నారని చెప్పడానికి బదులు, వారు బైబిల్‌ను విశ్వసిస్తున్నారని చెప్పడం మంచిది; వారు బైబిల్ చదవడం ప్రారంభించారని చెప్పడం కంటే, వారు బైబిల్‌ను విశ్వసించడం ప్రారంభించారని చెప్పడం మంచిది; మరియు వారు ప్రభువు యెదుటకు తిరిగి వచ్చారని చెప్పడం కంటే, వారు బైబిల్ యెదుటకు తిరిగి వచ్చారని చెప్పడం మంచిది. ఈ విధంగా, బైబిల్‌ను ప్రజలు అదే దేవుడు అన్నట్లుగా, అదే వారి జీవాధారం అన్నట్లుగా ఆరాధిస్తారు మరియు దాన్ని కోల్పోవడం అంటే వారి జీవాన్ని కోల్పోయినట్లు అవుతుంది. ప్రజలు బైబిల్‌ను దేవుడి అంత ఉన్నతంగా చూస్తారు మరియు దానిని దేవుడిని మించి ఉన్నతంగా చూసే వారు కూడా ఉన్నారు. ప్రజలకు పరిశుద్ధాత్మ కార్యము లేకపోయినా, వారు దేవుడిని అనుభూతి చెందలేకపోయినా, వారు జీవితాన్ని కొనసాగించగలరు—కానీ వారు బైబిల్‌ను కోల్పోయిన వెనువెంటనే లేదా బైబిల్‌లోని గొప్ప అధ్యాయాలను మరియు ప్రవచనాలను కోల్పోయిన వెనువెంటనే, అది వారు తమ జీవం కోల్పోయారా అన్నట్లు అవుతుంది. కాబట్టి, ప్రజలు ప్రభువును విశ్వసించడం ప్రారంభించిన వెనువెంటనే వారు బైబిల్ చదవడం మరియు బైబిల్‌ను కంఠోపాఠం చేయడం ప్రారంభిస్తారు, వారు బైబిల్‌ను ఎంత ఎక్కువగా కంఠస్థం చేయగలిగితే అంత ఎక్కువగా వారు ప్రభువును ప్రేమిస్తున్నారని మరియు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారనే దానిని ఇది రుజువు చేస్తుంది. బైబిల్‌ను చదివిన, దానిని గురించి ఇతరులతో మాట్లాడగలిగిన వారందరూ మంచి సోదరసోదరీమణులు. ఇన్ని సంవత్సరాలుగా, ప్రభువుపై ప్రజల విశ్వాసాన్ని మరియు విధేయతను బైబిల్‌పై వారి అవగాహన కొలబద్దగా కొలిచారు. దేవుడిని ఎందుకు విశ్వసించాలో, దేవుడిని ఎలా విశ్వసించాలో చాలా మందికి అసలు అర్థం కాదు మరియు వారు బైబిల్ అధ్యాయాలను అవగతం చేసుకోవడానికి ఆధారాల కోసం గుడ్డిగా వెతకడం తప్ప ఏమీ చేయరు. ప్రజలు పవిత్ర ఆత్మ కార్యపు దిశను ఎన్నడూ అన్వేషించలేదు; జీవితమంతా, వారు బైబిల్‌ను ఆదుర్దాగా అధ్యయనం చేయడం మరియు పరిశోధించడం తప్ప మరేమీ చేయలేదు మరియు బైబిల్ బయట పరిశుద్ధాత్మ కొత్త కార్యమును ఎవరూ ఎప్పుడూ కనుగొనలేదు. బైబిల్ నుండి ఎవ్వరూ పక్కకు వెళ్లలేదు లేదా అలా చేసే సాహసం కూడా ఎప్పుడూ చేయలేదు. ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు బైబిల్‌ను అధ్యయనం చేశారు, వారు అనేక వివరణలను వెలుగులోకి తెచ్చారు మరియు ఎంతో పని చేసారు; వారిలో బైబిల్ గురించి అనేక భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి, వాటిని వారు అంతం లేకుండా చర్చిస్తారు, అది ఎంతగా అంటే రెండు వేలకు పైగా విభిన్న వర్గాలు నేడు ఏర్పడ్డాయి. వారందరూ బైబిల్‌లో కొన్ని ప్రత్యేక వివరణలు లేదా మరింత లోతైన మర్మాలను తెలుసుకోవాలని, వారు దానిని అన్వేషించాలని మరియు ఇశ్రాయేలులో యెహోవా చేసిన కార్యానికి నేపథ్యం లేదా యూదయలో యేసు చేసిన కార్యానికి నేపథ్యం లేదా మరెవరికీ తెలియని మరిన్ని దమర్మాలు కనుగొనాలని అనుకుంటున్నారు. బైబిల్‌ను చేరుకోవడానికి ప్రజల మార్గం మనోగ్రస్థత మరియు విశ్వాసంతో కూడి ఉంటుంది మరియు బైబిల్‌లోని అంతర్గత కథ లేదా సారం గురించి ఎవరూ పూర్తి స్పష్టతతో ఉండలేరు. కాబట్టి, బైబిల్ పరంగా చూస్తే ఈనాటికీ ఒక వివరించలేని ఆశ్చర్య భావం ప్రజలలో ఉంది మరియు వారు దాని గురించి ఇంకా ఎక్కువ మనోగ్రస్థులై ఉన్నారు మరియు దానిపై ఇంకా ఎక్కువ విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు, ప్రతి ఒక్కరూ బైబిల్‌లోని అంత్యకాలపు కార్యము గురించి భవిష్యవాణులను తెలుసుకోవాలనుకుంటున్నారు, అంత్యకాలములో దేవుడు చేసే కార్యము మరియు అంత్యకాలములో ఉండే సంకేతాలను అన్వేషించాలని వారు అనుకుంటున్నారు. ఈ విధంగా, బైబిల్ పట్ల వారి ఆరాధన మరింత తీవ్రంగా మారుతుంది మరియు అంత్యకాలము సమీపించేకొద్ది, మరీ ముఖ్యంగా అంత్యకాలము గురించి వారు బైబిల్ భవిష్యవాణులకు మరింత గుడ్డి విశ్వసనీయత ప్రదర్శిస్తారు. బైబిల్‌పై అంత గుడ్డి విశ్వాసంతో, బైబిల్‌పై అంత నమ్మకంతో, పరిశుద్దాత్మ కార్యము కావాలనే కోరిక వారికి ఉండదు. ప్రజల ఆలోచనలలో, బైబిల్ ఒక్కటే పరిశుద్ధాత్మ కార్యమును తీసుకురాగలదని వారు భావిస్తారు; బైబిల్‌లోనే వారు దేవుడి అడుగుజాడలను కనుగొనగలరు; బైబిల్‌లోనే దేవుడి కార్యపు మర్మాలు దాగి ఉన్నాయి; బైబిల్ తప్ప మరే ఇతర గ్రంథాలు లేదా వ్యక్తులు—దేవుడి గురించి సమస్తాన్ని మరియు ఆయన కార్యపు సంపూర్ణతను స్పష్టం చేయలేవు; బైబిల్ పరలోకపు కార్యాన్ని భూమి మీదకు తీసుకురాగలదు; మరియు బైబిల్ కాలాలను ప్రారంభించగలదు మరియు ముగించగలదనే ఆలోచనలతో, పరిశుద్ధాత్మ కార్యాన్ని అన్వేషించడానికి ప్రజలు ఏ మాత్రం మొగ్గు చూపరు. కాబట్టి, గతంలో బైబిల్ ప్రజలకు ఎంతగా సహాయడినప్పటికీ, ఇప్పుడది దేవుడి తాజా కార్యానికి అడ్డంకిగా మారింది. బైబిల్ లేకుంటే, దేవుడి అడుగుజాడల కోసం ప్రజలు మరెక్కడైనా శోధించగలరు, కానీ నేడు, ఆయన అడుగుజాడలను బైబిల్ తనలో ఇముడ్చుకుంది మరియు ఆయన తాజా కార్యాన్ని విస్తరించడం రెండింతలు కష్టమైంది మరియు సంకటంతో కూడిన పోరాటమైంది. దీనంతటికీ కారణం బైబిల్‌లోని ప్రముఖ అధ్యాయాలు మరియు ప్రవచనాలతో పాటు బైబిల్‌లోని వివిధ భవిష్యవాణులు. ప్రజల మనస్సులలో బైబిల్ ఒక విగ్రహమూర్తిగా మారింది, వారి మెదడులలో అది ఒక అర్థం కాని చిక్కుముడిగా మారింది మరియు బైబిల్ బయట దేవుడు పని చేయగలడని వారు అసలు విశ్వసించలేరు, బైబిల్ బయట ప్రజలు దేవుడిని కనుగొనగలరని వారు విశ్వసించలేరు, అంతిమ కార్యము సమయంలో దేవుడు బైబిల్ నుండి వైదొలగగలడని మరియు సరికొత్తగా ప్రారంభించగలడని వారు కనీసం విశ్వసించలేరు. ప్రజలకు ఇది ఊహించతరం కానిది; వారు దానిని విశ్వసించలేరు మరియు వారు దానిని ఊహించలేరు. దేవుడి నూతన కార్యాన్ని ప్రజలు అంగీకరించడంలో ఒక గొప్ప అవరోధంగా మరియు ఈ నూతన కార్యాన్ని దేవుడు విస్తృతపర్చడంలో ఇబ్బందిగా బైబిల్ తయారైంది. కాబట్టి, మీరు బైబిల్ అంతర్గత కథను అర్థం చేసుకోకపోతే, మీరు సువార్తను విజయవంతంగా వ్యాప్తి చేయలేరు లేదా మీరు నూతన కార్యానికి సాక్ష్యంగా ఉండలేరు. మీరు ఈ రోజు బైబిల్ చదవనప్పటికీ, మీరు ఇప్పటికీ దాని పట్ల అత్యంత ప్రీతిపాత్రంగా ఉన్నారు, అంటే, బైబిల్ మీ చేతులలో ఉండకపోవచ్చు, కానీ మీ ఆలోచనలలో అనేకం దాని నుండే వస్తాయి. మీరు బైబిల్ మూలాలు లేదా దేవుడి కార్యపు గత రెండు దశల గురించి అంతర్గత కథను అర్థం చేసుకోలేదు. మీరు తరచూ బైబిల్ చదవనప్పటికీ, మీరు తప్పక బైబిల్‌ను అర్థం చేసుకోవాలి, మీరు తప్పక బైబిల్ గురించి సరైన జ్ఞానాన్ని సాధించాలి మరియు ఈ విధంగా మాత్రమే మీరు దేవుడి ఆరువేల యేండ్ల నిర్వహణ ప్రణాళిక అంతా దేని గురించో తెలుసుకోగలరు. ప్రజల మనసులను గెలవడానికి, ఈ ప్రవాహమే నిజమైన మార్గమని వారు గుర్తించేలా చేయడానికి, ఈరోజు మీరు నడిచే మార్గమే సత్యమార్గమని, అది పరిశుద్ధాత్మచే మార్గనిర్దేశం చేయబడిందని మరియు దానిని మానవుడెవరూ ప్రారంభించలేదని వారు గుర్తించేలా చేయడానికి మీరు వీటిని ఉపయోగిస్తారు.
ధర్మశాస్త్ర యుగములో దేవుడు తన కార్యము చేసిన తర్వాత, పాత నిబంధన రూపొందించబడింది, దాని తర్వాతే ప్రజలు బైబిల్ చదవడం మొదలుపెట్టారు. యేసు రాక తర్వాత, ఆయన కృపా యుగం కార్యాన్ని చేశాడు మరియు ఆయన అపొస్తలులు కొత్త నిబంధనను రాసారు. ఈవిధంగా బైబిల్ పాత మరియు కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి మరియు నేటికి కూడా, దేవుడిని విశ్వసించే వారందరూ బైబిల్ చదువుతున్నారు. బైబిల్ అనేది ఒక చరిత్ర గ్రంథం. అయితే, ఇందులో ప్రవక్తలు చెప్పిన కొన్ని భవిష్యవాణులు కూడా ఉన్నాయి, అలాంటి భవిష్యవాణులను ఏ విధంగా చూసినప్పటికీ, అవి చరిత్ర కాదు. బైబిల్‌లో అనేక భాగాలు ఉన్నాయి—అందులో కేవలం భవిష్యవాణి లేదా యెహోవా కార్యము లేదా పౌలు లేఖలు మాత్రమే లేవు. బైబిల్‌లో ఎన్ని భాగాలు ఉన్నాయో నీవు తప్పక తెలుసుకోవాలి; పాత నిబంధనలో ఆదికాండము, నిర్గమకాండము…, మరియు ప్రవక్తలు రాసిన భవిష్యవాణుల గ్రంథాలు కూడా ఉన్నాయి. పాత నిబంధన మలాకీ గ్రంథంతో ముగుస్తుంది. ఇది యెహోవా నడిపించిన ధర్మశాస్త్ర యుగపు కార్యాన్ని నమోదు చేస్తుంది; ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు, ఇది ధర్మశాస్త్ర యుగములో జరిగిన సమస్త కార్యపు సమగ్రమైన నమోదుగా ఉంది. అంటే, ధర్మశాస్త్ర యుగంలో యెహోవాచే మార్గనిర్దేశం చేయబడిన వ్యక్తుల అనుభవాలన్నింటినీ పాత నిబంధన నమోదు చేస్తుంది. పాత నిబంధన సమయంలోని ధర్మశాస్త్ర యుగములో యెహోవాచే మేల్కొల్పబడిన అనేకమంది ప్రవక్తలు ఆయన గురించి భవిష్యవాణులు చెప్పారు, వారు వివిధ తెగలకు మరియు దేశాలకు సూచనలు ఇచ్చారు మరియు యెహోవా చేయబోయే కార్యాన్ని ముందుగానే చెప్పారు. మేల్కొల్పబడిన ఈ వ్యక్తులందరికీ భవిష్యవాణిని ప్రవచించే ఆత్మను యెహోవా ఇచ్చాడు: వారు యెహోవా నుండి వచ్చిన దర్శనాలను చూడగలిగారు మరియు ఆయన స్వరం వినగలిగారు, కాబట్టి వారు ఆయన నుండి ప్రేరణ పొందారు మరియు భవిష్యవాణులను రాసారు. వారు చేసిన కార్యము యెహోవా స్వరపు వ్యక్తీకరణ, యెహోవా భవిష్యవాణి వ్యక్తీకరణ మరియు ఆ సమయంలో యెహోవా కార్యము ఆత్మను ఉపయోగించి ప్రజలకు మార్గదర్శనం చేయడం మాత్రమే; ఆయన దేహధారిగా మారలేదు మరియు ప్రజలు ఆయన ముఖాన్ని ఏమాత్రం చూడలేదు. ఆవిధంగా, తన కార్యాన్ని చేయడానికి ఆయన అనేకమంది ప్రవక్తలను మేల్కొల్పాడు మరియు వారు ఇశ్రాయేలులోని ప్రతి తెగ మరియు వంశానికి అందించిన భవిష్యవాణులను వారికి ఆయన ఇచ్చాడు. వారి పని ప్రవచనాలు చెప్పడమే, మరికొంతమంది ఇతరులకు చూపించడం కోసం యెహోవా ఇచ్చిన సూచనలను రాసి పెట్టారు. ప్రజలు యెహోవా అద్భుతాన్ని మరియు జ్ఞానాన్ని చూడగలిగేలా, భవిష్యత్తు కార్యాన్ని లేదా ఆ సమయంలో ఇంకా చేయవలసిన కార్యాన్ని ముందుగానే చెప్పడానికి యెహోవా ఈ వ్యక్తులను మేల్కొల్పాడు. ఈ భవిష్యవాణి గ్రంథాలు బైబిల్‌లోని ఇతర గ్రంథాల కంటే చాలా భిన్నమైనవి; అవి యెహోవా ద్వారా భవిష్యవాణి చెప్పే ఆత్మ ఇవ్వబడిన వారు—ఆయన ద్వారా దర్శనాలు లేదా స్వరం పొందిన వారు చెప్పిన లేదా రాసిన మాటలు. భవిష్యవాణి గ్రంథాలు కాకుండా, పాత నిబంధనలోని తక్కినవన్నీ యెహోవా తన కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత వ్యక్తులు నమోదు చేసిన వాటితో రూపొందించబడిన గ్రంథాలు. ఆదికాండము మరియు నిర్గమకాండము అనేవి యెషయా గ్రంథము మరియు డేనియల్ గ్రంథముతో ఎలా పోల్చదగినవి కావో, సరిగ్గా అలాగే ఈ గ్రంథాలు యెహోవా మేల్కొల్పిన ప్రవక్తలు చెప్పిన వాటి ముందు నిలబడలేవు. కార్యము కొనసాగించబడడానికి ముందే భవిష్యవాణులు చెప్పబడ్డాయి; అదే సమయంలో, ఇతర గ్రంథాలు, కార్యము పూర్తయిన తర్వాత రాయగలిగిన వ్యక్తులచే రాయబడ్డాయి. ఆ కాలములోని ప్రవక్తలు యెహోవాచే ప్రేరేపించబడి, కొన్ని భవిష్యవాణులు చెప్పారు, వారు అనేక మాటలు చెప్పారు, మరియు కృపా యుగపు విషయాలతో పాటు—అంత్యకాలములో ప్రపంచ వినాశనం చేయాలని యెహోవా ప్రణాళిక చేసుకున్న కార్యము గురించి భవిష్యవాణి చెప్పారు. తక్కిన గ్రంథాలన్నీ ఇశ్రాయేలులో యెహోవా చేసిన కార్యాన్ని నమోదు చేశాయి. కాబట్టి, మీరు బైబిల్ చదివినప్పుడు, ఇశ్రాయేలులో యెహోవా చేసిన దాని గురించే మీరు ప్రధానంగా చదువుతున్నారు; బైబిల్‌లోని పాత నిబంధన ప్రధానంగా ఇజ్రాయెల్‌కు మార్గనిర్దేశం చేసే యెహోవా కార్యాన్ని నమోదు చేస్తుంది, అంటే ఫరో సంకెళ్ళ నుండి ఇశ్రాయేలీయులను తప్పించి ఈజిప్టు నుండి బయటికి నడిపించిన మోషేను ఆయన ఉపయోగించడం, వారిని మరుభూమిలోనికి తీసుకెళ్లడం, ఆపైన వారు కనానులోకి ప్రవేశించడం మరియు దీని తరువాత కనానులో వారి జీవితంలో జరిగిన ప్రతిదాన్నీ నమోదు చేస్తుంది. ఇదే కాకుండా ఇశ్రాయేలు అంతటా యెహోవా చేసిన కార్యాన్ని గురించి చేసిన నమోదులు ఇందులో ఉన్నాయి. పాత నిబంధనలో నమోదు చేయబడిన ప్రతి ఒక్కటీ ఇశ్రాయేలులో యెహోవా చేసిన కార్యమే, ఇది యెహోవా ఆదాము మరియు హవ్వలను సృష్టించిన భూమిలో ఆయన చేసిన కార్యము. నోవహు తర్వాత దేవుడు అధికారికంగా భూమిపై ప్రజలను నడిపించడం ప్రారంభించినప్పటి నుండి, పాత నిబంధనలో నమోదు చేయబడినదంతా ఇశ్రాయేలులో జరిగిన కార్యమే. ఇశ్రాయేలు బయట జరిగిన ఏ కార్యము ఎందుకు నమోదు చేయబడలేదు? ఎందుకంటే, ఇశ్రాయేలు దేశం మానవజాతి పుట్టినచోటు. ప్రారంభంలో, ఇశ్రాయేలు తప్ప వేరే దేశాలేవీ లేవు మరియు యెహోవా మరే ప్రదేశంలో కార్యము చేయలేదు. ఈవిధంగా, బైబిల్ పాత నిబంధనలో నమోదు చేయబడినదంతా ఆ కాలములో ఇశ్రాయేలులో దేవుడు చేసిన కార్యము మాత్రమే. ప్రవక్తలైన యెషయా, దానియేలు, యిర్మీయా మరియు యెహెజ్కేలు చెప్పిన మాటలు … భూమిపై ఆయన చేసే ఇతర కార్యాన్ని ముందుగానే చెప్పే మాటలు, అవి స్వయంగా యెహోవా దేవుడి కార్యాన్ని ముందుగానే చెప్తాయి. ఇదంతా దేవుడి నుండే వచ్చింది, ఇది పరిశుద్ధాత్మ కార్యము మరియు ఈ ప్రవక్తల గ్రంథాలు కాకుండా, తక్కినవన్నీ ఆ కాలములో తాము అనుభవించిన యెహోవా కార్యాన్ని గురించి వ్యక్తులు నమోదు చేసిన విషయాలే.
మానవజాతి ఉనికికి ముందే సృష్టి కార్యము జరిగింది, కానీ మానవజాతి ఉనికి తర్వాత మాత్రమే ఆదికాండ గ్రంథం వచ్చింది; ఇది ధర్మశాస్త్ర యుగములో మోషే రాసిన గ్రంథం. ఇది ఈరోజు మీ మధ్య జరిగే పనుల లాంటిదే: పనులు జరిగిన తర్వాత, భవిష్యత్తులో ప్రజలకు చూపించడానికి మీరు వాటిని రాసి పెడతారు మరియు భవిష్యత్తు ప్రజల కోసం మీరు నమోదు చేసినవి గత కాలాలలో జరిగిన విషయాలే—అవి చరిత్రను మించి మరేమీ కాదు. పాత నిబంధనలో నమోదు చేసిన విషయాలు ఇశ్రాయేలులో యెహోవా చేసిన కార్యమే, అదే కొత్త నిబంధనలో నమోదు చేసినది కృపా యుగములో యేసు చేసిన కార్యము; రెండు విభిన్న కాలాలలో దేవుడు చేసిన కార్యాన్ని వారు నమోదు చేశారు. ధర్మశాస్త్ర యుగములో దేవుడి కార్యాన్ని పాత నిబంధన నమోదు చేస్తుంది, కాబట్టి పాత నిబంధన ఒక చారిత్రక గ్రంథం, అదే కొత్త నిబంధన కృపా యుగములోని కార్యపు ఉత్పత్తి. కొత్త కార్యము ప్రారంభమైనప్పుడు, కొత్త నిబంధన కూడా పాతది అయ్యింది—కాబట్టి, కొత్త నిబంధన కూడా ఒక చారిత్రక గ్రంథమే. నిజానికి, కొత్త నిబంధన పాత నిబంధన లాగా క్రమబద్ధమైనది కాదు, అది అనేక విషయాలను కూడా నమోదు చేయదు. బైబిల్‌లోని పాత నిబంధనలో యెహోవా చెప్పిన అనేక మాటలన్నీ నమోదు చేయబడ్డాయి, అదే యేసు చెప్పిన కొన్ని మాటలు మాత్రమే నాలుగు సువార్తలలో నమోదు చేయబడ్డాయి. నిజానికి, యేసు కూడా చాలా కార్యాన్ని చేశాడు, కానీ అది సవివరంగా నమోదు చేయబడలేదు. యేసు ఎంత కార్యము చేశాడనేది కొత్త నిబంధనలో తక్కువగా నమోదు చేయబడింది; భూమిపై మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన కార్యము మరియు అపొస్తలుల కార్యము యెహోవా చేసిన కార్యము కంటే చాలా తక్కువ. ఆవిధంగా, పాత నిబంధనలో కంటే కొత్త నిబంధనలో తక్కువ గ్రంథాలు ఉన్నాయి.
బైబిల్ ఏ రకమైన గ్రంథం? పాత నిబంధన అనేది ధర్మశాస్త్ర యుగములో దేవుడు చేసిన కార్యము. బైబిల్‌లోని పాత నిబంధన న్యాయకాలము సమయంలో యెహోవా కార్యాన్ని మరియు ఆయన సృష్టి కార్యాన్నంతా నమోదు చేస్తుంది. అది నమోదు చేసినదంతా యెహోవా చేసిన కార్యమే మరియు అది అంతిమంగా యెహోవా కార్య వృత్తాంతాలతో కూడిన మలాకీ గ్రంథంతో ముగుస్తుంది. పాత నిబంధన దేవుడు చేసిన కార్యపు రెండు భాగాలను నమోదు చేస్తుంది: ఒకటి సృష్టి కార్యము, మరొకటి చట్టాన్ని అమలు చేయడం. ఈ రెండూ కూడా యెహోవా చేసిన కార్యాలే. న్యాయకాలము యెహోవా దేవుడి నామమున జరిగిన కార్యాన్ని సూచిస్తుంది; ఇదంతా ప్రధానంగా యెహోవా నామముతో కొనసాగించబడిన సమస్త కార్యము. ఈవిధంగా, పాత నిబంధన యెహోవా కార్యాన్ని నమోదు చేస్తుంది మరియు కొత్త నిబంధన యేసు కార్యాన్ని నమోదు చేస్తుంది, ఈ కార్యము ప్రధానంగా యేసు నామముతో కొనసాగించబడింది. కొత్త నిబంధనలో యేసు నామము ప్రాముఖ్యత మరియు ఆయన చేసిన కార్యము చాలా ఎక్కువగా నమోదు చేయబడ్డాయి. ధర్మశాస్త్ర యుగంలో, అంటే, పాత నిబంధన యుగంలో, యెహోవా ఇశ్రాయేలులో దేవాలయం మరియు బలిపీఠాన్ని నిర్మించాడు, ఇశ్రాయేలీయులు తాను ఎంచుకున్న ప్రజలనీ, భూమిపై తాను ఎంచుకున్న మొదటి సమూహమనీ, వారు తన హృదయానికి దగ్గరివారనీ, తాను స్వయంగా నడిపించిన మొదటి సమూహమనీ రుజువు చేస్తూ, ఇశ్రాయేలీయుల జీవితానికి యెహోవా మార్గనిర్దేశం చేశాడు. ఇశ్రాయేలులోని పన్నెండు తెగలు యెహోవా మొదట ఎంచుకున్నవి, కాబట్టి ధర్మశాస్త్ర యుగంలో యెహోవా కార్యము ముగిసే వరకు ఆయన ఎల్లప్పుడూ వారిలో పనిచేశాడు. కార్యపు రెండవ దశ కొత్త నిబంధనలోని కృపా యుగపు కార్యము, ఇది ఇశ్రాయేలులోని పన్నెండు తెగలలో ఒకటైన యూదుల మధ్య కొనసాగింది. ఈ కార్యపు పరిధి తక్కువగానే ఉంది, ఎందుకంటే యేసు దేహధారిగా మారిన దేవుడు. యేసు కేవలం యూదయ భూభాగమంతటా పనిచేశాడు మరియు ఆయన మూడున్నర సంవత్సరాలు మాత్రమే తన కార్యాన్ని చేశాడు; కాబట్టి, కొత్త నిబంధనలో నమోదు చేయబడిన కార్యము పాత నిబంధనలో నమోదు చేయబడిన కార్యము మొత్తాన్ని అధిగమించలేకపోయింది. కృపా యుగంలోని యేసు కార్యము ప్రధానంగా నాలుగు సువార్తలలో నమోదు చేయబడింది. కృపా యుగపు ప్రజలు నడిచిన మార్గం వారి జీవిత స్వభావములో చాలా పైపై మార్పులతో కూడినది, వీటిలో చాలా వరకు లేఖలలో నమోదు చేయబడ్డాయి. పరిశుద్ధాత్మ ఆ సమయంలో ఎలా పనిచేసిందో లేఖలు చూపిస్తాయి. (వాస్తవానికి, పౌలు శిక్షించబడ్డాడా లేదా దురదృష్టంతో కూల్చబడ్డాడా అనే దానితో సంబంధం లేకుండా, అతని కార్యములో అతను పరిశుద్ధాత్మచే నిర్దేశించబడ్డాడు, ఆ సమయంలో అతడిని పరిశుద్ధాత్మ ఉపయోగించుకుంది; పేతురును కూడా పరిశుద్ధాత్మ ఉపయోగించుకుంది, కానీ అతను పౌలు చేసినంత పని చేయలేదు. పౌలు పనిలో మానవుని కల్మషాలు ఉన్నప్పటికీ, పౌలు రాసిన లేఖల ద్వారా ఆ సమయంలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేసిందో చూడవచ్చు. పౌలు నడిపించిన మార్గం మంచిది, అది సరైనది మరియు అది పరిశుద్ధాత్మ మార్గం.)
నీవు ధర్మశాస్త్రయుగపు కార్యాన్ని చూడాలనుకుంటే మరియు ఇశ్రాయేలీయులు యెహోవా మార్గాన్ని ఎలా అనుసరించారో చూడాలనుకుంటే, నీవు తప్పక పాత నిబంధనను చదవాలి; కృపా యుగపు కార్యాన్ని నీవు అర్థం చేసుకోవాలనుకుంటే, నీవు తప్పక కొత్త నిబంధనను చదవాలి. అయితే అంత్యకాలపు కార్యాన్ని నీవు ఎలా చూస్తావు? నీవు నేటి దేవుడి నాయకత్వాన్ని తప్పక అంగీకరించాలి మరియు నేటి కార్యము లోనికి ప్రవేశించాలి, ఎందుకంటే ఇది కొత్త కార్యము మరియు దీనిని ఇంతకు ముందు ఎవరూ బైబిల్‌లో నమోదు చేయలేదు. ఈనాడు, దేవుడు దేహధారిగా మారాడు మరియు చైనాలో ఎంపిక చేసిన ఇతర వ్యక్తులను ఎంచుకున్నాడు. దేవుడు ఈ వ్యక్తులలో పని చేస్తాడు, ఆయన భూమిపై తన కార్యాన్ని కొనసాగిస్తాడు మరియు కృపా యుగపు కార్యము నుండి కొనసాగిస్తాడు. ఈనాటి కార్యము మనిషి ఇంతకు ముందెన్నడూ నడవని మార్గం మరియు ఇంతవరకు ఎవ్వరూ చూడని మార్గం. ఇది ముందెన్నడూ చేయని కార్యము—ఇది భూమిపై దేవుడి తాజా కార్యము. కాబట్టి, ఇంతకు ముందెన్నడూ చేయని కార్యము చరిత్ర కాదు, ఎందుకంటే ఇప్పుడంటే ఇప్పుడే మరియు ఇంకా గతంగా మారలేదు. దేవుడు భూమిపై, ఇశ్రాయేలు బయట ఎంతో గొప్ప, సరికొత్త కార్యము చేశాడనీ, ఇది ఇప్పటికే ఇజ్రాయెల్ పరిధిని దాటిపోయిందనీ మరియు ప్రవక్తల భవిష్యవాణులను మించిపోయిందనీ, ఇది భవిష్యవాణులకు బయట కొత్త మరియు అద్భుతమైన కార్యమనీ మరియు ప్రజలు గ్రహించలేని లేదా ఊహించలేని కార్యమనీ ప్రజలకు తెలియదు. అలాంటి కార్యపు స్పష్టమైన నమోదులు బైబిల్‌లో ఎలా ఉండగలవు? నేటి కార్యపు ప్రతి చిన్న అంశాన్ని, తప్పిపోకుండా, ముందుగానే ఎవరు నమోదు చేయగలిగారు? ఆ బూజుపట్టిన పాత గ్రంథంలో, సాంప్రదాయాన్ని ధిక్కరించే ఈ శక్తివంతమైన, వివేకవంతమైన కార్యాన్ని ఎవరు నమోదు చేయగలిగారు? నేటి కార్యము చరిత్ర కాదు, అందుచేత, నీవు నేటి కొత్త మార్గంలో నడవాలనుకుంటే, నీవు బైబిల్ నుండి తప్పక వైదొలగాలి, నీవు బైబిల్‌లోని భవిష్యవాణులు లేదా చరిత్ర గ్రంథాలను దాటి వెళ్ళాలి. అప్పుడే నీవు కొత్త మార్గంలో సరిగ్గా నడవగలవు, అప్పుడే నీవు కొత్త రాజ్యం లోనికి, కొత్త కార్యము లోనికి ప్రవేశించగలవు. ఈరోజు, నిన్ను బైబిల్ చదవవద్దని ఎందుకు కోరుతున్నారో, బైబిల్ నుండి వేరుగా మరొక కార్యము ఎందుకు ఉందో, బైబిల్‌లో కొత్త, మరింత సవివరమైన ఆచరణ కోసం దేవుడు ఎందుకు చూడలేదో మరియు దానికి బదులు బైబిల్ బయట శక్తివంతమైన పని ఎందుకు ఉందో నీవు తప్పక అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవాల్సిదంతా ఇదే. నీవు పాత మరియు కొత్త కార్యము మధ్య తేడాను తప్పక అర్థం చేసుకోవాలి మరియు నీవు బైబిల్ చదవకపోయినా, నీవు దానిని విడదీసి చూడగలగాలి; అలా చేయకపోతే, నీవు ఇప్పటికీ బైబిల్‌నే ఆరాధిస్తావు మరియు నీవు కొత్త కార్యంలోనికి ప్రవేశించడం మరియు కొత్త మార్పులకు లోనవడం కష్టమవుతుంది. ఉన్నత మార్గం ఉంది కాబట్టి, ఆ తక్కువైన, కాలం చెల్లిన మార్గాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? సరికొత్త మాటలు మరియు సరికొత్త కార్యము ఉంది కాబట్టి, పాత చారిత్రక నమోదుల మధ్య ఎందుకు జీవించాలి? కొత్త మాటలు, ఇది కొత్త కార్యము అని నీకు రుజువు చేయగలవు; పాత నమోదులు నిన్ను తృప్తిపరచలేవు లేదా నీ ప్రస్తుత అవసరాలను సంతృప్తిపర్చలేవు, అవి చరిత్ర అని రుజువు చేస్తాయి మరియు ఇక్కడి, ఇప్పటి కార్యాన్ని కాదు. అతి ఉన్నమైన మార్గం ఈ సరికొత్త కార్యము మరియు కొత్త కార్యముతో, గతం ఎంత ఉన్నతమైనది అయినప్పటికీ, అది ప్రజలు వెనక్కి తిరిగి చూసే చరిత్ర మాత్రమే మరియు పరిశీలనకు దాని విలువ ఎంత ఉన్నప్పటికీ, అది ఇంకా పాత మార్గమే. ఇది “పవిత్ర గ్రంథం”లో నమోదు చేయబడినప్పటికీ, పాత మార్గం అనేది ఒక చరిత్ర; “పవిత్ర గ్రంథం”లో ఎలాంటి నమోదు లేనప్పటికీ, కొత్త మార్గం ఇక్కడ, ఇప్పుడు ఉంది. ఈ మార్గం నిన్ను రక్షించగలదు మరియు ఈ మార్గం నిన్ను మార్చగలదు, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ కార్యము.
మీరు బైబిల్‌ను తప్పక అర్థం చేసుకోవాలి—ఈ పని అత్యావశ్యకం! ఈనాడు, నీవు బైబిల్‌ను చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో కొత్త అంటూ ఏమీ లేదు; అదంతా పాతది. బైబిల్ ఒక చారిత్రక గ్రంథం, నీవు కృపాకాలములో పాత నిబంధనను తిని సేవించి ఉంటే—నీవు కృపాకాలములోని పాత నిబంధన సమయంలో అవసరమైన వాటిని ఆచరించి ఉంటే—యేసు నిన్ను తిరస్కరించి, ఖండించి ఉండేవాడు; నీవు యేసు కార్యానికి పాత నిబంధనను వర్తింపజేసి ఉంటే, నీవు పరిసయ్యుడవై ఉండేవాడివి. ఈనాడు, నీవు తినడానికి, సేవించడానికి మరియు ఆచరించడానికి పాత మరియు కొత్త నిబంధనను ఒకచోట కలిపితే, అప్పుడు ఈనాటి దేవుడు నిన్ను ఖండిస్తాడు; నీవు ఈనాటి పరిశుద్ధాత్మ కార్యములో వెనుకబడి ఉండేవారు! నీవు పాత మరియు కొత్త నిబంధనను తిని సేవిస్తే, అప్పుడు నీవు పరిశుద్ధాత్మ ప్రవాహానికి వెలుపల ఉంటావు! యేసు కాలంలో, యేసు యూదులను మరియు ఆయనను అనుసరించిన వారందరినీ ఆ సమయంలో తనలోని పరిశుద్ధాత్మ కార్యము ప్రకారం నడిపించాడు. ఆయన చేసిన దానికి బైబిల్‌ను ఆధారంగా తీసుకోలేదు, కానీ తన కార్యము ప్రకారం మాట్లాడాడు; బైబిల్‌లో చెప్పిన దానిని ఆయన పట్టించుకోలేదు లేదా తన అనుచరులను నడిపించే మార్గం కోసం ఆయన బైబిల్‌లో వెతకలేదు. ఆయన కార్యము చేయడం ప్రారంభించిన క్షణం నుండి, ఆయన పశ్చాత్తాప మార్గాన్ని వ్యాపింపజేశాడు—ఈ మార్గాన్ని గురించి పాత నిబంధన భవిష్యవాణులలో అస్సలు ఒక్క పదం కూడా లేదు. ఆయన బైబిల్ ప్రకారం నడుచుకోకపోవడమే కాకుండా, ఆయన ఒక కొత్త మార్గంలో నడిపించాడు మరియు కొత్త కార్యము చేశాడు. బోధించేటప్పుడు ఆయన ఎప్పుడూ బైబిల్‌ను ప్రస్తావించలేదు. ధర్మశాస్త్ర యుగంలో, రోగులను స్వస్థపరిచే మరియు దయ్యాలను వదిలించే ఆయన అద్భుతాలను ఎవరూ ఎప్పుడూ చేయలేకపోయారు. అలాగే, ఆయన కార్యము, ఆయన బోధనలు మరియు ఆయన మాటల అధికారం మరియు శక్తి ధర్మశాస్త్ర యుగంలో ఏ మనిషికీ లేనివి. యేసు కేవలం తన సరికొత్త కార్యాన్ని చేశాడు, చాలా మంది బైబిల్ ఉపయోగించి ఆయనను ఖండించినప్పటికీ—మరియు ఆయనను సిలువ వేయడానికి కూడా పాత నిబంధనను ఉపయోగించినప్పటికీ—ఆయన కార్యము పాత నిబంధనను అధిగమించింది; అది అలా కాకపోతే, ప్రజలు ఆయనను సిలువకు ఎందుకు వేలాడదీశారు? ఇది ఆయన బోధన గురించి పాత నిబంధనలో ఏమీ చెప్పనందున మరియు రోగులను స్వస్థపరిచే మరియు దయ్యాలను వదిలించే ఆయన సామర్థ్యం వలన కాదా? ఆయన కార్యము కొత్త మార్గంలో నడిపించడానికి జరిగింది, అది ఉద్దేశపూర్వకంగా బైబిల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి లేదా పాత నిబంధనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడానికి కాదు. ఆయన కేవలం తన పరిచర్యను నిర్వహించడానికి, ఆయన కోసం ఆరాటపడే మరియు తపించే వారికి కొత్త కార్యము తీసుకురావడానికి వచ్చాడు. ఆయన పాత నిబంధనను వివరించడానికి లేదా దాని కార్యాన్ని సమర్థించడానికి రాలేదు. ఆయన కార్యము ధర్మశాస్త్ర యుగము అభివృద్ధి కొనసాగేలా చేయడానికి కాదు, ఎందుకంటే ఆయన కార్యము బైబిల్‌పై ఆధారపడి ఉందా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు; యేసు కేవలం తాను చేయాల్సిన కార్యాన్ని చేయడం కోసమే వచ్చాడు. కాబట్టి, ఆయన పాత నిబంధనలోని భవిష్యవాణులను వివరించలేదు, అంతేగాకుండా పాత నిబంధన అనేది ధర్మశాస్త్ర యుగం వాక్కుల ప్రకారం పని చేయలేదు. ఆయన పాత నిబంధనలో చెప్పిన దానిని విస్మరించాడు, అది తన కార్యాన్ని అంగీకరిస్తుందా, అంగీకరించదా అని ఆయన పట్టించుకోలేదు మరియు ఇతరులకు ఆయన కార్యము గురించి ఏమి తెలుసు లేదా వారు దానిని ఎలా ఖండించారు అనే దానిని పట్టించుకోలేదు. ఆయనను ఖండించడానికి పాతనిబంధనలోని ప్రవక్తల భవిష్యవాణులను చాలా మంది ఉపయోగించినప్పటికీ, ఆయన తాను చేయవలసిన కార్యాన్ని చేస్తూ పోయాడు. ఆయన కార్యానికి ఎటువంటి ఆధారం లేనట్లు మరియు పాత నిబంధన నమోదులకు చాలా విరుద్ధంగా ఉన్నట్లు ప్రజలకు అనిపించింది. ఇది మనిషి పొరపాటు కాదా? దేవుడి కార్యానికి సిద్ధాంతాన్ని వర్తింపజేయాల్సిన అవసరం ఉందా? దేవుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యవాణుల ప్రకారం పని చేయాలా? అసలు, ఎవరు గొప్ప: దేవుడా లేక బైబిలా? దేవుడు తప్పక బైబిల్ ప్రకారం ఎందుకు పని చేయాలి? బైబిల్‌ను అధిగమించే హక్కు దేవుడికి లేదా? దేవుడు బైబిల్ నుండి వైదొలిగి వేరే కార్యము చేయలేడా? యేసు మరియు ఆయన శిష్యులు షబ్బత్‌ను ఎందుకు పాటించలేదు? ఆయన షబ్బత్ దృష్టితో మరియు పాత నిబంధన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవలసి ఉంటే, యేసు వచ్చిన తర్వాత ఆయన షబ్బత్‌ను ఎందుకు పాటించలేదు, దానికి బదులుగా కాళ్ళు కడుక్కొని, తలను కప్పుకుని, రొట్టె విరిచి, ద్రాక్ష సారాయి ఎందుకు తాగాడు? ఇవన్నీ పాత నిబంధన ఆజ్ఞలలో లేనివి కావా? యేసు పాత నిబంధనను గౌరవించి ఉంటే, ఆయన ఆ సిద్ధాంతాలను ఎందుకు భంగపరిచాడు? ఎవరు ముందు వచ్చారో నీవు తెలుసుకోవాలి, దేవుడా లేక బైబిలా? షబ్బత్‌కు ప్రభువు అయినందున, ఆయన బైబిల్‌కు కూడా ప్రభువు కాలేడా?
కొత్త నిబంధన సమయంలో యేసు చేసిన పని కొత్త కార్యాన్ని ప్రారంభించింది: ఆయన పాత నిబంధనలోని కార్యము ప్రకారం పని చేయలేదు, అంతేగాకుండా ఆయన పాత నిబంధనలోని యెహోవా వాక్కులను వర్తింపజేయలేదు. ఆయన తన కార్యాన్ని చేశాడు, ఆయన కొత్త కార్యాన్ని చేశాడు మరియు అది చట్టం కంటే ఉన్నతమైన కార్యము చేశాడు. అందుకే, ఆయన ఇలా చెప్పాడు: “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు: నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.” కాబట్టి, ఆయన సాధించిన దానికి అనుగుణంగా, చాలా సిద్ధాంతం భంగపర్చబడింది. షబ్బత్ రోజున ఆయన శిష్యులను ధాన్యపు పొలాల గుండా తీసుకువెళ్లినప్పుడు, వారు ధాన్యపు కంకులను తీసుకొని తిన్నారు; ఆయన షబ్బత్‌ను పాటించలేదు, మరియు “మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను.” ఆ సమయంలో, ఇశ్రాయేలీయుల నియమాల ప్రకారం, షబ్బత్‌ను పాటించని వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుతారు. అయితే, యేసు దేవాలయంలోకి ప్రవేశించనూలేదు, అలాగే షబ్బత్‌ను పాటించనూలేదు మరియు ఆయన కార్యము పాత నిబంధన సమయంలోని యెహోవా చేత చేయబడలేదు. కాబట్టి, యేసు చేసిన కార్యము పాత నిబంధన చట్టాన్ని అధిగమించింది, అది దాని కంటే ఉన్నతమైనది మరియు అది దాని ప్రకారం లేదు. కృపా యుగము సమయంలో, యేసు పాత నిబంధన చట్టం ప్రకారం పని చేయలేదు మరియు ఆ సిద్ధాంతాలను అప్పటికే ఆయన భంగపరిచాడు. కానీ ఇశ్రాయేలీయులు బైబిల్‌ను విపరీతంగా పట్టుకుని వేలాడారు మరియు యేసును ఖండించారు—ఇది యేసు కార్యాన్ని తిరస్కరించడం కాదా? ఈనాడు, మతపరమైన ప్రపంచం కూడా బైబిల్‌ను విపరీతంగా పట్టుకుని వేలాడుతుంది, కొంతమంది “బైబిల్ పవిత్ర గ్రంథం, దానిని తప్పక చదవాలి” అని అంటారు. కొంతమంది “దేవుడి కార్యాన్ని ఎప్పటికీ నిలబెట్టాలి, పాత నిబంధన ఇశ్రాయేలీయులతో దేవుడు చేసుకున్న అంగీకారం మరియు దానిని వదిలివేయలేము మరియు షబ్బత్‌ను ఎల్లప్పుడూ తప్పక ఆచరించాలి” అని అంటారు! వారు హాస్యాస్పదులు కారా? యేసు షబ్బత్‌ను ఎందుకు పాటించలేదు? ఆయన పాపం చేస్తున్నాడా? అలాంటి విషయాలను ఎవరు పూర్తిగా అర్థం చేసుకోగలరు? బైబిల్‌ను ప్రజలు ఎలా చదివినప్పటికీ, వారి గ్రహింపు శక్తిని ఉపయోగించి దేవుడి కార్యాన్ని తెలుసుకోవడం అసాధ్యం. వారు దేవుడి గురించి సంపూర్ణ జ్ఞానాన్ని పొందకపోవడమే కాకుండా, వారి ఆలోచనలు ఎప్పుడూ లేనంత ఘోరమైనవిగా మారుతాయి, ఎంతగా అంటే వారు దేవుడిని వ్యతిరేకించడం ప్రారంభిస్తారు. ఈనాడు దేవుడు శరీరధారిగా అవతరించకుంటే, ప్రజలను వారి సొంత ఆలోచనలే నాశనం చేస్తాయి మరియు వారు దేవుడి శిక్షల మధ్య మరణిస్తారు.