బైబిల్ పరిచయం (2)
బైబిల్‌ను పాత మరియు కొత్త నిబంధన అని కూడా పిలుస్తారు. “నిబంధన” అనేది దేనిని ప్రస్తావిస్తుందో మీకు తెలుసా? పాత నిబంధనలోని “నిబంధన” అనేది యెహోవా ఈజిప్షియన్లను చంపి, ఇశ్రాయేలీయులను ఫరోల నుండి రక్షించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చేసుకున్న ఒడంబడిక నుండి అది వచ్చింది. వాస్తవానికి, ఈ ఒడంబడికకు రుజువు అడ్డ దూలానికి గొర్రెపిల్ల రక్తాన్ని పూయడం, దేవుడు మనిషితో చేసుకున్న ఒడంబడికలో ఒకదాని ప్రకారం, దర్వాజ పైభాగం మరియు ప్రక్క భాగాలకు గొర్రెపిల్ల రక్తం పూయబడిన వారందరూ ఇశ్రాయేలీయులే అనీ, వారు దేవుడు ఎంచుకున్న ప్రజలనీ మరియు వారందరూ యెహోవాచే రక్షించబడతారనీ (ఎందుకంటే, అప్పుడు యెహోవా ఈజిప్టులోని జ్యేష్ఠ కుమారులందరినీ మరియు గొర్రెలు మరియు పశువుల జ్యేష్ఠ సంతానాన్ని అన్నింటినీ చంపబోతున్నాడనీ) చెప్పబడింది. ఈ ఒడంబడికకు రెండు స్థాయిల అర్థాలు ఉన్నాయి. ఈజిప్టు ప్రజలు లేదా పశువులు వేటిని కూడా యెహోవా వదిలిపెట్టడు; ఆయన వారి జ్యేష్ఠ కుమారులందరినీ మరియు గొర్రెలు మరియు పశువుల జ్యేష్ఠ సంతానం అన్నింటినీ చంపేస్తాడు. ఆవిధంగా, యెహోవా ఒడంబడిక కారణంగా ఈజిప్షియన్లు తీవ్రంగా శిక్షించబడతారని అనేక భవిష్యవాణి గ్రంథాలలో ముందే చెప్పబడింది. ఇది ఒడంబడిక మొదటి స్థాయి అర్థం. యెహోవా ఈజిప్టులోని జ్యేష్ట కుమారులను మరియు పశువుల జ్యేష్ట సంతానం అన్నింటినీ చంపాడు, ఆయన ఇశ్రాయేలీయులందరినీ విడిచిపెట్టాడు, అంటే ఇశ్రాయేలు దేశ వాసులందరూ యెహోవా ప్రేమను పొందారు మరియు అందరూ రక్షించబడ్డారు; ఆయన వారిలో దీర్ఘకాలిక కార్యము చేయాలని అనుకున్నాడు, గొర్రె రక్తాన్ని ఉపయోగించి వారితో ఒడంబడికను చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి, యెహోవా ఇశ్రాయేలీయులను చంపడు, మరియు వారు ఎప్పటికీ తాను ఎంచుకున్నవారుగా ఉంటారని చెప్పాడు. ఇశ్రాయేలులోని పన్నెండు తెగలలో, ఆయన ధర్మశాస్త్ర యుగము యావత్తు కోసం తన కార్యాన్ని ప్రారంభిస్తాడు, ఆయన తన చట్టాలన్నింటినీ ఇశ్రాయేలీయులకు బహిరంగపరుస్తాడు, వారిలో నుండి ప్రవక్తలను మరియు న్యాయమూర్తులను ఎంచుకుంటాడు మరియు వారు ఆయన కార్యమునకు కేంద్రంగా ఉంటారు. యెహోవా వారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు: కాలము మారితే తప్ప, ఎంచుకున్న వారి మధ్యలో మాత్రమే ఆయన కార్యము చేస్తాడు. యెహోవా ఒడంబడిక మార్చలేనిది, ఎందుకంటే అది రక్తంతో చేయబడింది మరియు ఆయన ఎంచుకున్న వారితో చేసుకోబడింది. మరీ ముఖ్యంగా, ఆయన యావత్తు కాలానికి తన కార్యాన్ని ప్రారంభించేందుకు తగిన పరిధిని మరియు లక్ష్యాన్ని ఎంచుకున్నాడు, కాబట్టి ఒడంబడికను ప్రజలు ఎంతో ముఖ్యమైనదిగా చూశారు. ఇదే ఒడంబడిక ద్వితీయ స్థాయి అర్థం. ఒడంబడిక చేసుకోవడానికి ముందున్న ఆదికాండము మినహా, పాత నిబంధనలోని ఇతర గ్రంథాలన్నీ ఒడంబడిక చేసుకున్న తర్వాత ఇశ్రాయేలీయుల మధ్య దేవుడి కార్యాన్ని నమోదు చేశాయి. అయితే, అన్యుల గురించి అక్కడక్కడ వివరణలు ఉన్నాయి, కానీ మొత్తంగా చూస్తే, పాత నిబంధన అనేది ఇశ్రాయేలులో దేవుడి కార్యాన్ని లిఖితపరుస్తుంది. ఇశ్రాయేలీయులతో యెహోవా ఒడంబడిక చేసుకోవడం వల్ల, న్యాయకాలము సమయంలో రాసిన గ్రంథాలను పాత నిబంధన అని పిలుస్తారు. ఇశ్రాయేలీయులతో యెహోవా ఒడంబడిక చేసుకున్న తర్వాత వాటికి పేరు పెట్టారు.
యేసు సిలువపై రక్తం చిందించి, ఆయనను విశ్వసించిన వారందరితో ఆయన ఒడంబడిక చేసుకున్న తర్వాత కొత్త నిబంధనకు పేరు పెట్టారు. యేసు ఒడంబడిక ఇది: ఆయన రక్తం చిందించడం వల్ల వారి పాపాలు క్షమించబడటానికి ప్రజలు ఆయనను విశ్వసించవలసి వచ్చింది, ఆవిధంగా వారు రక్షించబడతారు, ఆయన చేత పునర్జన్మ పొందుతారు మరియు ఇక ఏమాత్రం పాపులుగా ఉండరు; ప్రజలు ఆయన కృపను పొందేందుకు మరియు వారు మరణించిన తర్వాత నరకంలో బాధపడకుండా ఉండటానికి ఆయనను విశ్వసించవలసి వచ్చింది. కృపా యుగము సమయంలో రాసిన గ్రంథాలన్నీ ఈ ఒడంబడిక తర్వాత వచ్చాయి మరియు అవన్నీ వాటిలో ఉన్న కార్యాన్ని మరియు మాటలను లిఖితం చేశాయి. అవి ప్రభువైన యేసును సిలువ వేయడం లేదా ఒడంబడిక రక్షణను మించి ముందుకు వెళ్లవు; అవన్నీ అనుభవాలు పొందిన ప్రభువును విశ్వసించిన సోదరులు రాసిన గ్రంథాలు. కాబట్టి, ఈ గ్రంథాలకు కూడా ఒడంబడిక తర్వాతే పేరు పెట్టారు: వాటిని కొత్త నిబంధన అంటారు. ఈ రెండు నిబంధనలలో ధర్మశాస్త్ర యుగము మరియు కృపా యుగము గురించి మాత్రమే ఉంది మరియు అంత్యకాలముతో వాటికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి, అంత్యకాలములోని నేటి ప్రజలకు బైబిల్ పెద్దగా ఉపయోగపడదు. మహా అయితే, అది తాత్కాలిక సందర్భ సామాగ్రిగా పనిచేస్తుంది, కానీ దీనికి ప్రాథమికంగా కొంచెం కూడా వాడకపు విలువ లేదు. అయినప్పటికీ మతపరమైన వ్యక్తులు దానిని ఇప్పటికీ అత్యంత విలువైనదిగా భావిస్తారు. వారికి బైబిల్ తెలియదు; బైబిల్‌ను ఎలా వివరించాలో మాత్రమే వారికి తెలుసు, ప్రాథమికంగా దాని మూలాల గురించి తెలియదు. బైబిల్ పట్ల వారి వైఖరి ఇలా ఉంటుంది: బైబిల్‌లో ఉన్న ప్రతిదీ సరైనదే, అందులో తప్పులు లేదా లోపాలు లేవు. బైబిల్ తప్పులు లేకుండా సరైనదిగా ఉందని వాళ్లు మొదట్లోనే నిర్ణయించుకున్నారు కాబట్టి, వారు దానిని చాలా ఆసక్తితో అధ్యయనం చేసి పరిశీలిస్తారు. బైబిల్‌లో నేటి కార్యపు దశ గురించి ముందుగా చెప్పబడలేదు. గాఢాంధకారములో ఉన్న అన్ని ప్రదేశాలలో విజయ కార్యము గురించి ఎప్పుడూ ఎటువంటి ప్రస్తావన లేదు, ఎందుకంటే ఇది తాజా కార్యము. ఎందుకంటే కార్యపు కాలము భిన్నమైనది, ఈ దశ కార్యము అంత్యకాలము సమయంలో జరుగుతుందని స్వయంగా యేసుకు కూడా తెలియదు—కాబట్టి అంత్యకాలపు వ్యక్తులు బైబిల్‌ను పరిశీలించడం ద్వారా దానిలో ఈ దశ కార్యమును ఎలా కనుగొనగలరు?
బైబిల్‌ను వివరించే వారిలో చాలా మంది తార్కిక ఊహను ఉపయోగిస్తారు, వారికి అసలు నేపథ్యం తెలియదు. చాలా విషయాలను ఊహించడానికి వారు కేవలం తర్కాన్నే ఉపయోగిస్తారు. సంవత్సరాల తరబడి, బైబిల్‌ను విడదీసి చూడటానికి లేదా బైబిల్‌కు “కాదు” అని చెప్పడానికి ఎవరూ సాహసించలేదు, ఎందుకంటే ఈ గ్రంథం “పవిత్ర గ్రంథం” మరియు ప్రజలు దీనిని దేవుడిగా ఆరాధిస్తారు. ఇది ఇలా అనేక వేల సంవత్సరాలుగా కొనసాగింది. దేవుడు దీనిని పట్టించుకోలేదు మరియు బైబిల్‌లోని అంతర్గత కథను ఎవరూ కనుగొనలేదు. బైబిల్‌ను కాపాడుకోవడాన్ని విగ్రహారాధన అని మేము అంటున్నాము, అయినప్పటికీ విశ్వసించే ఆ భక్తులెవరూ దానిని ఈ విధంగా చూడటానికి సాహసించరు మరియు వారు నీతో ఇలా అంటారు: “సోదరా! అలా అనకండి, అది దారుణం! నీవు దేవుడికి వ్యతిరేకంగా ఎలా దైవదూషణ చేయగలవు?” ఆపై వారు ఒక బాధతో కూడిన వ్యక్తీకరణను తెచ్చిపెట్టుకుంటారు: “ఓ దయగల యేసు, రక్షకుడైన ప్రభువా, అతని పాపాలను క్షమించమని నేను నిన్ను వేడుకుంటున్నాను, ఎందుకంటే మనిషిని ప్రేమించే ప్రభువు నీవే, మేమంతా పాపం చేశాము, దయచేసి మాపై గొప్ప కరుణ చూపుము, ఆమేన్.” అంటారు. వారంతా ఇలాంటి “దైవభక్తులు”; సత్యాన్ని అంగీకరించడం వారికి ఎలా సులభం కాగలదు? నీ మాటలు వారిని పిచ్చిగా భయపెడతాయి. మానవాళి ఆలోచనలు మరియు మానవాళి ఉద్దేశాలతో బైబిల్ అపవిత్రమవ్వగలదని ఆలోచించడానికి ఎవరూ సాహసించరు మరియు ఈ దోషాన్ని ఎవరూ చూడలేరు. బైబిల్‌లో ఉన్న వాటిలో కొన్ని వ్యక్తుల అనుభవాలు మరియు జ్ఞానం, వాటిలో కొన్ని పరిశుద్దాత్మ జ్ఞానోదయం మరియు ఇందులో మానవ మేధస్సు మరియు ఆలోచన ద్వారా కల్తీ అయినవి కూడా ఉన్నాయి. దేవుడు ఎప్పుడూ ఈ విషయాలలో జోక్యం చేసుకోలేదు, అయినప్పటికీ ఒక పరిమితి ఉంటుంది: ఈ విషయాలు సాధారణ వ్యక్తుల ఆలోచనను మించకూడదు, అవి అలా మించితే, అవి దేవుడి కార్యంలో జోక్యం చేసుకుంటాయి మరియు ఆటంకం కలిగిస్తాయి. సాధారణ వ్యక్తుల ఆలోచనను మించిపోయినది ఏదైనా సాతాను పని అవుతుంది, ఎందుకంటే అది ప్రజలను వారి కర్తవ్యం నుండి దూరం చేస్తుంది, అది సాతాను పని, సాతానుచే మార్గనిర్దేశం చేయబడుతుంది మరియు ఈ సమయంలో ఆవిధంగా చేయడానికి పరిశుద్దాత్మ నిన్ను అనుమతించదు. కొన్నిసార్లు, కొంతమంది సోదరసోదరీమణులు ఇలా అడుగుతారు: “నేను ఫలానా ఫలానా మార్గంలో పని చేయడం సరైనదేనా?” వారి స్థాయిని చూసి నేను ఇలా చెప్తాను: “సరైనదే!” ఇలా కూడా చెప్పేవారు కొంతమంది ఉన్నారు: “నేను ఫలానా ఫలానా మార్గంలో పని చేస్తే, నా స్థితి సాధారణంగా ఉన్నట్లేనా?” దానికి నేను ఇలా అంటాను: “అవును! ఇది సాధారణం, చాలా సాధారణం!” మరి కొందరు ఇలా అంటారు: “నేను ఇలాంటి మార్గంలో పని చేయడం సరైనదేనా?” దానికి నేను ఇలా అంటాను: “కాదు!” వాళ్లు అంటారు: “అతనికి ఎందుకు సరైనది, నాకు ఎందుకు సరైనది కాదు?” దానికి నేను ఇలా అంటాను: “ఎందుకంటే నీవు చేస్తున్నది సాతాను నుండి వస్తుంది, ఇది ఒక ఆటంకం మరియు నీ ప్రేరణ తప్పు అవ్వడానికి మూలం.” పని తగినంత దూరం వెళ్ళని సందర్భాలు కూడా ఉన్నాయి, సోదరసోదరీమణులకు ఇది తెలియదు. ఒక రకమైన మార్గంలో పని చేయడం సరైనదేనా అని కొంతమంది నన్ను అడుగుతారు, వారి చర్యలు భవిష్యత్తు పనికి ఆటంకం కలిగించవని నేను గ్రహించినప్పుడు, అది సరైనదేనని అంటాను. పరిశుద్ధాత్మ కార్యము ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది; ప్రజలు పరిశుద్ధాత్మ ఇష్టాలను తు.చ. తప్పక అనుసరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలకు సాధారణ ఆలోచనలు మరియు బలహీనతలు ఉంటాయి, వారికి కొన్ని శారీరిక అవసరాలు ఉంటాయి, వారికి నిజమైన సమస్యలు ఉంటాయి మరియు ప్రాథమికంగా వారి మనసులలో నియంత్రణకు మార్గం లేని ఆలోచనలు ఉంటాయి. నేను ప్రజలను అడిగే ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది. కొందరు నా మాటలు అస్పష్టంగా ఉన్నాయని అనుకుంటారు, నేను వారిని ఏ విధంగానైనా వ్యవహరించమని చెబుతున్నాను—ఎందుకంటే నా అవసరాలకు తగిన అవకాశం ఉందని నీవు అర్థం చేసుకోలేవు కాబట్టి. ఒకవేళ అది నీవు ఊహించినట్లుగా ఉంటే—నేను మినహాయింపు లేకుండా అందరూ ఒకే స్థాయిని సాధించాలని ప్రజలందరినీ ఒకే విధంగా కోరితే—అది పని చేయదు. ఇది అసాధ్యాన్ని అడిగినట్లు అవుతుంది, ఇది మానవ కార్యపు విధానం, దేవుడి కార్యపు విధానం కాదు. దేవుడి కార్యము ప్రజల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొనసాగుతుంది మరియు వారి సహజ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సువార్తను వ్యాప్తి చేసే విధానం కూడా ఇదే: నీవు నెమ్మదిగా ముందుకు వెళ్లాలి, ప్రకృతిని తన మార్గం తను ఎంచుకోనివ్వండి; నీవు ఎవరితోనైనా సత్యాన్ని స్పష్టంగా మాట్లాడినప్పుడే వారు అర్థం చేసుకుంటారు మరియు అప్పుడే వారు బైబిల్‌ను పక్కన పెట్టగలరు. దేవుడు ఈ కార్యపు దశను చేయకపోతే, ఈ సంప్రదాయాన్ని ఎవరు ఛేదించగలరు? కొత్త కార్యాన్ని ఎవరు చేయగలరు? బైబిల్ బయట కొత్త మార్గాన్ని ఎవరు కనుగొనగలరు? ప్రజల సాంప్రదాయ ఆలోచనలు మరియు భూస్వామ్య నైతిక విలువలు ఎంత ఘోరంగా ఉంటాయంటే, వారికి వీటిని స్వయంగా వదిలించుకునే సామర్థ్యం గానీ లేదా అలా చేసే సాహసం గానీ ఉండదు. అంటే ఇది ఈనాటి ప్రజలు బైబిల్‌లోని కొన్ని మృత పదాలకు ఎలా బంధీలైపోయారో, ఈ పదాలు వారి హృదయాలను ఎలా స్వాధీనం చేసుకున్నాయో చెప్పడం కాదు. వారు బైబిల్‌ను వదులుకోవడానికి ఎలా ఇష్టపడగలరు? బైబిల్ బయట ఉన్న మార్గాన్ని అంత సులభంగా వారు ఎలా అంగీకరించగలరు? నీవు బైబిల్ అంతర్గత కథను మరియు పరిశుద్ధాత్మ కార్యపు విధానాలను గురించి స్పష్టంగా మాట్లాడగలిగితే తప్ప, ప్రజలందరూ పూర్తిగా ఒప్పుకోరు—ఇది అత్యంత అవసరం. ఎందుకంటే, మతం లోపల ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్‌ను ఆదరిస్తారు మరియు దానిని దేవుడిగా ఆరాధిస్తారు, వారు దేవుడిని బైబిల్ లోపల బంధించడానికి కూడా ప్రయత్నిస్తారు మరియు వారు దేవుడిని మరోసారి సిలువపై వేలాడదీస్తేనే, వారు తమ లక్ష్యాలను సాధిస్తారని కూడా అనుకోవచ్చు.