అవినీతిపరుడు దేవునికి ప్రాతినిధ్యం వహించడానికి అశక్తుడు
మనిషి ఎల్లప్పుడూ చీకటి ప్రభావానికి లోనై, సాతాను ప్రభావానికి బందీగా ఉంటూ, ఆ బంధకాల నుండి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నాడు మరియు అతని స్వభావం, సాతాను చేత రూపొందించబడినందున, మరింత మలినంగా మారిపోయింది. మనిషి ఎల్లప్పుడూ తన దుష్టత్వపు సాతాను స్వభావానికి లోనయి జీవిస్తూ దేవుని నిజంగా ప్రేమించలేకపోతున్నాడని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే, మనిషి దేవుని ప్రేమించాలనుకుంటే, అతడు తన స్వనీతి, స్వప్రాధాన్యత, అహంకారం, స్వాతిశయము మరియు—ప్రతి విధమైన సాతాను స్వభావాలను విడిచిపెట్టాలి. అలా చేయకపోతే, అతడి ప్రేమలో పవిత్రతలోపించి సాతాను సంబంధమైన ప్రేమగా ఉంటుంది, దీనిని దేవుడు ఏమాత్రమూ అంగీకరించడు. పరిశుద్ధాత్మ ద్వారా నేరుగా పరిపూర్ణం చేయబడకుండా, పరిశుద్ధాత్మ వారితో వ్యవహరించకుండా, విరుగగొట్టబడకుండా, పనికిమాలిన క్రియలు తొలగించబడకుండా, క్రమశిక్షణ అనుభవం లోనికి రాకుండా, శిక్షించబడకుండా మరియు శుద్ధి చేయబడకుండా, ఎవరునూ దేవుని నిజంగా ప్రేమించలేరు. మీరు కొంత వరకు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు దేవుని నిజంగా ప్రేమించగలరని చెప్తున్నట్లయితే, మీ మాటలు అహంకారంతో నిండి మీరు అవివేకంతో ప్రవర్తిస్తున్నట్టు అర్థం. అలాంటి వారు ప్రధాన దేవదూతను పోలినవారుగా ఉంటారు! మనిషి యొక్క సహజ స్వభావం నేరుగా దేవునికి స్వభావాన్ని ప్రదర్శించలేదు; మనుష్యుడు దేవుని పరిపూర్ణత ద్వారా తన సహజ స్వభావాన్ని వదిలివేయాలి,దేవుని చిత్తం కోసం శ్రద్ధ వహించడం, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం మరియు పరిశుద్ధాత్మ పనిలో పాల్గొనడం ద్వారా మాత్రమే—మనుష్యుని జీవనాన్ని దేవుడు ఆమోదించగలడు. శరీరానుసారంగా జీవించే ఏ ఒక్కరూ, పరిశుద్ధాత్మ ద్వారా ఉపయోగించబడే వ్యక్తి అయితే తప్ప, నేరుగా దేవుని స్వభావాన్ని కనబర్చలేరు. అయితే, ఇలాంటి ఒక వ్యక్తికి కూడా, అతని స్వభావం మరియు అతని పూర్తి జీవనం దేవుని స్వభావాన్ని కనబరుస్తాయని చెప్పడం సాధ్యం కాదు; అతని జీవనం పరిశుద్ధాత్మచే నిర్దేశించబడుతుందని మాత్రమే చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి స్వభావం దేవునికి స్వభావాన్ని కనబర్చలేదు.
మనిషి స్వభావం దేవునిచే నిర్దేశించబడినప్పటికీ—మనం దీనిని ప్రశ్నించలేము. అయితే మనం దీనిని సానుకూలమైన విషయంగా పరిగణించవచ్చు—ఇది సాతానుచే ప్రభావితం చెందినది, కాబట్టి మనిషి యొక్క పరిపూర్ణ స్వభావం సాతాను స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. చేసే పనిలో సూటిగా ఉండడం దేవుని లక్షణం అని కొందరు చెబుతారు, వారిలో కూడా అట్టి లక్షణమే ఉందనీ, వారి స్వభావం కూడా ఇలాగే ఉంటుందని, కాబట్టి వారి స్వభావం దేవుని ద్వభావం వంటిదని వారు చెబుతారు. వీరు ఎలాంటి వ్యక్తులు? అన్యాయంతో కూడిన సాతాను స్వభావం దేవుని స్వభావాన్ని చూపించగలదా? ఎవరైతే తమ స్వభావాన్ని దేవుని స్వభావం అని ప్రకటించుకుంటారో, అలాంటి వారు దేవదూషణ చేసేవారిగా పరిశుద్ధాత్మను అవమానిస్తారు! పరిశుద్ధాత్మ పని చేసే పద్ధతి, భూమిపై దేవుని పని కేవలం జయించుకుంటూ పోవడమే అని చూపిస్తుంది. అలాగే, మనిషి లోని అనేక దుష్టత్వపు సాతాను స్వభావాలు ఇంకా శుద్ధి చేయబడాల్సి ఉంది, తన జీవనం ఇప్పటికీ సాతాను యొక్క ప్రతిరూపంగానే ఉంది, దానినే మనిషి మంచి అని నమ్ముతున్నాడు మరియు ఇది మనిషి శారీరక క్రియలను సూచిస్తుంది; మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ ఆలోచనా విధానం సాతాను స్వభావాన్ని సూచిస్తూ దేవుని స్వభావాన్ని ఏమాత్రమూ సూచించదు. ఎవరైనా ఇప్పటికే భూమిపై పరలోకపు జీవితాన్ని ఆస్వాదించగలిగేంత స్థాయిలో దేవుని ప్రేమిస్తూ, వారు కూడా: “ఓ దేవా! నేను నిన్ను తగినంతగా ప్రేమించలేకపోతున్నాను,” అనే మాటలను పలుకగలుగుతూ, అత్యున్నత రాజ్యంలోనికి చేరినప్పటికీ వారు పూర్తిగా దేవుని పోలి జీవిస్తున్నారని లేదా దేవునిని ప్రతిబింబిస్తున్నారనీ చెప్పలేము, ఎందుకంటే మనిషి నైజం దేవునికి నైజానికి భిన్నంగా ఉంటుంది మరియు మనిషి ఎప్పుడూ దేవునిలా జీవించలేడు, దేవుని కంటే ఎంతో తక్కువ స్థాయిలో మాత్రమే జీవించగలుగుతాడు. కేవలం మనిషి నుండి దేవుడు కోరిన దాని ప్రకారం మాత్రమే జీవించులాగున పరిశుద్ధాత్ముడు మానవుని నిర్దేశిస్తాడు.
సాతాను యొక్క అన్ని చర్యలు మరియు క్రియలు మనిషిలో ప్రత్యక్షపరచబడతాయి. ఈనాడు, మనిషి యొక్క అన్ని చర్యలు మరియు పనులు సాతాను క్రియలనే వెల్లడి చేస్తున్నాయి కానీ దేవుని క్రియలను వెల్లడి చేయడం లేదు. మనిషి సాతాను స్వరూపాన్ని కలిగి ఉంటూ దేవుని స్వభావాన్ని ప్రతిబింబించలేకప్పోతున్నాడు. కొందరు వ్యక్తులు మంచి స్వభావం కలిగి ఉంటారు; అటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం ద్వారా దేవుడు కొంత పనిని చేయగలడు మరియు వారు చేసే పని పరిశుద్ధాత్మచే నిర్దేశించబడుతుంది. అయినప్పటికీ వారి స్వభావం దేవుని స్వభావాన్ని చూపించలేదు. దేవుడు వారిపై చేసే పని, ఇప్పటికే వారిల ఉన్న వాటి దానిని విస్తరింపచేయడం మాత్రమే. గడిచిన యుగాలలో ప్రవక్తలైనా లేదా దేవునిచే వాడబడిన వారైనా, ఎవరూ నేరుగా ఆయనను ప్రతిబింబించలేరు. ప్రజలు పరిస్థితుల ప్రభావాల కారణంగా మాత్రమే దేవుని ప్రేమిస్తారు, ఏ ఒక్కరూ వారి ఇష్టపూర్వకంగా సహకరించడానికి ప్రయత్నించరు. సద్విషయాలు అంటే ఏమిటి? నేరుగా దేవుని నుండి వచ్చేవన్నీ సద్విషయాలే; అయితే, మనిషి యొక్క స్వభావం సాతాను చేత ప్రభావితమై దేవుని స్వభావాన్ని చూపించలేకుండా తయారైంది. ప్రేమ, శ్రమలకు సహించాలనే సంకల్పం, నీతి, విధేయత మరియు వినయం మరియు అవతారియైన దేవుని అంతరంగములో కలిగి ఉండటం మాత్రమే దేవుని ప్రత్యక్షంగా సూచిస్తాయి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు, పాపపు స్వభావం లేకుండా వచ్చాడు మరియు సాతాను చేత ప్రభావితం చెందకుండా దేవుని నుండి నేరుగా వచ్చాడు. యేసు ఒక్కడే పాపపు శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ పాపం లేకుండా ఉన్నాడు; అందువల్ల, సిలువ కార్యం ద్వారా ఆయన తన పనిని సంపూర్తి చేయడానికి ముందు వరకు (ఆయన సిలువ వేయబడిన క్షణంతో సహా) ఆయన క్రియలు, పనులు మరియు మాటలు అన్నీ నేరుగా దేవుని స్వభావాన్నే కనబరచాయి. పాప స్వభావము గల ఎవరైనా దేవునికి ప్రాతినిధ్యం వహించలేరని మరియు మానవుని పాపం సాతానును స్వభావాన్ని సూచిస్తుందని నిరూపించడానికి యేసు ఉదాహరణ సరిపోతుంది. అంటే దీని అర్థం, పాపం దేవునికి ప్రాతినిధ్యం వహించదు మరియు దేవుడు పాపరహితుడు. పరిశుద్ధాత్మ ద్వారా మానవునిలో జరిగే పనిని కూడా పరిశుద్ధాత్మ నిర్దేశించినట్లు మాత్రమే పరిగణించవచ్చు మరియు అది దేవుని తరపున మానవుడు చేస్తున్నాడని చెప్పలేము. కానీ, మనిషికి సంబంధించినంతవరకు, అతని పాపం లేదా అతని స్వభావం, ఏవీ కూడా దేవునికి ప్రాతినిధ్యం వహించవు. గతం నుండి నేటి వరకు మానవునిపై పరిశుద్ధాత్మ చేసిన పనిని గమనించడం ద్వారా, పరిశుద్ధాత్మ అతనిపై పని చేసినందున మాత్రమే మనిషికి తన జీవనం లభించిందని గ్రహించవచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా వ్యవహరించబడిన మరియు క్రమశిక్షణ పొందిన తర్వాత చాలా కొద్దిమంది మాత్రమే సత్యాన్ని గ్రహించి జీవించగలరు. దీని అర్థం, పరిశుద్ధాత్మ యొక్క పని మాత్రమే నిలిచి ఉంటుంది; మానవుని నుండి సహకారం లేదు. ఇది మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందా? ఇది ఇలా ఉంటే, పరిశుద్ధాత్మ పనిచేసేటప్పుడు మీరు ఆయనకు సహకరించడానికి మరియు మీ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మీ శాయశక్తులా ఎలా కృషి చేస్తారు?