దేవుని కార్యపు సోపానముల మీద

వెలుపలి నుండి చూస్తే, దేవుని ప్రస్తుత కార్యపు సోపానములు ఇప్పటికే ముగిసినట్లుగా, మరియు దేవుని వాక్యముల తీర్పు, దండన, శిక్ష, శుద్ధీకరణను మనిషి ఇప్పటికే అనుభవించినట్లుగా, మరియు పరిచర్య చేసేవారు ఎదుర్కొన్న శ్రమలు, దండన సమయపు శుద్ధీకరణ, మరణకాలపు శ్రమ, ఓటములను ప్రతిఫలింపజేసే మెరుపు కాగితాలు, దేవుని ప్రేమించే సమయం లాంటి రూపాల్లో మనిషి ఇప్పటికే ఆ సోపానాల మీద నడిచినట్లుగా కనిపిస్తుంది. ఇలా ప్రతి దశలోనూ కఠిన శ్రమలకు ఓర్చినప్పటికీ, దేవుని సంకల్పం తెలుసుకోవడంలో మనుష్యులు ఇప్పటికీ అజ్ఞానులుగానే ఉంటున్నారు. పరిచర్యలు చేసేవారు ఎదుర్కొన్న శ్రమలను పరిగణనలోకి తీసుకోండి, ఉదాహరణకు: వారు ఏం సాధించారు, ఏం గ్రహించారు, మరియు దేవుడు సాధించదలచిన ప్రభావం ఏమిటనే వాటి గురించి వారు ఇప్పటికీ అస్పష్టతతోనే ఉన్నారు. దేవుని కార్యపు వేగాన్ని గమనిస్తే, నేటి వేగాన్ని అందుకోవడంలో మనిషి పూర్తి అసమర్ధుడిగానే కనిపిస్తున్నాడు. దేవుడు తన కార్యపు సోపానాలను మనిషికి బయలు పరుస్తాడనీ, మరియు మనిషికి ఊహాజనితమైన ఈ సోపానాల్లోని ఏదైనా ఒక దానికి సంబంధించిన ఒక స్థాయిని తప్పనిసరిగా సాధించడానికి బదులుగా, ఒక సమస్య మీద ఆయన వెలుతురు ప్రసరచడాన్ని మనం చూడవచ్చు. ఎవరైనా దేవుని ద్వారా లాభము పొందుకొనుటకు వీలుగా, దేవుడు వారిని పరిపూర్ణులుగా చేయడం కోసం, పైన పేర్కొన్న దశలన్నింటినీ ఆయన తప్పక జరిపించాల్సిందే. ఒక జన సమూహాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూపించడమే ఈ కార్యము ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. అందుకే, వెలుపలి నుండి చూస్తే, దేవుని కార్యములోని సోపానాలన్నీ పూర్తయ్యినట్లుగానే కనిపిస్తుంది. కానీ, సూటిగా చెప్పాలంటే, మనిషిని పరిపూర్ణం చేసే పనిని ఆయన ఆధికారింగా ఇప్పుడిప్పుడే ప్రారంభించాడు. దీని గురించి మనుష్యులకు విషయమై స్పష్టత ఉండాలి. అదేమిటంటే: ఆయన కార్యములోని సోపానాలు మాత్రమే పూర్తిచేయబడ్డాయి కానీ, ఆ కార్యము మాత్రము ఇంకా అంత్య దశకు రాలేదు. అయినప్పటికీ, దేవుని కార్యములోని సోపానాలన్నీ మనిషికి బయలుపర్చబడ్డాయనే మనుష్యులు తలపోస్తున్నారు. అందుకనే, దేవుని కార్యము ముగిసిందని నిస్సందేహంగా చెప్పేస్తున్నారు. పరిణామాలను ఈ దృష్టి కోణంతో చూడడం పూర్తిగా తప్పు. దేవుని కార్యము మనిషి ఆలోచనలకు భిన్నంగా సాగుతుంది. మరియు అలాంటి అలోచనలను అది అన్ని విధాలుగా తిప్పి కొడుతుంది; ప్రత్యేకించి, దేవుని కార్యపు సోపానాలన్నీ మనిషి తలంపునకు అంతుచిక్కనివిగా ఉంటాయి. అవన్నీ దేవుని జ్ఞానమును ప్రదర్శిస్తాయి. మనిషి ఆలోచనలు ప్రతి అడుగున ఆటంకపరచడం, మరియు మనిషి ఊహించే ప్రతిఒక్కదానినీ దేవుడు తిప్పికొట్టడం, వాస్తవ అనుభవాల సమయంలో అవన్నీ సాక్ష్యాలుగా మారడం చూడవచ్చు. దేవుడు చాలా వేగంగా పని చేస్తాడనీ, దాని గురించి మనం తెలుసుకోకముందే, అర్థం చేసుకోకముందే, మనం ఇంకా గంధరగోళంలో ఉండగానే దేవుని కార్యము సంపూర్ణవువుతుందని అందరూ అనుకుంటారు. ఆయన కార్యమునకు సంబంధించిన ప్రతి సోపానమూ ఇలాగే భావించబడుతుంది. దేవుడు మనుష్యులతో ఆడుకుంటున్నాడని చాలామంది అనుకుంటారు. కానీ, ఆయన కార్యము వెనుక ఉద్ధేశం అది కాదు. ఆయన కార్యము చేసే పద్ధతిని నెమరువేసుకోండి: మొదట అది, గుర్రం మీద స్వారీ చేస్తూ పువ్వులను అలా పైపైన చూస్తూ వెళ్ళిపోవడం లాగా, ఆ తర్వాత వాటి వివరాల్లోకి వెళ్ళడం, అటుమీదట ఆ వివరాలను పూర్తిగా మెరుగుపర్చడం లాగా ఉంటుంది. ఇది మనుష్యులను ఆశ్చర్యచకితం చేస్తుంది. దేవుణ్ణి ఏమార్చడానికి మనుష్యులు ప్రయత్నిస్తూ, ఒక స్థాయికి వచ్చేవరకు అలా చేసినప్పటికీ దేవుడు తృప్తి చెందుతాడని వారు భావిస్తుంటారు. నిజానికి, మనుష్యులు చేసే ఇలాంటి ప్రయత్నాలతో వలన దేవుడు ఏ విధంగా తృప్తి చెందగలడు? ఆశించిన ప్రభావం కోసం, మనుష్యులకు ఆ యెరుకే లేని సమయంలో, వారిని ఆశ్చర్యానికి గురిచేసేలా దేవుడు తన కార్యము చేస్తాడు; దేవుడి జ్ఙానం గురించి మనుష్యులకు ఇది గొప్ప యెరుకను అందిస్తుంది, ఆయన నీతి గురించి, గొప్పదనం గురించి, నొప్పింపబడని వ్యక్తిత్వం గురించి వారికి గొప్పగా అర్థమవుతుంది.

నేడు, మనిషిని పరిపూర్ణం చేయడాన్ని దేవుడు అధికారికంగా ప్రారంభించాడు. మనుష్యులు పరిపూర్ణం చేయబడాలంటే, వారు ఆయన వాక్యముల ప్రకటనను, తీర్పును, దండనను ఎదురుకోవాలి. ఆయన వాక్యముల శ్రమలను (పరిచర్య చేసేవారు ఎదుర్కొన్న శ్రమల లాంటివి), శుద్ధీకరణను అనుభవించాలి, మరియు మరణపు శ్రమను ఎదురొడ్డి నిలవాలి. దీని అర్థం ఏమిటంటే, దేవుని తీర్పు, దండన, శ్రమల మధ్య దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నవారు హృదయాంతరాల్లో నుండి దేవుణ్ణి స్తుతించగలరు, మరియు సంపూర్ణ విధేయత చూపిస్తూ, తమను తాము త్యజించి, పరిశుద్ధమైన, పవిత్రమైన, విభేదంలేని హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తారు; అలాంటి మనిషే పరిపూర్ణుడు, మరియు దేవుడు చేయాలనుకునే అమూల్యమైన కార్యము, ఆయన సాధించే కార్యమూ ఇదే. దేవుడు కార్యము చేసే పద్ధతి గురించి మనుష్యులు ఒక తీర్మానానికి రాకూడదు. వారు జీవితంలోకి ప్రవేశాన్ని మాత్రమే అనుసరించాలి. ఇదే ఇక్కడ కీలకం. దేవుడు కార్యము చేసే పద్ధతిని నిత్యం రంధ్రాన్వేషణ చేయకండి; అది మీ భవిష్యత్తు ప్రణాలికలను ఆటంక పరచడం మాత్రమే చేస్తుంది. దేవుడు ఏ పద్థతిలో కార్యము చేస్తాడో నీవు ఎంత మటుకు చూసావు? ఎంత మటుకు నీవు విధేయత కలిగి ఉన్నావు? ఆయన కార్యపు పద్ధతి నుండి ఎంత వరకు నీవు లాభం పొందావు? దేవుని చేత పరిపూర్ణం కావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? పరిపూర్ణం కావడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఈ విషయాలన్నిటిని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరియు వాటిలోకి ప్రవేశించాలి.

మునుపటి:  విశ్వాసులు ఎలాంటి దృష్టి కోణం కలిగి ఉండాలి

తరువాత:  అవినీతిపరుడు దేవునికి ప్రాతినిధ్యం వహించడానికి అశక్తుడు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger