భ్రష్టుపట్టిన మానవాళికి శరీరధారియైన దేవుని రక్షణ ఎంతో అవసరమైయున్నది

దేవుడు శరీరధారిగా అవతరించినది ఎందుకనగా ఆయన కార్యము యొక్క లక్ష్యము సాతాను ఆత్మ లేదా, మరేదైనా నిరాకారమైన ఆత్మ కాదు కానీ సాతాను ద్వారా బ్రష్టు పట్టించబడిన శరీర రూపంలో ఉన్న మనిషియై ఉన్నాడు. సరిగ్గా ఇలాగే ఎందుకంటేశరీరములో ఉన్న మనిషి భ్రష్టుపట్టియున్నాడు కాబట్టి దేవుడు ఈ శరీరములో ఉన్న మనిషిని తన కార్యము జరిగించు ఉద్దేశంగా ఎన్నుకొనియున్నాడు; అంతేకాకుండా, మనిషి భ్రష్టత్వముకు లక్ష్యమైయున్నాడు కాబట్టి దేవుడు రక్షణ కార్యము యొక్క అన్ని దశలలో మనుష్యుని తన ఏకైక ఉద్దేశ్యంగా చేసుకోనియున్నాడు. మనిషి రక్త మాంసముగలవాడై యుండి మరణ పాత్రుడైయున్నాడు మరియు దేవుడు మాత్రమే మనిషిని రక్షించగల సమర్థుడైయున్నాడు. ఈ విధంగా, దేవుడు తన కార్యమును జరిగించుటకు మానవ రూపమును దాల్చి మనుష్యుని పోలిన గుణాలను కలిగియుండాలి తద్వారా ఆయన కార్యము మరింత ఎక్కువ ప్రభావమును చూపుతుంది. మనిషి శరీరమైయున్నాడు కాబట్టి దేవుడు కూడా తప్పక శరీరధారిగా మారాలి మరియు పాపమును అధిగమించు సమర్థుడు కావాలి లేక శరీరము నుండి తన్ను తాను దూరపరచుకోవాలి. శరీరధారియైన దేవుని గుర్తింపు మరియు స్వభావము మనుష్యుని గుర్తింపు మరియు స్వభావముకు విభిన్నంగా ఉన్నప్పటికి, ఆయన మనిషిలాగానే కనబడ్డాడు; ఆయన సదరు మనుష్యుని పోలి కనబడెను మరియు సదరు వ్యక్తివలె జీవించెను మరియు ఆయనను చూచినవారు సదరు వ్యక్తితో ఆయనను పోల్చినా ఏ వ్యత్యాసము కనబడలేదు. సాధారణ మానవాళి మధ్యలో ఆయన తన దైవిక కార్యమును జరిగించుటకు ఇటువంటి సాధారణమైన రూపము మరియు సాధారణ మానవ జీవితము ఆయనకు చాలు. సాధారణ మానవాళి మధ్యలో మరియు మనుష్యుల మధ్యలో తన కార్యము జరిగించుట కొరకు ఆయన శరీరము ఆయనకు దోహదపడుతుంది అంతేగాకుండా మనుష్యుల మధ్యలో తన రక్షణ కార్యమును జరిగించుటకు ఆయన సాధారణ మానవ జీవితానికి సహాయపడుతుంది. ఆయన సాధారణ మానవ జీవితము మనుష్యల మధ్యలో గలిబిలిని కలిగించియున్నప్పటికి, అటువంటి గలిబిలి ఆయన కార్యము యొక్క సాధారణ పరిణామాల మీద ఎటువంటి ప్రభావమును చూపలేదు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆయన సాధారణ శరీరము యొక్క కార్యము మనుష్యునికి అత్యున్నతమైన లాభమును చేకూర్చుతుంది. చాలా మంది ప్రజలు ఆయన సాధారణ మానవ జీవితమును అంగీకరించకపోయినప్పటికి, ఆయన కార్యము ఇంకను ఫలితాలను సాధిస్తూనే ఉంది మరియు ఈ ఫలితాలన్ని సాధించగలిగినందుకు ఆయన సాధారాణ మానవత్వానికి కృతజ్ణతలు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. శరీరధారిగా ఆయన తన కార్యమును జరిగించుట ద్వారా మనుష్యుడు ఆయన సాధారణ మానవ జీవితమును గూర్చి కలిగియున్న అవగాహనకంటే పది లేక పన్నెండు రెట్లు ఎక్కువ ప్రయోజనమును మనుష్యుడు సంపాదించుకుంటాడు మరియు తుదకు ఇటువంటి అవగాహనాలన్నియు ఆయన కార్యము ద్వారా హరించబడును. మరియు ఆయన కార్యము ద్వారా పొందుకున్న పరిణామము, అనగా, ఆయన గూర్చి మనుష్యులు కలిగియున్న జ్ఞానము, ఆయనను గూర్చి మనుష్యులు కలిగియున్న ఆలోచనలను మించి ఉంటుంది. ఆయన శరీరధారిగా ఉండి చేయు కార్యమును ఎవరరూ ఉహించలేరు లేక దానిని అంచనావేయలేరు, ఎందుకనగా ఆయన శరీరము ఇతర మనుష్యుల శరీరముకంటే విభిన్నంగ ఉంటుంది; బాహ్య రూపము ఒకే విధంగా ఉన్నప్పటికీ అంతరంగపు స్వభావము ఒకే విధంగా ఉండదు. దేవుని గూర్చి మనుష్యుడు కలిగియున్న అనేక ఆలోచనలను ఆయన శరీరము పుట్టిస్తుంది, అయితే మనుష్యుడు హెచ్చైన జ్ఞానమును పొందుకొనుటకు మరియు ఇటువంటి బాహ్య రూపమును కలిగియున్న ఎటువంటి వ్యక్తినైన జయించుటకు ఆయన శరీరము అనుమతిస్తుంది. ఎందుకనగా ఆయన కేవలం ఒక మనిషి కాదు గాని ఆయన మానవ రూపములో ఉన్న దేవుడైయున్నాడు మరియు ఆయనను ఎవరు సంపూర్ణంగ అర్థం చేసుకోలేరు లేక ఆయనను గూర్చి ఎవరికీ సంపూర్ణమైన అవగాహన ఉండదు. కనిపించని మరియు స్పృశించలేని దేవుడు అందరిచేత ప్రేమించబడతాడు మరియు ఆహ్వానించబడతాడు. దేవుడు మనుష్యునికి కనిపించని ఒక ఆత్మగా మాత్రమే ఉన్నట్లయితే, దేవునిలో విశ్వసించుట మనుష్యునికి చాల సులభకరంగ ఉంటుంది. ప్రజలు తమ ఉహాప్రపంచముకు ఇష్టానుసారమైన పగ్గాలను ఇవ్వగలరు, వారు దేవుని స్వరూపమును తమకు నచ్చిన విధంగా ఉహించుకొని తమను తాము మభ్యపెట్టుకొని మరియు తమలో తాము సంతోషించగలరు. ఈ విధంగా, ప్రజలు ఎటువంటి సంకోచాలు లేకుండా తమ స్వంత దేవుడు ఇష్టపడువాటిని మరియు అడుగువాటిని చేయగలరు. అంతేకాకుండా, తమ దేవుడు పట్ల వారికంటే మరెవ్వరు భక్తికలిగియుండరని మరియు నమ్మకస్తులుగా ఉండరని వారు నమ్ముతారు. ఇతరులందరూ అన్య జనుల కుక్కలని మరియు దేవునికి నమ్మకస్తులుగా ఉండరని నమ్ముతారు. అస్పష్టమైన దేవునిని నమ్మువారు మరియు సిద్ధాంతము మీద ఆధారపడువారు ఈ విధమైన ఆలోచనలను కలిగియుంటారని చెప్పవచ్చు; అంతో ఇంతో తేడాలతో వారు కోరుచున్నది ఇంచుమించు ఒక్కటే. వారి ఉహాప్రపంచములో దేవుని రూపములు వేరువేరుగా ఉంటాయే తప్ప వారి స్వభావమంతా ఒక్కటిగానే ఉంటుంది.

దేవునిలో మనిషి ఉంచియున్న నిర్లక్ష్యమైన నమ్మకమునుబట్టి మనిషి ఏమాత్రము చింతించుటలేదు మరియు అతడు తనకు నచ్చిన విధంగా దేవునిని నమ్ముచున్నాడు. ఇది “మనుష్యుని స్వతంత్రం మరియు హక్కులలో” ఒకటి, దీనికి ఎవ్వరు అంతరాయం కలిగించలేరు, ఎందుకంటే ప్రజలు తమ స్వంత దేవుణ్ణి నమ్ముచున్నారు గాని వేరే ఎవ్వరి దేవుణ్ణి వాళ్ళు నమ్ముటలేదు; ఇది వారి స్వంత వ్యక్తిగత ఆస్తిగా భావిస్తారు మరియు ఇంచుమించు ప్రతియొక్కరు ఇటువంటి వ్యక్తిగత ఆస్తిని కలిగియున్నారు. ప్రజలు ఈ ఆస్తిని అమూల్యమైన సంపదగా భావిస్తారు కానీ దేవునికి దీనికన్నా నీచమైనది లేక పనికిరానిది ఏదియూ లేదు ఎందుకంటే దేవుణ్ణి వ్యతిరేకించడానికి ఈ వ్యక్తిగత ఆస్తి కలిగిఉండటం కన్నా స్పష్టమైనది ఏదియూ లేదు. శరీరధారియైన దేవుని కార్యము ద్వారానే దేవుడు శరీర రూపములో భౌతిక స్వరూపమును దాల్చాడు తద్వారా మనుష్యులు ఆయనను చూచి ఆయనను తాకగలరు. ఆయన రూపములేని ఆత్మకాదు గాని మనిషి చూడగలిగిన శరీరము మరియు ఆయనతో వారు సంప్రదించగలరు. ఇదిలావుండగా, ప్రజలు నమ్మే చాలామంది దేవుళ్ళు శరీరములేని రూపము లేని శిలలైయున్నవి, అవి కూడా స్వేచ్ఛా రూపములో ఉంటాయి. ఈ విధంగా, శరీరధారియైన దేవుడు దేవునిలో నమ్మికయుంచు అనేకులకు శత్రువైయున్నాడు మరియు దేవుడు శరీరధారియైయున్నాడని నమ్మనివారు కూడా ఆవిధంగా దేవునికి విరోధులైయున్నారు. మనుష్యుడు ఆలోచించు విధానం ద్వారా లేక అతని తిరుగుబాటు స్వభావము ద్వారా మనిషి ఆలోచనలతో నిండియుండలేదు గాని అతడు కలిగియున్న ఈ వ్యక్తిగత ఆస్తి ద్వారానే నిండియున్నాడు. ఈ ఆస్తి ద్వారానే అనేకమంది ప్రజలు చనిపోయారు మరియు కనిపించని, తాకుటకు వీలుకాని మరియు వాస్తవికతలో లేని ఈ అస్పష్టమైన దేవుడు మనుష్యుని జీవితమును నాశనము చేయుచున్నాడు. పరలోకమందున్న దేవుడు కాదుగద శరీరధారియైన దేవుని ద్వారా కూడా మనిషి జీవితానికి నష్టము కలుగలేదు గాని మనిషి ఉహించుకున్న ఆ దేవుని ద్వారానే అతడు నష్టపోయియున్నాడు. భ్రష్టుపట్టిన మనుష్యుని అవసరతల కొరకనే శరీరధారియైన దేవుడు మానవ రూపములో వచ్చాడు. ఇదంతయు మనుష్యుని కొరకే జరిగెను గాని దేవుని కొరకు జరగలేదు మరియు ఆయన అనుభవించిన శ్రమ అలాగే ఆయన చేసిన త్యాగము మానవాళి కొరకే గాని ఆయన స్వప్రయోజనము కొరకు కాదు. దేవునికి ఎటువంటి లాభ నష్టాలు లేక ఎటువంటి బహుమతులు ఉండవు; ఆయన భవిష్యత్ కాలపు పంటను కోయాడు కానీ ఆయనకు ఋణపడియున్నదానినే కోయును. ఆయన మనుష్యుని కొరకు చేసిన కార్యములు మరియు త్యాగము ద్వారా ఆయనకు ఎటువంటి బహుమతులు సంపాయించుకోవడానికి కాదు గాని కేవలం మనుష్యుల కొరకే ఆయన ఇదంతయ చేశాడు. శారీరకంగా దేవుని కార్యము ఉహించని ఇబ్బందులతో కూడుకొనిదైయున్నప్పటికి, ఆత్మ నేరుగా జరిగించు కార్యము ద్వారా సాధించిన దానికంటేను ఎక్కువ ప్రభావకరంగా ఇది ఉంటుంది. శరీర కార్యము ఎంతో శ్రమను కూడికొనియుంటుంది మరియు శరీరము ఆత్మ యొక్క గొప్ప గుర్తింపును పొందుకొనలేదు, ఆత్మ చేసిన ప్రకృతాతీతమైన కార్యములను ఆయన చేయలేడు సరి గదా ఆత్మవంటి అధికారము కూడా ఆయన కలిగియుండడు. అయిననూ ఇటువంటి ఆత్మ నేరుగా జరిగించిన కార్యముకంటే సాధారణ శరీరము జరిగించు కార్యము యొక్క భావము ఎంతో ఉత్తమమైనదిగా ఉన్నది మరియు సమస్త మానవాళి యొక్క అవసరతలకు ఈ శరీరము తానే సమాధానమైయున్నాడు. రక్షించబడువారికి, శరీరము కంటే ఆత్మను ఉపయోగించుకొను విలువ చాలా తక్కువగా ఉంటుంది: ఆత్మ జరిగించు కార్యము సమస్త విశ్వమును, పర్వతములను, నదులను, చెరువులను మరియు సముద్రములను కప్పియున్నది కానీ శరీరము జరిగించు కార్యము ఆయనకి సంబందించిన ప్రతి వ్యక్తితో మరింత ప్రభావవంతముగా సంబంధం కలిగియుంటుంది. అంతేకాదు, దేవుడు శరీరధారిగా శరీర రూపములో ఉన్నప్పుడు మనిషి ఆయనను మంచిగా అర్థం చేసుకోగలరు మరియు ఆయనను నమ్మగలడు, అంతేగాకుండా దేవుని పట్ల మనిషి జ్ఞానాన్ని మరింతగా పెంచుతుంది, దేవుని కార్యములను గూర్చి మనిషి మీద గంభీరమైన ప్రభావమును చూపుతుంది. ఆత్మ యొక్క కార్యము నిగూఢమైన రహస్యమైయున్నది; దీనిని నరమాత్రులు అర్థం చేసుకోనలేరు, దీనిని చూచుట వారికి మరింత కష్టకరము అందువలన వారు బలహీనమైన ఉహల మీద ఆధారపడతారు. శరీరమందు జరిగించబడు కార్యము సహజముగా మరియు వాస్తవికత మీద ఆధారపడియుంటుంది మరియు గొప్ప జ్ఞానము కలిగియుంటుంది అంతేగాకుండా అది మనుష్యుని కన్నులకు తేటగా కనిపిస్తుంది; దేవుని కార్యము యొక్క జ్ఞానమును మనుష్యులు వ్యక్తిగతంగా అనుభవించగలరు మరియు వారి విస్తారమైన ఉహలకు అవసరం లేదు. ఇదే శరీరమందున్న దేవుని కార్యము యొక్క ఖచ్చితమైన నిజ విలువైయున్నది. మనుష్యునికి అదృశ్యమైన మరియు అతడు ఉహించుటకు కష్టకరంగ ఉన్న కార్యములను మాత్రమే ఆత్మ చేయగలదు, ఉదాహరణకు ఆత్మ కలిగించు జ్ఞానోదయం, ఆత్మ యొక్క సంచారము మరియు ఆత్మ నడుపుదల, అయితే మనసు కలిగియున్న మనిషికి ఇవేవి స్పష్టమైన అర్థమును ఇవ్వవు. అవన్నియు కేవలము కదిలికను లేక విశాలమైన అర్థమును ఇస్తాయి గాని మాటల ద్వారా సూచనలను ఇవ్వలేవు. ఇట్లుండగా, శరీరమందు దేవుని కార్యము చాలా భిన్నంగా ఉంటుంది: అది మాటల ద్వారా సరియైన మార్గదర్శనం కలిగియుంటుంది, స్పష్టమైన చిత్తము కలిగియుంటుంది మరియు అవసరమైన స్పష్టమైన లక్ష్యములను కలిగియుంటుంది. అందువలన మనిషి అక్కడిక్కడ వెదకనవసరం లేదు లేక తన ఊహకు పదును పెట్టాల్సిన అవసరం లేదు లేక ఏవో అంచనాలు వేయనవసరం లేదు. ఇది శరీరమందు జరుగు కార్యము యొక్క స్పష్టతయైయున్నది మరియు ఆత్మ జరిగించు కార్యముకు ఇది చాలా భిన్నంగ ఉంటుంది. ఆత్మ జరిగించు కార్యము కేవలము పరిమిత పరిధిని కలిగియుంటుంది మరియు ఇది శరీరము జరిగించు కార్యమునకు ప్రత్యామ్నాయంగా ఉండలేదు. శరీరమందు జరిగించబడు కార్యము మనిషికి అవసరమైన నిర్దిష్టమైన లక్ష్యాలను ఇస్తుంది, ఇది ఆత్మ జరిగించు కార్యము కంటే నిజమైన విలువగల జ్ఞానమైయున్నది. భ్రష్టుపట్టిన మనిషికి అత్యంత విలువైన ఈ కార్యము ఖచ్చితమైన వాక్కులను అందిస్తుంది, అనుకరించడానికి స్పష్టమైన లక్ష్యాలను ప్రబోధిస్తుంది, అంతేగాకుండా శరీరమందు జరుగు కార్యమును చూడవచ్చు మరియు తాకవచ్చు. కేవలము వాస్తవిక కార్యము మరియు సమయానుసారమైన మార్గదర్శన మనిషి అభిరుచులకు సరిపోతుంది మరియు కేవలము వాస్తవమైన కార్యము మాత్రమే మనిషిని తన భ్రష్టత్వమునుండి మరియు భ్రష్ట స్వభావమునుండి రక్షించగలదు. ఇది కేవలము శరీరధారియైన దేవుని ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది; కేవలము శరీరధారియైన దేవుడు మాత్రమే మనిషిని తన భ్రష్టత్వమునుండి మరియు భ్రష్ట స్వభావమునుండి రక్షించగలడు. ఆత్మ దేవుని స్వాస్థ్యపు గుణమైనప్పటికీ ఇటువంటి కార్యము కేవలము శరీరము మాత్రమే జరిగించగలదు. ఆత్మ ఒంటి చేతితో కార్యము జరిగించినా ఆయన కార్యము ప్రభావవంతంగా ఉండుటకు అది సాధ్యపరచదు—ఇది పచ్చి నిజం. ఈ శరీరము ద్వారా అనేక మంది దేవునికి శత్రువులుగా మారియున్నారు గాని ఆయన తన కార్యమును ముగించినప్పుడు, ఆయనకు విరోధంగా ఉన్నవారు ఆయన శత్రువులుగా ఉండుట మానడమే కాకఆయనకు సాక్షులుగా మారుతారు. వారు ఆయన సంపాదించినా సాక్షులుగా ఉంటారు, వారు ఆయనతో ఏకమనస్కులైయుందురు మరియు ఆయనను ఎన్నడు విడిచివెళ్లరు. ఆయన మనుష్యుల మధ్యలో శరీరమందు జరిగించు కార్యము యొక్క ప్రాముఖ్యతను మనిషికి తెలియజేస్తాడు, మరియు మనుష్యుని ఉనికి యొక్క అర్థమును గ్రహించడానికి మనిషి ఈ శరీరము యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి, మనుషి జీవిత ఎదుగుదలకు ఆయన నిజ విలువను తెలుసుకుంటాడు, అంతేగాకుండా ఈ శరీరమే ఉబుకుచున్న జీవజలముగా మారుతుందని తెలుసుకుంటాడు మరియు అతడు ఇందులో నుండి తనను తానూ వేరుపరచుకోలేడు. శరీరధారియైన దేవుడు, దేవుని గుర్తింపు అలాగే స్థానముకు సరిసాటిగా లేనప్పటికి మరియు ఆయన అసలైన స్థాయికి ఇది సరిపోదని మనిషికి అనిపించినప్పటికీ, దేవుని నిజ స్వరూపము లేక దేవుని నిజ గుర్తింపును కలిగియుండని ఈ శరీరము దేవుని ఆత్మ ప్రత్యక్షంగా చేయలేని కార్యమును కూడా చేయగలదు. శరీరధారియైన దేవుని నిజమైన ప్రాముఖ్యత మరియు విలువ ఈ విధంగా ఉంటుంది అయితే ఈ ప్రాముఖ్యతను మరియు విలువను మనిషి గుర్తించలేక దానిని అభినందించలేకపోవుచున్నాడు. మనుష్యులందరూ దేవుని ఆత్మని ఉన్నతంగా భావించి, దేవుని శరీరమును తక్కువగా చూస్తారు, వారు ఎలా చూచిన లేక ఎలా ఆలోచించినా శరీరము యొక్క నిజ ప్రాముఖ్యత మరియు విలువ ఆత్మ కంటే ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అయితే ఇది కేవలము భ్రష్టుడైన మనిషికి సంబంధించింది మాత్రమే. సత్యము కొరకు వెదకువారందరికి మరియు దేవుని ప్రత్యక్షతకు వేచియున్నవారందరికి ఆత్మ యొక్క కార్యము కేవలము నడుపుదల లేక స్పూర్తిని ఇవ్వగలదు మరియు అది ఉహకు అందనిదని వివరణకు అందనిదనే భావనను కలిగిస్తుంది. అంతేకాకుండా అది గొప్పదని, అతిశయించ తగినదని మరియు ప్రశంసనీయమైనదని, దానిని అందరు సాధించలేరని మరియు పొందుకోలేరనే భావనను కలిగిస్తుంది. మనుష్యునికి మరియు దేవునికి మధ్యలో మహా దూరమున్నట్లు, వారు ఎన్నడు ఒక్కటి కాలేరనట్లు, మనిషిని మరియు దేవునిని వేరుపరచుటకు కనిపించని విభజన ఏదో ఉన్నట్లు, మనిషి మరియు దేవుడు దూరమునుండి ఒకరినొకరు చూచుకోగలరు అంతే. వాస్తవానికి, ఇది ఆత్మ ద్వారా మనిషికి తెలియపరచబడిన ఒక భ్రమయైయున్నది ఎందుకంటే ఆత్మ మనిషి ఒకే విధమైన వారు కారు మరియు వారు ఒకే లేకములో ఎన్నడు సహజీవనము చేయలేరు ఎందుకంటే మనిషి కలిగియున్నదేదియు ఆత్మ కలిగియుండదు. అందువలన మనిషికి ఆత్మ అవసరత ఉండదు, మనిషికి అవసరమైన కార్యమును ఆత్మ నేరుగా చేయలేదు. మనుష్యుడు కొనసాగించవలసిన నిజ ఉద్దేశ్యములను, స్పష్టమైన మాటలను, ఆయన నిజమని మరియు సామాన్యుడనే భావనను అంటే ఆయన దీనుడని మరియు సాధారణమైన వ్యక్తి అని శరీరమందు జరిగించబడు కార్యము కలిగిస్తుంది. మనుష్యుడు ఆయనకు భయపడినా, అనేక మంది ప్రజలు ఆయనతో సులువుగా సంబంధం కలిగియుంటారు: మనిషి ఆయన ముఖమును చూడగలడు, ఆయన స్వరమును వినవచ్చు మరియు ఆయనను దూరం నుండి చూడనవసరం లేదు. ఈ శరీరము మనుష్యునికి దగ్గరగా ఉన్నట్లుంటుంది గాని అది దూరం అని గాని లేక లోతైనదని గాని అనిపించదు, అయితే అది చూడగలిగినది మరియు తాకగలిగినదిగా ఉన్నది, ఈ శరీరము మనిషి ఉండే ప్రపంచములోనే ఉన్నది.

శరీరమందు జీవించు వారందరూ, తమ స్వభావమును మార్చుకొనుటలో వెంబడించవలసిన లక్ష్యాలను ఉంచుకోవాలి మరియు దేవునిని తెలుసుకోవడం అంటే దేవుని నిజ స్వరూపమును ఆయన నిజ క్రియలకు వారు సాక్ష్యులుగా ఉండాలి. ఈ రెండు శరీరధారియైన దేవుని స్వరూపములోనే సాధించబడతాయి మరియు సామాన్యమైన నిజ శరీరమునందు మాత్రమే ఈ రెండు నెరవేర్చబడతాయి. ఇందువలననే శరీరధారిగా ఆయన రావడం అవసరము మరియు అది భ్రష్టులైన మనుష్యులందరికి అవసరం. ప్రజలు దేవునిని తెలుసుకొవలసిన అవసరం ఉంది గనుక అస్పష్టమైన ప్రకృతాతీత దేవుళ్ళను తమ హృదయములలో నుండి త్రోసివేయాలి మరియు భ్రష్టుపట్టిన వారి స్వభావమును వారు తొలగించుకోవాలి కాబట్టి మొదట వారు తమ భ్రష్ట స్వభావమును తెలుసుకోవాలి. ఒకవేళ మనుష్యుల హృదయాలలో నుండి అస్పష్టమైన దేవుళ్ళను తొలగించుటకు మనిషి మాత్రమే ప్రయత్నిస్తే వారిలో సరియైన ప్రభావం చూపించుటకు అతడు విఫలమౌతాడు. మనుష్యుల హృదయాలలో అస్పష్టమైన దేవుని రూపములు బయలుపరచబడవు, బయటకు త్రోయబడవు లేక మాటల ద్వారా పూర్తిగా బయట వేయబడవు. ఇలా చేసినప్పుడు, తుదకు మనుష్యులలో వేరుపారియున్న ఈ సంగతులను పెకిలించడం వారికి సాధ్యపడదు. ఈ అస్పష్టమైన ప్రకృతాతీత దేవుళ్ళ స్థానములో ఆచరణాత్మకమైన దేవుడు మరియు దేవుని నిజ స్వరూపమును పెట్టుట ద్వారా అలాగే మనుష్యులు నెమ్మదిగా వారిని తెలుసుకొనేలా చెయ్యడం ద్వారా ఆశించిన ప్రభావము సాధించగలరు. మనిషి గతములో నమ్మిన దేవుడు అస్పష్టమైన ప్రకృతాతీత దేవుడని అతడు గ్రహిస్తాడు. ఈ ప్రభావము ఆత్మ నేరుగా నాయకత్వం చేయుట ద్వారా గాని ఒక వ్యక్తి బోధించుట ద్వారా సాధించబడదు, అయితే శరీరధారియైన దేవునివల్ల మాత్రమే సాధ్యమౌతుంది. శరీరధారియైన దేవుడు తన కార్యమును జరిగించుటను అధికారికంగా ప్రారంభించాక మనుష్యుని భావనలు బయటపడతాయి ఎందుకంటే మనుష్యుని ఉహల్లో ఉండే అస్పష్టమైన ప్రకృతాతీతమైన దేవుడు సాధారణమైన శరీరధారియైన దేవుని నిజతత్వముకు విరుద్దంగా ఉంటుంది. శరీరధారియైన దేవునితో పోలిక చేసి చూసినప్పుడు మాత్రమే మనుష్యుని అసలైన ఉద్దేశ్యాలు బయలుపరచబడతాయి. శరీరధారియైన దేవునితో పోలిక లేకుండా మనుష్యుని ఉద్దేశ్యాలు బయలుపరచబడవు; అంటే, ఒక మెరుపు కాగితంలా వాస్తవికతను ప్రతిఫలింపజేయకపోతే, అస్పష్టమైన సంగతులను బయలుపరచబడవు. ఈ కార్యమును జరిగించుటకు మాటలను ఉపయోగించుటకు ఎవరికీ సాధ్యము కాదు మరియు మాటలను ఉపయోగించి ఈ కార్యమును జరిగించుట ఎవరికీ సాధ్యముకాదు. దేవుడు మాత్రమే తన స్వంత కార్యమును చేయగలడు మరియు ఆయన స్థానములో మరి ఎవ్వరు ఈ కార్యమును జరిగించలేరు. మనిషికి ఎంతటి శ్రేష్టమైన భాషపరిజ్ఞానం ఉన్నా దేవుని వాస్తవికతను మరియు సాధారణ తత్వమును వివరించుటకు సాధ్యముకాదు. దేవుడు వ్యక్తిగతంగా మనుష్యుని మధ్యలో కార్యము జరిగించి తన స్వరూపమును మరియు ఆయన ఉనికిని చూపించినప్పుడు మాత్రమే మనుష్యుడు దేవుణ్ణి ఆచరణాత్మకంగా తెలుసుకొగలడు మరియు ఆయనను మరింత స్పష్టముగ చూడగలడు. శరీరమందున్న ఏ మనిషి కూడా ఈ ప్రభావమును సాధించలేరు. అయితే దేవుని ఆత్మ కూడా ఈ ప్రభావమును సాధించుటలో విఫలమైనది. సాతాను ప్రభావము నుండి దేవుడు ఈ భ్రష్టుపట్టిన మనిషిని రక్షించగలడు అయితే ఈ కార్యము దేవుని ఆత్మ ద్వారా నేరుగా నేరవేర్చబడదు; ఇది కేవలం శరీర రూపమును దాల్చిన దేవుని ఆత్మ అంటే శరీరధారియైన దేవుని ద్వారా మాత్రమే జరిగించబడుతుంది. ఈ శరీరమే మనిషిగాను దేవునిగాను ఉండి, ఈ మనిషే సాధారణమైన మానవత్వము కలిగియుండెను మరియు సంపూర్ణమైన ద్వైవత్వమును కలిగియున్న దేవుడైయున్నాడు. అందువలన ఈ శరీరము దేవుని ఆత్మ కానప్పటికీ, ఆత్మ దేవుని నుంచి ఎక్కువ తేడా కలిగియున్నప్పటికీ, అది మనుష్యుని రక్షించు శరీరధారియైన దేవుడైయున్నాడు, ఆయనే ఆత్మగాను శరీరముగాను ఉన్నాడు. ఆయన ఏ పేరుతొ పిలువబడతాడు అనే దానితో సంబంధం లేదు గాని దేవుడు తానే మానవాళిని రక్షించువాడైయున్నాడు. ఆత్మయైన దేవుడు శరీరమునుండి వేరుపరచబడడు మరియు శరీరమందు జరిగించబడిన కార్యము ఆత్మ దేవుని కార్యమైయున్నది; ఈ కార్యము జరిగించుటలో ఆత్మ దేవుని గుర్తింపు ఉపయోగించబడలేదు అంతే, అయితే శరీర గుర్తింపును ఉపయోగించి ఈ కార్యము జరిగించబడియున్నది. ఆత్మ ద్వారా నేరుగా జరిగించబడు కార్యము కొరకు శరీరధారిగ మారడం అవసరం లేదు మరియు శరీరము ద్వారా జరిగించబడు కార్యము ఆత్మ ద్వారా నేరుగా జరిగించబడదు అలాగే శరీరధారియైన దేవుని ద్వారా మాత్రమే జరిగించబడుతుంది. ఈ కార్యము కొరకు ఇదే చాలా అవసరమైయున్నది మరియు భ్రష్టుపట్టిన మానవాళికి ఇదే అవసరమైయున్నది. దేవుని కార్యము యొక్క మూడు దశలలో, కేవలం ఒక్క దశ మాత్రమే ఆత్మ ద్వారా నేరుగా నడిపించపడింది, మిగిలిన రెండు దశలు శరీరధారియైన దేవుని ద్వారా నడిపించబడిందే గాని ఆత్మ నేరుగా నడిపించలేదు. ధర్మశాస్త్ర యుగములో ఆత్మ ద్వారా జరిగించబడిన కార్యము భ్రష్టుపట్టిన మనుష్యుని స్వభావమును మార్చుటలో నిమగ్నంకాలేదు మరియు దేవుని గూర్చిన మనిషి జ్ఞానమును గూర్చి ఎటువంటి సంబంధమును కలిగియుండలేదు. కృపాయుగములో మరియు రాజ్యపు యుగములో శరీరధారియైన దేవుడు జరిగించిన కార్యము భ్రష్టుపట్టిన మనుష్యుని స్వభావము మరియు దేవుని గూర్చి మనుష్యుని జ్ఞానముతో సంబంధం కలిగియుండెను అలాగే రక్షణ కార్యములో ప్రాముఖ్యమైన కీలకమైన పాత్రను కలిగియున్నది. అందువలన, భ్రష్టుడైన మనిషికి శరీరధారియైన దేవుని రక్షణ కార్యము మరియు శరీరధారియైన దేవుని కార్యము నేరుగా జరిగించబడుట ఎంతో అవసరమున్నది. మానవాళికి శరీరధారియైన దేవుడు ఒక కాపరిగాను, అతనిని బలపరచువాడుగాను, అతనికి నీళ్ళు త్రాగించువాడుగాను, అతనికి ఆహారం అనుగ్రహించువాడుగాను, తీర్పు తీర్చువాడుగాను, అతనిని క్రమపరచువాడుగానూ, ఎక్కువ కృపను అనుగ్రహించువాడుగానూ మరియు శరీరధారియైన దేవుని దగ్గర నుండి గొప్ప విడుదలను కలిగించువాడుగానూ ఉండాలని కోరుకొనుచున్నాడు. శరీరధారియైన దేవుడు మాత్రమే మనుష్యునికి నమ్మకస్తుడుగా, మనుష్యుని కాపరిగా, నమ్మకమైన సహాయకునిగా ఉండగలడు మరియు భూత కాలములో అలాగే వర్తమాన కాలములో దేవుడు శరీరధారిగా ఉండుటకు ఇదంతయు అవసరమైయున్నది.

మనిషి సాతాను ద్వారా భ్రష్టుపట్టిపోయాడు మరియు ఈ మనిషి దేవుడు సృష్టించిన జీవరాశులన్నిటిలో చాలా గొప్పవాడు, అందుచేత మనిషికి దేవుని రక్షణ అవసరమైయున్నది. దేవుని రక్షణ యొక్క లక్ష్యం మనిషే గాని సాతాను కాదు. రక్షించబడవలసినది మానవ శరీరము మరియు మనిషి ఆత్మయే గాని దయ్యము కాదు. దేవుడు నాశనం చేయాలని సాతానును లక్ష్యంగా పెట్టుకున్నాడు, దేవుడు రక్షించాలని మనిషిని లక్ష్యంగా పెట్టుకున్నాడు మరియు మనిషి శరీరము సాతాను ద్వారా భ్రష్టుపట్టిపొయింది, అందుచేత మొట్ట మొదటిగా రక్షించబడవలసినది మనిషి శరీరమే. మనిషి శరీరము చాలా ఘోరంగా భ్రష్టుపట్టుపొయింది, అది దేవుణ్ణి ఎదిరించేదిగా మారిపోయింది. ఎంతగా అంటే, దేవుని అస్తిత్వమును బహిరంగంగా ఉపేక్షించి, ఆయనను ఎదిరించెంతగా మారిపోయింది. భ్రష్టుపట్టిన ఈ శరీరము మొండి ఘటము మరియు శరీరము యొక్క భ్రష్టుపట్టిన స్వభావమును మార్చడం, లేక దానితో వ్యవహారము జరిగించడముకంటే మరొకటి లేదు. అడ్డు ఆటంకాలను కలుగజేయడానికి సాతాను మనిషి శరీరములోనికి వస్తాడు, దేవుని కార్యమును చెడగొట్టుటకు మరియు దేవుని ప్రణాళికను పాడు చేయుటకు మనిషి శరీరమును ఉపయోగించుకుంటాడు. తద్వారా మనిషి సాతానుగా మారిపోతాడు మరియు దేవునికి శత్రువుగా మారిపోతాడు. మనిషి రక్షణ పొందాలంటే, అతను తప్పనిసరిగా మొట్ట మొదటిగా జయించబడాలి. ఈ కారణముచేతనే దేవుడు సవాలును లేవనెత్తి, ఆయన ఉద్దేశించిన కార్యమును చేయుటకును మరియు సాతానుతో యుద్ధము చేయుటకు శరీరధారిగా వచ్చాడు. ఆయనకున్న లక్ష్యం భ్రష్టుపట్టిన మనిషిని రక్షించడమే మరియు ఆయనకు తిరుగుబాటు చేసిన సాతానును ఓడించి సర్వ నాశనము చేయడమే. మనుష్యులను జయించుటకు ఆయన జరిగించు కార్యము ద్వారా ఆయన సాతానును ఓడిస్తాడు, అదే సమయములో ఆయన భ్రష్టుపట్టినపోయిన మానవాళిని సహితము రక్షిస్తాడు. అందుచేత, అది ఒకేసారి రెండు లక్ష్యాలను సాధిస్తుంది. ఆయన శరీరములో ఉండి కార్యము చేస్తాడు, ఆయన శరీరములో ఉండి మాట్లాడుతాడు, మరియు మనిషితో ఉత్తమ సహవాసము చేయుటకు, మనిషిని జయించుటకు శరీరములో ఉండి కార్యమంతటిని జరిగిస్తాడు. చివరిసారిగా దేవుడు మనిషిగా మారినప్పుడు, అంత్య దినాలలోని ఆయన కార్యము శరీరములోనే ముగించబడుతుంది. ఆయన సమస్త మానవాళిని ఆయా వర్గాలుగా విభజిస్తాడు, ఆయన సమస్త కార్య నిర్వహణను ముగిస్తాడు, మరియు శరీరమందు ఉండి జరిగించవలసిన ఆయన కార్యమునంతటిని కూడా చేసి ముగిస్తాడు. భూమి మీద ఆయన కార్యము ముగింపుకు వచ్చిన తరువాత, ఆయన సంపూర్ణముగా విజయము పొందుకుంటాడు. శరీరమందు ఉండి కార్యము జరిగించడం అనేది దేవుడు మానవులను సంపూర్ణముగా జయిస్తాడని అర్థం మరియు సమస్త మానవాళిని సంపూర్ణముగా పొందుకుంటాడని అర్థం. దీనిని బట్టి చూస్తే, ఆయన పూర్తి నిర్వహణ కార్యము ముగింపుకు వచ్చిందని దాని అర్థం కాదా? దేవుడు శరీరమందు ఉండి జరిగించవలసిన కార్యము పూర్తిగా ముగించిన తరువాత ఆయన సాతానును పూర్తిగా ఓడిస్తాడు మరియు ఆయన విజయము పొందుకుంటాడు. అప్పుడు మనుష్యులను భ్రష్టుపట్టించడానికి సాతానుకు ఇతర ఏ అవకాశాలు ఉండవు. మొదటిసారి శరీరధారిగా వచ్చిన దేవుని కార్యము మనుష్యుల పాపాలనుండి క్షమించి, విమోచించుటయైయున్నది. ఇప్పుడు మనుష్యులను జయించి, సంపూర్ణముగా వారిని సంపాదించుకునే కార్యమైయున్నది. తద్వారా, సాతానుకు ఎటువంటి కార్యము చేయాలన్న అవకాశం ఉండదు మరియు పూర్తిగా నాశనం చేయబడతాడు. అప్పుడు దేవుడు పూర్తిగా విజయము పొందుకుంటాడు. ఇదే శరీరము యొక్క కార్యమైయున్నది మరియు దేవుడు స్వయాన జరిగించు కార్యమైయున్నది. దేవుని కార్యములోని మూడు దశల ఆరంభ కార్యము నేరుగా దేవుని ఆత్మ ద్వారా జరిగించబడింది గాని శరీరము ద్వారా కాదు. దేవుని కార్యములోని మూడు దశల కార్యములో చివరి కార్యము శరీరధారియైన దేవుని ద్వారా జరిగించబడింది గాని ఆత్మ ద్వారా నేరుగా జరిగించబడలేదు. మధ్య దశ యొక్క విమోచనా కార్యము శరీరమందున్న దేవుని ద్వారా జరిగించబడింది. కార్య నిర్వహణ కార్యమంతటిలో సాతాను ప్రభావము నుండి మనుష్యులను రక్షించుటయే అత్యంత ప్రాముఖ్యమైన కార్యము. ముఖ్యమైన కార్యము ఏమనగా భ్రష్టుపట్టిన మనుష్యులను పూర్తిగా జయించుటయే, తద్వారా జయించబడిన మనిషి హృదయములో దేవుని విషయమైన నిజమైన భయభక్తులను పునరుద్ధరణ చేయడమైయున్నది మరియు అతను సామాన్య జీవితమును, అంటే దేవుని సృష్టి యొక్క సామాన్య జీవితమును కలిగియుండటకు అనుమతించడమునైయున్నది. ఈ కార్యము అత్యంత ప్రాముఖ్యమైనది, మరియు ఇది కార్య నిర్వహణ కార్యము యొక్క కేంద్రమైయున్నది. రక్షణ కార్యము యొక్క మూడు దశలలో ధర్మశాస్త్ర యుగము యొక్క కార్యపు మొదటి దశ కార్య నిర్వహణ కార్యము యొక్క కేంద్రానికి చాలా దూరములో ఉండేది; ఇది రక్షణ కార్యమును కొంచెము మాత్రమే కలిగియున్నది మరియు సాతాను సర్వాధికారము నుండి మనుష్యులను రక్షించే దేవుని కార్యారంభముగా ఉండేది కాదు. కార్యములో మొదటి దశ ఆత్మ ద్వారానే నేరుగా జరిగించబడింది, ఎందుకంటే ధర్మశాస్త్రము ప్రకారము మనిషి కేవలము ధర్మశాస్త్రమును బట్టియే నడుచుకోవాలని మనిషి తెలుసుకున్నాడు మరియు మనిషి అంతకంటే మించిన సత్యాన్ని కలిగియుండలేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర యుగములో జరిగిన కార్యము మావన స్వభావములో మార్పులను కలుగజేయుటలో పెద్ద జోక్యము చేసుకోలేదు, సాతాను అధికారము నుండి మనుష్యులను ఎలా రక్షించాలనే కార్యమును గురించి అంత పెద్దగా పట్టించుకోలేదు. అందుచేత, భ్రష్టుపట్టిన మనిషి స్వభావమును పట్టించుకొనని ఈ సులభమైన కార్యపు దశను దేవుని ఆత్మ అద్భుతముగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యములోని ఈ దశ కార్య నిర్వహణ యొక్క కేంద్రానికి కొంత సంబంధాన్ని కలిగియున్నది. అయితే, మనుష్యుల రక్షణ అధికారిక కార్యానికి సమసంబంధం పెద్దగా కలిగిలేదు. అందుచేత, దీనికి ఆయన తన కార్యమును వ్యక్తిగతంగా చేయడానికి దేవుడు శరీరధారిగా రావలసిన అవసరం లేకుండెను. ఆత్మ ద్వారా జరిగిన కార్యము అస్పష్టమైనది మరియు గ్రహించలేనిది. ఇది మనిషిని ఎక్కువగా భయపెట్టేది మరియు మనిషిని చేరుకోలేనిది; రక్షణ కార్యమును నేరుగా జరిగించడానికి ఆత్మ సరిపోయినది కాదు, మనుష్యులకు నేరుగా జీవమును ప్రసాదించడానికి ఆత్మ తగినది కాదు. మనుష్యులకు సరిపోయినది ఏదైనా ఉందంటే అది ఆత్మ కార్యమును మనుష్యులకు అందుబాటులో ఉండే విధంగా రూపాంతరము చేయడమే. ఇంకోక రీతిగా చెప్పాలంటే, మనుష్యులకు సరిపోయినదేమంటే దేవుడు తన కార్యమును జరిగించుటకు సాధారణమైన, సామాన్యమైన మనిషిగా మారడమే. దీనికి ఆయన కార్యములో ఆత్మ స్థానమును తీసుకోవడానికి దేవుడు శరీరధారిగా రావలసియుండెను. ఇంతకు మించి మనిషి కొరకు దేవుడు కార్యమును జరిగించడానికి వేరొక తగిన మార్గము లేదు. కార్యము యొక్క ఈ మూడు దశలలో రెండు దశలు శరీరము ద్వారా జరిగించబడ్డాయి మరియు ఈ రెండు దశలు కార్య నిర్వహణ కార్యము యొక్క ముఖ్య దశలైయున్నవి. రెండు శరీరావతారాలు పరస్పరంగా పరిపూర్ణమైనవి మరియు అవి ఒకదానికొకటి పరిపూర్ణతను సంతరించుకున్నాయి. శరీరధారియైన మొదటి దశ రెండవ దశకు పునాది వేసింది. దేవుని రెండు శరీరావతారాలు ఒక శరీరావతారాన్ని పూర్తిగా కలుగజేస్తాయి మరియు ఒకదానితో ఒకటి విభేదించవు. దేవుని కార్యములోని ఈ రెండు దశలు ఆయన శరీరావతారపు గుర్తింపులో దేవుని ద్వారా కొనసాగించబడ్డాయి. ఎందుకంటే అవి రెండు కార్యనిర్వహణా కార్యమంతటికి చాలా ప్రాముఖ్యమైయున్నవి. దీనిని ఇంకా స్పష్టంగా ఎలా చెప్పవచ్చు అంటే, దేవుని రెండు శరీరావతారముల కార్యము లేకుండా, కార్యనిర్వహణ కార్యమంతయు నిలబడిపోయేది, మానవాళిని రక్షించు కార్యము జరిగి ఉండేది కాదు గాని కేవలము మాటల వరకే నిలిచిపోయేది. మానవాళికున్నటువంటి అవసరతనుబట్టి, మానవాళి నిజ దుస్థితిని బట్టి, ఈ కార్యము అంత ప్రాముఖ్యమైనదో కాదో గాని సాతాను తీవ్రాతి తీవ్రమైన అవిధేయతనుబట్టి ఈ కార్యమునకు భంగముగా ఉన్నది. ఇదంతా పని జరిగించు వాని ద్వారా జరిగిన కార్య స్వభావము మీద మరియు కార్యము యొక్క ప్రాముఖ్యత మీద ఎవరు పనిని సరిగ్గా చేస్తున్నారో లేదో చెప్పబడుతుంది. ఇది ఈ కార్యము యొక్క ప్రాముఖ్యత విషయానికి వచ్చినప్పుడు, ఏ కార్యము యొక్క పద్ధతిని అవలంబించాలనే విషయానికి వచ్చినప్పుడు, అంటే దేవుని ఆత్మ ద్వారా నేరుగా జరిగిన కార్యమా, లేక శరీరధారియైన దేవుని ద్వారా జరిగిన కార్యమా, లేక మనిషి ద్వారా జరిగించబడిన కార్యమా, ఇందులో మనిషి ద్వారా జరిగించబడిన కార్యాన్ని మొట్ట మొదటిగా తొలగించబడాలి. కార్యము యొక్క స్వభావము ఆధారము చేసుకొని, శరీర కార్యమునకు విరుద్ధమైన ఆత్మ కార్యము యొక్క స్వభావమును ప్రక్కకు పెట్టాలి. అంతిమంగా, శరీరము ద్వారా జరిగించబడిన కార్యము ఆత్మ ద్వారా జరిగించబడిన కార్యముకంటే మనుష్యులకు ఎక్కువ ప్రయోజనకరమైనదని నిర్ణయించబడింది. అది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. ఆత్మ ద్వారా జరిగించబడిన కార్యమా లేక శరీరము ద్వారా జరిగించబడిన కార్యమా అని దేవుడు నిర్ణయించినప్పుడే ఇది దేవుని ఆలోచనయైయుండెను. కార్యములోని ప్రతి దశకు ఆధారము మరియు ప్రాముఖ్యతలు కలవు. అవి ఆధారాలు లేని ఊహాత్మక గానాలు కాదు, లేక అవి ఉన్నపళంగా కొనసాగించబడేవి కావు; వాటికి ఒక నిర్దిష్టమైన జ్ఞానము కలదు. ఇదే దేవుని కార్యమంతటి వెనుక ఉన్నటువంటి సత్యము. ప్రత్యేకంగా, దేవుడు శరీరధారియై స్వయంగా మనుష్యుల మధ్యన కార్యము జరిగించే అటువంటి గొప్ప కార్యములో దేవుని ప్రణాళిక మరింత ఎక్కువగా ఉంటుంది. అందుచేత, దేవుని జ్ఞానము మరియు ఆయన అస్తిత్వములు ఆయన జరిగించే కార్యములోని ప్రతి క్రియలోను, ఆలోచనలో, తలంపులలోను ప్రతిబింబిస్తాయి; ఇది మరింత బలమైన మరియు క్రమబద్ధమైన దేవుని అస్తిత్వము యొక్క స్థితియైయున్నది. ఇటువంటి సున్నితమైన ఆలోచనలు మరియు తలంపులన్నిటిని ఊహించుకోవడానికి, నమ్మడానికి మనిషికి చాలా కష్టం. అంతేగాకుండా, ఈ విషయాలను మనిషి తెలుసుకోవడము కూడా చాలా కష్టం. మనిషి ద్వారా జరిగించబడిన కార్యము ఒక సాధారణ సూత్ర ప్రకారము జరిగించబడింది, ఎందుకంటే ఇది మనిషికి అత్యంత సంతృప్తిని ఇస్తుంది. అయినా, దేవుని కార్యానికి పోల్చినప్పుడు, చాలా గొప్ప అసమానత ఉంది; దేవుని క్రియలు గొప్పవైనప్పటికి, దేవుని కార్యము అద్భుతమైన స్థాయిలో ఉన్నప్పటికి, వాటి వెనుకాల మనుష్యుల ఊహలకు అందని అనేకమైన అతి చిన్నవియైన, ఖచ్చితమైన ప్రణాళికలు మరియు ఏర్పాట్లు కలవు. ఆయన కార్యములోని ప్రతి దశ నియమ ప్రకారము జరగడమే కాకుండా ప్రతి దశలోను మానవ భాషకు అందని అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి. ఈ సంగతులన్నీ మనుష్యులకు అదృశ్యంగానే ఉంటాయి. ఇది ఆత్మ కార్యమా లేక శరీరధారియైన దేవుని కార్యమా అనే విషయముతో సంబంధము లేకుండా, ప్రతి దానిలొనూ దేవుని కార్యమునకు సంబంధించి ప్రణాళికలు ఉన్నాయి. ఆధారము లేకుండా అయన కార్యమును జరిగించడు మరియు ఆయన ప్రాముఖ్యత లేనటువంటి కార్యమును చేయడు. ఆత్మ నేరుగా కార్యము చేసినప్పుడు, ఆయన తనకున్న లక్ష్యాలతో చేస్తాడు. కార్యము జరిగించడానికి ఆయన మనిషిగా వచ్చినప్పుడు (అంటే, ఆయన బాహ్య కవచము రూపాంతరము చెందినప్పుడు), ఆయన మరింత ఎక్కువ ఉద్దేశముతో కార్యమును జరిగిస్తాడు. లేకపోతే, ఆయన ఎందుకు తన గుర్తింపును వెంటనే మార్చుకున్నాడు? ఇంకెందుకు ఆయన ఒక పేదవాడిగాను మరియు శ్రమలు అనుభవించే వ్యక్తిగా వెంటనే మారిపోయాడు?

శరీరమందు ఉండి ఆయన జరిగించు కార్యము అత్యున్నత ప్రాధాన్యతను సంతరించుకున్న కార్యము, ఇది కార్యమునకు సంబంధించి మాట్లాడుతుంది మరియు అంతిమంగా కార్యమును ముగించు వ్యక్తి శరీరధారియైన దేవుడే గాని ఆత్మ కాదు. దేవుడు తెలియని ఘడియలో ఈ భూమి మీదకి వస్తాడని, మనుష్యులందరికి కనిపిస్తాడని, అప్పుడు సమస్త మానవాళికి ఆయన వ్యక్తిగతంగా తీర్పు తీరుస్తాడని, ఎవరిని విడిచిపెట్టకుండ ఒకరిని తరువాత మరొకరిని ప్రతియొక్కరిని పరీక్షిస్తాడని కొంతమంది నమ్ముతారు. ఈ విధంగా ఆలోచించువారందరూ శరీరధారియైన దేవుని కార్యపు ఈ దశను ఎరుగరు. దేవుడు ఒక్కొక్కరికి తీర్పు తీర్చడు మరియు ఒక్కొక్కరిని పరీక్షించడు; అలా చేసినప్పుడు అది తీర్పు తీర్చు కార్యమనిపించుకోదు. మనుష్యులందరి భ్రష్టత్వము ఒకటే కాదా? మనుష్యులందరి గుణగణాలు ఒకటే కావా? సాతాను ద్వారా భ్రష్టుపట్టిన మనిషి గుణగణాలకు, సమస్త మానవాళి భ్రష్ట గుణగణాలకు మరియు మనుష్యుల సమస్త పాపాలకు తీర్పు తీర్చబడింది. మనిషి చేసిన చిన్న చిన్న అల్పమైన తప్పులకు దేవుడు తీర్పు తీర్చడు. తీర్పు తీర్చు కార్యము ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఇది కేవలము ఒక వ్యక్తి కొరకు మాత్రమే నిర్వహించబడదు. మానవాళియంతటికి తీర్పు తీర్చబడుచున్నదని సూచించు క్రమములో జన సమూహం తీర్పుకు గురయ్యే కార్యమైయున్నది. జన సమూహం పై ఆయన కార్యమును వ్యక్తిగతంగా కొనసాగించుట ద్వారా శరీరములో ఉన్నటువంటి దేవుడు సమస్త మానవాళిని సూచించునట్లుగా ఆయన కార్యమును ఉపయోగించుకుంటాడు, ఆ తరువాత అది క్రమేపి వ్యాపిస్తుంది. తీర్పు తీర్చు కార్యము కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు ఒక నిర్దిష్టమైన వ్యక్తిని గాని లేక ఒక నిర్దిష్టమైన జన సమూహాన్ని గాని తీర్పు తీర్చడు గాని సమస్త మానవాళి యొక్క అవినీతిని, ఉదాహరణకు దేవునిపట్ల మనిషి తిరుగుబాటును, లేక ఆయనపట్ల మానవుని భక్తిహీనత, లేక దేవుని కార్యమునాకు మానవుని ఆటంకం, ఇలా మొదలగు వాటికి తీర్పు తీరుస్తాడు. దేవునిపట్ల మానవాళి యొక్క తిరుగుబాటు గుణగణాలకు తీర్పు తీర్చబడుతుంది, ఈ కార్యము అంత్య దినాలలోని జయించు కార్యమైయున్నది. మనుష్యుల ద్వారా సాక్ష్యము పొందిన శరీరధారియైన దేవుని కార్యము మరియు మాటలు అంత్య దినాలలో గొప్ప ధవళ సింహాసనం ఎదుట తీర్పు తీర్చు కార్యమైయున్నది. ఇది గత కాలములోనే మనిషి ద్వారా పరిగణించబడింది. శరీరధారియైన దేవుని ద్వారా ప్రస్తుతం జరుగుచున్న కార్యము ఏమనగా గొప్ప ధవళ సింహాసనం ఎదుట జరిగే తీర్పుయైయున్నది. నేటి శరీరధారియైన దేవుడు అంత్య దినాలలో సమస్త మానవాళికి తీర్పు తీర్చే దేవుడైయున్నాడు. ఈ శరీరము మరియు ఆయన కార్యము, ఆయన వాక్యము, మరియు ఆయన స్వభావమంతయు కలిపి ఆయనైయున్నాడు. ఆయన కార్యమునకు పరిమితిగల పరిధి ఉన్నప్పటికి, విశ్వమంతటిలో నేరుగా జోక్యము చేసుకునే అవకాశం లేకపోయినప్పటికి, తీర్పు తీర్చు కార్యము యొక్క ముఖ్యాంశము ఏమనగా సమస్త మానవాళికి నేరుగా తీర్పు తీర్చడమే, అంటే చైనాలో ఎన్నుకొనబడిన ప్రజలకు మాత్రమే కాకుండా, కొద్ది సంఖ్య ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కాకుండా అందరికి తీర్పు తీర్చడమని అర్థం. శరీరమందున్న దేవుని కార్యము జరుగుచున్నప్పుడు, ఈ కార్యము యొక్క పరిధి విశ్వమంతటికి వ్యాపించినప్పటికి, ఇది విశ్వమంతటి కార్యమునకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆయన శరీరము అనుమతించే కార్యపు పరిధిలోనే ఆయన తన కార్యమును ముగించిన తరువాత, ఆయన ఈ కార్యమును తక్షణమే విశ్వమంతటికి వ్యాపింప జేస్తాడు, ఈ విధంగా యేసు సువార్తతోపాటు ఆయన పునరుత్థానము మరియు ఆరోహణములను గూర్చిన వార్త కూడా విశ్వమంతట వ్యాపిస్తుంది. ఇది ఆత్మ కార్యమా, లేక శరీర కార్యమా అనేదానితో సంబంధము లేకుండా, పరిమితిగల పరిధిలోనే ఈ కార్యము కొనసాగించబడుతుంది, అయితే విశ్వమంతట జరిగే కార్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంత్య దినాలలో దేవుడు తన కార్యమును తన శరీరావతారపు గుర్తింపు ద్వారానే జరిగిస్తాడు మరియు శరీరమందున్న దేవుడే గొప్ప ధవళ సింహాసనము ఎదుట మనుష్యులకు తీర్పు తీరుస్తాడు. ఆయన ఆత్మయైయున్నాడా లేక శరీరమైయున్నాడా అనేదానితో సంబంధము లేకుండా, తీర్పు తీర్చు కార్యము జరిగించు ఆయన అంత్య దినాలలో సమస్త మానవాళికి తీర్పు తీర్చే దేవుడైయున్నాడు. దీనిని ఆయన కార్యమును ఆధారము చేసుకొని నిర్వచించడం జరిగింది మరియు ఇది ఆయన బహిరంగ రూపము ద్వ్రారానో లేక ఇతర అనేక అంశాల ద్వారానూ నిర్వచించలేదు. ఈ మాటలను గూర్చి మనిషి ఎన్నో తలంపులను కలిగియున్నప్పటికి, శరీరధారియైన దేవుని తీర్పును గూర్చిన విషయాన్ని మరియు సమస్త మానవాళిని జయించుట గూర్చియైన విషయాన్ని ఏ ఒక్కరూ నిరాకరించలేరు. దీనిని ఎవరు ఏమి ఆలోచించినా, మొత్తం మీద వాస్తవాలు వాస్తవాలే. “కార్యము దేవుని ద్వారా జరిగింది గాని శరీరము దేవుడు కాదు” అని ఎవరూ చెప్పలేరు. ఇది అర్థంలేని విషయం, ఎందుకంటే ఈ కార్యము శరీరమందున్న దేవుని ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాను జరిగించబడదు. ఈ కార్యము ఇప్పటికే పూర్తి అయినందున, ఈ కార్యమును అనుసరించి మానవులకు తీర్పు తీర్చే దేవుని కార్యము రెండవసారి కనిపించదు; దేవుడు ఇప్పటికే తన రెండవ శరీరావతారపు సమస్త నిర్వహణ యొక్క కార్యమంతా. ముగించాడు. ఇక దేవుని కార్యములో నాల్గవ దశ అనేది ఉండదు. ఎందుకంటే తీర్పు తీర్చబడిన వ్యక్తి మనిషి, అనగా భ్రష్టుపట్టిన శరీరములో ఉన్న మనిషి. నేరుగా తీర్పు తీర్చబడిన సాతాను ఆత్మ కాదిది. అందుచేత, తీర్పు తీర్చు కార్యము ఆధ్యాత్మిక ప్రపంచములో కొనసాగించబడలేదు గాని మనుష్యుల మధ్యన జరిగింది. భ్రష్టుపట్టిన మానవ శరీరానికి తీర్పు తీర్చు కార్యము కొరకు శరీరమందున్న దేవుడు తప్ప ఏ ఒక్కరు తగినవారు కాదు, ఏ ఒక్కరు అర్హులు కాదు. తీర్పు తీర్చుట నేరుగా దేవుని ఆత్మ ద్వారా కొనసాగినట్లయితే, అప్పుడు ఇదంతా స్వీకరించే విషయంగా ఉండదు. అంతేగాకుండా, మనిషి అటువంటి కార్యమును అంగీకరించాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆత్మ మనిషితో ముఖాముఖిగ వచ్చి వ్యవహరించలేదు. ఈ కారణముచేత, ప్రభావములు తక్షణమే కనిపించవు, అప్పుడు మనిషి లోపములేని దేవుని స్వభావమును మరింత స్పష్టంగా చూడటములో లోపిస్తాడు. శరీరమందున్న దేవుడు మానవాళికి భ్రష్టత్వమునకు తీర్పు తీర్చినపుడు మాత్రమే సాతాను పూర్తిగా ఓడిపోతాడు. మనిషి సామాన్య మానవ జీవితాన్ని కలిగియున్నట్లుగానే, శరీరమందున్న దేవుడు మనిషి యొక్క అవినీతిని నేరుగా తీర్పు తీర్చగలడు; ఇది ఆయన అంతరంగ పరిశుద్ధతకు మరియు ఆయన అసాధారణ విషయాలకు గురుతైయున్నది. మనిషికి లేక మనుష్యులకు తీర్పు తీర్చడానికి దేవుడు మాత్రమే అర్హుడు మరియు ఆయన మాత్రమే ఆ స్థానమందున్నాడు. ఎందుకంటే ఆయనే సత్యమైయున్నాడు మరియు నీతియైయున్నాడు. అందుచేత ఆయన మనుష్యులకు తీర్పు తీర్చగలడు. సత్యము మరియు నీతి అనే సుగుణాలు లేనివారందరూ ఇతరులకు తీర్పు తీర్చడానికి యోగ్యులు కారు. ఈ కార్యము దేవుని ఆత్మ ద్వారా జరిగించబడినట్లయితే, అప్పుడు సాతానుపై విజయము సాధించినట్లు కాదు. క్షయమైన వాటికంటే ఆత్మ ఉన్నతమైనది, దేవుని ఆత్మ పరిశుద్ధమైనది, మరియు శరీరము మీద విజయము సాధించేది. ఈ కార్యమును ఆత్మ నేరుగా చేసినట్లయితే, ఆయన సమస్త మానవాళి అవిధేయత విషయమై తీర్పు తీర్చలేకపోయేవాడు మరియు సమస్త మానవాళి అవినీతిని బయలుపరచకలేకపోయేవాడు. ఎందుకంటే తీర్పు తీర్చే కార్యము దేవుని గూర్చిన మనుష్యుల తలంపుల విషయమై కూడా జరిగించబడుతుంది. మనిషికి ఆత్మ విషయమై ఎటువంటి ఆలోచనలను కలిగియుండడు. అందుచేత, ఆత్మ మనుష్యుల అవినీతిని బయలుపరచలేదు, అటువంటి అవినీతిని పూర్తిగా బయలుపరచలేడు. శరీరధారియైన దేవుడు ఆయనను గురించి ఎరగని వారందరికి శత్రువైయున్నాడు. ఆయనకు వ్యతిరేకతను మరియు మనుష్యుల ఆలోచనలను తీర్పు తీర్చుట ద్వారా ఆయన మనుష్యుల అవిధేయతనంతటిని బహిర్గతం చేస్తాడు. శరీరమందున్న ఆయన కార్యము యొక్క ప్రభావములు ఆత్మ కార్యము యొక్క ప్రభావములకంటే ఎక్కువగా కనిపిస్తాయి. అందుచేత, సమస్త మానవాళికి తీర్పు తీర్చడమనేది ఆత్మ ద్వారా నేరుగా జరిగించబడదు గాని శరీరధారియైన దేవుని కార్యము ద్వారానే జరిగించబడుతుంది. శరీరమందున్న దేవుడు మనిషికి కనిపిస్తాడు మరియు ఆయనను మనిషి తాకగలడు. శరీరమందున్న దేవుడు సంపూర్ణముగా మనిషిని జయించగలడు. శరీరమందున్న దేవునితో తనకున్న సత్సంబంధములో మనిషి తిరుగుబాటు నుండి విధేయతకు, హింస నుండి స్వీకరించుటకు, ఆలోచనల నుండి జ్ఞానముకు మరియు తిరస్కరించుట నుండి ప్రేమ చూపించుటకు ఎదుగుతూ వెళ్తాడు, అంటే ఇవన్ని శరీరధారియైన దేవుని కార్యము యొక్క ప్రభావాలు. మనిషి కేవలము ఆయన తీర్పును అంగీకరించుట ద్వారానే రక్షించబడతాడు, మనిషి కేవలము ఆయన నోట నుండి వచ్చే మాటల ద్వారానే ఆయనను క్రమేపి తెలుసుకుంటాడు, మనిషి ఆయనను వ్యతిరేకించినప్పుడే ఆయన ద్వారా జయించబడతాడు. మనిషి ఆయన శిక్షను స్వీకరించినప్పుడే ఆయన నుండి జీవమును పొందుకుంటాడు. ఈ కార్యమంతయు శరీరమందున్న దేవుని కార్యమైయున్నదే గాని ఆత్మగా ఆయన గుర్తింపులో జరిగిన కార్యము కాదు. శరీరధారియైన దేవుని ద్వారా జరిగిన కార్యము చాలా గొప్ప కార్యము, చాలా గాఢమైన కార్యము మరియు దేవుని కార్యములోని మూడు దశల చాలా ప్రాముఖ్యమైన కీలకమైన భాగాలు శరీరధారియైన దేవుని కార్యములోని రెండు దశలు. మనిషి యొక్క భ్రష్టత్వము శరీరధారియైన దేవుని కార్యానికి గొప్ప అడ్డుబండయైయున్నది. ప్రత్యేకంగా, అంత్య దినాలలోని ప్రజల మధ్యన కొనసాగే కార్యము బహు భయంకరమైన కష్టముతో కూడుకున్నది. వాతావరణం ప్రతికూలంగా ఉంది. ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యము చాలా తక్కువగా ఉంది. అయినా, ఈ కార్యము యొక్క ముగింపు ఎటువంటి లోపాలు లేకుండా సరియైన ఫలితాన్ని సాధిస్తోంది; ఇది శరీర కార్యము యొక్క ప్రభావము. ఈ ప్రభావము ఆత్మ కార్యముకంటే ఎక్కువ ఆమోదయోగ్యమైయున్నది. దేవుని కార్యములోని మూడు దశలు శరీరములోనే ముగించబడతాయి మరియు అవి తప్పకుండ శరీరధారియైన దేవుని ద్వారానే ముగించబడాలి. అతి ప్రాముఖ్యమైన మరియు అతి ప్రాధానమైన కార్యము శరీరములోనే జరిగించబడుతుంది. మనిషి యొక్క రక్షణ తప్పనిసరిగా శరీరమందున్న దేవుని ద్వారానే స్వయంగా నిర్వహించబడుతుంది. శరీరమందున్న దేవుడు మనిషితో ఏ మాత్రం సంబంధము లేకుండా ఉన్నాడని సమస్త మానవాళి అనుకున్నప్పటికి, వాస్తవానికి ఈ శరీరము సమస్త మానవాళి యొక్క అస్తిత్వానికి మరియు వారి భవిష్యత్తుకి సంబంధించి ఉంటుంది.

దేవుని కార్యములో ప్రతి యొక్క దశ మానవాళియంతటి కొరకే అమలు చేయడం జరుగుతుంది మరియు దేవుని కార్యములోని ప్రతి దశ మనుష్యులందరిని నిర్దేశిస్తుంది. శరీరములో ఆయన కార్యము జరుగుచున్నప్పటికినీ, ఇది ఇప్పటికీ మనుష్యులందరిని నిర్దేశిస్తుంది; ఆయన మనుష్యులందరికి దేవుడైయున్నాడు, మరియు ఆయన సృష్టించబడినవాటికి మరియు సృష్టించబడనివాటికి దేవుడైయున్నాడు. శరీరమందు ఆయన కార్యము పరిమితమైనప్పటికీ, ఈ కార్యమునకున్న లక్ష్యం కూడా పరిమితమే, ఆయన తన కార్యమును చేయుటకు శరీరధారునిగా వచ్చే ప్రతిసారి ఆయన తన కార్యమునకు లక్ష్యాన్ని అత్యున్నత ప్రాతినిధ్యంగా ఎంచుకుంటాడు; కార్యము జరిగించడానికి ఆయన సాదాసీదా ప్రజలను, గుర్తింపులేని ప్రజల గుంపును ఎన్నుకోడు గాని ఆయన కార్యమునకు లక్ష్యంగా శరీరములోని ఆయన కార్యము కొరకు ప్రాతినిధ్యం వహించగల సమర్థులైన ప్రజల గుంపునే ఎన్నుకుంటాడు. ఈ ప్రజల గుంపును ఎన్నుకొనుటకుగల కారణం శరీరములోని ఆయన కార్యమునకుగల పరిధి పరిమితమైనది మరియు ఈ గుంపు ప్రత్యేకముగా శరీరధారియైన ఆయన కొరకు సిద్ధం చేయబడింది. అంతేగాకుండా, ఈ గుంపు శరీరములోని ఆయన కార్యము కొరకు ప్రత్యేకంగా ఎన్నుకోబడింది. దేవుని కార్యము కొరకు ఆయన ఎన్నుకొనిన లక్ష్యాలన్ని ఆధారములేనివి, అయితే ఇవన్నీ నియమ ప్రకారంగా జరిగించబడతాయి: కార్యము యొక్క లక్ష్యం తప్పనిసరిగా శరీరములోని దేవుని కార్యమునకు ప్రయోజనకరంగా ఉండాలి మరియు తప్పనిసరిగా సమస్త మానవాళికి ప్రాతినిధ్యం వహించాలి. ఉదాహరణకు, యేసు యొక్క వ్యక్తిగత విమోచనమును అంగీకరించుటలో సమస్త మానవాళికి యూదులు ప్రాతినిధ్యం వహించారు, మరియు శరీరధారియైన దేవుని వ్యక్తిగత జయముగా అంగీకరించుటలో సమస్త మానవాళికి చైనీయులు ప్రాతినిధ్యం వహించాలి. సమస్త మానవాళికి యూదులు ప్రాతినిధ్యం వహించుటకు ఒక ఆధారము ఉంది, అలాగే దేవుని యొక్క వ్యక్తిగత జయమును అంగీకరించుటలో సమస్త మానవాళి కొరకు చైనా దేశపు ప్రజలు ప్రాతినిధ్యం వహించడానికి కూడా ఆధారము కలదు. యూదులు మధ్యన జరిగిన విమోచన కార్యముకంటే ఎక్కువగా విమోచనము యొక్క ప్రాధాన్యతను ఏదీ బయలుపరచలేదు. అలాగే, చైనీయుల మధ్య జరుగుచున్న విజయపు కార్యముకంటే ఎక్కువగా విజయపు కార్యము యొక్క యశస్సును మరియు పరిపూర్ణతను ఏదీ బయలుపరచజాలదు. చిన్న గుంపుగా ఉన్నటువంటి ప్రజల మధ్యనే శరీరధారియైన దేవుని వాక్యము మరియు ఆయన కార్యము కనబడుతుంది. వాస్తవానికి, ఈ చిన్న మంద లేక గుంపు మధ్యన జరిగే ఆయన కార్యము విశ్వమంతట జరిగే కార్యమైయున్నది మరియు ఆయన వాక్యము మనుష్యులందరినీ నిర్దేశిస్తుంది. శరీరమందు ఆయన కార్యము ముగిసిన తరువాత, వారి మధ్య జరిగించిన కార్యమును ఆయనను వెంబడించిన ప్రజలందరూ వ్యాపకము చేయుటను ప్రారంభిస్తారు. శరీరమందు ఆయన కార్యమును గూర్చిన ఉన్నత విషయమేమంటే ఆయన ఖచ్చితమైన మాటలను మరియు ఉపదేశాలను అందించుట మరియు ఆయనను వెంబడించే మానవాళి కొరకు ఆయన ప్రత్యేకమైన చిత్తమును కలిగియుండుటయే. తద్వారా, ఆయన అనుచరులందరూ శరీరమందున్నప్పుడు ఆయన జరిగించిన కార్యమునంతటిని, ఈ మార్గమును స్వీకరించువారందరికి సమస్త మానవాళికి ఆయన చిత్తమును మరింత ఖచ్చితంగా మరియు మరింత బలంగా వ్యాపకం చేస్తారు. మనుష్యుల మధ్యన శరీరమందు జరిగే దేవుని కార్యము మాత్రమే నిజంగా మనుష్యులతో దేవుడు ఉన్నాడని మరియు ఆయన కలిసి జీవిస్తున్నాడనే సత్యాన్ని నెరవేరుస్తాయి. కేవలము ఈ కార్యము మాత్రమే దేవుని ముఖ దర్శనము చేసుకోవాలనే మానవుల ఆశను, దేవుని కార్యమునకు సాక్ష్యులుగా ఉండాలనే కోరికను మరియు దేవుని వాక్యమును వ్యక్తిగతంగా వినాలనే కోరికను నెరవేర్చగలవు. యెహోవా తిరిగి మనుష్యులకు ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే శరీరధారియైన దేవుడు యుగానికి ముగింపు తీసుకు వస్తాడు. అన్య దేవునియందు మనుష్యుల నమ్మకాన్ని పెట్టిన యుగానికి కూడా ఆయన ముగింపును తీసుకు వస్తాడు. విశేషంగా, చివరిగా వచ్చిన శరీరధారియైన దేవుని కార్యము సమస్త మనుష్యులందరినీ మరింత వాస్తవికమైన, మరింత ఆచరణాత్మకమైన, మరింత అందమైన యుగములోనికి తీసుకు వస్తుంది. సిద్ధాంతపరమైన మరియు ధర్మశాస్త్రపరమైన యుగాన్ని మాత్రమే ముగించడు గాని మరింత ఎక్కువ ప్రాముఖ్యంగా సామాన్యమైన, నిజమైన, నీతి గల, పరిశుద్ధమైన, నిర్వహణ ప్రణాళిక యొక్క కార్యమును విప్పగలిగిన, మనుష్యుల గమ్యాన్ని మరియు రహస్యాలను బయలు పరచగలిగిన మనుష్యులందరిని సృష్టించిన మరియు నిర్వహణ కార్యమునకు ముగింపును తీసుకురాగలిగిన, వేల సంవత్సరాల కొలది రహస్యమందున్న దేవుణ్ణి ఆయన మనుష్యులందరికి కనుబరుస్తాడు. అస్పష్టతతో కూడిన యుగానికి ఆయన ముగింపు పలుకుతాడు. సమస్త మానవాళి దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి ఇష్టపడి, ఆయనను చూడలేని స్థితిని కలిగిన యుగానికి మరియు సాతానును సేవించిన సమస్త మానవాళి ఉన్నటువంటి యుగానికి ఆయన ముగింపు పలుకుతాడు. ఆయన సమస్త మానవాళిని సంపూర్ణముగా క్రొత్త యుగములోనికి నడిపిస్తాడు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ స్థానములో శరీరమందున్న దేవుని కార్యమైయున్నది. దేవుడు ఆయన శరీరములో ఉండి కార్యము జరిగించినప్పుడు, ఆయనను వెంబడించు వారందరూ ఉనికిలో ఉన్నవాటిని మరియు ఉనికిలో లేనివాటిని వెదకరు మరియు వాటి వెంట గుడ్డిగా వెళ్లరు. వారు అస్పష్టమైన దేవుని చిత్తాన్ని కనుగొనడం ఆపేస్తారు. శరీరమందు ఆయన కార్యమును దేవుడు విస్తరింపజేసినప్పుడు, సమస్త మతాలకు మరియు శాఖలకు శరీరమందు ఆయన జరిగించిన కార్యము మీదనే ఆయనను వెంబడించు వారందరూ దాటి వెళ్ళుదురు. ఆయన మాటలన్నిటిని వారు సమస్త మానవాళి చెవులకు వినిపింతురు. సువార్తను అంగీకరించినవారందరి ద్వారా వినినదంతయు ఆయన కార్యము యొక్క వాస్తవ సంగతులే, మనుష్యులందరూ వ్యక్తిగతంగా వినిన మరియు చూచిన సంగతులే, మరియు వాస్తవ సంఘటనలె గానీ వదంతులు కాదు. ఆయన తన కార్యమును విస్తరింపజేయడానికి ఈ వాస్తవ సంగతులన్నీ నిదర్శనమైయున్నాయి. అవన్నియు ఆయన కార్యమును విస్తరింపజేయుటలో ఆయన ఉపయోగించే ఉపకరణాలుగాను ఉన్నాయి. వాస్తవ సంగతులు లేకుండా, ఆయన సువార్తను సమస్త దేశాలకు మరియు సమస్త స్థలాలకు వ్యాపకము కాదు; వాస్తవాలు లేకుండా, మనిషి యొక్క ఊహా గానాలతోనే మనిషి సమస్త విశ్వమును జయించు కార్యమును జరిగించలేడు. ఆత్మ మనిషికి అర్థము కానిది, మనిషికి కనపడనిది, మరియు ఆత్మ కార్యము అనేది మనుష్యుల కొరకు జరుగుచున్న దేవుని కార్యపు వాస్తవాలను లేక ఆధారాలను వదిలిపెట్టలేని స్థితిలో ఉండేది. మనిషి దేవుని నిజమైన ముఖాన్ని ఎప్పటికీ చూడలేడు, అతను ఎల్లప్పుడూ ఉనికిలోని అస్పష్టమైన దేవునియందు మాత్రమే నమ్మకము కలిగియుంటాడు. మనిషి దేవుని ముఖాన్ని ఎప్పటికీ చూడలేడు, లేక దేవుడు వ్యక్తిగతంగా పలికిన మాటలను ఎప్పటికీ వినలేడు. ఇవన్నీ విన్న తరువాత, మనిషి యొక్క ఊహా గానాలన్నీ కేవలము శూన్యం, అవి దేవుని నిజమైన ముఖాన్ని బదిలీ చేయలేవు. దేవుని స్వాభావికమైన స్వభావము మరియు దేవుడు స్వయంగా జరిగించే కార్యము మనిషి ద్వారా నకలు చేయబడవు. పరలోకమందు అదృశ్యుడైన దేవుడు మరియు ఆయన కార్యము కేవలము మనుష్యుల మధ్యన ఆయన కార్యమును స్వయంగా చేయడానికి శరీరధారియైన దేవుని ద్వారానే ఈ భూమికి తీసుకు రాబడుతుంది. ఇదే దేవుడు మనిషికి కనిపించే అత్యంత ఆదర్శవంతమైన మార్గము, ఈ మార్గమునందే మనిషి దేవుణ్ణి చూస్తాడు మరియు దేవుని నిజమైన ముఖాన్ని తెలుసుకుంటాడు. ఇటువంటి కార్యము శరీరధారిగా రానటువంటి దేవుని ద్వారా జరగదు. ఈ దశకు ఎవుని కార్యాన్ని తీసుకురావడం, దేవుని కార్యము ఇప్పటికే సరైన ప్రభావమును చూపించింది మరియు సంపూర్ణమైన యశస్సును కలిగియున్నది. శరీరమందు జరుగుచున్న వ్యక్తిగత దేవుని కార్యము ఆయన కార్య నిర్వహణ కార్యములో తొంభై శాతపు కార్యము పూర్తయింది. ఈ శరీరము ఆయన కార్యమంతటికి ఉత్తమ ఆరంభాన్ని ఇచ్చింది, మరియు ఆయన కార్యమంతటికి సారాంశమును ఇచ్చింది, ఆయన కార్యమంతా విస్తరించులాగున చేసింది, మరియు ఈ కార్యమంతటికి పూర్తిగా సంపూర్ణతను నింపింది. అందుచేత, దేవుని కార్యములోని నాల్గవ దశను జరిగించుటకు మరొక శరీరధారియైన దేవుడు ఉండడు, శరీరధారియైన మూడవ దేవుని అద్భుత కార్యములు ఏవీ ఉండవు.

శరీరములోని దేవుని కార్యము యొక్క ప్రతి దశ యుగమందంతట జరిగే ఆయన కార్యమునకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే ఇది మనిషి చేసే ఒక కార్యమువలె ఒక నిర్దిష్టమైన కాలానికి ప్రాతినిధ్యం వహించదు. అందుచేత, ఆయన చివరిసారిగా శరీరధారునిగా వచ్చిన కార్యము ముగింపుకు వచ్చిందంటే దాని అర్థం ఆయన కార్యము సంపూర్ణముగా ముగిసిందని కాదు, ఎందుకంటే శరీరమందు ఆయన కార్యము యుగమంతటికి ప్రాతినిధ్యం వహిస్తుంది గాని శరీరములో ఆయన జరిగించు ఆయన కార్యము యొక్క కాల వ్యవధికి మాత్రమే ప్రాతినిధ్యం వహించదు. ఆయన శరీరమందుండు కాలములో యుగానికంతటికి కావలసిన ఆయన కార్యమును సంపూర్తి చేశాడని అర్థం, దీని తరవాత ఇది సర్వ స్థలములకు వ్యాపిస్తుంది. శరీరధారియైన దేవుడు ఆయన పరిచర్యను నెరవేర్చిన తరువాత, ఆయన భవిష్యత్తు కార్యమును ఆయనను వెంబడించువారికి ఆయనే అప్పగిస్తాడు. ఈ విధంగా, యుగమంతటికి జరిగిన ఆయన కార్యము అడ్డు ఆటంకాలు లేకుండా కొనసాగించబడుతుంది. శరీరధారునిగా యుగమంతటి కొరకు జరిగిన కార్యము విశ్వమంతట వ్యాపించినప్పుడే సంపూర్ణమైన కార్యముగా పరిగణించబడుతుంది. శరీరధారియైన దేవుని కార్యము ఒక క్రొత్త శకమును ప్రారంభిస్తుంది. ఆయన కార్యమును కొనసాగించువారందరూ ఆయన ద్వారా వాడబడుచున్న వారుగా పరిగణించబడతారు. మనిషి ద్వారా జరిగిన కార్యముమంతా శరీరములో ఉన్నటువంటి దేవుని పరిచర్య పరిధిలోనే జరిగింది. అయితే ఈ పరిధికంటే అతీతంగా ఇది వెళ్ళలేదు. శరీరధారియైన దేవుడు ఆయన కార్యమును జరిగించుటకు రాకపోయినట్లయితే, మనిషి పాత యుగానికి ముగింపు తీసుకు రాలేడు మరియు క్రొత్త యుగానికి నాంది పలకలేడు. మనిషి ద్వారా జరిగించబడిన కార్యము మనిషి చేయగలిగిన తన కర్తవ్యపు పరిధిలోనే ఉంటుంది. అప్పుడది దేవుని కార్యానికి ప్రాతినిధ్యం వహించలేదు. కేవలం శరీరధారియైన దేవుడు వచ్చి, ఆయన చేయవలసిన కార్యమును సంపూర్తి చేయాలి. ఆయన గాకుండా ఏ ఒక్కరూ ఈ కార్యాన్ని ఆయన పక్షాన నిలబడి చేయజాలరు. అవును, నేను శరీరావతారపు కార్యమును గూర్చియే మాట్లాడుచున్నాను. ఈ శరీరధారియైన దేవుడు మొట్ట మొదటిగా మనిషి ఆలోచనలకు అనుగుణంగా లేనటువంటి కార్యపు దశను తీసుకువస్తాడు, ఆ తరువాత ఆయన మనుష్యుల ఆలోచనలకు అనుగుణంగా లేనటువంటి మరి ఎక్కువ కార్యమును జరిగిస్తాడు. కార్యము యొక్క లక్ష్యము ఏమనగా మనిషిని జయించడమే. ఒక రకంగా, శరీరధారియైన దేవుడు మనిషి ఆలోచనలను ఆమోదించడు, దానికి తోడుగా ఆయన మనుష్యుల ఆలోచనలకు అనుగుణంగా లేనటువంటి కార్యాన్ని మరి ఎక్కువగా చేస్తాడు. అందుచేత, మనిషి ఆయనను గూర్చి మరిన్ని క్లిష్టమైన దృష్టికోణాలను వృద్ధి చేసుకుంటాడు. ఆయనను గూర్చి లెక్కలేనన్ని ఆలోచనలను కలిగియున్న ప్రజల మధ్యన ఆయన కేవలము జయించు కార్యమును జరిగిస్తాడు. వారు ఆయనను ఎలా చూస్తారన్న దానితో సంబంధము లేకుండా, ఆయన తన పరిచర్యను జరిగించి, నేరవేర్చినప్పుడు ప్రజలందరూ ఆయన సర్వాధికారమునకు లోబడుతారు. ఈ కార్యము యొక్క వాస్తవము చైనా ప్రజల మధ్యన ప్రతిబింబించడం మాత్రమే కాకుండా, సమస్త మానవాళియంతయు ఎలా జయించాలనే దానిని కూడా సూచిస్తోంది. ఈ ప్రజల మీద సాధించిన ప్రభావాలన్నియుసమస్త మానవాళి పైన సాధించే ప్రభావాలకు ముందుగా పయనించేవిగా ఉన్నాయి. భవిష్యత్తులో ఆయన చేసే కార్యము యొక్క ప్రభావలన్నియు ఈ ప్రజలపై ఉన్న ప్రభావాలకంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. శరీరములోని దేవుని కార్యము గొప్ప ఆర్భాటమును కలుగజేయదు, లేక మరుగున పడిపోదు. ఇది నిజమైన కార్యము మరియు వాస్తవికమైనది. ఈ పని ఒకటిగా ఎంచినట్లయితే, ఆ ఒక్కటి రెండింటికి సమానమైయున్నది. ఇది ఏ ఒక్కరి నుండి దాచబడియుండేది కాదు, లేక ఏ ఒక్కరిని మోసము చేసేది కాదు. ప్రజలు చూసేవన్ని నిజమైనవి మరియు వాస్తవ సంగతులే మరియు మనుష్యులు పొందుకునేవన్ని నిజమైన సత్యమే మరియు నిజమైన జ్ఞానమే. కార్యము ముగిసినపోయినప్పుడు, మనిషి ఆయనను గూర్చిన క్రొత్త జ్ఞానాన్ని పొందుకుంటాడు. నిజముగా వెంబడించువారందరికి ఆయనను గూర్చి ఎటువంటి ఆలోచనలు కలిగియుండరు. ఇది చైనా ప్రజల మీద జరిగిన ఆయన కార్యము యొక్క ప్రభావము మాత్రమే కాదు గాని ఇది సమస్త మానవాళిని జయించు ఆయన కార్యము యొక్క ప్రభావమును సూచిస్తుంది. ఈ శరీరము, ఈ శరీరము యొక్క కార్యము మరియు ఈ శరీరము యొక్క ప్రతీ విషయముకంటే సమస్త మానవాళిని జయించు కార్యమునకు ఎక్కవ ప్రయోజనమేమీ లేదు. అవన్నియు ఈ రోజున ఆయన కార్యమునకు మరియు భవిష్యత్తులో జరగబోయే ఆయన కార్యమునకు ప్రయోజనకరమైయున్నవి. ఈ శరీరము మానవాళియందంతటిని జయిస్తుంది మరియు సమస్త మానవాళిని గెలుస్తుంది. సమస్త మానవాళిని దేవుణ్ణి కలిగియుండే, దేవునికి విధేయత చూపే, దేవుని గురించి తెలుసుకునే మరియొక గొప్ప కార్యము ఇంకొకటి లేదు. మనిషి ద్వారా జరిగించబడే కార్యము కేవలము ఒక పరిధితో కూడిన పరిమితిని కలిగియుంటుంది. దేవుడు తన కార్యమును జరిగించినప్పుడు ఒక నిర్దిష్టమైన వ్యక్తితో ఆయన మాట్లాడడు గాని ఆయన సమస్త మానవాళితోను మరియు ఆయన వాక్కులను అంగీకరించువారందరితోను మాట్లాడుచున్నాడు. ఆయన ప్రకటించుట ముగిసిందంటే సమస్త మానవాళికి ముగింపు పలికినట్లే, కేవలము ఒక నిర్దిష్టమైన వ్యక్తికి ముగింపు పలకడం కాదు. ఆయన ఎవరి మీదనూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపడు, లేక ఆయన ఎవరినీ బాధపరచడు. ఆయన సమస్త మానవాళితో మాట్లాడుతాడు మరియు వారి కొరకు కార్యము చేస్తాడు. అందుచేత, ఈ శరీరధారియైన దేవుడు ఇప్పటికే సర్వ మానవాళిని ఒక విధంగా వర్గీకరించాడు, సర్వ మానవాళిని ఇప్పటికే తీర్పు తీర్చాడు మరియు సర్వమానవాళి కొరకు తగిన గమ్యాన్ని సిద్ధము చేశాడు. చైనాలో దేవుడే ఈ కార్యమును జరిగించినప్పటికి, వాస్తవానికి విశ్వమందంతట ఆయన తన కార్యమును జరిగించాడు. ఆయన తన వాక్కులను మరియు కార్య నిర్వహణ కార్యములను ఒకదాని తరువాత ఒకటి జరిగించక ముందు సమస్త మానవాళి మధ్యన ఆయన కార్యము వ్యాపకము అయ్యేంతవరకు ఆయన వేచియుండడు. అది ఆలస్యమవ్వదా? ఇప్పుడు ఆయన ముందుగానే భవిష్యత్తులోని కార్యమును సంపూర్తి చేయగలడు. ఎందుకంటే కార్యము జరిగించువాడు శరీరధారియైన దేవుడైయున్నాడు, ఆయన పరిమితి కలిగిన పరిధిలోనే అపరమితమైన కార్యమును జరిగించుచున్నాడు. ఆ తరువాత మనిషి జరిగించవలసిన కర్తవ్యమును మనిషి జరిగించుటకు ఆయన మనిషిని బలపరచును; ఇది ఆయన కార్యము యొక్క నియమమైయున్నది. ఆయన కొంత కాలం మాత్రమే మనుష్యులతో నివాసముంటాడు, యుగము యొక్క కార్యమంతా ముగిసే వరకు ఆయన మనుష్యులతో ఉండడు. ఎందుకంటే ఆయన దేవుడు గనుక భవిష్యత్తులో తన కార్యమును ముందుగానే చెబుతాడు. ఆ తరువాత, ఆయన తన వాక్కుల ప్రకారముగా సమస్త మానవాళిని వర్గీకరిస్తాడు మరియు సర్వ మానవాళి ఆయన వాక్కుల ప్రకారముగా దశల వారిగా జరిగే ఆయన కార్యములో ప్రవేశించవలసి ఉంటుంది. ఎవరూ ఈ ప్రక్రియను తప్పించుకోలేరు, ఈ ప్రకారముగానే ప్రతియొక్కరూ తప్పనిసరిగా అభ్యసించవలసి ఉంటుంది. అందుచేత, భవిష్యత్తులో యుగమంతా ఆయన వాక్కుల ద్వారానే మార్గ నిర్దేశనం చేయబడుతుంది గాని ఆత్మ ద్వారా నడిపించబడదు.

శరీరమందు దేవుని కార్యము తప్పకుండ శరీరమందే జరగాలి. ఇది దేవుని ఆత్మ ద్వారా నేరుగా జరిగినట్లయితే, ఇది ఎటువంటి ప్రభావములను చూపించదు. ఇది ఆత్మ ద్వారా జరిగించబడిన కార్యమైనప్పటికి, కార్యమునకు గొప్ప ప్రాధాన్యత ఏమీ ఉండదు మరియు అంతిమంగా ఆకట్టుకునే విధంగా ఉండదు. సకల జీవరాశులన్నియు సృష్టికర్త యొక్క కార్యమునకు ప్రాధాన్యత ఉందా లేదా, ఇది దేనిని సూచిస్తోంది మరియు ఇది దేని కోసం జరిగించబడింది, మరియు దేవుని కార్యము అధికారముతోను మరియు జ్ఞానముతోను నింపబడిండా లేదా, ఈ కార్యమునకు అత్యున్నతమైన విలువ మరియు ప్రాధాన్యతలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలని ఇష్టపడతారు. ఆయన చేసే కార్యము సమస్త మానవాళి రక్షణార్థమై, సాతాను పరాజయం చెందుట కొరకు, సమస్త విషయములయందు ఆయనకు సాక్ష్యము కలిగియుండుట కొరకు జరిగిస్తాడు. ఆ విధంగా, ఆయన చేసే కార్యము గొప్ప ప్రాధాన్యతను సంతరించుకోవాలి. మనిషి శరీరము సాతాను ద్వారా భ్రష్టుపట్టిపోయింది, చాలా ఎక్కువగా గృడ్డితనముతో చీకటిమయమైపోయింది మరియు తీవ్ర స్థాయిలో హానికి గురైంది. శరీరమందు దేవుడు ఎందుకు కార్యమును వ్యక్తిగతంగా చేస్తాడు అనుటకు అత్యంత ప్రాథమిక కారణం ఏమనగా ఆయన రక్షణ కార్యము యొక్క లక్ష్యం శరీరమందున్న మనిషి మరియు దేవుని కార్యమును ఆటంకపరచుటకు సాతాను మనిషి శరీరమును వాడుకుంటాడు కాబట్టి. సాతానుతో పోరాటం అనేది వాస్తవానికి మనిషిని జయించు కార్యమైయున్నది మరియు అదే సమయములో, దేవుని విమోచనకి కూడా మనిషి ఒక లక్ష్యమై ఉన్నాడు. ఈ విధంగా శరీరధారియైన దేవుని కార్యము చాలా ప్రాముఖ్యమైనది. సాతాను మనిషి శరీరాన్ని భ్రష్టు పట్టించాడు, మనిషి కూడా సాతాను యొక్క రూపముగా మారిపోయాడు మరియు దేవుని చేతిలో ఓడిపోయిన వ్యక్తిగా మారిపోయాడు. ఈ విధంగా భూమి మీద సాతానుతో యుద్ధము జరిగించు కార్యము ఉంటుంది మరియు మనుష్యులను రక్షించు కార్యము ఉంటుంది. సాతానుతో యుద్ధము చేయడానికి దేవుడు తప్పకుండ మనిషిగా మారాలి. ఇది అత్యంత ఆచరణాత్మకమైన కార్యము. దేవుడు శరీరమందు కార్యము జరిగిస్తున్నప్పుడు, ఆయన వాస్తవానికి శరీరమందున్న సాతానుతో యుద్ధము చేస్తున్నాడు. ఆయన శరీరమందు కార్యము చేస్తున్నప్పుడు, ఆయన ఆధ్యాత్మిక ప్రపంచములో ఆయన కార్యమును జరిగించుచున్నాడు. ఆధ్యాత్మిక ప్రపంచములో ఆయన జరిగించు తన కార్యమునంతటిని భూమి మీద నిజముగా చేయుచున్నాడు. జయించవలసిన వ్యక్తి మనిషి, ఆయనకు విధేయత చూపవలసిన వ్యక్తి మనిషి, మరియు ఓడిపోయిన వ్యక్తి సాతాను యొక్క రూపమును దాల్చాడు (ఈయన కూడా మనిషే), ఆయనకు శత్రువయ్యాడు మరియు అంతిమంగా రక్షించబడవలసిన వ్యక్తి కూడా మనిషే. ఈ విధంగా దేవుడు సృష్టి యొక్క బాహ్య కవచాన్ని కలిగిన మనిషిగా మారవలసిన అవసరత మరింత ఎక్కువ ఉంది, తద్వారా ఆయన సాతానుతో నిజమైన యుద్ధము చేస్తాడు, ఆయనకు అవిధేయత చూపిన, ఆయనవలె అదే విధమైన బాహ్య కవచాన్ని ధరించుకొనిన మనిషిని జయిస్తాడు. ఆయనవలె అదే విధమైన బాహ్య కవచాన్ని ధరించుకొనిన, సాతాను ద్వారా హానికి గురైన మనిషిని రక్షిస్తాడు. ఆయన శత్రువు మనిషే, ఆయన జయించాలని లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి కూడా మనిషే మరియు ఆయన రక్షణ యొక్క లక్ష్యము కూడా ఆయన ద్వారా సృష్టించబడిన మనిషే. అందుచేత, ఆయన తప్పనిసరిగా మనిషిగా రాక తప్పదు. ఈ విధంగా ఆయన కార్యము మరింత సులభముగా మారింది. ఆయన సాతానును ఓడిస్తాడు మరియు మనుష్యులను జయిస్తాడు. అంతేగాకుండా, మనుష్యులందరిని రక్షిస్తాడు. ఈ శరీరము సామాన్యమైనప్పటికిని మరియు నిజమైనప్పటికిని, ఆయన సాధారణ శరీరమును కలిగియుండలేదు; ఆయన మనిషి శరీరమునే కలిగియుండలేదు గాని మానవ మరియు దైవికములతో కలగలపిన శరీరమును కలిగియుండెను. ఇదే ఆయనకు మరియు మనిషికి మధ్యనున్న వ్యత్యాసము. ఇదే దేవుని గుర్తింపునకు గురుతైయున్నది. ఇటువంటి శరీరము మాత్రమే ఆయన ఉద్దేశించిన కార్యమును చేయగలుగుతుంది, శరీరమందు దేవుని పరిచర్యను నెరవేరుస్తుంది మరియు మనుష్యుల మధ్యన ఆయన కార్యమును సంపూర్తిగా చేసి ముగిస్తుంది. అలా కాకపోతే, మనుష్యుల మధ్యన ఆయన కార్యము శూన్యముగాను మరియు లోపభూయిష్టంగాను ఉంటుంది. సాతాను ఆత్మతో దేవుడు యుద్ధము చేసి, జయించినప్పటికి, భ్రష్టుపట్టిన మనిషి యొక్క పాత స్వభావము తొలగిపోదు మరియు దేవునికి అవిధేయత చూపించువారందరూ మరియు ఆయనను ఎదిరించువారందరూ ఆయన సర్వాధికారమునకు నిజముగా లోబడియుండరు. మరొక విధంగా చెప్పాలంటే, ఆయన మానవాళిని జయించలేడని అర్థం, ఆయన సమస్త మానవాళిని పొందుకోలేడని అర్థం. భూమి మీద ఆయన కార్యము జరగకపోతే, అప్పుడు ఆయన నిర్వహణ కార్యమును ముగింపుకు తీసుకు రాలేము, సమస్త మానవాళి విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు. దేవుడు తను సృష్టించిన జీవ రాశులతో విశ్రాంతిలోనికి ప్రవేశించకపోయినట్లయితే, అప్పుడు అటువంటి నిర్వహణ కార్యమునకు ఎటువంటి ఫలితమనేది ఉండదు, తత్ఫలితంగా దేవుని మహిమ కనిపించదు. ఆయన శరీరమునకు అధికారము లేకపోయినా, ఆయన చేయు కార్యము ప్రభావమును సాధిస్తుంది. ఇది ఆయన కార్యము యొక్క అనివార్య నిర్దేశనమైయున్నది. ఆయన శరీరము అధికారమును కలిగియుందా లేదా అనే దానితో నిమిత్తము లేకుండా, ఆయన స్వంతంగా దేవుని కార్యమును జరిగించు కాలము ఆయనే దేవుడైయున్నాడు. ఈ శరీరము ఎంత సాధారణమైనదో మరియు ఎంత సామాన్యమైనదో అనేదానితో సంబంధము లేకుండా, ఆయన చేయవలసిన కార్యమును ఆయన చేయగలడు, ఎందుకంటే ఈ శరీరము కేవలము మనిషి మాత్రమే కాకుండా దేవుడైయున్నాడు. మనిషి చేయలేని కార్యమును ఈ శరీరము జరిగిస్తుందనుటకుగల కారణం ఆయన అంతరంగ సుగుణాలన్ని మనుష్యులందరికంటే విభిన్నంగా ఉంటాయి మరియు ఆయన మనుష్యులను రక్షించగలడు ఎందుకంటే ఆయన గుర్తింపు ఇతర మనుష్యులందరికంటే విభిన్నంగా ఉంటుంది. ఈ శరీరము మనుష్యులందరికి చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఆయన మనిషియైయున్నాడు. అంత మాత్రమే గాకుండా, ఆయన దేవుడైయున్నాడు, ఎందుకంటే సామాన్యమైన శరీరమును కలిగియున్న ఏ మనిషి చేయలేని కార్యాన్ని ఆయన చేయగలడు. ఎందుకంటే భూమి మీద ఆయనతో కలిసి జీవించే భ్రష్టుపట్టిన మనుష్యులను ఆయన రక్షించగలడు. ఆయన మనిషికి సమానంగా ఉన్నప్పటికి, ఇతర ఏ మనిషి యొక్క విలువకంటే శరీరధారియైన దేవుడు మానవాళికి చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా జరగని కార్యము ఆయన చేయగలడు. దేవుని ఆత్మ స్వంతంగా దేవునికి తీసుకువచ్చే సాక్ష్యముకంటేను ఆయన ఎక్కువ సాక్ష్యమును తీసుకువస్తాడు. తత్వలితంగా, ఈ శరీరము సామాన్యముగాను మరియు సాధారణముగాను ఉన్నప్పటికి, మానవాళికి ఆయన అందించే సహకారము మరియు మానవాళికి ఆయన ఇచ్చే ప్రాధాన్యతనుబట్టి ఆయన అత్యంత విలువైన గొప్ప వ్యక్తిగా తీర్చబడ్డాడు. ఈ శరీరము యొక్క నిజమైన విలువ మరియు ప్రాధాన్యత ఏ మనిషికి సాటిలేనిది. ఈ శరీరము సాతానును నేరుగా నాశనము చేయలేకపోయినప్పటికి, ఆయన తన కార్యమును మానవులను జయించడానికి మరియు సాతానును ఓడించడానికి ఉపయోగించుకుంటాడు. అంతేగాకుండా, ఆయన సర్వాధికారమునకు సాతాను సంపూర్ణముగా లోబడునట్లు చేస్తాడు. దేవుడు శరీరధారిగా వచ్చినందునే ఆయన సాతానును ఓడిస్తాడు మరియు మనుష్యులందరిని రక్షిస్తాడు. ఆయన నేరుగా సాతానుని నాశానం చేయడు గాని సాతాను ద్వారా భ్రష్టుపట్టిన మనుష్యులను జయించుట కొరకు తన కార్యమును జరిగించాలని ఆయన శరీరధారిగా వస్తాడు. ఈ విధంగా ఆయన సృష్టించిన సర్వ జీవుల మధ్యన ఆయనకు ఆయనే సాక్ష్యమును కలిగియుంటాడు మరియు ఆయన భ్రష్టుపట్టిన మనుష్యులందరిని రక్షించుకుంటాడు. శరీరధారియైన దేవుడు సాతానును ఓడించడం ద్వారా గొప్ప సాక్ష్యము కలుగుతుంది, దేవుని ఆత్మ ద్వారా నేరుగా సాతానును నాశనము చేయుటకంటే ఎక్కువ ప్రభావమును చూపుతుంది. శరీరములో ఉన్న దేవుడు సృష్టికర్తను తెలుసుకోవడానికి మనుష్యులకు ఎంతగానో సహాయపడతాడు మరియు ఆయన సృష్టించిన జీవుల మధ్యన ఆయన తనుకు తాను గొప్ప సాక్ష్యమును కలిగియుంటాడు.

మునుపటి:  దేవుడి కార్యములోని మూడు దశలు గురించి తెలుసుకోవడమే దేవుడిని తెలుసుకోవడానికి మార్గం

తరువాత:  దేవుడు నివసించే దేహము స్వభావము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger