దేవుడి కార్యములోని మూడు దశలు గురించి తెలుసుకోవడమే దేవుడిని తెలుసుకోవడానికి మార్గం
మనుష్యులను సరైన మార్గంలో నడిపించే కార్యమును మూడు దశలుగా విభజించడమైనది. అంటే, మనుష్యులను రక్షించే కార్యము మూడు దశలుగా విభజించబడినదని దీని అర్థం. ప్రపంచాన్ని సృష్టించే కార్యము ఈ మూడు దశల్లో భాగం కాదు. అయితే, ధర్మ శాస్త్ర యుగము, కృపా యుగము మరియు రాజ్య యుగములలో జరిగిన కార్యమునకు సంబంధించిన మూడు దశలు ఇందులో భాగంగా ఉంటాయి. ప్రపంచాన్ని సృష్టించే కార్యము అనేది మానవాళి మొత్తాన్ని సృష్టించే కార్యమైయుండెను. ఇది మానవాళిని రక్షించే కార్యము కాదు. అలాగే, మానవజాతిని రక్షించే కార్యానికి మరియు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే, ఈ ప్రపంచం సృష్టించబడిన సమయంలో, మననుష్యులెవరూ సాతాను ద్వారా భ్రష్టులు కాలేదు. కాబట్టి, మనుష్యుల రక్షణకు సంబంధించిన కార్యమును నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఎప్పుడైతే, సాతాను ద్వారా మనుష్యులు భ్రష్టుపట్టారో అప్పుడే మనుష్యులను కాపాడే కార్యము ఆరంభమైంది. ఆవిధంగా, మనుష్యులు ఎప్పుడైతే భ్రష్టులయ్యారో, అప్పుడే వారిని సరైన మార్గంలో నడిపించే కార్యము కూడా ఆరంభమైంది. మరో మాటలో చెప్పాలంటే, మనుష్యులను రక్షించే కార్యమునకు ఫలితముగానే మనిషిని సరైన మార్గంలో నడిపించే దేవుని కార్యనిర్వహణ కూడా ప్రారంభమైంది. అంతేతప్ప, ప్రపంచమును సృష్టించే కార్యములో భాగముగా ఇది ఉద్భవించలేదు. మనుష్యుల్లో భ్రష్ట స్వభావం వెలుగులోకి వచ్చిన తర్వాతే, మనిషిని సరైన మార్గంలో నడిపించే కార్యనిర్వహణ ఉనికిలోకి వచ్చింది. కాబట్టే, మనుష్యులను సరైన మార్గంలో నడిపించడానికి ఉద్దేశించిన కార్యనిర్వహణలో నాలుగు దశలు కాకుండా లేదా నాలుగు యుగాలు కాకుండా, మూడు దశలు మాత్రమే ఉంటాయి. కేవలము ఇది మాత్రమే మనుష్యులను సరైన దారిలో పెట్టడానికి దేవుడు చేపట్టిన ఈ కార్య నిర్వహణను సూచించే సరైన మార్గం. ఆఖరి యుగము అంతమయ్యే సమయానికి, మనుష్యులను సరైన దారిలో పెట్టే దేవుని కార్య నిర్వహణ కూడా పూర్తిగా ముగుస్తుంది. ఈ నిర్వహణ కార్యము ముగింపుకు వచ్చిందంటే, మానవాళి మొత్తాన్ని రక్షించే ఈ కార్యము సంపూర్ణముగా పూర్తయ్యిందనీ, మరియు మానవాళి రక్షణ కోసం ఉద్దేశించిన ఈ దశ ముగిసిందనీ అర్థం. సమస్త మానవాళిని రక్షించే కార్యము లేకుండా, మనుష్యులను సన్మార్గంలో నడిపించే కార్య నిర్వహణ కూడా ఉండదు, లేదా అందులో భాగమైయున్న మూడు దశలు కూడా ఉండవు. మనుష్యుల భ్రష్టత్వమే ఇందుకు కీలక కారణం, మరియు మనుష్యులను రక్షించాలనే అత్యవసర పరిస్థితిని బట్టియే యెహోవా అప్పుడు లోకాన్ని సృష్టించడమును నిలిపివేశాడు మరియు ధర్మశాస్త్ర యుగ సంబంధమైన కార్యమును ప్రారంభించాడు. ఆ తర్వాత మాత్రమే, మానవాళిని సరియైన మార్గములో నడిపించే కార్యనిర్వహణ మొదలైంది, అంటే, మానవాళిని రక్షించే కార్యము అప్పుడు మాత్రమే మొదలైందని అర్థం. “మానవాళిని సరియైన మార్గములో నడిపించే కార్యనిర్వహణ” అంటే, భూమి మీద కొత్తగా సృష్టించబడిన మనుష్యుల (అంటే, ఇంకా భ్రష్టుపట్టని మనుష్యుల) జీవితాలకు మార్గనిర్దేశం చేయడం అని అర్థం కాదు. బదులుగా, సాతాను ద్వారా భ్రష్టులైన మనుష్యులను రక్షించడం అని అర్థం, ఒక్కమాటలో చెప్పాలంటే, భ్రష్టుపట్టిన మానవాళిని రూపాంతరము చెండునట్లు చేయడమే ఈ కార్యము యొక్క ఉద్దేశం. “మానవాళిని సరియైన మార్గములో నడిపించే కార్యనిర్వహణ” అనే మాటకు అసలు సిసలైన అర్థం ఇదే. మానవాళిని రక్షించే కార్యములో ప్రపంచాన్ని సృష్టించే కార్యము భాగమై ఉండదు. అదేవిధంగా, మానవాళిని సరియైన మార్గములో నడిపించే కార్య నిర్వహణలో ప్రపంచాన్ని సృష్టించే కార్యము కూడా భాగమై ఉండదు. బదులుగా, ప్రపంచ సృష్టి నుండి వేరుచేయబడిన మూడు దశల కార్యము మాత్రమే ఇందులో ఉంటుంది. మానవాళిని నిర్వహించే కార్యమును అర్థం చేసుకోవాలంటే, ఆ కార్యములో భాగమైన మూడు దశల చరిత్ర గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. రక్షణ పొందుకోవడం కోసం ప్రతి ఒక్కరికీ ఈ అవగాహన ఉండాలి. దేవుని ద్వారా సృష్టించబడిన జీవములుగా, మనిషి దేవుని ద్వారా సృష్టించబడ్డాడని మీరు గుర్తించాలి మరియు మనుష్యుల భ్రష్టత్వము మూలాన్ని మీరు గుర్తించాలి, అంతేకాకుండా, మనిషి రక్షణ పొందే ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. దేవుడి అనుగ్రహం పొందుకునే ప్రయత్నంలో భాగంగా, సిద్ధాంతానికి అనుగుణంగా ఎలా ప్రవర్తించాలో మాత్రమే మీరు తెలుసుకుని, మానవాళిని దేవుడు ఎలా రక్షిస్తాడు లేదా మానవాళి భ్రష్టత్వానికి మూలం ఏమిటి అనే వాటి గురించి మీరు తెలుసుకోకపోతే, దేవుడి ద్వారా సృష్టించబడిన జీవముగా మీరు ఏం తెలుసుకోవాలో అది తెలియని వారుగానే మిగిలిపోతారు. దేవుని నిర్వహణ కార్యమునకు సంబంధించిన విస్తృత పరిధి గురించి అజ్ఞానంగా ఉంటూ, ఆచరణలో పెట్టగల ఆ సత్యాలను అర్థం చేసుకోవడంతోనే నీవు సంతృప్తి చెందితే, నీవు అత్యంత పిడివాదిగానే మిగిలిపోతావు. దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశల కార్యమనేది మనిషి కోసం దేవుని కార్య నిర్వహణలోను, సర్వ లోకమునకు సువార్తను వ్యాపింప జేయుటలోను, సర్వ మానవాళి మధ్యన ఉన్నటువంటి రహస్యమందు అంతర్గత కథనమైయున్నది మరియు అవి సువార్త వ్యాప్తి చేయడానికి ఆ మూడు దశలు పునాది ఉన్నాయి. నీవు నీ జీవితానికి సంబంధించిన సాధారణ సత్యాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే దృష్టి సారిస్తే, మరియు గొప్ప రహస్యాలు మరియు దర్శనాల గురించి నీకు ఏమీ తెలియకపోతే, అప్పుడు నీ జీవితం లోపభూయిష్టమైన ఉత్పత్తికి సమానంగా ఉండడమే కాకుండా, చూసుకోవడానికే తప్ప, మరిదేనికి ఉపయోగపడుతోంది?
మనిషి కేవలం సాధన చేయుట మీద మాత్రమే దృష్టి సారిస్తూ, దేవుని కార్యమును మరియు మనిషి గ్రహించవలసిన దానిని రెండవ స్థానములో చూస్తుంటే, అలాంటి స్థితి అనేది పైసలు మీద దృష్టి పెట్టి, రూపాయిల గురించి పట్టించుకోకపోవడం లాంటిది కాదా? అందుకే, నీవు ఏదైతే తప్పక తెలుసుకోవాలో, దాని గురించి నీవు తప్పక తెలుసుకోవాలి; నీవు ఏదైతే ఆచరణలో పెట్టాలో, దానిని నీవు తప్పక ఆచరణలో పెట్టాలి. అలా చేసినప్పుడే, మీరు సత్యాన్ని ఎలా అనుసరించాలో తెలిసిన వ్యక్తి అవుతారు. నీవు సువార్తను వ్యాప్తి చేసే రోజు వచ్చినప్పుడు, దేవుడు గొప్పవాడు మరియు నీతిమంతుడు అని, ఆయనే సర్వోన్నతమైన దేవుడు అని, ఆయనతో పోల్చదగిన మరే సర్వోత్తముడు లేడని, మరియు అందరికి పైగా ఆయనే దేవుడైయున్నాడని మాత్రమే నీవు చెప్పగలిగితే…, ఈ అసంబద్ధమైన మరియు మిడిమిడి జ్ఞానంతో కూడిన మాటలు మాత్రమే మీ నోటి వెంట వస్తే, అత్యంత ప్రాముఖ్యమైన, అత్యంత కీలకమైన మాటలను మాట్లాడుటకు అసమర్థులుగా ఉంటారు. దేవుణ్ణి తెలుసుకోవడమును గూర్చి, లేదా దేవుని కార్యము గురించి చెప్పడానికి నీ వద్ద ఏమీ లేకపోతే, అంతకుమించి, నీవు సత్యం గురించి వివరణ ఇవ్వలేకపోతే, లేదా మనిషిలో కొరతగా అందివ్వలేకపోతే, అప్పుడు మీలాంటి వ్యక్తి వారి కర్తవ్య నిర్వహణలో అసమర్థులుగా ఉండిపోతారు. దేవునికి సాక్ష్యమివ్వడం మరియు దేవుని రాజ్యము గురించిన సువార్తను వ్యాప్తి చేయడమనేది సాధారణ విషయమేమీ కాదు. అందుకోసం, ముందుగా నీవు సత్యముతో నింపబడాలి మరియు దర్శనాలను అర్థం చేసుకోవాలి. దర్శనాలను మరియు దేవుని కార్యమునకు సంబంధించిన విభిన్న అంశాల్లోని సత్యం గురించి నీవు స్పష్టంగా ఉన్నప్పుడు, మరియు నీ హృదయంలో దేవుని పని గురించి తెలుసుకున్నప్పుడు, దేవుడు చేయబోయే కార్యముతో సంబంధము లేకుండా, అంటే న్యాయసంబంధమైన తీర్పు అయినప్పటికీ, లేదా మనిషికి సంబంధించిన శుద్ధీకరణ అయినప్పటికీ—నీకు పునాదిగా నీవు గొప్ప దర్శనాన్ని పొందుకుంటావు, మరియు ఆచరణలో పెట్టడానికి నీవు సరైన సత్యాన్ని కలిగి ఉంటావు, ఆవిధంగా, నీవు అంతము వరకు దేవుడిని అనుసరించగలుగుతారు. దేవుడు ఏ కార్యము చేసినప్పటికీ, ఆయన కార్యము యొక్క లక్ష్యము మారదు, ఆయన కార్యము యొక్క ముఖ్య ఉద్దేశము మారదు, మరియు మనిషి పట్ల ఆయన చిత్తము మారదని నీవు తప్పక తెలుసుకోవాలి. దేవుడి మాటలు ఎంతటి తీవ్రంగా ఉన్నప్పటికీ, పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఆయన కార్యమందలి నియమాలు మారవు, మరియు మనిషిని రక్షించాలనే ఆయన ఉద్దేశ్యం మారదు. అయితే, ఇదేమీ మనిషి ముగింపునకు సంబంధించిన ప్రత్యక్షత కాదు, లేదా మనిషి గమ్యానికి సంబంధించిన ప్రత్యక్షత కాదు, మరియు చివరి దశలో జరిగించవలసిన కార్యము కాదు, లేదా దేవుని నిర్వహణ ప్రణాళిక మొత్తాన్ని ముగింపునకు తీసుకొచ్చే కార్యము కూడా కాదు. నిజానికి, ఆయన మనిషియందు జరిగించు కార్య సందర్భములో ఇవ్వబడిన ప్రత్యక్షత అయినప్పటికీ, ఆ తర్వాత ఆయన కార్యమునకు సంబంధించిన ముఖ్య ఉద్దేశము మారదు. ఇది ఎల్లప్పుడూ మానవాళి రక్షణ కార్యమునకు సంబంధించినదిగానే ఉంటుంది. ఇది నీవు దేవుని మీద ఉంచే నమ్మకానికి పునాదిగా ఉండాలి. సర్వ మానవాళికి రక్షణను ప్రసాదించడమే దేవుని కార్యములోని మూడు దశల లక్ష్యం—అంటే, సాతాను ఆధిపత్యము నుండి మనుష్యులను సంపూర్ణముగా రక్షించడం అని అర్థం. దేవుడి కార్యములోని మూడు దశల్లో ప్రతి దశకు ఒక విభిన్న లక్ష్యం మరియు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, ఈ ప్రతి ఒక్కటీ మానవాళిని రక్షించే కార్యములో భాగమైయున్నారు, మరియు మానవాళి అవసరాలకు అనుగుణంగా ప్రతి దశలోనూ విభిన్నమైన కార్యము ఉంటుంది. దేవుడి కార్యములో భాగమైన ఈ మూడు దశల లక్ష్యం గురించి నీకు అవగాహన వస్తే, ఈ కార్యమునకు సంబంధించిన ప్రతి దశ ప్రాముఖ్యతను ఏవిధంగా మెచ్చుకోవాలో నీకు తెలుస్తుంది, మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు ఎలా పని చేయాలో నీవు గుర్తిస్తావు. అన్ని దర్శనాల గొప్ప స్థితికి నీవు చేరుకోగలిగితే, అప్పుడు ఇది దేవునియందు మీరు కలిగియున్న విశ్వాసానికి పునాదిగా మారుతుంది. నీవు ఆచరించడానికి సులభమైన మార్గాలు వెతకడం మాత్రమే కాకుండా, లేక లోతైన సత్యాలను వెదకడం మాత్రమే కాకుండా, ఆచరణతోపాటు దర్శనాలను కూడా మిళితం చేయాలి. అప్పుడే, దర్శనాలను ఆధారము చేసుకొనిన జ్ఞానము మరియు ఆచరణలోనికి పెట్టగల రెండు సత్యాలు ఉంటాయి. అప్పుడు మాత్రమే, మీరు సత్యాన్ని గ్రహింపుతో అనుసరించే వ్యక్తి అవుతారు.
దేవుడి కార్యములోని మూడు దశలనేవి ఆయన పూర్తి కార్య నిర్వహణలోని కేంద్రభాగంలో ఉంటాయి, మరియు వాటిలో దేవుని స్వభావము మరియు ఆయన ఏమైయున్నాడో అనే విషయాలు వ్యక్తము చేయబడి ఉంటాయి. దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశల గురించి తెలియని వారు దేవుడు తన స్వభావమును ఎలా వ్యక్తపరుస్తాడో గ్రహించలేరు లేదా దేవుని కార్యము గురించిన జ్ఞానమును వారు పొందుకోలేరు. మానవాళిని రక్షించడం కోసం దేవుడు ఎంచుకునే అనేక మార్గాల విషయమై మరియు సర్వ మానవాళి కోసం దేవుడు కలిగియున్న చిత్తము విషయమై అలాంటివారు నిర్లక్ష్యముతోనే ఉంటారు. దేవుని కార్యములోని మూడు దశలనేవి మానవాళిని రక్షించే దేవుడి కార్యమునకు సంబంధించిన సంపూర్ణ వ్యక్తీకరణయై ఉన్నాయి. దేవుడి కార్యములోని మూడు దశల గురించి తెలియని వారికి పరిశుద్ధాత్మ కార్యానికి సంబంధించిన విబిన్నమైన పద్ధతులను గురించి కూడా తెలియదు, మరియు దేవుని కార్యములోని ఒక నిర్దిష్ట దశలో వదిలివేయబడిన సిద్ధాంతానికి మాత్రమే పూర్తిగా కట్టుబడిన వారు దేవుడిని సిద్ధాంతానికి పరిమితం చేసే వ్యక్తులుగా ఉంటారు. అలాంటి మనుష్యులకు దేవుని మీద విశ్వాసం అనేది అస్పష్టంగాను మరియు అనిశ్చితంగాను ఉంటుంది. ఇలాంటి మనుష్యులు దేవుడు అనుగ్రహించే రక్షణను ఎన్నటికీ పొందుకోలేరు. దేవుని కార్యానికి సంబధించిన ఈ మూడు దశలు మాత్రమే దేవుని స్వభావమును పూర్తిగా వ్యక్తపరచగలవు మరియు సర్వమానవాళిని రక్షించాలనే దేవుని ఉద్దేశాన్ని సంపూర్ణంగా వ్యక్తపరచగలవు. ఆయన సాతానును ఓడించి, మానవాళిని గెలుచుకున్నాడనుటకు ఇదే ఋజువు; దేవుని విజయానికి ఇదే ఋజువు, మరియు ఇదే దేవుని పూర్తి స్వభావానికి వ్యక్తీకరణయైయున్నది. దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశలలో ఒక దశను మాత్రమే అర్థం చేసుకున్న వారికి దేవుడి స్వభావములో కొంత భాగమే తెలిసి ఉంటుంది. మనిషి ఆలోచనల్లో, ఈ ఒకే దశను సిద్ధాంతంగా మార్చుకోవడం సులభం, మరియు మనిషి దేవుని గురించి స్థిరమైన నియమాలు ఏర్పరుచుకునేందుకు ఇది అవకాశం అందిస్తుంది మరియు దేవుడి స్వభావంలోని ఈ ఒక్క భాగాన్ని దేవుని పూర్తి స్వభావానికి ప్రాతినిధ్యంగా ఉపయోగించుకునే అవకాశంగా మారుతుంది. అంతేకాకుండా, మనిషి ఊహ అనేది చాలావరకు ఇందులో మిళితం చేయబడి ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే, దేవుని స్వభావమును, ఆయన ఉనికిని మరియు ఆయన జ్ఞానమును పరిమితం చేస్తాడు, అలాగే దేవుని కార్యానికి సంబంధించిన నియమ నిబంధనలకు కూడా సరిహద్దులు పెడతాడు. తద్వారా, దేవుడు ఇలాగే ఉండేవాడనీ, ఆయన ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాడనీ, ఆయన ఎప్పుడూ మారడనీ నమ్ముతూ ఉంటారు. అయితే, దేవుడి కార్యమునకు సంబంధించిన మూడు దశల గురించి తెలుసుకుని, వాటిని ప్రశంసించగలిగిన వారు మాత్రమే దేవుణ్ణి సంపూర్ణముగా మరియు స్పష్టముగా తెలుసుకోగలరు. వారు కనీసం, దేవుణ్ణి ఇశ్రాయేలీయుల దేవునిగానో లేక యూదుల దేవునిగానో గుర్తించరు, మరియు మనుష్యుల కోసం శాశ్వతంగా సిలువకు కొట్టబడిన దేవుడిగాను ఆయనను చూడరు. ఎవరైనా సరే, దేవుని కార్యములోని ఒక దశను మాత్రమే తెలుసుకోవడంతో ఆగిపోతే, వారి జ్ఞానం చాలా చిన్నది అని అర్థం మరియు అది మహా సముద్రంలోని ఒక నీటి చుక్క కంటే ఎక్కువేమీ కాదు. అలాకాకపోతే, మతపరమైన పెద్దలు దేవుణ్ణి సజీవంగా సిలువకు మేకులతో కొట్టేవారా? ఇదంతా కూడా మనిషి దేవుణ్ణి కొన్ని నిర్దిష్టమైన పరిమితులలో ఉంచినందువలన కాదా? చాలా మంది మనుష్యులు దేవుణ్ణి వ్యతిరేకించరు మరియు పరిశుద్ధాత్మ కార్యమును అడ్డుకోరు. ఎందుకంటే వారికి దేవుని వైవిధ్యమైన, విభిన్నమైన కార్యమును గూర్చి తెలియదు. అదిమాత్రమే కాకుండా, పరిశుద్ధాత్మ కార్యమును బేరీజు వేయగల జ్ఞానం మరియు సిద్ధాంతం వారి వద్ద ఉన్నాయా? అలాంటి వ్యక్తుల అనుభవాలు పైపైనే ఉన్నప్పటికీ, వారు తమ స్వభావములో అహంకారముగాను మరియు చనువుతోను ఉంటారు. అందుకే, వారు పరిశుద్ధాత్మ కార్యమును ధిక్కరిస్తారు. పరిశుద్ధాత్మ క్రమశిక్షణను విస్మరిస్తారు మరియు ఆ పరిశుద్ధాత్మ కార్యమును “నిర్ధారించడానికి” వారు విశ్వసించే పనికిమాలిన పాత వాదనలు ఉపయోగిస్తారు. అంతేకాకుండా, వారు వారి సొంత అభ్యాసం మరియు పాండిత్యాన్ని పూర్తిగా విశ్వసిస్తారు మరియు తాము ప్రపంచమంతటా ప్రయాణించగలమని విశ్వసిస్తారు. అలాంటి మనుష్యులు పరిశుద్ధాత్మ చేత తృణీకరించబడినవారు మరియు తిరస్కరించబడినవారు కాదా, మరియు వారు కొత్త యుగం ద్వారా పరిత్యజించబడుతారు కదా? ఇలా దేవుడి ముందుకు వచ్చి, ఆయనను బహిరంగంగా వ్యతిరేకించే వారు తెలివితక్కువవారు మరియు అవగాహన లేని దుర్మార్గులు కాదా మరియు తాము ఎంతటి మేధావులో ప్రదర్శించడానికి వారు ప్రయత్నించడం లేదా? అయినప్పటికీ, ఇలాంటి వాళ్లు బైబిల్ గురించిన కొద్దిపాటి జ్ఞానంతో, ప్రపంచపు “విజ్ఞానం” లో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తారు; తమదైన ఒక పైపైన సిద్ధాంతాన్ని ప్రజలకు బోధించడం ద్వారా, పరిశుద్ధాత్మ కార్యమును తిప్పికొట్టడానికి వారు ప్రయత్నిస్తారు మరియు ఆ కార్యమును వారి ఆలోచనా పరిధి చుట్టూ తిప్పడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సంకుచిత దృష్టి కలిగిన మనుష్యులు 6,000 సంవత్సరాల దేవుడి కార్యమును ఒకేసారి చూసేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి, ఇలాంటి మనుష్యులకు చెప్పుకోదగిన పరిజ్ఞానం ఏదీ ఉండదు! నిజానికి, దేవుడి గురించిన జ్ఞానం మనుష్యుల్లో ఎక్కువయ్యే కొద్దీ, దేవుడి కార్యమును వారు బేరీజు వేసే వేగం అంతగా తగ్గుతుంది. అంతేకాకుండా, నేడు దేవుడి కార్యమనకు సంబంధించిన వారి జ్ఞానం గురించి కొంచెంగానే మాట్లాడతారు. అలాగే, తమ తీర్పులు చెప్పడానికి వారు తొందరపడరు. అదేసమయంలో, దేవుడి గురించి తక్కువ మాత్రమే తెలిసినవారు ఎక్కువ అహంకారంతో మరియు అతి విశ్వాసంతో ఉంటారు మరియు అలాంటివారే పోకిరితనంతో దేవుని ఉనికి ని ఎక్కువగా ప్రకటిస్తారు. కానీ, ఆ సమయంలో కూడా వారు సిద్ధాంత రీత్యానే మాట్లాడతారే తప్పు నిజమైన సాక్ష్యాధారాలు వెలువరించరు. అలాంటి వారికి ఎలాంటి విలువ ఉండదు. పరిశుద్ధాత్మ కార్యమును ఒక ఆటగా చూసే వారు పనికిమాలినవారు! పరిశుద్ధాత్మ కొత్త కార్యమును ఎదుర్కొనే సమయంలో జాగ్రత్తగా ఉండనివారు, నోరు అదుపులో లేనివారు, తీర్పు చెప్పడానికి తొందరపడుతారు, పరిశుద్ధాత్మ కార్యములోని మంచిని నిరాకరించడానికి వారు తమ స్వభావానికి స్వేచ్ఛనిస్తారు, పైపెచ్చు ఆ కార్యమును అవమానించి మరియు దూషిస్తారు. ఇలాంటి మర్యాదకు నోచుకోని వ్యక్తులు పరిశుద్ధాత్మ కార్యము గురించి తెలియని వారు కాదా? అంతకుమించి, ఇలాంటివారు తీవ్రమైన అహంకారం కలిగినవారు, సహజంగానే గర్వం కలిగిన మరియు అదుపు తప్పిన మనుష్యులు కాదా? ఇలాంటి మనుష్యులు సైతం పరిశుద్ధాత్మ కొత్త పనిని అంగీకరించే రోజు వచ్చినప్పటికీ, దేవుడు మాత్రం వీరిని సహించడు. ఎందుకంటే, వీళ్లు దేవుని కోసం పనిచేసే వారిని చిన్నచూపు చూడడమే కాకుండా, స్వయంగా దేవుణ్ణి దూషిస్తారు. ఇలాంటి నిరాశపూరిత మనుష్యులు ఈ యుగంలోనే కాకుండా, రాబోయే యుగంలోనూ క్షమార్హులు కాదు మరియు వీళ్లు శాశ్వతంగా నరకంలోనే కృషించిపోతారు! ఇలాంటి అమర్యాదస్తులు మరియు విచ్చలవిడిగా జీవించే వ్యక్తులు దేవుణ్ణి విశ్వసిస్తున్నట్లు నటిస్తారు. వ్యక్తుల్లో ఇలాంటి స్వభావం పెరిగినప్పుడు, వారు దేవుని పరిపాలనా శాసనాలను ఉల్లంఘించేవారుగా మారుతారు. పుట్టుక నుండే హద్దులు ఎరుగని, ఎవరికీ విధేయత చూపని అహంకారులందరూ ఈ మార్గంలోనే నడవడం లేదా? ఎల్లప్పుడూ క్రొత్తగా ఉండి పాతవాడు కానటువంటి దేవుణ్ణి వీళ్లు ప్రతిరోజూ వ్యతిరేకించడం లేదా? ఈ రోజున దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశల ప్రాముఖ్యతను మీరెందుకు తెలుసుకోవాలో మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పే ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయే తప్ప, ఇవేమీ ఒట్టి మాటలు కావు. అందుకే, గుర్రం మీద సవారీ చేస్తూ, దారి పక్కన పుష్పాల అందాన్ని మెచ్చుకున్నట్లుగా నా మాటలు చదివితే, నా కష్టమంతా వృధా కాదా? మీలోని ప్రతి ఒక్కరూ మీ సొంత స్వభావం గురించి తెలుసుకోవాలి. మీలో చాలా మంది పిడివాదంలో నైపుణ్యం కలిగినవారై ఉంటారు; సైద్ధాంతిక ప్రశ్నలకు సమాధానాలన్నీ మీ నాలుక మీదే ఉన్నట్లుగా వేగంగా బయటికి వచ్చేస్తాయి కానీ, ముఖ్యాంశముతో కూడిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలుండవు. నేటికీ, మీరు ఇంకా పనికిమాలిన సంభాషణల్లోనే విచ్చలవిడిగా మునిగి తేలుతూ ఉంటారు, మీ పాత స్వభావాలను మీరు ఏమాత్రం మార్చుకోలేరు మరియు ఉన్నత సత్యాన్ని సాధించడం కోసం మీరు అనుసరించే మార్గాన్ని మార్చుకునే ఉద్దేశం మీలో చాలా మందికి ఉండదు. దానికి బదులుగా మీరు మీ జీవితాలను అసంపూర్ణ హృదయంతోనే జీవిస్తుంటారు. ఇలాంటి మనుష్యులు అంతము వరకు దేవుణ్ణి ఎలా అనుసరించగలరు? ఒకవేళ మీరు అంతిమ ఘడియ వరకు ఆ పని చేసినప్పటికీ, దానివల్ల మీకొచ్చే ప్రయోజనం ఏముంటుంది? అందుకే, మరింత ఆలస్యం కాకముందే, నిజంగా అనుసరించాలా లేదంటే ఆ మార్గం నుండి ముందుగానే వైదొలగాలా అనే విషయంలో మీరు మీ ఆలోచనలు మార్చుకోవడం మంచిది. ఆలా చేయకపోతే, సమయం గడిచేకొద్దీ మీరు ముందుగానే సిద్ధం చేసిన పరాన్నజీవిగా మారుతారు. ఇలాంటి అల్పమైన, తుచ్చమైన పాత్రను పోషించడానికి మీరు ఇష్టపడుచున్నారా?
దేవుడి కార్యములోని మూడు దశలనేవి దేవుని సంపూర్ణ కార్యమునకు సంబంధించి వృత్తాంతమైయున్నది; అవి మానవాళికి దేవుడు అందించే రక్షణ వృత్తాంతములైయున్నవి, గాని అవేమీ ఊహాజనితం కావు. మీరు నిజంగానే దేవుని పూర్తి స్వభావమును తెలుసుకోవాలనుకుంటే, అప్పుడు మీరు దేవుని ద్వారా నిర్వహించబడే కార్యమునకు సంబంధించిన మూడు దశల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా, అందులోని ఏ దశనూ మీరు వదిలివేయకూడదు. దేవుణ్ణి తెలుసుకోవాలనుకునేవారుకనీసం దీనిని పాటించాలి. దేవుడు గురించిన నిజమైన జ్ఞానం మనిషికి దానికదే లభించదు. అలాగే, ఇది మనిషి తనకు తానుగా ఊహించుకునే విషయమూ కాదు, లేదంటే, పరిశుద్ధాత్మ దయ ద్వారా ఒక మనిషికి దక్కే పరిణామము కాదు. బదులుగా, దేవుని కార్యమును స్వయంగా అనుభవించిన తర్వాతే మనిషికి ఈ జ్ఞానము లభిస్తుంది మరియు దేవుని కార్యమునకు సంబంధించిన వాస్తవాలను అనుభవించిన తర్వాతే మనిషికి ఈ జ్ఞానము లభిస్తుంది. ఇలాంటి జ్ఞానం సులభంగా లభించదు, మరియు ఇదేమీ ఒకరు నేర్పించడం ద్వారా వచ్చేది కూడా కాదు. ఇది పూర్తిగా వారి వారి వ్యక్తిగత అనుభవానికి సంబంధించినది. మానవాళికి దేవుడు అందించే రక్షణ అనేది ఈ మూడు దశల కార్యములలో కీలకమైనది అయినప్పటికీ, రక్షణ అందించే ఈ కార్యమును జరిపించే పద్ధతులు, విధానాలు అనేకం ఉంటాయి మరియు ఈ సందర్భంగా దేవుని స్వభావము అనేక మార్గాల్లో వ్యక్తీకరించబడుతుంది. అందుకే, వీటిని గుర్తించడం మనిషికి చాలా కష్టంగా ఉంటుంది మరియు వీటిని అర్థం చేసుకోవడం కూడా మనిషికి కష్టమైన పనిగానే ఉంటుంది. యుగాలను వేరుచేయబడడం, దేవుడి కార్యములో మార్పులు జరగడం, కార్యము జరిగే ప్రదేశంలో మార్పులు సంభవించడం, ఈ కార్యమును పొందుకునే వారిలో మార్పులు జరగడం, మరియు ఇలా జరిగే మొదలగు విషయాలు ఈ కార్యమునకు సంబంధించిన మూడు దశల్లో చేర్చబడి ఉంటాయి. ప్రత్యేకించి, పరిశుద్ధాత్మ కార్యమును జరిగించు విధానంలో విభిన్నత, అలాగే, దేవుని స్వభావము, ఆయన స్వరూపం, ఆయన నామము, ఆయన గుర్తింపులో మార్పులు, లేదా ఇతర మార్పులు లాంటివన్నీ ఈ కార్యమునకు సంబంధించిన మూడు దశల్లో భాగమై ఉంటాయి. ఈ కార్యములోని ఒక దశ ఒక్క భాగాన్ని మాత్రమే సూచిస్తుంది, మరియు ఒక నిర్దిష్ట పరిధికి మాత్రమే పరిమితం చేస్తుంది. యుగాల విభజనలో లేదా దేవుని కార్యములోని మార్పుల్లో ఇది జోక్యం చేసుకోదు, ఇతర అంశాల్లోనూ దీని జోక్యం చాలా తక్కువగానే ఉంటుంది. ఇది ఒక స్పష్టమైన వాస్తవం. దేవుడి కార్యములోని మూడు దశలనేవి మానవాళిని రక్షించే దేవుడి కార్యము సూచిస్తాయి. రక్షణ కార్యములోని దేవుని స్వభావమును మరియు దేవుని కార్యమును మనిషి తప్పకుండ తెలుసుకోవాలి; ఈ వాస్తవం తెలియకపోతే, దేవుడి గురించిన మీకున్న జ్ఞానం ఒట్టి మాటలే తప్ప మరేమీ ఉండదు, దర్జాగా కుర్చీలో ముచ్చట్లు చెప్పే పనికిమాలిన కబుర్లుగానే ఉంటాయి. మనిషిని ఒప్పించడానికో లేదా జయించడానికో ఇలాంటి జ్ఞానం సరిపోదు; ఇది వాస్తవికతకు విరుద్ధంగాను మరియు సత్యానికి దూరంగాను ఉంటుంది. అయితే, ఇది అత్యంత సమృద్ధిగాను మరియు వినడానికి వినుసొంపుగాను ఉండవచ్చు కానీ, అది దేవుని సహజ స్వభావానికి విరుద్ధంగా ఉంటే మాత్రం దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన నీ జ్ఞానాన్ని అభినందించకపోగా, తనను దూషించిన ఒక పాపాత్ముడిగా పరిగణించి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. దేవుణ్ణి తెలుసుకోవడమును గురించి చెప్పే మాటలు అంత తేలికైనవి కావు. నీవు చాలా తెలివిగా మాట్లాడి మరియు మాటలతో గారడీ చేయగల వ్యక్తివి అయినప్పటికీ, నలుపును తెలుపుగాను మరియు తెలుపును నలుపుగాను చేసేంత వాదించగల సమర్థుడివి అయినప్పటికీ, దేవుని జ్ఞానము గూర్చి మాట్లాడే విషయంలో నీకు అంత లోతైన జ్ఞానముండదు. నీవు ఆకస్మాత్తుగా తీర్పు చెప్పి లేదా సాధాసీదాగా స్తుతించి లేదా నిర్మొహమాటంగా కింపరిచే వ్యక్తి కాదు దేవుడు. నువ్వు ఎవ్వరినైనా లేక ప్రతి ఒక్కరిని స్తుతిస్తావు, అయితే దేవుని అత్యున్నతమైన కృపను వివరించడానికి పదాలను కనుగొనుటకు చాలా ఇబ్బంది పడతావు. ఈ విషయాన్ని ఓడిపోయిన ప్రతివాడు తప్పక గ్రహించాలి. దేవుణ్ణి వర్ణించే సామర్థ్యం కలిగిన భాషా ప్రవీణులు ఎందరెందరో ఉండవచ్చు కానీ, దేవుడి గురించిన వారి వర్ణనలో ఖచ్చితత్వం అనేది దేవునికి సంబంధించివారు చెప్పే విషయాల్లో వందో వంతు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే, దేవుడికి చెందిన ఈ వ్యక్తుల పదజాలం పరిమితమే అయినప్పటికీ, దేవుని గురించిన విషయ పరిజ్ఞానంలో వారు గొప్ప అనుభవంతో ఉంటారు. ఈవిధంగా చూసినప్పుడు, దేవుడు గురించిన జ్ఞానం అనేది ఖచ్చితత్వం మరియు వాస్తవికతలో ఉంటుందే తప్ప, పదాలను తెలివిగా ఉపయోగించడం లేదా గొప్ప పదజాలమును ఉపయోగించడంలో ఉండదని మరియు మనిషి జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి పరస్పరం సంబంధం ఏమాత్రం ఉండదని అర్థమవుతుంది. దేవుని గురించి తెలుసుకునే పాఠం అనేది మనిషికి తెలిసిన సమస్త స్వాభావిక శాస్త్రాలకంటే ఉన్నతమైనది. దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకునే అసంఖ్యాకుల్లో అతి తక్కువ మంది మాత్రమే సాధించగల పాఠం ఇది. అలాగే, ఒక మనిషి కేవలం తన ప్రతిభతో దీన్ని సాధించలేడు. కాబట్టి, దేవుడిని తెలుసుకోవడం మరియు సత్యాన్ని అనుసరించడం అనేవి ఒక పిల్లల ఆటగా మీరు భావించకూడదు. బహుశా, నీవు నీ కుటుంబ జీవితంలో, లేదా నీ వృత్తి జీవితములో లేదా నీ వైవాహిక జీవితంలో గొప్పగా విజయం సాధించి ఉండవచ్చు కానీ, సత్యం మరియు దేవుణ్ణి తెలుసుకునే విషయానికి వచ్చినప్పుడు నీవు చూపించడానికి ఏమీ ఉండదు మరియు నీవు సాధించినది కూడా ఏమీ లేదు. సత్యాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టమని మీరు చెప్పినప్పుడు, దేవుణ్ణి తెలుసుకోవడమనేది మీకు మరింత పెను సమస్యగా మారుతుంది కదా. ఈ సమస్య మీది మాత్రమే కాదు. మానవాళి మొత్తం ఎదుర్కొంటున్న సమస్య ఇది. దేవుణ్ణి తెలుసుకునే విషయంలో కొన్ని విజయాలు సాధించిన వారిలో సైతం, ఆ స్థాయి ప్రమాణాలు కలిగినవారు దాదాపుగా ఎవరూ ఉండరు. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏమిటో, లేదా దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటో, లేదా దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక మనిషి ఏ స్థాయిని అందుకోవాలో అనే విషయాలు మనిషికి తెలియదు. ఇదే మానవాళిని తికమకపరుస్తోంది మరియు ఇదే మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద చిక్కు. నిజానికి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సామర్థ్యం ఎవరికీ లేదు, లేదా దీనికి సమాధానం చెప్పడానికి ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే, ఈ రోజు వరకూ, ఈ కార్యమును గురించిన అధ్యయనంలో విజయం సాధించిన మనిషి ఎవరూ లేరు. బహుశా, దేవుని కార్యములోని మూడు దశల ఈ చిక్కుముడి మానవాళికి అర్థమైనప్పుడు, దేవుణ్ణి ఎరిగిన ప్రతిభావంతులైన మనుష్యుల సమూహం వరుసగా కనిపించవచ్చు. నిజానికి, ఇది ఇలానే ఉంటుందని మరియు నేను ఈ కార్యమును నిర్వహించే ప్రక్రియలో ఉంటానని, మరియు ఇలాంటి ప్రతిభావంతులైన మనుష్యుల రూపాన్ని సమీప భవిష్యత్తులో నేను చూడగలనని ఆశిస్తున్నాను. అలాంటి వారు దేవుని కార్యములోని ఈ మూడు దశల కార్యానికి సంబంధించిన వాస్తవానికి సాక్ష్యమిచ్చే వారుగా ఉంటారు. అంతేకాకుండా, నిజానికి, వారు ఈ మూడు దశల కార్యమునకు సాక్ష్యమిచ్చే మొదటివారుగా కూడా ఉంటారు. అయితే, దేవుడి కార్యము పూర్తయ్యే నాటికి ఇలాంటి ప్రతిభావంతులు కనిపించకపోయినా, లేదా శరీరధారిగా వచ్చిన దేవుని ద్వారా పరిపూర్ణులు కావడానికి వ్యక్తిగతంగా అంగీకరించిన ఒకరిద్దరు మాత్రమే కనిపించినా అదేమీ అంత బాధపడాల్సిన మరియు విచారించాల్సిన విషయమేమీ కాదు కానీ, ఇదొక దరిద్రమైన సన్నివేశంగా ఉండిపోతుంది. ఏదేమైనప్పటికీ, దేవుణ్ణి నిజంగా అనుసరించేవారు ఈ ఆశీర్వాదాన్ని తప్పక పొందగలరని నేను ఇప్పటికీ ఆశిస్తున్నాను. కాలం మొదలైనప్పటి నుండి, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి కార్యము జరగలేదు; మానవ పరిణామక్రమ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు. దేవుణ్ణి ఎరిగిన వారిలో మీరు మొదటి వారు కాగలిగితే, సృష్టించబడిన సకల జీవరాశులలో ఇది అత్యున్నతమైన గౌరవం కాదా? సృష్టించబడిన వాటిలో ఏదైనా దేవుని అధిక మెప్పుకు పాత్రమైంది ఉందా? ఎందుకంటే, అది సాధించడం అంత సులభమేమీ కాదు కానీ, చివరకు ప్రతిఫలం దక్కుతుంది. లింగ, జాతి అనేవాటితో సంబంధం లేకుండా, దేవుని జ్ఞానాన్ని పొంద సామర్థ్యం కలిగిన వారందరూ చివరకు దేవుడి నుండి అత్యధిక గౌరవం పొందుకుంటారు మరియు అలాంటి వారు మాత్రమే దేవుని అధికారం కలిగినవారుగా ఉంటారు. ఇది ఇప్పుడు జరిగే కార్యము మాత్రమే కాదు గాని ఇది భవిష్యత్తులో జరిగే కార్యమైయున్నది; ఎందుకంటే, 6,000 సంవత్సరాలుగా జరిగిన కార్యములో ఇదే చివరిది మరియు అత్యున్నతమైనది. ఇది మనుష్యుల్లోని పలు విధాల మనుష్యులను బహిర్గతం చేసే కార్య మార్గముగా ఉంటుంది. మనిషి దేవుని గురించి తెలుసుకునేలా చేసే ఈ కార్యము ద్వారా మనుష్యుల్లో ఆయా రకాల మనుష్యులుంటారని వెల్లడవుతుంది: దేవుణ్ణి ఎరిగిన వారు దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరియు ఆయన వాగ్దానాలు అంగీకరించడానికి అర్హులవుతారు. అయితే, దేవుణ్ణి ఎరుగనివారు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరియు ఆయన వాగ్దానాలు అంగీకరించడానికి అనర్హులవుతారు. దేవుణ్ణి ఎరిగినవారు దేవుడి సన్నిహితులవుతారు, మరియు దేవుణ్ణి ఎరుగనివారు దేవునికి సన్నిహితులు కాలేరు; దేవుని సన్నిహితులైనవారు దేవుని ఆశీర్వాదాలు ఏవైనప్పటికీ వాటిని పొందుకోగలరు కానీ, దేవునికి సన్నిహితులు కాలేనివారు ఆయన కార్యమునకు అర్హులు కాలేరు. శ్రమలు, శుద్ధీకరణ లేదా తీర్పు అనేవి ఏవైనా, అవన్నీ మనిషి చివరకు దేవుని గురించిన జ్ఞానం గడించడానికి అనుమతించబడుతాయి, తద్వారా మనిషి దేవునికి సమర్పించుకుంటాడు. ఇది మాత్రమే అంతిమంగా పొందుకునే గొప్ప ఫలితం. దేవుడి కార్యమునకు సంబంధించిన మూడు దశల్లో ఏదీ దాచబడదు మరియు దేవుని గురించి మనిషి పొందుకునే జ్ఞానానికి గొప్ప ప్రయోజనకరంగా ఉంటాయి మరియు దేవుని గురించి మరింత సంపూర్ణమైన మరియు పరిపూర్ణమైన జ్ఞానం పొందడంలో మనిషికి సహాయపడుతాయి. ఈ కార్యము మొత్తమూ మనిషి ప్రయోనం కోసమే.
దేవుని కార్యమే మనిష తెలుసుకోవలసిన దర్శనమైయున్నది. ఎందుకంటే, దేవుని కార్యమును మనిషి సాధించలేడు మరియు దానిని మనిషి స్వాధీనం చేసుకోలేడు. దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశలనేవి దేవుని సమస్త కార్య నిర్వహణయైయున్నవి. మరియు వాటి గురించి తెలుసుకునేంత గొప్ప దర్శనం మనిషికి లేదు. ఈ మహత్తర దర్శనం గురించి మనిషికి తెలియకపోతే, దేవుని గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం సులభం కాదు, అదిమాత్రమే కాకుండా, అలా తెలుసుకోలేని మనిషికి అతను నడిచే మార్గం మరింత కష్టతరంగా మారుతుంది. దర్శనాలు లేకపోయి ఉంటే, మనిషి ఇంత దూరం వచ్చేవాడు కాదు. నేటి వరకు మనిషిని కాపాడిన దర్శనాలే, మనిషికి అతిగొప్ప సంరక్షణను కూడా అందించాయి. భవిష్యత్తులో, మీ జ్ఞానం మరింత ఎక్కువ లోతుల్లోనికి వెళ్ళాలి, మరియు దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశల్లోని ఆయన చిత్తాన్ని మరియు ఆయన జ్ఞాన సంబంధమైన కార్యములోని గుణగణాలన్నిటిని పూర్తిగా తెలుసుకోవాలి. ఇది మాత్రమే మీరు పొందుకునే నిజమైన స్థాయి అవుతుంది. దేవుని కార్యములోని చివరి దశ మాత్రమే ఉండదు గాని మునుపున్న రెండు దశలతో కలిసి ఏర్పడిన మొత్తంలో ఒక భాగమై ఉంటుంది. అంటే, కార్యము యొక్క మూడు దశలలో ఏదైనా ఒక దశను మాత్రమే పూర్తి చేయడం ద్వారా రక్షణ కార్యమంతటిని సంపూర్తి చేయడం అసాధ్యమని ఇందుమూలంగా చెప్పవచ్చు. దేవుని కార్యములోని చివరి దశ అనేది మనిషిని సంపూర్ణంగా రక్షించగలిగినప్పటికీ, సాతాను ప్రభావం నుండి మనిషిని రక్షించడానికి ఈ ఒక్క దశను నిర్వహించడం ముఖ్యమనీ మరియు ఇదివరకటి రెండు దశల కార్యము అవసరం లేదనీ దీని అర్థం కాదు. దేవుని కార్యములోని మూడు దశల్లోని ఏ ఒక్క దశ మాత్రమే మానవాళికి తెలిసిన ఏకైక దర్శనంగా పరిగణించబడదు. ఎందుకంటే, రక్షణ కార్యమంతా దేవుని కార్యములోని మూడు దశల్లో జరిగేదే గాని అది ఏ ఒక్క దశలోనో పూర్తయ్యేది కాదు. రక్షణ కార్యము పూర్తవనంతవరకు, దేవుని నిర్వహణ కార్యము పూర్తవదు. దేవుని ఉనికి, ఆయన స్వభావం మరియు ఆయన జ్ఞానం అనేవి రక్షణ కార్యమంతటిలో వ్యక్తీకరించబడ్డాయి; అయితే, ప్రారంభంలో అవి మనిషికి బహిర్గతం కానప్పటికీ, రక్షణ కార్యములో అవి క్రమంగా వ్యక్తీకరించబడ్డాయి. రక్షణ కార్యములోని ప్రతి దశ దేవుడి స్వభావములోని కొంత భాగాన్ని మరియు ఆయన ఉనికిలో కొంత భాగాన్ని వ్యక్త పరుస్తాయి; అంతేతప్ప, దేవుడి కార్యములో ఏ దశ కూడా దేవుని ఉనికి యొక్క సంపూర్ణతను దేవుని కార్యములోని ఏ దశ కూడా ప్రత్యక్షముగా మరియు సంపూర్ణముగా వ్యక్తపరచదు. అలాగే, దేవుని కార్యములోని మూడు దశలు పూర్తయిన తర్వాతే రక్షణ కార్యము సంపూర్ణంగా ముగుస్తుంది మరియు దేవుని సంపూర్ణత గురించిన మనిషి జ్ఞానం అనేది దేవుని కార్యానికి సంబంధించిన మూడు దశల నుండి విడదీయరానిదిగా ఉంటుంది. దేవుని కార్యములోని ఒక దశ నుండి మనిషి పొందుకునేది కేవలం ఆ దశలో వ్యక్తీకరించబడిన దేవుడి స్వభావం మాత్రమే. అంతేతప్ప, దానికి ముందు లేదా ఆ తర్వాతి దశల్లో వ్యక్తీకరించబడిన దేవుడి స్వభావం మరియు ఉనికిని అది సూచించదు. ఎందుకంటే, మానవాళిని రక్షించే కార్యము అనేది ఒక కాల ఘట్టంలోనో లేదా ఒకానొక ప్రదేశంలోనో ఒకేసారి పూర్తి చేయబడేది కాదు. నిజానికి, అది వివిధ కాల ఘట్టాల్లో, మరియు విభిన్న ప్రదేశాల్లో మనిషి అభివృద్ధి స్థాయిని బట్టి క్రమంగా లోతుగా వెళ్తూ పూర్తి చేయబడుతుంది. దేవుని కార్యము దశలవారీగా జరుగుతుందే తప్ప, ఒకే దశలోనే పూర్తి కాదు. కాబట్టి, దేవుని జ్ఞానం అనేది ఒక దశలోనే కాకుండా మూడు దశల్లో నిక్షిప్తమై ఉంటుంది. దేవుని ఉనికియంతా మరియు దేవుని జ్ఞానమంతా ఈ మూడు దశలలో ఉన్నాయి, మరియు ప్రతి దశ దేవుని ఉనికిని కలిగి ఉంటుంది మరియు ప్రతి దశ ఆయన జ్ఞాన కార్యమునకు ఒక వృత్తాంతంగా మారుతుంది. ఈ మూడు దశల్లో వ్యక్తీకరించబడే దేవుని సంపూర్ణ స్వభావమును మనిషి గ్రహించాలి. దేవునికి సంబంధించిన ఈ అంశాలన్నీ మనిషికి అత్యంత కీలకమైనవి, మరియు దెవునికి ప్రార్థించే సమయంలో మనుష్యులకు ఈ పరిజ్ఞానం లేకపోతే, అలాంటి వారు బుద్ధుడిని ఆరాధించే వారికంటే భిన్నంగా ఏమీ ఉండరు. మనుష్యుల మధ్య జరిగే దేవుని కార్యము ఆ మనుష్యులకు మరుగై ఉండదు గాని దేవుణ్ణి ఆరాధించే ప్రతియొక్కరికి ఆ కార్యమును గూర్చి తెలియాలి. మానవాళి రక్షణ కోసం దేవుడు నిర్వహించిన మూడు దశల కార్యములో ఆయన కలిగియున్న వాటి యొక్క వ్యక్తీకరణను మనిషి తెలుసుకోవాలి. మనిషి తప్పక చేయాల్సిన పని ఇది. మనిషి సాధించలేని దానిని, మనిషికి తెలియకూడని వాటిని మనిషికి దేవుడు మరుగు చేసినప్పటికీ, మనిషి తెలుసుకోవలసిన మరియు మనిషి కలిగి ఉండాల్సిన దానిని మనిషికి దేవుడు చూపెడుతాడు. దేవుని కార్యములోని మూడు దశలు మునుపున్న దశ యొక్క పునాది మీదే నిర్వహించబడుతుంది; అంతేతప్ప, అది స్వతంత్రంగా నిర్వహించబడదు, అలాగే, అది రక్షణ కార్యము నుండి వేరుగా ఉండదు. నిర్వహించబడిన కార్యములోను మరియు యుగములోను చాలా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, వాటి ప్రధాన లక్ష్యం మాత్రం సర్వ మానవాళి రక్షణ పొందడమే. అలాగే, రక్షణ కార్యములోని ప్రతి దశ మునుపు రద్దు చేయబడని దశకంటే చాలా లోతుగా ఉంటుంది. ఈ విధంగా, ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటూ, ఎప్పుడూ పాతది కాని తన కార్యము ద్వారా, మనిషికి మునుపెన్నడూ వ్యక్తం చేయని తన స్వభావమును దేవుడు నిరంతరం వ్యక్తపరుస్తుంటాడు మరియు ఆయన ఎల్లప్పుడూ తన కొత్త కార్యమును మరియు తన కొత్త ఉనికిని మనిషికి వ్యక్తం చేస్తుంటాడు. అదేసమయంలో, మతమౌఢ్యులైన పెద్దలు బహిరంగంగానే దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ, దేవుడు మాత్రం తాను చేయాలనుకున్న కొత్త కార్యమును ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు. నిజానికి, దేవుని కార్యము ఎల్లప్పుడూ మారుతూ ఉండడం వల్ల, అది ఎల్లప్పుడూ మనుష్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉంటుంది. ఆయన కార్యమును పొందుకునే వారిని బట్టి మరియు యుగమును బట్టి ఎల్లప్పుడూ ఆయన స్వభావము మారుతూనే ఉంటుంది. అంతేకాకుండా, దేవుడు ఎల్లప్పుడూ మునుపెన్నడూ చేయని కార్యమును చేస్తుంటాడు, ఒక్కోసారి గతంలో చేసిన పనికంటే, ఇది పూర్తి విరుద్ధంగా ఉందని మనిషికి అనిపించే విధంగా కూడా ఆయన కార్యము చేస్తుంటాడు. అయితే, మనిషి ఒకే రకమైన పనిని లేదా ఒకే విధమైన అభ్యాసాన్ని మాత్రమే అంగీకరించగలడు కాబట్టి, వాటిని విభేదించే లేదా వాటి కంటే ఉన్నతమైన కార్యమును అంగీకరించడం మనిషికి కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ కొత్త కార్యము చేస్తూనే ఉంటాడు. ఆ కారణంగానే, దేవుని కొత్త కార్యమును వ్యతిరేకించే ముదిరిన మత విశ్వాసుల సమూహం ఒకదాని తర్వాత ఒకటి ఉనికిలోనికి వస్తూనే ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ కొత్తవాడే తప్ప పాతవాడుగా ఎందుకు ఉండడో, దేవుని కార్యమునకు సంబంధిచిన నియమాలు ఏమిటో మనిషికి తెలియదు కాబట్టి, మనిషిని దేవుడు రక్షించే అనేక మార్గాల గురించి కూడా మనిషికి తెలియదు కాబట్టి, ఈ మత విశ్వాసులు గొప్ప మేధావులుగా చలామణీ అవుతుంటారు. ఆ కారణంగానే, అది పరిశుద్ధాత్మ నుండి వచ్చిన కార్యమా, లేదంటే అది స్వయంగా దేవుని కార్యమా అని మనిషి ఖచ్చితంగా చెప్పలేడు. నిజానికి, చాలా మంది మనుష్యులు ఒక వైఖరికి కట్టుబడి ఉంటారు. దీనిప్రకారం, ఏదైనా కొత్త కార్యము ముందుగా చెప్పబడిన మాటలతో వారు దానిని అంగీకరిస్తారు. అయితే, అది మునుపటి కార్యముతో విభేదిస్తున్నట్లయితే, వారు దానిని వ్యతిరేకిస్తారు మరియు తిరస్కరిస్తారు. నేడు, మీరందరూ అలాంటి సూత్రాలకే కట్టుబడి ఉండడం లేదా? రక్షణ కార్యములోని మూడు దశలు మీపై ఎటువంటి గొప్ప ప్రభావాన్ని చూపలేదు, మరియు దేవుని కార్యమునకు సంబంధించి మునుపటి రెండు దశలు గురించి తెలుసుకోవడం తమకు అనవసర భారం అని నమ్మేవారు ఉన్నారు. ఆ దశల గురించి జనాలకు ప్రకటించకూడదనీ మరియు వీలైనంత త్వరగా వాటిని ఉపసంహరించుకోవాలనీ, తద్వారా, మూడు దశల కార్యములో మునుపటి రెండు దశల గురించి జనాలు ఎక్కువగా ఆలోచించకూడదని వారు భావిస్తున్నారు. దేవుని కార్యములోని మునుపటి రెండు దశల గురించి తెలియజేయడం చాలా ప్రయాస అని, దేవుని గురించి తెలుసుకోవడంలో అవేమి సహాయకరంగా ఉండవని చాలా మంది విశ్వసిస్తారు. నిజానికి, మీరు కూడా అలాగే భావిస్తున్నారు. ఈ రోజు, ఈ విధంగా ప్రవర్తించడమే సరైనదని మీరందరూ విశ్వసిస్తున్నారు కానీ, నా కార్యము ప్రాముఖ్యతను మీరు గుర్తించే రోజు వస్తుంది: ప్రాముఖ్యత లేని ఏ కార్యమును నేను చేయనని తెలుసుకోండి. నేను మీకు నా కార్యమునకు సంబంధించిన మూడు దశలను ప్రకటిస్తున్నాను కాబట్టి, అవి మీకు తప్పక ప్రయోజనకరంగా ఉంటాయి; దేవుని కార్యమునకు సంబంధించిన ఈ మూడు దశలనేవని ఆయన కార్య నిర్వహణలో కీలకంగా ఉంటాయి కాబట్టి, విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వాటి మీద దృష్టి పెడతారు. ఒక రోజు, మీరందరూ ఈ కార్యము ప్రాముఖ్యతను గుర్తిస్తారు. మీరు దేవుని కార్యమును వ్యతిరేకిస్తున్నారనీ లేదా నేటి కార్యమును కొలత చేయడానికి మీ సొంత ఆలోచనలు ఉపయోగిస్తున్నారని తెలుసుకోండి. ఎందుకంటే, దేవుని కార్యము యొక్క సూత్రాలు మీకు తెలియవు మరియు పరిశుద్ధాత్మ కార్యము పట్ల మీరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మరొక విధంగా చెప్పాలంటే, దేవునికి చూపించే మీ అవిధేయత మరియు పరిశుద్ధాత్మ కార్యానికి మీరు కలిగించే ఆటంకం మీ ఆలోచనలనుబట్టి, మీలోని అహంభావమును బట్టి కలిగాయి. ఇలా జరగడానికిగల కారణం దేవుని కార్యము తప్పని కాదు గాని మీరు స్వాభావికముగానే అవిధేయులు కాబట్టి ఇలా జరిగింది. నిజానికి, చాలామంది దేవుని పట్ల విశ్వాసం పొందిన తర్వాత కూడా, మనిషి ఎక్కడ నుండి వచ్చాడో ఖచ్చితంగా చెప్పలేరు. అయినా సరే, పరిశుద్ధాత్మ కార్యములో సరి తప్పులు గురించి పేర్కొంటూ బహిరంగ ప్రసంగాలు చేయడానికి ధైర్యం ప్రదర్శిస్తారు. అలాగే, పరిశుద్ధాత్మ కొత్త కార్యమును కలిగియున్న అపొస్తలులకు కూడా వారు ఉపన్యాసాలు ఇస్తారు. ఏదేదో వ్యాఖ్యలు చేస్తూ, ఏదేదో మాట్లాడుతుంటారు; ఇలాంటి వారికి మానవత్వం చాలా తక్కువ, మరియు వారిలో కనీస జ్ఞానం కూడా ఉండదు. ఇలాంటి మనుష్యులందరూ పరిశుద్ధాత్మ కార్యము నుండి తిరస్కరించబడి, నరకంలోని మంటల్లో దహించబడే రోజు రాదంటారా? వీరికి దేవుని కార్యము తెలియనప్పటికీ, ఆయన కార్యమును విమర్శిస్తారు మరియు కార్యమును ఎలా చేయాలో దేవుడికే సలహాలు చెప్పడానికి సైతం ప్రయత్నిస్తారు. ఇలాంటి అసమంజసమైన మనుష్యులు దేవుడిని ఎలా తెలుసుకోగలరు? మనిషి తన అన్వేషణ మరియు అనుభవం ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటాడు; పరిశుద్ధాత్మ జ్ఞానోదయం ద్వారా దేవుడిని మనిషి తెలుసుకోవాలే తప్ప, ఇష్టానుసారంగా విమర్శించడం ద్వారా కాదు. దేవుడు గురించిన జ్ఞానం ఖచ్చితమయ్యే కొద్దీ, మనుష్యులు ఆయనను వ్యతిరేకించడం తగ్గుతుంది. దీనికి విరుద్ధంగా, దేవుని గురించి తక్కువ తెలుసు కున్నప్పుడే, మనుష్యులు ఆయనను ఎక్కువగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. నీ ఆలోచనలు, నీ పాత ప్రవృతి మరియు నీలోని మానవత్వం, స్వభావం మరియు నైతిక దృక్పథం లాంటివి నీవు దేవుడిని ఎదిరించడానికి కేంద్రస్థానంగా ఉంటాయి. అందుకే, నీ నైతికత ఎంతగా పాడైతే, నీ గుణాలు ఎంతగా అసహ్యించుకునేలా ఉంటే, మరియు నీలోని మానవత్వం ఎంత తక్కువైతే, నీవు అంత ఎక్కువగా దేవునికి శత్రువుగా మారుతావు. దృఢమైన భావాలు కలిగినవారు మరియు స్వనీతి స్వభావం కలిగినవారు శరీరధారిగా వచ్చిన దేవునికి శత్రువులై ఉంటారు; ఇలాంటి మనుష్యులే క్రీస్తు విరోధులు. అందుకే, నీ భావనలు సరిదిద్దబడకపోతే, అవి ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి; మీరు దేవునితో ఎన్నటికీ అనుకూలంగా ఉండలేరు మరియు ఎల్లప్పుడూ ఆయనకు దూరంగానే ఉంటారు.
మీరు మీ పాత ఆలోచనలు పక్కన పెట్టినప్పుడే కొత్త జ్ఞానం పొందగలరు అయితే, పాత జ్ఞానం అనేది తప్పనిసరిగా పాత భావాలకు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. “భావనలు” అనేవి వాస్తవికతకు విరుద్ధంగా మనిషికి వచ్చే ఊహా జనిత విషయాలు. పాత జ్ఞానం అనేది పాత యుగములోనే పాతబడిపోయి, సరిక్రొత్త కార్యములోనికి ప్రవేశించకుండా మనుష్యులను అడ్డగిస్తే, అలాంటి జ్ఞానం కూడా ఒక ఆలోచన అవుతుంది. అటువంటి జ్ఞానం పట్ల మనిషి సరైన విధానం అవలంబించగలిగితే, అలాగే, పాత మరియు కొత్త వాటిని కలిపి అనేక విభిన్న కోణాల నుండి దేవుణ్ణి తెలుసుకోగలిగితే, పాత జ్ఞానం కూడా మనిషికి సహాయం చేస్తుంది మరియు మనిషి కొత్త యుగంలోకి ప్రవేశించడానికి అదే ఆధారమవుతుంది. దేవుణ్ణి తెలుసుకోవడం అనే పాఠం అర్థం కావాలంటే, నీవు అనేక సూత్రాల్లో ప్రావీణ్యం సంపాదించాలి: దేవుణ్ణి తెలుసుకునే మార్గంలోనికి ఎలా ప్రవేశించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలంటే నీవు ఏ సత్యాలు అర్థం చేసుకోవాలి మరియు నీవు నీ భావాలను మరియు పాత స్వభావాలను వదిలించుకోవడం ఎలా అనే విషయాలలో ప్రావీణ్యత పొందాలి, తద్వారా దేవుని కొత్త కార్యములోని కార్య నిర్వహణములన్నిటికి మీరు లోబడి ఉండవచ్చు. దేవుణ్ణి తెలుసుకోవడం అనే పాఠంలోకి ప్రవేశించడానికి మీరు ఈ సూత్రాలను పునాదిగా ఉపయోగిస్తే, అప్పుడు నీ జ్ఞానం మరింత ఎక్కువ లోతుల్లోనికి వెళ్తుంది. దేవుని నిర్వహణకు సంబంధించిన సంపూర్ణ ప్రణాళికగా పిలువబడే దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశల గురించి నీకు స్పష్టమైన పరిజ్ఞానం ఉంటే, దేవుని కార్యమునకు సంబంధించిన మునుపటి రెండు దశలను ప్రస్తుత దశతో మీరు పూర్తి స్థాయిలో అనుసంధానించగలిగితే, మరియు దానిని దేవుడు చేసిన కార్యముగా చూడగలిగితే, అప్పుడు నీవు సాటిలేని ధృడమైన పునాది కలిగి ఉంటావు. దేవుని కార్యములోని మూడు దశలు ఒకే దేవుని ద్వారా పూర్తి చేయబడ్డాయి; ఇదే గొప్ప దర్శనం మరియు దేవుణ్ణి తెలుసుకోవటానికి ఇదే ఏకైక మార్గం. దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశలను దేవుడు మాత్రమే చేయగలడు మరియు ఆయన తరఫున ఆ కార్యమును ఇంకెవరూ చేయలేరు. అంటే, దేవుడే మొదటి నుండి ఈ రోజు వరకు తన కార్యమును తానే స్వయంగా పూర్తి చేయగలడు. దేవుని కార్యములోని మూడు దశలు వేర్వేరు యుగాల్లో మరియు విభిన్న ప్రదేశాల్లో నిర్వహించబడినప్పటికీ, మరియు ఆ ప్రతి దశ భిన్నంగా ఉన్నప్పటికీ, అదంతా ఒక దేవుడే పూర్తి చేసిన కార్యము. దర్శనాలు అన్నింటిలోకి మనిషి గ్రహించవలసిన గొప్ప దర్శనం ఇదే. మనిషి దీన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అతను వేగంగా నిలదొక్కుకోగలడు. నేడు, వివిధ మతాలు మరియు తెగల వారికి పరిశుద్ధాత్మ కార్యము గురించి తెలియకపోవడమే వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యగా ఉంటోంది. సరిగ్గా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ చేస్తున్న కార్యము మరియు పరిశుద్ధాత్మ చేయని కార్యము మధ్య తేడాను వారు గుర్తించలేకపోతున్నారు. ఈ కారణంగానే, వారు దేవుని కార్యములోని ఈ దశ కూడా చివరి రెండు దశలు లాగే యెహోవా ద్వారా చేయబడిందని స్పష్టంగా చెప్పలేకున్నారు. మనుష్యులు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పటికీ, వారిలో చాలామంది అది సరైన మార్గమో, కాదో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే, ఈ మార్గం దేవుడు స్వయంగా నడిపించిన మార్గమా, శరీరధారిగా వచ్చిన దేవుడు వాస్తవమా, కాదా అని మనిషి ఇంకా గందరగోళంలోనే ఉన్నాడు. అలాగే, అలాంటి వాటిని ఎలా గుర్తించాలనే విషయమై చాలా మంది వద్ద ఇప్పటికీ చిన్నపాటి ఆధారం కూడా లేదు. దేవుణ్ణి అనుసరించే వారు మార్గాన్ని నిర్ణయించలేరు కాబట్టి, చెప్పబడిన సందేశాలన్ని ఈ వ్యక్తుల్లో పాక్షిక ప్రభావం మాత్రమే కలిగి ఉంటాయి, మరియు అవి పూర్తిగా ప్రభావం కలిగించలేవు కాబట్టి, అవి అలాంటి మనుష్యుల జీవిత ప్రవేశాన్ని ప్రభావితం చేస్తాయి. వేర్వేరు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో, మరియు వేర్వేరు మనుష్యుల్లో దేవుడే చేసిన కార్యములోని మూడు దశల్లోనికి మనిషి చూడగలిగితే; కార్యము వేరైనప్పటికీ, అదంతా ఒకే దేవుని ద్వారా చేయబడుతుందని మరియు అలా ఒకే దేవుడు చేసిన కార్యము కాబట్టి, అది సరైనదిగా మరియు తప్పు లేనిదిగా ఉంటుందని మరియు అది మనిషి ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, అది కొట్టిపారేయలేని విధంగా, ఒకే దేవుడు చేసిన కార్యము అని చూడగలిగితే, అది ఒకే దేవుడు చేసిన కార్యము అని మనిషి ఖచ్చితంగా చెప్పగలిగితే, అప్పుడు మనిషి తలంపులన్నీ అత్యంత అల్పమైన వ్యర్థమైన భావాలుగాను, ప్రస్తావించడానికి యోగ్యము కానటువంటి భావాలుగాను మిగిలిపోతాయి. ఎందుకంటే, మనిషి పొందే దర్శనాలు అస్పష్టంగా ఉంటాయి, మరియు యెహోవా దేవుడని మరియు యేసు ప్రభువు అని మాత్రమే మనిషికి తెలుసు కాబట్టి, మరియు ఈ రోజు శరీరధారియై ఉన్నటువంటి దేవుని గురించి మనుష్యులు రెండు ఆలోచనలతో ఉన్నారు, చాలామంది ఇంకా యెహోవా మరియు యేసు కార్యముపట్ల అంకితభావంతో ఉన్నారు, ఈ రోజు జరుగుచున్న కార్యము గురించి వారు తమ భావనల్లోనే ఉండిపోయారు, చాలామంది ఎల్లప్పుడూ సందేహాత్మక స్థితిలోనే ఉన్నారు. అందుకే, నేడు జరుగుచున్న కార్యమును వారు తీవ్రంగా పరిగణించడం లేదు. దేవుని కార్యమునకు సంబంధించిన చివరి రెండు దశల గురించి మనిషికి ఎటువంటి భావనలు లేవు. ఎందుకంటే, అవి వారికి కనిపించవు. దేవుని కార్యములోని చివరి రెండు దశల వాస్తవికతను మనిషి అర్థం చేసుకోలేదు మరియు అతను వ్యక్తిగతంగా వాటిని చూడలేదు. అందుకే, ఈ రెండు దశల గురించి మనిషి తనకు తోచిన విధంగా ఊహించుకున్నాడు; అతని ఆలోచనల్లో ఎలాంటి ఒక దృశ్యం ఏర్పడినా సరే, వాటిని నిరూపించే వాస్తవాలు లేవు మరియు వాటిని సరిదిద్దే వారు కూడా లేరు. మనిషి తన స్వభావానికి స్వేచ్ఛనిస్తాడు, గాలికి సైతం హెచ్చరిక చేస్తూ, తన ఊహను స్వేచ్ఛగా వదిలేస్తాడు; మనిషి ఊహలను ధృవీకరించే వాస్తవాలు ఏవీ లేవు కాబట్టి, మనిషి ఊహలే చివరకు “వాస్తవం” గా మారుతాయి. వాటికి రుజువులు ఉన్నాయా, లేవా అనే దానితో సంబంధం లేకుండా, మనిషి తన మనసులో తాను ఊహించుకున్న దేవుణ్ణి నమ్ముతాడు మరియు నిజమైన దేవుడి కోసం అన్వేషించడు. ఇలా ఒక మనిషిలో ఒక రకమైన విశ్వాసం ఉంటే, వంద మందిలో వంద రకాల విశ్వాసాలుంటాయి. దేవుని కార్యమును నిజంగా చూడని కారణంగానే, మనిషి ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉంటాడు. ఎందుకంటే, మనిషి ఆ విషయాన్ని తన చెవులతో విన్నాడే తప్ప తన కళ్లతో చూడలేదు. మనిషి ఇతిహాసాలు మరియు కథలు విన్నప్పటికీ, దేవుని కార్యమునకు సంబంధించిన వాస్తవాల జ్ఞానం గురించి అతను అరుదుగానే విన్నాడు. ఆ విధంగా, ఒక సంవత్సరమే విశ్వాసులుగా ఉన్న వ్యక్తులు సైతం తమ సొంత ఆలోచనలకు అనుగుణంగా దేవుణ్ణి విశ్వసిస్తారు. అదే సమయంలో, జీవితాంతం దేవుణ్ణి నమ్మిన వారి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. వాస్తవాలు చూడలేని వారు దేవుని గురించి తమకున్న భావనల ఆధారంగా పొందిన విశ్వాసం నుండి ఎప్పటికీ బయటపడలేరు. తాను పాత భావనల బంధాల నుండి విముక్తి పొందాననీ మరియు కొత్త భూభాగంలోకి ప్రవేశించాననీ మనిషి విశ్వసిస్తుంటాడు. కానీ, దేవుని వాస్తవ చిత్రాన్ని చూడలేని వారి జ్ఞానం కేవలం ఊహలు మరియు వింతలే తప్ప మరేదీ కాదని మనిషికి తెలియదా? తన ఆలోచనలు సరైనవి మరియు తప్పు లేనివి మరియు అవి దేవుని నుండి వచ్చాయని మనిషి భావిస్తుంటాడు. నేడు, దేవుని కార్యమును మనిషి చూసినప్పుడు, తాను చాలా ఏళ్లుగా నిర్మించుకున్న ఆలోచనలను అతను వదులేసుకోవాలి. ఎందుకంటే, గత కాలపు ఊహలు, ఆలోచనలు ఈ దశ కార్యమునకు ఆటంకంగా మారుతాయి. అయినప్పటికీ, అలాంటి ఆలోచనలను వదిలివేయడం మరియు అలాంటి ఆలోచనలను తిరస్కరించడం మనిషికి కష్టంగా మారింది. ఈ రోజు వరకు దేవుణ్ణి అనుసరించిన వారిలో చాలా మందికి సైతం ఈ దశలవారీ కార్యము గురించిన ఆలోచనలు మరింత బాధిస్తున్నాయి. అందుకే, ఇలాంటి మనుష్యులందరూ క్రమంగా శరీరధారియైన దేవునిపట్ల మొండి వైరం ఏర్పరుచుకున్నారు. నిజానికి, ఈ ద్వేషానికి మూలం మనిషి ఆలోచనలలోను మరియు ఊహల్లోను ఉంది. ఆ క్రమంలోనే మనిషి ఆలోచనలు మరియు ఊహలు నేటి కార్యమునకు శత్రువుగా మారాయి. మనిషి ఆలోచనలతో ఆ కార్యము విభేదిస్తుంది. మనిషి తన ఊహకు స్వేచ్ఛ ఇవ్వడానికి వాస్తవాలు అనుమతించకపోవడంవల్లే ఇలా జరుగుతోంది. అంతేకాకుండా, ఈ వాస్తవాలను మనిషి అంత సులభంగా తిరస్కరించలేడు మరియు మనిషి ఆలోచనలు మరియు ఊహలనేవి ఈ వాస్తవాల ఉనికిని విచ్ఛిన్నం చేయడానికి నిరాకరిస్తుంటాయి. అంతేకాకుండా, వాస్తవాల ఖచ్చితత్వం మరియు వాస్తవికత గురించి మనిషి ఆలోచించకుండా కేవలం ఒక కోణములోనే ఆలోచన చేస్తూ, తన సొంత ఊహకు రెక్కలు తొడుగుతుంటాడు. కాబట్టి, ఈ తప్పుకు కారణం మనిషి ఆలోచనలే తప్ప, దేవుని కార్యములో తప్పు ఉందని చెప్పలేము. మనిషి తాను కోరుకున్న విధంగా ఊహించుకోవచ్చు కానీ, దేవుని కార్యములోని ఏ దశ గురించి లేదా దానిలోని ఏదైనా భాగం గురించి అతను వివాదించలేడు; ఎందుకంటే, దేవుని కార్యములోని వాస్తవాన్ని మనిషి ఉల్లంఘించలేడు. నీవు నీ ఊహకు స్వేచ్ఛనివ్వడం ద్వారా, యెహోవా మరియు యేసు కార్యము గురించి వినసొంపైన కథలను కూడా సమకూర్చుకుంటావు కానీ, యెహోవా మరియు యేసు కార్యములోని ప్రతి దశ గురించిన వాస్తవాన్ని నీవు తిరస్కరించలేవు; ఇది ఒక సూత్రం, మరియు ఇది ఒక పాలనకు సంబంధించిన కట్టడ కూడా. అందుకే, ఈ అంశాల ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాలి. దేవుడి కార్యములోని ప్రస్తుత దశ మనిషి భావాలకు విరుద్ధంగా ఉందనీ, మరియు ఆ కార్యమునకు సంబంధించిన మునుపటి రెండు దశల్లో అలాంటి పరిస్థితి లేదని మనిషి విశ్వసిస్తుంటాడు. మునుపటి రెండు దశల కార్యము ఖచ్చితంగా ఈనాటి కార్యమునకు సమానం కాదని మనషి తన ఊహల్లో గట్టిగా నమ్ముతాడు. అయితే, దేవుని కార్యమునకు సంబంధించిన సూత్రాలు ఒకేలా ఉన్నాయనీ, ఆయన కార్యము ఎల్లప్పుడూ ఆచరణాత్మకంగా ఉంటుందనీ మీరు ఎప్పుడైనా భావించారా? నిజానికి, కాలంతో సంబంధం లేకుండా, దేవుని కార్యములోని వాస్తవాన్ని ప్రతిఘటించే మరియు వ్యతిరేకించే వ్యక్తుల సమూహం ఎప్పుడూ ఒక ప్రవాహములా వచ్చేదే కదా? దేవుని కార్యమును ప్రతిఘటించే మరియు వ్యతిరేకించే వారందరూ నిస్సందేహంగా గతంలోనూ దేవుణ్ణి వ్యతిరేకించి ఉంటారు. ఎందుకంటే, అలాంటి మనుష్యులు ఎల్లప్పుడూ దేవునికి శత్రువులే. దేవుని కార్యములో వాస్తవాన్ని ఎరిగిన మనుష్యులు మూడు దశల కార్యమును ఒకే దేవుని కార్యముగా చూస్తారు మరియు అలాంటి వారు వారి ఆలోచనలు విడిచిపెడతారు. వీళ్లు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులు, ఇలాంటి వాళ్లు నిజంగా దేవుణ్ణి అనుసరించేవారుగా ఉంటారు. దేవుని కార్యనిర్వహణ కార్యమంతా చివరి దశకు చేరుకున్నప్పుడు, అన్ని విషయాలను పలు వర్గాలుగా దేవుడు వర్గీకరిస్తాడు. మనిషి సృష్టికర్త హస్తాల ద్వారా తయారు చేయబడ్డాడు, అంత్య దశలో మనిషిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటాడు; ఇది దేవుని కార్యమునకు సంబంధించిన మూడు దశలకు ముగింపుగా ఉంటుంది. అంత్య దినముల్లో దేవుని కార్యమునకు సంబంధించిన దశ, మరియు ఇస్రాయేలులోను మరియు యూదయలోను నిర్వహించబడిన మునుపటి రెండు దశలు మొత్తం విశ్వంలో దేవుని కార్య నిర్వహణ ప్రణాళికలో భాగమైయున్నాయి. ఎవరూ దీనిని కాదనలేరు మరియు ఇదే దేవుని కార్యమునకు సంబంధించిన వాస్తవముగా ఉంటుంది. ఈ కార్యమునకు సంబంధించి మనుష్యులకు ఎక్కువగా అనుభవము లేదా ప్రత్యక్షత లేనప్పటికీ, వాస్తవములు ఎప్పటికీ వాస్తవములుగానే ఉంటాయి మరియు ఏ మనిషి కూడా దీనిని నిరాకరించలేడు. విశ్వంలోని ప్రతి ప్రదేశంలో దేవుణ్ణి విశ్వసించే వారు ఆ దేవుని మూడు దశల కార్యమును కూడా అంగీకరిస్తారు. ఒకవేళ నీవు దేవుని కార్యములోని ఒక నిర్దిష్ట దశ గురించి మాత్రమే తెలుసుకుని, మిగిలిన రెండు దశల కార్యమును మరియు గతంలోని దేవుని కార్యమును అర్థం చేసుకోకపోతే, నీవు దేవుని నిర్వహణ ప్రణాళిక గురించిన పూర్తి సత్యం మాట్లాడలేవు మరియు దేవుని గురించిన నీ జ్ఞానం ఏకపక్షంగా ఉంటుంది. దేవునియందు నీవు ఉంచిన విశ్వాసమునుబట్టి నీవు ఆయనను గురించి తెలుసుకోలేవు లేదా ఆయనను అర్థం చేసుకోలేవు. కాబట్టి, దేవునికి సాక్ష్యం చెప్పడానికి నీవు తగిన వ్యక్తివి కాలేవు. చివరకు, ఈ విషయాల గురించిన నీ ప్రస్తుత జ్ఞానం లోతైనదా లేదా పైపైనే ఉందా అనే దానితో సంబంధం లేకుండా, మీరందరూ తప్పనిసరిగా ఈ జ్ఞానం కలిగి ఉండాలి మరియు ఆ విషయాలను సంపూర్ణంగా ఒప్పుకోవాలి ఈ స్థితిలో మనుష్యులందరూ దేవుని కార్యమును సంపూర్ణంగా చూస్తారు మరియు దేవుని ఆధిపత్యానికి లోబడి ఉంటారు. దేవుని ఈ కార్యము ముగిసే సమయానికి, అన్ని మతాలు ఏకమవుతాయి, అన్ని జీవములు సృష్టికర్త ఆధిపత్యంలోకి తిరిగి వస్తాయి, అన్ని జీవములు ఒకే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాయి మరియు అన్ని దుష్ట మతాలు మాయమవుతాయి మరియు మళ్లీ కనిపించవు.
దేవుడి కార్యములోని ఈ మూడు దశల గురించి ఇంత నిరంతరంగా ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? యుగాలు గడిచిపోవడం, సామాజిక అభివృద్ధి మరియు ప్రకృతి మారడం అనేవన్నీ దేవుని కార్యములోని మూడు దశల్లో సరిచేయబడతాయి. దేవుని కార్యముతోపాటు కాల గమనాన మానవాళి మారుతుంటుందే తప్ప అది దానికదే అభివృద్ధి చెందదు. అన్ని జీవములను మరియు ప్రతి మతం మరియు తెగకు చెందిన మనుష్యులందరినీ ఒకే దేవుని ఆధిపత్యం కిందకు తీసుకురావడం కోసమే దేవుని కార్యములోని మూడు దశలు ఉద్దేశించబడ్డాయి. నీవు నీ మతంతో సంబంధం లేకుండా, చివరకు మీరందరూ దేవుని ఆధిపత్యానికి లోబడుతారు. ఇలాంటి ఒక కార్యమును దేవుడు మాత్రమే నిర్వహించగలడు; ఏ మత పెద్ద కూడా ఈ కార్యము చేయలేడు. ప్రపంచంలో అనేక ప్రధాన మతాలున్నాయి మరియు ప్రతి మతానికి ఉన్న సొంత ఆధిపత్యం, లేదా నాయకుడు, మరియు అనుచరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు మరియు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు; దాదాపుగా ప్రతి దేశంలో, అది పెద్దదో లేదా చిన్నదో అనే తేడా లేకుండా, అందులో విభిన్న మతాలున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మతాలు ఉన్నప్పటికీ, విశ్వంలోని ప్రజలందరూ అంతిమంగా ఒకే దేవుని మార్గదర్శకత్వంలోకి వస్తారు. అంతేతప్ప వారి ఉనికి అనేది మత పెద్దల ద్వారా లేదా నాయకుల ద్వారా మార్గనిర్దేశం చేయబడదు. అంటే, మానవాళి అనేది ఒక నిర్దిష్ట మతాధిపతి లేదా నాయకుని ద్వారా మార్గనిర్దేశం చేయబడదని దీని అర్థం; బదులుగా, ఈ ఆకాశాలను మరియు భూమిని, సర్వమానవాళిని మరియు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ద్వారా ఈ సర్వ మానవాళి నడిపించబడుతుంది. ఇదే వాస్తవం. ప్రపంచంలో అనేక ప్రధాన మతాలు ఉన్నప్పటికీ, అవి ఎంత గొప్పవైనప్పటికీ, అవన్నీ సృష్టికర్త ఆధిపత్యంలోనే ఉన్నాయి మరియు వాటిలో ఏవి కూడా ఈ ఆధిపత్య పరిధిని అధిగమించలేవు. మానవాళి అభివృద్ధి, సమాజ పురోగతి, ప్రకృతి శాస్త్రాల అభివృద్ధి లాంటి ప్రతి ఒక్కటీ సృష్టికర్త ఏర్పాట్ల నుండి విడదీయలేని బంధాన్ని కలిగియున్నాయి, మరియు ఈ కార్యము అనేది ఏ మత పెద్ద ద్వారా జరిగించబడే కార్యము కాదు. ఏ మతపెద్ద అయినా సరే, ఒక నిర్దిష్ట మతానికి పెద్దగా ఉండగలడే తప్ప, దేవుని ప్రతినిధి కాలేడు, లేదా భూమ్యాకాశములను మరియు సర్వమును సృష్టించిన సృష్టికర్తకు ప్రతినిధి కాలేడు. ఒక మతాధికారి ఆ మతంలోని వారందరినీ నడిపించగలడు, కానీ ఆకాశముల క్రింద ఉన్నటువంటి సమస్త జీవరాశులను అతను ఆదేశించలేడు. ఇది విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన వాస్తవం. మతాధికారి కేవలం ఒక నాయకుడు మాత్రమే. అతను దేవునికి (సృష్టికర్త) సమానంగా నిలబడలేడు. నిజానికి, ప్రాపంచిక విషయాలన్నీ సృష్టికర్త చేతిలో ఉంటాయి. కాబట్టి, చివరకు ఆ నాయకులు సైతం సృష్టికర్త చేతుల్లోకే వస్తారు. మానవాళి దేవుని ద్వారా సృష్టించబడ్డారు. అందుకే, మతంతో సంబంధం లేకుండా, ప్రతి వ్యక్తి దేవుని ఆధిపత్యంలోకి తిరిగి వస్తాడు. ఇది జరగవలసిన ఒక అనివార్య కార్యం. అన్ని విషయాల్లోనూ దేవుడే సర్వోన్నతుడు. అందుకే, సృష్టించబడిన సమస్తము మధ్య ఉండే ఉన్నత పరిపాలకుడు కూడా ఆయన ఆధిపత్యపు క్రిందకి రావాల్సిందే. మనిషి ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే, అతను ఎప్పటికీ మానవాళిని సరైన గమ్యస్థానం వైపు తీసుకెళ్లలేడు. అలాగే, అందరిని, అన్ని విషయాలనూ ఆయా విభాగాలుగా వర్గీకరించడం ఎవరికీ సాధ్యం కాదు. యెహోవా స్వయంగా సమస్త మానవాళిని సృష్టించాడు మరియు ప్రతియొక్కరిని ఆయా విభాగాలుగా వర్గీకరించాడు, మరియు అంతిమ ఘడియ వచ్చినప్పుడు, ఆయన తన కార్యమును తానే స్వయంగా చేస్తాడు. సమస్తాన్ని ఆయా భాగాలుగా విభాగిస్తాడు. ఈ కార్యమును దేవుడు కాకుండా వేరెవరూ చేయలేరు. దేవుని కార్యమునకు సంబంధించి ప్రారంభం నుండి నేటి వరకు జరిగిన ఈ మూడు దశల కార్యము అంతటినీ దేవుడే జరిపించాడు మరియు ఒకే దేవుడు దీనంతటినీ నిర్వహించాడు. దేవుని కార్యములోని మూడు దశల వాస్తవం అనేది సర్వ మానవాళికి దేవుని నాయకత్వం యొక్క వాస్తవమునైయున్నది. ఇది ఎవరూ తిరస్కరించలేని వాస్తవం. దేవుని కార్యము యొక్క మూడు దశల ముగింపులో, సమస్తము ఆయా రకాలుగా విభాగించబడి మరియు దేవుని ఆధిపత్యంలోకి తిరిగి వస్తాయి. ఎందుకంటే, ఆ సమయానికి విశ్వంలో ఈ ఒక్క దేవుడే ఉంటాడు మరియు ఇతర మతాలేవీ ఉండవు. ప్రపంచాన్ని సృష్టించలేనివాడు దానిని అంతం చేయలేడు. అయితే, ప్రపంచాన్ని సృష్టించినవాడు తప్పకుండా దానిని అంతం చేయగలడు. కాబట్టి, ఎవరైతే యుగాన్ని అంతం చేయలేరో, మరియు మనిషి మనస్సు మార్చడానికి మాత్రమే ప్రయత్నిస్తారో వారు ఖచ్చితంగా దేవునిగా ఉండలేరు మరియు ఖచ్చితంగా మానవాళికి ప్రభువుగా ఉండలేరు. వాళ్లు అలాంటి గొప్ప పని చేయలేరు; ఒకే ఒక్కడు మాత్రమే ఈ కార్యమును నిర్వహించగలడు, మరియు ఈ పని చేయలేని వారందరూ ఖచ్చితంగా శత్రువులే తప్ప దేవుడు కాలేరు. చెడు మతాలన్నీ దేవునికి అనుకూలించవు. అవి దేవునికి విరుద్ధమైనవి కాబట్టి, అవి దేవునికి శత్రువులుగా ఉంటాయి. అన్ని కార్యములు ఈ ఒక్క నిజమైన దేవుని ద్వారానే జరుగుతాయి మరియు విశ్వమంతయూ ఈ ఒక్క దేవుడి ద్వారానే ఆజ్ఞాపించబడుతుంది. ఈ కార్యము ఆయన ద్వారా ఇశ్రాయేలులో జరిగిందా లేదా చైనాలో జరిగిందా అనే దానితో సంబంధం లేకుండా, ఈ కార్యము పరిశుద్ధాత్మ ద్వారా జరిగిందా లేదా మనిషి రూపంతో నిర్వహించబడిందా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతిదీ దేవుని ద్వారానే జరుగుతుంది మరియు వేరెవరూ ఈ కార్యము చేయలేరు. ఆయన మానవాళి మొత్తానికి దేవుడు కాబట్టి, ఆయన స్వేచ్ఛగా, ఎటువంటి షరతులకు కట్టుబడకుండా కార్యము చేస్తాడు. ఇది అన్ని దర్శనాలకంటే గొప్పదై ఉంటుంది. దేవుని సృష్టిగా, మీరు దేవుని సృష్టి ధర్మమును నిర్వహించాలనుకుంటే, మరియు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే, ముందుగా మీరు దేవుని కార్యమును అర్థం చేసుకోవాలి, సృష్టములపట్ల దేవుని చిత్తాన్ని మీరు అర్థం చేసుకోవాలి, దేవుని నిర్వహణ ప్రణాళికను అర్థం చేసుకోవాలి మరియు ఆయన చేసే కార్యము యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాలి. వీటిని అర్థం చేసుకోలేని వారు దేవుని సృష్టములుగా ఉండటానికి యోగ్యత సాధించలేరు! దేవుని సృష్టముగా, మీరు ఎక్కడ నుండి వచ్చారో మీకు అర్థం కాకపోతే, మానవాళి చరిత్ర మరియు దేవుడు చేసిన కార్యములను మీరు అర్థం చేసుకోలేరు. అంతేకాకుండా, మానవాళి ఈ రోజు వరకు అభివృద్ధి చెందిన తీరును మీరు అర్థం చేసుకోలేరు మరియు సమస్త మానవాళిని ఎవరు ఆజ్ఞాపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేరు. ఇలాంటి స్థితిలో నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించే సామర్థ్యం ఉండదు. నేటివరకు మానవాళిని దేవుడే నడిపిస్తాడు మరియు ఈ భూమి మీద మనిషిని సృష్టించినప్పటి నుండి ఆయన మనిషిని విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ తన కార్యమును ఎప్పుడూ ఆపలేదు, మరియు మానవాళిని నడిపించకుండా ఆగిపోలేదు మరియు మానవాళిని చేయి విడిచి పెట్టలేదు. కానీ, దేవుడు ఉన్నాడని మానవాళి ఇప్పటికీ గుర్తించడం లేదు. దేవుని గురించి మనిషికి తెలిసినది చాలా తక్కువ. దేవుని ద్వారా సృష్టించబడిన సమస్త జీవములకు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? దేవుడు వ్యక్తిగతంగా మనిషిని నడిపించినప్పటికీ, దేవుని కార్యమును మనిషి అర్థం చేసుకోడు. నీవు దేవుని ద్వారా సృష్టించబడినప్పటికీ నీ సొంత చరిత్ర నీకు అర్థం కాదు మరియు మీ ప్రయాణంలో మిమ్మల్ని ఎవరు నడిపించారో కూడా మీకు తెలియదు. అయినప్పటికీ, దేవుడు కార్యమును మీరు విస్మరిస్తున్నారు. కాబట్టి, నీవు దేవుణ్ణి తెలుసుకోలేవు. నీకు ఇప్పటికీ దేవుని గురించి తెలియకపోతే, దేవునికి సాక్ష్యం ఇవ్వడానికి నీవు ఎప్పటికీ అర్హత పొందలేవు. ఈ రోజున సృష్టికర్త వ్యక్తిగతంగా మనుష్యులందరినీ మరోసారి నడిపిస్తాడు మరియు మనుష్యులందరూ ఆయన జ్ఞానమును, సర్వశక్తిని, రక్షణను మరియు అద్భుతాలను అనుభవించేలా చేస్తాడు. అయినప్పటికీ, నీవు ఆయనను గ్రహించలేదు లేదా అర్థం చేసుకోలేదు అంటే, నీవు రక్షణ పొందని వ్యక్తివి కాదా? సాతానుకు సంబంధించిన వారందరూ దేవుని వాక్యములను అర్థం చేసుకోలేరు. కానీ, దేవునికి చెందినవారు దేవుని స్వరం వినగలరు. నేను పలికే వాక్యములను గ్రహించి, అర్థం చేసుకున్న వారందరూ రక్షింపబడతారు మరియు దేవునికి సాక్షులవుతారు; నా వాక్కులు అర్థం చేసుకోలేని వారందరూ దేవునికి సాక్ష్యమివ్వలేరు మరియు వారు పరిత్యజించబడుతారు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేని మరియు దేవుని కార్యమును గ్రహించని వారు దేవుని జ్ఞానాన్ని పొందుకోలేరు మరియు అలాంటి వ్యక్తులు దేవునికి సాక్ష్యమివ్వలేరు. దేవునికి సాక్ష్యమివ్వాలని మీరు కోరుకుంటే, మీరు దేవుణ్ణి తప్పకుండ తెలుసుకోవాలి; దేవుని కార్యము ద్వారానే దేవుని జ్ఞానం పొందుకొవడానికి సాధ్యం. మొత్తానికి, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలని ఇష్టపడితే, మీరు తప్పనిసరిగా దేవుని కార్యము గురించి తెలుసుకోవాలి: దేవుని కార్యము గురించి తెలుసుకోవడం అత్యంత కీలకం. దేవుని కార్యములోని మూడు దశలు ముగింపునకు వచ్చినప్పుడు, దేవునికి సాక్ష్యమిచ్చే వారు, దేవుని గురించి తెలిసిన వారు ఒక సమూహంగా చేయబడుతారు. ఈ మనుష్యులందరూ దేవుణ్ణి తెలుసుకుంటారు మరియు సత్యాన్ని ఆచరణలో పెట్టగలరు. వీళ్లు మానవత్వం మరియు జ్ఞానం కలిగి ఉంటారు మరియు దేవుని రక్షణ కార్యములోని మూడు దశలను వీళ్లు తెలుసుకుంటారు. ఇదే చిట్టచివరగా సాధించబడే కార్యము. మరియు ఈ మనుష్యులే 6,000 సంవత్సరాల నిర్వహణకు సంబంధించిన కార్యమునకు ప్రతిరూపంగా మరియు సాతాను అంతిమ ఓటమికి అత్యంత శక్తివంతమైన సాక్ష్యంగా ఉంటారు. దేవునికి సాక్ష్యమివ్వగలిగిన వారు దేవుని వాగ్దానాన్ని మరియు ఆశీర్వాదాన్ని పొందుకోగలరు మరియు వీళ్ల సమూహమే చివరకు మిగిలి ఉంటుంది. ఇదే దేవుని అధికారాన్ని కలిగిన మరియు దేవునికి సాక్ష్యమిచ్చే సమూహంగా ఉంటుంది. నిజానికి, ఈ సమూహంలో మీ అందరూ సభ్యులు కావచ్చు లేదా సగం మంది మాత్రమే కావచ్చు లేదా కొద్ది మందికే ఆ అవకాశం దక్కవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం మీద మరియు మీ అన్వేషణ మీద ఆధారపడి ఉంటుంది.