స్వభావాలు మారిన వ్యక్తులే, దేవుని వాక్యపు వాస్తవికతలోకి ప్రవేశించిన వారు
మనిషిలో పరిశుద్ధాత్ముని మార్గం మొదటి అడుగు, అన్నింటికంటే ముందుగా మనిషి హృదయాన్ని, మనుష్యుల నుండి, సంఘటనల నుండి, మరియు వస్తువుల నుండి దూరం చేసి, దేవుని మాటల్లోకి నడిపించి, దేవుని మాటలు సందేహాలకు మించినవని మరియు సంపూర్ణంగా సత్యమని మనిషి హృదయం నమ్మేలా చేస్తాడు. నీవు దేవునిలో నమ్మకముంచినట్లయితే, నీవు ఆయన మాటల్లో ఖచ్చితంగా నమ్మకముంచాలి; అనేక సంవత్సరాలు దేవునిలో విశ్వాసముంచిన తరువాత, పరిశుద్ధాత్ముని ద్వారా పొందిన మార్గాన్ని గురించి నీవు అవగాహన లేని వ్యక్తిగా ఉన్నట్లయితే, నీవు నిజంగా విశ్వాసివేనా? ఒక సాధారణ మానవ జీవితాన్ని చేరుకోవడానికి—దేవునితో సాధారణ సంబంధాన్ని కలిగిన సాధారణ మానవ జీవితాన్ని చేరుకోవడానికి, నీవు ఖచ్చితంగా మొదట ఆయన మాటల యందు విశ్వాసముంచాలి. ప్రజల్లో పరిశుద్ధాత్ముని కార్యపు మొదటి అడుగుని చేరుకోకపోయినట్లయితే, అప్పుడు నీవు పునాదిని కలిగి ఉండలేవు. అత్యంత అల్పమైన నియమాలు కూడా నీకు మించి ఉన్నట్లయితే, నీ ముందు ఉన్న మార్గంలో ఎలా నడుస్తావు? దేవుడు మనిషిని పరిపూర్ణ పరిచే సరైన మార్గంపై అడుగుపెట్టడం అంటే పరిశుద్ధాత్ముని ప్రస్తుత పని సరైన మార్గంలోకి ప్రవేశించినట్లని అర్థం; పరిశుద్ధాత్ముని ద్వారా పొందిన మార్గంలో అడుగు నిలపడమని దీని అర్థం. ప్రస్తుతానికి, దేవునిప్రస్తుత మాటలే పరిశుద్ధాత్ముని ద్వారా పొందిన మార్గం. అలాగే, పరిశుద్ధాత్ముని మార్గంలో ప్రజలు తమ పాదం నిలిపినట్లయితే, వారు ఖచ్చితంగా విధేయత చూపాలి, మరియు మానవావతారియైన దేవుని ప్రస్తుత మాటలు వినాలి మరియు విశ్వసించాలి. మాటల కార్యమే ఆయన చేసే కార్యం; సమస్తం ఆయన మాటల నుండే ప్రారంభమవుతుంది, మరియు సమస్తం ఆయన మాటలపై, ఇప్పటి ఆయన మాటలపై నిర్మితమవుతుంది. మానవావతారియైన దేవుని గురించి నిశ్చయత కలిగి ఉండడం, లేదా మానవావతారియైన దేవుణ్ణి తెలుసుకోవడం, ఈ రెండింటికీ ఆయన మాటలపై ఎంతో శ్రద్ధ పెట్టడం అవసరం. లేనట్లయితే, ప్రజలు దేన్ని సాధించలేరు మరియు వారికి ఏమి మిగలదు. కేవలం దేవుని మాటలను వినడం మరియు విశ్వసించడమనే పునాదిపై నిర్మించడం ద్వారా మరియు ఆయన్ని తెలుసుకోవడానికి మరియు ఆయన్ని సంతృప్తి పరచడానికి రావడం ద్వారా, ప్రజలు క్రమంగా దేవునితో సాధారణ సంబంధాన్ని నిర్మించుకోగలరు. దేవుని వాక్యాన్ని వింటూ, విశ్వసిస్తూ మరియు వాటిని ఆచరణలో పెట్టడానికి మించిన ఉత్తమమైన సహకారం ఆయనకు మరొకటి లేదు. ఆవిధమైన ఆచరణతోనే, దేవుని ప్రజలుగా సాక్ష్యమివ్వడంలో వారు స్థిరంగా నిలబడగలుగుతాయి. దేవుని ప్రస్తుత మాటల సారాంశాన్ని ప్రజలు అర్థం చేసుకుని, విధేయత చూపినప్పుడు, వారు పరిశుద్ధాత్ముని చేత నడిపించబడే మార్గంలో జీవిస్తారు మరియు మనిషి పట్ల దేవుని పరిపూర్ణత అనే సరైన మార్గంలో అడుగులు నిలుపుతారు. గతంలో ప్రజలు దేవుని కృపను వెదకడం ద్వారా లేదా సమాధానాన్ని మరియు సంతోషాన్ని వెదకడం ద్వారా దేవుని కార్యాన్ని పొందారు కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మానవావతారియైన దేవుని మాటలు లేకుండా, ఆయన మాటల వాస్తవికత లేకుండా, ప్రజలు దేవుని అంగీకారాన్ని పొందలేరు మరియు అందరూ దేవునిచే వెలివేయబడతారు. ఒక సాధారణ ఆధ్యాత్మిక జీవితాన్ని చేరుకోవడానికి, ప్రజలు మొదట దేవుని మాటలను వినాలి మరియు విశ్వసించాలి మరియు వాటిని ఆచరణలో పెట్టాలి, తరువాత ఆ పునాదిపై, దేవునితో ఒక సాధారణ సంబంధాన్ని స్థాపించాలి. నీవు ఎలా సహకరిస్తావు? దేవుని ప్రజల సాక్ష్యంలో నీవు స్థిరంగా ఎలా నిలబడతావు? దేవునితో ఒక సాధారణ సంబంధాన్ని నీవు ఎలా నిర్మిస్తావు?
నీ అనుదిన జీవితంలో దేవునితో సాధారణ సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని ఎలా చూడాలి.
1. దేవుని సొంత సాక్ష్యాన్ని నీవు నమ్ముతున్నావా?
2. దేవుని మాటలు సత్యమని మరియు దోషరహితమైనవని నీ హృదయమందు నమ్ముతున్నావా?
3. నీవు ఆయన మాటలను ఆచరణలో పెట్టే వ్యక్తివేనా?
4. ఆయన ఆజ్ఞకు నీవు నమ్మకంగా ఉన్నావా? ఆయన ఆజ్ఞకు నమ్మకంగా ఉండడానికి నీవు ఏం చేస్తావు?
5. నీవు చేసే ప్రతీదీ, దేవున్ని సంతృప్తిపరచడానికి మరియు ఆయనకు నమ్మకంగా ఉండాడానికే చేస్తున్నావా?
పైన పేర్కొన్న విషయాల ద్వారా, ప్రస్తుత స్థాయిలో దేవునితో సాధారణ సంబంధాన్ని కలిగి ఉన్నావా లేదా అనే విషయాన్ని తెలుసుకోగలవు.
నీవు దేవుని ఆజ్ఞను అంగీకరించి, ఆయన వాగ్ధానాన్ని స్వీకరించి, మరియు పరిశుద్ధాత్ముని మార్గాన్ని అంగీకరించినట్లయితే, అప్పుడు నీవు దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నావు. అంతరంగంలో పరిశుద్ధాత్ముని మార్గం నీకు స్పష్టంగా ఉందా? ఇప్పుడు, నీవు పరిశుద్ధాత్ముని మార్గానికి అనుగుణంగా కార్యం చేస్తున్నావా? నీ హృదయం దేవునికి దగ్గరగా వెళ్లిందా? పరిశుద్ధాత్ముని నూతన వెలుగులో నడవడానికి ఇష్టపడుతున్నావా? దేవుని ద్వారా పొందాలని నీవు కోరుకుంటున్నావా? భూమిపై దేవుని మహిమకు వ్యక్తీకరణగా మారాలి అనుకుంటున్నావా? దేవుడు నీ నుండి కోరుకునే దానిని సాధించడానికి తీర్మానాన్ని కలిగి ఉన్నావా? దేవుడు మాటలు పలికినప్పుడు, అక్కడ, నీలోపల, దేవునికి సహకరించడానికి మరియు సంతృప్తి పరచడానికి తీర్మానం ఉన్నట్లయితే–ఇది నీ మనస్తత్వమైతే–దానర్థం నీ హృదయంలో దేవుని వాక్యం ఫలిస్తుంది. నీకు అలాంటి తీర్మానం లేకపోతే, దానిని అనుసరించాలనే లక్ష్యం నీవు కలిగి ఉండకపోతే, నీ హృదయం దేవునిచే కదిలించబడలేదని అర్థం.
ఒక్కసారి ప్రజలు రాజ్యపు శిక్షణలోనికి అధికారికంగా ప్రవేశించినప్పుడు, వారి నుండి దేవుడు ఆశించేవి ఉన్నత స్థాయికి వెళతాయి. ఈ ఉన్నత డిమాండ్లను ఏ స్థాయిలో చూడాలి? ముందు, ప్రజలు జీవాన్ని కలిగి లేరని చెప్పబడింది. ఈరోజు, వారు జీవాన్ని వెదుకుతున్నారు, వారు దేవుని ప్రజలవ్వడానికి, దేవుని ద్వారా సంపాదించుకోవడానికి, దేవునిచే పరిపూర్ణంగా చేయబడటానికి వెదుకుతున్నారు. ఇది ఉన్నతమైన స్థాయి కాదా? వాస్తవానికి, ప్రజల నుండి దేవుడు డిమాండ్ చేసే విషయాలు గతంలో ఉన్నదాని కంటే సులభమైనవి. ప్రజలు సేవ చేయవలసిన లేదా చనిపోవలసిన అవసరం లేదు-వారు దేవుని ప్రజలుగా మారడమే వారు చేయవలసిన పని. అది సులభమైనది కాదా? నీవు చేయాల్సిందల్లా, నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి మరియు ఆయన నడిపింపుకు లోబడాలి, అప్పుడు సమస్తం సఫలమవుతాయి. ఇది కఠినమైందని నీవు ఎందుకు భావిస్తున్నావు? జీవంలోకి ప్రవేశించడాన్ని గురించి గతంలో కంటే ఇప్పుడే స్పష్టంగా చెప్పబడుతుంది. గతంలో, ప్రజలు అయోమయానికి గురయ్యేవారు మరియు సత్యం వాస్తవం ఏమిటో గ్రహించలేకపోయేవారు. వాస్తవానికి, దేవుని మాటలు విన్నప్పుడు స్పందించేవారందరూ, పరిశుద్ధాత్ముని ద్వారా వెలిగింపును మరియు జ్ఞానోదయాన్ని, మరియు దేవుని ఎదుట పరిపూర్ణతను పొంది, స్వభావంలో మార్పుపొందినవారందరూ–అలాంటి ప్రజలందరూ జీవాన్ని కలిగి ఉన్నారు. దేవుడు, సజీవులనే గానీ, నిర్జీవమైన వాటిని కోరుకోవడం లేదు; నీవు మృతినొందినట్లయితే, నీవు జీవాన్ని కలిగి లేవు మరియు దేవుడు నీతో మాట్లాడడు, తన ప్రజలలో ఒకరిని లేపినట్లుగా ఆయన నిన్ను తక్కువగా లేపుతాడు. నీవు దేవుని చేత లేపబడ్డావు గనుక మరియు ఆయన నుండి గొప్ప దీవెనను పొందావు గనుక, మీరు జీవంతో ఉన్న ప్రజలని, దేవుని నుండి వచ్చిన జీవంతో ఉన్న ప్రజలని ఇది చూపుతుంది.
ఒక వ్యక్తి జీవితపు స్వభావంలో మార్పును అన్వేషించడంలో, ఆచరణ మార్గం సులభంగా ఉంటుంది. నీ ఆచరణాత్మక అనుభవంలో, నీవు పరిశుద్ధాత్ముని ప్రస్తుత మాటలను అనుసరిస్తూ, దేవుని కార్యాన్ని అనుసరిస్తున్నట్లయితే, అప్పుడు నీ స్వభావం మారుతుంది. పరిశుద్ధాత్ముడు ఏది చెప్పినా నీవు అనుసరిస్తున్నట్లయితే, మరియు పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రతిదానిని వెదుకుతున్నట్లయితే, అప్పుడు నీవు ఆయనకు లోబడే వ్యక్తివి మరియు నీ స్వభావంలో మార్పు కలుగుతుంది. ప్రజల స్వభావాలు, పరిశుద్ధాత్ముని ప్రస్తుత మాటలతో మారతాయి; నీవు నీ పాత అనుభవాలకు మరియు గతం నియమాలకు ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉన్నట్లయితే, అప్పుడు నీ స్వభావం మార్పు చెందదు. ఈరోజు పరిశుద్ధాత్ముని మాటలు, ప్రజలందరిని సాధారణ మానవత్వపు జీవం లోనికి ప్రవేశించమని అడిగినప్పటికీ, నీవు బాహ్య సంబంధ విషయాలపై స్థిరపడి, వాస్తవం విషయంలో అయోమయానికి గురవుతూ, దాన్ని తీవ్రంగా పరిగణించకపోతే, అప్పుడు, నీవు పరిశుద్ధాత్ముని కార్యాన్ని కొనసాగించడంలో విఫలం చెందిన వ్యక్తివౌతావు మరియు పరిశుద్ధాత్ముని నడిపింపు మార్గంలో ప్రవేశించని వ్యక్తివౌతావు. నీ స్వభావం మార్పు చెందుతుందా లేదా అనేది, పరిశుద్ధాత్ముని ప్రస్తుత మాటలతో కొనసాగుతున్నావా లేదా అన్నదానిపై మరియు నీవు సత్యమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నావా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మీరు ఇంతకు ముందు గ్రహించిన దానికి భిన్నమైంది. త్వరగా తీర్పు తీర్చే నీవు దేవుని క్రమశిక్షణ ద్వారా అనాలోచితంగా మాట్లాడడం మానేసావు అనేది గతంలో నీవు నీ స్వభావంలో గమనించిన మార్పు; కానీ అది మార్పులో కేవలం ఒక్క రూపం మాత్రమే. ఇప్పుడు, పరిశుద్ధాత్ముని నడిపింపుని అనుసరించడమే అత్యంత సందిగ్ధ అంశం: దేవుడు చెప్పిన ప్రతి దానిని అనుసరించు మరియు దేవుడు చెప్పిన ప్రతిదానికి లోబడు. ప్రజలు తమ స్వంత స్వభావాన్ని మార్చుకోలేరు. వారు ఖచ్చితంగా దేవుని మాటల తీర్పు గుండా మరియు దండన గుండా, శ్రమ మరియు శుద్ధీకరణ గుండా వెళ్ళాలి మరియు ఆయన మాటల ద్వారా క్రమశిక్షణ చేయబడాలి మరియు కత్తిరించబడాలి. అప్పుడు మాత్రమే వారు దేవునికి విధేయతను మరియు నమ్మకత్వాన్ని చూపగలరు మరియు ఆయన పట్ల అశ్రద్ధ కలిగి ఉండలేరు. దేవుని మాటల శుద్ధీకరణ ద్వారా మాత్రమే ప్రజల స్వభావాల మార్పు చెందుతాయి. కేవలం ఆయన మాటల ప్రత్యక్షత, తీర్పు, క్రమశిక్షణ మరియు వ్యవహారం ద్వారానే దుడుకుగా స్పందించే ధైర్యం చేయరు, కానీ దానికి బదులుగా స్థిరంగాను మరియు నెమ్మదిగాను మారతారు. వారు దేవుని ప్రస్తుత మాటలకు మరియు ఆయన కార్యానికి లోబడగలగడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన అంశం. ఇవి మానవ ఆలోచనలతో పొందిక లేన్నప్పటికీ, వారు ఆ ఆలోచనను ప్రక్కనపెట్టి, ఇష్టపూర్వకంగా లోబడతారు. గతంలో, స్వభావంలో మార్పును గూర్చిన చర్చ ప్రధానంగా ఒక వ్యక్తి తనని తాను ఉపేక్షించుకోవడాన్ని, శరీరాన్ని శ్రమపరచుకోవడాన్ని, ఒకరి దేహాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవడాన్ని మరియు శరీర సంబంధం ప్రాధాన్యతలను వదిలించుకోవడాన్ని సూచిస్తుంది–ఇది స్వభావంలో ఒక విధమైన మార్పు. ఈరోజున, స్వభావంలో మార్పు అనేది నిజమైన వ్యక్తీకరణ, దేవుని ప్రస్తుత మాటలకు విధేయత చూపడం మరియు ఆయన నూతన కార్యాన్ని నిజంగా గ్రహించడం అని ప్రతిఒక్కరికీ తెలుసు. ఈ విధానంలో, దేవుని గూర్చిన ప్రజల గత అవగాహన, వారి స్వంత ఆలోచనలచే రూపించబడి, తొలగించబడుతుంది మరియు వారు దేవుని నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండగలరు మరియు దేవునికి విధేయత చూపగలరు–కేవలం ఇది మాత్రమే స్వభావంలో మార్పునకు యదార్థమైన వ్యక్తీకరణ.
జీవంలోకి ప్రవేశించాలనే మనుష్యులప్రయత్నం దేవుని మాటలపై ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు, సమస్తం ఆయన మాటలను బట్టే నేరవేర్చబడిందని చెప్పబడింది, కానీ ఎవరూ ఈ వాస్తవాన్ని చూడలేదు. నీవు ప్రస్తుత దశలోకి ప్రవేశిస్తే, సమస్తం నీకు స్పష్టమౌతుంది, మరియు నీవు నీ భావి శ్రమలకు మంచి పునాదిని నిర్మించుకుంటావు. దేవుడు ఏది చెప్పినా, ఆయన మాటల్లోకి ప్రవేశించడంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి. ప్రజలను శిక్షిస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆయన శిక్షను అంగీకరించాలి. దేవుడు చనిపొమ్మని ప్రజలకు చెప్పినప్పుడు ఆ శ్రమను అంగీకరించాలి. నీవు ఎల్లప్పుడు ఆయన నూతన వ్యక్తికరణల్లో జీవిస్తున్నట్లయితే, ముగింపులో దేవుని మాటలు నిన్ను పరిపూర్ణపరుస్తాయి. నువ్వు ఎంతగా దేవుని మాటల్లో ప్రవేశిస్తే, అంత త్వరగా నీవు పరిపూర్ణ పరచబడతావు. క్రమమైన సహవాసంలో, దేవుని మాటలను తెలుసుకొని, వాటిలో ప్రవేశించమని మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? నీవు దేవుని మాటలను అన్వేషించి, వాటిలో అనుభవం కలిగి, ఆయన మాటల వాస్తవికతలోకి ప్రవేశించినప్పుడు, నీలో పనిచేసే అవకాశాన్ని పరిశుద్దాత్ముడు కలిగి ఉంటాడు. కాబట్టి, దేవుడు పనిచేసే ప్రతి విధానంలో మీరందరు భాగస్వాములు కావాలి మరియు మీ శ్రమ ఏస్థాయిలో ఉన్నప్పటికీ ముగింపులో మీరు బహుమానాన్ని పొందుతారు. మీ అంతిమ పరిపూర్ణతను సాధించడానికి గాను, మీరు ఖచ్చితంగా దేవుని మాటలన్నిటిలోకి ప్రవేశించాలి. ప్రజలను పరిపూర్ణపరిచే పరిశుద్ధాత్ముని కార్యం ఏకపక్షమైంది కాదు; ఆయనకు ప్రజల సహకారం అవసరం, ప్రతి ఒక్కరూ ఉద్ధేశ్యపూర్వకంగా ఆయనకు సహకరించాలి. దేవుడు ఏం చెప్పినా, ఆయన మాటల్లోకి ప్రవేశించడంపైనే దృష్టి సారించాలి–ఇది మీ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైంది. ప్రతీది మీ స్వభావంలో మార్పును తేవడానికి ఉద్దేశించబడింది. నీవు దేవుని మాటల్లోకి ప్రవేశించినప్పుడు, నీ హృదయం ఆయనచే కదిలించబడుతుంది, మరియు తన కార్యానికి చెందిన ఈ దశలో నీవు సాధించాలని దేవుడు కోరుకున్న ప్రతిదానిని నీవు తెలుసుకోగలుగుతావు మరియు దాన్ని సాధించడానికి నీవు నిర్ణయం తీసుకోగలుగుతావు. శిక్షను పొందే సమయంలో, ఇది దేవుని కార్యపు విధానమని కొంతమంది నమ్ముతారు కానీ, దేవుని మాటల్లో మాత్రం నమ్మకముంచరు. ఫలితంగా, వారు శుద్ధీకరణ ప్రక్రియ గుండా వెళ్లరు మరియు ఏమి పొందకుండానే లేదా గ్రహించకుండానే శిక్షాకాలం నుండి బయటపడిపోతారు. దేవుని మాటలు పొరపాటు లేని సత్యమని మరియు మనుష్యులు శిక్షించబడాలని చెప్పే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఎలాంటి సందేహం లేకుండా, నిజంగా ఆమాటల్లోకి ప్రవేశిస్తారు. వారు కొంత సమయం శ్రమపడతారు, తమ భవిష్యత్ మరియు తమ లక్ష్యం వైపు కొనసాగుతారు, మరియు వాళ్ళు బయటికి వచ్చినప్పుడు, వారి స్వభావంలో మార్పు కలుగుతుంది మరియు వాళ్ళు దేవుని గూర్చి మరింత లోతైన గ్రహింపు కలిగి ఉంటారు. శిక్ష నుండి బయటకు వచ్చిన వారందరూ, దేవుని మనోహరతను అనుభవిస్తారు మరియు ఈ కార్యపు దశ, వారిలోకి దిగివచ్చిన దేవుని గొప్ప ప్రేమ కలిగి ఉందని గ్రహిస్తారు, అంటే ఇది దేవుని ప్రేమ విజయం మరియు రక్షణ. దేవుని ఆలోచనలు ఎల్లప్పుడూ మంచివి మరియు మనిషిలో దేవుడు చేసే ప్రతీదీ ద్వేషం నుండి కాకుండా, ప్రేమ నుండి కలిగాయని కూడా వారు చెప్తారు. దేవుని మాటల్లో విశ్వాసముంచనివారు, ఆయన మాటల్లోనికి చూడనివారు, శిక్షా సమయంలో శుద్ధీకరణ ప్రక్రియ గుండా వెళ్లరు. ఫలితంగా, పరిశుద్ధాత్ముడు వారితో ఉండడు మరియు వారేమీ పొందరు. శిక్షా కాలంలోకి ప్రవేశించినవారు, వారు శుద్ధీకరణ గుండా వెళ్ళినప్పటికీ, పరిశుద్ధాత్ముడు వారిలో రహస్యంగా పనిచేస్తాడు, ఫలితంగా వారి జీవిత స్వభావం మార్పు చెందుతుంది. కొంతమంది బయటికి చాలా సానుకూలంగాను, రోజంతా ఎంతో ఉత్సాహంతో కనబడతారు కానీ, దేవుని మాటల శుద్ధీకరణ స్థితిలోకి వారు ప్రవేశించరు, కాబట్టి వారు ఎప్పటికీ మార్పు చెందరు. ఇది దేవుని మాటలను నమ్మకపోవడం వల్ల కలిగే పర్యవసానం. నీవు దేవుని మాటలను నమ్మకపోతే, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయడు. తన మాటల్లో నమ్మకముంచేవారందరికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, మరియు ఆయన మాటల యందు విశ్వాసముంచి, అంగీకరించేవారు, ఆయన ప్రేమను పొందగలుగుతారు!
దేవుని మాటల వాస్తవికతలోని ప్రవేశించడానికి, దేవుని వాక్యాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో తెలుసుకొని, అభ్యాసం చేసే మార్గాన్ని కనుగొనాలి. కేవలం అప్పుడు మాత్రమే, మీ జీవిత స్వభావంలో మార్పు కలుగుతుంది, కేవలం ఈ మార్గం ద్వారానే మీరు దేవునిచేత పరిపూర్ణపరచబడతారు, మరియు కేవలం ఈ విధంగా పరిపూర్ణపరచబడిన ప్రజలు మాత్రమే ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటారు. నూతన వెలుగుని పొందాలంటే, నీవు ఆయన మాటల్లో జీవించాలి. పరిశుద్ధాత్మునిచేత ఒక్కసారి కదిలించబడితే సరిపోదు, నీవు మరింత లోతుకు వెళ్ళాలి. కేవలం ఒక్కసారే కదిలించబడినవారికి, వారి అంతరంగ ఉత్సాహం ప్రేరేపితమవుతుంది, మరియు వాళ్ళు వెదకాలని కోరుకుంటారు కానీ, ఇది ఎక్కువ కాలం నిలవదు; వారు నిరంతరం పరిశుద్ధాత్మునిచే కదిలించబడాలి. దేవుని ఆత్మ, ప్రజల ఆత్మలను కదిలిస్తాడని, తద్వారా తమ జీవిత స్వభావంలో మార్పుని అన్వేషిస్తారని మరియు దేవునిచే కదిలించబడడానికి వెదుకుతున్నప్పుడు, వారు తమ వ్యక్తిగత అసంపూర్ణతలను గ్రహిస్తారు మరియు ఆయన మాటలను అనుభవించే ప్రక్రియలో, వారిలో ఉన్న కల్మషాన్ని (స్వనీతి, అహంకారం, ఉద్దేశాలు మొదలైనవి) విసర్జిస్తారనే నిరీక్షణను గతంలో చాలాసార్లు నేను ప్రస్తావించాను. నూతన వెలుగును పొందడంలో క్రియాశీలకంగా ఉంటే చాలని అనుకోకండి–మీలో ఉన్న ప్రతికూలతలను కూడా విసర్జించాలి. ఒకవైపు, మీరు సానుకూలాంశాల నుండి ప్రవేశించాల్సి ఉంటుంది, మరోవైపు మీలో ఉన్న ప్రతికూలాంశాల కోణంలో అపవిత్రత అంతటి నుండి దూరమవ్వాల్సి ఉంటుంది. నీలో ఏ అపవిత్రత ఉందో చూడడానికి నిన్ను నీవు నిరంతరం పరిశీలించుకోవాలి. మానవుని మతపరమైన ఆలోచనలు, ఉద్ధేశ్యాలు, ఆశలు, స్వనీతి మరియు అహంకారం మొదలైనవన్నీ అపవిత్రమైనవి. నీ అంతరంగంలోకి చూసుకుని, నీవు ఏ మతపరమైన ఆలోచన కలిగి ఉన్నావో చూడడానికి, ప్రతిదానిని ప్రక్కప్రక్కన పెట్టి, దేవుని మాటల ప్రత్యక్షతతో పోల్చి చూడాలి. కేవలం నువ్వు వాటిని నిజంగా గ్రహించినప్పుడు మాత్రమే, వాటిని నీవు వదిలిపెట్టగలుగుతావు. కొంతమంది వ్యక్తులు ఇలా చెబుతారు: “పరిశుద్ధాత్ముని ప్రస్తుత కార్యపు వెలుగుని అనుసరిస్తే చాలు. దేని గురించి ఆలోచించనవసరం లేదు.” కానీ నీకు మతపరమైన ఆలోచనలు కలిగినప్పుడు, వాటి నుండి నీవు ఎలా తప్పించుకుంటావు? ఈరోజున దేవుని మాటలు అనుసరించడం చాలా సులభంగా చేయొచ్చని నువ్వు అనుకుంటున్నావా? నీవు మతపరమైన వ్యక్తివైనట్లయితే, నీ మతపరమైన ఆలోచనల నుండి మరియు నీ హృదయంలోని సాంప్రదాయిక వేదాంత సిద్ధాంతాల నుండి విభజనలు కలుగుతాయి. ఈ విషయాలు కలిగినప్పుడు, ఇవి నూతన విషయాలను అంగీకరించడంలో అడ్డుపడతాయి. ఇవన్నీ నిజమైన సమస్యలు. నీవు కేవలం పరిశుద్ధాత్ముని ప్రస్తుత మాటలను మాత్రమే అన్వేషించినట్లయితే, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. అదే సమయంలో, నీవు పరిశుద్ధాత్ముని ప్రస్తుత వెలుగుని అన్వేషిస్తున్నప్పుడు, నువ్వు ఎలాంటి ఆలోచనలకు మరియు తలంపులకు తావిస్తున్నావో, మరియు ఏ విధమైన మానవ స్వనీతిని కలిగి ఉన్నావో మరియు ఏ ప్రవర్తనలు దేవునికి అవిధేయత చూపుతాయి గ్రహించాలి. నువ్వు ఈ విషయాలన్నీ గ్రహించిన తరువాత, నువ్వు వాటిని వదిలిపెట్టాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటలను అనుసరించడానికే, నీవు నీ గత క్రియలను మరియు ప్రవర్తనను వదిలిపెట్టావు. స్వభావంలో మార్పు అనేది ఒకవైపు దేవుని మాటల ద్వారా సాధ్యమైతే, మరోవైపు మనిషి సహకారం అవసరమవుతుంది. ఒకవైపు దేవుని కార్యం, అదే సమయంలో మానవుని అభ్యాసం అనే రెండూ అనివార్యమైనవి.
మీ భవిష్యత్ సేవా మార్గంలో, దేవుని చిత్తాన్ని మీరు ఎలా నెరవేరుస్తారు? జీవంలోకి ప్రవేచించడానికి అన్వేషించడం, స్వభావంలో మార్పుని అన్వేషించడం మరియు సత్యంలోకి మరింత లోతుగా ప్రవేశించే ప్రయత్నం చేయడమనేది ఒక కీలకమైన అంశం–ఇది దేవునిచేత పరిపూర్ణపరచబడుటకు మరియు దేవుని ద్వారా సంపాదించబడడానికి ఒక మార్గం. మీరందరూ దేవుని ఆజ్ఞను పొందారు కానీ, అది ఎలాంటి ఆజ్ఞ? ఇది పనిలో తరువాతి దశకు సంబంధించినది; పనిలో తరువాతి దశ, విశ్వమంతటా జరిగే గొప్పకార్యం, కాబట్టి ఈరోజు, దేవుడు తన పని ద్వారా పొందే మహిమకు నిజమైన ఆధారంగా మారునట్లు మరియు ఆయన తన భవిష్యత్ కార్యానికి మిమ్మల్ని మాదిరిగా చేసేలా మీరు మీ జీవిత స్వభావంలో మార్పులను అన్వేషించాలి. భవిష్యత్ కార్యం కొరకు పునాది వేయడానికే ఈనాటి అన్వేషణ, కాబట్టి మీరు దేవునిచేత వాడబడతారు మరియు ఆయనకు సాక్ష్యమిస్తారు. దీన్నే నీ అన్వేషణకు లక్ష్యంగా చేసుకున్నట్లయితే, నీవు పరిశుద్ధాత్ముని సన్నిధిని పొందగలుగుతావు. నీ అన్వేషణకు ఎంత ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకుంటావో, అంతా ఎక్కువగా నీవు పరిపూర్ణపరచబడతావు. నీవు సత్యాన్ని ఎంత ఎక్కువగా అన్వేషిస్తే, అంత ఎక్కువగా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. నీ అన్వేషణలో ఎక్కువ శక్తిని వినియోగిస్తే, అంతగా పొందుతావు. ప్రజల అంతరంగ స్థితిని బట్టి పరిశుద్ధాత్ముడు వారిని పరిపూర్ణపరుస్తాడు. దేవునిచేత వాడబడడానికి లేదా ఆయనచేత పరిపూర్ణపరచడానికి ఇష్టపడుతున్నామని కొంతమంది ప్రజలు చెబుతారు కానీ, వారు తమ శరీరం సురక్షితంగా ఉండాలనుకుంటారు, ఏ కష్టాన్ని అనుభవించడానికి ఇష్టపడరు. కొంతమంది ప్రజలు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడరు కానీ, అగాథంలోకి దిగడానికి మాత్రం ఇష్టాన్ని కనబరుస్తారు. అలాంటి విషయానికొస్తే, దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు. నీవు దేనికొరకు అన్వేషించినా, అది జరిగేలా దేవుడు చేస్తాడు. కాబట్టి, ప్రస్తుతం నీవు దేనిని అన్వేషిస్తున్నావు? అది పరిపూర్ణపరచబడడమేనా? నీవు ప్రస్తుతం చేస్తున్న క్రియలు మరియు ప్రవర్తనలు దేవునిచేత పరిపూర్ణపరచబడడం మరియు ఆయన ద్వారా సంపాదించబడడానికేనా? నీవు నీ అనుదిన జీవితంలో నిరంతరం నిన్ను నీవు అంచనా వేసుకోవాలి. ఒకే లక్ష్యాన్ని అన్వేషించడంలో నీ హృదయమంతటిని పెట్టినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నిన్ను పరిపూర్ణపరుస్తాడు. అది పరిశుద్ధాత్ముని మార్గం. పరిశుద్ధాత్ముడు ప్రజలను నడిపించే మార్గం, వారి అన్వేషణ ద్వారానే సంపాదించబడుతుంది. దేవుని ద్వారా పరిపూర్ణపరచబడాలనే, సంపాదించబడాలనే తృష్ట నీవు ఎంతగా కలిగి ఉంటావో అంతగా పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేస్తాడు. అన్వేషించడంలో నీవు ఎంతగా వైఫల్యం చెందుతావో, అంతగా ప్రతికూలమైన, క్షీణిస్తున్నవానివిగా ఉంటావు, అంతగా పరిశుద్ధాత్ముడు కార్యం చేసే అవకాశాలను పోగొట్టుకుంటావు; సమయం గడిచేకొద్ది పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుని ద్వారా పరిపూర్ణపరచబడాలని నీవు కోరుకుంటున్నావా? దేవుని ద్వారా సంపాదించబడలని నీవు ఆశిస్తున్నావా? దేవునిచేత వాడబడాలని నీవు కోరుకుంటున్నావా? దేవునిచే పరిపూర్ణపరచబడడానికి, సంపాదించబడడానికి మరియు వాడబడానికి చేయాల్సిన ప్రతిదానిని మీరు అన్వేషిస్తే, అప్పుడు దేవుని కార్యాలు మీలో వ్యక్తపరచబడడం విశ్వం మరియు సమస్తం చూడగలుగుతాయి. సమస్తమైన వాటి విషయంలో మీరు ప్రావీణ్యులు కావడంతో పాటు, మీ ద్వారా సాక్ష్యాన్ని, మహిమను దేవుడు పొందేలా చేస్తారు–ఇది మీరు తరాలన్నింటిలో ఎంతో ఆశీర్వదించబడినవారు అనడానికి రుజువుగా ఉంటుంది.