దేవుని ఎదుట మీ హృదయాన్ని నిశ్శబ్దం చేయడం గురించి

దేవుని వాక్యాలలోకి ప్రవేశించడానికి ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని నిశ్శబ్దం చేయడం కంటే మరేదీ కీలకమైనది కాదు. ప్రస్తుతం, మనుష్యులందరూ ప్రవేశించడానికి త్వరపడే అవసరంలో ఉన్నారనే పాఠం ఇది. దేవుని ఎదుట నీ హృదయాన్ని నిశ్శబ్దపరుచుకోవడానికి ప్రవేశ మార్గాలు కింద ఉన్నాయి:

1. బాహ్య విషయాల నుండి నీ హృదయాన్ని వెనక్కి తీసుకో. దేవుని ముందు శాంతితో ఉండు, మరియు దేవుడిని ప్రార్ధించడానికి నీ అవిభక్త శ్రద్ధ అందివ్వు.

2. నీ హృదయం దేవుని ఎదుట శాంతితో ఉన్నప్పుడు దేవుని వాక్యాలను తిను, తాగు మరియు దేవుని వాక్యాలను ఆస్వాదించు.

3. దేవుని ప్రేమను ధ్యానించు మరియు యోచించు మరియు నీ హృదయంలో దేవుని కార్యాన్ని తలచుకో.

మొదటగా, ప్రార్థన అనే అంశం నుండి ప్రారంభిద్దాం. అవిభక్త శ్రద్ధతో మరియు నిర్ణీత సమయాలలో ప్రార్థించండి. సమయం కోసం మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా, మీ పని ఎంత తీరిక లేనిదైనా, లేదా మీకు ఏం జరిగినా, ప్రతిరోజు సాధారణంగానే ప్రార్థించండి, మరియు దేవుని వాక్యాలను సాధారణంగానే తినండి మరియు తాగండి. మీరు దేవుని వాక్యాలను తిని, తాగినంత కాలం, మీ పరిసరాలు ఎలాంటివైనా, మీ ఆత్మలో మీకు గొప్ప సంతోషం ఉంటుంది, మరియు మీరు ప్రజల చేత, సంఘటన చేత, లేదా మీ చుట్టూ ఉన్న విషయాల చేత భంగపరచబడరు. మీరు సాధారణంగా దేవుని గురించి యోచిస్తున్నపుడు బయట జరిగేది ఏదీ మిమ్మల్ని బాధించదు. ఉన్నత స్థితిని కలిగి ఉండటం అనే దానికి అర్ధం ఇదే. ప్రార్థనతో మొదలు పెట్టండి: దేవుని ముందు నిశ్శబ్దంగా ప్రార్థించడం అత్యంత ఫలప్రదం. దాని తర్వాత, దేవుని వాక్యాలు తినండి మరియు తాగండి దేవుని వాక్యాలలో వెలుగును వాటిని దీర్ఘంగా ఆలోచించడం ద్వారా వెతకండి. ఆచరించడానికి మార్గాన్ని వెతకండి, ఆయన వాక్యాలను చెప్పడంలో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోండి, మరియు దారి తప్పకుండా వాటిని అర్థం చేసుకోండి. మామూలుగా, మీ హృదయంలో దేవునికి దగ్గరగా జరగ గలగడం, బాహ్య విషయాల చేత ఆటంక పరచబడకుండా దేవుని వాక్యాలను దీర్ఘంగా ఆలోచించగలగడం మీకు సాధారణం అవ్వాలి. నీ హృదయం కొంత వరకు శాంతిని పొందినప్పుడు, చివరికి స్తుతి మీ హృదయం నుండి పొంగిపొరలే స్థాయికి చేరుకునేవరకు, మీ పరిసరాలతో సంబంధం లేకుండా, మీరు నిశ్శబ్దంగా తలుచుకోగలుగుతారు, మీలో మీరు, దేవుని ప్రేమను గురించి యోచించగలుగుతారు మరియు నిజంగా ఆయనకు దగ్గరగా జరుగుతారు, మరియు అది ప్రార్ధన కంటే ఉత్తమమైనది. అప్పుడు మీరు కొంత స్థాయిని కలిగి ఉంటారు. నువ్వు పైన వివరించిన స్థితులను సాధించగలిగితే, అది దేవుని ముందు నీ హృదయం నిజంగా శాంతిగా ఉందనే దానికి సాక్ష్యం అవుతుంది. ఇది మొదటి ప్రాథమిక పాఠం. జనులు దేవుని ముందు శాంతితో ఉండగలిగిన తర్వాత మాత్రమే వారు పరిశుద్ధాత్ముని చేత తాకబడతారు, మరియు పరిశుద్ధాత్మ చేత వివేకవంతులై, ప్రకాశింప చేయబడతారు, అప్పుడు మాత్రమే వారు దేవునితో నిజమైన అన్యోన్యతను కలిగి ఉండగలుగుతారు, దాంతో పాటు దేవుని చిత్తాన్ని మరియు పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని గ్రహించగలుగుతారు. అప్పుడే వారు వారి ఆధ్యాత్మిక జీవితాల్లో సరైన మార్గంలోకి ప్రవేశించినట్టు అవుతుంది. దేవుని ఎదుట నివశించడానికి వారి శిక్షణ ఒక నిర్దిష్టమైన లోతుకు చేరుకున్నప్పుడు, దేవుని వాక్యాలలో జీవించడానికి తమని తాము అలక్ష్యము చేసినపుడు, మరియు తమని తాము విడిచిపెట్టినపుడు, అప్పుడు వారి హృదయాలు దేవుని ఎదుట నిజమైన శాంతితో ఉంటాయి. తనని తాను అలక్ష్యము చేసుకోగలగడం, మరియు తనని తాను విడిచి పెట్టగలగడం అనేది దేవుని కార్యము చేత సాధించబడిన ప్రభావం, జనులు తమంతట తాముగా చేయలేరు. అలా దేవుని ముందు ఒక హృదయాన్ని నిశ్శబ్ద పరచుకోవడాన్ని ఆచరించడం అనేది జనులు వెంటనే ప్రవేశించవలసిన పాఠం. కొంతమందికి, మామూలుగానే వారు దేవుని ఎదుట శాంతితో ఉండలేకపోవడం మాత్రమే కాదు, వారు ప్రార్థిస్తున్నప్పుడు కూడా దేవుని ముందు వారి హృదయాలను నిశ్శబ్ద పరచుకోలేరు. దేవుని ప్రమాణాలకు ఇది చాలా కింది స్థాయిలో ఉంది! దేవుని ఎదుట మీ హృదయం శాంతితో లేకపోతే, మీరు పరిశుద్ధాత్మ చేత కదిలింపబడతారా? నువ్వు కనుక దేవుని ఎదుట శాంతి లేని వాడివైతే ఎవరైనా వచ్చినప్పుడు, లేదా ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నీ దృష్టి మరలి పోవడానికి బాధ్యుడివి అవుతావు, మరియు నీ మనసు ఇతరులు ఏదైనా చేస్తున్నప్పుడు దారి తప్పుతుంది, అలా జరిగితే నువ్వు దేవుని సన్నిధిలో నివశించవు. నీ హృదయం నిజంగా దేవుని ఎదుట శాంతితో ఉంటే, నువ్వు బాహ్య ప్రపంచంలో జరిగే దేనితోనూ ఆటంకపరచబడవు, లేదా ఏ వ్యక్తితోనో, సంఘటనతోనో, లేదా విషయంతోనో ఆక్రమించబడవు. ఒకవేళ నీకు దీనిలో ప్రవేశం ఉంటే, అప్పుడు ఆ ప్రతికూల స్థితులు మరియు ప్రతికూల విషయాలన్నీ—మనుషుల భావాలు, బ్రతకడానికి ఉపయోగపడే తత్వాలు, జనుల మధ్య అసాధారణ సంబంధాలు, మరియు ఆలోచనలు మరియు తలంపులు, మరియు ఇలాంటివన్నీ—సహజంగానే అదృశ్యమవుతాయి. ఎందుకంటే, నువ్వు ఎల్లప్పుడూ దేవుని వాక్యాలు తలుస్తున్నావు మరియు నీ హృదయం ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా జరగబడుతుంది మరియు దేవుని ప్రస్తుత వాక్యాల చేత ఆక్రమించబడి ఉంది, ఆ ప్రతికూల విషయాలు నువ్వు గ్రహించకుండానే నీ నుండి దూరమవుతాయి. ఎప్పుడైతే కొత్త మరియు సానుకూల విషయాలు నిన్ను నింపుతాయో, ప్రతికూల పాత విషయాలకు చోటు ఉండదు, అందుకని ఆ ప్రతికూల విషయాలపై దృష్టి పెట్టవద్దు. వాటిని నియంత్రించడానికి నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని ఎదుట శాంతిగా ఉండటంపై దృష్టి పెట్టాలి, దేవుని వాక్యాలు నీకు ఎంత వీలైతే అంత తిను, తాగు, మరియు ఆస్వాదించు, దేవుడిని ఎంత వీలైతే అంత స్తుతిస్తూ కీర్తనలు పాడు, నీపై పని చేయడానికి దేవునికి ఒక్క అవకాశం ఇవ్వు, ఎందుకంటే దేవుడు ఇప్పుడు వ్యక్తిగతంగా మానవాళిని పరిపూర్ణం చేయాలని అనుకుంటున్నాడు, మరియు ఆయన నీ హృదయాన్ని పొందాలని అనుకుంటున్నాడు. ఆయన ఆత్మ నీ హృదయాన్ని కదిలిస్తుంది మరియు ఒకవేళ, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ, నువ్వు దేవుని సన్నిధిలో నివశించడానికి వస్తే, నువ్వు దేవుడిని తృప్తి పరుస్తావు. దేవుని వాక్యాలలో జీవించడం పైన దృష్టి పెడితే మరియు పరిశుద్ధాత్మ యొక్క వివేచన మరియు ప్రకాశాన్ని పొందడానికి సత్యాన్ని గురించిన సహవాసంలో ఎక్కువగా నిమగ్నమైతే, అప్పుడు ఆ మతపరమైన భావాలు మరియు నీ నీతి మరియు స్వీయ ప్రాముఖ్యత అన్నీ అదృశ్యమవుతాయి, మరియు నిన్ను నువ్వు దేవుని కొరకు వెచ్చించడం ఎలానో, దేవుడిని ప్రేమించడం ఎలానో, మరియు దేవుడిని తృప్తిపరచడం ఎలానో తెలుసుకుంటావు. మరియు నీకు తెలియకుండానే, దేవునికి అన్యమైన ఆ విషయాలు పూర్తిగా నీ స్పృహ నుండి తొలగిపోతాయి.

దేవుడి ప్రస్తుత వాక్యాలను తింటున్నప్పుడు మరియు తాగుతున్నప్పుడు, ఆయన వాక్యాలను తలుచుకోవడం మరియు ప్రార్థించడం అనేది దేవుని ఎదుట శాంతిగా ఉండడానికి మొదటి మెట్టు. నువ్వు నిజంగా దేవుని ఎదుట శాంతిగా ఉండగలిగితే, అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వివేచన మరియు ప్రకాశం నీతో ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితం అంతా దేవుని సన్నిధిలో శాంతిగా ఉండటం ద్వారానే సాధించబడుతుంది. ప్రార్థనలో, నువ్వు తప్పక దేవుని ఎదుట శాంతిగా ఉండాలి, మరియు అప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడగలవు. దేవుని ఎదుట శాంతిగా ఉన్నప్పుడు దేవుని వాక్యాలను తిని తాగినప్పుడు, నువ్వు వివేకవంతుడువి మరియు ప్రకాశవంతుడివి అవ్వగలవు, మరియు దేవుని వాక్యాల యొక్క నిజమైన అవగాహనను పొందవచ్చు. ధ్యానం మరియు సహవాసం మరియు నీ హృదయం దేవునికి దగ్గర కావడం లాంటి సాధారణ కార్యకలాపాలలో, దేవుని సన్నిధిలో నువ్వు శాంతిగా ఉన్నప్పుడు, నువ్వు దేవునితో యదార్ధమైన సాంగత్యాన్ని ఆస్వాదించగలుగుతావు, దేవుని ప్రేమ మరియు ఆయన కార్యము గురించి యదార్ధమైన అవగాహన కలిగి ఉండగలవు, మరియు ఆయన ఉద్దేశాల పట్ల నిజమైన ఆలోచన మరియు శ్రద్ధ చూపగలవు. నువ్వు ఎంత సాధారణంగా దేవుని ఎదుట శాంతిగా ఉండగలవో, అంత ఎక్కువగా నువ్వు ప్రకాశింప చేయబడతావు మరియు అంత ఎక్కువగా నీ సొంత అవినీతి స్వభావాన్ని అర్థం చేసుకోగలుగుతావు, నీకు లోపించింది ఏమిటి? నువ్వు ప్రవేశించాల్సింది ఏమిటి, నువ్వు చేయవలసిన క్రియ ఏమిటి, మరియు నీ లోపాలు ఎక్కడ ఉన్నాయి. ఇదంతా దేవుని సన్నిధిలో శాంతిగా ఉండడం ద్వారా సాధించబడుతుంది. నువ్వు నిజంగా దేవుని ఎదుట లోతైన శాంతిని పొందగలిగితే, నువ్వు ఆత్మ యొక్క నిర్దిష్టమైన మర్మాలను గ్రహించగలుగుతావు, దేవుడు ప్రస్తుతం నీలో ఏం చేయాలనుకుంటున్నాడో గ్రహించగలగడానికి, దేవుని వాక్యాల యొక్క లోతైన అవగాహనను గ్రహించగలగడానికి, దేవుని వాక్యాల యొక్క గుజ్జును, దేవుని వాక్యాల యొక్క సారాన్ని, దేవుని వాక్యాల ఉనికిని గ్రహించగలగడానికి, మరియు నువ్వు ఆచరణ మార్గాన్ని మరింత స్పష్టంగా మరియు కచ్చితంగా చూడగలుగుతావు. నీ ఆత్మలో తగినంత లోతు ఉండటం సాధించడంలో నువ్వు కనుక విఫలమైతే, నువ్వు పరిశుద్ధాత్మ చేత కేవలం కొంత మాత్రంగానే కదిలింపబడతావు; నువ్వు లోపల బలపడిననట్లు భావిస్తావు మరియు నువ్వు కొంత మొత్తంలో సంతోషాన్ని మరియు శాంతిని అనుభూతి చెందుతావు, కానీ నువ్వు ఏదీ లోతుగా గ్రహించలేవు. నేను ఇంతకు ముందే చెప్పాను: జనులు వారి శక్తిలో ప్రతి ఔన్సును వాడకపోతే, వారికి నా మాటలు వినడం లేదా నా మొహం చూడడం కష్టతరం అవుతుంది. ఇది దేవుని ఎదుట ఒకరి శాంతిలో లోతును సాధించడాన్ని సూచిస్తుంది, మరియు పైపై ప్రయత్నాలను చేస్తుండటం కాదు. దేవుని సన్నిధిలో నిజంగా శాంతిగా ఉండగలిగే వ్యక్తి ప్రపంచపు బంధనాలన్నిటి నుండి తన్ను తాను విముక్తుడ్ని చేసుకోగలడు, మరియు దేవునిచే పొందబడడాన్ని సాధించగలడు. దేవుని సన్నిధిలో శాంతిగా ఉండగలం సామర్థ్యం లేని వారందరూ రూఢిగా భ్రష్టు లు మరియు అదుపులేని వారు. దేవుని ఎదుట శాంతిగా ఉండగలిగిన వారందరూ దేవుని ఎదుట భక్తిగా ఉండగలిగిన వాళ్ళు మరియు దేవుని కోసం ఆరాటపడేవారు. దేవుని ఎదుట శాంతిగా ఉన్నవారు మాత్రమే జీవితానికి విలువనిస్తారు, ఆత్మలో సహవాసానికి విలువ ఇస్తారు, దేవుని వాక్యాల కొరకు దప్పికగొని ఉంటారు, మరియు సత్యాన్ని వెంబడిస్తారు. దేవుని ఎదుట శాంతిగా ఉండటానికి ఎవరైతే విలువ ఇవ్వరో మరియు దేవుని ఎదుట శాంతిగా ఉండడానికి ప్రయత్నించరో వారు వ్యర్థం మరియు అల్పులు, జీవం లేకుండా ప్రపంచానికి అంటిపెట్టుకొని ఉంటారు. వారు దేవుడిని నమ్ముతున్నామని చెప్పినా సరే, వారు కేవలం పెదవితో మాట్లాడుతున్నారు. దేవుడు పరిపూర్ణులుగా మరియు సంపూర్తిగా చేసేది ఆయన సన్నిధిలో శాంతిగా ఉండగలిగిన వారినే. కాబట్టి, దేవుని ఎదుట శాంతిగా ఉన్నవారు గొప్ప ఆశీర్వాదాలతో దీవించబడతారు. రోజంతా దేవుని వాక్యాలను తినడానికి మరియు తాగడానికి అరుదుగా సమయం గడిపేవారు, తీరిక లేకుండా బాహ్య వ్యవహారాలతో ముందుగానే నిమగ్నమై పోయిన వారు మరియు జీవిత ప్రవేశానికి అతి తక్కువ విలువ ఇచ్చేవారు—వీరందరూ భవిష్యత్తులో పురోభివృద్ధి చెందే అవకాశం లేని కపట దారులు. దేవుని ఎదుట శాంతిగా ఉండగలిగిన వారు మరియు దేవునితో యదార్ధంగా సంభాషించగలిగినవారే దేవుని యొక్క ప్రజలు.

ఆయన మాటలను నీ జీవితంగా అంగీకరించడానికి దేవుని ఎదుటకి రావడానికి ముందుగా నువ్వు తప్పకుండా దేవుని ఎదుట శాంతితో ఉండాలి. దేవుని ఎదుట శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను వివేకవంతుడిని చేస్తాడు మరియు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. జనులు దేవుని ముందు ఎంత ఎక్కువ శాంతితో ఉంటారో అంత ఎక్కువగా వారు దేవుని వివేకాన్ని మరియు ప్రకాశాన్ని పొందగలుగుతారు. దీనంతటికీ జనులకు భక్తి మరియు విశ్వాసం ఉండటం అవసరం; కేవలం అలా మాత్రమే వారు పరిపూర్ణులుగా చేయబడతారు. ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించడానికి ప్రాథమిక పాఠం దేవుని సన్నిధిలో శాంతిగా ఉండడం. దేవుని సన్నిధిలో శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే నీ ఆధ్యాత్మిక శిక్షణ మొత్తం ప్రభావశీలంగా ఉంటుంది. నీ హృదయం దేవుని ఎదుట శాంతిగా ఉండలేకపోతే, పరిశుద్ధాత్మ కార్యాన్ని నువ్వు పొందలేవు. ఒకవేళ నీ హృదయం దేవుని ఎదుట శాంతితో ఉంటే నువ్వు ఏం చేస్తున్నప్పటికీ, నువ్వు దేవుని సన్నిధిలో నివసించే వాడివి అవుతావు. నువ్వు ఏం చేస్తున్నప్పటికీ నీ హృదయం దేవుని ఎదుట శాంతితో ఉంటే మరియు దేవునికి దగ్గరగా జరిగితే, అది నువ్వు దేవుని ఎదుట శాంతితో ఉన్న వ్యక్తివి అని నిరూపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు “నా హృదయం దేవునికి దగ్గరగా లాగబడుతుంది, మరియు బాహ్య విషయాల పైన కేంద్రీకృతమై లేదు మరియు దేవుని ఎదుట శాంతిగా ఉండగలను” అని చెప్పగలిగితే అప్పుడు నువ్వు దేవుని ఎదుట శాంతిగా ఉన్న వ్యక్తివి అవుతావు. నీ హృదయాన్ని బాహ్య విషయాల వైపు లాగే లేదా నీ హృదయాన్ని దేవుని నుండి వేరుచేసే మనుషులతో సంబంధం పెట్టుకోవద్దు. నీ హృదయాన్ని దేవునికి దగ్గర నుండి కావడం నుండి భంగం కలిగించేది ఏదైనా సరే, దాన్ని పక్కకు పెట్టు, లేదా దాన్నుండి దూరంగా ఉండు. ఇది నీ జీవితానికి గొప్ప ప్రయోజనం చేకూరుస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యానికి ఇప్పుడే తగిన సమయం, దేవుడు వ్యక్తిగతంగా జనులను పరిపూర్ణులుగా చేసే సమయం. ఒకవేళ ఈ క్షణంలో, దేవుని ఎదుట నువ్వు శాంతిగా ఉండలేక పోతే, అప్పుడు నువ్వు దేవుని సింహాసనానికి ముందుగా తిరిగి వచ్చే వ్యక్తివి కాదు. ఒకవేళ నువ్వు దేవుడిని కాకుండా ఇతర విషయాలను వెంబడిస్తే, దేవుని చేత పరిపూర్ణుడివి అవడానికి నీకు దారే లేదు. దేవుని నుండి ఈ ఉద్బోధలను వినగలిగినప్పటికీ, ఎవరైతే ఈరోజు దేవుని ఎదుట శాంతిగా ఉండటంలో విఫలం అవుతారో వారు సత్యాన్ని ప్రేమించని వారు, మరియు దేవుడిని ప్రేమించని వారు. ఈ క్షణం నిన్ను నువ్వు అర్పించు కోకపోతే, దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? ఒకరిని అర్పించుకోవడం అనేది దేవుని ఎదుట ఒకరి హృదయాన్ని నిశ్శబ్ద పరచుకోవడం. అది యదార్థమైన అర్పణ అవుతుంది. ఎవరైతే వారి హృదయాన్ని యదార్ధంగా దేవునికి అర్పిస్తారో ఇప్పుడు వారు నిశ్చయముగా దేవునిచే పరిపూర్ణులుగా చేయబడతారు. అది ఏదైనా సరే, నీకు భంగం కలిగించలేదు; అది నిన్ను తగ్గించినా లేదా నీతో వ్యవహరించినా లేదా నువ్వు విసుగు చెందినా లేదా వైఫల్యాన్ని ఎదుర్కొన్నా నీ హృదయం దేవుని ఎదుట ఎల్లప్పుడూ శాంతితో ఉండాలి. జనులు నీతో ఎలా వ్యవహరించినా, నీ హృదయం దేవుని ఎదుట శాంతితో ఉండాలి. నువ్వు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా సరే—నువ్వు ప్రతికూలతలు, వేదనలు, పీడన లేదా వివిధ రకాల పరీక్షలు చేత చుట్టుముట్టబడినా—నీ హృదయం ఎల్లప్పుడూ దేవుని ఎదుట శాంతితో ఉండాలి; పరిపూర్ణులుగా చేయబడడానికి మార్గాలు ఇలాంటివి. దేవుని ఎదుట నువ్వు నిజంగా శాంతితో ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రస్తుత వాక్యాలు నీకు స్పష్టమవుతాయి. పరిశుద్ధాత్మ యొక్క ప్రకాశాన్ని మరియు జ్ఞానాన్ని అప్పుడు నువ్వు దారి తప్పకుండా మరింత కచ్చితత్వంతో ఆచరించవచ్చు, నీ సేవకు ఒక స్పష్టమైన దిశను ఇచ్చే దేవుని ఉద్దేశాలను గొప్ప స్పష్టతతో గ్రహించవచ్చు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మరియు మార్గ నిర్దేశకత్వాన్ని మరింత ఖచ్చితంగా గ్రహించవచ్చు, మరియు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వంలో జీవిస్తారని నిశ్చయముగా ఉండండి. దేవుని ఎదుట నిజంగా శాంతిగా ఉండడంవల్ల సాధించే ప్రభావాలు ఇలాంటివి. ఎప్పుడైతే జనులు దేవుని వాక్యాల పట్ల స్పష్టత కలిగి ఉండరో, ఆచరణకు మార్గం ఉండదు, దేవుని ఉద్దేశాలను గ్రహించడంలో విఫలమౌతారు, లేదా ఆచరణా సూత్రాలు లేకుండా ఉంటారు, ఇది ఎందుకంటే వారి హృదయాలు దేవుని ఎదుట శాంతిగా లేవు. దేవుని ఎదుట శాంతిగా ఉండడం యొక్క ఉద్దేశం ఏమిటంటే, గంభీరంగా మరియు ఆచరణాత్మకంగా ఉండటం. దేవుని వాక్యాలలో కచ్చితత్వాన్ని మరియు పారదర్శకతను వెతకడం, మరియు అంతిమంగా దేవుడిని తెలుసుకోవడం మరియు సత్యాన్ని అర్థం చేసుకోవడం.

నీ హృదయం తరచుగా దేవుని ఎదుట శాంతిగా లేకపోతే దేవునికి నిన్ను పరిపూర్ణం చేసే దారులు లేవు. సంకల్పం లేకుండా ఉండడం అనేది హృదయం లేకుండా ఉండడంతో సరి సమానం మరియు హృదయం లేని వ్యక్తి దేవుడి ఎదుట శాంతిగా ఉండలేడు; అలాంటి వ్యక్తికి దేవుడు ఎంత పని చేస్తాడో తెలియదు, లేదా ఆయన ఎంత మాట్లాడతాడో తెలియదు, ఎలా ఆచరించాలో కూడా తెలియదు. ఇలాంటి ఒక వ్యక్తి హృదయం లేని వాడు కాదా? ఒక హృదయం లేని వ్యక్తి దేవుని ఎదుట శాంతిగా ఉండగలడా? హృదయం లేని జనులను పరిపూర్ణం చేసే మార్గాలు ఏవీ దేవుని దగ్గర లేవు—వారు బరువులు మోసే మృగాల కన్నా భిన్నమైన వారు కాదు. దేవుడు చాలా స్పష్టంగా మరియు పారదర్శకంగా మాట్లాడాడు, అయినప్పటికీ నీ హృదయం చలించకుండా ఉంది, మరియు ఇంకా దేవుని ఎదుట శాంతిగా ఉండలేని వాడిగా ఉన్నావు. నువ్వు ఒక తెలివిలేని మృగానివి కాదా? దేవుని ఎదుట శాంతిగా ఉండడాన్ని అభ్యసించడంలో కొంతమంది జనులు దోవ తప్పుతారు. వండవల్సిన సమయంలో వారు వండరు, మరియు పనులు చేయవలసిన సమయంలో వారు వాటిని చేయరు, కానీ ప్రార్థిస్తూ మరియు ధ్యానిస్తూనే ఉంటారు. దేవుని ఎదుట శాంతిగా ఉండటం అంటే పనులు చేయకపోవడం లేదా వంట చేయకపోవడం కాదు, లేదా ఒకరి జీవితాన్ని జీవించక పోవడం కూడా కాదు; బదులుగా, అది అన్ని సాధారణ స్థితులలో దేవుని ఎదుట శాంతిగా తన హృదయాన్ని ఉంచుకోగలగడం మరియు ఒకరి హృదయంలో దేవునికి ఒక చోటు ఉండటం. నువ్వు ప్రార్థించేటప్పుడు, దేవుని ముందు సరిగ్గా మోకరిల్లి ప్రార్థించాలి; నువ్వు పనులు చేస్తున్నప్పుడు లేదా వంట సిద్ధం చేస్తున్నప్పుడు, దేవుని ఎదుట నీ హృదయాన్ని నిశ్శబ్ద పరచుకో, దేవుని వాక్యాలు ఆలోచించు, లేదా కీర్తనలు పాడు. నిన్ను నువ్వు ఎలాంటి సందర్భంలో కనుగొన్నప్పటికీ, నువ్వు ఆచరించడానికి నీదైన సొంత విధానం ఉండాలి, దేవునికి దగ్గరగా జరగడానికి నువ్వు చేయగలిగినంత చేయాలి, మరియు దేవుని ఎదుట నీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచడానికి నీ శక్తి అంతటితో ప్రయత్నించాలి. పరిస్థితులు అనుకూలించినపుడు, ఏకాగ్రతతో ప్రార్ధించు; పరిస్థితులు అనుకూలించనప్పుడు నీ చేతిలో పని చేస్తూనే నీ హృదయంలో దేవునికి దగ్గరగా జరుగు. నువ్వు దేవుని వాక్యాలను తిని, తాగగలిగినప్పుడు ఆయన వాక్యాలను తిని తాగు; నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయగలిగితే, అప్పుడు ప్రార్ధించు; నువ్వు ఎప్పుడు దేవుని గురించి ఆలోచించగలిగితే, అప్పుడు ఆయన గురించి ఆలోచించు. ఇంకోలా చెప్పాలంటే, నీ పర్యావరణానికి అనుగుణంగా ప్రవేశించడానికి నీకు నువ్వు శిక్షణను ఇచ్చు కొనేలా నువ్వు చేయగలిగినంత చెయ్యి. కొందరు జనులు ఏదీ విషయం కానప్పుడు దేవుని ఎదుట శాంతితో ఉండగలరు, కానీ ఏదైనా జరిగిన వెంటనే, వారి మనసులు చలిస్తాయి. అది దేవుని ఎదుట శాంతితో ఉండటం కాదు. దాన్ని అనుభూతి చెందడానికి సరైన మార్గం ఇది: ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి హృదయం దేవుడి నుంచి విడిపోకూడదు, లేదా బయట జనులు, సంఘటనలు, లేదా విషయాల చేత భంగపరచబడినట్లు భావించకూడదు, మరియు అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి దేవుని ఎదుట నిజంగా శాంతితో ఉన్నాడు. కొంతమంది, వారు సమావేశాలలో ప్రార్ధించినప్పుడు వారి హృదయాలు దేవుని ఎదుట శాంతితో ఉండగలవని, కానీ ఇతరుల సహవాసంలో వారు దేవుని ఎదుట శాంతిగా ఉండగల సామర్థ్యం లేనివారు, మరియు వారి ఆలోచనలు విచ్చలవిడిగా పరుగులు తీస్తాయి అని చెబుతారు. ఇది దేవుని ఎదుట శాంతితో ఉండటం కాదు. ఈరోజు, చాలామంది జనులు ఈ స్థితిలో ఉన్నారు, వారి హృదయాలు ఎప్పటికీ దేవుని ఎదుట శాంతితో ఉండగల సామర్థ్యం లేనివి. అందువలన, మీరు ఈ విషయంలో మిమ్మల్ని మీరు అభ్యసించడానికి తప్పకుండా మరింత కృషి చేయాలి, జీవితానుభవం యొక్క సరైన మార్గంలోకి ఒక్కొక్క మెట్టు ఎక్కండి, మరియు దేవునిచే పరిపూర్ణత పొందే మార్గంలో బయలుదేరండి.

మునుపటి:  స్వభావాలు మారిన వ్యక్తులే, దేవుని వాక్యపు వాస్తవికతలోకి ప్రవేశించిన వారు

తరువాత:  తన హృదయానుసారులను దేవుడు పరిపూర్ణులుగా చేయును

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger