చీకటి ప్రభావము నుండి తప్పించుకున్నప్పుడే, నీవు దేవుని ద్వారా పొందుకుంటావు
చీకటి ప్రభావము అంటే ఏమిటి? చీకటి ప్రభావము అనేది మోసము, అవినీతి, బంధించుట, నియంత్రించుట అనే సాతాను ప్రభావమును సూచిస్తుంది; సాతాను ప్రభావమనేది మరణ ఛాయలతో కూడిన ప్రభావము. సాతాను అధికారము క్రింద ఉన్న వారందరి గతి చివరికి నాశనము మాత్రమే. దేవుణ్ణి నమ్ముకొన్న తర్వాత చీకటి ప్రభావము నుండి ఎలా తప్పించుకోవచ్చు? నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, నీ హృదయం పూర్తిగా దేవుని వైపు మళ్లుతుంది, ఈ సమయంలో నీవు దేవుని ఆత్మచే ప్రేరేపించబడి నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పించడానికి సిద్ధంగా ఉంటావు ఇదే క్షణంలో నీవు చీకటి ప్రభావం నుండి విముక్తి పొందుకొనియుంటావు. ఒక వ్యక్తి తాను చేసే ప్రతిపనీ దేవుణ్ణి సంతోషపెట్టుటకై అయన చిత్తానుసారముగా చేసినట్లయితే అతను వాక్యానుసారముగా ఉంటూ దేవుని సంరక్షణలో మరియు భద్రతలో జీవించు వ్యక్తిగా ఉంటాడు. వాక్యానుసారముగా జీవించని వ్యక్తులు, దేవుడు ఉన్నాడని నమ్మలేని వారు, ఎల్లప్పుడూ దేవుని ఎదుట మూర్ఖముగా జీవిస్తూ అయన పట్ల వ్యర్థముగా వ్యహరించే వారందరూ చీకటి ప్రభావం క్రింద జీవిస్తున్నారు. దేవుని రక్షణను స్వీకరించని ప్రతివారు సాతాను అధికారము క్రింద జీవిస్తున్నారు; అనగా అట్టివారందరూ చీకటి ప్రభావము క్రింద జీవిస్తున్నారు. దేవుణ్ణి నమ్మని ప్రతివారు సాతాను అధికారము క్రింద జీవిస్తున్నారు. అలాగని దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతివారు దేవుని వెలుగులో జీవిస్తున్నట్లు కాదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతివారు వాక్యానుసారముగా జీవించకపోవచ్చు, ఆయనకు లోబడకపోవచ్చు. దేవుణ్ణి నమ్మే విషయంలో మనిషి హద్దులు కలిగియున్నాడు, అతను దేవుని గూర్చిన జ్ఞానము లేనివాడు కనుక, దేవుని చేత పూర్తిగా పరిశుద్ధపరచబడక, పరిపూర్ణముగా దేవుని సొత్తు కాలేక, అతను ఇప్పటికీ పాత నిబంధనలలో, మృత అక్షరాల మధ్య అనిశ్చితమైన చీకటి జీవితములో బ్రతుకుతున్నాడు. కాబట్టి, దేవుణ్ణి నమ్మని వారు చీకటి ప్రభావం క్రింద జీవిస్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, దేవుణ్ణి నమ్మిన వారిలో కూడా పరిశుద్ధాత్మ కార్యము లేనివారు ఇంకనూ దాని ప్రభావము క్రిందనే జీవిస్తున్నారు. దేవుని కృపను లేదా అయన దయను పొందనివారు, పరిశుదాత్మ కార్యమును చూడని వారందరూ చీకటి ప్రభావము క్రింద జీవిస్తున్నవారే; మరియు చాలాసార్లు అలాంటి వారే దేవుని కృపను అనుభవిస్తారే కానీ ఆయనను మాత్రము వారు ఎరుగరు. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొనిననూ, తన జీవిత కాలములో ఎక్కువ భాగము చీకటి ప్రభావము క్రింద గడుపుతుంటే, అతని అస్థిత్వమునకు అర్ధముండదు—అలాంటప్పుడు, దేవుడు ఉన్నాడని నమ్మని వారి గురించి ఇక ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది?
దేవుని కార్యమును అంగీకరించలేని వారందరూ, లేదా దేవుని కార్యమును అంగీకరించిననూ, ఆయన ఆజ్ఞలను నెరవేర్చలేని వారందరూ చీకటి ప్రభావంలో జీవిస్తున్నవారే. సత్యమును అనుసరించేవారు మరియు దేవుని ఆజ్ఞలను నెరవేర్చగలవారు మాత్రమే ఆయన నుండి ఆశీర్వాదములు పొందుతారు, వారు మాత్రమే చీకటి ప్రభావం నుండి తప్పించుకుంటారు. విడుదల పొందుకోలేని వారు, ఎవరైతే ఎప్పుడూ కొన్ని విషయాల నియంత్రణలో ఉంటారో మరియు వారి హృదయాలను దేవునికి ఇవ్వలేని వారు సాతాను బంధకము క్రింద ఉండే వ్యక్తులు మరణ ఛాయలలో జీవిస్తారు. తమ పనిలో నిజాయతీ లేనివారు, దేవుని ఆజ్ఞలకు అవిధేయులైన వారు మరియు దేవుని సంఘములో తమ బాద్యతను నిర్వర్తించని వారే చీకటి ప్రభావంలో జీవించేవారు. కావాలని సంఘ కార్యకలాపాలకు భంగం కలిగించేవారు, సోదర సోదరీమణుల సంబంధాలను కావాలని చెడగొట్టేవారు లేక గుంపులను ఏర్పరుచుకునే వ్యక్తులు సాతాను బానిసత్వంలో, చీకటి ప్రభావంలో జీవించేవారే. దేవునితో సరైన సంబంధం లేనివారు, ఎప్పుడూ అత్యాశలు కలిగి ఉండేవారు, ఎల్లప్పుడూ ప్రయోజనం పొందాలనుకునేవారు మరియు తమ స్వభావము మార్పుచెందాలని ఎప్పుడూ కోరుకోనటువంటి వారు చీకటి ప్రభావంలో జీవించే వ్యక్తులే. సత్యమును అనుసరించడములో జాగ్రత్తపడి సత్యమును వెతకనివారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకుంటారు కానీ శరీరాశలను మాత్రమే నెరవేర్చుకుంటారు, అటువంటివారు చీకటి ప్రభావంలో జీవిస్తూ మరణ ఛాయలలో ఉండేవారుగానే ఉంటారు. దేవుని పని చేసేటప్పుడు కుటిలతతో మోసాలకు పాల్పడేవారు, దేవునితో వ్యర్ధమైన రీతిలో వ్యవహరించేవారు, దేవుణ్ణి మోసం చేసేవారు మరియు ఎల్లప్పుడూ తమ కోసం ప్రణాళికలు వేసుకునే వారు, చీకటి ప్రభావంలో జీవించే వ్యక్తులు. నిజాయతీగల హృదయంతో దేవుణ్ణి ప్రేమించలేని వారు, సత్యమును అనుసరించని వారు, తమ స్వభావాలలో మార్పుకై శ్రద్ధచూపని వారందరు చీకటి ప్రభావంలో జీవించేవారే.
నీవు దేవుని మెప్పు పొందాలనుకొంటే ముందుగా సాతాను చీకటి ప్రభావము నుండి తప్పించుకోవాలి, నీ హృదయాన్ని దేవుని ముందు తెరచియుంచి, పూర్తిగా అయన వైపు తిరగాలి. ఇప్పుడు నీ క్రియలను దేవుడు ఆమోదిస్తున్నట్లుగా నీవు చూస్తున్నావా? నీ హృదయం దేవుని వైపు తిప్పుకున్నావా? దేవుడు నీ నుండి ఆశిస్తున్న క్రియలు నీవు చేస్తున్నావేనా? అవి సత్యనుసారముగానే ఉన్నాయా? ఎల్లప్పుడు నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని వాక్యమునును భుజించుటపై, సేవించుటపై దృష్టి పెట్టి, నీ హృదయాన్ని ఆయన ముందు ఉంచి, ఆయనను చిత్తశుద్ధితో ప్రేమించి దేవుని కోసం అంకితభావంతో నిన్ను నీవు సమర్పించుకొనుము. ఇలా చేసే వ్యక్తులు తప్పకుండా దేవుని మెప్పు పొందుతారు. దేవుణ్ణి నమ్మి కూడా, సత్యమును వెంబడించని వారు సాతాను ప్రభావం నుండి తప్పించుకొనే మార్గం లేదు. జీవితములో నిజాయతీ లేని వారు, మనుషుల ముందు ఒక రకముగా, వెనుక ఒక రకముగా ప్రవర్తించేవారు, కృత్రిమమైన వినయం, సహనం మరియు ప్రేమను కనబరుస్తూ, అంతరంగములో మోసపూరితమైనవారు మరియు దేవునిపట్ల నిజాయతీ లేనివారు, అటువంటి వారు చీకటి ప్రభావము కింద జీవించేవారికి ప్రతినిధులుగా ఉన్నారు, వారు ఒక రకముగా సర్పమునకు సాదృశ్యముగా ఉన్నారు. తమ స్వలాభం కోసం మాత్రమే దేవుణ్ణి నమ్మేవారు, స్వనీతిపరులు మరియు గర్విష్టులు, మనుషులకు కనబడాలని పని చేసేవారు మరియు తమ పరపతిని కాపాడుకునే వారు, సత్యమును వ్యతిరేకించి సాతానును ప్రేమించేవారు వారు దేవుణ్ణి ఎదిరిస్తారు వారు పూర్తిగా సాతానుకు చెందినవారు. దేవుని భారమును పట్టించుకోని వారు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించని వారు, ఎల్లప్పుడూ తమ స్వప్రయోజనాలు మరియు కుటుంబ ప్రయోజనాల గురించి ఆలోచించేవారు, దేవుని కోసం తమను సమర్పించుకొనుటకు దేనినీ విడిచిపెట్టలేని వారు మరియు ఎన్నటికీ వాక్యానుసారము జీవించని వారందరు అయన వాక్యము వెలుపల ఉన్న వ్యక్తులు. అలాంటి వారు దేవుని మెప్పు పొందలేరు.
దేవుడు నరుని సృష్టించినప్పుడు, నరుడు తన ఐశ్వర్యాన్ని ఆస్వాదించి ఆయనను యధార్ధతతో ప్రేమించాలని ఉద్దేశించాడు. ఈ విధంగా, నరుడు అయన వెలుగులో జీవిస్తాడు. ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించలేరో, దేవుని భారము పట్ల శ్రద్ధ చూపలేరో, తమ హృదయాలను పూర్తిగా దేవునికి సమర్పించలేరో, దేవుని హృదయము కలిగి లేరో మరియు దేవుని పనిని తమ భారంగా భావించలేరో, అట్టి వారి మీద దేవుని వెలుగు ప్రసరింపదు, కాబట్టి వారంతా చీకటి ప్రభావములో జీవిస్తున్నారు. వీరు దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధంగా నడుస్తారు మరియు వారు చేసే దానిలో ఎటువంటి సత్యం ఉండదు, వారు సాతానుతో పాటు బురదలో కొట్టుకుపోతున్నారు, వారు చీకటి ప్రభావము క్రింద జీవించే వ్యక్తులు. నీవు గనుక తరచుగా దేవుని వాక్యమును భుజించి సేవించగలిగితే, మరియు దేవుని చిత్తానికి శ్రద్ధ వహించి, దేవుని వాక్యమును ఆచరిస్తే, నీవు దేవునికి చెందినవాడవు మరియు నీవు దేవుని వాక్యానుసారముగా జీవించే వ్యక్తివి. నీవు సాతాను ఆధిపత్యం నుండి తప్పించుకొని దేవుని వెలుగులో జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు దేవుని వాక్యానుసారముగా జీవించినట్లయితే, పరిశుద్ధాత్మ నీలో కార్యము చేసే అవకాశం ఉంటుంది, నీవు సాతాను ప్రభావంలో జీవిస్తే, పరిశుద్ధాత్మ నీలో కార్యము చేసే అవకాశం ఇవ్వలేవు. పరిశుద్ధాత్మ మనుష్యులపై చేసే కార్యము, ఆయన వారిపై ప్రకాశింపజేసే వెలుగు మరియు వారికి ఆయన ఇచ్చే నిబ్బరము ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది; వారు జాగ్రత్తగా ఉండకపోతే మరియు శ్రద్ధ వహించకపోతే, పరిశుద్ధాత్మ కార్యము వారిని దాటిపోతుంది. మనుష్యులు దేవుని వాక్యానుసారముగా జీవించినట్లయితే, అప్పుడు పరిశుద్ధాత్మ వారితో ఉండి, వారిపై అయన కార్యము చేస్తాడు. వారు దేవుని వాక్యానుసారముగా జీవించకపోతే, సాతాను బంధకములో జీవిస్తారు. మనుష్యులు అవినీతి స్వభావాలతో జీవిస్తే, వారిలో పరిశుద్ధాత్మ ఉండడు మరియు కార్యము చేయడు. నీవు దేవుని వాక్యమునకు లోబడి అయన చిత్తానుసారముగా జీవిస్తే, నీవు దేవుని వ్యక్తివి, అప్పుడు దేవుడు నీపై కార్యము చేస్తాడు, నీవు దేవుని చిత్తానుసారముగా జీవించకుండా, సాతాను అధిపత్యములో జీవిస్తే నీవు ఖచ్చితముగా సాతాను అవినీతి క్రింద జీవిస్తున్నట్లే. దేవుని వాక్యానుసారముగా జీవించడం ద్వారా మరియు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడం ద్వారా మాత్రమే నీవు దేవుని చిత్తము జరిగించగలవు. దేవుడు ఏది చెబితే అది నీవు చేయగలగాలి. దేవుని వాక్యమే నీ అస్థిత్వమునకు మరియు నీ జీవితపు నిజ స్వరూపమునకు పునాది కావాలి. అప్పుడు నీవు దేవునికి చెందినవాడవుతావు. నీవు నిజముగా దేవుని చిత్తమును ఆచరిస్తే, అయన నీపై కార్యము చేస్తాడు మరియు నీవు ఆయన ఆశీర్వాదముల క్రింద, ఆయన ముఖ కాంతిలో జీవిస్తావు; నీవు పరిశుద్ధాత్మ చేసే కార్యమును గ్రహిస్తావు మరియు దేవుని సన్నిధి ఆనందాన్ని అనుభవిస్తావు.
చీకటి ప్రభావము నుండి తప్పించుకోవాలంటే ముందుగా దేవుని పట్ల విధేయత మరియు సత్యమును అనుసరించే హృదయం కలిగియుండాలి. అప్పుడే సరైన స్థితి ఉంటుంది. చీకటి ప్రభావము నుండి తప్పించుకునేందుకు సరైన స్థితిలో జీవించడం కూడా అవసరం. సరైన స్థితి లేకపోవుట అంటే దేవునికి విధేయునిగా లేకపోవుట మరియు సత్యాన్ని అన్వేషించే హృదయం లేకపోవుట, అలాంటప్పుడు చీకటి ప్రభావము నుండి తప్పించుకొనే ప్రసక్తే ఉండదు. నా మాటలు మనుషులు చీకటి ప్రభావమునుండి తప్పించుకొనుటకు ఆధారం. వారు నా మాటల ప్రకారం ఆచరించలేకపోతే, చీకటి ప్రభావపు బంధకాల నుండి తప్పించుకోలేరు. సరైన స్థితిలో జీవించడం అంటే దేవుని మాటల నడిపింపులో జీవించడం, దేవునికి విధేయునిగా జీవించడం, సత్యమును వెతికే స్థితిలో జీవించడం, దేవుని కోసం హృదయపూర్వకంగా తనను తాను సమర్పించుకునే నిజస్వరూపములో జీవించడం, మరియు దేవుణ్ణి యదార్ధంగా ప్రేమించే స్థితిలో జీవించడం. ఈ స్థితిలో మరియు ఈ వాస్తవికతలో జీవించే వారు సత్యం లోతుల్లోకి ప్రవేశించినప్పుడు క్రమంగా రూపాంతరం చెందుతారు. ఆలా వారు సత్యములోనికి మరింత లోతుగా వెళ్ళినప్పుడు రూపాంతరం చెందుతారు; మరియు చివరికి, వారే ఖచ్చితంగా దేవునిచే సంపాదించబడిన వ్యక్తులుగా మరియు దేవుణ్ణి యథార్థంగా ప్రేమించే వ్యక్తులుగా మారతారు. చీకటి ప్రభావం నుండి తప్పించుకున్న వారు క్రమంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుని, క్రమంగా దానిని అర్థం చేసుకుంటారు, చివరికి దేవునికి నమ్మకస్థులు అవుతారు. వారు దేవుని గురించి ఎటువంటి అపోహలు కలిగి ఉండరు మరియు ఆయనకు అవిధేయలుగా ఉండరు, కాగా అంతకు ముందు వారు కలిగి ఉన్న ఆ భావనలను మరియు తిరుగుబాటు తనాన్ని మరింత అసహ్యించుకుంటారు మరియు వారి హృదయాల్లో దేవుని పట్ల నిజమైన ప్రేమ పుడుతుంది. చీకటి ప్రభావం నుండి తప్పించుకోలేని వారందరూ పూర్తిగా శరీరాశలతో, తిరుగుబాటుతనంతో నిండి ఉంటారు; వారి హృదయాలు మానవ ఆలోచనలతో, తత్వజ్ఞానముతో, అలాగే వారి స్వంత ఉద్దేశాలు మరియు ప్రణాళికలతో నిండి ఉంటాయి. మనిషి తన హృదయాంతరంగములోనుండి తనను ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు; మనిషి దేవుని వాక్యంతో మరియు తన హృదయం నిండా దేవుని పట్ల ప్రేమతో నిండియుండాలనే ఆయన కోరుకుంటున్నాడు. దేవుని వాక్యానుసారము జీవించడం, వారు దేనిని వేదకాలన్న దానికై వాక్యమును శోధించడం, అయన వాక్యమును బట్టి దేవుణ్ణి ప్రేమించడం, అయన మాటల కొరకు పరుగెత్తి, అయన మాటల కొరకు జీవించడం. మనిషి సాధించడానికి ప్రయత్నించాల్సిన లక్ష్యాలివి. ప్రతిదీ దేవుని వాక్యముపై నిర్మించబడాలి; అప్పుడే మనిషి దేవుని చిత్తము చేయగలడు. మనిషి దేవుని వాక్యముచేత బలపడకపొతే, అతను సాతాను ఆవహించిన పురుగు తప్ప మరొకటి కాదు. నీలో దేవుని వాక్యము ఎంత వరకు వేరు పారిందో—తూచిచూడు. నీవు ఏ విషయాలలో ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్నావు? నీవు ఏ విషయాలలో వాటికి అనుగుణంగా జీవించుట లేదు? దేవుని వాక్యము చేత నీవు పూర్తిగా పట్టబడకపోతే మరి నీ హృదయాన్ని నిజానికి ఏమి ఆక్రమించింది? నీ దైనందిన జీవితంలో, నీవు సాతాను చేత నియంత్రించబడుతున్నావా లేక నీవు దేవుని వాక్యము చేత నింపబడియున్నవా? నీ ప్రార్థనలకు పునాది ఆయన వాక్యమేనా? దేవుని వాక్యపు వెలుగు ద్వారా నీ చెడ్డ స్థితిలో నుండి బైటపడ్డవా? నీ జీవితానికి దేవుని వాక్యమే పునాది కావాలి—ఇదే అందరు ప్రేవేశించవలసిని స్థితి. ఆయన మాటలు నీ జీవితంలో లేకుంటే, నీవు చీకటి ప్రభావంలో జీవిస్తున్నావు, నీవు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు, నీవు ఆయనను ఎదిరిస్తున్నావు మరియు నీవు అయన పేరును అవమానపరుస్తున్నావు. అలాంటి వారి విశ్వాసము శుద్ధ వ్యర్ధము మరియు అనర్ధము. నీ జీవితములో ఎంత వరకు దేవుని వాక్యానుసారము జీవించావు? ఎంత వరకు దాని అనుగుణముగా జీవించలేదు? ఎంత వరకు దేవుని చిత్తం నీలో నెరవేరింది? ఎంత వరకు నెరవేరకుండా పోయింది? నీవు అటువంటి విషయాలను నిశితముగా పరిశీలించావా?
చీకటి ప్రభావం నుండి తప్పించుకోవడానికి పరిశుద్ధాత్మ కార్యము మరియు మనిషి అంకితమైన సహకారం రెండూ అవసరం. మనిషి సరైన దారిలో లేడని నేను ఎందుకు అంటాను? సరైన మార్గంలో ఉన్న వ్యక్తులు మొదట తమ హృదయాలను దేవునికి సమర్పించగలరు. ఇది సాధించడానికి చాలా సమయం పడుతుంది, ఎందుకంటే మానవజాతి ఎప్పటినుండో చీకటి ప్రభావంలో జీవించింది మరియు వేల సంవత్సరాలుగా సాతాను బంధకములో ఉంది. కాబట్టి, ఈ స్థితిని కేవలం ఒకటో రెండు రోజుల్లో సాధించలేము. మనుషులు తమ సొంత పరిస్థితిపై అవగాహన పొందుకోవాలనే నేను ఈ రోజు ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తాను. మనిషి కనుక చీకటి ప్రభావం ఏమిటో మరియు వెలుగులో జీవించడం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకోగలిగితే, అది సాధించడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే నీవు సాతాను నుండి తప్పించుకోవడానికి ముందు దాని ప్రభావం ఏమిటో తప్పక తెలుసుకోవాలి; ఆ తర్వాత మాత్రమే దాని నుండి విడుదల పొందటానికి వీలు ఉంటుంది. ఆ తర్వాత ఏమి చేయాలో, అది మనుషుల స్వంత నిర్ణయం. ప్రతి దానిలోకి సానుకూల కోణంలో నుండి ప్రవేశించాలే కానీ ఎప్పుడూ నిర్లిప్తంగా వేచి ఉండకూడదు. ఈ విధంగా మాత్రమే నీవు దేవుని సొత్తుగా మారగలవు.