విశ్వాసం అంటే, ఒక వ్యక్తి తప్పక సత్యము మీద దృష్టి పెట్టాలి—మతపరమైన ఆచారాల్లో పాల్గొనడం విశ్వాసం కాదు
నీవు ఎన్ని మతపరమైన ఆచారాలు పాటించావు? నీవు ఎన్నిసార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, నీ సొంత మార్గంలో నడిచావు? నీవు నిజంగా ఆయన మోయుచున్న భారాల పట్ల శ్రద్ధ వహిస్తూ, ఆయన చిత్తాన్ని తృప్తిపరచాలని కోరుకుంటున్నందున, దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు ఆచరణలో పెట్టావు? నీవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని, దాన్ని తదనుగుణంగా ఆచరణలో పెట్టాలి. నీ అన్ని కార్యములు మరియు పనులలో నీవు నీతిమంతుడివై ఉండాలి, అంటే, దీని అర్థం నియమాలకు కట్టుబడి ఉండటం లేదా ప్రదర్శన కోసం అయిష్టంగా ఏదైనా చేయడం అని కాదు; దానికి బదులుగా, సత్యమును ఆచరించడం మరియు దేవుని వాక్యము ప్రకారం జీవించడం అని అర్థం. ఇలాంటి ఆచరణ మాత్రమే దేవుడికి సంతృప్తినిస్తుంది. దేవుడిని సంతోషపెట్టే ఏ కార్యమైననూ అదొక నియమం కాదు, అది సత్యమును పాటించడం మాత్రమే అవుతుంది. కొందరు తమవైపు దృష్టిని ఆకర్షించుకునే కోరికతో ఉంటారు. వారి సోదర సోదరీమణుల సమక్షంలో, వారు దేవునికి రుణపడి ఉన్నామని చెప్పవచ్చు, కానీ వెనుక మాత్రం వారు సత్యమును పాటించరు, అంతేకాకుండా చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారు మతపరమైన పరిసయ్యులు కారా? దేవుణ్ణి నిజంగా ప్రేమించే మరియు సత్యవంతుడైన వ్యక్తి దేవుని పట్ల విశ్వాసంతో ఉంటాడు, కానీ ఆవిధంగా ఉన్నట్లు బహిరంగంగా ప్రదర్శించడు. అటువంటి వ్యక్తి ఏవైనా పరిస్థితులు ఎదురైనప్పుడు సత్యమునే ఆచరించడానికి సిద్ధంగా ఉంటాడు మరియు తన మనస్సాక్షికి విరుద్ధంగా మాట్లాడడు లేదా ప్రవర్తించడు. ఈ విధమైన వ్యక్తి, సమస్యలు తలెత్తినప్పుడు వివేకము ప్రదర్శిస్తాడు మరియు పరిస్థితులతో సంబంధం లేకుండా అతను లేదా ఆమె వారి కార్యములలో నీతిమంతులై ఉంటారు. ఈ రకమైన వ్యక్తి మాత్రమే నిజమైన సేవను అందించగలడు. దేవునికి రుణపడి ఉన్నట్లు తరచుగా పైపైన మాట్లాడేవారు కొందరు ఉంటారు; వారు ఆందోళనతో కనుబొమ్మలను ముడివేసి, ఇతరులను నమ్మించడానికి, దీనంగా నటిస్తూ రోజులు వెలిబుచ్చుతుంటారు. ఎంత నీచం కదా! “నీవు దేవునికి ఎలా రుణపడి ఉన్నావో నాకు చెప్పగలవా?” అని నీవు గనుక వారిని అడిగితే, ఇక వారు నోరు తెరవరు. నీకు దేవుని పట్ల విశ్వాసం ఉంటే, దాని గురించి బయటికి మాట్లాడకు; దానికి బదులు, వాస్తవ ఆచరణతో దేవునిపట్ల నీ ప్రేమను ప్రదర్శించు మరియు శుద్ధమైన హృదయంతో ఆయనను ప్రార్థించు. దేవుడిని కేవలం మాటలతో, ఉపేక్షతో కొలిచే వారందరూ వంచకులే! పరిశుద్ధాత్మచే కదిలించబడకపోయినప్పటికీ, కొందరు ప్రార్థించిన ప్రతిసారీ దేవునికి రుణపడ్డామని అంటారు మరియు ప్రార్థించిన ప్రతిసారీ రోదించడం మొదలుపెడతారు. ఇలాంటి వ్యక్తులు మతపరమైన ఆచారాలు మరియు తలంపులను కలిగి ఉంటారు; వారు అలాంటి ఆచారాలు మరియు తలంపులతోనే జీవిస్తారు, ఆ కార్యములు దేవుణ్ణి సంతోషపరుస్తాయని మరియు పైపైన దైవభక్తి లేదా వేదనాభరితమైన కన్నీళ్లను ఆయన ఇష్టపడతాడని ఎల్లప్పుడూ నమ్ముతారు. ఇలాంటి నిరర్థక వ్యక్తుల వల్ల మంచి ఎలా జరగగలదు? విధేయత ప్రదర్శించడానికి, ఇతరుల సమక్షంలో మాట్లాడేటప్పుడు కొందరు దయగా వ్యవహరిస్తారు. కొంతమంది, ఇతర వ్యక్తుల సమక్షంలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అతివినయం చూపుతారు, ఔన్సు బలం కూడా లేనట్టుగా గొర్రెపిల్లల వలె నటిస్తారు. దేవుని రాజ్యంలోని జనులకు ఇలాంటిది తగినదేనా? దేవుని రాజ్యంలోని ప్రజలు ఉల్లాసంగా మరియు స్వేచ్ఛగా, నిష్కపటంగా మరియు న్యాయబద్ధంగా, నిజాయితీగా మరియు ప్రేమగలవారుగా మరియు విమోచన స్థితిలో జీవిస్తూ ఉండాలి. వారు కపటం లేకుండా మరియు మర్యాద కలిగి ఉండాలి మరియు వారు ఎక్కడికి వెళ్లినా సాక్షిగా నిలబడగలగాలి; అలాంటి వ్యక్తులే దేవుడు మరియు మనుష్యులు ఇద్దరి చేత ప్రేమించబడతారు. విశ్వాసంలో అనుభవం లేని వారికి చాలా ఎక్కువ బహిరంగ ఆచరణలు ఉంటాయి; అందుకే వారు తప్పకుండా మొదట మనోచింతన సమయమును అనుభవించాలి మరియు వారి హృదయం బద్దలవ్వాలి. దేవుని పట్ల గాఢమైన విశ్వాసంతో ఉన్న వ్యక్తులు ఇతరుల కంటే వేరుగా స్పష్టంగా బయటికి కనిపించరు, కానీ వారి కార్యములు మరియు పనులు మెచ్చుకోతగినవిగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు మాత్రమే దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నట్లు భావించబడతారు. నీవు వివిధ వ్యక్తులకు ముక్తి కలిగించాలనే ప్రయత్నంతో, ప్రతిరోజు వారికి సువార్తను బోధించినప్పటికీ, ఆఖరికి నీవు నియమాలు మరియు సంప్రదాయాల ప్రకారమే జీవిస్తున్నట్లయితే, నీవు దేవుడిని మహిమ పరచలేవు. అలాంటి వ్యక్తులు మతపరమైన మనుష్యులు మాత్రమే కాకుండా వంచకులు కూడా. ఆ మతపరమైన జనులు గుమిగూడినప్పుడల్లా, “సోదరీ, ఈ రోజుల్లో నీవు ఎలా ఉన్నావు?” అని వారు అడగవచ్చు. అందుకు ఆమె “నేను దేవునికి రుణపడి ఉన్నాను మరియు ఆయన చిత్తాన్ని తృప్తి పరచలేకపోతున్నాను” అని జవాబివ్వవచ్చు. అలాగే, మరొకరు “నేను కూడా దేవునికి రుణపడి ఉన్నాను మరియు ఆయనను తృప్తి పరచలేకపోతున్నాను” అని చెప్పవచ్చు. కేవలం ఈ కొద్ది వాక్యాలు మరియు పదాలే వారిలో లోతుగా ఉన్న నీచత్వాన్ని బయలుపరుస్తాయి; అలాంటి పదాలు చాలా రోత పుట్టించేవి మరియు అతి అసహ్యకరమైనవి. అటువంటి వ్యక్తుల స్వభావం దేవునికి విరోధమైనది. యథార్ధతపై దృష్టి నిలుపువారు తమ మనసులో ఏమి ఉంటే దానిని బయటికి చెప్తారు మరియు సహవాసంలో తమ హృదయములను తెరిచి ఉంచుతారు. వారు అలాంటి సభ్యతలను లేదా డొల్ల పరిహాసాలను ప్రదర్శించకుండా ఉంటారు, కనీసం ఒక్క మోసపు వ్యవహారం కూడా చేయరు. వారు ఎల్లప్పుడూ సూటిగా ఉంటారు మరియు మతనిరపేక్ష నియమాలను పాటిస్తారు. అసలు ఏ మాత్రం అర్థం లేకపోయినప్పటికీ, కొంతమంది మనుష్యులు ఏమాత్రం మతిలేనంతగా, బహిరంగ ప్రదర్శనలపట్ల వాంఛతో ఉంటారు. ఎవరైనా పాడినప్పుడు, తమ కుండలలోని అన్నం ఇప్పటికే మాడిపోయిందని కూడా తెలుసుకోకుండా నృత్యం చేయడం ప్రారంభిస్తారు. అలాంటి వ్యక్తులు దేవుని పట్ల భక్తి గలవారు లేదా నీతిమంతులు కారు మరియు వారు చాలా ఘోరమైన అల్పులు. ఇవన్నీ యథార్ధత లేకపోవడానికి నిదర్శనాలే. కొందరు వ్యక్తులు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి సహవాసం చేసినప్పుడు, వారు దేవునికి ఏమీ రుణపడి లేమని చెప్పినప్పటికీ, వారు ఆయన పట్ల లోతుగా నిజమైన ప్రేమతో ఉంటారు. దేవునికి రుణపడి ఉన్నామనే నీ భావనతో ఇతరులకు ఏం సంబంధం లేదు; నీవు దేవునికి మాత్రమే రుణపడి ఉంటావు, మానవజాతికి కాదు. దీని గురించి ఇతరులతో నిరంతరం మాట్లాడటం వల్ల నీకు ఏం ఉపయోగం? నీవు యథార్ధతలోకి ప్రవేశించడానికి తప్పక ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప ఏదైనా బహిరంగ ఉత్సాహం లేదా ప్రదర్శనకు కాదు. మనుష్యులు పైపైన చేసే మంచి పనులు దేనిని సూచిస్తాయి? అవి దేహమును సూచిస్తాయి మరియు అత్యుత్తమమైన బహిరంగ ఆచరణలు కూడా జీవమును సూచించవు; అవి నీ సొంత వ్యక్తిగత స్వభావాన్ని మాత్రమే చూపగలవు. మానవాళి బహిరంగ ఆచరణలు దేవుని కోరికను తీర్చలేవు. నీవు ఎల్లప్పుడూ దేవునికి నీవు రుణపడటం గురించి మాట్లాడతావు, అయినప్పటికీ నీవు ఇతరులకు జీవమును అందించలేవు లేదా దేవుడిని ప్రేమించేలా వారిని ఉత్తేజపరచలేవు. అటువంటి నీ కార్యములు దేవుడిని తృప్తిపరుస్తాయని నమ్ముతావా? నీ కార్యములు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయని మరియు అవి ఆత్మకు సంబంధించినవని నీవు అనుకుంటావు, కానీ నిజానికి అవన్నీ నిరర్థకమైనవి! నీకు సంతోషాన్ని ఇచ్చేవి మరియు చేయడానికి నీవు ఇష్టపడే కార్యములే ఖచ్చితంగా దేవుణ్ణి కూడా సంతృప్తి పరుస్తాయని నీవు నమ్ముతావు. నీ ఇష్టాలు దేవునికి ప్రాతినిధ్యం వహించగలవా? ఒక వ్యక్తి ప్రవర్తన దేవునికి ప్రాతినిధ్యం వహించగలదా? నీకు సంతోషాన్ని ఇచ్చే కార్యములు ఖచ్చితంగా దేవుడు ద్వేషించేవే మరియు నీ అలవాట్లు దేవుడు అసహ్యించుకునేవి మరియు తిరస్కరించేవే. ఒకవేళ నీవు రుణపడి ఉన్నావని అనునుకుంటే, అప్పుడు దేవుని యెదుటకు వెళ్లి ప్రార్థించు; దాని గురించి ఇతరులతో మాట్లాడవలసిన అవసరం లేదు. నీవు దేవుని యెదుట ప్రార్థించకుండా, ఇతరుల ముందు నీ వైపు దృష్టిని ఆకర్షించడం కోసం మాత్రమే నిరంతరం ప్రార్థించినట్లయితే, అది దేవుని చిత్తాన్ని తృప్తిపరచగలదా? నీ కార్యములు ఎల్లప్పుడూ ప్రదర్శనగా మాత్రమే ఉంటే, దాని అర్థం, నీవు అత్యంత వ్యర్థం అని. కేవలం పైపైన మంచి పనులు చేస్తూ, యథార్ధహీనులైనవారు ఎలాంటి మనుష్యులు? అలాంటి మనుష్యులు కేవలం వంచక పరిసయ్యులు మరియు మతపరమైనవారు మాత్రమే! మీరు మీ బహిరంగ ఆచరణలను విసర్జించకపోతే, మరియు పరివర్తన పొందలేకపోతే, వంచన తత్వాలు మీలో మరింత పెరిగిపోతాయి. వంచన తత్వాలు మీలో ఎంత ఎక్కువగా ఉంటే, దేవుని పట్ల అంత ఎక్కువ నిరోధం ఉంటుంది. అంతిమంగా, అటువంటి జనులు ఖచ్చితంగా పరిత్యజించబడతారు!