దేవుని పట్ల నిజమైన ప్రేమ సహజ సిద్ధంగా ఉంటుంది
దేవుని మాటలచే ప్రజలందరూ శుద్ధీకరించబడుతూ ఉన్నారు. దేవుడు మానవ రూపంలో అవతరించక పోయినట్లయితే, మానవాళికి ఖచ్చితంగా శ్రమలు అనే ఈ ఆశీర్వాదం ఉండేది కాదు. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఎవరైతే దేవుని వాక్యంలోని శ్రమలను అంగీకరించగలిగారో వారందరూ ఆశీర్వదింపబడ్డారు. ప్రజల సహజమైన సామర్ధ్యాలు, వారి ప్రవర్తన మరియు దేవుని పట్ల వారి వైఖరిని పరిగణనలోనికి తీసుకుంటే వారు ఈ రకమైన శుద్ధీకరణను పొందుకోవటానికి యోగ్యులు కారు. దేవుని చేత వారు పైకి లేవనెత్తబడినందున ఈ ఆశీర్వాదమును అనుభవించగలిగారు. దేవుని ముఖము చూడడానికి మరియు ఆయన మాటలు వినడానికి తాము యోగ్యులం కాదని ప్రజలు అనుకునేవారు. ఈరోజు, పూర్తిగా దేవుని గొప్పతనం మరియు ఆయన దయ వలన మాత్రమే మనుష్యులు ఆయన మాటల వలన కలిగే శుద్ధీకరణను పొందుకుంటున్నారు. ఇది చివరి రోజుల్లో జన్మించిన ప్రతి వ్యక్తికి లభించే ఆశీర్వాదము—మీరు వ్యక్తిగతంగా ఈ అనుభవాన్ని పొందుకున్నారా? ఏ అంశాల్లో ప్రజలు బాధలు అనుభవించాలో మరియు ఎదురు దెబ్బలు తినాలో దేవునిచే ముందుగానే నిర్ణయించబడుతుంది—ప్రజల స్వంత అవసరాలపై ఇది ఆధారపడి ఉండదు. ఇది స్పష్టమైనటువంటి సత్యం. ప్రతి విశ్వాసి దేవుని వాక్యంలోని శ్రమలను అంగీకరించటానికి మరియు శ్రమపడటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది మీకు స్పష్టంగా అర్థమవుతుందా? కాబట్టి, నువ్వు అనుభవించిన శ్రమలకు ప్రతిగా ఈరోజు నువ్వు ఆశీర్వాదములు పొందుకుంటున్నావు. నువ్వు దేవుని కొరకు శ్రమలు పొందనట్లయితే, ఆయన ప్రశంశలను నువ్వు పొందుకోలేవు. నువ్వు గతంలో ఫిర్యాదు చేసి ఉండొచ్చు కానీ, ఎంతగా నువ్వు ఫిర్యాదులు చేసినప్పటికీ, దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఈరోజు వచ్చింది, నిన్నటి దినపు వ్యవహారాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
కొంతమంది ప్రజలు మేము దేవుని ప్రేమించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రేమించ లేకపోతున్నామని అంటుంటారు. దేవుడు వెళ్లిపోబోతున్నాడని వారు విన్నప్పుడు, వారు అకస్మాత్తుగా ఆయన పట్ల ప్రేమను కురిపిస్తారు. కొంత మంది ప్రజలు సత్యమును ఆచరణలో పెట్టరు మరియు దేవుడు కోపంతో వెళ్లిపోతున్నాడని వారు విన్నప్పుడు ఆయన ముందుకు వచ్చి ప్రార్థిస్తారు; “ఓ దేవా! దయచేసి వెళ్ళకు. నాకు ఒక్క అవకాశం ఇవ్వు! దేవా! నేను గతంలో నిన్ను సంతృప్తిపరచ లేదు; నేను నీకు ఋణగ్రస్తుడనై ఉన్నాను, నిన్ను ప్రతిఘటించాను, ఈరోజు నా శరీర హృదయాలను సంపూర్ణంగా సమర్పించడానికి ఆశ కలిగి ఉన్నాను, దానిని బట్టి నేను అంతిమంగా నిన్ను సంతృప్తిపరచగలను మరియు ప్రేమించగలను. నేను మరల ఈ అవకాశం పొందుకోలేను.” నువ్వు ఇలాంటి ప్రార్థన చేశావా? వారి మనసు దేవుని మాటలచే మేల్కొలపబడినప్పుడు కొంతమంది ఈ విధంగా ప్రార్థిస్తారు. మనుషులందరూ మొద్దుబారిన హృదయంతో నిస్తేజంగా ఉంటారు. వారు శిక్ష ద్వారా శుద్ధీకరణ పొందుతారు, అయినప్పటికీ దీని ద్వారా దేవుడు ఏం సాధించడానికి ప్రయత్నిస్తున్నాడో వారికి అర్థం కాదు. దేవుడు ఈ విధంగా పని చేయనట్లయితే, ప్రజలు ఇంకనూ గందరగోళానికి గురవుతారు; ఏ వ్యక్తి కూడా ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక భావనలను ప్రేరేపించలేడు. దేవుని మాటలు మాత్రమే ప్రజలను తీర్పు తీర్చి మనుష్యుల నిజ స్వరూపాన్ని వెల్లడి చేయగలవు, మరియు అవి ఫలములను ఇస్తాయి. కాబట్టి, సమస్త అన్ని విషయాలు దేవుని మాటల వలన ఏర్పడి నెరవేర్చబడతాయి, ఆయన మాటల వలననే మానవాళికి దేవుని పట్ల ప్రేమ పెరిగింది. దేవుని ప్రేమ కేవలం మానవుని మనస్సాక్షి మీద ఆధారపడి కోరుకున్న ఫలితాన్ని సాధించలేదు. ప్రజలు గతంలో దేవుని పట్ల వారి ప్రేమకు వారి మనస్సాక్షి మీద ఆధార పడలేదా? ఎవరైనా ఒక వ్యక్తి తన స్వంత ప్రేరణతో దేవుని ప్రేమించాడా? దేవుని మాటల ప్రోత్సాహం ద్వారా మాత్రమే ప్రజలు దేవుణ్ణి ప్రేమించారు. కొంతమంది ప్రజలు ఇలా అంటుంటారు; “నేను దేవుణ్ణి ఎన్నో సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాను, ఆయన గొప్ప కృపను మరియు అనేక ఆశీర్వాదాలను అనుభవించాను. ఆయన మాటల్ని బట్టి నేను శుద్ధీకరించబడ్డాను మరియు తీర్పు తీర్చబడ్డాను. కాబట్టి నేను చాలా అర్థం చేసుకున్నాను మరియు నేను దేవుని ప్రేమను చూశాను. నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన కృపకు ప్రతిగా తిరిగి చెల్లించాలి. మరణంతో నేను దేవుణ్ణి సంతృప్తి పరుస్తాను మరియు ఆయన పట్ల నా ప్రేమకు నా మనస్సాక్షిని ఆధారం చేసుకుంటాను.” ప్రజలు కేవలం వారి మనస్సాక్షి భావాలను మాత్రమే వింటే దేవుని ప్రేమ యొక్క అనుభూతిని పొందలేరు. వారు పూర్తిగా తమ మనస్సాక్షి మీద ఆధారపడినట్లయితే, దేవుని పట్ల వారి ప్రేమ బలహీనంగా ఉంటుంది. దేవుని కృప మరియు ప్రేమను తిరిగి చెల్లించడం గురించి మాత్రమే మాట్లాడినట్లయితే, ఆయన పట్ల నీ ప్రేమలో ఎటువంటి ఉత్సుకత నువ్వుకలిగి ఉండవు; నీమనస్సాక్షి భావాల మీద ఆధారపడి ఆయనను ప్రేమించడం అనేది ఒక స్థబ్దమైన విధానం. అది ఒక స్థబ్దమైన విధానం అని నేను ఎందుకు చెప్తున్నాను? ఇది ఒక ఆచరణాత్మక సమస్య. దేవుని పట్ల మీ ప్రేమ ఎటువంటిది? ఇది ఆయనను మోసపరచడం కాదా మరియు కదలికల ద్వారా ఆయన కోసం వెళ్లడం కాదా? చాలామంది ప్రజలు దేవుని ప్రేమించుట వలన ఎటువంటి ప్రతిఫలం లేదని మరియు ఆయనను ప్రేమించనట్లయితే ఒకే విధమైన శిక్షకు గురవుతారని, మొత్తానికి పాపం చేయకుండా ఉంటే చాలని నమ్ముతారు. కాబట్టి ఒకరి మనస్సాక్షి భావాల మీద ఆధారపడి దేవుని ప్రేమించుట మరియు ఆయన ప్రేమను తిరిగి చెల్లించడం అనేది ఒక స్థబ్దమైన విధానం, అది ఒకరి హృదయము నుండి దేవుని కొరకు సహజంగా వచ్చే ప్రేమ కాదు. దేవుని పట్ల ప్రేమ అనేది ఒక వ్యక్తి హృదయాంతరాలలో నుంచి వచ్చే ఒక నిజమైన భావన. కొంతమంది ఈ విధంగా అంటారు: “నేను దేవునివెదకడానికి మరియు ఆయన్ని వెంబడించటానికిసిద్ధంగా ఉన్నాను. దేవుడు నన్ను విడిచి పెట్టాలని కోరుకున్నప్పటికి, నేను ఇంకనూ ఆయన్ను వెంబడిస్తాను. ఆయన నన్ను కోరుకున్నా లేదా కోరుకోక పోయినా నేను చివరి వరకు ఇంకా ఆయనను ప్రేమిస్తాను, నేను ఖచ్చితంగా ఆయనను పొందు కోవాలి, ఆయన ఏం చేసినప్పటికీ నేను నా హృదయాన్ని దేవుడికి అర్పిస్తాను, నా జీవిత కాలమంతా నేను ఆయన్ని వెంబడిస్తాను. ఏదేమైనా, నేను దేవుణ్ణి తప్పక ప్రేమించాలి మరియు నేను ఆయన్ని తప్పక పొందుకోవాలి; ఆయన్ని పొందుకొనేంత వరకు నేను విశ్రమించను.” ఈ రకమైన తీర్మానాన్ని నువ్వు కలిగి ఉన్నావా?
దేవుని నమ్మే మార్గం మరియు ప్రేమించే మార్గం ఒకటే. నువ్వుఆయన్ని నమ్మాలంటే ఖచ్చితంగా ఆయనను ప్రేమించాలి; అయితే, ఆయనను ప్రేమించడం అనేది, మీ మనస్సాక్షి భావాల మీద ఆధారపడి ఆయనను ప్రేమించడం లేదా ఆయన ప్రేమను తిరిగి చెల్లించడం కాదు, అది దేవుని కొరకు మనం కలిగి ఉండే స్వచ్ఛమైన ప్రేమ. కొన్నిసార్లు ప్రజలు మనస్సాక్షి మీద మాత్రమే ఆధారపడి దేవుని ప్రేమను అనుభవించలేరు. “దేవుని ఆత్మ మన ఆత్మలను కదిలించును గాక” అని నేనెప్పుడూ ఎందుకు అంటుంటాను? దేవుని ప్రేమించడానికి ప్రజల మనస్సాక్షిని కదిలించటం గురించి నేను ఎందుకు మాట్లాడను? ఎందుకంటే ప్రజల మనస్సాక్షి దేవుని ప్రేమ మాధుర్యం యొక్క అనుభూతి పొందదు. నువ్వుఈ మాటలను ఒప్పుకోనట్లయితే, నీ మనస్సాక్షితో ఆయన ప్రేమను అనుభూతి చెందడానికి ప్రయత్నించి చూడు. ఈ క్షణంలో నీలో ఒక ఉత్సుకత ఉండవచ్చు, కానీ అది త్వరగా అంతర్ధానమైపోతుంది: దేవుని ప్రేమను మనస్సాక్షితో అనుభవించినప్పుడు మాత్రమే మీరు ప్రార్థించేటప్పుడు ఉత్సాహాన్ని కలిగిఉంటారు, కానీ త్వరగా ఆ ఉత్సాహం మసకబారి మాయమైపోతుంది. అది ఎందుకు? మీరు మీ మనస్సాక్షిని మాత్రమే ఉపయోగించినట్లయితే, దేవుని పట్ల మీ ప్రేమను పెంచుకోలేరు; నీహృదయంలో దేవుని ప్రేమానుభూతిని నిజముగా అనుభవించినప్పుడు నీ ఆత్మ ఆయనచే కదిలించబడుతుంది, ఈ సమయంలో మాత్రమే నీమనస్సాక్షి తన అసలైన పాత్రను పోషించగలుగుతుంది. అంటే, మనిషి ఆత్మ దేవునిచే కదిలించబడినప్పుడు మరియు మనిషికి జ్ఞానం కలిగి తన హృదయంలో ప్రోత్సహించబడినప్పుడు, అంటే, అతను అనుభవాన్ని పొందినప్పుడు మాత్రమే తన మనస్సాక్షితో దేవుని సమర్థవంతంగా ప్రేమించగలుగుతాడు. మీ మనస్సాక్షితో దేవుని ప్రేమించుట అనేది తప్పు కాదు—కానీ ఇది దేవుని కొరకు తక్కువ స్థాయి ప్రేమ. “దేవుని కృపకు కేవలం న్యాయం చేయడం” ద్వారా ప్రేమించడం అనేది మనిషి క్రియాశీలకంగా ప్రవేశించటానికి ప్రేరేపించదు. ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని కార్యములను పొందుకున్నప్పుడు, అంటే, వారి ఆచరణాత్మక అనుభవంలో దేవుని ప్రేమను చూసినప్పుడు మరియు పొందుకున్నప్పుడు, వారు దేవుని గూర్చిన జ్ఞానం కలిగి మానవాళి ప్రేమకు దేవుడు ఎంత యోగ్యుడో మరియు ఆయన ఎంత ప్రేమామయుడో నిజంగా చూసినప్పుడు మాత్రమే వారు నిజంగా దేవుని ప్రేమించగలుగుతారు.
ప్రజలు వారి హృదయాలతో దేవుని సంప్రదించినప్పుడు, వారి హృదయాలు పూర్తిగా దేవుని వైపు మళ్లీనప్పుడు, ఇది దేవుని కొరకు మానవుని ప్రేమలో మొదటి అడుగు. మీరు దేవుని ప్రేమించాలని కోరుకుంటే, మొదట మీ హృదయాన్ని దేవుని వైపు మళ్ళించాలి. దేవుని వైపు మీ హృదయాన్ని మళ్ళించడం అంటే ఏమిటి? మీ హృదయంలో మీరు చేసే ప్రతిదీ దేవుని ప్రేమించడం కొరకు మరియు ఆయనను పొందుకోవడం కొరకే. దీనిని బట్టి మీ హృదయాన్ని పూర్తిగా దేవుని వైపు మళ్లించారని తెలుస్తుంది. దేవుడు మరియు ఆయన మాటలను పక్కన పెడితే మీ హృదయంలో దాదాపుగా ఏదీ లేదు (కుటుంబం, ఆస్తి, భర్త, భార్య, పిల్లలు మొదలైనవి). అవి ఉన్నప్పటికీ, అవి మీ హృదయాన్ని ఆక్రమించలేవు మరియు మీ భవిష్యత్ అవకాశాల గురించి మీరు ఆలోచించండి కానీ దేవుణ్ణి ప్రేమించడం కొనసాగిస్తారు. అటువంటి సమయంలో మీ హృదయాన్ని దేవుని వైపు మళ్ళించారు. ఉదాహరణకు మీ హృదయంలో ఇంకనూ మీ గురించి ప్రణాళికలు వేస్తూ మరియు ఎల్లప్పుడూ మీ సొంత లాభాల మీద దృష్టి ఉంచి, మరి ఎప్పుడూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు: దేవుని గూర్చి చిన్న అభ్యర్థనను నేను ఎప్పుడు చేయాలి? ఎప్పుడు నా కుటుంబం సంపన్నం అవుతుంది? నేను మంచి దుస్తులు ఎలా పొందుకుంటాను? మీరు అటువంటి స్థితిలో జీవిస్తున్నట్లయితే మీ హృదయం పూర్తిగా దేవుని వైపు లేదని తెలుస్తుంది. మీ హృదయాల్లో కేవలం దేవుని మాటలు మాత్రమే ఉంటే మీరు అన్ని సమయాల్లో ఆయనకు ప్రార్థించి ఆయనకు దగ్గర అవ్వ గలుగుతారు—ఆయన మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు, దేవుడు మీలో ఉన్నట్లుగా మరియు మీరు ఆయనలో ఉన్నటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే మీ హృదయం దేవుని సన్నిధిలో ఉందని అర్థం. మీరు ప్రతి నిత్యం దేవుని ప్రార్ధించి ఆయన వాక్యమును భుజించి పానము చేసినప్పుడు, ఎల్లప్పుడు సంఘ కార్యములను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు మరియు దేవుని చిత్తము కొరకు కనిపెడుతున్నప్పుడు, మీ హృదయంతో ఆయనను నిజంగా ప్రేమించి ఆయన హృదయాన్ని సంతృప్తిపరచి నప్పుడు మీ హృదయం దేవునికి చెందుతుంది. మీ హృదయం అనేక ఇతర విషయములచే నింపబడినప్పుడు, ఇంకనూ సాతాను చేత ఆక్రమించబడినప్పుడు అది దేవుని వైపు పూర్తిగా మరలలేదు. ఎప్పుడైతే ఒకరి హృదయం పూర్తిగా దేవుని వైపు మరులుతుందో, వారు ఆయన పట్ల నిజమైన మరియు సహజమైన ప్రేమను కలిగి ఉంటారు మరియు వారు దేవుని కార్యములను చేయగలుగుతారు. వారు ఇప్పటికీ అవివేకము మరియు అన్యాయపు క్షణాల్ని కలిగి ఉన్నప్పటికీ, దేవుని గృహం పట్ల, దేవుని కార్యం పట్ల మరియు వారి స్వాభావిక మార్పుల పట్ల ఆసక్తి చూపుతారు మరియు వారి హృదయము సరైన స్థానంలో ఉన్నది. కొంతమంది తాము చేసేదంతా సంఘము కొరకు చేస్తున్నామని చెప్పుకుంటారు, వాస్తవానికి, వారు చేసేదంతా వారి సొంత ప్రయోజనాల కోసం. ఇలాంటి ప్రజలు తప్పుడు విధమైన ఉద్దేశాలను కలిగి ఉంటారు. వారు కుటిలమైన మరియు మోసపూరితమైన వారు మరి వారు చేసే చాలా పనులు వారి సొంత లాభం కోసం చేస్తారు. ఈ రకమైన వ్యక్తి దేవుని ప్రేమను పొందలేడు; వారి హృదయాలు ఇంకనూ సాతానుకు చెందినవిగానే ఉంటాయి మరియు దేవుని వైపు తిరగలేవు. ఆ విధంగా ఇలాంఏ మార్గమూ లేదు.
మీరు నిజంగా దేవుని ప్రేమించాలని మరియు ఆయనమిమ్మల్ని పొందుకోవాలని మీరు కోరుకుంటే మొదట మీరు చేయవలసింది మీ హృదయాన్ని పూర్తిగా దేవుని వైపు మరల్చడం. మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఇలా ప్రశ్నించుకోండి: దేవునిపై ఆధారపడిన హృదయంతో నేను దీన్ని చేస్తున్నానా? ఏదైనా వ్యక్తిగత ఉద్దేశాలు దీని వెనక ఉన్నాయా? ఇలా చేయడంలో నా అసలు లక్ష్యం ఏమిటి? మీరు మీ హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలనుకుంటే, మొదట మీ హృదయాన్ని అదుపులో ఉంచుకోవాలి, మీ స్వంత ఉద్దేశాలన్నిటినీ విడిచిపెట్టాలి మరియు పూర్తిగా నేను దేవుని కొరకే అనే స్థితిని సాధించాలి. ఇది దేవుడికి మీ హృదయాన్ని ఇవ్వటానికి ఆచరణాత్మక మార్గం. ఒకరు హృదయాన్ని అదుపులో ఉంచుకోవటం అనేది దేనిని సూచిస్తుంది? ఇది ఒకరి శరీరం యొక్క విపరీతమైన కోరికలను విడిచిపెట్టడం, హోదా యొక్క భోగం లేదా ప్రయోజనాన్ని వదిలిపెట్టడం. ఇది దేవుని సంతృప్తిపరచడానికి ప్రతీది చేస్తుంది మరియు హృదయాన్ని వారి కోసం కాకుండా సంపూర్ణంగా దేవుని కొరకు చేస్తుంది. ఇది చాలు.
దేవుని కొరకు నిజమైన ప్రేమ అనేది హృదయపు లోతుల్లోంచి వస్తుంది; ఇది దేవుని గూర్చి మనిషికి ఉన్న జ్ఞానం ఆధారంగా ఉండే ప్రేమ. ఒక హృదయం దేవుని వైపు పూర్తిగా తిరిగినప్పుడు వారు దేవుని ప్రేమను పొందుకుంటారు, కానీ ఆ ప్రేమ తప్పనిసరిగా స్వచ్ఛమైనది లేదా తప్పనిసరిగా పూర్ణ మైనది కాదు. దేవుని వైపు పూర్తిగా మరల్చబడిన ఒక వ్యక్తి యొక్క హృదయానికి మరియు ఆ వ్యక్తికి దేవుని పట్ల ఉన్న నిజమైన అవగాహన మరియు ఆయనపై ఉన్ననిజమైన ఆరాధనకు ఇంకనూ దూరం ఉండటమే దీనికి కారణం. మానవుడు నిజమైన దేవుని ప్రేమను సాధించే మరియు దేవుని మనసును తెలుసుకునే మార్గం, అతని హృదయాన్ని దేవుని వైపు తిప్పడం. ఎప్పుడైతే మనుష్యుడు తన నిజమైన హృదయాన్ని దేవునికి ఇస్తాడో అప్పుడు జీవిత అనుభవంలోనికి ప్రవేశించటం ప్రారంభిస్తాడు. ఈ విధంగా, అతని మనసు మారడం ప్రారంభమవుతుంది, దేవుని పట్ల అతనికి ఉన్న ప్రేమ నెమ్మదిగా పెరుగుతుంది మరియు దేవుని జ్ఞానము కూడా నెమ్మదిగా పెరుగుతుంది. కాబట్టి, ఒకరి హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవడం అనేది జీవితానుభవానికి సరైన మార్గమును పొందుకోవటానికి ముందస్తు షరతు మాత్రమే. ప్రజలు వారి హృదయాలను దేవుని ముందు ఉంచినపుడు, దేవునిపై కోరిక కలిగిన హృదయాన్ని మాత్రమే కలిగి ఉంటారు, కానీ ఆయన పట్ల ప్రేమను కలిగి ఉండరు, ఎందుకంటే ఆయనను గూర్చిన అవగాహన వారు కలిగి ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పట్ల కొంత ప్రేమను కలిగి ఉన్నప్పటికీ అది సహజమైంది మరియు నిజమైనది కాదు. ఇది ఎందుకంటే, మనిషి శరీరం నుంచి ఉద్భవించే ఏదైనా భావోద్వేగ ఉత్పత్తి మరియు అది నిజమేనా అవగాహన నుంచి కలుగదు. ఇది కేవలం ఒక క్షణ కాల ప్రేరణ మరి అది దీర్ఘకాల ఆరాధనకు ఫలితాన్ని ఇవ్వదు. దేవుని పట్ల ప్రజలకు అవగాహన లేనప్పుడు వారు వారి స్వంత ప్రాధాన్యతలు మరియు వ్యక్తిగత తలంపుల ఆధారంగా మాత్రమే ఆయన్ని ప్రేమిస్తారు; ఈ రకమైన ప్రేమ సహజమైన ప్రేమ అనిపించుకోదు లేదా నిజమైన ప్రేమ అనిపించుకోదు. మానవుని హృదయం నిజంగా దేవుని వైపు తిరగవచ్చు మరియు అన్ని విషయాలలో దేవుని ఆసక్తులను గురించి ఆలోచించే సామర్థ్యం కలిగి ఉండవచ్చు కానీ అతనికి దేవుని పట్ల అవగాహన లేకపోతే నిజమైన, సహజమైన ప్రేమను పొందుకునే సామర్థ్యం కలిగి ఉండడు. అతను చేయగలిగిదంతా సంఘం కోసం కొన్ని విధులను చేయడం లేదా కొద్దిపాటి కర్తవ్యాన్ని నిర్వర్తించడం, కానీ వీటిని ఎటువంటి ఆధారం లేకుండా చేస్తాడు. ఈ రకమైన వ్యక్తి మనసును మార్చడం అనేది చాలా కష్టతరం; ఇటువంటి వ్యక్తులు సత్యమును వెంబడించరు లేదా దాన్ని అర్థం చేసుకోరు. ఒక వ్యక్తి దేవుని వైపు తన హృదయాన్ని పూర్తిగా తిప్పినప్పటికీ, దాని అర్థం దేవుని ప్రేమించే వారి హృదయము పూర్తిగా స్వచ్ఛమైనదని కాదు, ఎందుకంటే ఎవరి హృదయాలు అయితే దేవుని కలిగి ఉంటాయో వారి హృదయాల్లో దేవుని ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. దేవుని అవగాహనను అనుసరించే లేదా అనుసరించని వారి మధ్య వ్యత్యాసమును ఇది చూపిస్తుంది. ఒకసారి ఇది ఒక వ్యక్తి ఆయనను గూర్చిన అవగాహన కలిగి ఉంటే, వారి హృదయము పూర్తిగా దేవుని వైపు తిప్పబడిందని చూపిస్తుంది, వారి హృదయాల్లో దేవుని పట్ల నిజమైన ప్రేమ సహజమైనదని చూపిస్తుంది. కేవలం ఇలాంటి ప్రజలు మాత్రమే వారి హృదయాల్లో దేవుణ్ణి కలిగి ఉంటారు. దేవుని అర్థం చేసుకోవడానికి లేదా దేవుని ప్రేమను సాధించడానికి ఒక సరైన మార్గంలోనికి ప్రవేశించడానికి ఒకరి హృదయం దేవుని వైపు తిరగటం అనేది ఒక ముందస్తు షరతు. దేవుని పట్ల ఒకరి కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి ఇది మార్కు కాదు లేదా ఆయన పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉండటానికి మార్కు కాదు. ఎవరైనా దేవుని ప్రేమను సాధించడానికి వారి హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి, ఇది ఆయన సృష్టిలో చేయవలసిన మొదటి పని కూడా. దేవుని కోరుకునే ప్రజలందరూ జీవితాన్ని కోరుకునేవారు, అంటే, సత్యమును మరియు నిజంగా దేవుని కోరుకునేవారు; వారందరూ పరిశుద్ధాత్మ చేత జ్ఞానమును పొందుకుని మరియు ఆయన చేత కదిలించబడ్డారు. వారందరూ దేవుని మార్గదర్శకత్వమును పొందగలుగుతారు.
ఎవరైనా తాము దేవుడికి రుణపడి ఉన్నామని భావిస్తే, అది ఆత్మచేత కదిలించేబడటం వలన మాత్రమే; ఈ విధంగా భావించేవారు కోరికతో కూడిన హృదయాన్ని కలిగి ఉంటారు మరియు జీవితంలోకి ప్రవేశాన్ని కొనసాగించగలరు. కానీ ఒక నిర్దిష్టమైన దశలో మీరు ఆగిపోతే మీరు ఇంకా లోతుగా వెళ్లలేరు; ఇంకా సాతాను వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది, మరియు ఒక నిర్దిష్ట స్థానంలో సాతాను మిమ్మల్ని బందీగా చేసుకుంటాడు. దేవుని ప్రకాశం ప్రజలు వారి గురించి తెలుసుకోవడానికి మరియు వారు దేవునికి ఉన్న ఋణగ్రస్తత గురించి తెలుసుకోవడానికి అనుమతిస్తుంది; వారు ఆయనకు సహకరించడానికి సంసిద్ధంగా ఉంటారు మరియు ఆయనను సంతోషపెట్టని విషయాలను తీసివేస్తారు. ఇది దేవుని యొక్క కార్య సూత్రం. మీరందరూ మీ జీవితాల్లో మరియు దేవుని ప్రేమలో ఎదగడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి బాహ్య విషయాల నుంచి మిమ్మల్ని వదిలించుకున్నారా? మిమ్మల్ని మీరు బాహ్య విషయాల నుంచి మాత్రమే వదిలించుకుని నాశనం కలిగించే మరియు గొప్పలు చెప్పుకునే ప్రవర్తనకు దూరంగా ఉంటే మీరు జీవితంలోఎదుగుతున్నట్లా? మీరు పై పై ప్రవర్తనలన్నింటి నుండి మిమ్మల్ని వదిలించుకుని, దేవుని మాటల్లో ప్రవేశించినట్లయితే, మీరు చురుకుగా పురోగతిని సాధించటం లేదని చూపిస్తుంది. పైపై ప్రవర్తనకు మూల కారణం ఏంటి? మీరు దేవుని ప్రజల్లో ఒకరిగా పరిగణించబడాలని కోరుకుంటున్నారా? ఏమైనప్పటికీ, మీరు జీవించేదానిపై దృష్టి ఉంచాలి; మీరు బాహ్య ప్రవర్తనపై దృష్టి ఉంచినట్లయితే మీ హృదయము బయటకు తోసి వేయబడుతుంది మరియు మీ జీవితంలో ఎదగడానికి ఎటువంటి మార్గం ఉండదు. దేవుడికి మీ మనసులో ఒక మార్పు కావాలి, కానీ మీరు ఎప్పుడూ బయటి విషయాలనే కోరుకుంటున్నారు; ఈ విధమైన వ్యక్తి తన మనసును మార్చుకోవడానికి సమర్థుడు కాడు! జీవితంలో పరిపక్వతను సాధించే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మార్గాన్ని అనుసరించాలి. వారు తప్పనిసరిగా తీర్పును, శిక్షను మరియు దేవుని మాటల పరిపూర్ణతను అంగీకరించాలి. మీరు దేవుని మాటలను కలిగి ఉండక, మీ ఆత్మవిశ్వాసం మరియు సంకల్పం మీద మాత్రమే ఆధారపడి నట్లయితే, మీరు చేసేదంతా ఉత్సాహం మీద ఆధారపడి ఉంటుంది. అంటే, జీవితంలో ఎదగాలంటే మీరు మరింతగా దేవుని మాటలను తిని, త్రాగి మరియు అర్థం చేసుకోవాలి. ఆయన మాటల ద్వారా సంపూర్ణులైన వారందరూ జీవించగలుగుతారు; ఎవరైతే ఆయన వాక్యం ద్వారా శుద్ధీకరించబడరో, ఎవరైతే ఆయన మాటల తీర్పునకు లోను కారో వారు ఆయన ఉపయోగానికి తగరు. కాబట్టి, ఆయన మాటలను బట్టి మీరు ఏ స్థాయి మేరకు జీవించగలరు? మీరు దేవుని మాటలను కేవలం తిని మరియు త్రాగి మీ జీవిత స్థాయితో పోల్చుకున్నప్పుడు, నేను తెచ్చిన సమస్యల వెలుగులో ఆచరణ మార్గాన్ని కనుగొన్నప్పుడు మాత్రమే, మీ ఆచరణ సరైనది మరియు దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది. ఈ రకమైన ఆచరణ కలిగి ఉన్నవారు మాత్రమే దేవుని సంకల్పాన్ని పొందుకుంటారు.