ఒక వ్యక్తి తన ఆలోచనలలో దేవునికి సరిహద్దులు పెట్టుకున్నప్పుడు అతడు దేవుని ప్రత్యక్షతలను ఎలా పొందుకోగలడు?
దేవుని కార్యము ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది, అలాగే, ఆయన కార్యము యొక్క ఉద్దేశ్యము మారకపోయినను, ఆయన కార్యము చేసే పద్ధతి మాత్రము ఎల్లప్పుడు మారుతూనే ఉంటుంది, అంటే, దేవుణ్ణి అనుసరించే వారందరూ ఎల్లపుడు మార్పు చెందుతూనే ఉంటారని అర్థం. దేవుడు కార్యము చేసేకొలది, దేవుని మీద మనిషి జ్ఞానం కూడా మెరుగవుతుంది. దేవుని కార్యము జరుగుచున్నప్పుడు మనిషి స్వభావంలో కూడా సంబంధిత మార్పులు జరుగుతుంటాయి. అయితే, దేవుని కార్యము నిరంతరమూ మారుతూనే ఉండడం వల్ల, పరిశుద్ధాత్మ కార్యము గురించి ఎరుగని వారు మరియు సత్యమును తెలుసుకోలేని విడ్డూరంగ ఉన్న ప్రజలు దేవుణ్ణి తిరస్కరించుచున్నారు. దేవుడు చేసే కార్యము ఎప్పటికీ మనిషి ఆలోచనలకు అనుగుణంగా ఉండదు, ఎందుకంటే, ఆయన కార్యము ఎల్లప్పుడూ కొత్తదిగానే ఉంటుందే తప్ప ఎప్పటికీ పాతదిగా ఉండదు. అలాగే, ఆయన ఎప్పుడు కూడా పాత కార్యమును పునరావృతం చేయకపోవడమే కాకుండా, అదివరకు ఎప్పుడూ చేయని కార్యముతో ముందుకు సాగుతాడు. దేవుడు ఎప్పుడూ తన కార్యమును పునరావృతం చేయడు కాబట్టి, ఆయన గతంలో చేసిన కార్యము ఆధారంగానే, ఆయన ప్రస్తుత కార్యమును మనిషి ఎల్లప్పుడూ అంచనా వేస్తుండడం వల్ల, కొత్త యుగానికి సంబంధించిన కార్యములోని ప్రతి దశను నిర్వహించడం దేవునికి అత్యంత కష్టతరంగా మారింది. మనిషికి అనేకమైన కష్టాలు ఉన్నాయి! మనిషి తన ఆలోచనలలో సంప్రదాయబద్దంగా ఉన్నాడు! దేవుని కార్యము గురించి ఎవరికి తెలియకపోయినను, ప్రతియొక్కరు దానికి పరిధులను వేస్తుంటారు. మనిషి దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు, అతను జీవమును, సత్యమును మరియు దేవుని ఆశిర్వదములను కోల్పోతాడు. అయినప్పటికీ, మనిషిపై దేవుడు ఉంచిన గొప్ప ఆశీర్వాదములనే మనిషి లెక్క చేయనప్పుడు దేవుడు అనుగ్రహించు జీవమును సత్యమును కూడా అంగీకరించడు. దేవుని పొందుకోవాలని మనుష్యులందరూ కోరుకున్నప్పటికీ, దేవుని కార్యములోని ఏ చిన్న మార్పునూ వారు సహించలేరు. దేవుని కొత్త కార్యమును అంగీకరించలేని వారంతా దేవుని కార్యము మార్పు లేనిదని, అందుకే అది ఎల్లప్పుడూ ఒకే స్థితిలోనే ఉంటుందని నమ్ముతారు. ఒకని పాపము విషయమై వారు ఒప్పుకొని పశ్చాత్తాపము చెందేంత కాలము, దేవుని చిత్తము ఎల్లప్పుడు సంతృప్తి చెందుతుందని, దేవుని నుండి నిత్య రక్షణ పొందుకొనుటకు ధర్మశాస్త్రమును పాటిస్తే చాలని వాళ్ళు నమ్ముతారు. ధర్మశాస్త్రము క్రింద ఉన్న దేవుడు మాత్రమే వారికి దేవుడుగా ఉంటాడని మరియు మనుష్యుని కొరకు సిలువ వేయబడిన ఆయనే దేవుడని; అంతమాత్రమే కాకుండా దేవునిగా ఉన్నవాడు బైబిలుకు అతీతంగా ఏది చేయకూడదని లేక ఏది చేయలేడని వారు అభిప్రాయపడుచున్నారు. ఇటువంటి అభిప్రాయాలను కలిగియున్నారు కాబట్టి పాత నిబంధన వారికి సంకెళ్ళు వేసియున్నది మరియు మరణకరమైన నియమాలకు వారు సిలువవేయబడియున్నారు. దేవుడు ఏదైన నూతన కార్యమును జరిగించుచున్నప్పుడు, అది ప్రవచనాల ఆధారంగ ఉండాలని మరియు ఆ కార్యములోని ప్రతి ఘట్టములోను, ఆయనను “నిజమైన” మనస్సుతో వెంబడించువారికి కూడా ప్రత్యక్షతలు కనుపరచాలని; అల లేనప్పుడు, అది దేవునివలన జరుగు కార్యము కాదని వారిలో అనేకులు నమ్ముచున్నారు. దేవుణ్ణి తెలుసుకోవడం మనిషికి అంత సులభమైన విషయమేమి కాదు. మనుష్యుని విచిత్రమైన మనస్సును అలాగే స్వీయ-ప్రాముఖ్యత మరియు దురహంకారంతో నిండిన తిరుగుబాటు స్వభావము ద్వారా దేవుని నూతన కార్యమును అతడు అంగీకరించడం మరి కష్టకరంగ మారుతుంది. దేవుని నూతన కార్యమును మనుష్యుడు పరిశిలచేయకపోవడమే కాకుండా దానిని దీనమనస్సుతో అంగీకరించనులేడు; దానికి బదులుగా దేవుని నుండి వచ్చు ప్రత్యక్షతలకొరకు మరియు నడుపుదలకు ఎదురుచూస్తూ దేవుని దిక్కరించు స్వభావమును అనుసరిస్తాడు. దేవునికి విరోధులు మరియు దేవునిని వ్యతిరేకించువారి నడత ఈ విధంగా ఉండదా? మరి, ఇలాంటి వ్యక్తులు దేవుని ఆమోదం ఎలా పొందగలరు?
కృపా యుగంలో యెహోవా కార్యము వెనుకబడిందని యేసు చెప్పినట్లుగానే, ఇప్పుడు యేసు కార్యము కూడా వెనుకబడియున్నదని ఈ రోజు నేను చెబుతున్నాను. శాస్త్ర కృపా యుగం రాకుండ ధర్మశాస్త్ర యుగమే ఉండినయడల యేసు సిలువ వయబడి సమస్త మానవాళికి విమోచన కలిగించే వాడు కాడు. ఒకవేళ, ఇప్పటికీ ధర్మశాస్త్ర యుగమే ఉండి ఉంటే, మానవజాతి ఈ స్థాయికి చేరుకుని ఉండేదా? చరిత్ర ముందుకు సాగుతూనే ఉంటుంది, చరిత్ర అనేది దేవుని కార్యము యొక్క స్వాభావిక నిబంధన కాదా? ఇది విశ్వమంతటిలో మానవుని కొరకు దేవుడు చేసిన నిర్వహణకు నిదర్శనము కాదా? చరిత్ర ముందుకు సాగినట్లుగానే, దేవుని కార్యము కూడా ముందుకు సాగుతూనే ఉంటుంది. దేవుని చిత్తము నిరంతరం మారుతూనే ఉంటుంది. అందరికి తెలిసిన విధంగానే, దేవుడు ఎన్నడు పాతబడడు కానీ ఎల్లప్పుడు నూతనపరచబడుతూనేయుంటాడు, ఆయన ఒక కార్యములోని ఒకే ఘట్టములో నిలిచియుండలేడు, సిలువవెయబడుట, సిలువకు ఒకటి, రెండు, మూడు సార్లు…. కొట్టబడడం వంటి ఒకే కార్యమును ఆయన పదేపదే జరిగించడు. అలా ఆలోచించడం కూడా విడ్డూరంగ ఉంటుంది. దేవుడు ఎప్పుడూ ఒకే పని చేస్తూ ఉండడు; ఎలాగైతే నేను మీతో క్రొత్త మాటలు మాట్లాడుతానో మరియు ప్రతి రోజూ క్రొత్త పనులు చేస్తానో అదేవిధంగా ఆయన పని కూడా ఎప్పుడూ మారుతూనే ఉంటుంది మరియు ఎల్లప్పుడూ నూతనపరచబడుతూనే ఉంటుంది. ఇదే నేను చేసే పని. అలాగే, “క్రొత్త” మరియు “అద్భుతం” అనే పదాలే ఇందులో కీలకం. “దేవుడు మార్పు లేనివాడు, దేవుడు ఎప్పటికీ దేవుడే” ఈ మాట నిజంగానే సత్యము; దేవుని స్వరూపము ఎప్పటికి మారదు, దేవుడు ఎల్లప్పుడు దేవునిగానే ఉంటాడు, మరియు ఆయన ఎప్పటికి సాతానుగ మారలేడు. అయితే, ఆయన కార్యము కూడా ఆయన స్వరూపము లాగా స్థిరమైనదని మరియు మర్పులేనిదని ఇది నిరూపించుటలేదు. దేవుడు మార్పులేనివాడని మీరు ప్రకటిస్తుంటారు, అలాంటప్పుడు, దేవుడు ఎల్లప్పుడూ నూతనపరచబడుతూనేయుంటాడని మరియు ఎన్నటికి పాటబడడని మీరెలా నిరూపించగలరు? దేవుని కార్యము నిరంతరమూ వ్యాపిస్తుంటుంది మరియు నిరంతరమూ మారుతూనే ఉంటుంది, ఆయన చిత్తము నిరంతరం బయలుపరచబుడుతుంది, మరియు మనిషికి తెలియజేయబడుతూ ఉంటుంది. దేవుని కార్యమును మనిషి అనుభవించేకొలది, అతని జ్ఞానం లాగే అతని స్వభావం కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది. కానీ, ఈ మార్పు ఎక్కడ నుండి వస్తోంది? నిరంతరం మారుతుండే దేవుని కార్యము నుండి కాదా? మనిషి స్వభావంలో మార్పు కలుగుచున్నప్పుడు, నా కార్యము మరియు నా వాక్యములు సైతం నిరంతరం మారడానికి మనిషి ఎందుకు అనుమతించుటలేదు? మనిషి పరిమితులకు నేను లోబడి ఉండాలా? ఇందుకోసం, మీరు వితండ వాదనలు మరియు పనికిమాలిన తర్కము ఉపయోగించడం లేదా?
యేసు తన పునరుత్థానం తరువాత, తన శిష్యులకు ప్రత్యక్షమై, “నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.” వారితో చెప్పెను. ఈ మాటలను ఎలా వివరించాలో నీకు తెలుసా? నీవు ఇప్పుడు ఆయన శక్తితో నింపబడియున్నావా? ఇక్కడ “శక్తి” అంటే ఏమిటో నీవు అర్థం చేసుకొనియున్నావా? అంత్య దినములలో సత్య సంబంధమైన ఆత్మను మనుష్యులకు అనుగ్రహించెదనని యేసు ప్రకటించెను. ఆ అంత్య దినములు ఇప్పుడు వచ్చియున్నాయి; సత్య సంబంధమైన ఆత్మ తన మాటలను ఎలా వ్యక్తికరిస్తుందని నీకు తెలుసా? సత్య సంబంధమైన ఆత్మ ఎక్కడ కనబడుతుంది మరియు ఎక్కడ పనిచేస్తుంది? క్రొత్త నిబంధన యుగంలో యేసు అనే శిశువు జన్మించనున్నాడని ప్రవచన గ్రంథమైన యెషయా గ్రంథములో ఎక్కడ చెప్పబడలేదు; ఇమ్మాన్యుయోలు అనే కుమారుడు జన్మిస్తాడని మాత్రమే రాయబడింది. “యేసు” అనే పేరు అందులో ఎందుకు ప్రస్తావించబడలేదు? పాత నిబంధనములో ఎక్కడ కూడా ఈ పేరు కనిపించదు, మరి, నీవింకా ఎందుకు యేసును విశ్వసిస్తున్నావు? యేసును నీ కళ్ళతో చూసిన తర్వాతే ఆయనను నీవు విశ్వసించుటకు ప్రారంభించలేదుగదా? లేదంటే, ఒక ప్రత్యక్షత పొందుకున్నాక తర్వాతే నీవు విశ్వసించడం ప్రారంభించావా? నిజంగానే దేవుడు నీ మీద అలాంటి కృపను చూపించునా? ఆయన నీ మీద అంత గొప్ప ఆశీర్వాదములు కురిపిస్తాడా? యేసు మీద నీ విశ్వాసానికి ఆధారమేమిటి? నేడు దేవుడు శరీరదారియై వచ్చాడని నీవెందుకు విశ్వసించుట లేదు? దేవుడి నుండి నీకు ప్రత్యక్షత లేకపోవడమే ఆయన శరీరధారిగా అవతరించలేదనేందుకు రుజువు అని మీరెందుకు అంటున్నారు? దేవుడు తన కార్యము మొదలుపెట్టే ముందు మనుష్యులకు తెలియజేయాలా? మనుష్యుల నుండి ఆయన ముందే ఆమోదం పొందాలా? ఒక కుమారుడు పశులపాకలో జన్మిస్తాడని మాత్రమే యెషయా ప్రకటించాడు; యేసుకు మరియ జన్మనిస్తుందని ఆయన ఎక్కడా ప్రవచించలేదు. అలాంటప్పుడు, మరియ జన్మనిచ్చిన యేసు మీద నీ విశ్వాసానికి ఆధారమేమిటి? నీ విశ్వాసం వాస్తవానికి చెదరిపోలేదు గదా? దేవుడి పేరు మారిపోదు అని కొందరు అంటుంటారు. అదే నిజమైతే, యెహోవా పేరు యేసుగా ఎందుకు మారింది? మెస్సీయ వస్తాడని ప్రవచించబడియున్నప్పుడు, యేసు అనే మనిషి ఎందుకు వచ్చాడు? దేవుని పేరు ఎందుకు మారింది? అంటే, అలాంటి కార్యము చాలా కాలం క్రితము జరగలేదా? దేవుడు ఈరోజు క్రొత్త కార్యము చేయలేడా? నిజానికి, నిన్నటి కార్యము మార్పు చెందవచ్చు, మరియు యేసు కార్యము యెహోవా కార్యమును అనుసరించవచ్చు. అలాంటప్పుడు, యేసు కార్యమును మరొక కార్యము అనుసరించవచ్చు కదా? యెహోవా పేరు యేసుగా మారగలిగినప్పుడు, యేసు పేరు కూడా మారగలదు కదా? ఇవేవీ అసాధారణ సంగతులు కావు; మనుష్యులు అత్యంత సాధారణ ఆలోచనా ధోరణితో ఉండడమే ఇందుకు కారణం. దేవుడు ఎప్పుడూ దేవుడుగానే ఉంటాడు. ఆయన కార్యము మారినను, ఆయన పేరు ఎలా మారినను, వాటితో సంబంధం లేకుండా, ఆయన స్వభావము మరియు జ్ఞానము ఎప్పటికీ మారవు. దేవుణ్ణి యేసు అనే పేరుతో మాత్రమే పిలుస్తారని నీవు విశ్వసించిన పక్షంలో, నీ జ్ఞానం అత్యంత పరిమితమని అర్థం. యేసు అనేదే ఎప్పటికీ దేవుని నామముగా ఉంటుందనీ, దేవుడు ఎప్పటికీ మరియు ఎల్లప్పుడూ యేసు నామముతోనే ఉంటాడనీ మరియు ఇదేదీ ఎప్పటికీ మారబోదని నీవు ధైర్యంగా చెప్పగలవా? యేసు అనే పేరుతో ధర్మశాస్త్ర యుగము ముగిసిందని మరియు అంతిమ యుగం కూడా ఆ పేరుతోనే ముగించబడునని నీవు ఖచ్చితంగా చెప్పగలవా? అలాంటప్పుడు యేసు కృప వల్లే యుగం ముగుస్తుందని ఎవరు చెప్పగలరు? ఈ సత్యాల గురించి నీకు స్పష్టమైన అవగాహన లేకపోతే, సువార్త ప్రకటనలో నీవు అసమర్థుడివి కావడమే కాకుండా, నీకు నీవు స్థిరంగా నిలబడలేవు. మతాన్ని ఆచరించే వారి కష్టాలన్నీ నీవు పరిష్కరించి, వారి తప్పిదాలన్నింటినీ నీవు తిప్పికొట్టే రోజు వచ్చినప్పుడు, ఈ దశ కార్యములో నీవు ఖచ్చితంగా ఉన్నవని మరియు అందులో లేస మాత్రమైనా సందేహం లేదనీ రుజువవుతుంది. వారి తప్పిదాలను నీవు ఖండించలేని పక్షంలో, వారు నిన్ను ఒంటరి వాడిని చేసి, నీ మీద అపవాదు మోపుతారు. అది నీకు అవమానకరం కాదా?
యూదులందరూ పాత నిబంధన చదివారు మరియు పశుల తొట్టిలో మగ శిశువు జన్మిస్తాడని యెషయా ప్రవచనం గురించి వారికి తెలుసు. కానీ, ఆ సంగతి స్పష్టంగా తెలిసినప్పటికీ, వారు యేసును ఎందుకు హింసించారు? వారి తిరుగుబాటు స్వభావం మరియు పరిశుద్ధాత్మ పని గురించి వారికి తెలియకపోవడమే అందుకు కారణం కాదా? బైబులులో చెప్పబడిన మగ శిశువు గురించి తమకు తెలిసిన సంగతులతో పోలిస్తే, యేసు కార్యము భిన్నంగా ఉందని ఆ సమయంలో పరిసయ్యలు విశ్వసించారు, మరియు దేవుని కార్యము శరీరదారిగ దాల్చడంలో బైబుల్ అనుగుణంగా లేదు కాబట్టి నేడు కూడా ప్రజలు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. దేవుని యందు వారి తిరుగుబాటు యొక్క సారాంశం అదే కదా? నీవు నిస్సందేహంగా పరిశుద్ధాత్మ కార్యములన్నిటిని అంగీకరించగలవా? అది పరిశుద్ధాత్మ కార్యముగా ఉంటే, అప్పుడది సరైన మార్గముగా ఉన్నది. కాబట్టి, సందేహాలలకు తావు లేకుండా నీవు దానిని అంగీకరించాలి; మీకు కావలసిన వాటిని మాత్రమే ఎన్నుకొని వాటిని మాత్రమే అంగీకరించ అవసరం లేదు. దేవుడి గురించి మీరు మరింత అవగాహన పెంచుకుని, ఆయన విషయములో మీరు జాగ్రతగా ఉండగలిగితే, ఇది మీకు అనవసరం కదా? అలాంటప్పుడు, నీవు బైబిల్ నుండి మరిన్ని ఆధారాల కోసం వెతికే అవసరం లేదు; అది పరిశుద్ధాత్మ పని అయినప్పుడు, నీవు దానిని అంగీకరించాల్సిందే, ఎందుకంటే, నీవు దేవుణ్ణి అనుసరించడానికి, దేవుణ్ణి విశ్వసిస్తావు కాబట్టి, నీవు ఆయన గురించి పరిశోధించనవసరం లేదు. నేనే నీ దేవుడినని నిరూపించడం కోసం నీవు నా గురించి మరిన్ని ఆధారాలను వెదకనవసరం లేదు గాని నా ద్వారా నీకు ప్రయోజనం ఉందా, లేదా అని మాత్రమే వివేచించాలి. ఇదే ఇక్కడ అత్యంత కీలకం. ఒకవేళ నీకు బైబిల్లో అత్యంత తిరుగులేని ఆధారాలు దొరికినప్పటికీ, అది నిన్ను సంపూర్ణంగా నా యొద్దకు తీసుకురాదు. ఎందుకంటే, నీవింకా బైబిలు హద్దుల్లోనే నివసిస్తున్నావు తప్ప, నా ముందు కాదు; నా గురించి తెలుసుకోవడానికి బైబిలు నీకు సహాయం చేయదు లేదా నా యందు నీ ప్రేమ లోతను అదేమీ మరింతగా పెంచబోదు. ఒక కుమారుడు జన్మించబోతున్నాడని బైబిలు పేర్కొన్నప్పటికీ, ఆ మాట ఎవరి గురించి చెప్పబడిందో ఎవరూ ఊహించజాలరు. ఎందుకంటే, దేవుని కార్యము మనిషికి అంతుచిక్కదు. యేసు మీద పరిసయ్యుల వ్యతిరేకతకు కారణం కూడా అదే. నా కార్యము మనిషి ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందని కొందరికి తెలిసినప్పటికీ, యేసు మరియు నేను పూర్తిగా వేర్వేరు అని, మేము పరస్పరం సరిపోని వారమని విశ్వసిస్తుంటారు. ఆ సమయంలో, అంటే, కృపాయుగంలో ఎలా సాధన చేయాలి, ఎలా ఒకచోట చేరాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలి లాంటి విషయాల గురించి మాత్రమే యేసు తన శిష్యులకు అనేక బోధలను చేసాడు. ఆయన కృప యుగమునకు సంబంధించిన కార్యమును జరిగించెను, అలాగే తన శిష్యులు మరియు ఆయనను అనుసరించువారు పాటించాల్సిన కార్యములను గూర్చి వివరించాడు. ఆయన కృపా యుగ కార్యము మాత్రమే చేసాడు, మరియు అంత్య దినములకు సంబంధించిన ఏ కార్యమును ఆయన చేయలేదు. ధర్మశాస్త్ర యుగములో యెహోవా దేవుడు పాట నిబంధన ధర్మశాస్త్రమును స్థాపించినప్పుడు, కృపా యుగము యొక్క కార్యములను ఆయన ఎందుకు జరిగించలేదు? కృపాయుగపు కార్యము గురించి ఆయన ముందుగానే ఎందుకు స్పష్టం చేయలేదు? మనిషి అంగీకరించడానికి ఇది దోహద పాడేది కదా? ఒక కుమారుడు జన్మించి, రాజ్యమేలును అని మాత్రమే ఆయన పేర్కొన్నాడే తప్ప, కృపాయుగపు కార్యమును ఆయన ముందుగానే ప్రారంభించలేదు. ప్రతి యుగంలో దేవుని కార్యము తగిన సరిహద్దులు కలిగి ఉంటుంది; ఆయన ప్రస్తుత యుగము యొక్క కార్యము మాత్రమే చేస్తాడే తప్ప రాబోయే యుగానికి సంబంధించిన కార్యమును ముందస్తుగానే ప్రారంభించడు. ఈ విధంగా మాత్రమే ఆయన ప్రతినిధులు వారి వారి యుగములో తగిన కార్యములను నెరవేరుస్తారు. యేసు అంత్య దినముల సూచనలను గూర్చి, సహనము కలిగియుండుట మరియు రక్షించబడుటను గూర్చి, ఎలా పశ్చాతాపము పొంది ఎలా ఒప్పుకోవాలని, సిలువ మోస్తూ ఎలా దీర్ఘ శాంతము కలిగియుండాలని చెప్పాడు; అంత్య దినములలో ఎలా ప్రవేశించాలని గాని లేక దేవుని చిత్తమును నేరవేచుట ఎలా వేదకాలని ఆయన ఎన్నడు ప్రకటించ లేదు. ఇదిలా ఉండగా, అంత్యదినములను గూర్చి బైబుల్లో వెదకడం అనాలోచితము కాదా? బైబిలును చేత పట్టుకోవడం ద్వారా మాత్రమే నీవేమి చూడగలవు? బైబిలులో విషయాలు వివరించే వ్యక్తి అయినా లేదా బోధకుడైనా, ఎవరైనా సరే, నేటికాలం కార్యమును ఎవరు మాత్రం ముందే చూడగలరు?
“చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక.” మీరిప్పుడు పరిశుద్ధాత్మ మాటలను విన్నారా? దేవుని మాటలు మీ దగ్గరకు వచ్చాయి. మీరు వాటిని వింటున్నారా? అంత దినములలో దేవుడు తన మాటల కార్యమును చేస్తాడు మరియు ఆ మాటలు పరిశుద్ధాత్మకు చెందినవి. ఎందుకంటే, దేవుడు పరిశుద్ధాత్మగానూ మరియు శరీరధారిగానూ ఉండవచ్చు; కాబట్టి, గతములో చెప్పబడిన పరిశుద్ధాత్మ మాటలే నేడు శరీరదారియైన దేవుని మాటలుగా ఉన్నాయి. పరిశుద్దాత్మ దేవుడే మాట్లాడుచున్నాడు కాబట్టి ఆ మాటలు పరలోకం నుండి మాత్రమే వినిపించాలని విశ్వసించే విచిత్రమైన ప్రజలు చాలా మందే ఉన్నారు. ఇలాంటి యోచన కలిగిన వారెవరికీ దేవుడి కార్యము గురించి తెలియదు. నిజానికి, పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటలనే శరీరధారియైన దేవుడు ఇదివరకే పలికియుండెను. పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మనిషితో మాట్లాడలేడు; ధర్మశాస్త్ర యుగంలో సైతం, యెహోవా మనుష్యులతో నేరుగా మాట్లాడలేదు. అలాంటప్పుడు, ఈ యుగంలో కూడా ఆయన అలా చేసే అవకాశం అత్యంత తక్కువని అనిపించడం లేదా? దేవుడు పలికిన మాటలను నెరవేర్చుటకు ఆయన శరీరధారియై రావాలి; లేని పక్షంలో, ఆయన కార్యము యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చడం అసాధ్యము. దేవుని శరీరధారి అయ్యాడని తిరస్కరించేవారంతా పరిశుద్ధాత్మ గురించి లేదా దేవుడు ఏ నియమాల ఆధారంగా పనిచేస్తాడో తెలియని వారే. ఇప్పుడున్నది పరిశుద్ధాత్మ యుగం అని విశ్వసించే వారు సైతం, ఆయన కొత్త కార్యమును అంగీకరించుట లేదు, ఇలాంటివారు అస్పష్టమైన మరియు స్పష్టము లేని విశ్వాసం మధ్య జీవించేవారుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మాట్లాడి తన కార్యమును జరిగించాలని కోరుకొనేవారు దేవుని మాటలను లేక ఆయన శరీరధారిగ వచ్చాడన్న సంగతులను అంగీకరించరు మరియు వారు ఎన్నటికి నూతన యుగములోనికి లేక దేవుని మూలంగా పరిపూర్ణమైన రక్షణలోనికి అడుగుపెట్టలేరు!