మీరు హోదా ఆశీర్వాదాలను పక్కన పెట్టాలి మరియు మనిషికి మోక్షం ఇవ్వడానికి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి
మనిషి దృష్టికోణంలో చూస్తే, మోయాబు వారసులను పరిపూర్ణులుగా చేయడం వీలుకాదు లేదా వారికి ఆ అర్హత కూడా లేదు. అదే దావీదు పిల్లలు నిశ్చయంగా నమ్మిక కలిగియున్నారు మరియు వారు నిజంగా పరిపూర్ణులుగా చేయబడగలరు. ఎవరైతే మోయాబు వారసులుగా ఉంటారో, వారిని పరిపూర్ణులుగా చేయలేరు. ఇప్పటికి కూడా, మీ మధ్య చేయబడుతున్న కార్యము ప్రాధాన్యత మీకు ఇంకా తెలియదు. ఈ దశలో, మీరు ఇంకా మీ భవిష్యత్తు గురించి అవకాశాలను మీ హృదయాలలో ఉంచుకున్నారు మరియు వాటిని వదిలివేయడానికి సంకోచిస్తున్నారు. మీలాంటి అత్యంత అనర్హులైన ప్రజల సమూహం కోసం పని చేయడానికి ఈరోజు దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. అంటే, ఆయన తన కార్యంలో తప్పు చేసి ఉండవచ్చనా? ఈ కార్యము క్షణికావేశంతో చేసిన పొరపాటా? మీరు మోయాబు బిడ్డలని ఎప్పుడూ తెలిసిన దేవుడు మీ మధ్య పని చేయడానికి నిశ్చయంగా ఎందుకు దిగి వచ్చాడు? ఇది మీకు ఎప్పుడూ తట్టలేదా? దేవుడు ఆయన కార్యాన్ని చేస్తున్నప్పుడు దీని గురించి ఎప్పుడూ ఆలోచించడా? ఆయన దూకుడుగా ప్రవర్తిస్తాడా? మీరు మోయాబు వారసులని ఆయనకు ముందు నుండి తెలియదా? మీకు ఈ విషయాలను గురించి ఆలోచించడం తెలియదా? మీ అభిప్రాయాలు ఎక్కడికి పోయాయి? మీరు ఆరోగ్యకరంగా ఆలోచించడం అనేది చెడిపోయిందా? మీ తెలివి మరియు వివేకం ఎక్కడికి పోయాయి? మీరు ఇలాంటి చిన్న విషయాలను పట్టించుకోనంత ఉదారస్వభావం కలిగి ఉన్నారా? మీ మనస్సులు మీ భవిష్యత్తు అవకాశాలు మరియు మీ సొంత తలరాత లాంటి వాటిపట్ల అత్యంత సున్నితంగా ఉంటాయి, అదే మరేదైనా విషయానికి వస్తే, అవి మొద్దుబారి, మందబుద్ధితో మరియు పూర్తి అజ్ఞానంతో ఉంటాయి. ఈ భూమి మీద మీరు దేనిని విశ్వసిస్తారు? మీ భవిష్యత్తు అవకాశాలనా? లేక దేవుడినా? మీరు విశ్వసించే ప్రతి ఒక్కటీ మీ అందమైన గమ్యం కాదా? ఇది మీ భవిష్యత్తు అవకాశాలు కాదా? మీరు జీవన విధానాన్ని ఇప్పుడు ఎంత అర్థం చేసుకున్నారు? మీరు ఎంత పొందారు? మిమ్మల్ని అవమానపరచడానికే మోయాబు వారసులపై ఇప్పుడు జరుగుతున్న కార్యము చేయబడుతున్నదని మీరు అనుకుంటున్నారా? ఇది మీ వికారాన్ని బయటపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేయబడిందా? మీరు దండనను అంగీకరించేలా చేయడానికి మరియు ఆ తర్వాత మిమ్మల్ని అగ్ని గుండంలోకి విసిరేయడానికి ఉద్దేశపూర్వకంగా చేయబడిందా? మీకు భవిష్యత్తు అవకాశాలు లేవని నేనెప్పుడూ చెప్పలేదు, మీరు నాశనం చేయబడాలని లేదా నాశనానికి గురి కావాలని అంతకంటే కాదు. అలాంటి విషయాలను నేను బహిరంగంగా ప్రకటించానా? నీవు నమ్మిక లేకుండా ఉన్నావని అంటావు, అయితే ఇది నీకు నీవే ఏర్పర్చుకున్న అభిప్రాయం కాదా? ఇది నీ సొంత మనస్తత్వం ప్రభావం కాదా? నీ సొంత అభిప్రాయాలు లెక్కకు వస్తాయా? నీవు ఆశీర్వదించబడలేదని నేను చెబితే, నీవు నిశ్చయంగా నాశనానికి గురవుతావు; మరియు నీవు ఆశీర్వదించబడ్డావని నేను చెబితే, నీవు నిశ్చయంగా నాశనం చేయబడవు. నీవు మోయాబు వారసుడవని మాత్రమే నేను చెబుతున్నాను; నీవు నాశనం చేయబడతావని నేను చెప్పలేదు. దీన్ని సులభంగా చెప్పాలంటే, మోయాబు వారసులు శపించబడ్డారు మరియు వారు చెడిపోయిన మానవులలో ఒక జాతి. పాపం గురించి ఇంతకుముందే పేర్కొనడం జరిగింది; మీరందరూ పాపులు కారా? పాపులందరూ సాతానుచే చెరిపివేయబడినవారు కారా? పాపులందరూ దేవుడిని ధిక్కరించి, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదా? దేవుడిని ధిక్కరించే వారు శపించబడరా? పాపులందరూ తప్పక నాశనం చేయబడరా? అలాంటప్పుడు, శరీరులైన మనుష్యులలో ఎవరు రక్షించబడగలరు? ఈరోజు వరకు మీరు ఎలా జీవించగలిగారు? మీరు మోయాబు వారసులు కాబట్టి మీరు ప్రతికూలంగా పెరిగారు; మీరు కూడా పాపులైన మనుష్యులలాగా లెక్కించబడరా? ఈరోజు వరకు మీరు ఎలా మిగిలి ఉన్నారు? పరిపూర్ణత గురించి చెప్పినప్పుడు, మీరు సంతోషిస్తారు. అది విన్న తర్వాత మీరు తప్పక గొప్ప సంకటాన్ని అనుభవిస్తారు, ఇది మిమ్మల్ని మరింత ఆశీర్వదించబడేలా చేస్తుందని మీరు భావిస్తారు. సంకటం నుండి బయటపడిన తర్వాత మీరు విజేతలు కాగలరని, అంతేగాకుండా ఇది దేవుని గొప్ప ఆశీర్వాదం మరియు మిమ్మల్ని ఆయన గొప్ప ఉన్నతస్థితికి చేర్చడమని మీరు భావిస్తారు. మోయాబు గురించి ప్రస్తావించగానే, మీలో అల్లకల్లోలం చెలరేగుతుంది; పెద్దలు మరియు పిల్లలు ఒకేలా మాటల్లో చెప్పలేని దుఃఖాన్ని అనుభవిస్తారు మరియు మీకు మీ హృదయాలలో ఎలాంటి సంతోషం ఉండదు మరియు మీరు జన్మించినందుకు పశ్చాత్తాపపడతారు. మోయాబు వారసులపై చేయబడుతున్న ఈ కార్యపు దశ ప్రాధాన్యత మీకు అర్థం కాదు; మీకు ఉన్నత స్థానాలను కోరుకోవడం మాత్రమే తెలుసు మరియు నమ్మిక లేదని మీరు భావించినప్పుడల్లా మీరు వెనక్కు జారిపోతారు. పరిపూర్ణత మరియు భవిష్యత్తు గమ్యం గురించి చెప్పగానే మీరు సంతోషిస్తారు; ఆశీర్వాదాలు పొందడానికి మరియు దాని ద్వారా మంచి గమ్యాన్ని పొందగలిగేందుకు మీరు దేవునిపై మీ విశ్వాసాన్ని ఉంచుతారు. తమ స్థితి కారణంగా కొంతమంది ఇప్పుడు భయపడతారు. వారికి తక్కువ విలువ మరియు తక్కువ హోదా ఉన్న కారణంగా, వారు పరిపూర్ణులుగా మార్చబడాలని కోరుకోరు. మొదట, పరిపూర్ణత గురించి మాట్లాడబడింది, ఆతర్వాత మోయాబు వారసుల గురించి పేర్కొనబడింది, కాబట్టి ముందు పేర్కొన్న పరిపూర్ణత మార్గాన్ని మనుష్యులు నిరాకరించారు. ఇది ఎందుకంటే, ప్రారంభం నుండి ముగింపు వరకు, మీరు ఈ కార్యం ప్రాముఖ్యతను ఎన్నడూ తెలుసుకోలేదు లేదా దాని ప్రాముఖ్యత గురించి మీరు పట్టించుకోలేదు. మీరు స్థాయిలో మరీ చిన్నవారు మరియు కొద్దిపాటి ఒడిదుడుకులను కూడా తట్టుకోలేరు. మీ సొంత స్థితి మరీ తక్కువగా ఉందని మీకు కనిపించినప్పుడు, మీరు అన్వేషణను కొనసాగించడంలో ప్రతికూలంగా మారతారు మరియు విశ్వాసాన్ని కోల్పోతారు. మనుష్యులు దయను పొందడాన్ని మరియు శాంతిని ఆనుభవించడాన్ని విశ్వాసానికి ప్రతీకలుగా మాత్రమే భావిస్తారు మరియు ఆశీర్వాదాలను కోరుకోవడాన్ని దేవునిపై వారి విశ్వాసానికి ఆధారంగా చూస్తారు. చాలా కొద్దిమంది మనుష్యులు మాత్రమే దేవుడిని తెలుసుకోవాలని లేదా వారి స్వభావాన్ని మార్చుకోవాలని కోరుకుంటారు. వారి విశ్వాసంలో, దేవుడు వారికి అనుకూలమైన గమ్యాన్ని మరియు వారికి అవసరమైన దయనంతా అందించేలా, ఆయనను వారి సేవకునిగా మార్చేలా, ఆయనతో ఎప్పటికైనా ఎలాంటి సంఘర్షణ లేకుండా, శాంతియుతమైన, స్నేహపూర్వకమైన సంబంధాన్ని కొనసాగించేలా చేయాలని మనుష్యులు కోరుకుంటారు. అంటే, దేవునిపై వారికున్న విశ్వాసం, బైబిలులో వారు చదివిన “నేను మీ ప్రార్థనలన్నీ వింటాను” అనే వాక్యములకు అనుగుణంగా, వారి అవసరాలన్నీ తీర్చడానికి మరియు వారు ప్రార్థించేవన్నీ వారికి ప్రసాదించడానికి వాగ్దానం చేయాలని డిమాండ్ చేస్తుంది. దేవుడు ఎవరికీ తీర్పు ఇవ్వకూడదని లేదా ఎవరితోనూ వ్యవహరించకూడదని వారు ఆశిస్తారు, ఎందుకంటే ఆయన అన్నివేళలలో మరియు అన్ని ప్రదేశాలలో మనుష్యులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండే ఎల్లప్పుడూ దయగల రక్షకుడైన యేసు. మనుష్యులు దేవుడిని ఎలా విశ్వసిస్తారో ఇక్కడ చెప్పబడింది: వారు తిరుగుబాటుదారులైనప్పటికీ లేదా విధేయులైనప్పటికీ, ఆయన గుడ్డిగా వారికి ప్రతిదీ ప్రసాదిస్తాడని విశ్వసిస్తూ, వారు సిగ్గు లేకుండా దేవుడిని డిమాండ్ చేస్తారు. ఆయన ఎలాంటి ప్రతిఘటన లేకుండా వారికి తప్పక “బాకీ తీర్చాలి”, అదికూడా రెండింతలు చెల్లించాలని నమ్ముతూ దేవుడి నుండి నిరంతరంగా కేవలం “ఋణాలు వసూలు చేస్తారు”; దేవుడు వారి నుండి ఏదైనా పొందాడా లేదా అనేదానితో సంబంధం లేకుండా, ఎన్నో ఏండ్లు దాచబడిన ఆయన జ్ఞానాన్ని మరియు నీతిబద్ధమైన స్వభావాన్ని ఆయనకు ఇష్టమైనప్పుడల్లా మరియు వారి అనుమతి లేకుండా మనుష్యులకు వెల్లడించడం మాట అటుంచి, ఆయన వారి చేతులలో కేవలం మోసగించబడగలడని మరియు ఆయన మనుష్యులను ఏకపక్షంగా నిర్వహించలేడని వారు అనుకుంటారు. దేవుడు వారి పాపాలను పరిహారం చేస్తాడనీ, అలా చేయడం వల్ల ఆయన అలసిపోడనీ మరియు ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని నమ్ముతూ, వారు కేవలం తమ పాపాలను దేవుడి ముందు అంగీకరిస్తారు. దేవుడు వారి ఆజ్ఞ పాటిస్తాడని నమ్ముతూ, వారు ఆయనను కేవలం ఆజ్ఞాపిస్తారు, ఎందుకంటే దేవుడు మానవాళి నుండి సేవ పొందడానికి రాలేదనీ, వారికి సేవ చేయడానికే వచ్చాడనీ మరియు ఆయన ఇక్కడ వారి సేవకుడిగా ఉన్నాడనీ బైబిలులో చెప్పబడింది. మీరు ఎల్లప్పుడూ ఈ విధంగా విశ్వసించలేదా? మీరు దేవుడి నుండి ఏదైనా పొందలేనప్పుడల్లా, మీరు పారిపోవాలనుకుంటారు; మీకేదైనా అర్థం కానప్పుడు, మీరు ఎంతో కోపాన్ని పెంచుకుంటారు మరియు ఆయనను అన్ని రకాలుగా దుర్భాషలాడేంత వరకు వెళతారు. దేవుడు తనంతతాను తన వివేకాన్ని మరియు అద్భుతాన్ని పూర్తిగా వ్యక్తపరచడానికి మీరు అసలు అనుమతించరు; దానికి బదులుగా, మీరు తాత్కాలిక సుఖం మరియు సౌలభ్యాన్ని ఆస్వాదించాలని మాత్రమే అనుకుంటారు. ఇప్పటి వరకు, దేవుడిని మీరు విశ్వసించే మీ ధోరణిలో కేవలం పాత అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. దేవుడు మీకు ఏమాత్రం కొద్ది మహత్యాన్ని చూపించినా, మీకు దుఃఖం కలుగుతుంది. మీ స్థాయి ఎంత గొప్పదో ఇప్పుడు మీకు సరిగ్గా కనిపిస్తుందా? వాస్తనికి మీ పాత అభిప్రాయాలు మారనప్పుడు మీరు దేవుడికి పూర్తిగా విధేయులని అనుకోకండి. మీకు ఏమీ జరగనప్పుడు, అంతా సజావుగా జరుగుతున్నని మీరు నమ్ముతారు మరియు దేవునిపై మీ ప్రేమ ఉన్నత బిందువుకు చేరుతుంది. మీకు ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు, మీరు పాతాళానికి పడిపోతారు. దేవుడికి విధేయంగా ఉండటం అంటే ఇదేనా?
ఇశ్రాయేలులో విజయకార్యం చివరి దశ ప్రారంభమై ఉంటే, అలాంటి విజయకార్యానికి అర్థం ఉండి ఉండేది కాదు. ఆ కార్యము చైనాలో చేయబడినప్పుడు మరియు మీపై చేయబడినప్పుడు దానికి చాలా ప్రాధాన్యత ఉంది. మీరు మనుష్యులలో అత్యంత అల్పస్థాయి మనుష్యులు, అతి తక్కువ స్థాయి కలిగిన మనుష్యులు; మీరు ఈ సమాజంలో అత్యల్ప స్థాయిలో ఉన్నవారు మరియు మీరు ప్రారంభంలో దేవుడిని అతి తక్కువగా ఒప్పుకున్నవారు. మీరు దేవుని నుండి తప్పిపోయి చాలా దూరం వెళ్లిన మరియు తీవ్రంగా నష్టపోయిన మనుష్యులు. ఈ కార్యపు దశ కేవలం విజయం సాధించడం కోసమే కాబట్టి, ఇది భవిష్యత్తులో సాక్ష్యం ఇచ్చేందుకు మీరు ఎంచుకోవడానికి అత్యంత సరైనది కాదా? విజయకార్యపు మొదటి దశ మీపై చేయబడి ఉండకపోతే, రాబోయే విజయకార్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టమై ఉండేది, ఎందుకంటే ఈరోజు చేయబడుతున్న కార్యపు వాస్తవంపై ఆధారపడి రాబోయే విజయకార్యం ఫలితాలను సాధిస్తుంది. ప్రస్తుత విజయకార్యం మొత్తం విజయకార్యానికి ప్రారంభం మాత్రమే. మీరు జయించబడే మొదటి బ్యాచ్; జయించబడబోయే మానవాళి అందరికి మీరే ప్రతినిధులు. ఈరోజు దేవుడు చేసే కార్యమంతా గొప్పదని మరియు మనుష్యులు వారి సొంత తిరుగుబాటుదనాన్ని తెలుసుకునేలా అనుమతించడమే కాకుండా వారి స్థాయిని కూడా ఆయన వెల్లడిస్తాడని వాస్తవమైన జ్ఞానం ఉన్న మనుష్యులు చూస్తారు. ఆయన వాక్యముల ఉద్దేశ్యం మరియు అర్థం మనుష్యులను భయపెట్టడం లేదా వారిని పడదోయడం కాదు. ఆయన వాక్యముల ద్వారా బోధ మరియు మోక్షం పొందటం వారి చేతుల్లోనే ఉంది; ఇది ఆయన వాక్యముల ద్వారా వారి ఆత్మను మేల్కొల్పడం. ఈ లోకం సృష్టించబడినప్పటి నుండి, మనిషి దేవుడు ఉన్నాడని తెలుసుకోవడంగానీ లేదా విశ్వసించంగానీ చేయకుండా సాతాను ఆదిపత్యంలో జీవించాడు. దేవుని గొప్ప రక్షణలో చేర్చబడగల మరియు దేవునిచే గొప్పగా ఉద్ధరించబడగల ఈ మనుష్యులు నిజంగా దేవుని ప్రేమను చూపుతారు; వాస్తవంగా అర్థం చేసుకునే వారందరూ దీనిని నమ్ముతారు. అలాంటి జ్ఞానం లేనివారి సంగతి ఏమిటి? వారు ఇలా అంటారు: “అయ్యో, మనం మోయాబు వారసులమని దేవుడు చెబుతాడు; దీన్ని ఆయన స్వయంగా తన మాటలలోనే చెప్పారు. అయినప్పటికీ మనం మంచి ఫలితం పొందగలమా? మనం మోయాబు వారసులం మరియు గతంలో మనం ఆయనను ఎదిరించాము. దేవుడు మనల్ని ఖండించడానికే వచ్చాడు; తొలి నుండి ఆయన మనపట్ల ఎలా తీర్పునిచ్చాడో నీవు చూడలేదా? మనం దేవుడిని ప్రతిఘటించాము కాబట్టి, మనం ఇలాగే దండించబడాలి.” ఈ మాటలు సరైనవేనా? ఈరోజు దేవుడు మీపట్ల తీర్పునిస్తాడు, మిమ్మల్ని దండిస్తాడు మరియు మిమ్మల్ని ఖండిస్తాడు, అయితే ఇక్కడ నీవు తప్పక తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, నిన్ను ఖండించడమనేది నిన్ను నీవు తెలుసుకోవడానికే. నిన్ను నీవు తెలుసుగలవేమోనని, నీ స్వభావం మారుతుందేమోనని, అంతేకాకుండా నీ విలువను నీవు తెలుసుకోవడానికి మరియు దేవుడి కార్యములన్నీ నీతివంతమైనవని, ఆయన స్వభావానికి మరియు ఆయన కార్యపు అవసరాలకు అనుగుణమైనవని, ఆయన మనిషికి రక్షణను కలిగించే తన ప్రణాళిక ప్రకారం పని చేస్తాడని మరియు ఆయన మనిషిని ప్రేమించే, రక్షించే, తీర్పునిచ్చే మరియు దండించే నీతివంతుడైన దేవుడని నీవు చూడటానికి ఆయన ఖండిస్తాడు, శపిస్తాడు, తీర్పునిస్తాడు మరియు దండిస్తాడు. నీవు అధమ స్థాయిగలవాడివని, నీవు చెరపబడినవాడివి మరియు అవిధేయుడవని నీకు మాత్రమే తెలిసి, దేవుడు నీకు ఈరోజు ఇచ్చిన తీర్పు మరియు దండనతో ఆయన తన రక్షణను స్పష్టం చేయాలని కోరుకుంటున్నాడని తెలియకపోతే, అప్పుడు నీకు ముందుకు సాగే సామర్థ్యం మాట అటుంచి, అసలు నీకు అనుభవాన్ని పొందే మార్గమే ఉండదు. దేవుడు చంపడానికి లేదా నాశనం చేయడానికి రాలేదు, కానీ తీర్పునివ్వడానికి, శపించడానికి, దండించడానికి మరియు రక్షించడానికి వచ్చాడు. ఆయన 6,000-సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ముగింపునకు వచ్చే వరకు—ఆయన ప్రతి వర్గానికి చెందిన మనిషి ఫలితాన్ని ప్రకటించేదానికి ముందు—లోకంలో దేవుని కార్యం రక్షణ కోసం ఉంటుంది; దాని ఉద్దేశ్యం ఆయనను ప్రేమించే వారిని పూర్తిగా—పరిపూర్ణులుగా చేయడం మరియు వారిని ఆయన ఆధిపత్యంలోకి తీసుకురావడమే. దేవుడు మనుష్యులను ఎలా రక్షించినప్పటికీ, అదంతా వారిని వారి పాత సాతాను స్వభావం నుండి విడగొట్టడం ద్వారా జరుగుతుంది; అంటే, వారు జీవాన్ని అన్వేషించేలా చేయడం ద్వారా ఆయన వారిని రక్షిస్తాడు. వారు అలా చేయకపోతే, దేవుడి రక్షణను అంగీకరించే మార్గమేదీ వారికి ఉండదు. రక్షణ అనేది స్వయంగా దేవుని కార్యమే, మరియు రక్షణను అంగీకరించడానికి జీవం కోసం అన్వేషించడమనేదే మనిషి తప్పనిసరిగా చేయవలసిన పని. మనిషి దృష్టిలో, రక్షణ అనేది దేవుని ప్రేమ, అలాంటప్పుడు దేవుని ప్రేమ అంటే దండన, తీర్పు మరియు శాపాలు కాలేవు; రక్షణలో ప్రేమ, కరుణ మరియు ఓదార్పు మాటలతో పాటు దేవుడు ప్రసాదించిన అంతులేని ఆశీర్వాదాలు తప్పక ఉండాలి. దేవుడు మనిషిని రక్షించినప్పుడు, వారు తమ హృదయాలను దేవునికి సమర్పించగలిగేలా ఆయన తన ఆశీర్వాదాలు మరియు దయతో వారిని కదిలించడం ద్వారా అలా చేస్తాడని మనుష్యులు విశ్వసిస్తారు. అంటే, ఆయన మనిషిని స్పృశించడమంటే వారిని రక్షించడం. ఈ రకమైన రక్షణ ఒక ఒప్పందం ఏర్పర్చుకోవడం ద్వారా జరుగుతుంది. దేవుడు మనిషిని వందరెట్లు అనుగ్రహించినప్పుడు మాత్రమే వారు దేవుని నామమున తమను సమర్పించుకుంటారు మరియు ఆయనకు మేలు చేసేందుకు, ఆయన మహిమపరిచేందుకు ప్రయత్నిస్తారు. దేవుడు మానవజాతి కోసం ఉద్దేశించినది ఇది కాదు. చెరపబడిన మానవజాతిని రక్షించడానికి దేవుడు లోకంలో పని చేయడానికి వచ్చాడు; దీనిలో మోసమేమీ లేదు. అలా ఏమైనా ఉన్నట్లయితే, ఆయన తన కార్యాన్ని వ్యక్తిగతంగా చేయడానికి ఖచ్చితంగా వచ్చి ఉండేవాడు కాదు. గతంలో, ఆయన రక్షణ మార్గంలో అంతులేని ప్రేమ మరియు కరుణ చూపడం ఉండేవి, ఎంతగా అంటే మొత్తం మానవజాతి కోసం ఆయన తన సర్వస్వాన్ని సాతానుకు ఇచ్చాడు. వర్తమానం గతంలాగా ఏమాత్రం లేదు: మనిషి మరింత సంపూర్ణంగా రక్షించబడటానికి, ఈ రోజు మీకు ప్రసాదించబడిన రక్షణ చివరి దినాల సమయంలో, ప్రతిదాన్ని రకాన్ని బట్టి వర్గీకరించే సమయంలో కలుగుతుంది; మీ రక్షణనకు మార్గం ప్రేమ లేదా కరుణ కాకుండా దండన మరియు తీర్పు అయి ఉన్నాయి. ఆ విధంగా, మీరు పొందేదంతా దండన, తీర్పు మరియు కనికరం లేకుండా కొట్టడం మాత్రమే, కానీ ఇది తెలుసుకోండి: ఈ కనికరం లేకుండా కొట్టడంలో కొద్దిగా కూడా శిక్ష లేదు. నా మాటలు ఎంత కఠోరంగా ఉన్నప్పటికీ, మీరు అనుభవించేవి మీకు హృదయరహితంగా అనిపించే కొద్ది మాటలు మాత్రమే మరియు నేను ఎంత ఆగ్రహంగా ఉన్నప్పటికీ, మీపై కురిసేవి ఇప్పటికీ బోధన వాక్యాలే, నా ఉద్దేశం మిమ్మల్ని బాధించడం లేదా మిమ్మల్ని చంపడం కాదు. ఇదంతా యథార్థం కాదా? ఈరోజుల్లో, అది నీతివంతమైన తీర్పయినా, హృదయం లేని శుద్ధీకరణ అయినా మరియు దండనయినా, ప్రతిదీ రక్షణ కోసమేనని తెలుసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కటీ మనిషి రకం లేదా వర్గం ప్రకారం వర్గీకరించబడినట్లు తేటతెల్లం చేయబడినా, దేవుని వాక్యములు మరియు కార్యం ఉద్దేశమంతా దేవుడిని నిజంగా ప్రేమించేవారిని రక్షించడమే. మనిషిని పరిశుద్ధం చేయడానికే నీతివంతమైన తీర్పు తీసుకురాబడింది మరియు వారిని ప్రక్షాళన చేయడానికే హృదయరహిత శుద్ధీకరణ చేయబడింది; కఠోరమైన మాటలు లేదా దండన రెండూ కూడా శుద్ధి చేయడానికి మరియు రక్షణ కోసమే. ఆ విధంగా, నేటి రక్షణ విధానం గతంలో కంటే భిన్నంగా ఉంది. ఈరోజు, మీరు నీతివంతమైన తీర్పు ద్వారా రక్షణ పొందారు మరియు మీలో ప్రతి ఒక్కరినీ రకాన్నిబట్టి వర్గీకరించడానికి ఇది ఒక మంచి సాధనం. అంతేకాకుండా, క్రూరమైన దండన మీ సంపూర్ణ రక్షణనకు దోహదపడుతుంది—మరియు అలాంటి దండన మరియు తీర్పు నేపథ్యంలో మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఆరంభం నుండి అంతం వరకు మీరు ఎల్లప్పుడూ రక్షణను ఆస్వాదించలేదా? మీరు మానావావతారియైన దేవుడిని చూశారు మరియు ఆయన సర్వశక్తిని మరియు వివేకాన్ని తెలుసుకున్నారు; అంతేకాకుండా, మీరు మళ్లీమళ్లీ కొట్టించుకోవడం మరియు క్రమశిక్షణను అనుభవించారు. అయితే, మీరు సర్వోన్నతమైన అనుగ్రహం కూడా పొందలేదా? మీరు పొందిన ఆశీర్వాదాలు మరేవాటికన్నా గొప్పవి కావా? సోలమన్ అనుభవించిన మహిమ మరియు ఐశ్వర్యాల కంటే కూడా మీరు పొందిన అనుగ్రహాలు చాలా గొప్పవి! దీని గురించి ఆలోచించండి: మిమ్మల్ని రక్షించడానికి బదులుగా మిమ్మల్ని ఖండించడం మరియు శిక్షించడమే నా ఉద్దేశమైతే, మీరిన్ని రోజులు ఉండేవారా? శరీరులైనటువంటి పాపాత్ములైన మీరు ఈరోజు వరకు బ్రతికి ఉండగలిగేవారా? మిమ్మల్ని శిక్షించడమే నా లక్ష్యమై ఉంటే, నేను శరీరుడిగా మారి ఇంత గొప్ప కార్యాన్ని ఎందుకు మొదలుపెట్టాల్సి వచ్చింది? మీలాంటి కేవలం మానవమాత్రులను శిక్షించడానికి ఊరికే ఒక్క మాటతో జరిగి ఉండేది కాదా? మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఖండించిన తర్వాత కూడా నేను మిమ్మల్ని నాశనం చేయాల్సిన అవసరముందా? మీరు ఇప్పటికీ నా ఈ మాటలను విశ్వసించడం లేదా? నేను మనిషిని ప్రేమ మరియు కరుణ ద్వారా మాత్రమే రక్షించగలనా? లేదా నేను మనిషిని రక్షించడానికి శిలువ వేయడాన్ని మాత్రమే ఉపయోగించగలనా? నా నీతివంతమైన స్వభావం మనిషిని పూర్తి విధేయుడిగా మార్చడానికి అనుకూలమైనది కాదా? ఇది మనిషిని సంపూర్ణంగా రక్షించగల మరింత సామర్థ్యం గలిగినది కాదా?
నా మాటలు కఠోరంగా ఉన్నప్పటికీ, అవన్నీ మనిషికి రక్షణ కోసమే చెప్పబడ్డాయి, ఎందుకంటే నేను కేవలం వాక్యములను మాత్రమే మాట్లాడుతున్నాను, మనిషి దేహాన్ని శిక్షించం లేదు. ఈ వాక్యములు మనిషి వెలుగులో జీవించేలా చేస్తాయి, వెలుగు ఉందని, వెలుగు అమూల్యమైనదని, అంతేగాకుండా ఈ వాక్యములు వారికి ఎంత ప్రయోజనకరమైనవో మరియు దేవుడు అంటే రక్షణ అని తెలుసుకునేలా చేస్తాయి. నేను దండన మరియు తీర్పు గురించి అనేక వాక్యాలను పలికినప్పటికీ, నిజానికి వాటిలో చేప్పినది ఏదీ మీకు చేయబడలేదు. నేను నా కార్యము చేయడానికి మరియు నా వాక్యములు చెప్పడానికి వచ్చాను, నా వాక్యములు కఠినంగా ఉన్నప్పటికీ, అవి మీ చెడుదనానికి మరియు మీ తిరుగుబాటుకు తీర్పుగా చెప్పబడ్డాయి. నేను చేసే ఈ కార్యం ఉద్దేశం సాతాను ఆధిపత్యం నుండి మనిషిని రక్షించడమే; నేను మనిషిని రక్షించడానికి నా వాక్యాలను ఉపయోగిస్తున్నాను. నా ఉద్దేశం నా వాక్యములతో మనిషికి హాని చేయడం కాదు. నా కార్యంలో ఫలితాలను సాధించడానికి నా వాక్యములు కఠినంగా ఉంటాయి. అలాంటి కార్యం ద్వారా మాత్రమే మనిషి తనను తాను తెలుసుకొనగలడు మరియు తన తిరుగుబాటు స్వభావం నుండి బయటపడగలడు. వాక్యముల కార్యం యొక్క అతిగొప్ప ప్రాధాన్యత ఏమిటంటే, మనుష్యులు సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత దానిని ఆచరణలో పెట్టేలా, వారి స్వభావంలో పరివర్తలను సాధించేలా మరియు తమను గురించి తాము మరియు దేవుని కార్యం గురించి జ్ఞానాన్ని పొందేలా చేయడమే. వాక్యములను చెప్పే పద్ధతిలో కార్యం చేయడం ద్వారా మాత్రమే దేవుడికి మరియు మనిషికి మధ్య కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది మరియు వాక్యములు మాత్రమే సత్యాన్ని వివరించగలవు. ఈ విధంగా కార్యం చేయడం అనేదే మనిషిని జయించటానికి అత్యుత్తమ మార్గం; వాక్యములను చెప్పడం తప్పించి, సత్యము మరియు దేవుని కార్యము గురించి మనుష్యులకు స్పష్టమైన అవగాహన కలిగించే సామర్థ్యం మరే పద్ధతికీ లేదు. ఆ విధంగా, తన కార్యం చివరి దశలో, మనిషి ఇప్పటికీ అర్థం చేసుకోని సత్యాలు మరియు మర్మాలన్నింటినీ విప్పడానికి, దేవుని నుండి నిజమైన మార్గాన్ని మరియు జీవాన్ని పొందటానికి దేవుడు వారికి వీలుకల్పిస్తాడు, ఆవిధంగా ఆయన చిత్తాన్ని సంతృప్తిపరుస్తాడు. మనిషిపై దేవుడి కార్యపు ఉద్దేశం వారు దేవుని చిత్తాన్ని సంతృప్తిపరిచేలా చేయడానికే మరియు ఇది వారికి రక్షణను తీసుకురావడానికే చేయబడుతుంది. కాబట్టి, ఆయన మనిషికి రక్షణ కలిగించే సమయంలో, ఆయన వారిని శిక్షించే పనిని చేయడు. మనిషికి రక్షణ కలిగించేటప్పుడు, దేవుడు చెడుతనాన్ని శిక్షించడు లేదా మంచితనానికి బహుమానమివ్వడు, అంతేగాకుండా వివిధ రకాల మనుష్యుల గమ్యాలను వెల్లడించడు. దానికి బదులుగా, ఆయన కార్యం చివరి దశ పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన చెడుతనాన్ని శిక్షించే మరియు మంచితనానికి బహుమానమిచ్చే కార్యం చేస్తాడు మరియు అప్పుడే ఆయన విభిన్నరకాల మనుష్యుల ముగింపులను వెల్లడిస్తాడు. నిజానికి ఎవరైతే రక్షించబడలేరో వారే శిక్షించబడతారు, అదే దేవుడు మనిషికి రక్షణ కలిగించే సమయంలో దేవుడి రక్షణను పొందిన వారే రక్షించబడతారు. దేవుడి రక్షణ కార్యం జరుగుతున్నప్పుడు, రక్షింపబడగలిగే ప్రతి ఒక్క వ్యక్తి వీలైనంతవరకు రక్షించబడతాడు మరియు వారిలో ఎవరూ తోసివేయబడరు, ఎందుకంటే దేవుడి కార్యం ఉద్దేశం మనిషిని రక్షించడమే. దేవుడు మనిషికి రక్షణ అందించే సమయంలో, తమ స్వభావంలో పరివర్తన సాధించలేని వారందరూ—మరియు దేవుడికి పూర్తిగా సమర్పించుకోని వారందరూ—శిక్షకు పాత్రులు అవుతారు. కార్యం యొక్క ఈ దశ—వాక్యముల కార్యం—మనుష్యులు దేవుని చిత్తాన్ని మరియు వారి నుండి దేవుడు ఆశించిన వాటిని అర్థం చేసుకోగలిగేలా, వారు దేవుని వాక్యములను ఆచరణలో పెట్టడానికి మరియు వారి స్వభావంలో పరివర్తనలను సాధించడానికి అవసరమైన ముందస్తు అర్హతలను పొదగలగడానికి వీలుగా వారికి అర్థంకాని అన్ని మార్గాలను మరియు మర్మాలను విప్పుతుంది. దేవుడు తన కార్యాన్ని చేయడానికి వాక్యములను మాత్రమే ఉపయోగిస్తాడు మరియు కొద్దిపాటి తిరుగుబాటుతనానికి మనుష్యులను శిక్షించడు; ఇలా చేయడం ఎందుకంటే, ఇప్పుడు రక్షణ కార్యపు సమయం. తిరుగుబాటుగా ప్రవర్తించిన వారెవరైనా శిక్షించబడితే, అప్పుడు ఎవరికీ రక్షణ పొందే అవకాశం ఉండదు; ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు మరియు పాతాళంలోకి పడిపోతారు. మనిషికి తీర్పునిచ్చే వాక్యముల ఉద్దేశం, వారు తమను తాము తెలుసుకొని దేవునికి సమర్పించుకునేలా చేయడం; అలాంటి తీర్పుతో వారిని శిక్షించడం కాదు. వాక్యముల కార్యం సమయంలో, అనేకమంది మనుష్యులు తమ తిరుగుబాటుతనాన్ని, ధిక్కారాన్ని మరియు శరీరధారియైన దేవుని పట్ల వారి అవిధేయతను వెల్లడిస్తారు. అయినప్పటికీ, దీని ఫలితంగా ఆయన మనుష్యులందరినీ శిక్షించడు, దానికి బదులుగా పూర్తిగా చెరిపివేయబడిన వారిని మరియు రక్షింపబడలేని వారిని మాత్రమే పక్కనపెడతాడు. ఆయన వారి దేహాన్ని సాతానుకు ఇస్తాడు మరియు కొన్ని సందర్భాలలో, వారి దేహాన్ని పరిసమాప్తం చేస్తాడు. మిగిలిన వారు వెంబడించడం కొనసాగిస్తారు మరియు చర్య తీసుకోవడాన్ని మరియు తీర్చిదిద్దడాన్ని అనుభవిస్తారు. ఒకవేళ, వెంబడిస్తున్నప్పుడు, ఈ మనుష్యులు ఇప్పటికీ చర్య తీసుకోవడాన్ని మరియు తీర్చిదిద్దడాన్ని అంగీకరించలేకపోతే మరియు ఇంకా ఇంకా దిగజారిపోతే, వారు రక్షణకు అవకాశం కోల్పోతారు. దేవుని వాక్యములచే జయించబడటానికి సమర్పించుకున్న ప్రతి మనిషికి రక్షణ పొందడానికి తగినంత అవకాశం ఉంటుంది; ఈ మనుష్యులలో ప్రతి ఒక్కరికి దేవుని రక్షణ అనేది ఆయన అత్యంత సానుభూతిని తెలియజేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, వారికి అత్యంత సహనం చూపబడుతుంది. మనుష్యులు చెడు మార్గం నుండి వెనక్కు తిరిగినంత కాలం మరియు వారు పశ్చాత్తాపం పడగలిగినంత కాలం, దేవుడు వారికి తన రక్షణను పొందే అవకాశాలను ఇస్తాడు. మనుష్యులు మొదటిసారి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, వారు మరణం పొందేలా చేయాలనే కోరిక ఆయనకు లేదు; దానికి బదులుగా, వారిని రక్షించడానికి ఆయన చేయగలిగినదంతా చేస్తాడు. ఎవరికైనా రక్షణ పొందడానికి నిజంగా అవకాశం లేకపోతే, దేవుడు వారిని పక్కన పెడతాడు. దేవుడు కొందరిని శిక్షించడంలో నిదానంగా ఉండడానికి కారణం ఏమంటే, రక్షింపబడగలిగే ప్రతి ఒక్కరినీ రక్షించాలని ఆయన అనుకుంటాడు. ఆయన మనుష్యులకు కేవలం వాక్యములతో తీర్పునిస్తాడు, బోధ కలిగిస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు మరియు వారిని చంపడానికి దండము ఉపయోగించడు. కార్యం చివరి దశ యొక్క ఉద్దేశం మరియు ప్రాధాన్యత మనుష్యులకు రక్షణ తీసుకురావడానికి వాక్యములను ఉపయోగించడమే.