మీ భవిష్యత్తు పరిచర్యకు మీరు ఎలా హాజరు కావాలి?

ప్రతి యుగంలోనూ, ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో దేవుని ద్వారా వ్యక్తీకరించబడిన స్వభావాన్ని, ఆ యుగ ప్రాముఖ్యతకు తగినట్లుగా వ్యక్తీకరించే భాషలోనే నీవు తెలియజేయగలుగుతున్నావా? అంత్య దినములలో దేవుని కార్య అనుభవాన్ని పొందుకున్న మీరు దేవుని నీతి స్వభావాన్ని గురించి సవివరంగా వర్ణించగలరా? దేవుని స్వభావం గురించి మీరు స్పష్టంగా మరియు ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వగలరా? నీతి కొరకు ఆకలిదప్పులతో మరియు వారికి మీరు కాపరిగా ఉంటారని మీకోసం ఎదురు చూస్తున్న ఆ దీన, పేద మరియు భక్తి గల మత విశ్వాసులకు మీరు చూసిన దానిని మరియు అనుభవించిన దానిని ఏ విధంగా అందిస్తారు? మీరు కాపరిగా ఉండాలని ఎలాంటి వ్యక్తులు నిరీక్షిస్తున్నారు? నీవు ఊహించగలవా? మీ భుజాలపై ఉంచబడిన భారము, మీకివ్వబడిన ఆజ్ఞ మరియు మీకివ్వబడిన బాధ్యతల విషయమై మీరు అవగాహన కలిగియున్నారా? చారిత్రక పరిచర్య గురించిన మీ జ్ఞానం ఎక్కడ ఉంది? తదుపరి యుగంలో ఒక యజమానిగా మీరు తగినంతగా ఎలా సేవ చేస్తారు? మీకు యాజమాన్య నైపుణ్యానికి సంబంధించిన బలమైన జ్ఞానము ఉందా? సమస్త విషయాలకు ఆధారమైన యజమాని గురించి మీరు ఏ విధంగా వివరిస్తారు? ప్రపంచంలోని అన్ని జీవములకు మరియు భౌతిక అంశాలకు నిజమైన యజమాని ఆయనే కాదా? పరిచర్యలోని తదుపరి దశ పురోగతి కొరకు మీకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ఎంత మంది ప్రజలు తమ కాపరిగా మీ కొరకు ఎదురుచూస్తున్నారు? మీకివ్వబడిన పని భారమైనదా? వారు పేదవారు, దీనులు, గ్రుడ్డివారు, నష్టంలో ఉన్నవారు, చీకటిలో విలపిస్తున్నవారు—ఇలాంటివారికి మార్గం ఎక్కడ ఉంది? ఒక ఉల్క వలె, అకస్మాత్తుగా క్రిందకు దిగి ఎన్నో సంవత్సరాలుగా మానవుని బాధిస్తున్న చీకటి శక్తులను పారద్రోలే కాంతి కొరకు వారు ఎంతగానో ఆరాటపడుతున్నారు. దీని కొరకు రాత్రి పగలు దుఃఖముతో ఏ మేరకు వారు ఆతృతతో నిరీక్షిస్తున్నారో ఎవరికి తెలుసు? తీవ్రంగా బాధించబడ్డ ఈ ప్రజలు వెలుగు ప్రకాశించిన రోజు కూడా విడుదల అనే భరోసా కరువై చీకటి చెరసాలలోనే ఉండిపోతారు; వారి ఏడుపు ఎప్పుడాగుతుంది? విశ్రాంతికి నోచుకోలేని ఈ బలహీనమైన ఆత్మల దురవస్థ చాలా భయంకరమైనది మరియు కనికరంలేని బంధకాలు మరియు ఘనీభవించిన చరిత్ర ద్వారా వారు చాలా కాలంగా ఈ స్థితిలో బంధించబడ్డారు. మరియు వారి ఏడుపు శబ్దమును ఎవరు విన్నారు? వారి దయనీయమైన స్థితిని ఎవరు చూశారు? దేవుని హృదయం ఎంత దుఃఖించిందో మరియు చింత పడిందో మీకు అర్థమైందా? ఆయన తన స్వహస్తాలచే సృష్టించిన ఈ మానవాళి ఈ విధంగా బాధను అనుభవించటం ఆయన ఎలా భరించగలడు? ఎంతైనా మానవులు విషపూరితం గావించబడిన బాధితులు. మరియు మానవుడు ఈ రోజు వరకూ జీవించి ఉన్నప్పటికీ, దుష్టునిచే ఎంతో కాలం క్రితమే విషపూరితం చేయబడ్డాడని ఎవరికి తెలుసు? అలాంటి బాధితుల్లో మీరూ ఒకరిని మర్చిపోయారా? ఈ బాధితులను రక్షించడం కోసం శ్రమ పడడానికి, దేవుడి కోసం మీ ప్రేమను అందించడానికి మీరు సిద్ధంగా లేరా? తన స్వంత శరీరము మరియు రక్తము వలె మానవాళిని ప్రేమించిన దేవునికి మీ పూర్తి శక్తిని తిరిగి చెల్లించడానికి మీరు సిద్ధంగా లేరా? అంతా చెప్పి మరియు చేయటం జరిగినప్పుడు, మీరు అసాధారణమైన జీవితాన్ని జీవించడానికి దేవునిచే ఉపయోగించబడటాన్ని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు? దేవునికి సేవ చేసే వ్యక్తిగా ఉండడానికి మరియు భక్తితో కూడిన అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి నీవు సంకల్పం మరియు నిశ్చయతను కలిగియున్నావా?

మునుపటి:  విజయ కార్యపు అంతర్గత సత్యము (4)

తరువాత:  ఆశీర్వాదాల పట్ల మీ అవగాహన ఎంత?

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger