విజయ కార్యపు అంతర్గత సత్యము (4)

పరిపూర్ణంగా చేయబడటం అంటే ఏమిటి? జయించబడటం అంటే ఏమిటి? ప్రజలు జయించడానికి ఎటువంటి ప్రమాణమును తప్పక పాటించాలి? పరిపూర్ణులవడానికి ఎటువంటి ప్రమాణమును తప్పక పాటించాలి? జయించడం మరియు పరిపూర్ణమవడం అనేది రెండు ప్రక్రియలు మనుష్యుని సంపూర్ణునిగా చేయుటకే ఉద్దేశించబడ్డాయి. తద్వారా అతను తన నిజ స్వరూపమును తిరిగి పొందుకుంటాడు, మరియు సాతాను ప్రభావము నుండి మరియు భ్రష్ట సాతాను స్వభావము విడుదల పొందుకుంటాడు. జయించడం అనే ఈ కార్యము, మనిషి కార్యపు ప్రక్రియలో ప్రారంభ దశలోనే వస్తుంది; నిజానికిది జరిగించు కార్యములో మొదటి దశయైయున్నది. పరిపూర్ణులను చేయడం అనేది రెండవ దశ, ఇదే కార్యపు ముగింపుయైయున్నది. ప్రతి మానవుడు జయించే ప్రక్రియ గుండా తప్పక ప్రయాణించాలి. లేకుంటే, వారికి దేవుని గురించి తెలుసుకునే మార్గం ఉండదు, లేదా వారికి దేవుడు ఉన్నాడని కూడా తెలియదు, అనగా వారిని దేవుణ్ణి గుర్తించడం అసాధ్యం. ప్రజలు దేవుణ్ణి గుర్తించడం అసాధ్యమైతే, వారు దేవుని ద్వారా సంపూర్ణులుగా చేయబడడం కూడా అసాధ్యమే, ఎందుకంటే సంపూర్ణముగా చేయబడే ఈ ప్రక్రియ ప్రమాణమును నువ్వు అందుకోలేదు. నువ్వు దేవుణ్ణి కూడా గుర్తించలేకపోయినట్లయితే, ఆయనను నీవు ఎలా తెలుసుకోగలవు? నీవు ఆయనను ఎలా వెంబడించగలవు? నువ్వు ఆయనకు సాక్ష్యమును కలిగి ఉండలేవు, లేక ఆయనను మెప్పించడానికి నీవు తక్కువ విశ్వాసమును కలిగియుంటావు. కాబట్టి, సంపూర్ణునిగా చేయబడాలనుకునే ఎవరైనా, తప్పక జయించు కార్యము గుండా మొదటి అడుగు వేయవలసిందే. ఇదే మొదటి షరతు. అయితే జయించడం మరియు పరిపూర్ణం చేయడం అనే రెండు ప్రక్రియలు ప్రజల మధ్యన కార్యము చేయుటలోను మరియు వారిని మార్చడములో భాగమైయున్నాయి. మరియు ప్రతి ఒక్కటి మనిషిని నిర్వహించే పనిలో భాగమే. ఎవరినైనా సంపూర్ణులుగా మార్చడానికి ఈ రెండు దశలు అవసరం మరియు వీటిలో ఏ ఒక్కదానినీ నిర్లక్ష్యం చేయకూడదు. “జయించినవారిగా ఉండడం” అనేది అంత మంచిగా ఉండదనేది నిజం, అయితే వాస్తవానికి, ఎవరినైనా జయించడం అనే ప్రక్రియ వారిని మార్చే ప్రక్రియైయున్నది. నీవు జయించిన తర్వాత, నీ చెడు స్వభావము పూర్తిగా తొలగించబడకపోవచ్చు, కానీ అది నీకు తెలుస్తుంది. జయించు కార్యము ద్వారా, నీవు నీ అల్పమైన మానవత్వంతోపాటు నీ సొంత అవిధేయత గురించి కూడా తెలుసుకుంటావు. జయించు కార్యమనే స్వల్పకాలం లోపు ఈ విషయాలను నీవు వదిలివేయలేకపోయినా లేదా మార్చలేక పోయినా, నీవు వాటిని తెలుసుకుంటావు మరియు ఇది నీ పరిపూర్ణతకు పునాది వేస్తుంది. కాబట్టి, జయించడం మరియు పరిపూర్ణుడిగా చేయడం అనేవి రెండూ ప్రజలు తమనుతాము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోగలిగేలా వారిని మార్చడానికి, చెడు సాతాను స్వభావాల నుండి వదిలించడానికి చేయబడతాయి. జయించడం అనేది కేవలం ప్రజల స్వభావాలను మార్చడంలో వేసే మొదటి అడుగు, అలాగే ప్రజలు తమను తాము పూర్తిగా దేవునికి సమర్పించుకోవడంలో కూడా వేసే మొదటి అడుగు మరియు ఇది పరిపూర్ణుడిగా చేయబడే దశ కంటే తక్కువైనది. పరిపూర్ణుడిగా చేయబడిన వ్యక్తి కంటే జయించిన వ్యక్తి యొక్క జీవిత స్వభావము చాలా తక్కువ మారుతుంది. జయించడం మరియు పరిపూర్ణముగా చేయడం అనేవి ఒకదానికొకటి సైద్ధాంతికంగా భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే అవి కార్యములో విభిన్న దశలు మరియు అవి ప్రజలకు విభిన్న విలువలను కనుబరుస్తాయి; విజయం ప్రజలను తక్కువ ప్రమాణాలలో ఉంచుతుంది, అదే పరిపూర్ణత వారిని ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. పరిపూర్ణులుగా చేయబడిన వారు నీతిమంతులు, మరియు పరిశుద్ధులైయున్నారు; వారు మానవత్వపు నిర్వహణ కార్యపు స్ఫటికీకరణలుగా ఉన్నారు లేదా అంతిమ ఫలాలైయున్నారు. వారు పరిపూర్ణులు కాకపోయినప్పటికీ, వారు అర్థవంతమైన జీవితాలను గడపాలని కోరుకునేవారు. అదే సమయంలో, జయించినవారు, దేవుడి అస్థిత్వాన్ని మాటల్లో మాత్రమే అంగీకరిస్తారు; దేవుడు శరీరధారిగా వచ్చాడని మరియు వాక్యము దేహంలో కనిపించిందని మరియు తీర్పు తీర్చడానికి మరియు శిక్షించడానికి దేవుడు భూమిపైకి వచ్చాడని వారు అంగీకరిస్తారు. దేవుని తీర్పును మరియు ఆయన శిక్షను కూడా అంగీకరిస్తారు. ఆయన దండనను మరియు శుద్ధీకరణను, మానవునికి ప్రయోజనకరమైనవాటిని వారు అంగీకరిస్తారు. వారు ఇటీవలే కొంతమేరకు మానవ పోలికలోనికి రావడం ప్రారంభించారు. వారికి జీవితం పట్ల కొన్ని ఆలోచనలను ఉన్నాయి, కానీ ఇంకా వారికి అది మసకగా ఉంది. మరోలా చెప్పాలంటే, వారు మానవత్వాన్ని సంతరించుకోవడం ఇప్పుడే ప్రారంభించారు. జయించడం యొక్క ప్రభావాలు ఇలా ఉంటాయి. ప్రజలు పరిపూర్ణత మార్గంలో అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు, వారి పాత స్వభావాలు మార్చబడతాయి. అంతేగాకుండా, వారి జీవితాలు ఎదుగుతూ ఉంటాయి మరియు వారు క్రమేపి సత్యము లోనికి మరింత లోతుగా ప్రవేశిస్తారు. వారు ప్రపంచాన్ని మరియు సత్యాన్ని అనుసరించని వారందరినీ అసహ్యించుకుంటారు. మరీ ముఖ్యంగా వారు తమను తాము అసహ్యించుకుంటారు, కానీ అంతకు మించి, వారు తమను తాము స్పష్టంగా తెలుసుకుంటారు. వారు సత్యాన్నిబట్టి జీవించాలని కోరుకుంటారు మరియు సత్యాన్ని వెంబడించడమే తమ లక్ష్యంగా చేసుకుంటారు. వారు తమ సొంత మెదళ్ల మధ్యన పుట్టే ఆలోచనలలో జీవించడానికి ఇష్టపడరు మరియు వారు మానవుని స్వనీతిని, గర్వాన్ని మరియు స్వీయ ప్రశంసను అసహ్యించుకుంటారు. వారు దృఢమైన ఔచిత్య భావనతో మాట్లాడతారు, జ్ఞానము మరియు వివేకంతో విషయాలను నిర్వహిస్తారు, మరియు దేవునికి విశ్వాసపాత్రులుగా మరియు విధేయులుగా ఉంటారు. వారు శిక్ష మరియు తీర్పు సందర్భాన్ని అనుభవిస్తే, వారు ఉదాసీనంగా లేదా బలహీనంగా మారకపోవడమే కాకుండా, దేవుని నుండి వచ్చిన ఈ శిక్ష మరియు తీర్పుపట్ల వారు కృతజ్ఞతతో ఉంటారు. దేవుని శిక్ష మరియు తీర్పు లేకుండా తాము ఉండలేమని మరియు అవి తమను రక్షిస్తాయని వారు నమ్ముతారు. వారు శాంతి మరియు ఆనందం ఇచ్చే విశ్వాసమును మరియు ఆకలిని తీర్చుకోవడానికి రొట్టెను వెంబడిస్తారు. అలా కాకపోతే, వారు క్షణికమైన శారీరక ఆనందాలను వెంబడిస్తారు. పరిపూర్ణులుగా మారిన వారిలో జరిగేది ఇదే. ప్రజలు జయించిన తర్వాత, వారు దేవుడున్నాడని అంగీకరిస్తారు, కానీ వారిలో అలా గుర్తించడమనేది కొన్ని విషయాల్లో మాత్రమే కనబడుతుంది. అసలు శరీరములో వాక్యము ప్రత్యక్షమగుట అంటే అర్థం ఏమిటి? శరీరధారిగా రావడం అంటే ఏమిటి? శరీరధారియైన దేవుడు ఏమి చేశాడు? ఆయన కార్యపు లక్ష్యం మరియు ప్రాముఖ్యత ఏమిటి? ఆయన కార్యాన్ని ఎంతో అనుభవించిన తర్వాత, దేహంలో ఆయన కార్యములను అనుభవించిన తర్వాత, నీవు ఏమి పొందుకున్నావు? ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్న తర్వాతనే నీవు జయించిన వ్యక్తివవుతావు. నీవు వదిలివేయాల్సినవి వదిలివేయకుండా మరియు నీవు వదులుకోవాల్సిన శారీరక ఆనందాలను వదులుకోకుండా, నీవు ఎప్పటిలాగే అనుభవిస్తున్న శరీర సుఖాలను అనుభవిస్తూ ఉంటే మరియు నీవు సోదరసోదరీమణులకు వ్యతిరేకంగా ఏవైనా దురభిప్రాయాలను వదిలివేయలేకపోతే మరియు అనేక సాధారణ ఆచరణలను కొనసాగించడానికి ఎలాంటి మూల్యం చెల్లించుకోకపోతే, కేవలం దేవుడున్నాడని నీవు అంగీకరించినట్లు చెబితే, నీవు ఇంకా జయించని వ్యక్తివని రుజువు చేస్తుంది. అలాంటి సందర్భంలో, నీవు అర్థం చేసుకునేది ఎంతో ఉన్నప్పటికీ, అదంతా వ్యర్థం. జయించినవారు అంటే కొన్ని తొలి మార్పులను మరియు తొలి ప్రవేశాన్ని సాధించిన వ్యక్తులు అని అర్థం. దేవుని తీర్పు మరియు శిక్షను అనుభవించడం అనేది ప్రజలకు దేవుని గురించి తొలి జ్ఞానాన్ని మరియు సత్యాన్ని గురించి తొలి అవగాహనను అందిస్తుంది. నీవు లోతైన, మరింత సవివరమైన సత్యాల వాస్తవికతలోకి పూర్తిగా ప్రవేశించలేకపోవచ్చు, కానీ నీ నిజ జీవితంలో నీవు నీ శరీర ఆనందాలు లేదా మీ వ్యక్తిగత హోదాలు లాంటి అనేక మౌలిక సత్యాలను ఆచరణలో పెట్టగలరు. ఇవన్నీ జయించే ప్రక్రియలో ప్రజలలో కనబడే ప్రభావం. జయించిన వారి స్వభావములో మార్పులను కూడా చూడవచ్చు; ఉదాహరణకు, వారు దుస్తులు ధరించే విధానం, తమను తాము ప్రదర్శించుకునే విధానం మరియు వారు జీవించే విధానం—ఇవన్నీ మారవచ్చు. దేవునిపట్ల వారికున్న విశ్వాసపు దృష్టికోణం మారుతుంది, వారి సాధన లక్ష్యాల గురించి వారిలో స్పష్టత ఉంటుంది మరియు వారికి ఉన్నత ఆకాంక్షలు ఉంటాయి. విజయం యొక్క కార్యము జరుగు సమయంలో, వారి జీవిత స్వభావంలో కూడా సంబంధిత మార్పులు వస్తాయి. మార్పులు ఉన్నాయి, కానీ అవి సారహీనమైనవి, ప్రాథమికమైనవి మరియు పరిపూర్ణత పొందిన వారి స్వభావము మరియు సాధన లక్ష్యాలలో మార్పుల కంటే చాలా తక్కువ స్థాయిగలవి. జయించే కార్యములో ఒక వ్యక్తి స్వభావం ఏ మాత్రం మారకపోతే మరియు వారు ఎలాంటి సత్యాన్ని పొందకపోతే, అతడు వ్యర్థుడు మరియు ఆ వ్యక్తి పూర్తిగా పనికిరానివాడు! జయించని వ్యక్తులు పరిపూర్ణులుగా చేయబడలేరు! ఒక వ్యక్తి జయించాలని మాత్రమే కోరుకుంటే, విజయం యొక్క కార్యము సమయంలో వారి స్వభావాలలో కొన్ని సంబంధిత మార్పులు కనిపించినప్పటికీ, వారు పూర్తిగా పరిపూర్ణులుగా చేయబడలేరు. వారు పొందిన తొలి సత్యాలను కూడా వారు కోల్పోతారు. జయించినవారు మరియు పరిపూర్ణులుగా చేయబడినవారి స్వభావాలలో వచ్చిన మార్పుల మధ్య చాలా తేడా ఉంటుంది. కానీ మార్పులో జయించడం అనేది తొలి మెట్టు; అదే పునాది. ఒక వ్యక్తికి దేవుని గురించి ఏమాత్రం తెలియదు అనడానికి ఈ తొలి మార్పు లేకపోవడం అనేది ఒక రుజువు, ఎందుకంటే ఈ జ్ఞానం తీర్పు నుండి వస్తుంది మరియు అలాంటి తీర్పు విజయం యొక్క కార్యములో ప్రధాన భాగం. కాబట్టి, పరిపూర్ణులుగా చేయబడిన వారందరూ మొదట జయించిన వారుగా ఉండాలి; లేకపోతే, పరిపూర్ణులవడానికి వారికి ఎటువంటి మార్గం లేదు.

నువ్వు శరీరధారియైన దేవుడిని మరియు శరీరములో వాక్యము ప్రత్యక్షమగుటను గుర్తించావని చెబుతావు, కానీ నీవు ఆయన వెనుక కొన్ని పనులు చేస్తావు, ఆయన అడిగే వాటికి వ్యతిరేకమైన పనులు చేస్తావు మరియు నీ హృదయంలో ఆయన అంటే నీకు భయం లేదు. దేవుడిని గుర్తించడం అంటే ఇదేనా? ఆయన చెప్పేదానిని నీవు అంగీకరిస్తావు, కానీ నీవు చేయగలిగిన వాటిని ఆచరించవు లేదా ఆయన మార్గానికి నీవు కట్టుబడి ఉండవు. ఇదేనా దేవుణ్ణి అంగీకరించడమంటే? నీవు ఆయనను అంగీకరించినప్పటికీ, నీ మనస్తత్వం ఆయనపట్ల అప్రమత్తంగా మాత్రమే ఉంటుంది, ఎప్పుడూ గౌరవ భావముతో ఉండదు. నీవు ఆయన కార్యాన్ని చూసి, అంగీకరించి మరియు ఆయన దేవుడని తెలుసుకున్నప్పటికీ నీవు నిరుత్సాహంగా మరియు సంపూర్ణంగా మారకుండా ఉంటే, అప్పుడు నీవు ఇంకా జయము పొందని వ్యక్తిలాంటి వాడివే. జయించిన వారందరూ తాము చేయగలిగినదంతా తప్పక చేయాలి మరియు వారు ఉన్నత సత్యాలలోకి ప్రవేశించలేకపోయినప్పటికీ, ఈ సత్యాలు వారికి అతీతంగా ఉన్నప్పటికీ, అలాంటి వ్యక్తులు దీనిని సాధించాలని తమ హృదయాలలో కోరుకుంటూ ఉంటారు. ఇది ఎందుకంటే, వారు అంగీకరించగలిగిన వాటికి పరిమితులు ఉంటాయి, వారు ఆచరించగలిగే వాటికి హద్దులు మరియు పరిమితులు ఉన్నాయి. అయితే, కనీసంగా, వారు చేయగలిగినదంతా తప్పక చేయాలి, నీవు అది సాధించగలిగితే, అది విజయం యొక్క కార్యమువలననే సాధించిన ప్రభావంగా ఎంచబడుతుంది. “మానవుడు చెప్పలేని అనేక మాటలను ఆయన చెప్పగలడు కాబట్టి, ఆయన దేవుడు కాకపోతే ఇంకెవరు?” అని నీవు అన్నావనుకుందాం అలాంటి ఆలోచనకు అర్థం నీవు దేవుణ్ణి అంగీకరిస్తున్నావని కాదు. నీవు దేవుణ్ణి అంగీకరిస్తే, నీవు నీ నిజమైన క్రియల ద్వారా దానిని తప్పక తెలియజేయాలి. నీవు ఒక చర్చిని నడిపిస్తూ, నీతిని అభ్యసించకుండా ఉన్నట్లయితే, నీవు డబ్బు మరియు సంపద కోసం వెంపర్లాడితే, మరియు సంఘ నిధులను ఎల్లప్పుడూ నీ కోసం నీ జేబులను నింపుకుంటూ ఉన్నట్లయితే, దేవుడు ఉన్నాడని నీవు గుర్తించినట్లవుతుందా? దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గౌరవించబడటానికి అర్హుడు. దేవుడు ఉన్నాడని నీవు నిజంగా అంగీకరిస్తే, నీవు ఎలా భయపడకుండా ఉండగలవు? నీవు అటువంటి హేయమైన పనులకు పాల్పడగలిగితే, నీవు ఆయనను నిజంగా గుర్తించావా? నీవు విశ్వసించేది దేవుడినేనా? నీవు విశ్వసించేది ఒక అస్పష్టమైన దేవుణ్ణి మాత్రమే; కాబట్టే నీకు భయం లేదు! దేవుణ్ణి నిజంగా గుర్తించి మరియు తెలుసుకున్న వారందరూ ఆయనకు భయపడతారు మరియు ఆయనకు విరుద్ధమైనవాటిని చేయడానికి, లేదా వారి మనస్సాక్షిని అతిక్రమించే ఏదైనా చేయడానికి భయపడతారు; దేవుని చిత్తానికి వ్యతిరేకమైనదని వారికి తెలిసిన ఏ పనినైనా చేయడానికి వారు ప్రత్యేకించి భయపడతారు. దీనినే దేవుని అస్థిత్వాన్ని అంగీకరించడంగా పరిగణించబడుతుంది. నీ తల్లిదండ్రులు నిన్ను దేవుణ్ణి విశ్వసించకుండా ఆపడానికి ప్రయత్నించినప్పుడు నీవు ఏమి చేయాలి? అవిశ్వాసియైన నీ భర్త నీతో మంచిగా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? నీ సోదర సోదరీమణులు నిన్ను అసహ్యించుకున్నప్పుడు నీవు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? నీవు ఆయనను అంగీకరిస్తే, నీవు ఈ విషయాలలో చక్కగా నడుచుకుంటావు మరియు వాస్తవికంగా జీవిస్తావు. నీవు గట్టి చర్యలు తీసుకోకుండా, కేవలం దేవుని ఉనికిని అంగీకరిస్తున్నట్లు చెబితే, అప్పుడు నీవు కేవలం మాటలు చెప్పేవాడివిగా మాత్రమే ముద్రించబడతావు! నీవు ఆయనను విశ్వసిస్తున్నానని మరియు ఆయనను అంగీకరిస్తున్నానని అంటావు, కానీ నీవు ఆయనను ఏ విధంగా అంగీకరిస్తావు? నీవు ఆయనను ఏ విధంగా విశ్వసిస్తావు? నువ్వు ఆయనకు భయపడుచున్నావా? నీవు ఆయనను గౌరవిస్తున్నావా? నీ హృదయంలో లోతుగా ఆయనను ప్రేమిస్తున్నావా? నీవు బాధలలో ఉన్నప్పుడు మరియు ఆధారపడటానికి ఎవరూ లేనప్పుడు, నువ్వు దేవుని ప్రేమానురాగాలను పొందుతావు, కానీ తర్వాత అదంతా నీవు మరచిపోతావు. దేవుణ్ణి ప్రేమించడం అంటే అది కాదు, దేవుణ్ణి విశ్వసించడమంటే కూడా అది కాదు! అంతిమంగా, మానవుడు ఏమి సాధించాలని దేవుడు కోరుకుంటాడు? నీ సొంత ప్రాముఖ్యతను చూసి చాలా ప్రభావితమవ్వడం, నీవు కొత్త విషయాలను త్వరగా గ్రహిస్తావని మరియు అర్థం చేసుకుంటావని అనుకోవడం, ఇతరులను నియంత్రించడం, ఇతరులను తక్కువగా చూడటం, కనిపించేదానిని బట్టి ఇతరులపై అభిప్రాయం ఏర్పర్చుకోవడం, నిష్కపట వ్యక్తులను బెదిరించడం, సంఘ డబ్బును ఆశించడంలాంటి మరియు మొదలైన నేను పేర్కొన్న అన్నిటిని, అంటే, ఈ చెడు సాతాను స్వభావాలన్నింటినీ సమూలంగా నీ నుండి తొలగించబడినప్పుడు మాత్రమే, నీ విజయం స్పష్టంగా గోచరిస్తుంది.

మీపై జరిగించబడిన విజయపు కార్యము చాలా ప్రాముఖ్యమైనది: ఒక రకంగా, ఈ కార్యము యొక్క ఉద్దేశం ఏమనగా ప్రజల గుంపును పరిపూర్ణులుగా చేయుటయైయున్నది, వారిని పరిపూర్ణులనుగా చేయడమంటే వారు జయించిన వారి గుంపుగా మారడమే—ప్రథమ ఫలాలుగా అర్థమిచ్చే సంపూర్ణులుగా చేయబడిన మొదటి గుంపుగా మారడమన్నమాట. మరో రకంగా, సృష్టించబడిన జీవులు దేవుని ప్రేమను ఆస్వాదించేలా చేయుటయైయున్నది, దేవుని సంపూర్ణమైన గొప్ప రక్షణను పొందేలా చేయుటయైయున్నది, మానవుడు కరుణ మరియు ప్రేమతో కూడిన దయను మాత్రమే కాకుండా, మరీ ముఖ్యంగా శిక్ష మరియు తీర్పును పొందుకొనునట్లు చేయుటయైయున్నది. విశ్వం సృష్టించబడినప్పటి నుండి ఇప్పటివరకు, దేవుడు తన కార్యములో చేసినదంతా మానవుని పట్ల ఎలాంటి ద్వేషం లేకుండా ప్రేమను మాత్రమే పంచాడు. నీవు చూసిన శిక్ష మరియు తీర్పులనేవి కూడా ప్రేమే, ఒక సత్యమైన మరియు మరింత నిజమైన ప్రేమయైయున్నది, ప్రజలను సరైన జీవిత మార్గంలో నడిపించే ప్రేమయైయున్నది. ఇంకా మరో రకంగా, ఇది సాతాను యెదుట సాక్ష్యమును కలిగియుండుటయైయున్నది. ఇంకా మరో రకంగా, ఇది భవిష్యత్తులో సువార్త కార్యము వ్యాప్తికి పునాది వేయుటయైయున్నది. ఆయన చేసిన కార్యమంతా, ప్రజలు సామాన్య వ్యక్తులుగా జీవించగలిగేలా ప్రజలను మానవ జీవితపు సరైన మార్గంలో నడిపించే ఉద్దేశంతో చేసినదే, ఎందుకంటే ప్రజలకు ఎలా జీవించాలో తెలియదు మరియు ఈ మార్గదర్శకత్వం లేకుండా, నీవు శూన్యమైన జీవితాన్ని మాత్రమే జీవిస్తావు; నీ జీవితానికి విలువ గాని లేదా అర్థం గాని ఏమీ ఉండదు మరియు నీవు సామాన్య వ్యక్తిగా ఉండటానికి పూర్తి అసమర్థుడుగా ఉంటావు. మనిషిని జయించడంలో ఉన్న లోతైన ప్రాముఖ్యత ఇదే. మీరంతా మోయాబు సంతతి; మీలో విజయం యొక్క కార్యము కొనసాగినప్పుడు, దానిని గొప్ప రక్షణ అని అంటారు. మీరంతా పాపము మరియు విచ్చలవిడితనము ఉన్నటువంటి దేశమందు జీవిస్తున్నారు, మీరంతా విచ్చలవిడితనంతోను మరియు పాపముతోనూ నిండినవారు. ఈనాడు మీరు దేవుణ్ణి కనులెత్తి అసలు చూడలేరు, మరీ ముఖ్యంగా, మీరు శిక్ష మరియు తీర్పు పొందారు, మీరు నిజమైన గంభీరమైన రక్షణ పొందారు, అంటే మీరు దేవుని గొప్ప ప్రేమను పొందారు. ఆయన చేసే అన్నింటిలో, దేవుడు నిజంగా మీపట్ల నిజమైన ప్రేమను కలిగియున్నాడు. ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఇది ఎందుకంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఈ అద్భుతమైన రక్షణ పొందేలా మీ పాపాలను బట్టి ఆయన మీకు తీర్పు తీరుస్తాడు. ఇదంతా మానవుడిని సంపూర్ణుడిగా మార్చాలనే ఉద్దేశంతో చేయబడుతుంది. ఆరంభము నుండి అంతము వరకు, మానవుడిని రక్షించడానికి దేవుడు తన శాయశక్తులా పని చేస్తున్నాడు మరియు తన స్వహస్తాలతో సృష్టించిన మానవులను పూర్తిగా నాశనం చేయాలనే కోరిక ఆయనకు లేదు. ఈ రోజు, ఆయన మీ మధ్య పని చేయడానికి వచ్చాడు; ఇదంతా రక్షణ కార్యము కాదంటారా? ఆయన మిమ్మల్ని ద్వేషించి ఉంటే, మీకు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేయడానికి ఇప్పటికీ ఆయన ఇంత మహత్తరమైన కార్యము చేస్తాడా? ఆయన ఎందుకు అంతలా శ్రమలు అనుభవించాలి? దేవుడు మిమ్మల్ని ద్వేషించడు, లేదా మీ పట్ల ఆయనకు ఎలాంటి దురుద్దేశాలు ఉండవు. దేవుని ప్రేమ అత్యంత నిజమైన ప్రేమ అని మీరు తెలుసుకోవాలి. ప్రజలు అవిధేయులు కాబట్టే ఆయన తీర్పు ద్వారా వారిని రక్షించాల్సి ఉంటుంది; లేకపోతే వారిని రక్షించడం అసాధ్యమవుతుంది. మీకు ఎలా జీవించాలో తెలియదు మరియు ఎలా జీవించాలనే అవగాహన కూడా లేదు కాబట్టి మరియు మీరు ఈ దుష్ట సంబంధమైన, పాపభూయిష్టమైన దేశములో జీవిస్తున్నారు మరియు మీరే దుష్టులైన, అశుద్ధులైన దయ్యాలు కాబట్టి, ఆయన మిమ్మల్ని మరింత ఎక్కువగా చెడిపోయేలా వదిలివేయలేడు, ఆయన ఇప్పుడు మీరున్న ఈ అశుద్ధ భూమిలో సాతానుచే ఇష్టానుసారం తొక్కించుకుంటూ జీవించడాన్ని చూడలేడు మరియు ఆయన మిమ్మల్ని పాతాళములోకి పడిపోనివ్వలేడు కాబట్టి. ఆయన ఈ వ్యక్తుల సమూహాన్ని పొందాలని మరియు మిమ్మల్ని పూర్తిగా రక్షించాలని కోరుకుంటున్నాడు. ఇదే మీపై విజయపు కార్యము యొక్క ముఖ్య ఉద్దేశం—ఇది కేవలం రక్షణ కోసమే. నీపై జరిగించే ప్రతిదీ ప్రేమ మరియు రక్షణ అని నీవు చూడలేకపోతే, ఇది ఒక పద్ధతి అని, మానవుడిని హింసించడానికి ఒక మార్గం మాత్రమే అని, ఇది నమ్మదగనిది కాదని నీవు అనుకుంటే, అప్పుడు నీవు బాధ మరియు కష్టాలను అనుభవించడానికి తిరిగి నీ ప్రపంచంలోకి వెళ్ళవచ్చు కూడా! నీవు ఈ ప్రవాహంలో ఉండి, ఈ తీర్పును మరియు ఈ అంతులేని రక్షణను అనుభవించాలనుకుంటే, ఈ మానవ ప్రపంచంలో ఎక్కడా పొందలేని దీవెనలన్నీ అనుభవించాలనుకుంటే మరియు ఈ ప్రేమను ఆస్వాదించాలనుకుంటే, మంచిగా ఉండండి: నీవు పరిపూర్ణుడిగా చేయబడేలా వీలు కల్పించడానికి విజయం యొక్క కార్యమును అంగీకరించడానికి ఈ ప్రవాహంలో ఉండండి. ఈరోజు, దేవుని తీర్పు కారణంగా నీవు కొద్దిగా బాధను మరియు శుద్ధీకరణను అనుభవించవచ్చు, కానీ ఈ బాధను అనుభవించడంలో విలువ మరియు అర్థం ఉంది. దేవుని శిక్ష మరియు తీర్పుల ద్వారా ప్రజలు శుద్దీకరించబడి మరియు కనికరించబడనివారిగా ఉన్నప్పటికినీ—దీని ఉద్దేశం వారి పాపాలను శిక్షించడానికి మరియు వారి దేహాన్ని శిక్షించడానికి మాత్రమే—ఈ కార్యము ఉద్దేశమేదీ వారి దేహాన్ని నాశనం చేయడం కాదు. వాక్కు ద్వారా వెల్లడించబడిన తీవ్ర అదేశాలన్ని నిన్ను సరైన మార్గంలో నడిపించే ఉద్దేశం కోసమే. ఈ కార్యమును మీరు వ్యక్తిగతంగా చాలా అనుభవించారు మరియు ఇది మిమ్మల్ని చెడు మార్గంలోనికి తీసుకు వెళ్ళదు అనేది స్పష్టం! ఇదంతా నీవు సామాన్య మానవత్వంతో జీవించేలా చేయడానికే ఇదంతా జరుగుతుంది మరియు నీవు ఇదంతా సామాన్య మానవత్వంతో సాధించుకోవచ్చు. దేవుడి కార్యపు ప్రతి అడుగు నీ అవసరాలపై ఆధారపడి, నీ బలహీనతల ప్రకారం మరియు నీ వాస్తవిక స్థాయి ప్రకారం ఉంటుంది మరియు మీపైన మోయలేని భారాన్ని ఉంచదు. ఇది నీకు ఈరోజు స్పష్టంగా తెలియదు, నేను నీతో కఠినంగా వ్యవహరిస్తున్నానని నీకు అనిపిస్తుంది మరియు నేను అనుదినం నిన్ను శిక్షించడానికి, నిజానికి తీర్పు నివ్వడానికి మరియు నిందించడానికి కారణం నేను నిన్ను ద్వేషిస్తున్నానని నీవు ఎల్లప్పుడూ నమ్ముతావు. అయితే నీవు సహించేది శిక్ష మరియు తీర్పు అయినప్పటికీ, వాస్తవానికిది నీ పట్ల చూపించే ప్రేమ మరియు నీకు కలుగజేసే గొప్ప రక్షణయైయున్నది. ఈ కార్యపు లోతైన అర్థాన్ని నీవు గ్రహించలేకపోతే, నీవు ఆస్వాదించడాన్ని కొనసాగించడం అసాధ్యమవుతుంది. ఈ రక్షణ నీకు ఓదార్పునివ్వాలి. నీ స్పృహలోకి రావడాన్ని నిరాకరించవద్దు. ఇంత దూరం వచ్చాక, విజయపు కార్యము యొక్క ప్రాముఖ్యత నీకు స్పష్టమై ఉండాలి మరియు నీకు ఇక ఎప్పుడూ దీని గురించి ఏ రకమైన అభిప్రాయాలు ఉండకూడదు!

మునుపటి:  విజయ కార్యపు అంతర్గత సత్యము (3)

తరువాత:  మీ భవిష్యత్తు పరిచర్యకు మీరు ఎలా హాజరు కావాలి?

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger