సాధారణ స్థితిలోకి ప్రవేశించుట ఎలా?

మనుష్యులు దేవుని వాక్యమును ఎంత ఎక్కువగా అంగీకరించే కొలది, వారు జ్ఞానవంతులై, దైవాన్వేషణ కొరకు అంత ఎక్కువగా ఆకలి మరియు తృష్ణ కలిగియుంటారు. దేవుని వాక్యమును అంగీకరించిన వారి జీవితములు మాత్రమే ఐశ్వర్యమును మరియు అధికమైన గూఢ అనుభవములను కలిగి, నువ్వుల పుష్పములవలె ఎదుగుచుండును. జీవించువారందరు దీనిని ఒక సంపూర్ణ బాధ్యతగా పరిగణించి; “దేవుడు లేకుండా, నేను జీవించలేను; దేవుడు లేకుండా, నేను ఏమీ సాధించలేను; దేవుడే లేకపోతే సమస్తము శూన్యమే,” అని భావించాలి. కాబట్టి, “పరిశుద్దాత్మ సన్నిధి లేకుండా, నేను ఏమి చేయలేను, దైవవాక్య పఠనము యొక్క ప్రభావమే లేకపోతే, నేను చేసే ఏ కార్యమైనా దుర్భలమే.” అను తీర్మానం కూడా వారు కలిగియుండాలి. మిమ్మునుబట్టి మీరు గర్వించకండి. జీవిత అనుభవాలు దైవజ్ఞానము మరియు నడిపింపు ద్వారా వచ్చాయి మరియు మీ ప్రయత్నములకు ప్రతీకలైయున్నవి. కాబట్టి “జీవిత అనుభవాలను ఉచితంగా పొందుకోలేను,” అని మిమ్ములను మీరు కోరుకోవాలి.”

కొన్నిసార్లు, ప్రతికూల పరిస్థితులలో ఉన్నపుడు, మీరు దేవుని సముఖమును కోల్పోవుటచేత, మీరు ప్రార్దించునప్పుడు దైవ సన్నిధిని అనుభవించలేరు. అటువంటి సమయాల్లో భయము చెందుట సహజమే. వెంటనే మీరు పరిశీలన చేసుకోవాలి. మీరు ఆవిధముగా చేయనట్లయితే, దేవుని ఎడబాటును బట్టి పరిశుద్దాత్మ మీరు సన్నిధిని కోల్పోతారు, దానికిపైగా—ఒక దినము, రెండు దినములు, నెల, రెండునెలలు అయినప్పటికీ పరిశుద్దాత్మ కార్యములు జరుగవు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మిక్కిలి అచేతనమై, ఎటువంటి చర్యలకైనా పాల్పడే స్థితిలో తిరిగి సాతాను బంధకాల్లో చిక్కుకొంటారు. మీరు ధనమును ఆశిస్తారు, క్రమశిక్షణ లేనివారై మీయొక్క సహోదర సహోదరీలను మోసము చేస్తారు, చలన చిత్రాలను వీడియోలను చూస్తారు, జూదానికి అలవాటు పడటంతో పాటు ఆఖరికి పొగత్రాగడం మద్యం సేవించడం వరకు దిగజారిపోతారు. దేవుని నుండి మీ హృదయము బహుదూరమై, రహస్యంగా మీ స్వమార్గములో వెళ్లుచు, యథేచ్ఛగా దేవుని పనులలో లోపాలను వెదకడం ప్రారంభిస్తారు. కొన్ని సందర్భాలలో మనుష్యులు సిగ్గు బిడియములను విడచి లైంగికసంబంధ పాపములు చేయుచు నీచమునకు దిగజారుచున్నారు. అటువంటి వ్యక్తి పరిశుద్దాత్మచే విడనాడబడియున్నాడు; వాస్తవానికి ఆ వ్యక్తిలో పరిశుద్దాత్మ కార్యము సుదీర్ఘకాలంగా జరుగుటలేదు. వారు తమ పాప కరములు బహుగా చాచు కొలది మిక్కిలి దుష్టత్వములోనికి దిగజారుటను మాత్రమే చూడగలము. తుదకు, వారు ఈ మార్గపు ఉనికినే తిరస్కరించి పాపము చేయుచున్నందున, అపవాది దాసులుగా చెరపట్టబడతారు. నీవు పరిశుద్దాత్మ సన్నిధిని మాత్రమే కలిగి ఉండి పరిశుద్దాత్మను కలిగిలేకుంటే, ఇప్పటికే ప్రమాదకరమైన స్థితికి చేరుకున్నావని గ్రహించాలి. ఒకవేళ పరిశుద్దాత్మ సన్నిధిని కూడా అనుభవించలేకపోతే, నీవు మరణపు అంచున ఉన్నావని అర్ధం. నీవు పశ్చాత్తాపము చెందకపోతే పూర్తిగా అపవాది వైపునకు త్రిప్పబడి, వెలివేయబడిన వారిలో ఒకడవుగా ఉంటావు. అయితే, పరిశుద్దాత్మ సన్నిధిని మాత్రమే కలిగియున్న స్థితిలో ఉండి (పాపముచేయవు, నిన్ను నీవు నియంత్రణలో ఉంచుకొంటావు, దేవునికి విరోధముగా ఏమి చేయవు), పరిశుద్దాత్మ కార్యము నీలో (ప్రార్ధించునపుడు కదిలించబడిన అనుభూతిని పొందలేవు, దైవవాక్యమును భుజించి పానము చేయునపుడు జ్ఞానమును లేదా వెలుగును పొందుకోవు, దైవవాక్యమును భుజించి పానము చేయుట నీలో ఏ వ్యత్యాసమునూ కలిగించదు, జీవితములో ఎదుగుదల లేక, సుదీర్ఘంగా గొప్ప వెలుగు లేక ఉంటావు) లేదని కనుగొన్నప్పుడు, నీవు బహు జాగ్రత్త వహించాలి. ఇకపై మిమ్ములను బట్టి మీరు అతిశయింపక, మీ స్వభామునకు ఇచ్చు స్వేచ్ఛ పై మీరు నియంత్రణ కలిగియుండాలి. పరిశుద్దాత్మ సన్నిధి ఏ సమయములోనైనా అదృశ్యమగును. కాబట్టి ఇటువంటి పరిస్థితి బహు ఘోరమైనది. నీవు ఈ విధమైన స్థితిలో ఉన్నట్లు గ్రహిస్తే, వీలైనంత త్వరగా నీ స్థితిని మార్చుకొనుటకు యత్నించాలి. మొదటిగా, పశ్చాత్తాప పార్ధన చేసి, దేవుని దయను మరోసారి మీ పట్ల చూపమని ఆయనను వేడుకోవాలి. హృదయపూర్వకముగా పార్థిస్తూ, దేవుని వాక్యమును భుజించి పానము చేయుటకు మీ హృదయమును నిమ్మళపరచుకోవాలి. దీని మూలముగా, కీర్తనలు పాడుటయందు, ప్రార్ధన యందు, దేవుని వాక్యమును భుజించి పానము చేయుటయందు ఆలాగుననే మీ భాధ్యతను నెరవేర్చుటయందు మీ ప్రయాసను రెట్టింపు చేయాలి. మీరు బాహుబలహీన స్థితిలో ఉన్నపుడు, అపవాది మీ హృదయమును సులభంగా స్వాధీనం చేసుకోగలదు. అదే జరిగిన క్షణాన, మీ హృదయము దేవునియొద్దనుండి తీసివేయబడి సాతాను వైపునకు త్రిప్పబడుతుంది, అటుపిమ్మట మీరు పరిశుద్దాత్మ సన్నిధిని కోల్పోతారు. అటువంటి సమయాల్లో పరిశుద్దాత్మ సన్నిధిని తిరిగి పొందుకొనడము రెట్టింపు కష్టతరము. పరిశుద్దాత్మ దేవుడు మీతోకూడా ఉన్నపుడే ఆయన కార్యమును వెదకుట ఎంతో మేలు. అది దేవుడు మీకు జ్ఞానమును అనుగ్రహించి మిమ్మును ఎన్నటికీ ఎడబాయక ఉండుటకు వీలు కలుగజేయును. ప్రార్ధించుట, కీర్తనలు పాడుట మరియు దేవుని వాక్యమును భుజించి పానము చేయుట వంటివి అపవాది తన కార్యము జరిగించుటకు అవకాశమియ్యక, పరిశుద్దాత్ముడు మీలో పనిచేయుటకు దోహదపడతాయి. ఈ విధముగా మీరు పరిశుద్దాత్మ కార్యము తిరిగి పొందక, కేవలము ఎదురు చూస్తూ, పరిశుద్దాత్మ సన్నిధిని కూడా కోల్పోయినట్లయితే, పరిశుద్దాత్మడు మిమ్ములను బలముగా కదిలింపజేసి లేక ప్రత్యేకముగా వెలిగించి జ్ఞానము అనుగ్రహించకుండా పరిశుద్దాత్మ కార్యము తిరిగిపొందడము అంత సులభము కాదు. అయినప్పటికీ, ఆ స్థితి ఎదో ఒకటీ లేక రెండురోజులలో కోలుకునేది కాదు; కొన్నిసార్లు ఎటువంటి మార్పు లేకుండా ఆరు మాసాలు కూడా గడచిపోవచ్చును. మనుష్యులు తమ విషయమై అశ్రద్ధ కలిగి, సాధారణమైన వాటిని గ్రహించుటయందు అసమర్థులై, పరిశుద్దాత్మచే విడనాడబడుటయే దీనంతటికీ కారణం. ఒకవేళ మీరు తిరిగి పరిశుద్దాత్మ కార్యమును పొందినప్పటికీ, మీకు దేవుని వర్తమాన కార్యవిషయమై స్పష్టమైన అవగాహన ఉండకపోవచ్చును, ఎందుకనగా మీరు జీవితానుభవములో ఒక పదివేల మైళ్ళ దూరమురమంత వెనుకబడియున్నారు. మరి ఇది ఘోరమైన సంగతి కాదా? అటువంటి వారికి, ఏదేమైనప్పటికీ ఇంకను పశ్చాత్తాపపడుటకు సమయము మించిపోలేదు అని చెప్పదలచుకున్నాను, అయితే ఒక నియమమున్నది; మీరు సోమరితనము విడచి బహుగా కష్టించి పనిచేయవలసియున్నది. ఒకవేళ ఇతరులు దినమంతటిలో ఐదు మార్లు ప్రార్థిస్తే, నీవు పది మార్లు ప్రార్ధించాలి; దేవుని వాక్యము భుజించి పానము చేయుటయందు ఇతరులు దినమందు రెండు గంటల సమయం గడుపుచున్నట్లైతే, నీవు నాలుగు లేక ఆరు గంటలు గడపాలి; ఇతరులు కీర్తనలను ఆలకించుటకు రెండు గంటలు కేటాయిస్తే, నీవు కనీసం అర్ధ దినము కేటాయించాలి. నీవు కదిలింపబడి, నీ హృదయము దేవునివైపునకు త్రిప్పబడి, ఇక ఎన్నటికీ దేవుని ఎడబాయనని తీర్మానించుకొనునంతవరకు దేవుని ప్రేమను గూర్చి యోచిస్తూ ఆయన ఎదుట సమాధానము కలిగి ఉండాలి. అప్పుడుమాత్రమే మీరు అనుభవఫలమును మరియు మీ పూర్వపు సాధారణ స్థితిని తిరిగి పొందగలరు.

కొందరు వ్యక్తులు తమ లక్ష్యసాధనలో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ సరైన త్రోవయందు ప్రవేశించుటలో విఫలమవుతారు. వారు అజాగ్రత్తపరులై, ఆత్మీయ సంగతులయందు లక్ష్యముంచకపోవుటయే దీనికి ముఖ్యకారణం. దేవుని వాక్యమును ఏవిధముగా అభ్యసించవలెనో, పరిశుద్దాత్మ కార్యము మరియు సన్నిధి అనగానేమిటో వారికి గ్రహింపుఉండదు. అటువంటివారు ఉత్సాహవంతులే కానీ బుద్ధిమాలిన వారు; వారు జీవితమును అన్వేషించరు. ఆత్మను గూర్చిన కొంచెం కూడా జ్ఞానము లేనందున, పరిశుద్దాత్ముని ప్రస్తుత కార్యాభివృద్ధిని గూర్చిన అవగహన లేనందున, మీ ఆత్మీయ స్థితినిగూర్చి మీకు తెలియదు. మరి అటువంటి వారి విశ్వాసము బుద్ధిహీనమైన విశ్వాసము కాదా? అటువంటి వారి అన్వేషణా ఫలము శూన్యము. దేవునితో గల విశ్వాసజీవితమందు వృద్ధిని పొందుటకు దేవుడు నీపట్ల చేసిన కార్యములను గ్రహించి, దేవుని మనోహరతను చూచుచు, దేవుని చిత్తమును గ్రహించడంతో పాటు, దేవుడు సిద్ధపరచిన సమస్తముతో ఏకీభవించి, జీవాధారములుగా ఉండుటకు దేవుని వాక్యమును నీలోనికి స్వీకరించి, వాటినిబట్టి దేవుని సంతృప్తిపరచాలి. మీ విశ్వాసము బుద్ధిహీనమైనదైయుండి, నీ జీవిత విధానములో కలుగుచున్న మార్పు మరియు ఆధ్యాత్మికఆత్మ సంబంధమైన సంగతుల పట్ల అజాగ్రత్త కలిగి, సత్యస్థాపన విషయమై ప్రయసపడకుండా దేవుని చిత్తమును ఎలా గ్రహిస్తారు? దేవుడు అడుగుచున్నవి మీరు ఎరుగనపుడు, మీరు అనుభవరహితులైనందున వారికి నెరవేర్చే అవకాశం ఉండదు. నీవు దేవుని మాటలను అనుభవించేటప్పుడు ఆయన మాటల ద్వారా నీవు దేవుని తెలుసుకోగలిగేలా అవి నీలో కలిగించే మార్పుపై శ్రద్ధను కలిగి ఉండాలి. దేవుని వాక్యములను చదువుట మాత్రమే ఎరిగి, వాటిని పాటించనియెడల, అది ఆత్మీయ సంగతుల పట్ల నీ నిర్లక్ష్య ధోరణిని కనుపరచదా? నేడు అనేకమంది దేవుని వాక్కులను పాటింపనందున వారు దేవుని కార్యము గూర్చి ఎరుగకయున్నారు. ఇది వారి ఆచరణలోని వైఫల్యము కాదా? వారు ఇలాగే కొనసాగితే ఎప్పుడు వాటిని పాటించి జీవితములో ఐశ్వర్యాభివృద్ధిని పొందగలరు? ఇవి కేవలము వట్టి మాటలుగా అనిపించుటలేదా? మీలో అనేకమంది అక్షర సంబంధమైన వాటి పట్ల మాత్రమే దృష్టి కలిగి, ఆత్మీయ సంగతులగూర్చి ఏమి ఎరుగనప్పటికీ, దేవునిచే విశేషముగా వాడబడుచూ, ఆశీర్వదింపబడాలని ఆశిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైనది అసాధ్యము! కాబట్టి మీరు ఈ వైఫల్యమునకు ముగింపు పలకాలి, తద్వారా మీ ఆత్మీయ జీవితములో సత్య మార్గమును అనుసరించి, వాస్తవానుభవములు కలిగి, దేవుని సత్యవాక్యములో మీరు నిజముగా ప్రవేశించగలుగుతారు.

మునుపటి:  దుష్టులు తప్పక శిక్షించబడతారు

తరువాత:  దేవుని చిత్తమునకు అనుగుణంగా ఎలా సేవ చేయాలి

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger