దేవుని చిత్తమునకు అనుగుణంగా ఎలా సేవ చేయాలి
ఒక వ్యక్తి దేవుని విశ్వసించినప్పుడు, ఎలాంటి ఖచ్చితమైన రీతిలో ఆయనకు సేవ చేయాలి? దేవునికి సేవ చేసేవారు ఎటువంటి నియమాలను నెరవేర్చాలి మరియు ఎటువంటి సత్యములను అర్థం చేసుకోవాలి? మరియు ఆయన సేవలో మీరు ఎక్కడ దారి తప్పవచ్చు? ఈ అన్ని విషయాలకు మీరు సమాధానాలు తెలుసుకోవాలి. మీరు దేవుడిని ఏ విధంగా విశ్వసిస్తున్నారు, పరిశుద్ధాత్మ చూపిన మార్గంలో మీరు ఎలా నడుస్తున్నారు మరియు అన్ని విషయాలలో దేవునికి అనుగుణంగా ఎలా సమర్పించుకున్నారనే వాటిని ఈ అంశాలు స్పృశిస్తాయి, ఆ విధంగా, మీలో దేవుని కార్యములకు సంబంధించిన ప్రతి అడుగును అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు ఈ దశకు చేరుకున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం అంటే ఏమిటి, దేవుని సక్రమంగా ఎలా విశ్వసించాలి మరియు దేవుని చిత్తముతో సామరస్యంగా వ్యవహరించడానికి మీరేం చేయాలనే లాంటి విషయాలను మీరు ప్రశంసిస్తారు. ఇది మిమ్మల్ని దేవుని కార్యము పట్ల పరిపూర్ణముగా మరియు పూర్తి విధేయులుగా చేస్తుంది; మీకు ఎటువంటి ఫిర్యాదులు ఉండవు మరియు మీరు దేని మీదా తీర్పు ఇవ్వరు లేదా విశ్లేషించరు, దేవుని కార్యము గూర్చి అత్యంత తక్కువ పరిశోధిస్తారు. ఆ విధంగా, మరణము వరకు మీరు దేవుడికి విధేయత చూపే సామర్థ్యం కలిగి ఉంటారు, దేవుడు మిమ్మల్ని నడిపించడానికి మరియు గొర్రెను లాగా మిమ్మల్ని వధించడానికి అనుమతిస్తాడు, ఆవిధంగా, మీరు 1990ల నాటి పేతుర్లు లాగా మార్చబడతారు మరియు చిన్న ఫిర్యాదు కూడా లేకుండా శిలువ మీద కూడా దేవుని ప్రేమించగలుగుతారు. అప్పుడు మాత్రమే మీరు 1990ల నాటి పేతుర్లు లాగా జీవించగలుగుతారు.
దేవునికి సేవ చేయాలని నిర్ణయించుకున్న వారందరూ ఆ పని చేయవచ్చు—కానీ, దేవుని చిత్తముపై ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మరియు దేవుని చిత్తమును అర్థం చేసుకునే వారు మాత్రమే ఆ అర్హత కలిగి, దేవుని సేవ చేయడానికి హక్కు పొందుతారు. మీ అందరిలోనూ నేను దీనిని కనుగొన్నాను: తాము ఉత్సాహంగా దేవుని సువార్తను వ్యాప్తి చేయడం, దేవుని కొరకు రోడ్లమీదకు వెళ్ళటం, దేవుని కొరకు తమను తాము ఖర్చు చేసుకొనటం మరియు దేవుని కొరకు వస్తువులను విడిచిపెట్టడం, ఇలా అనేకమైన పనులు చేయటమే దేవుని సేవ చేయడమని చాలామంది అనుకుంటారు. చేతిలో బైబిల్ పట్టుకొని తిరగడం, పరలోక రాజ్య సువార్తను వ్యాప్తి చేయడం మరియు ప్రజలు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకునే లాగా చేసి వారిని రక్షించడమే దేవుని సేవ చేయడం అని చాలామంది మత విశ్వాసులు సైతం నమ్ముతారు. విద్యాలయాల్లో అధునాతనమైన చదువులు మరియు శిక్షణ పొందుకుని సంఘాలలో బోధించడం మరియు బైబిల్ లేఖనాల ద్వారా ప్రజలకు బోధించడం లాంటివన్నీ దేవుని సేవలో భాగమేనని నమ్మే మతాధికారులు కూడా ఉన్నారు. అంతేకాక, పేదరికంలో ఉన్న చాలా ప్రాంతాలలో దేవుని సేవ అంటే రోగులను స్వస్థపరచడం మరియు వారి సహోదర సహోదరీల నుండి దయ్యములను వెళ్ళగొట్టడం లేదా వారి కోసం ప్రార్థించడం, లేదా వారికి సేవ చేయడమే దేవునికి సేవ చేయడమని నమ్మే ప్రజలు ఉన్నారు. దేవుని సేవ చేయడం అంటే, దేవుని మాటలను తిని మరియు త్రాగటం, ప్రతిరోజు దేవుని ప్రార్థించడం, అదేవిధంగా అన్నిచోట్ల సంఘములను దర్శించి పని చేయడమే, అని నమ్మేవారు కూడా మీలో చాలామంది ఉన్నారు. దేవునికి సేవ చేయడం అంటే ఎన్నటికీ వివాహం చేసుకొనక పోవటం లేదా కుటుంబాన్ని కలిగి ఉండకపోవటం మరియు తమను తాము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడమే దేవుని సేవ చేయడం అని నమ్మే సహోదరీ, సహోదరులు కూడా కొందరు ఉన్నారు. అయితే, నిజంగా దేవుని సేవ చేయడం అంటే ఏమిటో తెలిసిన కొంతమంది ఇంకా ఉన్నారు. దేవునికి సేవ చేసే వారి సంఖ్య ఆకాశంలోని నక్షత్రములు కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ, ప్రత్యక్షంగా సేవ చేసేవారు మరియు దేవుని చిత్తానుసారముగా సేవ చేయగలిగేవారు చాలా తక్కువ—పరిగణన లోనికి తీసుకోలేనంత తక్కువగానే ఉన్నారు. నేను ఇలా ఎందుకు చెబుతున్నాను? నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే, “దేవునికి సేవ” అనే వాక్య సారాన్ని మీరు అర్థం చేసుకోలేదు మరియు దేవుని చిత్తానుసారముగా ఎలా సేవ చేయాలో మీరు చాలా తక్కువగానే అర్థం చేసుకున్నారు. ఏ విధమైనటువంటి సేవ దేవుని చిత్తానుకూలంగా ఉంటుందో మనుష్యులు తెలుసుకోవాల్సిన అత్యవసరము ఉంది.
దేవుని చిత్తానికి అనుగుణంగా సేవ చేయాలని మీరు కోరుకుంటే, ఎటువంటి మనుషులు దేవుని సంతోష పరుస్తున్నారు, ఎటువంటి మనుషులు దేవునిచే అసహ్యించుకోబడుతున్నారు, ఎటువంటి మనుషులు దేవునిచే పరిపూర్ణులుగా చేయబడ్డారు మరియు ఎటువంటి మనుషులు దేవుని సేవ చేయడానికి అర్హులవుతున్నారనే విషయాన్ని మీరు మొదట అర్థం చేసుకోవాలి. కనీస పక్షంలోనైనా, మీరు ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా, దేవుని కార్య లక్ష్యాలను, మరియు దేవుడు ఇప్పుడు ఇక్కడ చేయబోయే పని గురించి మీరు తెలుసుకోవాలి. దీనిని అర్థం చేసుకున్న తర్వాత, మరియు దేవుని వాక్యముల మార్గదర్శకత్వం ద్వారా, మీరు మొదటగా ప్రవేశం సాధించాలి, మరియు మొదటగా దేవుని ఆజ్ఞను పొందుకోవాలి. ఒకసారి మీరు దేవుని వాక్యముల అసలైన అనుభవాన్ని పొందిన తరువాత, మరియు దేవుని కార్యములను నిజంగా తెలుసుకున్నప్పుడు, దేవుని సేవ చేయడానికి మీరు అర్హులు అవుతారు. మరియు మీరు ఆయన సేవ చేసినప్పుడు దేవుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయన కార్యముల గూర్చి గొప్ప అవగాహనను మరియు దానిని మరింత స్పష్టంగా చూసేందుకు అనుమతిస్తాడు. మీరు ఈ వాస్తవికత లోనికి ప్రవేశించినప్పుడు, మీ అనుభవాలు మరింత లోతుగా మరియు వాస్తవంగా ఉంటాయి, మరియు మీలో ఇలాంటి అనుభవాలు పొందుతున్న వారందరూ సంఘముల మధ్య నడవగలుగుతారు మరియు సహోదర సహోదరీల అవసరతలను తీర్చగలరు, ఆ విధంగా, మీ సొంత కొరతలను తీర్చుకోవడానికి ఒకరి బలాన్ని మరొకరు ఉపయోగించుకుంటారు, మరియు మీ ఆత్మలలో గొప్ప జ్ఞానాన్ని పొందుకుంటారు. ఈ ప్రభావాన్ని పొందుకున్న తర్వాత మాత్రమే, దేవుని చిత్తానుసారముగా సేవ చేయగలుగుతారు మరియు మీ సేవా కాలంలో దేవునిచే పరిపూర్ణులుగా చేయబడతారు.
దేవుని సేవ చేసేవారు దేవుని సన్నిహితులుగా ఉండాలి, దేవుని సంతోషపరిచేవారిగా ఉండాలి మరియు దేవునికి అత్యంత విధేయులుగా ఉండే సామర్ధ్యం కలిగి ఉండాలి. మీరు అంతరంగికంగా లేదా బహిరంగంగా, ఎలా ప్రవర్తించినప్పటికీ, దేవుని ముందు నిలబడి దేవుని ఆనందం పొందగలుగుతారు, దేవుని యెదుట మీరు స్థిరంగా నిలబడ గలుగుతారు, మరియు ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించినప్పటికీ, మీరు నడవాల్సిన మార్గంలోనే ఎల్లప్పుడూ నడుస్తారు, మరియు దేవుని ప్రతి భారముపై శ్రద్ధ వహిస్తారు. ఇలాంటి మనుష్యులు మాత్రమే దేవునికి ఆత్మీయులవుతారు. ఇలాంటి ఆత్మీయులు మాత్రమే ఆయన్ని ప్రత్యక్షంగా సేవించగలుగుతారు ఎందుకంటే, దేవునిచే ఇవ్వబడిన ఆజ్ఞను మరియు దేవుని భారాన్ని వారు పొందుకున్నారు, దేవుని హృదయాన్ని వారు తమ హృదయంగా చేసుకోగలరు, మరియు దేవుని భారాన్ని వారి స్వంతదిగా తీసుకుంటారు, మరియు వారు తమ భవిష్యత్తు అవకాశాలను పరిగణనలోనికి తీసుకోరు: వారికి ఎటువంటి అవకాశాలు లేనప్పటికీ, మరియు వారు పొందుకోవడానికి ఏమీ లేకపోయినప్పటికీ, వారు ఎల్లప్పుడూ ప్రేమ నిండిన హృదయంతో దేవునివిశ్వసిస్తారు. కాబట్టి ఇలాంటి మనిషి దేవునికి ఆత్మీయుడవుతాడు. దేవునికి ఆత్మీయులైన వారు ఆయనకు నమ్మకస్తులు కూడా అవుతారు; దేవుని నమ్మకస్తులు మాత్రమే ఆయన తీరకలేమిని మరియు ఆయన ఆలోచనలను పంచుకోగలరు, మరియు వారి శరీరం బాధాకరమైనది మరియు బలహీనమైనది అయినప్పటికీ, వారు బాధను భరించగలుగుతారు మరియు దేవుని సంతృప్తిపరచడానికి వారు తాము ప్రేమించే దానిని వదులుకుంటారు. అటువంటి వ్యక్తులకు దేవుడు ఎక్కువ శ్రమలు ఇస్తాడు, మరియు దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో, అది అలాంటి వారికి ఎదురయ్యే పరీక్షల నుండి ప్రస్ఫుటమవుతుంది. ఆ విధంగా, ఇలాంటి మనుష్యులు దేవుని సంతోషపరిచే వారుగా ఉంటారు, వారు ఆయన హృదయానుసారులై దేవుని సేవకులుగా ఉంటారు, మరియు ఇటువంటి మనుష్యులు మాత్రమే దేవునితో కలిసి పరిపాలించగలుగుతారు. దేవుడికి నీవు నిజమైన ఆత్మీయుడైనప్పుడు, నీవు ఖచ్చితంగా దేవునితో కలిసి పరిపాలిస్తావు.
దేవుని కార్యము—సమస్త మానవాళికి విమోచనము—ను యేసు పూర్తి చేయగలిగాడు ఎందుకంటే ఆయన తన కొరకు ఎటువంటి ప్రణాళికలు లేదా ఏర్పాట్లు చేసుకొనకుండా, దేవుని చిత్తానికి పూర్తి శ్రద్ధ కనపరిచాడు. కాబట్టే, ఆయన దేవునికి ఆత్మీయుడయ్యాడు—తానే దేవుడయ్యాడు—మీరందరూ చాలా బాగాఅర్థం చేసుకున్న విషయమిది. (నిజానికి, ఆయనే దేవుడు, దేవునిచే సాక్ష్యమివ్వబడిన దేవుడు. యేసు గూర్చిన వాస్తవాన్ని ఉపయోగించడాన్ని నేను దీనిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.) దేవుని నిర్వహణ ప్రణాళికను ఆయన అత్యంత కేంద్ర స్థానంలో ఉంచగలిగాడు, మరియు ఆయన ఎల్లప్పుడూ పరలోకమందున్న తండ్రిని ప్రార్ధించాడు మరియు పరలోకమందున్న తండ్రి చిత్తమును కోరాడు. ఆయన ప్రార్థించడంతో పాటు ఈ విధంగాఅన్నాడు: “తండ్రి అయిన దేవుడా! నీ చిత్తము ఏదైననూ దానినే నెరవేర్చుము, మరియు నా కోరికలను అనుసరించి కాకుండా, నీ ప్రణాళిక ప్రకారముగా పని చేయుము. మనిషి బలహీనుడు కావచ్చు, కానీ, నీవెందుకు అతని పట్ల శ్రద్ధ వహించాలి? నీ చేతిలో ఒక చీమ లాంటి మనుష్యుడు నీ శ్రద్ధకు పాత్రుడు ఎలా కాగలడు? నా హృదయములో, నీ చిత్తము మాత్రమే నెరవేరాలని నేను కోరుకుంటాను, మరియు నీ స్వంత కోరికల ప్రకారము, నాలో ఏది చేయాలని తలచితివో అదే నీవు చేయవచ్చు.” యెరూషలేముకు వెళ్ళే సమయంలో, ఎవరో కత్తిన తన గుండెల్లో మెలిపెట్టినట్లుగా యేసు ఎంతో బాధ అనుభవించెను, అయినప్పటికీ, తన వాక్యము నుండి వెనుకడుగు వేయాలని రవ్వంత అయినను ఆయన తలంచలేదు; ఆయన ఎక్కడైతే శిలువ వేయబడతాడో, ఆ స్థలమునకు ఒక బలమైన శక్తి ఆయనను నడిపించెను. చివరకు, శిలువ ఎక్కించబడి మేకులు కొట్టబడ్డాడు మరియు పాపకూపమైన శరీరానికి సాదృశ్యంగా మారాడు, తద్వారా, మానవాళికి విమోచనము అనే కార్యమును పూర్తి చేశాడు. ఆయన మరణపు మరియు పాతాళ లోకపు సంకెళ్లు విరగ్గొట్టి స్వేచ్ఛను కలుగచేసెను. మరణము, పాతాళము మరియు నరకము ఆయన ముందు వాటి శక్తిని కోల్పోయినవి మరియు ఆయనచే ఓడించబడెను. ఆయన ముప్పది మూడు సంవత్సరములు జీవించెను, ఈ కాలమంతయు, ఆ సమయములో దేవుని చిత్తానుసారముగా దేవుని కార్యములను నిర్వర్తించుటకే తన శాయశక్తులా కృషి చేసెను; తన స్వంత వ్యక్తిగత ప్రయోజనం లేదా నష్టము గురించి ఆలోచించలేదు, మరియు తండ్రియైన దేవుని గూర్చి మాత్రమే ఎల్లప్పుడూ ఆలోచించెను. ఆ విధంగా ఆయన బాప్తిస్మము పొందిన తర్వాత, దేవుడు: “మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” అని సెలవిచ్చెను. దేవుని యెదుట, దేవుని చిత్తానికి అనుగుణముగా చేసిన ఆయన సేవ కారణముగానే, మానవాళిని విముక్తులను చేయడమనే బహు భారమును దేవుడు ఆయన భుజస్కంధాలపై ఉంచెను మరియు ఆయన దానిని పూర్తి చేసేలా చేసెను, మరియు ఈ ముఖ్యమైన కార్యమును పూర్తి చేయడానికి ఆయన అర్హుడైనాడు మరియు ఆ యోగ్యతను సాధించాడు. ఆయన తన జీవిత కాలమంతా దేవుని కొరకు లెక్కించలేనంత శ్రమ అనుభవించెను మరియు లెక్కలేనన్ని సార్లు సాతానుచే శోధించబడెను, కానీ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. దేవుడు ఆయనను విశ్వసించెను మరియు ప్రేమించెను గనుకనే ఇంత గొప్ప కార్యమును అప్పగించెను, అందుకే దేవుడు వ్యక్తిగతంగా: “మరియు–ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” అని చెప్పెను. ఆ సమయంలో యేసు మాత్రమే ఈ ఆజ్ఞను పూర్తి చేయగలిగెను, కృపా కాలంలో మానవాళిని విమోచించుట అనే దైవకార్యమును పూర్తి చేయుటకు ఇది ఒక ఆచరణాత్మక అంశం.
యేసు వలే, మీరు దేవుని శ్రమ కొరకు శ్రద్ధ కనపరిచినప్పుడు, మరియు మీ శరీరపు ఆశల నుండి వెనుకకు తిరిగినప్పుడు, దేవుడు ఆయన ముఖ్య కార్యములను మీకు అప్పగిస్తాడు, ఆవిధముగా, దేవుని సేవ కోసం అవసరమైన షరతులను మీరు పూర్తిచేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే దేవుని చిత్త ప్రకారము ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తున్నారని చెప్పడానికి మీరు సాహసించవచ్చు, మరియు అప్పుడు మాత్రమే మీరు నిజంగా దేవుడిని సేవిస్తున్నారని చెప్పటానికి సాహసించవచ్చు. యేసు ఉదాహరణతో పోల్చినప్పుడు, నీవు దేవుని ఆత్మీయుడవని చెప్పటానికి నీవు సాహసించగలవా? దేవుని చిత్తము ప్రకారము చేస్తున్నానని చెప్పటానికి నీవు సాహసించగలవా? నీవు నిజంగానే దేవుడికి సేవ చేస్తున్నట్లు చెప్పడానికి నీవు సాహసించగలవా? దేవుడికి ఎలా సేవ చేయాలో నీవు ఈరోజుకీ అర్థం చేసుకోలేదు, మరి నీవు దేవుని సన్నిహితుడని చెప్పటానికి ఎలా సాహసించగలవు? దేవునికి సేవ చేస్తున్నానని నీవు చెప్పినట్లయితే, అది నీవు దేవుడి పట్ల చేసే దూషణ కాదా? దాని గురించి ఆలోచించండి: నీవు దేవుని సేవిస్తున్నావా, లేక నీ సొంత సేవ చేస్తున్నావా? నీవు సాతానుకి సేవ చేస్తున్నావు, అయినప్పటికీ, నీవు దేవుని సేవిస్తున్నావని మొండిగా చెబుతారు—ఇదంతయూ, నీవు దేవుని పట్ల చేసే దూషణ కాదా? నా వెనుక ఉన్న చాలామంది హోదా ప్రయోజనం కోరుకుంటారు, వారు అమితంగా తినడానికి ఇష్టపడుతున్నారు, వారు నిద్రించడాన్ని ప్రేమిస్తున్నారు మరియు శరీరానికి ప్రతి సంరక్షణ అందిస్తారు, శరీర సంరక్షణ కోసం ఎటువంటి మార్గం లేదని ఎల్లప్పుడూ భయపడుతుంటారు. వారు సంఘంలో సరైన విధులను నిర్వర్తించరు, కానీ సంఘము నుండి తమను తాము స్వేచ్ఛ పరుచుకుంటారు లేదా నా మాటలను అడ్డుపెట్టుకుని వారి సహోదర, సహోదరీలను మందలిస్తారు, అధికార స్థాయిలకు చేరుకుని ఇతరులపై తమను తాము ప్రభువులుగా చేసుకుంటారు. తాము దేవుని చిత్తము ప్రకారము చేస్తున్నామని, మరియు తాము దేవుని సన్నిహితులమని ఇలాంటివారు ఎల్లప్పుడూ చెబుతుంటారు—ఇది అయుక్తమైనది కాదా? నీవు సరైన ఉద్దేశ్యములను కలిగిఉన్నప్పటికీ, దేవుని చిత్తానుసారముగా సేవ చేయలేకపోతున్నావంటే, నీవు మూర్ఖుడవే; అయితే, నీ ఉద్దేశ్యములు సరైనవి కానప్పుడు, మరియు ఇంకను నీవు దేవుని సేవ చేస్తున్నట్లు చెబితే, నీవు దేవుని వ్యతిరేకి అవుతావు, నీవు దేవుని శిక్షకు అర్హుడవుతావు! ఇటువంటి వ్యక్తులపై నాకు ఎటువంటి సానుభూతి లేదు! ఇలాంటి వారు దేవుని గృహంలో స్వేచ్ఛగా ఉంటూ, ఎల్లప్పుడూ శరీర సౌఖ్యాలను కోరుకుంటారు, మరియు దేవుని ఆసక్తులను పరిగణనలోనికి తీసుకోరు. తమకు ఏది మంచిదో దానిని మాత్రమే వారు ఎల్లప్పుడూ కోరుకుంటారు, దేవుని చిత్తాన్ని అస్సలు పట్టించుకోరు. వారు చేసే దేనిలోనూ దేవుని ఆత్మ పరిశీలనను అంగీకరించరు. వారు ఎప్పుడూ మొహమాటం లేకుండా వారి సహోదర, సహోదరీలను మోసం చేస్తుంటారు, మరియు ద్రాక్షతోటలోని నక్క ద్రాక్ష పళ్ళు దొంగలించి, ద్రాక్ష తోటను తొక్కి నాశనం చేసినట్లుగా, వారు రెండు ముఖాలు కలిగి ఉంటారు. ఇటువంటి వ్యక్తులు దేవునికి సన్నిహితులు కాగలరా? ఇదే స్థితిలో నీవు దేవుని ఆశీసులకు అర్హుడవేనా? నీవు నీ జీవమునకు మరియు సంఘము కొరకు ఎటువంటి శ్రమను తీసుకోనప్పుడు, దేవుని విధిని పొందుకొనడానికి నీవు అర్హుడవేనా? మీలాంటి వ్యక్తులను నమ్మటానికి ఎవరు ధైర్యం చేస్తారు? మీరు ఈ విధంగా సేవ చేసినప్పుడు, మీకు గొప్ప పనులు అప్పజెప్పడానికి దేవుడు నమ్మిక ఉంచుతాడా? దీనివల్ల పనులలో ఆలస్యం జరగదా?
దేవుని చిత్తానుసారముగా, సామరస్యంగా సేవ చేయడానికి ఎటువంటి నియమాలు తప్పనిసరిగా నెరవేర్చాలో మీరు తెలుసుకోగలరని నేను ఇదంతా చెప్పాను. మీరు మీ హృదయాన్నిదేవునికి ఇవ్వనట్లయితే, యేసు లాగా దేవుని చిత్తానికి శ్రద్ధ చూపించక పోయినట్లయితే, మీరు దేవునిచే నమ్మదగినవారు కాలేరు, మరియు చివరగా దేవునిచే తీర్పు తీర్చబడతారు. బహుశా ఈరోజు, దేవునికి మీరు చేసిన సేవలో, దేవుని మోసం చేసే ఉద్దేశ్యం కలిగి ఉండవచ్చు లేదా ఆయనతో నిర్లక్ష్యపూరిత ధోరణితో వ్యవహరించి ఉండవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఇంకేదైనా కారణం లేకుండానే నీవు దేవుణ్ణి మోసం చేస్తే, కనికరం లేని తీర్పు నీ మీదికి వస్తుంది. కాబట్టి, ఎటువంటి విభజిత విధేయతలు లేకుండా మీ హృదయాన్ని మొదట దేవునికి ఇవ్వటం ద్వారా దేవుని సేవ చేయడానికి ఇప్పుడే సరైన మార్గంలో ప్రవేశించిన ప్రయోజనాన్ని పొందుకోవడానికి మీరు త్వరపడాలి. దేవుని ముందు ఉన్నప్పటికీ, లేదా మనుష్యుల ముందు ఉన్నప్పటికీ, నీ హృదయం ఎల్లప్పుడు దేవుని తట్టు తిరగాలి మరియు యేసు ప్రేమించిన విధంగా దేవుని ప్రేమించాలని తీర్మానించుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడే, దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాడు, కాబట్టి, మీరు ఆయన హృదయాన్ని ఆనుకుని ఉన్న దైవ సేవకులుగా మారతారు. దేవునిచే పరిపూర్ణులుగా మార్చబడాలని నీవు నిజంగా కోరుకుంటే, నీ సేవ ఆయన చిత్త ప్రకారము అనుకూలంగా ఉండాలి, దేవుని విశ్వాసం పట్ల నీ మునుపటి అభిప్రాయాలను మార్చుకోవాలి, దేవుని సేవించడానికి నీవు ఉపయోగించే పాత మార్గాన్ని మార్చుకోవాలి, అప్పుడే నీవు దేవునిచే ఇంకా ఎక్కువ పరిపూర్ణంగా చేయబడతారు. ఈ విధమైన మార్గంలో మాత్రమే, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, మరియు, పేతురు వలె దేవుని ప్రేమించే సమూహంలో మీరు అగ్రభాగాన ఉంటారు. మీరు ఇంకనూ పశ్చాత్తాపపడనట్లయితే, యూదా పొందుకున్న ముగింపునే మీరు పొందుకుంటారు. దేవుని నమ్ముకున్న వారందరూ దీనిని అర్థం చేసుకోవాలి.