దేవుడి స్వభావాన్ని మరియు ఆయన కార్యము సాధించే ఫలితాలను ఎలా తెలుసుకోవాలి

ముందుగా, ఒక కీర్తన పాడుదాం: దేవుని రాజ్యపు గీతం (I) (దేవుని) రాజ్యం, లోకము మీదకి దిగివచ్చింది.

సహకారము: జన సమూహాలు నన్ను సంతోషపరుస్తారు, జనసమూహాలు నన్ను స్తుతిస్తారు; అన్ని నాలుకలు ఒక్కడైయున్న నిజ దేవుని నామాన్ని పలుకుతాయి, దేవుని రాజ్యం, మనుష్య లోకంపై దిగివచ్చింది.

1 జన సమూహాలు నన్ను సంతోషపరుస్తారు, జనసమూహాలు నన్ను స్తుతిస్తారు; అన్ని నాలుకలు ఒక్కడైయున్న నిజ దేవుని నామాన్ని పలుకుతాయి, ప్రజలందరూ వారి కన్నులెత్తి, నా కార్యాలను చూస్తారు. (దేవుని) రాజ్యం, మనుష్య లోకంపై దిగివచ్చింది, నా వ్యక్తిత్వం ఉత్తమమైనది, దాతృత్వం కలిగింది. దీనిని బట్టి ఎవరు సంతోషించరు? సంతోషంతో నాట్యం చేయని వారెవరు? ఓహ్. సీయోను! నన్ను ఘనపరచడానికి నీ విజయోత్సాహ ధ్వజము ఎత్తుకొనుము! నా పరిశుద్ధ నామాన్ని ప్రకటించడానికి నీ విజయ గీతాన్ని పాడు!

2 ఆకాశమండలంలో నా గొప్ప శక్తిని చూపడానికి మీ స్థానాలకు తిరిగివెళ్ళడానికి త్వరపడండి! భూమిపై, కీర్తనలో నా పట్ల తమ అపారమైన ప్రేమను మరియు గౌరవాన్ని వ్యక్తపరిచే ప్రజల స్వరాలవైపు నా చెవులనిస్తున్నాను! ఈ రోజు, సమస్త సృష్టి, జీవానికి తిరిగి వచ్చినప్పుడు, నేను మనుష్య లోకానికి నేను దిగివస్తాను. ఈ క్షణంలో, ఈ తరుణంలో, పువ్వులన్నీ వికసిస్తాయి, పక్షులన్నీ ఏక స్వరంతో పాడతాయి, సమస్తం సంతోషంతో కంపిస్తుంది! (దేవుని) రాజ్యపు సమస్కార శబ్ధమందు, సాతాను రాజ్యం కూలిపోతుంది, దేవుని రాజ్యపు గీతం యొక్క ఉరుముల్లో మరలా తిరిగి లేవలేనంతగా నిర్మూలమైపోతుంది!

3 భూమిపై ఎవరు లేచి, ఎదుర్కొనే ధైర్యం చేస్తారు? నేను భూమికి దిగివచ్చినప్పుడు, నేను అగ్నిని, ఉగ్రతను, అన్ని రకాల విపత్తులను తీసుకొస్తాను. ఈ లోక రాజ్యాలన్నీ ఇప్పుడు నా రాజ్యాలు! ఆకాశమందు, మేఘాలు దొర్లిపోతాయి; ఆకాశం క్రింద సరస్సులు మరియు నదులు ప్రవాహంతో ఉప్పొంగుతూ, సంతోషంతో మధురమైన సంగీతాన్ని ఆలపిస్తాయి. విశ్రమిస్తున్న జంతువులను వాటి గుహల నుండి, వారున్న మత్తులో నుండి ప్రజలందరినీ నేను మేల్కోలుపుతాను. ఎట్టకేలకు అనేక మంది ప్రజలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది! వారు అత్యంత సుందరమైన గీతాలను నాకు అర్పిస్తారు!

ఈ గీతం పాడిన ప్రతిసారీ మీకు ఏమనిపిస్తుంది? (మేము చాలా ఉద్వేగానికి మరియు పులకరింతకు లోనవుతాము మరియు దేవుడి రాజ్యపు అందం ఎంత మహిమాన్వితమైనది, మానవజాతి మరియు దేవుడు ఎప్పటికీ కలిసి ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాము.) దేవుడితో కలిసి ఉండడానికి మానవులు తప్పనిసరిగా సంతరించుకోవాల్సిన రూపం గురించి ఎవరైనా ఆలోచించారా? మీ ఊహ ప్రకారం, దేవుడితో చేరడానికి మరియు ఆపైన దేవుడి రాజ్యంలో మహిమాన్వితమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మానవులు తప్పక ఎలా ఉండాలి? (వారి స్వభావాలు మారాలి.) వారి స్వభావాలు మారాలి, కానీ ఎంత మేరకు? వారి స్వభావాలు మార్చబడిన తర్వాత వారు ఏ మాదిరిగా ఉంటారు? (వారు పరిశుద్ధులుగా మారుతారు.) పరిశుద్ధతకు ప్రమాణం ఏమిటి? (వారి ఆలోచనలు మరియు పరిశీలనలు అన్నీ క్రీస్తుకు తప్పక పొందికగా ఉండాలి.) అలాంటి పొందిక ఎలా ప్రదర్శించబడుతుంది? (వారు దేవుడిని ప్రతిఘటించరు లేదా నమ్మకద్రోహం చేయరు, ఆయనకు పూర్తిగా సమర్పించుకోగలరు మరియు వారి హృదయంలో ఆయన పట్ల భయంతో కూడిన గౌరవం ఉంటుంది.) మీ జవాబులలో కొన్ని సరైన మార్గంలో ఉన్నాయి. మీరందరూ మీ హృదయాలను తెరవండి మరియు మీరు చెప్పాలనుకున్న దాన్ని గొంతు విప్పి చెప్పండి. (దేవుడి రాజ్యంలో దేవుడితో కలిసి జీవించే వ్యక్తులు—విశ్వాసంతో—సత్యాన్ని అనుసరించడం ద్వారా మరియు ఏ వ్యక్తి, సంఘటన లేదా వస్తువు ద్వారా నిలువరించబడకుండా తమ విధులను చేయగలగాలి. అప్పుడు వారికి చీకటి ప్రభావాన్ని ఛేదించుకుని బయటికి రావడానికి, వారి హృదయాలను దేవుడితో సుతి చేయడానికి మరియు దేవుని యందు భయము మరియు చెడుతనమును విసర్జించడానికి వీలవుతుంది.) (విషయాలపై మన దృక్పథం దేవుడితో శృతి కలిసి ఉన్నతి చెందవచ్చు మరియు మనం చీకటి ప్రభావాన్ని ఛేదించవచ్చు. ఎంతలేదన్నా, మనం ఇక మీదట సాతానుచే దోపిడీ చేయబడని చోటుకు మరియు ఏవైనా చెడు స్వభావాలను వదిలివేసే, దేవుడికి సమర్పించుకునే చోటుకు చేరుకోవచ్చు. వ్యక్తులు చీకటి ప్రభావాన్ని ఛేదించుకుని బయటికి రావడం చాలా అవసరమని మనము నమ్ముతాము. చీకటి ప్రభావాన్ని ఛేదించుకుని బయటికి రాలేని మరియు సాతాను బంధనాల నుండి తప్పించుకోలేని వ్యక్తులు దేవుడి రక్షణ పొందలేరు.) (దేవుడిచే పరిపూర్ణుడిగా చేయబడే ప్రమాణాన్ని సాధించబడటానికి, వ్యక్తులు తప్పక ఆయనతో ఒకే హృదయం మరియు మనస్సుతో ఉండాలి మరియు ఆయనను ఇక ఎప్పుడూ ప్రతిఘటించకూడదు. వారిని వారు తప్పక తెలుసుకోగలగాలి, సత్యాన్ని ఆచరించగలగాలి, దేవుడి గురించి అవగాహన పొందగలగాలి, దేవుడిని ప్రేమించగలగాలి మరియు దేవుడితో శృతి కలుపగలగాలి. ఈమాత్రం చేయగలిగితే చాలు.)

వ్యక్తుల ఫలితాలు వారి హృదయాలపై ఎలాంటి భారం మోపుతాయి

మీరు కట్టుబడి ఉండాల్సిన విధానానికి సంబంధించి మీకు కొన్ని ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తున్నది మరియు మీరు దాని గురించి కొంత అవగాహన లేదా దాని పట్ల జ్ఞానం పెంచుకున్నారు. అయినప్పటికీ, మీరు పలికిన మాటలన్నీ డొల్లగా ఉన్నాయా లేదా నిజమయ్యాయా అనేది మీ రోజువారీ ఆచరణలో మీ దృష్టిపై ఆధారపడి ఉంటుంది. సంవత్సరాలుగా, మీరందరూ సత్యం యొక్క ప్రతి కోణం నుండి సిద్ధాంతపరంగా మరియు సత్యం యొక్క వాస్తవ విషయం రెండింటిపరంగా కొన్ని ఫలాలు పొందారు. ఈరోజుల్లో వ్యక్తులు సత్యం కోసం కృషి చేయడానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది నిరూపిస్తుంది, ఫలితంగా, కొందరి హృదయాలలో సత్యం యొక్క ప్రతి కోణం మరియు అంశం నిస్సందేహంగా వేళ్లూనుకున్నాయి. అయితే, నేను అత్యంత ఎక్కువగా భయపడేది ఏమిటి? అదేమిటంటే, సత్య సంబంధిత ఈ విషయాలు మరియు ఈ సిద్ధాంతాలు మీ హృదయాలలో వేళ్లూనుకున్నప్పటికీ, వాటి వాస్తవిక విషయంలో తత్వం తక్కువగా ఉంది. మీకు సమస్యలు ఎదురైనప్పుడు మరియు పరీక్షలు, కోరికలు ఎదుర్కొన్నప్పుడు, ఈ సత్యాల వాస్తవికత మీకు ఎంతమేరకు ఆచరణాత్మక ఉపయోగంగా ఉంటుంది? దేవుడి చిత్తాన్ని సంతృప్తిపర్చగలిగేలా, మీ కష్టాలను అధిగమించడానికి మరియు మీ పరీక్షల నుండి బయటపడడానికి ఇది మీకు సహాయపడగలదా? మీరు మీ పరీక్షల మధ్య దృఢంగా నిలబడి, దిక్కులు పిక్కటిల్లేలా దేవుడికి సాక్ష్యమిస్తారా? మీరెప్పుడైనా ఈ విషయాలను గురించి ఆందోళన పడ్డారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను: మీ హృదయాలలో మరియు మీ రోజువారీ ఆలోచనలు మరియు చింతనలు అన్నింటిలో, మీకు అతి ముఖ్యమైనది ఏమిటి? దీని గురించి మీరెప్పుడైనా ఒక నిర్ణయానికి వచ్చారా? మీకు అతి ముఖ్యమైనదిగా మీరు దేనిని విశ్వసిస్తారు? కొంతమంది, “నిజానికి, ఇది సత్యాన్ని ఆచరణలో పెట్టడం,” అని అంటారు, అదే మరి కొంతమంది, “నిజానికి, ఇది దేవుడి వాక్యములను ప్రతిరోజూ చదవడమే” అని అంటారు. కొందరు, “నిజానికి, ఇది దేవుడి యెదుటకు వచ్చి, ప్రతిరోజూ ఆయనను ప్రార్థించడం,” అని అంటారు, అదే “నిజానికి, ఇది నా కర్తవ్యాన్ని ప్రతిరోజూ సక్రమంగా చేయడం” అని చెప్పేవారు కూడా ఉన్నారు. దేవుడిని ఎలా సంతృప్తి పరచాలి, అన్ని విషయాలలో ఆయనకు ఎలా విధేయత చూపాలి మరియు ఆయన చిత్తంతో సామరస్యంగా ఉండేలా ఎలా ప్రవర్తించాలి అనే వాటిని గురించి మాత్రమే తామెప్పుడూ ఆలోచిస్తామని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇది సరైనదేనా? ఉన్నదంతా ఇదేనా? ఉదాహరణకు, “నేను దేవుడికి సమర్పించుకోవాలని మాత్రమే అనుకుంటాను, కానీ నాకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నేను అలా చేయలేను” అని కొందరు అంటారు. మరికొందరు, “నేను దేవుడిని సంతృప్తి పరచాలని, ఆయనను ఒక్కసారైనా నేను సంతృప్తి పరచగలిగితే చాలు అని అనుకుంటాను—కానీ నేను ఎన్నటికీ ఆయనను సంతృప్తి పరచలేను” అని అంటారు. కొందరు, “నేను దేవుడికి సమర్పించుకోవాలని మాత్రమే అనుకుంటాను. పరీక్షలు ఎదురైనప్పుడు, ఎలాంటి ఫిర్యాదులు లేదా అభ్యర్థనలు లేకుండా నేను ఆయన వాద్య బృందాలకు, ఆయన సార్వభౌమాధిపత్యానికి మరియు ఏర్పాట్లకు మాత్రమే సమర్పించుకోవాలని అనుకుంటాను. అయినప్పటికీ, సమర్పించుకోవడంలో నేను దాదాపు ప్రతిసారీ విఫలమవుతాను” అని అంటారు. మరికొందరైతే, “నేను నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, సత్యాన్ని ఆచరణలో పెట్టడాన్ని నేను ఎన్నడూ ఎంచుకోలేను. నేను ఎల్లప్పుడూ దేహాన్ని సంతృప్తి పరచాలనుకుంటాను మరియు నా సొంత వ్యక్తిగత, స్వార్థ కోరికలను నెరవేర్చుకోవాలనుకుంటాను” అని అంటారు. దీనికి కారణం ఏమిటి? దేవుడి పరీక్ష రాక ముందు, మీకై మీరు పదే పదే ప్రయత్నిస్తూ మరియు పరీక్షించుకుంటూ, అప్పటికే అనేకసార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఉంటారా? మీరు దేవుడికి నిష్కల్మషంగా సమర్పించుకోగలరా, ఆయనను నిజంగా సంతృప్తిపరచగలరా మరియు ఆయనకు మీరు నమ్మకద్రోహం చేయరని భరోసా ఇవ్వగలరేమో చూడండి; మిమ్మల్ని మీరు సంతృప్తిపరచుకోకుండా మరియు మీ స్వార్థ కోరికలను నెరవేర్చుకోకుండా, ఎలాంటి వ్యక్తిగత ఎంపికలు చేయకుండా కేవలం దేవుడిని మాత్రమే సంతృప్తి పరచగలరేమో చూడండి. ఇలా ఎవరైనా చేస్తారా? వాస్తవానికి, స్పష్టంగా మీ కండ్ల యెదుట ఉంచబడిన ఒకే ఒక యథార్థం ఉంది, మీలో ప్రతి ఒక్కరికీ అత్యంత ఆసక్తి ఉన్న మరియు మీరు అన్నింటికీ మించి తెలుసుకోవాలనుకునేది అదే—అది ప్రతి ఒక్కరి ఫలితం మరియు గమ్య స్థానం. మీరు దానిని తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఇది ఎవరూ కాదనలేని విషయం. వ్యక్తుల ఫలితాలు, మానవాళికి దేవుడి వాగ్దానం మరియు దేవుడు ప్రజలను ఏరకమైన గమ్య స్థానంలోనికి తీసుకురావాలని అనుకుంటున్నాడనే వాటికి సంబంధించిన సత్యం విషయానికొస్తే, ఈ విషయాలపై దేవుడి వాక్యములను అనేకసార్లు ఇప్పటికే అధ్యయనం చేసిన వారు కొందరున్నారని నాకు తెలుసు. అదే పదేపదే సమాధానం కోసం చూస్తూ, మనసులో దీర్ఘంగా ఆలోచిస్తూ, అయినప్పటికీ ఏమీ తెలుసుకోకుండా లేదా బహుశా ఏదో అస్పష్టమైన నిర్ణయానికి రాకుండా ఉండేవారు ఉన్నారు. చివరకు, వారికి ఎలాంటి ఫలితం రాబోతుందనే దానిపై వారు నిర్ధారణకు రాకుండా ఉండి పోతారు. వ్యక్తులు తమ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు, చాలామంది ఈ కింది ప్రశ్నలకు నిర్దిష్టమైన సమాధానాలు తెలుసుకోవాలనుకుంటారు: “నా ఫలితం ఏమై ఉంటుంది? నేను ఈ మార్గంలో కడవరకు నడవగలనా? మానవాళి పట్ల దేవుడి వైఖరి ఏమిటి? కొందరు ఈ విధంగా కూడా ఆందోళన చెందుతారు: “గతంలో, నేను కొన్ని పనులు చేశాను, కొన్ని విషయాలు చెప్పాను; నేను దేవుడికి అవిధేయుడిగా ఉన్నాను, నేను దేవుడికి నమ్మకద్రోహం చేసే చర్యలకు ఒడిగట్టాను, కొన్ని సందర్భాలలో, నేను దేవుడిని సంతృప్తిపరచలేకపోయాను, ఆయన మనోభావాలను గాయపరిచాను, ఆయనను నిరాశపరిచాను, ఆయన నన్ను ద్వేషించేలా మరియు నన్ను అసహ్యించుకునేలా చేశాను. బహుశా, అందువల్లే, నా ఫలితం తెలియదు.” చాలామంది తమ సొంత ఫలితం గురించి వ్యాకులతతో ఉంటారని చెప్పడం సబబుగా ఉంటుంది. “నేను రక్షణ పొందిన వాడినై ఉంటానని నూటికి నూరుశాతం ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది; నేను దేవుడి చిత్తాన్ని సంతృప్తిపర్చగలనని నూటికి నూరుశాతం ఖచ్చితంగా చెప్తాను. నేను దేవుడి హృదయంతో శృతి చేయబడిన వ్యక్తిని; నేను దేవుడు మెచ్చుకునే వ్యక్తిని” అని చెప్పడానికి ఎవరూ సాహసించరు. దేవుడి మార్గాన్ని అనుసరించడం మరీ కష్టమని మరియు సత్యాన్ని ఆచరించడం అన్నింటికంటే కఠినమైన పని అని కొందరు అనుకుంటారు. కాబట్టి, అలాంటి వ్యక్తులు తాము సహాయం పొందలేమని విశ్వసిస్తారు మరియు మంచి ఫలితం పొందడం గురించి తమ ఆశలు పెంచుకోవడానికి సాహసం చేయరు; లేదా వారు దేవుడి చిత్తాన్ని సంతృప్తిపరచలేమని, అందుచేత రక్షణ పొందినవారిగా మారలేమని, బహుశా, వారు విశ్వసిస్తారు. ఈ కారణంగా, వారికి ఎలాంటి ఫలితం లేదని మరియు మంచి గమ్య స్థానాన్ని చేరుకోలేరని వారు చెబుతారు. వ్యక్తులు ఎంత ఖచ్చితంగా అనుకున్నప్పటికీ, వారందరూ తమ ఫలితాల గురించి చాలాసార్లు విస్మయం చెందారు. వారి భవిష్యత్తు మరియు దేవుడు తన కార్యము ముగించిన తర్వాత వారు ఏమి పొందుతారు అనే ప్రశ్నల గురించి వారు నిరంతరం లెక్కిస్తూ మరియు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కొందరు రెట్టింపు మూల్యం చెల్లిస్తారు; కొందరు తమ కుటుంబాలు మరియు ఉద్యోగాలను విడిచిపెడతారు; కొందరు తమ వివాహాలను వదులుకుంటారు; కొందరు దేవుడి కోసం తమను తాము వెచ్చించడానికి అన్నీ వదులుకుంటారు; కొందరు తమ విధులను నెరవేర్చడానికి తమ ఇండ్లను విడిచిపెడతారు; కొందరు కష్టాన్ని ఎంచుకుంటారు మరియు అత్యంత చేదైన మరియు శ్రమగల పనులను చేయడం ప్రారంభిస్తారు; కొందరు తమ సంపదను అంకితం చేయడాన్ని మరియు తమ సర్వస్వాన్ని అర్పించడాన్ని ఎంచుకుంటారు; మరికొందరు సత్యాన్ని అన్వేషించడాన్ని మరియు దేవుడిని తెలుసుకునేందుకు కృషి చేయడాన్ని ఎంచుకుంటారు. మీరు ఆచరించడాన్ని ఎలా ఎంచుకున్నప్పటికీ, మీరు ఆచరించే విధానం ప్రధానమైనదా కాదా? (కాదు, అది ప్రధానం కాదు.) అయితే, ఈ “అప్రాధాన్యతను” మనం ఎలా వివరిస్తాము? ఆచరణ విధానం ప్రధానం కాకపోతే, మరి ప్రధానమైనది ఏమిటి? (సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి బాహ్యమైన మంచి ప్రవర్తన ప్రాతినిధ్యం వహించదు.) (ప్రతి వ్యక్తి ఆలోచనలు ప్రధానమైనవి కావు; మనం సత్యాన్ని ఆచరణలో పెట్టామా లేదా మరియు మనం దేవుడిని ప్రేమించామా లేదా అనేదే ఇక్కడ కీలకం.) (క్రీస్తు విరోధులు మరియు తప్పుడు నాయకుల పతనం బాహ్య ప్రవర్తన అత్యంత ప్రధానమైన విషయం కాదని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. పైపైన వారు ఎంతో విడిచిపెట్టినట్లు మరియు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ దగ్గరగా పరిశీలిస్తే, వారు దేవుడిని అసలు గౌరవించరని, దానికి బదులుగా వారు ఆయనను అన్ని రకాలుగా వ్యతిరేకిస్తారని మనం గమనించవచ్చు. కీలక సమయాలలో, వారు ఎల్లప్పుడూ సాతాను పక్షం వహిస్తారు మరియు దేవుడి కార్యానికి ఆటంకం కలిగిస్తారు. కాబట్టి, సమయం వచ్చినప్పుడు మనం ఏ పక్షాన నిలబడతాము మరియు విషయాలపై మన దృష్టికోణాలు ఏమిటి అనేవే ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన విషయాలు.) మీరంతా చాలా బాగా మాట్లాడుతారు మరియు మీకు ఇప్పటికే ప్రాథమిక అవగాహన ఉన్నట్లు మరియు సత్యాన్ని ఆచరణలో పెట్టడం, దేవుడి ఉద్దేశాలు మరియు దేవుడు మానవాళి నుండి ఏమి కోరుకుంటున్నాడు అనేవాటి విషయానికి వస్తే, వాటికి అనుగుణంగా జీవించడానికి ఒక ప్రమాణం ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు ఈవిధంగా మాట్లాడగలగడం అనేది హృదయాన్ని చాలా కదిలిస్తుంది. మీరు చెప్పే వాటిలో కొన్ని చాలా ఖచ్చితమైనవి కాకపోయినప్పటికీ, సత్యాన్ని గురించి మీకు ఇప్పటికే సరైన వివరణ ఉంది—అంటే వ్యక్తులు, సంఘటనలు మరియు మీ చుట్టూ ఉన్న వస్తువులు, దేవుడు ఏర్పాటు చేసిన పరిసరాలు మరియు మీరు చూడగలిగే అన్నింటి గురించి మీరు మీ సొంత యథార్థ అవగాహనను పెంపొందించుకున్నారని ఇది రుజువు చేస్తుంది. ఇది సత్యానికి అతి సమీపంలో ఉన్న అవగాహన. మీరు చెప్పినదంతా పూర్తిగా సమగ్రమైనది కాకపోయినప్పటికీ మరియు మీ మాటలలో కొన్ని బాగా అనువైనవి కాకపోయినప్పటికీ, మీ గ్రహింపు శక్తి ఇప్పటికే సత్యం యొక్క వాస్తవికత దగ్గరకు చేరుకుంటున్నది. మీరు ఈవిధంగా మాట్లాడం వింటుంటే నాకు చాలా బాగా అనిపిస్తోంది.

ప్రజల నమ్మకాలు సత్యం స్థానాన్ని తీసుకోలేవు

కొ౦తమ౦ది ప్రజలు కష్టాలను భరించగలుగుతారు, మూల్యాన్ని చెల్లి౦చగలరు, బాహ్య౦గా చాలా బాగా ప్రవర్తిస్తారు, చాలా బాగా గౌరవి౦చబడతారు, ఇతరుల ప్రశంసను అనుభవిస్తారు. ఈ విధమైనటువంటి బాహ్య ప్రవర్తనను సత్యాన్ని ఆచరణలో పెట్టినట్లుగా పరిగణించవచ్చని మీరు చెబుతారా? అటువంటి ప్రజలు దేవుని చిత్తాన్ని సంతృప్తి పరుస్తున్నారని ఎవరైనా నిర్ధారించగలరా? ప్రజలు మరల మరలా అటువంటి వ్యక్తులను చూసి, వారు దేవుణ్ణి స౦తృప్తిపరుస్తున్నారని, సత్యాన్ని ఆచరణలో పెట్టే మార్గ౦లో నడుస్తున్నారని మరియు దేవుడి మార్గానికి అనుగుణ౦గా నడుచుకు౦టున్నారని ఎ౦దుకు అనుకు౦టారు? కొంత మంది ఎందుకు ఈవిధంగా ఆలోచిస్తారు? దీనికి ఒకే ఒక వివరణ వుంది. ఆ వివరణ ఏమిటి? చాలా మంది ప్రజలకు సత్యాన్ని ఆచరణలో పెట్టడ౦ అ౦టే ఏమిటి, దేవుణ్ణి స౦తృప్తిపరచడ౦ అ౦టే ఏమిటి, సత్యం వాస్తవికతను నిజంగా కలిగి ఉండటం అ౦టే ఏమిటి అనేటటువంటి కొన్ని ప్రశ్నలు చాలా స్పష్ట౦గా లేవు. ఆవిధంగా, బయటకు ఆధ్యాత్మికంగా, ఘనంగా, ఉన్నతంగా మరియు గొప్పగా కనిపించే వారిచే తరచుగా మోసపరచబడే కొంతమంది ప్రజలు వున్నారు. లేఖనాల గురించీ, సిద్ధాంతాల గురించీ ధాటిగా మాట్లాడగల వ్యక్తుల విషయానికొస్తే, మరియు ఎవరి మాటలు, చేతలు మెచ్చుకోదగినవిగా అనిపిస్తాయో, వాటివల్ల మోసపోయినవారు తమ చర్యల సారాన్ని, తమ క్రియల వెనుక ఉన్న సూత్రాలను, లేదా వారి లక్ష్యాలు ఏమిటో ఎన్నడూ చూడలేదు. అంతేకాకుండా, ఈప్రజలు నిజంగా దేవునికి లోబడివున్నారా అని వారు ఎప్పుడు చూడలేదు లేదా ఈ ప్రజలు నిజ౦గా దేవునికి భయపడి చెడును విసర్జి౦చారో లేదో అని వారు ఎన్నడూ నిర్ధారించుకోలేదు. ఈ ప్రజల మానవత్వం సారాన్ని వారు ఎన్నడూ గ్రహించలేదు. బదులుగా, వారితో పరిచయ౦ పొ౦దడమనే మొదటి మెట్టుతో ప్రార౦భి౦చి, మెల్లమెల్లగా వారు ఈ ప్రజలను ప్రశంసించడానికి మరియు ఆరాధి౦చడానికి వచ్చారు మరియు చివరికి ఈ ప్రజలు వారి ఆరాధ్యదైవాలుగా తయారవుతారు. ఇంతేకాకు౦డా, కొ౦తమ౦ది ప్రజల మనస్సుల్లో తాము ఆరాధి౦చేవారు మరియు తాము నమ్మేవారు తమ కుటు౦బాలను, ఉద్యోగాలను పరిత్యజించి, పైపైన మూల్య౦ చెల్లి౦చగలిగినట్లు కనిపి౦చే ఆరాధ్యనీయులు దేవుణ్ణి నిజ౦గా స౦తృప్తిపరుస్తారు మరియు నిజంగా మ౦చి ఫలితాలను, మ౦చి గమ్యస్థానాలను పొందుకోగలరు. వారి మనస్సులో, దేవుడు ప్రశంసించేది ఈ ఆరాధ్యనీయుల నే అలాంటి వారిని నమ్మడానికి కారణం ఏమిటి? ఈ సమస్య సారం ఏమిటి? అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? ముందుగా దాని సారం గురించి చర్చిద్దాం.

అతిముఖ్యంగా, ప్రజల దృష్టికోణములకు సంబంధించిన ఈ సమస్యలు, వారు ఆచరించే పద్ధతులు, వారు ఏ ఆచరణా సూత్రాలను అవల౦బి౦చాలని ఎంచుకుంటారు మరియు వారిలో ప్రతి ఒక్కరూ దేనిపై దృష్టి కేంద్రీకరి౦చడానికి మొగ్గు చూపుతారో దానికి, మానవాళి గురి౦చిన దేవుని కోరికలతో ఏ విధమైన స౦బ౦ధ౦ లేదు. ప్రజలు నిస్సారమైన విషయాలపైనా, గంభీరమైన సమస్యలపైనా, లేఖల మీద, సిద్ధాంతాల మీదా లేదా వాస్తవికత మీద దృష్టి సారించినా, వారు ఎక్కువగా పాటించవలసినదానికి కట్టుబడి ఉండరు, లేదా వారు ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయం వారికి తెలియదు. దీనికి కారణము ఏమిటంటే ప్రజలు నిజాన్ని అస్సలు ఇష్టపడరు; అ౦దుకే, వారు దేవుని భాషణలలో ఆచరణ సూత్రాలను కనుగొనడానికి, ఆచరణలో పెట్టడానికి సమయాన్ని మరియు కృషిని వెచ్చి౦చడానికి ఇష్టపడరు. బదులుగా, వారు దగ్గర మార్గాలను ఉపయోగించడాన్ని ఎంచుకుంటారు, మంచి అభ్యాసం మరియు మంచి ప్రవర్తన అని వారు అర్థం చేసుకున్న మరియు తెలిసిన వాటిని సంక్షిప్తం చేస్తారు; తర్వాత ఈ సారాంశం వెంబడించడానికి వారి స్వంత లక్ష్యంగా మారుతుంది, దీనిని వారు ఆచరించే సత్యంగా తీసుకుంటారు. దీని ప్రత్యక్ష పర్యవసానం ఏమిటంటే ప్రజలు సత్యాన్ని ఆచరణలో పెట్టటానికి ప్రత్యామ్నాయంగా మానవుని మంచి ప్రవర్తనను వాడతారు, వారు దేవుని అనుగ్రహాన్ని పొందుకోవాలనే వారి కోరికను కూడా ఇది సంతృప్తిపరుస్తుంది. సత్య౦తో పోరాడే౦దుకు అది వారికి మూలధనాన్ని ఇస్తు౦ది, దాన్ని వారు తర్కి౦చడానికి, దేవుడితో పోటీపడడానికి కూడా ఉపయోగిస్తారు. అదే సమయంలో, ప్రజలు నిర్ద్వద్వంగా దేవుడ్ని పక్కన పెడతారు, ఆయనకు బదులుగా వారు ఆరాధించే విగ్రహాల్ని పెడతారు. ప్రజలు ఇటువంటి నిర్లక్ష్య ధోరణలు మరియు దృష్టికోణములను లేదా ఏకపక్ష అభిప్రాయాలూ మరియు అభ్యాసములు కలిగివుండటానికి ఒకే ఒక మూలకారణము వుంది—మరియు ఈ రోజు దాని గురించి నేను చెప్పబోతున్నాను: కారణము ఏమిటంటే, ప్రజలు దేవుడ్ని అనుసరించినప్పటికీ, ప్రతిరోజూ ఆయనను ప్రార్దించినప్పటికీ మరియు అయన వాక్కులను ప్రతిరోజూ ధ్యానించినప్పటికీ, వారు వాస్తవానికి అయన చిత్తాన్నిఅర్ధం చేసుకోలేరు. సమస్యకు మూలం ఇక్కడ వుంది. ఎవరైనా దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని మరియు ఆయన ఏది ఇష్టపడతాడో, ఆయన దేనిని అసహ్యించుకుంటున్నాడో, అయన ఏమి కోరుకుంటున్నాడో, అయన దేనిని తిరస్కరిస్తున్నాడో, ఎటువంటి వ్యక్తిని ప్రేమిస్తున్నాడో, అయన ఎటువంటి వ్యక్తిని ఇష్టపడడో, ప్రజల కోరికలు తీర్చేటప్పుడు ఆయన ఎటువంటి ప్రమాణాలను ఉపయోగిస్తాడు మరియు వారిని పరిపూర్ణం చేయడానికి ఆయన ఎటువంటి విధానాన్ని అనుసరిస్తాడు, అప్పుడు ఆ వ్యక్తికి వారి స్వంత వ్యక్తిగత అభిప్రాయాలు ఇంకా ఉండవచ్చా? ఇటువంటి ప్రజలు మాములుగా వెళ్లి వేరొకరిని ఆరాధించగలరా? ఒక సాధారణ మానవుడు వారి ఆరాధ్యదైవంగా మారగలడా? దేవుని చిత్తాన్ని అర్థ౦ చేసుకునే వ్యక్తులు దానిక౦టే కొ౦చె౦ ఎక్కువ యుక్తిగల దృష్టికోణాన్ని కలిగివు౦టారు. వారు చెడిపోయిన వ్యక్తిని యధేచ్చగా ఆరాధి౦చరు, సత్యాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే మార్గ౦లో నడుస్తున్నప్పుడు, కొన్ని సరళమైన నియమాలకు లేదా సూత్రాలకు గుడ్డిగా కట్టుబడి ఉ౦డడ౦ సత్యాన్ని ఆచరణలో పెట్టడ౦తో సమానమని వారు నమ్మరు.

దేవుడు ప్రజల ఫలితాలను నిర్ణయించే ప్రమాణానికి సంబంధించి అనేకమైన అభిప్రాయాలు వున్నాయి.

మనం ఈఅంశానికి తిరిగివచ్చి ఫలితం అనే విషయానికి సంబంధించి చర్చించడాన్ని కొనసాగిద్దాం.

ప్రతి వ్యక్తి వారి స్వంత ఫలితానికి సంబంధించి ఆలోచించడం వాళ్ళ, ఆ ఫలితాన్ని దేవుడు ఎలా నిర్ణయిస్తాడో మీకు తెలుసా? ఒకరి ఫలితాన్ని దేవుడు ఏ పద్దతిలో నిర్ణయిస్తాడు? అన్నిటికంటే, దానిని నిర్ణయించడానికి దేవుడు ఎటువంటి ప్రమాణాన్ని వినియోగించాడు? ఒక వ్యక్తి ఫలితం ఇంకను నిర్ణయించబడవలసి వున్నప్పుడు, దానిని ప్రకటించడానికి దేవుడు ఏమి చేస్తాడు? ఎవరికైనా తెలుసా? నేను ఒక్క క్షణం క్రితం చెప్పినట్లుగా, ప్రజల ఫలితాల గురి౦చి, వివిధ రకాల ప్రజల కోస౦ ఎదురుచూసే వివిధ రకాల ఫలితాల గురి౦చి ఆచూకీలు వెతికే ప్రయత్న౦లో, ఈ ఫలితాలు ఏ విభాగాలుగా విభజి౦చబడ్డాయో, దేవుని మాటలను పరిశోధి౦చే౦దుకు కొ౦తమ౦ది ఇప్పటికే చాలా కాల౦ గడిపారు. దేవుని వాక్య౦ ప్రజల ఫలితాలను ఎలా నిర్దేశిస్తు౦దో, ఆయన ఎలా౦టి ప్రమాణాన్ని ఉపయోగిస్తాడో మరియు ఒక వ్యక్తి ఫలితాన్ని ఆయన ఎలా నిర్ణయిస్తాడో తెలుసుకోవాలని కూడా వారు ఆశ కలిగివున్నారు. చివరికి, ఎలాగయినా ఈ వ్యక్తులు ఎప్పటికీ ఎటువంటి సమాధానాలను కనుగొనలేరు. వాస్తవానికి, దేవుని వాక్కులలో ఈ విషయ౦ గురి౦చి అమూల్యమైన మాటలు చాలా తక్కువ చెప్పబడింది. ఇది ఎందుకు? ప్రజల ఫలితాలు ఇ౦కా వెల్లడి అవనంతవరకు, చివరికి ఏమి జరగబోతో౦దో దేవుడు ఎవ్వరికీ చెప్పడానికి ఇష్టపడడు, లేదా వారి గమ్యస్థాన౦ గురి౦చి కాలానికి ము౦దే ఎవరికీ తెలియజేయాలని ఆయన కోరుకోడు—ఎ౦దుక౦టే ఆవిధంగా చేయడ౦ మానవాళికి ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించదు. ఇక్కడ మరియు ఇప్పుడు, దేవుడు ప్రజల ఫలితాలను నిర్ణయించేటటువంటి విధానం గురించి, ఈ ఫలితాలను నిర్ణయించడానికి మరియు వ్యక్తపరచడానికి తన పనిలో ఆయన ఉపయోగించే సూత్రాల గురించి మరియు ఎవరైనా మనుగడ సాగించగలరా లేదా అని నిర్ధారించడానికి ఆయన ఉపయోగించే ప్రమాణం గురించి మాత్రమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నలు మీరు ఎక్కువగా విచారం చెందుతున్న ప్రశ్నలు కాదా? కాబట్టి, దేవుడు ప్రజల ఫలితాలను నిర్ణయిస్తాడని ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? మీరు దానిలో ఒక భాగాన్ని ఇప్పుడు చెప్పారు: మీలో కొందరు ఒకరి విధులను విశ్వసనీయంగా చేయడం మరియు దేవుని కోసం ఖర్చు పెట్టడంతో సంబంధం కలిగి ఉందని చెప్పారు; కొ౦దరు దేవునికి లోబడడ౦ మరియు ఆయనను స౦తృప్తిపరచడ౦ గురి౦చి చెప్పారు; కొ౦తమ౦ది దేవుని కృపలో ఉ౦డడ౦ ఒక కారకం అని చెప్పారు; మరియు కొంతమంది తగ్గి ఉండటం మూలం అని చెప్పారు…. మీరు ఈ సత్యాలను ఆచరణలో పెట్టినప్పుడు, మరియు మీరు సరైనవని నమ్మే సూత్రాలకు అనుగుణంగా మీరు అభ్యాసం చేసినప్పుడు, దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడో మీకు తెలుసా? ఇలా వెళ్ళటం లేదా వెళ్ళకపోవడం అనేది ఆయన సంకల్పాన్ని సంతృప్తి పరుస్తుందా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది ఆయన ప్రమాణానికి అనుగుణ౦గా ఉ౦దా? అది ఆయన కోరికలను తీరుస్తుందా? చాలా మంది ప్రజలు ఇలాంటి ప్రశ్నల గురించి ఎక్కువ ఆలోచించరని నేను నమ్ముతాను. వారు కేవల౦ యాంత్రిక౦గా దేవుని వాక్య౦లోని కొ౦త భాగాన్ని లేదా ప్రస౦గాల్లోని కొ౦త భాగాన్ని లేదా తాము ఆరాధి౦చే కొ౦తమ౦ది ఆధ్యాత్మిక వ్యక్తుల ప్రమాణాలను అన్వయి౦చుకు౦టూ, అది మరియు ఇది చేయమని తమని తాము బలవ౦త౦ చేసుకుంటారు. ఇది సరియైన దారి అని వారు విశ్వసిస్తారు, కాబట్టి చివరికి ఏమి జరిగినప్పటికీ వారు దానిని అనుసరిస్తారు మరియు చేస్తారు. కొంతమంది ప్రజలు, “నేను చాలా సంవత్సరముల నుండి విశ్వాసాన్ని కలిగి వున్నారు; నేను ఎల్లప్పుడూ ఈ మార్గాన్ని అభ్యసించాను. నేను దేవుడ్ని నిజంగా సంతృప్తిపరచానని భావిస్తున్నాను మరియు నేను దాని నుండి చాలా పొందుకున్నానని భావిస్తున్నాను. ఇది ఎందుకంటే నేను ఈ సమయంలో చాలా సత్యములను అర్ధం చేసుకున్నాను, అదే విధంగా నేను ముందు అర్ధం చేసుకొని చాలా విషయాలను అర్ధం చేసుకున్నాను. ప్రత్యేకంగా, నా యొక్క చాలా ఆలోచనలు మరియు అభిప్రాయాలు మారాయి, నా జీవిత విలువలు బ్రహ్మండంగా మారాయి మరియు నాకు ఇప్పడు ప్రపంచమును గురించి మంచి అవగాహన వుంది.” అటువంటి ప్రజలు ఇది ఒక పంట మరియు మానవాళి కొరకు దేవుని కార్యం అంతిమ ఫలితం అని విశ్వసిస్తారు. మీ అభిప్రాయంలో, ఈ ప్రమాణాలు మరియు మీ అభ్యాసములు కలిపి చూస్తే, మీరు దేవుని చిత్తాన్ని సంతృప్తి పరుస్తున్నారా? మీలో కొ౦తమ౦ది పూర్తి ఖచ్చితత్వంతో ఇలా అ౦టారు, “అవును! మేము దేవుని వాక్య ప్రకారము అభ్యాసం చేస్తున్నాము; పైన పేర్కొన్న వారు బోధించిన మరియు తెలియచేసిన దాని ప్రకారం మేము అభ్యాసం చేస్తున్నాము. మేము నిరంతరం మా విధులను నిర్వర్తిస్తున్నాము మరియు ఎడతెగకుండా దేవుణ్ణి అనుసరిస్తున్నాము మరియు మేము ఎన్నడూ దేవుణ్ణి విడనాడలేదు. కాబట్టి మేము దేవుణ్ణి సంతృప్తిపరుస్తున్నామని పూర్తి నమ్మకంతో చెప్పగలం. ఆయన ఉద్దేశ్యాలను మేముఎ౦తగా అర్థ౦ చేసుకున్నామని కాకుండా మరియు ఆయన వాక్యాన్ని మేము ఎ౦తగా అర్థ౦ చేసుకున్నామని కాకుండా, మేము ఎల్లప్పుడూ దేవునికి తగినట్టుగా ఉ౦డే౦దుకు ప్రయత్ని౦చే మార్గ౦లో ఉ౦టా౦. మేముసరిగ్గా ప్రవర్తి౦చి, సరిగ్గా అభ్యాసం చేసిన౦తకాల౦, అప్పుడు మేము సరైన ఫలితాన్ని సాధి౦చవలసి ఉ౦టు౦ది.” ఈ దృష్టికోణం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది సరైనదేనా? కొ౦తమ౦ది ఇలా కూడా అ౦టూ ఉ౦డవచ్చు, “నేను ఈ విషయాల గురి౦చి ము౦దు ఎప్పుడూ ఆలోచి౦చలేదు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, దేవుని మాటల ఆవశ్యకతలకు అనుగుణ౦గా ప్రవర్తి౦చిన౦తకాల౦ నేను మనుగడ సాగి౦చగలనని మాత్రమే అనుకు౦టున్నాను. నేను దేవుని హృదయాన్ని సంతృప్తి పరచగలనా లేదా అనే ప్రశ్నను నేను ఎప్పుడూ పరిగణించలేదు లేదా ఆయన నాముందు ఉంచిన ప్రమాణాన్ని ఎప్పటికైనా చేరుకోగలనా లేదా అని నేను ఎప్పుడూ పరిగణించలేదు. దేవుడు నాకు ఎప్పుడూ చెప్పలేదు లేదా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనందున, ఆపకుండా నేను పనిచేస్తూ ఉన్నంతకాలం, దేవుడు తృప్తి చెందుతాడు మరియు నా నుండి అదనపు డిమాండ్లు చేయకూడదని నేను నమ్ముతున్నాను.” ఈ నమ్మకాలన్నీసరైనవా? నాకు సంబంధించినంతవరకు, ఈ విధమైన అభ్యాసం, ఈ విధమైన ఆలోచన మరియు ఈ దృష్టికోణములు అన్ని కూడా అనివార్యంగా ఊహాజనితమైనవి, అలాగే కొంచెం అంధత్వాన్ని కలిగివుంటాయి. బహుశా నేనిలా చెప్పడం అంధత్వమా? అనే ఆలోచన చేసేలా మీలో కొ౦తమ౦దికి కొ౦చె౦ నిరుత్సాహ౦ కలిగించివుండవచ్చు. ఇది అంధత్వమైతే, అప్పుడు మోక్షం మరియు మనుగడ కోసం మన నిరీక్షణ చాలా చిన్నది మరియు అనిశ్చితమైనది, కాదా? దానిని ఆ విధంగా చెప్పడం ద్వారా, మీరు మాపై చల్లని నీటిని పోస్తున్నారు కదా?” మీరు ఏమి నమ్మినప్పటికీ, నేను చెప్పే మరియు చేసే విషయాలు మీపై చల్లని నీరు పోయబడినట్లు మీకు అనిపించడానికి ఉద్దేశించినవి కావు. బదులుగా, అవి దేవుని ఉద్దేశాల పట్ల మీ అవగాహనను మెరుగుపరచడానికి మరియు ఆయన ఏమి ఆలోచిస్తున్నాడు, ఆయన ఏమి పూర్తిచేయాలని అనుకుంటున్నాడు, ఆయన ఏ రకమైన వ్యక్తులను ఇష్టపడతాడు, ఆయన దేనిని అసహ్యించుకుంటాడు, ఆయన దేనిని తృణీకరిస్తాడు, ఆయన ఏ రకమైన వ్యక్తిని పొందాలనుకుంటున్నాడు మరియు మరియు ఆయన ఏ రకమైన వ్యక్తిని నిరాకరిస్తాడు అనే దానిపై మీ అవగాహనను పెంచడానికి ఉద్దేశించబడ్డాయి. అవి, మీలో ప్రతి ఒక్కరి చర్యలు మరియు ఆలోచనలు దేవుడికి అవసరమైన ప్రమాణం నుండి ఎంత దూరం వరకు దారి తప్పాయో అని మీ మనస్సులకు స్పష్టతను ఇవ్వడానికి మరియు మీకు స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఉద్దేశించినవి. ఈ విషయాలను చర్చించడం అనేది చాలా ఆవశ్యకమా? ఎందుకంటే మీరు చాలా కాలం నుండి విశ్వాసం కలిగివున్నారు మరియు చాలా ప్రసంగాల్ని విని వున్నారు, కానీ ఇవే మీకు అత్య౦త లోప౦గా ఉ౦డే విషయాలు. మీ నోటు పుస్తకాలలో ప్రతి సత్యమును నమోదు చేసియున్నప్పటికీ, మరియు మీరు వ్యక్తిగతంగా చాలా ముఖ్యం అనుకున్న విషయాల్ని కంఠస్తం చేసి మీ హృదయాల్లో చెక్కుకుని యున్నప్పటికీ మరియు మీ అభ్యాసంలో దేవుణ్ణి సంతృప్తి పరచడానికి వీటిని ఉపయోగించాలని, అవసరతలో మీరున్నారని మీకు తెలిసినప్పుడు వాటిని వాడటానికి, రాబోయే క్లిష్టసమయాల్ని అధిగమించడానికి వాటిని ఉపయోగించడానికి లేదా ఊరకనే మీరు మీ జీవితాలను జీవిస్తున్నప్పుడు అవి మీకు తోడుగా ఉండటానికి, మీరు యోచిస్తున్నారు నాకు సంబంధించినంత వరకు, మీరు ఎలా చేసినా, మీరు దీన్ని ఎలా చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, మీరు దీన్ని కేవలం చేస్తున్నట్లయితే, ఇది అంత ముఖ్యమైనది కాదు. మరి, ఏది చాలా ముఖ్యమైన విషయం? నువ్వు అభ్యాసం చేస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్న ప్రతి ఒక విషయం, ప్రతి ఒక్క పని కూడా దేవుడు కోరుకున్నదానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని, మరియు నీ అన్ని చర్యలు, నీ అన్ని ఆలోచనలు, మరియు నువ్వు సాధించాలనుకునే ఫలితాలు మరియు లక్ష్యం నిజంగా దేవుని సంకల్పాన్ని సంతృప్తి పరచాలని మరియు ఆయన కోర్కెలను తీర్చాలని నువ్వు కోరుకుంటావా లేదా అనే విషయాన్ని అలాగే ఆయన వాటిని ఆమోదిస్తున్నాడా లేదా అని కూడా సంపూర్ణమైన నిశ్చయతతో నువ్వు తప్పకుండా లోతుగా తెలుసుకోవాలి. ఇవి ఏమిటంటే చాలా ప్రాముఖ్యమైనవి.

దేవుడి మార్గంలో నడవండి: దేవుడికి భయపడండి మరియు చెడుతనమును విసర్జించండి

మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక సామెత వుంది. నేను అది చాల ముఖ్యమైనదని నమ్ముతాను, ఎందుకంటే ప్రతి ఒక్కరోజు లెక్కలేనన్ని సార్లు అది నా మనసులోకి వస్తుంది. ఎందుకని? ఎందుకంటే, నేను ఎవరినైనా ఎదుర్కొన్న ప్రతిసారి, నేను ఎవరిదైనా కధ విన్న ప్రతిసారి, మరియు దేవుని విశ్వసించుటలో ఒక వ్యక్తి అనుభవం లేదా సాక్ష్యం విన్న ప్రతిసారి, ఈ వ్యక్తి దేవుడు కోరుకు౦టున్న వ్యక్తి, దేవుడు ఇష్టపడే వ్యక్తి అవునా కాదా అని నా హృదయ౦లో నిర్ణయి౦చుకోవడానికి నేను ఎల్లప్పుడూ ఈ సామెతను ఉపయోగిస్తాను. కాబట్టి: ఈ సామెత ఏమిటి? నేను ఇప్పుడు మీ సీట్ల అంచులలో మీరందర్నీ కలిగివున్నాను. నేను సామెతను బహిర్గతం చేసినప్పుడు, బహుశా మీరు నిరాశ చెందవచ్చు, ఎందుకంటే కొంతమంది చాలా సంవత్సరాలుగా దీనికి పెదవి సేవ చేస్తున్నారు. అయితే, నేను అసలు ఎప్పుడూ ఒక్కసారి కూడా దానికి పెదవి సేవ చేయలేదు. ఈ సామెత నా హృదయంలో నివసిస్తుంది. కాబట్టి, ఆ సామెత ఏమిటి? అది: దేవుడి మార్గంలో నడవండి: దేవుడికి భయపడండి మరియు చెడుతనమును విసర్జించండి. ఇది చాలా సరళమైన వాక్యం కాదా? అయినప్పటికీ, అది నిరాడంబరత కలిగినదైనప్పటికీ, ఈ మాటల గురి౦చి నిజ౦గా లోతైన అవగాహన ఉన్న ప్రజలు, అవి ఎ౦తో ప్రాముఖ్యమైనవని, ఈ సామెత తమ ఆచరణకు ఎ౦తో విలువైనదని, అది సత్యస౦బ౦ధమైన వాస్తవికతను కలిగివున్న జీవిత భాష ను౦డి వచ్చిన ఒక పంక్తి అనీ, దేవుణ్ణి తృప్తిపరచాలనుకునేవారికి అది జీవితకాల లక్ష్యాన్ని సూచిస్తు౦దనీ భావిస్తారు, మరియు ఇది దేవుని ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకునే ఎవరైనా అనుసరించాల్సిన జీవితకాల మార్గం. కాబట్టి, మీరు ఏమి ఆలోచిస్తున్నారు: ఈ సామెత సత్యం కాదా? దీనికి అటువంటి ప్రాముఖ్యత ఉందా లేదా? ఇంకా, అలాగే మీలో కొ౦తమ౦ది ఈ సామెత గురి౦చి ఆలోచి౦చి, దాన్ని గుర్తి౦చే౦దుకు ప్రయత్ని౦చి ఉ౦డవచ్చు, బహుశా మీలో కొ౦తమ౦ది దాని గురి౦చి సందేహించి ఉ౦డవచ్చు: ఈ సామెత చాలా ముఖ్యమైనదా? ఇది చాలా ముఖ్యమైనదా? దీని గురించి చాలా నొక్కి చెప్పటం అవసరమా? మీలో చాలా మందికి ఈ సామెత నచ్చకపోయి కూడా ఉండవచ్చు ఎందుకంటే దేవుని మార్గ౦లో పయని౦చి, దాన్ని ఈ సామెతలోకి స్వేదన౦ చేయడ౦ చాలా సరళంగా ఉ౦టు౦దని మీరు అనుకు౦టారు. దేవుడు చెప్పిన దానినంతటిని తీసుకొని ఒక సామెతకు దాన్నికుదించడం — అది దేవుణ్ణి కొ౦చె౦ అప్రాధాన్యత ఉ౦డేలా చేయడ౦ కాదా? ఇది ఆ విధంగానే ఉందా? ఈ పదాల గంభీరమైన ప్రాముఖ్యతను మీలో చాలా మంది పూర్తిగా అర్థం చేసుకోలేకపోయివుండొచ్చు. మీరందరూ దానిని నోట్ చేసుకొని ఉన్నప్పటికీ, మీ హృదయాల్లో ఈ సామెతను పదిలపరచుకునే ఉద్దేశ్యం లేదు; ఖాళీ సమయాల్లో తిరిగి సందర్శించడానికి మీ నోటు పుస్తకాల్లో దాన్ని ఊరకనే వ్రాసి పెట్టుకునివున్నారు. మీలో కొంతమంది దాన్ని మంచికి ఉపయోగించడానికి ప్రయత్నించరు సరికదా కనీసం ఈ సామెతను కంఠస్తం చేయడానికి కూడా తాపత్రయపడరు, అయినా ఎందుకు, నేను ఈ సామెతను ప్రస్తావించదలచుకున్నాను? మీ దృక్పధం మరియు మీరు ఏమి ఆలోచిస్తారని దానితో సంబంధం లేకుండా నేను ఈ సామెతను ప్రస్తావించవలసి వచ్చింది, ప్రజల ఫలితాలను దేవుడు ఏ విధంగా నిర్ణయిస్తాడనే దానికి ఇది సంబంధించింది. ఈ సామెత పట్ల మీ ప్రస్తుత అవగాహన ఏమైనప్పటికి లేదా దానిని ఎలా పరిగణించినప్పటికీ, నేను దీనిని ఇప్పటికీ మీకు చెపుతాను: ప్రజలు ఈ సామెత మాటలను ఆచరణలో పెట్టి మరియు వాటిని అనుభవించినట్లయితే, మరియు దేవుని పట్ల భయమును మరియు చెడును విసర్జించుటలో ప్రమాణాన్ని సాధించినట్లయితే, అప్పుడు వారు మృతశేషులుగా మరియు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. అయినప్పటికిని, ఒకవేళ నువ్వు ఈ సామెత ద్వారా రూపొందించబడ్డ ప్రమాణాన్ని చేరుకోలేకపోయినట్లయితే, అప్పుడునీ ఫలితం తెలియనిది అని చెప్పవచ్చు. ఆ విధంగా, మీ స్వంత మానసిక సన్నద్ధత కొరకు ఈ సామెత గురించి నేను మీతో మాట్లాడుతున్నాను మరియు తద్వారా దేవుడు మిమ్మల్ని కొలవడానికి ఎటువంటి ప్రామాణికతను ఉపయోగిస్తాడో మీరు తెలుసుకుంటారు. నేను ఇప్పుడే మీతో చెప్పినట్లుగా, ఈ సామెత మానవాళికి దేవుని రక్షణకు, అదే విధంగా ఆయన ప్రజల ఫలితాలను ఎలా నిర్ణయిస్తాడనేదానికి ఎంతో సంబంధించింది. ఇది ఏ విధంగా సంబంధితమైనది? మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే, ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం.

ప్రజలు దేవునికి భయపడుతున్నారా మరియు చెడును విసర్జించారా అని పరీక్షించడానికి దేవుడు అనేకవిధములైన పద్దతులను వినియోగిస్తాడు

ప్రతి యుగంలోనూ, మనుష్యుల మధ్య కార్యం చేయుచున్నప్పుడు, దేవుడు కొన్ని మాటలను వారికి దయచేస్తాడు మరియు కొన్ని సత్యాల్ని వారికి చెబుతాడు. ఈ సత్యములు ప్రజలు కట్టుబడి ఉండాల్సిన రీతిగా, వారు నడవవలసిన మార్గంగా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటానికి మరియు చెడును విసర్జించడానికి వారికి వీలు కల్పించే మార్గంగా మరియు ప్రజలు తమ జీవితాలలో మరియు వారి జీవిత ప్రయాణాలలో ఆచరణలో పెట్టాల్సిన మరియు కట్టుబడి ఉండాల్సిన మార్గంగా పనిచేస్తాయి. ఈ కారణాల చేత దేవుడు మానవాళికి ఈ వాక్కులను వ్యక్తపరుస్తున్నాడు. దేవుని నుండి వచ్చు ఈ మాటలకు ప్రజలు కట్టుబడి ఉండాలి, మరియు వాటికి కట్టుబడి ఉండటం అంటే నిత్యజీవాన్ని పొందుకోవటం. ఒక వ్యక్తి వాటికి కట్టుబడి ఉండనట్లయితే, వాటిని ఆచరణలో పెట్టనట్లయితే మరియు వారి జీవితాల్లో దేవుని మాటల ప్రకారం జీవించకపోతే, అప్పుడు ఈ వ్యక్తి సత్యమును ఆచరణలో పెట్టటం లేదు. ఇంతే కాకుండా, ప్రజలు సత్యమును ఆచరణలో పెట్టకపోయినట్లయితే, అప్పుడు వారు దేవుడికి భయపడటం లేదు మరియు చెడును విసర్జించడం లేదు, దేవుడ్ని సంతృప్తిపరచడంలేదు. దేవుడ్ని సంతృప్తిపరచే సామర్ధ్యం లేని ప్రజలు ఆయన మెప్పును పొందుకోలేరు, మరియు అటువంటి ప్రజలకు ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి, ఆయన కార్యం చేసే క్రమంలో దేవుడు ఒక వ్యక్తి ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తాడు? ఒక వ్యక్తి ఫలితాన్ని నిర్ణయించడానికి దేవుడు ఏ పద్ధతులను ఉపయోగిస్తాడు బహుశా మీరు ఈ క్షణంలో దీనిపై ఇంకా కొంచెం అస్పష్టంగా ఉన్నారు, కానీ నేను ఈ ప్రక్రియ గురించి మీకు చెప్పినప్పుడు, ఇది చాలా స్పష్టంగా ఉంటుంది, ఎందుకంటే, ఇప్పటికే మీలో చాలా మంది దీనిని అనుభవించారు.

ప్రారంభం నుండి ఆయన కార్యం క్రమంలో, దేవుడు ప్రతి వ్యక్తికీ లేదా ఆయనను అనుసరించే ప్రతి వ్యక్తికీ పరీక్షలను నిర్దేశించారు, ఈ పరీక్షలు వివిధ పరిమాణాల్లో వస్తాయి. కుటుంబాల చేత తిరస్కరించబడ్డారనే విచారణను అనుభవించినవారు, ప్రతికూల వాతావరణాల విచారణను అనుభవించినవారు, ఖైదుకాబడటం మరియు చిత్రహింసలు అనుభవించడం అనే విచారణను అనుభవించినవారు, ఎంపికలచే ఎదుర్కొనబడటం అనే విచారణను అనుభవించినవారు మరియు డబ్బు మరియు హోదా అనే విచారణలను ఎదుర్కొన్నవారు వున్నారు. సాధారణంగా మాట్లాడితే, మీలో ప్రతి ఒక్కరూ అన్ని రకాల విచారణలను ఎదుర్కొన్నారు. దేవుడు ఈ విధంగా ఎందుకు కార్యం చేస్తాడు? ఆయన ప్రతి ఒక్కరితో ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఏ రకమైన ఫలితాన్ని ఆయన కోరుకుంటున్నాడు? ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను: ఈ వ్యక్తి ఆయనకు భయపడతాడా మరియు చెడును విసర్జిస్తాడా లేదా అని దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. దీని అర్ధం ఏమిటంటే దేవుడు మీకు ఒక పరీక్షను ఇచ్చినప్పుడు మరియు ఏదైనా ఒక పరిస్థితితో లేదా ఇంకొకదానితో మిమ్మల్ని ఎదుర్కొంటున్నపుడు, ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఒక వ్యక్తి ఆయనకు భయపడుతున్నాడా మరియు చెడును విసర్జిస్తున్నాడా? లేదా అని. పరీక్షించడం ఎవరైనా ఒక అర్పణను భద్ర౦గా వుంచడమనే విధిని ఎదుర్కొ౦టే, ఆ విధి దేవుని అర్పణతో స౦బ౦ధ౦లోకి రావడానికి దారితీస్తు౦టే, అది దేవుడు ఏర్పాటు చేసినది అని మీరు చెబుతారా? అది సందేహం లేకుండా! మీరు ఎదుర్కొంటున్న ప్రతీది దేవుడు ఏర్పాటు చేసినది. ఇటువంటి విషయాన్నీ మీరు ఎదుర్కొన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని రహస్యంగా గమనిస్తాడు, ఎటువంటి ఎంపికలు మీరు చేస్తారు, ఎలా అభ్యసిస్తారు మరియు ఎటువంటి ఆలోచనలు మీరు కలిగివున్నారని చూస్తాడు. దేవుడు అత్య౦త శ్రద్ధ చూపి౦చేది ఏమిటంటే చివరి ఫలిత౦, ఎ౦దుక౦టే ఈ నిర్దిష్ట పరీక్షలో ఆయన ప్రమాణాలకు అనుగుణ౦గా మీరు జీవి౦చారా లేదా అని కొలిచే౦దుకు ఈ ఫలితమే ఆయనకు సహాయ౦ చేస్తు౦ది. అయినప్పటికీ, ప్రజలు ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు, తరచుగా వారు ఎందుకు మేము దీనిని ఎదుర్కొంటున్నాము, ఏ ప్రమాణానికి వారు చేరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు, వారిలో ఏమి చూడాలని ఆయన కోరుకుంటున్నాడు లేదా వారి నుండి ఆయన ఏమి పొందుకోవాలని కోరుకుంటున్నాడని తరచుగా ఆలోచించరు. ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు, అటువంటి ప్రజలు కేవలం ఇలా ఆలోచిస్తారు, “ఇది నేను ఎదుర్కొంటున్న విషయం; నేను జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా వుండకూడదు! ఏమైనప్పటికి, ఇది దేవుని అర్పణ మరియు నేను దానిని ముట్టుకోలేను.” అటువంటి సరళమైన ఆలోచనలతో సిద్దపడి వుండే ప్రజలు వారి భాద్యతలను నెరవేర్చామని నమ్ముతారు. ఈ పరీక్ష ఫలితం దేవునికి సంతృప్తిని తీసుకువస్తుందా లేదా? ముందుకు సాగండి మరియు దాని గురించి మాట్లాడండి. (ప్రజలు వారి హృదయాల్లో దేవుని పట్ల భయం కలిగివున్నప్పుడు, దేవుని అర్పణతో స౦బ౦ధ౦ కలిగివు౦డే౦దుకు వారిని అనుమతి౦చే విధిని ఎదుర్కొన్నప్పుడు, దేవుని స్వభావాన్ని కించపర్చడ౦ ఎ౦త సులభమో వారు ఆలోచిస్తారు మరియు అది వారు ఒక జాగ్రత్తతో కొనసాగేలా చేస్తు౦ది.) మీ ప్రతిస్పందన సరైన మార్గంలో ఉంది, కానీ అది ఇంకా పూర్తిగా లేదు. దేవుని మార్గ౦లో నడవడమ౦టే పైపై నియమాలను పాటి౦చడ౦ కాదు; దానికి బదులుగా, మీరు ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు, మీరు దానిని మొదటదిగా మరియు ముఖ్యమైనదిగా దేవుడు ఏర్పాటు చేసిన పరిస్థితిగా, మీకు ఇచ్చిన బాధ్యతగా లేదా ఆయన మీకు అప్పగించిన పనిగా చూస్తారు. ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు, దీనిని దేవుడు మీకు పెట్టిన పరీక్షగా కూడా మీరు దీనిని చూడాలి. మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు, మీ హృదయంలో ఒక ప్రమాణం కలిగివుండాలి, మరియు ఈ విషయం దేవుని యొద్ద నుండి వచ్చినదని మీరు కచ్చితంగా ఆలోచించాలి. దేవునికి విశ్వసనీయ౦గా ఉంటూనే మీ బాధ్యతను నిర్వర్తి౦చే విధ౦గా దానితో ఎలా వ్యవహరి౦చాలో, అలాగే ఆయనకు కోప౦ పుట్టి౦చకు౦డా లేదా ఆయన స్వభావాన్ని బాధపెట్టకు౦డా ఎలా చేయాలో మీరు ఆలోచి౦చాలి. ఒక క్షణం క్రితం మేము అర్పణలను జాగ్రత్తగా ఉంచడం గురించి మాట్లాడాము. ఈ విషయములో అర్పణలు ఇమిడి ఉంటాయి, మరియు ఇది నీ కర్తవ్యాన్ని మరియు నీ విధిని కూడా తాకుతుంది. మీరు ఈ విధికి కట్టుబడి ఉంటారు. అయితే, ఈ సమస్యను ఎదుర్కొన్నప్పడు, ఏదైనా శోధన ఉందా? ఉంది! ఈ శోధన ఎక్కడ నుండి వస్తుంది? ఈ శోధన సాతాను నుండి వస్తుంది, మరియు అది మనుష్యుని చెడుతనము నుండి, చెడుస్వభావం నుండి కూడా వస్తుంది. ప్రలోభ౦ ఉ౦టు౦ది కాబట్టి, ప్రజలు నిలబడాలనే సాక్ష్యాన్ని నిలుపుకోవడ౦ ఈ అ౦శ౦లో ఇమిడివు౦ది, అది కూడా నీ బాధ్యత మరియు విధి. కొ౦తమ౦ది ప్రజలు ఇలా అ౦టారు, “ఇది చాలా చిన్నపాటి విషయ౦; దానికి ఇంత పెద్ద వ్యవహారం చేయటం నిజంగా అవసరమా?” అవును ఇది! ఎ౦దుక౦టే, దేవుని మార్గానికి అనుగుణ౦గా ఉ౦డాల౦టే, మనం మనకు గానీ, మన చుట్టూ గానీ జరిగే దేనినైనా, చిన్న చిన్న విషయాలను కూడా విడిచిపెట్టలేము; ఏదైనా విషయం మనల్ని ఎదుర్కొంటున్నంతకాలం, మనం దానిపట్ల శ్రద్ధ చూపాలా వద్దా అని భావించినా, మనం తప్పనిసరిగా దానిని వదలకూడదు. జరిగే అన్ని విషయాలు దేవుడు మనకు ఇస్తున్న పరీక్షలాగానే చూడాలి. ఈ విధంగా విషయాల్ని చూడటాన్ని మీరు ఏమి అనుకుంటున్నారు? నువ్వు ఇటువంటి వైఖరి కలిగిఉంటే, అప్పడు, అది ఒక నిజాన్ని నిర్ధారిస్తుంది. లోతుగా, నువ్వు దేవుని పట్ల భయం కలిగివుంటావు మరియు చెడును విసర్జించడానికి సమ్మతం కలిగివున్నావు. దేవుని సంతృప్తిపరచాలనే కోరిక నీకు ఉంటే, అప్పుడు నువ్వు ఆచరణలో పెట్టినదేవుని పట్ల భయం కలిగి మరియు చెడును విసర్జించడం అనే ప్రమాణాన్ని చేరుకోవడానికి ఎంతో దూరంలో ఉండదు.

ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపని విషయాలు మరియు సాధారణ౦గా ప్రస్తావి౦చని విషయాలు, సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి ఏ విధమైన స౦బ౦ధ౦లేని చిన్న చిన్న విషయాలు మాత్రమే అని నమ్మే వారు తరచుగా ఉ౦టారు. అటువంటి ఒక విషయాన్నీ ఎదుర్కొన్నప్పుడు, ఈ ప్రజలు దానికి ఎక్కువ ఆలోచనను ఇవ్వరు మరియు తరువాత వారు దానిని జారిపోయేలా చేస్తారు. యదార్ధానికి, అయితే, ఈ విషయం నువ్వు చదవాల్సిన ఒక పాఠం—ఎలా దేవునికి భయపడాలి మరియు చెడును విసర్జించాలి అనే పాఠం. అన్నిటికంటే, నువ్వు ఈ విషయ౦ మిమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఇ౦కా ఎక్కువ శ్రద్ధ చూపి౦చాలి. దేవుడు నీ కుడి ప్రక్కన వున్నాడు, నీ ప్రతి మాటను మరియు చర్యను గమనిస్తున్నాడు మరియు నువ్వు చేసే ప్రతీది మరియు నీ ఆలోచనల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి అని చూస్తున్నాడు—ఇది దేవుని కార్యం. కొంతమంది ప్రజలు అడుగుతారు, “అదే నిజమైతే, ఎందుకు దానిని నేను ఎరుగలేదు?” నువ్వు దానిని ఎందుకు ఎరుగలేదు ఎందుకంటే, దేవుడి పట్ల భయం కలిగివుండటం మరియు చెడును విసర్జించడం అనే మార్గమును నీ ప్రధాన మార్గంగా భావించి దానికి కట్టుబడి వుండలేదు; కాబట్టి నువ్వు ప్రజలలో భగవంతుడు చేసే సూక్ష్మమైన పనిని గ్రహించలేవు, ఇది ప్రజల వివిధ ఆలోచనలు మరియు చర్యల ప్రకారం వ్యక్తమవుతుంది. నువ్వు ఒక చలచిత్తునివి! పెద్ద విషయం ఏమిటి? చిన్న విషయం ఏమిటి? దేవుడి మార్గంలో నడవటంలో ఇమిడి వుండే విషయాలు పెద్దవి లేదా చిన్నవి అనేవాటి మధ్య విభజించబడలేదు, అవన్నీ పెద్ద వ్యవహారాలు—మీరు దీనిని అంగీకరించగలరా? (మేము దీనిని అంగీకరించగలం.) రోజువారీ విషయాల సంబంధించి, కొన్ని విషయాలను ప్రధానమైనవిగా మరియు ప్రాముఖ్యత కలవిగా కొంతమంది ప్రజలు భావిస్తారు మరియు ఇతరులు అల్పమైనవాటిగా చూస్తారు. ప్రజలు తరచుగా ఈ ప్రధానమైన విషయాలను చాలా ముఖ్యమైనవిగా చూస్తారు మరియు వారు వాటిని దేవుడు పంపించాడని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ, ప్రజల అపరిపక్వస్థాయి కారణంగా మరియు వారి పేలవమైన సామర్థ్యం కారణంగా ఈ ప్రధాన విషయాలు బయటపడుతున్నందున, ప్రజలు తరచుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా లేరు, ఎటువంటి ప్రత్యక్షతలు పొందలేరు మరియు విలువైననటువంటి వాస్తవ జ్ఞానాన్ని పొందలేరు. చిన్నచిన్న విషయాలకు సంబంధించినంత వరకు, ప్రజలు వీటిని పట్టించుకోరు మరియు ఒక్కొక్కటిగా ఒకసారి జారిపోయేలా వదలివేస్తారు. అందుకని, ప్రజలు దేవుని ఎదుట పరిశోధించబడే మరియు ఆయన చేత పరీక్షించబడే అనేక అవకాశాలను కోల్పోయారు. దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన వ్యక్తులు, సంఘటనలు మరియు వస్తువులు మరియు పరిస్థితులను నువ్వు ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేసినట్లయితే, దాని అర్థం ఏమిటి? ప్రతి రోజు మరియు ప్రతి క్షణం కూడా, నువ్వు నీ పట్ల దేవుని పరిపూర్ణతను, అలాగే ఆయన నాయకత్వాన్ని నిరంతరం పరిత్యజిస్తున్నారు. దేవుడు మీ కోసం ఒక పరిస్థితిని ఏర్పాటు చేసినప్పుడల్లా, ఆయన రహస్యంగా గమనిస్తారు, నీ హృదయాన్నిగమనిస్తూ, నీ ఆలోచనలను మరియు చర్చలను గమనిస్తూ, నువ్వు ఎలా ఆలోచిస్తావో గమనిస్తూ, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూడటానికి వేచి ఉంటాడు. నువ్వు అజాగ్రత్తగా వుండే వ్యక్తి అయితే—దేవుని మార్గం, ఆయన మాటలు లేదా సత్యమును గురించి గంభీరంగా లేని వ్యక్తి అయినట్లయితే, దేవుడు ఏమి పూర్తి చేయాలని కోరుకు౦టున్నాడో లేదా నీ కోస౦ ఒక నిర్దిష్ట వాతావరణాన్ని ఏర్పాటు చేసినప్పుడు నువ్వు తీర్చాలని ఆయన ఆశి౦చిన ఆవశ్యకతల గురి౦చి గానీ నువ్వు మనసు పెట్టటం కానీ, శ్రద్ధ కానీ చూపి౦చవు. నువ్వు ఎదుర్కొనే వ్యక్తులు, స౦ఘటనలు మరియు వస్తువులు సత్యానికి లేదా దేవుని చిత్తానికి ఎలా స౦బ౦ధి౦చినవో కూడా నీకు తెలియదు. నువ్వు మళ్ళీమళ్ళీ ఇటువంటి పరిస్థితులు మరియు మళ్ళీమళ్ళీ పరీక్షలు ఎదుర్కొన్న తరువాత, దేవుడు నీ లో ఎటువంటి ఫలితాలు చూడకపోతే, ఆయన ఏ విధంగా ముందుకు కొనసాగుతాడు? మళ్ళీమళ్ళీ శ్రమలను ఎదుర్కొన్న తర్వాత, మీరు మీ హృదయంలో దేవుడ్ని లేదా దేవుడు మీకోసం ఏర్పాటు చేసిన పరిస్థితులను మీరు చూడలేదు, అవి: దేవునినుండి శోధనలు మరియు పరీక్షలు. బదులుగా, ఒకదాని తర్వాత ఇంకొకటి, దేవుడు మీకు ప్రసాదించిన అవకాశాలను మీరు తిరస్కరించారు, వాటిని ఎప్పటికప్పుడు జారిపోయేలా చేశారు. ఇది ప్రజలు ప్రదర్శించిన అత్యంత అవిధేయత కాదా? (అవును.) దీనివలన దేవుడు బాధపడతాడా?(ఆయన బాధపడతాడు) తప్పు, దేవుడు బాధపడడు! నేను మాట్లాడిన అటువంటి మాట విన్న మీకు నా మాట మరోసారి షాక్ కు గురిచేసింది. మీరు ఆలోచిస్తూఉ౦డవచ్చు: “దేవుడు ఎల్లప్పుడూ బాధపడతాడని ఇంతకుముందు చెప్పలేదా? కాబట్టి దేవుడు బాధపడడా? అలాంటప్పుడు, ఆయన ఎప్పుడు బాధపడతాడు?” క్లుప్తంగా చెప్పాలంటే, దేవుడు ఈ పరిస్థితిలో బాధపడడు. కాబట్టి, పైన వివరి౦చబడిన ప్రవర్తన విషయ౦లో దేవుని వైఖరి ఎలా ఉ౦ది? దేవుడు పంపిన శోధనలు మరియు పరీక్షలను ప్రజలు తిరస్కరించినప్పుడు మరియు వారు వారి ను౦డి తప్పి౦చుకున్నప్పుడు, అలా౦టి ప్రజలపట్ల దేవునికి ఒకే ఒక వైఖరి ఉ౦టు౦ది. ఏ రకమైన వైఖరి ఇది? దేవుడు హృదయాంతరం నుండి ఈ రకమైన వ్యక్తిని తిరస్కరిస్తాడు. “తిరస్కారం” అనే మాటకు రెండు పొరల అర్ధం వుంది. నా దృష్టికోణం నుండి దానిని ఎలా వివరించాలి? లోతుగా, “తిరస్కారం” అనే పదానికి అసహ్యం మరియు ద్వేషం సహజ అర్థాలు ఉన్నాయి. దాని మరొక పొర గురించిన అర్థం ఏమిటి? అది ఏదో ఒక విషయాన్ని విడిచిపెట్టడాన్ని సూచించే భాగం. “విడిచిపెట్టడం” అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు, సరియైనదా? సూక్ష్మంగా చెప్పాల౦టే, “తిరస్కార౦” అనే పద౦, ఆ విధ౦గా ప్రవర్తి౦చే ప్రజలపట్ల దేవుని చివరి ప్రతిస్ప౦దనకు, వైఖరికి ప్రాతినిధ్య౦ వహి౦చేటటువంటి పద౦; అది వారిపట్ల విపరీతమైన ద్వేషము, మరియు అసహ్యము, అందువలన, అది వారిని వదలిపెట్టాలనే నిర్ణయానికి దారితీస్తుంది. దేవుని మార్గంలో ఎన్నడూ నడవని మరియు దేవుని పట్ల భయం లేని, చెడును విసర్జించని ఒక వ్యక్తి పట్ల ఇది దేవుని అంతిమ నిర్ణయం. నేను ఇంతకు ముందు పేర్కొన్న ఆ సామెత ప్రాముఖ్యతను ఇప్పుడు మీరందరూ చూడగలరా?

ప్రజలు పొందే ఫలితాలను నిర్ణయించడానికి దేవుడు ఉపయోగించే విధానాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? (ఆయన ప్రతిరోజూ విభిన్న పరిస్థితులను కల్పిస్తాడు.) “ఆయన విభిన్న పరిస్థితులను కల్పిస్తాడు”—వీటిని ప్రజలు అనుభూతి చెందవచ్చు మరియు స్పృశించవచ్చు. ఇంతకీ, ఇలా చేయడంలో దేవుని ఉద్దేశం ఏమిటి? ప్రతి ఒక్కరికీ వేరువేరు సమయాల్లో మరియు విభిన్న ప్రదేశాలలో వివిధ విధాల పరీక్షలు పెట్టడమే ఆయన ఉద్దేశం. పరీక్షా సమయంలో ఒక వ్యక్తిలోని ఏయే అంశాలు పరీక్షించబడతాయి? నీవు ఎదుర్కొనే, వినే, చూసే మరియు వ్యక్తిగతంగా అనుభవించే ప్రతి సమస్యలోనూ నీవు దేవుని యందు భయము గల మరియు చెడుతనమును విసర్జించే వ్యక్తివేనా, కాదా అనేది ఈ పరీక్ష నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ రకమైన పరీక్షను ఎదుర్కొంటారు, ఎందుకంటే దేవుడు ప్రజలందరినీ న్యాయంగా చూస్తాడు. మీలో కొంతమంది, “నేను ఎన్నో సంవత్సరాలు దేవుడిని విశ్వసించాను, మరి, నేనెందుకు ఎలాంటి పరీక్షలనూ ఎదుర్కోలేదు?” అంటారు. ఇంకా ఏ పరీక్షనూ ఎదుర్కోలేదని నీవు ఎందుకు భావిస్తున్నావంటే, దేవుడు నీ కోసం పరిస్థితులను కల్పించిన ప్రతిసారీ నీవు వాటిని తీవ్రంగా తీసుకోలేదు మరియు దేవుని మార్గంలో నడవాలనుకోలేదు. కాబట్టి, నీవు దేవుని పరీక్షలను అస్సలు గ్రహించలేదు. కొంతమంది, “నేను కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నాను, కానీ, తగిన విధంగా ఎలా ఆచరించాలో నాకు తెలియదు. ఒకవేళ నేను ఆచరించినప్పటికీ, దేవుని పరీక్షల సమయంలో నేను స్థిరంగా ఉన్నానో, లేదో నాకు ఇప్పటికీ తెలియదు” అని అంటారు. ఈ రకమైన స్థితిలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా తక్కువ సంఖ్యలో ఏమీ లేరు. అలాంటప్పుడు, ప్రజలను కొలవడానికి దేవుడు ఉపయోగించే ప్రమాణం ఏమిటి? ఇది నేను కొన్ని క్షణాల క్రితం చెప్పినదే: నీవు చేసే, ఆలోచించే మరియు ప్రదర్శించే ప్రతిదానిలోనూ నీవు దేవుని యందు భయము కలిగి ఉన్నావా మరియు చెడుతనమును విసర్జిస్తున్నావా, లేదా అనేదే ఆ ప్రమాణము. నీవు దేవుని యందు భయము కలిగిన మరియు చెడుతనమును విసర్జించే వ్యక్తివేనా, కాదా అనే దాన్ని బట్టి ఇది నిర్ణయించబడుతుంది. ఈ భావన సులువుగా ఉందా, లేదా? ఇది చెప్పడానికి సులువే, కానీ ఆచరించడానికి సులువైనదేనా? (ఇది అంత సులువేమీ కాదు.) ఇది ఎందుకంత సులవు కాదు? (ఎందుకంటే, ప్రజలకు దేవుడి గురించి తెలియదు మరియు దేవుడు ఎలా ప్రజలను పరిపూర్ణులుగా చేస్తాడో వారికి తెలియదు. కాబట్టి, వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, వాటిని పరిష్కరించడానికి సత్యాన్ని ఎలా అన్వేషించాలో వారికి తెలియదు. వారు దేవునికి భయపడే వాస్తవికతను పొందగలగడానికి ముందు వారు వివిధ పరీక్షలు, శుద్ధీకరణలు, శిక్షలు మరియు తీర్పులను అనుభవించాల్సి ఉంటుంది.) మీరు దానిని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు, కానీ మీకు సంబంధించినంతవరకు, దేవుని యందు భయము కలిగి ఉండటం మరియు చెడుతనమును విసర్జించడం అనేవి ప్రస్తుతానికి చాలా సులువుగా చేయగలిగినవిగానే కనిపిస్తాయి. నేను దీనిని ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే మీరు చాలా ప్రవచనాలు విన్నారు కానీ, సత్యం యొక్క వాస్తవికత నుండి కొంచెం సారాన్ని కూడా పొందలేదు; నిజానికి, దేవుని యందు భయము మరియు చెడుతనమును విసర్జించుట ఎలాగో సిద్ధాంతపరంగా మరియు మేధోపరంగా మీరు అర్థం చేసుకునేలా చేసేది ఇదే. దేవుని యందు భయము కలిగి ఉండటాన్ని మరియు చెడుతనమును విసర్జించడాన్ని వాస్తవంగా ఎలా ఆచరించాలి అనే విషయంలో, ఈ జ్ఞానమంతా మీకు చాలా సహాయపడేదిగా ఉంటుంది మరియు అలాంటి పని సులువుగా సాధించగలిగేదని అనిపించేలా చేస్తుంది. అలాంటప్పుడు, ప్రజలు దాన్ని వాస్తవంగా ఎందుకు సాధించలేరు? ఎందుకంటే, మానవుల స్వభావము మరియు గుణగణాలు దేవునికి భయపడవు మరియు అవి చెడుతనమును ఇష్టపడతాయి. అదే అసలు కారణం.

దేవుని యందు భయము లేకపోవడం మరియు చెడుతనమును విసర్జించకపోవడం అంటే దేవుడిని వ్యతిరేకించడమే

“దేవుని యందు భయము కలిగి ఉండుట మరియు చెడుతనమును విసర్జించుట” అనే ఈ మాట ఎక్కడ నుండి వచ్చిందో నేను మిమ్మల్ని అడగడం ద్వారా మొదలుపెడతాను. (యోబు గ్రంథం.) మనం యోబును ప్రస్తావించాము కాబట్టి, ఆయన గురించి చర్చిద్దాం. యోబు కాలంలో, దేవుడు మానవాళి రక్షణ మరియు విజయం కోసం పని చేశాడా? లేదు! అది నిజం కాదా? అంతేగాకుండా, యోబుకు సంబంధించినంతవరకు, ఆ సమయంలో దేవుని గురించి అతనికి ఎంత జ్ఞానం ఉండేది? (అంత ఎక్కువ లేదు.) దేవుని గురించి ఇప్పుడు మీకున్న జ్ఞానం కంటే యోబుకు ఎక్కువ ఉండేదా లేదా తక్కువ ఉండేదా? మీరు సమాధానం చెప్పడానికి ఎందుకు సాహసించడం లేదు? ఇది సమాధానం చెప్పడానికి చాలా సులువైన ప్రశ్న. తక్కువ ఉండేది! అది ఖచ్చితమైనదే! ఈ రోజుల్లో మీరు దేవునికి ఎదురుగా మరియు దేవుని మాటలకు ఎదురుగా ఉన్నారు; మీకు దేవుని గురించి యోబు కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. నేను దీనిని ఎందుకు చెప్తున్నాను? ఈ విషయాలు చెప్పడంలో నా ఉద్దేశమేమిటి? నేను మీకు ఒక నిజం వివరించాలనుకుంటున్నాను, అయితే దానికంటే ముందు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను: యోబుకు దేవుని గురించి చాలా కొద్దిగానే తెలుసు, అయినా ఆయనకు భయపడటం, చెడుతనమును విసర్జించగలగడం చేయగలిగాడు; ఈ రోజుల్లో ప్రజలు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? (వారు అత్యంత చెడిపోయినవారు.) “అత్యంత చెడిపోయినవారు”—అనేది సమస్యకు పైపైన కనిపించే కారణం, కానీ నేను ఎప్పుడూ దానిని ఆ విధంగా చూడను. మీరు తరచుగా ఉపయోగించే “అత్యంత చెడిపోయినవారు,” “దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు,” “దేవుని పట్ల నమ్మకద్రోహం,” “అవిధేయత,” “సత్యాన్ని ఇష్టపడకపోవడం” లాంటి సిద్ధాంతాలు మరియు పదాలను తీసుకుని, ప్రతి సమస్యకు మూలాన్ని వివరించడానికి వాటిని పడికట్టు పదాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆచరించడంలోని ఒక తప్పుడు విధానం. విభిన్న స్వభావాలు గల విషయాలను వివరించడానికి ఒకే సమాధానం ఉపయోగించడం అనేది తప్పనిసరిగా సత్యం మరియు దేవుని గురించి దైవదూషణ సంబంధమైన అనుమానాలను రేకెత్తిస్తుంది; ఈ రకమైన సమాధానం వినడం నాకిష్టం లేదు. దీని గురించి దీర్ఘంగా మరియు గట్టిగా ఆలోచించండి! మీరెవరూ ఈ విషయం గురించి ఆలోచించలేదు, కానీ నేను దీనిని అనునిత్యం చూడగలను మరియు అనునిత్యం అనుభూతి చెందగలను. ఆ విధంగా, మీరు చేస్తూ ఉండగా, నేను చూస్తూ ఉన్నాను. మీరేదైనా చేస్తున్నప్పుడు, మీరు దాని గుణగణాలను అనుభూతి చెందలేరు, కానీ నేను చూస్తున్నప్పుడు, నేను దాని గుణగణాలను చూడగలను మరియు దాని గుణగణాలను కూడా అనుభూతి చెందగలను. అయితే, ఈ గుణగణాలంటే ఏమిటి? ఈ రోజుల్లో ప్రజలు దేవునికి భయపడకుండా, చెడుతనమును విసర్జించకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? మీ సమాధానాలు ఈ సమస్య గుణగణాలను వివరించడానికి చాలా దూరంలో ఉన్నాయి లేదా అవి దానిని పరిష్కరించలేవు. ఎందుకంటే, దీని వెనక మీకు తెలియని మూలం ఉంది కాబట్టి. ఈ మూలం ఏమిటి? దీని గురించి మీరు వినాలనుకుంటున్నారని నాకు తెలుసు, కాబట్టి ఈ సమస్య మూలాన్ని నేను మీకు చెబుతాను.

దేవుడు కార్యము చేయడం ప్రారంభించినప్పటి నుండి, ఆయన మానవులను ఎలా పరిగణించాడు? దేవుడు వారిని రక్షించాడు; మానవులను తన కుటుంబ సభ్యులుగా, తన కార్యానికి వస్తువులుగా, అంటే ఆయన జయించాలని మరియు రక్షించాలని కోరుకునే వారిగా మరియు ఆయన పరిపూర్ణులుగా చేయాలనుకున్న వారిగానే ఆయన చూశాడు. దేవుడి కార్యము ప్రారంభంలో మానవుల పట్ల ఆయన వైఖరి ఇదే. అయితే, ఆ కాలములో దేవుని పట్ల మానవాళి వైఖరి ఏమిటి? దేవుడు మానవులకు తెలియనివాడు మరియు వారు దేవుడిని అపరిచితుడిగా భావించారు. దేవుని పట్ల వారి వైఖరి సరైన ఫలితాలను ఇవ్వలేదని, దేవునితో ఎలా వ్యవహరించాలో వారికి స్పష్టమైన అవగాహన లేదని చెప్పవచ్చు. అందుచేత, ఆయనతో వారికిష్టమొచ్చినట్లు వ్యవహరించారు మరియు వారికేది నచ్చితే అది చేశారు. వారికి దేవుడి గురించి ఏమైనా అభిప్రాయాలు ఉండేవా? మొదటగా, వారికి అవేవీ లేవు; వారి అభిప్రాయాలు అని చెప్పబడేవి కేవలం ఆయన గురించి ఉన్న కొన్ని ఆలోచనలు మరియు ఊహలు మాత్రమే. వారు తమ ఆలోచనలకు అనుగుణమైన వాటిని అంగీకరించారు, ఏదైనా వారి ఆలోచనలకు అనుగుణంగా లేకపోతే, వారు దానిని పైపైన ఆచరించారు, కానీ తమ అంతరంగం లోతులలో వారు దానిని బలమైన వివాదంగా భావించి, వ్యతిరేకించారు. ప్రారంభంలో దేవుడు మరియు మానవుల మధ్య సంబంధం ఇదే: దేవుడు వారిని కుటుంబ సభ్యులుగా చూశాడు, అయినా, వారు మాత్రం ఆయనను అపరిచితుడిగా భావించారు. అయితే, దేవుడు కొంత కాలం కార్యము చేసిన తర్వాత, ఆయన ఏమి సాధించడానికి ప్రయత్నిస్తున్నాడో మనుష్యులు అర్థం చేసుకున్నారు మరియు ఆయనే నిజమైన దేవుడని తెలుసుకున్నారు; దేవుని నుండి వారు ఏమి పొందగలరో కూడా తెలుసుకున్నారు. ఈ కాలములో ప్రజలు దేవుడిని ఎలా పరిగణించారు? వారు ఆయనను జీవాధారంగా చూశారు మరియు ఆయన కృప, దీవెనలు మరియు వాగ్దానాలను పొందాలని ఆశించారు. ఈ కాలములో దేవుడు ప్రజలను ఎలా పరిగణించాడు? ఆయన వారిని తన విజయానికి లక్ష్యాలుగా చూశాడు. వారికి తీర్పునివ్వడానికి, వారిని పరీక్షించడానికి మరియు పరీక్షలకు గురిచేయడానికి దేవుడు వాక్యములను ఉపయోగించాలనుకున్నాడు. అయితే, ఆ కాలపు ప్రజలకు సంబంధించినంతవరకు, దేవుడంటే వారి సొంత లక్ష్యాలను సాధించుకోవడానికి వారు ఉపయోగించుకోగల ఒక వస్తువు మాత్రమే. దేవుడు జారీ చేసిన సత్యం వారిని జయించగలదని మరియు రక్షించగలదని, ఆయన నుండి తాము కోరుకున్న వాటిని పొందడానికి, అదేవిధంగా తాము కోరుకున్న గమ్యస్థానాలను చేరుకోవడానికి అవకాశంగానే ప్రజలు చూశారు. ఈ కారణంగా, వారి హృదయాలలో అణువంత చిత్తశుద్ధి ఏర్పడింది మరియు వారు ఈ దేవుడిని అనుసరించడాన్ని ఇష్టపడ్డారు. కాలం గడిచిపోయింది, దేవుని గురించి కొంత పైపై మరియు సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని వారు పొందిన కారణంగా, దేవుని గురించి, ఆయన చెప్పిన వాక్యములు, ఆయన బోధనలు, ఆయన వెల్లడించిన సత్యాలు మరియు ఆయన కార్యము గురించి మానవులలో “పరిచయం” ప్రారంభమైందని కూడా చెప్పవచ్చు. కాబట్టి, దేవుడంటే ఇకపై అపరిచితుడు కాదనీ, దేవుడికి అనుగుణంగా తయారయ్యే మార్గంలో తాము ఇప్పటికే అడుగు మోపామనే అపోహలో వారు ఉండేవారు. ఇప్పటికల్లా, సత్యం గురించి అనేక ప్రవచనాలను ప్రజలు విన్నారు మరియు దేవుని కార్యాన్ని ఎంతో అనుభవించారు. అయినప్పటికీ, విభిన్నమైన అనేక కారకాలు మరియు పరిస్థితుల జోక్యం మరియు అవరోధం కారణంగా, అత్యధిక మంది సత్యాన్ని ఆచరించడంలో విజయం సాధించలేక పోయారు లేదా వారు దేవుడిని సంతృప్తిపరచలేక పోయారు. ప్రజలలో మందకొడితనం బాగా పెరిగి, విశ్వాసం బాగా సన్నగిల్లి పోయింది. వారు పొందిన సొంత ఫలితాలు తెలియని భావన వారిలో పెరిగింది. వారు ఏవైనా గొప్ప ఆలోచనలతో ముందుకు రావడానికి సాహసం చేయరు, వారు పురోగతి సాధించడానికి ప్రయత్నించరు; వారు కేవలం అయిష్టంగా అనుసరిస్తూ, ఒక్కో అడుగు ముందుకు వెళ్తారు. మానవుల ప్రస్తుత స్థితికి సంబంధించి, దేవునికి వారి పట్ల ఉన్న వైఖరి ఏమిటి? ఈ సత్యాలను వారికి అనుగ్రహించాలనీ మరియు వారిని తన మార్గంలో ప్రవేశపెట్టాలనీ, ఆతర్వాత వారిని విభిన్న విధాలుగా పరీక్షించడానికి వివిధ పరిస్థితులను కల్పించాలనీ మాత్రమే ఆయన కోరుకుంటాడు. ఆయన లక్ష్యం మానవులు ఈ వాక్యములను, ఈ సత్యాలను మరియు ఆయన కార్యాన్ని స్వీకరించేలా చేయడం మరియు వారు ఆయనకు భయపడగలిగేలా, చెడుతనమును విసర్జించగలిగేలా ఫలితాన్ని తీసుకురావడమే. నేను చూసిన అనేక మంది కేవలం దేవుని వాక్యములను స్వీకరిస్తారు మరియు వాటిని సిద్ధాంతాలుగా, కేవలం కాగితంపై ఉన్న అక్షరాలుగా, అనుసరించాల్సిన నిబంధనలుగా మాత్రమే భావిస్తారే తప్ప, వారి చేతలు మరియు మాటలలో లేదా పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు, తాము కట్టబడి ఉండాల్సిన దేవుని మార్గం అదే అని భావించరు. మరీ ముఖ్యంగా, ప్రజలు పెద్ద పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు ఇదే నిజం; దేవుని యందు భయం కలిగి ఉండడాన్ని మరియు చెడుతనమును విసర్జించడాన్ని ఆచరించే ఏ వ్యక్తినీ నేను చూడలేదు. కాబట్టి, మనుష్యుల పట్ల దేవుని వైఖరి అత్యంత అసహ్యం మరియు విరక్తితో నిండి ఉంది! ఆయన వారికి మళ్లీమళ్లీ పరీక్షలు పెట్టినప్పటికీ, వందల సార్లు అయినప్పటికీ, తమ దృఢ సంకల్పాన్ని ప్రదర్శించే స్పష్టమైన వైఖరి వారిలో ఇప్పటికీ లేదు: “నేను దేవుని యందు భయము కలిగి ఉండాలనీ మరియు చెడుతనమును విసర్జించాలనీ అనుకుంటున్నాను” అనే సంకల్పం ప్రజలలో లేనందున మరియు ఆ రకంగా ప్రదర్శించనందున, వారి పట్ల గతంలో చూపినట్లుగా కరుణ, భరించే గుణం, ఓర్పు మరియు సహనంతో కూడిన వైఖరి దేవుడికి ప్రస్తుతం అదే విధంగా లేదు. దానికి బదులుగా, ఆయన మానవాళి పట్ల అత్యంత నిరాశ చెందాడు. ఈ నిరాశకు కారణం ఎవరు? మనుష్యుల పట్ల దేవుని వైఖరి ఎవరిపై ఆధారపడి ఉంటుంది? ఇది ఆయనను అనుసరించే ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంటుంది. దేవుడి అనేక సంవత్సరాల కార్యము క్రమములో, ఆయన ప్రజల నుండి అనేక డిమాండ్లు చేశాడు మరియు వారికి అనేక పరిస్థితులను కల్పించాడు. అయితే, వారు ఎలా పనిచేసినప్పటికీ, దేవుని పట్ల వారి వైఖరి ఎలా ఉండినప్పటికీ, దేవుని యందు భయము కలిగి ఉండటం మరియు చెడుతనమును విసర్జించడం అనే స్పష్టమైన లక్ష్యానికి అనుగుణంగా ఆచరించడంలో ప్రజలు విఫలమయ్యారు. అందుచేత, నేను సారాంశపు మాట ఒకటి చెబుతాను మరియు దేవుని యందు భయము కలిగి ఉండటం మరియు చెడుతనమును విసర్జించడం అనే దేవుని మార్గంలో ప్రజలు ఎందుకు నడవలేకపోతున్నారనే దాని గురించి మనం ఇప్పుడే చెప్పుకున్న ప్రతిదాన్ని వివరించడానికి ఈ మాటను ఉపయోగిస్తాను. ఈ మాట ఏమిటి? ఇదేమిటంటే: దేవుడు మానవులను తాను అందించే రక్షణకు, తన కార్యానికి లక్ష్యాలుగా భావిస్తాడు; అయితే, మనుష్యులు మాత్రం దేవుడిని తమ శత్రువుగా మరియు తమ వ్యతిరేకిగా భావిస్తారు. నీకు ఇప్పుడు ఈ విషయం గురించి స్పష్టమైన అవగాహన వచ్చిందా? మానవాళి వైఖరి ఏమిటో, దేవుని వైఖరి ఏమిటో మరియు మనుష్యులకు మరియు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చాలా సుస్పష్టం. మీరు ఎంత బోధన విన్నప్పటికీ, దేవుని పట్ల విశ్వాసంగా ఉండడం, దేవునికి సమర్పించుకోవడం, దేవునికి అనుగుణంగా ఉండే మార్గాన్ని అన్వేషించడం, దేవుడి కోసం ఒక జీవిత కాలాన్ని వెచ్చించడం మరియు దేవుడి కోసం జీవించాలనుకోవడం లాంటి వాటి గురించి మీరు మీ సొంత తీర్మానాలు చేశారు—నాకు, ఆ విషయాలు దేవుని యందు భయముతో ఉండాలనే మరియు చెడుతనమును విసర్జించాలనే ఉద్దేశంతో దేవుని మార్గంలో నడవడానికి ఉదాహరణలు కావు, దానికి బదులుగా, అవి మీరు వాటి ద్వారా కొన్ని లక్ష్యాలను సాధించగల మార్గాలు మాత్రమే. వాటిని పొండానికి, మీరు అయిష్టంగా కొన్ని నిబంధనలను పాటిస్తారు మరియు ఖచ్చితంగా ఈ నిబంధనలే ప్రజలను దేవుని యందు భయము కలిగి ఉండే మరియు చెడుతనమును విసర్జించే మార్గం నుండి మరింత దూరంగా తీసుకెళ్తాయి మరియు దేవుడిని మరోసారి మానవాళికి విరోధిగా ఉంచుతాయి.

ఈరోజు మాట్లాడే అంశం కాస్త బరువైనది, ఏదేమైనప్పటికీ, రాబోయే అనుభవాలు మరియు రాబోయే కాలాల గుండా మీరు వెళ్లినప్పుడు, నేను ఇప్పుడే మీకు చెప్పిన వాటిని మీరు చేయగలరని నేనిప్పటికీ ఆశిస్తున్నాను. మీకు ఉపయోగపడినప్పుడు ఆయన ఉన్నట్లు, మీకు ఆయనతో ఎలాంటి ఉపయోగం లేనప్పుడు ఆయన లేడు అన్నట్లు—దేవుడిని కేవలం ఖాళీ గాలి గుచ్ఛంగా భావించకండి. నీ ఉపచేతనలో అలాంటి ఆలోచన వచ్చింది అంటే, నీవు అప్పటికే దేవునికి ఆగ్రహం తెప్పించావని అర్థం. “నేను దేవుడిని కేవలం ఖాళీ గాలిగా భావించను. నేను ఆయనను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను మరియు నేను ఎల్లప్పుడూ ఆయనను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తాను మరియు నేను చేసే ప్రతి పని దేవుడు కోరుకునే పరిధి, ప్రమాణం మరియు సూత్రాల పరిధిలోకే వస్తుంది. నేను ఖచ్చితంగా నా సొంత ఆలోచనల ప్రకారం ఆచరించడం లేదు” అని చెప్పేవారు బహుశా ఉండవచ్చు. అవును, నీవు ఆచరిస్తున్న ఈ విధానం సరైనదే! అయినప్పటికీ, ఒక సమస్యను నీవు నేరుగా ఎదుర్కొన్నప్పుడు నీవు ఏమి ఆలోచిస్తావు? ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు నీవు ఎలా ఆచరిస్తావు? కొందరు వ్యక్తులు దేవుడిని ప్రార్థించినప్పుడు మరియు వేడుకున్నప్పుడు దేవుడు ఉన్నాడని భావిస్తారు, కానీ వారికి ఏదైనా సమస్య ఎదురైన ప్రతిసారీ, వారు తమ సొంత ఆలోచనలతోనే ముందుకు వస్తారు మరియు వాటికి కట్టుబడాలనుకుంటారు. అంటే దీనర్థం వారు దేవుడిని కేవలం ఖాళీ గాలి గుచ్ఛంగా భావిస్తారు మరియు అలాంటి పరిస్థితి వారి మనస్సులలో దేవుడి అస్థిత్వం లేకుండా చేస్తుంది. తమకు అవసరమైనప్పుడు దేవుడు ఉండాలనీ, అవసరం లేనప్పుడు ఉండకూడదనీ ప్రజలు విశ్వసిస్తారు. తమ సొంత ఆలోచనలపై ఆధారపడి ఆచరిస్తే సరిపోతుందని ప్రజలు భావిస్తారు. వారికి నచ్చినట్లు వారు చేయగలరని విశ్వసిస్తారు; దేవుని మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని వారు అసలు విశ్వసించరు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఉన్న మరియు ఈ రకమైన స్థితిలో చిక్కుకు పోయిన వ్యక్తుల విషయానికొస్తే, వారు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం లేదా? “నేను ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నా, తెచ్చుకోకపోయినా, నేను అనేక సంవత్సరాలుగా విశ్వాసంతోనే ఉన్నాను మరియు దేవుడు నన్ను విడిచి వెళ్లడని విశ్వసిస్తాను, ఎందుకంటే ఆయన దానిని భరించలేడు” అని కొంతమంది అంటారు. “నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే నేను ప్రభువును విశ్వసిస్తున్నాను. ఇప్పటికి నలభై లేదా యాభై సంవత్సరాలు గడిచింది, కాబట్టి సమయం దృష్ట్యా, దేవుని రక్షణ పొందడానికి నాకు అత్యధిక అర్హత ఉంది మరియు నాకు జీవించడానికి అత్యధిక అర్హత ఉంది. ఈ నాలుగు లేదా ఐదు దశాబ్దాలుగా నేను నా కుటుంబాన్ని, నా ఉద్యోగాన్ని మరియు నాకున్న డబ్బు, హోదా, ఆనందం మరియు నా కుటుంబంతో గడిపే సమయం—లాంటివన్నీ వదులుకున్నాను. నేను ఎన్నో రుచికరమైన ఆహారాలను తినలేదు, నేను ఎన్నో వినోదాలను ఆస్వాదించలేదు, నేను ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాలను సందర్శించలేదు మరియు మామూలు వ్యక్తులు భరించలేని బాధలను కూడా నేను అనుభవించాను. వీటన్నింటి కారణం చేత దేవుడు నన్ను రక్షించలేకపోతే, అప్పుడు నాకు అన్యాయం చేస్తునట్లే లెక్క మరియు అలాంటి దేవుడిని నేను విశ్వసించలేను” అని మరికొందరు అంటారు. ఇలాంటి ఆలోచనగలవారు అనేకమంది ఉన్నారా? (ఉన్నారు.) సరే, అయితే, ఈ రోజు ఒక యథార్థాన్ని అర్థం చేసుకోవడంలో నేను మీకు సహాయం చేస్తాను: అలాంటి ఆలోచనగల వ్యక్తులందరూ వారి కాళ్లను వారే నరుక్కుంటున్నారు. ఎందుకంటే, వారు తమ సొంత ఊహలతో తమ కళ్లను కప్పేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ఊహలు, అలాగే వారి సొంత తీర్మానాలే, మానవులు పూర్తి చేయవలసిన దేవుడు కోరుకునే ప్రమాణం స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి మరియు దేవుని వాస్తవ ఉద్దేశాలను అంగీకరించకుండా వారిని అడ్డుకుంటున్నాయి. ఇది ఆయన నిజమైన అస్థిత్వాన్ని వారు గ్రహించలేకుండా చేస్తుంది మరియు దేవుని వాగ్దానంలో ఏదైనా భాగం లేదా వంతును విడిచిపెడుతూ, దేవునిచే పరిపూర్ణులుగా చేయబడే అవకాశాన్ని కూడా వారు కోల్పోయేలా చేస్తుంది.

దేవుడు తాను చేసే దాని ద్వారా ప్రజల ఫలితాలను మరియు ప్రమాణాలను ఎలా నిర్ణయిస్తాడు

నీవు ఏవైనా అభిప్రాయాలు లేదా తీర్మానాలకు రావడానికి ముందు, నీ పట్ల దేవుని వైఖరి ఏమిటో, ఆయన ఏమనుకుంటున్నాడో ముందుగా నీవు అర్థం చేసుకోవాలి, ఆతర్వాత నీ సొంత ఆలోచన సరైనదా కాదా అని నీవు నిర్ణయించుకోవచ్చు. ఒక వ్యక్తి ఫలితాన్ని నిర్ణయించడానికి దేవుడు సమయాన్ని ఒక కొలత యూనిట్‌గా ఎప్పుడూ ఉపయోగించలేదు లేదా ఒక వ్యక్తి ఎంత బాధను అనుభవించాడు అనేదానిపై ఆధారపడి ఆయన ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఒక వ్యక్తి ఫలితాన్ని నిర్ణయించడానికి దేవుడు ఏ కొలమానాన్ని ప్రమాణంగా ఉపయోగిస్తాడు? సమయం ఆధారంగా దీనిని నిర్ణయించడం అనేది ప్రజల ఆలోచనలకు ఎంతో అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒక సమయంలో ఎంతగానో భక్తి కలిగిన, ఎంతో వెచ్చించిన, భారీ మూల్యం చెల్లించిన, ఎంతో బాధను అనుభవించిన వారిని మీరు తరచూ చూస్తారు. మీరు చూసే విధానంలో, దేవునిచే రక్షించబడగల వ్యక్తులు వీరే. ఈ వ్యక్తులు ప్రదర్శించే మరియు జీవించేవన్నీ ఒక వ్యక్తి ఫలితాన్ని నిర్ణయించడానికి దేవుని నిర్ణయించిన ప్రమాణాలు అనుకునే ప్రజల అలోచనలకు ఖచ్చితంగా అనుగుణంగా ఉంటాయి. మీరు ఏదైనా విశ్వసించండి, నేను ఈ ఉదాహరణలను ఒకదాని తర్వాత ఒకటిగా పేర్కొనను. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని సొంత ఆలోచన నుండి వచ్చినది తప్ప, మానవుల ఊహ నుండి వచ్చినది ఏదైనా ప్రమాణం కాదు మరియు అలాంటివన్నీ మానవ ఆలోచనలే. నీవు గుడ్డిగా నీ సొంత ఆలోచనలు మరియు అభిరుచులను నొక్కి చెబితే, ఫలితం ఏమి వస్తుంది? దీని పర్యవసానం దేవుడు నిన్ను తిరస్కరించి తోసివేయడం మాత్రమే అనేది చాలా స్పష్టం. ఎందుకంటే, దేవుని యెదుట నీవు ఎల్లప్పుడూ నీ అర్హతలను గొప్పగా చాటుకుంటావు, ఆయనతో పోటీపడతావు మరియు ఆయనతో వాదిస్తావు, అంతేకానీ ఆయన ఆలోచనను అర్థం చేసుకోవడానికి నిజంగా ప్రయత్నించవు లేదా ఆయన చిత్తాన్ని లేదా మానవాళి పట్ల ఆయన వైఖరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు. ఈ విధానంలో ముందుకు సాగడం అనేది అన్నింటికంటే మించి నిన్ను ఎక్కువ గౌరవిస్తుంది; అది దేవుడిని ఘనంగా చూపదు. నీవు నిన్ను మాత్రమే విశ్వసిస్తావు; నీవు దేవుడిని నమ్మవు. దేవుడు అలాంటి వారిని కోరుకోడు, ఆయన వారికి రక్షణ ఇవ్వడు. నీవు ఇలాంటి దృష్టి కోణాన్ని వదిలివేయగలిగితే, అలాగే, గతంలో నీకున్న తప్పు దృష్టి కోణాలను సరిదిద్దుకోగలిగితే, నీవు దేవుని కోరికల ప్రకారం కొనసాగగలిగితే, నీవు దేవుని యందు భయముతో ఉండే, చెడుతనమును విసర్జించే మార్గాన్ని ఆచరించగలిగితే, నీవు అన్ని విషయాలలో గొప్పవాడైన దేవుడిని గౌరవించగలిగితే మరియు నిన్ను నీవు మరియు దేవుడిని నిర్వచించడానికి మీ సొంత వ్యక్తిగత అభిరుచులు, దృష్టి కోణాలు లేదా నమ్మకాలను ఉపయోగించకుండా ఉండగలిగితే, దానికి బదులుగా నీవు అన్ని విధాలుగా దేవుని ఉద్దేశాలను అన్వేషించగలిగితే, మానవాళి పట్ల ఆయన వైఖరిని తెలుసుకుని, అర్థం చేసుకుని, ఆయన ప్రమాణాలకు అనుగుణంగా ఆయనను సంతృప్తిపర్చగలిగితే, అది ఎంతో అద్భుతంగా ఉంటుంది! నీవు దేవుని యందు భయము కలిగి ఉండే మరియు చెడుతనముము విసర్జించే మార్గం వైపు తొలి అడుగు వేయబోతున్నావని ఇది సూచిస్తుంది.

దేవుడు ప్రజల ఫలితాలను నిర్ణయించడానికి వారి వివిధ ఆలోచనలు, తలంపులు మరియు దృష్టి కోణాలను ప్రమాణాలుగా ఉపయోగించకపోతే, వారి ఫలితాలను నిర్ణయించడానికి ఆయన ఏ విధమైన ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు? వారి ఫలితాలను నిర్ణయించడానికి ఆయన పరీక్షలను ఉపయోగిస్తాడు. ప్రజల ఫలితాలను నిర్ణయించడానికి పరీక్షలను ఉపయోగించడంలో దేవుడికి రెండు ప్రమాణాలు ఉన్నాయి: మొదటిది, ప్రజలు ఎదుర్కొనే పరీక్షల సంఖ్య మరియు రెండవది, ఈ పరీక్షలు ప్రజలకు ఇచ్చే ఫలితాలు. ఒక వ్యక్తి ఫలితాన్ని నిర్ణయించేవి ఈ రెండు సూచికలే. ఇప్పుడు, ఈ రెండు ప్రమాణాలను వివరిద్దాము.

మొదటగా, ఒక వ్యక్తి దేవుని పరీక్షను ఎదుర్కొన్నప్పుడు (గమనిక: నీ దృష్టిలో, ఈ పరీక్ష చిన్నదే కావచ్చు, చెప్పుకోదగినది కాకపోవచ్చు), ఇది నీపై ఆయన చేయి అని మరియు నీ కోసం ఈ పరిస్థితిని కల్పించింది ఆయనేనని నీకు స్పష్టంగా తెలిసేలా ఆయన చేస్తాడు. నీవు స్థాయిలో ఇంకా అపరిపక్వంగా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను పరీక్షించడానికి పరీక్షలు పెడతాడు మరియు ఈ పరీక్షలు నీ స్థాయికి తగినట్టు, నీవు గ్రహించగలిగేటట్లు మరియు నీవు తట్టుకోగలిగేటట్లు ఉంటాయి. నీలో ఏ భాగం పరీక్షించబడుతుంది? దేవుని పట్ల నీ వైఖరి. ఈ వైఖరి చాలా ముఖ్యమైనదా? అవును, ఇది ముఖ్యమైనదే! దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది! మనుష్యులలో ఈ వైఖరి దేవుడి కోరిక ఫలితం, కాబట్టి, ఆయనకు సంబంధించినంతవరకు, ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. అలా కాకపోతే, దేవుడు ప్రజలను అలాంటి పనిలో పెట్టడం ద్వారా తన ప్రయత్నాలను వారి కోసం వెచ్చించడు. ఈ పరీక్షల ద్వారా, దేవుడు ఆయన పట్ల నీ వైఖరిని చూడాలనుకుంటాడు; నీవు సరైన మార్గంలో ఉన్నావా లేదా అని ఆయన చూడాలనుకుంటాడు. నీవు దేవుని యందు భయముతో ఉన్నావా మరియు చెడుతనమును విసర్జించాలనుకుంటున్నావా లేదా అని కూడా ఆయన చూడాలనుకుంటాను కాబట్టి, నీవు ఏదైనా నిర్దిష్ట సమయంలో సత్యాన్ని ఎక్కువ లేదా తక్కువ అర్థం చేసుకున్నావా అనేదానితో సంబంధం లేకుండా, నీవు ఇప్పటికీ దేవుని పరీక్షలను ఎదుర్కొంటావు మరియు నీవు అర్థం చేసుకున్న సత్యంలో ఏదైనా పెరుగుదలకు అనుగుణంగా, ఆయన నీ కోసం తగిన పరీక్షలను కల్పించడం కొనసాగిస్తాడు. నీవు ఇంకోసారి పరీక్షను ఎదుర్కొన్నప్పుడు, దేవుడు నీ దృష్టి కోణం, నీ ఆలోచనలు మరియు ఆయన పట్ల నీ వైఖరి ఈ మధ్య కాలంలో ఏమైనా పెరిగిందా లేదా అని చూడాలని దేవుడు అనుకుంటాడు. “దేవుడు ఎందుకు ఎప్పుడూ ప్రజల వైఖరులను చూడాలనుకుంటాడు? వారు సత్యాన్ని ఎలా ఆచరిస్తున్నారో ఆయన ఇప్పటికే చూడలేదా? ఆయన ఇంకా ఎందుకు వారి వైఖరిని చూడాలనుకుంటాడు?” అని కొందరు ఆశ్చర్యపడతారు. ఇది అర్థంలేని ప్రయత్నం! దేవుడు ఈ పద్ధతిలో పనిచేస్తాడని అనుకుంటే, ఆయన చిత్తం తప్పక అందులో ఉండాలి. దేవుడు ప్రజలను ఎల్లప్పుడూ పక్క నుండి గమనిస్తాడు, వారి ప్రతి మాట మరియు చర్య, వారి ప్రతి పని మరియు కదలికను గమనిస్తాడు; ఆయన వారి ప్రతి ఆలోచనను మరియు తలంపును కూడా గమనిస్తాడు. ప్రజలకు జరిగే ప్రతిదానిని—అంటే, వారి మంచి పనులు, వారి తప్పులు, వారి అతిక్రమణలు, వారి తిరుగుబాట్లు మరియు నమ్మకద్రోహాలను—వారి ఫలితాలను నిర్ణయించడానికి సాక్ష్యంగా దేవుడు గమనిస్తాడు. అంచెలంచెలుగా, దేవుని కార్యము వృద్ధి చెందే కొద్దీ, నీవు మరిన్ని సత్యాలను వింటావు మరియు మరిన్ని సానుకూల విషయాలు, సమాచారాన్ని అంగీకరిస్తావు మరియు నీవు సత్యపు వాస్తవికతను మరింత పొందుతావు. ఈ మొత్తం క్రమములో, దేవుడు నీ నుండి కోరుకునేవి కూడా పెరుగుతాయి మరియు అవి పెరిగే కొద్దీ, ఆయన నీకు మరింత తీవ్రమైన పరీక్షలు పెడతాడు. ఈ సమయంలో ఆయన పట్ల నీ వైఖరిలో పురోగతి ఉందో లేదో పరీక్షించడమే ఆయన లక్ష్యం. నిజానికి, ఇది జరిగినప్పుడు, దేవుడు నీ నుండి కోరుకునే దృష్టి కోణం అనేది సత్యపు వాస్తవికత గురించిన నీ అవగాహనకు అనుగుణంగా ఉంటుంది.

నీ స్థాయి క్రమంగా వృద్ధి చెందుతుంటే, దేవుడు నీ నుండి కోరుకునే ప్రమాణం కూడా పెరుగుతుంది. నీవు ఇంకా అపరిపక్వంగా ఉన్నప్పుడు, నీవు పూర్తి చేయడానికి ఆయన చాలా తక్కువ ప్రమాణాన్ని నిర్ణయిస్తాడు; నీ స్థాయి కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు, ఆయన నీ ప్రమాణాన్ని కాస్త ఎక్కువగా పెంచుతాడు. అయితే నీవు సత్యాన్నంతా అర్థం చేసుకున్నాక దేవుడు ఏమి చేస్తాడు? ఆయన నిన్ను మరింత పెద్ద పరీక్షలకు గురి చేస్తాడు. ఈ పరీక్షల మధ్యలో, దేవుడు నీ నుండి పొందాలనుకునేది, ఆయన నీలో చూడాలనుకునేది, ఆయన గురించి మరింత లోతైన జ్ఞానం, ఆయన పట్ల నిజమైన గౌరవం మాత్రమే. ఈ సమయంలో, నీ స్థాయి ఎక్కువ అపరిపక్వంగా ఉన్నప్పటి కంటే నీ నుండి ఆయన కోరుకునేవి ఉన్నతంగా మరియు “కఠినంగా” ఉంటాయి (గమనిక: ప్రజలు వాటిని కఠినమైనవిగా చూడవచ్చు, కానీ దేవుడు వాటిని సహేతుకమైనవిగా చూస్తాడు). దేవుడు ప్రజలను పరీక్షించేటప్పుడు, ఆయన ఎలాంటి వాస్తవికతను సృష్టించాలనుకుంటాడు? ప్రజలు వారి హృదయాలను ఆయనకు అర్పించాలని ఆయన నిరంతరం కోరుతున్నాడు. “నేను దాన్ని ఎలా ఇవ్వగలను? నేను నా విధిని పూర్తి చేశాను; నేను నా ఇంటిని మరియు బతుకుదెరువును విడిచిపెట్టాను మరియు నన్ను నేను వెచ్చించుకున్నాను. ఇవన్నీ నేను నా హృదయాన్ని దేవునికి అర్పించిన సందర్భాలు కావా? నా హృదయాన్ని దేవునికి మరెలా అర్పించగలను? ఇవి నా హృదయాన్ని ఆయనకు అర్పించే వాస్తవ మార్గాలు కాకపోవడానికి అవకాశం ఉందా? దేవుడి నిర్దిష్ట కోరిక ఏమిటి?” అని కొందరు అడుగుతారు. ఆ కోరిక చాలా సరళమైనది. వాస్తవానికి, కొందరు వారి పరీక్షల వివిధ దశలలో ఇప్పటికే తమ హృదయాలను వివిధ స్థాయిలలో దేవునికి అర్పించారు, కానీ, అత్యధిక ప్రజలు తమ హృదయాలను దేవునికి ఎప్పుడూ అర్పించలేదు. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, నీ హృదయం ఆయనతో ఉందా, దేహంతో ఉందా లేదా సాతానుతో ఉందా అని ఆయన చూస్తాడు. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, నీవు ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డావా లేదా ఆయనకు అనుకూలమైన స్థితిలో ఉన్నావా అనీ, నీ హృదయం ఆయన వైపు ఉందా అని కూడా ఆయన చూస్తాడు. నీవు అపరిపక్వంగా ఉండి, పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, నీకు తక్కువ ఆత్మవిశ్వాసం ఉంటుంది మరియు దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఏమి చేయాలో ఖచ్చితంగా నీవు తెలుసుకోలేవు, ఎందుకంటే సత్యం గురించి నీ అవగాహన పరిమితంగా ఉంది. అయితే, నీవు ఇప్పటికీ దేవుడిని నిష్కళంకంగా మరియు మనస్ఫూర్తిగా ప్రార్థించగలిగితే మరియు నీ హృదయాన్ని నీవు ఆయనకు అర్పించాలనీ, ఆయనను నీ సార్వభౌముడిగా చేసుకోవాలని కోరుకోగలిగితే, నీవు అత్యంత అమూల్యమైనవిగా విశ్వసించే వాటన్నింటినీ ఆయనకు సమర్పించాలని అనుకోగలిగితే, నీవు ఇప్పటికే నీ హృదయాన్ని దేవునికి అర్పించుకుని ఉంటావని దానర్థం. నీవు ఎక్కువ ప్రవచనాలు వింటూ మరియు సత్యాన్ని మరింత అర్థం చేసుకుంటూ ఉండడం వల్ల, నీ స్థాయి కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ సమయంలో, దేవుని కోరికల ప్రమాణం నీవు అపరిపక్వంగా ఉన్నప్పుటిలా ఒకేలా ఉండదు; ఆయన నీ నుండి మరింత ఉన్నత స్థాయిని కోరుకుంటాడు. ప్రజలు క్రమంగా తమ హృదయాలను దేవునికి అర్పిస్తున్నప్పుడు, వారి హృదయాలు నెమ్మదిగా ఆయనకు చేరువ అవుతాయి; ప్రజలు దేవునికి నిష్కళంకంగా చేరువైనపుడు, వారి హృదయాలు ఆయనను ఇంకా ఎక్కువ గౌరవిస్తాయి. దేవుడు కోరుకునేది అలాంటి హృదయాన్ని మాత్రమే.

దేవుడు ఎవరిదైనా హృదయాన్ని పొందాలనుకున్నప్పుడు, ఆయన ఆ వ్యక్తిని అనేక పరీక్షలకు గురి చేస్తాడు. ఆ పరీక్షల సమయంలో, దేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని పొందకపోతే లేదా ఆ వ్యక్తికి ఏదైనా వైఖరి ఉందని చూడకపోతే—అంటే, ఆ వ్యక్తి తన పట్ల గౌరవాన్ని ప్రదర్శించే విధంగా ఆచరించడం లేదా ప్రవర్తించడాన్ని దేవుడు చూడకపోతే మరియు ఈ వ్యక్తిలో చెడుతనమును విసర్జించే వైఖరి మరియు సంకల్పాన్ని కూడా చూడకపోతే—అప్పుడు, అనేక పరీక్షల తర్వాత, వారి పట్ల దేవుడు తన సహనాన్ని ఉపసంహరించుకుంటాడు మరియు ఆయన వారిని ఇక ఏమాత్రం సహించడు. ఆయన ఇక ఆ వ్యక్తిని ఏమాత్రం పరీక్షించడు మరియు ఆయన ఇక ఏమాత్రం అతనిపై పని చేయడు. కాబట్టి, ఆ వ్యక్తి ఫలితానికి సంబంధించి ఇది దేనిని సూచిస్తుంది? వారికి ఏ ఫలితం లేదని దీనర్థం. ఆ వ్యక్తి బహుశా చెడు ఏదీ చేసి ఉండకపోవచ్చు; అతను బహుశా అంతరాయం ఏదీ కలిగించి ఉండకపోవచ్చు మరియు భంగం ఏదీ కలిగించి ఉండకపోవచ్చు. బహుశా అతను దేవుడిని బహిరంగంగా ప్రతిఘటించి ఉండకపోవచ్చు. అయితే, ఆ వ్యక్తి హృదయం దేవునికి కనిపించకుండా దాగి ఉంది; వారికి దేవుని పట్ల స్పష్టమైన వైఖరి మరియు దృష్టి కోణం ఎప్పుడూ లేదు మరియు వారి హృదయాన్ని తనకు అర్పించినట్లు లేదా వారు తనకు భయపడాలనీ మరియు చెడుతనమును విసర్జించాలనీ కోరుకోవడాన్ని దేవుడు స్పష్టంగా చూడలేడు. అలాంటి వ్యక్తుల పట్ల దేవుడు సహనం కోల్పోతాడు మరియు వారి కోసం ఇక ఏ మూల్యాన్ని చెల్లించడు, వారిపై ఎలాంటి కరుణ చూపించడు లేదా వారిపై పని చేయడు. అలాంటి వ్యక్తికి దేవుని పట్ల విశ్వాసపు జీవితం ఇప్పటికే ముగిసిపోయింది. ఎందుకంటే, వారికి దేవుడు పెట్టిన పరీక్షలన్నింటిలో, దేవుడు ఆయన కోరుకున్న ఫలితాన్ని పొందలేదు. ఈ విధంగా, పరిశుద్ధాత్మ జ్ఞానోదయం మరియు వెలుగును వారిలో నేను ఎన్నడూ చూడని వ్యక్తులు అనేకమంది ఉన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఈ వ్యక్తులు అనేక సంవత్సరాలు దేవుడిని విశ్వసించి ఉండవచ్చు మరియు పైపైన, వారు పూర్తి శక్తితో ప్రవర్తించారు; వారు అనేక గ్రంథాలు చదివారు, అనేక వ్యవహారాలు చక్కబెట్టారు, డజను లేదా అంతకంటే ఎక్కువ రాత పుస్తకాలు నింపారు మరియు అనేక పదాలు మరియు సిద్ధాంతాలపై ప్రావీణ్యత సాధించారు. అయితే, వారిలో కనిపించే పెరుగుదల ఎప్పుడూ లేదు, దేవునిపై వారి అభిప్రాయాలు కనిపించకుండా ఉండిపోతాయి మరియు వారి వైఖరులు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే, వారి హృదయాలను చూడటం సాధ్యం కాదు; వారు ఎప్పుడూ కప్పివేయబడి మరియు మూసివేయబడి ఉంటారు—వారు దేవుని నుండి మూసివేయబడి ఉంటారు. ఫలితంగా, ఆయన వారి నిజమైన హృదయాలను చూడలేదు, ఆయన ఈ వ్యక్తులలో తనపై నిజమైన గౌరవాన్ని చూడలేదు మరియు ఇంకా చెప్పాలంటే, ఈ వ్యక్తులు ఆయన మార్గంలో ఎలా నడుస్తున్నారో చూడలేదు. ఇప్పటికీ అలాంటి వ్యక్తులను దేవుడు పొందకపోతే, ఇక భవిష్యత్తులో వారిని పొందగలడా? ఆయన పొందలేడు! పొందలేని వాటి కోసం ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడా? ఆయన ప్రయత్నించడు! అయితే, అలాంటి వ్యక్తుల పట్ల దేవుని ప్రస్తుత వైఖరి ఏమిటి? (ఆయన వారిని నిరాకరిస్తాడు మరియు వారిని పట్టించుకోడు.) ఆయన వారిని పట్టించుకోడు! దేవుడు అలాంటి వారిని లక్ష్యపెట్టడు; ఆయన వారిని నిరాకరిస్తాడు. మీరు ఈ పదాలను చాలా త్వరగా మరియు చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. మీరు విన్నదాన్ని మీరు అర్థం చేసుకున్నారా అన్నట్లు ఇది కనిపిస్తోంది!

తాము దేవుడిని అనుసరించడం ప్రారంభించినప్పుడు, అపరిపక్వంగా మరియు అజ్ఞానంగా ఉండేవారు కొందరు ఉన్నారు; వారికి ఆయన చిత్తం అర్థం కాదు లేదా ఆయనను విశ్వసించడమంటే ఏమిటో వారికి తెలియదు. వారు దేవుడిని విశ్వసించడం మరియు అనుసరించడంలో మానవ-కల్పిత మరియు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు. అలాంటి వారు పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు, దాని గురించి వారికి తెలియదు; వారు దేవుని మార్గదర్శకత్వం మరియు జ్ఞానోదయం పట్ల స్తబ్ధంగా ఉంటారు. వారికి తమ హృదయాలను దేవునికి అర్పించడం అంటే ఏమిటో లేదా పరీక్ష సమయంలో గట్టిగా నిలబడటం అంటే ఏమిటో తెలియదు. దేవుడు అలాంటి వారికి పరిమిత సమయాన్ని ఇస్తాడు మరియు ఈ సమయంలో, ఆయన తన పరీక్షల స్వభావాన్ని మరియు తన ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి అవకాశమిస్తాడు. ఆ తర్వాత, ఈ వ్యక్తులు తప్పక వారి అభిప్రాయాలను ప్రదర్శించాలి. ఈ దశలోని వారి కోసం, దేవుడు ఇంకా వేచి ఉన్నాడు. తమ హృదయాలను దేవునికి అర్పించాలనుకున్నప్పటికీ, అలా చేయడానికి సామరస్యత పొందని మరియు కొన్ని ప్రాథమిక సత్యాలను ఆచరణలో పెట్టినప్పటికీ, పెద్ద పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు దాక్కోవడానికి మరియు వదిలేయడానికి ప్రయత్నించే, ఇప్పటికీ కొన్ని అభిప్రాయాలు చంచలంగా ఉన్నవారి విషయానికొస్తే—వారి పట్ల దేవుని వైఖరి ఏమిటి? ఆయన ఇప్పటికీ వారి నుండి కాస్త ఆశిస్తాడు మరియు ఫలితం వారి వైఖరి మరియు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. పురోగతి చెందడంలో వ్యక్తులు చురుకుగా లేకుంటే, దేవుడేమి చేస్తాడు? ఆయన వారిని వదులుకుంటాడు. ఎందుకంటే, దేవుడు నిన్ను వదులుకోవడానికి ముందే, నిన్ను నీవు ఇప్పటికే వదులుకున్నావు. కాబట్టి, అలా చేసినందుకు నీవు దేవుడిని నిందించలేవు. దేవునికి వ్యతిరేకంగా నీవు ఫిర్యాదు కలిగి ఉండటం తప్పు.

ఒక ఆచరణాత్మక ప్రశ్న ప్రజలలో సృష్టించే వివిధ ఇబ్బందికర పరిస్థితులు

అందరికంటే అత్యంత విషాదకరమైన ఫలితం ఉన్న మరొక రకమైన వ్యక్తి ఉన్నాడు; కనీసం ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడనిది ఈ రకమైన వ్యక్తినే. వారు దేవుని శిక్షను పొందారు కాబట్టి వారు విషాదకరంగా ఉన్నారనీ లేదా వారిపై ఆయన కోరికలు కఠోరంగా ఉన్నాయి కాబట్టి వారి ఫలితం విషాదకరంగా ఉందనీ కాదు; దానికి బదులుగా, అది వారంతట వారు చేసుకున్నారు కాబట్టే వారు విషాదంగా ఉన్నారు. ఒక సాధారణ నానుడి ప్రకారం చెప్పాలంటే, వారు తమ గోతిని తామే తవ్వుకుంటారు. ఏ రకమైన వ్యక్తి ఇలా చేస్తాడు? ఈ వ్యక్తులు సరైన మార్గంలో నడవరు మరియు వారి ఫలితాలు ముందుగానే వెల్లడించబడతాయి. దేవుని దృష్టిలో, అలాంటి వ్యక్తులు ఆయన అత్యంత అసహ్యించుకునే వస్తువులు. మానవపరంగా చూస్తే, ఇలాంటి వ్యక్తులు అత్యంత దయనీయులు. అలాంటి వ్యక్తులు దేవుడిని అనుసరించడం ప్రారంభించినప్పుడు, వారు చాలా ఉత్సాహంగా ఉంటారు; వారు అనేక మూల్యాలు చెల్లిస్తారు, దేవుని కార్యపు అవకాశాల గురించి మంచి అభిప్రాయంతో ఉంటారు మరియు తమ సొంత భవిష్యత్తు విషయానికొస్తే అంతులేని కల్పనతో ఉంటారు. దేవుడు మనుష్యులను పరిపూర్ణులుగా చేయగలడనీ మరియు వారిని అద్భుతమైన గమ్యస్థానానికి చేర్చగలడనీ విశ్వసిస్తూ, వారు దేవుని పట్ల ప్రత్యేకమైన విశ్వాసంతో కూడా ఉంటారు. అయినా, కారణం ఏదైనప్పటికీ, ఈ వ్యక్తులు దేవుని కార్యము సమయంలో పలాయనం చిత్తగిస్తారు. ఇక్కడ “పలాయనం చిత్తగించడం” అంటే ఏమిటి? అంటే, వీడ్కోలు చెప్పకుండా, చప్పుడు కూడా కాకుండా అదృశ్యమవుతారని అర్థం; ఒక్క మాట కూడా చెప్పకుండా వారు వెళ్ళిపోతారని దీనర్థం. అలాంటి వ్యక్తులు దేవుడిని విశ్వసిస్తున్నామని చెప్పుకున్నప్పటికీ, వారు తమ విశ్వాసపు మార్గంలో నిజంగా ఎప్పుడూ వేర్లు పాతుకోలేదు. అందుచేత, వారు ఆయనను ఎంతకాలం విశ్వసించారనే దానితో సంబంధం లేకుండా, వారు ఇప్పటికీ దేవుని నుండి తిరిగి దూరంగా వెళ్లిపోగలరు. కొంతమంది వ్యాపారం లోనికి వెళ్లడానికి, కొందరు తమ జీవితాలను జీవించడానికి, కొందరు ధనవంతులుగా మారడానికి మరియు మరికొందరు పెళ్లి చేసుకుని పిల్లలను కనడానికి వదిలి వెళ్తారు… అలా వదిలి వెళ్లే వారిలో, తర్వాత మనస్సాక్షి దాడులకు గురై తిరిగి రావాలనుకునే వారు కొందరున్నారు, మనుగడ కొనసాగించడానికి చాలా కఠోరమైన సమయాన్ని గడుపుతున్న మరికొందరు యేండ్ల తరబడి లోకంలో కొట్టుకుపోతుంటారు. ఈ కొట్టుకుపోయేవారు చాలా బాధలను అనుభవిస్తారు, లోకంలో ఉండటం చాలా బాధాకరమనీ మరియు వారిని దేవుని నుండి వేరు చేయలేరనీ వారు విశ్వసిస్తారు. ఓదార్పు, శాంతి మరియు ఆనందం పొందడానికి వారు దేవుని గృహానికి తిరిగి రావాలనుకుంటారు మరియు వారు విపత్తును తప్పించుకోవడానికి లేదా రక్షణను మరియు అందమైన గమ్య స్థానాన్ని పొందడానికి దేవుడిని విశ్వసిస్తూనే ఉండాలనుకుంటారు. ఇది ఎందుకంటే, వీరు దేవుని ప్రేమ అవధుల్లేనిదని మరియు ఆయన కృప తరిగి పోనిదని విశ్వసిస్తారు. ఎవరేమి చేశారనే దానితో సంబంధం లేకుండా దేవుడు వారిని క్షమించాలనీ మరియు వారి గతాన్ని సహించాలనీ వారు భావిస్తారు. వీరు తిరిగి వచ్చి తమ విధులను నిర్వర్తించాలనుకుంటున్నారని పదే పదే చెబుతారు. దేవుని గృహానికి తిరిగి వెళ్లడానికి మార్గాన్ని సుగమం చేస్తుందనే ఆశతో, తమ ఆస్తులలో కొన్నింటిని చర్చికి ఇచ్చే వారు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల దేవుడి వైఖరి ఏమిటి? వారి ఫలితాలను ఆయన ఎలా నిర్ణయించాలి? సంకోచం లేకుండా చెప్పండి. (ఈ రకమైన వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడని నేననుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పినది విన్నాక, ఆయన అలా చేయకపోవచ్చునని నాకనిపిస్తున్నది.) నీ తర్కాన్ని చెప్పండి. (అలాటి వ్యక్తులు తమ ఫలితాలు మృత్యువుగా మారకుండా ఉండేందుకు మాత్రమే దేవుని యెదుటకు వస్తారు. వారు యథార్థమైన నిజాయితీతో దేవుడిని విశ్వసించడానికి రారు; వారికి దేవుని కార్యము త్వరలోనే ముగుస్తుందని తెలుసు, కాబట్టి వారు వచ్చి ఆశీర్వాదాలు పొందవచ్చుననే భ్రమలో ఉంటారు.) ఈ వ్యక్తులు దేవుడిని మనస్ఫూర్తిగా విశ్వసించరనీ, అందుకే ఆయన వారిని అంగీకరించలేరనీ నీవు అంటున్నావు, అవునా? (అవును.) (అలాంటి వ్యక్తులు కేవలం అవకాశవాదులనీ మరియు దేవుడిని నిష్కళంకంగా విశ్వసించరనీ నా భావన.) వారు దేవుడిని విశ్వసించడానికి రాలేదు; వారు అవకాశవాదులు. బాగా చెప్పారు! ఈ అవకాశవాదులు ప్రతి ఒక్కరూ అసహ్యించుకునే రకానికి చెందిన వ్యక్తులు. వారు గాలి ఎటు వీస్తే అటే వెళ్తారు, వారు దాని నుండి ఏదైనా పొందుతారంటే తప్ప, ఏదైనా చేయాలనుకోరు, కాబట్టి వారు హేయమైనవారు! ఇంకెవరైనా సోదరుడు లేదా సోదరి తమ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నారా? (దేవుడు వారిని ఇక ఏమాత్రం అంగీకరించడు, ఎందుకంటే ఆయన కార్యము పూర్తి కాబోతోంది మరియు ఇది ప్రజల ఫలితాలు నిర్ణయించబడుతున్న సమయం. సరిగ్గా ఈ సమయంలోనే ఈ వ్యక్తులు తిరిగి రావాలనుకుంటున్నారు—నిజంగా సత్యాన్ని అనుసరించాలనుకుంటున్నారు కాబట్టి కాదు, విపత్తులు ముంచుకొస్తున్నాయని వారికి కనిపిస్తున్నందున లేదా వారు బాహ్య కారకాలచేత ప్రభావితం కాబడుతున్నందున వారు రావాలనుకుంటున్నారు. వారికి నిజంగా సత్యాన్ని అనుసరించాలనే ఉద్దేశమే ఉంటే, వారు దేవుని కార్యము నుండి మధ్యలో పారిపోరు.) ఇంకా ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయా? (వారు అంగీకరించబడరు. నిజానికి దేవుడు వారికి ఇప్పటికే అవకాశాలు ఇచ్చాడు, కానీ వారు ఆయన పట్ల జాగ్రత్త లేని వైఖరిని అవలంబించాలని పట్టుబట్టారు. ఈ వ్యక్తుల ఉద్దేశాలు ఏమైనప్పటికీ, వారు నిజంగా పశ్చాత్తాపం చెందినా, వారు తిరిగి రావడానికి దేవుడు అనుమతించడు. ఎందుకంటే, ఆయన వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ వారు తమ వైఖరిని ఇప్పటికే ప్రదర్శించారు: వారు దేవుడిని వదిలి వెళ్లాలనుకున్నారు. అందుచేత, వారు ఇప్పుడు తిరిగి రావాలని ప్రయత్నిస్తే, వారిని దేవుడు అంగీకరించడు.) (దేవుడు ఈ రకమైన వ్యక్తిని అంగీకరించడని నేను ఒప్పకుంటాను, ఎందుకంటే ఒక వ్యక్తి నిజమైన మార్గాన్ని చూసి కూడా, అంత సుదీర్ఘ కాలం దేవుని కార్యాన్ని అనుభవించి కూడా, లోకం లోనికి మరియు సాతాను కౌగిలిలోకి తిరిగి వెళ్లగలిగితే, అప్పుడది దేవుడికి పెద్ద నమ్మకద్రోహం చేసినట్లు అవుతుంది. దేవుని గుణగణాలు కరుణ మరియు ప్రేమ అనేది వాస్తవమైనప్పటికీ, ఆ గుణగణాలు ఎలాంటి వ్యక్తి వైపు చూపబడుతున్నాయి అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తి ఓదార్పు కోసం లేదా వారి ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుని యెదుటకు వస్తే, వారు దేవుడిని మనస్ఫూర్తిగా విశ్వసించే రకం కాదు, అలాంటి వ్యక్తుల పట్ల దేవుని కరుణ అంత వరకు మాత్రమే ఉంటుంది.) దేవుని గుణగణాలు కరుణ అయితే, ఇలాంటి వ్యక్తికి దానిలో మరికాస్త ఆయన ఎందుకు ఇవ్వడు? మరికాస్త కరుణతో, ఈ వ్యక్తికి ఒక అవకాశం లభించదా? గతంలో, దేవుడు ప్రతి వ్యక్తి రక్షించబడాలనుకుంటాడనీ మరియు ఎవరూ వినాశనానికి గురికాకూడదనుకుంటాడనీ ప్రజలు తరచూ చెప్పేవారు; వంద గొర్రెలలో ఒక్కటి తప్పిపోయినా, తప్పిపోయిన దానిని వెతకడానికి దేవుడు తొంభై తొమ్మిది గొర్రెలను వదిలి వెళ్తాడు. ఇప్పుడు, ఈ వ్యక్తుల విషయానికొస్తే, వారి నిజాయితీతో కూడిన విశ్వాసం కారణంగా, దేవుడు వారిని అంగీకరించి, వారికి రెండవ అవకాశం ఇవ్వాలా? నిజానికి ఇది అంత కఠినమైన ప్రశ్న కాదు; ఇది చాలా సులభమైనది! మీరు నిజంగా దేవుడిని అర్థం చేసుకుంటే, ఆయన గురించి నిజమైన జ్ఞానం మీకుంటే, అప్పుడు చాలా వివరణ అవసరం లేదు—మరియు ఎక్కువ ఊహాగానాలతో పని లేదు, అవునా? మీ జవాబులు సరైన మార్గంలో ఉన్నాయి, కానీ అవి ఇంకా దేవుని వైఖరికి చాలా దూరంగానే ఉన్నాయి.

ఇప్పుడే, మీలో కొందరు ఈ రకమైన వ్యక్తిని దేవుడు అంగీకరించలేడని నిశ్చయంగా చెప్పారు. దేవుడు వారిని అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు అనే ఆలోచనతో, ఇతరులలో మరీ అంత స్పష్టత లేదు—ఈ వైఖరి మరింత మధ్యస్థమైన మార్గం. దేవుడు ఇలాంటి వ్యక్తిని అంగీకరిస్తాడని ఆశించే దృష్టికోణం గల వారు కూడా మీలో ఉన్నారు—ఈ వైఖరి మరింత అస్పష్టమైనది. దేవుడు ఇంతకాలం పనిచేశాడనీ మరియు ఆయన కార్యము పూర్తయిందనీ, కాబట్టి ఆయనకు ఈ వ్యక్తుల పట్ల సహనం చూపించాల్సిన అవసరం లేదనీ; కాబట్టి, ఆయన వారిని మళ్లీ అంగీకరించడని ఖచ్చితంగా విశ్వసించేవారు మీలో ఉన్నారు. మీలో మరింత మధ్యేమార్గంగా ఉన్నవారు ఈ విషయాలను వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా చక్కబెట్టాలని నమ్ముతారు; ఈ వ్యక్తుల హృదయాలు దేవుని నుండి విడదీయరానివైతే మరియు వారు నిజంగా దేవుడిని విశ్వసించి, సత్యాన్ని అనుసరిస్తే, అప్పుడు దేవుడు వారి గత బలహీనతలను మరియు పొరపాట్లను మరచిపోవాలి—ఆయన ఈ వ్యక్తులను క్షమించాలి, వారికి రెండవ అవకాశం ఇవ్వాలి మరియు ఆయన గృహానికి తిరిగి రావడానికి అనుమతించాలి మరియు ఆయన రక్షణను కల్పించాలి. అయితే, ఈ వ్యక్తులు మరోసారి పారిపోతే, అప్పుడు వారిని ఇక ఏమాత్రం దేవుడు కోరుకోడు మరియు ఈ వ్యక్తులను పరిత్యజించడం అన్యాయంగా భావించబడదు. అలాంటి వ్యక్తిని దేవుడు అంగీకరించవచ్చని ఆశించే మరో సమూహం ఉంది. దేవుడు నిజంగా అలా చేస్తాడా లేదా అనేది ఈ సమూహానికి ఖచ్చితంగా తెలియదు. ఆయన ఈ రకమైన వ్యక్తిని అంగీకరించాలని వారు విశ్వసిస్తే, కానీ ఆయన అంగీకరించకపోతే, అప్పుడు ఈ అభిప్రాయం దేవుని దృష్టికోణానికి కాస్త వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి వ్యక్తిని దేవుడు అంగీకరించకూడదని వారు విశ్వసిస్తే, మానవుల పట్ల తన ప్రేమ అవధుల్లేనిదనీ, అలాంటి వ్యక్తికి మరొక అవకాశం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ దేవుడు చెప్పడం జరిగితే, అప్పుడది మానవ అజ్ఞానానికి ఉదాహరణ కాదా? ఏదేమైనా, మీకందరికీ మీ సొంత అభిప్రాయాలు ఉన్నాయి. ఈ దృష్టికోణాలు మీ సొంత ఆలోచనలలో ఉన్న ఒక రకమైన జ్ఞానాన్ని సూచిస్తాయి; అవి సత్యం మరియు దేవుని చిత్తం గురించి మీ లోతైన అవగాహనకు ప్రతిబింబం కూడా. అలా అనడం సరైనదా, కాదా? ఈ విషయంపై మీకు అభిప్రాయాలు ఉండటం చాలా అద్భుతమైన విషయం! అయినా, మీ అభిప్రాయాలు సరైనవేనా, కాదా అనే ప్రశ్న ఇప్పటికీ అలాగే ఉంది. మీరందరూ కొంచెం ఆందోళన చెందుతున్నారు, కాదంటారా? “అప్పుడు ఏది సరైనది? నేను స్పష్టంగా చూడలేను మరియు దేవుడు ఆలోచిస్తున్నదేమిటో నాకు ఖచ్చితంగా తెలియదు మరియు ఆయన నాకేమీ చెప్పలేదు. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో నేనెలా తెలుసుకోగలను? మానవాళి పట్ల దేవుని వైఖరి ప్రేమ. ఆయనకు గతంలో ఉన్న వైఖరి ప్రకారం చూస్తే, ఆయన అలాంటి వ్యక్తిని అంగీకరించాలి, కానీ దేవుని ప్రస్తుత వైఖరి గురించి నాకు మరీ స్పష్టంగా తెలియదు; ఆయన ఈ వ్యక్తిని అంగీకరించవచ్చు మరియు అంగీకరించకపోవచ్చని మాత్రమే నేను చెప్పగలను. ఇది నవ్వుకోదగినది కాదంటారా? ఈ ప్రశ్న మిమ్మల్ని నిజంగా నిశ్చేష్టులను చేసింది. మీకు ఈ విషయంలో సరైన దృష్టికోణం లేకపోతే, మీ చర్చి అలాంటి వ్యక్తిని నిజంగా ఎదుర్కొన్నప్పుడు మీరేమి చేస్తారు? మీరు పరిస్థితిని సరిగ్గా నిర్వహించలేకపోతే, మీరు దేవుడి పట్ల అపరాధము చేయవచ్చు. ఇది ఒక ప్రమాదకరమైన వ్యవహారం కాదా?

నేను ఇప్పుడు లేవనెత్తిన విషయానికి సంబంధించి మీ అభిప్రాయాలను నేనెందుకు అడగాలనుకుంటున్నాను? దేవుని గురించి మీకు ఎంత జ్ఞానం ఉందో మరియు ఆయన ఉద్దేశాలు మరియు వైఖరిని మీరు ఎంతగా అర్థం చేసుకున్నారో పరీక్షించడానికి నేను మీ అభిప్రాయాలను పరీక్షించాలని అనుకుంటున్నాను. మరి, మీసమాధానం ఏమిటి? దీనికి సమాధానం స్వయంగా మీ అభిప్రాయాలే. మీలో కొంతమంది చాలా సాంప్రదాయవాదులు, మరికొందరు ఊహించడానికి మీ ఊహలను ఉపయోగిస్తున్నారు. “ఊహించడం” అంటే ఏమిటి? అంటే, దేవుడు ఎలా ఆలోచిస్తాడో గ్రహించలేకపోవడం వల్ల దేవుడు ఏదో ఒక విధంగా ఆలోచించాలని నిరాధారమైన అభిప్రాయానికి రావడమని అర్థం; మీరు చెప్పేది సరైనదో లేక తప్పో నిజంగా మీకే తెలియదు, కాబట్టి మీరు అస్పష్టమైన అభిప్రాయాన్ని వినిపిస్తారు. ఈ యథార్థాన్ని ఎదుర్కొన్నప్పుడు, మీరు ఏమి చూశారు? దేవుడిని అనుసరిస్తున్నప్పుడు, ప్రజలు ఆయన చిత్తంపై చాలా అరుదుగా దృష్టి పెడతారు, మానవుల పట్ల ఆయన ఆలోచనలను మరియు ఆయన వైఖరిని వారు చాలా అరుదుగా పట్టించుకుంటారు. ప్రజలు దేవుని ఆలోచనలను అర్థం చేసుకోరు, కాబట్టి, ఆయన ఉద్దేశాలు మరియు స్వభావం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు, మీరు తికమకపడతారు; మీరు లోతైన అనిశ్చితిలో పడిపోతారు, దాంతో మీరు ఊహించడం గానీ లేదా జూదం ఆడటం గానీ చేస్తారు. ఇది ఏ రకమైన మానసికస్థితి? ఇది ఒక వాస్తవాన్ని నిరూపిస్తుంది: దేవుడిని విశ్వసించే చాలా మంది ఆయనను ఒక ఖాళీ గాలి గుచ్ఛంగా మరియు అది ఒక నిమిషం ఉండి, మరో నిమిషం ఉండకుండా పోయే ఏదో వస్తువుగా భావిస్తారు. నేనెందుకు ఈవిధంగా చెప్తున్నాను? ఎందుకంటే మీకు సమస్య ఎదురైనప్పుడల్లా, మీకు దేవుని చిత్తం తెలియదు. మీకు ఆయన చిత్తం ఎందుకు తెలియదు? ఇప్పుడు మాత్రమే కాదు, ఆది నుండి అంతం వరకు, ఈ సమస్య పట్ల దేవుని వైఖరి మీకు తెలియదు. నీవు దీనిని లోతుగా చూడలేవు మరియు దేవుని వైఖరి ఏమిటో నీకు తెలియదు, కానీ దీని గురించి నీవు బాగా ఆలోచించావా? దీని గురించి తెలుసుకోవాలని నీవు ప్రయత్నించావా? దీని గురించి నీవు సాంగత్యము చేశావా? లేదు! ఇది ఒక వాస్తవాన్ని నిర్ధారిస్తుంది: నీవు విశ్వసించే దేవునికి నిజమైన దేవునితో ఎటువంటి సంబంధం లేదు. దేవుని పట్ల నీ విశ్వాసంలో, నీవు నీ సొంత ఉద్దేశాలను మరియు నీ నాయకుల ఉద్దేశాలను గురించి మాత్రమే ఆలోచిస్తావు; నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని నిజంగా ప్రయత్నించకుండా లేదా అన్వేషించాలని అసలే మాత్రం కోరుకోకుండా, దేవుని వాక్యముల అర్థం గురించి పైపైన మరియు సిద్ధాంతపరంగా మాత్రమే ఆలోచిస్తావు. అంతే కదా? ఈ విషయపు గుణగణాలు చాలా ఘోరమైనవి! అనేక సంవత్సరాల తర్వాత, దేవుడిని విశ్వసించే ఎంతోమందిని నేను చూశాను. వారి మనస్సులలో వారి విశ్వాసం దేవుడిని ఏ విధంగా మార్చింది? కొంతమంది దేవుడిని ఆయన కేవలం ఖాళీ గాలి గుచ్ఛం మాత్రమే అన్నట్టుగా విశ్వసిస్తారు. వీరికి దేవుని అస్థిత్వాన్ని గురించిన ప్రశ్నలకు సమాధానం లేదు, ఎందుకంటే వారు ఆయన అస్థిత్వాన్ని లేదా ఆయన లేకపోవడాన్ని స్పష్టంగా చూడటం లేదా అర్థం చేసుకోవడం మాట అటుంచి, దానిని కనీసం అనుభూతి చెందలేరు లేదా గ్రహించ లేరు. ఉపచేతనలో, ఈ వ్యక్తులు దేవుడు లేడనే అనుకుంటారు. మరికొందరు దేవుడిని కూడా మనిషే అన్నట్లుగానే విశ్వసిస్తారు. అందుకే, తాము చేయలేని పనులన్నింటినీ ఆయన కూడా చేయలేడని ఈ వ్యక్తులు భావిస్తారు, వారు ఎలా ఆలోచిస్తారో ఆయన కూడా అలాగే ఆలోచించాలని అనుకుంటారు. దేవుడు అంటే వారి నిర్వచనం “ఒక కనిపించని మరియు స్పృశించలేని వ్యక్తి”. దేవుడు ఒక కీలుబొమ్మ అని విశ్వసించే జనసమూహం కూడా ఉంది; దేవునికి ఎటువంటి భావోద్వేగాలు లేవని వీరు విశ్వసిస్తారు. దేవుడు ఒక మట్టి విగ్రహమనీ, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, దేవునికి ఎలాంటి వైఖరి, అభిప్రాయం లేదా ఆలోచనలు ఉండవనీ వారు అనుకుంటారు; ఆయన మానవజాతి కరుణపై ఆధారపడి ఉన్నాడని వారు నమ్ముతారు. ప్రజలు ఎలా విశ్వసించాలనుకుంటే అలా విశ్వసిస్తారు. వారు ఆయనను గొప్పవాడిగా చేస్తే, గొప్పవాడు అవుతాడు; వారు ఆయనను అల్పుడిగా చేస్తే, అల్పుడు అవుతాడు. ప్రజలు పాపం చేసినప్పుడు, దేవుని కరుణ, సహనం మరియు ప్రేమ అవసరమైనప్పుడు, దేవుడు ఆయన కరుణను వారిపై చూపాలనుకుంటారు. ఈ వ్యక్తులు వారి మనస్సులలోనే “దేవుడిని” ఆవిష్కరించుకుంటారు, ఆ తర్వాత ఈ “దేవుడిని” వారి అవసరాలను తీర్చేలా మరియు వారి కోరికలన్నీ సంతృప్తిపర్చేలా చేస్తారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు లేదా ఎక్కడ అనేదానితో సంబంధం లేకుండా మరియు ఏమి చేస్తారనేదానితో సంబంధం లేకుండా, దేవుని పట్ల వారి ప్రవర్తనలో మరియు వారి విశ్వాసంలో వారు ఈ కల్పననే అవలంబిస్తారు. దేవుని ప్రేమ అవధుల్లేనిదనీ, ఆయన స్వభావము నీతిమంతమైనదనీ, ఒక వ్యక్తి దేవుడి పట్ల ఎంత అపరాధము చేసినా, అవేవీ ఆయన గుర్తుపెట్టుకోడనీ భావిస్తారు కాబట్టి, దేవుని స్వభావానికి చెరుపు చేసినప్పటికీ, ఆయన తమను రక్షించగలడని విశ్వసించేవారు కూడా ఉన్నారు. మానవుని తప్పిదాలు, మానవుని ఉల్లంఘనలు మరియు మానవుని అవిధేయత అనేవి ఒక వ్యక్తి స్వభావపు క్షణిక వ్యక్తీకరణలు కాబట్టి, దేవుడు ప్రజలకు అవకాశాలు ఇస్తాడనీ, వారిని భరిస్తాడనీ మరియు వారి పట్ల సహనం చూపిస్తాడనీ వారు అనుకుంటారు; ఇంతకుముందు లాగా దేవుడు వారిని ప్రేమిస్తాడని విశ్వసిస్తారు. కాబట్టి, వారు రక్షణను పొందడంపై అధిక ఆశలు పెట్టుకుంటారు. వాస్తవానికి, ప్రజలు దేవుడిని ఎలా విశ్వసించినప్పటికీ, వారు సత్యాన్ని ఆచరించనంత కాలం, ఆయన వారి పట్ల ప్రతికూల వైఖరితోనే ఉంటాడు. ఎందుకంటే, దేవుడిని నీవు విశ్వసించే క్రమంలో, నీవు దేవుని వాక్యముల గ్రంథాన్ని తీసుకొని దానిని ఒక నిధిగా చూసినప్పటికీ, దానిని ప్రతిరోజూ అధ్యయనం చేసినప్పటికీ, చదివినప్పటికీ, నీవు నిజమైన దేవుడిని పక్కన పెట్టావు. నీవు ఆయనను కేవలం ఖాళీ గాలిగానే లేదా కేవలం ఒక వ్యక్తిగానే పరిగణిస్తావు—మరియు మీలో కొందరు ఆయనను ఒక కీలుబొమ్మను మించి పరిగణించరు. నేను దీనిని ఈవిధంగా ఎందుకు చెప్తున్నాను? నేను అలా ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఒక సమస్యను ఎదుర్కొన్నా లేదా ఏదైనా పరిస్థితికి గురైనా, నీ ఉపచేతనలో ఉన్న ఆ విషయాలకు, నీవు అంతర్గతంగా ఉత్పన్నం చేసుకునే విషయాలకు, దేవుని వాక్యములతో లేదా సత్యాన్ని ఆచరించడంతో ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేదు. నీవు ఏమి ఆలోచిస్తున్నావో, నీ అభిప్రాయం ఏమిటో నీకు మాత్రమే తెలుసు, ఆపై నీవు నీ సొంత ఆలోచనలు మరియు అభిప్రాయాలను దేవునిపై బలవంతంగా రుద్దుతావు. నీ మనస్సులో అవి దేవుని అభిప్రాయాలుగా మారతాయి మరియు నీవు ఈ అభిప్రాయాలను అచంచలంగా నిలబెట్టాల్సిన ప్రమాణాలుగా మారుస్తావు. కాలం గడిచేకొద్దీ, ఇలా కొనసాగడం అనేది దేవుని నుండి నిన్ను మరింత దూరంగా తీసుకెళ్తుంది.

దేవుని వైఖరిని అర్థం చేసుకోవడం మరియు దేవుడి గురించి అపార్థాలన్నింటినీ పక్కన పెట్టడం

మీరు ప్రస్తుతం విశ్వసించే ఈ దేవుడు ఎలాంటి దేవుడు? మీరు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన చెడు పనులు చేస్తున్న చెడ్డ వ్యక్తిని చూసినప్పుడు, ఆయన దానిని తృణీకరిస్తాడా? (అవును, ఆయన తృణీకరిస్తాడు.) అజ్ఞానులు తప్పులు చేయడం చూసినప్పుడు ఆయన వైఖరి ఏమిటి? (విచారానికి గురవుతాడు.) ఆయన తన పరిహారార్థబలులను ప్రజలు దొంగిలించడం చూసినప్పుడు, ఆయన వైఖరి ఏమిటి? (ఆయన వారిని తృణీకరిస్తాడు.) ఇదంతా చాలా స్పష్టంగా ఉంది, అంతేగదా? తనను విశ్వసించడంలో, సత్యాన్ని ఏరకంగాను అనుసరించని వ్యక్తి గందరగోళంలో ఉండటాన్ని దేవుడు చూసినప్పుడు, ఆయన వైఖరి ఏమిటి? మీకు నిశ్చితంగా తెలియదు, తెలుస్తుందా? “గందరగోళం” అనేది ఒక వైఖరి, పాపం కాదు లేదా అది దేవుడి పట్ల అపరాధము చేయదు, ఇది ఒక రకమైన పెద్ద తప్పు కాదని ప్రజలు అనుకుంటారు. కాబట్టి, చెప్పండి—ఈ సందర్భంలో దేవుడి వైఖరి ఏమిటి? (వారిని అంగీకరించడానికి ఆయన ఇష్టపడటం లేదు.) “అంగీకరించడానికి ఇష్టపడకపోవడం”—ఇది ఎలాంటి వైఖరి? అంటే, దేవుడు ఈ వ్యక్తులను చిన్నచూపు చూస్తాడని మరియు వారిని తిరస్కరిస్తాడని అర్థం! అలాంటి వారితో ఆయన వ్యవహరించే తీరు వారి పట్ల ఎడమొఖం పెడమొఖంగా ఉండటమే. దేవుని విధానం వారిని పక్కన పెట్టేయడం, వారిని ఏ కార్యములో పాల్గొననీయక పోవడం మరియు ఇందులో జ్ఞానోదయం, వెలిగింపు, శిక్షించడం మరియు క్రమశిక్షణకు సంబంధించిన కార్యము ఉంటుంది. అలాంటి వ్యక్తులు దేవుని కార్యములో లెక్కించబడరు. తన స్వభావానికి చెరుపు చేసే మరియు ఆయన పాలనా కట్టడలను ఉల్లంఘించే వారి పట్ల దేవుని వైఖరి ఏమిటి? విపరీతంగా అసహించుకోవడం! ఆయన స్వభావానికి చెరుపు చేయడం గురించి పశ్చాత్తాపం చెందని వ్యక్తుల ద్వారా దేవుడు విపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడు! “ఆగ్రహానికి గురవ్వడం” అనేది ఒక భావన, మనోస్థితి కంటే ఎక్కువేమీ కాదు; ఇది ఒక స్పష్టమైన వైఖరికి అనుగుణంగా లేదు. అయితే, ఈ భావన—ఈ మనోస్థితి—అలాంటి వ్యక్తులకు ఒక ఫలితాన్ని ఇస్తుంది: అది దేవునిలో విపరీతమైన అసహ్యాన్ని నింపుతుంది! ఈ విపరీతమైన అసహ్యం పరిణామం ఏమిటి? దేవుడు ఈ వ్యక్తులను పక్కన పెట్టడం, ప్రస్తుతానికి వారిని పట్టించుకోకపోవడం దీని పరిణామం. ఆయన వారిని సరిచేయడానికి “ఆకురాలే కాలము తర్వాత” వరకు వేచి చూస్తాడు. ఇది దేనిని సూచిస్తుంది? ఈ వ్యక్తులు ఇప్పటికీ ఫలితాలు పొందుతారా? అలాంటి వ్యక్తులకు ఎలాంటి ఫలితం ఇవ్వాలనే ఉద్దేశం దేవునికి ఎప్పుడూ లేదు! కాబట్టి, దేవుడు ఇప్పుడు అలాంటి వ్యక్తులను పట్టించుకోకపోవడం అనేది సర్వసాధారణం కాదా? (అవును, ఇది సాధారణమే.) అలాంటి వ్యక్తులు ఏమి చేయడానికి సిద్ధపడుతూ ఉండాలి? వారు తమ ప్రవర్తన మరియు తాము చేసిన చెడు పనులకు ప్రతికూల పరిణామాలను భరించడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి వ్యక్తికి దేవుడి ప్రతిస్పందన ఇదే. కాబట్టి, అలాంటి వ్యక్తులకు ఇప్పుడు నేను స్పష్టంగా చెబుతున్నాను: ఇకపై మీ భ్రమలను పట్టుకుని వేలాడకండి మరియు మీకు ఇష్టమైన ఆలోచన ఏదీ చేయకండి. దేవుడు నిరవధికంగా ప్రజలను సహించడు; ఆయన వారి ఉల్లంఘనలను లేదా అవిధేయతను ఎప్పటికీ భరించడు. “నేను కూడా అలాంటి వారిని కొందరిని చూశాను, వారు ప్రార్థించినప్పుడు, వారు దేవుడు తమ మనసును కదిలించినట్లు భావిస్తారు, ఆపైన వారు గట్టిగా ఏడుస్తారు. సాధారణంగా వారు చాలా సంతోషంగా కూడా ఉంటారు; వారు దేవుని సమక్షంలో ఉన్నట్లు మరియు వారికి దేవుని మార్గదర్శకత్వం ఉన్నట్లు కనిపిస్తారు” అని కొందరు చెబుతారు. అలాంటి అర్థంలేని మాటలు మాట్లాడకండి! బాధలో వచ్చే కన్నీళ్లు అంటే, దేవుని మార్గదర్శకత్వం మాట అటుంచి, దేవుడు హృదయాన్ని కదిలించినట్టు లేదా దేవుని సమక్షాన్ని ఆస్వాదించినట్టు కాదు. ప్రజలు దేవునికి ఆగ్రహం తెప్పించినప్పటికీ, ఆయన వారికి దారి చూపుతాడా? ఒక్క మాటలో చెప్పలంటే, దేవుడు ఎవరినైనా తొలగించాలనీ మరియు విడిచిపెట్టాలనీ నిర్ణయించుకున్నప్పుడు, ఆ వ్యక్తి ఫలితం అప్పటికే లేకుండా పోయింది. వారు ప్రార్థించేటప్పుడు వారి భావాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ లేదా వారి హృదయాలలో దేవునిపై ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ, ఇకపై దాని ఫలితమేదీ ఉండదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవునికి ఇలాంటి విశ్వాసం అవసరం లేదు; ఆయన ఇప్పటికే ఈ వ్యక్తులను తిరస్కరించాడు. వారిని భవిష్యత్తులో ఎలా చూడాలనేది కూడా ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తులు దేవునికి ఆగ్రహం తెప్పించిన క్షణంలోనే, వారి ఫలితాలు నిర్ణయించబడతాయి. అలాంటి వ్యక్తులను రక్షించకూడదని దేవుడు నిర్ణయించుకుంటే, వారు శిక్షించబడటానికి కూడా పనికిరాకుండా వదిలివేయబడతారు. ఇదే దేవుడి వైఖరి.

దేవుని గుణగణాలలో ప్రేమ అనే అంశం కూడా ఉన్నప్పటికీ, ఆయన ప్రతి వ్యక్తి పట్ల దయతో ఉన్నప్పటికీ, ఆయన గుణగణాలలో మర్యాద కూడా ఒక అంశమనే వాస్తవాన్ని ప్రజలు విస్మరించారు మరియు మరచిపోయారు. ఆయనలో ప్రేమ ఉందంటే అర్థం, ప్రజలు ఆయనలోని భావాలను లేదా ప్రతిచర్యను ప్రేరేపించకుండా, ఇష్టమొచ్చినట్టు ఆయన పట్ల అపరాధము చేయవచ్చని కాదు, లేదా ఆయనలో కరుణ ఉందంటే అర్థం, ఆయన ప్రజలతో వ్యవహరించడంలో ఆయనకు ఎటువంటి నియమాలు లేవని కాదు. దేవుడు సజీవుడు; ఆయన నిజంగా ఉన్నాడు. ఆయన ఊహించుకున్న కీలుబొమ్మ కాదు లేదా మరే వస్తువు కాదు. ఆయన ఉన్నాడు కాబట్టి, మనం ఆయన గుండె గొంతును ఎల్లప్పుడూ జాగ్రత్తగా వినాలి, ఆయన వైఖరి పట్ల నిశిమైన శ్రద్ధ వహించాలి మరియు ఆయన భావాలను అర్థం చేసుకోవాలి. దేవుడిని నిర్వచించడానికి మనం మానవుని ఊహలను ఉపయోగించకూడదు లేదా దేవుడు మానవుల ఊహలను బట్టి ప్రజలతో మానవ పద్ధతిలో వ్యవహరించేలా చేస్తూ, మానవుల ఆలోచనలు లేదా ఇష్టాలను ఆయనపై రుద్దకూడదు. నీవు ఇలా చేస్తే, నీవు ఆయన ఉగ్రతను రెచ్చగొడుతూ, ఆయన మర్యాదను ప్రశ్నిస్తూ, దేవునికి ఆగ్రహం తెప్పిస్తావు! కాబట్టి, మీరు ఈ విషయానికున్న తీవ్రతను అర్థం చేసుకున్న తర్వాత, మీలో ప్రతి ఒక్కరూ మీ పనులలో జాగ్రత్తగా మరియు వివేకంతో ఉండాలని నేను కోరుతున్నాను. మీ మాటలలో జాగ్రత్తగా మరియు వివేకంతో ఉండండి, అలాగే—మీరు దేవునితో వ్యవహరించే తీరుకు సంబంధించి, మీరు ఎంత జాగ్రత్తగా మరియు వివేకంతో ఉంటే అంత మంచిది! దేవుని వైఖరి ఏమిటో నీకు అర్థం కానప్పుడు, నిర్లక్ష్యంగా మాట్లాడటం మానుకో, మీ పనులలో నిర్లక్ష్యం చూపకు మరియు ఊరకే పేర్లు పెట్టకు. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలకు రావద్దు. దానికి బదులుగా, నీవు వేచి ఉండాలి, వేడుకోవాలి; ఇలా చేయడం కూడా దేవునికి భయపడటం మరియు చెడును విసర్జించడానికి ఒక వ్యక్తీకరణ అవుతుంది. అన్నింటిని మించి, నీవు దీనిని మరియు మిగతా అన్నింటినీ సాధించగలిగితే, నీకు ఈ వైఖరి ఉంటే, అప్పుడు దేవుడు నీ మూర్ఖత్వం, అజ్ఞానం మరియు విషయాల వెనుక ఉన్న కారణాలను గురించి అవగాహన లేకపోవడం గురించి నిన్ను నిందించడు. అలా కాకుండా, దేవుడి పట్ల అపరాధము చేయడానికి భయపడే, ఆయన ఉద్దేశాలను గౌరవించే మరియు ఆయనకు విధేయత చూపాలనే నీ వైఖరి కారణంగా, దేవుడు నిన్ను గుర్తుంచుకుంటాడు, నీకు దారి చూపుతాడు మరియు జ్ఞానోదయం కలిగిస్తాడు లేదా నీ అపరిపక్వతను, అజ్ఞానాన్ని సహిస్తాడు. దానికి విరుద్ధంగా, నీకు ఇష్టమొచ్చినట్లు ఆయన పట్ల అభిప్రాయానికి వస్తూ లేదా ఆయన ఆలోచనలను ఏకపక్షంగా ఊహిస్తూ మరియు నిర్వచిస్తూ—ఆయన పట్ల నీ వైఖరి అమర్యాదగా ఉంటే—అప్పుడు దేవుడు నిన్ను ఖండిస్తాడు, నిన్ను క్రమశిక్షణలో పెడతాడు మరియు నిన్ను శిక్షిస్తాడు కూడా; లేదా ఆయన నిన్ను ఆక్షేపించవచ్చు. బహుశా ఈ ఆక్షేపణలో నీ ఫలితం ఉండవచ్చు. కాబట్టి, నేను మరోసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నాను: మీలో ప్రతి ఒక్కరూ దేవుని నుండి వచ్చే ప్రతిదాని పట్ల జాగ్రత్తగా మరియు వివేకంతో ఉండాలి. నిర్లక్ష్యంగా మాట్లాడవద్దు మరియు మీ పనులలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. మీరు ఏదైనా మాట్లాడే ముందు, మీరు ఆగి ఆలోచించాలి: నా ఈ పని దేవునికి ఆగ్రహం తెప్పిస్తుందా? ఇలా చేయడం వల్ల, నేను దేవుడిని గౌరవిస్తున్నానా? చిన్నచిన్న విషయాలలో కూడా, మీరు ఈ ప్రశ్నలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మరియు వాటిని గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం వెచ్చించాలి. నీవు అన్ని అంశాలలో, అన్ని విషయాలలో, అన్ని సమయాలలో ఈ నియమాల ప్రకారం నిజంగా ఆచరించగలిగితే మరియు ప్రత్యేకించి నీకు ఏదైనా అర్థం కానప్పుడు అలాంటి వైఖరిని అవలంబించగలిగితే, అప్పుడు దేవుడు నీకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాడు మరియు నీవు నడవాల్సిన మార్గాన్ని చూపుతాడు. ప్రజలు ఏ రకంగా తమను తాము ప్రదర్శించినా, దేవుడు వారిని చాలా స్పష్టంగా మరియు నేరుగా చూస్తాడు, ఆయన నీ ఈ ప్రదర్శనలకు ఖచ్చితమైన మరియు తగిన మూల్యాంకనం చేస్తాడు. నీవు అంతిమ పరీక్షను ఎదుర్కొన్న తర్వాత, దేవుడు నీ సమస్త ప్రవర్తనను లెక్కలోకి తీసుకొని, నీ ఫలితాన్ని నిర్ణయించడానికి దానిని పూర్తిగా సంగ్రహిస్తాడు. ఈ ఫలితం సందేహానికి ఏమాత్రం తావు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని ఒప్పిస్తుంది. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకునేది ఇదే: మీ ప్రతి పని, మీ ప్రతి చర్య, మరియు మీ ప్రతి ఆలోచన మీ తలరాతను నిర్ణయిస్తుంది.

వ్యక్తుల ఫలితాలను ఎవరు నిర్ణయిస్తారు?

చర్చించవలసిన అత్యంత ప్రధానమైన విషయం మరొకటుంది, అదే దేవుని పట్ల మీ వైఖరి. ఈ వైఖరి అంత్యంత ముఖ్యమైనది! అంతిమంగా మీరు విధ్వంసం వైపుకు నడుస్తారా లేదా దేవుడు మీ కోసం సిద్ధం చేసిన అందమైన గమ్యస్థానంలోకి నడుస్తారా అనేదాన్ని ఇదే నిర్ణయిస్తుంది. రాజ్యపు యుగములో, దేవుడు ఇప్పటికే ఇరవై యేండ్లకు మించి పని చేశాడు మరియు ఈ రెండు దశాబ్దాల క్రమములో, మీరు ఎలా పనిచేశారు అనేదాని గురించి మీ అంతరంగపు లోతులలో మీరు కాస్త అసందిగ్దంగా ఉన్నారు. అయినప్పటికీ, దేవుని హృదయంలో, ఆయన మీలో ప్రతి ఒక్కరి వాస్తవమైన మరియు సత్యమైన నమోదు చేశాడు. ప్రతి ఒక్కరూ ఆయనను అనుసరించడం మరియు ఆయన ప్రవచనాలు వినడం ప్రారంభించినప్పటి నుండి, క్రమక్రమంగా సత్యాన్ని మరింతగా అర్థం చేసుకుంటూ, ప్రతి వ్యక్తి తన కర్తవ్యాలను నెరవేర్చడం ప్రారంభించే వరకు, ప్రతి వ్యక్తి చేసిన అన్ని రకాల పనులను దేవుడు నమోదు చేసి ఉంచాడు. వారి కర్తవ్యాలను నిర్వర్తించేటప్పుడు, అన్ని రకాల పరిస్థితులు మరియు పరీక్షలను ఎదుర్కునేటప్పుడు, ప్రజల వైఖరులు ఏమిటి? వారు ఎలా నిర్వహిస్తారు? వారి హృదయాలలో దేవుని పట్ల వారు ఎలా అనుభూతి చెందుతారు? … వీటన్నింటి గురించి దేవుని దగ్గర లెక్క ఉంది; వీటన్నింటి నమోదు ఆయన వద్ద ఉంది. బహుశా, మీ అభిప్రాయంలో, ఈ సమస్యలు గందరగోళంగా ఉన్నాయి. అయినప్పటికీ, దేవుడు నిలబడిన చోటు నుండి, అవన్నీ తేటతెల్లంగా కనిపిస్తాయి, లేశమాత్రం కూడా అజాగ్రత్త వహించడం ఉండదు. ఇందులో ప్రతి వ్యక్తి ఫలితం ఉంది మరియు ప్రతి వ్యక్తి తలరాతను మరియు భవిష్యత్తు అవకాశాలను కూడా స్పృశిస్తుంది, అంతకుమించి, దేవుడు తన శ్రమతో కూడిన ప్రయత్నాలన్నింటినీ వెచ్చించేది ఇక్కడే; కాబట్టి, దేవుడు దీనిని ఎప్పటికీ కాస్త కూడా నిర్లక్ష్యం చేయడు లేదా ఏమాత్రం అజాగ్రత్తను సహించడు. మొదటి నుండి చివరి వరకు దేవుడిని అనుసరించడంలో మానవుల మొత్తం క్రమాన్ని నమోదు చేస్తూ, దేవుడు మానవాళి విషయమంతా నమోదు చేస్తున్నాడు. ఈ కాలంలో ఆయన పట్ల నీ వైఖరి నీ తలరాతను నిర్ణయించింది. ఇది నిజం కాదా? ఇప్పుడు, దేవుడు నీతిమంతుడని నీవు విశ్వసిస్తున్నావా? ఆయన చర్యలు తగినవేనా? మీ మెదడుల్లో ఇప్పటికీ దేవుని గురించి ఏవైనా ఇతర ఊహాగానాలు ఉన్నాయా? (లేవు.) అప్పుడు, ప్రజల ఫలితాలను దేవుడే నిర్ణయించాలని మీరంటారా లేదా ప్రజలు తమంతటతామే నిర్ణయించుకోవాలని అంటారా? (వాటిని దేవుడే నిర్ణయించాలి.) వాటిని నిర్ణయించేది ఎవరు? (దేవుడు.) మీకు నిశ్చితంగా తెలియదు, తెలుసా? హాంగ్‌కాంగ్‌లోని సోదరసోదరీమణులారా, చెప్పండి—వాటిని ఎవరు నిర్ణయిస్తారు? (ప్రజలు తమంతట తామే వాటిని నిర్ణయిస్తారు.) ప్రజలు తమంతట తామే వాటిని నిర్ణయిస్తారా? అలాంటప్పుడు ప్రజల ఫలితాలకు దేవునితో ఎలాంటి సంబంధం లేదని అర్థం కాదా? దక్షిణ కొరియాలోని సోదరసోదరీమణులారా, చెప్పండి. (ప్రజల అన్ని చర్యలు మరియు పనులను బట్టి మరియు వారు ఏ మార్గంలో ఉన్నారనే దానిని బట్టి వారి ఫలితాలను దేవుడు నిర్ణయిస్తాడు.) ఇది చాలా సరైన సమాధానం. ఇక్కడ నేను అందరికీ తప్పక చెప్పాల్సిన ఒక వాస్తవం ఉంది: దేవుని రక్షణ కార్యపు క్రమములో, ఆయన మానవుల కోసం ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రమాణం ఏమిటంటే, వారు తప్పక దేవుని వాక్యాన్ని వినాలి మరియు దేవుని మార్గంలో నడవాలి. ప్రజల ఫలితాలను కొలవడానికి ఉపయోగించేది ఈ ప్రమాణాన్నే. నీవు దేవుని ఈ ప్రమాణానికి అనుగుణంగా ఆచరిస్తే, మంచి ఫలితం పొందవచ్చు; ఆచరించకపోతే, మంచి ఫలితాన్ని పొందలేవు. అలాంటప్పుడు, ఈ ఫలితాన్ని ఎవరు నిర్ణయిస్తారని నీవంటావు? దానిని నిర్ణయించేది కేవలం దేవుడు ఒక్కడే కాదు, దేవుడు మరియు మనష్యులు కలిసి నిర్ణయిస్తారు. ఇది నిజమేనా? (అవును.) అలా ఎందుకు? ఎందుకంటే మానవాళి రక్షణ కార్యములో చురుకుగా పాల్గొనాలని మరియు మానవాళి కోసం ఒక అందమైన గమ్యస్థానాన్ని తయారు చేయాలని దేవుడు కోరుకుంటాడు; దేవుని కార్యానికి మనుష్యులే లక్ష్యాలు మరియు దేవుడు వారి కోసం సిద్ధం చేసేది ఈ ఫలితాన్నే, ఈ గమ్యస్థానాన్నే. ఆయన కార్యము నిర్వహించడానికి లక్ష్యాలే లేకపోతే, ఆయన ఈ కార్యము చేయాల్సిన అవసరం లేదు; ఆయన ఈ కార్యము చేయకపోతే, మానవులకు రక్షణ పొందే అవకాశమే ఉండేది కాదు. రక్షించబడవలసిన వారు మానవులే మరియు రక్షింపబడడం అనేది ఈ ప్రక్రియలో ఒక నిష్క్రియ భాగం అయినప్పటికీ, ఈ భాగాన్ని పోషించేవారి వైఖరే మానవాళిని రక్షించడానికి దేవుడు తన కార్యములో విజయం సాధిస్తాడా లేదా అనేదానిని నిర్ణయిస్తుంది. దేవుడు నీకు మార్గదర్శకత్వం చేయకపోతే, ఆయన ప్రమాణం నీకు తెలిసి ఉండేది కాదు లేదా నీకొక లక్ష్యం ఉండేది కాదు. నీకు ఈ ప్రమాణం, ఈ లక్ష్యం ఉన్నప్పటికీ, ఇప్పటికీ నీవు సహకరించకపోతే, ఆచరించకపోతే లేదా మూల్యం చెల్లించకపోతే, నీవు ఈ ఫలితాన్ని పొందలేవు. ఈ కారణం చేత, ఎవరి ఫలితాన్నైనా దేవుని నుండి వేరు చేయలేమని మరియు దాన్ని ఆ వ్యక్తి నుండి కూడా వేరు చేయలేమని నేను చెప్తున్నాను. అయితే, ప్రజల ఫలితాలను ఎవరు నిర్ణయిస్తారో ఇప్పుడు మీకు తెలుసు.

ప్రజలు వారి అనుభవాన్ని బట్టి దేవుడిని నిర్వచించడానికి మొగ్గు చూపుతారు

దేవుడిని తెలుసుకోవడం అనే విషయాన్నిచెప్తున్నప్పుడు, మీరు ఏదైనా గమనించారా? ఈమధ్యన ఆయన వైఖరి మార్పునకు లోనైందని మీరు గమనించారా? మానవుల పట్ల ఆయన వైఖరి మార్చలేనిదా? తన ప్రేమ మరియు కరుణనంతా మానవులపై నిరవధికంగా చూపుతూ ఆయన ఎల్లప్పుడూ ఇలాగే సహిస్తాడా? ఈ విషయంలో దేవుని గుణగణాలు కూడా ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు అనబడే ఇంతకు ముందు ప్రస్తావించిన ప్రశ్నకు తిరిగి వద్దాం. ఈ ప్రశ్న అడిగిన తర్వాత, మీ సమాధానాలు చాలా స్పష్టంగా లేవు; మరో మాటలో చెప్పాలంటే, దేవుని ఉద్దేశాల గురించి మీకు ఇప్పటికీ గట్టి అవగాహన లేదు. దేవుడు మానవాళిని ప్రేమిస్తాడని తెలుసుకున్న తర్వాత, ఆయనను వారు ప్రేమకు ప్రతీకగా నిర్వచించారు: తాము ఏమి చేసినప్పటికీ, ఎలా ప్రవర్తించినప్పటికీ, దేవునితో ఎలా వ్యవహరించినప్పటికీ, ఎంత అవిధేయతతో ఉన్నప్పటికీ, ఇవేవీ నిజంగా ముఖ్యమైనవి కావని ప్రజలు విశ్వసిస్తారు, ఎందుకంటే దేవునికి ప్రేమ ఉంది, ఆయన ప్రేమ అపరిమితమైనది మరియు కొలవలేనిది; దేవునికి ప్రేమ ఉంది కాబట్టి, ఆయన ప్రజలను సహించగలడు; దేవునికి ప్రేమ ఉంది కాబట్టి, ఆయన ప్రజల పట్ల కరుణతో, వారి అపరిపక్వత పట్ల కరుణతో, వారి అజ్ఞానం పట్ల కరుణతో మరియు వారి అవిధేయత పట్ల కరుణతో ఉండగలడు. నిజంగా ఇది ఈవిధంగానే ఉందా? కొంతమంది, దేవుని సహనాన్ని ఒకసారి లేదా కొన్ని సార్లయినా అనుభవించినప్పుడు, ఆయన వారి పట్ల ఎప్పటికీ సహనం మరియు కరుణతో ఉంటాడని నమ్ముతూ, దేవుని గురించి వారు వారి సొంత అవగాహనకు ఈ అనుభవాలను పెట్టుబడిగా భావిస్తారు, ఆ తర్వాత, వారి జీవితాలను గడుపుతున్న క్రమములో, వారు దేవుని ఈ సహనాన్ని పరిగణించి, దానిని ఆయన వారితో వ్యవహరించే ప్రమాణంగా భావిస్తారు. ఒకసారి దేవుని సహనాన్ని అనుభవించిన తర్వాత, దేవుడు సహనశీలి అని ఎప్పటికీ నిర్వచించే మరికొందరు కూడా ఉన్నారు—మరియు వారి మనస్సులలో, దేవుని ఈ సహనం నిరవధికమైనదిగా, షరతులు లేనిదిగా మరియు పూర్తిగా నియమాలు లేనిదిగా ఉంటుంది. అలాంటి విశ్వాసాలు సరైనవేనా? దేవుని గుణగణాలు లేదా దేవుని స్వభావము విషయాల గురించి చర్చించిన ప్రతిసారీ, మీరు అయోమయానికి గురైనట్లు కనిపిస్తారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. దేవుని గుణగణాలకు సంబంధించి మీరు ఎన్నో సత్యాలను విన్నారు; ఆయన స్వభావానికి సంబంధించిన అనేక చర్చలను కూడా మీరు విన్నారు. అయితే, మీ మనస్సులలో, ఈ సమస్యలు, ఈ అంశాల సత్యం అనేవి సిద్ధాంతం మరియు లిఖిత వాక్యములపై ఆధారపడిన జ్ఞాపకాలు మాత్రమే; మీ రోజువారీ జీవితంలో, దేవుని స్వభావమంటే నిజంగా ఏమిటో మీలో ఎవ్వరూ ఎప్పుడూ అనుభవించలేరు లేదా చూడలేరు. ఆ విధంగా, మీరందరూ మీ విశ్వాసాల విషయంలో గజిబిజిగా ఉన్నారు; మీరందరూ గుడ్డిగా విశ్వసిస్తున్నారు, ఎంతగా అంటే, మీరు దేవుని పట్ల అమర్యాదపూర్వకమైన వైఖరితో ఉన్నారు మరియు ఆయనను పక్కకు కూడా తోసివేస్తారు. దేవుని పట్ల మీకు ఈ రకమైన వైఖరి ఉండటం దేనికి దారి తీస్తుంది? ఇది మీరు ఎల్లప్పుడూ దేవుని గురించి అభిప్రాయాలు ఏర్పర్చుకోవడానికి దారితీస్తుంది. మీరు కొద్దిగా జ్ఞానం సంపాదించిన తర్వాత, మీరు దేవుడిని సంపూర్ణంగా పొందారు అన్నట్లుగా మీరు చాలా సంతృప్తి చెందుతారు. ఆ పిమ్మట, దేవుడంటే ఇలాగే ఉంటాడనే అభిప్రాయానికి మీరు వస్తారు, ఆయనను స్వేచ్ఛగా కదలనివ్వరు. అంతేగాకుండా, దేవుడు ఏదైనా కొత్త కార్యము చేసినప్పుడల్లా, ఆయనే దేవుడని ఒప్పుకోవడానికి మీరు నిరాకరిస్తారు. ఏదో ఒకరోజు, “నేను ఇకపై మానవాళిని ప్రేమించను; నేను ఇకపై మానవుల పట్ల కరుణ చూపను; వారి పట్ల నాకు ఇంతకుమించి సహనం లేదా ఓర్పు లేదు; వారి పట్ల నాలో విపరీతమైన అసహ్యం మరియు వ్యతిరేకత నిండిపోయాయి” అని దేవుడు చెప్పినప్పుడు, అలాంటి ప్రకటనలు ప్రజల హృదయాలలో లోతైన సంఘర్షణను కలిగిస్తాయి. వారిలో మరికొందరు, “నీవు ఇకపై నా దేవుడు కాదు; నీవు ఇకపై నేను అనుసరించాలనుకునే దేవుడు కాదు. నీవు చెప్పేది ఇదే అయితే, నీవు ఇకపై నా దేవుడిగా ఉండేందుకు అర్హుడివి కావు మరియు నేను నిన్ను అనుసరించాల్సిన అవసరం లేదు. నీవు ఇకపై నాపై కరుణ, ప్రేమ మరియు సహనం చూపకపోతే, నేను నిన్ను అనుసరించడం మానేస్తాను. నీవు నా పట్ల ఎల్లప్పుడూ సహనంతో ఉంటే, ఎల్లప్పుడూ నాపట్ల ఓర్పుతో ఉంటే మరియు నీవు ప్రేమ, నీవు ఓర్పు మరియు నీవు సహనం అని నన్ను చూడనిస్తే, అప్పుడే నేను నిన్ను అనుసరించగలను, అప్పుడే నిన్ను చివరి వరకు అనుసరించాలనే విశ్వాసం నాకు ఉంటుంది. నాకు నీ సహనం మరియు కరుణ ఉన్నాయి కాబట్టి, నా అవిధేయతను మరియు నా ఉల్లంఘనలను ఎల్లప్పుడూ మన్నించవచ్చు మరియు క్షమించవచ్చు మరియు నేను ఎప్పుడైనా, ఎక్కడైనా పాపం చేయవచ్చు, ఎప్పుడైనా మరియు ఎక్కడైనా ఒప్పుకోవచ్చు మరియు క్షమించబడవచ్చు మరియు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా నీకు ఆగ్రహం కలిగించవచ్చు. నీకు నా గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉండకూడదు లేదా నా గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు” అని కూడా అంటారు. మీలో ఏ ఒక్కరూ ఈ రకమైన సమస్య గురించి అంత వ్యక్తిగతంగా లేదా స్పృహతో ఆలోచించకపోయినప్పటికీ, దేవుడిని నీ పాపాలకు నిన్ను క్షమించడానికి ఒక సాధనంగా లేదా ఒక అందమైన గమ్య స్థానాన్ని పొందడానికి ఉపయోగించే ఒక వస్తువుగా నీవు భావించినప్పుడల్లా, నీవు నిగూఢంగా సజీవుడైన దేవుడిని నీ శత్రువు లాగా నీకు వ్యతిరేకంగా ఉంచుతున్నావు. నాకు కనిపించేది ఇదే. “నేను దేవుడిని విశ్వసిస్తాను,” “నేను సత్యాన్ని అన్వేషిస్తాను,” “నేను నా స్వభావాన్ని మార్చుకోవాలనుకుంటాను,” “నేను చీకటి ప్రభావం నుండి బయట పడాలనుకుంటాను,” “నేను దేవుడిని సంతృప్తి పరచాలనుకుంటాన్నాను,” “నేను దేవునికి సమర్పించబడానుకుంటాను,” “నేను దేవుని పట్ల విశ్వాసంతో ఉండాలనుకుంటాను మరియు నా కర్తవ్యాన్ని బాగా చేయాలనుకుంటాను” లాంటివి నీవు ఎప్పుడూ చెబుతూ ఉండవచ్చు. అయితే, నీ మాటలు ఎంత తీయగా ఉన్నట్టు అనిపించినా, నీకు సిద్ధాంతం ఎంత తెలిసినా మరియు ఆ సిద్ధాంతం ఎంత గంభీరమైనది లేదా మర్యాదపూర్వకమైనది అయినా, వాస్తవం ఏమిటంటే, దేవుని గురించి అభిప్రాయాలు ఏర్పర్చుకోవడానికి మీరు ప్రావీణ్యత సంపాదించిన నిబంధనలు, సిద్ధాంతాలు, సూత్రాలను ఎలా ఉపయోగించాలో మీలో అనేకమంది ఇప్పటికే నేర్చుకున్నారు, ఆవిధంగా సహజంగానే ఆయనను మీకు వ్యతిరేకిగా ఉంచారు. నీవు అక్షరాలు మరియు సిద్ధాంతాలలో ప్రావీణ్యత సంపాదించినప్పటికీ, నీవు సత్యం వాస్తవికతలోకి అసలు ప్రవేశించనే లేదు, కాబట్టి నీవు దేవునికి సన్నిహితమవ్వడం, ఆయనను తెలుసుకోవడం మరియు ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది ఎంతో చింతించవలసిన విషయం!

నేను ఈ కింది దృశ్యాన్ని ఒక వీడియోలో చూశాను: కొంతమంది సోదరీమణుల వద్ద శరీరములో వాక్యము ప్రత్యక్షమగుట కాపీ ఉంది, వారు దాన్ని చాలా ఎత్తుగా ఎత్తి పట్టుకున్నారు; వారు ఆ పుస్తకాన్ని తమ మధ్యలో, వారి తలలపైకి ఎత్తి చూపుతున్నారు. ఇది ఒక చిత్రమే అయినప్పటికీ, అది నాలో రేకెత్తించిన భావం చిత్రమని కాదు; దానికి బదులుగా, ప్రతి ఒక్కరూ తమ హృదయంలో ఉన్నతంగా ఉంచుకున్నది దేవుని వాక్యం కాదనీ, దేవుని వాక్యముల పుస్తకాన్ని మాత్రమేనని అది నాకు అనిపించేలా చేసింది. ఇది అత్యంత విచారకరమైన విషయం. అలాంటి పని దేవుడిని ఉన్నతంగా ఉంచడంతో సమానం కాదు, ఎందుకంటే దేవుని గురించి మీకు అవగాహన లేకపోవడం అనేది ఏ స్థాయికి చేరుకుందంటే, చాలా స్పష్టమైన ప్రశ్న, అత్యంత చిన్న సమస్య కూడా మీరు మీ సొంత ఆలోచనలతో ముందుకు వచ్చేలా చేస్తాయి. నేను మిమ్మల్ని ఏవైనా విషయాలు అడిగినప్పుడు, నేను మీతో గంభీరంగా ఉన్నపుడు, మీ భావన మరియు మీ సొంత ఊహలతో ప్రతిస్పందిస్తారు; మీలో కొందరు సందేహంతో కూడిన స్వరంతో నా ప్రశ్నలకు ప్రశ్నలతోనే సమాధానమిస్తారు. మీరు విశ్వసించే దేవుడు నిజమైన దేవుడు కాదని ఇది నాకు మరింత స్పష్టంగా చెబుతుంది. అనేక యేండ్లు దేవుని వాక్యములను చదివిన తర్వాత, మీరు వాటిని, దేవుని కార్యాన్ని మరియు మరిన్ని సిద్ధాంతాలను మరోసారి ఆయన గురించి అభిప్రాయాలు ఏర్పర్చుకోవడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా, మీరు దేవుడిని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయరు; మీరు ఆయన ఆలోచనలను తెలుసుకోవడానికి, మానవుల పట్ల ఆయన వైఖరిని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు లేదా దేవుడు ఎలా ఆలోచిస్తాడో, ఎందుకు ఆయన విచారంగా ఉన్నాడో, ఎందుకు ఆయన ఆగ్రహంతో ఉన్నాడో, ఎందుకు ఆయన ప్రజలను నిరాకరిస్తాడో మరియు అలాంటి ఇతర ప్రశ్నలను గ్రహించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయరు. అంతేకాకుండా, మానవాళి చేసే వివిధ పనులను గురించి దేవుడు ఎలాంటి వైఖరి లేదా ఆలోచనలు లేకుండా ఊరకే చూస్తూ ఉంటాడు కాబట్టి, ఆయన ఎల్లప్పుడూ మౌనంగా ఉంటాడని కూడా అనేకమంది విశ్వసిస్తారు. ఇంకా మరో సమూహపు ప్రజలు దేవుడు ఆక్షేపణ లేకుండా ఆమోదించాడు కాబట్టి, ఆయన ఒక్కమాట కూడా పలుకడు, ఆయన వేచి ఉన్నందున లేదా ఆయనకు ఎలాంటి వైఖరి లేనందున మౌనంగా ఉన్నాడని విశ్వసిస్తారు; దేవుని వైఖరి ఇప్పటికే గ్రంథంలో మానవాళికి పూర్తిగా విశదీకరించబడింది మరియు పరిపూర్ణంగా వ్యక్తీకరించబడింది కాబట్టి, దానిని ప్రజలకు మాటిమాటికి చెప్పాల్సిన అవసరం లేదని వారనుకుంటారు. దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ, ఆయనకు ఒక వైఖరి మరియు అభిప్రాయంతో పాటు, ప్రజలు పాటించాలని ఆయన కోరుకునే ఒక ప్రమాణం కూడా ఉంది. ఆయనను అర్థం చేసుకోవడానికి లేదా ఆయనను అన్వేషించడానికి ప్రజలు ప్రయత్నించక పోయినప్పటికీ, దేవుని వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఒకప్పుడు అతి ఉత్సాహంగా దేవుడిని అనుసరించినప్పటికీ, ఆ తర్వాత, ఏదో ఒక సమయంలో, ఆయనను వదిలి వెళ్లిపోయిన ఎవరైనా వ్యక్తిని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆ వ్యక్తి తిరిగి వెనక్కు రావాలనుకుంటే, ఎంతో ఆశ్చర్యకరంగా, దేవుని అభిప్రాయం ఎలా ఉంటుందో లేదా ఆయన వైఖరి ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఇది అత్యంత విచారకరం కాదా? వాస్తవం ఏమిటంటే, ఇది చాలా పైపై విషయం. మీరు దేవుని హృదయాన్ని నిజంగా అర్థం చేసుకుంటే, ఇలాంటి వ్యక్తి పట్ల ఆయన వైఖరి ఏమిటో మీకు తెలుస్తుంది మరియు మీరు అస్పష్టమైన సమాధానం ఇవ్వరు. మీకు తెలియదు కాబట్టి, నన్ను తెలియజేయనివ్వండి.

దేవుని కార్యము సమయంలో పారిపోయే వారి పట్ల ఆయన వైఖరి

ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారు: వారు దేవుని మార్గం గురించి నిశ్చితంగా తెలుకున్న తర్వాత, వివిధ కారణాల వల్ల, దూరంగా వెళ్లి తమ మనసుకు నచ్చింది చేయడానికి, వీడ్కోలు చెప్పకుండానే వారు మౌనంగా వెళ్లిపోతారు. ప్రస్తుతానికి, ఈ వ్యక్తులు వదిలి వెళ్లడానికి గల కారణాల జోలికి మనం వెళ్లము; ఈ రకమైన వ్యక్తి పట్ల దేవుని వైఖరి ఏమిటో మొదట మనం చూద్దాం. ఇది చాలా సుస్పష్టం! ఈ వ్యక్తులు దూరంగా వెళ్లిన మరుక్షణం నుండే, దేవుని దృష్టిలో, వారి విశ్వాసపు వ్యవధి ముగిసింది. దానిని ముగించింది ఆ వ్యక్తి కాదు, దేవుడే. ఈ వ్యక్తి దేవుడిని వదిలి వెళ్లాడంటే వారు ఇప్పటికే దేవుడిని తిరస్కరించారనీ, వారు ఇకపై ఆయనను కోరుకోవడం లేదనీ మరియు వారు ఇకపై దేవుని రక్షణను అంగీకరించడం లేదనీ అర్థం. ఇలాంటి వాళ్ళకి దేవుడు అవసరం లేదు కాబట్టి, ఇప్పటికీ వారిని ఆయన కోరుకోగలడా? అంతేకాకుండా, అలాంటి వ్యక్తులకు ఈ రకమైన వైఖరి, ఈ అభిప్రాయం ఉన్నప్పుడు మరియు దేవుడిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, వారు ఇప్పటికే దేవుని స్వభావానికి చెరుపు చేశారు. వారు ఆగ్రహానికి లోనై దేవుడిని శపించక పోవడం వాస్తవమైనప్పటికీ, వారు ఎలాంటి నీచమైన, విపరీత ధోరణిలో ప్రవర్తించక పోవడమనేది వాస్తవమైనప్పటికీ, “నేను బయటికి వెళ్లి సరదాగా గడిపే రోజు వచ్చినప్పుడు లేదా నాకు దేనికోసమైనా ఇంకా దేవుడు అవసరమైనప్పుడు, నేను తిరిగి వస్తాను. లేదా దేవుడు నన్ను పిలిస్తే, నేను తిరిగి వస్తాను,” అని ఈ ప్రజలు అనుకుంటూ ఉండడం వాస్తవమైనప్పటికీ లేదా “నేను బయట బాధపడ్డప్పుడు లేదా బయటి ప్రపంచం మరీ అంధకారంగా, మరీ దుర్మార్గంగా ఉందని మరియు నేను ఇకపై ప్రవాహంతో పాటు పోలేనని నాకనిపించినప్పుడు, నేను దేవుని వద్దకు తిరిగి వస్తాను” అని వారు అన్నప్పటికీ వారు ఇప్పటికే దేవుని స్వభావానికి చెరుపు చేశారు. ఈ వ్యక్తులు వారు సరిగ్గా ఎప్పుడు తిరిగి రావాలో వారి మనస్సులలో లెక్కించుకున్నప్పటికీ, వారు తిరిగి రావడం కోసం వారు తలుపు తెరిచే ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఏమి విశ్వసిస్తున్నప్పటికీ లేదా వారి ప్రణాళిక ఏదైనప్పటికీ, ఇదంతా వారి ఇష్టమైన ఆలోచన మాత్రమేనని వారు గ్రహించరు. వదిలి వెళ్లాలనే వారి కోరిక దేవుడికి ఎలా అనిపిస్తుందో స్పష్టంగా తెలియకపోవడమే వారి అతిపెద్ద పొరపాటు. దేవుడిని వదిలి వెళ్లాలని వారు నిర్ణయించుకున్న క్షణం నుండే, ఆయన వారిని పూర్తిగా విడిచిపెడతాడు; అప్పటికే, ఆయన తన హృదయంలో అలాంటి వ్యక్తి ఫలితాన్ని నిర్ణయించుకుంటాడు. ఆ ఫలితం ఏమిటి? ఈ వ్యక్తి ఎలుకల్లో ఒకడవుతాడు, కాబట్టి వాటితో పాటే నశించిపోతాడు. కాబట్టి, ప్రజలు తరచూ ఈ రకమైన పరిస్థితిని చూస్తారు: ఒకవ్యక్తి దేవుడిని విడిచిపెడతారు, కానీ శిక్షను పొందడు. దేవుడు తన సొంత నియమాల ప్రకారం పని చేస్తాడు; వీటిలో కొన్ని కనిపించవచ్చు, మరికొన్ని దేవుని హృదయంలో మాత్రమే నిర్ణయించబడతాయి, కాబట్టి ప్రజలు ఫలితాలను చూడలేరు. మానవులకు కనిపించే భాగం తప్పనిసరిగా విషయాల నిజమైన వైపు కానక్కరలేదు, కానీ నీకు కనిపించని—మరో వైపు—వాస్తవానికి దేవుడు హృదయంలో అనుకున్న నిజమైన ఆలోచనలు మరియు నిర్ణయాలు ఉంటాయి

దేవుని కార్యము సమయంలో పారిపోయే వ్యక్తులే నిజమైన మార్గాన్ని విడిచిపెట్టేవారు

దేవుని కార్యము సమయంలో పారిపోయే వ్యక్తులకు అలాంటి తీవ్రమైన శిక్షను ఆయన ఎలా ఇవ్వగలడు? వారిపై ఆయన అంత కోపంగా ఎందుకు ఉన్నాడు? అన్నింటికంటే ముందు, దేవుని స్వభావం అనేది మహత్యం మరియు ఉగ్రత అని మనకు తెలుసు; ఆయన ఎవరైనా వధించే గొర్రె కాదు, తమకు ఇష్టమొచ్చినట్లు ప్రజలు ఆడించే కీలుబొమ్మ అసలే కాదు. ఆయనపై అధికారం చెలాయించడానికి ఆయన ఖాళీ గాలి గుచ్ఛం కూడా కాదు. దేవుడు ఉన్నాడని నీవు నిజంగా విశ్వసిస్తే, నీకు దేవునికి భయపడే హృదయం ఉండాలి మరియు ఆయన గుణగణాలు ఆగ్రహించేలా చేయగలిగినవి కావని నీవు తెలుసుకోవాలి. ఈ ఆగ్రహం ఒక మాట కావచ్చు లేదా బహుశా ఒక ఆలోచన కావచ్చు లేదా ఒక రకమైన నీచమైన ప్రవర్తన కావచ్చు లేదా స్వల్ప ప్రవర్తన—మనుష్యుల దృష్టిలో మరియు నైతికతలో సాధారణ ప్రవర్తన వల్ల కూడా కావచ్చు; లేదా అది ఒక సిద్ధాంతం లేదా సూత్రం చేత రెచ్చగొట్టబడినదై ఉండవచ్చు. అయినప్పటికీ, నీవు దేవునికి ఒకసారి కోపం తెప్పిస్తే, నీ అవకాశం కోల్పోయినట్లే మరియు నీ ముగింపు రోజులు వచ్చినట్లే. ఇది ఘోరమైన విషయం! దేవుని పట్ల అస్సలు అపరాధము చేయకూడదని నీవు అర్థం చేసుకోకపోతే, నీవు ఆయనకు భయపడకపోవచ్చు మరియు నీవు మామూలుగా ఆయన పట్ల అపరాధము చేస్తూనే ఉండవచ్చు. దేవునికి ఎలా భయపడాలో నీకు తెలియకపోతే, నీవు దేవునికి భయపడలేవు, దేవుని యందు భయము మరియు చెడుతనమును విసర్జించుట అనే దేవుని మార్గంలో నడవడం ఎలాగో నీకు తెలియదు. దేవుడి పట్ల అస్సలు అపరాధము చేయకూడదని నీకు తెలిసిన, స్పృహ కలిగిన తర్వాత, దేవుని యందు భయము మరియు చెడుతనమును విసర్జించుట అంటే ఏమిటో నీకు తెలుస్తుంది.

దేవుని యందు భయము మరియు చెడుతనమును విసర్జించుట అనే మార్గంలో నడవడమంటే నీకు ఎంత తెలుసు, నీవు ఎన్ని పరీక్షలు అనుభవించావు లేదా నీవు ఎంత క్రమశిక్షణలో పెట్టబడ్డావు అని ఎంతమాత్రం కాదు. దానికి బదులుగా, నీ హృదయంలో దేవుని పట్ల నీ వైఖరిపై మరియు నీవు వ్యక్తపరిచే గుణగణాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రజల గుణగణాలు మరియు వారి వ్యక్తిగత వైఖరులు—చాలా ముఖ్యమైనవి, చాలా కీలకమైనవి. దేవుడిని పరిత్యజించి, విడిచిపెట్టిన వారి విషయానికొస్తే, ఆయన పట్ల వారి ధిక్కార వైఖరులు మరియు సత్యాన్ని తృణీకరించే వారి హృదయాలు ఇప్పటికే ఆయన స్వభావానికి చెరుపు చేశాయి, కాబట్టి ఆయనకు సంబంధించినంతవరకు, వారెప్పుడూ క్షమించబడరు. వారికి దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన ఇప్పటికే వచ్చాడనే వార్త వారికి తెలియజేయబడింది మరియు దేవుని కొత్త కార్యాన్ని కూడా అనుభవించారు. వారు విడిచిపెట్టడం అనేది భ్రమతో లేదా గజిబిజిగా ఉన్న సందర్భం కాదు, వారు వదిలి వెళ్లాలని బలవంతం చేసిన సందర్భం అసలే కాదు. అలా కాకుండా, వారు స్పృహతో మరియు స్పష్టమైన మనస్సుతో దేవుడిని వదిలి వెళ్లాలని ఎంచుకున్నారు. వారు విడిచిపెట్టడం అనేది తమ దారి తప్పపోయిన లేదా వారు తోసివేయబడిన విషయం కాదు. కాబట్టి, దేవుని దృష్టిలో వారు మంద నుండి తప్పిపోయిన గొర్రె పిల్లలు కాదు, దారి తప్పి తప్పిపోయిన కుమారులు అసలే కాదు. వారు శిక్ష లేకుండా విడిచి వెళ్లారు—మరియు అలాంటి పరిస్థితి, అలాంటి సందర్భం, దేవుని స్వభావానికి చెరుపు చేస్తుంది మరియు ఈ చెరుపు చేయడం కారణంగా ఆయన వారికి నిరాశాజనకమైన ఫలితాలను ఇస్తాడు. ఈ రకమైన ఫలితం భయానకమైనది కాదా? కాబట్టి, ప్రజలకు దేవుని గురించి తెలియకపోతే, వారు ఆయన పట్ల అపరాధము చేస్తారు. ఇదేమీ చిన్న విషయం కాదు! దేవుని వైఖరిని వ్యక్తులు గంభీరంగా తీసుకోకపోతే, ఆయన తప్పిపోయిన గొర్రె పిల్లలలో వారు కొందరు కాబట్టి, వారు తిరిగి రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడని, వారి హృదయ పరివర్తన కోసం ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడని ఇప్పటికీ విశ్వసిస్తే, అప్పుడు వారు శిక్షించబడే రోజులకు ఎంతో దూరంలో లేరు. దేవుడు వారిని అంగీకరించడానికి నిరాకరించడం ఒక్కటే చేయడు—ఇది వారు ఆయన స్వభావానికి రెండవసారి చెరుపు చేయడం కాబట్టి, ఈ విషయం చాలా ఘోరమైనది! ఈ ప్రజల అమర్యాదపూర్వక వైఖరులు ఇప్పటికే దేవుని పాలనా కట్టడలను ఉల్లంఘించాయి. ఆయన ఇంకా వారిని అంగీకరిస్తాడా? ఆయన హృదయంలో, ఈ విషయానికి సంబంధించి ఉన్న దేవుని నియమాలు ఏమిటంటే, నిజమైన మార్గం గురించి ఎవరైనా నిశ్చయత సాధించినప్పటికీ, స్పృహతో మరియు స్పష్టమైన మనస్సుతో దేవుడిని తిరస్కరించగలిగితే మరియు దేవుడిని విడిచిపెట్టగలిగితే, అప్పుడు అలాంటి వ్యక్తి రక్షణ మార్గాన్ని ఆయన మూసివేస్తాడు మరియు ఆ వ్యక్తికి, ఇకపై దేవుని రాజ్యంలోకి ద్వారం మూసివేయబడుతుంది. ఆ వ్యక్తి మరోసారి తలుపు తట్టడానికి వచ్చినప్పుడు, దేవుడు తలుపు తెరవడు; ఆ వ్యక్తి శాశ్వతంగా గెంటి వేయబడతాడు. బహుశా, మీలో కొందరు బైబిల్‌లోని మోషే కథను చదివే ఉండవచ్చు. మోషే దేవునిచే రాజ్యాభిషేకించబడిన తర్వాత, అతని చర్యలు మరియు అనేక ఇతర కారణాల వల్ల, 250 మంది నాయకులు మోషే పట్ల అవిధేయత వ్యక్తం చేస్తారు. నిజానికి, వారు ఎవరి పట్ల విధేయత చూపడానికి నిరాకరించారు? అది మోషే పట్ల కాదు. వారు దేవుని ఏర్పాట్ల పట్ల విధేయత చూపడానికి నిరాకరించారు; వారు ఈ విషయంలో దేవుని కార్యము పట్ల విధేయత చూపడానికి నిరాకరించారు. వారు ఇలా చెప్పారు: “You(pl) take too much on you, seeing all the congregation are holy, every one of them, and Jehovah is among them….” ఈ మాటలు మరియు వాక్యాలు మానవ దృష్టికోణంలో చాలా తీవ్రమైనవిగా ఉన్నాయా? అవి తీవ్రమైనవి కావు! కనీసం, ఈ మాటల అక్షరతః అర్థం తీవ్రమైనది కాదు. న్యాయపరమైన దృష్టిలో, వారు ఎటువంటి చట్టాలను ఉల్లంఘించలేదు, ఎందుకంటే పైకి కనిపించే దానిని బట్టి, ఇది వ్యతిరేకమైన భాష లేదా పదజాలం కాదు, ఇందులో దైవదూషణకు సంబంధించిన అర్థాలు అస్సలు లేవు. ఇవి సాధారణ వాక్యాలను మించి, ఇంకేమీ కావు. మరి అలాంటప్పుడు, ఈ మాటలు దేవుడికి అంత ఆగ్రహం ఎందుకు తెప్పించాయి? ఎందుకంటే, అవి ప్రజలతో మాట్లాడినవి కావు, దేవునితో మాట్లాడినవి. వారు వ్యక్తపరచిన వైఖరి మరియు స్వభావం దేవుని స్వభావానికి ఖచ్చితంగా చెరుపు చేస్తాయి మరియు అవి అపరాధం అస్సలు చేయకూడని దేవుని స్వభావానికి అపరాధము చేస్తాయి. చివరకు ఆ నాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. దేవుడిని విడిచిపెట్టిన వ్యక్తుల గురించి, వారి దృష్టికోణం ఏమిటి? వారి వైఖరి ఏమిటి? వారి అభిప్రాయం మరియు వైఖరి దేవుడు వారితో అలా వ్యవహరించేలా ఎందుకు చేస్తాయి? దీనికి కారణం, ఆయన దేవుడని వారికి స్పష్టంగా తెలిసినప్పటికీ, వారు ఆయనకు నమ్మకద్రోహం చేయాలని ఎంచుకున్నారు, అందుచేతనే వారి రక్షణ పొందే అవకాశాలు పూర్తిగా తొలగించబడ్డాయి. బైబిల్‌లో ఇలా రాసి ఉంది, “For if we sin willfully after that we have received the knowledge of the truth, there remains no more sacrifice for sins.” ఈ విషయం గురించి మీకు ఇప్పుడు స్పష్టమైన అవగాహన వచ్చిందా?

దేవుని పట్ల ప్రజల వైఖరిని బట్టే వారి తలరాతలు నిర్ణయించబడతాయి

దేవుడు సజీవమైన దేవుడు, ప్రజలు భిన్నమైన పరిస్థితుల్లో భిన్నంగా ప్రవర్తించినట్లే, ఆ ప్రవర్తనల పట్ల ఆయన వైఖరి కూడా భిన్నంగానే ఉంటుంది, ఎందుకంటే ఆయన ఒక కీలుబొమ్మ కాదు లేదా ఖాళీ గాలి గుచ్ఛం కాదు. దేవుడి వైఖరిని తెలుసుకోవడం అనేది మానవాళికి ఒక అమూల్యమైన అన్వేషణ. దేవుని వైఖరిని తెలుసుకోవడం ద్వారా, దేవుని స్వభావం గురించిన జ్ఞానాన్ని వారు కొద్దికొద్దిగా ఎలా పొందాలో మరియు ఆయన హృదయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలు నేర్చుకోవాలి. దేవుని హృదయాన్ని నీవు క్రమంగా అర్థం చేసుకున్నప్పుడు, ఆయన యందు భయము కలిగి, చెడుతనమును విసర్జించడం అనే దానిని సాధించడం అంత కష్టమైన పనిగా నీవు భావించవు. అంతేగాకుండా, నీవు దేవుడిని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన గురించి అభిప్రాయాలు ఏర్పర్చుకునే అవకాశం ఉండదు. దేవుని గురించి నీవు అభిప్రాయాలు ఏర్పర్చుకోవడం మానేసిన తర్వాత, నీవు ఆయన పట్ల అపరాధము చేసే అవకాశం తక్కువగా ఉంటుంది, నీకు తెలియకుండానే, దేవుడు ఆయన గురించి నీవు జ్ఞానం పొందేలా చేస్తాడు; ఇది నీ హృదయంలో ఆయన పట్ల గౌరవాన్ని నింపుతుంది. అప్పుడు నీవు, నీవు ప్రావీణ్యం సాధించిన గ్రంథాలు, ఉన్నది ఉన్నట్లుగా అర్థాలు మరియు సిద్ధాంతాల ద్వారా దేవుడిని నిర్వచించడం ఆపివేస్తావు. దానికి బదులుగా, అన్ని విషయాలలో దేవుని ఉద్దేశాలను నిరంతరం అన్వేషించడం ద్వారా, నీకు తెలియకుండానే దేవుని హృదయాన్ని అనుసరించే వ్యక్తిగా మారుతావు.

దేవుని కార్యము మానవులు చూడలేనిది మరియు స్పృశించలేనిది, కానీ ఆయనకు సంబంధించినంతవరకు—ఆయన పట్ల వారి వైఖరితో సహా—ప్రతి వ్యక్తి పనులు దేవుడు గ్రహించదగినవే కాకుండా, ఆయన చూడదగినవి కూడా. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించి, దాని గురించి చాలా స్పష్టతతో ఉండాల్సిన విషయం. నిన్ను నీవు ఎప్పుడూ ఇలా ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు, “నేను ఇక్కడ చేస్తున్నది దేవునికి తెలుసా? నేను ఈ క్షణంలో ఆలోచిస్తున్నది ఆయనకు తెలుసా? ఆయనకు తెలియవచ్చు మరియు తెలియకపోవచ్చు.” నీవు ఈ రకమైన అభిప్రాయాన్ని అవలంబిస్తే, దేవుడిని అనుసరిస్తూ మరియు విశ్వసిస్తూ ఉన్నప్పటికీ ఆయన కార్యము, ఆయన అస్థిత్వాన్ని సందేహిస్తూ ఉంటే, నీవు ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించే రోజు ఇప్పుడో అప్పుడో వస్తుంది, ఎందుకంటే, నీవు ఇప్పటికే ప్రమాదకరమైన కొండ చరియ అంచు నుండి జారిపోతున్నావు. ఎన్నో యేండ్లుగా దేవుడిని విశ్వసించినప్పటికీ, సత్యపు వాస్తవికతను పొందకపోగా, దేవుడి చిత్తాన్ని సైతం అసలు అర్థం చేసుకోని వ్యక్తులను నేను చూశాను. ఈ వ్యక్తులు నిస్సారమైన సిద్ధాంతాలను మాత్రమే పట్టుకొని వేలాడుతూ, వారి జీవితాలలో మరియు స్థాయిలలో ఎలాంటి పురోగతిని సాధించరు. ఎందుకంటే, అలాంటి వ్యక్తులు దేవుని వాక్యమంటే జీవమని ఎప్పుడూ భావించలేదు, వారు ఆయన ఉనికిని ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు మరియు అంగికరించలేదు. అలాంటి వ్యక్తులను చూడగానే దేవుడు సంతోషంతో నిండిపోతాడని నీవు అనుకుంటున్నావా? వారు ఆయనకు ఓదార్చునిస్తారా? కాబట్టి, మనుష్యులు దేవుడిని ఎలా విశ్వసిస్తారు అనేదానిని బట్టే వారి తలరాతలు నిర్ణయించబడతాయి. ప్రజలు ఎలా కోరుకుంటారు మరియు ప్రజలు దేవుడిని ఎలా చేరుకుంటారు అనే విషయానికొస్తే, ప్రజల వైఖరులకు ప్రధాన ప్రాముఖ్యత ఉంది. దేవుడు నీ తల వెనుక గుండ్రంగా తిరుగుతున్న ఒక ఖాళీ గాలి గుచ్ఛం వంటి వాడేనని ఆయనను నిర్లక్ష్యం చేయవద్దు; నీవు విశ్వసించే దేవుడిని సజీవమైన దేవుడుగా, నిజమైన దేవుడుగా ఎల్లప్పుడూ అనుకోండి. ఆయన చేసేదేమీ లేక మూడవ ఆకాశం చుట్టుపక్కల ఏమీ కూర్చోని ఉండడు. దానికి బదులుగా, నీవు ఏమి చేస్తున్నావో గమనిస్తూ, నీ ప్రతి చిన్న మాట మరియు ప్రతి చిన్న పనిని చూస్తూ, నీవు ఎలా ప్రవర్తిస్తావో మరియు ఆయన పట్ల నీ వైఖరి ఏమిటో చూస్తూ, ఆయన నిరంతరం ప్రతి ఒక్కరి హృదయం లోనికి చూస్తున్నాడు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడినా, పడకపోయినా, నీ ప్రవర్తన మరియు నీ అంతరాత్మలోని ఆలోచనలు మరియు భావనలన్నీ కళ్లకు కట్టినట్టు ఆయన యెదుట ఉన్నాయి మరియు ఆయన చూస్తున్నాడు. నీ ప్రవర్తన కారణంగా, నీ పనుల కారణంగా మరియు ఆయన పట్ల నీ వైఖరి కారణంగా, నీ పట్ల దేవుని అభిప్రాయం మరియు నీ పట్ల ఆయన వైఖరి నిరంతరం మారుతూనే ఉంటాయి. నేను కొంతమందికి కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను: దేవుడు నీపై పిచ్చి ప్రేమను కురిపించాలి అన్నట్లుగా, ఆయన నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టలేడు అన్నట్లుగా మరియు నీ పట్ల ఆయన వైఖరి స్థిరమైనది, ఎప్పటికీ మారలేనిది అన్నట్లుగా, చిన్న బిడ్డల్లాగా నిన్ను నీవు ఆయన చేతుల్లో పెట్టవద్దనీ, కలలు కనడం నుండి బయట పడాలనీ నేను మీకు సలహా ఇస్తున్నాను! దేవుడు ప్రతిఒక్కరి పట్ల తనదైన వ్యవహారం చూపడంలో నీతిమంతుడు మరియు ప్రజలను జయించే మరియు రక్షించే కార్యము చేయటంలో ఆయన మనస్ఫూర్తితో ఉన్నాడు. ఇదే ఆయన నిర్వహణ. పెంపుడు జంతువుతో ఆడుకున్నట్లు కాకుండా, ఆయన ప్రతి ఒక్కరిని తీవ్రంగా పరిగణిస్తాడు. మనుష్యుల పట్ల దేవుని ప్రేమ అతిగా గారాబం చేసే లేదా చెడగొట్టే రకం కాదు, అలాగే మానవజాతి పట్ల ఆయన కరుణ మరియు సహనం అనుగ్రహించేది లేదా పట్టించుకోనిది కాదు. అలా కాకుండా, మనుష్యుల పట్ల దేవుని ప్రేమలో జీవమును ప్రేమించడం, జాలిపడడం మరియు గౌరవించడం ఉంటాయి; ఆయన కరుణ, సహనం వారి నుండి ఆయన కోరుకునే వాటిని తెలియజేస్తాయి, అవి మానవాళి మనుగడకు అవసరమైనవి. దేవుడు సజీవుడు, దేవుడు నిజంగా ఉన్నాడు; మానవజాతి పట్ల ఆయన వైఖరి నియమబద్ధమైనది, పిడివాద నియమాల సమ్మేళనం ఏమాత్రం కాదు మరియు అది మారవచ్చు. ప్రతి వ్యక్తి వైఖరితో పాటు ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ఆధారపడి మానవాళి పట్ల ఆయన ఉద్దేశాలు క్రమంగా మారుతుంటాయి మరియు కాలంతో పాటు పరివర్తన చెందుతుంటాయి. కాబట్టి, దేవుని గుణగణాలు మార్పులేనివనీ మరియు ఆయన స్వభావము విభిన్న సమయాల్లో మరియు విభిన్న సందర్భాలలో ప్రకటితమవుతుందనీ పూర్తి స్పష్టతతో నీ మనసులో నీవు తెలుసుకోవాలి. ఇది తీవ్రమైన విషయమని నీవు భావించకపోవచ్చు, దేవుడు పనులు ఎలా చేయాలో ఊహించుకోవడానికి నీవు నీ సొంత వ్యక్తిగత ఆలోచనలను ఉపయోగించవచ్చు. అయినప్పటికీ, నీ అభిప్రాయానికి భిన్న ధ్రువంలో ఉండేది నిజమైన సందర్భాలు ఉన్నాయి, దేవుడిని కొలవడానికి నీ సొంత వ్యక్తిగత ఆలోచనలను ఉపయోగించి ప్రయత్నించడంతో, నీవు ఇప్పటికే ఆయనకు ఆగ్రహం తెప్పించావు. ఎందుకంటే, దేవుడు ఎలా చేస్తాడని నీవు అనుకుంటున్నావో అలా చేయడు లేదా ఆయన ఎలా భావిస్తాడని నీవు చెబుతావో అలా ఆ విషయాన్ని భావించడు. కాబట్టి, మీ చుట్టుపక్కల ఉన్న ప్రతిదానితో వ్యవహరించే నీ వైఖరిలో జాగ్రత్తగా మరియు వివేకంతో ఉండాలనీ మరియు అన్ని విషయాలలో దేవుని మార్గంలో నడిచే నియమాలను పాటించడాన్ని తెలుసుకోవాలనీ నేను నీకు గుర్తు చేస్తున్నాను, అంటే దేవుని యందు భయము కలిగి ఉండాలనీ, చెడుతనమును విసర్జించాలనీ చెబుతున్నాను. నీవు దేవుని చిత్తం మరియు దేవుని వైఖరికి సంబంధించిన విషయాలలో స్థిరమైన అవగాహనను తప్పక పెంపొందించుకోవాలి, ఈ విషయాల గురించి నీతో మాట్లాడడానికి నీవు జ్ఞానోదయం పొందిన వ్యక్తులను తప్పక కనుగొనాలి, నీవు తప్పక మనస్ఫూర్తిగా వెతకాలి. నీవు విశ్వసించే దేవుడిపై ఇష్టానుసారం అభిప్రాయం ఏర్పర్చుకుంటూ, ఆయన గురించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మరియు ఆయన అర్హుడైన గౌరవం ఇవ్వకుండా—ఆయనను ఒక కీలుబొమ్మగా చూడకు. దేవుడు నీకు రక్షణ ఇస్తున్నప్పుడు మరియు నీ ఫలితాన్ని నిర్ణయిస్తున్నప్పుడు, ఆయన నీకు కరుణ లేదా సహనం లేదా తీర్పు మరియు శిక్షను మంజూరు చేయవచ్చు, కానీ ఏదేమైనప్పటికీ, నీ పట్ల ఆయన వైఖరి స్థిరమైనది కాదు. ఇది ఆయన పట్ల నీ సొంత వైఖరిపై, అలాగే ఆయన పట్ల నీ అవగాహనపై ఆధారపడి ఉంటుంది. దేవుడిని శాశ్వతంగా నిర్వచించడానికి నీకు తెలిసిన నీ జ్ఞానం లేదా అవగాహనలోని ఒక అంశాన్నే ఉపయోగించకు. మృత దేవుడిని విశ్వసించకు; జీవించి ఉన్న దేవుడినే విశ్వసించు. దీన్ని గుర్తుంచుకో! ఇక్కడ నేను కొన్ని నిజమైన వాస్తవాలను చర్చించినప్పటికీ—మీరు వినవలసిన నిజమైన వాస్తవాలను—మీ ప్రస్తుత స్థితి, ప్రస్తుత స్థాయిని దృష్టిలో ఉంచుకుని వినాలి, మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తూ, ఇప్పటికిప్పుడు, నేను మీ నుండి పెద్దగా ఏమీ కోరను. అలా చేయడం అనేది మీ హృదయాలలో మరీ ఎక్కువ నిరుత్సాహాన్ని నింపవచ్చు, దేవుని పట్ల మీరు మరీ నిరాశకు లోనయ్యేలా చేయవచ్చు. అలాకాకుండా, మీరు మీ ముందున్న మార్గంలో నడుస్తున్నప్పుడు మీ హృదయాల్లో దేవుని పట్ల ఉన్న ప్రేమను ఉపయోగించుకోగలరనీ మరియు దేవుని పట్ల గౌరవంతో కూడిన వైఖరిని చూపగలరనీ నేను ఆశిస్తున్నాను. దేవుడిని ఎలా విశ్వసించాలనే విషయంలో గందరగోళానికి గురికావద్దు; దానిని ఒక అతిపెద్ద సమస్యగా భావించవద్దు. దానిని మీ హృదయంలో ఉంచుకోండి, ఆచరణలో పెట్టండి మరియు నిజ జీవితంతో దానిని అనుసంధానం చేయండి; కేవలం పైపై మాటలకే పరిమితం చేయకండి—ఎందుకంటే, ఇదో జీవన్మరణ సమస్య మరియు నీ తలరాతను నిర్ణయించేది ఇదే. దీన్ని ఒక పరిహాసంగా లేదా పిల్లలాటలా భావించకండి! ఈరోజు ఈ విషయాలను మీతో పంచుకున్న తర్వాత, మీ మనస్సులు ఎంత అవగాహన పొందాయోనని నేను కుతూహలంగా ఉన్నాను. నేను ఈరోజు ఇక్కడ చెప్పిన దానిపై మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నలు ఏవైనా ఉన్నాయా?

ఈ విషయాలు కాస్త కొత్తవి అయినప్పటికీ, మీ అభిప్రాయాల నుండి, మీ మామూలు అన్వేషణల నుండి, మీరు శ్రద్ధ వహించడానికి మొగ్గు చూపే వాటి నుండి కొద్దిగా తొలగించబడినప్పటికీ, మీరు కొంతకాలం వాటితో సాంగత్యము చేసిన తర్వాత, నేను ఇక్కడ చెప్పిన ప్రతిదాని గురించి మీకు ఒక సాధారణ అవగాహన పెంపొందుతుందని నేను అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ చాలా కొత్తవి, మీరు ఇంతకు మునుపెన్నడూ ఆలోచించనివి, కాబట్టి అవి ఏ విధంగానూ మీకు అదనపు భారం కావని నేను ఆశిస్తున్నాను. నేనీరోజు మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదు లేదా మిమ్మల్ని దారిలో పెట్టడానికి నేను వాటిని ఒక మార్గంగా ఉపయోగించడం లేదు; అలాకాకుండా, సత్యం గురించి ఖచ్చితమైన వాస్తవాలను అవగాహన చేసుకోవడంలో మీకు సహాయపడటమే నా లక్ష్యం. ఎందుకంటే, మానవజాతి మరియు దేవుని మధ్య పెద్ద తేడా ఉంది కాబట్టి, మానవులు దేవుడిని విశ్వసించినప్పటికీ, వారు ఆయనను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు లేదా ఆయన వైఖరిని తెలుసుకోలేదు. మానవులకు వారి ఆలోచనలలో దేవుని వైఖరి పట్ల ఎప్పుడూ చాలా ఉత్సాహం కూడా లేదు. దానికి భిన్నంగా, వారు గుడ్డిగా విశ్వసించి, ముందుకు సాగారు మరియు దేవుని గురించి వారి జ్ఞానం మరియు అవగాహనలో నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుచేత, నేను ఈ సమస్యల నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడం నా బాధ్యతని భావిస్తున్నాను మరియు మీరు విశ్వసించే ఈ దేవుడు ఎలాంటి దేవుడో, అలాగే ఆయన ఏమనుకుంటున్నాడో, విభిన్న రకాల ప్రజలతో వ్యవహరించడంలో ఆయన వైఖరి ఏమిటో, మీరు ఆయన కోరుకున్నవి తీర్చడానికి ఎంత దూరంలో ఉన్నారో, మీ పనులు మరియు ఆయన కోరుకునే ప్రమాణాల మధ్య ఎంత పెద్ద వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఈ విషయాలను మీకు తెలియజేయడానికి గల లక్ష్యం, మిమ్మల్ని మీరు కొలుచుకునేందుకు ఒక కొలబద్ధను మీకు ఇవ్వడమే, దానితో మీరు వెళ్లే మార్గం ఎలాంటి ఫలితానికి దారితీస్తుందో, మీరు ఈ మార్గంలో ఏమి పొందలేదో మరియు ఏయే రంగాలలో మీరు అసలు పాలుపంచుకోలేదో మీరు తెలుకుంటారు. మీ మధ్య పరస్పర సంభాషణ జరుగుతున్నప్పుడు, మీరు మామూలుగా సాధారణంగా చర్చించే తక్కువ పరిధి కలిగిన మరియు లోతులేని విషయాలనే మాట్లాడతారు. మీరు చర్చించే వాటికి మరియు దేవుని ఉద్దేశాలకు మధ్య, అదేవిధంగా, మీ చర్చలు మరియు దేవుడు కోరుకునే వాటి పరిధి మరియు ప్రమాణాల మధ్య దూరం, అంతరం ఉంది. ఈవిధంగా కొనసాగడం అనేది కాలక్రమేణా మీరు దేవుని మార్గం నుండి మరింత దూరం అవడానికి దారి తీస్తుంది. మీరు దేవుని ప్రస్తుత మాటలను మాత్రమే తీసుకొని, వాటిని ఆరాధనా వస్తువులుగా మారుస్తున్నారు మరియు వాటిని ఆచారాలు మరియు నిబంధనలుగా చూస్తున్నారు. మీరు చేసేదంతా ఇదే! అసలు వాస్తవమేమంటే, దేవునికి మీ హృదయాలలో స్థానం లేదు మరియు ఆయన నిజంగా మీ హృదయాలను ఎప్పుడూ పొందలేదు. దేవుడిని తెలుసుకోవడం చాలా కష్టమని కొంతమంది అనుకుంటారు, ఇది వాస్తవం. ఇది కష్టమైనది! ప్రజలను వారి విధులను నిర్వహించేలా మరియు బాహ్యంగా పనులను పూర్తిచేసేలా, కష్టపడి పని చేసేలా తయారు చేస్తే, అప్పుడు వారు దేవుడిని విశ్వసించడం చాలా సులభమని అనుకుంటారు, ఎందుకంటే ఆ పనులన్నీ మానవ సామర్థ్యపు పరిధిలోకి వస్తాయి. అయితే, ఈ విషయాలు దేవుని ఉద్దేశాలకు మరియు మానవాళి పట్ల ఆయన వైఖరికి మారిన క్షణమే, ప్రతి ఒక్కరి దృష్టికోణంలో, ఈ విషయాలు నిజంగా కొంచెం ఎక్కువ కష్టమైనవిగా మారుతాయి. ఎందుకంటే, ఇందులో ప్రజలు సత్యాన్ని అవగాహన చేసుకోవడం మరియు వారు వాస్తవికతలోకి ప్రవేశించడం ఉంటాయి, కాబట్టి కొంత స్థాయిలో కష్టం ఉండటం వాస్తవమే! అయినా, నీవు మొదటి ద్వారం గుండా ప్రవేశించి, ప్రవేశం పొందడం మొదలు పెట్టిన తర్వాత, విషయాలు క్రమంగా సులభం అవుతాయి.

దేవుడిని దేవుడిగా భావించడమే దేవుడి పట్ల భయానికి ప్రారంభ స్థానం

కొద్దిసేపటి క్రితం, ఎవరో ఒకరు ఒక ప్రశ్నను లేవనెత్తారు: మనకు దేవుని గురించి యోబు కంటే ఎక్కువ తెలిసినప్పటికీ, మనం ఇంకా ఆయనను ఎందుకు గౌరవించలేకపోతున్నాము? మనం ఈ విషయం గురించి ఇంతకుముందే కొంచెం మాట్లాడాము, కదా? వాస్తవానికి ఈ ప్రశ్న సారాంశాన్ని మనం ఇంతకుముందే చర్చించాము కూడా, అంటే అప్పుడు యోబుకు దేవుడు తెలియకపోవడం అనేది వాస్తవమైనప్పటికీ, అతను ఆయనను దేవుడిలా భావించాడు మరియు ఆయనను భూమ్యాకాశములు మరియు సమస్తానికి యజమానిగా పరిగణించాడు. యోబు దేవుడిని శత్రువుగా భావించలేదు; బదులుగా, అతను ఆయనను సమస్త సృష్టికి సృష్టికర్తగా ఆరాధించాడు. ఈరోజుల్లో దేవుడిని ప్రజలు ఎందుకు అంతగా ప్రతిఘటిస్తున్నారు? వారు ఆయనను ఎందుకు గౌరవించలేకపోతున్నారు? దీనికి ఒక కారణం ఏమిటంటే, వారిని సాతాను లోతుగా చెడగొట్టింది మరియు అంత లోతుగా పాతుకుపోయిన సాతాను స్వభావంతో వారు దేవునికి శత్రువులుగా మారిపోయారు. కాబట్టి, వారు దేవుడిని విశ్వసించినప్పటికీ మరియు దేవుడిని గుర్తించినప్పటికీ, వారు ఆయనను ప్రతిఘటించగలుగుతున్నారు మరియు తమంతట తాముగా ఆయనకు వ్యతిరేకంగా ఉండగలుగుతున్నారు. దీన్ని మానవ స్వభావం నిర్ణయిస్తుంది. మరో కారణం ఏమిటంటే, వారికి దేవుడిపై విశ్వాసం ఉన్నప్పటికీ, ప్రజలు ఆయనను దేవుడిగా ఏమాత్రం భావించరు. ప్రతిగా, ఆయనను తమ శత్రువుగా భావిస్తూ, వారు ఆయనను మానవాళికి వ్యతిరేకిగా పరిగణిస్తారు మరియు వారికి దేవునితో అసలు పొసగదని భావిస్తారు. ఇది అంత సరళమైన విషయం. ఈ విషయం మన మునుపటి సమావేశంలో ప్రస్తావించబడలేదా? దీని గురించి ఆలోచించండి: కారణం అదే కాదా? నీకు దేవుని గురించి కొంత జ్ఞానం ఉండవచ్చు, కానీ ఈ జ్ఞానానికి అసలు అర్థం ఏమిటి? అందరూ మాట్లాడుకునేది ఇదే కదా? నీకు దేవుడు చెప్పింది ఇదే కాదా? నీకు దీని సైద్ధాంతిక మరియు గ్రంథపరమైన అంశాలు మాత్రమే బాగా తెలుసు—కానీ దేవుని నిజమైన ముఖాన్ని నీవు ఎప్పుడైనా ప్రశంసించావా? నీకు వ్యక్తిగత జ్ఞానం ఉందా? నీకు వ్యవహారిక జ్ఞానం మరియు అనుభవం ఉన్నాయా? దేవుడు నీకు చెప్పకపోయి ఉంటే, నీవు తెలుసుకోగలిగే వాడివా? నీ సైద్ధాంతిక జ్ఞానం నిజమైన జ్ఞానాన్ని సూచించదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నీకు ఎంత తెలుసు లేదా నీకు ఎలా తెలిసింది అనేదానితో సంబంధం లేకుండా, దేవుని గురించి నిజమైన అవగాహనను నీవు పొందే వరకు, ఆయన నీకు శత్రువుగానే ఉంటాడు మరియు నీవు దేవుడిని దేవుడిగా భావించడం వాస్తవంగా మొదలుపెట్టే వరకు, ఆయన నిన్ను వ్యతిరేకిస్తాడు, ఎందుకంటే నీవు సాతాను స్వరూపానివి.

నీవు క్రీస్తుతో ఉన్నప్పుడు, బహుశా నీవు ఆయనకు రోజుకు మూడు పూటలా భోజనం పెట్టవచ్చు లేదా ఆయనకు టీ ఇవ్వవచ్చు మరియు ఆయన జీవిత అవసరాలను తీర్చవచ్చు; నీవు క్రీస్తును దేవుడిగా భావించినట్లు కనిపిస్తావు. ఏదైనా జరిగినప్పుడల్లా, ప్రజల అభిప్రాయాలు ఎల్లప్పుడూ దేవునికి విరుద్ధంగా వెళ్తాయి; దేవుని అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడంలో మరియు అంగీకరించడంలో ప్రజలు ఎల్లప్పుడూ విఫలమవుతారు. పైపైన ప్రజలు దేవునితో కలిసిమెలిసి ఉండవచ్చు, దీని అర్థం వారు ఆయనకు అనుగుణంగా ఉన్నారని కాదు. ఏదైనా జరిగిన వెంటనే, మానవాళి అవిధేయత అసలు ముఖం బయటపడుతుంది, ఆవిధంగా, మనుష్యులకు మరియు దేవునికి మధ్య ఉన్న వైరాన్ని నిర్ధారిస్తుంది. ఈ వైరం అనేది దేవుడు మనుష్యులను వ్యతిరేకించడం కాదు లేదా దేవుడు వారి పట్ల వైరంతో ఉండాలనుకోవడం కాదు లేదా ఆయన వారిని తనకు వ్యతిరేకంగా ఉంచి, ఆతర్వాత వారిని అలా చూడటం కూడా కాదు. దానికి బదులుగా, ఇది మానవుల వ్యక్తిగత చిత్తంలో మరియు వారి ఉపచేతన మనస్సులలో దాగి ఉన్న దేవుని పట్ల ఈ వైరానికి సారాంశం. ప్రజలు దేవుని నుండి వచ్చినవన్నీ తమ పరిశోధనకు విషయ వస్తువులుగా భావిస్తారు కాబట్టి, దేవుని నుండి వచ్చిన మరియు దేవునికి సంబంధించిన ప్రతిదాని పట్ల వారి స్పందన, అన్నింటికి మించి, ఊహించడం, సందేహించడం, ఆపై వెనువెంటనే దేవుడితో విభేదించే, ఆయనను వ్యతిరేకించే వైఖరిని అవలంబించడంగా ఉంటుంది. ఆతర్వాత వెంటనే, వారు దేవునితో వివాదాలు లేదా పోటీ పడే ప్రతికూల మనోస్థితిని పెంచుకుంటారు, అలాంటి దేవుడిని అనుసరించడం తగినదేనా అని సందేహించేంత దూరం వరకు కూడా వారు వెళ్తారు. వారు ఈ విధానంలో ముందుకు సాగకూడదని వారి వివేకం వారికి చెబుతున్నప్పటికీ, వారు తమతో సంబంధం లేకుండా అలా చేయడాన్ని ఎంచుకుంటారు, ఎంతగా అంటే, వారు చివరి వరకు సంకోచం లేకుండా కొనసాగేటంతగా. ఉదాహరణకు, దేవుని గురించి పుకార్లు లేదా అభాండాలు విన్నప్పుడు కొందరు వ్యక్తులలో కలిగే మొదటి ప్రతిస్పందన ఏమిటి? ఈ పుకార్లు నిజమైనవా కాదా, ఈ పుకార్లు ఉన్నాయా లేదా అని ఆలోచించడం మరియు ఆతర్వాత వేచి చూసే ధోరణిని అవలంబించడం వారి మొదటి ప్రతిస్పందన. తర్వాత వారు, “దీనిని ధ్రువీకరించుకోవడానికి వేరే మార్గం లేదు. అది నిజంగా జరిగిందా? ఈ పుకారు నిజమా కాదా?” అని ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇలాంటి వ్యక్తులు దానిని బయటికి చూపించకపోయినప్పటికీ, వారి హృదయాలలో ఇప్పటికే సందేహించడం ప్రారంభించారు మరియు ఇప్పటికే దేవుడిని నిరాకరించడం మొదలు పెట్టారు. ఈ రకమైన వైఖరి మరియు అలాంటి అభిప్రాయాల సారాంశం ఏమిటి? ఇది నమ్మకద్రోహం కాదా? వారికి ఈ విషయం ఎదురయ్యే వరకు, ఈ ప్రజల అభిప్రాయాలేమిటో నీవు చూడలేవు; వారు దేవుడిని శత్రువుగా పరిగణించకపోయినప్పటికీ, వారు ఆయనతో విభేదించినట్లు అనిపించదు. అయితే, వారికి ఒక సమస్య ఎదురైన వెంటనే, వారు తక్షణం సాతాను వైపు నిలబడి దేవుడిని వ్యతిరేకిస్తారు. ఇది దేనిని సూచిస్తుంది? మనుష్యులు మరియు దేవుడు వ్యతిరేకులని ఇది సూచిస్తుంది! ఇది దేవుడు మానవాళిని శత్రువుగా భావించడం కాదు, కానీ మానవాళి గుణగణాలే దేవునికి వ్యతిరేకమైనవని సూచిస్తుంది. ఎవరైనా ఒకరు ఎంతకాలం ఆయనను అనుసరించారు లేదా ఎంత పెద్ద మూల్యం చెల్లించారు అనేది కాకుండా, వారు దేవుడిని ఎలా స్తుతించినప్పటికీ, ఆయనను ప్రతిఘటించకుండా తమను తాము ఎలా నిలువరించుకున్నప్పటికీ, దేవుడిని ప్రేమించమని తమనుతాము ఎంత గట్టిగా వేడుకున్నప్పటికీ, వారు దేవుడిని దేవుడిగా చూడటం ఎప్పుడూ చేయలేరు. ఇది ప్రజల గుణగణాలతో నిర్ణయించబడేది కాదా? నీవు ఆయనను దేవుడిగా చూసి, ఆయనే దేవుడని నిజంగా విశ్వసిస్తే, నీకు ఆయన పట్ల ఇంకా ఏమైనా సందేహాలు ఉండగలవా? ఆయన గురించి మీ హృదయంలో ఇప్పటికీ ఏవైనా ప్రశ్న చిహ్నాలు ఉండగలవా? ఏవీ ఉండలేవు, అవునా? ఈ ప్రపంచపు ధోరణులు చాలా చెడ్డవి, ఈ మానవ జాతి కూడా అంతే; కాబట్టి, నీకు వాటిపై ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎలా ఉండగలవు? నీకు నీవే చాలా దుష్టుడివి, కాబట్టి నీకు దాని గురించి ఎలా ఏ ఆలోచన ఎందుకు ఉండదు? పైపెచ్చు, కొన్ని పుకార్లు మరియు కొన్ని అభాండాలు దేవుని గురించి అటువంటి అపరిమితమైన అలోచనలను రేకెత్తిస్తాయి మరియు అనేక విషయాలను గురించి ఊహించుకోవడానికి దారి తీస్తాయి, ఇవి మీ స్థాయి ఎంత అపరిపక్వమైనదో చూపుతాయి! కేవలం కొన్ని “గుయ్యిమనే” దోమలు మరియు కొన్ని చీదర పుట్టించే ఈగలు—నిన్ను మోసం చేయడానికి సరిపోతాయా? అతను ఏరకమైన మనిషి? అలాంటి వ్యక్తుల గురించి దేవుడు ఏమనుకుంటాడో నీకు తెలుసా? నిజానికి దేవుడు వారితో ఎలా వ్యవహరిస్తాడనే విషయంలో ఆయన వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఈ వ్యక్తుల పట్ల దేవుడి వ్యవహారం ఎడమొఖం పెడమొఖంగా ఉండడమే—వారిని ఏ మాత్రం పట్టించుకోకపోవడం మరియు ఈ అజ్ఞానులను గురించి తీవ్రంగా ఆలోచించకపోవడమే ఆయన వైఖరి. అలా ఎందుకని? ఎందుకంటే, దేవుని పట్ల చివరి వరకు వైరంతో ఉండాలని ప్రతిజ్ఞ చేసిన వారిని మరియు ఆయనకు అనుగుణంగా ఉండే మార్గాన్ని వెతకడానికి ఎప్పుడూ యోచించని వ్యక్తులను పొందాలని ఆయన ఎప్పుడూ తన హృదయంలో ప్రణాళిక చేయలేదు. నేను మాట్లాడిన ఈ మాటలు బహుశా కొంతమందికి బాధ కలిగించవచ్చు. సరే, నేనెప్పుడూ మిమ్మల్ని ఇలాగే బాధ పెట్టాలని మీరు అనుకుంటున్నారా? మీరనుకున్నా, అనుకోకపోయినా నేను చెప్పేదంతా వాస్తవం! నేను ఈవిధంగా మిమ్మల్ని ఎప్పుడూ బాధపెడుతూ, మీ కళంకాలను బయటపెడితే, అది మీ హృదయాలలో మీరు నిలుపుకున్న ఘనమైన దేవుని రూపాన్ని ప్రభావితం చేస్తుందా? (అది చేయదు.) అది చేయదని నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే మీ హృదయాలలో అసలు దేవుడే లేడు. మీ హృదయాలలో నిండిన ఘనమైన దేవుడు—మీరు గట్టిగా రక్షించే మరియు కాపాడుకునేవాడు—అసలు దేవుడే కాదు. దానికి బదులుగా, ఆయన మానవ ఊహల కట్టుకథ మాత్రమే; అసలు ఆయన లేనేలేడు. కాబట్టి, నేను ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం బయటపెట్టడమనేది చాలా మంచిది; ఇది మొత్తం వాస్తవం గుట్టు విప్పదా? దేవుడు ఎలా ఉండాలని మనుషులు ఊహించుకుంటున్నారో నిజమైన దేవుడు అలా ఉండడు. మీరంతా ఈ వాస్తవాన్ని తట్టుకోగలరని నేను ఆశిస్తున్నాను మరియు ఇది దేవుని గురించి మీ జ్ఞానాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

దేవుడి ద్వారా గుర్తింపు పొందని వ్యక్తులు

కొంతమంది విశ్వాసం దేవుని హృదయంలో ఎప్పుడూ గుర్తింపు పొందదు. మరో మాటలో చెప్పాలంటే, వారిని తన అనుచరులుగా దేవుడు గుర్తించడు, ఎందుకంటే ఆయన వారి నమ్మకాలను మెచ్చుకోడు. ఈ వ్యక్తులు, ఎన్ని సంవత్సరాలు దేవుడిని అనుసరించినప్పటికీ, వారి ఆలోచనలు మరియు అభిప్రాయాలు ఎప్పుడూ మారలేదు; అవిశ్వాసుల సూత్రాలకు, పనులను చేసే మార్గాలకు మరియు అవిశ్వాసుల మనుగడ మరియు నమ్మకం చట్టాలకు కట్టుబడుతూ, వారు అవిశ్వాసుల లాగే ఉంటారు. వారు దేవుని వాక్యమును తమ జీవితంగా ఎన్నడూ అంగీకరించలేదు, దేవుని వాక్యము సత్యమని ఎప్పుడూ విశ్వసించలేదు, దేవుని రక్షణను అంగీకరించాలని ఎప్పుడూ కోరుకోలేదు మరియు దేవుడిని తమ దేవుడిగా ఎప్పుడూ గుర్తించలేదు. దేవుడిని విశ్వసించడమంటే, ఒక రకమైన ఔత్సాహిక అభిరుచిగా వారు చూస్తారు, ఆయనను కేవలం ఆధ్యాత్మిక బతుకుదెరువుగా భావిస్తారు; కాబట్టి, దేవుని స్వభావం లేదా గుణగణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం తగిదని వారు అనుకోరు. నిజమైన దేవునికి సంబంధించిన అన్నింటితో ఈ వ్యక్తులకు ఏమీ సంబంధం లేదు; వారికి ఆసక్తి లేదు లేదా వారు దానిని పట్టించుకోవాలని ఆలోచించలేరు. ఎందుకంటే, వారి హృదయపు లోతులలో, “దేవుడు కంటికి కనిపించనివాడు, స్పృశించలేనివాడు మరియు ఉనికిలో లేనివాడు” అని ఎప్పుడూ ప్రబలంగా చెప్పే ఒక స్వరం ఉంది. ఈ రకమైన దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం తమ ప్రయత్నాలకు తగినది కాదని, అలా చేయడం ద్వారా వారు తమను తాము మోసం చేసుకుంటారని వారు విశ్వసిస్తారు. నిజమైన పక్షాన్ని వహించకుండా లేదా నిజమైన పనులలో తమను తాము వెచ్చించకుండా కేవలం మాటలతో దేవుడిని గుర్తించడం ద్వారా తాము చాలా తెలివైన వారమని వారు విశ్వసిస్తారు. అలాంటి వారిని దేవుడు ఎలా చూస్తాడు? ఆయన వారిని అవిశ్వాసులుగానే చూస్తాడు. “అవిశ్వాసులు దేవుని వాక్యములను చదవగలరా? వారు వారి విధులను పూర్తిచేయగలరా? ‘నేను దేవుని కోసం జీవిస్తాను’ అని వారు చెప్పగలరా?” అని కొంతమంది అడుగుతారు. మనుష్యులు ఎక్కువగా చూసేది ప్రజలు పైపైన ప్రదర్శించే వాటినే; వారికి ప్రజల గుణగణాలు కనిపించవు. అయితే, దేవుడు ఈ పైపై ప్రదర్శనలను చూడడు; ఆయన వారి అంతర్గత గుణగణాలను మాత్రమే చూస్తాడు. కాబట్టి, దేవుడికి ఈ ప్రజల పట్ల ఈ రకమైన వైఖరి మరియు నిర్వచనం ఉన్నాయి. “దేవుడు ఇలా ఎందుకు చేస్తాడు? దేవుడు అలా ఎందుకు చేస్తాడు? నేను ఇది అర్థం చేసుకోలేను; నేను అది అర్థం చేసుకోలేను; ఇది మానవ ఆలోచనలకు అనుగుణంగా లేదు; నీవు దానిని తప్పక నాకు వివరించాలి…” అని ఈ ప్రజలు అంటారు. దీనికి జవాబుగా, నేను అడుగుతున్నాను: నీకు ఈ విషయాలను వివరించడం నిజంగా అవసరమా? ఈ విషయాలతో నీకు అసలేమైనా సంబంధం ఉందా? నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు? నీవు ఎక్కడ నుండి వచ్చావు? దేవుడిని ఎత్తి చూపడానికి నీకు నిజంగా అర్హత ఉందా? నీకు ఆయన పట్ల విశ్వాసం ఉందా? ఆయన నీ విశ్వాసాన్ని గుర్తిస్తాడా? నీ విశ్వాసంతో దేవునికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఆయన చేసే పనులతో నీకు సంబంధం ఏమిటి? దేవుని హృదయంలో నీ స్థానం ఎక్కడో నీకు తెలియదు, కాబట్టి ఆయనతో సంభాషించడానికి నీవు ఎలా అర్హుడివి కాగలవు?

మందలింపు మాటలు

ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత మీకు ఇబ్బందిగా లేదా? మీరు వాటిని వినాలని అనుకోకపోవచ్చు లేదా వాటిని అంగీకరించాలనీ అనుకోకపోవచ్చు, కానీ అవన్నీ వాస్తవాలే. ఎందుకంటే, కార్యపు ఈ దశను దేవుడు చేయవలసి ఉంది కాబట్టి, నీవు ఆయన ఉద్దేశాలను గురించి ఆలోచించకపోతే, ఆయన వైఖరి గురించి పట్టించుకోకపోతే, ఆయన గుణగణాలు మరియు స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే, అప్పుడు చివరకు నష్టపోయేది నీవే. వినడానికి కష్టంగా ఉన్నందున నా మాటలను నిందించకండి మరియు మీ ఉత్సాహాన్ని నీరుగార్చినందుకు వాటిని నిందించకండి. నేను వాస్తవం మాట్లాడుతున్నాను; మిమ్మల్ని నిరుత్సాహపరచడం నా ఉద్దేశం కాదు. నేను మిమ్మల్ని ఏమి అడిగిగాను, మీరు దానిని ఎలా చేయాల్సి ఉంది అనేదానితో సంబంధం లేకుండా, మీరు సరైన మార్గంలో నడుస్తారనీ, దేవుని మార్గాన్ని అనుసరిస్తారనీ మరియు మీరు సరైన మార్గం నుండి ఎప్పుడూ పక్కకు వెళ్లరనీ నేను ఆశిస్తున్నాను. నీవు దేవుని వాక్యమునకు అనుగుణంగా ముందుకు సాగకపోతే లేదా ఆయన మార్గాన్ని అనుసరించకపోతే, నీవు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావనీ మరియు సరైన మార్గం నుండి పక్కకు వెళ్లిపోయావనీ అనుకోవడంలో సందేహం ఉండనక్కరలేదు. కాబట్టి, నేను మీకు తప్పక స్పష్టం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను మరియు నేను తప్పక మీరు నిస్సందేహంగా, స్పష్టంగా మరియు అసందిగ్ధతకు తావు లేకుండా విశ్వసించేలా చేయాలి మరియు దేవుని వైఖరి, ఆయన ఉద్దేశాలు, ఆయన మానవులను ఎలా పరిపూర్ణులను చేస్తాడు మరియు ప్రజల ఫలితాలను ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేవాటి గురించి స్పష్టమైన అవగాహన పొందడానికి మీకు సహాయం చేయాలి. నీవు ఈ మార్గంలో అడుగు పెట్టలేని రోజు వస్తే, అప్పుడది నా బాధ్యత కాదు, ఎందుకంటే ఈ మాటలను ఇప్పటికే నీకు చాలా స్పష్టంగా చెప్పాను. నీ సొంత ఫలితంతో నీవు ఎలా వ్యవహరిస్తావు అనేది, పూర్తిగా నీకు సంబంధించిన విషయమే. భిన్న రకాల వ్యక్తుల ఫలితాల విషయంలో, దేవునికి భిన్నమైన వైఖరులు ఉన్నాయి, వారిని తూకం వేయడానికి ఆయనకు సొంత మార్గాలు ఉన్నాయి, అలాగే వారికి అవసరమైన తన సొంత ప్రమాణాలు కూడా ఉన్నాయి. మనుష్యుల ఫలితాలను తూకం వేసే ఆయన ప్రమాణం అందరి పట్ల న్యాయంగా ఉంటుంది—అందులో ఎలాంటి సందేహం లేదు! కాబట్టి, కొందరి భయాలు అనవసరమైనవి. ఇప్పుడు మీకు ఉపశమనంగా ఉందా? ఇక ఈరోజుకి ఇంతే. సెలవు!

అక్టోబర్ 17, 2013

తరువాత:  దేవుడి కార్యము, దేవుడి స్వభావము మరియు స్వయంగా దేవుడు I

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger