ఈరోజు వరకు సమస్త మానవాళి ఎలా అభివృద్ధి చెందిందో నీవు తెలుసుకోవాలి

వివిధ యుగాలు వస్తూ పోతూ ఉండటం వల్ల ఆరు వేల యేండ్లలో కొనసాగించిన పని మొత్తం క్రమంగా మారిపోయింది. ఈ పనిలో మార్పులనేవి ప్రపంచపు మొత్తంమీది పరిస్థితి మరియు మొత్తంగా మానవాళి అభివృద్ధి ధోరణులపై ఆధారపడి ఉన్నాయి; దానికి అనుగుణంగానే నిర్వహణ కార్యము క్రమంగా మారింది. ఇదంతా సృష్టికి ప్రారంభం నుండి ప్రణాళికాబద్ధంగా జరగలేదు. లోకం సృష్టించబడక ముందు లేదా ఆతర్వాత అతి త్వరలో, యెహోవా ఇంకా కార్యపు మొదటి దశ అనగా, న్యాయ దశ; కార్యపు రెండవ దశ అనగా, కృపా దశ; లేదా కార్యపు మూడవ దశ అనగా, విజయపు దశ గురించి ప్రణాళిక చేయలేదు, ఇందులో ఆయన తొలుత మోయాబు వారసులలోని కొంతమందితో ప్రారంభించి, తద్వారా విశ్వం మొత్తాన్ని జయించాడు. లోకాన్ని సృష్టించిన తర్వాత, ఆయన ఈ మాటలు ఎప్పుడూ చెప్పలేదు లేదా మోయాబు తర్వాత వాటిని ఆయన ఎప్పుడూ చెప్పలేదు; నిజానికి, లోత్‌కు ముందు, వాటిని ఆయన ఎప్పుడూ ఉచ్చరించలేదు. దేవుడి కార్యములన్నీ అకస్మాత్తుగానే జరిగాయి. ఆయన ఆరు వేల సంవత్సరాల నిర్వహణ కార్యము మొత్తం సరిగ్గా ఇలాగే అభివృద్ధి చెందింది; ప్రపంచాన్ని సృష్టించే ముందు, “మానవాళి అభివృద్ధి కోసం సారాంశ చార్టు” వంటి రూపంలో ఆయన అలాంటి ప్రణాళిక ఏదీ రాసుకోలేదు. దేవుడి కార్యంలో, ఆయన అంటే ఏమిటో నేరుగా వ్యక్తపరుస్తాడు; ఒక ప్రణాళికను రూపొందించడానికి ఆయన తన మెదడును కష్టపెట్టడు. అవును, చాలా కొద్దిమంది ప్రవక్తలు అనేక గొప్ప భవిష్యవాణులు చెప్పారు, అయితే దేవుడి కార్యము ఎల్లప్పుడూ ఒక ఖచ్చితమైన ప్రణాళికతో కూడుకున్నదని ఇప్పటికీ చెప్పలేము; ఆ భవిష్యవాణులు ఆ సమయంలో దేవుని కార్యము ప్రకారం చేయబడ్డాయి. ఆయన చేసే కార్యమంతా అత్యంత వాస్తవమైన కార్యము. ఆయన దానిని ప్రతి యుగం అభివృద్ధికి అనుగుణంగా చేపడతాడు మరియు దానిని మారే పరిస్థితులపై ఆధారపడి చేస్తాడు. ఆయనకు, కార్యమును చేపట్టడం అంటే ఒక అనారోగ్యానికి తగిన ఔషధాన్ని ఇవ్వడం వంటిది; కార్యమును చేస్తున్నప్పుడు, ఆయన స్వీయ పరిశీలన చేస్తాడు మరియు తన పరిశీలనలకు అనుగుణంగా తన కార్యమును కొనసాగిస్తాడు. తన కార్యపు ప్రతి దశలోనూ, తన విస్తారమైన జ్ఞానం మరియు సామర్థ్యాన్ని దేవుడు ప్రదర్శించగలడు; ఆయన ఏదైనా నిర్దిష్ట కాలపు కార్యము ప్రకారం తన అపారమైన జ్ఞానం మరియు అధికారాన్ని వెల్లడిస్తాడు మరియు ఆ కాలములో ఆయన తిరిగి తీసుకువచ్చిన వారందరినీ తన సమగ్ర స్వభావాన్ని చూడటానికి అనుమతిస్తాడు. ఆయన చేయవలసిన కార్యమును చేస్తూ, ప్రతి కాలంలో చేయవలసిన కార్యమునకు అనుగుణంగా ప్రజల అవసరాలను తీరుస్తాడు. సాతాను మనుష్యులను చెడగొట్టిన స్థాయిని బట్టి వారికి అవసరమైన వాటిని ఆయన సరఫరా చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే, ప్రారంభంలో యెహోవా ఆదాము మరియు హవ్వలను సృష్టించినప్పుడు, వారు భూమిపై దేవుడిని సాక్షాత్కారం చేయగలిగేలా, తద్వారా వారు సృష్టిలో దేవుడికి సాక్ష్యమివ్వగలిగేలా ఆయన వారి సృష్టి చేశాడు. అయితే, సర్పముచే ప్రలోభపెట్టబడిన తర్వాత హవ్వ పాపం చేసింది, ఆదాము కూడా అదే చేశాడు; తోటలో, మంచి చెడ్డల జ్ఞానాన్నిచ్చే చెట్టు ఫలాలను వారిద్దరూ తిన్నారు. కాబట్టి, యెహోవాకు వారి మీద అదనపు కార్యము చేయవలసి వచ్చింది. వారి నగ్నత్వాన్ని చూసి, ఆయన జంతు చర్మాలతో తయారైన దుస్తులతో వారి శరీరాలను కప్పాడు. ఆతర్వాత, ఆయన ఆదాముతో ఇలా చెప్పాడు: “ఆయన ఆదాముతో–నీవు నీ భార్యమాట విని–తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;౹ 18అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;౹ 19నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.” స్త్రీతో ఆయన ఇలా చెప్పాడు, “నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.” అప్పటి నుండి, ఆయన వారిని ఏదేను వనం నుండి బహిష్కరించాడు మరియు ఇప్పుడు ఆధునిక మానవుడు భూమిపై నివసిస్తున్నట్లుగానే వారిని దాని వెలుపల నివసించేలా చేసాడు. ఆదిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, సృష్టించబడిన తర్వాత మనిషిని సర్పంతో ప్రలోభపెట్టడం, ఆతర్వాత మనిషిని మరియు సర్పాన్ని శపించడం ఆయన ప్రణాళిక కాదు. వాస్తవానికి ఆయనకు అలాంటి ప్రణాళిక లేదు; ఇది కేవలం పరిస్థితులు మారిన విధానం కారణంగానే ఆయనకు తన సృష్టిలో కొత్త కార్యాన్ని చేయవలసి వచ్చింది. యెహోవా భూమిపై ఆదాము మరియు హవ్వల విషయంలో ఈ కార్యము పూర్తి చేసిన తర్వాత, మానవాళి అనేక వేల సంవత్సరాలు అభివృద్ధి చెందుతూనే ఉంది, “నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. … అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను”. ఈ సమయంలో చేయడానికి యెహోవాకు మరింత కొత్త కార్యము ఉంది. ఎందుకంటే, ఆయన సృష్టించిన మానవాళి సర్పంతో ప్రలోభపెట్టబడిన తర్వాత వారిలో చెడుతనం చాలా పెరిగింది. ఈ పరిస్థితులలో, మొత్తం మానవాళిలో రక్షించడానికి నోవహు కుటుంబాన్ని యెహోవా ఎంచుకున్నాడు, ఆతర్వాత ప్రపంచాన్ని ప్రళయంలో ముంచివేసే కార్యమును చేపట్టాడు. ఈ విధంగా మానవాళి ఈరోజు వరకు అభివృద్ధి చెందుతూనే ఉంది, చెడు అంతకంతకూ పెరుగుతోంది మరియు మానవాభివృద్ధి పరాకాష్టకు చేరుకునే సమయం వచ్చినప్పుడు, అదే మానవాళి అంతమని అర్థం. ఆది నుండి ప్రపంచం అంతం వరకు, ఆయన కార్యపు అంతర్గత సత్యం ఎల్లప్పుడూ అలాగే ఉంటూ వచ్చింది మరియు ఎల్లప్పుడూ ఈ విధంగానే ఉంటుంది. ఇది మనుష్యులు వారి రకం ప్రకారం ఎలా వర్గీకరించబడతారో అదే విధంగా ఉంటుంది; ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి చెందాలని ఆదిలోనే ముందుగా నిర్ణయించిన దానికి భిన్నంగా ఉంది; దానికి బదులుగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి ప్రక్రియలో పాల్గొన్న తర్వాత మాత్రమే క్రమక్రమముగా వర్గీకరించబడతారు. చివరలో, పూర్తి విమోచనకు తీసుకురాలేని ఎవరినైనా వారి “పూర్వీకుల” వద్దకు తిరిగి పంపబడతారు. మానవాళిలో దేవుడి కార్యము ఏదీ లోకం సృష్టించబడినప్పుడు అప్పటికే తయారు చేయబడలేదు. దానికి బదులుగా, మారుతున్న పరిస్థితులే మానవాళి మధ్య దేవుడు తన కార్యమును అంచెలంచెలుగా మరియు మరింత వాస్తవిక మరియు వ్యావహారిక విధానంలో చేయడానికి వీలుకల్పించాయి. ఉదాహరణకు, దేవుడైన యెహోవా స్త్రీని ప్రలోభపెట్టడం కోసం సర్పాన్ని సృష్టించలేదు; అది ఆయన నిర్దిష్ట ప్రణాళిక కాదు లేదా ఆది ఆయన ఉద్దేశపూర్వకంగా ముందుగా నిర్ణయించినది ఏదీ కాదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పవచ్చు. ఆవిధంగా, ఈ కారణం చేతనే యెహోవా ఏదేను వనం నుండి ఆదాము మరియు హవ్వలను బహిష్కరించాడు మరియు ఇక ఎప్పుడూ మనిషిని సృష్టించనని ప్రమాణం చేశాడు. అయితే, మనుష్యులు దేవుడి జ్ఞానాన్ని ఈ పునాదిపై మాత్రమే అన్వేషిస్తారు. ఇది సరిగ్గా నేను ఇంతకు ముందు చెప్పినట్లే ఉంది: “నేను సాతాను కుతంత్రాలపై ఆధారపడి నా జ్ఞానాన్ని ఉపయోగిస్తాను.” మానవాళి ఎంత చెడిపోయింది లేదా సర్పం వారిని ఎలా ప్రలోభపెట్టింది అనేదానితో సంబంధం లేకుండా, యెహోవాకు ఇంకా తన జ్ఞానం ఉంది; కాబట్టి, లోకాన్ని సృష్టించినప్పటి నుండి ఆయన నూతన కార్యములో లీనమై ఉన్నాడు మరియు ఈ కార్యపు దశలు ఏవీ ఎప్పుడూ పునరావృతం చేయబడలేదు. సాతాను నిరంతరాయంగా కుతంత్రాలు పన్నుతూ, మానవాళిని ఎగతెగకుండా చెడగొడుతూ ఉంది మరియు దేవుడైన యెహోవా తన వివేకవంతమైన కార్యమును నిరంతరాయంగా కొనసాగించాడు. లోకం సృష్టించబడినప్పటి నుండి ఆయన ఎప్పుడూ ఓటమి చెందలేదు లేదా కార్యము చేయడం ఆపివేయలేదు. మానవులందరినీ సాతాను చెడగొట్టిన తర్వాత, వారి చెడుదనానికి మూలమైన శత్రువును ఓడించడానికి ఆయన వారి మధ్య కార్యము నిర్వహిస్తూనే ఉన్నాడు. తొలి నుండే ఈ యుద్ధం చెలరేగింది మరియు లోకం అంతమయ్యే వరకు కొనసాగుతుంది. దేవుడైన యెహోవా ఈ కార్యమునంతా చేయడం ద్వారా సాతాను చేత చెడగొట్టబడిన మానవులు తన గొప్ప రక్షణ పొందడానికి అనుమతించడమే కాకుండా, తన జ్ఞానాన్ని, పరాక్రమాన్ని మరియు అధికారాన్ని చూసేందుకు కూడా ఆయన అనుమతించాడు. అంతేకాకుండా, చివరలో, ఆయన దుష్టులను శిక్షించి మరియు మంచివారికి ప్రతిఫలమిచ్చి తన నీతివంతమైన స్వభావాన్ని వారు చూడటానికి అనుమతిస్తాడు. ఈరోజు వరకూ ఆయన సాతానుతో యుద్ధం చేశాడు మరియు ఎన్నడూ ఓటమి చెందలేదు. ఎందుకంటే జ్ఞానంగల దేవుడు మరియు సాతాను కుతంత్రాలనుబట్టి ఆయన తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. అందుచేత, దేవుడు పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కటీ తన అధికారానికి లోబడి ఉండేలా చేయడం మాత్రమే కాకుండా, భూమిపై ఉన్న ప్రతి ఒక్కటీ ఆయన పాదపీఠం క్రింద ఉంచాడు మరియు కనీసంలో కనీసంగా, మానవాళిపై దాడి చేసే, వేధించే దుష్టులను తన శిక్షకు పాత్రులను చేస్తాడు. ఈ కార్యములన్నింటి ఫలితాలు ఆయన జ్ఞానం వల్లనే కలుగుతాయి. మానవాళి అస్థిత్వానికి ముందు ఆయన తన జ్ఞానాన్ని బయలుపరలేదు, ఎందుకంటే ఆయనకు పరలోకంలో, భూమి మీద లేదా సమస్త విశ్వంలో ఎక్కడా శత్రువులు లేరు మరియు ప్రకృతిలో దేనినైనా ఆక్రమించే చీకటి శక్తులు లేవు. ప్రధాన దేవదూత ఆయనకు నమ్మకద్రోహం చేసిన తర్వాత, ఆయన భూమిపై మానవాళిని సృష్టించాడు మరియు మానవాళి కోసమే ఆయన ప్రధాన దేవదూత అయిన సాతానుతో అధికారికంగా తన వెయ్యేండ్ల యుద్ధాన్ని మొదలుపెట్టాడు—ఈ యుద్ధం ప్రతి క్రమానుసార దశలో ఇంకా వేడెక్కుతుంది. ఈ దశలు ప్రతిదానిలో ఆయన పరాక్రమం మరియు జ్ఞానం ఉన్నాయి. అప్పుడు మాత్రమే పరలోకంలో, భూమిపై ఉన్న ప్రతిదీ దేవుడి జ్ఞానాన్ని, పరాక్రమం మరియు ప్రత్యేకించి దేవుడి నిజతత్వాన్ని చూసింది. అయినా ఇప్పటికీ ఆయన ఇదే వాస్తవిక విధానంలో తన కార్యమును కొనసాగిస్తున్నాడు; అంతేకాకుండా, తన కార్యము నిర్వహిస్తున్నప్పుడు, ఆయన తన జ్ఞానం మరియు పరాక్రమాన్ని కూడా బహిర్గతం చేస్తాడు. ఆయన కార్యపు ప్రతి దశలోని అంతర్గత సత్యాన్ని చూడటానికి, దేవుడి పరాక్రమాన్ని ఖచ్చితంగా ఎలా వివరించాలో చూడటానికి మరియు దేవుడి నిజతత్వపు ఖచ్చితమైన వివరణను చూడటానికి ఆయన మిమ్మల్ని అనుమతిస్తాడు.

జుడాస్ యేసుకు చేసిన నమ్మకద్రోహం గురించి, కొందరు ఆశ్చర్యపోతారు: ఇది లోకం సృష్టించబడటానికి ముందే నిర్ణయించబడలేదా? వాస్తవానికి, ఆ సమయపు నిజతత్వాన్ని బట్టి పరిశుద్ధాత్మ ఈ ప్రణాళికలను యోచించింది. జుడాస్ అనే పేరుతో ఎప్పుడూ నిధులు అపహరించేవాడు ఒకడు ఉండటం అనేది చాలా యాదృచ్ఛికంగా జరిగింది, అందుకే ఈ పాత్రను పోషించడానికి మరియు ఈ విధంగా సేవ చేయడానికి ఈ వ్యక్తి ఎంచుకోబడ్డాడు. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక నిజమైన ఉదాహరణ. మొదట యేసుకు దీనిని గురించి తెలియదు; జుడాస్ బహిర్గతం చేయబడిన తర్వాతనే ఆయనకు దీని గురించి తెలిసింది. ఈ పాత్రను వేరే వ్యక్తి ఎవరైనా పోషించగలిగి ఉంటే, జుడాస్‌కు బదులు ఆ వ్యక్తి ఈ పాత్రను పోషించి ఉండేవాడు. వాస్తవానికి, ఆ క్షణంలో పరిశుద్ధాత్మ చేసినదే, ముందుగా నిర్ణయించబడినది. పరిశుద్ధాత్మ కార్యము ఎల్లప్పుడూ సహజంగానే జరుగుతుంది; ఆయన తన కార్యాన్ని ఎప్పుడైనా ప్రణాళిక చేయగలడు మరియు దానిని ఎప్పుడైనా నిర్వహించగలడు. పరిశుద్ధాత్మ కార్యము వాస్తవికమైనదని మరియు అది ఎల్లప్పుడూ కొత్తదని, ఎప్పటికీ పాతది కాదని మరియు ఎల్లప్పుడూ అత్యున్నత స్థాయిలో తాజాగా ఉంటుందని నేను ఎందుకు ఎల్లప్పుడూ చెబుతానో తెలుసా? లోకం సృష్టించబడినప్పుడు ఆయన కార్యము అప్పటికే ప్రణాళిక చేయబడలేదు; అస్సలు జరిగింది అది కాదు! కార్యపు ప్రతి దశ దానికి సమయం వచ్చినప్పుడు తగినట్లు అమలులోకి వస్తుంది మరియు ఈ దశలు ఒకదానితో ఒకటి జోక్యం చేసుకోవు. చాలాసార్లు, మీ మనసులో ఉన్న ప్రణాళికలు పరిశుద్ధాత్మ తాజా కార్యమునకు అసలు సరిపోవు. ఆయన కార్యము మనుష్యులు తర్కించేటంత సులభమైంది కాదు, ఇది మనుష్యులు ఊహించేటంత సంక్లిష్టమైనది కూడా కాదు—ఇందులో ప్రజలకు వారి అప్పటి అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైనా మరియు ఎక్కడైనా సరఫరా చేయడం ఉంటుంది. మానవుల గుణగణాల గురించి ఆయన కంటే స్పష్టంగా ఎవరికీ తెలియదు మరియు ఆయన కార్యము సరిపోయినంత బాగా ప్రజల వాస్తవిక అవసరాలకు మరేదీ సరిపోలేకపోవడానికి సరిగ్గా ఇదే కారణం. కాబట్టి, మనుష్యల దృష్టికోణంతో చూస్తే, ఆయన కార్యము ఎన్నో వేల ఏండ్ల ముందుగానే ప్రణాళిక చేయబడినట్టు అనిపిస్తుంది. ఆయన ఇప్పుడు మీ మధ్య కార్యము నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ మరియు మాట్లాడుతూ మీరు ఏ స్థితులలో ఉన్నారో ఆయన గమనిస్తాడు, అన్ని రకాల స్థితులను ఎదుర్కొన్నప్పుడు, ప్రజలకు ఖచ్చితంగా అవసరమైన మాటలను చెప్పడానికి ఆయన వద్ద సరిగ్గా సరిపోయే పదాలు ఉన్నాయి. ఆయన కార్యములో మొదటి దశను తీసుకోండి: శిక్ష విధించే సమయం. ఆతర్వాత, దేవుడు తన కార్యాన్ని ప్రజలు వ్యక్తపరచిన వాటి ఆధారంగా చేశాడు, వారి తిరుగుబాటు, వారి నుండి వచ్చిన సానుకూల స్తితి మరియు ప్రతికూల స్థితి అలానే ఆ ప్రతికూల స్థితులు ఒక స్థాయికి చేరుకున్నప్పుడు ప్రజలు ఎంత హీన స్థితికైనా దిగజారగలరు; మరియు ఆయన కార్యము నుండి మరింత ఉత్తమ ఫలితాన్ని పొందడానికి ఆయన వీటిని ఆధారం చేసుకున్నాడు అంటే, ఆయన ఏ సమయంలోనైనా ప్రజల ప్రస్తుత స్థితిపై ఆధారపడి వారి మధ్యన సుస్థిరమైన కార్యము నిర్వహిస్తాడు; ఆయన తన కార్యపు ప్రతి దశను ప్రజల వాస్తవ స్థితికి అనుగుణంగా నిర్వహిస్తాడు. సమస్త సృష్టి ఆయన చేతుల్లోనే ఉంది; మరి, ఆయన వారిని ఎందుకు తెలుసుకోలేడు? ప్రజల స్థితులకు అనుగుణంగా కొనసాగించవలసిన కార్యపు తదుపరి దశను దేవుడు ఎప్పుడైనా, ఎక్కడైనా నిర్వహిస్తాడు. ఏరకంగా చూసినా ఈ కార్యము వేల సంవత్సరాల ముందే ప్రణాళిక చేయబడలేదు; మనుష్యులే అలా అనుకుంటున్నారు! ఆయన తన కార్యపు ప్రభావాలను గమనిస్తూ దానికనుగుణంగా పని చేస్తాడు మరియు ఆయన కార్యము నిరంతరం లోతుగా వెళ్తుంది మరియు అభివృద్ధి చెందుతుంది; తన కార్యపు ఫలితాన్ని గమనించిన ప్రతిసారీ, ఆయన తన కార్యపు తదుపరి దశను అమలు చేస్తాడు. ఆయన క్రమక్రమంగా పరివర్తన చెందడానికి మరియు కాలక్రమేణా తన కొత్త కార్యము ప్రజలకు అగుపించేలా చేయడానికి అనేక విషయాలను ఉపయోగిస్తాడు. ఈ విధంగా పని చేయడం అనేది ప్రజల అవసరాలను తీర్చగలదు, ఎందుకంటే దేవుడికి ప్రజల గురించి చాలా బాగా తెలుసు. ఈ విధంగా ఆయన పరలోకం నుండి తన కార్యమును కొనసాగిస్తాడు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ మరియు మానవుల మధ్యలో పని చేస్తూ, అవతారమూర్తియైన దేవుడు తన కార్యమును ఇదే విధంగా చేస్తాడు. లోకం సృష్టించబడటానికి ముందు ఆయన కార్యము ఏదీ ఏర్పాటు చేయబడలేదు లేదా అది ముందుగానే జాగ్రత్తగా ప్రణాళిక చేయబడలేదు. లోకం సృష్టించబడిన రెండు వేల సంవత్సరాల తర్వాత, న్యాయకాలము ముగిసిన తర్వాత కృపాకాలంలో మానవాళిని తిరిగి పొందడానికి యెహోవా తన కార్యమును కొనసాగిస్తాడు అని యెషయా ప్రవక్త చెప్పిన భవిష్యవాణి మాటలను యెహోవా ఉపయోగించవలసినంతగా మానవత్వం చెడిపోయినట్లు ఆయన చూస్తాడు. అవును, ఇది యెహోవా ప్రణాళికే కానీ, ఈ ప్రణాళిక కూడా ఆయన ఆ కాలంలో గమనించిన పరిస్థితుల ప్రకారం తయారు చేయబడింది; ఆదామును సృష్టించిన తర్వాత వెనువెంటనే ఆయన ఖచ్చితంగా దాని గురించి ఆలోచించలేదు. యెషయా కేవలం భవిష్యత్ వాణిని మాత్రమే చెప్పాడు, కానీ న్యాయకాలములో యెహోవా ఈ కార్యం కోసం ముందస్తు సన్నాహాలు ఏమీ చేయలేదు; దానికి బదులుగా, దేవుడు శరీరధారిగా మారుతాడనీ మరియు అప్పుడు మాత్రమే శరీరధారిగా అవతరించిన ఆయన కార్యము ప్రారంభమవుతుందని సందేశంతో జోసెఫ్‌కు జ్ఞానోదయం కలిగించడానికి అతని కలలో దేవదూత కనిపించినప్పుడు యెహోవా కృపాకాలము ప్రారంభంలో దానిని కార్యరూపంలో పెట్టాడు. ప్రజలు ఊహించినట్లుగా దేవుడు, లోకాన్ని సృష్టించిన వెంటనే శరీరధారిగా అవతరించిన తన కార్యానికి సిద్ధపడలేదు; మానవాళి ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది మరియు సాతానుకు వ్యతిరేకంగా ఆయన యుద్ధం ఏ స్థితిలో ఉందనే దానిని బట్టి మాత్రమే అది నిర్ణయించబడింది.

దేవుడు శరీరధారి అయినప్పుడు, ఆయన ఆత్మ ఒక మనుష్యునిలోకి దిగుతుంది; మరో మాటలో చెప్పాలంటే, దేవుడి ఆత్మ తనంతటతాను భౌతిక శరీరాన్ని ధరిస్తుంది. ఆయన భూమిపై తన కార్యము చేయడానికి వస్తాడు, అంతేగానీ ఆయనతో పాటు కొన్ని పరిమిత చర్యలను తీసుకురావడానికి కాదు; ఆయన కార్యము పూర్తిగా అపరిమితమైనది. శరీరం లోపల పరిశుద్ధాత్మ చేసే కార్యము ఇప్పటికీ ఆయన కార్యపు ఫలితాలపై నిర్ణయించబడుతుంది మరియు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసే కార్యపు సమయం వ్యవధిని నిర్ణయించడానికి అలాంటి వాటిని ఆయన ఉపయోగిస్తాడు. ఆయన ముందుకు సాగుతున్నప్పుడు ఆయన కార్యాన్ని పరిశీలిస్తూ పరిశుద్ధాత్మ తన కార్యపు ప్రతి దశను నేరుగా వెల్లడిస్తుంది; ఈ కార్యము మనుష్యుల ఊహా పరిమితులను విస్తరింపజేసేంత అతీంద్రియమైనది కాదు. ఇది భూమ్యాకాశములు మరియు సమస్తాన్ని సృష్టించడంలో యెహోవా చేసిన కార్యములాగే ఉంది; ఆయన ఏకకాలంలో ప్రణాళిక చేసి, పనిచేశాడు. ఆయన అంధకారం నుండి వెలుగును వేరు చేశాడు, ఉదయం మరియు సాయంత్రం ఉనికిలోకి వచ్చాయి—దీనికి ఒక రోజు పట్టింది. రెండవ రోజు, ఆయన ఆకాశాన్ని సృష్టించాడు మరియు దానికి కూడా ఒక రోజు పట్టింది; ఆతర్వాత ఆయన భూమిని, సముద్రాలను మరియు వాటిలో జీవించే అన్ని జీవులను సృష్టించాడు, దీనికి మరో రోజు అవసరమైంది. దేవుడు మనిషిని సృష్టించి, భూమిపై ఉన్న సమస్తాన్ని అతను నిర్వహించేలా చేయడం కోసం ఇది ఆరవ రోజు వరకు కొనసాగింది. ఆతర్వాత, ఆయన సమస్తాన్ని సృష్టించడాన్ని పూర్తిచేసిన తర్వాత, ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఏడవ రోజును ఆశీర్వదించాడు మరియు దానికి పరిశుద్ధ దినముగా పేరు పెట్టాడు. ఆయన సమస్తాన్ని సృష్టించిన తర్వాత మాత్రమే ఈ పరిశుద్ధ దినమును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు, అంతేగానీ వాటిని సృష్టించడానికి ముందు కాదు. ఈకార్యము కూడా అనుకోకుండా కొనసాగించబడింది; సమస్తాన్ని సృష్టించడానికి ముందు, ఆరు రోజులలో లోకాన్ని సృష్టించాలనీ మరియు ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలనీ ఆయన ముందే నిర్ణయించుకోలేదు; అలాంటి పనికి వాస్తవాలతో ఏమాత్రం పొంతన లేదు. ఆయన అలాంటి విషయాన్ని ప్రకటించలేదు లేదా ప్రణాళిక చేయలేదు. సమస్త సృష్టి ఆరవ రోజున పూర్తవుతుందని మరియు ఆయన ఏడవ రోజు విశ్రాంతి తీసుకుంటాడని ఆయన ఏరకంగానూ చెప్పలేదు; దానికి బదులుగా, ఆయనకు ఆ సమయంలో ఏది మంచి అనిపిస్తే ఆప్రకారమే సృష్టించాడు. ప్రతిదీ సృష్టించడం ఆయన పూర్తి చేసేటప్పటికే ఆరవ రోజు అయింది. ప్రతిదీ సృష్టించడం పూర్తవ్వడం ఒకవేళ ఐదవ రోజున జరిగి ఉంటే, ఆయన ఆరవ రోజును పరిశుద్ధ దినముగా ప్రకటించి ఉండేవాడు. అయితే, వాస్తవానికి సమస్తమును సృష్టించడం ఆయన ఆరవ రోజున పూర్తి చేశాడు, అందువల్ల ఏడవ రోజు పరిశుద్ధ దినముగా మారింది, అది ఈరోజు వరకూ కొనసాగుతూనే ఉంది. కాబట్టి, ఆయన ప్రస్తుత కార్యము ఈవిధంగా కొనసాగుతూనే ఉంది. ఆయన మీ పరిస్థితులకు అనుగుణంగా మీ అవసరాల కోసం మాట్లాడతాడు మరియు సమకూరుస్తాడు. అంటే, ప్రజల పరిస్థితులకు అనుగుణంగా ఆత్మ మాట్లాడుతుంది మరియు పని చేస్తుంది; ఆయన అన్నింటిని గమనిస్తూ ఉంటాడు మరియు ఎప్పుడైనా, ఎక్కడైనా పని చేస్తాడు. నేను చేసేది, చెప్పేది, మీకు సమకూర్చేది మరియు మీకు ప్రసాదించేది, ఎలాంటి మినహాయింపు లేకుండా, మీకు అవసరమైనవే. కాబట్టి, నా కార్యము ఏదీ నిజతత్వానికి భిన్నమైనది కాదు; ఇదంతా వాస్తవం, ఎందుకంటే “దేవుని ఆత్మ సమస్తాన్ని గమనిస్తూ ఉంటుంది” అని మీకందరికీ తెలుసు. ఒకవేళ ఇవన్నీ ముందుగానే నిర్ణయించబడి ఉంటే, ఇది మరీ అనాసక్తికరంగా మరియు చప్పగా ఉండేది కాదా? దేవుడు ఆరువేల ఏండ్ల పాటు ప్రణాళికలు రూపొందించి, ఆతర్వాత మానవాళిని తిరుగుబాటుదారులుగా, ప్రతిఘటించేవారుగా, వంకర బుద్ధిగలవారుగా మరియు మోసగాళ్లుగా మరియు సాతాను స్వభావమైన శారీరక అవినీతి, కండ్లలో కామం మరియు వ్యక్తిగత భోగలాలస కలిగి ఉండాలని ముందుగానే నిర్ణయించినట్లు మీరు అనుకుంటారు. వాటిలో దేనినీ దేవుడు ముందుగా నిర్ణయించలేదు, అయితే ఇదంతా సాతాను చెరుపు ఫలితంగా జరిగింది. కొందరు అనవచ్చు, “సాతాను కూడా దేవుడి అధీనంలోని వాడే కదా? సాతాను ఈవిధంగా మనిషిని చెరుపుతుందని దేవుడు ముందే నిర్ణయించాడు, ఆతర్వాతే, దేవుడు తన కార్యాన్ని మనుషుల మధ్య కొనసాగించాడు.” మానవాళిని చెరపడానికి సాతానును నిజంగా దేవుడు ముందుగానే నిర్ణయించాడా? మానవాళి సాధారణంగా జీవించేలా అనుమతించడానికే దేవుడు చాలా ఆసక్తితో ఉన్నాడు, అలాంటప్పుడు ఆయన వారి జీవితాలలో నిజంగా జోక్యం చేసుకుంటాడా? అలా అయితే, సాతానును ఓడించడం మరియు మానవాళిని రక్షించడం అనేది అనవసర ప్రయత్నం కాదా? మానవాళి తిరుగుబాటు ముందుగా ఎలా నిర్ణయించబడగలదు? ఇది సాతాను జోక్యం చేసుకోవడం వల్ల జరిగిన ఒక విషయం, అలాంటప్పుడు ఇది దేవుడు ముందుగా నిర్ణయించింది ఎలా కాగలదు? మీరు భావించినట్లు దేవుడి ఆధీనంలో ఉండే సాతాను, నేను మాట్లాడే దేవుని ఆధీనంలో ఉండే దానికి చాలా భిన్నమైనది. మీ వ్యాఖ్యల ప్రకారం “దేవుడు సర్వశక్తిమంతుడు, సాతాను ఆయన చేతుల్లోనే ఉంది”, సాతాను ఆయనకు ఎప్పుడూ నమ్మకద్రోహం చేయలేదు. మీరు దేవుడు సర్వశక్తిమంతుడని చెప్పలేదా? మీ జ్ఞానం మరీ అమూర్తమైనది మరియు దీనికి నిజతత్వంతో సంబంధం లేదు; మనిషి ఎప్పుడూ దేవుని ఆలోచనలను గ్రహించలేడు లేదా ఆయన జ్ఞానాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు! దేవుడు సర్వశక్తిమంతుడు; అందులో ఏమాత్రం అసత్యము లేదు. దేవుడు ప్రారంభంలో ప్రధాన దేవదూతకు అధికారంలో వాటా ఇచ్చాడు కాబట్టి అతడు దేవునికి నమ్మకద్రోహం చేశాడు. అవును, హవ్వ సర్పము ప్రలోభానికి లొంగిపోయినట్లే, ఇది ఒక అనుకోని సంఘటన. అయితే, సాతాను తన నమ్మకద్రోహాన్ని ఎలా కొనసాగిస్తుంది అనేదానితో సంబంధం లేకుండా, అది ఇప్పటికీ దేవుడంత సర్వశక్తిమంతమైనది కాదు. మీరు చెప్పినట్లుగా, సాతాను కేవలం శక్తివంతమైనది; అది ఏమి చేసినప్పటికీ, దేవుడి అధికారం దానిని ఎల్లప్పుడూ ఓడిస్తుంది. “దేవుడు సర్వశక్తిమంతుడు, సాతాను ఆయన చేతుల్లో ఉంది” అనే మాట వెనుకనున్న నిజమైన అర్థం ఇదే. కాబట్టి, సాతానుతో యుద్ధం ఒక్కో సమయంలో ఒక్కో దశగా కొనసాగించబడాలి. అంతేకాకుండా, దేవుడు సాతాను కుట్రలకు ప్రతిస్పందనగా తన కార్యాన్ని ప్రణాళిక చేస్తాడు. అంటే, ఆయన మానవాళికి రక్షణ కల్పిస్తాడు మరియు ఆయన పరాక్రమం మరియు జ్ఞానాన్ని అప్పుడున్న కాలానికి తగినట్టుగా వెల్లడిస్తాడు. ఆవిధంగానే, కృపా కాలానికి ముందు అంత్యకాలపు కార్యము ముందుగా నిర్ణయించబడలేదు; ముందుగా నిర్ణయించబడినవి ఇలాంటి క్రమపద్ధతిలో చేయబడవు: మొదటిది, మనిషి బాహ్య స్వభావాన్ని మార్చడం; రెండవది, మనిషిని ఆయన శిక్ష మరియు పరీక్షలకు లోనుచేయడం; మూడవది, మనిషిని మరణ విచారణలకు గురిచేయడం; నాలుగవది, మనిషి దేవుడిని ప్రేమించే సమయాన్ని అనుభవించి, సృష్టించబడిన జీవి సంకల్పాన్ని వ్యక్తం చేయడం; ఐదవది, దేవుడి చిత్తాన్ని చూడడానికి మరియు ఆయనను సంపూర్ణంగా తెలుసుకోవడానికి మనిషిని అనుమతించడం; అంతిమంగా, మనిషిని సంపూర్ణుడిని చేయడం. ఆయన ఇవన్నీ కృపాకాలములో ప్రణాళిక చేయలేదు; అలాకాకుండా, ఆయన ప్రస్తుత కాలములో వాటిని ప్రణాళిక చేయడం మొదలుపెట్టాడు. దేవుడిలాగానే సాతాను కూడా పనిచేస్తూ ఉంది. సాతాను తన చెరుపు స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది, అదే దేవుడు ముక్కుసూటిగా మాట్లాడతాడు మరియు కొన్ని అత్యవసర విషయాలను వెల్లడిస్తాడు. ఈనాడు జరుగుతున్న కార్యము ఇదే మరియు లోకం సృష్టించబడిన తర్వాత ఎంతో కాలం క్రితం ఉపయోగించిన అదే పని నియమం ఇప్పటికీ ఉంది.

మొదట దేవుడు ఆదాము మరియు హవ్వలను సృష్టించాడు మరియు ఆయన ఒక సర్పాన్ని కూడా సృష్టించాడు. ఈ అన్ని విషయాలలో, ఈ సర్పము అత్యంత విషపూరితమైనది; దాని శరీరంలో సాతాను తన ప్రయోజనాన్ని సాధించేందుకు ఉపయోగించే విషం ఉంది. పాపము చేయడానికి హవ్వను ప్రలోభానికి గురిచేసినది సర్పమే. హవ్వ తర్వాత ఆదాము పాపము చేసాడు, ఆతర్వాత వారిద్దరు మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించగలిగారు. ఒకవేళ సర్పము హవ్వను ప్రలోభపెడుతుందని, హవ్వ ఆదామును ప్రలోభపెడుతుందని యెహోవాకు తెలిసి ఉంటే, ఆయన వారందరినీ ఒకేచోట వనంలో ఎందుకు ఉంచాడు? ఆయన ఈ విషయాలను ముందుగానే ఊహించగలిగి ఉంటే, ఎందుకు ఒక సర్పాన్ని సృష్టించి, ఏదేను వనంలో ఉంచాడు? ఏదేను వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము పండ్లు ఎందుకు ఉన్నాయి? వారు ఆ పండు తినాలని ఆయన ఉద్దేశించాడా? యెహోవా వచ్చినప్పుడు, ఆదాము లేదా హవ్వ ఆయనకు ఎదురుగా రావడానికి సాహసించలేదు, అప్పుడే యెహోవా వారు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము పండు తిన్నారని మరియు సర్పము జిత్తులమారితనానికి ఎరగా మారారని తెలుసుకుంటాడు. చివరకు, ఆయన సర్పాన్ని శపించాడు మరియు ఆయన ఆదాము మరియు హవ్వను కూడా శపించాడు. వారిలో ఇద్దరు ఆ వృక్షం పండు తిన్నప్పుడు, వారు అలా చేస్తున్నారని యెహోవాకు ఏమాత్రం తెలియదు. మానవాళి చెడుగా మరియు లైంగికపరంగా వ్యభిచారం చేసే స్థాయికి చెరపబడింది, అది ఎంతవరకంటే, వారి హృదయాలలో ఉన్నవన్నీ చెడు మరియు అవినీతివంతమైనవి అనేంత దూరం వెళ్లాయి; అవన్నీ రోతగా ఉన్నాయి. అందుచేత మానవాళిని సృష్టించినందుకు యెహోవా పశ్చాత్తాప పడ్డాడు. ఆతర్వాత, నోవహు మరియు అతని కుమారులు ప్రాణాలతో బయటపడిన జలప్రళయంతో ప్రపంచాన్ని నాశనం చేసే తన కార్యమును ఆయన కొనసాగించాడు. వాస్తవానికి కొన్ని విషయాలు ప్రజలు ఊహించినంత ఉన్నతమైనవి మరియు అతీంద్రియమైనవి కావు. “ప్రధాన దేవదూత తనకు నమ్మకద్రోహం చేస్తుందని దేవుడికి తెలిసినప్పటికీ, మరి ఆయన దానిని ఎందుకు సృష్టించాడు?” అని కొందరు అడుగుతారు. వాస్తవాలు ఇవి: భూమి అస్థిత్వంలో లేకముందు, పరలోకంలోని దేవదూతలందరిలో ప్రధాన దేవదూత గొప్పదిగా ఉండేది. దీనికి పరలోకంలోని దేవదూతలందరిపై అధికార పరిధి ఉండేది; ఇది దేవుడు దానికి ఇచ్చిన అధికారం. దేవుడు తప్ప, ఇది పరలోకపు దేవదూతలందరి కంటే గొప్పదిగా ఉండేది. తరువాత, దేవుడు మానవాళిని సృష్టించిన తర్వాత, భూమిపైకి వచ్చిన ప్రధాన దేవదూత దేవుడికి వ్యతిరేకంగా మరింత పెద్ద ద్రోహాన్ని కొనసాగించింది. అది మానవాళిని నడిపించాలని మరియు దేవుడి అధికారాన్ని అధిగమించాలనుకుంది కాబట్టి, అది దేవుడికి నమ్మకద్రోహం చేసిందని నేను అంటాను. పాపం చేయడానికి హవ్వను ప్రలోభపెట్టింది ఈ ప్రధాన దేవదూతే, అలా ఎందుకు చేసిందంటే అది భూమిపై తన రాజ్యాన్ని స్థాపించాలని మరియు మానవులు దేవుడిని తృణీకరించి, ఆయనకు బదులుగా ప్రధాన దేవదూతకు విధేయత చూపాలని కోరుకుంది కాబట్టి. దేవదూతలు, భూమిపై ఉన్న ప్రజలు చూపగలిగినట్టుగానే, ప్రధాన దేవదూత తనకు ఎన్నో విధేయత చూపగలవని చూసింది. పక్షులు మరియు మృగాలు, వృక్షాలు, అడవులు, పర్వతాలు, నదులు మరియు భూమిపైన ఉన్న ప్రతిదీ మానవుల సంరక్షణలో, అంటే, ఆదాము మరియు హవ్వ సంరక్షణలో ఉన్నాయి. అదే సమయంలో ఆదాము మరియు హవ్వ ప్రధాన దేవదూతపట్ల విధేయత చూపించారు. కాబట్టే, ప్రధాన దేవదూత దేవుడి అధికారాన్ని అధిగమించాలని మరియు దేవుడికి నమ్మకద్రోహం చేయాలనుకుంది. ఆతర్వాత, అది అనేకమంది దేవదూతలు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు నాయకత్వం వహించింది, దాని తర్వాత అది వివిధ రకాల అపరిశుద్ధాత్మలుగా మారింది. నేటి వరకు జరిగిన మానవాళి అభివృద్ధికి కారణం ఈ ప్రధాన దేవదూత చెరుపు కాదా? ప్రధాన దేవదూత దేవుడికి నమ్మకద్రోహం చేసి మానవాళికి చెరుపు చేసింది కాబట్టే, మానవులు ఈ రోజు ఉన్నట్టుగా ఉన్నారు. ప్రజలు ఊహించినట్లుగా ఈ దశల వారీ కార్యము ఎక్కడా సుమారుగా కూడా అమూర్తమైనది మరియు సరళమైనదిగా లేదు. సాతాను ఒక కారణం కోసం తన నమ్మకద్రోహాన్ని కొనసాగించాడు, అయినా ప్రజలు అలాంటి సాధారణ వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోయారు. భూమ్యాకాశములు మరియు సమస్తాన్ని సృష్టించిన దేవుడు సాతానును కూడా ఎందుకు సృష్టించాడు? దేవుడు సాతానును ఎంతో తృణీకరించాడు మరియు సాతాను ఆయనకు శత్రువు కాబట్టి, ఆయన సాతానును ఎందుకు సృష్టించాడు? సాతానును సృష్టించడం ద్వారా, ఆయన శత్రువును సృష్టించినట్టు కాదా? వాస్తవానికి, దేవుడు శత్రువును సృష్టించలేదు; దానికి బదులుగా, ఆయన ఒక దేవదూతను సృష్టించాడు ఆ తరువాత ఆ దేవదూత ఆయనకు నమ్మకద్రోహం చేసింది. దాని హోదా అది దేవుడికి నమ్మకద్రోహం చేయాలనుకునేంతగా పెరిగింది. ఇది కాకతాళీయంగా జరిగిందని ఎవరైనా చెప్పవచ్చు, కానీ ఇది తప్పనిసరిగా జరగవలసినది కూడా. ఇది ఒక నిర్దిష్ట బిందువు వరకు పరిపక్వత చెందిన ఒక మనషి తప్పనిసరిగా చనిపోవడం లాంటిది; పరిస్థితులు ఇప్పుడే ఆ దశకు అభివృద్ధి చెందాయి. కొందరు అర్థంపర్థంలేని మూర్ఖులు ఇలా అంటారు, “సాతాను నీ శత్రువు అయినప్పుడు, నీవు దానిని ఎందుకు సృష్టించావు? ప్రధాన దేవదూత నీకు ద్రోహం చేస్తుందని నీకు తెలియదా? నీవు అనంతం నుండి అనంతం వరకు చూడలేవా? నీకు ప్రధాన దేవదూత స్వభావం తెలియదా? ఇది నీకు నమ్మకద్రోహం చేస్తుందని స్పష్టంగా తెలిసినప్పటికీ, నీవు దానిని ప్రధాన దేవదూతగా ఎందుకు చేశావు? ఇది నీకు నమ్మకద్రోహం చేయడమే కాకుండా, మానవాళికి చెరుపు చేయడానికి తనతో పాటు అనేక ఇతర దేవదూతలను కూడా ముందుకు నడిపింది మరియు మానవుల ప్రపంచానికి దిగింది, అయినా నేటి వరకు, నీవు ఇంకా నీ ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళికను పూర్తి చేయలేకపోయావు.” ఆ మాటలు సరైనవేనా? నీవు ఈవిధంగా ఆలోచించినప్పుడు, నిన్నునీవు అవసరమైన దానికంటే ఎక్కువ ఇబ్బందులకు లోనుచేయడం లేదా? మరికొందరు ఇలా చెప్తారు “ఈరోజు వరకు సాతాను మానవాళికి ఈవిధంగా చెరుపు చేయకుండా ఉండి ఉంటే, దేవుడు మనుష్యత్వానికి ఇంతటి విమోచనం ఇచ్చి ఉండేవాడు కాదు. ఆవిధంగా, దేవుడి జ్ఞానం మరియు పరాక్రమం అదృశ్యంగా ఉండి ఉంటే; ఆయన జ్ఞానం ఎక్కడ బయలుపరచబడి ఉండేది? దేవుడు తన పరాక్రమాన్ని తర్వాత బయలుపరచగలగడానికి వీలుగా సాతాను కోసం మనుష్య జాతిని సృష్టించాడు—లేకపోతే, మనిషి దేవుని జ్ఞానాన్ని ఎలా తెలుసుకోగలడు? మనిషి దేవుణ్ణి ఎదిరించకపోతే లేదా ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకపోతే, ఆయన చర్యలు బహిర్గతం చేయడం అనవసరమై ఉండేవి. సమస్త సృష్టి ఆయనను ఆరాధించి, ఆయనకు సమర్పించుకుంటే, చేసేందుకు దేవుడికి ఏ పనీ ఉండేది కాదు.” ఇది నిజతత్వం నుండి ఇంకా దూరంగా ఉంది, ఎందుకంటే దేవుడిలో అశుద్ది ఏదీ లేదు, కాబట్టి ఆయన అశుద్ధిని సృష్టించలేడు. ఆయన తన శత్రువును ఓడించడానికి, తాను సృష్టించిన మానవులను రక్షించడానికి మరియు దేవుడిని ద్వేషించే, నమ్మకద్రోహం చేసే మరియు ప్రతిఘటించే, ప్రారంభంలో తన ఆధిపత్యంలో ఉండిన మరియు తనకు చెందిన ప్రేతాత్మలను మరియు సాతానును ఓడించడానికి మాత్రమే ఆయన ఇప్పుడు తన చర్యలను బహిర్గతం చేస్తాడు. దేవుడు ఈ ప్రేతాత్మలను ఓడించి, తద్వారా, అందరికి తన పరాక్రమాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడు. మానవాళి మరియు భూమిపై ఉన్న సమస్తం ఇప్పుడు సాతాను ఆధిపత్యంలో ఉన్నాయి మరియు దుష్టుల ఆధిపత్యం కింద ఉన్నాయి. ప్రజలు ఆయనను తెలుసుకునేలా, తద్వారా సాతానును ఓడించి, ఆయన శత్రువులను పూర్తిగా నిర్మూలించేలా చేయడానికి దేవుడు తన చర్యలన్నింటిని అందరికి బహిర్గతం చేయాలని అనుకుంటున్నాడు. ఈ కార్యము యావత్తు ఆయన చర్యలను బహిర్గతం చేయడం ద్వారా పూర్తిచేయబడుతుంది. ఆయన సమస్త సృష్టి సాతాను ఆధీనంలో ఉంది, కాబట్టి దేవుడు తన పరాక్రమాన్ని వారికి బహిర్గతం చేయాలని, తద్వారా సాతానును ఓడించాలని అనుకుంటున్నాడు. సాతాను లేకుండా ఉండి ఉంటే, ఆయనకు తన క్రియలను బహిర్గతం చేయవలసిన అవసరం ఉండేది కాదు. సాతాను వేధింపులు లేకుంటే, దేవుడు మానవాళిని సృష్టించి, వారిని ఏదేను వనంలో జీవించేలా చేసి ఉండేవాడు. సాతాను నమ్మకద్రోహం చేయడానికి ముందు, దేవుడు తన క్రియలన్నింటినీ దేవదూతలకు లేదా ప్రధాన దేవదూతకు ఎందుకు వెల్లడించలేదు? ప్రారంభంలో, దేవదూతలు మరియు ప్రధాన దేవదూత అందరూ దేవుడిని తెలుసుకుని, ఆయనకు సమర్పించుకుని ఉండి ఉంటే, దేవుడు కార్యపు ఆ అర్థరహితమైన చర్యలను కొనసాగించి ఉండేవాడు కాదు. సాతాను మరియు ప్రేతాత్మల ఉనికి కారణంగానే, మానవులు కూడా దేవుడిని ప్రతిఘటించారు మరియు పీకల వరకు తిరుగుబాటు స్వభావంతో నిండిపోయారు. అందుచేతనే దేవుడు తన చర్యలను బహిర్గతం చేయాలని అనుకుంటున్నాడు. ఆయన సాతానుతో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి, దానిని ఓడించడానికి ఆయన తన సొంత అధికారాన్ని మరియు ఆయన చర్యలన్నింటినీ తప్పక ఉపయోగించాలి; ఈవిధంగా, ఆయన మానవుల మధ్యలో చేసే రక్షణ కార్యము వారు ఆయన జ్ఞానాన్ని మరియు పరాక్రమాన్ని చూసేలా చేస్తుంది. ఈరోజు దేవుడు చేస్తున్న కార్యము అర్థవంతమైనది మరియు కొంతమంది చెప్పే, “నీవు చేసే పని పరస్పర విరుద్ధంగా లేదా? ఈ కార్యపు కొనసాగింపు కేవలం నిన్ను నీవు కష్టపెట్టుకునే అభ్యాసం కాదా? నీవు సాతానును సృష్టించావు, ఆపై అది నీకు నమ్మకద్రోహం చేయడానికి, ప్రతిఘటించడానికి అనుమతించావు. నీవు మానవులను సృష్టించావు, ఆపై వారిని సాతానుకు అప్పగించి, ఆదాము మరియు హవ్వ ప్రలోభానికి గురయ్యేలా చేశావు. నీవు ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేశావు కాబట్టి, నీవు మానవాళిని ఇంకా ఎందుకు ద్వేషిస్తున్నావు? నీవు సాతానును ఎందుకు అసహ్యించుకుంటున్నావు? ఇవన్నీ నీ స్వయంకృతం కాదా? నీవు ద్వేషించడానికి ఏముంది?” ఈ విషయాలతో ఈ కార్యానికి ఏరకంగానూ పోలిక లేదు. చాలా కొద్దిమంది అర్థంలేనివారే ఇలాంటివి చెబుతారు. వారు దేవుడిని ప్రేమించాలనుకుంటారు, కానీ అంతరంగంలో, వారు దేవుడి గురించి ఫిర్యాదు చేస్తారు. ఎంత వైరుధ్యం! నీవు సత్యాన్ని అర్థం చేసుకోలేవు, నీకు అనేక అతీంద్రియ ఆలోచనలు ఉన్నాయి మరియు నీవు దేవుడు తప్పు చేశాడని కూడా వాదిస్తావు—నీవు ఎంత అర్థరహితుడివి! సత్యంతో ఆటలాడేది నీవే; ఇందులో దేవుడు తప్పు చేశాడు అనేది ఏదీ లేదు! కొంతమంది పదే పదే ఫిర్యాదు కూడా చేస్తారు, “సాతానును సృష్టించింది నీవే మరియు సాతానును మానవులలోకి తెచ్చి దానికి వారిని అప్పజెప్పిందీ నీవే. మానవులు సాతాను స్వభావం పొందిన తర్వాత, నీవు వారిని క్షమించలేదు; అందుకు భిన్నంగా, వారిని కొంత మేరకు అసహ్యించుకున్నావు. మొదట నీవు వారిని కొంత మేరకు ప్రేమించావు, కానీ ఇప్పుడు వారిని అసహ్యించుకుంటున్నావు. మానవాళిని ద్వేషించింది నీవే, అయినా మానవాళిని ప్రేమించింది కూడా నీవే. ఇక్కడ నిజంగా ఏమి జరుగుతోంది? ఇది వైరుధ్యం కాదా?” మీరు దీనిని ఎలా చూసినప్పటికీ, పరలోకంలో జరిగింది ఇదే; ప్రధాన దేవదూత దేవుడికి ద్రోహం చేసింది మరియు మానవాళి చెడిపోయింది ఈవిధంగానే మరియు మానవులు ఈరోజు వరకు కొనసాగుతున్నది ఇలాగే. మీరు దీనిని ఎలాంటి మాటలతో చెప్పినా, మొత్తం కథ అదే. అయితే, ఈరోజు దేవుడు చేస్తున్న ఈ కార్యము వెనుక ఉన్న ఉద్దేశమంతా మిమ్మల్ని రక్షించడం మరియు సాతానును ఓడించడం అని మీరు తప్పక అర్థం చేసుకోవాలి.

దేవదూతలు ప్రత్యేకించి బలహీనులు మరియు మాట్లాడే సామర్థ్యాలు లేనివారు కాబట్టి, వారికి అధికారం ఇచ్చిన వెంటనే వారిలో అహంకారం పెరిగింది. ఇది మరీ ముఖ్యంగా ఇతర దేవదూతల కంటే ఎక్కువ హోదా కలిగిన ప్రధాన దేవదూత విషయంలో నిజం. దేవదూతలలో ఒక రాజుగా, అది లక్షలాది మందిని ముందుకు నడిపింది మరియు యెహోవా ఆధీనం కింద దాని అధికారం ఇతర దేవదూతల అధికారాన్ని అధిగమించింది. అది ఏదేదో చేయాలనుకుంది మరియు లోకాన్ని నియంత్రించడానికి మానవుల మధ్యకు దేవదూతలను నడిపించాలనుకుంది. ఈ విశ్వానికి ఇప్పుడు బాధ్యత వహించేది తానేనని దేవుడు చెప్పాడు; కానీ ప్రధాన దేవదూత ఈ విశ్వానికి బాధ్యత వహించేది తానేనని దావా చేసింది—అప్పటి నుండి, ప్రధాన దేవదూత దేవుడికి నమ్మకద్రోహం చేసింది. దేవుడు పరలోకంలో మరో లోకాన్ని సృష్టించాడు మరియు ప్రధాన దేవదూత ఈ లోకాన్ని నియంత్రించాలని మరియు మానవ లోకానికి దిగాలని అనుకుంది. అలా చేయడానికి దేవుడు అనుమతించగలడా? కాబట్టి, ఆయన ప్రధాన దేవదూతను పడగొట్టి గాలిలోకి తోసివేశాడు. అది మానవులను చెడగొట్టినప్పటి నుండి, వారిని రక్షించడానికి దేవుడు ప్రధాన దేవదూతతో యుద్ధం చేశాడు; ఆయన ఈ ఆరువేల ఏండ్లను దానిని ఓడించడానికి ఉపయోగించాడు. సర్వశక్తిమంతుడైన దేవుడి గురించి మీ భావన దేవుడు ప్రస్తుతం కొనసాగిస్తున్న కార్యానికి అనుగుణమైంది కాదు; ఇది పూర్తిగా ఆచరణ యోగ్యమైనది కాదు మరియు ఇది చాలా తప్పిదం! వాస్తవానికి, ప్రధాన దేవదూత నమ్మకద్రోహం చేసిన తర్వాతనే దేవుడు దానిని తన శత్రువుగా ప్రకటించాడు. దాని నమ్మకద్రోహం కారణంగానే ప్రధాన దేవదూత మానవ లోకం లోకి వచ్చిన తరువాత మానవాళిని అణగతొక్కింది మరియు ఈ కారణంతోనే మానవాళి ఈ స్థాయికి చేరింది. అది జరిగిన తర్వాత, దేవుడు సాతానుతో, “నేను నిన్ను ఓడించి, నేను సృష్టించిన మానవులందరికీ రక్షణ కల్పిస్తాను” అని ప్రతిఙ్ఞ చేశాడు. మొదట్లో ఒప్పుకోని సాతాను ఇలా ప్రశ్నించింది, “నీవు యథార్థంగా నన్ను ఏమి చేయగలవు? నీవు నిజంగా నన్ను గాలిలోకి తోసివేయగలవా? నీవు నన్ను నిజంగా ఓడించగలవా?” దేవుడు దానిని గాలిలోకి తోసివేసిన తరువాత, ఆయన ప్రధాన దేవదూతను పట్టించుకోలేదు, ఆపై కొనసాగుతున్న సాతాను ఆటంకాలు ఉన్నప్పటికీ, మానవాళిని రక్షించడం మరియు తన కార్యాన్ని చేయడం కొనసాగించాడు. సాతానుకు గతంలో దేవుడు ఇచ్చిన శక్తుల కారణంగా అది ఏదేదో చేయగలిగింది; అది వీటిని తనతో పాటు గాలిలోకి తీసుకెళ్లింది మరియు ఈరోజు వరకు వాటిని అలాగే ఉంచింది. ప్రధాన దేవదూతను గాలిలోకి తోసివేసినప్పుడు, దేవుడు దాని అధికారాన్ని వాపసు తీసుకోలేదు, కాబట్టి సాతాను మానవాళిని చెడగొట్టడం కొనసాగించింది. మరోవైపు, సృష్టించబడిన వెంటనే సాతాను చెడగొట్టిన మానవాళిని దేవుడు రక్షించడం ప్రారంభించాడు. పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు తన చర్యలను బహిర్గతము చేయలేదు; అయితే, భూమిని సృష్టించడానికి ముందు, ఆయన పరలోకంలో సృష్టించిన లోకంలోని ప్రజలు తన చర్యలను చూడటానికి అనుమతించాడు, ఆవిధంగా ఆయన ప్రజలను పరలోకం పైకి నడిపించాడు. ఆయన వారికి జ్ఞానాన్ని మరియు తెలివిని ఇచ్చాడు మరియు ఆ ప్రజలను ఆ లోకంలో జీవించేలా నడిపించాడు. సహజంగానే, మీలో ఎవరూ దీని గురించి ఇంతకు ముందు వినలేదు. తరువాత, దేవుడు మానవులను సృష్టించిన తర్వాత, ప్రధాన దేవదూత వారిని చెడగొట్టడం ప్రారంభించింది; భూమిపై ఉన్న మానవాళి అంతా అస్తవ్యస్తం అయింది. అప్పుడే దేవుడు సాతానుకు వ్యతిరేకంగా తన యుద్ధాన్ని ప్రారంభించాడు మరియు ఈ సమయంలోనే మానవులు ఆయన క్రియలను చూడటం ప్రారంభించారు. ప్రారంభంలో, అటువంటి చర్యలు మానవాళికి కనిపించకుండా దాచబడ్డాయి. సాతానును గాలిలోకి తోసివేసిన తర్వాత, అది తన పనులను తాను చేసింది మరియు అంత్యకాలము వరకు సాతానుకు వ్యతిరేకంగా నిరంతరం యుద్ధం చేస్తూనే దేవుడు తన కార్యాన్ని తాను కొనసాగించాడు. ఇప్పుడు సాతానును నాశనం చేయవలసిన సమయం ఆసన్నమైంది. ప్రారంభంలో, దేవుడు దానికి అధికారం ఇచ్చాడు, తరువాత ఆయన దానిని గాలిలోకి తోసివేశాడు, అయినా అది ధిక్కరిస్తూనే ఉంది. ఆతరువాత, అది భూమిపై మానవాళిని చెడగొట్టింది, కానీ మానవాళిని రక్షించడానికి దేవుడు అక్కడ ఉన్నాడు. సాతానును ఓడించడానికి దేవుడు తన మానవ నిర్వహణను ఉపయోగిస్తాడు. ప్రజలను చెడగొట్టడం ద్వారా, సాతాను వారి విధికి ముగింపు పలికి దేవుడి కార్యానికి అంతరాయం కలిగిస్తుంది. మరోవైపు, దేవుడి పని మానవాళికి రక్షణ కల్పించడం. దేవుడు చేసే కార్యంలో మానవాళిని రక్షించడానికి ఉద్దేశించని దశ ఏదైనా ఉందా? ప్రజలను శుద్ధిచేయడానికి మరియు వారు నీతిమంతులుగా ప్రవర్తించేలా చేయడానికి మరియు ప్రేమించదగిన స్వరూపంగా జీవించడానికి ఉద్దేశించని దశ ఏదైనా ఉందా? అయితే సాతాను దీనిని చేయదు. ఇది మానవాళిని చెడగొడుతుంది; అది విశ్వమంతటా మానవాళిని నిరంతరం చెరుపుతూ ఉంటుంది. అయితే, సాతానును పట్టించుకోకుండా దేవుడు కూడా తన సొంత కార్యాన్ని చేస్తాడు. సాతానుకు ఎంత అధికారం ఉన్నప్పటికీ, ఆ అధికారం దేవుడు ఇచ్చినదే; నిజానికి దేవుడు ఆయన మొత్తం అధికారాన్ని దానికి ఇవ్వలేదు, కాబట్టి సాతాను ఏమి చేసినా, ఎప్పటికీ దేవుడిని అధిగమించలేదు, ఎల్లప్పుడూ దేవుడి అదుపులోనే ఉంటుంది. దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు తన కార్యాలలో వేటిని కూడా బహిర్గతం చేయలేదు. ఆయన సాతానుకు అధికారంలో కొద్ది భాగాన్ని మాత్రమే ఇచ్చాడు మరియు ఇతర దేవదూతలను నియంత్రించే అధికారం దానికి ఇచ్చాడు. కాబట్టి, సాతాను ఏమి చేసినప్పటికీ, అది దేవుడి అధికారాన్ని అధిగమించలేదు. ఎందుకంటే, దేవుడు మొట్టమొదట ఇచ్చిన అధికారం పరిమితం. దేవుడు పని చేస్తుంటే, సాతాను ఆటంకం కలిగిస్తుంది. అంత్యకాలములో, దాని ఆటంకాలు అంతమవుతాయి; అలాగే, దేవుని కార్యము కూడా పూర్తవుతుంది మరియు దేవుడు పూర్తి చేయాలని కోరుకుంటున్న స్వభావంగల మానవులు పూర్తి చేయబడతారు. దేవుడు ప్రజలను సకారాత్మకంగా నడిపిస్తాడు; ఆయన జీవితం జీవజలం, అపరిమితం మరియు అనంతం. సాతాను మనిషిని కొంతమేరకు చెడగొట్టాడు; ఆఖరికి, జీవితపు జీవజలం మనిషిని సంపూర్ణం చేస్తుంది మరియు ఇందులో జోక్యం చేసుకోవడం మరియు తన పనిని చేసుకుపోవడం సాతానుకు అసాధ్యమవుతుంది. అందుచేత, దేవుడు ఈ ప్రజలను పూర్తిగా పొందగలుగుతాడు. ఇప్పుడు కూడా, దీనిని అంగీకరించడానికి సాతాను నిరాకరిస్తుంది; అది నిరంతరం దేవునికి వ్యతిరేకంగా పోటీ పడుతుంది కానీ, ఆయన దానిని పట్టించుకోడు. “సాతాను చీకటి శక్తులన్నింటి మీద మరియు చీకటి ప్రభావాలన్నింటి మీద నేను గెలుపు సాధిస్తాను” అని దేవుడు చెప్పాడు. ఇది శరీరధారిగా ఉండి చేయవలసిన కార్యము మరియు ఇది శరీరధారణను గొప్పదిగా చేస్తుంది: అంటే, అంత్యకాలములో సాతానును ఓడించే మరియు సాతానుకు సంబంధించినవన్నీ తుడిచిపెట్టే కార్యపు దశను పూర్తి చేయడం. సాతానుపై దేవుడి గెలుపు అనివార్యం! వాస్తవానికి, సాతాను ఎప్పుడో చాలా కాలం క్రితమే ఓడిపోయింది. యెఱ్ఱని మహాఘటసర్పము భూమంతా సువార్త వ్యాపించడం మొదలైనప్పుడు—అంటే, శరీరధారియైన దేవుడు తన కార్యమును ప్రారంభించినప్పుడు ఈ కార్యము మొదలైంది—సాతాను ఘోరంగా ఓడిపోయింది, ఎందుకంటే అవతారపు అసలైన ఉద్దేశం సాతానును జయించడమే. దేవుడు మరోసారి శరీరధారి అయ్యాడని మరియు ఏ శక్తి నిలువరించలేని తన కార్యాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడని సాతాను చూసిన వెంటనే, ఈ కార్యమును చూసి నిశ్చేష్టురాలైంది మరియు తర్వాత ఎలాంటి తుంటరి పని చేయడానికి ధైర్యం చేయలేదు. మొదట్లో సాతాను తనకు కూడా చాలా జ్ఞానం పుష్కలంగా ఉందని అనుకుని దేవుడి కార్యాన్ని ఆటంకపరిచింది మరియు వేధించింది; అయితే, దేవుడు మరోసారి శరీరధారి అవుతాడని లేదా తన కార్యములో సాతాను దుర్మార్గాన్ని మానవాళికి ఒక ప్రత్యక్షత మరియు తీర్పుగా దేవుడు ఉపయోగించుకుంటాడని, తద్వారా మానవాళిని జయించి, సాతానును ఓడిస్తాడని అది ఊహించలేదు. సాతాను కంటే దేవుడు వివేకవంతుడు మరియు ఆయన కార్యము దానిని మించిపోతుంది. కాబట్టి, ఇంతకుముందు నేను పేర్కొన్నట్లుగా, “నేను చేసే కార్యము సాతాను కుతంత్రాలకు ప్రతిస్పందనగా కొనసాగించబడుతుంది; అంతిమంగా, నేను నా పరాక్రమాన్ని మరియు సాతాను శక్తిహీనతను బహిర్గతం చేస్తాను.” దేవుడు తన కార్యాన్ని ముందు వరుసలో చేస్తాడు, అదే సాతాను ఆఖరికి తాను నాశనం చేయబడే వరకు వెనుకబడి ఉంటుంది—దానిని ఎవరు కొట్టారో కూడా దానికి తెలియదు! అది ధ్వంసంచేయబడిన, నలిపివేయబడిన తర్వాత మాత్రమే సత్యాన్ని గ్రహిస్తుంది, అయితే అప్పటికే, అది అగ్ని సరస్సులో కాలి బూడిదై ఉంటుంది. అప్పుడైనా అది పూర్తిగా ఒప్పుకోదా? ఎందుకంటే, అప్పుడు ఇక ప్రయోగించడానికి సాతానుకు ఎలాంటి పథకాలు ఉండవు!

ఇది మానవాళి కోసం దేవుడి హృదయాన్ని తరచూ దుఃఖంతో బరువెక్కించే దశల వారీ, వాస్తవిక కార్యము కాబట్టి, సాతానుతో ఆయన యుద్ధం ఆరు వేల యేండ్లు కొనసాగింది మరియు “నేను మానవాళిని మళ్లీ ఎప్పుడూ సృష్టించను లేదా నేను మళ్ళీ ఎప్పుడూ దేవదూతలకు అధికారాన్ని ప్రసాదించను” అని దేవుడు చెప్పాడు. అప్పటి నుండి, దేవదూతలు భూమిపై పని చేయడానికి వచ్చినప్పుడు, వారు ఏదో ఒక కార్యము చేయడానికి దేవుడిని అనుసరించారు; ఆయన మళ్లీ ఎప్పుడూ వారికి ఎలాంటి అధికారం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయులు చూసిన దేవదూతలు తమ కార్యాన్ని ఎలా కొనసాగించారు? వారు కలలలో తమను తాము బహిర్గతము చేసుకొని యెహోవా మాటలను వినిపించారు. శిలువ వేయబడిన మూడు రోజుల తర్వాత యేసు పునరుత్థానం అయినప్పుడు, పెద్ద బండరాయిని పక్కకు నెట్టింది దేవదూతలే; ఈ కార్యాన్ని దేవుడి ఆత్మ ప్రత్యక్షంగా చేయలేదు. దేవదూతలు మాత్రమే ఈ రకమైన కార్యాన్ని చేశారు; వారు సహాయక పాత్రలను పోషించారు, కానీ వారికి అధికారం ఏమీ లేదు, ఎందుకంటే వారికి దేవుడు మళ్లీ ఎలాంటి అధికారాన్ని ప్రసాదించడు. కొంతకాలము పనిచేసిన తరువాత, భూమి మీద దేవుడు ఉపయోగించిన ప్రజలు దేవుని స్థానాన్ని పొంది, ఇలా అన్నారు “నేను ఈ విశ్వాన్ని అధిగమించాలనుకుంటున్నాను! నేను మూడవ ఆకాశములో నిలవాలనుకుంటున్నాను!” మేము సార్వభౌమాధికార పాలనను హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాము! వారు అనేక రోజుల కార్యము తర్వాత అహంకారులుగా తయారవుతారు; వారు భూమిపై సార్వభౌమాధికారాన్ని పొందాలని, మరొక దేశాన్ని స్థాపించాలని, అన్నింటినీ తమ పాదాల కింద ఉంచుకొని, మూడవ ఆకాశములో నిలవాలని కోరుకున్నారు. నీవు దేవుడు ఉపయోగించిన మనిషివి మాత్రమే అని నీకు తెలియదా? నీవు మూడవ ఆకాశమును ఎలా అధిరోహించగలవు? దేవుడు నిశ్శబ్దంగా మరియు వినిపించేలా కేకలు వేయకుండా కార్యము నిర్వహించడానికి భూమి మీదకు వస్తాడు మరియు ఎవరికీ అంతుపట్టకుండా తన కార్యమును ముగించుకొని వెళ్లిపోతాడు. ఆయన మనుష్యుల లాగా ఎప్పుడూ కేకలు వేయడు, కానీ తన కార్యాన్ని కొనసాగించడంలో వ్యావహారికంగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ చర్చిలోనికి ప్రవేశించి, “నేను మిమ్మల్ని అందరినీ నిర్మూలిస్తాను! అని అరవడు. నేను మిమ్మల్ని శపిస్తాను మరియు మిమ్మల్ని శిక్షిస్తాను!” ఆయన కేవలం తన సొంత కార్యమును చేయడం కొనసాగిస్తాడు మరియు పూర్తి చేశాక నిష్క్రమిస్తాడు. రోగులను స్వస్థతపరచే, ప్రేతాత్మలను వెళ్లగొట్టే, చర్చి వేదిక నుండి ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే, సుదీర్ఘమైన మరియు డాంబికమైన ప్రసంగాలు చేసే మరియు అవాస్తవిక విషయాలను చర్చించే మతపరమైన కాపరులు అందరూ ప్రధానంగా అహంకారులు! వారు ప్రధాన దేవదూతకు వారసులు మాత్రమే!

నేటి వరకు తన ఆరువేల యేండ్ల కార్యమును కొనసాగించిన తరువాత, సాతానును ఓడించి మానవాళి అందరికీ రక్షణ ప్రసాదించే ప్రధాన ఉద్దేశం గల తన అనేక చర్యలను దేవుడు ఇప్పటికే బహిర్గతము చేశాడు. పరలోకంలోని ప్రతిదాన్ని, భూమిపై ఉన్న ప్రతిదాన్ని, సముద్రాలలోని ప్రతిదాన్ని మరియు భూమిపైన దేవుడి సృష్టిలోని ప్రతి చిట్టచివరి వస్తువు ఆయన తన పరాక్రమాన్ని చూసేలా మరియు ఆయన చర్యలన్నింటికీ సాక్ష్యంగా అనుమతించేలా ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగిస్తున్నాడు. సాతానును ఓడించడం ద్వారా లభించిన ఈ అవకాశాన్ని ఆయన మానవాళికి తన సమస్త క్రియలను బహిర్గతం చేయడానికి మరియు సాతానును ఓడించినందుకు వారు ఆయనను స్తుతించేందుకు మరియు ఆయన జ్ఞానాన్ని ఘనపర్చేందుకు వీలుకల్పించడానికి ఉపయోగిస్తున్నాడు. భూమి మీద, పరలోకంలో మరియు సముద్రాలలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుడి మహిమను తీసుకువస్తుంది, ఆయన పరాక్రమాన్ని స్తుతిస్తుంది, ఆయన క్రియలను స్తుతిస్తుంది మరియు ఆయన పరిశుద్ధ నామాన్ని గొంతెత్తి చాటుతుంది. ఆయన సాతానును ఓడించాడు అనడానికి రుజువు ఇదే; ఇది సాతానుపై ఆయన గెలుపుకు రుజువు. మరీ ముఖ్యంగా, ఇది మానవాళికి ఆయన రక్షణకు రుజువు. దేవుడి సమస్త సృష్టి ఆయనను మహిమపరుస్తుంది, తన శత్రువును ఓడించినందుకు, దిగ్విజయంగా తిరిగి వచ్చినందుకు ఆయనను స్తుతిస్తుంది మరియు ఆయనను గొప్ప విజయవంతమైన రాజుగా కీర్తించింది. ఆయన ఉద్దేశం సాతానును ఓడించడం మాత్రమే కాదు, కాబట్టే ఆయన కార్యము ఆరువేల యేండ్లు కొనసాగింది. సాతాను ఓటమిని ఆయన మానవాళిని రక్షించడానికి ఉపయోగిస్తాడు; సాతాను ఓటమిని ఆయన తన సమస్త చర్యలను మరియు ఆయన సమస్త మహిమను బహిర్గతం చేయడానికి ఉపయోగిస్తాడు. ఆయన మహిమను పొందుతాడు మరియు దేవదూతల బాహుళ్యమంతా ఆయన సమస్త మహిమను చూస్తారు. పరలోకంలోని దూతలు, భూమి మీద ఉన్న మనుష్యులు మరియు భూమి మీద ఉన్న సృష్టిలోని సమస్త వస్తువులు సృష్టికర్త మహిమను చూస్తాయి. ఇదే ఆయన చేసే కార్యము. పరలోకంలోని మరియు భూమి మీద ఉన్న ఆయన సమస్త సృష్టి ఆయన మహిమను చూస్తారు మరియు సాతానును సమూలంగా ఓడించిన తర్వాత ఆయన దిగ్విజయంగా తిరిగి వస్తాడు మరియు మానవాళి ఆయనను స్తుతించేలా చేస్తాడు, ఆవిధంగా ఆయన కార్యములో రెట్టింపు విజయం సాధిస్తాడు. చివరిలో, సమస్త మానవాళిని ఆయన జయిస్తాడు మరియు ప్రతిఘటించే లేదా తిరుగుబాటు చేసే ఎవరినైనా ఆయన నిర్మూలిస్తాడు; మరో మాటలో చెప్పాలంటే, సాతానుకు సంబంధించిన వారందరినీ ఆయన నిర్మూలిస్తాడు. నీవు ప్రస్తుతం దేవుడి అనేక చర్యలను చూస్తున్నావు, అయినా నీవు ప్రతిఘటిస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు మరియు ఆయనకు సమర్పించుకోవడం లేదు; నీవు మనసులో ఎన్నో విషయాలను ఉంచుకుంటావు మరియు నీవు చేయాలనుకున్నది చేస్తావు. నీవు మీ సొంత వాంఛలను మరియు ఇష్టాలను అనుసరిస్తావు; ఇదంతా తిరుగుబాటుతనం మరియు ప్రతిఘటించే గుణం. శరీరం మరియు వాంఛల కోసం, అదేవిధంగా తన సొంత, ప్రపంచ మరియు సాతాను ఇష్టాల కోసం దేవుడిపై ఉన్న ఏదైనా విశ్వాసం అశుద్ధమైనది; దీని స్వభావం ప్రతిఘటన మరియు తిరుగుబాటే. ఈరోజుల్లో, విభిన్న రకాల విశ్వాసాలు అన్నీ ఉన్నాయి: కొందరు విపత్తు నుండి ఆశ్రయాన్ని కోరుకుంటారు, మరికొందరు ఆశీర్వాదాలు పొందాలనుకుంటారు; కొందరు మర్మాలను అర్థం చేసుకోవాలనుకుంటారు, ఇంకా కొందరు డబ్బు కోరుకుంటారు. ఇవన్నీ ప్రతిఘటన రూపాలే మరియు అవన్నీ దైవదూషణలే! ఎవరైనా ప్రతిఘటిస్తున్నారు లేదా తిరుగుబాటు చేస్తారు అని అంటే—అది అలాంటి ప్రవర్తనలను సూచించదా? ఈరోజుల్లో అనేకమంది గొణుక్కుంటారు, ఫిర్యాదు చేస్తారు లేదా అభిప్రాయాలకు వస్తారు. అవన్నీ దుష్టులు చేసే పనులే; అవన్నీ మానవ ప్రతిఘటన మరియు తిరుగుబాటుకు ఉదాహరణలు. అలాంటి వ్యక్తులు సాతాను ఆవహించినవారు మరియు సాతాను ఆక్రమించినవారు. దేవుడి ఆధీనంలోకి వచ్చిన మనుష్యులు ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకునే వారు; వారు సాతానుచే చెడగొట్టబడిన వారు, అయితే దేవుడి ప్రస్తుత కార్యము ద్వారా రక్షించబడినవారు మరియు జయించబడినవారు, వారు కష్టాలను ఓర్చుకుని చివరకు పూర్తిగా దేవుడి ఆధీనంలోకి వచ్చినవారు, ఇక ఏమాత్రం సాతాను ఆధిపత్యం కింద జీవించని, అవినీతి నుండి తెగదెంపులు చేసుకొని స్వేచ్ఛ పొందిన వారు మరియు పరిశుద్ధతతో జీవించాలనుకునేవారు—అటువంటి వారే నిజానికి పరిశుద్ధులు; వారే నిజంగా పరిశుద్ధులు. నీ ప్రస్తుత చర్యలు దేవుడి నియమాలలో కనీసం ఒక భాగానికి అనుకూలంగా లేకపోతే, నీవువెలివేయబడతావు. ఇది నిర్వివాదమైనది. ప్రతి ఒక్కటీ ఇప్పుడు ఏమి జరుగుతుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది; నీవు ముందుగా నిర్ణయించబడినప్పటికీ మరియు ఎంపిక చేయబడినప్పటికీ, ఈరోజు నీవు చేసే చర్యలు నీ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. నీవు ఇప్పుడు సరిగా నడుచుకోకపోతే, నీవుపరిత్యజించబడతావు. నీవు ఇప్పుడు సరిగా నడుచుకోకపోతే, నీవు తర్వాత ఎలా నడుచుకోగలవు? నీ కళ్ల ముందర అంత గొప్ప అద్భుతం కనిపించినా, నీవు ఇప్పటికీ నమ్మవు. అలాంటప్పుడు, దేవుడు తన కార్యాన్ని ముగించి, ఇక ఏమాత్రం అలాంటి కార్యాన్ని చేయనప్పుడు నీవు ఆయనను ఎలా నమ్ముతావు? ఆ సమయానికి, నీకు ఆయనను అనుసరించడం మరింత అసాధ్యమవుతుంది! కొంత కాలానికి, నీ ధోరణి, శరీరధారియైన దేవుడి కార్యము పట్ల నీ జ్ఞానం మరియు నీవు పాపివా లేదా నీతిమంతుడివా అని నిర్ణయించడానికి లేదా నీవు పరిపూర్ణం చేయబడినవాడివా లేదా తొలగించబడినవాడివా అని నిర్ణయించడానికి నీ అనుభవంపై దేవుడు ఆధారపడతాడు. నీవు ఇప్పుడే తప్పక స్పష్టంగా చూడాలి. పరిశుద్ధాత్మ ఈ విధంగా పనిచేస్తుంది: నేటి నీ ప్రవర్తన ప్రకారమే ఆయన నీ ఫలితాన్ని నిర్ణయిస్తాడు. నేటి మాటలు ఎవరు మాట్లాడతారు? నేటి కార్యము ఎవరు చేస్తారు? నీవు ఈనాడు తొలగించబడతావని ఎవరు నిర్ణయిస్తారు? నిన్ను పరిపూర్ణులుగా చేయాలని ఎవరు నిర్ణయిస్తారు? ఇదంతా చేసేది నేను కాదా? ఈ మాటలు మాట్లాడేది నేనే; అలాంటి కార్యము కొనసాగించేది నేనే. శపించడం, శిక్షించడం మరియు ప్రజలపై అభిప్రాయం ఏర్పర్చుకోవడం అన్నీ నా కార్యములో భాగాలే. చివరలో, నిన్ను తుడిచిపెట్టడం కూడా నా ఇష్టప్రకారమే ఉంటుంది. ఇవన్నీ నా పనులే! నిన్ను పరిపూర్ణంగా చేయడం నా పని మరియు నిన్ను ఆశీర్వాదాలు ఆస్వాదించేలా చేయడం కూడా నా పనే. నేను చేసే పనంతా ఇదే. నీ ఫలితం యెహోవా చేత ముందుగా నిర్ణయించబడలేదు; అది నేటి దేవుడి చేత నిర్ణయించబడుతూ ఉన్నది. ఇది ఇప్పుడే నిర్ణయించబడుతూ ఉన్నది; ఇది లోకం సృష్టించబడక ముందు ఎప్పుడో గతంలో నిర్ణయించబడలేదు. కొందరు అర్థంపర్థంలేని వ్యక్తులు ఇలా అంటారు, “బహుశా నీ కళ్లలో ఏదో లోపం ఉండవచ్చు మరియు నీవు నన్ను ఎలా చూడాలో అలా చూడటం లేదు. చివరలో, నీవు ఆత్మ ఏమి బహిర్గతము చేస్తుందో అదే చూస్తావు!” మొదట్లో యేసు జుడాస్‌ను తన శిష్యుడిగా ఎంచుకున్నాడు. ప్రజలు ఇలా అడుగుతారు: “తనకు నమ్మకద్రోహం చేయబోయే శిష్యుడిని ఆయన ఎలా ఎంచుకోగలడు?” మొదట్లో, యేసుకు నమ్మకద్రోహం చేయాలనే ఉద్దేశం జుడాస్‌కు లేదు; ఇది తర్వాత మాత్రమే జరిగింది. ఆ సమయంలో, యేసు జుడాస్‌ను చాలా ఇష్టంగా చూశాడు; అతను తనను అనుసరించేలా చేశాడు మరియు వారి ఆర్థిక వ్యవహారాల బాధ్యత అతనికి అప్పజెప్పాడు. జుడాస్ డబ్బు దోచుకుంటాడని యేసుకు తెలిసి ఉంటే, అలాంటి వ్యవహారాలను ఆయన అతనికి ఎప్పుడూ అప్పజెప్పేవాడు కాదు. ఈ వ్యక్తి వంకర బుద్ధిగలవాడని మరియు మోసగాడని లేదా అతను తన సోదరసోదరీమణులను మోసగిస్తాడని యేసుకు మొదట్లో తెలియదని చెప్పవచ్చు. ఆతర్వాత, జుడాస్ కొంతకాలం యేసును అనుసరించిన తర్వాత, అతను తన సోదరసోదరీమణులను తీయని మాటలతో వంచించడం మరియు దేవుడిని వంచించడం యేసు చూశాడు. డబ్బు సంచిలో నుండి డబ్బు దొంగిలించే అలవాటు జుడాస్‌కు ఉందని కూడా ప్రజలు కనిపెట్టారు, అప్పుడే దాని గురించి వారు యేసుకు చెప్పారు. అప్పుడే యేసుకు జరిగేదంతా తెలిసింది. యేసుకు శిలువ వేయించుకునే కార్యాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది కాబట్టి, ఆయనకు నమ్మకద్రోహం చేసే ఎవరైనా అవసరం కాబట్టి, ఈ పాత్రను పోషించడానికి సరైన వ్యక్తిగా జుడాస్ అప్పుడే కనిపించాడు కాబట్టే, “నాకు నమ్మకద్రోహం చేసేవాడు మనలోనే ఒకడు ఉంటాడు. మనుష్య కుమారుడు ఈ నమ్మకద్రోహాన్ని శిలువ వేయించుకోవడానికి ఉపయోగిస్తాడు, మూడు రోజుల తర్వాత పునరుత్థానం చేయబడతాడు” అని యేసు అన్నాడు. ఆ సమయంలో, నిజానికి యేసు తనకు నమ్మకద్రోహం చేయడానికి జుడాస్‌ను ఎంచుకోలేదు, అలా కాకుండా, జుడాస్ విశ్వాసపాత్రుడైన శిష్యుడిగా ఉంటాడని ఆయన ఆశించాడు. అనుకోకుండా, జుడాస్ ప్రభువుకు ద్రోహం చేసే దురాశతో దిగజారిపోయిన వ్యక్తిగా మారుతాడు, కాబట్టి యేసు ఈ కార్యము కోసం జూడాస్‌ను ఎంచుకోవడానికి ఈ పరిస్థితిని ఉపయోగించుకున్నాడు. యేసు పన్నెండు మంది శిష్యులందరూ విశ్వాసపాత్రులై ఉండి ఉంటే, మరియు వారిలో జుడాస్ లాంటి వారు లేకపోయి ఉంటే, అప్పుడు అంతిమంగా యేసుకు నమ్మకద్రోహం చేసే వ్యక్తి ఆ శిష్యులలో ఒకరు కాకుండా వేరే ఎవరైనా అయి ఉండేవారు. అయితే, ఆ సమయంలో, లంచం తీసుకోవడాన్ని ఇష్టపడే ఒకడు—జుడాస్ శిష్యులలో ఉండటం అనుకోకుండా జరిగింది. కాబట్టి, తన కార్యమును పూర్తి చేయడానికి ఈ వ్యక్తిని యేసు ఉపయోగించాడు. ఇది ఎంత సులువుగా ఉంది! తన కార్యము ప్రారంభంలో యేసు దానిని ముందుగా నిర్ణయించలేదు; పరిస్థితులు ఒక స్థాయికి చేరుకున్నాకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది యేసు నిర్ణయం, మరో మాటలో చెప్పాలంటే, ఇదే స్వయంగా దేవుడి ఆత్మ నిర్ణయం. అసలైతే, జుడాస్‌ను ఎంచుకున్నది యేసయ్యే; తరువాత యేసుకు జుడాస్ ద్రోహం చేసినప్పుడు, అలా చేయడమనేది తన సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ చేసిన పనే. ఇది ఆ సమయంలో పరిశుద్ధాత్మ కొనసాగించిన పని. జుడాస్‌ను యేసు ఎంచుకున్నప్పుడు, జుడాస్ తనకు నమ్మకద్రోహం చేస్తాడని ఆయనకు తెలియదు. ఇతను జుడాస్ ఇస్కారియోట్ అని మాత్రమే ఆయనకు తెలుసు. నేటి మీ సమర్పణ స్థాయి మరియు మీ జీవిత అభివృద్ధి స్థాయి ప్రకారమే మీ ఫలితాలు కూడా నిర్ణయించబడతాయి, అంతేగానీ, లోకం సృష్టించబడినప్పుడు నీ ఫలితాలు ముందుగానే నిర్ణయించబడ్డాయనే మనుష్యుల అభిప్రాయం ప్రకారం కాదు. నీవు ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏ కార్యము కూడా ఇలా ఉండాలని నీవు ఊహించినట్లు చేయబడదు.

మునుపటి:  విమోచన యుగం నాటి కార్యము వెనుక దాగియున్న నిజమైన కథ

తరువాత:  పేర్లు మరియు గుర్తింపుకు సంబంధించిన విషయాలు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger