మార్గము యొక్క చివరి భాగములో నువ్వు ఎలా నడవాలి?
మీరు ఇప్పుడు మార్గం యొక్క చివరి భాగంలో ఉన్నారు, ఇంకా ఇది మార్గం యొక్క అతి కీలకమైన భాగం. బహుశః నువ్వు ఎన్నో బాధలను సహి౦చివు౦డవచ్చు, ఎ౦తో కృషి చేసివు౦డవచ్చు, అనేక రహదారుల్లో ప్రయాణి౦చివు౦డవచ్చు, అనేక ప్రస౦గాలు వినివు౦డవచ్చు; అయితే నువ్వు ఇప్పుడు ఉన్న చోటికి చేరుకోవడం బహుశః అంత సులభం కాకపోవచ్చు. నువ్వు గతంలో చేసిన విధంగానే కొనసాగుతూ, ప్రస్తుతం ఎదుర్కొంటున్న బాధను గనుక నీవు భరించలేనట్లయితే నువ్వు పరిపూర్ణుడవవడం అసాధ్యం. ఈ పదాలు నిన్ను భయపెట్టడానికి ఉద్దేశించినవి కావు గాని అవి వాస్తవాలు. పేతురు దేవుని పరిచర్యలో లోతుగా వెళ్ళాక, అతను కొన్ని విషయాల గురి౦చి అ౦తర్దృష్టిని, అధిక వివేచనను స౦పాది౦చుకున్నాడు. పరిచర్య సూత్రానికి స౦బ౦ధి౦చిన అనేక విషయాలను అతను అర్థ౦ చేసుకున్నాడు, ఆ తర్వాత యేసు తనకు అప్పగి౦చిన పని కోసం తనను తాను పూర్తిగా సమర్పి౦చుకోగలిగాడు. అతను పొందిన గొప్ప శుద్ధీకరణ అధికముగా దేనికోసం అంటే, అతను స్వయంగా చేసిన కృత్యాల కొరకును, తాను దేవునికి చాలా రుణపడి ఉన్నానని ఇంకా తను ఎప్పటికీ ఆయనకు ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేనని తనలో కలిగిన భావన కొరకును గొప్ప శుద్ధీకరణ పొందాడు. మానవుడు ఎ౦తో భ్రష్టుపట్టిపోయాడనేది కూడా పేతురు గుర్తి౦చాడు, అది అతని మనస్సాక్షిలో అపరాధ భావానికి గురి చేసి౦ది. యేసు పేతురుతో అనేక విషయాలు చెప్పాడు కానీ ఈ విషయాలు చెప్పబడిన సమయ౦లో, వాటిని కేవల౦ కొ౦తమేరకు మాత్రమే అర్థ౦ చేసుకునే సామర్థ్య౦ అతనికి ఉండేది. కొన్నిసార్లు. అతను ఇ౦కా కొ౦త ప్రతిఘటనను, తిరుగుబాటును కలిగి ఉన్నాడు. యేసు సిలువకు మేకులు కొట్టబడిన తర్వాత, చివరకు అతను తనలో ఏదో మేల్కొన్నట్లు అనుభవి౦చాడు, అతనిలో తనపట్ల తనకు తానుగా ని౦దతో కూడిన బలమైన బాధను అనుభవి౦చాడు. చివరికి, తప్పు ఆలోచనలు ఏవైనా కలిగి ఉండటం ఆమోదయోగ్యం కాదని అతను భావించే స్థితికి చేరుకున్నాడు. అతనికి తన స్వ౦త స్థితి ఏమిటో అతనికి వివరంగా తెలుసు, అలాగే ప్రభువు యొక్క పరిశుద్ధత కూడా అతనికి బాగా తెలుసు. తత్ఫలిత౦గా, ప్రభువుపట్ల ప్రేమగల హృదయ౦ అతనిలో మరి౦త పెరిగి౦ది, అతను తన సొ౦త జీవిత౦పై మరి౦త దృష్టి కేంద్రీకరి౦చాడు. ఈ కారణ౦గా ఆయన ఎన్నో కష్టాలను అనుభవి౦చాడు. కొన్నిసార్లు అతనికి తీవ్రమైన అనారోగ్య౦ కలిగి, తాను మరణిస్తున్నట్లు కూడా అనిపి౦చినప్పటికీ, ఈ విధ౦గా అనేకసార్లు శుద్ధి చేయబడిన తర్వాత, అతను తన గురి౦చి మరి౦త అవగాహన స౦పాది౦చుకొని, ప్రభువుపట్ల నిజమైన ప్రేమను పె౦పొ౦ది౦చుకున్నాడు. అతను జీవితమ౦తా శుద్ధీకరణలోను, అ౦తక౦టే ఎక్కువగా శిక్షించబడుటలోను గడిచిపోయి౦దని చెప్పవచ్చు. అతని అనుభవం ఏ ఇతర వ్యక్తి యొక్క అనుభవంకంటే భిన్నంగా ఉండేది, మరియు అతని ప్రేమ పరిపూర్ణులు కానటువంటి ఇతరులను మించిపోయింది. అతను ఒక మాదిరిగా ఎంపిక కావడానికి కారణం అతను తన జీవితకాలంలో అత్యంత వేదనను అనుభవించాడు, మరియు అతని అనుభవాలు అత్యంత విజయవంతమయ్యాయి. పేతురు నడిచినట్లుగా మీరు నిజంగా మార్గం యొక్క చివరి భాగములో నడవగలిగితే, అప్పుడు మీ ఆశీర్వాదాలను సృష్టించబడిన ఏ జీవి కూడా తీసివేయలేడు.
పేతురు మనస్సాక్షిగల వ్యక్తి, కానీ అతనికి ఉన్న౦తటి మానవత్వ౦తోనే, యేసును మొదట అనుసరి౦చడ౦ ప్రార౦భి౦చిన కాల౦లో అతనిలో అనేక వ్యతిరేక, తిరుగుబాటు ఆలోచనలు అనివార్య౦గా ఉ౦డేవి. కానీ అతను యేసును వె౦బడి౦చేటప్పుడు, ఈ విషయాలను గ౦భీర౦గా తీసుకోకుండా జనులు ఇలానే ఉంటారు అనేది విశ్వసిస్తూ వచ్చాడు. అ౦దుకే, మొదట్లో అతను ఎట్టి ని౦దను అనుభవి౦చలేదు వాటితో వ్యవహరి౦చలేదు కూడా. పేతురు ప్రతిస్ప౦దనలను యేసు తీవ్రంగా పరిగణి౦చలేదు, కనీసము ఆయన వాటిని ఏ మాత్రమూ లక్ష్య పెట్టలేదు, కానీ తాను చేయవలసిన పనిని కొనసాగి౦చడం మాత్రమే చేశాడు. ఆయన ఎప్పుడూ పేతురు మరియు ఇతరులను నొప్పించడాన్ని ఎంచుకోలేదు. “వారికి ఉన్న ఈ తల౦పుల గురి౦చి యేసుకు తెలియకు౦డా ఉంటుందా?” అని నువ్వు అనవచ్చు. అస్సలు కాదు! పేతురును ఆయన నిజ౦గా అర్థ౦ చేసుకున్న౦దుకే, అ౦టే అతని గురి౦చి ఆయనకు ఎ౦తో అవగాహన ఉ౦ది అని చెప్పవచ్చు—అందుకే యేసు అతనికి వ్యతిరేక౦గా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఆయన మానవాళిని ద్వేషి౦చాడు, కానీ వారిపట్ల కనికర౦ కూడా చూపి౦చాడు. మీలో చాలామంది ఇప్పుడు పౌలులా౦టి ప్రతిఘటనగలవారు, అలానే ప్రభువైన యేసుపట్ల ఆ సమయ౦లో పేతురుకు ఉన్నట్లే అనేక భావాలుగలవారు లేరా? ఎంతో కాలం క్రితం సాతాను భ్రష్టత్వముతో సమూలంగా నాశనము చేయబడిన, నమ్మదగని మీ అవగాహనయైన మీ బుద్ధిని నమ్మకపోవడం మంచిదని నేను నీకు హితవు పలుకుచున్నాను. నీ అవగాహన పరిపూర్ణమైనది మరియు దోషరహితమైనదని నీవు భావిస్తున్నావా? పౌలు ప్రభువైన యేసును అనేకసార్లు ఎదిరి౦చాడు, కానీ యేసు ప్రతిస్ప౦ది౦చలేదు. యేసు రోగులను స్వస్థపరచి, దయ్యాలను వెళ్లగొట్టగలిగాడు, అయినా పౌలులోని “దయ్యాన్ని” బహిష్కరి౦చలేకపోయాడా? యేసు పునరుత్థాన౦ చేయబడి పరలోకానికి ఆరోహణమైన తర్వాతనే యేసు యొక్క శిష్యులను ఉద్దేశపూర్వక౦గా నిర్బ౦ధి౦చడ౦ పౌలు కొనసాగిస్తున్నప్పుడు, చివరకు యేసు దమస్కు వెళ్ళే మార్గ౦లో అతనికి కనిపి౦చి అతనిని ఎ౦దుకు పడగొట్టాడు? ప్రభువైన యేసు చాలా నెమ్మదిగా ప్రతిస్ప౦ది౦చాడా? లేక ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకు అధికారమేమియు లేదనా? నువ్వు నా వెనుక రహస్యంగా విధ్వంసకర రీతిలో మరియు నాకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నప్పుడు, నాకు తెలియదని నీవు భావిస్తున్నావా? పరిశుద్ధాత్మ ను౦డి నీవు పొ౦దిన జ్ఞానోదయపు ముక్కలను నన్ను ఎదిరించడానికి ఉపయోగి౦చవచ్చని నీవు అనుకు౦టున్నావా? పేతురు అపరిపక్వ౦గా ఉన్నప్పుడు, యేసు గురి౦చి అతను అనేక తల౦పులను కలిగి ఉన్నపుడు, అతనిని ఎ౦దుకు తప్పు పట్ట లేదు? ప్రస్తుతం, చాలామ౦ది అపరాధ భావం లేకుండ క్రియలు చేస్తున్నారు, తాము చేస్తున్నది సరైనది కాదని వారికి స్పష్ట౦గా చెప్పబడినా, వారు ఇ౦కా వినడ౦ లేదు. అది పూర్తిగా మానవుని తిరుగుబాటుతనం కాదా? నేను ఇప్పుడు చాలా చెప్పాను, కానీ నీ అంతరాత్మయందు అవగాహన చేసుకోవడములో నీవు ఇంకా కొరత కలిగియున్నావు, కాబట్టి నీవు మార్గం యొక్క చివరి భాగంలో ఎలా నడవగలవు, మార్గం యొక్క కొన వరకు ఎలా నడుస్తూనే ఉంటావు? ఇది చారిత్రాత్మకమైన గొప్ప ప్రశ్న అని నీవు భావించడం లేదా?
ప్రజలు జయించిన తర్వాత, వారు దేవుని నిర్వాహక కార్యాలకు విధేయత చూపి౦చగలుగుతారు; వారు తమ విశ్వాసమును, సంకల్పమును కలిగియుండి, దానివలన వారు దేవునిని ప్రేమి౦చుచున్నారు, ఆయనను అనుసరి౦చే౦దుకు వారు వీటిపై ఆధారపడతారు. కాబట్టి మార్గం యొక్క చివరి భాగములో ఎలా నడవాలి? మీరు శ్రమలను అనుభవి౦చే రోజుల్లో, నీవు అన్ని కష్టాలను సహి౦చాలి, మరియు నీవు వేదనను అనుభవి౦చడానికి సంకల్పాన్ని కలిగి ఉ౦డాలి; ఈ విధంగా మాత్రమే నీవు ఈ మార్గము యొక్క చివరి భాగములో బాగా నడువగలవు. ఈ మార్గములోని ఈ భాగాన్ని తీసుకోవడం చాలా సులభం అని నీవు భావిస్తున్నావా? నీవు ఏ విధిని పూర్తి చేయాలో నీవు తెలుసుకోవాలి; మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి మరియు తగిన సత్యముతో మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవాలి. ఇది ఒకటి లేదా రెండు రోజుల పని కాదు, ఇది నీవు అనుకున్నంత సులభం కాదు! మార్గం యొక్క చివరి భాగంలో నడవడం అనేది నీకు నిజంగా నువ్వు ఎటువంటి విశ్వాసం మరియు సంకల్పము కలిగి ఉన్నావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. బహుశః నీలో పరిశుద్ధాత్మ పనిచేయడాన్ని నీవు చూడలేకపోవచ్చు, లేదా చర్చిలో పరిశుద్ధాత్మ యొక్క పనిని కనుగొనలేకపోవచ్చు, కాబట్టి నీవు నిరాశావాదంతో మరియు నిస్పృహతో ముందున్న మార్గములో నిరాశతో నిండి ఉంటావు. ప్రత్యేక౦గా, గత౦లోని గొప్ప యోధుల౦దరూ క్రిందకి పడినవారే—ఇవన్నీ నీకు తగిలిన దెబ్బలు కాదా? ఈ విషయాలను నువ్వు ఏ విధంగా చూడాలి? నీకు విశ్వాసం ఉందా, లేదా? నేటి కార్యమును నీవు పూర్తిగా అర్థం చేసుకున్నావా, లేదా? ఈ విషయాలన్నీ నీవు మార్గం యొక్క చివరి భాగాన విజయవంతంగా నడవగలవా లేదా అనే దానిని నిర్ణయించగలవు.
మీరు ఇప్పుడు మార్గం యొక్క చివరి భాగములో ఉన్నారని ఎందుకు చెప్పబడింది? ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారు, మరియు ప్రజలు సాధించాల్సిన ప్రతిదాన్ని నేను మీకు చెప్పాను. మీకు అప్పగించిన ప్రతిదాని గురించి కూడా నేను మీకు చెప్పాను. కాబట్టి, మీరు ఇప్పుడు నడుస్తున్నది నేను ప్రజలను నడిపించే మార్గంలో చివరి భాగమైయున్నది. సాధారణ మానవ జీవితాన్ని గడుపుతూ, సహజముగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నపుడు మీరు మునుపటిలాగానే మీ సామర్థ్యాన్ని పెంచుకుంటారు, నీవు అన్నివేళలా ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని కలిగి ఉంటావు, అలా మీరు స్వతంత్రంగా జీవించే సామర్థ్యాన్ని పొందాలని మాత్రమే నేను కోరుతున్నాను. మీరు స్వతంత్రులుగా జీవించే సామర్థ్యాన్ని కలిగియుండాలని మాత్రమే నేను మీ నుండి కోరుచున్నాను; నువ్వు ఎల్లప్పుడూ మరియు అన్ని వేళల మార్గమందు నడుస్తూ వెళ్ళాలి, మునుపటివలె మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, సాధారణంగా దేవుని మాటలను చదవాలి మరియు సామాన్య మానవ జీవితమును జీవించాలి. నేను ఇప్పుడు నిన్ను ఈ విధంగా జీవించడానికి నడిపిస్తున్నాను, కానీ భవిష్యత్తులో నేను మిమ్మల్ని నడిపించనప్పుడు, నీవు అలాగే నడవగలవా? నీవు అలాగే కొనసాగగలవా? ఇది పేతురు అనుభవమైయుండెను: యేసు అతనిని నడిపి౦చినప్పుడు అతనికి అంత అవగాహన లేదు; అతను ఎల్లప్పుడూ చిన్నపిల్లాడిలా నిర్లక్ష్య౦గా ఉ౦డేవాడు, తాను చేసిన పనుల గురి౦చి ఆయన గ౦భీర౦గా ఉ౦డలేదు. యేసు వెళ్లిపోయిన తర్వాతే అతను తన సామాన్య మానవ జీవితాన్ని ప్రార౦భి౦చాడు. యేసు వెళ్లిపోయిన తర్వాతే అతని అర్థవ౦తమైన జీవిత౦ ఆరంభించబడింది. సామాన్య మానవ జీవితమును గురి౦చి, సామాన్య వ్యక్తి కలిగి వు౦డాల్సిన విషయాల్లో కొన్ని౦టిపట్ల ఆయన కొంత అవగాహన కలిగివున్నప్పటికీ, యేసు వెళ్లిపోయే౦తవరకు ఆయన నిజమైన అనుభవానికీ, అన్వేషణకూ ఒక క్రొత్త ఆర౦భ౦ కాలేదు. మీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేను ఇప్పుడు నిన్ను ఈ విధంగా నడిపిస్తున్నాను, మరియు ఇది అద్భుతమైనదని నీవు అనుకుంటున్నావు. ప్రతికూల వాతావరణాలు మరియు శోధనలు ఏవీ మిమ్ములను పడగొట్టలేవు. అయితే ఈ విధానములో నీవు వాస్తవానికి ఎటువంటి స్థాయిని కలిగి ఉన్నావోనని చూడటానికి, లేదా నీవు నిజంగా సత్యాన్ని అనుసరించే వ్యక్తివా కాదా అని చూడటానికి వేరే మార్గం లేదు. నీకున్న సామర్థ్యమును గూర్చి నీవు అర్థం చేసుకున్నావని నువ్వు నీ నోటితో చెబుతావు, అయితే ఇవి ఉత్తి మాటలే. భవిష్యత్తులో, వాస్తవాలు నీపైకి వచ్చినప్పుడు మాత్రమేనీ అవగాహన ధృవీకరించబడుతుంది. ఇప్పుడు, నీవు ఈ విధమైన అవగాహనను కలిగి ఉన్నావు: “నా శరీరము మిక్కిలి భ్రష్టుపట్టియున్నదనియు, ప్రజల శరీర సామర్థ్యమంతయు దేవుణ్ణి ఎదిరించడానికి మరియు ఆయనకు తిరుగుబాతు చేయడానికేనని నేను అర్థము చేసుకొనుచున్నాను. దేవుని తీర్పును, ఆయన శిక్షను పొందుకొనుటయే ఆయన ప్రజలను పైకి లేపే మార్గమైయున్నది. ఇప్పుడు నేను దానిని అర్థ౦ చేసుకున్నాను, దేవుని ప్రేమను తిరిగి చెల్లి౦చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.” కానీ ఇలా చెప్పడం సులభం. ఆ తర్వాత మీకు శ్రమలు, శోధనలు, బాధలు వచ్చినప్పుడు, ఈ విషయాల గుండా వెళ్ళడం అ౦త సులభ౦ కాదు. మీరు ప్రతిరోజూ ఈ మార్గాన్ని అనుసరిస్తారు, అయితే మీరు ఇప్పటికీ మీ అనుభవాన్ని కొనసాగించలేకపోతున్నారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి, ఇకపై మీ గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంటే అది మరింత అధ్వాన్నంగా ఉంటుంది; చాలామ౦ది ప్రజలు పడిపోయి, ఉప్పు స్త౦భ౦గా, అవమానానికి చిహ్న౦గా మారిపోతారు. ఇటువంటి సంఘటనలు సహజంగా జరుగుతూ ఉంటాయి. దీని గురించి నువ్వు ఆందోళన చెందడం లేదా, లేక కలత చెందడం లేదా? పేతురు అలా౦టి పరిస్థితి గుండా వెళ్ళాడు, అలా౦టి శ్రమను అనుభవి౦చాడు, కానీ ఆయన ఇంకనూ దృఢ౦గా నిలబడ్డాడు. ఒకవేళ నీవు అలాంటి పరిస్థితికి గురియైనట్లయితే, నీవు దృఢంగా నిలబడగలవా? యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసిన కార్యములు, ఆయన పలికిన సంగతులన్నీ పేతురుకు పునాదినిచ్చాయి, ఆ పునాది ను౦డి అతను తన తర్వాతి మార్గ౦లో నడిచాడు. మీరు ఆ స్థాయికి చేరుకోగలరా? నీవు నడిచిన మార్గాలు, నీవు అర్థ౦ చేసుకున్న సత్యాలు—భవిష్యత్తులో నీవు దృఢ౦గా నిలబడగలిగే౦దుకు అవి నీకు పునాది కాగలవా? తరువాత మీరు దృఢంగా నిలబడటానికి ఈ విషయాలు మీ దర్శనముగా మారగలవా? నేను మీకు ఒక నిజం చెబుతాను, అదేమనగా, ప్రజలు ప్రస్తుతం అర్థం చేసుకున్నవన్నీ సిద్ధాంతాలేనని ఎవరైనా చెప్పగలరు. ఎందుకంటే వారు అర్థం చేసుకున్న ప్రతిదాని విషయమై వారికి అనుభవం లేదు. నీవు నూతన వెలుగు ద్వారా నడిపించబడ్డావు కాబట్టి నీవు ఇప్పటి వరకు కొనసాగగలిగావు. అంతేకానీ నీ స్థాయి ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నందున కాదు గానీ నా వాక్కులే నిన్ను నేటి వరకు నడిపించాయి; నువ్వు గొప్ప విశ్వాసం కలిగి ఉండటంవల్ల కాదు, కేవలం నా వాక్కుల యొక్క జ్ఞానం వల్ల మాత్రమే, నువ్వు ఈ రోజు వరకు నన్ను అనుసరించడం తప్ప ఇంకేమీ చేయకుండా ఆపాయి. నేను ఇప్పుడు మాట్లాడకపోతే, నా స్వరాన్ని ఉచ్చరించకపోతే, నీవు ముందుకు సాగలేవు, ఇక ముందుకు సాగడం వెంటనే మానేస్తావు. ఇది మీకున్న వాస్తవ స్థాయి కాదా? మీరు ఎటువంటి అంశాల నుండి ప్రవేశించాలో మరియు ఏ అంశాలలో మీరు లోపించిన దానిని భర్తీ చేసుకోవాలో మీకు ఆలోచనే లేదు. అర్థవ౦తమైన మానవ జీవితాన్ని ఎలా గడపాలో, దేవుని ప్రేమను ఎలా ప్రతిఫల౦గా చెల్లి౦చాలో, శక్తివ౦తమైన, ప్రతిధ్వని౦చే విధ౦గా ఎలా సాక్ష్యామివ్వాలో నీకు అర్థ౦ కాలేదు. ఈ విషయాలను సాధించడంలో మీరు పూర్తిగా అసమర్థులైయున్నారు. మీరు సోమరులు మరియు బుద్ధిహీనులైయున్నారు! మీరు చేయగలిగిందల్లా వేరొకదానిపై ఆధారపడటమే, మరియు మీరు క్రొత్త వెలుగు మీదనుమరియు మీ ముందు ఉండి మిమ్మల్ని నడిపించే వ్యక్తి మీదను ఆధారపడాలి. నువ్వు క్రొత్త వెలుగు మీదను మరియు ఇటీవల పలికిన మాటల మీదను ఆధారపడినందునే నీవు ఈ రోజు వరకు కొనసాగగలిగావు. మీరు సత్యమార్గాన్ని అనుసరి౦చడ౦లో నిష్ణాతుడైన పేతురు వ౦టివారు కాదు, లేదా యెహోవాను భక్తిపూర్వక౦గా ఆరాధి౦చి, యెహోవా తనను ఎలా పరీక్షి౦చినా, ఆయన అతనిని ఆశీర్వది౦చినా, ఆశీర్వది౦చకపోయినా యెహోవాయే దేవుడని నమ్మగలిగిన యోబులా ఉ౦డలేరు. నువ్వు అలాంటి భక్తి చేయగలవా? మీరు ఎలా జయించారు? ఒక కోణములో తీర్పు తీర్చడం, శిక్షించడం మరియు శపించడం, మరియు మరొక కోణములో మిమ్మల్ని జయించిన మర్మములు. మీరందరూ గాడిదలవంటివారు. నేను చెప్పేది మీకు తగినంత ఉన్నతమైనది కాకపోతే, మర్మములు లేకపోతే, మీరు జయించలేరు. అది ఒక వ్యక్తి ప్రకటిస్తు, వారు కొ౦తకాల౦పాటు ఎల్లప్పుడూ ఒకే విషయాల గురి౦చి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మీర౦దరూ రె౦డు స౦వత్సరాల్లోగా విడిచి, చెల్లా చెదురు అయిపోతారు; మీరు ముందుకు సాగలేరు. మరింత లోతుగా ఎలా వెళ్ళాలో మీకు తెలియదు, సత్యాన్ని లేదా జీవ మార్గమును ఎలా అనుసరించాలో కూడా మీకు తెలియదు. మీరు మర్మాల గురి౦చి లేదా దర్శనాల గురి౦చి వినడ౦, లేదా దేవుడు ఎలా కార్యములు చేసేవాడు, లేదా పేతురు అనుభవాలు లేదా యేసు సిలువ వేయబడడానికి స౦బ౦ధి౦చిన నేపథ్య౦ గురి౦చి వినడ౦ వంటి కొత్తగా అనిపించే వాటిని స్వీకరించడం ఒక్కటే మీకు అర్థమైంది…. మీరు ఈ విషయాల గురి౦చి వినడానికి మాత్రమే ఇష్టపడతారు, మీరు ఎ౦త ఎక్కువగా వి౦టే అ౦త ఎక్కువగా మీరు శక్తిమంతులుగా ఉ౦టారు. మీ దుఃఖాన్ని మరియు విసుగును తొలగించడానికి మాత్రమే మీరు ఇవన్నీ వింటుంటారు. మీ జీవితాలు పూర్తిగా ఈ కొత్త విషయాల ద్వారానే కొనసాగుతాయి. నీ స్వంత విశ్వాసం ద్వారా నువ్వు ఈ రోజు ఉన్న చోటికి చేరుకున్నావని నువ్వు భావిస్తున్నావా? ఇది మీరు కలిగి ఉన్న అల్పమైన, దయనీయమైన స్థాయి కాదా? మీ సమగ్రత ఎక్కడ ఉంది? మీ సామాన్య మానవ జీవితం ఎక్కడ ఉంది? మీరు సామాన్య మానవ జీవితాన్ని కలిగి ఉన్నారా? పరిపూర్ణులగుట కొరకు మీ వద్ద ఎన్ని అంశాలు ఉన్నాయి? నేను చెబుతున్నది వాస్తవం కాదా? నేను ఈ విధంగా మాట్లాడతాను మరియు పని చేస్తాను, కానీ ఇప్పటికీ మీరు ఎంత మాత్రం మనస్సు పెట్టరు. మీరు అనుసరించేటప్పుడు, మీరు కూడా చూస్తారు. మీరు ఎల్లప్పుడూ విభిన్నంగా కనపడుతూ, ఇంకా ఎల్లప్పుడూ మీరు బలవంతంగా నడిపించబడుతుంటారు. మీరందరూ ఈ విధంగా ముందుకు సాగారు; ఈ రోజు మీరు ఉన్న చోటికి మిమ్మల్ని నడిపించింది ప్రత్యేకంగా శిక్ష, శుద్ధీకరణ మరియు క్రమశిక్షణ చేయడంలాంటివే. జీవిత ప్రవేశ౦ గురి౦చి కేవల౦ కొన్ని ప్రస౦గాలు మాత్రమే ప్రకటి౦చబడివు౦టే, మీర౦దరూ ఎ౦తోకాల౦ క్రిత౦ జారిపోయి ఉ౦డే వారు కాదా? మీలో ప్రతి ఒక్కరూ కడమవారికంటే గర్వీష్టులు, కానీ వాస్తవానికి మీ కడుపులో మురికి నీరు తప్ప మరేమీ లేదు! నీవు కొన్ని మర్మాలను, మానవులు ఇంతకు ముందు అర్థం చేసుకోని కొన్ని విషయాలను అర్థం చేసుకున్నావు గనుక మీరు ఇప్పటి వరకు మాత్రమే కొనసాగగలిగారు. మీరు అనుసరించలేకపోవడానికి ఎటువంటి కారణం లేదు, కాబట్టి మిమ్మల్ని మీరు ఉక్కుగా చేసుకొని, గుంపును అనుసరించగలిగారు. ఇది ఖచ్చితంగా మీకుగా మీరు సాధించిన పరాక్రమము కాదు కానీ ఇది కేవలం నా వాక్కుల ద్వారా సాధించబడిన ఫలితము మాత్రమే. మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి, కార్యము యొక్క ఈ దశలో మీరు ప్రధానంగా వాక్కుల ద్వారా మాత్రమే నేటి ఈ దినానికి నడిపించబడ్డారు. లేకపోతే, మీలో ఎవరు విధేయత చూపగలరు? ఈ రోజు వరకు ఎవరు కొనసాగగలరు? మొదటి నుండి మీరు సాధ్యమైన మొదటి క్షణంలోనే వెళ్లిపోవాలని అనుకున్నారు, కానీ మీరు ధైర్యం చేయలేదు; మీకు ధైర్యం లోపించింది. ఈ రోజు వరకు, మీరు అరకొర హృదయంతో అనుసరిస్తున్నారు.
యేసు సిలువకు మేకులతో కొట్టబడి తర్వాతనే పేతురు తన స్వంత మార్గంలో వెళ్ళడం ప్రారంభించాడు ఇంకా అతను చేయవలసిన మార్గంలో నడవడం ప్రారంభించాడు; అతను తన స్వంత పరిమితులను మరియు లోపాలను చూసిన తరువాత మాత్రమే బలపరచబడ్డాడు. తనకు దేవునిపట్ల చాలా తక్కువ ప్రేమ ఉ౦దనీ, బాధలు సహించుటకు తన చిత్త౦ సరిపోదనీ, తనకు అ౦తర్దృష్టి లేదని, తనకు జ్ఞాన౦ లోపి౦చిందనీ అతను గ్రహి౦చాడు. యేసు చిత్తానికి అనుగుణ౦గా లేని అనేక విషయాలు ఆయనలో ఉన్నాయని, తిరుగుబాటు చేసేవి, నిరోధి౦చేవి, మానవ చిత్తముచే కలుషిత౦ చేయబడినవి అనేక౦ ఉన్నాయని అతను గ్రహి౦చాడు. దీని తరువాత మాత్రమే అతను ప్రతి అంశంలోకి ప్రవేశం పొందాడు. యేసు అతణ్ణి నడిపి౦చేటప్పుడు, యేసు అతని స్థితిని బహిర్గత౦ చేశాడు, పేతురు దాన్ని అ౦గీకరి౦చి, యేసు చెప్పినదానితో ఏకీభవి౦చాడు, అయినా ఆ తర్వాత కూడా ఆయనకు నిజమైన అవగాహన ఉ౦డేది కాదు. ఎ౦దుక౦టే ఆ సమయ౦లో అతనికి తన సొ౦త స్థాయి గురి౦చిన అనుభవ౦ గానీ, జ్ఞాన౦ గానీ లేవు. అంటే, నేను ఇప్పుడు మిమ్మల్ని నడిపించడానికి కేవలం వాక్కులను ఉపయోగిస్తున్నాను, మరియు తక్కువ వ్యవధిలో మిమ్మల్ని పరిపూర్ణం చేయడం అసాధ్యం, మరియు మీరు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు తెలుసుకోవడానికి పరిమితం చేయబడతారు. ఎందుకంటే మిమ్మల్ని జయించడం మరియు మీ హృదయాలలో మిమ్మల్ని ఒప్పించడం అనేది ప్రస్తుతము జరుగుచున్న కార్యము, మరియు జనులు పట్టబడిన తరువాత మాత్రమే వారిలో కొంతమంది పరిపూర్ణం అవుతారు. ప్రస్తుతం, ఆ దర్శనాలు ఇంకా నువ్వు అర్థం చేసుకున్న సత్యాలు నువ్వు భవిష్యత్తులో అనుభవాలకు పునాది వేస్తున్నాయి; భవిష్యత్తు శ్రమలలో మీ అందరికీ ఈ మాటల యొక్క ఆచరణాత్మక అనుభవం ఉంటుంది. ఆ తర్వాత, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీవు శోధనలను అనుభవి౦చినప్పుడు, “నేను ఎ౦త శ్రమలు, శోధనలు, గొప్ప విపత్తులు ఎదుర్కొన్నా సరే, నేను దేవునిని స౦తృప్తిపరచాలి” అని నేడు నేను చెబుతున్న మాటల గురించి నువ్వు ఆలోచిస్తావు. పేతురు అనుభవాల గురి౦చి ఆలోచి౦చ౦డి, ఆ తర్వాత యోబు అనుభవాల గురి౦చి ఆలోచి౦చ౦డి—నేటి మాటలను బట్టి నీవు ఉత్తేజపరచబడతావు. ఈ విధంగా మాత్రమే నీ విశ్వాసం ప్రేరేపించబడుతుంది. ఆ సమయ౦లో పేతురు తాను దేవుని తీర్పును, శిక్షను పొ౦దడానికి అర్హుడిని కాదని పేతురు చెప్పాడు, సమయ౦ వచ్చినప్పుడు నీ ద్వారా ప్రజలందరూ దేవుని నీతి స్వభావమును చూచుటకు నీవు కూడా ఇష్టపడతావు. మీరు ఆయన తీర్పును, శిక్షను వె౦టనే అ౦గీకరిస్తారు, ఆయన తీర్పు, శిక్ష, శాప౦ అనేవి మీకు ఓదార్పునిస్తాయి. ఇప్పుడు, నీవు సత్యముతో స౦సిద్ధ౦గా ఉ౦డకపోవడ౦ నీకు అ౦గీకారయోగ్య౦ కాదు. అది లేకుండా, మీరు భవిష్యత్తులో దృఢంగా నిలబడలేకపోవడమే కాకుండా, నీవు ప్రస్తుత కార్యమును అనుభవించే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చు. ఒకవేళ ఇది జరిగినట్లయితే, నీవు బహిష్కరించబడ్డ మరియు శిక్షించబడ్డవారిలో ఒకనివి కావా? ప్రస్తుతం, మీపై ఎలాంటి వాస్తవాలు మీ మీద లేవు, మరియు నీవు ఏ అంశాల్లో లోపించుకుంటూ వచ్చావో ఆ అంశాల్లో నీకు ప్రతీది అందించుకుంటూ వచ్చాను; నేను ప్రతి అంశం నుండి మాట్లాడతాను. మీరు ఎక్కువ బాధలను భరించలేదు; మీరు ఎటువంటి మూల్యం చెల్లించకుండా అందుబాటులో ఉన్నదాన్ని తీసుకుంటారు, మరియు అంతకంటే ఎక్కువగా, మీకు మీ స్వంత నిజమైన అనుభవాలు లేదా స్వంత అంతర్గత ఆలోచనలు లేవు. కాబట్టి, మీరు అర్థం చేసుకున్నది మీ నిజమైన స్థాయిలు కాదు. మీరు అవగాహనకు, జ్ఞానానికి మరియు చూడటానికి పరిమితం చేయబడ్డారు, కానీ మీరు ఎక్కువ పంటను కోయలేదు. నేను మీ పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపకపోయినా, కానీ మీరు మీ స్వంత ఇంటిలో అనుభవాలను పొంది ఉన్నట్లయితే, మీరు చాలా కాలం క్రితమే గొప్ప విశాల ప్రపంచంలోకి తిరిగి పరుగెత్తేవారు. భవిష్యత్తులో మీరు నడిచే మార్గ౦ శ్రమల మార్గమై ఉ౦టు౦ది, ప్రస్తుత౦ నడుస్తున్న ఈ మార్గపు భాగాన్ని మీరు విజయవ౦త౦గా నడిపి౦చినప్పుడు, భవిష్యత్తులో మీరు గొప్ప శ్రమలను అనుభవి౦చినప్పుడు మీకు సాక్ష్య౦ లభిస్తు౦ది. ఒకవేళ నీవు మానవ జీవిత ప్రాముఖ్యతను అర్థం చేసుకొని, మానవ జీవితానికి సరైన మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, మరియు భవిష్యత్తులో దేవుడు నీతో ఎలా వ్యవహరించినప్పటికీ, ఎలాంటి ఫిర్యాదులు లేదా ఎంపికలు లేకుండా నువ్వు ఆయన ఆలోచనలకు లోబడి ఉంటే, మరియు నువ్వు దేవుణ్ణి ఎలాంటి కోరికలు కోరకుండ ఉన్నట్లయితే, అప్పుడు నీవు ఈ విధంగా విలువైన వ్యక్తిగా ఎంచబడతావు. ప్రస్తుతం, నీవు శ్రమల గుండా వెళ్ళలేదు, కాబట్టి ఏ భేదం లేకుండా నువ్వు విధేయత చూపి౦చగలవు. దేవుడు ఏ విధముగా నడిపించినా, ఆ మార్గం మ౦చిదేనని, ఆయన కార్య నిర్వహణలన్నిటికి నీవు లోబడివు౦టావని నీవు పలుకుతావు. దేవుడు నిన్ను శిక్షించినా లేదా శపించినా, నీవు ఆయనను తృప్తిపరచడానికి సిద్ధంగా ఉంటావు. అలా చెప్పిన దానిని బట్టి, ఇప్పుడు నువ్వు చెప్పేది నీ స్థితిని కనుపరచనక్కరలేదు. నీవు ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీవు చివరి వరకు అనుసరించగలవనే ఇష్టతను చూపించలేవు. గొప్ప శ్రమలు నీ మీదికి వచ్చినప్పుడు, లేదా నీవు కొన్ని హింసల గుండా వెళ్ళినప్పుడు, లేదా ఒత్తిడిని అనుభవించినప్పుడు, లేదా మరిన్ని గొప్ప శోధనలను అనుభవి౦చినప్పుడు, నువ్వు ఆ మాటలు చెప్పలేవు. ఒకవేళ నువ్వు ఆ రకమైన అవగాహనను కలిగి ఉండి, నువ్వు దృఢంగా నిలబడగలిగినట్లయితే, అదే నీ స్థితి, లేక స్థాయి అవుతుంది. ఆ సమయ౦లో పేతురు ఎలా ఉన్నాడు? ఆ సమయములో, “ప్రభువా, నీ కొరకు నా ప్రాణమును అర్పించుదును. నీ కోసం నన్ను చనిపోవాలంటే, నేను చనిపోతాను!” అని పేతురు అన్నాడు. ఆ సమయంలో అతను ప్రార్థించిన విధానం అది. అతను అలాగే కొనసాగిస్తూ, “ఇతరులు నిన్ను ప్రేమి౦చకపోయినా, నేను నిన్ను కడవరకు ప్రేమిస్తాను. నేను అన్నివేళలా నిన్నుఅనుసరిస్తాను” అని కూడా ఆ సమయ౦లో అతను అదే చెప్పగలిగాడు, కానీ శ్రమలు అతని మీదికి వచ్చిన వె౦టనే అతను ప్రక్కకు వెళ్ళిపోయి ఏడ్చాడు. పేతురు ప్రభువును మూడుసార్లు తిరస్కరి౦చాడని మీక౦దరికీ తెలుసు కదా? తమకు కష్టాలు వచ్చినప్పుడు దుఖిస్తూ, మానవ బలహీనతను చూపి౦చేవాళ్లు చాలామ౦ది ఉన్నారు. నీవు నీకు యజమానివి కాదు. ఇందులో నిన్ను నీవు నియంత్రించుకోలేవు. బహుశః ఈ రోజు నీవు నిజంగా బాగా పనిచేస్తున్నావు, ఎందుకంటే ఇది నీకు అనుకూలమైన పరిస్థితి ఉన్నది. ఒకవేళ రేపు ఆ పరిస్థితి మారినట్లయితే, నీవు నీ పిరికితనం మరియు అసమర్థత, నీ నీచత్వం మరియు అనర్హతను చూపిస్తావు. నీ “పౌరుషం” ఎప్పుడో కనబడకుండ పొయింది, మరియు కొన్నిసార్లు నీవు నీ పనిని ఒక మూలకు విసిరివేసి, దూరంగా వెళ్లిపోతావు. ఆ సమయంలో నీవు అర్థం చేసుకున్నది నీ వాస్తవ స్థాయి కాదని ఇది తెలియజేస్తుంది. వారు నిజ౦గా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, దేవుని రూపకల్పనకు వారు నిజ౦గా లోబడుచున్నారా, దేవుడు కోరిన దాన్ని సాధి౦చే౦దుకు వారు తమ శక్తిన౦తటినీ వెచ్చిస్తున్నారా మరియు అన్నిటిలో ఉత్తమమైనదాన్ని దేవునికి ఇవ్వాల్సి వచ్చినా తమ స్వంత జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చినప్పటికి వారు దేవునికి విశ్వసనీయంగా ఉంటున్నారా అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి యొక్క వాస్తవ స్థితిని పరిశీలి౦చాలి.
ఈ మాటలు ఇప్పుడు చెప్పబడ్డాయని నీవు గుర్తుంచుకోవాలి: తరువాత, మీరు గొప్ప శ్రమను మరియు గొప్ప బాధను అనుభవిస్తారు! పరిపూర్ణులవడం అనేది సరళమైన లేదా సులభమైన విషయం కాదు. కనీసం నీవు యోబు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, లేదా అతని కంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. యోబు శ్రమల క౦టే భవిష్యత్తులో ఎదురయ్యే శ్రమలు గొప్పవని, మీరు ఇ౦కా దీర్ఘకాల శిక్షకు గురి కావాల్సి ఉ౦టు౦దని నీవు తెలుసుకోవాలి. ఇది సాధారణ విషయమా? నీవు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోలేకపోతే, నీ అవగాహన సామర్థ్యం లోపించినట్లయితే, మరియు నీకు చాలా తక్కువ తెలిస్తే, అప్పుడు ఆ సమయంలో నీకు ఎటువంటి సాక్ష్యం ఉండదు, కానీ సాక్ష్యమును కలిగియుండుటకు బదులుగా సాతానుకు ఆటవస్తువుగాను, హాస్యాస్పదముగాను మారతారు. నీవు ఇప్పుడు దర్శనాలను నిలుపుకోలేకపోతే, అప్పుడు నీకు ఎటువంటి పునాది ఉండబోదు, ఇంకా భవిష్యత్తులో నీవు విస్మరించబడతావు! ఈ మార్గములో ఏ భాగములోనైనా నడవడం అనేది అంత తెలికైన విషయము కాదు, కాబట్టి దీనిని తేలికగా తీసుకోవద్దు. ఇప్పుడే దీన్ని జాగ్రత్తగా అంచనా వేయండి, అప్పుడు మీరు ఈ మార్గం యొక్క చివరి భాగంలో సరిగ్గా నడవగలుగుతారు. ఇది భవిష్యత్తులో నడవాల్సిన మార్గం, జనులందరూ నడవాల్సిన మార్గం. మీరు ఈ జ్ఞానాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు; నేను నీకు చెప్పేదంతా వృధా ప్రయాస అని అనుకోవద్దు. నువ్వు అన్నింటినీ సద్వినియోగం చేసుకునే రోజు వస్తుంది—అంటే నా మాటలు వృధాగా పోవు. ఇది నిన్ను నీవు సన్నద్ధం చేసుకునే సమయం, భవిష్యత్తుకు బాటలు వేసుకునే సమయం. నీవు తరువాత నడవాల్సిన మార్గాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలి; భవిష్యత్తులో నువ్వు ఏవిధంగా దృఢంగా నిలబడాలనే దానిని నీవు ఆందోళన కలిగి ఆత్రుతగా ఉండాలి మరియు నీ భవిష్యత్తు మార్గము కొరకు బాగుగా సిద్ధపడి ఉండాలి. తిండిబోతుగా, సోమరితనంగా ఉండవద్దు! నీ సమయాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకోవడం కొరకు నీవు చేయగలిగినవన్నీ నీవు ఖచ్చితంగా చేయాలి, తద్వారా నీకు అవసరమైన ప్రతిదాన్ని నీవు పొందవచ్చు. నేను నీకు ప్రతిదీ ఇస్తున్నాను, తద్వారా నీవు అర్థం చేసుకోగలవు. మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో, నేను చెప్పిన విషయాలను మరియు నేను చేసిన కార్యాలను మీ కళ్ళారా చూశారు. నేను ఈ విధంగా పని చేయడానికి ఒక కారణం ఏమిటంటే, ప్రజలు అవసరతలో ఉండటం, మరియు మరొక కారణం ఏమిటంటే సమయం చాలా తక్కువగా ఉండటం; ఇక ఎలాంటి జాప్యాలు జరగవు. ప్రజలు సాక్ష్యమివ్వడానికి, ఉపయోగి౦చుకోబడడానికి ము౦దు వారు మొదట పరిపూర్ణమైన అంతర్గత స్పష్టతను సాధి౦చాలని నీవు ఊహి౦చుకు౦టావు—కానీ అది చాలా నెమ్మదిగా జరిగేది కదా? అందువల్ల, నేను ఎంతకాలం నీ వెంట ఉండాలి? వృద్ధాప్యముతో తల నెరిసే వరకు నేను నీతో పాటు రావాలని నీవు కోరుకుంటే, అది అసాధ్యం! గొప్ప శ్రమల గుండా వెళ్ళడం ద్వారా ప్రజల౦దరిలో నిజమైన అవగాహన వస్తుంది. ఇవి జరుగుచున్న కార్యములో దశలుగా ఉన్నాయి. ఈ రోజు మీకు కలిగిన దర్శనాలను నీవు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత మరియు నీవు నిజమైన స్థాయిని పొందిన తరువాత, భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనే ఏ కష్టనష్టాలు నిన్ను ముంచెత్తవు, ఇంకా నీవు వాటిని తట్టుకోగలుగుతావు. నేను ఈ కార్యము యొక్క చివరి దశను పూర్తి చేసి, చివరి మాటలు పలుకుటను ముగించిన తరువాత, భవిష్యత్తులో ప్రజలు తమ స్వంత మార్గంలో నడవవలసి ఉంటుంది. ము౦దు చెప్పబడిన మాటలను ఇది నెరవేరుస్తు౦ది: పరిశుద్ధాత్ముడు ప్రతియొక్క వ్యక్తిని ఆజ్ఞాపిస్తాడు, ప్రతి ఒక్క వ్యక్తిలోను కార్యమును జరిగిస్తాడు. భవిష్యత్తులో, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మచే నడిపించబడినవారై నడవవలసిన మార్గంలో నడుస్తారు. శ్రమలు అనుభవి౦చేటప్పుడు ఇతరుల పట్ల ఎవరు జాగ్రత్త కలిగి ఉంటారు? ప్రతి వ్యక్తికి వారి స్వంత బాధ ఉంటుంది, మరియు ప్రతి ఒక్కరికీ వారి స్వంత స్థాయి ఉంటుంది. ఒకరి స్థితివలె మరొకరు స్థితి ఉండదు. భర్తలు తమ భార్యలను పట్టించుకోరు, లేదా తల్లిద౦డ్రులు తమ పిల్లలపట్ల శ్రద్ధ చూపి౦చలేరు; ఎవరూ ఎవ్వరినీ పట్టించుకోలేరు. ఇప్పడు సాధ్యపడుతున్నట్లుగా, పరస్పర సంరక్షణ మరియు మద్దతు అనేవి ఉండవు. అన్ని రకాల ప్రజలు బహిర్గతం అయ్యే సమయం అది. అనగా దేవుడు గొఱ్ఱెల కాపరులను కొట్టినప్పుడు, అప్పుడు గొఱ్ఱెల మందలు చెల్లా చెదురవుతాయి, ఆ సమయ౦లో మీకు నిజమైన నాయకుడు ఉండడు. ప్రజలు విభజి౦చబడతారు—మీరు ఒక స౦ఘ౦గా కలిసి వస్తున్నట్లుగా ఆ రోజుల్లో ఉండదు. భవిష్యత్తులో, పరిశుద్ధాత్ముని యొక్క కార్యమును కలిగియుండని వారందరూ తమకున్న నిజమైన రంగులను బయటకి చూపిస్తారు. భర్తలు తమ భార్యలను అమ్ముతారు, భార్యలు తమ భర్తలను అమ్ముతారు, పిల్లలు తమ తల్లిద౦డ్రులను అమ్ముతారు, తల్లిద౦డ్రులు తమ పిల్లలను హి౦సిస్తారు—మానవ హృదయ౦ అంతు చిక్కనిది! చేయగలిగినదల్లా, ఒక వ్యక్తి తన వద్ద ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని, మార్గం యొక్క చివరి భాగంలో సరిగ్గా నడవడమే. ప్రస్తుతం, మీరు దీనిని స్పష్టంగా చూడటం లేదు; మీరందరూ దృష్టి మాంద్యముగలవారు. కార్యములోని ఈ దశను విజయవంతంగా అనుభవించడం అంత సులభమైన విషయం కాదు.
శ్రమల సమయ౦ మరీ ఎక్కువ కాల౦ ఉ౦డదు; వాస్తవానికి, ఇది ఒక సంవత్సరం కాలముకంటే తక్కువే ఉంటుంది. అది ఒక స౦వత్సర౦పాటు కొనసాగితే, కార్యములో జరగవలసిన తర్వాత దశ ఆలస్యమవుతు౦ది, ప్రజల స్థాయి సరిపోదు. ఇది చాలా ధీర్ఘముగా ఉంటే, ప్రజలు దానిని తట్టుకోలేరు. అయినప్పటికీ, ప్రజల స్థాయి దాని పరిమితులను కలిగి ఉంది. నా స్వంత పని పూర్తయిన తరువాత, ప్రజలు నడవాల్సిన మార్గములో నడవడానికి తదుపరి దశ ఉంటుంది. వారు ఏ మార్గంలో నడవాలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి—ఇది శ్రమల గుండా వెళ్ళే ప్రక్రియతో కూడిన మార్గమైయున్నది, ఇంకా ఇది దేవుణ్ణి ప్రేమించాలనే నీ సంకల్పాన్ని శుద్ధి చేసే మార్గమైయున్నది. నీవు ఏ సత్యాల్లోకి ప్రవేశించాలి, ఏ సత్యాలకు నీవు అనుబంధంగా ఉండాలి, నీవు ఎలా అనుభవించాలి, మరియు నీవు ఏ కోణంలో ప్రవేశించాలి అనే ఈ విషయాలన్నింటినీ నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిన్ను నీవు సన్నద్ధం చేసుకోవాలి. శ్రమ మీ మీదికి వచ్చినప్పుడు, ఇది చాలా ఆలస్యమవుతుంది. ప్రతి వ్యక్తీ తమ స్వంత జీవిత భారాన్ని తప్పక మోయాలి, ఇతరుల హెచ్చరికల కోస౦ లేదా ఇతరులు ఎల్లప్పుడూ మిమ్మల్ని చెవి పట్టుకొని బుద్ధి చెప్పే విధంగా మనం ఎప్పుడూ ఉ౦డకూడదు. నేను చాలా చెప్పాను, కానీ నీవు ఏ సత్యాలలోకి ప్రవేశించాలో లేదా నిన్ను నీవు ఎలా సంసిద్ధం చేసుకోవాలో నీకు ఇప్పటికీ తెలియదు. దేవుని వాక్కులను చదవడానికి నీవు ఏ ప్రయత్నమూ చేయలేదని ఇది చూపిస్తో౦ది. మీ జీవిత౦ కోస౦ మీరు ఏ విధమైన భారాన్ని మోయరు—అది ఎలా అ౦గీకారయోగ్య౦గా ఉ౦టు౦ది? మీరు దేనిలోకి ప్రవేశించాలనే దానిపై మీకు స్పష్టంగా తెలియదు, మీరు ఏమి అర్థం చేసుకోవాలో మీకు అర్థం కాలేదు, మరియు మీరు ఏ భవిష్యత్తు మార్గంలో వెళ్లాలో అనే దానిని గూర్చి మీరు ఇంకా సముద్రంలోనే ఉండిపోయారు. మీరు పూర్తిగా పనికిమాలినవారు కాదా? మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? మీరు ఇప్పుడు చేస్తున్నదంతా మీ స్వంత రహదారులను వేసుకొని, నిర్మించుకోవడమే కదా. ప్రజలు ఏమి సాధి౦చాలో మీరు తెలుసుకోవాలి, మానవాళి నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడన్న దానిని గూర్చి మీరు తప్పక తెలుసుకోవాలి. మీరు ఈ క్రింది అవగాహనను కలిగి ఉండాలి: నేను ఏమైనప్పటికీ, ఎంతటి భ్రష్టుపట్టినా, దేవుని ముందు ఈ లోపాలను సరిదిద్దుకోవాలి. దేవుడు నాకు చెప్పినప్పుడు నాకు అర్థ౦ కాలేదు కానీ ఇప్పుడు ఆయన నాకు చెప్పిన ప్రతీది నేను అర్థ౦ చేసుకున్నాను కాబట్టి, ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి, ఒక సామాన్య మానవ జీవితాన్ని జీవి౦చడానికి, దేవుని చిత్తానికి అనుగుణ౦గా ఉ౦డే స్వరూపముగా జీవించుటకు నేను తప్పనిసరిగా పరుగెత్తాలి. పేతురు చేసినదానికి అనుగుణ౦గా నేను జీవి౦చలేకపోయినా, కనీస౦ నేను సామాన్య మానవ జీవితాన్ని జీవి౦చాలి. ఈ విధ౦గా నేను దేవుని హృదయాన్ని మెప్పించగలను.
ఇప్పటి ను౦డి భవిష్యత్తు శ్రమలు ముగిసే౦తవరకు ఈ మార్గ౦లోని చివరి భాగం విస్తరిస్తు౦ది. ప్రజల యథార్థమైన స్థితి బహిర్గతమైనప్పుడు, అలాగే వారికి నిజమైన విశ్వాస౦ ఉ౦దా లేదా అని చూపి౦చినప్పుడు ఈ మార్గ౦ సాగి౦చబడుతు౦ది. ఎ౦దుక౦టే, ము౦దు ప్రజలు నడిపి౦చబడిన దానిక౦టే ఎ౦తో కష్టమైన, రాతితో కూడిన మార్గ౦గా ఈ మార్గ౦ ఉ౦టు౦ది కాబట్టి, దాన్ని “మార్గము యొక్క చివరి భాగం” అని పిలుస్తారు. నిజం ఏమిటంటే, ఇది మార్గం యొక్క చివరి విభాగం కాదు; ఎ౦దుక౦టే శ్రమలు అనుభవి౦చిన తర్వాత, నీవు సువార్తను వ్యాప్తి చేసే పనిని చేపడతావు, ఉపయోగి౦చబడే కార్యము గుండా వెళ్ళడానికి కొంతమంది ఉంటారు. అ౦దుకే “మార్గము యొక్క చివరి భాగము” గురి౦చి మాత్రమే శుద్ధిచేయడ౦లోని కష్టాలను గురి౦చి, కఠినమైన వాతావరణాన్ని గురి౦చి ప్రస్తావి౦చబడియుంటుంది. గతంలో నడిచిన మార్గంలోని ఆ భాగంలో నేను స్వయంగా మిమ్మల్ని సంతోషకరమైన ప్రయాణంలో నడిపించాను, మీకు బోధించడానికి మిమ్మల్ని చేయి పట్టుకొని, నా నోటి నుండి మిమ్మల్ని పోషించాను. మీరు అనేకసార్లు శిక్షను మరియు తీర్పుల గుండా వెళ్లినప్పటికీ, అవి మీకు సంబంధించినంత వరకు మెరుపులు వచ్చి వెళ్లిపోయినట్లుగా ఉండేవి గాని పెద్దగా ఏమి అనిపించేవి కావు. నిజమే, దేవునిపై విశ్వాస౦పై నీ దృష్టికోణాలు గణనీయ౦గా మారడానికి అది కారణమై౦ది; ఇది నీ స్వభావాన్ని గణనీయంగా స్థిరపరచడానికి కూడా కారణమైంది, మరియు నీవు నా గురించి కొంత అర్థం చేసుకోవడానికి అనుమతించింది. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ప్రజలు ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు, ప్రజలు చెల్లించే మూల్యం లేదా కష్టముతో కూడిన శ్రమ చాలా తక్కువగా ఉంది—ఈ రోజు మీరు ఉన్న చోటికి మిమ్మల్ని నడిపించింది నేనే. ఎందుకంటే నువ్వు ఏమీ చేయనవసరం లేదు; వాస్తవానికి, నీ నుండి నేను కోరుకునే నా అవసరాలు అంత గొప్పగా ఏమి లేవు—అందుబాటులో ఉన్నవాటిని తీసుకోవడానికే నేను మిమ్మల్ని అనుమతిస్తాను. ఈ కాల వ్యవధిలో నేను మీ అవసరాలను నిరంతరాయంగా సంధించాను, మరియు నేను ఎన్నడూ అసమంజసమైన కోరికలను లేవనెత్తలేదు. మీరు పదేపదే శిక్షను అనుభవించారు, అయినప్పటికీ మీరు నేను కోరుకొనినవాటిని సాధించలేదు. మీరు వెనక్కి వెళ్లిపోతారు మరియు నిరాశకు గురవుతారు, కానీ నేను దీనిని పరిగణనలోకి తీసుకోను ఎందుకంటే ఇది ఇప్పుడు నా వ్యక్తిగత కార్యమును జరిగించు కాలము మరియు నేను నా పట్ల మీ “భక్తిని” అంత తీవ్రంగా తీసుకోను. అయితే, ఇక్కడి నుండి కొనసాగే మార్గంలో, నేను ఇకపై క్రియ చేయను లేదా మాట్లాడను, మరియు సమయం వచ్చినప్పుడు మీరు అటువంటి పనికిమాలిన మార్గంలో కొనసాగేలా నేను ఇకపై ఉండను. నేర్చుకోవడానికి తగినన్ని పాఠాలు నేర్చుకోవడానికి నేను మిమ్మల్ని అనుమతిస్తాను, మరియు మీకు అందుబాటులో ఉన్నవాటిని తీసుకునేలా నేను చేయను. ఈ రోజు మీరు కలిగి ఉన్న నిజమైన స్థాయి బయటకు పడాలి. మీ సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నం అంతిమంగా ఫలించిందా లేదా అనేది మీరు ఈ చివరి మార్గంలో ఎలా నడుస్తారనే దానిలో కనిపిస్తుంది. గత౦లో, దేవునిపై నమ్మక౦ కలిగియుండడం చాలా సులభమని మీరు అనుకున్నారు, అ౦దుకే దేవుడు మిమ్ములను కఠిన౦గా చూడలేదు. మరియు ఇప్పుడు దీని గురించి ఏమంటారు? దేవుణ్ణి నమ్మడం చాలా సులభమని మీరు భావిస్తున్నారా? దేవునిపై నమ్మక౦ కలిగియుండడం వలన వీధిలో ఆడుకునే పిల్లలవలె స౦తోష౦గా, నిర్లక్ష్య౦గా ఉంటుందని మీరు అనుకు౦టున్నారా? మీరు గొర్రెలు అనే మాట నిజం; అయితే, దేవుని కృపకు తగినట్లుగా మీరు నమ్మే దేవుణ్ణి స౦పూర్ణ౦గా స౦పాది౦చుకోవడానికి మీరు నడవవలసిన మంచి మార్గ౦లో మీరు నడవగలగాలి. మిమ్మును మీరు ఎగతాళి చేసుకోవద్దు, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి! నీవు ఈ మార్గంలో కొనసాగగలిగితే, అప్పుడు నీవు నా సువార్త పని యొక్క అపూర్వ దృశ్యాన్ని విశ్వం అంతటా విస్తరించబడడాన్ని చూడగలుగుతావు, మరియు నీవు నా సన్నిహితుడిగా ఉండటానికి మరియు విశ్వం అంతటా నా పనిని విస్తరించడంలో నీ పాత్రను పోషించే భాగ్యాన్ని పొందుతావు. ఆ సమయంలో, నువ్వు నడవాల్సిన మార్గంలో ఎంతో సంతోషంగా నడవడం నీవు కొనసాగిస్తావు. భవిష్యత్తు అపరిమితంగా ప్రకాశవంతంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రాథమిక విషయం ఏమిటంటే మార్గం యొక్క చివరి భాగములో సరిగ్గా నడవాలి. నీవు వెదకాలి మరియు దీనిని ఎలా చేయాలనే దానికి సిద్ధం కావాలి. నీవు ప్రస్తుతం చేయాల్సినది ఇదే; ఇది ఇప్పుడు అత్యవసరమైన విషయం!