మీరు తప్పకుండా కార్యమును అర్థము చేసుకోవాలి–తికమకలో దేనిని అనుసరించవద్దు!
ప్రస్తుతం తికమకలో ఉండి నమ్మేవారు ఎంతో మంది ఉన్నారు. మీరు ఆశీర్వాదముల విషయమై చాలా ఎక్కువ ఆసక్తిని, చాలా ఎక్కువ ఆకాంక్షను కలిగియున్నారు గాని జీవమును వెదకుట కొరకు చాలా తక్కువ అభిలాషను కలిగియున్నారు. నేటి కాలములో ప్రజలు యేసునందు విశ్వాసముంచుటలో ఎక్కువ ఉత్సాహమును కలిగియున్నారు. యేసు వారినందరిని పరలోకపు ఇంటికి తీసుకు వెళ్లనున్నాడు మరి, వారు ఎలా నమ్మకుండా ఉండగలరు? కొంతమంది మనుష్యులు వారి జీవితకాలమంతా విశ్వాసులుగా ఉంటారు; వారు నలభై లేక యాభై సంవత్సరాలైనప్పటికీ విశ్వాసులుగానే ఉంటారు, అప్పటికి కూడా వారు బైబిలు చదవడములో అలసిపోరు. ఎందుకంటే, ఏది ఏమైనా, వారు విశ్వాసము కలిగియున్నంత కాలము వారు పరలోకము వెళ్తారనే ఆలోచనను కలిగియున్నారు[ఎ]. మీరు కేవలము కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ మార్గములో దేవుణ్ణి అనుసరించారు, అయినా మీరు ఇప్పటికే తడబడ్డారు; మీ సహనాన్ని కోల్పోయారు, ఎందుకంటే ఆశీర్వాదాలు పొందుకోవాలనే మీకున్న ఆకాంక్ష చాలా బలమైనది. ఇటువంటి నిజమైన మార్గము గుండా వెళ్ళే మీ ప్రయాణము మీకున్న ఆకాంక్షను బట్టి మరియు ఆశీర్వాదాలు పొందుకోవాలనే మీకున్న ఆశను బట్టే జరిగించబడుతోంది. ఈ స్థాయిలో జరిగించబడే ఈ కార్యమును గురించి మీకు పెద్దగా అవగాహన లేదు. ఈ రోజు నేను చెప్తున్నదంతా యేసు నందు విశ్వాసము కలిగియున్నవారని గురించి చెబుతున్నది కాదు, లేదా వారు కలిగియున్న ఆలోచనలను వ్యతిరేకించడానికి చెప్పడం లేదు. వాస్తవానికి, బహిర్గతమైన ఈ ఆలొచనలలో ప్రతిదీ మీలో ఉద్భవించినవే, బైబిలు ఎందుకు ప్రక్కకు పడవేయబడిందో, యెహోవా కార్యము పాతబడిపోయిందని నేను ఎందుకు చెప్పుచున్నానో, లేక యేసు కార్యము పాతబడిపోయిందని నేను ఎందుకు చెప్పుచున్నానో మీకు అర్థము కాదు. వాస్తవానికి, మీరు స్వరమిప్పి చెప్పని ఎన్నో ఆలోచనలను మీరు కలిగియున్నారు, మీ హృదయ లోతుల్లో ఎన్నో దృష్టికోణాలను కలిగియున్నారు మరియు మీరు కేవలము జనసమూహములను వెంబడిస్తున్నారు. అయినప్పటికీ, మీలో నిజంగా ఎటువంటి ఆలోచనలు లేవనుకుంటున్నారా? నిజానికి, మీరు మీ ఆలోచనలను బయటకు చెప్పుకోవడం లేదంతే! వాస్తవానికి, మీరు దేవుణ్ణి అశ్రద్ధగా అనుసరిస్తున్నారు, మీరు నిజమైన మార్గాన్ని వెదకడానికి అస్సలు రారు మరియు మీరు జీవమును పొందుకొనే ఉద్దేశముతో రావట్లేదు. ఏమి జరుగుతుందో చూద్దాం అనే ధోరణితో వస్తున్నారు. ఎందుకంటే, మీకున్న పాత భావాలను తీసివేసుకోవడానికి మీరు ఇష్టపడరు. తనను తాను సమర్పించుకోగలిగిన వ్యక్తి మీలో ఒక్కడునూ లేడు. ఈ విషయానికి వచ్చినప్పుడు, రాత్రింబవళ్ళు మీ స్వంత ఆలోచనల మథనంతో, మీ స్థితిగతులను గూర్చి చింతిస్తూ, వాటిని బయట వ్యక్తం చేయకుండా ఉండిపోతుంటారు. నేను ఫరిసయ్యులను గురించి మాట్లాడేటప్పుడు నేను మతములోని “పాత మనుష్యులను” సూచిస్తున్నానని నీవనుకున్నావా? ప్రస్తుత యుగములోని ఆధునిక ఫరిసయ్యులకు మీరు ప్రతినిధులు కారా? బైబిలుకు విరుద్ధంగా నా విషయమై కొలత వేసేవారిని గురించి నేను చెప్పినప్పుడు, మతపరమైన పరిధిలో ఉన్నటువంటి బైబిల్ పండితులను సూచిస్తున్నానని నీవు తలంచావా? మరొకమారు దేవుణ్ణి సిలువకు వేసే వారిని గురించి నేను మాట్లాడేటప్పుడు, మతపరమైన పరిధిలో ఉండే నాయకులను గురించి నేను మాట్లాడుచున్నానని నీవు నమ్ముచున్నావా? నిజానికి, ఈ పాత్రను పోషించడంలో అద్భుతమైన నటులు మీరు కారా? నేను మాట్లాడిన ప్రతి మాట మనుష్యుల ఆలోచనా విధానాన్ని ఎత్తి చూపడానికే అని, కేవలము మతపరమైన నాయకులను మరియు పాస్టర్లను వెక్కిరించడానికే అని నీవు ఆలోచిస్తున్నావా? ఈ విషయాలన్నిటిలో మీ వంతు పాత్ర మీరు పోషించడం లేదా? మీరు కొన్ని ఆలోచనలే కలిగియున్నారని మీకు అనిపించట్లేదా? ఇప్పుడు మీరు చాలా తెలివిగా ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నారంతే. మీరు అర్థము చేసుకోని విషయాలను గూర్చి మీరు మాట్లాడరు, లేదంటే, మీకు అర్థము కాని విషయాలను గురించిన భావాలను వివరించలేరు, కానీ, గౌరవప్రదమైన మరియు సమర్పించుకొనే హృదయాలు మీలో ఉద్భవించలేదు. ఇలాంటి పరిస్థితిని మీరు చూస్తున్నప్పుడు, అధ్యయనం చేయడం, పరిశీలన చేయడం మరియు వేచియుండడం అనేవి ఈ రోజున మీరు ఆచరణాత్మకంగా నడుచుకోవడానికి ఉత్తమ మార్గాలుగా ఉంటాయి. చాలా తెలివిగా ఎలా ఉండాలో మీరు నేర్చుకున్నారు. అయినప్పటికీ, ఇది ఒక మానసిక కుయుక్తి అని మీరు గ్రహించారా? మీరు పోషించే పాత్రలో తెలివితేటలు ఒక క్షణం ఉన్నా సరే, నిత్య శిక్షను తప్పించుకోవడానికి అది సహాయపడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? మీరు చాలా “జ్ఞానంగా” ఉండడం ఎలాగో నేర్చుకొనియున్నారు! అంతేగాకుండా, కొంతమంది ఈ ప్రశ్నలను నన్ను అడిగారు: “ఒకానొక రోజున మతపరమైన పరిధిలో ఉండే మనుష్యులు, ‘మీ దేవుడు ఎందుకు ఒక చిన్న అద్భుతం చేయలేదు’ అని అడిగితే, నేను ఎలా వివరించాలి?” ఈ రోజుల్లో ఈ ప్రశ్నను మతపరమైన మనుష్యులు మాత్రమే అడగడం లేదు; ఈ రోజు జరుగుచున్న కార్యమును మీరు అర్థము చేసుకోవడము లేదు మరియు అనేకమైన ఆలోచనల క్రింద పని చేస్తున్నారు. మతపరమైన వ్యక్తులను గురించి నేను మాట్లాడినప్పుడు అసలు నేనెవరిని గురించి మాట్లాడియున్నానో నీకింకా తెలియట్లేదా? నేను ఎవరిని ఉద్దేశించి బైబిలును వివరిస్తున్నానో నీకు తెలియదా? మూడు స్థాయిల దేవుని కార్యమును గురించి నేను చెప్పినప్పుడు నేను ఎవరిని గూర్చి ఉద్దేశించి చెప్పానో నీకింకా తెలియదా? నేను ఆ విషయాలను చెప్పకపోతే, మీరు అంత సులభంగా ఒప్పించబడతారా? మీ తలలను అంత సులభంగా వంచుతారా? మీ పాత ఆలోచనలను అంత సులభంగా ప్రక్కన పెడతారా? ముఖ్యంగా, ఎవరికీ లోబడని “మగరాయుళ్ళందరూ” అంత సులభంగా లోబడుతారా? మీలోని మానవత్వం నాసిరకమైనదని, మీరు అతి తక్కువ సామర్థ్యాన్ని కలిగియున్నారని, తక్కువ వృద్ధి చెందిన మెదళ్లను కలిగియున్నారని, దేవునియందు నమ్మికయుంచిన సుదీర్ఘ చరిత్ర మీకు లేదని, వాస్తవానికి మీకు చాలా ఆలోచనలు ఉన్నాయని మరియు మీ స్వాభావిక స్వభావము అంత తేలిగ్గా ఎవరికి లొంగదని నాకు తెలుసు. అయితే, ఈ రోజున మీరు లోబడుచున్నారు. ఎందుకంటే, మీరు బలవంతపెట్టబడుచున్నారు మరియు నిస్సహాయంగా ఉన్నారు; మీరంతా ఇనుప పంజరములో పులులు, మీకున్న నైపుణ్యతలను అంత సులభంగా ప్రదర్శించలేరు. మీకు రెక్కలున్నా, ఎగరడం చాలా కష్టమని భావిస్తుంటారు. ఆశీర్వాదాలు లభించకపోయినప్పటికీ, మీరింకా దానినే అనుసరించడానికి ఇష్టపడుచున్నారు. అయితే, మీరు “మంచి మనుష్యులుగా” ధైర్యవంతులని ఇది తెలియజెప్పదు గాని మీరు పూర్తిగా ఓడిపోయారని తెలియజెబుతోంది మరియు ఇక మీ పని అయిపోయిందని అర్థం. మీరు చేసిన ఈ పని ద్వారా ఓడిపోయారని అర్థం. మీరు సాధించాల్సింది ఏదైనా ఉన్నట్లయితే మీరు ఈనాడు విధేయులుగా ఉన్నట్లు ఉండకపోవుదురు. ఎందుకంటే, మునుపు మీరందరు అరణ్యములో అడవి గాడిదలుగా ఉన్నారు. అందుచేత, ఈ రోజు చెప్పినదంతా అనేక మతాల, అనేక శాఖల ప్రజలను ఉద్దేశించి చెప్పలేదు, లేక వారి ఆలోచనలను ఉద్దేశించి మాట్లాడలేదు; ఇదంతా కేవలము మీ ఆలోచలను ఉద్దేశించే చెప్పడం జరిగింది.
నీతికి సంబంధించిన తీర్పు ఆరంభమయ్యింది. ప్రజల కొరకు దేవుడు పాప పరిహారార్థ బలిగానే సేవ చేస్తాడా? మరియొకమారు దేవుడు వారి కొరకు పరమ వైద్యునిగానే పని చేయబోవుచున్నాడా? దీనికంటే ఎక్కువ అధికారము దేవునికి లేదా? ఇప్పటికే కొంతమంది ప్రజలు పరిపూర్ణులుగా చేయబడ్డారు మరియు సింహాసనము ఎదుట నిలుపబడ్డారు; ఆయన ఇంకా దయ్యములను వెళ్ళగొట్టి, రోగులను స్వస్థత పరుస్తున్నాడా? అది అతి ప్రాచినమైనది కాదా? ఇదే కొనసాగితే సాక్ష్యమనేది చెల్లుతుందా? ఒకమారు సిలువకు వ్రేలాడదీయబడడం అనేది దేవుడు శాశ్వతంగా సిలువ వేయబడ్డాడని అర్థమా? ఆయన ఒకమారు దయ్యములను వెళ్ళగొట్టి, ఎల్లప్పుడు వాటిని వెళ్ళగొడుతూనే ఉన్నాడా? ఇలాంటి ఆలోచనలు అవమానంగా పరిగణించబడదా? కార్యము యొక్క ఈ దశ మునుపటికంటే ఉన్నతంగా ఉన్నప్పుడు మాత్రమే యుగము యొక్క ప్రగతి ముందుకు వెళ్తుంది, అప్పుడు అంత్య దినాలు సమీపిస్తాయి, అప్పుడు ఈ యుగము ముగిసే సమయము వస్తుంది. సత్యాన్ని వెంబడించే ప్రజలు తప్పనిసరిగా లోతైన దర్శనాల విషయమై శ్రద్ధ వహించాలి; ఇదే పునాది. దర్శనాలను గురించి నేను మీతో సహవాసము చేసినప్పుడెల్లా, కొంతమంది తలలు ఆడిస్తూ, మూత పడుచున్న కళ్ళతో, వినడానికి ఆసక్తిని కనుపరచని సంగతిని నేను ప్రతిసారి చూస్తున్నాను. “నువ్వు ఎందుకు వినట్లేదు?” అని కొంతమంది అడిగినప్పుడు, వారు, “ఈ విషయాలను వినడం ద్వారా నా జీవితానికి ఎటువంటి ప్రయోజనము లేదు, అదేమీ నన్ను వాస్తవికతలోనికి నడిపించదు”. మాకు ఆచరణాత్మక మార్గము కావాలి అని చెప్తారు. నేను ఆచరణాత్మక మార్గాల కంటే కార్యమును గూర్చి మాట్లాడినప్పుడెల్లా, “నువ్వు కార్యమును గూర్చి మాట్లాడిన వెంటనే, నేను నిదురపోతుంటాను” అని వారు చెప్తారు. ఆచరణాత్మక మార్గాలను గురించి నేను మాట్లాడుట ప్రారంభించిన ప్రతిసారి, వారు వ్రాసుకోవడానికి ప్రారంభిస్తారు మరియు నేను కార్యమును గూర్చి వివరించడానికి వెళ్ళిన ప్రతిసారి, వారు వినడం మానేస్తారు. ప్రస్తుతం మీరు ఎటువంటి అంశాలను వినాలో మీకు తెలుసా? వాటిలో ఒక అంశం కార్యమును గూర్చిన దర్శనాలు విషయమై వినడం ఉంటుంది, మరొక అంశం మీ ఆచరణ కూడా ఉంటుంది. మీరు ఈ రెండు అంశాలను తప్పనిసరిగా అర్థము చేసుకోవాలి. జీవితములో ప్రగతిని సాధించడానికి మీ అన్వేషణలో దర్శనాలను కలిగియుండకపోతే, మీకు పునాది అనేది ఉండదు. ఎటువంటి చిన్న దర్శనము లేకుండా మీరు ఆచరణ మార్గాలను మాత్రమే కలిగియున్నట్లయితే, నిర్వహణ ప్రణాళిక అంతటి మీద జరిగే కార్యమును గూర్చిన అవగాహన మీకుండదన్న మాట, అప్పుడు నీ వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. దర్శనాలతో మిళితమైన సత్యాలను మీరు అర్థము చేసుకోవాలి. ఆచరణకు సంబంధించిన సత్యాల కొరకు, ఆ సత్యాలను అర్థము చేసుకున్న తర్వాత నీవు సరియైన ఆచరణాత్మక మార్గాలను కనుగొనవలసి ఉంటుంది; వాక్కుల ప్రకారంగా నీవు తప్పనిసరిగా సాధన చేయవలసి ఉంటుంది, నీకున్న పరిస్థితులను బట్టి ప్రవేశించవలసి ఉంటుంది. దర్శనాలనేవి పునాదిలాంటివి. ఇటువంటి వాస్తవ సంగతిపై మీరు దృష్టి పెట్టకపోతే, మీరు చివరి వరకు అనుసరించలేరు; అటువంటి అనుభవం మిమ్మల్ని తప్పు దారిలో వెళ్ళే విధంగా నడిపిస్తుంది, లేక క్రిందకి పడిపోయేలా చేస్తుంది మరియు విఫలమయ్యేలా చేస్తుంది. మీరు విజయం సాధించడానికి ఎటువంటి మార్గము ఉండదు! తమ పునాదులుగా ఎవరికైతే గొప్ప దర్శనాలు ఉండవో, వారు తప్పకుండగా విఫలమవుతారు; వారు విజయాన్ని సాధించలేరు. నువ్వు స్థిరంగా నిలబడలేవు! దేవుని యందు విశ్వాసముంచడం అంటే ఏమిటో నీకు తెలుసా? దేవుణ్ణి అనుసరించడం అంటే ఏమిటో నీకు తెలుసా? దర్శనాలు లేకుండా ఎటువంటి మార్గములో నడుస్తావు? నేడు జరిగించబడే కార్యములో నీకు దర్శనాలు లేకపోతే, నీవు ఏ విధంగాను పరిపూర్ణుడవు కాలేవు. నీవు ఎవరిలో విశ్వాసముంచావు? నీవు ఆయనలో ఎందుకు నమ్మకముంచావు? నీవు ఆయనను ఎందుకు అనుసరిస్తున్నావు? నీ విశ్వాసమును ఒక విధమైన ఆటగా నీవు చూస్తున్నావా? ఒక రకమైన ఆట వస్తువుతో ఆడుకుంటున్నట్లు నీవు నీ జీవితముతో అడుకుంటున్నావా? ఈ రోజు ఉన్న దేవుడే ఒక గొప్ప దర్శనం. ఆయనను గురించి నీకు ఎంత తెలుసు? ఆయనను నీవు ఎంతమట్టుకు చూశావు? ఈ రోజున్న దేవుణ్ణి చూసిన తరువాత, దేవునిలో నీవుంచిన పునాది బలమైనదిగా ఉన్నదా? ఇటువంటి తికమక మార్గములో నీవు నడిచినంత కాలం నీవు రక్షణను పొందుకుంటావని భావిస్తున్నావా? బురద నీటిలో చేపను పట్టుకోగలవని నీవు భావిస్తున్నావా? పట్టుకోవడం అంత సులభమా? ఈ రోజు దేవుడు మాట్లాడిన మాటలకు సంబంధించి ఎన్ని ఆలోచనలను ప్రక్కకు పెట్టావు? నేటి దేవున్ని గూర్చిన దర్శనము నీకుందా? నేటి దేవుని గురించి నీకున్న అవగాహన ఏ స్థాయిలో ఉంది? నీవు ఆయనను అనుసరించుట ద్వారానే, లేక ఆయనను చూచుట ద్వారానే నీవు ఆయనను పొందుకోగలవని[బి], నీ నుండి ఏ ఒక్కరూ వెళ్లిపోరని నీవు ఎల్లప్పుడూ నమ్ముతావు. దేవుణ్ణి అనుసరించడం అనేది అంత సులభమైన విషయమని ఊహించుకోవద్దు. ఇక్కడ విషయం ఏమిటంటే, నీవు తప్పనిసరిగా ఆయనను గూర్చి తెలుసుకోవాలి, నీవు తప్పనిసరిగా ఆయన కార్యమును గూర్చి తెలుసుకోవాలి, ఆయన కొరకు కష్టాలను సహించుకోవడానికి నీవు తప్పనిసరిగా ఇష్టతను కలిగియుండాలి, ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి, ఆయన ద్వారా నీవు సంరక్షించబడాలి. ఇటువంటి దర్శనమును నీవు కలిగియుండాలి. నీ ఆలోచనలు ఎల్లప్పుడూ కృపను ఆనందించుటలోనే ఉండిపోతే అవి ఏమీ చేయలేవు. ప్రజల ఆనందము కొరకు మాత్రమే, లేక ప్రజల మీద కృపను కుమ్మరించడానికే దేవుడు ఇక్కడున్నాడని అనుకోవద్దు. నీవు తప్పటడుగు వేసియుండవచ్చు! ఆయనను అనుసరించడానికి ప్రాణాల్ని లెక్కచేయకపోతే, ఆయనను అనుసరించడానికి లౌకిక ఆస్తిపాస్తులను వదులుకోకపోతే, వారు ఆయనను చివరి వరకు అనుసరించలేరు! నీ పునాదిగా ఉండడానికి నీవు తప్పనిసరిగా దర్శనాలను కలిగియుండాలి. ఒక రోజున నీకు దురదృష్టం ఎదురైతే, నీవు ఏమి చేస్తావు? ఆయనను అలాగే అనుసరిస్తావా? నీవు ఆయనను చివరి వరకు అనుసరించగలనని తేలికగా చెప్పవద్దు. ఇప్పుడు ఎలాంటి సమయమన్నదానిని చూచుటకు నీ కళ్ళను పెద్దవి చేసుకొని చూస్తే చాలా మంచిది. ప్రస్తుతం మీరు మందిరపు స్తంభములుగా కనిపించినప్పటికీ, అటువంటి స్తంభాలన్ని పురుగులచేత కోరకబడి, మందిరమును నాశనము చేసే సమయము వస్తుంది. ప్రస్తుతం మీరు చాలా దర్శనాల కొరతను కలిగియున్నారు. కేవలం మీ స్వంత చిన్న చిన్న ప్రపంచాల విషయమై మీరు శ్రద్ధ చూపిస్తారు, వెదకగలిగిన నమ్మదగిన మరియు సరియైన మార్గము ఏది అనే విషయము మీకు తెలియదు. నేటి కార్యము యొక్క దర్శనాన్ని మీరు గమనించరు, లేక మీ హృదయములో ఈ విషయాలను ఉంచుకోరు. ఒక రోజున మీ దేవుడు మిమ్మల్ని ఎవరికి తెలియని ప్రదేశములో ఉంచబోతున్నాడని మీరెప్పుడైనా అనుకున్నారా? ఒక రోజున మీ నుండి సమస్తాన్ని నేను తీసుకున్నప్పుడు మీరు ఏమవుతారో ఊహించగలరా? ఈ రోజు మీకు శక్తి ఉన్నట్లుగా ఆ రోజు కూడా ఉంటుందా? మీ విశ్వాసము తిరిగి కనిపిస్తుందా? దేవుణ్ణి వెంబడించడములో గొప్ప దర్శనం “దేవుడే” అనే విషయాన్ని మీరు తప్పకుండ తెలుసుకోవాలి: ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. లోకస్తులతో కలిసి ఉండడం ద్వారా పవిత్రీకరించబడతామనే భ్రమలో ఉండవద్దు, మీరు తప్పకుండా దేవుని కుటుంబములోనే ఉండాలి. ఈ రోజుల్లో, సృష్టిలో దేవుడే తన కార్యమును జరిగించుచున్నాడు; ఆయన తన స్వంత కార్యమును జరిగించుకొనుటకు ఆయనే ప్రజల మధ్యకు వచ్చియున్నాడే తప్ప, ప్రచారాలు చేయడానికి రాలేదు. నేటి ఈ కార్యము శరీరధారిగా వచ్చిన పరలోకమందున్న దేవుని కార్యమని మీ మధ్యన ఏ ఒక్కరు కూడా తెలుసుకోలేకపోయారు. ఇది మిమ్మల్ని అత్యుత్తమ ప్రతిభావంతులైన వ్యక్తులుగా చేయడానికి కాదు; మానవ జీవితము ప్రాముఖ్యతను గూర్చి తెలుసుకోవడానికి, మానవుల గమ్యాన్ని తెలుసుకోవడానికి మరియు దేవుని గురించి, ఆయనను గురించిన సమస్త విషయాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో సహాయ పడుతుంది. నీవు సృష్టికర్త చేతులలో ఉన్నటువంటి సృష్టిలో ఒక భాగమని నీవు తప్పకుండా తెలుసుకోవాలి. నీవు ఏమి అవగాహన చేసుకోవాలో, నీవు ఏమి చేయాలో, నీవు దేవుణ్ణి ఎలా అనుసరించాలో అనే అంశాలన్నీ నీవు గ్రహించవలసిన సత్యాలు కావా? ఇవి నీవు చూడవలసిన దర్శనాలు కావా?
మనుష్యులు దర్శనాలను కలిగియుంటే, పునాదిని కలిగియున్నట్లే. ఇటువంటి పునాదిని ఆధారము చేసుకొని మీరు అనుసరించినప్పుడు, ప్రవేశించడానికి చాలా సులభంగా ఉంటుంది. అదే విధంగా, నీవు ప్రవేశించడానికి పునాదిని కలిగియున్న తరువాత నీకు ఎటువంటి సందేహాలు ఉండవు మరియు ప్రవేశించడానికి నీకు చాలా సులభంగా ఉంటుంది. దేవుని కార్యమును తెలిసికొనుట మరియు దర్శనాలను అర్థము చేసికొనుట అనే ఈ అంశము చాలా కీలకమైనది; మీరు తప్పకుండ దీనిని మీ ఆయుధ శాలలో ఉంచుకోవాలి. నీవు ఇటువంటి సత్యాంశమును కలిగియుండక, కేవలం ఆచరణాత్మక మార్గాలను గురించి ఎలా మాట్లాడాలో తెలిసికొని ఉన్నట్లయితే, అప్పుడు నీవు చాలా లోపభూయిష్టంగా ఉన్నావని అర్థం. మీలో చాలామంది ఈ సత్యాంశమును గూర్చి నొక్కి చెప్పరని నేను తెలుసుకున్నాను, దీనిని గూర్చి మీరు విన్నప్పుడు, మీరు కేవలము వాక్కులను గూర్చి మరియు సిద్ధాంతములను గూర్చి మాత్రమే వింటారు. ఒక రోజున నీవు ఓడిపోతావు. నువ్వు అర్థము చేసుకోవని మరియు అంగీకరించవని ఈ రోజుల్లో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి; అటువంటి సందర్భాల్లో, నువ్వు చాలా ఓపిగ్గా వెదకాలి, అప్పుడు నువ్వు అర్థము చేసుకునే రోజు రానే వస్తుంది. ఎక్కువ దర్శనాలతో నిన్ను నీవు క్రమేపి బలపరుచుకో. మీరు కొన్ని ఆధ్యాత్మిక సిద్ధాంతాలను మాత్రమే అర్థము చేసుకున్నప్పటికీ, దర్శనాల విషయముపై శ్రద్ధ వహించని దానికంటే, అసలు ఏదీ అర్థము కానిదానికంటే ఇదెంతో మేలు కదా. మీ ప్రవేశానికి ఇవన్ని ఎంతగానో సహకరిస్తాయి మరియు నీకున్న సందేహాలన్నిటినీ తొలగిస్తాయి. నీవు అనేకమైన ఆలోచనలు కలిగియుండుట కంటే ఇది ఎంతో ఉత్తమం. ఈ దర్శనాలన్నిటిని నీ పునాదిగా కలిగియున్నట్లయితే నీవు మరింత మెరుగ్గా ఉంటావు. మీకు ఎలాంటి సందేహాలు ఉండవు, మీరు ఎంతో ధైర్యంగా, నిశ్చయంగా ప్రవేశిస్తారు. అటువంటి తికమకలో ఉంటూ, సంశయాత్మకంగా దేవుని ఎందుకు అనుసరించాలి? అలాచేస్తే, అది నీ తలను ఇసుకలో పూడ్చినట్లుండదా? ఠీవిగా, హుందాగా దేవుని రాజ్యములోనికి అడుగు పెడితే ఎంత బాగుంటుందో కదా! అనేకమైన సందేహాలతో ఎందుకుండాలి? ఊరకనే మీకు మీరు నరకానికి గురవుతన్నట్లు అనిపించలేదా? మీరు ఒకసారి యెహోవా కార్యమును, యేసు కార్యమును మరియు ఈ స్థాయిలో జరిగే కార్యమును అర్థము చేసుకున్నట్లయితే, మీరు పునాదిని కలిగియుంటారు. ప్రస్తుతానికి, చాలా సరళంగా ఉండాలని నీవు ఊహించుకోవచ్చు. “సమయము వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యమును చేయుటను ఆరంభిస్తాడు, ఈ విషయాలన్నిటిని గూర్చి నేను మాట్లాడగలను. పరిశుద్ధాత్ముడు నన్ను అంత ఎక్కువగా వెలిగించలేదు గనుక ప్రస్తుతానికి నాకు అర్థము కాదనేది వాస్తవం” అని కొంతమంది చెప్తారు. ఇది అంత సులభం కాదు. ఇప్పుడు నీవు సత్యాన్ని[సి] అంగీకరించి, సమయము వచ్చినప్పుడు ఆ సత్యాన్ని చాకచక్యంగా ఉపయోగించుకుంటాననే పరిస్థితి కాదిది. ఇలా చేయవలసిన పరిస్థితి కూడా లేదు! ప్రస్తుతం నీకు అన్ని విషయాలను గూర్చిన అవగాహన ఉందని, మత సంబంధమైన మనుష్యులకు మరియు గొప్ప గొప్ప వేదాంత పండితులకు స్పందించాల్సిన అవసరం లేదని మరియు వారిని ఖండించాల్సిన అవసరము కూడా లేదని నీవు నమ్ముచున్నావు. నిజంగా నీవు అలా చేయగలవా? ఎటువంటి అవగాహనతో నీవు అలా మాట్లాడగలవు, కేవలము నీకున్న పైపై అనుభవముతో మాట్లాడుతావా? సత్యముతో బలపరచబడడం, సత్యము కొరకు పోరాటం చేయడం, దేవుని నామానికి సాక్ష్యం ఇవ్వడం అనేవి నువ్వు ఆలోచించినంత సులభం కాదు–అది దేవుడు కార్యము జరిగించినంత కాలం, ప్రతీది సంపూర్తి చేయబడుతుంది. అప్పటికీ, నీవు ఏదో ఒక ప్రశ్న ద్వారా అనుమానానికి గురవుతుంటావు, అప్పుడు నువ్వు మూగబోతుంటావు. ఈ స్థాయిలో జరిగే కార్యమును గూర్చి నువ్వు స్పష్టమైన అవగాహన కలిగియున్నావా లేదా అనేది ముఖ్యమైన విషయం కానప్పటికీ, ఆ కార్యమును గూర్చి నీకు ఎంతవరకు తెలుసన్నది చాలా ముఖ్యం. నువ్వు శత్రు సైన్యమును జయించకపోతే, మత శక్తులను ఓడించకపోతే, అప్పుడు నువ్వు పనికిరానివాడవుగా ఉండవా? నేటి కార్యమును గూర్చి నువ్వు అనుభవించియున్నావు, నీ కళ్ళతో ఈ కార్యాన్ని చూశావు, నీ చెవులతో ఈ కార్యమును గూర్చి విన్నావు కానీ చివరికి సాక్ష్యాన్ని కలిగియుండకపోతే, ఇంకా జీవించాలనే మొండి ప్రవర్తను కలిగియున్నారా? నువ్వు ఎవరిని ఎదుర్కోగలవు? అది అంత సులభంగా ఉంటుందని ఇప్పుడేమీ ఊహించుకోవద్దు. భవిష్యత్తులోని కార్యము నువ్వు ఊహించుకున్నంత సులభము కాదు; సత్యము కొరకు పోరాడడం అనేది అంత సులభము కాదు, అంత సూటిగా చెప్పేది కాదు. ఇప్పుడే మీరు బలపరచబడాలి; మీరు సత్యముచేత బలపరచబడక పోయినట్లయితే, సమయము వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రాకృతాతీతముగా కార్యమును జరిగించడు, మీరు నష్టపోతారు.
అధస్సూచిక:
ఎ. మూల వాక్యములో “వారు అనుకుంటున్నారు” అనే మాట లేదు.
బి. మూల వాక్యములో “ఆయన” అనే పదము లేదు.
సి. మూల వాక్యములో “సత్యము” అనే పదము లేదు.