దేవుని యొక్క కార్యము మనిషి ఊహించినంత తేలికైనదా?
దేవుని యందు విశ్వాసముగలవారిలా, అంత్య దినాల్లో ఆయన కార్యాన్ని స్వీకరించడం ద్వారా మీరు నిజంగా అత్యంత ఔన్నత్యాన్ని మరియు రక్షణని ఎలా పొందారో, మరియు ఈ రోజు ఆయన ప్రణాళికా కార్యము నీలో ఎలా పని చేస్తుందో అనే వాటి పట్ల మీలో ప్రతి ఒక్కరూ కృతజ్ఞతగా ఉండాలి. దేవుడు విశ్వవ్యాప్తంగా ఈ జనుల సమూహాన్ని ఆయన కార్యానికి ఏకైక కేంద్రీకరణగా చేశాడు. ఆయన తన హృదయపు రక్తాన్నంతటినీ మీ కోసం త్యాగం చేశాడు. విశ్వవ్యాప్తంగా ఆత్మ యొక్క కార్యాన్ని తిరిగి తీసుకొని ఆయన మీకు ఇచ్చాడు. అందుకే మీరు అదృష్టవంతులు. అంతేకాక, ఆయన తన మహిమను ఆయన ఎన్నుకున్న జనులైన ఇశ్రాయేలీల నుండి మీ వైపుకు మరల్చాడు. ఆయన తన ప్రణాళిక యొక్క ప్రయోజనాన్ని ఈ సమూహం ద్వారా వ్యక్తపరుస్తాడు. కాబట్టి దేవుని వారసత్వాన్ని పొందేది మీరే, మరియు దీని కన్నా ఎక్కువగా దేవుని ఘనతకి వారసులు మీరే. బహుశా మీ అందరూ ఈ మాటలు గుర్తుంచుకొని ఉంటారు: “క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.” మీరందరూ ఇంతకు ముందు ఈ మాటలు విన్నారు, అయినా వాటి యొక్క నిజమయిన అర్థాన్ని మీలో ఎవరూ గ్రహించలేక పోయారు. ఈ రోజు, వాటి యొక్క నిజమైన ప్రాముఖ్యత పట్ల మీరు లోతైన ఎరుక కలిగి ఉన్నారు. ఈ మాటలు అంత్య దినాల్లో దేవుని చేత నెరవేర్చబడతాయి, మరియు గొప్ప ఎర్ర డ్రాగన్ చుట్టబడి ఉన్న నేలలో దానిచే కఠోరంగా హింసింపబడిన వారిలో అవి నెరవేరతాయి. గొప్ప ఎర్ర డ్రాగన్ దేవుడిని హింసిస్తుంది మరియు అది దేవునికి శత్రువు కాబట్టి, ఈ నేలలో దేవుడిని నమ్మే వారందరూ దానివల్ల అవమానాలకు, అణిచివేతకి గురి ఔతారు. మరియు దీని ఫలితంగా ఈ మాటలన్నీ ఈ జనుల సమూహంలో, మీలో నెరవేర్చబడతాయి. దేవుడిని వ్యతిరేకించే దేశంలో ఇది ప్రవేశించినందుకు, మొత్తం దేవుని కార్యము విపరీతమైన అడ్డంకులను ఎదుర్కొంటోంది, ఆయన అనేకమైన వాక్కులని నెరవేర్చడానికి సమయం పడుతుంది. ఆవిధంగా, దేవుని వాక్కు ఫలితంగా జనులు శుద్ధికాబడి ఉన్నారు, ఇది కూడా వేదనలో భాగమే. గొప్ప ఎర్ర డ్రాగన్ యొక్క నేలలో తన కార్యాన్ని నిర్వహించడం దేవునికి చాలా కష్టం. కానీ ఈ వేదన గుండానే దేవుడు తన కార్యంలో ఒక దశను చేశాడు, ఆయన వివేచనను మరియు ఆయన అద్భుతమైన కార్యాలను వ్యక్తపరిచి, ఈ వ్యక్తుల సమూహాన్ని నింపడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటున్నాడు. జనుల వేదన ద్వారా, వారి యోగ్యత ద్వారా, మరియు ఈ మురికి నేలలో సాతాను స్వరూపులై ఉన్న ప్రజలందరి ద్వారా దేవుడు తన శుద్దీకరణ మరియు జయించే కార్యాన్ని చేస్తున్నాడు. దీని వల్ల ఆయన ఘనత పొందవచ్చు, మరియు ఆయన కార్యానికి సాక్షులు గా ఉండే వారిని పొందవచ్చు. ఈ సమూహంలో జనుల కోసం దేవుడు చేసిన అన్ని త్యాగాల మొత్తం ప్రాముఖ్యత ఇది. అంటే, ఆయనని వ్యతిరేకించే వారి ద్వారానే దేవుడు జయించే కార్యాన్ని చేస్తాడు, తద్వారా మాత్రమే దేవుని యొక్క గొప్ప శక్తి బహిర్గతమవుతుంది. మరోలా చెప్పాలంటే, అపరిశుద్ధమైన నేలలో ఉన్నవారు మాత్రమే దేవుని ఘనతను వారసత్వంగా పొందేందుకు అర్హులు, ఇది మాత్రమే దేవుని యొక్క గొప్ప శక్తిని ప్రత్యేకంగా చూపుతుంది. అందుకనే అపరిశుద్ధమైన నేల నుండి, మరియు అపరిశుద్ధమైన నేలలో నివసించే వారి నుండి దేవునికి ఘనత దక్కుతుంది. దేవుని చిత్తం ఇలాంటిది. యేసు కార్యపు దశ ఇలాంటిదే. ఆయనని హింసించిన పరిసయ్యుల మధ్య నుండి మాత్రమే ఆయన ఘనత పొందగలడు, పరిసయ్యుల హింస మరియు జుడాస్ యొక్క ద్రోహం వల్ల కాకపోతే యేసు అవహేళనకు లేదా దూషణకి గురి అయ్యేవాడు కాదు, శిలువగ్రస్తుడు అసలే అయ్యేవాడు కాదు. తద్వారా ఘనతని పొంది ఉండేవాడు కాదు. ప్రతి యుగంలోనూ దేవుడు ఎక్కడ పని చేస్తాడో, మరియు ఆయన దేహధారియై ఎక్కడ పని చేస్తాడో అక్కడే ఆయన ఘనతను పొందుతాడు, మరియు అక్కడే ఆయన పొందాలనుకున్న చోట పొందుతాడు. ఇది దేవుని కార్యపు ప్రణాళిక మరియు ఆయన నిర్వహణ.
అనేక వేల సంవత్సరాల దేవుని ప్రణాళికలో, రెండు భాగాల పని శరీర రూపంలో జరగబడింది. మొదటి కార్యం శిలువగ్రస్తుడవడం, దాని వల్ల ఆయన ఘనత పొందుతాడు; ఇంకోటి అంత్య దినాల్లో జయించడం మరియు పరిపూర్ణత సాధించడం, దాని వల్ల ఆయన ఘనత పొందుతాడు. ఇది దేవుని యొక్క నిర్వహణ. అందువలన దేవుని కార్యాన్ని లేదా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞను సాధారణ విషయంగా పరిగణించవద్దు. దేవుని యొక్క అత్యంత మహోన్నతమైన మరియు శాశ్వతమైన ఘనతకు మీరందరూ వారసులు, మరియు ఇది దేవునిచే ప్రత్యేకంగా నియమించబడింది. ఆయన ఘనత యొక్క రెండు భాగాలలో, ఒకటి మీలో వ్యక్తమవుతుంది. దేవుని యొక్క శాశ్వతమైన ఘనతలో ఒక భాగం మీకు అనుగ్రహించబడింది. అది మీ వారసత్వం కావచ్చు. ఇది దేవుడు మిమ్మల్ని వృద్ధి చెయ్యడం, మరియు ఇది కూడా ఆయన ఎప్పుడో ముందుగానే నిర్ణయించిన ప్రణాళిక. గొప్ప ఎర్ర డ్రాగన్ నివసించే నేలలో దేవుని కార్యపు గొప్పతనాన్ని చూస్తే, ఇదే కార్యము ఎక్కడైనా జరిగితే అది ఎప్పుడో గొప్ప ఫలాన్ని ఇచ్చేది మరియు మనిషి చేత అంగీకరించబడడానికి సిద్ధంగా ఉండేది. అంతేకాక, దేవుణ్ణి విశ్వసించే పాశ్చాత్య మాతాధిపతులకి ఈ కార్యాన్ని ఆమోదించడం చాలా సులభం, ఎందుకంటే యేసు కార్యము యొక్క దశ ఉదాహరణగా ఉంది. ఇందువల్లనే దేవుడు మరోచోట ఘనతని పొందే ఈ కార్యము యొక్క దశను సాధించలేక పోతున్నాడు. ఎప్పుడైతే పనికి జనుల ద్వారా మద్దతు లభించి, దేశాల ద్వారా గుర్తింపు వస్తుందో, అప్పుడు దేవునికి ఘనత దక్కదు. ఈ నేలలో ఈ కార్యము యొక్క దశకి ఉన్న అసాధారణ ప్రాముఖ్యత ఖచ్చితంగా ఇదే. మీలో చట్టం ద్వారా రక్షింపబడే వారు ఒక్కరు కూడా లేరు—బదులుగా మీరు చట్టం ద్వారా అనుమతించబడినవారు. ప్రజలు మిమ్మల్ని అర్దం చేసుకోలేక పోవడం మరింత సమస్యాత్మకం. అది మీ బంధువులు, మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, లేదా మీ సహోద్యోగులు ఎవరైనా కావచ్చు, వారిలో ఎవరూ మిమ్మల్ని అర్దం చేసుకోరు. దేవునిచే మీరు విడిచి పెట్టబడినప్పుడు, భూమి పైన బ్రతుకు కొనసాగించడం మీకు అసాధ్యం, కానీ అయినప్పటికీ, జనులు దేవుని నుండి దూరంగా ఉండటాన్ని భరించలేరు, దేవుడు మనుషులని గెలవడం యొక్క ప్రాధాన్యత ఇదే, మరియు ఇదే దేవుని ఘనత. ఈ రోజు మీరు వారసత్వంగా పొందినది, యుగాల నాటి అపోస్తులు మరియు ప్రవక్తలను మించినది మరియు అది మోషే మరియు పేతురుల కన్నా గొప్పది. దీవెనలు ఒకటి లేదా రెండు రోజుల్లో పొందలేము; తప్పకుండా వాటిని గొప్ప త్యాగము ద్వారా సంపాదించాలి. చెప్పాలంటే, మీరు శుద్దీకరణ చేయబడిన ప్రేమని కలిగి ఉండాలి, తప్పకుండా మీరు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి, మరియు మీరు పొంది ఉండాలని దేవుడు కోరుకునే అనేకమైన సత్యాలను మీరు కలిగి ఉండాలి. ఇంకా ఎక్కువగా, మీరు దిగులు పడకుండా లేదా తప్పించుకోకుండా న్యాయం వైపు మరలాలి, మరియు మరణించే వరకూ దేవుని పట్ల స్థిరమైన ప్రేమను తప్పక కలిగి ఉండాలి. మీరు నిశ్చయముగా ఉండాలి, మీ జీవిత క్రమంలో మార్పులు తప్పక రావాలి, మీ అవినీతి పూర్తిగా తొలగిపోవాలి, దేవుని యొక్క అన్ని ఏర్పాట్లను ఫిర్యాదు చేయకుండా అంగీకరించాలి, మరియు మరణం వరకూ తప్పక మీరు విధేయతతో ఉండాలి. మీరు సాధించవలసింది ఇదే. దేవుని కార్యపు అంతిమ లక్ష్యం ఇదే, దేవుడు ఈ జనుల సమూహం నుండి అడిగేది ఇదే. ఆయన మీకు ఇస్తాడు కనుక, ఆయన తిరిగి మిమ్మల్ని తప్పకుండా అడుగుతాడు. మీకు ఖచ్చితంగా తగిన ఆజ్ఞాపనలు చేస్తాడు. కాబట్టి, దేవుడు చేసే పని అంతటికీ కారణం ఉంటుంది, దేవడు చేసే కార్యము ఉన్నత ప్రమాణాలు మరియు కఠినమైన నియమాలు ఎందుకు నిర్ధారిస్తుందో మరలా, మరలా చూపిస్తుంది. దీనివల్లనే మీరు దేవుని యందు విశ్వాసంతో నింపబడాలి. క్లుప్తంగా, దేవుని యొక్క పని మొత్తం ఆయన వారసత్వాన్ని స్వీకరించడానికి అర్హులు అవుతారని, మీకొరకు చేయబడింది. ఇది మొత్తం దేవుని సొంత ఘనత కోసం కాదు కానీ మీ రక్షణ మరియు ఈ అపరిశుద్ద నేలలో తీవ్రమైన బాధకి గురి కాబడిన జనుల సమూహం కోసం. మీరు దేవుని చిత్తాన్ని అర్దం చేసుకోవాలి. ఏ విధమైన అంతః దృష్టి లేదా ఇంగితం లేని ఎంతో మంది అజ్ఞానులకి నేను ఇలా ఉద్భోదిస్తున్నాను: దేవుని పరీక్షించవద్దు, మరియు ఇకపై ప్రతిఘటించవద్దు. ఏ మనుష్యుడు తట్టుకోలేని వేదనకు దేవుడు ఇంతకు మునుపే గురయ్యాడు, మరియు చాలా కాలం క్రితమే మనిషికి బదులు ఘోరమైన అవమానాన్ని భరించాడు. మీరు ఇంకా దేనిని విడిచి పెట్టలేరు? దేవుని చిత్తం కన్నా ముఖ్యమైనది ఏముంటుంది? దేవుని ప్రేమ కన్నా ఉన్నతమైనది ఏముంటుంది? ఈ అపరిశుద్ధమైన నేలలో తన పనిని నిర్వహించడమే దేవునికి చాలా కష్టం; ఒక వేళ దీనికి తోడు, మనిషి తెలిసి మరియు ఉద్దేశ పూర్వకంగా అతిక్రమిస్తే, దేవుని యొక్క కార్యము పొడిగించబడాల్సి వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదు, ఇది ఎవరికీ ప్రయోజనం కలిగించదు. దేవుడు కాలానికి బద్ధుడై ఉండడు; ఆయన కార్యము మరియు ఆయన ఘనత ముందు వస్తాయి. అందువలన, ఆయన కార్యం కోసం ఆయన ఎలాంటి వెల అయినా చెల్లిస్తాడు, దానికి ఎంత కాలం పట్టినా సరే. ఇదే దేవుని స్వభావం. ఆయన కార్యం పూర్తి అయ్యే వరకూ ఆయన విశ్రమించడు. ఆయన ఘనత యొక్క రెండవ భాగాన్ని పొందినప్పుడే ఆయన కార్యము ముగింపుకి వస్తుంది. ఒకవేళ, విశ్వమంతటిలో, దేవుడు ఘనతని పొందే ఆయన రెండవ భాగపు కార్యాన్ని పూర్తి చేయకపోతే, ఆయన రోజు ఎప్పటికీ రాదు, ఆయన ఎన్నుకున్న వారిని ఆయన చేయి ఎప్పటికీ విడవదు. ఆయన మహిమ ఎప్పటికీ ఇశ్రాయేలుపై కురవదు, మరియు ఆయన ప్రణాళిక ఎప్పటికీ పూర్తి కాదు. మీరు దేవుని చిత్తాన్ని చూడగలుగుతారు, మరియు దేవుని యొక్క కార్యము భూమ్యాకా శాలను మరియు అన్నిటినీ సృష్టించినంత తేలిక కాదని చూస్తారు. ఎందుకంటే నేటి కార్యము అత్యంత అచేతనంగా ఉన్న అవినీతి పరులను మార్చడం కోసం, ఇది సాతానుచే సృష్టించబడిన లేదా ఆవహించబడిన వారిని పరిశుద్ధపరచడం కోసం. ఇది ఆదాము లేదా అవ్వను సృష్టించడం కాదు, వెలుగుని సృష్టించడం అసలే కాదు, లేదా ప్రతీ మొక్కని మరియు జంతువును సృష్టించడం కాదు. సాతాను చేత కల్తీ కాబడిన వాటిని దేవుడు పరిశుద్దపరుస్తాడు మరియు తర్వాత కొత్తగా వారిని పొందుతాడు. వారు ఆయనకి చెందినవారు అవుతారు, మరియు వారు ఆయన ఘనతగా మారతారు. ఇది మనిషి ఊహించినట్లు కాదు, భూమ్యాకాశాల్ని మరియు వాటిలో ఉండే వాటిని సృష్టించినంత తేలిక కాదు, లేదా సాతానుని అధోగతికి శపించే కార్యము కాదు; బదులుగా ఇది మనిషిని మార్చే కార్యము, ప్రతికూలమైన వాటిని, మరియు ఆయనకి చెందని వాటిని, ఆయనకి చెందేలా అనుకూలంగా మార్చడం. దేవుని కార్యపు ఈ దశ వెనుక ఉన్న నిజం ఇది. మీరు ఇది ఖచ్చితం గా అర్దం చేసుకోవాలి, మరియు విషయాలను అతిగా సరళీకరించడం మానేయాలి. దేవుని యొక్క కార్యము ఏదైనా సాధారణమైన కార్యము లాంటిది కాదు. దాని అద్భుతత్వం, మరియు వివేచన మనిషి మెదడుకి అతీతమైనవి. దేవుడు ఈ కార్యపు దశలో అన్నిటినీ సృష్టించడు, లేదా నాశనం కూడా చెయ్యడు. బదులుగా ఆయన సృష్టించిన అన్నిటినీ మారుస్తాడు, మరియు సాతాను ద్వారా బ్రష్టపరచబడిన అన్నిటినీ పరిశుద్ధం చేస్తాడు. ఇలా దేవుడు ఒక గొప్ప సంస్థలోకి ప్రవేశించాడు, ఇదే దేవుని కార్యము యొక్క పూర్తి ప్రాముఖ్యత. ఈ మాటల్లో మీకు దేవుని కార్యము చాలా తేలికగా కనపడుతుందా?