ఆజ్ఞలను పాటించటం మరియు సత్యమును ఆచరించుట
ఆచరణలో, ఆజ్ఞలను పాటించడం అనేది సత్యమును ఆచరించడానికి ముడిపడి ఉండాలి. ఆజ్ఞలను పాటించేటప్పుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా సత్యమును ఆచరించాలి. సత్యాన్ని ఆచరించేటప్పుడు, ఒక వ్యక్తి ఆజ్ఞల నియమాలను ఉల్లంఘించకూడదు లేదా ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు; దేవునికి నీ నుంచి ఏది కావలెనో అది తప్పనిసరిగా చేయాలి. ఆజ్ఞలను పాటించడం మరియు సత్యమును ఆచరించడం అనేది ఒకదానికొకటి అంతర్లీనమైయున్నవి, విరుద్ధమైనవి కావు. మీరు ఎంత ఎక్కువగా సత్యమును ఆచరించినట్లయితే అంత ఎక్కువగా ఆజ్ఞల సారాన్ని పాటించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు ఎంత ఎక్కువగా సత్యమును ఆచరించినట్లయితే అంత ఎక్కువగా ఆజ్ఞలలో వ్యక్తపరిచినట్లుగా దేవుని వాక్కును అర్థం చేసుకోగలుగుతారు. సత్యమును ఆచరించుట మరియు ఆజ్ఞను పాటించడం అనేది విరుద్ధమైన చర్యలు కావు అవి ఒకదానికొకటి అనుసంధానమైనవి. ఆదిలో, మానవుడు ఆజ్ఞలను పాటించిన తర్వాత మాత్రమే సత్యమును ఆచరించటం మరియు పరిశుద్ధాత్మ చేత జ్ఞానమును పొందగలిగే వాడు, కానీ ఇది దేవుని యొక్క అసలైన ఉద్దేశం కాదు. దేవునికి కావాల్సింది కేవలం మంచిగా ప్రవర్తించడం కాదు కానీ మీ హృదయాన్ని ఆయన ఆరాధనలో ఉంచటం. అయితే, మీరు ఆజ్ఞలను కనీసం పైపైన అయినా తప్పనిసరిగా పాటించాలి. నెమ్మదిగా అనుభవం ద్వారా, దేవుని గురించి స్పష్టమైన అవగాహన పొందుతున్న తర్వాత ప్రజలు ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేయడం, ఆయనను వ్యతిరేకించటం మానేస్తారు మరియు ఆయన కార్యములను గూర్చి ఎంతమాత్రం అనుమానం లేకుండా ఉంటారు. ఆజ్ఞల సారానికి ప్రజలు కట్టుబడి ఉండటానికి ఇది మాత్రమే మార్గం. కాబట్టి, సత్యము ఆచరించకుండా కేవలం ఆజ్ఞలను పాటించటం అనేది విఫలమైనది మరియు నిజమైన దేవుని ఆరాధనను నిర్మించలేదు, ఎందుకంటే మీరు ఇంకా నిజమైన స్థాయిని పొందుకోలేదు. సత్యం లేకుండా ఆజ్ఞలను పాటించడం అనేది నియమాలకు కఠినంగా కట్టుబడి ఉండటమే. అలా చేయటంతో ఆజ్ఞలు మీ చట్టంగా మారుతాయి అవి జీవితంలో మీరు ఎదగటానికి సహాయ పడవు. దీనికి ప్రతికూలంగా అవి మీకు భారంగా మారతాయి మరియు పాతనిబంధనలోని చట్టాల వలె మిమ్మల్ని గట్టిగా బంధిస్తాయి, ఫలితంగా మీరు పరిశుద్ధాత్ముని సన్నిధిని కోల్పోతారు. కాబట్టి, సత్యమును ఆచరించడం ద్వారా మాత్రమే మీరు సమర్థవంతంగా ఆజ్ఞలను పాటించగలుగుతారు మరియు సత్యమును ఆచరించడానికి ఆజ్ఞలను పాటిస్తారు. ఆజ్ఞలను పాటించే ప్రక్రియలో మీరు మరిన్ని సత్యములను ఆచరణలో పెడతారు మరియు సత్యమును ఆచరించేటప్పుడు, మీరు ఆజ్ఞల అసలైన అర్థం గురించి మరింత లోతైన అవగాహన పొందుకుంటారు. మనుష్యుడు ఆజ్ఞలను పాటించాలనే దేవుని కోరిక వెనుక ప్రణాళిక మరియు అర్థం ఏమిటంటే అతను కేవలం నియమాలను అనుసరించేలా చేయటం కాదు కానీ అది జీవితంలో అతని ప్రవేశానికి సంబంధించినదని అతను ఇంకా ఊహించు కొనవచ్చు. జీవితంలో మీ ఎదుగుదల పరిధి ఆజ్ఞలను ఆచరించ గలగడానికి మీ స్థాయిని నిర్దేశిస్తుంది. ఆజ్ఞలనేవి మనుష్యుడు పాటించడానికి అయినప్పటికీ, ఆజ్ఞల యొక్క సారం మనిషిని జీవిత అనుభవం ద్వారా మాత్రమే స్పష్టమవుతుంది. చాలామంది సరిగా దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే వారు “పూర్తిగా సిద్ధపడి ఉన్నాము మరియు ఇక చేయవలసింది అంతా పట్టుకొనపడటం మాత్రమే” అని అనుకుంటూ ఉంటారు. ఇది ఒక విపరీతమైనటువంటి ఆలోచన మరియు దేవుని చిత్తానుసారము కాదు. ఇలాంటి విషయాలు చెప్పేవారు పురోగతిని కోరుకోరు మరియు వారు శరీరాన్ని కోరుకుంటారు. ఇది అర్థం లేనిది! ఇది యధార్ధత కు అనుగుణంగా లేదు! ఆజ్ఞలను నిజంగా పాటించకుండా కేవలం సత్యమును ఆచరించుట అనేది దేవుని యొక్క చిత్తము కాదు. ఈ విధంగా చేసేవారు అవిటి వారు; వారు ఒక కాలును కోల్పోయిన వారిగా ఉన్నారు. ఇంకనూ సత్యమును కలిగి ఉండకుండా నియమాలచే కట్టుబడినట్లుగా ఊరికే ఆజ్ఞలను పాటించడం అనేది దేవుని చిత్తమును సంతృప్తిపరిచే సామర్థ్యం కాదు, ఇది ఒక కన్ను కోల్పోయిన వారి వలె ఉంటుంది, ఈ విధంగా చేసే ప్రజలు కూడా ఒక వైకల్యత రూపంలో బాధపడుతున్నారు. దీన్ని ఈవిధంగా చెప్పవచ్చు, మీరు ఆజ్ఞలను చక్కగా పాటించి మరియు క్రియలు చేసే దేవుని గూర్చి స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నట్లయితే మీరు సత్యమును పొందుకుంటారు, ఇంకొక విధంగా చెప్పాలంటే మీరు నిజమైన స్థాయిని పొందుకుంటారు. మీరు ఆచరించాల్సినటువంటి సత్యమును ఆశ్రయించినట్లయితే, మీరు ఆజ్ఞలను కూడా పాటిస్తారు మరియు ఈ రెండు విషయాలు ఒకదానికొకటి విరుద్ధంగా లేవు. సత్యం ఆచరించటం మరియు ఆజ్ఞలను పాటించడం అనేవి రెండు వ్యవస్థలు, రెండూ కూడా మనిషి జీవితానుభవంలోని అంతర్భాగాలు. ఒక మనిషి అనుభవం ఆజ్ఞలను పాటించుట మరియు సత్యమును అనుసరించుట అనే సమైక్యతను కలిగి ఉండాలి కానీ విభజనను కాదు. ఏదేమైనా, నా ఈ రెండింటి మధ్య విభేదాలు మరియు సంబంధాలు రెండు ఉన్నాయి.
ఈ నూతన యుగంలో ఆజ్ఞల ప్రకటన అనేది, ఈ ప్రవాహంలో ఉన్న ప్రజలందరూ, ఈరోజు దేవుని స్వరమును విన్న వారందరూ నూతన యుగంలోనికి ప్రవేశించారనే సత్యమునకు సాక్షిగా ఉన్నది. దేవుని కార్యమునకు ఇది ఒక నూతన ఆరంభం, అదేవిధంగా దేవుని కార్యములలో చివరి భాగమైన ఆరు వేల సంవత్సరముల నిర్వహణ ప్రణాళికకు ఆరంభం. ఈ నూతన యుగంలోని ఆజ్ఞలు, ఇశ్రాయేలీయుల మధ్య యెహోవా పనిచేసినట్లుగా మరియు యూదుల మధ్య యేసుక్రీస్తు పని చేసినట్లుగా మరింత ఆచరణాత్మకమైన పని చేయుటకు మరియు ఈ భూమ్మీద ఇంకా ఎక్కువ మరియు గొప్ప కార్యములు చేయుటకు దేవుడు మరియు మానవుడు నూతన పరలోకము మరియు నూతన భూమండలంలోనికి ప్రవేశించారను సత్యమునకు సూచనగా ఉన్నాయి. ఈ ప్రజల సమూహం దేవుని వద్దనుండి చాలా మరియు గొప్ప ఆదేశాలు మరియు వారికి ఆహారం, మద్దతు, సంరక్షణ, ఆచరణాత్మక విధానంలో ఆయనచే రక్షించబడడం మరియు ఇంకా ఎక్కువగా ఆయనచే ఆచరణాత్మక శిక్షణ ఇవ్వబడటం మరియు దేవుని వాక్కుతో నిర్మలం చేయబడతారు అనటానికి కూడా ఇవి సూచనగా ఉన్నాయి. నూతన యుగపు ఆజ్ఞల ప్రాముఖ్యత చాలా లోతైనది. దేవుడు నిజంగా ఈ భూమి మీద కనబడునని, అక్కడ నుండి ఆయన ఈ మొత్తము విశ్వమును జయించి, శరీరధారియై తన మహిమను పరచునని వారు సూచిస్తున్నారు. ఆచరణాత్మక దేవుడు తాను ఎన్నిక చేసుకొనిన వారిని పరిపూర్ణులుగా చేసే క్రమంలో ఈ భూమ్మీద చాలా ఆచరణాత్మక కార్యములు చేయునని వారు ఇంకా సూచిస్తున్నారు. అన్నిటికంటే, దేవుడు తన వాక్కుతో ఈ భూమి మీద సమస్తమును పూర్తిచేసి, “అవతారుడు అయిన దేవుడు ఉన్నత స్థానానికి ఎదిగి మహిమ పొందునని మరియు గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి సమస్త ప్రజలు మరియు సమస్త జనాంగములు మోకరిల్లునని” శాసనమును వెల్లడి చేయును. నూతన యుగపు ఆజ్ఞలు మనుష్యుడు ఆచరించవలసినవే అయినప్పటికీ, అలా చేయుట మానవుని విధి మరియు అతని బాధ్యత మరియు వారి ప్రాతినిధ్య అర్థము ఒకటి రెండు మాటల్లో పూర్తిగా వ్యక్తపరచలేనంత లోతైనవి. నూతన యుగపు ఆజ్ఞలు యెహోవా మరియు యేసుక్రీస్తు ప్రకటించిన పాత నిబంధన చట్టములు మరియు క్రొత్త నిబంధన శాసనములను భర్తీ చేస్తాయి. ఇది చాలా లోతైన పాఠము, ప్రజలు ఊహించినట్లుగా సులువైనది కాదు. ఈ నూతన యుగపు ఆజ్ఞలకు ఆచరణాత్మక ప్రాముఖ్యత అనే ఒక అంశం ఉంది: అవి కృపా యుగానికి మరియు రాజ్య యుగానికి మధ్యవర్తిగా పనిచేస్తాయి. పాత యుగపు ఆచారాలు మరియు శాసనాలు, అదేవిధంగా యేసుక్రీస్తు కాలపు మరియు అంతకుముందు ఉన్న ఆచారాలు అన్నిటికీ నూతన యుగపు ఆజ్ఞలు ముగింపునిస్తాయి. అవి మానవుని గొప్ప ఆచరణాత్మక దేవుని సన్నిధికి తీసుకొని వస్తుంది, ఆయన వ్యక్తిగతంగా అతడిని పరిపూర్ణుడుగా చేయడానికి అనుమతిస్తుంది; అవి పరిపూర్ణత మార్గానికి ఆరంభం. ఆ విధంగా, మీరు నూతన యుగపు ఆజ్ఞల పట్ల సరైన వైఖరిని కలిగి ఉండాలి, ఒక పద్ధతి లేకుండా వాటిని అనుసరించకూడదు లేదా వ్యతిరేకించకూడదు. నూతన యుగపు ఆజ్ఞలు ఒక నిర్దిష్ట అంశాన్ని గట్టిగా నొక్కి చెబుతుంటాయి: మానవుడు ఈనాటి ఆచరణాత్మక దేవుడైన ఆయనను ఆరాధించవలెను, అది మరింత ఆచరణాత్మకమైన ఆత్మ సారమును కలిగి ఉంటుంది. దేవుడు నీతి సూర్యునిగా ప్రత్యక్షమైన తర్వాత, దేవుడు మనిషిని దోషిగా లేదా నీతిమంతునిగా తీర్పు తీర్చే నియమాన్ని ఈ ఆజ్ఞలు నొక్కి చెబుతాయి. ఆజ్ఞలను ఆచరించడం కంటే అర్థం చేసుకోవడం చాలా సులువు. ఇక్కడి నుండి దేవుడు మానవుని పరిపూర్ణంగా చేయడం చూస్తాం, ఆయన ఆ విధంగా తన మాటలు మరియు నిర్దేశము చొప్పున చేయాలి కానీ మనుష్యుడు తన సొంత జ్ఞానం చేత పరిపూర్ణతను సాధించలేడు. మానవుడు నూతన ఆజ్ఞలను పాటించిన లేక పాటించకపోయినను, ఆచరణాత్మక దేవుని జ్ఞానమును కలిగి ఉండాలి. కావున, మీరు ఆజ్ఞలను పాటించగలరా లేదా పాటించలేరా అనేది కొద్ది రోజులలో పరిష్కారం అయ్యే ప్రశ్న కాదు. ఇది నేర్చుకొనడానికి చాలా లోతైన పాఠం.
సత్యమును ఆచరించుట అనేది మానవుని జీవితం ఎదగటానికి మార్గం. మీరు సత్యమును ఆచరించనట్లయితే, సిద్ధాంతం తప్ప మీరు ఏమి కలిగి ఉండరు మరియు వాస్తవిక జీవితం ఉండదు. సత్యం అనేది మనిషి స్థాయికి సంకేతం, మరియు సత్యమును పాటిస్తున్నారా లేదా అనేది మీకు నిజమైన స్థాయి ఉన్నదా లేదా అనేదానితో సంబంధం కలిగి ఉంటుంది. మీరు సత్యము ఆచరించనట్లయితే, నీతిగా వ్యవహరించనట్లయితే లేదా మీ భావోద్వేగాలతో ఊగిసలాడినట్లయితే మరియు మీ శరీరంపై శ్రద్ధ చూపినట్లయితే, ఆజ్ఞలను పాటించటానికి మీరు చాలా దూరంగా ఉన్నారు. ఇవి చాలా లోతైన పాఠాలు. ప్రతి యుగంలోనూ మనుషులు ప్రవేశించడానికి మరియు అర్థం చేసుకోవడానికి చాలా సత్యాలు ఉంటాయి, కానీ ప్రతి యుగంలో కూడా వాటితో పాటు వివిధ ఆజ్ఞలు కూడా ఉంటాయి. మనుషులు ఆచరించే సత్యాలు నిర్దిష్టమైన వయస్సుకు సంబంధించి ఉంటాయి మరియు అలాగే వారు పాటించే ఆజ్ఞలు కూడా. ప్రతి యుగం ఆచరించడానికి తన స్వంత సత్యములు మరియు పాటించడానికి స్వంత ఆజ్ఞలు కలిగి ఉంటుంది. అయితే, మానవుని సత్య ఆచరణ ప్రభావం మరియు లక్ష్యం, దేవునిచే ప్రకటించబడిన వివిధ యుగాల మీద ఆధారపడిన అనేక ఆజ్ఞలకు అనుగుణంగా ఉంటుంది. ఆజ్ఞలు సత్య సేవ చేస్తాయని మరియు ఆజ్ఞలను నిర్వహించడానికి సత్యం ఉందని చెప్పవచ్చు. కేవలం సత్యం మాత్రమే ఉన్నట్లయితే, దేవుని కార్యముల గురించి మాట్లాడటానికి ఎటువంటి మార్పులు ఉండవు. అయితే, ఆజ్ఞలను ప్రస్తావించడం ద్వారా మనుష్యుడు పరిశుద్ధాత్మ కార్యాల పరిధిని గుర్తించగలుగుతాడు మరియు ఏ యుగంలో దేవుడు కార్యాలు చేస్తాడో తెలుసుకోగలుగుతాడు. ధర్మశాస్త్ర యుగంలో ప్రజలు ఆచరించినట్లుగా సత్యమును ఆచరించే ప్రజలు మతంలో ఉన్నారు. అయితే వారు నూతన యుగపు ఆజ్ఞలను కలిగి ఉండరు, లేదా వాటిని పాటించలేరు. ఇంకా పాత మార్గం అనుసరిస్తారు మరియు ఆదిమ మానవులుగా ఉండిపోతారు. వారు పనిలో క్రొత్త విధానాలను కలిగి ఉండరు మరియు నూతన యుగపు ఆజ్ఞలను చూడలేరు. కాబట్టి, వారు దేవుని పనిని కలిగి ఉండరు. వారు ఖాళీ గుడ్డు పెంకులను మాత్రమే కలిగి ఉంటారు; లోపల కోడిపిల్ల లేనట్లుగా వారిలో కూడా ఆత్మ లేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, వారికి జీవితం లేదని అర్థం. అలాంటి ప్రజలు నూతన యుగంలోనికి ప్రవేశించలేరు మరియు ఎన్నో అడుగులు వెనుకబడి ఉంటారు. కాబట్టి, పాత యుగాల సత్యములను కలిగి ఉండి క్రొత్త యుగపు ఆజ్ఞలను కలిగి ఉండకపోతే అది వ్యర్థం. మీలో చాలామంది ఈనాటి సత్యమును ఆచరిస్తూ ఉండవచ్చు కానీ వాటి ఆజ్ఞలను పాటించరు. మీరు ఏది పొందలేరు మరియు మీరు ఆచరిస్తున్న సత్యము విలువ లేనిది మరియు అర్థం లేనిది, దేవుడు మిమ్మల్ని ప్రశంసించడు. పరిశుద్ధాత్మ ప్రస్తుత పని విధానాల పరిమితులలో మాత్రమే సత్యమును ఆచరించవలెను; ఇది ఈనాటి ఆచరణాత్మక దేవుడి స్వరానికి ప్రతిస్పందనగా చేయాలి. అలా చేయనట్లయితే, సమస్తం శూన్యం, వెదురు బుట్టను ఉపయోగించి నీటిని తోడటం లాంటిది, ఇది నూతన యుగపు ఆజ్ఞలను ప్రకటించడానికి ఆచరణాత్మక అర్థం కూడా. ప్రజలు ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నట్లయితే, వారు కనీసం ఎటువంటి గందరగోళం లేకుండా శరీరధారిగా ప్రత్యక్షమయ్యే ఆచరణాత్మక దేవుని తెలుసుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే, ప్రజలు ఆజ్ఞలకు కట్టుబడి ఉండే నియమాలను గ్రహించాలి. ఆజ్ఞలకు కట్టుబడి ఉండటం అనేది వాటిని అడ్డదిడ్డంగా లేదా యథేచ్ఛగా అనుసరించడం కాదు, కానీ వాటికి ఒక పద్ధతిలో, ఒక లక్ష్యంతో మరియు నియమాలతో కట్టుబడి ఉండటం. మొదట సాధించవలసిన విషయం ఏమిటంటే, మీ దర్శనములు స్పష్టంగా ఉండాలి. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముని కార్యం గూర్చి పూర్తి అవగాహన ఉన్నట్లయితే మరియు ఈనాటి పని విధానాల్లో ప్రవేశించినట్లైతే, అప్పుడు ఆజ్ఞలను పాటించడానికి స్పష్టమైన అవగాహనను మీరు సహజంగా పొందుకుంటారు. నూతన యుగపు ఆత్మల సారం ద్వారా చూడగలిగే రోజు వచ్చినప్పుడు, మీరు ఆజ్ఞలను పాటించగలరు, అప్పుడు మీరు పరిపూర్ణులుగా చేయబడతారు. సత్యము ఆచరించుట మరియు ఆజ్ఞలను పాటించుటకు ఇది ఆచరణాత్మక ప్రాముఖ్యత. మీరు సత్యమును ఆచరించగలరా లేదా అనేది నూతన యుగపు ఆజ్ఞల సారమును మీరు ఎలా తెలుసుకోగలరు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్ముని కార్యము నిరంతరం మనిషికి కనిపిస్తూ ఉంటుంది మరియు దేవుడు మనిషి నుండి ఇంకా ఇంకా కోరుకుంటున్నాడు. కాబట్టి, వాస్తవానికి మనుష్యుడు ఆచరణలో పెట్టే సత్యాలు మరింత పెరుగుతాయి మరియు మరింత గొప్పగా మారుతాయి మరియు ఆజ్ఞలను పాటించడం యొక్క ప్రభావాలు మరింత లోతుగా మారుతాయి. కాబట్టి, మీరు తప్పనిసరిగా ఒకేసారి సత్యమును ఆచరించటం మరియు ఆజ్ఞలను పాటించడం చేయాలి. ఎవరు కూడా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు; ఈ నూతన యుగంలో నూతన సత్యము మరియు నూతన ఆజ్ఞలు ఒకే సమయంలో ప్రారంభం అవ్వనివ్వండి.