వెయ్యేండ్ల రాజ్యం వచ్చేసింది

ఈ మనుష్యుల సమూహంలో దేవుడు జరిపించబోవు కార్యమును మీరు గమనించారా? దేవుడు ఒకసారి చెప్పిన ప్రకారం, వెయ్యేండ్ల దేవుని రాజ్యంలో కూడా ప్రజలు ఆయన వాక్యములను అనుసరించాల్సిందే మరియు భవిష్యత్తులో దేవుని వాక్కులు మనుష్యుల జీవమును నేరుగా కనాను అనే మంచి భూమిలోకి నడిపిస్తాయి. మోషే అరణ్యంలో ఉన్నప్పుడు, దేవుడు సూచనలివ్వడంతో పాటు సూటిగా అతనితో మాట్లాడెను. మనుష్యులు అనుభవించడానికి దేవుడు ఆకాశము నుండి ఆహారం, నీరు మరియు మన్నా పంపెను, అవి నేటికీ అలాగే ఉన్నాయి: మనుష్యులు తృప్తిగా తిని, త్రాగి అనుభవించడానికి దేవుడు స్వయంగా అన్నింటినీ కిందికి పంపెను, అలాగే, మనుష్యులను మందలించడం కోసం ఆయనే స్వయంగా శాపములను కూడా పంపెను. కాబట్టి, ఆయన కార్యమునందలి ప్రతి అడుగు స్వయముగా దేవునిచే వేయించబడుతున్నది. నేడు, మనుష్యులు వాస్తవాలు సంభవించాలని కోరుకుంటారు, వారు సూచనలు మరియు అద్భుతాలను కోరుకుంటారు. కానీ, దేవుని కార్యము మరింత ఆచరణాత్మకంగా మారుతున్న కారణంగా అలాంటి వారందరూ దూరముగా త్రోసియేయబడే అవకాశం ఉంది. దేవుడు పరలోకము నుండి దిగి వచ్చాడని ఎవరికీ తెలియదు, దేవుడు ఆకాశము నుండి ఆహారమును మరియు బలవర్ధకములు పంపెను అనే విషయమును కూడా వారు ఎరుగరు—అయినప్పటికీ, దేవుడు వాస్తవముగా ఉనికిలో ఉన్నాడు, మరియు మనుష్యుల ఊహలోని వెయ్యేండ్ల దేవుని రాజ్యం యొక్క ఉత్తేజకరమైన దృశ్యాలు కూడా దేవుని సొంత వాక్యములే. ఇదే నిజము, దీనినే భూమి మీద దేవుడు యేలుట అని పిలుస్తారు. భూమి మీద దేవుడు యేలుట అనేది శరీరానికి సూచనగా ఉన్నది. శరీర సంబంధం కానిది యేదియు భూమి మీద ఉండదు, ఆ ప్రకారముగా, మూడవ ఆకాశమునకు వెళ్లడంపై దృష్టి సారించే వారందరి ప్రయాస వ్యర్ధమే. ఏదో ఒకరోజున, విశ్వమంతయు మళ్లీ దేవుని వద్దకు తిరిగి వచ్చినప్పుడు, జగత్తు యావత్తు ఆయన జరిపించిన కార్యమును కేంద్రముగా చేసుకొని ఆయన వాక్యమును వెంబడిస్తుంది; ఇతరత్రా ప్రదేశాలలోని వారు, దేవుని వాక్యమును స్వీకరించడానికి కొందరేమో టెలిఫోన్ వినియోగిస్తారు, ఇంకొందరు విమానంలో వెళతారు, ఇంకొందరు సముద్రం మీదుగా పడవలో వెళతారు, మరికొందరు కాంతిరేఖలను ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరూ దేవుడిని ఆరాధిస్తారు, ఆకాంక్షిస్తారు కాబట్టి, వారందరూ దేవునికి సమీపముగా వస్తారు అంతమాత్రమే కాదు సమూహముగా దేవుని పక్షముగా చేరతారు మరియు అందరూ కలిసి దేవుడిని ఆరాధిస్తారు—ఇవన్నియు దేవుని కార్యములుగా ఉంటాయి. ఇది జ్ఞాపకముంచుకో! దేవుడు ఖచ్చితంగా ఇంకెక్కడా మళ్లీ ప్రారంభించడు. ఈ వాస్తవమును దేవుడే పరిపూర్ణము చేస్తాడు: లోకంలో ఉన్న జనులందరు ఆయన యొద్దకు వచ్చేలా మరియు భూమి మీద ఉన్న దేవుడిని ఆరాధించేలా చేస్తాడు, అలాగే ఇతర ప్రదేశాలలో ఆయన పని ఆగిపోతుంది, జనులు సత్య మార్గాన్ని వెతకడానికి బలవంతం చేయబడతారు. ఇది యోసేపు పరిస్థితి వలె ఉంటుంది: యోసేపు యొద్ద ఆహారము సమృద్దిగా ఉండటంతో ప్రతి ఒక్కరూ అతని యొద్దకు వచ్చి అతని యెదుట సాగిలపడ్డారు. కరువు నుండి తప్పించుకోటానికి జనులు సత్య మార్గాన్ని వెతకవలసి వస్తుంది. మతసంబందమైన జనులు యావత్తు తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడతారు, నేటి దేవుడు మాత్రమే జీవ జల ఊట అయి ఉన్నాడు, మానవుని ఆనందానికి అందించబడిన నిరంతరం ప్రవహించే ఊటబావిని కలిగి ఉంటాడు, ప్రజలు ఆయనను ఆశ్రయించి ఆయనపై ఆధారపడతారు. అదే దేవుని కార్యములు బయలుపరచబడిన సమయము మరియు దేవుడు మహిమపరచబడే గడియ అవుతుంది; ఈ లోకములో ఉన్న జనులందరూ ఈ గుర్తింపులేని “మానవుడిని” ఆరాధిస్తారు. ఇది దేవుడు మహిమపరచబడే దినము కాదా? ఒక దినమున, వృద్ధ కాపరులు జీవజల ఊట నుండి నీటిని కోరుతూ సందేశాలు పంపుతారు. వారు వృద్ధులుగా ఉంటారు, అయినప్పటికీ ఒకప్పుడు వారు తృణీకరించిన ఈ వ్యక్తినే ఆరాధించుటకు వస్తారు. వారు ఆయనను తమ నోటితో ఒప్పుకొని, ఆయనను తమ హృదయాలతో విశ్వసిస్తారు—ఇది ఒక సూచన మరియు ఆశ్చర్యం కాదా? రాజ్యమంతయు సంతోషించినప్పుడు ఆ దినము దేవుని మహిమపరుచు దినముగా ఉంటుంది, అంతేగాక ఎవరైతే మీ యొద్దకు వచ్చి దేవుని సువార్తను స్వీకరిస్తారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, జనులు మరియు దేశములు ఇలా చేసినప్పుడు వారందరు దేవునిచేత ఆశీర్వదించబడతారు మరియు శ్రద్ధ చూపబడతారు. రాబోయే మార్గం ఇలా ఉండబోతుంది: దేవుని నోటి నుండి వెలువడిన వాక్కును పొందినవారికి నేల మీద నడవడానికి త్రోవలు ఉంటాయి, మరియు దేవుని వాక్కు పొందకుండా, వ్యాపారులు కావచ్చు లేదా శాస్త్రవేత్తలు కావచ్చు లేదా విద్యావేత్తలు కావచ్చు లేదా పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనను ఒక్క అడుగు వేయడానికే చాలా ప్రయాసపడతారు, అలాగే సత్య మార్గమును వెతుకుటలో వారు బలవంతం చేయబడతారు. దీని అర్థం ఏమిటంటే, “సత్యముతో మీరు సర్వలోకములో సంచరించగలరు; సత్యము లేకుండా ఎక్కడికీ వెళ్లలేరు”. వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి: దేవుడు విశ్వమంతటిని ఆజ్ఞాపించుటకు, మనుష్యులందరిని పాలించుటకు మరియు వారిని జయించుటకు మార్గమును (ఆయన వాక్యములన్నీ అని అర్థం) ఉపయోగిస్తాడు. దేవుడు చేసే పనులలో గొప్ప మార్పు కోసం మనుష్యులు ఎల్లప్పుడూ ఆశతో ఉంటారు. స్పష్టంగా చెప్పాలంటే, దేవుడు తన వాక్యముల ద్వారా మనుష్యులను నియంత్రిస్తాడు నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆయన చెప్పేది నువ్వు తప్పక చేయాల్సిందే; ఇది ఒక లక్ష్యాత్మక సత్యము కాబట్టి, అందరూ తప్పక లోబడాలి అలాగే ఇది నిష్పక్షపాతమైనది, అందరికీ తెలిసినది కూడా.

పరిశుద్ధాత్మ జనులకు ఒక అనుభూతిని కలుగజేస్తుంది. జనులు దేవుని వాక్యాములను చదివిన తర్వాత వారి హృదయములలో స్థిరత్వాన్ని మరియు శాంతిని పొందుతారు అయితే, దేవుని వాక్యములను గ్రహించని వారు వట్టి ఖాళీ స్పర్శను పొందుతారు. దేవుని వాక్యమునకు అంతటి శక్తి ఉంది. మనుష్యులు వాటిని చదవాలి, వాటిని చదివిన తర్వాత వారు పోషించబడతారు మరియు అవి లేకుండా వారు ఏమి చేయలేరు. ఇది ప్రజలు నల్లమందు తీసుకున్నప్పుడు ఉన్నట్టుగా ఉంటుంది: అది వారికి బలాన్ని ఇస్తుంది, అది లేనట్లయితే వారు శక్తి లేనివారుగాను మరియు బలహీనులగా ఉన్న అనుభూతిని పొందుతారు. నేటి ప్రజలలో ఉన్న అభిప్రాయము ఇదే. దేవుని వాక్యములను చదవడం వల్ల మనుష్యులకు బలం వస్తుంది. ఆ వాక్యములను చదవకపోతే వారు నిస్సత్తువగా భావిస్తారు కానీ, వాటిని చదివిన తర్వాత వారు తక్షణమే “అనారోగ్య పడకల” నుండి పైకి లేస్తారు. భూమి మీద దేవుని వాక్యమునకు ఉన్న శాసన శక్తి మరియు భూమి మీద దేవుడి పాలనకు ఇది నిదర్శనము. కొంతమంది మనుష్యులు వదిలి వెళ్లాలనుకుంటారు లేదా దేవుని పనిలో అలసి పోతారు. అయినప్పటికీ, వారు దేవుని వాక్యముల నుండి తమను తాము వేరు పరుచుకోలేరు; ఎంత బలహీనులైనవారు అయినప్పటికీ, వారు ఎంత తిరుగుబాటుదారులైనప్పటికీ, వాటితో సంబంధం లేకుండా, దేవుని వాక్యాలు అనుసరించి జీవించాల్సిందే. వారు దేవుని వాక్యములను విడిచిపెట్టడానికి సాహసం చేయరు. దేవుడు పాలించినప్పుడు, శక్తిని ప్రయోగించినప్పుడు, దేవుడి వాక్యములు వాటి బలాన్ని నిజంగా ప్రదర్శిస్తాయి; ఈ విధంగా దేవుడు పని చేస్తాడు. అన్నింటికంటే ముఖ్యంగా, ఇది దేవుడు పనిచేసే విధానం కనుక ఎవరూ దానిని విడిచిపెట్టలేకపోవచ్చు. దేవుని వాక్యాలు లెక్కలేనన్ని గృహాలలో వ్యాపిస్తాయి, అవి అందరికీ తెలిసి పోతాయి, అప్పుడు మాత్రమే ఆయన పని విశ్వమంతటా వ్యాపిస్తుంది. ఇంకా చెప్పాలంటే, దేవుని పని లోకమంతటా వ్యాపించాలంటే, ఆయన వాక్యములు తప్పక వ్యాప్తి చెందాలి. దేవుని మహిమపరచు దినమున, దేవుని వాక్యములు వాటి ప్రభావమును మరియు అధికారాన్ని తెలియజేస్తాయి. అనాది కాలం నుండి ఈనాటి వరకు ఆయన చెప్పిన ప్రతి వాక్యము నెరవేరును మరియు పూర్తిచేయబడును. ఈ విధానంలో భూమి మీద దేవుడు మహిమ పరచబడతాడు—అంటే ఆయన వాక్యములు భూమి మీద రాజ్యమేలుతాయి. దుష్టులందరూ దేవుని నోటి నుండి వచ్చే వాక్యముల వలన మందలింపబడతారు, నీతిమంతులందరూ ఆయన నోటి నుండి వచ్చే వాక్యముల వలన ఆశీర్వదించబడతారు మరియు అందరూ ఆయన నోటి నుండి వచ్చే వాక్యముల ద్వారా స్థిరము పొంది సంపూర్ణులవుతారు. ఆయన ఎటువంటి సూచక క్రియలు లేదా ఎటువంటి అద్భుతములుకనుపరుచడు; అన్నీ ఆయన వాక్యముల ద్వారానే నెరవేర్చబడతాయి మరియు ఆయన వాక్యములు వాస్తవాలను ఉత్పన్నం చేస్తాయి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యములను వేడుక చేసుకుంటారు, వారు పెద్దవారు కావచ్చు లేదా పిల్లలు కావచ్చు, మగవారు, ఆడవారు కావచ్చు, వృద్ధులు లేదా యవ్వనులు కావచ్చు, జనులందరు దేవుని వాక్యములకు లోబడి ఉంటారు. ప్రజలు భూమిపై దేవుని వాక్యములను స్పష్టంగా మరియు జీవసంబంధంగా చూడడానికి అవి శరీరధారియై కనిపిస్తాయి. వాక్యము శరీరధారి అయ్యేను అనే మాటకు అర్దం ఇదే. ముఖ్యంగా దేవుడు “వాక్యము శరీరధారియగును” అనే వాస్తవము నెరవేర్చుటకు ఆయన భూమి మీదకు వచ్చెను, అనగా ఆయన తన వాక్కును శరీరానుసారుడుగా మాటలాడుటకు వచ్చెను (పాత నిబంధనలో ఉన్న మోషే కాలం వలె కాదు, ఎందుకంటే ఆ దినాల్లో దేవుని స్వరము నేరుగా ఆకాశం నుండి వెలువడేది). అటు తరువాత, వెయ్యేండ్ల దేవుని రాజ్య యుగంలో ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి, అవి మానవుని కళ్ళ ముందు వాస్తవాలుగా మారతాయి మరియు ప్రజలు తమ స్వంత దృష్టితో ఎటువంటి తారతమ్యము లేకుండా తేటతెల్లంగా చూస్తారు. ఇదే దేవుని అవతారానికి పరమార్థం. అంటే, ఆత్మ కార్యము శరీరము ద్వారా మరియు వాక్యము ద్వారా నెరవేర్చబడుతుంది. “వాక్యము శరీరధారియగును” మరియు “శరీరములో వాక్యము కనిపించడం” అనేదానికి ఇదే నిజమైన అర్థం. దేవుడు మాత్రమే ఆత్మ యొక్క చిత్తాన్ని మాట్లాడగలడు మరియు శరీరధారియైన దేవుడు మాత్రమే ఆత్మ పక్షముగా మాట్లాడగలడు; దేవుని యొక్క వాక్యములు దేవుని అవతారంలో స్పష్టముగా ఉన్నాయి మరియు ప్రతి ఒక్కరూ ఆ వాక్యములచేత నడిపించబడతారు. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదు, వారందరూ ఈ పరిధిలోనే ఉన్నారు. కేవలము ఇటువంటి వాక్కు ద్వారానే ప్రజలు అవగాహన పొందగలరు; ఈ విధానములో లాభము పొందనివారు పరలోకము నుండి మేము ఆ వాక్కును పొందగలము అనుకుంటే అది పగటి కలే అవుతుంది. దేవుని అవతార శరీరంలో ప్రదర్శించబడిన అధికారం అటువంటిదే, దీని వలన అందరూ సంపూర్ణమైన ఒప్పుదల కలిగినవారై ఆయనయందు విశ్వాసముతో ఉంటారు. అత్యంత గౌరవనీయులైన నిపుణులు మరియు మతపరమైన కాపరులు కూడా ఈ వాక్యములు మాట్లాడలేరు. వారందరూ తప్పనిసరిగా వాటికి లోబడాలి అంతే గాక ఎవరునూ ఏవిధముగానూ మరొక ఆరంభాన్ని చేయలేరు. ఈ ప్రపంచాన్ని జయించడానికి దేవుడు వాక్కును ప్రయోగిస్తాడు. ఆయన తన అవతార శరీరం ద్వారా ఇలా చేయడు, కానీ మొత్తం విశ్వంలోని జనులందరినీ జయించటానికి దేవుని నోటి నుండి వచ్చిన వాక్యములు ఉపయోగించడం ద్వారా శరీరధారి అవుతాడు; ఈ వాక్యము మాత్రమే శరీరముగా మారుతుంది, మరియు ఇది మాత్రమే శరీరములో వాక్యము యొక్క రూపము. బహుశా, మానవులకు, దేవుడు పెద్దగా పని చేసినట్లు కనిపించకపోవచ్చు కాని దేవుడు తన మాటలను పలకవలసి ఉంది, మరియు వారు పూర్తిగా ఒప్పించబడతారు మరియు విస్మయానికి గురవుతారు. వాస్తవాలు లేకుండా, జనులు అరుస్తారు మరియు కేకలేస్తారు; దేవుని వాక్యములతో, వారు మౌనంగా ఉంటారు. దేవుడు ఈ వాస్తవాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఎందుకంటే ఇది దేవుని దీర్ఘకాల ప్రణాళిక: భూమిపై వాక్యము యొక్క ఆగమన వాస్తవాన్ని నెరవేర్చడమే. వాస్తవానికి, నేను వివరించాల్సిన అవసరం లేదు—భూమిపై వెయ్యేండ్ల దేవుని రాజ్య ఆగమనం అంటే భూమిపై దేవుని వాక్యముల ఆగమనం అని అర్థం. పరలోకం నుండి కొత్త జెరూసలేం లోకి ఆయన దిగడం అంటే మనుష్యుల మధ్య జీవించడానికి, మనిషి యొక్క ప్రతి చర్యకు మరియు అతని అంతర్లీన ఆలోచనలన్నిటికి తోడుగా ఉండటానికి దేవుని వాక్యముల ఆగమనం చెందినట్లే. ఇది కూడా దేవుడు నెరవేర్చే వాస్తవమే; ఇదే వెయ్యేండ్ల దేవుని రాజ్యం యొక్క అందం. ఇది దేవుడు తయారు చేసిన ప్రణాళిక: ఆయన వాక్యములు భూమిపై వెయ్యి సంవత్సరాల వరకు కనిపిస్తాయి, మరియు అవి ఆయన పనులన్నింటినీ వ్యక్తపరుస్తాయి మరియు భూమిపై ఆయన మొత్తం పనిని పూర్తి చేస్తాయి, ఆ తర్వాత మానవజాతి యొక్క ఈ దశ ముగుస్తుంది.

మునుపటి:  కొత్త యుగం ఆజ్ఞలు

తరువాత:  ఆజ్ఞలను పాటించటం మరియు సత్యమును ఆచరించుట

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger