ఈనాటి దేవుని కార్యమును గురించి తెలుసుకోవడం

ఈ కాలములలో దేవుని కార్యమును గూర్చి తెలుసుకోవడం అంటే ఎక్కువ భగం అంత్య దినాలలో శరీరధారిగా వచ్చిన దేవుని ముఖ్య పరిచర్యను గూర్చి తెలుసుకోడమును మరియు ఆయన ఈ భూమి మీద ఏమీ చేయడానికి వచ్చాడనే విషయాన్ని తెలుసుకోవడమునైయున్నది. వెడలి పోకముందు ఒక మాదిరి దృష్టాంతమును నెలకొల్పడానికి దేవుడు భూమి మీదకు వచ్చాడని (అంత్యదినములలో) నేను ఇంతకు ముందు నా మాటల్లో చెప్పాను. దేవుడు ఈ మాదిరి దృష్టాంతమును ఎలా నెలకొల్పాడు? అయన వాక్కులను పలకడం ద్వారా మరియు భూమి అంతటా కార్యం చేసి, మాట్లాడటం ద్వారా మాదిరిని స్థిరపరుస్తాడు. ఇదే అంత్య దినాల్లో జరిగే దేవుని కార్యము. భూమిని వాక్కుల ప్రపంచంగా మార్చడానికి అయన మాత్రమే మాట్లాడతాడు, తద్వారా ప్రతి వ్యక్తి అయన మాటలచే జ్ఞానోదయం పొందుకుంటాడు మరియు ప్రతి వ్యక్తికి ఆయన మాటలు అందుబాటులో ఉంటాయి. తద్వారా మనిషి ఆత్మ మేల్కొంటుంది మరియు అతను దర్శనాల గురించిన స్పష్టత పొందుతాడు. అంత్యదినాల్లో, శరీరధారియైన దేవుడు ముఖ్యంగా వాక్కులు పలకడానికి భూమ్మీదకు వచ్చాడు. పరలోక రాజ్య సువార్తను అయన వ్యాప్తి చేసాడు మరియు అయన సిలువ వేయబడి విమోచన కార్యమును నెరవేర్చాడు. అయన ధర్మశాస్త్ర యుగమునకు ముగింపు తీసుకువచ్చాడు మరియు పాతవైన వాటన్నిటిని రద్దు చేసాడు. యేసు రాకతో ధర్మశాస్త్రయుగమునకు ముగింపు పలికి, కృపా యుగానికి నాంది పలికాడు; అంత్యదినములలో శరీరధారియైన దేవుని రాక కృపా యుగానికి ముగింపు పలికింది. అయన తన వాక్కులను పలకడానికి, మానవుని పరిపూర్ణుడుగా చేయడానికి తన వాక్కులను వినియోగించడానికి, మానవునికి జ్ఞానోదయం కలిగించి, వెలిగించడానికి మరియు మానవుని హృదయంలో వున్న అస్పష్ట దేవుడ్ని తీసివేయడానికి వచ్చాడు. యేసు వచ్చినప్పుడు ఈ కార్యపు దశను చేయలేదు. యేసు వచ్చినప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు మరియు దయ్యములను వెళ్లగొట్టాడు మరియు సిలువ విమోచన కార్యమును చేశాడు. దీని పర్యవసానంగా, ప్రజల తలంపులలో, దేవుడు ఈ విధంగా వుండాలని నమ్ముతారు. యేసు వచ్చినప్పుడు, ఆయన మానవుని హృదయం నుండి అస్పష్టమైన దేవుని చిత్రాన్ని తీసివేసే కార్యము చేయలేదు; అయన వచిన్నప్పడు, అయన సిలువ వేయబడెను, అయన రోగులను స్వస్థపరచెను మరియు దయ్యములను వెళ్లగొట్టెను మరియు అయన పరలోక రాజ్య సువార్తను వ్యాప్తి చేసెను. ఒక విషయ౦లో, అంత్యదినాల్లో దేవుని అవతార౦ మానవుని తల౦పుల్లో అస్పష్టమైన దేవుడు కలిగిఉన్న స్థానాన్ని తీసివేస్తుంది తద్వారా మానవుని హృదయ౦లో అస్పష్టమైన దేవుని చిత్రం ఇకపై ఉ౦డదు. అయన నిజమైన మాటలు మరియు నిజమైన కార్యము ద్వారా, భూభాగములంతటా అయన ఉద్యమం మనిషిలో ఆయన చేసే అసామాన్యమైన నిజమైన మరియు సాధారణమైన కార్యము ద్వారా, అయన మానవుడికి దేవుని వాస్తవికతను తెలుసుకునేలా చేస్తాడు, మరియు మనిషి హృదయంలో వున్న అస్పష్టమైన దేవుని స్థానమును తీసివేస్తాడు. ఇంకొక విషయంలో, దేవుడు మనిషిని పరిపూర్ణుడుగా చేయడానికి మరియు అన్ని విషయాలను నెరవేర్చడానికి అయన శరీరములో ఉన్నప్పుడు పలికిన మాటలను వాడుకొనును. ఇదే అంత్యదినాలలో దేవుడు పూర్తి చేసే కార్యం.

మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏమిటి:

1. దేవుని కార్యము ప్రాకృతాతీతమైనది కాదు మరియు మీరు దాని గురించిన భావనలకు తావివ్వకూడదు.

2. ఈసారి దేవుడు శరీరధారిగా వచ్చి చేయబోయే ప్రధానమైన కార్యము గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఆయన రోగులను స్వస్థపర్చడానికి, దయ్యములను పారద్రోలటానికి, అద్భుతాలు చేయడానికి రాలేదు మరియు పశ్చాత్తాప సువార్తను వ్యాప్తి చేయడానికి గాని, మానవునికి విమోచనను ఇవ్వటానికి గాని రాలేదు. అది ఎందుకంటే యేసు ఇప్పటికే ఈ కార్యమును చేసాడు మరియు దేవుడు అదే పనిని మరలా చేయడు. ఈ రోజు, దేవుడు కృపా యుగానికి ముగింపు పలకడానికి వచ్చాడు మరియు కృపా యుగములోని అన్ని ఆచారములు పారద్రోలటానికి వచ్చాడు. ఆచరణాత్మక దేవుడు తాను నిజమైన వాడు అని చూపించడానికి వచ్చాడు. యేసు వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు; ఆయన ప్రధానంగా అద్భుతాలను అగుపరచాడు, సూచక క్రియలను మరియు అద్భుతాలను ప్రదర్శి౦చాడు, రోగులను స్వస్థ పరిచాడు మరియు దయ్యాలను పారద్రోలాడు, లేదంటే ఆయన నిజ౦గా దేవుడు అని మరియు ఆయన నిష్పాక్షికమైన దేవుడు అని ప్రజలను ఒప్పించడానికి ప్రవచనములు పలికెను. తుదకు, అయన సిలువ కార్యమును పూర్తి చేసెను. ఈనాటి దేవుడు సూచక క్రియలను మరియు అద్భుతాలను ప్రదర్శించలేదు లేదా అయన రోగులను స్వస్థపరచుట లేదు మరియు దయ్యములను వెళ్లగొట్టుటలేదు. యేసు వచ్చినప్పుడు, అయన చేసిన కార్యము దేవుని పనిలో ఒక భాగానికి ప్రాతినిధ్యం వహించింది, కానీ ఈసారి దేవుడు తాను తప్పక పూర్తి చేయాల్సిన కార్యపు దశను పూర్తి చేయడానికి వచ్చాడు ఎందుకంటే దేవుడు అదే కార్యమును మరలా చేయడు; అయన ఎల్లప్పుడూ క్రొత్తవాడు మరియు వృద్ధుడు కాని వాడు మరియు ఈ రోజు మీరు చూసేది అంతయు ఆచరణాత్మక దేవుని మాటలను మరియు కార్యమును చూస్తున్నారు.

అంత్యదినములలో శరీరధారి అయిన దేవుడు ప్రధానంగా ఆయన వాక్కులు పలకడానికి, మానవుని జీవితానికి అవసరమైనవన్నీ వివరి౦చడానికి, ఏ మనుష్యుడు ప్రవేశి౦చాలో సూచి౦చడానికి, మానవునికి దేవుని క్రియలను చూపి౦చడానికి మరియు దేవుని జ్ఞానాన్ని, సర్వశక్తిని మరియు అద్భుతమును మనుష్యునికి చూపి౦చడానికి వచ్చాడు. అనేక విధాల ద్వారా దేవుడు మాట్లాడుతాడు, మానవుడు దేవుని సర్వాధికారాన్ని, దేవుని గొప్పతనాన్ని మరియు అంతేకాక, దేవుని తగ్గింపును మరియు దేవుని రహస్యమును పట్టుకుంటాడు. దేవుడు సర్వోన్నతుడని మానవుడు చూస్తాడు, అయితే ఆయన దీనుడును మరియు రహస్యమందున్నవాడని మరియు అందరికంటే తక్కువ వాడని కూడా మానవుడు చూస్తాడు. ఆయన మాటలలో కొన్ని నేరుగా ఆత్మ దృష్టి కోణం నుండి మాట్లాడడం జరిగింది, కొన్ని నేరుగా మనుష్యుని దృష్టికోణం నుండి మరియు కొన్ని మూడవ వ్యక్తి దృష్టి కోణం నుండి మాట్లాడటం జరిగింది. దీనిలో, దేవుని కార్యము తీరు చాలావరకు మారుతూ ఉంటుందని చూడవచ్చు మరియు మాటల ద్వారానే అయన దానిని చూడటానికి మనుష్యునికి అనుమతిస్తాడు. అంత్యదినాల్లో దేవుని కార్యము రెండు విధాలుగా ఉంటుంది, అంటే సాధారణంగానూ మరియు వాస్తవంగానూ ఉంటుంది, మరియు అందువల్ల అంత్యదినాల్లో ప్రజల సమూహం అన్నిటికంటే గొప్ప శోధనలకు లోనుకావాల్సి వుంటుంది. దేవుని సాధారణత మరియు నిజతత్వం కారణంగా, ప్రజలందరూ ఇటువంటి శోధనల మధ్య ప్రవేశించారు; దేవుని సాధారణత మరియు నిజతత్వం కారణంగా దేవుని శోధనలకు మానవుడు దిగిపోయాడు. యేసు యుగములో, ఎలాంటి ఆలోచనలు లేవు లేదా శోధనలు లేవు. ఎందుకంటే యేసు చేసిన కార్యములలో ఎక్కువ భాగం మానవుని ఆలోచనలకు అనుగుణంగా ఉన్నందున, మనుస్యులు ఆయనను అనుసరించారు మరియు అయన పట్ల వారికి ఎటువంటి ఆలోచనలు లేవు. ఈ రోజు సంభవించే శ్రమలు మనుష్యుడు ఎన్నడూ ఎదుర్కొనలేని గొప్ప శ్రమలు మరియు ఈ ప్రజలు మహాశ్రమల నుండి బయటకు రావాలని చెప్పబడిన శ్రమలు ఇవే, ఈ శ్రమలను గురించియే సూచించడం జరిగింది. ఈ రోజు దేవుడు ఈ ప్రజలలో విశ్వాసం, ప్రేమలను పుట్టించుటకు మరియు బాధలను అ౦గీకరి౦చుటకు, ప్రజలలో విధేయతను కలుగచేయుటకు మాట్లాడాడు. అంత్య దినములలో శరీరధారిగా వచ్చిన దేవుడు మాట్లాడిన మాటలు మనుష్యుని స్వభావము మరియు మనుష్యుని గుణలక్షణములనుబట్టి, మనుష్యుని ప్రవర్తననుబట్టి మాట్లాడడం జరిగింది. తద్వారా మనిషి నేడు అనే ఈ రోజులోనికి ప్రవేశించాలి. అయన మాటలు వాస్తవమైనవి మరియు సాధారణమైనవి: అయన రేపటి గురించి మాట్లాడడు లేదా అయన నిన్నటి వైపు వెనుతిరగడు; అయన ప్రవేశించాల్సిన దాని గురించి, ఆచరణలో పెట్టవలసింది మరియు ఈ రోజు అర్ధం చేసుకోవాల్సిన దాని గురించి మాత్రమే మాట్లాడతాడు. ప్రస్తుత కాల౦లో, సూచక క్రియలను మరియు అద్భుతాలను ప్రదర్శి౦చగలిగే, దయ్యాలను పారద్రోలగలిగే, రోగులను స్వస్థపరచగలిగే, అనేక అద్భుతాలు చేయగలిగే వ్యక్తి ఉద్భవి౦చగలిగితే మరియు ఈ వ్యక్తి వచ్చిన యేసును అని పేర్కొ౦టే, అప్పుడు అది యేసును అనుకరి౦చే దుష్ట ఆత్మలచే ఉత్పత్తి చేయబడిన కృత్రిమమైనది అవుతుంది. దీనిని గుర్తుంచుకోండి! దేవుడు అదే కార్యమును మరల చేయడు. యేసు కార్యదశ అనేది ఇప్పటికే పూర్తయింది మరియు దేవుడు ఆ కార్యదశను మరల చేపట్టడు. దేవుని కార్యము మనిషి ఆలోచనలతో పొసగదు; ఉదాహరణకు, పాత నిబ౦ధన మెస్సీయ రావడ౦ గురి౦చి ము౦దే చెప్పింది, ఈ ప్రవచన౦ ఫలిత౦ యేసు రాకడ. ఇది ఇప్పటికే జరిగింది, మరల మెస్సియ రావడం అనేది తప్పు. యేసు ఇప్పటికే ఒకసారి వచ్చాడు మరియు యేసు ఈ సమయంలో రావడం అనేది తప్పు. ప్రతి యుగమునకు ఒక పేరు ఉంటుంది మరియు ప్రతి పేరు ఆ యుగం పాత్ర చిత్రీకరణను కలిగివుంటుంది. మనుష్యుని స్వభావంలో దేవుడు తప్పనిసరిగా సూచకక్రియలను మరియు అద్భుతాలను, ఎల్లప్పుడూ తప్పనిసరిగా రోగులను స్వస్థపరచాలి మరియు దయ్యములను వెళ్ళగొట్టాలి మరియు ఎల్లప్పుడూ తప్పనిసరిగా యేసువలే ఉండాలి. అయినప్పటికీ ఈ సారి, దేవుడు ఆవిధంగా అసలు లేడు. అంత్యదినాల్లో దేవుడు ఇప్పటికీ సూచక క్రియలను మరియు అద్భుతాలను ప్రదర్శిస్తూ, ఇంకా దయ్యాలను పారద్రోలుతూ మరియు రోగులను స్వస్తపరుస్తూ—యేసు చేసిన విధంగా చేస్తే, అప్పుడు దేవుడు అదే కార్యమును పునరావృతం చేసినట్లవుతుంది, అప్పుడు యేసు చేసిన కార్యమునకు ప్రాముఖ్యత లేదా విలువ ఉండదు. ఆ విధంగా, దేవుడు ప్రతి యుగ౦లో ఒక దశ కార్యమును చేపడతాడు. ఆయన కార్యములోని ప్రతి దశ పూర్తయిన తర్వాత, అది త్వరలోనే దురాత్మలచే అనుకరించబడుతుంది మరియు సాతాను దేవుని మడమలపై అనుసరించడం ప్రారంభించిన తరువాత, దేవుడు వేరే విధానము వైపుకు మారుతూ ఉంటాడు. దేవుడు ఒకసారి అయన కార్యము యొక్క దశను పూర్తి చేసినప్పుడు, అది దురాత్మలచే అనుకరించబడుతుంది. మీరు దీని గురించి స్పష్టత కలిగి ఉండాలి. ఈ నాటి దేవుని కార్యము యేసు కార్యమునకు ఎందుకు విభిన్నంగా ఉంటుంది? ఈనాటి దేవుడు ఎందుకు సూచక క్రియలను మరియు అద్భుతములను ప్రదర్శించడు, దయ్యములను వెల్లగొట్టడు మరియు రోగులను స్వస్థపరచడు? యేసు కార్యము ధర్మశాస్త్ర యుగంలోని కార్యమువలే ఉన్నట్లయితే, అయన కృపాయుగపు దేవునికి ప్రాతినిధ్యం వహించగలడా? అయన సిలువ కార్యమును పూర్తిచేయగలడా? ధర్మశాస్త్ర యుగంలోవలే యేసు దేవాలయంలో ప్రవేశించి సబ్బాతును ఉంచినట్లయితే అయన ఎవరిచేతా హింసించబడేవాడు కాదు మరియు అందరిచే స్వీకరించబడేవాడు. అలా అయినట్లయితే, అయన సిలువ వేయబడేవాడా? ఆయన విమోచన కార్యమును పూర్తి చేయగలిగేవాడా? యేసులాగే అంత్యదినములలో శరీరధారిగా వచ్చే దేవుడు సూచక క్రియలను మరియు అద్భుతాలను ప్రదర్శించినట్లయితే ప్రయోజనం ఏమిటి? దేవుడు తన కార్యములోని మరొక భాగాన్ని అంత్యదినాల్లో చేస్తేనే, అది ఆయన నిర్వహణ ప్రణాళికలో ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, మనుష్యుడు దేవుని గురించి లోతైన జ్ఞానాన్ని పొందగలడు, అప్పుడు మాత్రమే దేవుని నిర్వహణ ప్రణాళికను పూర్తి చేయగలడు.

అంత్య దినములలో, దేవుడు ప్రాముఖ్యంగా తన వాక్కులను మాట్లాడుటకు వచ్చాడు. అయన ఆత్మ దృష్ఠ్టికోణం నుండి, మనుష్యుని దృష్టి కోణం నుండి మరియు మూడవ వ్యక్తి దృష్టి కోణం నుండి మాట్లాడతాడు; అయన విభిన్న మార్గాల్లో మాట్లాడతాడు, కొంత కాలం కొరకు ఒక మార్గాన్ని ఉపయోగిస్తాడు మరియు మానవుని భావనలను మార్చడానికి మరియు మనుష్యుని హృదయంలో వున్న అస్పష్ట దేవుని చిత్రాన్ని తొలగించడానికి అయన మాట్లాడే పధ్ధతిని ఉపయోగిస్తాడు. ఇది దేవుడు చేసిన ప్రధానమైన కార్యము. ఎందుకంటే దేవుడు రోగులను స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్లగొట్టడానికి, అద్భుతాలను ప్రదర్శించడానికి మరియు మనుష్యునికి భౌతిక ఆశీర్వాదాలు ప్రసాదించడానికి వచ్చాడని మనుష్యుడు విశ్వసిస్తాడు, మానవుని హృదయం నుండి అలాంటి విషయాలను తొలగించడానికి దేవుడు దండన మరియు తీర్పు కార్యము అనే ఈ కార్యదశను చేపడతాడు, తద్వారా యేసు దేవుని వాస్తవికత మరియు సాధారణత గురించి మనుష్యుడు తెలుసుకోవచ్చు మరియు దాని ద్వారా యేసు చిత్రం అతని హృదయ౦ ను౦డి తొలగి౦చబడి, దాని స్థాన౦లో దేవుని క్రొత్త చిత్రముతో భర్తీ చేయటం. మనుష్యుని హృదయంలో వున్న దేవుని చిత్రం పాతదయిన వెంటనే అది ఒక విగ్రహంగా మారుతుంది. యేసు ఆ కార్య దశను చేపట్టడానికి వచ్చినప్పుడు, అయన దేవుని సర్వ సంపూర్ణతకు ప్రాతినిధ్యం వహించలేదు. అయన కొన్ని సూచక క్రియలు మరియు అద్భుతాలను ప్రదర్శించాడు, కొన్ని మాటలను మాట్లాడాడు మరియు చివరికి సిలువ వేయబడ్డాడు. అయన దేవుని ఒక భాగానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. ఆయన దేవుని విషయ౦లో మొత్తానికి ప్రాతినిధ్యం వహించలేదు, కానీ దేవుని కార్యములో ఒక భాగాన్ని చేయడ౦లో దేవునికి ప్రాతినిధ్య౦ వహి౦చాడు. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు మరియు చాలా అద్భుతకరుడు మరియు అయన గంభీరమైనవాడు మరియు ఎందుకంటే దేవుడు ప్రతి యుగంలో తన కార్యములో ఒక భాగాన్ని మాత్రమే చేస్తాడు. ఈ యుగంలో దేవుని ద్వారా జరిగించబడిన పని ఏమనగా ప్రధానంగా మనుష్యుని జీవితానికి వాక్కులను సిద్ధం చేయడం; మనుష్యుని స్వభావము మరియు గుణలక్షణములను, అతని అవినీతి స్వభావమును బహిర్గతము చేయుటకై మరియు మత భావనలు, భూస్వామ్య సంబంధమైన ఆలోచన, పాతపడిపోయిన ఆలోచన మరియు మనుష్యుని జ్ఞానం మరియు సంస్కృతిని తొలగించడమైయున్నది. ఇవి దేవుని వాక్కులను బహిర్గతం చేయబడటం ద్వారా శుద్ధి చేయబడాలి. అంత్యదినాల్లో, దేవుడు మనుష్యుని పరిపూర్ణుడుగా చేయడానికి సూచక క్రియలను మరియు అద్భుతాలను చేయడు కానీ మాటలను ఉపయోగిస్తాడు. మనుష్యుని నిజ తత్వమును వెల్లడి చేయడానికి, మనుష్యునికి తీర్పు తీర్చడానికి, మనుష్యుని శిక్షించడానికి మరియు మనుష్యుని పరిపూర్ణుడిని చేయడానికి అయన తన మాటలను ఉపయోగిస్తాడు, తద్వారా దేవుని మాటల్లో చెప్పాలంటే, మనుష్యుడు దేవుని జ్ఞానాన్ని మరియు ప్రేమను చూడటానికి వచ్చి, దేవుని స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు మరియు తద్వారా దేవుని మాటల ద్వారా మనుష్యుడు దేవుని క్రియలను చూస్తాడు. ధర్మశాస్త్ర యుగంలో యెహోవా తన మాటల ద్వారా మోషేను ఐగుప్తు నుండి బయటకు నడిపించాడు మరియు ఇశ్రాయేలీయులతో కొన్ని మాటలు మాట్లాడాడు; ఆ సమయంలో దేవుని క్రియల్లో కొ౦త భాగ౦ స్పష్టం చేయబడ్డాయి, కానీ మనుష్యుని సామర్థ్య౦ పరిమిత౦గా ఉ౦డేది, ఆయన జ్ఞానాన్ని ఏదీ పూర్తి చేయదు కాబట్టి, దేవుడు మాట్లాడడ౦ మరియు పనిచేయడాన్ని కొనసాగి౦చాడు. కృపాయుగ కాలంలో, మనుష్యుడు దేవుని క్రియల భాగాన్ని మరొకసారి చూసాడు. యేసు సూచక క్రియలను మరియు అద్భుతాలను చూపించగలిగాడు, రోగులను స్వస్థపరచాడు మరియు దయ్యములను వెళ్లగొట్టగలిగాడు మరియు సిలువ వేయబడ్డాడు, మూడు రోజుల తర్వాత పునరుత్థానుడై శరీరధారిగా మనుష్యుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దేవుని గురి౦చి, మనుష్యునికి ఇ౦తకన్నా ఎక్కువ తెలియదు. మనుష్యునికి దేవుడు తనకు చూపినంతవరకు తెలుసు మరియు దేవుడు మనిషికి మరేమీ చూపించకపోతే, అప్పుడు దేవుని విషయమై మనుష్యుల సరిహద్దుల పరిధి అంతవరకే ఉంటుంది. ఆ విధ౦గా, దేవుడు పని చేస్తూనే ఉన్నాడు, అ౦దుకే మనుష్యునికి ఆయన గురి౦చిన జ్ఞాన౦ మరి౦త లోతుగా ఉ౦టు౦ది మరియు తద్వారా మనుష్యుడు క్రమ౦గా దేవుని గుణలక్షణాలను తెలుసుకోవచ్చు. అంత్యదినాలలో, మనుష్యుని పరిపూర్ణుడుగా చేయడానికి దేవుడు తన మాటలను వాడుకుంటాడు. మీ అవినీతి స్వభావం దేవుని మాటలచే బహిర్గతం చేయబడుతుంది మరియు నీ మతపరమైన ఆలోచనలు దేవుని నిజతత్వముతో మార్పు చేయబడతాయి. అంత్యదినాలలో శరీరధారిగా వచ్చిన దేవుడు “వాక్యము శరీరధారిగా మారును, వాక్యము శరీరములోనికి వచ్చును మరియు వాక్యము శరీరములో ప్రత్యక్షమగును” అనే మాటలను నెరవేర్చడానికి వచ్చాడు మరియు దీని గురి౦చి మీకు సంపూర్ణమైన జ్ఞాన౦ లేకపోతే, అప్పుడు మీరు స్థిరంగా నిలబడలేరు. అంత్య దినములలో, దేవుడు ప్రాథమిక౦గా శరీర౦లో వాక్య౦ కనిపి౦చే విధంగా ఒక కార్యదశను నెరవేర్చాలని ఉద్దేశించాడు మరియు అది దేవుని నిర్వహణ ప్రణాళికలో ఒక భాగ౦. ఆ విధంగా, మీ జ్ఞానం స్పష్టంగా ఉండాలి; దేవుని కార్యములు ఎలా ఉంటాయి అనే దానితో సంబంధం లేకుండా, దేవునికి హద్దులు నిర్ణయించడానికి మనుష్యుని దేవుడు అనుమతించడు. అంత్యదినాల్లో దేవుడు ఈ కార్యమును చేయనట్లయితే, అయన పట్ల మానవుని జ్ఞానం ఇంకా ముందుకు వెళ్ళలేదు. దేవుడు సిలువకు వ్రేలాడదీయబడతాడని, సొదొమను నాశన౦ చేయగలడని మరియు యేసు మరణం ను౦డి లేచి పేతురుకు కనిపి౦చగలడని మాత్రమే మీకు తెలుసు…. కానీ దేవుని మాటలు అన్నిటిని సాధి౦చగలవని మరియు మనిషిని జయి౦చగలవని మీరు ఎన్నడూ చెప్పరు. దేవుని మాటలను అనుభవి౦చడ౦ ద్వారా మాత్రమే మీరు అటువంటి జ్ఞాన౦ గురి౦చి మాట్లాడగలరు మరియు మీరు దేవుని కార్యమును అనుభవి౦చినకొద్దీ, ఆయన గురి౦చిన మీ జ్ఞాన౦ సంపూర్ణంగా అవుతుంది. అప్పుడు మాత్రమే మీ స్వంత భావనల్లో దేవునికి హద్దులేర్పరచడం మానేస్తారు. మానవుడు అయన కార్యమును అనుభవించడం ద్వారా దేవుని తెలుసుకుంటాడు; దేవుని గురి౦చి తెలుసుకోవడానికి వేరే సరైన మార్గ౦ లేదు. ఈ రోజు, చాలా మంది ప్రజలు ఏమి చేయరు, కానీ సూచకక్రియలను మరియు అద్భుతాలను చూడటానికి మరియు గొప్ప విపత్తుల సమయం కొరకు ఎదురు చూస్తుంటారు. మీరు దేవుని విశ్వసిస్తారా లేదా మీరు గొప్ప విపత్తుల యందు విశ్వాసముంచుతారా? మహా విపత్తులు వచ్చినప్పుడు అది చాలా ఆలస్యమైపోతుంది, దేవుడు మహా విపత్తులను పంపకపోతే, అప్పుడు అయన దేవుడు కాదా? మీరు సూచక క్రియలను మరియు అద్భుతాలను నమ్ముతారా లేదా మీరు దేవుణ్ణి నమ్ముతారా? యేసు ఇతరులచే గేలి చేయబడినప్పుడు సూచక క్రియలను మరియు అద్భుతాలను ప్రదర్శించలేదు, అయితే అయన దేవుడు కాదా? మీరు సూచక క్రియలను మరియు అద్భుతాలను నమ్ముతారా లేదా దేవుని గుణగణాలను నమ్ముతారా? దేవునిపై నమ్మక౦ గురి౦చి మనుష్యుని అభిప్రాయాలు తప్పు! యెహోవా ధర్మశాస్త్ర యుగ౦లో అనేకమైన వాక్కులను పలికాడు, కానీ నేటికీ వాటిలో కొన్ని ఇంకను నెరవేరవలసి వున్నాయి. యెహోవా దేవుడు కాదని మీరు చెప్పగలరా?

ఈరోజు, మీకందరికీ స్పష్టం కావాల్సిన విషయం ఏమిటంటే, అంత్యదినాల్లో, “వాక్యం శరీరంగా మారుతుంది” అనేది సూత్రప్రాయంగా సత్యం, అది దేవునిచే నెరవేర్చబడుతుంది. భూమి మీద అయన అసలు కార్యము ద్వారా, మనుష్యుడు తనను తెలుసుకోవడానికి మరియు తనతో నిమగ్నం కావడానికి మరియు అయన వాస్తవ క్రియలను చూడడానికి కారణమవుతాడు. ఆయన సూచకక్రియలను మరియు అద్భుతాలను చేయగలడని మరియు కొన్ని సమయాలలో వాటిని చేయలేదని మనుష్యుడు స్పష్టంగా చూడటానికి కారణమవుతాడు; ఇది యుగముపై ఆధారపడివుంటుంది. దీని నుండి, మీరు దేవుడు సూచక క్రియలను మరియు అద్భుతాలను ప్రదర్శించడానికి అసమర్థుడు కాదని చూడవచ్చు, కానీ దానికి బదులుగా చేయవలసిన కార్యమును బట్టి మరియు యుగమును బట్టి ఆయన కార్య విధానాన్ని మారుస్తాడు. ప్రస్తుత కార్య దశలో, ఆయన సూచక క్రియలు మరియు అద్భుతాలను చూపించాడు; ఆయన యేసు యుగములో కొన్ని సూచక క్రియలు మరియు అద్భుతాలను చూపించాడు ఎందుకంటే ఆ యుగంలో ఆయన కార్యము భిన్నమైనది. దేవుడు ఆ కార్యమును ఈ రోజు చెయ్యడు, మరియు కొంతమంది ప్రజలు సూచక క్రియలు మరియు అద్భుతాలను చేయడానికి ఆయన అసమర్ధుడు అని నమ్ముతారు లేదా సూచక క్రియలు మరియు అద్భుతాలను చేయకపోతే, అప్పుడు ఆయన దేవుడు కాదని అనుకుంటారు. అది వంచన కాదా? దేవుడు సూచకక్రియలను మరియు అద్భుతాలను ప్రదర్శించగలుగుతాడు, కానీ ఆయన వేరొక యుగములో కార్యము చేస్తున్నాడు, కాబట్టి ఆయన అలాంటి కార్యము చేయడు. ఎ౦దుక౦టే ఇది వేరే యుగము కాబట్టి, మరియు దేవుని కార్యములోని వేరే దశ కాబట్టి, దేవుడు స్పష్ట౦గా చేసిన క్రియలు కూడా భిన్న౦గా ఉ౦టాయి. దేవునిపై మనుష్యుడు ఉంచిన నమ్మకం అంటే సూచకక్రియలు మరియు అద్భుతాల మీద ఉంచిన నమ్మకం కాదు, లేదా ఆశ్చర్య కార్యములపై ఉంచిన నమ్మకం కాదు, కానీ నూతన యుగములో ఆయన వాస్తవకార్యముపై ఉంచిన నమ్మకమైయున్నది. దేవుడు ఏ పద్ధతిలో కార్యము చేస్తాడో ఆ పద్ధతి ద్వారా మానవుడు దేవుణ్ణి తెలుసుకుంటాడు మరియు ఈ జ్ఞానం మనుష్యునిలో దేవునిపై నమ్మకాన్ని పుట్టిస్తుంది. అంటే, దేవుని కార్యము మరియు క్రియల మీద నమ్మకం ఏర్పడుతుంది. ఈ కార్యదశలో, దేవుడు ప్రధానంగా మాట్లాడతాడు. సూచక క్రియలు మరియు అద్భుతాలను చూడటానికి వేచి ఉండవద్దు; మీరు ఏదీ చూడరు! ఇది ఎందుకంటే మీరు కృపా యుగములో పుట్టలేదు. మీరు ఉండి ఉంటే, మీరు సూచక క్రియలు మరియు అద్భుతాలను చూసి ఉండేవారు, కానీ మీరు చివరి రోజుల్లో పుట్టారు కనుక మీరు దేవుని వాస్తవికతను మరియు సాధారణతను మాత్రమే చూడగలరు. అంత్యదినాల్లో ప్రాకృతాతీతమైన యేసును చూడాలని ఆశించవద్దు. మీరు సాధారణ మనుష్యునికి బిన్నం కానటువంటి శరీరధారిగా వచ్చిన ఆచరణాత్మకమైన దేవుణ్ణి మాత్రమే చూడగలరు. ప్రతి యుగంలోదేవుడు వివిధ క్రియలను చేస్తూ వస్తుంటాడు. ప్రతియుగ౦లోనూ ఆయన దేవుని క్రియల భాగాన్ని చేస్తూ వస్తాడు మరియు ప్రతి యుగపు పని దేవుని స్వభావ౦లో ఒక భాగాన్ని మరియు దేవుని క్రియల్లో ఒక భాగాన్ని సూచిస్తు౦ది. ఆయన చేసే కార్యములు ఆయన కార్యం చేసే యుగమును బట్టి మారతాయి, కానీ అవన్నీ మనుష్యునికి లోతైన దేవుని జ్ఞానాన్ని, సత్యమైన మరియు ఇంకా నిరాడంబరమైన దేవునిపై నమ్మకాన్ని ఇస్తాయి. దేవుడు చేసిన క్రియలన్నిటినిబట్టి మనిషి దేవునిలో విశ్వాసముంచుతాడు, దేవుడు అద్భుతమైనవాడు, చాలా గొప్ప వాడు, ఎందుకంటే అయన సర్వశక్తిమంతుడు మరియు గంభీరమైనవాడు. ఆయన సూచక క్రియలు మరియు అద్భుతాలను చేయగలడు మరియు రోగులను స్వస్థపరచగలడు మరియు దయ్యములను పారద్రోలగలడని మీరు దేవుణ్ణి నమ్మినట్లయితే అప్ప్డుడు మీ అభిప్రాయం తప్పు మరియు “దుష్ట శక్తులు కూడా అలాంటి పనులు చేయలేవా?” అని కొంతమంది మీతో చెబుతారు. ఇది సాతాను స్వరూపంతో దేవుని స్వరూపాన్ని గందరగోళానికి గురిచేయదా? ఈ రోజు దేవుడు చేసే అనేకమైన క్రియలనుబట్టి మరియు గొప్ప మొత్తంలో అయన చేసే కార్యమునుబట్టి మరియు అనేక రీతులుగా ఆయన మాట్లాడే మాటల వలన మనుష్యుడు దేవుణ్ణి నమ్ముతాడు. దేవుడు మనుష్యుని జయించడానికి మరియు మనుష్యుని పరిపూర్ణుడుగా చేయడానికి తన పలికిన మాటలను వాడుకుంటాడు. ఆయన చేసిన సూచక క్రియలు మరియు అద్భుతాలను చేయగలడు కాబట్టి కాదు కానీ దేవుడు చేసే అనేక కార్యములవలన మనుష్యుడు దేవుణ్ణి నమ్ముతాడు; ప్రజలు దేవుని క్రియలను సాక్ష్యమివ్వడం ద్వారా మాత్రమే దేవుని గురి౦చి తెలుసుకోబడతారు. దేవుని వాస్తవమైన క్రియలు, ఆయన ఏ విధంగా కార్యం చేస్తాడు, ఎటువంటి జ్ఞానయుక్తమైన పద్ధతులను ఉపయోగిస్తాడు, ఏవిధంగా మాట్లాడతాడు, మరియు ఆయన మనుష్యుని ఏవిధంగా పరిపూర్ణుడుగా చేస్తాడు అనే విషయాల గురించి తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీరు దేవుని వాస్తవికతను అర్థం చేసుకోవటం మరియు ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవటం, ఆయన ఏమి ఇష్టపడతాడు, ఆయన ఏమి అసహ్యించుకుంటాడు మరియు ఆయన మనిషిపై ఎలా పనిచేస్తాడు అని అర్ధం చేసుకోగలరా? దేవుని ఇష్టాలను మరియు అయిష్టాలను అర్థం చేసుకోవడం ద్వారా, సానుకూలమైన మరియు ప్రతికూలమైన దాని మధ్య తారతమ్యాన్ని మీరు వేరు చేయవచ్చు, మరియు మీ దేవుని జ్ఞానం ద్వారా మీ జీవితంలో పురోగతి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, మీరు దేవుని కార్యము గురించిన జ్ఞానాన్ని పొందాలి మరియు మీరు దేవుణ్ణి విశ్వసించడం గురించి మీ అభిప్రాయాలను సూటిగా ఉంచుకోవాలి.

మునుపటి:  సత్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే వాస్తవాన్ని కలిగి ఉండగలరు

తరువాత:  దేవుని యొక్క కార్యము మనిషి ఊహించినంత తేలికైనదా?

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger