సత్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే వాస్తవాన్ని కలిగి ఉండగలరు

దేవుని వాక్యములను పట్టుకుని వాటిని నిస్సంకోచముగా వివరించు సాధ్యత కలిగి యున్నారంటే, మీరు యధార్ధతను కలిగియున్నారని అర్థం కాదు; పరిస్థితులు నీవు ఉహించినంత సులువైనవి కావు. నీవు యధార్ధత కలిగియున్నావా లేదా అనునది నీ మాటలపై ఆధారపడి లేదు; బదులుగా, అది నీ జీవన విధానముపై ఆధారపడియున్నది. దేవుని వాక్కులు నీ జీవముగా మారినప్పుడు మరియు నీ వాస్తవికతను నీ సహజ వ్యక్తీకరణ తెలియజేయగలిగినప్పుడు మాత్రమే నీకు అది నిజముగా అర్థమవుతుంది మరియు నీవు వాస్తవిక స్థాయిని పొందుకుంటావు. నీవు చాలాకాలం పాటు పరీక్షను ఎదుర్కొని నిలబడగలగాలి, మరియు దేవునికి అవసరమైన సారూప్యతతో నీవు జీవించగలగాలి. ఇది కేవలము ఒక ప్రదర్శనగా ఉండకూడదు; ఇది నీ నుండి సహజముగా వ్యక్తీకరించబడాలి. అప్పుడు మాత్రమే నీవు యధార్ధతను నిజముగా కలిగి ఉండగలవు, మరియు అప్పుడు మాత్రమే నీవు జీవము పొందగలవు. సేవకులకు ఎదురైన శోధన గురించి ప్రతిఒక్కరికి సుపరిచితమైన ఒక ఉదాహరణను నన్ను ఇక్కడ చెప్పనివ్వండి: సేవచేసే వారి గురించి గంభీరమైన సిద్ధాంతాలను ఎవరైనా వ్యక్తీకరించగలరు, మరియు ఆ అంశము గురించి ప్రతిఒక్కరు మంచి విషయపరిజ్ఞానము కలిగి ఉంటారు; ఆ విషయమై వారి ప్రతి ప్రసంగము మునుపటి దానిని మించినదిగా ఉంటుంది, ఎందుకంటే, వారి ప్రతి ప్రసంగము అదొక పోటీ అన్నట్టుగా ఉంటుంది. అయితే, మనిషి ఒక గొప్ప శోధనకు గురి కానంతవరకు, సహనమునకు అతనొక మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడని చెప్పడం చాలా కష్టం. క్లుప్తంగా చెప్పాలంటే, మనుష్యుని జీవితము ఇంకా చాలా కొదువగానే ఉన్నది, అతని అవగాహనకు విరుద్ధముగానే ఉన్నది. కాబట్టి, అది ఇంకా మానవుని నిశ్చయ స్థితిగా మారవలసి యున్నది, మరియు అది ఇంకా మానవ జీవముగా మారలేదు. ఎందుకంటే, మానవుని ఆలోచనలు ఇంకా వాస్తవికతలోనికి తీసుకొనిరాబడలేదు కనుక, అతని స్థితి ఇప్పటికీ ఇసుక మీద కట్టబడిన కోటలాగే ఉంటూ, అటూఇటూ ఊగిపోతూ ఎప్పుడైనా కూలిపోయేలా ఉన్నది. మానవుడు కలిగి ఉన్న యధార్ధత చాలా చాలా తక్కువ; మానవునిలో యధార్ధత కనుగొనుట దాదాపుగా అసాధ్యము. మానవుని నుండి సహజముగా వెలువడే యధార్ధత చాలా తక్కువ, అలాగే వారు జీవించే యధార్ధత కూడా బలవంతముగా వ్యక్తము చేయబడుతున్నదే. మనిషిలో ఎటువంటి యధార్ధత లేదు అని నేను చెప్పడానికి తార్కాణము ఇదే. దేవుని యందు తమకున్న ప్రేమ ఎన్నటికీ మారదని మనుష్యులు చెప్పుకున్నప్పటికీ, ఏవైనా శ్రమలు ఎదుర్కునే ముందు వరకు మాత్రమే వారు ఇలా చెబుతారు. అకస్మాత్తుగా ఒకరోజు వారు శ్రమలు ఎదుర్కొన్నపుడు, వారు అప్పటివరకు మాట్లాడినవన్నీ మరోసారి వాస్తవికతకు చాలా దూరంగా ఉంటాయి, మరియు మనిషికి యధార్ధత లేదని అది మరోసారి నిరుపిస్తుంది. నీ తలంపులకు విరుద్ధమైన, మరియు నిన్ను నీవు ప్రక్కన పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు నీవు ఎదుర్కొన్నప్పుడు, వాటినే నీ శ్రమలుగా పేర్కొనవచ్చు. దేవుని చిత్తము బయలుపడక మునుపు, ప్రతిఒక్కరు కఠినమైన పరీక్షలు మరియు ఘోరమైన శ్రమలు ఎదుర్కోవలసిందే. నీవు దీనిని గ్రహించగలవా? దేవుడు మనుష్యులను శోధించాలనుకున్నపుడు, వాస్తవ సత్యము బయలుపరచబడకముందే మనుష్యులు వారి ఎంపికలు ఎంచుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ అనుమతిస్తాడు. దీని అర్ధము, దేవుడు మనిషిని శ్రమలకు గురిచేయాలనుకున్నప్పుడు, ఆయన నీకు సత్యాన్ని చెప్పడు; మనుష్యులు నిజముగా బహిర్గతమయ్యేలా చేయడంలో ఇది ఒక తీరు. నీవు వర్తమాన దేవుని ఎరిగియున్నావా అలాగే నీవు యధార్ధత కలిగియున్నవా అని తెలుసుకొనుటకు, తన పనిని కొనసాగించుటకు దేవుడు ఉపయోగించు ఒక మార్గము ఇది. నీవు నిజముగానే దేవుని పనిని గురించి నిస్సందేహముగా ఉన్నావా? నీపైకి గొప్ప శ్రమ వచ్చినపుడు, నిజముగానే నీవు ధృఢముగా నిలువగలవా? “ఇకపై ఏ సమస్యలు రావని హామీ ఇస్తున్నాను” అని చెప్పే ధైర్యం ఎవరికుంది? “ఇతరులకు అనుమానాలు ఉండవచ్చేమో కానీ నేను ఎప్పటికీ అనుమానించను” అని ఎవరు ధైర్యం చేసి చెప్పగలరు? పేతురు శ్రమలకు గురైనపుడు కూడా ఇలాగే జరిగింది; అతను కూడా ఎల్లపుడూ సత్యము బయలుపరచబడకముందే గొప్పలు చెప్పేవాడు. ఇది పేతురు ఒక్కడికే ఉన్న వ్యక్తిగత లోపమేమీ కాదు; నేడు ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. నేను గనుక కొన్ని ప్రదేశాలు సందర్శించవలసివచ్చి లేక కొందరు సోదర సోదరీలను దర్శించి దేవుని పని పట్ల మీ అవగాహన ఏమిటో చూడవలసివస్తే, మీ పరిజ్ఞానమును మీరు గొప్పగా వ్యక్తీకరించగలరు. అలాగే, మీకు అస్సలు ఎటువంటు సందేహాలు లేవు అన్నట్టుగా మీరు కనిపించవచ్చు. “నేటి పనిని దేవుడే జరిగిస్తున్నాడని నీవు నిజముగా ధృవపరచగలవా?” అని నిన్ను నేను అడుగవలసి వస్తే, “నిస్సందేహముగా అదేదైనా, ఈ పని దేవుని ఆత్మ ద్వారా జరిగింపబడుతుంది” అని నీవు ఖచ్చితముగా జవాబిస్తావు. ఆవిధమైన జవాబు నీవిచ్చినప్పుడు, ఖచ్చితముగా కొద్దిపాటి అనుమానము కూడా నీకుండదు, అంతేగాక కాస్త యధార్ధతను పొందాను అనే భావనతో నీవు సంతోషముగా కూడా కనిపిస్తావు. విషయాలను ఈ విధముగా అర్ధం చేసుకునే వారు తక్కువ యధార్ధతను కలిగి యుంటారు; దానిని నేను అధికముగా పొందానని భావించినవారు, శ్రమలు ఎదుర్కొన్నపుడు అత్యంత తక్కువ ధృఢముగా మాత్రమే నిలవగలరు. గర్విష్టులు మరియు అహంకారులకు శ్రమ తప్పదు, తమను గుర్చిన జ్ఞానము లేనివారికి శ్రమ తప్పదు; అలాంటి వారు మాటలాడుటలో నేర్పరులైనప్పటికీ, ఆ మాటలను ఆచరించు విషయములో వారు దారుణముగా వ్యవహరిస్తారు. శోధన యొక్క చిన్న సూచన కలుగగానే, ఈ వ్యక్తులకు అనుమానాలు మొదలవుతాయి, మరియు దానిని అక్కడికక్కడే విడనాడాలనే తలంపు కుడా వారి మనస్సులలోనికి జొరబడుతుంది. వారు ఎటువంటి యధార్ధతను కలిగి ఉండరు; నేడు దేవుడు కోరుచున్న యధార్ధత ఏది వారు కలిగి యుండరు, కేవలము మతానికి అవతలి సిద్దాంతాలు మాత్రమే కలిగియుంటారు. యధార్ధత కలిగి యుండకుండా కేవలం సిద్ధాంతాల గురించి మాట్లాడేవారంటే నాకు చాలా అసహ్యము. వారు తమ పనిని చేసేటప్పుడు కేకలు వేస్తారు, కానీ, యధార్ధతను ఎదుర్కొన్న వెంటనే వారు పడిపోతారు. ఈ వ్యక్తులు యధార్ధత లేని వారని ఇది మీకు చుపట్లేదా? గాలి మరియు కెరటాలు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, నీ మనస్సులోకి చిన్న సందేహమైనా రానియ్యక, ఏ ఒక్కరి అండ లేనప్పటికీ, స్థిరముగా నిలబడి మరియు నిరాకరణకు దూరంగా నిలువగలిగినప్పుడు, నీవు నిజమైన జ్ఞానమును మరియు యధార్ధతను కలిగియున్నావని లెక్కింపబడుతుంది. నీవు గాలి వీచిన వైపుకు తిరుగుతూ—ఆధిక్యతను అనుసరిస్తూ, ఇతరుల ప్రసంగాలను అనుకరించడము నేర్చుకుని—నీవు ఎంత అనర్గళంగా ఉన్నప్పటికీ, నీవు యధార్ధత కలిగియున్నావని అది రుజువు చేయదు. కాబట్టి, డోల్ల మాటలతో కేకలు పెట్టడంతో అపరిపక్వముగా ఉండవద్దని నేను మీకు సూచిస్తున్నాను. దేవుడు ఏమి చేయబోతున్నాడో నీకు తెలుసా? నీవు మరొక పేతురు వలె ప్రవర్తించవద్దు, తద్వారా నీ పైకి నీవే అవమానాన్ని కొనితెచ్చుకుని, తల ఎత్తుకునే స్థాయిని నీవు కోల్పోతావు; అది ఎవరికీ మంచిదికాదు. చాలామందికి అస్సలు నిజమైన స్థాయి ఉండదు. దేవుడు ఉన్నతమైన పని చేసినప్పటికీ, నరుల యందు ఆయన యధార్ధతను తీసుకురాలేకపోతున్నాడు; మరింత స్పష్టంగా చెప్పాలంటే, దేవుడు ఎవరినీ వ్యక్తిగతముగా దండించలేదు. కొందరు అటువంటి శ్రమలను బట్టి బహిర్గతమగుట చేత, వారి పాప హస్తములు మిక్కిలి దూరముగా చాపుచూ, దేవుని యెద్ద నుండి మేలును పొందుకోవడం సులభమని, తద్వారా వారు ఏమికావాలన్నా చేయవచ్చునని అనుకుంటారు. వారు ఇటువంటి చిన్న శ్రమను కుడా తట్టుకోలేనందునే, యధార్ధతను పొందుకోవడానికి ఉన్న మరిన్ని సవాలుపూరితమైన శ్రమలు వారికి అసాధ్యములవుతాయి. వారు కేవలం దేవుని మోసపుచ్చడానికి యత్నించుట లేదా? యధార్ధత అనేది నకిలీ చేయగలిగినది కాదు, యధార్ధత అనేది దాని గురించి తెలుసుకోవడం ద్వారా పొందేది కాదు. అది నీ వాస్తవ స్థాయి మీద, అలాగే అన్ని శ్రమలను నీవు తట్టుకోగలవా లేదా అనేదానిపై ఆధారపడియున్నది. నీకు అర్థమవుతోందా?

దేవునికి కావలిసింది ప్రజలు కేవలం యధార్ధత గురించి మాట్లాడడం కాదు; నిజానికి, అది చాలా సులభమే కదా? అలాగైతే, మరి జీవములోకి ప్రవేశం గురించి దేవుడు ఎందుకు చెప్పుచున్నాడు? పరివర్తన గురించి ఆయన ఎందుకు మాట్లాడుచున్నాడు? మనుష్యులు యధార్ధత గురించి కేవలం డొల్ల మాటలతోనే సరిపుచ్చుతుంటే, తమ ప్రవర్తనలో వారు పరివర్తన సాధించగలరా? ఒక రాజ్యంలోని మంచి సైనికులు యధార్ధతత గురించి మాట్లాడే లేక ప్రగల్భాలు పలికే సమూహంగా మాత్రమే శిక్షణ పొందరు; బదులుగా, ఎటువంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ తలొగ్గక కేవలము దేవుని మాటలు అనుసరించి జీవించడానికి, దేవుని మాటలయందు స్థిరమైన జీవితం కలిగి, తిరిగి లోకము వైపు రాకుండా ఉండుటకు వారు శిక్షణ పొందుతారు. ఇదే దేవుడు చెప్పే వాస్తవము; ఇదే మానవుని నుండి దేవునికి కావలసినది. కాబట్టి దేవుడు చెప్పిన వాస్తవాన్ని అంత సులభమైనదిగా అనుకోవద్దు. పరిశుద్ధాత్ముని నుండి వచ్చు జ్ఞానము సైతము యధార్ధతను కలిగియుండుటతో సమానము కానేరదు. అంతటి స్థాయి మానవునికి లేదు—అది దేవుని కృప మాత్రమే, ఈ విషయంలో మనిషి చేసేది ఏమిలేదు. పేతురుకి కలిగినట్టి భాధలను, అంతకంటే ఎక్కువ కూడా ప్రతి ఒక్కరు భరించి, పేతురు పాయిండిన మహిమను పొందాలి, దేవుని పనిని పొందిన పిమ్మట వారు కలిగియుండె జీవమునకు అది సంకేతము. దీనిని మాత్రమే యధార్ధత అని చెప్పవచ్చు. కేవలము యధార్ధత గురించి మాట్లాడితే దానిని పొందుకోవచ్చు అని అనుకోకండి; అది ఒక అపోహ. అలాంటి ఆలోచనలు దేవుని చిత్తానుసారమైనవి కావు, వాటిలో ఎలాంటి నిజము లేదు. అలాంటి మాటలు ఇకపై చెప్పకండి—అలాంటి ప్రసంగాలు కట్టిపెట్టండి! అటువంటి దురాలోచన గలవారందరూ అవిశ్వాసులే. వారికి నిజమైన జ్ఞానము లేదు, వారి వాస్తవ స్థాయి చాలా తక్కువ; వారు యధార్ధత తెలియని అజ్ఞానులు. మరొక మాటలో చెప్పాలంటే, దేవుని వాక్య భావమునకు వెలుపల జీవించువారందరూ అవిశ్వాసులే. జనులచే అవిశ్వాసులుగా పరిగణించబడేవారు దేవుని దృష్టిలో పశుప్రాయులు, అలాగే దేవునిచే అవిశ్వాసులుగా పరిగణింపబడేవారు దేవుని వాక్యమే తమ జీవితముగా లేని వారు. కావున దేవుని మాటలే యధార్ధ్తతగా లేనివారు, ఆ ఆయన వాక్యానుసారము జీవించని వారందరూ అవిశ్వాసులే. ప్రతి ఒక్కరు కేవలము యధార్ధత గురించి మాట్లాడేవారు కాక—ప్రతి ఒక్కరు దేవుని మాటల యధార్ధ్తతను కలిగి జీవించేలా, అంతేగాక తన వాక్య యధార్ధత యందు జీవించేలా చేయాలన్నదే ఆయన ఉద్దేశ్యము. మనుష్యులు అవలంభించే యధార్ధత బూటకమైనది; అది విలువలేనిది మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. అది అత్యంత తక్కువైనది మరియు ప్రస్తావన అర్హమైనది కూడా కాదు. దేవునికి కావలసిన ప్రమాణములకు అనర్హమైనంత అల్పముగా ఉన్నది. మీలో ఎవరు ఎటువంటి మార్గనిర్దేశకము లేకుండానే మీ అవగాహన మేరకు మాట్లాడగలరో, అలాగే మీలో ఎవరు పనికిమాలిన చెత్త ముక్కలుగా ఉన్నారో చూడటానికి మీలో ప్రతి ఒక్కరు ఒక గొప్ప శోధనకు లోనవుతారు. ఇకనుండైనా ఇది గుర్తుంచుకోండి! లేని జ్ఞానము గురించి మాట్లాడవద్దు; ఆచరణ మార్గము మరియు యధార్ధత గురించి మాత్రమే మాట్లాడండి. నిజమైన జ్ఞానము నుండి నిజమైన ఆచరణలోనికి రూపాంతరము చెందాలి, ఆపై ఆచరణ నుండి నిజమైన జీవితము లోనికి పరివర్తన చెందాలి. ఇతరులకు ఉపన్యాసాలు దంచకండి, మరియు నిజమైన జ్ఞానము గురించి మాట్లాడకండి. నీ జ్ఞానము ఒక మార్గము అయితే, నీ మాటలను దానిపై సేచ్చగా వెళ్లనివ్వు; అలాకాకపోతే, దయచేసి నీ నోరు మూసుకుని మాట్లాడటం ఆపివేయి! నీవు చెప్పేదంతా నిరుపయోగమే. ఎందుకంటే, నీవు మాట్లాడుతున్న జ్ఞానమనేది దేవుని మోసపుచ్చి మరియు ఇతరులు నిన్ను గురించి మత్సరపడేలా చేయునది మాత్రమే. ఇదే కదా నీ లక్ష్యం? ఉద్దేశ్యపుర్వకముగానే మీరు ఇతరులతో ఆటలాడుట లేదా? దీనిలో ఏమైనా విలువ ఉన్నదా? అనుభవపుర్వకముగా జ్ఞానము పొందిన తరువాత మాట్లాడితే, నీవు అతిశయిస్తున్నట్లు అగుపడదు. లేకపోతే, మీరు దురహంకార మాటలు ఉమ్మేవారిగా మాత్రమే ఉంటారు. నీ నిజానుభావములో జయించలేని అనేక విషయములు కలిగియున్నప్పుడు, నీ శరీరమునే నీవు ఎదిరించలేవు; దేవుని చిత్తమును తృప్తిపరచకుండా, ఎప్పుడూ నీకిష్టమైనది చేస్తున్నావు—అయినప్పటికీ, దైవ సిద్దాంతిక జ్ఞానము గురించి మాట్లాడే సాహసము చేస్తున్నావు. నీవు సిగ్గుమాలినవాడివి! అయినప్పటికీ, దేవుని మాటలపై నీకున్న జ్ఞానాన్ని మాట్లాడే ధైర్యం చేస్తున్నావు. నీది ఎంత సిగ్గుమాలినత్వము? ప్రసంగాలు చేయడం మరియు ప్రగల్భాలు పలకడము నీకు సహజ స్వభావముగా మారి, అలా చేయడానికి నీవు అలవాటుపడిపోయావు. అందుకే, నీవు ప్రసంగించాలనుకున్నపుడల్లా, నీవు చాలా సులభముగా ఆ పని చేసేస్తున్నావు. కానీ, ఆచరణ విషయానికొస్తే, అలంకారప్రాయముగా ఉండిపోతున్నావు. ఇది ఇతరులను మోసం చేయడం కాదా? నీవు మనుష్యులను మోసపుచ్చగలవేమో గానీ, దేవుని మోసపుచ్చలేవు. మనుష్యులకు అవగాహన మరియు వివేచన లేదు, గానీ దేవుడు అటువంటి విషయాలను తీవ్రముగా భావిస్తాడు, అలాగే ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ సహోదర సహోదరీలు నీ జ్ఞానాన్ని ప్రశంసిస్తూ, నిన్ను మెచ్చుకుని, నీ పక్షాన వాదించవచ్చేమో, కానీ నీవు యధార్ధతను కలిగియుండకపోతే, పరిశుద్ధాత్మడు నిన్ను విడిచి పెట్టడు. ఆచరణీయుడైన దేవుడు బహుశా నీలో లోపాలు వెతకక పోవచ్చు, కానీ దేవుని ఆత్మ నిన్ను విస్మరిస్తుంది, మరియు దానిని భరించడం నీకు చాలా కష్టము. నీవు దీనిని నమ్ముతావు కదా? వాస్తవికత ఆచరణ గురించి ఎక్కువగా మాట్లాడు; ఇప్పటికే నీవు మర్చిపోయావు కదా? ఆచరణాత్మక మార్గాల గురించి మాట్లాడు; ఇప్పటికే ఆ సంగతి మర్చిపోయావు కదా? “ఉన్నతమైన సిద్దాంతాలు, మరియు పనికిమాలిన సంగతులు చెప్పడం, అతిశయపు మాటలు తగ్గించండి; ఇందుకోసం ఇప్పుడే మీ అభ్యాసము మొదలుపెట్టడం ఉత్తమం.” ఈ మాటలన్నీ నీవు మర్చిపోయావు కదా? నీకేమీ అర్ధము కావడం లేదు కదా? దేవుని చిత్తము గురించి నీకు అస్సలు గ్రహింపే లేదు కదా?

మునుపటి:  ఆచరణాత్మకమైన దేవుడే దేవుడని నీవు తెలుసుకోవాలి

తరువాత:  ఈనాటి దేవుని కార్యమును గురించి తెలుసుకోవడం

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger