శరీరధారి అయిన దేవుని పరిచర్య మరియు మానవుని కర్తవ్యం మధ్య గల వ్యత్యాసము
మీరు దేవుని కార్యపు దర్శనాలను తెలుసుకోవాలి మరియు ఆయన కార్యపు సాధారణ దిశను గ్రహించాలి. ఇది సానుకూల ప్రవేశము. దర్శనాల సత్యమును మీరు ఖచ్చితముగా సాధించిన తరువాత, నీ ప్రవేశము సురక్షితమవుతుంది; దేవుని కార్యము ఎలా మారినప్పటికీ, నీ హృదయమందు నీవు స్థిరముగా ఉంటావు, దర్శనాల గురించి స్పష్టత కలిగి ఉంటావు, నీ ప్రవేశము మరియు నీ అనుసరణ కొరకు ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటావు. ఈ విధంగా, నీలో ఉన్న జ్ఞానము మరియు అనుభవమంతా లోతుగా ఎదుగుతూ మరియు మరింత సవివరముగా మారతాయి. ఒక్కసారి నీవు విశాలమైన చిత్రాన్ని పూర్తిగా గ్రహించాక, జీవితములో నీవు నష్టాలను చవిచూడవు లేదా బ్రష్టత్వానికి వెళ్ళవు. కార్యపు ఈ దశలను నీవు తెలుసుకోకపోతే, ప్రతి దశలోనూ నీవు నష్టాన్ని చవిచూస్తావు, పరిస్థితులు మారడానికి నీకు కొద్ది రోజులకంటే ఎక్కువ సమయము పడుతుంది, రెండు వారాలైనా కూడా నీవు సరైన దారిలో పెట్టలేవు. దీని వలన ఆలస్యమవ్వదా? సానుకూల ప్రవేశము మరియు అనుసరణ మార్గములో నీవు ప్రావీణ్యత పొందవలసినది ఎంతో ఉంది. ఇక దేవుని కార్యపు దర్శనాల విషయానికొస్తే, ఈ క్రింది విషయాలను నీవు తప్పక గ్రహించాలి: ఆయన విజయ కార్యపు ప్రాధాన్యత, పరిపూర్ణత పొందే మార్గము, శోధనలు మరియు శ్రమలను అనుభవించుట ద్వారా, గద్దింపు మరియు శిక్ష ప్రాముఖ్యత, పరిశుద్దాత్మ కార్యము వెనుక ఉన్న సూత్రాలు, విజయము మరియు పరిపూర్ణత వెనక ఉన్న సూత్రాలు సాధించాలి. ఇవన్నీ కూడా దర్శనాల సత్యానికి చెందినవి. మిగిలినవి ధర్మశాస్త్ర కాలము, కృపా కాలము మరియు దేవుని రాజ్య కాలములోని కార్యపు మూడు దశలు, అలాగే భవిష్యత్ సాక్ష్యముగా ఉంటాయి. ఇది, దర్శనాల సత్యము కూడా, మరియు ఇవి ఎంతో ప్రాథమికమైనవి మరియు అత్యంత కీలకమైనవి. ప్రస్తుతము, నీవు ప్రవేశించవలసినది మరియు అనుసరించవలసినది చాలా ఉంది, ఇప్పుడైతే అది చాలా దశలుగా మరియు సవివరముగా ఉన్నది. నీకు ఈ సత్యాల గురించి అవగాహన లేకపోతే, నీవు ఇంకా ప్రవేశాన్ని సాధించవలసి ఉన్నదని నిరూపిస్తుంది. అనేక సార్లు ప్రజల సత్య జ్ఞానము చాలా పేలవంగా ఉంటుంది; వారు ప్రాథమిక సత్యాలను అనుసరించలేరు మరియు అల్పమైన విషయాలను ఎలా అదుపు చేయాలో కూడా తెలియదు. ప్రజలు సత్యాన్ని అనుసరించలేక పోవడానికి కారణం వారి తిరుగుబాటు స్వభావము, మరియు నేటి కార్యమును గురించిన వారి జ్ఞానము చాలా నిస్సారముగా మరియు ఏకపక్షముగా ఉండడమే. అందువలన, ప్రజలు పరిపూర్ణత పొందడం అంత తేలికైన పని కాదు. నీవు చాలా ఎక్కువగా తిరుగుబాటుతనము కలిగి మరియు నీ పాత స్వభావమును చాలా ఎక్కువగా అంటిపెట్టుకుని ఉంటావు; మీరు సత్యము పక్షమున నిలువలేకపోతున్నారు, మరియు మీరు స్వీయ-ఆధారిత సత్యాలను కూడా అనుసరించలేక పోతున్నారు. అలాంటి ప్రజలు రక్షించబడలేని వారు మరియు జయించబడని వారు. నీ ప్రవేశానికి స్పష్టత మరియు లక్ష్యాలు లేకపోతే, నీకు కలిగే వృద్ధి నిదానముగా ఉంటుంది. నీ ప్రవేశానికి కాస్తయినా వాస్తవికత లేకపోతే, అప్పుడు నీ అన్వేషణ అంతా వ్యర్ధమే. సత్య సారాంశము గురించి నీకు అవగాహన లేకపోతే, నీవు మార్పు లేకుండా మిగిలిపోతావు. మనిషి జీవితములోని ఎదుగుదల మరియు అతని స్వభావములోని మార్పులు వాస్తవికతలోనికి ప్రవేశించడము ద్వారా మరియు, ఇంకా, వివరణాత్మకమైన అనుభవాలలోనికి ప్రవేశించుట ద్వారా సాధించబడతాయి. నీ ప్రవేశ సమయములో నీవు అనేకమైన వివరణాత్మకమైన అనుభవాలను కలిగి ఉంటే, మరియు నీకు ఎక్కువగా వాస్తవ జ్ఞానము మరియు అనుమతి ఉంటే, నీ స్వభావము త్వరగా మారిపోతుంది. ప్రస్తుతం, ఆచరణ గురించి నీకు పూర్తిగా స్పష్టత లేకపోయినప్పటికీ, కనీసం దేవుని కార్యపు దర్శనాల పట్ల అయినా నీకు స్పష్టత ఉండాలి. లేకపోతే, నీవు ప్రవేశించడానికి అసమర్థునిగా ఉంటావు; సత్యము గురించి జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రవేశము సాధ్యమవుతుంది. పరిశుద్దాత్మ మిమ్మల్ని మీ అనుభవములో వెలిగించినప్పుడు మాత్రమే సత్యము గురించి గూఢమైన జ్ఞానము మరియు లోతైన ప్రవేశాన్ని పొందుకుంటారు. దేవుని కార్యాన్ని మీరు తెలుసుకోవాలి.
ఆదిలో, మానవజాతి సృజించబడిన తరువాత, ఇశ్రాయేలీయులే దేవుని కార్యానికి మూలముగా పనిచేశారు. భూమిపై యెహోవా చేసిన కార్యమునకు ఇశ్రాయేలీయులందరూ మూలమే. మానవుడు సాధారణ జీవితము గడపడానికి, మరియు భూమిపై సాధారణ పద్దతిలో యెహోవాను ఆరాధించడానికి, న్యాయ విధులను రూపొందించుట ద్వారా నేరుగా మానవుని సంరక్షించడం మరియు నడిపించడమే యెహోవా కార్యమై ఉన్నది. ధర్మశాస్త్ర కాలములోని దేవుని మానవుడు చూడలేదు మరియు తాకలేదు. ఎందుకంటే, ఆ సమయంలో ఆయన చేసినదంతా సాతాను వలన చెడిపోయిన పితరులను నడిపించడం, వారికి బోధించి మరియు సంరక్షించడం వంటివే, ఆయన వాక్యాల్లో ఉన్నదంతా కట్టడలు శాసనాలు, మరియు మానవ ప్రవర్తన నియమావళి తప్ప మరేమీ కాదు, మరియు వారికేమీ జీవిత సత్యాలను అందించలేదు. ఆయన నాయకత్వములోని ఇశ్రాయేలీయులు సాతాను చేత దారుణముగా చెడగొట్టబడలేదు. ఆయన ధర్మశాస్త్ర కార్యమనేది రక్షణ కార్యములోని మొట్టమొదటి దశ మరియు రక్షణ కార్యపు అత్యంత ఆరంభమే తప్ప, మానవ జీవిత స్వభావములోని మార్పులతో అది ఆచరణాత్మకముగా చేయగలిగినది ఏమీ లేదు. కాబట్టే, రక్షణ కార్యపు ఆరంభంలో ఇశ్రాయేలులోని ఆయన రక్షణ కార్యము కొరకు శరీరమును ధరించవలసిన అవసరము ఆయనకు రాలేదు. అందుకే, మానవునితో మమేకం కావడానికి ఒక మాధ్యమము—ఒక సాధనము—ఆయనకు అవసరమైనది. ఈవిధముగా, సృజించబడిన జీవరాశిలో యెహోవా తరపున మాట్లాడి మరియు పనిచేసిన వారు లేపబడ్డారు. ఆవిధంగానే, మనుష్య కుమారులు మరియు ప్రవక్తలు మనుష్యుల మధ్య పని చేయడానికి వచ్చారు. నర పుత్రులు మనుష్యుల మధ్య దేవుని తరపున పనిచేశారు. యెహోవా ద్వారా “నర పుత్రులు” అని పిలవబడడం అంటే యెహోవా తరపున అలాంటి వ్యక్తులు కట్టడలను నిర్దేశిస్తారని అర్ధము. ఇశ్రాయేలు ప్రజల మధ్య వారు, యెహోవాచే పర్యవేక్షించబడి మరియు సంరక్షించబడిన యాజకులుగా మరియు యెహోవా ఆత్మ వారిలో పనిచేసిన యాజకులుగా కూడా ఉన్నారు; వారు ప్రజలలోని నాయకులు మరియు యెహోవాను నేరుగా సేవించిన వారు. మరోవైపు, అన్నీ దేశాల మరియు జాతుల ప్రజలతో, యెహోవా తరపున, మాట్లాడుటకు ప్రతిష్టించబడిన ప్రవక్తలు. వారు యెహోవా కార్యాన్ని కూడా ప్రవచించారు. వారు నర పుత్రులైనా లేక ప్రవక్తలైనా, అందరూ యెహోవా ఆత్మ ద్వారానే లేపబడి, యెహోవా కార్యమును వారిలో కలిగియున్నారు. ప్రజలలో, వారు నేరుగా యోహోవాకు ప్రాతినిధ్యము వహించారు; యెహోవా ద్వారా లేపబడిన కారణంగానే వారు తమ పనిని తాము చేశారే తప్ప, వారు పరిశుద్దాత్మ స్వయముగా అవతరించిన శరీరమైయున్నారని దాని అర్థం కాదు. కాబట్టి, వారు దేవుని తరపున మాట్లాడటం మరియు పనిచేయడంలో ఒకేలా ఉన్నప్పటికీ, ఆ నర పుత్రులు మరియు ధర్మశాస్త్ర కాలం నాటి ప్రవక్తలు శరీరధారి అయిన దేవుని దేహము కాదు. మానవ రక్షణ కార్యము మరియు తీర్పు రెండూ శరీరధారి అయిన దేవుని ద్వారా స్వయముగా జరిగింపబడినందున, కృపా కాలము మరియు తుది దశలోని దేవుని కార్యము కచ్చితముగా వ్యతిరేకంగా ఉంటుంది, కాబట్టి ఆయన తరపున పని చేయడానికి ప్రవక్తలు మరియు నర పుత్రులను మరోసారి లేపాల్సిన అవసరం లేదు. మానవుని దృష్టిలో, వారి పని స్వభావానికి మరియు పద్దతికి మధ్య ముఖ్యమైన వ్యత్యాసాలేవీ లేవు. ఈ కారణంగానే, ప్రవక్తల మరియు నరపుత్రులతో దేవుని కార్యమునకు సంబంధించి మనుష్యులు నిరంతరం కలవరపడుతుంటారు. శరీరధారి అయిన దేవుని రూపము ప్రాథమికముగా ప్రవక్తలు మరియు నరపుత్రుల మాదిరిగానే ఉన్నది. దేవుని శరీరధారణ ప్రవక్తల కంటే ఇంకా వాస్తవికముగా మరియు సాధారణముగా ఉన్నది. అందువలన, మానవుడు వారి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేడు. పని చేయడం మరియు మాట్లాడడంలో ఇద్దరు ఒకేలా ఉన్నప్పటికీ, వారి మధ్య ప్రాముఖ్యమైన వ్యత్యాసముందని పూర్తిగా గ్రహించకుండానే, మానవుడు రూపముల మీద మాత్రమే దృష్టి సారిస్తాడు. విషయాలను వేరుగా చెప్పగల సామర్థ్యము మానవునికి చాలా తక్కువగా ఉన్నందున, చిన్న విషయాల మధ్య వ్యత్యాసాన్ని, సంక్లిష్టమైన వాటిని అతడు గుర్తించుట లేదు. ప్రవక్తలు మరియు పరిశుద్దాత్మచే వాడబడిన ప్రజలు మాట్లాడి మరియు పనిచేసినప్పుడు, మానవ ధర్మాలను నిర్వర్తించడం, సృజించబడినవాని పనికి సేవ చేయడం అనేది మానవుడు చేయవలసిన పనిగా ఉన్నది. అయితే, శరీరధారి అయిన దేవుని వాక్యాలు మరియు కార్యము ఆయన పరిచర్యను కొనసాగించడానికే ఉన్నాయి. ఆయన బాహ్య రూపము సృజించబడిన వానిగా ఉన్నప్పటికీ, ఆయన కార్యమనేది పరిచర్య జరిగించడమే గాని పనిని కొనసాగించడం కాదు. “కర్తవ్యము” అనే పదము సృజించబడిన జీవరాశికి చెందినది, అయితే “పరిచర్య” అనేది శరీరధారి అయిన దేవుని దేహానికి సంబంధించినది. రెండింటి మధ్య గణనీయమైన వ్యత్యాసము ఉన్నది; అవి పరస్పరం మార్చుకోలేవు. పరిచర్యను కొనసాగించడం మరియు నిర్వహించడం దేవుని కార్యమైతే, కర్తవ్యాన్ని నిర్వర్తించడం మానవుని పని. అందువలన, అనేకమంది అపోస్తలులు పరిశుద్దాత్మ చేత వాడబడి, మరియు ఆయనతో అనేక మంది ప్రవక్తలు నింపబడినప్పటికీ, సృజించబడిన వారిగా వారి పని మరియు మాటలు కేవలం వారి కర్తవ్యాన్ని నిర్వర్తించడమే అయి ఉన్నది. వారి ప్రవచనాలు శరీరధారి అయిన దేవుడు చెప్పిన జీవన జీవితపు నిజమైన మార్గాన్ని అధిగమించి ఉండవచ్చు మరియు వారి మానవ స్వభావము శరీరధారి అయిన దేవుని మించి ఉండవచ్చు, కానీ ఇప్పటికీ వారు చేస్తున్నది వారి కర్తవ్యాన్నే తప్ప పరిచర్యను కాదు. మానవుని కర్తవ్యము మానవుని విధిని సూచిస్తుంది; అది మనిషి సాధించదగినది. అయితే, శరీరధారి అయిన దేవుని ద్వారా కొనసాగింపబడుచున్న పరిచర్య ఆయన నిర్వహణకు సంబంధించినది, ఇది మానవుడు సాధించలేనిది. శరీరధారి అయిన దేవుడు మాట్లాడినా, కార్యము చేసినా, మరియు అద్భుతాలు చేసినా, ఆయన తన నిర్వహణలో గొప్ప కార్యము చేస్తున్నాడు, మరియు అటువంటి కార్యము ఆయనకు బదులుగా మానవుడు చేయలేనిది. దేవుని నిర్వహణ కార్యమందు సూచించబడిన దశలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం మాత్రమే మానవుని కార్యమై ఉన్నది. దేవుని నిర్వహణ లేకుండా, అనగా, శరీరధారి అయిన దేవుని పరిచర్యను కోల్పోతే, సృజించబడిన వాని కర్తవ్యము పోతుంది. తన పరిచర్యలో మానవుని సముదాయించడమే దేవుని కార్యము, అయితే మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది సృష్టికర్త కోరికలను తీర్చే తన బాధ్యత నెరవేర్పు అయి ఉన్నదే గానీ, ఒకరి పరిచర్యను కొనసాగించడం అనేది ఏ విధంగానూ పరిగణించబడదు. దేవుని అంతర్గత స్వభావానికి—ఆయన ఆత్మకు—దేవుని కార్యమే ఆయన నిర్వహణగా ఉన్నది, అయితే సృజించబడిన వారి బాహ్య రూపాన్ని ధరించే శరీరధారి అయిన దేవునికి తన పరిచర్యను కొనసాగించడమే కార్యమై ఉన్నది; దేవుని నిర్వహణ పరిధిలో మరియు ఆయన మార్గదర్శకత్వములో ఉత్తమమైన దానిని అందించడమే మానవుడు చేయగలిగినది.
వాస్తవానికి, మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది మానవునిలో అంతర్లీనముగా ఉన్న వాటన్నిటినీ, అంటే మానవునికి సాధ్యమయ్యే దానిని సాధించడమే. అప్పుడే అతని కర్తవ్యం నెరవేరుతుంది. అతని సేవా సమయములో మానవుని లోపాలు ప్రగతిశీలమైన అనుభవము మరియు తీర్పు ప్రక్రియ గుండా వెళ్లడాన్ని బట్టి క్రమముగా తగ్గుతాయి; అవి మానవుని కర్తవ్యాన్ని ఆటంక పరచవు లేక ప్రభావితం చేయవు. సేవ చేయడం మరియు ఫలించడం మానేసి, తమ సేవలో లోటుపాట్లు ఉంటాయనే భయముతో వెనుకబడేవారు అందరికంటే పిరికిపందలు. సేవా సమయములో వారు చెప్పాల్సిన వాటిని ప్రజలు చెప్పకుండా మరియు అంతర్గతముగా వారికి సాధ్యమయ్యే వాటిని సాధించకుండా, మరియు బదులుగా మూర్ఖులై తీర్మానముల ద్వారా వెళితే, సృజించబడిన ప్రాణకోటి కలిగి ఉండవలసిన పనితీరును కోల్పోయిన వారవుతారు. అటువంటి ప్రజలను “తటస్థులు” అని పిలుస్తారు, వారు పనికిమాలిన చెత్త. అలాంటి ప్రజలు నిజముగా సృజించబడిన వారు అని ఎలా పిలువబడతారు? వారు బయటకు మెరుస్తున్నా లోపల కుళ్ళిపోయిన అవినీతి పరులు కారా? మనిషి తనను తాను దేవునిగా పిలుచుకుంటూ, దైవత్వపు ఉనికిని వ్యక్తపరచలేక, దేవుని కార్యమును చేయలేక లేక దేవునికి ప్రాతినిధ్యము వహించకపోతే, నిస్సందేహముగా అతడు దేవుడు కాదు, ఎందుకంటే అతనికి దేవుని స్వాభావికత్వము లేదు, మరియు దేవుడు స్వాభావికముగా సాధించగలది అతనిలో లేదు. మానవుడు స్వతహాగా తాను పొందగలిగినది కోల్పోతే, అతడు ఇక మనిషిగా పరిగణించబడడు, మరియు సృజించబడిన వానిగా నిలుచుటకు, దేవుని ఎదుటకు వచ్చి ఆయనను సేవించుటకు అయోగ్యుడు. అంతేగాక, దేవుని కృపను పొందడానికి లేక కాపాడబడటానికి, సంరక్షించబడటానికి మరియు దేవుని ద్వారా పరిపూర్ణత పొందటానికి యోగ్యత లేనివాడు. దేవుని నమ్మకత్వాన్ని కోల్పోయిన వారందరూ దేవుని కృపను కోల్పోతారు. వారు తమ వెకిలి చేష్టలను విసర్జించకపోవడమే కాకుండా, దేవుని మార్గపు ఆలోచనే సరైనది కాదని నిస్సంకోచముగా ప్రచారం చేస్తారు మరియు ఆ తిరుగుబాటుదారులు దేవుని అస్థిత్వాన్ని కూడా తృణీకరిస్తారు. ఇలాంటి తిరుగుబాటు స్వభావము కలిగిన అటువంటి ప్రజలు దేవుని కృపను ఆస్వాదించడానికి ఎలా అర్హులవుతారు? వారంతా కర్తవ్యాన్ని నిర్వర్తించని వారు, దేవునికి బహు విరోధమైన వారు, మరియు ఆయనకు చాలా రుణపడిన వారు అయినప్పటికీ, వారు వెనుతిరిగి తప్పంతా దేవునిదే అని ఘీంకరిస్తారు. అటువంటి మానవుడు పరిపూర్ణత పొందడానికి ఎలా అర్హుడవుతాడు? బహిష్కరించబడి మరియు శిక్షించబడటానికి ముందున్నది ఇది కాదా? దేవుని ఎదుట వారి కర్తవ్యాన్ని నిర్వర్తించని ప్రజలు ఇదివరకే మరణము కూడా శిక్షగా సరిపోని అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడ్డారు, అయినప్పటికీ దేవునితో వాదిస్తూ తమను తాము ఆయనతో పోల్చుకునే సాహసం చేస్తారు. అలాంటి వ్యక్తులను పరిపూర్ణులు చేయడం ద్వారా కలిగే ప్రయోజనం ఏముంది? తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ప్రజలు విఫలమైనప్పుడు, రుణగ్రస్తమైన మరియు అపరాధ భావాన్ని వారు కలిగియుండాలి; వారు తమ పనికిమాలినతనము మరియు బలహీనతను, వారి తిరుగుబాటుతనము మరియు దుర్నీతిని విసర్జించాలి, అంతేగాక, వారి జీవితాలను దేవునికి సమర్పించాలి. అప్పుడు మాత్రమే వారు దేవుని నిజముగా ప్రేమించే సృజించబడిన జీవులుగా ఉంటారు, మరియు అలాంటి ప్రజలు మాత్రమే దేవుని ఆశీర్వాదాలను మరియు వాగ్ధానమును ఆస్వాదించడానికి మరియు ఆయన చేత పరిపూర్ణ పరచబడటానికి యోగ్యులై ఉంటారు. మీలో అనేకుల సంగతేంటి? మీ మధ్య నివసించే దేవునితో మీరు ఎలా వ్యవహరిస్తారు? ఆయన ఎదుట మీరు మీ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించారు? మీ స్వంత జీవితాన్ని పణంగా పెట్టి అయినా, మీరు చేయాలని చెప్పినవన్నీ మీరు చేశారా? మీరు ఏమి త్యాగం చేశారు? మీరు నా వద్ద నుండి ఎక్కువ పొందలేదా? మీరు గుర్తించగలరా? మీరు నా పట్ల ఎంత విధేయులుగా ఉన్నారు? మీరు నాకు ఎలా సేవ చేశారు? నేను మీ కోసము అనుగ్రహించిన మరియు మీ కొరకు చేసినదంతా ఏమిటి? వాటన్నిటికి మీరు కొలత వేశారా? మీరందరూ మీలో ఉన్న అల్పమైన మనస్సాక్షితో దీన్ని పోల్చి నిర్దారించారా? మీ మాటలు మరియు క్రియలు ఎవరికీ యోగ్యమైనవి? అటువంటి అత్యల్పమైన మీ త్యాగము నేను మీకు అనుగ్రహించిన వాటన్నిటికంటే విలువైనదా? నాకు వేరే మార్గము లేదు మరియు హృదయపూర్వకముగా మీకు అర్పించాను, అయినప్పటికీ మీరు దుష్టాలోచనలు కలిగి మరియు నా పట్ల అయిష్టపూర్వకముగా ఉన్నారు. ఇది కేవలము మీ విధి, మీ కర్తవ్య పరిధి. ఇవన్నీ కాదని అనుకుంటున్నారా? సృజించబడిన వాని విధిని నిర్వర్తించడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారన్న సంగతి మీకు తెలియదా? మీరు సృజించబడిన వారిగా ఎలా పరిగణించబడతారు? మీరు వ్యక్తపరుస్తున్నది మరియు జీవిస్తున్నది ఏమిటో మీకు స్పష్టముగా ఉందా? మీ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో మీరు విఫలమయ్యారు కానీ, మీరు దేవుని సహనాన్ని మరియు సమృద్ది కృపను పొందాలని ఆశిస్తారు. అటువంటి కృప అనేది ఏమీ కోరకుండా సంతోషముగా త్యాగము చేసే వారి కోసమే గానీ, మీలాంటి నీచమైన మరియు విలువ లేని వారికోసం సిద్దపరచబడలేదు. మీలాంటి ప్రజలు, అటువంటి తటస్థులు పరలోకపు కృపను అనుభవించడానికి పూర్తిగా అనర్హులు. కష్టాలు మరియు అంతులేని శిక్ష మాత్రమే మీ దినాలను వెంబడిస్తుంది! మీరు నా పట్ల నమ్మకముగా లేకపోతే, మీ గతి బాధలలో ఒకటిగా ఉంటుంది. నా వాక్యాలు మరియు నా కార్యమునకు మీరు ఉత్తరవాదులుగా ఉండకపోతే, మీ ప్రతిఫలము శిక్షలలో ఒకటిగా ఉంటుంది. సమస్త కృప, ఆశీర్వాదాలు, దేవుని రాజ్యపు అద్భుతమైన జీవితంతో మీకు ఎటువంటి సంబంధం ఉండదు. మీరు స్వతహాగా చేసుకున్నదాని పరిణామాన్ని మరియు మీరు పొందడానికి తగిన ముగింపు ఇదే! అజ్ఞానులు మరియు అహంకారులు తమ వంతు ప్రయత్నము చేయకపోవడము, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించకపోవడమే కాకుండా, వారు కోరేదానికి అర్హులు అన్నట్లుగా, దయ కొరకు వారు తమ హస్తాలను జోడిస్తారు. వారు కోరిన వాటిని పొందడములో వారు ఫలమైతే, వారు ఎన్నటికి విశ్వాసహీనులవుతారు. అటువంటి వ్యక్తులను హేతుబద్దంగా ఎలా పరిగణిస్తారు? వారు పేలవమైన సామర్థ్యము కలిగియున్న సహేతుకత లేని వారు, కార్య నిర్వహణ సమయములో మీరు నెరవేర్చవలసిన కర్తవ్యాన్ని బొత్తిగా నెరవేర్చలేనివారు. మీ విలువ ఇదివరకే క్షీణించింది. మీ పట్ల చూపిన అంతటి దయకి ప్రతిగా నాకు చెల్లించడంలో మీ వైఫల్యము ఇప్పటికే ఘోరమైన తిరుగుబాటు చర్య అనేది, మిమ్మల్ని ఖండించి మీ టక్కరితనాన్ని, అసమర్థతని, నీచత్వాన్ని, మరియు అనర్హతను వెల్లడిచేయడానికి సరిపోతుంది. మీ చేతులు చాపడానికి మీకు ఏ అర్హత ఉంది? నా కార్యానికి కనీస సహకారము అందించలేకపోవడం, విధేయులుగా ఉండలేకపోవడం, మరియు నాకు సాక్ష్యులుగా ఉండలేకపోవడం వంటివి మీ దుర్మార్గాలు మరియు వైఫల్యాలుగా ఉన్నా సరే, నాపై దాడి చేసి, నాపై నిందలు మోపి, నేను అవినీతిపరుడని ఫిర్యాదు చేస్తారు. ఇదేనా మీరు కనుపరచే విధేయత? ఇదేనా మీరు చూపించే ప్రేమ? ఇంతకు మించి ఇంకా మీరేమి చేయగలరు? జరిగిన కార్యమంతటికి మీరు సహకారము ఎలా అందించారు? ఎంతవరకు మీరు వెచ్చించారు? ఇప్పటికే మిమ్మల్ని నిందించకుండా నేను సహనాన్ని కనుపరిచాను, అయినప్పటికీ నిస్సిగ్గుగా మీరు నాపై సాకులు చెప్తూ మరియు నా గురించి రహస్యముగా ఫిర్యాదు చేస్తారు. మీకు కాస్తయినా మానవత్వము ఉందా? మానవ కర్తవ్యం అనేది మానవుని మనస్సు మరియు అతని తలంపులతో కలుషితమైనప్పటికీ, మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించి మీ విధేయతను కనుపరచాలి. మానవుని కార్యములో ఉన్న మలినాలు తన సామర్థ్యానికి చెందిన సమస్య, అయితే మానవుడు గనుక తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే, అది అతని తిరుగుబాటుతనాన్ని కనుపరుస్తుంది. మానవుని కర్తవ్యానికి మరియు అతడు దీవించబడ్డాడా లేదా శపించబడ్డాడా అనే దాని మధ్య ఎటువంటి సంబంధాలు లేవు. కర్తవ్యం అనేది మానవుడు నేరవేర్చవలసినది; అది పరలోకము-పంపిన అతని ఉద్యోగము, మరియు ప్రతిఫలము, షరతులు, లేక కారణాలపై ఆధారపడకూడదు. అప్పుడు మాత్రమే అతడు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు అని భావం. ఆశీర్వదించబడడం అనగా ఎవరైనా పరిపూర్ణపరచబడి మరియు తీర్పును అనుభవించిన తరువాత దేవుని దీవెనలను ఆస్వాదించడం. శపించబడడం అనగా ఎప్పుడైనా ఎవరైనా గద్దింపు మరియు తీర్పును అనుభవించిన తరువాత వారి స్వభావము మారకపోతే, అప్పుడు వారు పరిపూర్ణపరచబడరు, కానీ శిక్షింపబడతారు. కానీ వారు దీవించబడ్డారా లేక శపించబడ్డారా అనే దానితో సంబంధం లేకుండా, సృజించబడిన వారు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి, వారు చేయవలసిన దానిని చేయాలి, మరియు వారు చేయగలిగిన దానిని చేయాలి; ఇది దేవుని అనుసరించే ఒక వ్యక్తి, కనీసముగా ఏ వ్యక్తైనా తప్పక చేయవలసినది. కేవలం నీవు ఆశీర్వదించబడడం కోసం పనిచేయకూడదు, శపించబడతారేమో అన్న భయమును బట్టి మీరు పనిచేయడం మానకూడదు. నేను మీకు ఈ ఒక్క సంగతి చెప్తాను: మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే అతడు చేయవలసినది, మరియు అతడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో అసమర్దుడైతే, అప్పుడు అది అతని తిరుగుబాటుతనము అవుతుంది. తన కర్తవ్యాన్ని నిర్వర్తించే ప్రక్రియ ద్వారానే మానవుడు క్రమముగా మార్పు చెందుతాడు, మరియు ఈ ప్రక్రియ ద్వారానే అతడు తన విధేయతను విశదీకరిస్తాడు. అలాగే, నీవు ఎంత ఎక్కువగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించగలిగితే, నీవు అంత సత్యాన్ని పొందుకుంటావు మరియు నీ వ్యక్తీకరణ అంత వాస్తవికముగా మారుతుంది. తమ కర్తవ్యాన్ని మాత్రము చేయాలనే ఆలోచనలు కలిగి మరియు సత్యాన్ని కనుగొనని వారు అంతిమంగావెలివేయబడతారు, ఎందుకంటే సత్యాన్ని అనుసరించడంలో వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించరు, మరియు కర్తవ్యాన్ని నెరవేర్చడంలో సత్యాన్ని అనుసరించరు, వారు మారకుండా మిగిలిపోతారు మరియు శపించబడతారు. వారి వ్యక్తీకరణలు మలినమైనవి అని మాత్రమే కాదు, కానీ వారు వ్యక్తపరిచేది ప్రతిదీ చెడ్డదే.
కృపా కాలములో, యేసు కూడా చాలా వాక్యాలు పలికాడు మరియు ఎంతో కార్యము చేశాడు. ఆయన యెషయా కంటే భిన్నముగా ఎలా ఉన్నాడు? ఆయన దానియేలు కంటే భిన్నముగా ఎలా ఉన్నాడు? ఆయన ప్రవక్తా? ఆయన క్రీస్తు అని ఎందుకు చెప్పబడ్డాడు? వారి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి? వారందరూ మాటలు మాట్లాడిన మనుష్యులు మరియు వారి మాటలు ఇంచుమించు మానవునికి మాదిరి కనిపిస్తాయి. వారందరూ మాటలు పలికారు మరియు పని చేశారు. పాత నిబంధన కాలపు ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు మరియు, అంతా యేసు లాగే చేశారు. మరి, ఆ భిన్నత్వం ఎలా వచ్చింది? ఇక్కడ బేధము కార్యపు స్వభావము మీద ఆధారపడి ఉన్నది. ఈ విషయాన్ని గుర్తించడానికి, నీవు శరీర స్వభావాన్ని పట్టించుకోకూడదు మరియు వారి మాటల లోతుపాతులను గురించి ఆలోచించకూడదు. ఎల్లప్పుడూ ముందు నీవు వారి కార్యమును మరియు మానవునిలో వారి కార్యము సాధించిన ప్రభావాలను పరిగణించాలి. ఆ కాలములో ప్రవక్తలచే పలుకబడిన ప్రవచనాలు మానవునికి జీవాన్ని అందించలేదు యెషయా మరియు దానియేలు వంటి వారు పొందుకున్న ప్రేరణలు వట్టి ప్రవచనాలు మాత్రమే గానీ జీవ మార్గము కాదు. యెహోవా ప్రత్యక్ష ప్రకటనే కాకపోతే, మనుష్యులకు సాధ్యము కాని ఆ కార్యమును ఎవరూ చేయలేరు. యేసు కూడా అనేక వాక్యాలు పలికాడు కానీ, అలాంటి వాక్యాలు మానవుడు అనుసరణ మార్గము కనుగొనగలిగే జీవ మార్గమై ఉన్నది. అంటే, మొదటిగా, యేసు జీవమైయున్నాడు కాబట్టి, ఆయన మానవ జీవాన్ని సరఫరా చేశాడు, రెండవదిగా, ఆయన మానవ అతిక్రమాలను తిప్పికొట్టగలడు; మూడవదిగా, యుగాన్ని కొనసాగించడానికి ఆయన కార్యము యెహోవాను కొనసాగించేదిగా ఉంది; నాల్గవదిగా, మనిషిలో ఉన్న అవసరతలను ఆయన గ్రహించగలడు మరియు మానవునికి కొదువైనది ఏదో అర్ధం చేసుకోగలడు. ఐదవదిగా, ఆయన పాత దానిని ముగించి నూతన యుగాన్ని ప్రారంభించగలడు. అందుకే ఆయన దేవుడు మరియు క్రీస్తు అని పిలువబడతాడు, ఆయన యెషయా మాత్రమే కాకుండా మిగిలిన ప్రవక్తలందరి కన్నా కూడా భిన్నముగా ఉన్నాడు. ప్రవక్తల కార్యానికి పోలికగా యెషయాను తీసుకోండి. మొదటిగా, అతడు మానవునికి జీవాన్ని అందించలేకపోయాడు; రెండవదిగా, అతడు నూతన యుగాన్ని ఆరంభించలేకపోయాడు; అతడు నూతన యుగములో దూతగా కాకుండా యెహోవా నాయకత్వములో పని చేస్తున్నాడు. మూడవదిగా, అతడు పలికిన మాటలు అతనికి అతీతమైనవి. అతడు ఇతరులు గ్రహించలేని, కనీసం వినని, ప్రత్యక్షతలను నేరుగా దేవుని ఆత్మ నుండి పొందుతున్నాడు. అతని మాటలు ప్రవచనాల కంటే ఎక్కువేమీ కాదని, యెహోవా స్థానములో జరిగించబడిన కార్యపు దృక్పథము మాత్రమేనని నిరూపించడానికి ఈ మాత్రం విషయాలు సరిపోతాయి. అయితే, అతడు పూర్తిగా యెహోవాను వర్ణించలేకపోయాడు. అతడు యెహోవా సేవకుడు, యెహోవా కార్యములో ఒక సాధనము. అతడు ధర్మశాస్త్ర కాలములో మరియు యెహోవా కార్యపు పరిధిలో మాత్రమే పని చేస్తున్నాడు; ధర్మశాస్త్ర కాలమునకు మించి అతడు పనిచేయలేదు. మరోవైపు, యేసు కార్యము భిన్నముగా ఉంది. ఆయన యెహోవా కార్యపు పరిధిని అధిగమించాడు; ఆయన శరీరధారి అయిన దేవునిగా కార్యము చేశాడు మరియు సర్వ మానవాళిని విమోచించడానికి సిలువ వేయబడ్డాడు. అంటే, యెహోవా జరిగించిన కార్యమును దాటి ఆయన నూతన కార్యమును చేశాడు. అదొక నూతన యుగానికి నాంది పలుకుతుంది. అదనంగా, ఆయన మానవుడు సాధించలేని దాని గురించి మాట్లాడగలిగాడు. ఆయన కార్యము దేవుని నిర్వాహకత్వములోని కార్యమై సమస్త మానవాళిని జొప్పించింది. ఆయన కేవలం కొద్దిమంది మనుష్యులలో కార్యము చేయలేదు, ఆయన కార్యము పరిమిత సంఖ్యలో మనుష్యులను నడిపిస్తుందని భావము కాదు. దేవుడు మానవునిగా ఎలా అవతరించాడు అనే విషయానికొస్తే, ఆ సమయంలో ఆత్మ ప్రత్యక్షతలను ఎలా ఇచ్చాడు, మరియు కార్యము చేయడానికి ఆత్మ మానవునిపై ఎలా దిగివచ్చాడు—అనే ఈ విషయాలు మానవుడు చూడలేనివి మరియు తాకలేనివి. ఈ సత్యాలు ఆయన శరీరధారి అయిన దేవుడని నిరూపణ చేయడం పూర్తిగా అసాధ్యము. అలాగే, మానవునికి ప్రత్యక్షపరచబడిన వాక్యాలు మరియు దేవుని కార్యమునకు మధ్య మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. ఇది మాత్రమే నిజం. ఎందుకంటే ఆత్మ విషయాలు దేవునికే స్పష్టముగా తెలుస్తాయి గానీ నీకు కనిపించవు, మరియు శరీరధారి అయిన దేవుని దేహానికి కూడా అన్నీ తెలియవు; ఆయన చేసిన కార్యమును బట్టి మాత్రమే ఆయన దేవుడా కాదా అని నీవు ధృవీకరించగలవు. ఆయన కార్యము నుండి, మొదటిగా, ఆయన నూతన యుగాన్ని ఆవిష్కరించగలడని, చూడవచ్చు; రెండవదిగా, ఆయన మానవ జీవితాన్ని అందించి, మానవుడు అనుసరించవలసిన మార్గమును చూపగలడు. ఆయన దేవుడని స్థాపించడానికి ఇది సరిపోతుంది. చిట్టచివరి వరకు, ఆయన చేసే కార్యములో దేవుని ఆత్మను పూర్తిగా కనుపరుస్తాడు మరియు అటువంటి కార్యము ద్వారా ఆయనలో దేవుని ఆత్మ ఉందని చూడవచ్చు. శరీరధారి అయిన దేవుని కార్యము ప్రధానంగా నూతన యుగానికి నాంది పలికి, నూతన కార్యాన్ని కొనసాగించి, మరియు నూతన రాజ్యాన్ని ఆవిష్కరించి, ఆయనే స్వయముగా దేవుడని స్థాపించడం అనడానికి ఇవే సరిపోతాయి. కాబట్టి ఇది యెషయా, దానియేలు, మరియు ఇతర ప్రవక్తల నుండి ఆయనను వేరు పరుస్తుంది. యెషయా, దానియేలు, మరియు మిగిలిన వారందరూ ఉన్నత విద్యావంతుల మరియు సంస్కారవంతుల తరగతికి చెందినవారు; వారు యెహోవా నాయకత్వములోని విశేషమైన వ్యక్తులు. శరీరధారి అయిన దేవుని దేహము కూడా కొదువలేని బుద్ధి జ్ఞానమును కలిగి ఉన్నది, కానీ అయన మానవ స్వభావము చాలా సాధారణమైనది. ఆయన సామాన్యమైన మానవుడు మరియు తిన్నని నేత్రాలు ప్రత్యేకమైన ఆయన మానవ స్వభావాన్ని గ్రహించలేవు లేక ఇతరులకు భిన్నముగా ఆయన మానవ స్వభావమందు గుర్తించలేవు. ఆయన అద్భుతకరుడు లేక అద్వితీయుడు అసలే కాదు, మరియు ఆయనకు ఉన్నత విద్య, జ్ఞానము, మరియు సిద్దాంతాలు లేవు. ఆయన మాట్లాడే జీవితం మరియు ఆయన నడిపించే మార్గము సిద్దాంతము ద్వారా, జ్ఞానము ద్వారా, జీవిత అనుభవము ద్వారా, కుటుంబ పెంపకము ద్వారా పొందినవి కాదు. బదులుగా, అవి అవతార శరీరపు కార్యమైన, ఆత్మ ప్రత్యక్ష కార్యము. ఎందుకంటే, మానవునికి దేవుని గురించి గొప్ప భావనలు ఉన్నాయి, మరియు ఆ భావనలు ముఖ్యముగా అనేక అతీతమైన మరియు అస్పష్టమైన అంశాలతో రూపొందించబడ్డాయి కాబట్టి, సూచనలు మరియు అద్భుతాలు చేయలేని, మానవ బలహీనతలు కలిగిన సాధారణ దేవుడు, మనిషి దృష్టిలో, ఖచ్చితముగా దేవుడు కాదు. ఇవి మానవుని తప్పుడు భావనలు కావా? శరీరధారి అయిన దేవుని దేహము సామాన్య మానవుడు కాకపోతే, మరి ఆయన శరీరముగా మారాడని ఎలా చెప్పాలి? శరీర సంబంధంగా ఉండటమంటే సాధారణంగా, సామాన్య మానవునిగా ఉండటమే; ఆయన అతీంద్రియమైన వాడు అయితే, ఆయన శరీర సంబంధి కాదు. ఆయన శరీర సంబంధి అని నిరూపించడానికి, శరీరధారి అయిన దేవుడు సాధారణ శరీరమును ధరించవలసి వచ్చింది. ఇది కేవలం శరీరధారణ ప్రాముఖ్యతను సంపూర్తి చేయడానికి మాత్రమే. అయితే, ప్రవక్తలు మరియు నరపుత్రుల విషయములో ఇవేవీ లేవు. వారు పరిశుద్దాత్మ చేత వాడబడిన ప్రతిభావంతులైన వ్యక్తులు; మానవ దృష్టిలో, వారి మానవ స్వభావము చాల గొప్పది, మరియు సాధారణ మనవ స్వభావాన్ని మించిన అనేక కార్యాలు వారు చేశారు. ఈ కారణాన్ని బట్టి, మానవుడు వారిని దేవునిగా భావించాడు. ఇప్పుడు మీరందరూ దీనిని స్పష్టముగా గ్రహించాలి, ఎందుకంటే ఇది గత కాలాల్లో మనుష్యులందరినీ సులువుగా చిక్కులబెడుతున్న సమస్య. అదనంగా, శరీరధారణ అన్ని విషయాలలోకెల్లా అత్యంత రహస్యమైనది, మరియు దేవుని శరీరధారణ అనేది మనిషి అంగీకరించడానికి చాలా కష్టతరమైనది. నేను చెప్పేది మీ విధిని నెరవేర్చడానికి మరియు శరీరధారణ మర్మాన్ని గ్రహించడానికి వీలుగా ఉంటుంది. ఇదంతా దేవుని నిర్వాహకత్వానికి, దర్శనాలకు సంబంధించినది. దీని గురించిన మీ అవగాహన, అంటే, దేవుని నిర్వాహకత్వము, దర్శనాలను గూర్చిన జ్ఞానము పొందడానికి ఎంతో ప్రయోజనకరముగా ఉంటుంది. ఈ విధంగా, మీరు వివిధ రకాలైన వ్యక్తులు నిర్వర్తించాల్సిన కర్తవ్యం గురించి కూడా ఎంతో అవగాహన పొందుతారు. ఈ మాటలు మీకు నేరుగా మార్గాన్ని చూపించనప్పటికీ, అవి ఇప్పటికీ మీ ప్రవేశానికి చాలా సహాయకరంగా ఉంటాయి, ఎందుకంటే ప్రస్తుతము మీ జీవితాలకు దర్శనాలు కరువయ్యి, మీ ప్రవేశాన్ని నిరోధించే ప్రధానమైన ఆటంకముగా ఇది మారుతుంది. మీరు గనుక ఈ సమస్యలను అర్ధం చేసుకోలేకపోతే, మీ ప్రవేశానికి ఇక ఏ ప్రేరణా ఉండదు. మరి, మీ కర్తవ్యాన్ని ఉత్తమంగా నిర్వర్తించడానికి అటువంటి అన్వేషణ ఎలా ప్రేరేపిస్తుంది?