దేవుడు మరియు ఆయన కార్యమును ఎరిగినవారే దేవుణ్ణి సంతృప్తి పరచగలరు

దేవుని అవతార కార్యములో రెండు భాగాలున్నాయి. ఆయన మొదటిసారి శరీరధారి అయినప్పుడు మనుష్యులు ఆయన యందు నమ్మిక ఉంచలేదు లేదా తెలుసుకోలేదు, ఆయనను సిలువకు మేకులతో కొట్టిరి. తరువాత, రెండవసారి శరీరధారి అయినప్పుడు, మనుష్యులు ఇంకనూ ఆయన యందు నమ్మిక ఉంచలేదు, ఆయన గూర్చి చాలా తక్కువ తెలుసుకున్నారు మరియు మరల ఆయనను సిలువకు మేకులతో కొట్టిరి. మరి, మనిషి దేవునికి శత్రువు కాదా? కానీ, మనిషికి దేవుడి గూర్చి తెలియకపోతే, ఆయనకు సన్నిహితుడిగా ఎలా ఉండగలడు? దేవుడికి సాక్ష్యం ఇవ్వడానికి అతను ఎలా అర్హత పొందుతాడు? అలాంటప్పుడు, దేవుని ప్రేమించటం, దేవుణ్ణి సేవించడం మరియు దేవుని మహిమపరచడం వంటి మానవుని వాదములన్నీ మోసపూరితమైన అబద్ధములు కావా? మీరు ఇలాంటి అవాస్తవిక, ఆచరణాత్మకం కాని విషయాలకు మీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే, మీ శ్రమ వ్యర్థం కాదా? దేవుడు ఎవరో కూడా తెలుసుకోకుండా ఉంటే, మీరు దేవుని సన్నిహితుడిగా ఎలా ఉండగలరు? అలాంటి ఒక అన్వేషణ అస్పష్టం మరియు సంగ్రహం కాదా? ఇది మోసపూరితం కాదా? ఒకరు దేవుడికి ఎలా సన్నిహితంగా ఉండవచ్చు? దేవునికి సన్నిహితంగా ఉండడంలో ఆచరణాత్మక ప్రాముఖ్యత ఏమిటి? మీరు దేవుని ఆత్మకు సన్నిహితంగా ఉండగలరా? ఆత్మ ఎంత గొప్పదో మరియు ఘనమైనదో మీరు చూడగలరా? అదృశ్యమైన, నిరాకారమైన దేవునికి సన్నిహితంగా ఉండడమనేది అస్పష్టంగా మరియు సంగ్రహంగా ఉండదా? అలాంటి ఒక అన్వేషణలో ఆచరణాత్మక ప్రాముఖ్యత ఏముంటుంది? ఇవన్నీ ఒక మోసపూరిత అబద్ధం కాదా? మీ అన్వేషణ దేవునికి సన్నిహితంగా ఉండటం కొరకే అయినప్పటికీ, వాస్తవానికి మీరు సాతాను పెంపుడు కుక్కగానే ఉంటారు, మీకు దేవుని గురించి తెలియదు, మరియు ఉనికిలో లేని “అన్ని విషయాలకూ కర్త అయిన దేవుని” అనుసరిస్తారు, అది అస్పష్టంగా, నిరాకారంగా మరియు మీ స్వంత భావనల ఉత్పత్తిగా ఉంటుంది. కొంచెం నర్మగర్భంగా చెప్పాలంటే, సాతాను ఆ “దేవుడు” గా ఉంటాడు, ఆచరణాత్మకంగా చెప్పాలంటే, మీరే అలా ఉంటారు. మీరు మీతో సాన్నిహిత్యంగా ఉండటాన్ని కోరుకుంటారు, కానీ దేవునికి సన్నిహితంగా ఉండడాన్ని అనుసరిస్తున్నట్లుగా చెబుతారు ఇది దైవదూషణ కాదా? అటువంటి ఒక అన్వేషణకు విలువేముంది? దేవుని ఆత్మ శరీరాన్ని దాల్చకపోతే, దేవుడు అనే విషయమే కేవలం అదృశ్యమైన, అస్పష్టమైన జీవాత్మగా, రూపం లేని మరియు నిరాకారమైన, అభౌతికమైన, మనిషి చేరుకోలేని మరియు తెలుసుకునే శక్యము కానిదిగానే ఉండేది. ఇటువంటి నిరాకారమైన, అద్భుతమైన మరియు నిగూఢమైన ఆత్మకు మనిషి ఎలా సన్నిహితంగా ఉండగలడు? ఇది ఒక పరిహాసం కాదా? ఇలాంటి అనుచితమైన తర్కము చెల్లుబాటు కాదు మరియు ఆచరణాత్మకం కూడా కాదు. సృష్టించబడిన మనిషి స్వాభావికంగా దేవుని ఆత్మకు భిన్నమైనవాడు, అలాంటప్పుడు వీరిరువురూ ఎలా సన్నిహితంగా ఉండగలరు? అందుకే, దేవుని ఆత్మ శరీరంలో ప్రత్యక్షపరచబడనట్లయితే, దేవుడు శరీరధారిగా మారడంతో పాటు సృష్టించబడిన వ్యక్తి స్థాయికి తనను తాను తగ్గించుకోకపోతే, ఆయనకు సన్నిహితంగా ఉండటానికి మనిషి అనర్హుడు మరియు సమర్ధత లేని వాడుగా ఉండిపోవడమే కాకుండా మనుషుల ఆత్మలు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం వచ్చినప్పుడు, దేవుడితో సన్నిహితంగా ఉండటానికి అవకాశం దొరికిన ఆయన విశ్వాసులు తప్ప, చాలామంది దేవుని ఆత్మతో సన్నిహితులు కాలేరు. మరియు దేవుని అవతారము మార్గదర్శనంలో పరలోక రాజ్యములోకి ప్రవేశించాలని కోరుకునే మనుష్యులు ఆశ్చర్యకరమైన రీతిలో మూర్ఖులైన మనుష్య-యేతరులు కాదా? మనుష్యులు అదృశ్య దేవుని పట్ల మాత్రమే “విశ్వాసము” కనపరుస్తారు మరియు కనపడే దేవుని పట్ల కొంచెం కూడా శ్రద్ధను కనపరచరు. ఎందుకంటే, అదృశ్య దేవుని అనుసరించటం వారికి చాలా సులువు. మనుష్యులు వారికి కావలసిన రీతిలో ఈ పని చేస్తారు కానీ, కనపడే దేవుని అనుసరించడం అనేది సులువైనది కాదు. అస్పష్టమైన దేవుణ్ణి కోరుకునే వ్యక్తి దేవుణ్ణి పూర్తిగా పొందలేడు, ఎ౦దుక౦టే, అస్పష్టమైన, నిగూఢమైన విషయాలన్నీ మనిషి ద్వారా ఊహి౦చబడతాయి మరియు వాటిని పొందుకోవటానికి మనిషికి సమర్ధత ఉండదు. అలాంటప్పుడు మీకు అందుబాటులో లేని ఉన్నతమైన మరియు ఘనమైన దేవుడు మీ మధ్యకు వచ్చినట్లయితే, ఆయన చిత్తమును మీరు ఎలా గ్రహించగలరు? మీరు ఆయనను ఎలా తెలుసుకొనగలరు మరియు అర్థం చేసుకోగలరు? ఆయన తన కార్యమును మాత్రమే చేసి, మానవునితో సాధారణ సంబంధం లేకుండా, లేదా సాధారణ మనుష్యులు మరియు కేవలం మర్త్యులకు చేరుకోలేని స్థితిలో ఉంటే, అప్పుడు, ఆయన మీకోసం ఎక్కువ పని చేసినప్పటికీ ఆయనతో మీకు సంబంధం లేకుండా మరియు ఆయనను చూడలేకపోతే, మీరు ఆయనను ఎలా తెలుసుకోగలరు? ఈ శరీరము సాధారణ మనిషి స్వభావం కలిగి ఉండకపోతే, మనిషికి దేవుని గూర్చి తెలుసుకునే మార్గం ఉండదు; దేవుని అవతారం కారణంగానే శరీరధారియైన దేవునికి సన్నిహితుడిగా ఉండటానికి మనిషి యోగ్యతను పొందుతున్నాడు. ముష్యులు దేవునితో స౦బ౦ధ౦ కలిగివు౦డడానికి కారణం, వారు ఆయనతో కలిసి జీవిస్తారు మరియు ఆయనతో సంబంధం కలిగి ఉంటారు, కాబట్టే, క్రమంగా వారు ఆయనను తెలుసుకోవటం ద్వారా దేవునికి సన్నిహితులుగా మారతారు. అలా కానప్పుడు మనిషి అన్వేషణ వ్యర్థం కాదా? అంటే, దేవుని కార్యము వల్ల మాత్రమే మనిషి దేవునికి సన్నిహితుడు కాలేడు కానీ, దేవుని అవతారం వాస్తవికత మరియు సాధారణత్వము వలన మాత్రమే సన్నిహితుడిగా కాగలడు. దేవుడు శరీరధారిగా మారడ౦ వల్లనే, మనుష్యులకు తమ కర్తవ్యం నిర్వర్తి౦చే అవకాశ౦, నిజ దేవుణ్ణి ఆరాధి౦చే అవకాశ౦ ఉ౦టు౦ది. ఇదే అత్యంత నిజమైన మరియు ఆచరణాత్మక సత్యం కాదా? ఇప్పుడు, ఇంకనూ మీరు పరలోకంలో దేవునికి సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నారా? దేవుడు తనను తాను ఒక నిర్దిష్ట స్థానం వద్ద తగ్గించుకున్నప్పుడు, దేవుడు శరీరధారిగా మారినప్పుడు మాత్రమే మానవుడు అయనకు సన్నిహితుడు, నమ్మకస్తుడు కాగలడు. దేవుడు ఆత్మ స్వరూపుడు: ఇంతటి శ్రేష్ఠమైన మరియు పరిమితులు లేని ఈ ఆత్మకు సన్నిహితులు కావడానికి మనుష్యులు ఎలా అర్హులు కాగలరు? దేవుని ఆత్మ శరీరము ధరించి, మనిషి లాంటి రూపం కలిగిన జీవిగా మారినప్పుడే మనుష్యులు ఆయన చిత్తాన్ని అర్థ౦ చేసుకోగలుగుతారు, వాస్తవానికి ఆయన ద్వారా పొందుకోగలుగుతారు. ఎందుకంటే, ఆయన శరీరధారియై మాట్లాడతాడు, పనిచేస్తాడు, మానవజాతి లోని ఆన౦దాలు, దుఃఖాలు, శ్రమలను ప౦చుకు౦టాడు, మానవజాతి లాగే అదే లోక౦లో నివసిస్తాడు, మానవజాతిని రక్షిస్తాడు, వారికి మార్గనిర్దేశ౦ చేస్తాడు, తద్వారా మనుష్యులను పరిశుద్ధం చేస్తాడు, తన రక్షణను, తన ఆశీర్వాదాన్ని పొ౦దడానికి అనుమతిస్తాడు. ఈ విషయాలను స౦పాది౦చుకున్న తర్వాత, మనుష్యులు దేవుని చిత్తాన్ని నిజ౦గా అర్థ౦ చేసుకు౦టారు, అప్పుడే వారు దేవుని సన్నిహితులు కాగలరు. ఈ విషయాన్ని పొందుకొనుట వలన ప్రజలు దేవుని చిత్తమును నిజంగా అర్థం చేసుకోగలరు. మరియు అప్పుడు వారు దేవుని సన్నిహితులు కాగలుగుతారు. ఇది మాత్రమే ఆచరణాత్మకము. దేవుడు మనుష్యులకు అదృశ్యడుగా మరియు అస్పష్ణుడుగా ఉన్నట్లయితే వారు దేవునికి సన్నిహితులుగా ఎలా కాగలరు? అదొది ఒక శూన్య సిద్ధాంతంగా నిలిచిపోదా?

ఇప్పటివరకు దేవుని యందు విశ్వాసం కలిగిన చాలామంది అస్పష్టమైన మరియు గూఢమైన దాన్నే ఇంకనూ అనుసరిస్తున్నారు. వారు ఈ రోజు దేవుని కార్యము యొక్క వాస్తవికతను గ్రహించలేదు మరియు ఇంకనూ పత్రికలు మరియు సిద్ధాంతాల మధ్య జీవిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, “దేవుణ్ణి ప్రేమి౦చేవారి క్రొత్త తర౦,” “దేవుని సన్నిహితులు,” “దేవుణ్ణి ప్రేమి౦చే ఉదాహరణ మరియు ప్రతి రూపము” మరియు “పేతురు శైలి” వ౦టి క్రొత్త వాక్యముల వాస్తవికతలోకి ఇంకా చాలామ౦ది ప్రవేశి౦చలేదు; బదులుగా, వారి అన్వేషణ ఇప్పటికీ అస్పష్టంగా మరియు నిగూఢంగానే ఉంది, వారు ఇప్పటికీ సిద్ధాంతంలోనే వెతుకులాడుతున్నారు, మరియు ఈపదాల వాస్తవికత గురించి వారికింకా గ్రహింపు లేదు. దేవుని ఆత్మ శరీరాన్ని ధరించిననప్పుడు, నీవు ఆయన కార్యములను చూడగలుగుతావు మరియు స్పృశించగలుగుతావు. అయినప్పటికీ, నీవు ఆయన సన్నిహితుడిగా మారలేకపోయినట్లయితే, మరియు ఆయనకు నమ్మకస్తుడిగా ఉండలేకపోయినట్లయితే, దేవుని ఆత్మకు నీవెలా నమ్మకస్తుడిగా ఉండగలవు? ఈనాటి దేవుడిని నీవు ఎరగనట్లయితే, దేవుని ప్రేమిస్తున్న క్రొత్త తరంలో ఒకరిగా నీవు ఎలా ఉండగలవు? ఈ పదబంధములన్నీ ఖాళీ అక్షరములు మరియు సిద్ధాంతాలు కావా? నీవు ఆయన ఆత్మను చూడగలుగుతున్నావా మరియు ఆయన చిత్తమును గ్రహించగలుగుతున్నావా? ఈ పద బంధములు ఖాళీగా లేవా? నీవు కేవలం ఈ పదబంధాలను మరియు వాక్యములను మాట్లాడితే సరిపోదు, మరియు కేవలం తీర్మానం ద్వారా మాత్రమే నీవు దేవుని సంతృప్తిని పొందుకోలేవు. ఈ పదాలను మాట్లాడటం ద్వారా మాత్రమే నీవు సంతృప్తి చెందావు, మరియు నీ స్వంత కోరికలను సంతృప్తిపరచడానికి, నీ స్వంత అవాస్తవిక ఆదర్శాలను సంతృప్తిపరచడానికి మరియు నీ స్వంత భావనలు మరియు ఆలోచనలను సంతృప్తిపరచడానికి నీవు అలా చేశావు. ఈనాటి దేవుడిని నీవు తెలుసుకోనట్లయితే, నీవు ఏది చేసినప్పటికీ, దేవుని హృదయ వాంఛను సంతృప్తి పరచలేవు. దేవునికి నమ్మకస్తుడిగా ఉండటం అంటే ఏమిటి? మీరు ఇంకా దీన్ని అర్థం చేసుకోలేదా? దేవుని సన్నిహితుడు మనిషే కాబట్టి, దేవుడు కూడా మనిషే. అందుకే, దేవుడు శరీరధారి అయ్యాడు మరియు మనిషిగా మారాడు. ఒకేరకంగా ఉన్నవారు మాత్రమే నమ్మకస్తులుగా పిలవబడతారు, అప్పుడు మాత్రమే వారు సన్నిహితులుగా పరిగణించబడతారు. దేవుడు ఆత్మ స్వరూపుడు అయినట్లయితే, మనిషిని తన సన్నిహితుడుగా ఎలా సృష్టించాడు?

దేవుని యందు నీ నమ్మకం, నీ సత్యాన్వేషణ మరియు నీవు నీ కోసం నడిచే దారి సైతం వాస్తవికత ఆధారంగా ఉండాలి: మీరు చేసే ప్రతిదీ ఆచరణాత్మకంగా ఉండాలి, మరియు భ్రాంతికరమైన వాటిని, విచిత్రమైన వాటిని అనుసరించకూడదు. ఈ విధమైన ప్రవర్తనకు ఎలాంటి విలువ లేదు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా, అటువంటి జీవితానికి అర్థం లేదు. ఎందుకంటే, నీ అన్వేషణ మరియు జీవితం అబద్ధం మరియు మోసం మధ్య గడవడం తప్ప దులో మరేమీ ఉండదు, మరియు విలువ మరియు ప్రాముఖ్యత ఉన్న విషయాలను నీవు అనుసరించవు కాబట్టి, నీవు పొందే విషయాలు అసంగతమైన వాదన మరియు సత్యం కాని సిద్ధాంతంగా మాత్రమే ఉంటుంది. ఇటువంటి విషయాలు నీ ఉనికికి సంబంధించి ప్రాముఖ్యత మరియు విలువతో సంబంధం కలిగి ఉండవు మరియు అవి మిమ్మల్ని ఒక బూటకమైన రాజ్యానికి మాత్రమే తీసుకురాగలవు. ఈ విధంగా నీ పూర్తి జీవితం ఎటువంటి విలువ మరియు అర్థం లేకుండా ఉంటుంది, నీవు ఒక అర్థవంతమైన జీవితాన్ని కొనసాగించనట్లయితే, అప్పుడు మీరు వంద సంవత్సరాలు జీవింటినప్పటికీ, అదంతయు ఎందుకు పనికిరాదు. అలాంటి జీవితాన్ని మానవ జీవితం అని ఎలా పిలువగలం? నిజానికి అదొక జంతువ జీవితం లాంటిది కాదా? అదేవిధ౦గా, దేవుని విశ్వాస మార్గాన్ని అనుసరి౦చడానికి మీరు ప్రయత్నించినప్పుడు, చూడగల దేవుణ్ణి అనుసరించడానికి ప్రయత్ని౦చకు౦డా, దానికి బదులుగా అదృశ్యమైన, నిరాకారుడైన దేవుణ్ణి ఆరాధించినట్లయితే, అంతా నిష్ఫలమే. చివరికి నీ అన్వేషణ శిధిలాల కుప్పగా మారుతుంది. అటువంటి అన్వేషణ వల్ల నీకు ప్రయోజనం ఏమి ఉంటుంది? మనిషితో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే, చూడలేని లేదా స్పృశించలేని వస్తువులను, అత్యంత మర్మమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలను మాత్రమే అతను ప్రేమిస్తాడు, మరియు అవి మనిషి ఊహించలేనివి మరియు మర్త్యులైన వారిచే సాధించలేనివి. ఈ విషయాలు మరింత అవాస్తవికమయ్యే కొద్దీ, మనుష్యులు వీటిని మరింతగా విశ్లేషిస్తారు మరియు వారు వాటిని అజాగ్రత్తగా అనుసరిస్తారు మరియు వాటిని పొందటానికి ప్రయత్నిస్తారు. వాటి అవాస్తవికత పెరిగే కొద్దీ, మనుష్యులు అంతగా వాటిని నిశితంగా పరీక్షించి విశ్లేషించడమే కాకుండా, వాటి గురించి వారి స్వంత సమగ్ర ప్రణాళికలు రూపొందించే వరకు కూడా వెళతారు. అదేసమయంలో, దీనికి విరుద్ధంగా, ఆ విషయాలు ఎంత వాస్తవికంగా ఉంటే, మనుష్యలు అంతగా వాటిని తిరస్కరిస్తుంటారు; వారు వాటిని పైపైన చూస్తారు మరియు వాటిని తిరస్కరిస్తారు. ఈ రోజు నేను చేసే వాస్తవిక కార్యము పట్ల ఖచ్చితంగా మీ వైఖరి ఇది కాదా? ఇటువంటి వాస్తవికమైన విషయాలు ఎన్ని ఉన్నాయో, పక్షపాతంతో వాటిని వ్యతిరేకించేవారు కూడా అంతగా ఉన్నారు. వాటిని పరిశీలించడానికి మీరు ఎటువంటి సమయము కేటాయించరు, కానీ కేవలం వాటిని నిర్లక్ష్యం చేస్తారు; ఈ వాస్తవికమైన, తక్కువ ప్రామాణిక ఆవశ్యకతలను మీరు అగౌరవంగా చూస్తారు, మరియు అత్యంత వాస్తవమైన ఈ దేవుని గురించి అనేక భావనలను కలిగిఉన్నారు, మరియు ఆయన వాస్తవికత మరియు సాధారణతను అంగీకరించే సామర్థ్యం మీకు లేదు. ఈవిధంగా, మీరు ఒక అస్పష్టమైన నమ్మకాన్ని కలిగిలేరా? గతకాలపు అస్పష్టమైన దేవుని పట్ల మీకు దృఢమైన విశ్వాసము కలదు మరియు ఈనాటి నిజమైన దేవుని పట్ల మీకు ఆసక్తి లేదు. నిన్నటి దేవుడు మరియు నేటి దేవుడు రెండు విభిన్నమైన శకముల నుండి వచ్చినవారు కావడమే ఇందుకు కారణం కాదా? నిన్నటి దేవుడు పరలోక రాజ్యములో ఉన్నతమైనవాడు మరియు నేటి దేవుడు ఈ భూలోకంలో ఒక సాధారణ మనిషి కావడమే ఇందుకు కారణం కాదా? మరీ ముఖ్యంగా, మనిషి ఆరాధించే దేవుడు ఆ మనిషి భావనల నుండి ద్వారా ఉత్పన్నమైనవాడు, అయితే నేటి దేవుడు భూమ్మీద ఉత్పత్తి చేయబడిన నిజమైన శరీరధారి కావడమే ఇందుకు కారణం కాదా? ఆయన అన్నింటినీ చెప్పి, అన్నింటినీ జరిపించిన తర్వాత కూడా, మనిషి ఆయనను వెంబడించకపోవడానికి కారణం ఆయన అత్యంత నిజమైన దేవుడు కావడమే కాదా? ఈనాటి దేవుడు మనుష్యలు చేయాలని కోరుతున్నది ఏమిటంటే, ఖచ్చితంగా అది మనుష్యులు చేయడానికి ఇష్టపడనిది, మరియు అది వారిని సిగ్గుపడేలా చేసేది. ఇది మనుష్యులకు విషయాలను కష్టతరం చేయడం లేదా? ఇది మనషయలకు మచ్చ తెచ్చే విషయం కాదా? ఈ విధ౦గా, నిజ దేవుడిని, ఆచరణాత్మక దేవుడిని అనుసరి౦చనిచాలామ౦ది ప్రజలు దేవుని అవతారానికి శత్రువులు అవుతారు, చెప్పాలంటే క్రీస్తు విరోధులు అవుతారు. ఇది ఒక స్పష్టమైన వాస్తవం కాదా? గతంలో, దేవుడు ఇంకా శరీరధారిగా అవతరించనప్పుడు, మీరు మతపరమైన వ్యక్తి లేదా భక్తి కలిగిన విశ్వాసి అయిఉండవచ్చు. దేవుడు శరీరధారిగా మారిన తర్వాత, అలా౦టి భక్తిగల విశ్వాసులలో చాలామ౦ది వారికి తెలియకుండానే క్రీస్తు విరోధులు అయ్యారు. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? దేవుని పట్ల మీ విశ్వాసంలో మీరు వాస్తవికత లేదా సత్యాన్వేషణ యందు ఏకాగ్రత ఉంచలేరు, కానీ దానికి బదులుగా అబద్ధాల యందు ఇష్టాన్ని కలిగి ఉంటారు—దేవుని అవతారము యందు నీ వ్యతిరేకతకు ఇది స్పష్టమైన ఆధారం కాదా? దేవుని అవతారము క్రీస్తుగా పిలవబడుతుంది. అంటే, దేవుని అవతారమందు నమ్మకం ఉంచని వారందరూ క్రీస్తు విరోధులేనా? మరి, మీరు ఈ శరీధారి అయిన దేవుడి యందు విశ్వాసం కలిగి ఉన్నారా మరియు నిజంగా ఆయనను ప్రేమిస్తున్నారా? ఈ జీవించే, శ్వాసించే దేవుడు అత్యంత నిజమైన మరియు అసాధారణ రీతిలో సాధారణమైన వ్యక్తి కాదా? అసలు మీ అనుసరణ యొక్క ఖచ్చితమైన లక్ష్యం ఏమిటి? అది పరలోకంలో ఉన్నదా లేదా భూమి మీద ఉన్నదా? అది ఒక భావన మాత్రమేనా లేక సత్యమా? అది దేవుడా లేక ఏదైనా అతీంద్రియ శక్తి రూపమా? నిజానికి, సత్యమే నిజ జీవితపు సూత్రాలలో అత్యంత వాస్తవమైనది, మరియు సమస్త మానవాళి అనుసరించే అటువంటి సూత్రాలలో అత్యున్నతమైనది. ఎందుకంటే, మనిషి కోసం దేవుడు చేసే కార్యమునకు అది ఆవఖ్యకమైనది మరియు అది దేవుడు వ్యక్తిగతంగా చేసే పని కాబట్టి, దానిని “జీవిత సూత్రం” అని పిలుస్తారు. ఇది ఏదో ఒక దాని నుండి సంక్షిప్తీకరించబడిన సూత్రం కాదు లేదా ఒక ప్రసిద్ధ వ్యక్తి పేర్కొన్న పదబంధం అసలే కాదు. బదులుగా, ఆకాశము మరియు భూమి మరియు సమస్తమును పాలించే సర్వోత్తముడు నుండి మానవాళికి వచ్చిన వాక్యము; ఇది ఏదో ఒక మనుష్యునిచే సంక్షిప్తీకరించిన మాట కాదు, కానీ, స్వాభావికమైన దేవుని జీవితం. కాబట్టి దీన్ని జీవిత సూత్రాల్లో అత్యుత్తమమైనదిగా పిలుస్తారు. సత్యమును ఆచరణలో పెట్టడానికి మనుష్యులు చేయాల్సిన అన్వేషణ వారి కర్తవ్యాన్ని నిర్వర్తించడమే—అంటే, అది మాత్రమే దేవుని ఆవశ్యకతను సంతృప్తిపరచే అన్వేషణ. ఏ మనుష్యుడు కూడా సాధించలేనటువంటి శూన్య సిద్ధాంతం కంటే, ఈ ఆవశ్యకత సారమే అన్ని సత్యాలలోకి అత్యంత వాస్తవమైనది. మీ అన్వేషణ అనేది సిద్ధాంతం తప్ప మరేమీ కానట్లయితే, మరియు అందులో వాస్తవికత లేనట్లయితే, మీరు సత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నట్లు కాదా? మీరు సత్యంపై దాడి చేసే వ్యక్తి కాదా? అలా౦టి వ్యక్తి దేవుడి ప్రేమను కోరుకునే వ్యక్తిగా ఎలా ఉ౦డగలడు? అందుకే, వాస్తవికత లేని మనుష్యులు సత్యమునకు మోసం చేస్తారు, మరియు వారు స్వాభావికంగా తిరుగుబాటుదారులై ఉంటారు.

మీరు ఎలా అన్వేషిస్తున్నప్పటికీ, మిగిలిన అన్నింటి కంటే ముఖ్యంగా, ఈ రోజు దేవుడు చేసిన కార్యమును అర్థం చేసుకోవాలి మరియు ఈ కార్యము ప్రాముఖ్యతను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంత్యదినములలో దేవుడు ఎటువంటి కార్యమును తీసుకొనివస్తాడు, ఎటువంటి స్వభావమును ఆయన తీసుకొని వస్తాడు మరియు మానవునిలో సంపూర్ణంగా దేనిని చేస్తాడు అనేదాని గురించి తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి మరియు తెలుసుకోవాలి. శరీరధారిగా ఆయన ఏ కార్యమును చేయడానికి వచ్చాడో తెలుసుకొనక మరియు అర్థం చేసుకోనట్లయితే, మీరు ఆయన చిత్తమును ఎలా గ్రహించగలుగుతారు మరియు ఆయనకు సన్నిహితుడిగా ఎలా మారతారు? దేవునితో సన్నిహితుడిగా ఉండటం అనేది కష్టతరమైనది కాదు, నిజానికి, అది సులువైనది. ప్రజలు దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే, మరియు దానిని ఆచరణలో పెట్టకలిగినట్లయితే, అది కష్టతరం కానే కాదు; మనుష్యులు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోనట్లయితే, అప్పుడది కొంచెం కష్టంగా మారుతుంది మరియు ఇంకా, వారు తమ అన్వేషణను అస్పష్టతలోకి నడిపించే అవకాశం ఉంది. దేవుని కొరకు అన్వేషణలో, మనుష్యులు నిలబడడానికి స్వంత స్థానం లేకపోతే, మరియు ఎటువంటి సత్యాన్ని కలిగి ఉండాలో వారికి తెలియకపోతే, అప్పుడు వారికి పునాది లేదు అని అర్థం. కాబట్టి, వారు ధృఢంగా నిలబడటం కష్టమవుతుంది. సత్యమును అర్థం చేసుకొనివారు ఈరోజు చాలామంది వున్నారు, మంచి మరియు చెడు మధ్య తేడాను వారు గుర్తించలేరు లేదా దేనిని ప్రేమించాలో లేదా ద్వేషించాలో వారు చెప్పలేరు. అటువంటి మనుష్యులు స్థిరముగా నిలబడటం కష్టం. సత్యాన్ని ఆచరించగలగడం, దేవుని చిత్తముపై శ్రద్ద కనపరచడం, అయన శరీరధారియై వచ్చినపుడు మానవునిపై దేవుని కార్యమును గురించి మరియు అయన మాట్లాడే సూత్రాల గురించి తెలుసుకోవడం అనేది దేవుని మీద ఉన్నటువంటి నమ్మకానికి కీలకమైనది. జనసందోహాన్ని వెంబడించకండి. మీరు ఎక్కడ ప్రవేశించాలో దాని గురించిన సూత్రాలను మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి మరియు వాటిని తప్పనిసరిగా పట్టుకోవాలి. దేవుని జ్ఞానము ద్వారా ఇవ్వబడిన నీలోని విషయాలను స్థిరముగా పట్టుకోవడం అనేది నీకు సహాయం అవుతుంది. నీవు అలా చేయనట్లయితే, నీవు ఈ రోజు ఒక మార్గంలో తిరుగుతారు, రేపు మీరు మరొక దాంట్లో తిరుగుతావు, మరియు నీవు ఎన్నడూ ఏ నిజమైన దానిని పొందలేవు. నీ స్వంత జీవితమునకు ఇటువంటిది ఏది ప్రయోజనకరం కాదు. సత్యమును అర్థం చేసుకొని వారు ఎల్లప్పుడూ వేరేవారిని అనుసరిస్తారు: ఇది పరిశుద్ధాత్మ కార్యము అని మనుష్యులు చెపితే మీరు కూడా ఇది పరిశుద్దాత్మ కార్యము అని చెప్తారు; ఇది దురాత్మ కార్యం అని మనుష్యులు చెబితే మీరు సందేహములో పడతారు లేదా మీరు కూడా ఇది దురాత్మ కార్యము అని చెప్తారు. నీవు ఎల్లప్పుడూ వేరేవారి మాటలను వల్లిస్తుంటారు మరియు దేనినీ గుర్తించగలిగే సామర్థ్యం కలిగివుండవు లేదా నీ గురించి ఆలోచించలేవు. దేనిని వేరుపరచలేని వారు ఒక దృక్పధం లేని వ్యక్తి—అటువంటి వ్యక్తి విలువలేని దౌర్భాగ్యుడు! మీరు ఎల్లప్పుడూ ఇతరుల మాటలను తిరిగి చెపుతారు: ఈరోజు ఇది పరిశుద్ధాత్మ కార్యము అని చెప్పబడింది, కానీ ఏదో ఒక రోజు ఎవరైనా ఇది పరిశుద్ధాత్మ కార్యము కాదని చెప్పే సంభావ్యత ఉంది, మరియు నిజానికి ఇది మానవుని క్రియలు తప్ప మరేమీ కాదు—అయినను మీరు దీనిని గ్రహించలేరు, మరియు ఇతరులు దీనిని చెప్పడాన్ని మీరు చూసినప్పుడు, మీరు అదే విషయాన్ని చెబుతారు. వాస్తవానికి ఇది పరిశుదాత్మ కార్యము కానీ ఇది మనుష్యుని కార్యము అని మీరు చెపుతారు; పరిశుద్దాత్మ కార్యమునకు వ్యతిరేకంగా దూషించిన వారిలో మీరు కూడా ఒకరు కావడం లేదా? దీనిలో బేధ భావమును చూపనందువలన మీరు దేవునికి వ్యతిరేకించలేదా? ఒకవేళ ఎవరైనా ఒక మూర్ఖుడు ఒక రోజు ప్రత్యక్షమయ్యి “ఇది దురాత్మ యొక్క కార్యము” అని చెపితే మరియు మీరు ఈమాటలు విన్నప్పుడు మీరు నష్టపోతారు, మరియు మరోసారి ఇతరుల మాటలతో మీరు బంధించబడతారు. ప్రతిసారి ఎవరైనా అసమ్మతి రేకేత్తించి గందరగోళం చేసినపుడు, మీరు మీస్థానములో నిలబడగలిగే సామర్ధ్యం కలిగివుండరు ఎందుకంటే, మీరు సత్యమును కలిగి లేరు. సమూహముగా కూడి ప్రసంగము వినుట వలన ఈవిషయాలను పొందుకోలేరు మరియు మీ ఆసక్తి వలన మాత్రమే మీరు పరిపూర్ణులుగా కాలేరు. మీరు అనుభవించాలి, తెలుసుకోవాలి మరియు మీ చర్యలలో సూత్రపాయంగా ఉండాలి మరియు పరిశుద్దాత్మ యొక్క కార్యమును పొందుకోవాలి. మీరు ఇటువంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడే, మీరు చాలా విషయాలను గ్రహించగలుగుతారు, మంచి మరియు చెడుల మధ్య, నీతి మరియు దుర్మార్గం మధ్య తారతమ్యమును మరియు శరీరం మరియు రక్తం అంటే ఏమిటి మరియు సత్యము అంటే ఏమిటి అని తెలుసుకోగలుగుతారు. మీరు ఈ విషయాలన్నింటి మధ్య తారతమ్యమును గుర్తించగలగాలి, అలా చేయడం ద్వారా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మీరు ఎప్పటికీ నష్టపోరు. ఇది మాత్రమే నీ నిజమైన స్థాయి కాగలదు.

దేవుని కార్యమును తెలుసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. మీ అన్వేషణలో మీకు ప్రమాణాలు మరియు ఒక లక్ష్యం ఉండాలి, సత్య మార్గాన్ని ఎలా వెతకాలో, అది నిజమైన మార్గమా కాదా అనేది మరియు అది దేవుని కార్యమా, కాదా అని తెలుసుకోవాలి. సత్య మార్గమును వెదకుటలో అత్యంత ప్రాధమిక సూత్రం ఏమిటి? ఈ మార్గములో సత్యమునకు సంబంధించిన కార్యము వుందా లేదా, ఈ మాటలు సత్యము వ్యక్తీకరణ అవునా కాదా, ఎవరు సాక్ష్యమిస్తారు మరియు మీ కొరకు అది ఏమి తీసుకువస్తుందో మీరు తెలుసుకోవాలి. సత్యమార్గమునకు మరియు అబద్దమార్గమునకు మధ్య తేడాను గుర్తించడానికి అనేక అంశాలతో కూడిన ప్రాథమిక జ్ఞానము అవసరం, వీటిలో అత్యంత ప్రాధమికమైనది అక్కడ పరిశుద్దాత్మ కార్యము యొక్క ప్రత్యక్షత వుందా లేదా అని చెప్పడమే. ఎందుకంటే, దేవునిపై మనుష్యుల నమ్మకం యొక్క సారమే దేవుని ఆత్మపై ఉన్న నమ్మకం, మరియు దేవుని అవతారంపై వారి నమ్మకం కూడా. ఎందుకంటే, ఈ శరీరము దేవుని ఆత్మకు ప్రతిరూపం, అంటే అటువంటి నమ్మకం ఇప్పటికీ ఆత్మపై ఉన్నటువంటి నమ్మకం. ఆత్మ మరియు శరీరము మధ్య తారతమ్యాలు వున్నాయి, ఎందుకంటే, ఈ శరీరం ఆత్మ నుండి వస్తుంది మరియు వాక్కు శరీరముగా మారింది, ఆవిధంగా మనిషి విశ్వసించేది దేవుని ఆత్మసారం యొక్క స్వభావం మాత్రమే. కావున వేరు చేసే ప్రక్రియలో ఇది నిజమైన మార్గమా, కాదా అని, అంతకన్నా ముఖ్యంగా, అది పరిశుద్ధాత్మ కార్యములో ఉన్నదా లేదా అని చూడాలి, ఆ తర్వాత, ఆ మార్గంలో సత్యము ఉన్నదా, లేదా అని తప్పనిసరిగా చూడాలి. సత్యం అనేది సాధారణ మానవ జాతి యొక్క జీవిత స్వభావం. చెప్పాలంటే, ఆదిలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఇది అవసరమైనది. అంటే, సాధారణ మానవ జాతి యొక్క సమస్తము (మానవ జ్ఞానం, తెలివి, వివేకము మరియు మానవునిగా ఉండటానికి కావలసిన ప్రాథమిక జ్ఞానముతో కలిపి) ఇందులోనే భాగమైంది. అంటే, మనుష్యులను సాధారణ మానవ జాతి యొక్క జీవితంలోకి ఈ మార్గం నడిపించగలదా లేదా, సాధారణ మానవజాతి వాస్తవికత ప్రకారం మాట్లాడే సత్యం అవసరమా లేదా, ఈ సత్యం ఆచరణాత్మకమైనదేనా మరియు ఇది వాస్తవమా, కాదా, మరీ ముఖ్యంగా, ఇది సకాలంలో ఉందా లేదా అనే దానిని మీరు చూడాలి. ఒకవేళ సత్యం ఉన్నట్లయితే, అది మనుష్యులను సాధారణ మరియు నిజమైన అనుభవాలలోనికి నడిపిస్తుంది; అప్పుడు, మనుష్యులు మరింత ఎక్కువగా, ఎప్పుడూ లేనంత సాధారణంగా మారతారు, వారి మానవజ్ఞానం మరింత పరిపూర్ణంగా మారుతుంది, శరీర రూపంలోని వారి జీవితము మరియు వారి ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఎక్కువగా క్రమానుసారంగా అవుతుంది మరియు వారి ఉద్వేగాలు మరింత సాధారణంగా ఉంటాయి. ఇది రెండవ సూత్రం. ఇలాంటిదే మరొక సూత్రం కూడా ఉంది, దేవుని గురించి పెరిగే జ్ఞానం మనుష్యుల్లో ఉందా, లేదా, మరియు అటువంటి కార్యము మరియు సత్యాన్ని అనుభవించడమనేది వారిలో దేవుని పట్ల ప్రేమను ప్రేరేపించగలదా, లేదా మరియు వారిని దేవునికి మరింత దగ్గర చేయగలదా, లేదా అనేది దీని క్రిందకే వస్తుంది. దీనిలో ఈమార్గము సత్యమైన మార్గమా, కాదా అని కొలవచ్చు. ఈ మార్గము అసాధారణమైన దానికంటే వాస్తవికమైనదని మరియు మానవునికి జీవితాన్ని అందిస్తుందా, లేదా అనేది చాలా ప్రాథమికమైనది. ఇది ఈ సూత్రాలకు అనుగుణంగా ఉన్నట్లయితే, ఈ మార్గము సత్యమైన మార్గము అనే ముగింపునకు రావచ్చు. భవిష్యత్తు అనుభవాలలో ఇతర మార్గాలను అంగీకరించకూడదు లేదా భవిష్యత్తులో వేరే ఒక నూతనయుగం కార్యము ఉంటుందని ఊహించకూడదని నేను మీకు ఈ మాటలు చెబుతున్నాను. ఈనాటి మార్గము సత్యమైన మార్గమని నిర్ధారించుకోవడానికి నేను వాటిని చెబుతున్నాను, కాబట్టి, ఈనాటి కార్యములో మీ నమ్మకంలో మీరు పాక్షికమైన ఖచ్చితత్వాన్ని కలిగి ఉండటమే కాక మరియు దానిలో అంతర్దృష్టిని పొందుకోలేరు. చాలామంది ఈ విషయంలో నిశ్చయంగానే ఉన్నప్పటికీ, ఇంకను గందరగోళంతోనే దానిని అనుసరించే వారు కూడా ఉన్నారు; అటువంటి నిశ్చయతకు ఎటువంటి సూత్రం లేదు, మరియు అటువంటి వ్యక్తులను త్వరగా లేదా తరువాత అయినా పరిత్యజించబడాలి. వారి అనుసరణలో పట్టుదల కలిగి వున్నవారు కూడా మూడొంతులు ఖచ్చితంగా వున్నారు మరియు ఐదొంతులు ఖచ్చితంగా లేరు, వారికి పునాది లేదని ఇది చూపిస్తుంది. మీ ప్రమాణం చాల పేలవంగా మరియు మీ పునాది చాల నిస్సారంగా వుంది, భేదమును గూర్చిన అవగాహన మీకు లేదు. దేవుడు తన కార్యమును పునరావృతం చేయడు, అయన వాస్తవం కాని కార్యమును చేయడు, మనిషి యొక్క అధిక అవసరతలను ఆయన చేయడు మరియు మానవుని జ్ఞానమునకు మించిన కార్యమును కూడా ఆయన చేయడు. అయన చేసే కార్యమంతయు మానవుని సాధారణ జ్ఞానము పరిమితిలోనే ఉంటుంది మరియు సాధారణ మానవజాతి జ్ఞానమునకు మించి ఉండదు మరియు అయన కార్యము అనేది మనిషి సాధారణ అవసరతలకు అనుగుణంగా ఉంటుంది. అది పరిశుద్దాత్మ కార్యమైనప్పుడు, ప్రజలు ఇంకా సాధారణంగా వుంటారు మరియు వారి మానవధర్మం ఇంకా సాధారణంగా ఉంటుంది. ప్రజలు తమ దుష్టమైన స్వభావం గురించి పెరుగుతున్న జ్ఞానాన్ని పొందుకుంటారు మరియు మనిషి సారం గురించి, మరియు వారు సత్యం కొరకు మరింత ఎక్కువ వాంఛను కూడా పొందుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే, మనిషి జీవితం పెరుగుతుంది మరియు మరింతగా పెరుగుతుంది మరియు మానవుని అవినీతి స్వభావం మారింతగా మారే సామర్థ్యం ఏర్పడుతుంది—అంటే, దేవుడు మనిషి జీవితంగా మారిపోవడమే దీనంతటికీ కారణం. మనిషి తత్వానికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయలేని మార్గం ఉన్నట్లయితే, మనిషి స్వభావాన్ని మార్చగలిగే సామర్థ్యము లేనట్లయితే, మనుష్యులను దేవుని యొద్దకు తీసుకురావటం లేదా దేవుని గూర్చిన నిజమైన అవగాహనను వారికి ఇవ్వగలిగే సామర్థ్యం లేనట్లయితే మరియు వారి మానవత్వం మరింత తక్కువగా మారడం మరియు వారి జ్ఞానం మరింత అసాధారణంగా మారడానికి కారణం అయినట్లయితే, అప్పుడు ఈ మార్గము నిజమైన మార్గము కాకూడదు, అది దురాత్మ పని కావచ్చు, లేదా పాత మార్గము కావచ్చును. క్లుప్తంగా చెప్పాలంటే, అది పరిశుద్ధాత్మ ప్రస్తుత కార్యం కాదు. ఇన్ని సంవత్సరాలు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, అయినప్పటికీ నిజమైన మార్గము మరియు అబద్ధ మార్గము మధ్య తేడా మరియు నిజమైన మార్గాన్ని పొందుకొనడానికి కావలసిన సూత్రముల సూచనలను మీ వద్ద లేవు. చాలామంది ఈ విషయాలలో కనీసం ఆసక్తి కూడా లేదు; ఇలాంటివారందరూ అధిక సంఖ్యాకులు ఎక్కడికి వెళతారో అక్కడికి వెళ్తారు మరియు అధిక సంఖ్యాకులు చెప్పిందే వీళ్లూ పునరావృతం చేస్తారు. అయితే, నిజమైన మార్గాన్ని కోరుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? మరియు అటువంటి వ్యక్తులు నిజమైన మార్గాన్ని ఎలా కనుగొంటారు? అనేకమైన ఈ ప్రాథమిక సూత్రాలను మీరు గ్రహించగలిగితే, ఏది జరిగినను, మీరు మోసపరచబడరు. నేడు, విషయాల మధ్య వ్యత్యాసాలు చూడగలగడం అనేది చాలా ముఖ్యమైనది; సాధారణ మానవజాతి కలిగి ఉండాల్సింది ఇదే; మరియు వారి అనుభవంలో తప్పనిసరిగా ఉండాల్సింది ఇదే. ఈ రోజుకీ మనుష్యులు వారి అనుసరణలో దేనిని గుర్తించలేకపోతే, వారి మానవజ్ఞానం పెరగనట్లయితే, అప్పుడు మనుష్యులు మూర్ఖులుగా ఉండడమే కాకుండా వారి అన్వేషణ కూడా తప్పుగా ఉంటుంది మరియు అది దారి తప్పుతుంది. ఈ రోజు, మీ అన్వేషణలో చిన్న తేడా కూడా లేకుండా, అది పూర్తిగా సత్యమైనప్పుడు, మీరు దానిని పొందుకున్నారా? మీరు దేనినైనా వేరు చేయగలుగుతున్నారా? నిజమైన మార్గము యొక్క సారము ఏమిటి? నిజమైన మార్గములో, మీరు నిజమైన మార్గాన్ని పొందుకోరు; మీరు సత్యములో దేనిని పొందుకోలేరు. చెప్పాలంటే, దేవునికి అవసరమైన దానిని మీరు సాధించలేదు మరియు ఆవిధముగా మీ అవినీతిలో ఎలాంటి మార్పు లేదు. మీరు ఈదారిలోనే అన్వేషణని కొనసాగించినట్లయితే, తుదకు మీరు పరిత్యజించబడుతారు. ఈనాటి వరకు అనుసరించిన తరువాత, మీరు ఎంచుకున్న మార్గం సరియైనదని మీరు ఖచ్చితంగా ఉండాలి, మరియు తదుపరి అనుమానాలు ఉండకూడదు. చాలామంది అనిశ్చితితో వుంటారు మరియు చిన్న విషయాలకే సత్యాన్ని అనుసరించడం మానేస్తారు. అటువంటి మనుష్యులు దేవుని కార్యమునకు సంబంధించిన జ్ఞానమును కలిగి వుండరు; వారు ఎలాంటివారు అంటే, గందరగోళంలో దేవుని అనుసరిస్తారు. దేవుని కార్యము గురించి తెలియని వారు అయన సన్నిహితులుగా ఉండలేరు, లేదా ఆయనకు సాక్ష్యమివ్వలేరు. ఆశీర్వాదాలు మాత్రమే కోరుకునే వారికి, అస్పష్టంగా, నిరాకారంగా ఉన్న సత్యాన్ని వీలైనంత త్వరగా కొనసాగించాలని మాత్రమే నేను సలహా ఇస్తాను, తద్వారా వారి జీవితానికి అర్థం దొరకవచ్చు. ఇకపై మిమ్మల్ని మీరు ఎంతమాత్రమూ మోసపరచుకోవద్దు!

మునుపటి:  ఒక వ్యక్తి తన ఆలోచనలలో దేవునికి సరిహద్దులు పెట్టుకున్నప్పుడు అతడు దేవుని ప్రత్యక్షతలను ఎలా పొందుకోగలడు?

తరువాత:  శరీరధారి అయిన దేవుని పరిచర్య మరియు మానవుని కర్తవ్యం మధ్య గల వ్యత్యాసము

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger