శరీరంతో ఉన్న వారెవరూ ఆగ్రహ దినం నుండి తప్పించుకోలేరు

నా కార్యము సజావుగా సాగిపోవడానికి మరియు అన్ని దేశాలు మరియు జాతుల ప్రజలకు నా వాక్యములు, అధికారం, మహత్యం మరియు తీర్పును వెల్లడిస్తూ నా ప్రారంభ కార్యాన్ని విశ్వమంతటా మరింత సముచితంగా మరియు పరిపూర్ణంగా నిర్వహించబడటానికి, మీ సొంత మనుగడ కోసం నేను మిమ్మల్ని ఈ రోజు ఇలా హెచ్చరిస్తున్నాను. మీ మధ్య నేను చేసే కార్యము మొత్తం విశ్వమంతటా నా కార్యానికి నాంది. ఇది ఇప్పటికే అంత్యకాలపు సమయం అయినప్పటికీ, “అంత్యకాలము” అనేది ఒక కాలము పేరు మాత్రమే అని తెలుసుకోండి; న్యాయకాలము మరియు కృపాకాలము లాగా, ఇది ఒక కాలాన్ని సూచిస్తుంది మరియు ఇది కొన్ని అంతిమ సంవత్సరాలు లేదా నెలలను కాకుండా మొత్తం కాలాన్ని సూచిస్తుంది. అంతేగాకుండా, అంత్యకాలము అనేది కృపాకాలము మరియు న్యాయకాలమునకు చాలా భిన్నంగా ఉంటుంది. విశ్వమంతటా నా మహిమ జగత్తు మరియు ఆకాశాన్ని నింపగలిగేలా అంత్యకాలపు కార్యము ఇశ్రాయేలులో కాకుండా అన్యుల మధ్య నిర్వహించబడుతుంది; ఇది ఇశ్రాయేలు వెలుపల నా సింహాసనం ముందున్న అన్ని దేశాలు మరియు తెగల ప్రజల విజయం. ఇది ఎందుకంటే, నేను గొప్ప మహిమను పొందగలగడానికి, భూమిపై ఉన్న సమస్త జీవులు నా మహిమను ప్రతి జాతికి, చిరస్థాయిగా రాబోయే తరాలకు అందజేయగలగడానికి, నేను భూమి మీద సాధించిన మహిమనంతా పరలోకము మరియు భూమిపై ఉన్న సమస్త జీవులు చూడగలగడానికి. అంత్యకాలపు సమయములో చేసే కార్యము విజయపు కార్యము. ఇది భూమిపై ఉన్న ప్రజలందరి జీవితాల మార్గదర్శకం కాదు కానీ, భూమిపై ఉన్న మనుష్యుల అంతులేని, వేలాది యుగాల బాధలతో నిండిన జీవితాలకు ముగింపు లాంటిది. ఫలితంగా, అంత్యకాలపు కార్యము ఇశ్రాయేలులో అనేక వేల సంవత్సరాల కార్యములాగా ఉండకూడదు లేదా దేవుని రెండవ అవతారం వరకు రెండు సహస్రాబ్దాలు యూదయలో కొనసాగిన కేవలం అనేక సంవత్సరాల కార్యమువలె ఉండకూడదు. అంత్యకాలపు మనుష్యులు దేహరూపుడైన విమోచకుని పునఃదర్శనం మాత్రమే చూస్తారు మరియు వారు దేవుని వ్యక్తిగత కార్యము మరియు వాక్యములను పొందుతారు. అవి చివరి దినాలు ముగియడానికి ముందు రెండువేల సంవత్సరాలు ఉండవు; అవి స్వల్ప సమయమే ఉంటాయి, అవి యూదయలో కృపాకాలపు కార్యాన్ని యేసు నిర్వహించిన సమయం లాంటిది. ఎందుకంటే, చివరి దినాలు అనేవి మొత్తం యుగం యొక్క ముగింపు. అవి దేవుని ఆరు-వేల-సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక యొక్క పూర్తి మరియు ముగింపు, అవి బాధలతో నిండిన మనుష్యుల జీవిత ప్రయాణానికి ముగింపు పలుకుతాయి. అవి మనుష్యులందరినీ నూతన యుగంలోకి తీసుకెళ్లవు లేదా మనుష్యుల జీవితం కొనసాగడానికి అనుమతించవు; అవి నా నిర్వహణ ప్రణాళికకు లేదా మనిషి ఉనికికి ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వవు. మానవాళి ఇలాగే కొనసాగితే, అప్పుడు ముందో వెనకో వారు పూర్తిగా అపవాదిచే కబళించబడతారు మరియు చివరికి దాని చేతుల్లో నాకు చెందిన ఆత్మలు నాశనం చేయబడతాయి. నా కార్యము కేవలం ఆరు వేల సంవత్సరాలు మాత్రమే ఉంటుంది మరియు మొత్తం మానవాళిపై దుష్టుని నియంత్రణ ఆరు వేల సంవత్సరాలకు దాటి కొనసాగదని నేను వాగ్దానం చేశాను. కాబట్టి, ఇప్పుడు సమయం అయిపోయింది. నేను ఇక ఏమాత్రం కొనసాగించను లేదా జాప్యం చేయను: చివరి దినాలలో నేను సాతానును ఓడిస్తాను, నా మహిమనంతా వెనక్కు తీసుకుంటాను మరియు దుఃఖంతో ఉన్న ఆత్మలు బాధల సముద్రం నుండి తప్పించుకోగలిగేలా నేను భూమిపై ఉన్న నాకు చెందిన ఆత్మలన్నిటినీ నేను తిరిగి నా వద్దకు తీసుకుంటాను, ఈ విధంగా భూమిపై నా కార్యము యావత్తూ ముగుస్తుంది. ఈ రోజు నుండి మొదలుపెట్టి, నేను మళ్ళీ ఎప్పుడూ భూమిపై శరీరధారిగా అవతరించను మరియు సమస్తాన్ని నియంత్రించే నా ఆత్మ మళ్లీ ఎప్పుడూ భూమిపై పని చేయదు. నేను భూమిపై ఒకటి మాత్రమే చేస్తాను: నేను మానవాళిని, పవిత్రమైన మానవాళిని మరియు భూమిపై నాకు విశ్వాసపాత్రంగా ఉండే నగరాన్ని పునర్నిర్మిస్తాను. కానీ, నేను ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయనని, సమస్త మానవాళిని నాశనం చేయనని తెలుసుకోండి. మిగిలిన ఆ మూడవ భాగాన్ని అంటే నన్ను ప్రేమించే మరియు నేను పూర్తిగా జయించిన మూడవ భాగాన్ని నేను అలాగే కొనసాగిస్తాను—మరియు న్యాయానికి లోబడి విస్తారమైన గొర్రెలు మరియు పశుసంపద నుండి పోషణ పొందుతూ అభివృద్ధి చెందిన సరిగ్గా ఇశ్రాయేలీయులలాగే, ఈ మూడవ భాగాన్ని భూమిపై ఫలవంతం మరియు వృద్ధి చేస్తాను. ఈ మానవజాతి ఎప్పటికీ నాతోనే ఉంటుంది, అయితే అది ఈనాటి శోచనీయమైన అశుద్ధముగా వుండే మానవజాతి కాదు, కానీ నా నుండి లబ్ది పొందిన వారందరితో కూడిన మానవజాతి. అలాంటి మానవజాతి సాతానుచే చెరపబడదు, ఆటంకపర్చబడదు లేదా కబళించబడదు మరియు నేను సాతానును జయించిన తర్వాత భూమిపై ఉండే ఏకైక మానవజాతి అదే అవుతుంది. అది ఈ రోజు నా చేత జయించబడిన మరియు నా వాగ్దానాన్ని పొందిన మానవజాతి. కాబట్టి, చివరి దినాల సమయంలో జయించబడిన మానవజాతి కూడా మిగిల్చబడుతుంది మరియు నా శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందుతుంది. ఇది సాతానుపై నా విజయానికి ఏకైక సాక్ష్యంగా మరియు సాతానుతో నా యుద్ధం నుండి ఏకైక కొల్లగొట్టినదిగా ఉంటుంది. యుద్ధం నుండి కొల్లగొట్టబడిన వీరందరూ సాతాను రాజ్యము నుండి నాచే రక్షణ పొందారు మరియు అదే నా ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక యొక్క ఏకైక స్ఫటికీకరణము మరియు ఫలం. వారు విశ్వంలోని ప్రతి దేశం మరియు జాతి నుండి, ప్రతి చోటు మరియు దేశం నుండి వస్తారు. వారు విభిన్న తెగలకు చెందినవారు, విభిన్న భాషలు, ఆచారాలు మరియు చర్మపు రంగులను కలిగి ఉంటారు మరియు వారు ప్రపంచంలోని ప్రతి దేశం, జాతి మరియు ప్రపంచంలోని ప్రతి మూలలో కూడా వ్యాపించి ఉంటారు. చివరకు, వారు ఒక సంపూర్ణ మానవజాతిని, సాతాను శక్తులు చేరుకోలేని మనుష్యుల సమూహాన్ని ఏర్పరచడానికి ఒక్కటి అవుతారు. మానవజాతిలో నాచే రక్షించబడని మరియు జయించబడని వారు నిశ్శబ్దంగా సముద్రపు అగాధాలలోకి మునిగిపోతారు మరియు నా దహించే జ్వాలలచే శాశ్వతంగా కాల్చివేయబడతారు. నేను ఈజిప్టులోని జ్యేష్ఠ కుమారులను మరియు పశువులను నాశనం చేసినట్లే, ఈ పాత, అత్యంత అశుద్ధమైన మానవజాతిని నేను నాశనం చేస్తాను, గొర్రెపిల్ల మాంసం తిన్న, గొర్రెపిల్ల రక్తాన్ని తాగిన మరియు తమ ఇంటి దర్వాజలకు గొర్రెపిల్ల రక్తం రాసిన ఇశ్రాయేలీయులను మాత్రమే వదిలివేస్తాను. వారు నాచే జయించబడి, నా కుటుంబానికి చెందిన వారై మరియు నేనే అయిన గొర్రెపిల్ల మాంసాన్ని తిని, నేనే అయిన గొర్రెపిల్ల రక్తాన్ని తాగి, నాచే విడిపించబడి నన్ను ఆరాధించే మనుష్యులు కాదా? అలాంటి వారికి ఎల్లప్పుడూ నా మహిమ తోడు ఉండదా? నేను అనే గొర్రెపిల్ల మాంసం లేనివారు ఇప్పటికే నిశ్శబ్దంగా సముద్రపు అగాధాల్లో మునిగిపోలేదా? ఈ రోజు మీరు నన్ను వ్యతిరేకిస్తారు మరియు ఈ రోజు నా మాటలు ఇశ్రాయేలు కుమారులు మరియు మనవళ్లతో యెహోవా చెప్పినట్లుగానే ఉన్నాయి. అయినప్పటికీ, మీ హృదయాల లోతుల్లోని కాఠిన్యం నా ఉగ్రత పెరిగేలా చేస్తున్నది, మీ శరీరానికి మరింత బాధను, మీ పాపాలకు మరింత తీర్పును మరియు మీ అవినీతికి మరింత ఆగ్రహాన్ని తెస్తున్నది. ఈ రోజు మీరు నాతో ఇలా వ్యవహరించినప్పుడు, నా ఉగ్రత రోజునుండి ఎవరు తప్పించుకోగలరు? ఎవరి అవినీతి నా దండన నుండి తప్పించుకోగలదు? సర్వశక్తిమంతుడినైన నా చేతుల నుండి ఎవరి పాపాలు తప్పించుకోగలవు? సర్వశక్తిమంతుడినైన నా తీర్పు నుండి ఎవరి ఉల్లంఘన తప్పించుకోగలదు? యెహోవా అయిన నేను, అన్యుల కుటుంబ వారసులైన మీతో ఈ విధంగా చెప్పుచున్నాను మరియు నేను మీతో మాట్లాడే మాటలు న్యాయకాలము మరియు కృపాకాలము యొక్క అన్ని మాటలను అధిగమిస్తాయి, అయినప్పటికీ మీరు ఈజిప్టు ప్రజలందరి కంటే కాఠిన్యంతో ఉన్నారు. నేను నిశ్చయంగా నా కార్యము చేస్తున్నందున మీరు నా ఆగ్రహాన్ని నిల్వచేసుకోవడం లేదా? సర్వశక్తిమంతుడినైన నా రోజు నుండి మీరు హానిపొందకుండా ఎలా తప్పించుకోగలరు?

నేను మీ మధ్య ఈ విధంగా పని చేశాను మరియు మాట్లాడాను, నేను చాలా శక్తిని మరియు కృషిని వెచ్చించాను, అయినప్పటికీ మీకు నేను స్పష్టంగా చెప్పేది మీరు ఎప్పుడు విన్నారు? సర్వశక్తిమంతుడినైన నాకు మీరు ఎక్కడ మోకరిల్లారు? మీరు నాతో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీరు చెప్పే మరియు చేసే ప్రతిదీ ఎందుకు నాలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది? మీ హృదయాలు ఎందుకు అంత కఠినంగా ఉన్నాయి? నేనెప్పుడైనా మిమ్మల్ని పడగొట్టానా? నాకు విచారం మరియు ఆందోళన కలిగించేది తప్ప మరేదీ మీరు ఎందుకు చేయరు? యెహోవా అయిన నా ఉగ్రత దినం మీ మీదకు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారా? మీ అవిధేయతతో రెచ్చగొట్టబడిన ఆగ్రహాన్ని నేను పంపడం కోసం మీరు వేచి ఉన్నారా? నేను చేసేదంతా మీ కోసం కాదా? అయినప్పటికీ మీరు యెహోవా అయిన నాతో ఈ విధంగా ప్రవర్తించారు: నా బలులను దొంగిలించడం, నా బలిపీఠంలోని అర్పణలను తోడేళ్ల పిల్లలకు మరియు పిల్లల పిల్లలకు తినిపించడానికి తోడేలు గుహకు తీసుకెళ్లడం; మనుష్యులు ఒకరికికొకరు వ్యతిరేకంగా పోరాడుతారు, కోపపు చూపులు, కత్తులు మరియు బరిశెలతో ఒకరినొకరు ఎదుర్కొంటారు, సర్వశక్తిమంతుడినైన నా మాటలను మలం లాగా అశుద్ధంగా మారడానికి మరుగుదొడ్డిలోకి విసిరివేస్తారు. మీ నిజాయితి ఎక్కడ ఉంది? మీ మానవత్వం మృగత్వంగా మారిపోయింది! మీ హృదయాలు చాలా కాలం నుండి రాతి శిలగా మారాయి. ఈ రోజు సర్వశక్తివంతుడనైన నాకు వ్యతిరేకంగా మీరు చేసే చెరుపుకు నేను తీర్పునిచ్చే సమయమే నా ఉగ్రత దినం వచ్చే సమయమని మీకు తెలియదా? నన్ను ఇలా మోసం చేయడం ద్వారా, నా మాటలను బురదలోనికి విసిరేయడం ద్వారా మరియు వాటిని వినకుండా ఉండటం ద్వారా—నా వెనుక ఇలా వ్యవహరించడం ద్వారా మీరు నా ఆగ్రహంతో కూడిన చూపుల నుండి తప్పించుకోగలరని మీరు అనుకుంటున్నారా? మీరు నా బలులను దొంగిలించినప్పుడు మరియు నా ఆస్తులను ఆకాంక్షించినప్పుడు, యెహోవా అయిన నా కళ్లతో ఇప్పటికే మిమ్మల్ని చూశానని మీకు తెలియదా? మీరు నా బలులను దొంగిలించినప్పుడు, బలులను అర్పించిన బలిపీఠం ముందు మీరు అలా చేశారని మీకు తెలియదా? ఈ విధంగా నన్ను మోసం చేసేటంత తెలివైనవారమని మిమ్మల్ని మీరు ఎలా నమ్ముగలరు? మీ ఘోరమైన పాపాల నుండి నా ఆగ్రహం ఎలా తొలగిపోగలదు? మీ చెడు పనులను నా రగులుతున్న ఆగ్రహం ఎలా వదిలివేయగలదు? ఈ రోజు మీరు చేసే చెడు మీకు ఒక మార్గాన్ని తెరవదు, కానీ మీ రేపటి రోజు కోసం దండనను నిల్వ చేస్తుంది; ఇది మీ పట్ల సర్వశక్తిమంతుడినైన నా దండనను రేకెత్తిస్తుంది. మీ చెడు చేతలు మరియు చెడు మాటలు నా దండన నుండి ఎలా తప్పించుకోగలవు? మీ ప్రార్థనలు నా చెవులకు ఎలా చేరగలవు? మీ అవినీతికి మార్గాన్ని నేను ఎలా తెరవగలను? నన్ను ధిక్కరించడంలో మీ చేసిన చెడు పనులను నేను ఎలా వదిలివేయగలను? పాములాగా విషపూరితమైన మీ నాలుకలను నేను ఎలా కోసివేయకుండా ఉండగలను? మీ నీతి కోసం మీరు నన్ను పిలవరు, దానికి బదులుగా మీ అనీతి ఫలితంగా నా ఆగ్రహాన్ని నిల్వ చేసుకుంటారు. నేను మిమ్మల్ని ఎలా క్షమించగలను? సర్వశక్తిమంతుడినైన నా దృష్టిలో మీ మాటలు మరియు చేతలు అశుద్ధమైనవి. సర్వశక్తిమంతుడినైన నా దృష్టిలో, కర్కశమైన దండనగా మీ అవినీతిని చూడండి. నా నీతివంతమైన దండన మరియు తీర్పు మీ నుండి ఎలా తప్పిపోగలదు? మీరు నాకు దుఃఖం మరియు ఆగ్రహం కలగజేస్తూ ఇలా చేస్తున్నారు కాబట్టి, నేను మిమ్మల్ని నా చేతుల నుండి తప్పించుకునేలా ఎలా చేయగలను మరియు యెహోవా అయిన నేను మిమ్మల్ని దండించి, శపించే రోజు నుండి ఎలా తప్పించగలను? మీ అన్ని చెడు మాటలు మరియు ఉచ్చారణలు ఇప్పటికే నా చెవులను చేరాయని మీకు తెలియదా? మీ అవినీతి ఇప్పటికే నా పరిశుద్ధమైన నీతి వస్త్రాన్ని కప్పివేసిందని మీకు తెలియదా? మీ అవిధేయత ఇప్పటికే నా తీవ్ర ఆగ్రహాన్ని రెచ్చగొట్టిందని మీకు తెలియదా? మీరు చాలా కాలం నుండి నేను కుంగిపోయేలా చేశారని మరియు చాలా కాలం నుండి నా సహనాన్ని పరీక్షించారని మీకు తెలియదా? మీరు ఇప్పటికే నా దేహాన్ని దెబ్బతీసి, దానిని గుడ్డపీలికలుగా మార్చారని మీకు తెలియదా? మీ పట్ల నా ఆగ్రహాన్ని, సహనాన్ని ఇక ఏమాత్రం వదిలివేయలేనంతగా ఇప్పటివరకు నేను సహించాను. మీ చెడు పనులు నా దృష్టికి ఇప్పటికే చేరాయని మరియు నా రోదనలు ఇప్పటికే నా తండ్రి చెవులను చేరాయని మీకు తెలియదా? మీరు నాతో ఇలా వ్వహరించడాన్ని ఆయన ఎలా అనుమతించగలడు? నేను మీలో చేసే ఏదైనా పని మీ కోసం కాదా? అయితే, యెహోవా అయిన నా పనిని మీలో ఎవరు ఎక్కువగా ప్రేమించారు? నేను బలహీనుడిని కాబట్టి మరియు నేను అనుభవించిన వేదన కారణంగా నేను నా తండ్రి చిత్తానికి ద్రోహం చేయగలనా? మీరు నా హృదయాన్ని అర్థం చేసుకోలేదా? నేను మీతో యెహోవాలాగా మాట్లాడుతాను; నేను మీ కోసం చాలాఅంకితమై లేనా? నా తండ్రి కార్యము కోసం నేను ఈ బాధలన్నింటినీ సహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నా బాధలకు ప్రతిఫలంగా నేను మీకు ఇవ్వబోయే దండన నుండి మీరు ఎలా విముక్తి పొందగలరు? మీరు నా నుండి ఎంతో ఆనందం పొందలేదా? ఈ రోజు, నేను మీకు నా తండ్రి ద్వారా ప్రసాదించబడ్డాను; మీరు నా ఉదారమైన వాక్యముల కంటే ఎంతో ఎక్కువ ఆనందించారని మీకు తెలియదా? మీ జీవితం మరియు మీరు ఆనందించే విషయాల కోసం నా జీవితం బదులు ఇవ్వబడిందని మీకు తెలియదా? సాతానుతో యుద్ధం చేయడానికి నా తండ్రి నా జీవితాన్ని ఉపయోగించాడనీ మరియు మీరు వందరెట్లు పొందేలా మరియు ఎన్నో ప్రలోభాలను తప్పించుకునేలా చేస్తూ ఆయన నా జీవితాన్ని మీకు ప్రసాదించాడని మీకు తెలియదా? నా కార్యము ద్వారా మాత్రమే మీరు అనేక ప్రలోభాల నుండి మరియు అనేక జ్వలించే దండనల నుండి మినహాయించబడ్డారని మీకు తెలియదా? ఇప్పటి వరకు మీరు ఆనందించడానికి నా తండ్రి మిమ్మల్ని అనుమతించడం నా వల్లనేనని మీకు తెలియదా? అది మీ హృదయాలు మొద్దుబారి పోయాయా అన్నట్లు, ఈరోజు మీరు అంత కఠినంగా మరియు లొంగకుండా ఎలా ఉండగలరు? ఈరోజు మీరు చేసే చెడు, భూమి నుండి నా నిష్క్రమణ తర్వాత వచ్చే ఆగ్రహం రోజు నుండి ఎలా తప్పించుకోగలదు? ఇంత కఠినమైన మరియు లొంగని వారిని యెహోవా ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి నేను ఎలా అనుమతించగలను?

గతం గురించి ఆలోచించు: మీ పట్ల నా చూపు ఎప్పుడు కోపంగా ఉండినది మరియు నా స్వరం ఎప్పుడు కఠినంగా ఉండినది? నేను మీతో ఎప్పుడు వాదులాడాను? నేను మిమ్మల్ని అసమంజసంగా ఎప్పుడు నిందించాను? నేను మిమ్మల్ని మీ ముఖం మీద ఎప్పుడు నిందించాను? ప్రతీ ప్రలోభం నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి నేను నా తండ్రిని పిలవడం నా కార్యము కోసం కాదా? మీరు నాతో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీ దేహాన్ని పడగొట్టడానికి నేను ఎప్పుడైనా నా అధికారాన్ని ఉపయోగించానా? మీరు ఈ విధంగా నాపై ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు? మీరు నా పట్ల నిరంతరం మనసు మార్చుకున్న తర్వాత, మీరు ఎలాంటి భావన లేకుండా ఉన్నారు, ఆ తర్వాత మీరు నన్ను మోసపుచ్చడానికి మరియు నా నుండి విషయాలను దాచడానికి ప్రయత్నిస్తారు మరియు మీ నోళ్ల నిండా అవినీతి ఉమ్మి ఉంది. మీ నాలుకలు నా ఆత్మను మోసం చేయగలవని మీరనుకుంటున్నారా? మీ నాలుకలు నా ఆగ్రహాన్ని తప్పించుకోగలవని మీరనుకుంటున్నారా? మీ నాలుకలు, వాటికి ఇష్టమొచ్చినట్టుగా, యెహోవా అయిన నా కార్యాలకు తీర్పు చెప్పవచ్చని మీరు అనుకుంటున్నారా? మనిషి చేత తీర్పు చెప్పించుకునే దేవుడిని నేనేనా? ఈ విధంగా నన్ను దైవదూషణ చేయడానికి ఒక చిన్న క్రిమినైనా నేను అనుమతించగలనా? అలాంటి అవిధేయులైన కుమారులను నేను నా శాశ్వతమైన ఆశీర్వాదాలలో ఎలా ఉంచగలను? మీ మాటలు మరియు చర్యలు చాలా కాలం నుండి మిమ్మల్ని బట్టబయలుచేసి ఖండించాయి. నేను పరలోకాలను మీ ముందు పరిచి, సమస్తమును సృష్టించినప్పుడు, నా కార్యమునకు మరియు నా నిర్వహణకు అవి కోరుకున్నట్లు ఆటంకం కలిగించడానికి అనుమతించే మాట అటుంచి, వాటి ఇష్టానుసారంగా పాల్గొనడానికి నేను ఏ జీవిని అనుమతించలేదు. నేను ఏ మనుష్యుని లేదా వస్తువును సహించలేదు; అలాంటిది నా పట్ల క్రూరమైన మరియు అమానవీయమైన వారిని నేను ఎలా వదిలివేయగలను? నా వాక్యములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని నేను ఎలా క్షమించగలను? నాకు విధేయత చూపని వారిని నేను ఎలా వదిలివేయగలను? మనిషి తలరాత సర్వశక్తిమంతుడినైన నా చేతులలో లేదా? మీ అవినీతి మరియు అవిధేయతను నేను ఎలా పరిశుద్ధమైనవిగా భావించగలను? మీ పాపాలు నా పరిశుద్ధతను ఎలా అపవిత్రం చేస్తాయి? అవినీతి కల్మషం వల్ల నేను అపవిత్రం కాను, లేదా అవినీతి అర్పణలను నేను ఆస్వాదించను. మీరు యెహోవా అయిన నా పట్ల విశ్వాసంతో ఉన్నట్లయితే, నా బలిపీఠం వద్ద బలిని మీకు మీరుగా తీసుకోగలరా? నా పరిశుద్ధ నామాన్ని దూషించడానికి మీరు మీ విషపూరితమైన నాలుకను ఉపయోగించగలరా? ఈ విధంగా మీరు నా వాక్యములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగలరా? మీరు నా మహిమను మరియు పరిశుద్ధ నామాన్ని ఆ చెడు సాతానుకు సేవ చేసే సాధనంగా ఉపయోగించగలరా? నా జీవితం పరిశుద్ధుల ఆనందం కోసం అందించబడింది. మీకు ఇష్టం వచ్చిట్లుగా నా జీవితంతో ఆడుకోవడానికి మరియు మీ మధ్య సంఘర్షణకు ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి నేను నిన్ను ఎలా అనుమతించగలను? మీరు నా పట్ల ఎలా ఉన్నారు అనే విషయంలో, మీరు అంత నిర్దయగా మరియు మంచి మార్గాన్ని అంతగా తప్పిపోయి ఎలా ఉండగలరు? నేను ఇప్పటికే మీ చెడు పనులను ఈ జీవిత వాక్యములలో రాసుకున్నట్లు మీకు తెలియదా? నేను ఈజిప్టును దండించినప్పుడు మీరు ఆగ్రహ దినం నుండి ఎలా తప్పించుకోగలరు? ఈ విధంగా, మీరు నన్ను పదే పదే వ్యతిరేకించడానికి మరియు ధిక్కరించడానికి నేను మిమ్మల్ని ఎలా అనుమతించగలను? నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, ఆ రోజు వచ్చినప్పుడు, మీ దండన ఆ ఈజిప్టు దండన కంటే అత్యంత భరించరానిదిగా ఉంటుంది! నా ఆగ్రహ దినం నుండి మీరు ఎలా తప్పించుకోగలరు? నేను మీకు నిజంగా చెబుతున్నాను: నా సహనం మీ చెడు పనుల కోసం సిద్ధం చేయబడింది మరియు ఆ దినాన మీ దండన కోసం ఉనికిలో ఉంటుంది. నేను నా సహనం కోల్పోయిన తర్వాత ఉగ్ర తీర్పును అనుభవించేవారు మీరు కాదా? సమస్తమూ ఉన్నది సర్వశక్తిమంతుడినైన నా చేతిలో కాదా? భూమిపై ఈ విధంగా నాకు అవిధేయత చూపడానికి నేను మిమ్మల్ని ఎలా అనుమతించగలను? మీ జీవితం చాలా కష్టంగా ఉండబోతుంది, ఎందుకంటే ఆయన వస్తాడు, ఇంతవరకు ఎప్పుడూ రాలేదు అని ఎవరి గురించి అయితే చెబుతారో ఆ మెస్సీయను మీరు కలుసుకున్నారు. మీరు ఆయన శత్రువులు కాదా? మీతో యేసు స్నేహంగా ఉన్నాడు, అయినప్పటికీ మీరు మెస్సీయకు శత్రువులు. మీరు యేసుతో స్నేహంగా ఉన్నప్పటికీ, మీ చెడు పనులు అసహ్యమైన వారి పాత్రలను నింపాయని మీకు తెలియదా? మీరు యెహోవాకు చాలా సన్నిహితులు అయినప్పటికీ, మీ చెడు మాటలు యెహోవా చెవులకు చేరాయని మరియు ఆయన ఆగ్రహాన్ని రెచ్చగొట్టాయని మీకు తెలియదా? ఆయన మీకు సన్నిహితంగా ఎలా ఉండగలడు మరియు చెడు పనులతో నిండిన మీ పాత్రలను కాల్చివేయకుండా ఆయన ఎలా ఉండగలడు? ఆయన మీ శత్రువు కాకుండా ఎలా ఉండగలడు?

మునుపటి:  రాలిన ఆకులు వాటి మూలాల వద్దకు తిరిగి వచ్చినప్పుడు, నీవు చేసిన చెడు పనులకు నీవు చింతిస్తావు

తరువాత:  రక్షకుడు ఇప్పటికే “తెల్లటి మేఘం” మీద తిరిగి వచ్చాడు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger