సాధారణ ఆధ్యాత్మిక జీవితం ప్రజలను సరియైన మార్గములోనికి నడిపిస్తుంది

దేవునియందు ఒక విశ్వాసి నడవవలసిన మార్గములో కొంతమట్టుకు మాత్రమే మీరు నడిచారు. ఇంకా మీరు సరియైన మార్గములోనికి ప్రవేశించవలసియున్నారు. అందుచేత, మీరు దేవుని విలువల ప్రకారముగా నడిచే మార్గానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ మీరు దేవుని విలువలకు తగినట్లుగా జీవించని స్థితిలో ఉన్నారు. మీకున్న సామర్థ్యాన్నిబట్టి, మీకున్నఅవినీతి స్వభావమునుబట్టి మీరు దేవుని పరిచర్యను నిర్లక్ష్యము చేయుచున్నారు; మీరు దేవుని పరిచర్య మీద శ్రద్ధ చూపించడములేదు. ఇదీ మీలో ఉన్నటువంటి అతి పెద్ద లోపం. పరిశుద్ధాత్ముడు నడిపించే మార్గములో నడవడానికి ఇష్టపడేవారు ఎవరూ లేరు; ఈ విషయం మీలో చాలామందికి అర్థం కాలేదు మరియు దానిని స్పష్టంగా చూడటం లేదు. అంతేగాకుండా, మీలో చాలామంది ఈ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు, దీనిని చాలా తక్కువ మంది హృదయానికి తీసుకుంటున్నారు. మీరు పరిశుద్ధాత్ముని పనిని నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తున్నట్లయితే దేవుని విశ్వాసిగా మీరు ఎన్నుకున్న మార్గమునుబట్టి మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఇందుచేతనే మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మీ స్వశక్తిచేత ఏమి చేయలేకపోవుచున్నారు మరియు ఈ కారణముచేతనే మీరు దేవునితో సరిగ్గా సహకరించలేకపోవుచున్నారు. అలాగని దేవుని కార్యము మీలో జరగలేదని లేక పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కదలించలేదని కాదు గాని మీరు పరిశుద్ధాత్ముని కార్యము మీద అంత శ్రద్ధను కనుపరచలేకపోవుచున్నారని లేక ఆయన కార్యమును నిర్లక్ష్యము చేస్తున్నారని దాని అర్థం. తక్షణమే ఇటువంటి పరిస్థితిని, లేక ఇటువంటి ధోరణిని మార్చుకొని, పరిశుద్ధాత్ముడు తన ప్రజలను నడిపించే మార్గములో నడవండి. ఇదే ఈ రోజు మనకు ముఖ్యాంశము. “పరిశుద్ధాత్ముడు నడిపించే మార్గము” అనే ఈ మాట ఆత్మయందు జ్ఞానోదయమును సంపాదించుకొనుటను, దేవుని వాక్య విషయములో జ్ఞానమును, నడిచే మార్గము విషయమై స్పష్టతను కలిగియుండుటను, అంచలంచలుగా సత్యములోనికి ప్రవేశించు సామర్థ్యమును కలిగియుండుటను మరియు దేవుని గొప్ప జ్ఞానమును కలిగియుండుటను సూచిస్తోంది. పరిశుద్ధాత్ముడు ప్రజలను నడిపించే మార్గము ప్రాథమికంగా దేవుని వాక్యమును స్పష్టముగా అర్థము చేసుకునేదిగాను, విభేదాలు మరియు అపార్థములు లేనటువంటిదిగాను ఉంటుంది. ఆ మార్గమందు నడుచువారందరూ ఆ మార్గముతోపాటు నేరుగా నడుస్తారు. ఈ మార్గమందు నడవాలంటే, మీరు దేవునితో సమాధానము కలిగి జీవించవలసి ఉంటుంది, అభ్యసించడానికి సరియైన మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది మరియు పరిశుద్ధాత్మునిచేత నడిపించబడే మార్గమందు నడవవలసి ఉంటుంది. ఇందులో మనిషి అందించు సహకారము ఉంటుంది: అదేమనగా, దేవునిని కలవడానికి దేవుడు మీ నుండి ఎదురు చూసేవాటిని ఖచ్చితంగా చేయాలి మరియు దేవునియందలి విశ్వాసముగల సరియైన మార్గములోనికి ప్రవేశించడానికి మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి.

పరిశుద్ధాత్ముడిచేత నడిపించబడే మార్గములో అడుగుపెట్టడమనేది కొంత క్లిష్టకరమైన విషయమే గానీ మీరు ఆ మార్గమందు నడవడం అభ్యాసము చేసే కొలది, అది స్పష్టంగా మీకు అర్థమయ్యే కొలది అది మీకు చాలా సులభమైన మార్గంగా మారిపోతుంది. ప్రజల నుండి దేవుడు ఏదైతే ఎదురు చూస్తున్నాడో వాటన్నిటిని చేయడానికి ప్రజలు సమర్థులు అనే విషయము సత్యము. పందులు గాలిలో ఎగరాలన్నట్లుగా ఆయన ఇక్కడ మనకు బోధించే ప్రయత్నము చేయడము లేదు. ఏ సందర్భములోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రజల సమస్యలను తీర్చి, వాటికి పరిష్కారము చూపించాలని దేవుడు ఎల్లప్పుడు ఆశ కలిగియుంటాడు. మీరందరూ ఈ విషయాన్ని బాగుగా అర్థము చేసుకోవాలి; దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. పరిశుద్ధాత్ముడు నడిచే మార్గముతోపాటు దేవుని వాక్య ప్రకారముగా ప్రజలు నడిపించబడాలి. ముందుగా చెప్పినట్లుగా, మీరు మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు నడిపించే మార్గమందు నడవడానికి ఇది మొదటి మెట్టులాంటిది. సరియైన మార్గమందు ప్రవేశించు క్రమములో మీరు దీనిని మొట్టమొదటిగా చేయవలసి కార్యమై ఉంటుంది. ఒక వ్యక్తి తన ప్రజ్ఞతో తన హృదయాన్ని దేవునికిచ్చే పనిని ఎలా జరిగిస్తాడు? మీ దైనందిన జీవితాలలో దేవుని కార్యమును అనుభవించినప్పుడు ఆయనకు ప్రార్థన చేయండి. మీరు పని చేస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే మీరు దానిని నిర్లక్ష్యంగా చేస్తున్నారని అర్థం. ఇలా చేయడమును దేవునికి మీ హృదయాన్ని ఇవ్వడమని అంటారా? మీరు ఇంటి పనుల విషయమై లేక శరీర సంబంధమైన క్రియల విషయమై ఆలోచిస్తుంటారు; మీరు ఎల్లప్పుడూ రెండు మనస్సులు కలిగియుంటారు. ఇలా ఉండడం అనేది దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని సమర్పించుకోవడమంటారా? ఇందుచేతనే మీ హృదయం ఎల్లప్పుడూ లోక వ్యవహారాలపైన కేంద్రీకరించబడియున్నది మరియు మీరు దేవుని వైపుకు తిరగలేకపోవుచున్నారు. దేవుని ఎదుట మీ హృదయం సమాధానముగా ఉండాలంటే మీరు తప్పకుండ ప్రజ్ఞతో కూడిన సహకారమును అందించాలి. మరొక విధంగా చెప్పాలంటే, మీలో ప్రతియొక్కరూ భక్తి చేయడానికి, అనగా వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, వాక్య ధ్యానము చేయడానికి తప్పకుండ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఇలా చేయాలంటే ప్రజలను, వేడుకలను మరియు ఇతర అనవసరమైన సంగతులను ప్రక్కకు పెట్టి సమయాన్ని దేవునితో గడపవలసి ఉంటుంది; మిమ్ములను మీరు కుదుట పరచుకొని దేవుని సన్నిధిలో ఉండండి. వ్యక్తిగతంగా భక్తి చేసేటప్పుడు తమకు వచ్చే ఆలోచనలను వ్రాసుకోవాలి, తమ అవగాహన లోతైనదా లేక కేవలం పైపై చూపించేదా అనే దానితో సంబంధము లేకుండా వారి ఆత్మ ఎలా కదలించబడుతోంది మరియు తమకున్న దేవుని వాక్య అవగాహనను వ్రాసుకొని భద్రపరచుకోవాలి; ప్రతియొక్కరూ దేవుని ఎదుట తమ హృదయాలను ప్రజ్ఞతోనే నిమ్మలపరచుకోవాలి. నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి మీరు ప్రతిరోజు ఒక గంట లేక రెండు గంటలు వెచ్చించగలిగితే ఆ రోజున మీ జీవితము అద్భుతంగా ఉంటుంది మరియు మీ హృదయము ప్రజ్వలముగాను, ఎంతో స్పష్టత కలిగి ఉంటుంది. ఇటువంటి జీవితము మీరు ప్రతిరోజు జీవించగలిగితే మీ హృదయము దేవుని స్వాధీనములోనికి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది, మీ ఆత్మ మరింత బలంగా మార్చబడుతుంది, మీ పరిస్థితి నిరంతరం మెరుగు పరచబడుతుంది, పరిశుద్ధాత్ముడు నడిపించే మార్గములో నడిచే శక్తిగలవారగుతారు. అంతేగాకుండా, దేవుడు మీ పైన ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రజ్ఞతో ఆస్వాదించడమే మీ ఆధ్యాత్మిక జీవితము యొక్క ఉద్దేశమైయున్నది. మరొక విధంగా చెప్పాలంటే, నియమ నిబంధలను అనుసరించి, ఆచారాలను పాటించడం కాదు గాని నిజముగా దేవునితో కలిసి పనిచేయడమునైయున్నది, నిజముగా మీ శరీరము క్రమశిక్షణలో ఉంచడమునైయున్నది—ఇదే ఒక మనిషి చేయవలసిన పనియైయున్నది, అందుచేత మీరు దీనిని అత్యంత ప్రయాసతో చేయాలి. మీరు ఎంత ఎక్కువ నిబద్ధత కలిగి, ఎంత ఎక్కువ సహకరించగలిగితే అంత ఎక్కువగా మీ హృదయం దేవుని వైపుకు మరలించబడుతుంది, అంత ఎక్కువగా మీ హృదయాన్ని దేవుని ఎదుట నిమ్మళం చేసుకోవచ్చు. ఇలా జరుగుతుండగా ఒక నిర్దిష్టమైన సమయములో దేవుడు మీ హృదయాన్ని సంపూర్ణముగా తన స్వాధీనములోనికి తీసుకుంటాడు. ఇక ఎవ్వరూ మీ హృదయాలను దొంగలించలేరు లేక నియంత్రించలేరు, అప్పుడు మీరు దేవునికి సంపూర్ణముగా చెందినవారవుతారు. మీరు ఈ మార్గములో నడిచినట్లయితే, అన్ని సందర్భాలలో దేవుని వాక్యము మీకు బయలుపరచబడుతుంది మరియు మీరు అర్థము చేసుకొనని ప్రతి విషయమును గూర్చి జ్ఞానోదయము పొందుతూనే ఉంటారు—ఇదంతయు కేవలము మీ సహకారముతోనే పొందుకుంటారు. ఇందుచేతనే, “నా ప్రకారము జీవించు వారందరిని నేను రెండంతలుగా ఆశీర్వదిస్తాను” అని దేవుడు ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటాడు. మీరు ఈ మార్గాన్ని స్పష్టంగా చూడాలి. మీరు సరియైన మార్గములో నడవడానికి ఇష్టపడినట్లయితే దేవునిని సంతోషపరిచే ప్రతి కార్యమును మీరు తప్పకుండ చేయవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకోవడానికి మీరు చేయవలసినవన్నీ తప్పకుండ చేయాలి. ఆరంభములో మీరు ఇలా నడుస్తున్నప్పుడు గొప్ప గొప్ప ఫలితాలను చూడకపోవచ్చు, అందుచేత మీరు దిగులు చెంది వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు—మీరు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి! మీరు ఎంత ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి జీవిస్తారో అంత ఎక్కువగా మీ హృదయాన్ని దేవుని మాటల చేత నింపబడుతుంది, ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన కలిగి జీవిస్తుంది, ఎల్లప్పుడూ ఈ భారమును కలిగి ఉంటుంది. దాని తరువాత, మీ ఆధ్యాత్మిక జీవితము ద్వారా మీ అంతరంగ సత్యమును దేవునికి బయలుపరచాలి; మీరు ఏమి చేయాలని ఇష్టపడుచున్నారో, మీరు దేనిని గూర్చి ఆలోచించాలని అనుకుంటున్నారో, దేవుని వాక్యమును మీరు అర్థము చేసుకునే విధానమును గూర్చి ఆయనకు తెలియజేయండి. ఆయనకు చెప్పకుండా ఏదీ (లేక, చిన్న విషయమైన) మరుగుచేయవద్దు! మీ హృదయములో దాచుకున్న దేవుని వాక్యమును మాట్లాడుటను అభ్యసించండి మరియు దేవునితో మీ నిజమైన భావాలను పంచుకోండి; అవి మీ హృదయములో ఉన్నను, లేక వేరే ఎక్కడ ఉన్నను మాట్లాడుట అభ్యసించండి. ఈ విధంగా మీరు ఎంత ఎక్కువగా మాట్లాడుతారో అంతే ఎక్కువగా దేవుని ప్రేమను అనుభవిస్తారు మరియు దేవుడు మీ హృదయాన్ని ఎక్కువగా బలపరుస్తాడు. ఇదంతా జరిగినప్పుడు మీరు ఇతర ఏ వ్యక్తికన్న దేవుణ్ణి ప్రియమైన వ్యక్తిగా మీరు ఆయనను అనుభవిస్తారు. అప్పుడు మీరు ఏ కారణముచేతను ఆయనను వదిలిపెట్టలేరు. ప్రతిరోజు మీరు ఇలాంటి భక్తి జీవితాన్నిఅభ్యసించి, దీనిని మీ మనస్సులోనుంచి తీసివేయకుండ కాపాడుకొని, ఈ భక్తి జీవితాన్ని మీ జీవితములో అతి ప్రాముఖ్యమైన విషయంగా పరిగణించగలిగితే దేవుని వాక్యము మీ హృదయమును స్వాధీనము చేసుకుంటుంది. దీనినే పరిశుద్ధాత్మునిచేత కదలించబడడం అని అంటారు. ఇలా జరిగిన్నప్పుడు, మీ హృదయము ఎల్లప్పుడూ దేవుని స్వాధీనములో ఉంటుంది, మీ హృదయములో దేవునిపట్ల మీ ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. దానిని మీ వద్దనుండి ఎవరూ తీసివేయలేరు. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో, దేవుడు నిజముగా మీలో నివసిస్తాడు మరియు మీ హృదయము ఆయనకు నివాస స్థానముగా ఉంటుంది.

మునుపటి:  దేవునితో ఒక సాధారణ సంబంధాన్ని స్థాపించుకోవడం చాలా ప్రాముఖ్యం

తరువాత:  పరిపూర్ణులు కాబడిన వారికి హామీలు

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger