దేవునితో ఒక సాధారణ సంబంధాన్ని స్థాపించుకోవడం చాలా ప్రాముఖ్యం

ప్రజలు విశ్వసించినప్పుడు, వారు దేవుణ్ణి ప్రేమిస్తారు మరియు ఆయనను మెప్పిస్తారు. వారి హృదయాలతో దేవుని ఆత్మను తాకుతారు. తద్వారా వారు ఆయన మెప్పుదలను సంపాదించుకుంటారు, వారు దేవుని వాక్కులయందు నిమగ్నమై ఉంటారు. అప్పుడు వారు ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతారు. ఒక సాధారణ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ, దేవునితో ఒక సాధారణ సంబంధాన్ని స్థాపించాలని నీవు కోరుకుంటే, ముందుగా నీవు నీ హృదయాన్ని ఆయనకు అర్పించాలి. ఆయన ఎదుట నీ హృదయాన్ని నిమ్మళపరచుకొని, నీ పూర్ణ హృదయాన్ని ఆయనలోనికి కుమ్మరించిన తర్వాతే నీవు క్రమముగా సాధారణ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలవు. ఒకవేళ, దేవునియందు మనుష్యులకు విశ్వాసమును కలిగియుండి, వారి హృదయాలను దేవునికి అర్పించకుండా, వారి హృదయాలు ఆయనతో లేకుండా మరియు ఆయన భారాన్ని వారి స్వంత భారంగా పరిగణించకుండా ఉన్నట్లయితే, అప్పుడు వారు చేసే ప్రతీదీ దేవుణ్ణి మోసపరచే కార్యముగాను, మతపరమైన ప్రజలు చేసేదిగానే ఉంటుంది మరియు అది దేవుని మెప్పును పొందుకొననదిగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తి నుండి దేవునికి ఎటువంటి లాభం లేదు; ఇటువంటి వ్యక్తి దేవుని పనికి కేవలం అడ్డుగా ఉండిపోతాడు. ఇటువంటి వ్యక్తులు దేవుని మందిరంలో అలంకారములుగా ఉండిపోతారు, అంటే ఎందుకూ పనికిరానివారుగా ఉండిపోతారు. ఇటువంటి వ్యకులను దేవుడు వాడుకోడు. ఇటువంటి వ్యక్తులలో పరిశుద్దాత్మ కార్యానికి అవకాశం లేకపోవడమే కాకుండా, వారిని పరిపూర్ణము చేయడములో కూడా ఎటువంటి విలువ ఉండదు. నిజానికి, ఇటువంటి వ్యక్తి నడిచే శవమే. పరిశుద్ధాత్మ వాడుకోవడానికి ఇటువంటి వారి వద్ద ఎటువంటి భాగము ఉండదు, అంటే ఇలాంటి వారందరూ సాతాను ద్వారా అతి దారుణంగా భ్రష్టులై, వాని ఆధిపత్యానికి బాగా లోబడిపోయారు. ఇటువంటి మనుష్యుల్ని దేవుడు తీసేస్తాడు. ఈ రోజున మనుష్యుల్ని వాడుకోవడంలో భాగంగా, వారిలో తాను ఇష్టపడే భాగాలను పరిశుద్దాత్మ పనిలో పెట్టడమే కాకుండా, వారిలో ఆయనకు ఇష్టంలేని వాటిని కూడా ఆయన పరిపూర్ణం చేసి మారుస్తాడు. నీ హృదయాన్ని దేవునిలోనికి కుమ్మరించి, ఆయన ఎదుట నిమ్మళముగా ఉంచగలిగినప్పుడే, నీవు పరిశుద్దాత్మ యొక్క జ్ఞానోదయాన్ని మరియు వెలిగింపును పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ ద్వారా వాడబడుటకు నీవు అవకాశమును మరియు అర్హతను కలిగి ఉంటావు. దానికంటే మరీ ఎక్కువగా, నీ లోటుపాట్లను పరిశుద్ధాత్ముడు తొలగించి మార్చుటకు కూడా నీకు అవకాశం కలుగుతుంది. సానుకూల పక్షంగా, నీ హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు, నీవు లోతుగా ప్రవేశించి ఉన్నతమైన వివేచనను పొందుకోగలవు; ప్రతికూలంగా చూసినట్లయితే, నీ పొరపాట్లు మరియు లోటుపాట్లను గూర్చి ఎక్కువగా అర్థం చేసుకుంటావు, దేవుని చిత్తమును మెప్పించాలని వెదుకుతూ మరింత ఆతురపడతావు. అంతేగాకుండా, నీవు చలనము లేకుండా ఉండవు కానీ, చురుకుగా ప్రవేశిస్తావు. నువ్వు సరియైన వ్యక్తివని ఇది చూపిస్తోంది. దేవుని ఎదుట నీ హృదయము నిమ్మళముగా ఉండగలదని అనుకుంటే, నీవు పరిశుద్ధాత్మ నుంచి మెప్పు పొందుకుంటావా లేదా మరియు నీవు దేవుని సంతోషపెడతావా లేదా అనే దానికి నీవు చురుకుగా ప్రవేశించగలగడమే కీలకమవుతుంది. పరిశుద్దాత్మ ప్రజలకు జ్ఞానోదయం కలిగించి, వారిని వాడుకున్నప్పుడు, అది వారిని ఎన్నడూ ప్రతికూలమైన ధోరణిగలవారలనుగా చేయదు కానీ, వారు ఎప్పుడూ క్రియాశీలకమైన పురోగతి చెందేలా చేస్తుంది. ఇలాంటి వ్యక్తులకు బలహీనతలు ఉన్నప్పటికీ, ఆయన వారిని ఇలాగే ప్రగతి పథంలో నడిపిస్తాడు గాని వారు ఆ బలహీనతలనుబట్టి జీవించరు. వారు జీవిత ప్రగతి పథములో ఆగిపోరు, వారు నిరంతరం దేవుని చిత్తాన్ని మెప్పించాలని వెదకుతూ కొనసాగుతారు. ఇదే ప్రమాణము. నీవు ఇది సాధించగలిగితే, నీవు పరిశుద్ధాత్మ సన్నిధిని పొందుకున్నావు అనడానికి ఇదే తగిన ఋజువు అవుతుంది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ప్రతికూలంగా ఉండి, జ్ఞానోదయమును పొందుకుని మరియు తమును గూర్చి తాము తెలుసుకున్న తర్వాత కూడా, వారు ఎటువంటి చలనం లేకుండా ప్రతికూలమైన ధోరణితో ఉన్నట్లయితే, దేవునితో నిలువబడి, ఆయనతో పనిచేయకపోయినట్లయితే, అటువంటి వ్యక్తి దేవుని కృపను మాత్రమే పొందుకుంటాడు కానీ, పరిశుద్ధాత్మ వారితో ఉండడు. వారు ప్రతికూల ధోరణి కలిగియున్నారనేదానికి అర్థం ఏమిటంటే వారి హృదయం దేవుని వైపు తిరగలేదని మరియు వారి ఆత్మ దేవుని ఆత్మ ద్వారా కదల్చబడలేదని అర్థం. ఈ విషయాన్ని అందరు అర్థము చేసుకోవాలి.

ఒకరి హృదయాన్ని దేవుని ఎదుట నిమ్మళపరచుకోవడమే అత్యంత ముఖ్యమైనదనే విషయాన్ని అనుభవం ద్వారా కనబడుతుంది. ఇది ప్రజల జీవన పురోగతికి మరియు ప్రజల ఆధ్యాత్మిక జీవితాలకి సంబంధించిన సమస్యలకు సంబంధించినదిగా ఉంటుంది. దేవుడి ఎదుట నీ హృదయం ప్రశాంతంగా ఉన్నప్పుడే, నీవు సత్యాన్ని అనుసరించగలవు మరియు నీ స్వభావములో మార్పు అనేది ఫలవంతం అవుతుంది. దానినిబట్టి, నీవు భారముతోనే దేవుని వద్దకు చేరుతావు, ఎందుకంటే, నీవు అనేక విషయాలలో కొరత కలిగియున్నావని, నీవు అనేక సత్యాలను తెలుసుకోవలసిన అవసరత ఉందని, నీవు అనుభవించవలసిన వాస్తవికత యొక్క గొప్ప సవాలు ఉందని మరియు నీవు దేవుని చిత్తము కొరకు శ్రద్ధ చూపవలసిన అవసరత ఉందని భావిస్తుంటావు. అంటే, ఈ విషయాలన్నీ ఎల్లప్పుడూ నీ మనసులోనే ఉంటాయి. నీవు ఊపిరి తీసుకోలేనంతగా ఇవి నిన్ను బలంగా పైనుండి క్రిందకి ఒత్తుతున్నట్లుగా ఉంటుంది. తద్వారా, (నీవు ప్రతికూల స్థితిలో లేకపోయినప్పటికీ) నీ హృదయం భారంగా అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తి మాత్రమే దేవుని మాటల నుండి కలిగే జ్ఞానోదయాన్ని అంగీకరించటానికి మరియు దేవుని ఆత్మ ద్వారా కదిలించబడటానికి అర్హులు. వారి భారమును బట్టే, వారి హృదయ భారమును బట్టే, వారు చెల్లించిన వెలనుబట్టే మరియు దేవుని ఎదుట వారు సహించిన శ్రమలను బట్టే, వారు ఆయన జ్ఞానోదయాన్ని మరియు వెలిగింపును పొందుకుంటారని చెప్పవచ్చు. ఎందుకనగా దేవుడు ఎవరితోనూ ప్రత్యేకంగా వ్యవహరించడు. ఆయన ఎప్పుడూ మనుష్యులందరితోనూ సముచితంగానే వ్యవహరిస్తాడు, అలాగని ఆయన మనుష్యులకు ఇష్టానుసారంగా లేక షరతులు లేకుండా కూడా ఏదీ ఇవ్వడు. ఆయన నీతిమంతమైన స్వభావంలో ఇది ఒక అంశం. నిజ జీవితంలో అనేక మంది ఈ స్థాయిని ఇంకా అందుకోవాల్సి ఉంది. కనీసం, వారి హృదయం ఇంకనూ పూర్తిగా దేవుని వైపు తిరగాల్సి ఉంది, దీన్ని బట్టే వారి జీవిత క్రమములో ఇంకా ఏ గొప్ప మార్పూ పొందలేదు. ఇది ఎందుకనగా, వారు కేవలం దేవుని కృపలో జీవిస్తారు, పరిశుద్ధాత్మ కార్యమును ఇంకనూ పొందుకోవాల్సి ఉంది. దేవుని ద్వారా వాడబడటానికి ప్రజలు కలిగి ఉండాల్సిన ప్రమాణాలు ఏమిటనేవి ఇక్కడ వివరించబడ్డాయి: వారి హృదయాలు తప్పనిసరిగా దేవుని వైపు తిరగాలి, వారు దేవుని మాటల భారాన్ని తప్పనిసరిగా మోయాలి, వారు తప్పనిసరిగా తపించే హృదయాలను కలిగియుండాలి మరియు వారికి తప్పనిసరిగా సత్యాన్ని వెతకాలన్న సంకల్పం ఉండాలి. ఇటువంటి ప్రజలు మాత్రమే పరిశుద్ధాత్మ కార్యమును పొందుకుంటారు మరియు వారు తరచుగా జ్ఞానోదయాన్ని, వెలిగింపబడుటను పొందుకుంటారు. దేవుడు వాడుకునే మనుష్యులు బయటికి మాత్రం తెలివిలేని వారిగా ఉంటారు మరియు ఇతరులతో మామూలు సంబంధాలు లేనివారిగా కనబడతారు, అయితే వారు ఎంతో ప్రాధాన్యతనిచ్చి, చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు మరియు వారు ఎల్లప్పుడూ దేవుని ఎదుట తమ హృదయాన్ని నిమ్మళపరచుకుంటారు. సరిగ్గా ఇటువంటి వ్యక్తి మాత్రమే పరిశుద్దాత్మచేత వాడబడటానికి యోగ్యుడు. దేవుడు మాట్లాడే ఈ “తెలివిలేని” వ్యక్తికి ఇతరులతో మామూలు సంబంధాలు లేనట్టుగా ఉంటుంది. బాహ్య ప్రేమ లేదా బాహ్య ఆచారాలకు వీళ్లు పెద్దపీట వేయరు కానీ వారు ఆధ్యాత్మిక విషయాలపై సంభాషించినప్పుడు వారి హృదయాన్ని తెరవగలిగి, దేవుని ఎదుట వారి అసలైన అనుభవం నుండి వారు పొందుకున్న జ్ఞానోదయాన్ని మరియు వెలిగింపును ఇతరులకు నిస్వార్థముగా అందిస్తారు. ఇలా దేవునిపట్ల వారికున్న ప్రేమను వ్యక్తపరచి, దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. ఇతరులు వారిని దూషిస్తూ ఎగతాళి చేసినప్పటికీ, బయటివారి విషయాలు లేదా సంగతుల ద్వారా, లేదా వస్తువులు ద్వారా ప్రభావితం చెందకుండా వాటిని విస్మరిస్తారు, దేవుని ఎదుట నిమ్మళముగా ఉంటారు. వారికి తమ సొంత విశిష్టమైన వివేచనలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇతరులు చేసిన దానితో సంబంధం లేకుండా, వారి హృదయాలు ఎన్నడూ దేవుని విడిచిపెట్టవు. ఇతరులు సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా, వీళ్లు మాత్రం దేవుని ఉద్దేశాలను వెదకుతూ, వారి హృదయాలలో నిశ్శబ్దంగా దేవునికి ప్రార్థన చేస్తూ, లేదా దేవుని మాటను గూర్చి ధ్యానిస్తూ, వారి హృదయాలను దేవుని ఎదుట ఉంచుతారు. ఇతరులతో వారు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలను కాపాడుకోవడానికి ప్రాధాన్యతనివ్వరు. జీవించడానికి అటువంటి వ్యక్తికి ఎటువంటి సిద్దాంతం ఉన్నట్లు అనిపించదు. బయటికి ఈ వ్యక్తి ఉల్లాసంగా, మనోహరంగా మరియు అమాయకంగా ఉంటాడు, అలాగే నిమ్మళముగానూ ఉంటాడు. దేవుడు వాడుకునే వ్యక్తికి ఇటువంటి స్వభావమే ఉంటుంది. జీవించడానికి జీవిత సిద్ధాంతాలు, లేదా “సాధారణ కారణం” లాంటి విషయాలు ఇటువంటి వ్యక్తికి పని చేయవు; వారు తమ పూర్ణ హృదయాలను దేవుని మాటలోనికి కుమ్మరించారు, వారి హృదయంలో దేవుడు మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు ఇటువంటి వ్యక్తినే “కారణంలేని” వ్యక్తిగా సూచిస్తాడు మరియు సరిగ్గా ఇటువంటి వ్యక్తి మాత్రమే దేవుని ద్వారా వాడబడతాడు. దేవుని ద్వారా వాడబడే వ్యక్తి గుణలక్షణం ఏదనగా: ఎప్పుడైనా ఎక్కడైనా సరే, వారి హృదయం ఎప్పుడూ దేవుని ఎదుటే ఉంటుంది, ఇతరులు ఎంత భ్రష్టత్వంతో ఉన్నా, వారి మోహానికి మరియు శరీరానికి ఎంత తావిచ్చినా, ఈ వ్యక్తి హృదయం మాత్రం ఎన్నడూ దేవుని విడిచిపెట్టదు మరియు వీరు జనసమూహమును వెంబడించరు. ఇటువంటి వ్యక్తి మాత్రమే దేవుడు ఉపయోగించుకునేందుకు సరిపోయేవాడు మరియు ఇటువంటి వ్యక్తి మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణం చేయబడతాడు. నీవు వీటిని సంపాదించకపోయినట్లయితే, దేవుని ద్వారా సంపాదించబడుటకు మరియు పరిశుద్ధాత్మ ద్వారా పరిపూర్ణం చేయబడటానికి నీవు అర్హుడివి కాదు.

నీవు దేవునితో సాధారణ సంబంధం స్థాపించుకోవాలంటే, నీ హృదయం తప్పనిసరిగా ఆయన వైపు తిరగాలి. ఇది పునాదియైనట్లయితే, ఇతరులతో కూడా నువ్వు సరైన సంబంధాలను కలిగి ఉంటావు. నీవు దేవునితో సాధారణ సంబంధాన్ని కలిగియుండనప్పుడు, ఇతరులతో సంబంధాలు నిలబెట్టుకోవడానికి నువ్వు ఏం చేసినా, ఎంత కష్టపడి పనిచేసినా లేక ఎంత శక్తి ధారపోసినా, అదంతా బతకడానికి మనిషి కలిగియుండే తాత్వికతకు సంబంధించిందే. దేవుని వాక్య ప్రకారం సాధారణ వ్యక్తిగత సంబంధాలను స్థాపించుకోవడానికి బదులుగా మానవ ద్రుష్టికోనాల ద్వారా మరియు మానవ సిద్ధాంతాల ద్వారాను వారి మెప్పును సంపాదించుకుంటున్నావు మరియు మనుష్యుల మధ్యన నీకున్న స్థానాన్ని కాపాడుకుంటున్నావు. ప్రజలతో నీకున్న సంబంధాలపై నువ్వు దృష్టి పెట్టకుండా, దేవునితో సరైన సంబంధాన్ని నిలబెట్టుకుంటే, నీ హృదయాన్ని దేవునికి అర్పించడానికి మరియు ఆయనకు విధేయత చూపించడం నేర్చుకోవడానికి ఇష్టపడితే, అప్పుడు సహజంగానే అందరితో నీకున్న వ్యక్తిగత సంబంధాలు సరవుతాయి. ఇలా, ఈ సంబంధాలు శరీరమనేదాని మీద కట్టబడకుండా, దేవుని ప్రేమ అనే పునాదిపై స్థాపించబడతాయి. మీరు ఇతర ప్రజలతో దాదాపుగా శారీరక వ్యవహారాలను కలిగియుండరు గాని ఆధ్యాత్మిక స్థాయిలో మీ మధ్యన సహవాసం, పరస్పర ప్రేమ, పరస్పర ఆదరణ మరియు పరస్పర సహాయం అనేవి ఉంటాయి. ఇదంతా కూడా దేవుని మెప్పించాలన్న ఆశ అనే పునాదిపై జరుగుతుంది. అంటే, ఈ సంబంధాలనేవి బతకడానికి మానవ తత్వాల మీద ఆధారపడటం ద్వారా నిలబడవు కానీ, దేవుని కొరకైన భారాన్ని ఒకరు వహించడం ద్వారా చాలా సహజంగా ఏర్పడతాయి. దీనికి ఎటువంటి కృత్రిమ ప్రయత్నమైనా, మానవ ప్రయత్నమైనా అవసరం లేదు. కేవలం దేవుని వాక్కుల యొక్క సూత్రాల ప్రకారమే నీవు అనుసరించాలి. నువ్వు దేవుని చిత్తమును పట్టించుకోవడానికి ఇష్టపడతావా? “ఏ కారణం” లేకుండా దేవుని ముందు ఉండగలిగే వ్యక్తిలాగా ఉంటావా? ఇతర ప్రజల్లో నీకుండే స్థాయిని పట్టించుకోకుండా నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పిస్తావా? నీకు వ్యక్తిగతంగా తెలిసిన వారందరిలోఎవరితో నీకు గొప్ప సంబంధాలున్నాయి? ఎవరితో నీకు చెడు సంబంధాలున్నాయి? ప్రజలతో నీకున్న సంబంధాలు సరిగా ఉన్నాయా? నువ్వు ప్రజలందరినీ సమానంగా చూస్తావా? బతకడానికి నీకున్న జ్ఞానాన్ని అనుసరించి ఇతరులతో నీకున్న సంబంధాలను కాపాడుకుంటున్నావా, లేక దేవుని ప్రేమ అనే పునాదిపై అవి కట్టబడ్డాయా? ప్రజలు తమ హృదయాలను దేవునికి సమర్పించనప్పుడు, వారి ఆత్మలు చురుకుదనాన్ని కోల్పోయి, మొద్దుబారి అచేతనంగా ఉండిపోతాయి. అటువంటి ప్రజలు ఎన్నడూ దేవుని మాటలను అర్థం చేసుకోలేరు మరియు ఎన్నడూ దేవునితో సరైన సంబంధాన్ని కలిగియుండలేరు, వారు తమ స్వభావంలో ఎప్పటికీ ఎటువంటి మార్పును సాధించలేరు. ఒకరి స్వభావం మారడమంటే అతని హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పించడం, దేవుని మాటల నుండి జ్ఞానోదయాన్ని మరియు వెలిగింపును స్వీకరించే స్వీకరించడం అని అర్థం. దేవుని కార్యము ప్రజలను చైతన్యవంతంగా ప్రవేశించడానికి అనుమతిసిస్తుంది, వారిని గురించిన జ్ఞానము వారు పొందుకున్న తర్వాత వారిలో ఉండే వ్యతిరేకార్ధమైన భాగాలన్నిటిని తొలగించుకొనుటకు వారిని బలపరుస్తుంది. నీ హృదయాన్ని దేవునికి అర్పించే స్థితికి చేరినప్పుడు, నీ ఆత్మ లోపల ప్రతీ సున్నితమైన కదలికను నీవు గ్రహించగలవు మరియు దేవుని నుండి పొందుకున్న ప్రతీ జ్ఞానోదయం మరియు వెలిగింపు నీకు తెలుస్తుంది. దీన్ని పట్టుకొని ఉన్నప్పుడే నీవు క్రమముగా పరిశుద్దాత్మచేత పరిపూర్ణం చేయబడుతున్న మార్గంలో ప్రవేశిస్తావు. దేవుని ముందు నీ హృదయం ఎంత నిమ్మళముగా ఉండగలదో, అంత ఎక్కువగా నీ ఆత్మ సున్నితంగా మృదువుగా ఉండి, పరిశుద్ధాత్మ దానిని ఎలా కదలింపజేస్తుందోనన్న విషయాన్ని మరింత ఎక్కువగా నీ ఆత్మ గ్రహించగలదు, అప్పుడు దేవునితో నీకున్న సంబంధం మరింత ఎక్కువ సాధారణంగా మారిపోతుంది. సాధారణ వ్యక్తిగత సంబంధాలన్నీదేవుని వైపుకు తిరిగిన ఒకని హృదయము మీదనే స్థాపించబడతాయే గాని మానవ సామర్థ్యముతో కాదు. ఒక వ్యక్తి హృదయములో దేవుడు లేకుంటే, ఇతర ప్రజలతో వారికున్న వ్యక్తిగత సంబంధాలు కేవలం శరీర సంబంధాలుగానే ఉండిపోతాయి. అవి సాధారణమైన సంబంధాలు కాదు, ఇంకా చెప్పాలంటే, కామముతో నిండియున్న కోరికలను తీర్చుకునే సంబంధాలు. అంతేగాకుండా, అవన్నీ దేవుని ద్వారా ద్వేషించబడిన మరియు అసహ్యించుకోబడిన సంబంధాలు. నీ ఆత్మ కదిలించబడిందని నీవు చెప్పి, నీకు ఇష్టమైన వారితోనే, నీవు గౌరవించే వారితోనే సహవాసం చేయాలని కోరతావు, నీకు ఇష్టములేనివారు నీ నుండి ఏదైనా ఎదురుచూచినప్పుడు వారితో మాట్లాడుటకు తిరస్కరిస్తావు మరియు వారికి పక్షపాతం చూపిస్తావు, ఇలాంటి ప్రవర్తనను బట్టి నీవు నీకున్న భావోద్వేగాల ద్వారా నియంత్రించబడుచున్నావని మరియు దేవునితో నీకు అసలు ఎటువంటి సాధారణ సంబంధమూ కలిగిలేవని రుజువు చేయబడుతుంది. దేవుని మోసపరచి నీ సొంత చెడును దాచాలని నీవు ప్రయత్నిస్తున్నావన్నట్లుగా ఇది సూచిస్తోంది. నీకున్న కొంత అవగాహనను నీవు పంచుకోగలిగిననూ చెడు ఉద్దేశాలనే నీవు గలిగి ఉంటావు, అప్పుడు నీవు చేసే ప్రతీది మానవ ప్రమాణాలను బట్టి మాత్రమే మంచిదిగా ఉంటుంది. దేవుడు నిన్ను మెచ్చుకోడు. ఎందుకంటే, దేవుని భారాన్ని బట్టి కాదు గానీ శరీరాన్ని బట్టి నీవు నడుచుకుంటున్నావు. దేవుని ఎదుట నీ హృదయాన్ని నిమ్మళబరచగలిగి, దేవుని ప్రేమించే వారందరితోనూ సాధారణ పరస్పర చర్యలుంటేనే దేవుడు వాడుకోవడానికి నీవు అర్హుడివి. మీరు ఈ రకంగా చేయగలిగి, ఇతరులతో నీవు ఎలా స్పందిస్తున్నారన్నదానితో నిమిత్తము లేకుండా, నీవు జీవించడం కొరకు తత్వాన్ని బట్టి కాకుండా, అది ఆయన భారాన్ని పట్టించుకుని, దేవుని ఎదుట జీవించినట్లుగా ఉంటుంది. మీ మధ్య ఇటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఇతరులతో నీకున్న సంబంధాలు నిజంగా సాధారణంగా ఉన్నాయా? అవి ఏ పునాదిపై కట్టబడ్డాయి? నీ లోపలి జీవితం కొరకు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి? వాటిని వదిలి పెట్టావా? నీ హృదయం పూర్తిగా దేవుని వైపుకు తిరగకపోతే, నీవు దేవునికి సంబంధించినవాడవు కాదు, అంటే నీవు సాతాను నుండి వచ్చావు మరియు అంతిమంగా నీవు సాతాను వద్దకే తిరిగి వెళ్తావు. దేవుని ప్రజల్లో ఒకడిగా ఉండే యోగ్యత నీకు లేదు. ఈ సంగతులన్నిటిని నీవు జాగ్రత్తగా పరీక్షించుకోవాలి.

మునుపటి:  దేవుని యందు మీ విశ్వాసంలో మీరు దేవునికి విధేయులై ఉండాలి

తరువాత:  సాధారణ ఆధ్యాత్మిక జీవితం ప్రజలను సరియైన మార్గములోనికి నడిపిస్తుంది

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger