గమ్యం గురించి
లక్ష్యం గురించి ప్రస్తావించినప్పుడల్లా, మీరు దాని విషయంలో ప్రత్యేక గంభీరతతో వ్యవహరిస్తుంటారు; అదిమాత్రమే కాకుండా, మీరందరూ ప్రత్యేకించి సున్నితంగా తీసుకునే విషయమిది. కొంత మంది మెరుగైన గమ్యాన్ని చేరుకునేందుకు దేవుని ముందు మోకరిల్లి తమ తలను నేలకేసి బాదుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు. మీ ఆత్రుతను నేను గుర్తించగలను, దాన్ని మీరు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. మీ శరీరము విపత్తులో పడకూడదని మీరు కోరుకోవడం కంటే అది ఎక్కువేమీ కాదు, భవిష్యత్తులో శాశ్వతమైన శిక్షకి దిగజారాలని నీవు తక్కువగా కోరుకుంటున్నావా. కొంచెం స్వేచ్ఛగా, మరికొంత సునాయాసంగా జీవించడానికి మిమ్మల్ని మీరు అనుమతించాలని మాత్రమే మీరు ఆశిస్తున్నారు. కాబట్టే, గమ్యం గురించి ప్రస్తావించబడినప్పుడల్లా ప్రత్యేకించి మీరు ఉద్రేకానికి గురవుతారు, మీరు తగినంత శ్రద్దగా లేనట్లయితే, దేవుని కించపరుస్తారేమోననీ, తద్వారా తగిన దండనకి గురికాబడతారనీ తీవ్రంగా భయపడతారు. మీరు మీ లక్ష్యం కోసం రాజీలు పడటానికి వెనుకాడలేదు, మరియు మీలో చాలా మంది ఒకప్పుడు మోసపూరితంగా మరియు అలక్షముగా మాటలాడెడు వారు కూడా అకస్మాత్తుగా, మరీ ముఖ్యంగా నిజాయితీగా మరియు సున్నితంగా మారారు; మీరు ప్రదర్శించే నిజాయితీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అయినప్పటికీ, మీ అందరికీ “నిజాయితీ” తో కూడిన హృదయాలు ఉన్నాయి, మరియు మనోవేదన, మోసం లేదా భక్తి ఏదైనప్పటికీ, ఏదీ దాచుకోకుండా మీ హృదయాల్లోని రహస్యాలన్నిటినీ నా కోసం నిలకడగా తెరిచారు. మొత్తంమీద, మీ ఉనికి యొక్క లోతైన అంతరాలలో ఉన్న ముఖ్యమైన విషయాలను మీరు చాలా నిక్కచ్చిగా నా వద్ద “ఒప్పుకున్నారు”. అయితే, నేనెప్పుడూ అలాంటి వాటి చుట్టూ తిరగలేదు, ఎందుకంటే అవి నాకు చాలా సుపరిచితం అయిపోయాయి. దేవుని ఆమోదం పొందేందుకు ఒక్క వెంట్రుకను పోగొట్టుకోవడానికి కూడా ఆలోచించే మీరు మీ చివరి గమ్యస్థానం కోసం అగ్ని సముద్రంలోకి ప్రవేశించడానికైనా సిద్ధపడుతారు. నేను మీతో మరీ పిడివాదం చేస్తున్నానని అనుకోకండి; నేను చేసే వాటన్నిటితో ముఖాముఖిగా రావడానికి మీలో భక్తి గల హృదయం బాగా లోపించింది. నేను ఇప్పుడు చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి నన్ను మీకు సరళమైన వివరణ ఇవ్వనివ్వండి: మీకు కావలసింది సత్యం మరియు జీవితం కాదు, లేదా మీరు ఎలా నడుచుకోవాలనే సూత్రాలు కాదు. శ్రమపూరితమైన నా పని అసలే కాదు. బదులుగా, మీకు మీ శరీరములో కలిగి ఉండే సంపద, హోదా, కుటుంబం, వివాహం మరియు అలాంటివన్నీ కావాలి. మీరు నా మాటలు మరియు పనిని పూర్తిగా తిరస్కరించారు, కాబట్టి నేను మీ విశ్వాసాన్ని ఒక మాటలో పనికిరానిదని సంక్షిప్తీకరించగలను. మీరు పూర్తిగా అంకితభావంతో ఉన్న వాటిని సాధించడానికి మీరు ఎంత దూరమైనా వెళ్తారు, కానీ దేవునిపై మీ నమ్మకానికి సంబంధించిన విషయాల కోసం మీరు అదే పని చేయరని నేను కనుగొన్నాను. బదులుగా, భిన్నమైన వాటి విషయంలో మీరు అంకితభావంతో ఉన్నారు మరియు భిన్నమైన వాటి విషయంలో శ్రద్ధ గలిగి ఉన్నారు. అందుకే, అత్యంత చిత్తశుద్ధి లేని హృదయం ఉన్న వారు భగవంతుని పై విశ్వాసం ఉంచడంలో వైఫల్యం చెందుతారాని నేను చెప్తాను. జాగ్రత్తగా ఆలోచించండి—మీలో ఇలాంటి విఫలులు చాలామంది ఉన్నారు కదా?
దేవునిపై నమ్మకంలో విజయం అనేది ప్రజల స్వంత చర్యల ఫలితంగా సాధించబడుతుందని మీరు తెలుసుకోవాలి; ఎప్పుడైతే ప్రజలు విజయం సాధించరో, దానికి బదులుగా వారు విఫలమవుతారో, అది కూడా వారి స్వంత చర్యల వల్లే జరుగుతుందో మరియు మరే ఇతర అంశమూ అందులో ఏ పాత్రా వహించదో అప్పుడు అది అవగతమవుతుంది. దేవుడిని నమ్మడం కంటే, కష్టతరమైన మరియు ఎక్కువ బాధలు కలిగించేదాన్ని సాధించడానికి మీరు ఏమైనా చేస్తారని నేను నమ్ముతున్నాను మరియు మీరు దానిని చాలా తీవ్రంగా కూడా పరిగణిస్తారు. ఎంతగా అంటే, దాని విషయంలో మీరు ఏ తప్పిదాలనూ అంగీకరించరు; మీరందరూ మీ స్వంత జీవితాలలో తలపెట్టే అలుపెరగని ప్రయత్నాలన్నీ అలాంటివే. మీరు నా శరీరాన్ని కూడా మోసం చేయగల సమర్థులు, కానీ అదే పరిస్థితుల్లో మీ స్వంత కుటుంబంలోని ఏ సభ్యుడినీ మోసం చెయ్యరు. ఇదే మీ స్థిరమైన ప్రవర్తన మరియు మీరు జీవించే సూత్రం. మీ గమ్యం సంపూర్ణంగా అందంగా మరియు మీరు కోరుకున్నదంతా ఉండేలా మరియు దాని కోసం నన్ను మోసం చేయడానికి మీరు ఇప్పటికీ ఒక తప్పుడు ముఖభాగాన్ని ప్రదర్శించడం లేదంటారా? మీ చిత్తశుద్ధి లానే మీ భక్తి కూడా తాత్కాలికమని నాకు తెలుసు. మీ సంకల్పం మరియు మీరు చెల్లించే మూల్యం ప్రస్తుత క్షణం కోసమే తప్ప భవిష్యత్తు కోసం కాదు కదా? ఒక లావాదేవీ చేయాలనే ఏకైక లక్ష్యంతో, మీరు ఒక అందమైన గమ్యాన్ని భద్రపరచుకోవడానికి ఒక చివరి ప్రయత్నంగా మాత్రమే పరిశ్రమించాలనుకుంటున్నారు. ఇదే ప్రయత్నం మీరు సత్యానికి రుణపడి ఉండకుండా తప్పించుకునేందుకు చేయరు మరియు నేను చెల్లించిన మూల్యాన్ని నాకు తిరిగి చెల్లించడం కోసం అసలే చెయ్యరు. క్లుప్తంగా చెప్పాలంటే, మీరు కోరుకున్నది పొందడానికి తెలివైన వ్యూహాలను అమలు చేయడానికి మాత్రమే మీరు సిద్ధంగా ఉన్నారే తప్ప దాని కోసం బహిరంగ యుద్ధం చేయడానికి కాదు. మీ హృదయపూర్వక వాంఛ ఇది కాదా? మీరు మారువేషాలు వేయకూడదు, మీరు మీ గమ్యస్థానం విషయంలో తినడానికి లేదా నిద్రించడానికి వీలులేని స్థాయిలో మీ బుర్ర బద్దలు కొట్టుకోకూడదు. నిజానికి, మీ ఫలితమనేది ఇప్పటికే నిర్ణయించబడిందనేది నిజం కాదా? మీరు ప్రతి ఒక్కరూ మీ సామర్థ్యం మేరకు తెరచియున్న మరియు నిజాయితీ గల హృదయాలతో మీ స్వంత కర్తవ్యాన్ని నిర్వర్తించాలి మరియు అవసరమైన ఏ మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి, మీరు చెప్పినట్లుగా, ఆ రోజు వచ్చినప్పుడు, తన కోసం బాధలు పడిన లేదా మూల్యం చెల్లించిన వారి పట్ల దేవుడు విముఖత చూపడు. ఈ రకమైన నమ్మకానికి కట్టుబడటం యోగ్యమైనది మరియు మీరు దానిని ఎప్పటికీ మరచిపోకపోవడమే సరైనది. ఈ విధంగా మాత్రమే నేను మీ గురించి నా మనస్సును తేలికగా ఉంచగలను. లేకపోతే, మీరు ఎప్పటికీ నా మనస్సును తేలికగా ఉంచలేని వ్యక్తులుగా మిగిలిపోతారు, మరియు మీరు ఎప్పటికీ నా అప్రియపాత్రులవుతారు. మీరందరూ మీ మనస్సాక్షిని అనుసరించి, నా కోసం మీ సర్వస్వాన్ని అందించగలిగితే, నా పని కోసం ప్రయత్నించడంలో దేనికీ వెరవకుండా మరియు మీ జీవితకాలపు శక్తిని నా సువార్త పని కోసం అంకితమివ్వగలిగితే, అప్పుడు నా హృదయం తరచుగా మీ కోసం ఆనందంతో గంతులు వేయదంటారా? ఈ విధంగా నేను మీ విషయంలో నా మనస్సును తేలికగా ఉంచగలను. కానీ, అలా ఉంచలేనంటారా? నిజానికి, నేను ఆశించిన దానిలో మీరు చేయగలిగింది జాలి పడాల్సినంత చిన్న భాగమే అయినప్పుడు, అది కూడా చేయలేకపోవడం సిగ్గుచేటు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, మీరు ఆశించిన దానిని నా నుండి కోరుకునే ధైర్యం మీకు ఎలా ఉంటుంది?
మీ గమ్యం మరియు మీ భవితవ్యం మీకు చాలా ముఖ్యమైనవి. అవి గంభీరంగా విచారించాల్సినవి. మీరు చాలా జాగ్రత్తగా పనులు చేయకపోతే, మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరనీ, మీ స్వంత భవిష్యత్తుని మీరే నాశనం చేసుకున్నారని మీరు నమ్ముతారు. కానీ, తమ లక్ష్యం కోసం మాత్రమే శ్రమను వెచ్చించే వ్యక్తులు వృధాగా శ్రమిస్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి ప్రయత్నాలు అసలైనవి కావు. అవి నకిలీవి మరియు మోసపూరితమైనవి. అదే కనుక జరిగితే, తమ లక్ష్యం కోసం మాత్రమే పని చేసే వారు తమ చివరి ఓటమికి దగ్గరలో ఉంటారు. ఎందుకంటే, దేవునిపై ఒకరి విశ్వాసంలో వైఫల్యం అనేది మోసం వల్లే జరుగుతుంది. నన్ను పొగడటం లేదా ముఖస్తుతి చేయటం లేదా అత్యుత్సాహంతో వ్యవహరించడం నాకు ఇష్టం ఉండదని నేను ఇంతకు ముందే చెప్పాను. నిజాయితీ గల వ్యక్తులు నా సత్యాన్ని మరియు నా అంచనాలను ఎదుర్కోవడం నాకు ఇష్టం. ప్రజలు నా హృదయం పట్ల అత్యంత శ్రద్ధ మరియు పరిగణన చూపగలిగినప్పుడు మరియు వారు నా కొరకు అన్నింటినీ వదులుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు వారిని నేను ఇంకా ఎక్కువగా ఇష్టపడతాను. ఆ విధంగా మాత్రమే నా హృదయానికి ఓదార్పు లభిస్తుంది. ప్రస్తుతం, మీ గురించి నేను ఇష్టపడని విషయాలు ఎన్ని ఉన్నాయి? మీలో నాకు నచ్చిన విషయాలు ఎన్ని ఉన్నాయి? మీ గమ్యం కోసం మీరు ప్రదర్శించిన వికారాల విభిన్న లక్షణాలన్నీ మీలో ఎవరూ గ్రహించలేరా?
నా మనసులో, సానుకూలంగా పైకి ఎదగాలనుకునే ఏ హృదయాన్నైనా గాయపరచాలని అనుకోను. మరియు తన కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వర్తించే వారి శక్తిని నిర్వీర్యం చేయాలని అసలే కోరుకోను. ఏది ఏమైనప్పటికీ, నేను మీలో ప్రతి ఒక్కరికీ మీ అసమర్థతలను మరియు మీ హృదయాల లోతైన అంతరాల్లో ఉన్న అశుద్ద ఆత్మను గుర్తు చేయాలి. మీరు నా మాటలతో ముఖాముఖీగా తలపడినపుడు మీ నిజమైన హృదయాన్ని అందించగలరనే ఆశతో నేను అలా చేస్తున్నాను. ఎందుకంటే, ప్రజలు నా పట్ల చేసే మోసాన్నే నేను ఎక్కువగా ద్వేషిస్తాను. నా పని చివరి దశలో, మీరు మీ అసాధారణ పనితీరును ప్రదర్శించగలరనీ, మరియు ఇకపై అన్యమనస్కులై కాకుండా, హృదయపూర్వకంగా మిమ్మల్ని మీరు అంకితం చేస్తారనీ నేను ఆశిస్తున్నాను. అయితే, మీరందరూ మంచి లక్ష్యాన్ని కలిగి ఉండాలని కూడా నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ, నాకు కావలసినది ఇంకా ఉంది, అదేంటంటే, మీ ఏకైక మరియు చివరి భక్తిని నాకు సమర్పించడంలో మీరు ఉత్తమ నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఆ ఏకైక భక్తి కలిగి ఉండకపోతే, అతను ఖచ్చితంగా సాతానుకి అమూల్యమైన ఆస్తిగా ఉంటాడు, మరియు నేను అతనిని ఇకపై ఉపయోగించుకోను, కానీ అతని తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచడానికి అతనిని ఇంటికి పంపుతాను. నా పని మీకు ఒక గొప్ప సహాయం; మీ నుండి నేను పొందాలని ఆశిస్తున్నది నిజాయితీ గల మరియు పైకి ఎదగాలనుకునే హృదయం మాత్రమే, కానీ ఇప్పటివరకు నా చేతులు ఖాళీగానే ఉన్నాయి. దాని గురించి ఆలోచించండి: ఒకరోజు నేను మాటల్లో చెప్పలేనంత బాధతో ఉంటే, అప్పుడు మీ పట్ల నా వైఖరి ఎలా ఉంటుంది? నేను ఇప్పుడున్నంతగా స్నేహంగా అప్పుడు కూడా నీతో ఉంటానా? నా హృదయం అప్పుడున్నంత నిర్మలంగా ఇప్పుడు కూడా ఉంటుందా? కష్టపడి పొలాన్ని సాగు చేసినప్పటికీ, ఒక్క గింజ కూడా పండించలేని వ్యక్తి ఆవేదన మీకు అర్థమైందా? ఒక వ్యక్తికి పెద్ద దెబ్బ తగిలినప్పుడు అతని గుండె ఎంతగా గాయపడుతుందో మీకు అర్థమైందా? ఒకప్పుడు చాలా ఆశతో నిండి ఉన్నప్పటికీ, చెడ్డ ఒడంబడికలతో విడిపోవాల్సి వచ్చిన వ్యక్తి చేదు అనుభవాన్ని మీరు రుచి చూడగలరా? రెచ్చగొట్టబడిన వ్యక్తి నుండి క్రోధం వెళ్లగక్కబడటం మీరు చూశారా? శత్రుత్వం మరియు వంచనకి గురికాబడిన వ్యక్తికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఉండే తపన మీకు తెలుసా? ఈ మనుష్యుల మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకుంటే, అప్పుడు దేవుడు తన ప్రతీకారం తీర్చుకునే సమయంలో ఎలాంటి వైఖరితో ఉంటాడో ఊహించడం మీకు కష్టంగా ఉండదని నేను భావిస్తున్నాను! చివరగా, మీ స్వంత లక్ష్యం కోసం మీరందరూ తీవ్రమైన ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే, మీరు మీ ప్రయత్నాల్లో మోసపూరిత మార్గాలను ఉపయోగించకుండా ఉండటమే మంచిది. లేదంటే, మీ గురించి నా హృదయంలో నిరాశ చెందుతూనే ఉంటాను మరియు అలాంటి నిరాశ దేనికి దారి తీస్తుంది? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం లేదా? తమ గమ్యం గురించి ఆలోచించినప్పటికీ, దానిని నాశనం చేసుకున్న వారు అతి తక్కువగా రక్షించబడతారు. అలాంటి వ్యక్తి విసుగు చెంది, ఆగ్రహానికి గురైనప్పటికీ, అతనిపై ఎవరు జాలి చూపుతారు? మొత్తంగా, మీకు అనుకూలమైన మరియు మంచి లక్ష్యం ఉండాలని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను మరియు మీలో ఎవరూ విపత్తులో పడకూడదని కూడా అంతకంటే ఎక్కువగానే ఆశిస్తున్నాను.