తమ విధిని నిర్వర్తించే ప్రతి ఒక్కరి గురించి
ప్రస్తుత విధానంలో, దేవుడిని నిజంగా ప్రేమించే వారందరికీ ఆయనచే సంపూర్ణులుగా మారే అవకాశం కలుగుతున్నది. వారు యువకులైనా లేదా వృద్ధులైనా కూడా, తమ హృదయాలలో దేవుడి పట్ల విధేయత ఉండి, ఆయనను ఆరాధిస్తున్నంత కాలం, దేవుడు వారిని పరిపూర్ణులుగా మార్చుతూనే ఉంటాడు. దేవుడు ప్రజలను వారు నిర్వహించే విధులను అనుసరించి పరిపూర్ణులుగా చేస్తాడు. నీవు నీ పూర్తి శక్తిని ఉపయోగించి, దేవుడి కార్యములో నిమగ్నం అయినంత కాలం, ఆయనచే నీవు పరిపూర్ణుడివి అవుతూ ఉంటావు. ప్రస్తుతం, మీలో ఎవ్వరూ పరిపూర్ణులు కారు. కొన్నిసార్లు మీరు ఒక రకమైన విధిని మాత్రమే నిర్వహించగలరు, మిగతా సమయాలలో రెండు నిర్వహించవచ్చు. దేవుని యెడల మీరు మీ శక్తియుక్తులను పూర్తిగా వెచ్చించి మీ సమర్థతను విస్తృతం చేసుకున్నంత కాలం, అంతిమంగా మీరు దేవునిచే పరిపూర్ణులుగా మార్చబడతారు.
యుక్తవయస్సులో ఉన్న వారికి జీవించడం కోసం ఏ సిద్ధాంతాలూ ఉండవు, అలాగే వారిలో వివేకము, అవగాహన కూడా లోపించి ఉంటాయి. దేవుడు ఉన్నదే మనిషిలో వివేకము, అవగాహనలను పరిపూర్ణంగా చేయడం కోసం. దేవుని వాక్యము వలన వారిలోని లోపాలు సరిదిద్దబడును. అయితే, యువత స్వభావములు అస్థిరముగా ఉంటాయి, కనుక దేవుడు వారిని తీర్చి దిద్దవలసి ఉంటుంది. యువకులైన వారిలో మతము పట్ల, జీవించడం కోసం అనుసరించవలసిన సిద్ధాంత నియమాల పట్ల ఎటువంటి ఆలోచనలు ఉండవు; వారు ప్రతి విషయాన్ని చాలా తేలికగా ఆలోచిస్తూ ఉంటారు, అలాగే వారి ప్రతిస్పందనలు కూడా సంక్లిష్టముగా ఉండవు. వారి మనుష్యతత్త్వములోని ఈ భాగమే ఇంకా ఎటువంటి రూపాన్ని సంతరించుకొని ఉండదు, అందువల్ల ఇది చాలా గొప్పగా కొనియాడదగిన విషయము; అయితే, యువకులైన వారు అవగాహన లేని వారు ఇంకా వివేకము పొందని వారు. వారిలో ఈ అంశములే దేవుడిచే తీర్చిదిద్దబడాలి. దేవుడిచే పరిపూర్ణులుగా తీర్చి దిద్దబడినప్పుడు మీలో వివేచన పెరుగుతుంది. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మీరు స్పష్టముగా అర్థం చేసుకోగలుగుతారు, తద్వారా క్రమంగా దేవుడిచే ఉపయోగించబడుటకు సమర్థతను పొందుతారు. పెద్దలైన సహోదరులకు ఇంకా సహోదరీలకు కూడా వారు నిర్వహించవలసిన కర్తవ్యాలు ఉంటాయి, కావున దేవుడు వారిని విడిచిపెట్టడం జరగదు. అయితే, పెద్దలైన సహోదరులు, సహోదరీలలో కూడా కొన్ని అవసరమైన విషయాలు, మరికొన్ని అనవసరమైన విషయాలు ఉంటాయి. వారిలో జీవించడం కోసం ఎక్కువ సిద్ధాంతాలు, అలాగే ఎక్కువ మతపరమైన ఆలోచనలు ఉంటాయి. వారు చేపట్టే కార్యములలో, వారు ఎన్నో మొండి సంప్రదాయాలను పాటిస్తూ, ఎటువంటి మార్పులకు లోనుకానటువంటి, యాంత్రికముగా నిర్వహించేటటువంటి నియమాలను అనుసరిస్తూ ఉంటారు. ఇది అవాంఛనీయమైన అంశము. అయితే, ఈ పెద్దలైన సహోదరులు ఇంకా సహోదరీలు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే చాలా ప్రశాంతంగా చాలా దృఢముగా ఉండగలుగుతారు; వారి స్వభావములు స్థిరముగా ఉంటాయి, విపరీతమైన మనోభావాలు వారిలో కనిపించవు. కొత్త విషయాలను స్వీకరించే విషయంలో వారు నిదానంగా వ్యవహరిస్తారు, అయితే ఇది అంత పెద్ద తప్పిదము ఏమీ కాదు. మీరు దేవుని పట్ల సమర్పణులై ఉన్నంత కాలము; దేవుడి ప్రస్తుత వాక్యములను అంగీకరించినంత కాలము, దేవుడి వాక్యములను మీరు విశ్లేషించనంత కాలము; మీరు కేవలము మిమ్మల్ని మీరు దేవుని పట్ల సమర్పించుకుంటూ ఆయన వాక్యములను అనుసరిస్తూ, దేవుని వాక్యములపై మీరు తీర్పులు చెప్పక, ఆ వాక్యముల పట్ల ఎటువంటి చెడు ఆలోచనలు చేయకుండా ఉన్నంత కాలము; దేవుడి వాక్యములను మీరు ఆమోదించి వాటిని ఆచరణలో పెట్టినంత కాలము—అలా మీరు ఈ అర్హతలను మీరు సాధించినట్లయితే, దేవునిచే మీరు పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడగలరు.
మీరు తమ్ముళ్లూ చెల్లెళ్లూ అయినా లేదా అన్నయ్యలూ అక్కయ్యలూ అయినా, మీరు నిర్వర్తించవలసిన కార్యము గురించి మీకు తెలుసు. యుక్తవయస్సులో ఉన్న వారు పొగరుగా ఉండరు; పెద్ద వయస్సు వారైనంత మాత్రమున నిష్క్రియులగా, తిరోగాములుగా ఉండరు. అంతకుమించి, వారివారిలో ఉన్న బలహీనతలను సరి చేసుకోనేందుకు ఒకరి బలాన్ని మరొకరు ఉపయోగించుకుంటారు, ఎటువంటి భేదభావములు లేకుండా ఒకరికొకరు సహాయపడతారు. చిన్న వయస్సు వారికీ పెద్ద వయస్కులైన సోదరీ, సోదరుల మధ్య స్నేహం అనే వారధి ఏర్పడుతుంది, ఆపై దేవుడి ప్రేమ కారణముగా, మీరు ఒకరినొకరు ఇంకా మెరుగుగా అర్థం చేసుకోగలుగుతారు. పెద్దలైన సోదరీ, సోదరులు చిన్నవయస్సు వారు చులకనగా చూడరు, అలాగే ఆ సహోదరులు, సహోదరీలు కూడా తామే నీతిమంతులము అనే భావనతో ఉండరు: అది సామరస్యమైన అనుబంధం అవుతుందా? మీలో అటువంటి సంకల్పం ఉంటే, అప్పుడు ఆ దేవుడి చిత్తము మీ తరములో ఖచ్చితముగా నెరవేరుతుంది.
భవిష్యత్తులో, మీరు దేవుని ఆశీర్వాదము పొందుతారా లేక శాపమును పొందుతారా అనేది ఈ రోజున మీరు చేసే కార్యముల మీద, మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవునిచే పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడాలి అంటే, అది ఈ క్షణమే జరగాలి; ఈ కాలములోనే జరిగి తీరాలి; భవిష్యత్తులో మీకు మరొక అవకాశము ఉండదు. దేవుడు నిజంగా మిమ్మల్ని ఇప్పుడే తీర్చి దిద్దాలని సంకల్పించాడు. ఇది కేవలం మాటల కోసం చెప్పడం లేదు. భవిష్యత్తులో, మీరు ఎలాంటి దారులు దొరికినా, ఎటువంటి సంఘటనలు జరిగినా, లేదా ఎటువంటి విపత్తులను ఎదుర్కొన్నా, అవన్నీ దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులు చేయడానికి చేసిన సంకల్పాలు; ఇది ఖచ్చితమైన, నిర్వివాదమైన వాస్తవం. దీనిని ఎక్కడ చూడవచ్చు? దేవుని వాక్యమునలకు సంబంధించిన ఒక విషయములో దీనిని చూడవచ్చు. ఎన్నో యుగాలుగా మరెన్నో తరాలుగా దేవుని వాక్యము ఈ రోజున ఉన్న గొప్ప స్థితిలో ఎప్పుడూ ఉండి ఉండలేదు. ఆ వాక్యము అత్యున్నత స్థితిని పొంది ఉన్నది, యావత్ మనుష్యులపై ఈ రోజున పరిశుద్ధాత్మ చేపట్టిన కార్యము ఇంతకుముందు ఎన్నడూ చూడనిది. ఎన్నో తరాలుగా ఏ ఒక్కరూ ఇటువంటి అనుభూతిని పొంది ఉండలేదు; ఆఖరికి యేసు ప్రభువు కాలంలో కూడా, ఈ రోజున ఉన్న ప్రకటనలు అప్పుడు ఉండి ఉండలేదు. మీతో పలికిన వాక్యములు, మీరు వాటిని అర్థం చేసుకోవడము, తద్వారా మీరు పొందుతున్న అనుభూతి, ఇవన్నీ సరికొత్త గొప్ప స్థితిని పొందుతున్నాయి. ఎటువంటి విచారణలు జరుగుతున్నా, ఎటువంటి శిక్షలు పడుతున్నా, మీరు వదిలిపెట్టడము లేదు. ఆ దేవుడి కార్యము అత్యున్నతమైన వైభవమును పొంది ఉన్నదని చెప్పడానికి ఇదే నిదర్శనము. ఇది మానవమాత్రుడి వల్ల సాధ్యమయ్యే విషయము కాదు, అలాగే ఇది మనిషి నిర్వహించగల కార్యము కూడా కాదు; అందుకే, ఇది దేవుడు స్వయముగా చేసిన కార్యము. అందువల్ల, దేవుడి కార్యము యొక్క ఎన్నో వాస్తవికతల ప్రకారము, దేవుడు మనిషిని పరిపూర్ణుడిగా తీర్చి దిద్దాలని సంకల్పించిన విషయాన్ని చూడవచ్చు. ఆయన ఖచ్చితముగా మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయగల సమర్థుడు. మీరు ఈ అవగాహనను కలిగి ఉంటే, ఈ కొత్త విషయాన్ని కనిపెట్టి ఉంటే, అప్పుడు మీరు యేసు ప్రభువు రెండవ అవతారము గురించి నిరీక్షించరు; దానికి బదులు, మీరు ఈ ప్రస్తుత కాలములోనే ఆ దేవుడు మిమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చి దిద్దడానికి అనుకూలముగా వ్యవహరిస్తారు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ మీ పూర్ణ శక్తితో, ఎటువంటి ప్రయత్నము వదలకుండా మీ వంతు కృషి చేయాలి, దాని ద్వారా మీరు దేవునిచే పరిపూర్ణులుగా చేయబడతారు.
ఇప్పుడు, మీరు ఎటువంటి చెడు విషయాలను పట్టించుకోకూడదు. మొదటగా, మీలో దురాలోచనలు కలిగించే ఏ విషయాన్ని అయినా పక్కన పెట్టేయండి ఇంకా తృణీకరించండి. మీరు వ్యవహారములు నిర్వహిస్తున్నప్పుడు, మీ హృదయము స్వయముగా సరైన మార్గమును అన్వేషించుకునేలా, ముందుకు వెళ్లగలిగేలా చేయండి, ఆ హృదయము దేవునికి అంకితమై ఉండేలా చేయండి. మీలో ఒక బలహీనత ఉన్నదని మీరు ఎప్పుడయితే తెలుసుకున్నారో, ఆ బలహీనత మిమ్మల్ని నియంత్రించకుండా చేసుకోగలుగుతున్నారో, ఆ బలహీనత ఉన్నా కూడా, మీరు చేయవలసిన కార్యములను మీరు నిర్వహించగలుగుతున్నట్లయితే, అప్పుడు మీరు సరైన మార్గములో ముందడుగు వేశారని చెప్పవచ్చు. ఉదాహరణకు, మీ అన్నయ్యలు ఇంకా అక్కయ్యలకు మతపరమైన అభిప్రాయాలు ఉండి ఉండవచ్చు, అయినా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు, అంకితం అవుతున్నారు, దేవుని వాక్యమును రుచి చూస్తున్నారు, సేవిస్తున్నారు, స్తోత్రములను పాడగలుగుతున్నారు…. ఒక విధముగా చెప్పాలంటే, మీ శక్తినంతా ఉపయోగించి మీరు చేయగలిగినదంతా చేయడానికి, మీరు చేయవలసిన కార్యములను నిర్వర్తించడానికి మీరు పూర్తి శ్రద్ధతో కృషి చేయాలి. నిష్క్రియత్వముతో నిరీక్షిస్తూ ఉండకండి. మీ విధి నిర్వహణ ద్వారా దేవుడిని సంతృప్తి పర్చుట అనేది మొదటి అడుగు. ఆ తరువాత, మీరు సత్యాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, దేవుని వాక్యముల యొక్క వాస్తములోకి మీకు ప్రవేశించే అర్హత లభిస్తుంది, అప్పుడు మీరు ఆయనచే పరిపూర్ణులుగా తీర్చి దిద్దబడతారు.