అనుభవంతో
పేతురు అనుభవాల్లో అతడు వందలకొద్దీ శ్రమలు అనుభవించాడు. ఈ తరం ప్రజలకు “శ్రమలు” అనే పదం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ దాని అసలైన అర్థాన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మాత్రం ఇంకా అయోమయంలోనే ఉన్నారు. దేవుడు ప్రజల పట్టుదలను ధృఢపరుస్తాడు, వారి నమ్మకాన్ని బలపరుస్తాడు, వారిలోని ప్రతి భాగాన్ని సంపూర్ణం చేస్తాడు, ఇదంతా ప్రధానంగా శ్రమల ద్వారానే సాధ్యమవుతుంది, ఇంకా చెప్పాలంటే ఇవన్నీ పరిశుద్ధాత్మ అగోచరంగా చేసే కార్యాలే. ఇది దేవుడు తన ప్రజలను ఎడబాసినట్లు కనిపించవచ్చు, కానీ, మనుష్యులు దీనిని జాగ్రత్తగా గ్రహించలేకపోతే, వారు ఈ శ్రమలను సాతాను శోధనలుగా చూస్తారు. నిజానికి, చాలా మంది శ్రమలను శోధనలుగా పరిగణిస్తారు, దేవుడు ఈ సూత్ర నియమంపై ఆధారపడే తన పనిని జరిగిస్తారు. ప్రజలు నిజంగా దేవుని సన్నిధిలో నివసిస్తే, వారు వాటిని దేవుని నుండి వచ్చే పరీక్షలుగా పరిగణిస్తారు, వాటిని పోగొట్టుకోరు. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి సాతాను నన్ను సమీపించలేడు అని ఎవరైనా అంటే, అది సరియైనది కాదు; ఒకవేళ అదే నిజమైతే యేసు నలభై రోజులు అరణ్యంలో ఉపవాసముండిన తర్వాత ఆయన శోధనలను ఎందుకు ఎదుకొన్నాడు? కాబట్టి, దేవునిపై తమకున్న విశ్వాసంలో ఉన్న లోటుపాటులను ప్రజలు నిజంగా సరిచేసుకుంటే వారు మరెన్నో సంగతులను మరింత స్పష్టంగా చూడగలగడమే కాకుండా, వారు అర్థం చేసుకునే తీరు గతి తప్పకుండా మరియు తప్పు కాకుండా ఉంటుంది. దేవునిచే పరిపూర్ణులగుటకు ఎవరైనా నిజమైన తీర్మానం తీసుకుంటే, వారు భిన్న కోణాలనుండి వచ్చే అన్ని విషయాలను కుడిఎడమలకు తిరగకుండా ఎదుర్కోవాలి. నీకు దేవుని పని గురించి తెలియకపోతే, మీకు దేవునితో ఎలా వ్యవహరించాలో తెలియదు. నీకు దేవుని పని సూత్రాలు తెలియకపోతే మరియు మానవునిలో సాతాను ఎలా పని చేస్తాడో తెలియకపోతే నీకు వాటిని అనుసరించే మార్గమే ఉండదు. కేవలం రోషము కలిగి ప్రయత్నించినంత మాత్రాన దేవుడు ఆశించే ఫలితాలను నీవు సాధించలేవు. లారెన్స్ కూడా ఇలాంటి అనుభవాన్నే కలిగి ఉన్నాడు: తాను ఎదుర్కొనే పరిస్థితుల మధ్య తారతమ్యాన్ని తెలుసుకోకుండా తాను పొందుకునే అనుభవం మీద మాత్రమే దృష్టిని నిలిపి ఉంచుతూ, సాతాను ఏమి చేస్తాడో పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడో దేవుని సన్నిధి లేకుండా మానవుని స్థితి ఎలా ఉంటుందో మరియు దేవుడు ఎలాంటి వారిని పరిపూర్ణులనుగా చేయాలనుకుంటున్నాడో అసలేమాత్రం అవగాహన లేకుండా ఉండటం. వేర్వేరు రకాల ప్రజలతో వ్యవహరించేటప్పుడు ఏ సూత్రాలను ఆకళింపు చేసుకోవాలి ప్రస్తుత కాలంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుని మనసును ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి వారిపై పరిస్థితులతో సహా దేవుని కరుణ, మహత్యం మరియు నీతి పని చేస్తుంది—ఇలాంటి వాటన్నిటిపై అతడికి ఏమాత్రమూ వివేచన లేదు. వారి అనుభవాలకు పునాదిగా ప్రజలు పలు దర్శనాలను కలిగి లేకపోతే జీవితము మరియు మరింత ఎక్కువగా అనుభవాలకు తావే ఉండదు; వారు అవివేకంతో అన్నింటికీ తమ్మునుతాము లోబరచుకుంటూ అన్నింటినీ సహిస్తూ ఉండిపోతారు. అలాంటి వారిని పరిపూర్ణులను చేయడం చాలా కష్టం. పైన అనుకున్న ఏ దర్శనాన్నీ నీవు కలిగి లేకపోతే నీవు నిశ్చయంగా ఇశ్రాయేలులో నిలిచియుండే ఉప్పు స్థంభానికి నిదర్శనమని చెప్పవచ్చు. అలాంటి వారు పనికిమాలినవారు, వారు దేనికీ పనికి రారు! కొంతమంది మాత్రము దేనికైనా గుడ్డిగా సమర్పించుకొంటారు మరియు కొత్త విషయాలతో వ్యవహరించేటప్పుడు వారు తమ స్వంత జ్ఞానమును ఉపయోగించి నిర్వర్తిస్తారు లేదా అసలు ప్రస్తావించడానికే ప్రాధాన్యత లేని అంశాలకు “జ్ఞానాన్ని” ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వారు వివేచనా రహితులు, వారెలా ఉంటారంటే దేవుని ఏర్పాటులోనికి రాకుండా ఎప్పుడూ వెనుకకు మళ్ళేవారిగా ఉంటారు, వారెన్నటికీ మారరు. ఇలాంటి వారు కనీస వివేచన లేని అవివేకులవలె ఉంటారు. వారెప్పుడూ పరిస్థుతులకు, వేర్వేరు జనులకు తగినవిధంగా ప్రవర్తించరు. అలాంటి వారికి అనుభవం లేదు. నేను కొంతమందిని చూసాను. వారు తమ స్వంత ఆలోచనతో నింపబడిన వారై అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారిని చూసినప్పుడు ఆ అపవిత్రాత్మలను గద్దించే ధైర్యం లేక దేవుని దగ్గర తమ పాపాలను ఒప్పుకొంటూ ఉంటారు. వీరు పరిశుద్ధాత్మ కార్యాన్ని స్పష్టంగా ఎదుర్కొన్నప్పుడు, దానికి లోబడటానికి మాత్రం ముందుకు రారు. వారు దురాత్మలు కూడా దేవుని చేతిలోనున్నవే అని విశ్వసిస్తూ వాటిని ఎదుర్కొని గద్దించడానికి కనీస ధైర్యాన్ని కూడా కలిగి ఉండరు. అలాంటి వారు దేవునికి అవమానాన్ని తీసుకురావడంతో పాటు దేవుని గురించిన అధిక భారాన్ని కలిగి ఉండలేని అసమర్ధులుగా ఉంటారు. అలాంటి అవివేకులు ఏరకంగానూ తారతమ్యాలను గుర్తించలేరు. అది దేవునికి అంగీకారయోగ్యం కానిది కాబట్టి అలాంటి అనుభవం నుండి బయటపడాలి.
దేవుడు నిజంగా ప్రజలలో ఎంతో పనిని నెరవేరుస్తాడు, కొన్ని సార్లు వారిని పరీక్షిస్తాడు కొన్నిసార్లు వారిని ధృఢపరిచే పరిస్థితులను కలిగిస్తాడు మరికొన్నిసార్లు వారిని నడిపించడానికి వీలుగా వారి లోపాలను సరిదిద్దడానికి వారితో మాట్లాడతాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ప్రజలకు కొదువగా ఉన్న అనేక విషయాలను ప్రజలు అప్రయత్నంగా తెలుసుకోవడానికి వారికొరకు దేవుడు సిద్ధం చేసిన పరిస్థితులలోనికి ప్రజలను నడిపిస్తుంది. ప్రజలు పలికే మాటలు, చేసే పనులు ఇతరులను చూసే విధానం మరియు పరిస్థితులతో వ్యవహరించే తీరు ద్వారా పరిశుద్ధాత్మ వారికి తెలియకుండానే అనేక విషయాలను అనుభవంలోనికి తీసుకువస్తూ అనేక మందిని స్పష్టంగా చూడటానికి వీలుకలిగిస్తూ ఇదివరకెప్పుడూ వారికి తెలియని సంగతులను చూసేలా చేస్తూ ఇదివరకు ఎప్పుడూ అర్థం చేసుకొని ఉండని అనేక విషయాలలో జ్ఞానపు వెలుగులోనికి నడిపిస్తుంది. నీవు ఈ లోకపు పనులతో జోక్యం కలిగి ఉన్నప్పుడు నెమ్మదిగా లోకములోని విషయాలను వివేచించడం ప్రారంభిస్తావు. ఇంకా నీ అంతముకు ముందు నీవు ఈ విధంగా చెప్పవచ్చు: “ఒక వ్యక్తిగా ఉండటం నిజంగా ఎంతో కష్టం.” దేవునితో కొంత సమయాన్ని గడిపి అనుభవాన్ని పొందుతూ దేవుని పనిని మరియు మనసును అర్థం చేసుకుంటే నీవు నెమ్మదిగా లోతైన అవగాహనను పొందుకోవడంతో పాటు నీ స్థాయి కూడా నెమ్మదిగా పెరుగుతుంది. నీవు అనేక ఆత్మీయ విషయాలను మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతావు మరియు ప్రత్యేకించి దేవుని పని విషయంలో నీకు స్పష్టత లభిస్తుంది. నీవు దేవుని వాక్యాన్ని, పనిని, సకల కార్యాలను, మనసును, అసలు దేవుడెవరు, ఆయన ఏమై ఉన్నాడు మరియు నీ స్వంత జీవితంలా దేవుడు ఇంకా కలిగి ఉన్నవి ఏమిటి అనే విషయాలను అంగీకరిస్తారు. నీవు ఈ లోకంలో కేవలం సంచరించేవాడివిగా ఉంటే స్వేచ్ఛగా జీవించాలనే కోరిక నానాటికీ ఎక్కువై దేవుని చిత్తాన్ని చేయడానికి నీ నుండి ప్రతిఘటన మరింత అధికమవుతుంది; అలా అయితే దేవుడు నిన్నెలా వాడుకోగలడు? “నా అభిప్రాయం ప్రకారం” అనే భావన నీలో అధికంగా ఉన్నందున దేవుడు నిన్ను వాడుకోడు. నీవు దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా గడిపితే నీవు అన్ని అనుభవాలను పొందుకుంటావు. నీవు ఈ లోకంలో ఇంకనూ మృగము వలె—నీ నోరు దేవుని యందలి విశ్వాసాన్ని ప్రకటిస్తూ నీ హృదయము అందుకు భిన్నంగా మరెక్కడో ఉంటూ—నీ జీవితాన్ని జీవించడానికి ఈ లోకసంబంధమైన తాత్విక చింతనను నేర్చుకుంటూ జీవించుచున్నట్లయితే నీవు గతంలో పడిన కష్టం అంతా దేనికోసం పనికొచ్చినట్లు? కాబట్టి ప్రజలు దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా ఉంటే అంత సులభంగా దేవుడు వారిని పరిపూర్ణులను చేయగలడు. పరిశుద్ధాత్ముడు పని చేసే విధానం ఇదే. నీకు ఇది అర్థం కాకపోతే నీవు సరియైన మార్గంలోనికి ప్రవేశించడంతో పాటు దేవునిచే పరిపూర్ణులు కావడం కూడా అసాధ్యమే అవుతుంది. నీవు సాధారణ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండలేవు; నీవు అవిటివాని వలె ఉంటూ నీ జీవితమంతటిలో నీ శ్రమ తప్ప దేవుని పని ఏదీ ఉండదు. ఇది నీ అనుభవంలోని లోపం కాదా? నీవు దేవుని సన్నిధిలో ఉండటం కొరకు ప్రార్ధనే చేయాల్సిన అవసరం లేదు; కొన్నిసార్లు నీవు దేవుని కోసం ఆరాటపడటం ద్వారా లేదా ఆయన పని కొరకు ఎదురుచూడటం ద్వారా, కొన్నిసార్లు ఏదైనా ఒక విషయంలో నువ్వు వ్యవహరించే విధానం ద్వారా మరియు కొన్నిసార్లు ఏదైనా సంఘటనలో నీ తత్వం ఏమిటో బయలుపరచడం ద్వారా కూడా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. ఎక్కువమంది “నేను తరచూ ప్రార్ధన చేస్తూ ఉంటాను కదా నేను దేవుని సన్నిధిలో ఉన్నట్లు కాదా?” అని అంటారు చాలా మంది “దేవుని సన్నిధిలో” అంతు లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ ప్రార్ధన చేస్తూనే ఉన్నప్పటికీ వారు నిజానికి దేవుని సన్నిధిలో నివసించరు. అలాంటి వారు దేవుని సన్నిధిలో వారి పరిస్థితులను కొనసాగించగలగడానికి ఇదొక్కటే మార్గము; వారు అన్ని సమయాల్లో హృదయం ద్వారా దేవునితో ఏ మాత్రమూ ఉండలేకపోవడమే కాక తమ ఆలోచనలలో దేవుని వెదకుట ద్వారా కానీ మౌనంగా దేవునికోసం కనిపెట్టుకొని ఉండటం ద్వారా గానీ తమ హృదయములలో దేవునితో ఏకమై ఉండటం కొరకు ఆలోచించడం ద్వారా కానీ దేవుని భారం పట్ల ఆసక్తిని కలిగి ఉండటం ద్వారా కానీ దేవుని వద్దకు రాలేరు. వారు పరలోకమందున్న దేవునికి తమ నోటి ద్వారా మాత్రమే ప్రార్ధన చేస్తారు. అనేకుల హృదయాలలో దేవుడు నివాసముండటం లేదు, వారు దేవునికి సమీపంగా వచ్చినప్పుడు మాత్రమే వారి హృదయాలలో దేవుడు ఉంటున్నాడు; ఎక్కువ సందర్భాలలో అసలు వారి హృదయాలలో దేవుని కలిగి లేరు. దేవుడిని హృదయంలో కలిగి ఉండకపోవడానికి ఇదొక నిదర్శనం కాదా? వారు నిజంగానే వారి హృదయాలలో దేవుని కలిగి ఉంటే దొంగలు మరియు క్రూర మృగాలు చేసే పనులను వారు చేసి ఉండేవారా? దేవుని పట్ల నిజమైన భక్తిని కలిగి ఉండే వారు దేవునికి సమీపంగా తమ హృదయాన్ని తీసుకురావడమే కాక వారి ఆలోచనలు మరియు ఉపాయాలన్నీ ఎల్లప్పుడూ దేవుని మాటలచే నిండి ఉంటాయి. వారి మాటలలో గానీ క్రియలలో గానీ దోషముండదు మరియు దేవునికి విరోధమైన ఏ పనినీ వారు తలపెట్టరు. విశ్వాసిగా ఉండటానికి ప్రమాణం అదే.