రక్షణ పొందుకున్న వ్యక్తి అంటేనే సత్యాన్ని అనుసరించడానికి ఇష్టపడిన వ్యక్తి అని అర్థం
సరియైన సంఘ జీవితమును కలిగియుండవలసిన అవసరత ఉందని ప్రసంగాలలో ఎన్నోమార్లు చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ, సంఘ జీవితము ఇంకా ఎందుకు మెరుగపరచబడుటలేదు, మరియు ఇంకా పాతదిగానే ఎందుకు ఉండిపోయింది? సంపూర్ణముగా క్రొత్తదిగాను మరియు విభిన్నమైన జీవితముగలదిగాను ఎందుకు ఉండలేకపోతోంది? ఒకనాటి చక్రవర్తి కాలములో జీవించినట్లుగా నేటి శతాబ్దములోని ఒక వ్యక్తి జీవించడం సాధ్యమా? ఇప్పుడున్న ప్రజలు రుచి చూస్తున్న అనేకమైన పానీయాలను మరియు రుచికరమైన వంటలను పూర్వకాలములోని ప్రజలు రుచి చూసుండకపోవచ్చు గానీ సంఘ జీవితములో పెద్ద మార్పులేమీ చోటు చేసుకోలేదు. ఇది క్రొత్త తిత్తులలో పాత ద్రాక్షారసమును పోసినట్లుగా ఉంది. అలాంటప్పుడు దేవుడు ఇన్ని విషయాలు చెప్పి ప్రయోజనము ఏమిటి? అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి సంఘాలు మార్పు చెందనేలేదు. మార్పు చెందని ఈ దుస్థితిని నేను నా కళ్ళారా చూశాను మరియు ఆ స్థితి నా హృదయములో స్పష్టంగా ఉండిపోయింది; నా వరకు నేను సంఘ జీవితము అనుభవించకపోయినప్పటికీ, నేటి సంఘ కూడికల స్థితిగతులను గూర్చి నాకు చాలా స్పష్టంగా తెలుసు. వారు తగినంత ప్రగతిని సాధించలేదు. క్రొత్త తిత్తులలో పాత ద్రాక్షారసమును పోసినట్లుగా వారి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎటువంటి మార్పు లేదు! వారిని కాయడానికి ఎవరైనా కాపరిగా ఉన్నట్లయితే వారు అగ్ని జ్వాలలవలె మండుతూ ఉంటారు గానీ వారిని బలపరిచేవారెవరూ లేనప్పుడు మంచు గడ్డలా చల్లగా ఉంటారు. అనేకులు ఆచరణాత్మక విషయాలను మాట్లాడరు, వారిలో కొద్దిమంది మాత్రమే అరుదుగా నాయకత్వపు బాధ్యతలు చేపడతారు. ప్రసంగాలు గంభీరముగా ఉన్నప్పటికినీ వాటిని అర్థము చేసుకునేవారు కేవలము కొంతమంది మాత్రమే. కొంతమంది ప్రజలు దేవుని వాక్యాన్ని బాగుగా ఆస్వాదిస్తారు. దేవుని వాక్యాన్ని గ్రహించేటప్పుడు వారు చాలా కన్నీరు కారుస్తారు, ఆ వాక్య ప్రకారంగా నడిచినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు మరియు వారు వాక్యమును అనుసరించనప్పుడు లోక సంబంధులుగా మారి, నిస్సారమైపోతారు. నిజం చెప్పాలంటే, మీరు దేవుని వాక్యములో ఆనందించకపోయినట్లయితే ఒక నిధిగా దేవుని మాటలను మీ నోటి నుండి రావడం చూడలేము. మీరు దేవుని వాక్యమును చదవడానికి భయపడి, ఆ దేవుని మాటలను కంఠత చేయడానికి ఒత్తిడికి గురై, ఆ మాటలను ఆచరణలో పెట్టడానికి వచ్చినప్పుడు, గుర్రపు తోక వెంట్రుకలతో బోరింగు పంపును కొట్టినట్లుంటుంది; మీరు ఎంత కృషి చేసినా ఆ బోరింగును కొట్టడానికి అవసరమయ్యే శక్తి లభించదు. మీరు దేవుని వాక్యాన్ని చదువుచుండగానే శక్తి పొందుకుంటారు, అయితే దానిని ఆచరించాలని మరిచిపోతారు. వాస్తవానికి, ఈ మాటలను బాధాకరంగా మాట్లాడి, సహనముతో పునరావృతము చేసి పదే పదే చెప్పనవసరములేదు; అయితే విషయము ఏమిటంటే, ప్రజలు దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టకుండ, కేవలం వింటారు గనుకనే వారు దేవుని పనికి అడ్డుబండలుగా మారిపోయారు. నేను దానిని అనుసరించలేను, నేను వాక్యమును గూర్చి మాట్లాడలేను. నేను వాక్య ప్రకారంగా జీవించాలని బలవంతం చేయబడ్డాను; అయితే ఇతరుల బలహీనతలను ఎత్తి చూపించడములో నేను సంతోషిస్తున్నాని దాని అర్థం కాదు. మీ ఆచరణ ఇంచు మించు సరిపోతుందని మీరు అనుకుంటున్నారు—అంటే ప్రత్యక్షతలు తారా స్థాయిలో ఉన్నప్పుడు మీ ప్రేవేశము కూడా తారా స్థాయితో ఉంటుందా? ఇది ఇంత సులభమా? మీ అనుభవాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఆ పునాదిని మీరు ఎప్పుడూ పరీక్షించుకోరు! ప్రస్తుతం మీరు జరిపించుకుంటున్న కూడికలు సరియైన సంఘ జీవితము కలిగియున్నాయని చెప్పబడవు, కనీసం ఆధ్యాత్మిక కూడికలుగా కూడా పరిగణించబడవు. ఈ కూడికలను కేవలము కొందరు ఒక దగ్గర కూడుకొని పాటలు పాడుకొని, ముచ్చట్లు చప్పుకొని సంతోషించి వెళ్ళిపోయే గుంపు గానే పిలుస్తారు. అందులో నిజాయితీ కరువైందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరింత స్పష్టంగా చెప్పాలంటే, నీవు సత్యాన్ని అభ్యసించకపోతే, నిజాయితీ అనేది ఎక్కడుంటుంది? నీవు నిజాయితీ కలిగియున్నావని గొప్పలు చెప్పుకోవడమే అవుతుంది కదా? ఎల్లప్పుడూ పని చేసే ప్రతియొక్కరూ అహంకారముగాను మరియు గర్వముగాను ఉంటారు, అయితే వినయము కలిగినవారు తమ తలలు దించుకొని మౌనంగా ఉండి, ఎటువంటి తర్ఫీదుకు అవకాశం ఇవ్వరు. పని చేయడం తప్ప మాట్లాడడం మాత్రమే చేసేవారు, అటూ ఇటూ వెళ్ళడం, ఎక్కువెక్కువగా అరవడం తప్ప మరేమీ చేయరు మరియు వారిని అనుసరించేవారు కేవలము వారి మాటలు వింటూ ఉండాలంతే. మాట్లాడుటకు రూపాంతరం చెందరు; ఇవన్నీ కేవలం గతానికి చెందిన విషయాలు మాత్రమే! నేడు మీరు విధేయులుగా ఉండి, మీకు నచ్చినట్లు జీవించుటకు ఇష్టపడుట లేదంటే దానికి కారణం దేవుని శాసనాలే గాని ఇది మీకు అనుభవాల ద్వారా వచ్చిన మార్పు కాదు. దేవుని మాటలవలన కలిగే కార్యాలు స్పష్టమైన ప్రభావాన్ని చూపుతూ మరియు ప్రజలను జయించిన కారణాన కార్యనిర్వహణపరమైన శాసనాలను ఉల్లంఘించే కొన్ని పనులను నీవు చేయలేకపోవుచున్నావన్నది వాస్తవం. వీటిని నన్నడగనివ్వండి: నీవు ఈనాడు పొందియున్న ఘనతలో ఎంతవరకు నీ కృషితో సంపాదించియున్నావు? వీటిలో ఎంతవరకు దేవుడు మీకు స్వయంగా చెప్పియున్నాడు? నీవు ఎలా జవాబునిస్తావు? నీవు మూగబోయావా మరియు మాటలు రావట్లేదా? ఇతరులు చేసిన భోజనమును నీవు ఆరగిస్తుంటే, మిమ్ములను బ్రతికించడానికి అందించే వారి నిజమైన అనుభవాలను గూర్చి ఇతరులు ఎందుకు పంచుకోగలుగుచున్నారు? నీకు సిగ్గనిపించడంలేదా? మీరు నిజ నిర్ధారణ పరీక్షను చేసుకోవచ్చు, మంచివారిని పోల్చుకుంటూ పరిశీలన చేసుకోవచ్చు: నీవు సత్యాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నావు? అర్థం చేసుకున్న ఆ సత్యాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టావు? నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దేవునినా లేక నిన్నా? నీవు ఎక్కువగా ఇచ్చావా, లేక ఎక్కువగా తీసుకున్నావా? ఎన్ని సందర్భాలలో మీరనుకున్న ఉద్దేశము విఫలపరచి, మీ పాత జీవితానికి స్వస్తి చెప్పి, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు? ఈ కొన్ని ప్రశ్నలకే కొంతమంది నోరెళ్ళబెడుతారు. చాలామంది ప్రజలు తాము అనుకున్న ఉద్దేశము తప్పని గ్రహించినప్పటికీ, వారు తెలిసి తప్పు చేస్తూనే ఉంటారు. మరియు వారు తమ స్వయిచ్చలను తృణీకరించుటలో ఏ మాత్రము కృషి చేయరు. అనేకమంది ప్రజలు తమలో పాపము ప్రబలముగా ఏలడానికి, వారి ప్రతి క్రియను పాపము నిర్దేశించడానికి అనుమతిస్తుంటారు. వారు తమ పాపములను అధిగమించలేకపోవుచున్నారు. ఇటువంటి ప్రస్తుత పరిస్థితిలో తాము చెడు క్రియలు చేశామని ఎంత మంది ప్రజలకి తెలియదు? నీవు తెలియదని చెప్పినట్లయితే, నీవు తప్పకుండ అబద్ధము చెప్పుచున్నావు. యథార్థముగా చెప్పాలంటే, మీ పాత స్వభావమును వదులుకోవడానికి మీరు ఇష్టపడటంలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉపయోగములేని పశ్చాత్తాప మాటలు “హృదయము నుండి” ఎన్ని చెబితేనేమి? ఇవి నీ జీవితములో ఎదగడానికి ఉపయోగపడుతాయా? మిమ్మల్ని గూర్చి మీరు తెలుసుకోవడానికే మీ పూర్తి కాలాన్ని వినియోగించవలసియున్నది. ప్రజలుకున్న సమర్పణనను బట్టి మరియు దేవుని వాక్యాలను వారు అనుసరించుదానిని బట్టి ప్రజలు పరిపూర్ణులవుతారని నేను భావిస్తాను. పండితులుగా మరియు విద్యావంతులుగా కనబడడానికి దుస్తులు ధరించినట్లు మీరు దేవుని వాక్యమును ధరించినట్లయితే మిమ్మల్ని మీరు మోసము చేసుకొని, ప్రజలను కూడా మోసపరచుచున్నట్లు కాదా? ఇదంతా మీరు మాట్లాడి, వాటిని ఆచరణలో పెట్టకపోతే, మీరు ఏమి సంపాదించాలనుకుంటున్నారు?
అనేకమంది ప్రజలు తాము వాక్య ప్రకారంగా అనుసరించే దానిని గూర్చి తక్కువగా మాట్లాడుతారు, వ్యక్తిగతంగా వారు ఎలాంటి అనుభూతిని పొందారన్నదానిని గూర్చి ఎక్కువగా మాట్లాడుతారు. అయితే వీరిలో ఎక్కువమంది ఇతరుల మాటల నుండి ప్రభావితం చెందినవారే. ఇందులో వారు తమ స్వంతంగా వ్యక్తిగతంగా అనుసరించే దానిలో నుండి గానీ, లేక వారు తమ స్వంత అనుభవాలలో నుండి తాము చూసిన వాటిలోనుండి గానీ ఎటువంటి విషయాలను చేర్చియుండరు. ఈ సమస్యను నేను ముందుగానే విభజించి చెప్పియున్నాను; నాకు ఏమి తెలియదని ఆలోచన చేయవద్దు. నీవు ఒక కాగితపు పులివై, నేను సాతానును జయిస్తానని, అనేకమైన విజయవంతమైన సాక్ష్యాలను కలిగియుంటానని, మరియు దేవుని స్వారూప్యతను కలిగి జీవిస్తానని చెబుతూ ఉంటావు, ఇది ఎంతవరకు సమంజసము? ఇవన్నీ అర్థములేని మాటలే! ఈ రోజున దేవుడు పలికిన ప్రతి మాట మీరు పొగుడుకోవడానికని మీరు ఆలోచిస్తున్నారా? మీరు మీ పాత స్వభావమును వదిలిపెట్టి, సత్యాన్ని అనుసరిస్తున్నారని మీ నోటి మాటల ద్వారా చెప్పవచ్చు గానీ మీ చేతలు సత్యానికి అతీతమైన క్రియలు చేసుకుంటూ, మీ హృదయము రహస్యమైన తంత్రాలను అనుసరిస్తున్నట్లయితే, మీరు ఎటువంటి వ్యక్తిగా జీవిస్తున్నారో ఆలోచించారా? మీ హృదయము మరియు మీ చేతులు ఎందుకు ఒకేలాగా లేవు మరియు అవి రెండూ ఒకే పనిని ఎందుకు చేయడములేదు? ఎక్కువ ప్రసంగించడం అనేది వ్యర్థమైన మాటలు పలకడముగా మారింది; ఇది కాదా హృదయ విదారక విషయం? మీరు దేవుని మాటలను అనుసరించకపోతే, పరుశుద్దాత్ముడు కార్యము చేసే మార్గములోనికి మీరు ఇంకా ప్రవేశించలేదన్నమాట, అప్పుడు మీరు సత్యమును అనుసరించని వ్యక్తిగా మిగిలిపోతారు. ఇలాంటి వ్యక్తిని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. పాపులను, పేదలను మరియు దీనులను రక్షించే క్రమములో యేసు సిలువ శ్రమలను పొందుచున్నప్పుడు భయంకరమైన వేదనను అనుభవించాడు. ఆయన పొందిన సిలువ శ్రమలు పాప ప్రాయశ్చిత్తముగా అర్పించబడింది. మీరు దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే మీరు ఎంత త్వరగానైతే అంత త్వరగా విడిచిపెట్టి వెళ్ళండి; దేవుని ఇంటిలో స్వేచ్ఛగా తిరిగే వ్యక్తిగా ఉండనవసరములేదు. కొంతమంది దేవునిని ఎదిరించే పనులను చేస్తున్నారని వారికి స్పష్టంగా తెలిసిన వాటిని ఆపలేకపోవుచున్నారు. అది వారు చనిపోవడానికి అడుగుచున్నట్లుగా లేదూ? వారు దేవుని రాజ్యములో ప్రవేశించడమును గూర్చి ఎలా మాట్లాడుతారు? అలాంటి వారు దేవుని ముఖమును చూడటానికి ధైర్యము చేయగలరా? దేవుడు అనుగ్రహించే ఆహారమును భుజిస్తూ, దేవునికి విరుద్ధమైన పనికిమాలిన పనులు చేస్తూ, హానికరంగా, కృత్రిమంగా, కుతంత్రముగా ఉంటూ, దేవుడు మీ మీద ఉంచే ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు మీ చేతులు కాలే అనుభవాన్ని మీరు పొందుకోరా? ఆ సమయములో మీ ముఖము ఎర్ర బారదా? దేవునికి విరుద్ధమైన పనులు ఏవో చేశానని, “వంచకునిగా” ఉండటానికి అనేకమైన కుతంత్రాలను అనుసరించానని నీకు భయము పుట్టదా? ఇలాంటి అనుభవాలు మీకేమి కలుగకపోతే, మీరు భవిష్యత్తును గూర్చి ఎలా మాట్లాడగలరు? ఎప్పటినుండో మీకు భవిష్యత్తు ఏమీ లేకపోతే, భవిష్యత్తును గూర్చి మీకు ఇంకేమి గొప్ప ఆశలు ఉంటాయి? మిమ్మల్ని మీరు విమర్శించుకొనకుండా, హృదయములో ఎటువంటి మార్పు లేకుండా, మీరు ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతుంటే దేవుడు మిమ్మల్ని ఇప్పటికే వదిలి పెట్టాడని అర్థం కాదా? సున్నితముగా మాట్లాడడం, నటించడం మరియు అడ్డు అదుపులేకుండా ఉండడం అనేది నీ స్వభావముగా మారిపోయింది; ఈ విధంగా ఉంటే దేవుని ద్వారా ఎప్పటికైనా పరిపూర్ణులు కాగలరా? మీరు లోకమును జయించగలరా? మీ ద్వారా ఎవరు ఒప్పించబడగలరు? మీ నిజ స్వభావమును గురించి తెలిసిన వారందరూ మిమ్మలను దూరంగా ఉంచుతారు. ఇది దేవుని శిక్ష కాదా? సమస్త విషయాలను కేవలము మాట్లాడుతూ, అనుసరణ లేకపోయినట్లయితే, ఎటువంటి ఎదుగుదల ఉండదు. మీరు మాట్లాడుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు బహుశః పని చేస్తూ ఉండవచ్చు, మీరు చెప్పినవాటిని అనుసరించకపోయినట్లయితే, పరిశుద్ధాత్ముడు పని చేయడం ఆపి వేస్తాడు. మీరు ఇలాగే జీవిస్తున్నట్లయితే, మీ భవిష్యత్తును గూర్చి, లేక దేవుని పని కొరకు మీరు సమస్తాన్ని అప్పగించుకున్నారనే విషయమును గూర్చి మాట్లాడుటకు ఏమి మిగిలి ఉంటుంది? మీరు మీ సమస్త జీవితాన్ని అందించడం గురించి మాత్రమే మాట్లాడగలరు, అయినప్పటికీ మీరు ఇంకా మీ నిజమైన ప్రేమను దేవునికి ఇవ్వరు. ఆయన మీ నుండి పొందుకున్న భక్తియంతా కేవలము మీ నోటి నుండి వచ్చిన భక్తి మాత్రమే; సత్యాన్ని అనుసరించాలనే ఆలోచన కూడా ఆయనకు మీరివ్వలేదు. ఇదే మీకున్న నిలువెత్తు స్వభావమా? మీరు ఇలాగే మీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే, దేవుని ద్వారా మీరెప్పుడు పరిపూర్ణులవుతారు? మబ్బుగాను, చీకటిమయంగా ఉండే మీ భవిష్యత్తును గూర్చి మీకు భయమనిపించట్లేదా? దేవుడు మీ మీద ఆశలు కోల్పోయాడని మీకనిపించట్లేదా? మిమ్మల్ని క్రొత్త ప్రజలనుగాను, లేక పరిపూర్ణమైన ప్రజలనుగాను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడని మీకు తెలియదా? పాత స్వభావాలు అలాగే ఉండిపోతాయా? ఈ రోజున నీవు దేవుని మాటలకు శ్రద్ధ చూపడం లేదు: నీవింకా రేపటి కొరకు ఎదురుచూస్తున్నావా?