నీవు సత్యాన్ని అర్థం చేసుకుంటే, నీవు దానిని తప్పక ఆచరణలో పెడుతావు

దేవుని పని మరియు వాక్యము మీ స్వభావములో మార్పు తీసుకొచ్చే ఉద్దేశ్యంతోనే ఉంటాయి; దేవుని పనిని మరియు వాక్యమును మీరు అర్థం చేసుకునేలా చేయడము మాత్రమే ఆయన లక్ష్యం కాదు. ఆయనకు అది మాత్రమే చాలదు. నీవు విషయ అవగాహన సామర్థ్యం కలిగిన వ్యక్తివి, కాబట్టి, దేవుని వాక్యమును అర్థం చేసుకోవడంలో నీకు ఎటువంటి కష్టమూ లేదు, ఎందుకంటే, దేవుని వాక్యాల్లో ఎక్కువ భాగం మనుష్య భాషలోనే రాసి ఉంటాయి, మరియు ఆయన అత్యంత స్పష్టముగా మాట్లాడుతాడు. ఉదాహరణకు, నీవు దేనిని అర్థం చేసుకోవాలి మరియు దేనిని సాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో దానిని నేర్చుకోవడానికి నీవు చక్కటి సామర్థ్యం కలిగి ఉన్నావు; అవగాహన సామర్థ్యం కలిగిన ఒక సామాన్య వ్యక్తి ఈ పని తప్పకుండా చేయగలడు. నిర్ధిష్టంగా చెప్పాలంటే, ప్రస్తుత దశలో దేవుడు చెప్పిన వాక్యాలు ప్రత్యేకించి స్పష్టంగా మరియు పారదర్శకంగా ఉంటాయి, మరియు మనుష్యులు పరిగణనలోకి తీసుకోని అనేక అంశాలతో పాటు మానవ స్థితులను దేవుడు ఎత్తి చూపుతున్నాడు. ఆయన వాక్యాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి, మరియు పున్నమి చంద్రుడిలా స్పష్టంగా ప్రకాశిస్తుంటాయి. ఇప్పుడు మనుష్యులు చాలా సమస్యలు అర్థం చేసుకుంటున్నారు, కానీ, ఇప్పటికీ వాళ్లు ఏదో కోల్పోతున్నారు—ఆయన వాక్యాలను ఆచరణలో పెట్టడం మర్చిపోతున్నారు. మనుష్యులు కేవలం తమకు అందుబాటులో ఉన్న వాటిని శోషించుకోవడం కోసం నిరీక్షించడం కాకుండా, సత్యానికి సంబంధించిన అన్ని అంశాలను వారు తప్పనిసరిగా వివరణాత్మకంగా అనుభవం చెందాలి; అలాకాని పక్షంలో, వారు పరాన్నజీవుల కంటే గొప్పవారేమీ కాలేరు. వారికి దేవుని వాక్యం తెలిసినప్పటికీ, దానిని ఆచరణలో పెట్టడం లేదు. ఇలాంటి ఒక మనిషి సత్యాన్ని ప్రేమించలేడు మరియు చిట్టచివరకు వెలివేయబడతాడు. 1990ల నాటి పీటర్లాగా ఉండాలంటే, మీలోప్రతిఒక్కరూ దేవుని వాక్యాన్ని తప్పక ఆచరణలో పెట్టాలి, నీ అనుభవాల్లోకి నిజంగా ప్రవేశించడంతో పాటు దేవునితో నీ సహకారం ద్వారా మరింత గొప్ప జ్ఞానోదయం పొందాలి, నీ సొంత జీవితంలో ఎదగటానికి ఇది నిరంతర సహాయంగా మారుతుంది. మీరుదేవుని వాక్యాలను పెద్ద మొత్తంలో చదివినప్పటికీ, ఆ వచనం మాత్రమే అర్థం చేసుకుని, నీ ఆచరణీయ అనుభవం ద్వారా దేవుని వాక్యంలోని ప్రత్యక్ష జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే, దేవుని వాక్యాన్ని నీవు గ్రహించలేవు. దేవుని వాక్యం గురించి నీలో అంతర్మథనం జరగనంతవరకు, దేవుని వాక్యం నీకు జీవంగా కనిపించదు, కేవలం జీవం లేని అక్షరాలుగా మాత్రమే కనిపిస్తుంది. జీవం లేని అక్షరాల్లో మాత్రమే నీవు జీవించిన పక్షంలో, దేవుని వాక్యంలోని సారాన్ని నీవు గ్రహించలేవు మరియు ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకోలేవు. దేవుని వాక్యాన్ని నీవు వాస్తవిక అనుభవాలతో అనుభూతి చెందినప్పుడు మాత్రమే, ఆయన వాక్యంలోని మహిమాన్విత అర్థం నీ తలకెక్కుతుంది. అనేక సత్యాల మహిమాన్విత అర్థాన్ని నీవు గ్రహించగలగడంతో పాటు దేవుని వాక్యంలోని రహస్యాల తాళం తీయగలిగిన అనుభవం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నీవు దీనిని ఆచరణలో పెట్టని పక్షంలో, ఆయన వాక్యం ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ, అందులోని అక్షరాలు మరియు సిద్ధాంతాలు మాత్రమే నీవు గ్రహిస్తావు, అవి నీకు మతపరమైన నిబంధనలుగానే ఉంటాయి. పరిసయ్యులు కూడా ఇలాగే చేశారని నీకు తెలుసు కదా? దేవుని వాక్యాన్ని మీరుఆచరించి అనుభూతి చెందగలిగితే, అది మీకు ఆచరణీయంగా మారుతుంది; దానిని ఆచరణలో పెట్టాలని నీవు కోరుకోని పక్షంలో, దేవుని వాక్యం నీకు మూడో పరలోకానికి సంబంధించిన ఒక గాధగా మాత్రమే వినిపిస్తుంది. నిజానికి, దేవుని యందు విశ్వాసం అనే ప్రక్రియ ఆయన వాక్యాన్ని అనుభూతి చెందడంతో పాటు ఆయన ద్వారా పొందబడిన ప్రక్రియగా ఉంటుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, దేవుని యందు విశ్వాసం అనేది ఆయన వాక్యం గురించిన యెరుక మరియు అర్థం చేసుకోవడానికి సమానంగా ఉంటుంది మరియు ఆయన వాక్యాన్ని అనుభూతి చెందడంతో పాటు దానితోటే జీవించినట్లుగా ఉంటుంది; దేవుని యందు మీవిశ్వాసం వెనుక ఇదే వాస్తవంగా ఉంటుంది. మీరు దేవునియందు విశ్వాసముంచి, మీరు సత్యసంబంధమైన వాస్తవములోనికి ప్రవేశించకుండా, దేవుని వాక్యాన్ని ఆచరించడానికి వెదకకుండా నిత్యజీవము కొరకు నిరీక్షణకలిగియున్నట్లయితే, నీకంటే మూర్ఖుడు వేరొకరు ఉండరు. విందుకు వెళ్లి, అక్కడి ఆహార పదార్థాల్లో ఏదీ రుచి చూడకుండానే, కేవలం ఆ రుచికరమైన ఆహార పదార్థములన్నిటిని కంఠత పట్టి నేర్చుకున్నట్లుగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని మూర్ఖుడు అని కాకుండా ఇంకేమంటారు?

మనుష్యుడు కలిగి ఉండాల్సిన సత్యం అనేది దేవుని వాక్యంలో కనుగొనబడాలి. అలాంటి సత్యం మాత్రమే మనుష్యులకు అత్యంత ప్రయోజనకరంగా మరియు సహాయకరంగా ఉంటుంది. మీశరీరానికి అవసరమైన బలవర్ధక పానీయం మరియు పోషక పదార్థం కూడా ఇదే. మనుష్యుడి సాధారణ మానవత పునరుద్ధరణకు ఇది మాత్రమే సహాయపడుతుంది. మనిషికలిగి ఉండాల్సిన సత్యం ఇదే. దేవుని వాక్యాన్ని మీరు ఎంతగా ఆచరణలో పెడితే, అంత త్వరగా మీ జీవితం వికసిస్తుంది, మరియు ఆ సత్యం కూడా అంతగా తేటతెల్లమవుతుంది. మీరు ఉన్నత స్థాయిలో పెరిగితే, ఆధ్యాత్మిక ప్రపంచంలోని అంశాలను మీరు మరింత స్పష్టంగా చూడగలరు, మరియు సాతాను మీద పైచేయి సాధించడానికి మరింత బలం కలిగి ఉంటారు. మీరు అర్థం చేసుకోలేని చాలా సత్యాలనేవి మీరు దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. చాలామంది దేవుని వాక్యంలోని వచనాన్ని అర్థం చేసుకోవడంతోనే సంతృప్తి పడుతుంటారు మరియు ఆచరణ ద్వారా తమ అనుభవాన్ని లోతు చేసుకోవడం కంటే, సిద్ధాంతాల ద్వారా తమను తాముసన్నద్ధం చేసుకోవడం మీదే దృష్టి పెడుతుంటారు. నిజానికి, పరిసయ్యులు అనుసరించిన మార్గం ఇదే అని తెలుసు కదా? అలాంటప్పుడు, “దేవుని వాక్యమే జీవము” అనే వచనము వారి జీవితంలో ఎలా నిజమవుతుంది? కేవలం దేవుని వాక్యం పఠించడం ద్వారా మాత్రమే ఒక మనిషి జీవితము వృద్ధి చెందదు, దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే జీవం మరియు ఉన్నత స్థాయి అవసరమనేది నీవిశ్వాసమైతే, అప్పుడు నువ్వు అర్థం చేసుకునే స్థాయి తారుమారవుతుంది. నీవు సత్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే, దేవుని వాక్యాన్ని నీవు నిజంగా అర్థం చేసుకోవడం సంభవిస్తుంది, మరియు “సత్యాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దానిని అర్థం చేసుకోగలం” అని కూడా నీవు అర్థం చేసుకుంటావు. నేడు, దేవుని వాక్యం చదివిన తర్వాత, నాకు దేవుని వాక్యం తెలుసని మాత్రమే నీవు చెప్పగలవు, కానీ, దానిని నేను అర్థం చేసుకున్నానని చెప్పలేవు. సత్యాన్ని ఆచరణలో పెట్టాలంటే, ముందుగా దాన్ని అర్థం చేసుకోవాలని కొందరు చెబుతుంటారు, అయితే, ఆ మాట కొంతవరకే సరైనది. పూర్తి స్థాయిలో నిశ్చింతగా ఖచ్చితమైనది కాదు. సత్యం గురించిన జ్ఞానం నీకు ముందే లేకపోతే, ఆ సత్యాన్ని నీవు అనుభవం చెందలేవు. ఉపన్యాసంలో విన్నది అర్థమైనట్లుగా నీకు కలిగేది భావనే తప్ప, అది నీకు నిజంగా అర్థమైనట్లు కాదు–అది కేవలం సత్యం యొక్క అక్షర పదాలను తలకెక్కించుకోవడం మాత్రమే తప్ప అందులోని నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి అది సమానం కాదు. సత్యానికి సంబంధించి మిడిమిడి జ్ఞానం కలిగి ఉన్నంతమాత్రాన అది నీకు నిజంగా అర్థమైనట్లు కాదు లేదా దాని గురించిన పరిజ్ఞానం ఉన్నట్లు కాదు; సత్యం యొక్క నిజమైన అర్థం అనేది దానిని అనుభూతి చెందడం నుండి వస్తుంది. కాబట్టి, సత్యాన్ని నీవు అనుభూతి చెందినప్పుడే, అది నీకు నిజంగా అర్థమవుతుంది, మరియు అప్పుడే నీవు అందులోని దాగిన భాగాలను కూడా గ్రహించగలవు. భావగర్భిత అర్థాలను మరియు సత్యం యొక్క పరిమళాన్ని గ్రహించడానికి నీవు లోతైన అనుభవం సాధించడం ఒక్కటే మార్గం. కాబట్టి, నీవు సత్యం తోడుగా ప్రతిచోటుకూ వెళ్లవచ్చు, కానీ, నీలో సత్యం లేకపోతే, మత విశ్వాసం తక్కువగా కలిగిన మీ కుటుంబ సభ్యులను సైతం ఒప్పించే ప్రయత్నం చేయవద్దు. సత్యం తోడుగా లేకపోతే, నీవు గాలికి ఊగే మంచు ముక్కలుగా మిగిలిపోతావు, అయితే, సత్యం తోడుగా నీవు సంతోషంగా మరియు స్వేచ్ఛగా ఉండవచ్చు, మరియు ఎవరూ నీ మీద దాడి చేయలేరు. ఒక సిద్ధాంతం ఎంత దృఢమైనది అయినప్పటికీ, అది సత్యాన్ని అధిగమించలేదు. ఈ ప్రపంచం సైతం సత్యం వల్లే కదులుతోంది, పర్వతాలు మరియు సముద్రాలు కూడా చలిస్తున్నాయి, సత్యం లేకపోతే, బలమైన నగర గోడలను పురుగులు సైతం కుప్పకూల్చేయగలవు. ఇదే స్పష్టమైన వాస్తవం.

ప్రస్తుత దశలో, సత్యం గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత, దానిని ఆచరణలో పెట్టడం మరియు సత్యం యొక్క నిజమైన అర్థంతో మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవడం కీలకం. దీనిని సాధించడానికి మీరు ప్రయత్నించాలి. ఇతరులు నీ మాటలను అనుసరించేలా చేయడానికే పరిమితం కాకుండా, వారు నీ ఆచరణను అనుసరించడానికి కూడా మీరు కారణం కావాలి. ఈ మార్గంలో మాత్రమే నీవు ఏదైనా అర్థవంతమైన దానిని కనుగొనగలవు. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ, నీకు ఎవరు ఎదురైనప్పటికీ, నీలో సత్యం ఉన్నంత వరకు, నీవు స్థిరంగా నిలబడి ఉండగలవు. దేవుని వాక్యం మనిషికి జీవం తీసుకొస్తుందే తప్ప మరణాన్ని కాదు. దేవుని వాక్యం చదివిన తర్వాత కూడా, నీవు జీవుడవు కాలేక, ఇంకా మృతుడిగానే ఉన్నావంటే, నీలోనే ఏదో లోపం ఉంది. నీవు ఎక్కువసార్లు దేవుని వాక్యం చదవడమే కాకుండా, అనేక ఆచరణాత్మక ప్రసంగాలు విన్నప్పటికీ, నీవింకా మృత స్థితిలో ఉన్నావంటే, నీవు సత్యానికి విలువ ఇవ్వడం లేదనో, నీవు సత్యాన్ని వెంబడించే వ్యక్తివి కాదనో చెప్పడానికి వేరొక ఋజువు అవసరం లేదు. దేవుని కృప పొందాలని మీరు నిజంగానే కోరుకుంటే, మిమ్మల్ని మీరు సిద్ధాంతాలతో సన్నద్ధం చేసుకోవడం మరియు ఇతరులకు బోధించడం కోసం శ్రేష్ఠమైన సిద్ధాంతాలు ఉపయోగించడం మీద మీరు దృష్టి పెట్టరు, బదులుగా దేవుని వాక్యాన్ని అనుభవంలో చూడడం మరియు సత్యాన్ని ఆచరణలో పెట్టడం మీద మీరు దృష్టి పెడతారు. నిజానికి, ఇప్పుడు మీరు కోరుకోవలసినది ఇందులోకి ప్రవేశించాలని కాదా?

మనిషిలో దేవుడు తన పని పూర్తి చేయడానికి సమయం పరిమితంగానే ఉన్నప్పుడు, నీవు ఆయనతో సహకరించని పక్షంలో ఫలితం ఎలా లభిస్తుంది? మీరు దేవుని వాక్యం అర్థం చేసుకున్న తర్వాత, దానిని మీరు ఆచరించాలని ఆయన ఎల్లప్పుడూ ఎందుకు కోరుకుంటాడు? ఎందుకంటే, దేవుడు తన వాక్యములను మీకు బయలుపరిచాడు కాబట్టి, ఆ తర్వాత దశ మీరు వాటిని ఆచరణలో పెట్టాలి. నీవు ఈ వాక్యములను ఆచరణలో పెడుతున్న సమయంలో, జ్ఞానోదయం మరియు మార్గదర్శనం పనిని దేవుడు నిర్వహిస్తాడు. ఆ విధంగా, ఆ పని పూర్తి కావాలి. దేవుని వాక్యం మనిషిని అతని జీవితంలో వికసించడం కోసం అనుమతిస్తుంది మరియు మనిషి తన పని నుండి వైదొలిగేలా లేదా నిష్క్రియాత్మకంగా మారేలా చేసే అంశాలు లేకుండా చేస్తుంది. దేవుని వాక్యం చదివాననీ, మరియు దానిని ఆచరిస్తున్నాననీ నీవు చెప్పవచ్చు. కానీ, ఇప్పటికీ నీవు పరిశుద్ధాత్మ నుండి ఏ కార్యమునూ స్వీకరించలేదు. నీ మాటలు ఒక చిన్నబిడ్డనిమాత్రమే మోసపుచ్చగలవు. నీ ఉద్దేశాలు సరైనవేనా అని ఇతరులు పసిగట్టలేకపోవచ్చు, కానీ, దేవునికి ఆ సంగతి తెలియకుండా ఉండడం సాధ్యమనుకుంటున్నావా? ఇతరులు దేవుని వాక్యం ఆచరించడం మరియు పరిశుద్ధాత్మ జ్ఞానోదయం పొందడం సాధ్యమైనప్పడు, నీవు ఆయన వాక్యాన్ని ఆచరించినప్పటికీ, పరిశుద్ధాత్మ జ్ఞానోదయం పొందలేకపోవడం ఎలా సాధ్యం? దేవునికిభావోద్వేగాలు ఉన్నాయా? నీ ఉద్దేశాలు నిజంగానే సరైనవి గా ఉండి మరియు నీవు సహకారం కూడా అందించినప్పుడు, దేవుని ఆత్మ నీతోనే ఉంటుంది. కొందరు మనుష్యులు ఎల్లప్పుడూ తమ స్వంత జెండా ఎగురవేయాలని కాంక్షించినప్పటికీ, ఆ పని పూర్తి చేసి, సంఘాన్ని నడిపించడానికి దేవుడు వారికి ఎందుకు అవకాశం ఇవ్వడు? కొందరు కేవలం వారి విధుల కోసం మాత్రమే పనిచేస్తారు మరియు వాటిని మాత్రమే నిర్వహిస్తుంటారు, అయితే, వారికి ఆ విషయం తెలియడానికి ముందే, వారు దేవుని ఆమోదం పొందినవారై ఉంటారు. అదెలా సాధ్యమవుతుంది? దేవుడు మనిషి హృదయాంతరాన్ని శోధిస్తాడు, మరియు సత్యాన్ని వెంబడించే వారు సరైన ఉద్దేశాలతోనే ఆ పని చేస్తారు. సదుద్దేశ్యాలు లేని వారు స్థిరంగా నిలబడలేరు. అంటే, మీ లక్ష్యమే మీలో దేవుని వాక్య ప్రభావానికి అనుతిస్తుందని దీని అర్థం. మరో మాటలో చెప్పాలంటే, దేవుని వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకున్నప్పుడే, మీరు దానిని ఆచరణలో పెట్టగలరు. ఒకవేళ మీకు దేవుని వాక్యం అవగతం చేసుకునే సామర్థ్యం గొప్పగా లేనప్పటికీ, దేవుని వాక్యాన్ని మీరు ఆచరణలో పెట్టగలిగితే, మీ లోపాన్ని ఆయన సరిచేయగలడు, కాబట్టి, మీరు అనేక సత్యాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టాలి. ఇది విస్మరించకూడని అతిగొప్ప దృష్టి. యేసు తన జీవితంలోని ముప్పై మూడున్నర ఏళ్ల పాటు అనేక అవమానాలు మరియు చెప్పనలవి కాని బాధలు భరించాడు. ఆయన సత్యాన్ని ఆచరించడం వల్లే ఆ బాధలన్నీ పడ్డాడు, అన్ని విషయాల్లోనూ దేవుని చిత్తాన్ని అమలు చేశాడు మరియు దేవుని చిత్తం కోసమే శ్రద్ధ వహించాడు. సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ, దానిని ఆచరణలో పెట్టకుండా ఉంటే, ఆయన ఈ బాధలు అనుభవించాల్సిన అవసరం ఉండేది కాదు. యేసు యూదుల బోధలు విని, పరిసయ్యులను అనుసరించి ఉంటే, ఆయనకు ఆ బాధలు ఎదురయ్యేవి కావు. మనిషి మీద దేవుడి పని ప్రభావం ఆ మనుష్యుని సహకారం ద్వారానే సాధ్యమవుతుందనే విషయాన్ని మీరు యేసు కార్యముల నుండి నేర్చుకోవచ్చు, మరియు ఈ విషయాన్ని మీరు తప్పక గ్రహించాలి. యేసు సత్యాన్ని ఆచరించకపోయి ఉంటే, శిలువ మీద ఆ చిత్రవధ అనుభవించేవాడా? దేవుని చిత్తానికి అనుగుణంగా ఆయన ప్రవర్తించి ఉండకపోతే, అలాంటి బాధాకర ప్రార్థన చేసేవాడా? కాబట్టి, సత్యాన్ని ఆచరించడం కోసం మీరు బాధను అనుభవించాలి; ఒక వ్యక్తి తప్పక అనుభవించవలసిన బాధ ఇది.

మునుపటి:  మనిషిని దేవుడు వినియోగించడానికి సంబంధించి

తరువాత:  రక్షణ పొందుకున్న వ్యక్తి అంటేనే సత్యాన్ని అనుసరించడానికి ఇష్టపడిన వ్యక్తి అని అర్థం

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger