అంత్య దినములలో క్రీస్తు మాత్రమే మనిషికి నిత్యజీవ మార్గాన్ని అందించగలడు

జీవ మార్గము అనేది ఎవరైనా సొంతం చేసుకునేది కాదు, లేక ఎవరైనా సులభంగా సాధించేది కాదు. ఎందుకంటే, ఈ జీవము దేవుని నుండి మాత్రమే వస్తుంది, అంటే దేవుడు మాత్రమే జీవమునకు ఆధారమైయున్నాడు మరియు దేవుడు మాత్రమే జీవ మార్గాన్ని కలిగియున్నాడు. దేవుడు మాత్రమే జీవమునకు ఆధారము, మరియు ఎల్లప్పుడూ ఉబికే జీవ జలముల బుగ్గయై ఉన్నాడు. దేవుడు లోకాన్ని సృష్టించినప్పటినుండి జీవమునకు ప్రాణాధారము అందించడం కోసం ఆయన ఎంతో కృషిని చేసియున్నాడు, మనిషికి జీవమును తీసుకువచ్చే కార్యమును ఎంతో చేసియున్నాడు, మరియు మనిషి జీవమును పొందుకొను నిమిత్తము ఆయన గొప్ప వెలను చెల్లించియున్నాడు. ఎందుకంటే, దేవుడే నిత్య జీవమైయున్నాడు, మరియు దేవుడే మార్గమైయున్నాడు, తద్వారా మనిషి పునరుత్థానం చెందుతాడు. దేవుడు మనిషి హృదయానికి దూరంగా ఉండడు, ఆయన ఎల్లప్పుడూ మనుష్యుల మధ్యనే ఉంటాడు. మనిషి మనుగడకు, మనిషి ఉనికి యొక్క మూలానికి మరియు మనిషి పుట్టుక తరువాత మనిషి ఉనికికి దేవుడే గొప్ప నిధియై, ఆయనే నడిపించు బలమైన శక్తియైయున్నాడు. మనిషి పునర్జన్మకు ఆయనే కారకుడు, ప్రతి పాత్రలోనూ పట్టుదల కలిగి జీవించేలా దేవుడు మనిషిని చేశాడు. ఆయన శక్తికి మరియు తరగిపోని జీవ బలానికి వందనాలు, తరము వెంబడి తరము మనిషి జీవించాడు, మానవ ఉనికికి దేవుని జీవపు శక్తే ప్రధానం, మరియు ఏ మనిషి కూడా చెల్లించలేనంత వెలను దేవుడు చెల్లించాడు. దేవుని జీవపు శక్తి ఎటువంటి శక్తి మీదనైనా గెలుస్తుంది; అంతేగాకుండా, ఇది ప్రతి శక్తిని మించిపోతుంది. ఆయన జీవము నిత్యము నిలిచేది, ఆయన శక్తి అసాధారణమైనది, మరియు సృష్టించబడిన ఏదైనా లేక శత్రు బలము ఏదైనా ఆయన జీవపు శక్తిని అధిగమించలేదు. దేవుని జీవపు శక్తి ఉనికిలో ఉంది మరియు సమయముతోను లేక స్థలముతోను నిమిత్తం లేకుండా అద్బుతముగా ప్రకాశిస్తుంది. భూమి ఆకాశములు గొప్పగా మార్పు చెందవచ్చునేమో గానీ దేవుని జీవము ఎల్లప్పుడూ ఒకే రీతిగా శాశ్వతముగా నిలిచి ఉంటుంది. సమస్తము గతించి పోవచ్చు గానీ దేవుని జీవము శాశ్వతముగా నిలిచి ఉంటుంది, ఎందుకంటే దేవుడు సృష్టించబడిన ప్రతిదానికి ఆధారమైయున్నాడు మరియు వాటి ఉనికికి మూలమైయున్నాడు. మానవుని జీవము దేవుని నుండి ఆరంభమవుతుంది, దేవునిని బట్టియే ఆకాశము ఉనికిలో ఉంది, మరియు భూమి ఉనికి దేవుని జీవపు శక్తి నుండి ఉద్భవించింది. జీవపు శక్తిని కలిగిన ఏదియు దేవుని సార్వభౌమాధికారమును అధిగమించదు, మరియు శక్తితో కూడినదేదైనా దేవుని అధికారముతో కూడిన ప్రభుత్వాన్ని తప్పించుకోలేదు. ఈ విధంగా, ఎవరన్నదానితో నిమిత్తము లేకుండా, ప్రతియొక్కరు దేవుని ఆధిపత్యమునకు లోబడవలసినదే, ప్రతియొక్కరు దేవుని ఆజ్ఞ క్రింద జీవించాల్సిందే, మరియు ఆయన చేతుల నుండి ఏ ఒక్కరు తప్పించుకోలేరు.

బహుశా నీవు ఇప్పుడు జీవమును పొందాలనే కోరికను కలిగియుండవచ్చు, లేక బహుశా నీ ఆశ సత్యాన్ని పొందుకోవడానికైనా ఉండవచ్చు. విషయం ఏదైనా, నీవు దేవుణ్ణి కనుగొనడానికి ఇష్టపడాలి, నీవు ఆధారపడే దేవుణ్ణి కనుగొనడానికి ఇష్టపడాలి, మరియు నిత్య జీవమును ప్రసాదించే దేవుణ్ణి కనుగొనడానికి ఇష్టపడాలి. నీవు నిత్యజీవమును పొందుకోవడానికి ఇష్టపడినట్లయితే, నీవు మొదటిగా నిత్యజీవానికి మూలాన్ని అర్థం చేసుకోవాలి మరియు మొదటిగా దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. దేవుడు మాత్రమే మార్పులేని జీవమును కలిగియుంటాడని మరియు దేవుడు మాత్రమే జీవ మార్గమును కలిగియుంటాడని నేను ముందుగానే చెప్పాను. దేవుడు మార్పులేని జీవమును కలిగియున్నందున ఆయనే నిత్య జీవమైయున్నాడు; దేవుడు మాత్రమే జీవ మార్గమైయున్నందున, దేవుడే నిత్య జీవ మార్గమైయున్నాడు. కాబట్టి, నీవు మొదట దేవుడు ఎక్కడ ఉన్నాడో మరియు ఈ నిత్య జీవ మార్గాన్ని ఎలా పొందుకోవాలో తెలుసుకోవాలి. ఈ రెండు విషయాల మీద విడి విడిగా తెలుసుకునేందుకు పూనుకుందాం.

నువ్వు నిజంగా నిత్యజీవ మార్గాన్ని పొందుకోవాలనుకుంటే, దాని కొరకైన నీ అన్వేషణలో విపరీతమైన ఆతురతను కలిగియున్నట్లయితే, మొట్ట మొదటిగా ఈ ప్రశ్నకు జవాబునివ్వు: ఈ రోజు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నకు నువ్వు, “దేవుడు పరలోకములో జీవిస్తున్నాడు, ఆయన నీ ఇంటిలో ఉండడు కదా?” అని బదులివ్వచ్చు. ఆయన అన్ని చోట్ల నివసిస్తాడని కూడా నీవు చెప్పవచ్చు. లేక దేవుడు ప్రతియొక్కరి హృదయములోను నివసిస్తాడని నీవు చెప్పవచ్చు, లేక దేవుడు ఆధ్యాత్మిక ప్రపంచములో ఉంటాడని కూడా నీవు చెప్పవచ్చు. నీవిచ్చే ఈ జవాబులలో దేనినీ నేను త్రోసిపుచ్చను గానీ నేను ఈ విషయాన్ని స్పష్టం చేయదలిచాను. దేవుడు మానవుని హృదయములో నివసిస్తాడని చెప్పడం పూర్తిగా తప్పా కాదా, అది పూర్తిగా తప్పు కాదు. అందుచేతనే, దేవునిలో విశ్వాసముంచిన విశ్వాసుల మధ్య సరియైన నమ్మకాలు కలిగినవారున్నారు, తప్పుడు నమ్మకాలను కలిగినవారున్నారు, దేవుడు ఆమోదించే ప్రజలున్నారు మరియు దేవుడు ఆమోదించని ప్రజలున్నారు, దేవుణ్ణి మెప్పించేవారున్నారు మరియు ఆయనను తిరస్కరించేవారున్నారు, మరియు దేవునిచేత పరిపూర్ణులయ్యేవారున్నారు, దేవునిచేత పరిత్యజించబడేవారున్నారు. నేను చెప్పెదేమనగా, దేవుడు నివసిస్తాడు, అయితే ఆయన కొంతమంది హృదయాలలోనే నివసిస్తాడు. ఇటువంటి ప్రజలు నిస్సందేహంగా దేవుని యందు ఖచ్చితంగా విశ్వాసముంచినవారు, దేవుడు ఆమోదించిన ప్రజలు, ఆయనను మెప్పించేవారు, మరియు ఆయన చేత పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడినవారు. వీరే దేవుని చేత నడిపించబడినవారు. వారు దేవుని చేత నడిపించబడినందున, వీరు దేవుని నిత్యజీవపు మార్గమును గురించి విన్నవారు మరియు దానిని చూచినవారు. దేవునియందు తప్పుడు నమ్మకాన్ని కలిగినవారు, దేవుని చేత ఆమోదించబడనివారు, దేవుని చేత త్రోసివేయబడినవారు, దేవుని చేత పరిత్యజించబడినవారు దేవుని చేత తిరస్కరించబడుటకే ఉన్నారు, జీవ మార్గము లేకుండ మిగిలిపోవుటకే ఉన్నారు, మరియు దేవుడు ఎక్కడున్నాడనే విషయాన్ని నిర్లక్ష్యము చేయడానికే ఉన్నారు. దానికి విరుద్ధంగా, తమ హృదయాలలో దేవుడు నివసిస్తున్నాడని దేవుణ్ణి కలిగియున్న వారందరికి దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసు. అటువంటి మనుష్యుల మీద దేవుడు నిత్యజీవ మార్గాన్ని ఉంచియున్నాడు, మరియు అటువంటివారే దేవుణ్ణి అనుసరించువారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడని నీకు తెలుసా? దేవుడు మానవుని హృదయములోను మరియు మానవ హృదయానికి వెలుపటను ఉన్నాడు, అంటే ఇరువైపుల దేవుడు ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మిక ప్రపంచములోనే లేడు, మరియు అన్నిటికి పైగా, మానవ ఉనికి ఉండే ఈ భూమి మీదనే ఉన్నాడు. అందుచేత, అంత్య దినాల ఆగమనం దేవుని కార్యము యొక్క అడుగులను క్రొత్త ప్రాంతములోనికి తీసుకుకొని వెళ్లాయి. సమస్త విషయాల మధ్యన అన్నిటి మీద దేవుడు తన సార్వభౌమాధికారాన్ని కలిగియుంటాడు, మరియు ఆయన మానవ హృదయములో మనిషికి మూలమైయున్నాడు, అంతేగాకుండా ఆయన మనుష్యుల మధ్యనే ఉన్నాడు. కేవలము ఈ విధంగానే ఆయన మనుష్యులకు జీవ మార్గాన్ని తీసుకు రాగలడు, మరియు మనిషిని జీవ మార్గములోనికి తీసుకు రాగలడు. దేవుడు భూమి మీదకి వచ్చియున్నాడు, మరియు మనుష్యుల మధ్యన నివాసమైయున్నాడు, తద్వారా మనిషి జీవ మార్గాన్ని సంపాదించుకోగలడు, తద్వారా మనిషి ఉనికిలో ఉంటాడు. అదే సమయములో, ఆయన మానవుల మధ్యన జరిగించే నిర్వహణతో సమస్తాన్ని సులభతరం చేయడానికి ఆయన కూడా ప్రజలందరి మధ్యన ఉంటూ అన్నిటిని ఆదేశిస్తాడు. అందుచేత, మీరు కేవలము దేవుడు పరలోకములో ఉన్నాడు మరియు మానవ హృదయములో ఉన్నాడు అనే సిద్ధాంతమును అవగాహన చేసుకొని, దేవుడు మనుష్యుల మధ్య ఉన్నాడనే సత్యాన్ని గ్రహించకపోయినట్లయితే, నీవు జీవమును పొందుకోలేవు మరియు సత్య మార్గాన్ని ఎప్పటికీ సాధించలేవు.

దేవుడే జీవమును, సత్యమునైయున్నాడు, మరియు ఆయన జీవము, ఆయన సత్యము ఆయనతో పాటు ఉనికిలో ఉంటాయి. సత్యాన్ని పొందుకోవడానికి అసమర్థులైనవారు జీవమును పొందుకోలేరు. సత్యము యొక్క మార్గదర్శకత్వము, మద్దతు మరియు సదుపాయం లేకుండా, నీవు కేవలం అక్షరాలను, సిద్ధాంతాలను మరియు వాటన్నిటికి మించి మరణాన్ని పొందుకుంటావు. దేవుని జీవము నిత్యము ఉంటుంది, మరియు ఆయన సత్యము, ఆయన జీవము ఉనికిలో ఉంటాయి. నీవు సత్యానికి మూలాన్ని కనుగొనకపోయినట్లయితే, నీవు జీవానికి సంబంధించిన పోషణను పొందుకోలేవు; నీవు జీవానికి సంబంధించిన పోషణను పొందుకొనకపోయినట్లయితే, నీవు ఖచ్చితంగా సత్యాన్ని కలిగియుండలేవు, అందుచేత, నియమాలను మరియు ఊహలను ప్రక్కకు పెట్టినట్లయితే, నీ దేహమంతా నీ రక్తమాంసాలు, అంటే, దుర్గంధం వెదజల్లే మాంసం తప్ప మరేమీ ఉండదు, అంటే నీకు ఉండేది కుళ్ళిపోయిన శరీరమన్నమాట. పుస్తకాల మాటలు జీవముగా పరిగణించబడవని, చరిత్రలోని దాఖలాలు సత్యముగా ఆరాధించబడవని, గతములోని నియమ నిబంధనలన్నీ ప్రస్తుతమందు దేవుడు మాట్లాడిన మాటలుగా పరిగణింపబడవని తెలుసుకోండి. దేవుడు భూమి మీదకి వచ్చి, మనుష్యుల మధ్య నివసించినప్పుడు సత్యం, జీవం, దేవుని చిత్తం మరియు ఆయన ప్రస్తుత పరిచర్య విధానం మాత్రమే ఆయన ద్వారా వ్యక్తం చేయబడింది. గత యుగాల నుండి నేటి వరకు దేవుని ద్వారా పలకబడిన మాటలను నీవు అన్వయించుకొనినట్లయితే, అవన్నీ నిన్ను ఒక పురావస్తు శాస్త్రవేత్తగా తయారు చేస్తాయి, మరియు నిన్ను ఒక చారిత్రాత్మక స్వాస్థ్యంగా వివరించుకోవడం ఒక ఉత్తమ మార్గమవుతుంది. ఇందుచేతనే గత కాలములో దేవుడు చేసిన కార్యపు జాడలను నీవు ఎల్లప్పుడూ విశ్వసించాలి, ఆయన మునుపు మనుష్యుల మధ్య నివాసముండి పనిచేసి వదిలిన దేవుని నీడలో మాత్రమే నమ్మిక ఉంచాలి, మరియు మునుపటి కాలాలో దేవుడు తన అనుచరులకు ఇచ్చిన మార్గమునందే నమ్మిక ఉంచాలి. ఈ రోజున దేవుడు చేస్తున్న కార్యము యొక్క నిర్దేశనములో నీవు నమ్మిక ఉంచవు, ఈ రోజున దేవుని మహిమాన్వితమైన ముఖమునందు నమ్మిక ఉంచవు, మరియు ప్రస్తుతం దేవుడు వ్యక్తము చేస్తున్న సత్య మార్గమునందు నమ్మిక ఉంచవు. అందుచేత నీవు నిస్సందేహంగా వాస్తవికతతో సంబంధము లేకుండ పగటి కలలు కనేటువంటి వ్యక్తివే. మనిషికి జీవము తీసుకురాని మాటలను పట్టుకొని నీవు వ్రేలాడుతుంటే, నీవు ఎటువంటి నిరీక్షణలేని కట్టె ముక్కవే,[ఎ] ఎందుకంటే నువ్వు చాలా సంప్రదాయవాదివి, చాలా మూర్ఖపు వ్యక్తివి, తర్కము చేయడానికి ఇష్టపడని వ్యక్తివి!

శరీరధారిగా వచ్చిన దేవుణ్ణి క్రీస్తు అని పిలుస్తారు. అందుచేత, ప్రజలకు సత్యాన్ని అందించే క్రీస్తును దేవుడు అని అంటారు. దీనికి మించింది మరొకటి లేదు, ఎందుకంటే ఆయన దేవుని గుణగణాలను కలిగియున్నాడు, దేవుని స్వభావాన్ని కలిగియున్నాడు, మరియు ఆయన చేసే పనిలో జ్ఞానమును కలిగియున్నాడు, ఇవన్ని మనిషి సాధించేవి కావు. నేనే క్రీస్తునని చెప్పుకునేవారందరూ మోసగాళ్ళే, ఎందుకంటే వారు దేవుని కార్యాన్ని జరిగించలేరు. క్రీస్తు కేవలము భూమి మీదకి వచ్చిన దేవుని ప్రత్యక్షత మాత్రమే కాదు గానీ మనుష్యుల మధ్య దేవుని కార్యాన్ని మోసుకు వెళ్లి, పూర్తి చేసేందుకు దేవుని ద్వారా ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ధరించినవాడు. ఈ శరీరమునకు ఏ మనిషి కూడా ప్రత్యామ్నాయంగా ఉండలేడు, అయితే ఈ శరీరము భూమి మీద దేవుని కార్యాన్ని తగుమట్టుకు భరించగలదు, దేవుని స్వభావాన్ని వ్యక్తము చేయగలదు, మరియు దేవునికి ప్రతినిధిగా ఉండగలదు, మనిషికి జీవమును అందించగలదు. త్వరగానైనా, ఆలస్యంగానైనా నేనే క్రీస్తునంటూ ప్రవర్తించేవారందరూ తప్పనిసరిగా దిగజారిపోతారు, నేనే క్రీస్తునని తాము ప్రకటించుకున్నప్పటికీ, వారు క్రీస్తు గుణగణాలను కలిగియుండడం అసాధ్యం. అందుచేత, క్రీస్తు అధికారికతను ఏ మనిషి చూపించలేడని నేను చెప్పుచున్నాను, అయితే క్రీస్తు అధికారికత దేవుని ద్వారానే నిర్ణయించబడాలి, ఆయనే జవాబివ్వాలి. ఈ విధంగా, నీవు నిజంగా జీవ మార్గాన్ని వెదకుచున్నట్లయితే, దేవుడు ఈ భూమి మీదకి వచ్చి, మనుష్యులకు జీవ మార్గాన్ని అనుగ్రహించే కార్యాన్ని ప్రదర్శించాడని నీవు మొట్ట మొదటిగా గ్రహించాలి, మరియు అంత్య దినాలలో ఆయన భూమి మీదకి వచ్చి మనుష్యులకు జీవ మార్గాన్ని అనుగ్రహిస్తాడని నీవు తెలుసుకోవాలి. ఇదేదో గతాన్ని గురించి చెప్పేది కాదు; ఇది ఈ రోజు జరుగుతోంది.

అంత్య దినాలలో క్రీస్తు జీవమును తీసుకు వస్తాడు, మరియు శాశ్వతమైన నిత్య సత్య మార్గాన్ని తీసుకు వస్తాడు. ఈ సత్యమే మనిషి జీవమును సంపాదించుకునే మార్గమైయున్నది, మరియు ఈ ఒక్క మార్గము ద్వారానే మనిషి దేవుణ్ణి తెలుసుకోగలడు మరియు దేవుని ద్వారా ఆమోదించబడగలడు. అంత్య దినాలలో క్రీస్తు ద్వారా ఇవ్వబడే జీవ మార్గమును నీవు వెదకకపోయినట్లయితే, నీవు ఎప్పటికీ, ఎన్నటికీ క్రీస్తు ఆమోదాన్ని పొందలేవు, మరియు పరలోక రాజ్యపు ద్వారములోనికి ప్రవేశించడానికి అర్హత పొందలేవు, ఎందుకంటే నీవు చరిత్రకు తోలు బొమ్మవు మరియు ఖైదివయ్యావు. నియమ నిబంధనల ద్వారా, అక్షరాల ద్వారా నియంత్రించబడేవారందరూ, చరిత్ర ద్వారా సంకెళ్ళు వేయబడినవారందరూ జీవమును సంపాదించుకోవడం అసాధ్యం, లేక శాశ్వతమైన జీవ మార్గాన్ని సంపాదించుకోవడం అసాధ్యం. ఇలా ఎందుకు జరుగుతుందంటే, వారు సింహాసనము నుండి ప్రవహించే జీవ జలాన్ని కలిగియుండకుండా, అనేక వేల సంవత్సరాల నుండి బురద నీళ్ళకు పరిమితమయ్యారు. జీవ జలమును త్రాగనివాళ్ళందరూ చచ్చిన శవాలుగాను, సాతానుడి పావులైన వస్తువులుగాను మరియు నరకపు పిల్లలుగాను మిగిలిపోతారు. అలాంటప్పుడు, వారు దేవుణ్ణి ఎలా చూడగలరు? మీరు గతాన్ని పట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నించినట్లయితే, అవి ఇంకా నిలిచియున్నాయన్నట్లుగా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లయితే, చరిత్రను ప్రక్కకు పెట్టి, పొందుకున్న స్థితిని మార్చుకోవడానికి ప్రయత్నించకపోతే, నీవు దేవునికి ఎల్లప్పుడూ విరోధిగా నిలిచిపోవా? పెద్ద పెద్ద ఉరుములువలె, ఉప్పెనెలా ఎగిసిపడే పెద్ద పెద్ద అలల వలె దేవుని కార్యపు అడుగులు ఎంతో విస్తారమైనవి మరియు ఎంతో శక్తివంతమైనవి, అయినప్పటికీ నీవు నాశనాన్ని కోరుకుంటున్న వ్యక్తిగా మౌనంగా కూర్చుంటున్నావు, నీ మూర్ఖత్వమును విడువక హత్తుకొనియున్నావు మరియు ఏమీ చేయకున్నావు. ఈ విధంగా ఉన్నప్పుడు, నువ్వు గొర్రెపిల్ల అడుగు జాడలను వెంబడిస్తున్న వ్యక్తివని ఎవరు పరిగణిస్తారు? ఎప్పటికీ పాత వ్యక్తి కాని ఎల్లప్పుడూ క్రొత్త వ్యక్తిగా ఉండే దేవుణ్ణి నీవు పట్టుకున్నావని నీవు దేవునికి ఎలా న్యాయం చేయగలవు? పాతబడిన ఆ పుస్తకాల మాటలు ఎలా నిన్ను క్రొత్త యుగములోనికి నడిపిస్తాయి? అవి దేవుని కార్యపు అడుగులను వెదకడానికి ఎలా నడిపిస్తాయి? అవి నిన్ను పరలోకానికి ఎలా తీసుకు వెళ్తాయ? నీ చేతుల్లో తాత్కాలిక ఓదార్పునిచ్చే అక్షరాలను పట్టుకున్నారా, లేక జీవమునిచ్చే సామర్థ్యముగల సత్యాలను పట్టుకున్నారా? నీవు చదివే లేఖనాలు కేవలము నీ నాలుకను మెరుగు పరుస్తాయి, అవి మానవ జీవితమును గూర్చి తెలుసుకునేందుకు నీకు సహాయము చేసే తత్వ శాస్త్ర సంబంధమైన పదాలు కాదు, నిన్ను పరిపూర్ణత వైపుకు నడిపించే మార్గాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వైరుధ్యం నీవు ప్రతిబింబించడానికి కారణం కాదా? ఇది లోపల దాగియున్న రహస్యాలను గ్రహించే విధంగా మిమ్మల్ని చేయలేదా? నీ స్వశక్తితో దేవుణ్ణి కలవడానికి నీయంతటికి నీవే పరలోకానికి వెళ్ళే సామర్థ్యమును కలిగియున్నవా? దేవుని వద్దకు రాకుండానే, దేవునితో కుటుంబ సంతోషాన్ని అనుభవించడానికి పరలోకానికి వెళ్ళగలవా? నువ్వు ఇంకా కలగంటున్నావా? అయితే, నువ్వు కల కనడం ఆపి, ఇప్పుడు ఎవరు కార్యము చేస్తున్నారో చూడమని నీకు నేను సలహా ఇస్తున్నాను—అంత్య దినాలలో మనిషిని రక్షించే కార్యమును ఎవరు తీసుకు వెళ్తున్నారో చూడు. నీవు చూడకపోయినట్లయితే, నీవు సత్యాన్ని పొందుకోలేవు, జీవాన్ని ఎన్నటికీ పొందుకోలేవు.

క్రీస్తు ద్వారా పలకబడిన సత్యము మీద ఆధారపడకుండా జీవమును పొందుకోవాలనుకునే వారికంటే భూమి మీద అత్యంత హాస్యాస్పదమైన వ్యక్తులు ఇంకెవరూ ఉండరు, మరియు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన జీవ మార్గమును అంగీకరించనివారు ఒక విచిత్రమైన ఊహాగానములోనికి జారుకున్నవారే. అందుచేత, అంత్య దినాలలోని క్రీస్తును అంగీకరించనివారందరూ దేవునిచేత శాశ్వతముగా అసహ్యించుకొనబాడతారు. అంత్యదినాలలో పరలోక రాజ్యానికి క్రీస్తే మనిషి ద్వారమునైయున్నాడు, మరియు ఆయన చుట్టూ ఉండేవారు ఎవరు లేరు. క్రీస్తు ద్వారా కాకుండా దేవుడు ఎవరి ద్వారాను ఎవరినీ పరిపూర్ణులనుగా చేయడు. నీవు దేవునియందు నమ్మిక ఉంచావు, అందుచేత నీవు తప్పకుండ ఆయన మాటలను స్వీకరించాలి మరియు ఆయన మార్గానికి విధేయత చూపాలి. జీవమును మరియు సత్యమును స్వీకరించలేని స్థితిలో నీవునప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటున్నానే ఆలోచన కూడా చేయలేవు. అంత్య దినాలలో క్రీస్తు వస్తాడు, తద్వారా ఆయనయందు నిజముగా విశ్వాసముంచిన వారందరూ జీవమును పొందుకుంటారు. ఆయన కార్యము పాత యుగానికి స్వస్తి చెప్పి, క్రొత్త యుగములోనికి ప్రవేశించుట కొరకే ఉన్నది. క్రొత్త యుగములోనికి ప్రవేశించాలనుకునే వారందరు అనుసరించినవలసిన మార్గమే ఆయన కార్యము. ఆయన గురించి తెలుసుకొనుటకు నీవు అసమర్థుడవై, ఆయనను ఖండించడం, దూషించడం, లేక ఆయనను హింసించడం జరిగినా, నీవు నిత్యము కాల్చబడుటకు బద్ధుడవై ఉంటావు మరియు ఇక ఎన్నటికీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేవు. ఈ విషయాన్ని దేవుని కార్యాన్ని ఈ భూమి మీద జరిగించడానికి దేవుడే ఆమోదించిన, దేవుని వ్యక్తీకరణయైన క్రీస్తే స్వయాన పరిశుద్ధాత్ముని ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. అందుచేత, అంత్య దినాలలో క్రీస్తు ద్వారా జరిగించబడేవన్నీ నీవు అంగీకరించకపోయినట్లయితే, నీవు పరిశుద్ధాత్మను దూషించుచున్నావని నేను చెప్పుచున్నాను. పరిశుద్ధాత్ముని దూషించిన వారికి కలిగే శిక్ష అందరికి స్పష్టంగా విదితమే. నీవు అంత్య దినాలలో క్రీస్తును ఎదిరిస్తే, అంత్య దినాలలోని క్రీస్తును నీవు తిరస్కరిస్తే, నీకు జరిగే పరిణామాలను భరించడానికి నీ పక్షాన నిలిచేవారెవరూ ఉండరు. అంతేగాకుండా, ఈ రోజు నుండి దేవుని ఆమోదాన్ని పొందడానికి నీకు ఎటువంటి అవకాశం ఉండదు; నిన్ను నీవు విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా, నీవు దేవుని ముఖాన్ని చూసే భాగ్యాన్ని ఎన్నటికీ పొందుకోలేవు. ఎందుకంటే, నీవు ఎదురించేది మనిషిని కాదు, నీవు తిరస్కరించేది ఎటువంటి ప్రాముఖ్యతలేని చిన్న జీవిని కాదు, నీవు క్రీస్తునే తిరస్కరించి, ఎదురిస్తున్నావు. దీనినిబట్టి ఎటువంటి పరిణామాలు ఎదుర్కుంటావో నీకు తెలుసా? నీవు ఒక చిన్న తప్పు కూడా చేయకపోయుండవచ్చు గానీ ఘోరమైన నేరానికి పాల్పడ్డావు. అందుచేత, ప్రతియొక్కరు సత్యము ముందు మీ కోరలు విప్పొద్దని నేను సలహా ఇస్తున్నాను, లేక పనికిమాలిన విమర్శలు చేయవద్దని చెప్పుచున్నాను, ఎందుకంటే, సత్యము మాత్రమే నీకు జీవమును కలిగిస్తుంది, మరియు సత్యము కాకుండా మరేదియు నీవు తిరిగి జన్మించడానికి, దేవుని ముఖాన్ని చూడడానికి అవకాశం కల్పించదు.

ఫుట్‌నోట్:

ఎ. చేవ చచ్చిన కలప: ఇది చైనీయుల సామెత, “సహాయమునకు అతీతమైనది” అని అర్థం.

మునుపటి:  నీకు తెలుసా? దేవుడు మనుషుల మధ్య ఒక గొప్ప కార్యాన్ని చేసాడు

తరువాత:  నీ గమ్యము కొరకు తగిన సత్క్రియలు సిద్దపరచుకో

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger