నీ గమ్యము కొరకు తగిన సత్క్రియలు సిద్దపరచుకో

నేను మీ మధ్య ఎంతో పని చేసాను, అంతేగాక ఎన్నో ప్రసంగాలు కూడా చెప్పాను. అయినప్పటికీ అంత్యదినాలలో నా పని మరియు నా మాటలు నా పని యొక్క ఉద్దేశ్యాన్ని పూర్తిగా నెరవేర్చలేదని భావించకుండా ఉండలేను. చివరి దినాలలో, నా పని నా యొక్క సహజస్వభావాన్ని వెల్లడిపరచుటకే కాని, ఫలానా వ్యక్తి నిమిత్తమో లేక ఫలానా ప్రజల కోసమో కాదు. అయినప్పటికీ అనేక కారణాలనుబట్టి—బహుశా సమయాభావం లేక తీరికలేని పని జాబితా కారణముగా—ప్రజలు నా స్వభావాన్ని బట్టి నన్ను అర్ధంచేసుకోలేదు. ఈ విధముగా నేను నా నూతన ప్రణాళికను, నా చివరి పనిని ఆరంభించి మరియు నా పనిలో ఒక క్రొత్త పేజీని తెరిచాను, తద్వారా నన్ను చూసేవారందరూ వారి రోమ్ములపై కొట్టుకొంటూ, నా ఉనికి కారణము బట్టి అంగలారుస్తూ ఎడతెగక రోదిస్తారు. ఎందుకంటే, నేను మానవజాతి అంతమును లోకములోకి తెస్తాను, మరియు ఈ క్షణం నుండి నేను నా పూర్తి స్వభావాన్ని మానవజాతి ముందు బహిర్గత పరుస్తాను, తద్వారా నన్ను ఎరిగిన మరియు ఎరుగనివారందరూ నేను నిజముగా నరలోకానికి వచ్చానని, సమస్తమైనవి ఫలించే ఈ భూమిమీదికి వచ్చానని చూచి, తమ కన్నులపండుగ చేసుకుంటారు. ఇదే నా ప్రణాళిక మరియు నా మానవజాతి సృష్టి మొదలుకొని నా ఏకైక “ఒప్పుకోలు”. నా ప్రతి కదలికపై మీ ఏకాగ్రమైన లక్ష్యముంచండి, ఎందుకంటే నా దండము మానవజాతికి, నా విరోధులందరికీ మరింత సమీపముగా ఉన్నది.

ఆకాశములతో కలసి, నేను తప్పక చేయవలసిన పనిని ఆరంభిస్తాను. అందువలననే ఎవరూ నా కదలికలు గమనించకుండా లేదా నా మాటలు గ్రహించకుండా, నేను జన ప్రవాహము గుండా వెళ్ళుచూ ఆకాశము మరియు భూమి మధ్య సంచరించుచున్నాను. కాబట్టే, నా ప్రణాళిక సజావుగా సాగుచున్నది. మీ ఇంద్రియాలన్నీ బహుగా మొద్దుబారుటను బట్టి, మీరు నా పని దశలను మరిచారు. అయితే మీరు నా ఉద్దేశ్యాలను గ్రహించే ఒక రోజు తప్పక వస్తుంది. నేడు, నేను మీతో కలసి జీవిస్తున్నాను మరియు మీతో కలసి బాధపడుచున్నాను, అలాగే చాలకాలంనుండి మానవజాతి నాపట్ల కలిగియున్న వైఖరినీ అర్ధంచేసుకున్నాను. ఇకమీదట నేను దీనిగురించి మాట్లాడాలనుకోవడంలేదు, ఈ బాధాకరమైన విషయము యొక్క మరిన్ని సందర్భాలను తెచ్చి మిమ్మల్ని అవమానించాలని నేను అసలే ఆశించడంలేదు. మీరు చేసినవన్నీ మీ హృదయాలలో గుర్తుంచుకోవాలని మాత్రమే నేను ఆశిస్తున్నాను, తద్వారా మనము మరలా కలిసే దినమున మన క్రియలను సరితూచుకోవచ్చు. నేను మీలో ఎవరినీ తప్పుగా నిందించదలచుకోలేదు, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ న్యాయముగా, నిజాయితీగా, మరియు గౌరవప్రదముగానే వ్యవహరించాను. నిజానికి, భూమ్యాకాశమునకు లేక మీ మనఃసాక్షికి విరోధముగా ఏమిచేయకుండా మీరు ఉన్నతముగా ఉండగలరని కుడా నేను ఆశిస్తున్నాను. ఇది మాత్రమే నేను మిమ్మల్ని అడిగేది. ఘోరమైన తప్పులు చేయుటనుబట్టి అనేకమంది శాంతి మరియు సమాధానము లేకయున్నారు, మరియు అనేకమంది తాము ఒక్కమంచి పని కుడా చేయలేదని తమనుగూర్చి సిగ్గుపడుచున్నారు. నా స్వభావమును పరీక్షించడానికి—ఇంకా చాల మంది వారి పాపములనుగూర్చి పశ్చాతాపముచెందక, చెడు నుండి అధ్వాన్నమునకు వెళ్లి, ఇంకా బహిర్ఘతము కాని—వారి వికృత చేష్టలను దాచిపెట్టే ముసుగును పూర్తిగా తొలగించబడవలసినవారు అనేక మంది ఉన్నారు. నేను ఏ ఒక్క వ్యక్తి చర్యలను గమనించను, పట్టించుకోను. బదులుగా, నేను చేయవలసిన పని చేస్తాను, అది సమాచార సేకరణ, భూ పర్యటన లేక నా ఆసక్తులను బట్టి ఏమైనా చేయవచ్చు. కీలక సమయాల్లో, నేను మొదట అనుకున్నట్లుగానే నరునియందు నా పనిని ఒక్క సెకను కుడా ఆలస్యము లేకుండా, లేక త్వరత్వరగా కాకుండా, నెమ్మదిగా మరియు జాగ్రత్తగా కొనసాగిస్తాను. ఏదేమైనప్పటికీ, నా పనియొక్క ప్రతి దశయందు, కొందరు ప్రక్కకు పెట్టబడతారు, ఎందుకనగా వారి ముఖస్తుతి నడతలు మరియు వారి కపటమైన విధేయతను నేను సహించను. నాకు ఆసహ్యకరమైనవారు అనుకోకుండా అయినా లేక ఉద్దేశ్యపుర్వకముగా కాని ఖచ్చితముగా విడనాడబడతారు. క్లుప్తంగా, నన్ను తృణీకరించే వారందరూ నాకు దూరముగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నా గృహములో ఉండే దుష్టులను నేను విడిచిపెట్టనని ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. నరునికి శిక్ష పడే రోజు దగ్గరలో ఉన్నందున, నాకున్న నా ఆలోచనబట్టి, నా ఇంటినుండి ఆ పాపాత్ములందరినీ వెళ్ళగొట్టడానికి నేను తొందరపడను.

ఇది నేను ప్రతి వ్యక్తికి ముగింపును నిర్ణయించే సమయమే కాని, మనిషి పనిని నేను ప్రారంభించిన దశ కాదు. ప్రతి వ్యక్తి యొక్క మాటలు మరియు క్రియలు, వారు నన్ను అనుసరించిన నడతలు, వారి స్వాభావిక గుణగణాలు మరియు అంతిమంగా తమను తాము సమకూర్చుకున్న విధములన్ని, ఒక్కొక్కటిగా నా జ్ఞాపకార్థ గ్రంధములో రాస్తాను. ఈ విధంగా, వారు ఎలాంటి వ్యక్తి అయినా సరే, నా చేతిలో నుండి ఎవడూ తప్పించుకోలేడు, మరియు నేను నియమించిన విధంగా వారి స్వంత రీతిగానే ఉంటారు. నేను ప్రతి వ్యక్తి యొక్క గమ్యాన్ని వయస్సు, పెద్దరికము, బాధ యొక్క పరిమాణము, అన్నింటికంటే వారు కలిగియున్న కనీస దీనస్థితిని బట్టికాక, వారు సత్యాన్ని కలిగియున్నారా అనేదాని ఆధారముగా నిర్ణయిస్తాను. ఇది తప్ప వేరే మార్గం లేదు. దేవుని చిత్తాన్ని అనుసరించని వారందరూ శిక్షింపబడతారని మీరు గ్రహించాలి. ఇది తిరుగులేని వాస్తవం. అందువలన, శిక్షించబడినవారందరూ దేవుని నీతిని బట్టి మరియు వారియొక్క అనేకమైన చెడ్డక్రియల ప్రాయశ్చిత్తముగా శిక్షించబడ్డారు. నా ప్రణాళిక ఆరంభమైనప్పటినుండి నేను దానిలో ఒక్క మార్పు కుడా చేయలేదు. ఇది కేవలము, మానవునికి సంబంధించినంతవరకు, నేను ఎవరికి నా మాటలను నిర్దేశిస్తానో, వారి సంఖ్య తగ్గుతున్నట్లు కనబడుతుంది, నేను నిజముగా మెచ్చుకొనువారు వీరే. ఏదేమైనా, నా ప్రణాళిక ఎన్నటికీ మారకుండా నిర్వహిస్తున్నాను; బదులుగా మానవునియొక్క విశ్వాసము మరియు ప్రేమ నిరంతరం మారుతూ, ఒక వ్యక్తికి నాపట్ల ఉన్న మమకారము కాస్త నా పట్ల నిర్దయగాఅలాగే నన్ను వెలుపలకు త్రోసివేసేంతగా క్షీణించుచున్నాయి. నాకు విరక్తి మరియు అసహ్యము కలిగి, అంతిమ శిక్షను విధించువరకు, మీ పట్ల నా వైఖరి వెచ్చగానైనా మరియు చల్లాగానైనా ఉండదు. అయినప్పటికీ, మీకు శిక్షపడే దినాన, నేను మిమ్మల్ని ఇంకా చూడగలను, కాని మీరు నన్ను ఎన్నటికీ చూడలేరు. మీ మధ్య నా జీవనము ఇప్పటికే ఆయాసముగా మరియు నిస్సత్తువగా మారినందున, మీరు ఇకపై నన్ను మోసముచేయక లేక నా పట్ల నీచముగా ప్రవర్తించకుండునట్లు, మీ ద్వేషపు మాటలవలన కలుగు బాధనుండి తొలగుటకు, మీయొక్క భరించలేని దుర్మార్గపుప్రవర్తననుండి యెడముగా జీవించుటకు నేను వివిధ పరిసరాలను ఎంచుకున్నానని చెప్పనవసరములేదు. నేను మిమ్మల్ని విడిచిపెట్టే ముందు, సత్య విరుద్ధమైన పనిని చేయడం మానాలని మిమ్మల్ని ప్రోత్సహించవలసియున్నది. కాస్త, అందరికి సంతోషాన్ని కలిగిస్తూ, అందరికి మేలైన మరియు మీ స్వకీయ గమ్యమునకు ప్రయోజనకరమైన వాటినే చేయాలి, లేకపోతే విపత్తు నడుమ బాధపడే వ్యక్తివి నీవే గాని మరెవరో కాదు.

నన్ను ప్రేమించుచూ తమను తాము ఉపేక్షించుకొను వారిపట్ల నా దయ వ్యక్తమవుతుంది. అదే సమయములో, దుష్టులపై విధింపబడిన శిక్ష, నీతియుక్తమైన నా స్వభావమునకు ఖచ్చితమైన రుజువుగాను మరియు అంతకంటే ఎక్కువగా, నా ఉగ్రతకు సాక్ష్యమైయున్నది. విపత్తు వచ్చినప్పుడు నన్ను తిరస్కరించువారందరూ కరువు మరియు తెగులు భారినపడి అంగలార్చుతారు. అనేక సంవత్సరాలనుండి నన్ను అనుసరిస్తూ, సకలవిధములైన దుర్మార్గాలకుఒడిగట్టినవారు, తమ పాపాలకు మూల్యము చెల్లించకుండా తప్పించుకోలేరు; యుగాలలో అరుదుగా కనిపించే విపత్తులో వారుకూడా మునిగిపోతారు మరియు నిత్యము భీతితోను, భయముతోను జీవిస్తారు. మరియు నా పట్ల విధేయత చూపిన నా అనుచరులు ఆనందించుచూ, నా బలమును కొనియాడుతారు. వారు వర్ణించలేని సంతృప్తిని అనుభవిస్తూ మరియు నేను మానవజాతికి ఇదివరకెన్నడూ అనుగ్రహించని ఆనందము నడుమ జీవిస్తారు. ఎందుకంటే నేను మానవునియోక్క సత్క్రియలను విలువైనదిగా భావించి వారి దుష్క్రియలను ఛీత్కరించుకుంటాను. నేను మొదట మానవజాతిని నడిపించుట ఆరంభించినప్పటినుండి, నాతో ఏకమనస్సు కలిగిన ఒక మానవ సమూహమును కలిగియుండాలని ఎంతో ఆత్రుతగా ఆశిస్తున్నాను. అదేసమయములో, నాతో ఏకమనస్సు కలిగిలేని వారిని, నేను ఎన్నడు మర్చిపోను, ఎల్లపుడూ నా హృదయములో వారిని అసహ్యించుకొనుచూ, నేను చూడటానికి ఆనందపడే, వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు ఇప్పుడు నా దినము వచ్చింది, ఇక నేను వేచియుండాల్సిన అవసరములేదు!

నా అంతిమ కార్యము మనిషిని శిక్షించడం కొరకు మాత్రమే కాదు కాని మనిషి గమ్యాన్ని ఏర్పరచడము కొరకు కూడా. అంతేకాక, జనులందరూ నాయొక్క క్రియలు మరియు కార్యములను అంగీకరించుటకు ఇది జరుగుచున్నది. నేను చేసినదంతా సరైనదని మరియు నేను చేసినదంతా నా స్వభావమునకు ఒక వ్యక్తీకరణ అని ప్రతిఒక్కరు చూడాలని నేను ఆశిస్తున్నాను. మానవజాతిని ముందు ఉంచింది సృష్టిలోని ప్రతి జీవిని పోషించు నేనే కాని, నరుని పని మరియు స్వభావము కానేకాదు. నా ఉనికి లేకుండా మానవజాతి నశించి మరియు వైపరీత్యములయొక్క దండనను మాత్రమే అనుభవిస్తుంది. అందమైన సూర్యచంద్రులను లేక సుశ్యామలమైన ఈ లోకమును ఇకపై ఏ మానవుడు ఎన్నడూ చూడలేడు; శీతలమయమైన అంధకారమును మరియు మరణఛాయలు గల దారుణమైన లోయను మాత్రమే మానవజాతి ఎదుర్కుంటుంది. నేను మాత్రమే మానవజాతికి రక్షణ. నేను మాత్రమే మానవజాతి నిరీక్షణైనా ఇంకా ఏమైనా, మానవజాతి యొక్క అస్తిత్వం నేనే. నేను లేకుండా మానవజాతి వెంటనే స్థంబించిపోతుంది. నేను లేకుండా, మానవజాతి దుర్గతి పాలవుతుంది, మరియు సమస్త దురాత్మల పాదాలక్రింద త్రోక్కబడుతుంది, అయినప్పటికీ ఎవరూ నన్ను పట్టించుకోరు. మరెవరూ చేయజాలని పనిని నేను చేసాను, మరియు మానవుడు కొన్ని సత్క్రియలతో నా ఋణము తీర్చుకుంటాడని మాత్రము ఆశిస్తున్నాను. అయితే కొందరు మాత్రము తమ ఋణము చెల్లిస్తే, నేను మానవ లోకములో నా ప్రయాణాన్ని ముగించి, తదుపరి దశ అయిన నా ప్రత్యక్షత కార్యమును ఆరంభిస్తాను, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను మానవుని నడుమ పడిన ప్రయాసంతా సఫలమైనది, దీనినిబట్టి నేను సంతోషించుచున్నాను. నేను పట్టించుకోనేది మనుష్యుల సంఖ్య కాదు కాని, వారి సత్క్రియలు. ఏదేమైనప్పటికీ, మీరు మీ స్వంత గమ్యస్థానము కొరకు తగినన్ని సత్క్రియలు సిద్దపరచుకొనుచున్నారని ఆశిస్తున్నాను. అప్పుడు నేను సంతృప్తి చెందుతాను; లేకపోతే, సంభవింపబోవు నాశనమునుండి మీలో ఎవరూ తప్పించుకొనలేరు. విపత్తు నాతో ఉద్భవిస్తుంది మరియు నా ద్వారానే నిర్దేశించబడింది. మీరు నా దృష్టిలో మంచిగా కనబడకపోతే విపత్తునుండి మీరు తప్పించుకొనలేరు. మహాశ్రమల నడుమ, మీ పనులు మరియు క్రియలు సముచితమైనవిగా పరిగణించబడలేదు, ఎందుకంటే మీ విశ్వాసం మరియు ప్రేమ అంతా భూటకం, మిమ్మును మీరు పిరికివారిగా మరియు కఠినాత్ములుగానే కనుపరచుకొన్నారు. దీనినిబట్టి, నేను మంచి లేక చెడ్డతీర్పు మాత్రమే తీర్చగలను. మీ క్రియలు మరియు వ్యక్తీకరణను బట్టి నేను చింత కలిగియున్నాను, దాని ఆధారముగానే మీ యొక్క ముగింపుని నేను నిర్ణయించవలసియున్నది. ఏదేమైనప్పటికీ, ఒకటి నేను తప్పక స్పష్టపరచాలి; నా దయ ఇక్కడివరకు మాత్రమే విస్తరించియున్నందున, శ్రమలకాలములో నాపట్ల కాస్తయినా విధేయత చూపని వారిపై ఇక నేను దయ చూపను. అంతేకాక నాకు ద్రోహము చేసిన వారి పట్ల నాకు ఇష్టము లేదు, తమ స్నేహితుల ఫలములను అమ్ముకునే వారితో నేను సహవాసము చేయను. ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ, నా స్వభావము ఇదే. నేను ఇది మీకు చెప్పాలి: నా హృదయమును గాయపరిచేవారు ఎవరైనా రెండవమారు నా యోద్ద క్షమాపణ పొందలేరు, మరియు నాయందు నమ్మికయుంచినవారు ఎవరైనా నా హృదయములో శాశ్వ తముగా నిలిచిపోతారు.

మునుపటి:  అంత్య దినములలో క్రీస్తు మాత్రమే మనిషికి నిత్యజీవ మార్గాన్ని అందించగలడు

తరువాత:  నీవుఎవరికి విశ్వాసపాత్రుడవు?

సెట్టింగులు

  • వచనం
  • థీమ్స్

ఘన రంగులు

థీమ్స్

అక్షరశైలి

అక్షరశైలి పరిమాణం

గీతల మధ్య దూరం

గీతల మధ్య దూరం

పేజీ వెడల్పు

విషయ సూచిక

శోధించండి

  • ఈ వచనాన్ని శోధించండి
  • ఈ పుస్తకాన్ని శోధించండి

Connect with us on Messenger