దేవుని ప్రేమించడం మాత్రమే దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగి ఉండటం
ప్రస్తుతం మీరు దేవుని ప్రేమించాలని మరియు ఆయనను గురించి తెలుసుకోవాలని చూస్తుండగా, ఒక విధంగా అయితే మీరు శ్రమలు మరియు శుద్ధీకరణల గుండా వెళ్ళవలసి ఉంటుంది, మరొక విధంగా అయితే మీరు వెల చెల్లించాల్సి ఉంటుంది. దేవుడిని ప్రేమించడానికి మించిన ప్రాధాన్యమైన పాఠం ఏదీ ఉండదు, జనులు జీవిత కాలంలో తాము కలిగి ఉండే నమ్మకం నుండి నేర్చుకోదగిన పాఠం దేవుని ఎలా ప్రేమించాలి అనే సంగతిని గూర్చినదే అని చెప్పవచ్చు. మరో రకంగా చెప్పాలంటే, నీవు దేవుని నమ్మితే, నువ్వు దేవుని తప్పక ప్రేమించాలి. నీవు దేవుని యందు నమ్మిక మాత్రముంచి ఆయనను ప్రేమించలేకపోయినా, దేవుని గురించిన జ్ఞానాన్ని పొందకపోయినా, మరియు మీ హృదయాంతరంగము లోనుండి వచ్చే నిజమైన ప్రేమతో ఆయనను ప్రేమించలేకపోయినా దేవుని పట్ల నీకున్న నమ్మకం వ్యర్ధమే అని గ్రహించాలి; దేవుని పట్ల నీకున్న విశ్వాసంలో నీవు దేవుడిని ప్రేమించనట్లయితే, నీవు నీ జీవితాన్ని వ్యర్ధంగా జీవిస్తున్నట్లు లెక్క, మరియు నీ జీవితమంతా అందరి జీవితాల కంటే చాలా అల్పంగా ఉంటుంది. ఒకవేళ మీ జీవితమంతటిలో, మీరు ఎప్పుడూ దేవుడిని ప్రేమించనట్లయితే లేదా సంతృప్తిపరచనట్లయితే, నీ బ్రతుకుకు అర్థమేముంటుంది? ఇంకా దేవునిపై నీకున్న నమ్మకానికి ఆర్థం ఏముంటుంది? అది వృధా ప్రయాస కాదా? మరో రకంగా చెప్పాలంటే, మనుష్యులు దేవుని నమ్మి, ఆయనను ప్రేమించాలంటే, వారు తప్పనిసరిగా వెల చెల్లించాల్సిందే. బహిరంగంగా వారు ఏదో ఒక విధంగా నటించడంకంటేను వారి హృదయాంతరంగాలలోనుండి నిజమైన విశ్లేషణ కోసం వారు వెదకాలి. మీకు పాటలు పాడాలని మరియు నాట్యం చేయాలనే కోరిక ఉండి, సత్యమును ఆచరించలేని వారైతే, మీరు దేవుడిని ప్రేమిస్తున్నారని చెప్పగలమా? దేవుడిని ప్రేమించాలంటే అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని కోరాలి, మరియు నీకేదైనా జరిగినప్పుడు, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ, అసలు ఈ విషయంలో దేవుని చిత్తం ఏమై ఉంటుందని చూడడానికి, నీవు దేనిని సాధించాలని ప్రయత్నించాలి కోరుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, మరియు ఆయన చిత్తం పట్ల నీవు ఏ విధంగా శ్రద్ధ కలిగి ఉండాలి అని నీలో నీవే లోతైన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకు: మీరు శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒకటి మీకు సంభవించింది అనుకోండి, అలాంటి సమయంలోనే నీవు దేవుని చిత్తమేమిటో అర్థం చేసుకోవడంతో పాటు ఆయన చిత్తంపై ఎలాంటి శ్రద్ధను కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. నిన్ను నీవు సంతృప్తిపరచుకునేవానిగా నీవు ఉండకూడదు: మొదట నిన్ను నీవు తృణీకరించుకోవాలి. శరీరము కంటే తుచ్ఛమైనది మరేదీ లేదు. నీవు దేవుడిని సంతృప్తి పరచడానికి చూడాలి, మరియు నీవు చేయవలసిన దానిని నీవు చేయాలి. అలాంటి ఆలోచనలు నీకుంటే, ఈ విషయంలో దేవుడు ప్రత్యేకమైన ఆత్మ గ్రహింపును అనుగ్రహిస్తాడు, తద్వారా నీ హృదయం ఆదరణను పొందుకుంటుంది. చిన్నదో, పెద్దదో మీకేదైనా సంభవిస్తే, నీవు మొదట నిన్ను నీవు ఉపేక్షించుకొని, నీ శరీరాన్ని అన్నింటిలోకెల్లా స్వల్పమైనదిగా నీవు పరిగణించాలి. నీవు శరీరాన్ని ఎంత సంతృప్తి పరిస్తే, అది నీపై అంత అజమాయిషీ ప్రదర్శిస్తుంది; నీవు దానిని ఈసారికి సంతృప్తిపరిస్తే, వచ్చేసారి అది నిన్ను మరిన్ని పెద్ద కోరికలు కోరుతుంది. ఇదిలా కొనసాగుతుంటే, మనుష్యులు మరింత ఎక్కువగా శరీరాన్ని ప్రేమిస్తుంటారు. శరీరము అసాధారణమైన కోరికలు కోరుతుంటుంది; అది నీవు తినే వాటి విషయాలలో కావచ్చు, మీరు ధరించే వాటి విషయాలలో కావచ్చు, లేదా మీరు మీ సహనాన్ని కోల్పోవడంలో కావచ్చు, లేదా మీ స్వంత బలహీనతలకు, సోమరితనానికి బానిసై పోయే విషయంలో కావచ్చు, నీవు దానిని ఎల్లప్పుడూ సంతృప్తిపరుస్తూ దాని చెప్పుచేతల్లో ఉండాలని కోరుతుంది…. నీ శరీరాన్ని నీవు ఎంతగా సంతృప్తి పరిస్తే, దాని కోరికలు అంత బలంగా తయారవుతుంటాయి మరియు లోతైన పాపపు తలంపులకు కేంద్రమయ్యేంత దుర్మార్గంగా తయారై దేవునికి అవిధేయత చూపించడంతో పాటు తనను తానే హెచ్చించుకుంటూ దేవుని పనిపై నమ్మకం లేనిదిగా తయారవుతుంది. శరీరాన్ని ఎంతగా సంతృప్తి పరిస్తే, దాని బలహీనత అంత అధికమవుతుంటుంది; నీ బలహీనతను బట్టి నీ మీద ఎవ్వరూ సానుభూతి చూపించడం లేదని మరియు దేవుడు నిన్ను ఎడబాసి సుదూరంగా వెళ్ళిపోయాడని నీవెప్పుడూ బాధపడాల్సి వస్తుంది. నీవు ఈ క్రింది విధంగా చెప్పడం ప్రారంభిస్తావు: “దేవుడు ఇంత కఠినంగా ఎలా ఉంటున్నాడు? ఆయన మనుష్యులకు విజయాన్ని ఎందుకు ఇవ్వడు?” మనుష్యులు శరీరాన్ని సంతృప్తి పరుస్తూ దానిలో విపరీరమైన ఆనందం పొందుతూ ఉంటే, వారు తమను తానే నాశనం చేసుకుంటారు. నీవు దేవుడిని నిజముగా ప్రేమించి, నీ శరీరాన్ని సంతృప్తి పరచకపోతే, నీకు దేవుడు చేసేదంతా సరియైనదిగా మరియు మంచిదిగా కనిపిస్తుంది, మరియు నీ తిరుగుబాటు స్వభావం వలన మరియు మీ దుర్నీతి వలన శాపగ్రస్తుడవై దోషిగా తీర్పు తీర్చబడాల్సిన నీవు నీతిమంతునిగా తీర్పు తీర్చబడతావు. నీవు ఆయన వద్దకు రావడానికి దేవుడు నిన్ను శిక్షించి, క్రమశిక్షణపరచి, నిన్ను గుణపరచే పరిస్థితులను ఏర్పరిచే రోజులు నీ జీవితంలో వస్తాయి—అప్పుడు దేవుడు నీలో చేస్తున్నదంతయూ అద్భుతంగా నీకు అనిపిస్తుంది. అప్పుడు నీకు అది అంతా పెద్ద శ్రమలా అనిపించదు కానీ దేవుడు ఎంతో ప్రేమామయునిలా కనిపిస్తాడు. నీవు నీ శరీర బలహీనతలవైపే మొగ్గు చూపుతూ దేవుడు నీ నుండి దూరంగా వెళ్ళిపోయాడని అంటున్నట్లయితే, నీకెప్పుడూ శ్రమలు కలుగుతున్నట్లే అనిపిస్తుంది మరియు నీవు మరింత కృంగిపోతావు, మరియు నీకు దేవుని పని అంతటిపై స్పష్టత ఉండకపోవడంతో పాటు మానవుడి బలహీనతలపై దేవుడు ఎప్పుడూ సానుభూతిని కలిగి ఉండడు మరియు మానవుని కష్టాలను దేవుడు అర్థం చేసుకోడు అనే భావన కలుగుతుంది. ఇందును బట్టి నీవు నీకేదో గొప్ప అన్యాయం జరిగిపోయి ఎప్పుడు దయనీయమైన స్థితిలో ఒంటరివన్న భావనలోనికి ప్రవేశిస్తావు. ఇక వీటి ఫలితంగా నీవు అన్ని విషయాలను గురించి ఫిర్యాదులు చేయడం మొదలుపెడతావు. ఈ విధంగా నీవు నీ బలహీనతకు మరియు శరీరాశలకు లొంగిపోయిన కొలదీ, దేవుడు దూరంగా వెళ్ళిపోయాడన్న భావన అంత అధికంగా నీకు కలుగుతుంటుంది మరియు నీవు దేవుని పనిని తిరస్కరించి, దేవునికి విరోధిగా పూర్తి అవిధేయతలోనికి దిగజారిపోయేంత దారుణ పరిస్థితికి వెళ్ళిపోతావు. ఈ కారణంచే, నీవు నీ శరీరానికి విరోధంగా తిరుగుబాటు చేయాలి కానీ దానికి లొంగిపోకూడదు: “నా భర్త (భార్య), పిల్లలు, భావి ప్రణాళికలు, వివాహము, కుటుంబం—ఇవేవీ విలువైనవి కావు! నా హృదయంలో దేవుడు మాత్రమే ఉన్నాడు, మరియు నేను దేవుని సంతృప్తి పరచడానికి వీలైనంత ప్రయత్నించాలి కానీ నా శరీరాన్ని సంతోషపెట్టడానికి చూడకూడదు.” నీవు ఈ తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి తీర్మానం ఎల్లప్పుడూ నీ మనసులో నిలిచియుంటే, నీవు సత్యమును ఆచరిస్తూ, నిన్ను నీవు ఉపేక్షించుకొనడానికి ప్రయత్నించినప్పుడు, ఆ పనిని నీవు చాలా సులభంగా చేయగలుగుతావు. ఒక రైతు ఉండేవాడు. అతడికి దారిలో చలికి గడ్డకట్టుకుపోతున్న పాము ఒకటి కనిపించింది. రైతు ఆ పామును చేతిలోనికి తీసుకొని, గుండెలకు హత్తుకొన్నాడు. కానీ ఆ పాము తేరుకున్న తర్వాత అది ఆ రైతును కాటు వేసి చంపివేసింది. మానవుని శరీరం ఇలాంటి పాము వంటిది: ఇది మనుష్యులకు ప్రాణ హానిని కలిగించే స్వభావం కలిగి ఉంది—దానికి పూర్తి స్వేచ్ఛ లభించి, దాని ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలు పెట్టినప్పుడు, నీ జీవితం నాశనమై పోతుంది. శరీరాశలు సాతానుకు చెందినవి. అది అనేక విపరీత కోరికలను కలిగి ఉంటూ దాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది, అది సుఖాన్ని అనుభవిస్తూ విరామ వేడుకల్లో మునిగి తేలాలాలని, సోమరిగా ఏమీ చేయకుండా సమయం గడపాలని చూస్తుంది. నీవు దానిని ఒక నిర్దిష్ట స్థాయి వరకు సంతృప్తి పరిచావంటే, ఇక అది నిన్ను క్రమంగా తినివేస్తుంది. ఇదెలా అంటే, నీవు దానిని ఈ సారి సంతృప్తిపరిస్తే, వచ్చేసారి అది నిన్ను మరిన్ని సంగతులను గురించి అడుగుతుంది. దానికెప్పుడూ అపరిమితమైన కోర్కెలు, కొత్త ఆశలు ఉంటూనే ఉంటాయి, మరియు నీవు శరీరానికి లోబడిపోయిన దానిని అదనుగా తీసుకొని నీవు దానిలో ఇంకా ఎక్కువ సంతోషిస్తూ, దాని సౌఖ్యములోనే నిలిచిపోయేలా నిన్ను తయారుచేస్తుంది—నీవు దానిని జయించకపోతే, చివరికి నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. నీవు దేవుని యెదుట నీ జీవమును పొందుకుంటావో లేక శాశ్వత అంతమును పొందుకుంటావో అనేది నీవు నీ శరీరానికి విరుద్ధంగా ఏ విధంగా తిరుగుబాటు చేస్తావో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దేవుడు నిన్ను రక్షించి, ఎన్నుకొని, నీ గమ్యస్థానాన్ని ముందుగానే నిర్దేశించియున్నాడు, అయినప్పటికీ, నీవు నీ ప్రస్తుత జీవితములో ఆయనను సంతృప్తి పరచడానికి, నిజంగా దేవుని ప్రేమించే హృదయాన్ని కలిగి నీ స్వంత శరీరంపై తిరుగుబాటు చేయడానికి ఇష్టపడకపోతే చివరికి నిన్ను నీవే నాశనం చేసుకొని తీవ్ర వేదనలు భరించాల్సి ఉంటుంది. నీవు ఎల్లప్పుడూ శరీరానికి లొంగిపోయి ఉండిపోతే, సాతానుడు నిన్ను నెమ్మది నెమ్మదిగా మింగివేస్తూ, నీవు పూర్తి అంధకారంలోనికి వెళ్ళిపోయేంతవరకు నీకు జీవం లేకుండా లేదా ఆత్మ నిన్ను స్పృశించకుండా చేస్తాడు. నీవు అంధకారంలో నివసిస్తే, సాతానుడు నిన్ను చెరపట్టుకు తీసుకుపోతాడు, నీ హృదయంలో దేవుడు నిలిచి ఉండడు, ఇక ఆ సమయంలో నీవు దేవుడి ఉనికినే పూర్తిగా తిరస్కరించి ఆయనను విడిచిపెట్టే భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతావు. కాబట్టి, మనుష్యులు దేవుడిని ప్రేమిస్తే, వారు శ్రమలు అనే వెల చెల్లిస్తూ కష్టాలను ఎదుర్కోవాల్సిందే. ఎక్కువగా చదివెయ్యాలని, ఎక్కువగా పొందుకోవాలనీ పరిగెత్తి ప్రాకులాడాల్సిన అవసరం లేదు; బదులుగా వారు, వారిలోని విపరీతమైన ఆలోచనలు, వ్యక్తిగత ఆసక్తులు, మరియు వారి స్వీయ పరిగణనలు, భావనలు, మరియు ఉద్దేశాలు మొదలైన వాటిని విడిచిపెట్టాలి. అదే దేవుని చిత్తం.
మనుష్యుల బాహ్య ప్రవర్తనతో దేవుడు వ్యవహరించడం కూడా ఆయన పనిలో భాగమే; ఉదాహరణకు జనుల అసాధారణ బాహ్య నైజాన్ని, లేదా వారి జీవన విధానం మరియు అలవాట్లు, వారి మార్గాలు మరియు సంప్రదాయాలు, వారి బాహ్య ఆచారాలు మరియు వారి ప్రాకులాట వంటి వాటితో వ్యవహరించడం కూడా ఆయన కార్యములో ఒక భాగమైయున్నది. కానీ ప్రజలు సత్యాన్ని ఆచరణలో పెట్టాలని మరియు తమ స్వభావాలను మార్చుకోవాలని ఆయన అడిగినప్పుడు, ప్రాథమికంగా ఆయన వారిలోని ఉద్దేశాలతోను మరియు తలంపులతోను వ్యవహరిస్తాడు. బాహ్య స్వభావముతో మాత్రమే వ్యవహరించడం అంటే పెద్ద కష్టమేమి కాదు; ఇది మీరు ప్రేమించే వాటిని తినవద్దు అని అడగటం వంటిది, ఇది సులభం. నీలో అంతర్లీనంగా ఉన్న భావనలను ప్రభావితం చేసే వాటిని తరిమివేయడం అంత సులభమేమీ కాదు. దీని కోసం మనుష్యులు శరీరముపై తిరుగుబాటు చేయాలి, వెల చెల్లించాలి మరియు దేవుని యెదుట శ్రమలు అనుభవించాలి. ముఖ్యంగా జనులు వారి తలంపులకు విరుద్ధంగా తిరగబడాలి. మనుష్యులు దేవుడిని నమ్మడం మొదలుపెట్టిన నాట నుండి వారిలో అనేక తప్పు ఉద్దేశాలు పేరుకుపోయాయి. నీవు సత్యమును ఆచరించనప్పుడు, మీ తలంపులన్నీ సరియైనవే అని అనుకుంటావు. కానీ నీకేదైనా జరిగితే అప్పుడు నీలో గూడుకట్టుకున్న అనేక తప్పుడు ఉద్దేశాలను నీవు చూడగలుగుతావు. ఇందును బట్టి దేవుడు మానవులను పరిపూర్ణులనుగా చేయునప్పుడు, వారు దేవుడిని గురించి పుర్తిగా తెలుసుకోకుండా వారికి అడ్డుపడే అనేక తప్పుడు భావనలు వారిలో ఉన్నాయని వారు తెలుసుకునేలా దేవుడు చేస్తాడు. నీ తలంపులు తప్పు అని నీవు గుర్తించినప్పుడు, నీ భావనలు మరియు ఉద్దేశాల ప్రకారం నడచుకోవడం ఆపివేసి, దేవుని సాక్ష్యాన్ని కలిగి ఉండగలిగితే, మరియు నీకు ఏది జరిగినా నీ స్థానంలో ధృఢంగా నిలబడగలిగితే, నీవు నీ శరీరంపై తిరుగుబాటు చేస్తున్నట్లు ఋజువవుతుంది. నీవు శరీరానికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, నీలో నీకు ఒక అంతర్యుద్ధం అనివార్యమవుతుంది. సాతాను ఎంతో ప్రయత్నించి మనుష్యులందరూ దానిని అనుసరించేలా చేస్తాడు, మనుష్యులు తమ శరీర తలంపులను అనుసరించేలా చేస్తూ వారి శరీర కోర్కెలను సజీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు—కానీ మరోవైపు దేవుని మాటలు మనుష్యుల అంతరంగములలో జ్ఞానపు వెలుగును కలిగిస్తుంటాయి. ఈ సందర్భంలో నీవు దేవుడిని అనుసరిస్తావా లేక సాతానును అనుసరిస్తావా అనేది నీ చేతిలోనే ఉంది. మనుష్యుల అంతరంగములతో, వారి ఆలోచనలతో మరియు దేవుని హృదయానుసారం కాని కల్పనలతో వ్యవహరించడానికి దేవుడు ప్రధానంగా వారిని సత్యాన్ని ఆచరించడం ప్రారంభించాలని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రజల హృదయాలలో సంధించి, వారికి జ్ఞానపు వెలుగును కలిగిస్తుంది. కాబట్టి ప్రతి సంగతికి వెనుక ఒక యుద్ధమే జరుగుతుందని గ్రహించాలి: మనుష్యులు సత్యాన్ని, లేదా దేవుని ప్రేమను ఆచరణలో పెట్టిన ప్రతి సందర్భంలో ఒక గొప్ప యుద్ధమే జరుగుతుంది, శరీర విషయములో అంతా సవ్యంగా ఉన్నట్లే అన్నిపించినప్పటికీ, వారి హృదయపు లోతులలో ఒక జీవన్మరణ యుద్ధం జరుగుతుంటుంది. నిజానికి ఈ యుద్ధం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది—ఈ భీకర యుద్ధం మరియు పరిశోధన తర్వాతే, వారు విజయులయ్యారా లేక అపజయం పాలయ్యారా అనే విషయం నిర్ణయించబడుతుంది. ఈ సమయంలో వారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. మనుష్యులలోని అనేక తలంపులు సరియైనవి కాకపోవడం వలన, లేదంటే దేవుని పనిలో ఎక్కువ భాగం వారి తప్పుడు ఉద్దేశాలతో వ్యవహరించడం వలన మనుష్యులు సత్యాన్ని ఆచరణలో పెట్టాలని ప్రయత్నించినప్పుడు తెర వెనుక గొప్ప యుద్ధం జరుగుతుంది. మనుష్యులు ఈ సత్యాన్ని ఆచరణలో పెడుతూ, దేవుడిని సంతృప్తి పరచడానికి అంతిమంగా తమ మనస్సును సిద్ధం చేసుకునే సందర్భంలో తెర వెనుక లెక్కలేనన్ని వేదన కన్నీటిని ఒలికించాల్సి వస్తుంది. ఈ యుద్ధం వలననే మనుష్యులు శ్రమలను మరియు శుద్ధీకరణను ఎదుర్కోవాల్సి వస్తుంది; ఇదే నిజమైన శ్రమ. ఈ యుద్ధం నీ మీదికి వచ్చినప్పుడు, నీవు నిజంగా దేవుని పక్షాన నిలబడగలిగితే, నీవు దేవుడిని సంతృప్తిపరచగలుగుతావు. సత్యాన్ని ఆచరించేటప్పుడు ఎవరైనా తప్పనిసరిగా లోలోపల శ్రమను అనుభవించాల్సిందే; ఒకవేళ వారు సత్యాన్ని అనుసరించేటప్పుడు వారిలో అంతా సవ్యంగా ఉన్నట్లే ఉంటే, వారు దేవునిచే పరిపూర్ణులుగా చేయబడవలసిన అవసరం ఉండదు, మరియు వారికి ఈ యుద్ధం మరియు శ్రమలు ఉండవు. ఇలా ఎందుకంటే దేవునిచే ఉపయోగించబడటానికి ఏ మాత్రమూ పొసగని విషయాలు మనుష్యులలో ఎన్నో ఉంటాయి, మరియు శరీరంలో తిరుగుబాటు స్వభావము అధికంగా ఉండటం వలన మనుష్యులు శరిరంపై తిరుగుబాటు చేసే పాఠాన్ని మరింత ప్రధానంగా అలవర్చుకోవాలి. మనుష్యులు తమ అంతరంగములో అనుభవించాల్సిందిగా దేవుడు తెలిపిన శ్రమ ఇదే. నీవు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, త్వరపడి దేవుని ప్రార్ధించండి: “దేవా! నాకు నిన్ను సంతృప్తిపరచాలని ఉంది, నీ హృదయాన్ని సంతృప్తి పరచడానికి అంతిమ శ్రమలను సహించడానికి నేను ఇష్టపడుతున్నాను, నేను ఎలాంటి ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ, నేను తప్పకుండా నిన్ను సంతృప్తిపరచాలి. నేను నా జీవితాన్నంతటినీ ధారపోయాల్సి వచ్చినా నిన్ను తప్పకుండా సంతృప్తిపరుస్తాను!” ఈ తీర్మానం తీసుకొని, నీవు ప్రార్ధన చేస్తే, నీవు నీ సాక్ష్య జీవితంలో ధృఢంగా నిలబడగలుగుతావు. వారు సత్యమును ఆచరణలో పెట్టే, శుద్ధీకరణానుభవాన్ని పొందే, అలసిపోయే మరియు దేవుని కార్యం వారిలో జరిగే ప్రతి సందర్భంలో, గొప్ప శ్రమలను పొందుతారు. ఇదంతా మనుష్యులకు పరీక్ష, కాబట్టి మనుష్యులందరిలో ఈ యుద్ధం జరుగుతుంది. ఇదే వారు చెల్లించే అసలు వెల. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవడం మరియు మరింత పొందుకోవడం గురించి ప్రయత్నించడం, ఇవన్నీ వారి చెల్లించే వెలలో భాగమే. మనుష్యులు చేయవలసినది ఇదే, ఇది వారి కర్తవ్యం, మరియు వారు నెరవేర్చాల్సిన బాధ్యత, కానీ ఇందుకోసం మనుష్యులు వారిలో నుండి వేటిని విడిచిపెట్టాలో వాటిని తప్పక విడిచిపెట్టాలి. నీవు అలా చేయకపోతే, నీవు బయటకు ఎంత గొప్ప శ్రమలు అనుభవించినా, ఎంతగా పరుగులుపెట్టినా అవన్నియూ వ్యర్థమే! అంటే, నీ బాహ్య శ్రమలు విలువైనవో కావో అనే విషయాన్ని నీలో చోటుచేసుకునే మార్పులు మాత్రమే నిర్ణయిస్తాయి. మీ అంతరంగ స్వభావం మారినప్పుడు మరియు నీవు సత్యాన్ని అనుసరించడం మొదలుపెట్టినప్పుడు, నీ బాహ్య శ్రమలన్నీ దేవుని దృష్టిలో ఆమోదయోగ్యంగా ఎంచబడతాయి; ఒకవేళ నీ అంతఃచిత్తవృత్తిలో మార్పు లేకపోతే, నీవు ఎన్ని శ్రమలు అనుభవించినా లేదా నీవు బయటకు కనిపించేలా ఎంత ప్రాకులాడినా దానికి దేవుని ఆమోదం లభించదు—దేవుడు ఆమోదం పొందని శ్రమ వ్యర్థమే. ఇందునుబట్టి, నీవు చెల్లించిన వెల దేవునిచే అంగీకరించబడిందా లేదా అనేది, నీలో మార్పు వచ్చిందా లేదా అనే అంశంపై మరియు దేవుని చిత్తం, జ్ఞానము మరియు నమ్మకత్వం కలిగి ఉండే విషయంలో దేవుని సంతృప్తిని సాధించడానికి నీవు సత్యాన్ని ఆచరణలో పెడుతూ నీ స్వీయ తలంపులు మరియు భావనలకు విరుద్ధంగా తిరుగుబాటు చేస్తున్నావా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నీవు ఎంతగా పరుగులెత్తినా, నీవు నీ స్వీయ తలంపులకు విరుద్ధంగా తిరుగుబాటు చెయకుండా, బయటికి కనిపించే క్రియలపై మాత్రమే లక్ష్యముంచుతూ, నీ జీవితంపై ఎప్పుడూ శ్రద్ధ వహించకుండా ఉంటున్నట్లయితే, నీ శ్రమ అంతయూ వృధా ప్రయాసే అవుతుంది. ఒక నిర్దిష్ట సందర్భంలో, నీవు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటావు, కానీ దానిని చెప్పడానికి అది సరైన సందర్భం కాదని, దానిని చెప్పడం వలన నీ సోదర సోదరీలకు ప్రయోజనం కలుగకపోగా అది వారిని నొప్పిస్తుందని, మరియు ఆ మాటలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండవని నీకు అనిపిస్తే, నీ బాధను నీలోనే దిగమింగుకుంటూ నీవు ఆ విషయాన్ని చెప్పకుండానే ఉండిపోతావు. ఈ సమయంలో, నీలో ఒక పోరాటం జరుగుతుంది, కానీ నీవు మాత్రం శ్రమను అనుభవించడానికి మొగ్గు చూపుతూ నీవు ప్రేమిస్తున్న దానిని విడిచిపెడతావు. నీవు దేవుడిని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఈ శ్రమలను సహించడానికి ఇష్టపడతావు, నీలో నీవెంత శ్రమను అనుభవించినప్పటికీ, శరీరాశలకు లోనుకాక దేవుని హృదయాన్ని సంతృప్తిపరుస్తావు, తద్వారా నీవు కూడా నీ అంతరంగములో ఆదరణ పొందుతావు. ఇది నిజంగా వెల చెల్లించుటయే, దేవుడు కోరుకున్న వెలను చెల్లించుటయే. నీవు ఈ విధంగా జీవిస్తే, దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు; నీవు దీనిని సాధించలేకపోతే, నీవు ఎంత గ్రహింపును పొందుకున్నప్పటికీ, లేదా నీవు ఎంత బాగా మాట్లాడినప్పటికీ, అదెందుకూ పనికిరాదు! దేవుడిని ప్రేమించే మార్గంలో, దేవుడు సాతానుతో యుద్ధం చేయునప్పుడు నీవు దేవుడి పక్షాన నిలబడి, సాతాను వైపుకు మళ్ళకపోతే నీవు దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు, మరియు నీవు నీ సాక్ష్యాన్ని ధృఢపరుచుకోగలుగుతావు.
దేవుడు మనుష్యులలో చేసే పనికి సంబంధించి ప్రతి దశలో, బయటకు అది మానవ ఏర్పాట్ల వలన కలిగినట్టుగా లేదా మానవుల జోక్యం ద్వారా కలిగినట్లుగా కనిపిస్తూ, మనుష్యుల మధ్య సంబంధాలవలె కనిపిస్తుంది. కానీ తెర వెనుక మాత్రం, ప్రతి దశలో మరియు ప్రతి కార్యంలో దేవుని ఎదుట సాతాను విసిరే పందెంలాగా ఉంటుంది, మరియు ప్రజలు దేవునికి యోబు శోధించబడిన సందర్భాన్ని ఉదాహరణగా తీసుకోండి: తెర వెనుక, సాతాను, దేవునికి సవాలు విసిరాడు, ఈ ప్రక్రియ అంతటిలో యోబుకు జరిగినదంతా మనుష్యుల చర్యల వలన మరియు మనుష్యుల జోక్యం వలననే జరిగింది. దేవుడు మీలో చేసే కార్యంలో అడుగడుగునా దేవునితో సాతాను విసిరే సవాలు ఉంటుంది—వెనుక జరిగేదంతా యుద్ధమే. ఉదాహరణకు, నీ సహోదర సహోదరీల విషయంలో నీకు ఏవైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే, నీవు వారితో వాటిని చెప్పాలి అనుకుంటావు—నీవు చెప్పాలనుకునే మాటలు దేవుడిని బాధపెట్టవచ్చు—కానీ నీవు ఆ మాటలు చెప్పకపోతే, లోపల నీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఈ సందర్భంలో నీలో ఒక యుద్ధం ప్రారంభమవుతుంది: “నేను చెప్పాలా వద్దా?” ఇదే యుద్ధం. ఇందునుబట్టి, నీవు ఎదుర్కొనే ప్రతి దాని వెనుక ఒక యుద్ధం ఉంటుంది, మరియు నీలో అలాంటి యుద్ధం జరిగేటప్పుడు, మీరు నిజంగా దానికి సహకరిస్తూ శ్రమను అనుభవిస్తున్నందుకు వందనాలు, దేవుడు నీలో పని చేస్తున్నాడు. అంతిమంగా, నీలో ఉన్న విషయాలను ప్రక్కన పెట్టగలుగుతావు మరియు నీలోని కోపం స్వాభావికంగా చల్లారిపోతుంది. నీవు దేవునికి సహకరించడం వలన ఫలితం ఇలాగే ఉంటుంది. మనుష్యులు చేసే ప్రతిదానికీ వారు చేసే ప్రయత్నంలో భాగంగా వారు కొంత వెలను చెల్లించాల్సి ఉంటుంది. నిజమైన శ్రమను అనుభవించకుండా, వారు దేవుడిని సంతృప్తిపరచలేరు; వారు కనీసం దేవుడిని కొద్దిగా కూడా సంతృప్తిపరచలేరు, వారు పేలవమైన నినాదాలు మాత్రం చేస్తూ మిగిలిపోతారు! ఈ పస లేని నినాదాలు దేవుడిని సంతృప్తిపరచగలవా? దేవుడు మరియు సాతాను ఆత్మ సంబంధమైన ప్రపంచంలో యుద్ధంలో ఉండగా, నీవు దేవుడిని ఎలా సంతోషపెట్టగలవు, మరియు నీవు ఆయనలో కలిగియున్న సాక్ష్యాన్ని ధృఢంగా ఎలా నిలుపుకోగలవు? నీకు జరిగేదంతా గొప్ప శ్రమానుభవమనియూ, నీవు ఆయనకు సాక్ష్యంగా నిలవాలని దేవుడు ఆశించే సమయమనీ నీవు తెలుసుకోవాలి. అవి బయటకు అంత ప్రాధాన్యత కలిగి లేనట్లుగా కనిపించినా, ఈ సంగతులు జరిగినప్పుడు అవే నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా లేదా అనే విషయంపై సాక్ష్యమిస్తాయి. నీవు అలా చేయగలిగితే నీవు ఆయనకు బలమైన సాక్ష్యంగా నిలబడగలుగుతావు, నీవు ఆయన పట్ల ప్రేమను కలిగి యుండటాన్ని ఆచరణలో పెట్టలేకపోతే, నీవు సత్యమును ఆచరించేవాడవు కావనియూ, నీవు సత్యమును కలిగి లేవనియూ, మరియు జీవము లేని పొట్టులాంటి వాడవనియూ దీనిని బట్టి ఋజువవుతుంది! మనుష్యులకు సంభవించేదంతయూ దేవుడు వారిని తన కొరకు బలమైన సాక్షులుగా నిలబడాలని ఆశించినప్పుడే జరుగుతుంది. ఈ సమయంలో నీ జీవితంలో గొప్పగా ఏమీ సంభవించకపోయినప్పటికీ, సాక్ష్యమును కలిగి లేకపోయినప్పటికీ, నీ అనుదిన జీవితములోని అన్ని సంగతులూ నీవు దేవునికి సాక్షిగా జీవించడంలో వాటి పాత్రను పోషిస్తాయి. నీవు నీ సహోదర సహోదరీలు, కుటుంబ సభ్యులు మరియు నీ చుట్టూ ఉన్నవారందరి గౌరవాన్ని పొందగలిగినప్పుడు; ఒకానొక రోజున అవిశ్వాసులు వచ్చి నీవు చేసేదంతటినీ ఇష్టపడి, దేవుడు నీలో చేస్తున్నదంతా అద్భుతంగా ఉందని గుర్తించినప్పుడు, నీవు సాక్ష్యాన్ని కలిగియున్నట్లు నీవు గ్రహించాలి. నీకు అంత ప్రావీణ్యత లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, దేవుని పరిపూర్ణత నీలో సాక్షాత్కరించడం ద్వారా అసమర్ధులైన వారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలను నెరవేర్చగలడో ఇతరులకు తెలియజేస్తూ, ఆయనను సంతృప్తిపరచగలుగుతూ ఆయన చిత్తాన్ని చేయడంలో ఆసక్తిని కలిగి ఉంటావు. మనుష్యులు దేవుడిని తెలుసుకొని సాతానును జయించేవారుగా తయారై, దేవునికి ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉంటే ఇలాంటి వారి కంటే మరింత ధృఢమైన వారు మరెవ్వరూ ఉండరు, ఇది అత్యంత గొప్ప సాక్ష్యం. నీవు గొప్ప కార్యాలను చేయలేని అసమర్ధుడవైనప్పటికీ, నీవు దేవుడిని సంతృప్తిపరచగలవు. ఇతరులు వారు తప్పుడు భావనలను ప్రక్కన పెట్టలేరు, కానీ నీవైతే వాటిని విడిచిపెట్టగలవు; ఇతరులైతే వారి వాస్తవ అనుభవాలలో దేవుడికి సాక్షులుగా ఉండలేరు, కానీ నీవైతే నీకున్న స్థాయితో దేవుడి ప్రేమను తిరిగి ఆయన పట్ల చూపిస్తూ ప్రతిధ్వనించే సాక్ష్యాన్ని ఆయన యెడల కలిగి ఉంటావు. ఇది మాత్రమే నిజంగా దేవుడిని ప్రేమించడంగా పరిగణించబడుతుంది. నీవు దీనిని చేయలేకపోతే, నీవు నీ కుటుంబ సభ్యుల వద్ద, నీ సోదరుల వద్ద, లేదా ఈ లోకస్తుల ముందు నీ సాక్ష్యాన్ని కలిగి ఉండలేవు. నీవు సాతాను యెదుట దేవుని కొరకు సాక్షిగా నిలబడలేకపోతే, సాతాను నిన్ను చూసి పరిహాసం చేస్తుంది, అది నిన్ను హాస్యాస్పదముగానూ, ఆట బొమ్మగా పరిగణిస్తుంది, అది నిన్ను ఎల్లప్పుడూ అవివేకిని చేస్తూ వెర్రివానివలె చూస్తుంది. భవిష్యత్తులో, నీకు గొప్ప శ్రమలు కలుగవచ్చు—కానీ ఈరోజు నీవు నిజమైన హృదయంతో దేవుడిని ప్రేమిస్తే, రాబోయే శ్రమలు ఎంత గొప్పవైనప్పటికీ మరియు నీకు ఏది జరిగినప్పటికీ నీ సాక్ష్యాన్ని కొనసాగిస్తూ ధృడంగా నిలబడగలగడమే కాక దేవుడిని సంతృప్తిపరచగలుగుతావు, అప్పుడు నీ హృదయం ఆదరణ పొందుతుంది, నీవు భవిష్యత్తులో ఎంత గొప్ప శోధనలు ఎదుర్కొన్నా ఇక నీవు ఏమాత్రము జడియవు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నీవు చూడలేవు; మీరు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రమే దేవుడిని సంతృప్తిపరచగలరు. మీరు గొప్ప పనులు చేయలేని అసమర్ధులు, నిజ జీవితంలో ఆయన వాక్యమును అనుభవించడం ద్వారా దేవుడిని సంతృప్తి పరచడానికి మీరు శ్రద్ధ చూపించాలి, మరియు సాతానును సిగ్గుపరిచే గొప్ప బలమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నీ శరీరం సంతృప్తి చెందనప్పటికీ మరియు శ్రమలు అనుభవించినప్పటికీ, నీవు దేవుడిని సంతృప్తి పరుస్తూ సాతానును సిగ్గుపరుస్తావు. నీవు ఎల్లప్పుడూ ఇదే విధంగా చేస్తే, దేవుడు నీ ముందు ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఒకానొక రోజున గొప్ప శ్రమలు కలిగినప్పుడు, ఇతరులందరూ పడిపోతారు కానీ నీవు మాత్రం ధృడంగా నిలబడగలుగుతావు: నీవు చెల్లించిన వెల కారణంగా, నీవు ధృడంగా నిలబడి క్రిందికి పడిపోకుండా దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. ఒకవేళ నీవు సాధారణ పరిస్థితుల్లో సత్యాన్ని ఆచరణలో పెట్టగలిగి, ఆయనను నిజంగా ప్రేమించే హృదయంతో ఆయనను సంతృప్తిపరచగలిగితే దేవుడు నీ భవిష్యత్ శ్రమలలో నిన్ను తప్పకుండా కాపాడతాడు. నీవు అవివేకివై ప్రావీణ్యత లేక అసమర్ధుడిగా ఉంటే, దేవుడు నిన్ను చిన్న చూపు చూడడు. నీ తలంపులు సరిగా ఉన్నాయా లేదా అనే దానిపైనే అది ఆధారపడుతుంది. ఇప్పుడు, నీవు దేవుడిని సంతృప్తిపరచగలుగుతూ చిన్న విషయాలలో కూడా ఎంతో శ్రద్ధను కనబరిస్తే, నీవు దేవుడిని అన్ని విషయాలలో సంతృప్తి పరచగలుగుతావు, దేవుడిని నిజంగా ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటావు, నీకు అర్థం కాని సంగతులు కొన్ని ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి నీ దుష్ట తలంపులను తీసివేసికొని దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ ఆయనను సంతృప్తి పరచడానికి నీవు చేయవలసినదంతయూ నీవు చేస్తావు. నీ సహోదర సహోదరీలు నిన్ను వెలివేయవచ్చు, కానీ నీ హృదయం మాత్రం దేవుడిని సంతృప్తిపరుస్తూనే ఉంటుంది, ఇక నీవు శరీర సౌఖ్యాల గురించి ఆశించవు. నీవు ఎల్లప్పుడూ ఇదే విధంగా చేస్తే, నీకు గొప్ప శ్రమలు కలిగినప్పుడు నీవు సంరక్షించబడతావు.
మనుష్యులలో ఎలాంటి ఆంతరంగిక స్థితి ఉన్నప్పుడు శ్రమలు కలుగుతాయి? మనుష్యులలో ఉండే దేవుడిని సంతృప్తిపరచలేని తిరుగుబాటు స్వభావాన్ని అవి లక్ష్యంగా చేసుకుంటాయి. మనుష్యులలో అపవిత్రత మరియు వేషధారణ అధికంగా ఉంది, కాబట్టి దేవుడు మనుష్యులను శుద్ధీకరించడానికి వారిని శ్రమల గుండా నడిపిస్తాడు. కానీ నీవు ఇప్పుడు దేవుడిని సంతృప్తి పరిస్తే, భవిష్యత్తులో నీకు కలిగే శ్రమలు నిన్ను పరిపూర్ణునిగా చేస్తాయి. నీవు ఇప్పుడు దేవుడిని సంతృప్తి పరచలేకపోతే, భవిష్యత్తులో కలిగే శ్రమలు నీకు శోధనకరంగా పరిణమించి, నీకు తెలియకుండానే నీవు పడిపోతావు. ఆ సమయంలో నీవు నిలదొక్కుకోలేవు, దేవుడి పనిని కొనసాగించలేవు మరియు నిజమైన ఉన్నతిని పొందుకోలేవు. దేవుడిని మరింతగా సంతృప్తి పరచడానికి, అంతము వరకు ఆయనను వెంబడించడానికి నీవు భవిష్యత్తులో ధృఢంగా నిలబడాలని ఆశిస్తే, ఈరోజే నీవు బలమైన పునాదిని ఏర్పరచుకోవాలి. నీవు అన్ని విషయములలో సత్యాన్ని ఆచరించడం ద్వారా మరియు ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం పట్ల శ్రద్ధను కలిగి ఉండటం ద్వారా దేవుడిని సంతృప్తిపరచాలి. నీవు ఎల్లప్పుడూ ఇదే విధంగా చేస్తే, నీలో ఒక పునాది ఏర్పడుతుంది మరియు ఆయనను ప్రేమించే హృదయాన్ని దేవుడు నీలో కలిగించి ఆయన విశ్వాసాన్ని నీకు అనుగ్రహిస్తాడు. శ్రమలు నిన్ను నిజముగా పడద్రోసిన రోజున, నీవు కొంత బాధను అనుభవించవచ్చు, కొంతవరకు దుఃఖపడవచ్చు మరియు మరణకరమైన వేదనతో నిన్ను క్షోభకు గురిచేసే వేదన నీకు కలుగవచ్చు—కానీ దేవుని పట్ల నీకున్న ప్రేమ మాత్రం మారక మరింత లోతైన అనుభవాన్ని పొందుతావు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి. దేవుడు చెప్పేవన్నిటినీ నీవు అంగీకరిస్తూ విధేయత కలిగిన హృదయంతో వాటిని ప్రస్తుత రోజుల్లో చేయగలిగితే, నీవు తప్పకుండా దేవునిచే ఆశీర్వదించబడతావు, నీవు దేవుని ఆశీర్వాదములు పొందుకొని ఆయన వాగ్దానాన్ని అందుకుంటావు. నీవు ప్రస్తుతం దీనిని చేయలేకపోతే, ఒకానొక దినాన నీకు శ్రమలు కలిగినప్పుడు, నీలో విశ్వాసము గానీ, ప్రేమగల హృదయం గానీ ఉండవు, ఆ సమయంలో శ్రమ, శోధనగా మారుతుంది; సాతాను శోధనలో నీవు ఇరుక్కుని ఇక బయటపడే మార్గం లేకుండా ఉండిపోతావు. ప్రస్తుతం నీకు చిన్నపాటి శ్రమలు కలిగినప్పుడు ధృడంగా నిలబడవచ్చు, కానీ నీకు ఒకానొక దినాన పెద్ద పెద్ద శ్రమలు కలిగినప్పుడు ధృడంగా నిలబడతావన్న నమ్మకం లేదు. కొంతమంది అహంకారముతో నిండుకున్నవారై, ఇప్పటికే దాదాపుగా పరిపూర్ణులుగా ఉన్నారని అనుకుంటారు. అటువంటి సమయాల్లో నీవు లోతుకు వెళ్ళకుండా ఉల్లాసంగా ఉంటే, నీవు ప్రమాదంలో ఉన్నావని గ్రహించాలి. ప్రస్తుత రోజుల్లో, దేవుడు గొప్ప శ్రమలతో కూడిన కార్యాలను చేయకపోవడంతో, అంతా సవ్యంగానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ దేవుడు నీ స్థాయి గురించి నిన్ను పరిశోధించి, కనుగొన్నప్పుడు, నీ స్థాయి చాలా స్వల్పముగా ఉండటాన్ని మరియు నీవు చాలా వెనుకబడి ఉండటాన్ని మరియు గొప్ప శ్రమలు ఎదుర్కోలేని అసమర్థుడవనియూ కనుగొనగలుగుతావు. నీవు నీలాగే ఉండిపోయి, జడత్వపు స్థితిలో ఉంటే, శ్రమలు కలిగినప్పుడు, నీవు పడిపోతావు. మీ స్థాయి ఎంత స్వల్పమో మీరు ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి; ఈ విధంగా మాత్రమే మీరు ముందుకు కొనసాగగలరు. నీ స్థాయి చాలా స్వల్పమనియూ, నీ మనోబలం చాలా స్వల్పమనియూ, నీలో ఉన్న దానిలో చాలా స్వల్పము మాత్రమే వాస్తవం అనియూ మరియు దేవుని చిత్తానికి నీవు సరియైన వాడవు కావనియూ శ్రమల కాలంలో మాత్రమే నీవు కనుగొనగలిగితే, అప్పటికే చాలా ఆలస్యమయిపోతుంది.
నీకు దేవుని స్వభావం ఎలాంటిదో తెలియకపోతే, నీవు ఈ శ్రమలు ఎదురైనప్పుడు తప్పకుండా పడిపోతావు, ఎందుకంటే—దేవుడు మనుష్యులను ఎలా పరిపూర్ణులనుగా చేస్తాడు, ఏ విధానంలో ఆయన వారిని పరిపూర్ణులుగా చేస్తాడు, మరియు దేవుని శ్రమలు నీ మీదికి ఎప్పుడు వస్తాయి అనే విషయాలు నీకు తెలియవు కాబట్టి వీటన్నిటికీ మరియు నీ భావనలకు సరిపోలకపోవడంతో నీవు ధృఢంగా నిలబడలేవు. దేవుని నిజమైన ప్రేమయే ఆయన పూర్తి స్వభావమై యున్నది, మరియు ఆయన పూర్తి స్వభావాన్ని మనుష్యులకు కనబర్చినప్పుడు, అది నీ శరీరానికి ఏమి తీసుకువస్తుంది? దేవుని నీతి స్వభావము మనుష్యులకు ప్రత్యక్షపరచబడినప్పుడు, వారి శరీరము తప్పనిసరిగా తీవ్రంగా నలుగగొట్టబడుతుంది. నీవు ఈ బాధను ఎదుర్కోకపోతే, దేవుని పరిపూర్ణతను పొందలేవు, దేవునిపై నిజమైన ప్రేమను చూపించలేవు. దేవుడు నిన్ను పరిపూర్ణునిగా చేస్తే, ఆయన తప్పనిసరిగా తన పూర్తి స్వభావాన్ని నీకు కనబరుస్తాడు. సృష్ట్యాది నుండి ఈ రోజు వరకు, దేవుడు తన పూర్తి స్వభావాన్ని మనుష్యులకు ఎప్పుడూ కనబర్చలేదు—కానీ కడవరి దినములలో ఆయన ముందుగానే గమ్యస్థానాన్ని నిర్దేశించి, ఎన్నుకున్న ఈ జనులకు దానిని ప్రత్యక్షపరుస్తాడు, మరియు వారిని పరిపూర్ణులనుగా చేయుట ద్వారా, తన స్వభావాన్ని వారు ధరించేలా చేసి, తద్వారా జనులను సంపూర్ణం చేసుకుంటాడు. ప్రజల పట్ల దేవుని నిజమైన ప్రేమ ఈ విధంగా ఉంటుంది. దేవుని నిజమైన ప్రేమను అనుభవించాలంటే మనుష్యులు తీవ్రమైన శ్రమలను ఎదుర్కొని, అధిక వెలను చెల్లించాలి. ఇలా జరిగిన తర్వాతే వారు దేవునిచే స్వీకరించబడినవారై దేవుని పట్ల వారి నిజమైన ప్రేమను చూపించగలుగుతారు, అప్పుడు మాత్రమే దేవుని హృదయం సంతృప్తి చెందుతుంది. మనుష్యులు దేవునిచే పరిపూర్ణులవడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడి, దేవుని పట్ల తమ పూర్తి ప్రేమను కనబర్చితే, మరణము కంటే భయంకరమైన బాధలను వారి పరిస్థితుల నుండి అనుభవించడానికి వారు అనేక తీవ్రమైన శ్రమలు మరియు వేదనలు ఎదుర్కోవాలి. చివరికి వారు తమ నిజమైన హృదయాన్ని తిరిగి దేవుడికి ఇవ్వడానికి బలవంతము చేయబడతారు. ఒకరు నిజముగా దేవుడిని ప్రెమిస్తున్నదీ లేనిదీ శ్రమలు మరియు శుద్ధీకరణ ప్రక్రియలో దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు మనుష్యుల ప్రేమను పవిత్రపరుస్తాడు, ఇది కూడా శ్రమలు మరియు శుద్ధీకరణ ప్రక్రియలో భాగంగానే సాధించబడుతుంది.