“వెయ్యేండ్ల రాజ్యం వచ్చేసింది” గురించి ఒక క్లుప్తమైన ప్రసంగం
వెయ్యేండ్ల రాజ్య దర్శనం గురించి మీరు ఏమి ఆలోచిస్తున్నారు? కొ౦తమ౦ది ప్రజలు దాని గురి౦చి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు, కొందరు: “వెయ్యేండ్ల రాజ్య౦ భూమ్మీద వెయ్యి స౦వత్సరాలపాటు ఉ౦టు౦ది, కాబట్టి సంఘంలోని వయస్సు పైబడిన సభ్యులు అవివాహితులైతే, వారు వివాహ౦ చేసుకోవలసి ఉంటుందా? నా కుటుంబానికి డబ్బు లేదు, నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టాలా? …” అని అడుగుతారు. వెయ్యేండ్ల రాజ్యం అంటే ఏమిటి? మీకు తెలుసా? ప్రజలు దృష్టి మాంద్యం కలిగిన వారు, అత్యంత కఠిన పరీక్షను అనుభవిస్తున్నారు. నిజానికి, వెయ్యేండ్ల రాజ్యం ఇంకను అధికారికంగా రావాల్సివుంది. ప్రజలను పరిపూర్ణులుగా చేసే దశలో, వెయ్యేండ్ల రాజ్యం రెక్కలు తొడుక్కుంటున్నది; దేవుడు వెయ్యేండ్ల రాజ్యం గురించి మాట్లాడే సమయానికి మనుష్యుడు పరిపూర్ణుడు కావించబడతాడు. గతంలో, ప్రజలు సత్పురుషుల వలె ఉంటారని మరియు సినిమ్ భూమిలో దృఢంగా నిలబడతారని చెప్పబడింది. ప్రజలు పరిపూర్ణులుగా అయినప్పుడు—దేవునిచే చెప్పినట్లుగా వారు సత్పురుషులుగా మారినప్పుడు మాత్రమే—వెయ్యేండ్ల రాజ్యం వస్తుందా? దేవుడు మనుష్యులను పరిపూర్ణులుగా చేసినప్పుడు, అయన వారిని శుద్ధీకరిస్తాడు మరియు వారు ఎంత ఎక్కువగా శుద్ధి కావించబడతారో అంత ఎక్కువగా వారు దేవునిచే పరిపూర్ణులుగా చేయబడతారు. మీలో వున్న మాలిన్యం, తిరుగుబాటుతనం, వ్యతిరేకత మరియు శరీర సంబంధమైన కార్యములను బహిష్కరించినప్పుడు, మీరు దేవునిచే ప్రేమించబడతారు (ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు సత్పురుషుడు అవుతారు); మీరు దేవునిచే పరిపూర్ణులుగా చేయబడిన తర్వాత మరియు సత్పురుషులుగా మారిన తర్వాత, మీరు వెయ్యేండ్ల రాజ్యంలో వుంటారు. ఇప్పుడు వెయ్యేండ్ల రాజ్య యుగం. వెయ్యేండ్ల రాజ్యయుగంలో ప్రజలు జీవించడానికి దేవుని మాటలపై ఆధారపడతారు మరియు అన్ని దేశములు దేవుని నామము క్రిందకు వస్తాయి మరియు దేవుని మాటలను చదవడానికి అందరూ వస్తారు. ఆ సమయంలో, కొంత మంది టెలిఫోన్ ద్వారా కాల్ చేస్తారు, కొంత మంది ఫ్యాక్స్ చేస్తారు … వారు దేవుని మాటలను పొందుకోవడానికి ప్రతి ఒక్క మార్గము ఉపయోగిస్తారు, మరియు మీరు కూడా దేవుని మాటల క్రిందకు వస్తారు. ప్రజలు పరిపూర్ణులుగా చేయబడిన తరువాత ఇది అంతయు జరుగుతుంది. ఈ రోజు, ప్రజలు పరిపూర్ణులుగా, శుద్దీకరించబడిన వారుగా, జ్ఞానం పొందుకున్న వారిగా మరియు మాటల ద్వారా దిశా నిరేశం చేయబడ్డారు; ఇది రాజ్య యుగం, ఇది ప్రజలు పరిపూర్ణులుగా చేయబడే దశ మరియు దీనికి వెయ్యేండ్ల రాజ్యంతో ఎటువంటి సంబంధం లేదు. వెయ్యేండ్ల రాజ్య యుగంలో, ప్రజలు అప్పటికే పరిపూర్ణులు కావించబడ్డారు మరియు వారిలోని అవినీతి స్వభావాలు శుద్దీకరించబడతాయి. ఆ సమయ౦లో, దేవునిచే మాట్లాడబడిన మాటలు ప్రజలను దశలవారీగా దిశానిర్దేశం చేస్తాయి, సృష్టి ఆరంభం ను౦డి నేటి వరకు దేవుని కార్యం రహస్యాలన్ని౦టినీ వెల్లడిచేస్తాయి మరియు ఆయన మాటలు ప్రతి యుగ౦లో, ప్రతీ రోజు దేవుని కార్యములను ప్రజలకు తెలియజేస్తాయి, ఆయన ప్రజలను ఎలా నడిపిస్తాడు, ఆధ్యాత్మిక రాజ్య౦లో ఆయన చేసే కార్యం, ఆధ్యాత్మిక రాజ్యం గతిశీలత గురించి వారికి చెబుతాయి. అప్పుడు మాత్రమే అది నిజంగా వాక్కు యుగం అవుతుంది; ఇప్పుడు అది రెక్కలు తొడుక్కుంటున్న స్థితిలో వుంది. ప్రజలు పరిపూర్ణులుగా మరియు శుద్ధి చేయబడకపోతే, వారు భూమి మీద వెయ్యి సంవత్సరాలు జీవించేటటువంటి మార్గం ఉండదు, మరియు వారి శరీరం అనివార్యంగా కుళ్లిపోతుంది; ప్రజలు లోపల శుద్ధి చేయబడిన యెడల వారు సాతాను శరీరం గలవారు కాకు౦డా, అప్పుడు వారు భూమి మీద సజీవంగా ఉ౦టారు. ఈ దశలో మీరు ఇంకనూ దృష్టి మాంద్యం కలిగివుంటారు మరియు మీరు ఈ భూమి మీద జీవించే ప్రతి రోజు అనుభవించినదంతా దేవుణ్ణి ప్రేమించడం మరియు అయన సాక్ష్యమును కలిగివుండటంగానే ఉంటుంది.
“వెయ్యేండ్ల రాజ్యం వచ్చింది” అనేది ఒక ప్రవచనం, అది ఒక ప్రవక్త ము౦దుగా చెప్పడ౦తో సమాన౦గా ఉ౦టు౦ది, దానిలో భవిష్యత్తులో ఏమి జరుగుతు౦దో దాని గురించి దేవుడు ప్రవచిస్తాడు. భవిష్యత్తులో దేవుడు మాట్లాడే మాటలు మరియు అయన ఈరోజు మాట్లాడే మాటలు ఒకేలా వుండవు. భవిష్యత్తులోని మాటలు యుగానికి మార్గనిర్దేశం చేస్తాయి, అయితే ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు ప్రజలను పరిపూర్ణంగా చేస్తాయి, వారిని శుద్దీకరిస్తాయి మరియు వారితో వ్యవహరిస్తాయి. భవిష్యత్తులోని వాక్కు యుగం ఈనాటి వాక్కు యుగమునకు భిన్నంగా ఉంటుంది. ఈనాడు, దేవుడు పలికే మాటలన్నీ—ఆయన మాట్లాడేటటువంటి విధానాలతో సంబంధం లేకుండా—ప్రజలను పరిపూర్ణులను చేయడానికి, వారి లోపల మాలిన్యంగా ఉన్నవాటిని శుద్ధి చేయడానికి, వారిని పవిత్రులనుగా చేయడానికి మరియు దేవుని ముందు వారిని నీతిమంతులను చేయడానికి ఉద్దేశించినవిగా ఉంటాయి. ఈరోజు మాట్లాడిన మాటలు మరియు భవిష్యత్తులో మాట్లాడే మాటలు రెండు వేర్వేరు విషయాలు. రాజ్యయుగంలో మాట్లాడే మాటలు ప్రజలను అన్ని శిక్షణలలో ప్రవేశించేలా చేయడం, ప్రతిదానిలో ప్రజలను సరైన మార్గంలోకి తీసుకురావడం, వాటిలో మాలిన్యమైనదంతటిని బహిష్కరించడం కొరకు. అలాంటిది ఈ యుగంలో దేవుడు చేసేది. ప్రతి వ్యక్తిలోనూ ఆయన మాటల పునాదిని సృష్టిస్తాడు. తన మాటలను ప్రతి వ్యక్తి జీవితంగా చేస్తాడు. ఎడతెగక జ్ఞానోదయం కలిగించి, వారికి మార్గనిర్దేశం చేయడానికి తన మాటలను ఉపయోగిస్తాడు. మరియు వారు దేవుని చిత్తం పట్ల జాగరూకతతో లేనప్పుడు, వారిని నిందించడానికి మరియు క్రమశిక్షణలో పెట్టటానికి వారి లోపల దేవుని మాటలు ఉంటాయి. ఈనాటి మాటలు మానవునికి జీవమై వున్నాయి; అవి మానవునికి అవసరమైనవన్నీ నేరుగా అందిస్తాయి, మీ లోపల లేనివన్నీ దేవుని మాటల ద్వారా అమర్చబడతాయి, మరియు దేవుని మాటలను అంగీకరించే వారందరూ ఆయన మాటలను తినడం మరియు తాగడం ద్వారా జ్ఞానోదయం పొందుకుంటారు. దేవుడు భవిష్యత్తులో మాట్లాడే మాటలు విశ్వమంతటా వున్న ప్రజలందరికి దిశానిర్దేశం చేస్తాయి; ఈరోజు, ఈ మాటలు చైనాలో మాత్రమే మాట్లాడబడుతున్నాయి మరియు అవి మొత్తం విశ్వం అంతటా మాట్లాడే వాటికి ప్రాతినిధ్యం వహించవు. వెయ్యేండ్ల రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు విశ్వమంతటితో మాట్లాడతాడు. నేడు దేవుడు చెప్పిన మాటలన్నీ ప్రజలను పరిపూర్ణులను చేయడం కొరకేనని తెలుసుకోండి; ఈ దశలో దేవుడు మాట్లాడిన మాటలు ప్రజల అవసరాలను తీర్చడానికి, రహస్యాలను తెలుసుకోవడానికి లేదా దేవుని అద్భుతాలను చూడటానికి మిమ్మల్ని అనుమతించడానికి కాదు. ప్రజల అవసరాలను తీర్చడానికి అయన అనేక మార్గాల ద్వారా మాట్లాడుతున్నాడు. వెయ్యేండ్ల రాజ్యం ఇంకనూ రానైయుంది—దేవుని మహిమ దినం అని చెప్పబడేది వెయ్యేండ్ల రాజ్యం. యేసు కార్యం యూదయలో పూర్తయిన తర్వాత, దేవుడు తన కార్యమును చైనా ప్రధాన భూభాగానికి బదిలీ చేసి ఇంకొక ప్రణాళికను రూపొందించాడు, ఆయన తన మాటలతో ప్రజలను పరిపూర్ణులుగా చేసే కార్యం చేస్తాడు మరియు ప్రజలు ఎ౦తో బాధను అనుభవి౦చేలా చేయడానికి అదే విధంగా, ఎంతో దేవుని కృపను స౦పాది౦చుకోవడానికి ఆయన మాటలను ఉపయోగిస్తాడు. ఈ కార్య దశ అధిగమించే వారి సమూహాన్ని సృష్టిస్తుంది, మరియు ఆయన ఈ అధిగమించే వారి సమూహాన్ని చేసిన తరువాత, వారు ఆయన క్రియలకు సాక్ష్యం ఇవ్వగలుగుతారు, వారు వాస్తవికతలో జీవించగలుగుతారు మరియు వారు వాస్తవానికి ఆయనను సంతృప్తి పరుస్తారు మరియు మరణం వరకు ఆయనకు విధేయులుగా ఉంటారు, మరియు ఈ విధంగా దేవుడు మహిమను పొందుకుంటాడు. దేవుడు మహిమను పొందుకుంటున్నప్పుడు—అ౦టే ఆయన ఈ సమూహమును పరిపూర్ణ౦ చేసినప్పుడు—అది వెయ్యేండ్ల రాజ్య యుగ౦ అవుతుంది.
యేసు ఈ భూమి మీద ముప్పది మూడున్నర సంవత్సరాలు వున్నపుడు, ఆయన సిలువ కార్యమును చేయడానికి వచ్చాడు, మరియు ఆ సిలువ కార్యము ద్వారా దేవుడు ఒక భాగం మహిమను పొందుకున్నాడు. దేవుడు శరీరధారియై వచ్చినప్పుడు, ఆయన దీనుడై మరియు మరుగు పరచుకొని మరియు విపరీతమైన బాధలను అనుభవించగలిగాడు. ఆయన స్వయ౦గా దేవుడు అయినప్పటికీ, ఆయన ఇంకా ప్రతి అవమానాన్ని మరియు ప్రతి దూషణను సహి౦చాడు, విమోచన కార్యమును పూర్తి చేయడానికి సిలువలో మేకులు కొట్టబడటం ద్వారా ఆయన ఎ౦తో బాధను సహి౦చాడు. ఈ కార్య దశ ముగిసిన తరువాత, దేవుడు గొప్ప మహిమను పొందుకున్నాడని ప్రజలు చూసినప్పటికీ, అది మొత్తం ఆయన మహిమ కాదు, అది యేసు వలన పొందుకున్న ఆయన మహిమలో ఒక భాగం మాత్రమే. యేసు ప్రతి ఒక్క కష్టమును భరించగలిగినప్పటికీ, వినయ౦గా, మరుగుపరచుకొని, దేవుని కొరకు శిలువ వేయబడినప్పటికీ, దేవుడు తన మహిమలో ఒక భాగాన్ని మాత్రమే స౦పాది౦చుకున్నాడు, మరియు ఆయన మహిమ ఇశ్రాయేలులో పొందుకొనబడింది. దేవుడు ఇంకను ఇంకొక భాగం మహిమను కలిగివున్నాడు: ఆచరణాత్మకంగా పని చేయడానికి మరియు ఒక ప్రజల సమూహమును పరిపూర్ణులుగా చేయడానికి భూమి మీదకు రావడం. యేసు కార్యదశలో, ఆయన కొన్ని అసాధారణమైన విషయాలు చేసాడు, కానీ ఆ కార్య దశ అనేది కొన్ని సూచక క్రియలు మరియు అద్భుతాలు చేయడానికి మాత్రమే. అది ప్రాధమికంగా యేసు పొందిన బాధలను మరియు దేవుని కొరకు సిలువ వేయబడటం చూపించడానికి, ఆయన దేవుని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ విపరీతమైన బాధను భరించాడు, దేవుడు ఆయనను విడిచిపెట్టినప్పటికీ, ఆయన ఇంకను తన జీవితాన్ని దేవుని చిత్తం కొరకు తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండెను. దేవుడు ఇశ్రాయేలులో తన కార్యమును పూర్తి చేసిన తరువాత మరియు యేసు సిలువలో మేకులు కొట్టబడిన తరువాత, దేవుడు మహిమను పొందుకున్నాడు, మరియు సాతాను ముందు సాక్ష్యమును కలిగివుండెను. చైనాలో దేవుడు ఎలా శరీరధారిగా మారాడో మీకు తెలియదు లేదా చూడలేదు, కాబట్టి దేవుడు మహిమను పొ౦దాడని మీరు ఎలా చూడగలరు? దేవుడు నీలో ఎక్కువ గెలుపు కార్యములు చేసినప్పుడు మరియు మీరు స్థిరముగా నిలిచినప్పుడు, అప్పడు దేవుని కార్యము ఈ దశ విజయవంతమవుతుంది మరియు అది దేవుని మహిమతో భాగం అవుతుంది. మీరు దీనిని మాత్రమే చూస్తారు మరియు మీరు ఇంకను దేవునిచే పరిపూర్ణులుగా చేయబడలేదు, ఇంకనూ మీ హృదయాన్ని సంపూర్తిగా దేవునికి ఇవ్వాలి. మీరు ఇంకా ఈ మహిమను పూర్తిగా చూడలేదు; దేవుడు మీ హృదయాన్ని ఇప్పటికే జయించాడని, మీరు ఆయనను ఎన్నడూ విడిచిపెట్టలేరని, చివరి వరకు దేవుణ్ణి అనుసరిస్తారని, మీ హృదయం మారదని, ఇదే దేవుని మహిమ అని మాత్రమే మీరు చూస్తారు, ఇది దేవుని మహిమ. సంఘములలో వున్న సహోదర మరియు సహోదరీల శక్తి ఉద్భవించినపుడు మరియు వారు తమ హృదయాల నుండి దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు, దేవుడు చేసిన పని అత్యున్నత శక్తిని, ఆయన మాటల సాటిలేని శక్తిని చూసినప్పుడు, ఆయన మాటలు అధికారాన్ని కలిగి ఉన్నాయని మరియు అతను చైనా ప్రధాన భూభాగం దయ్యపు పట్టణంలో తన కార్యమును ప్రారంభించగలడని వారు చూసినప్పుడు, ప్రజలు బలహీనులైనప్పటికీ, వారి హృదయాలు దేవుని ముందు తలవంచి, వారు దేవుని మాటలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరియు వారు బలహీనంగా మరియు అయోగ్యంగా ఉన్నప్పటికీ, దేవుని మాటలు చాలా ప్రేమగలవని మరియు వారి రక్షణకు చాలా అర్హమైనవని వారు చూడగలిగినప్పుడు ఇది దేవుని మహిమ. ప్రజలు దేవునిచే పరిపూర్ణులుగా చేయబడే దినము వచ్చినప్పుడు, మరియు ఆయన సన్నిధిని సమర్పించుకోగలిగే దినము వచ్చినప్పుడు, దేవునికి పూర్తిగా విధేయత చూపి మరియు వారి అవకాశములను మరియు విధిని దేవుని చేతిలో వదిలివేయగలిగినప్పుడు దేవుని మహిమ రెండవ భాగమును పూర్తిగా పొందగలరు. అంటే, ఆచరణాత్మక దేవుని కార్యము పూర్తిగా ముగిసినప్పుడు, చైనా ప్రధాన భూభాగంలో ఆయన కార్యము ముగింపునకు వస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు పూర్వమే నిర్ణయించిన మరియు ఎంచుకున్న వారు పరిపూర్ణంగా చేయబడినప్పుడు, దేవుడు మహిమను పొందుతాడు. దేవుడు తన మహిమ రెండవ భాగమును తూర్పుకు తీసుకువచ్చాడని చెప్పాడు, అయినప్పటికీ ఇది మామూలు కళ్ళకు కనిపించదు. దేవుడు తన కార్యమును తూర్పుకు తీసుకువచ్చాడు: ఆయన ఇప్పటికే తూర్పుకు వచ్చాడు మరియు ఇది ఆయన మహిమ. ఈ రోజు, ఆయన కార్యము ఇంకను పూర్తి కానప్పటికీ, దేవుడు కార్యము చేయాలని నిర్ణయించుకున్నందువలన, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవుడు ఈ కార్యమును చైనాలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు ఆయన మిమ్ములను పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆవిధంగా, బయటకు వెళ్ళటానికి ఆయన మీకు ఎటువంటి మార్గం ఇవ్వడు—ఆయన ఇప్పటికే మీ హృదయాలను జయించాడు మరియు మీకు ఇష్టం వున్న లేకున్నా మీరు వెళ్ళాలి మరియు మీరు దేవునిచే సంపాదించుకొనబడిన తర్వాత, దేవుడు మహిమను పొందుకుంటాడు. ఈనాడు, దేవుడు ఇంకనూ పూర్తి మహిమను పొందుకోవాల్సి వుంది, ఎందుకంటే మీరు ఇంకనూ పరిపూర్ణులుగా చేయబడవలసివుంది. మీ హృదయాలు దేవుని తట్టు తిరిగినప్పటికీ, మీ శరీరంలో ఇంకా అనేక బలహీనతలు వున్నాయి, మీరు దేవుణ్ణి సంతృప్తిపరచే సామర్ధ్యాన్ని కలిగి లేరు, దేవుని చిత్తం పట్ల మీరు శ్రద్ధ కలిగిలేరు మరియు మీరు ఇంకను వదలిపెట్టాల్సిన అనేక ప్రతికూల విషయాలు కలిగి వున్నారు మరియు తప్పనిసరిగా అనేక శ్రమలు మరియు శుద్ధీకరణల ద్వారా వెళ్ళాలి. ఆ విధంగా మాత్రమే మీ జీవిత స్వభావాలు మారగలవు మరియు మీరు దేవుని ద్వారా పొందుకోగలుగుతారు.