నేటి దేవుని పనిని ఎరిగినవారే దేవుని సేవ చేయగలరు
దేవుని ఎదుట సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఎర్రని మహాఘట సర్పమును సిగ్గుపరచుటకై, వ్యక్తులు కొన్ని నియమ నిబంధనలను నెరవేర్చేవారుగా ఉండాలి; వారు తమ హృదయములో దేవుని ప్రేమిస్తూ ఆయన వాక్యములోనికి ప్రవేశించాలి. మీరు దేవుని వాక్యములోనికి ప్రవేశించకపోతే సాతానును సిగ్గుపరచుట అసాధ్యము. మీ జీవితంలోని ఎదుగుదల ద్వారా ఆ ఎర్రని మహాఘట సర్పమును తిరస్కరించి దానిని తీవ్రంగా అవమానపరచగలుగుతారు; ఎర్రని మహాఘట సర్పాన్ని సిగ్గుపరచడానికి మీకున్న ఏకైక సత్య మార్గం ఇదే. దేవుని వాక్కులను ఆచరణలో పెట్టడానికి మీరు అధికంగా సుముఖతను కలిగి ఉంటే అదే దేవుని పట్ల మీకున్న ప్రేమకు, ఎర్రని మహాఘట సర్పముపై నీకున్న అసహ్యానికి గొప్ప నిదర్శనం; దేవుని వాక్యానికి మీరు కనబరిచే అధిక విధేయతే సత్యము పట్ల మీకున్న ఆశకు గొప్ప నిదర్శనం. దేవుని వాక్కుల కొరకు ఆశతో ఎదురుచూడని వారు జీవము లేని వారు. అట్టివారు దేవుని వాక్యముకు వెలుపల జీవిస్తారు, వారు మతానికి చెందినవారు. దేవుని యందు నిజముగా విశ్వాసముంచువారు ఆయన వాక్యమును భుజించుట మరియు పానము చేయుట ద్వారా ఆయన వాక్యమునందు లోతైన జ్ఞానమును కలిగి ఉంటారు. మీరు దేవుని వాక్కుల కొరకు ఆశతో ఎదురుచూడని వారైతే నిజముగా ఆయన వాక్యమును భుజించి పానము చేసేవారుగా ఉండలేరు, మీకు దేవుని వాక్యమునందలి జ్ఞానము లేకపోతే ఏవిధంగానూ దేవునికి సాక్షార్థముగా నిలవలేరు లేదా ఆయనను సంతృప్తి పరచలేరు.
దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా ఒక వ్యక్తి దేవునిని ఎలా తెలుసుకోవాలి? దేవుని వాక్యము ఆధారంగా మరియు ప్రస్తుత కాలంలో దేవుడు చేస్తున్న కార్యాల ఆధారంగా వ్యక్తులు ఏమాత్రమూ దారి తొలగకుండా లేదా ఎటువంటి అవాస్తవాలకు తావివ్వకుండా, మిగిలిన వారికంటే ముందుగా దేవుని పనిని తెలుసుకోవాలి. దేవునిని తెలుసుకోవడానికి ఇదే పునాది. దేవుని వాక్యమును గురించిన స్పష్టమైన అవగాహన లేని మిగిలిన అన్ని దుర్బోధలు కేవలం మతపరమైన భావనలు మాత్రమే; అవి తప్పుదోవ పట్టించే దోషసహిత అవగాహనలు. మతపరమైన వ్యక్తులకుండే ప్రధాన లక్షణం ఏమిటంటే, వారు దేవుని వాక్కులను గతంలో అర్థం చేసుకున్న విధానంలోనే పరిగణిస్తూ ప్రస్తుత కాలంలో దేవుని వాక్యాన్ని గత కాలంలో వాటిని అర్థం చేసుకున్న అవగాహనతో పోల్చుతూ ఉంటారు. మీరు ప్రస్తుత కాలంలో పనిని జరిగిస్తున్న దేవుని సేవించేటప్పుడు గతంలో పరిశుద్ధాత్మ జ్ఞానపు వెలుగులో బయలుపరచిన అంశాలను ఆధారంగా చేసుకుంటే మీ సేవకు అవి ఆటంకముగా ఉంటూ మీరు పాటించేవన్నీ మతపరమైన ఆచార వ్యవహారాలుగా తప్ప మరి దేనినీ కలిగి ఉండకుండా, కాలం చెల్లినవిగా ఉంటాయి. దేవుని సేవించు వారికి మిగతా లక్షణాలన్నీ ఎలా ఉన్నప్పటికీ, బయటకు కనిపించేటప్పుడు మాత్రం వినయముతో మరియు సహనముతో కనిపించాలని నమ్ముతూ, మీకున్న ఈ అవగాహనను ప్రస్తుత కాలంలో ఆచరణలో పెట్టాలని చూస్తే, అది తప్పనిసరిగా మతపరమైన భావన మాత్రమే అవుతుంది; అలాంటి ఆచరణ అనేది వేషధారణతో కూడిన ప్రదర్శన మాత్రమే. “మతపరమైన భావన” అనే వాక్యం పనికిమాలిన లేదా ఆచరణాత్మకం కాని (దేవుడు గతంలో పలికిన మాటలను మరియు పరిశుద్ధాత్ముడు నేరుగా బయల్పరచిన వెలుగును అర్థం చేసుకోవడంతో సహా) సంగతులను గూర్చి తెలుపుతుంది, ఒకవేళ వీటిని ప్రస్తుత కాలంలో ఆచరించాలని చూస్తే, అవి దేవుని పనికి అడ్డుపడటమే కాకుండా మానవునికి ఏమాత్రమూ ప్రయోజనాన్ని కలిగించవు. జనులు మతపరమైన భావనలకు సంబంధించిన సంగుతుల వంటి వాటిని తమ నుండి తొలిగించుకోలేకపోతే ఆవి దేవుని సేవించకుండా వారిని అవరోధించే గొప్ప అడ్డుబండలుగా తయారవుతాయి. మతపరమైన భావనలు కలిగి ఉండేవారు పరిశుద్ధాత్మ పనిని ఏమాత్రమూ అనుసరించలేరు—వారు మొదట ఒక అడుగు, ఆ తర్వాత నెమ్మదిగా రెండు అడుగులు వెనుకపడిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఈ మతపరమైన భావనలు మనుష్యులను అసాధారణమైన రీతిలో స్వనీతిని కలిగి ఉండేవారుగా, గర్విష్టులుగా తయారవ్వడానికి కారణమవుతాయి. దేవుడు గతంలో తాను చెప్పిన మరియు చేసిన వాటి విషయంలో ఏ మాత్రమూ మిశ్రమ భావాన్ని (లేదా విచారపడటం) కలిగి ఉండడు; ప్రస్తుత కాలంలో ఆచరణాత్మకం కానిది ఏదైనా ఉంటే ఆయన దానిని పరిత్యజిస్తాడు. మీరు నిజంగా మీకున్న స్వంత భావనల నుండి బయటపదలేకపోతున్నారా? మీరు గతంలో దేవుడు పలికిన మాటలను పట్టుకుని వ్రేలాడుతూ ఉంటే దేవుని పనిని ఎరిగినవారని ఋజువవుతుందా? మీరు ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ వెలుగును అంగీకరించలేని స్థితిలో ఉండి గతంలోని వెలుగుపైనే ఇంకనూ ఆధారపడుతున్నట్లయితే దేవుని అడుగుజాడలలో నడుస్తున్నారని ఋజువవుతుందా? మీరు ఇంకనూ మతపరమైన భావనలను వీడలేకపోతున్నారా? అదే నిజమైతే మీరు దేవుని వ్యతిరేకించే వానిగా తయారవుతారు.
జనులు తమ మతపరమైన భావనల నుండి బయటపడగలిగితే, ప్రస్తుత కాలంలో దేవుని వాక్యమును, పనిని కొలవడానికి వారు తమ మెదడును ఉపయోగించకుండా నేరుగా వాటికి లోబడేవారుగా ఉంటారు. ప్రస్తుత కాలంలో దేవుని పనిని, గతంలో దేవుని పనితో పోల్చినప్పుడు అవి ఒకేలా జరుగకపోయినప్పటికీ, మీరు గతంలోని ఆలోచనా విధానాన్ని విడనాడి దేవుని పనికి నేరుగా విధేయత చూపించగలుగుతారు. దేవుడు గతంలో ఎలా పనిచేసాడన్న దానితో సంబంధం లేకుండా, ప్రస్తుతం దేవుడు చేస్తున్న పనిని బట్టి గర్వించే వారిగా ఉండాలని అర్థం చేసుకునే సామర్థ్యం మీకు ఉంటే, దేవునికి లోబడి స్వీయ భావనలను విడనాడిన వారిగా ఉండటంతో పాటు దేవుని పనికి, వాక్యముకు విధేయత చూపిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచేవారుగా ఉంటారు. ఈ సందర్భంలో, మీరు నిజంగా దేవునికి లోబడేవారుగా ఉంటారు. మీరు దేవుని పనిని విశ్లేషించరు లేదా పరిశోధించరు; ఇది ఎలా ఉంటుందంటే దేవుడు మరియు మీరు ఇద్దరూ గతంలో దేవుని పనిని మరచిపోయినట్లుగా ఉంటుంది. ప్రస్తుతమున్నది మాత్రమే ప్రస్తుతానికి చెందినది, గడచినది గతానికి చెందినది, ఈ రోజు వరకు దేవుడు గతంలో చేసిన దానిని పక్కన పెట్టేసాడు కాబట్టి నీవిక అందులో నివసించకూడదు. అలాంటి వారు మాత్రమే దేవునికి పూర్తిగా లోబడి వారి మతపరమైన భావనలను పూర్తిగా విడనాడిన వారు.
ఎందుకంటే దేవుని పనిలో ఎల్లప్పుడూ కొత్తదనం ఉంటుంది, కొత్త పని మొదలు కాగానే పాతపని పాతదై కాలం చెల్లినదైపోతుంది. ఈ భిన్న రకాలైన పనులైన, పాత మరియు కొత్త పనులు ఒకదానితో ఒకటి విభేదించుకోవు, కానీ ఒకదానికి మరొకటి సంపూరకాలుగా ఉంటాయి; ప్రతి అడుగు గతంలో దాని నుండే ప్రారంభమవుతుంది. కొత్త పని వచ్చింది కాబట్టి, పాతవి పరిత్యజించబడాల్సిందే. ఉదాహరణకు, మానవులలో ఎప్పటి నుంచో వేళ్ళూనుకుపోయి పద్ధతులు మరియు అలవాటుగా చెప్పే మాటలు మానవుని అనేక సంవత్సరాల అనుభవంతో మరియు బోధలతో పెనవేసుకుపోయి మానవుని మనసులో అన్ని రకాలైన తప్పు భావనలను ఏర్పరిచాయి. దేవుడు తన నిజమైన ముఖాన్ని మరియు అసలైన స్వభావాన్ని మానవునికి ఇంకనూ పూర్తిగా బయలుపరచాల్సి ఉండగా ప్రాచీన కాలం నుండి అనేక సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయక సిద్ధాంతాలు మానవునికి అట్టి భావనలు ఏర్పడటానికి మరింత ప్రధాన కారణాలుగా ఉన్నాయి. దేవుడిని మనుష్యుడు నమ్ముతున్న కాలంలో మనుగడలో ఉన్న పలురకాల భావనల ప్రభావం, ప్రజలలో దేవుని గురించి అన్ని రకాలైన భావనలు నిరంతరం వృద్ధి చెందుతూ కాల క్రమేణా పరిణామం చెందుతూ రావడానికి దారితీసింది, ఇది దేవుని సేవించే అనేకులైన మతపరమైన వ్యక్తులు దేవునికి విరోధులుగా మారడానికి కారణమైంది. కాబట్టి, జనులలో మతపరమైన భావనలు ఎంత బలంగా ఉంటే, వారు దేవునిని అంత అధికంగా వ్యతిరేకించేవారుగా మరియు అంతే అధిక స్థాయిలో శత్రువులుగా ఉంటారు. దేవుని పని ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది కానీ పాతదిగా ఉండదు; అది ఎప్పుడూ ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచదు, కానీ కొద్దో గొప్పో నిరంతరం మారుతూ నూతనపర్చబడుతూ ఉంటుంది. ఈ విధానంలో పని చేయడం దేవుడు స్వయంగా తన వాస్తవ స్వభావాన్ని వ్యక్తం చేయడమే. ఇది దేవుని పనికి స్వాభావిక సూత్రము, మరియు దేవుడు తన నిర్వహణను పూర్తి చేసే ఒక మార్గం. ఒకవేళ దేవుడు ఈ విధానంలో పని చేసి ఉండకపోతే, మానవుడు మార్పు చెంది దేవుని తెలుసుకునే వాడు కాదు మరియు సాతాను ఎప్పటికీ జయించబడి ఉండేవాడు కాదు. ఈ విధంగా, ఆయన పనిలో తప్పులుగా కనిపిస్తూ ఉండే వాటిలో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి, అయితే నిజానికి ఇవి క్రమ వ్యవధుల్లో జరుగుతాయి. మానవుడు దేవుని యందు విశ్వాసముంచే మార్గము చాలా భిన్నమైనది. వ్యవస్థలలోని పాతగిలిన, సుపరిచిత సిద్ధాంతాలు మరియు విధానాలనే పట్టుకుని వ్రేలడుతూ ఉంటాడు, అవి ఎంత పాతవైతే మానవునికి అంత రుచికరంగా అనిపిస్తాయి. కఠిన పాషాణము వంటి మానవుని అవివేక హృదయం లోతైన దేవుని నూతన పనిని మరియు వాక్యమును ఎలా అంగీకరించగలదు? ఎప్పుడూ నూతనంగా ఉంటూ, ఎప్పటికీ పాతబడని దేవుడిని మానవుడు తిరస్కరిస్తున్నాడు; పెద్ద దంతాలతో, తెల్లని జుట్టుతో ఒక ప్రదేశం నుండి కదలలేని స్థితిలో ఉండే పాతకాలపు దేవుడంటేనే మనిషికి ఇష్టం. ఇందుమూలముగా దేవునికీ మానవునికీ ఎవరి అభిరుచులు వారికుండగా, మానవుడు దేవునికి శత్రువుగా తయారయ్యాడు. దాదాపు ఆరువేల సంవత్సరాలుగా దేవుడు నూతనమైన పనిని జరిగిస్తున్నప్పటికీ, ఈ విభేదాలలో అనేకములు ఈరోజుకి కూడా అలాగే కొనసాగుతున్నాయి. అవి ఇక ఛేదించలేనివిగా బలంగా నాటుకుపోయి ఉంటాయి. బహుశా మానవుని మొండితనం వలన లేదా దేవుని పరిపాలనా సంబంధమైన కట్టడలను మానవుడు తు. చ తప్పకుండా పాటించడం ద్వారా కావచ్చు—కానీ ఆ పురుష మరియు స్త్రీ పాదిరిలు మాత్రం అవే పాత బూజుపట్టిన పుస్తకాలు మరియు కాగితాలలో ఉన్నదానినే పట్టుకుని వ్రేలాడుతూ ఉంటారు. మరోవైపు ఇక నా పక్షాన నిలుచువారు ఎవరూ లేరన్నట్లుగా దేవుడు ఒక్కడే ఒంటరిగా అసంపూర్తిగా మిగిలిన తన నిర్వహణ పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విభేదాలు దేవుడిని మనిషిని ఒకరికొకరిని శత్రువులనుగా చేస్తూ ఎప్పటికీ పరిష్కారం కాని స్థితిలోనికి వచ్చినప్పటికీ దేవుడు మాత్రం వాటిని ఒకప్పుడుండి ఇప్పుడు లేనివన్నట్లుగా ఏమాత్రమూ పట్టించుకోకుండా ఉంటాడు. అయితే మనుష్యుడు మాత్రం తన నమ్మకాలు మరియు భావనలకే కట్టుబడి ఉంటూ వాటిని ఎప్పటికీ విడిచిపెట్టనివాడుగా ఉంటున్నాడు. కానీ, ఒక్క విషయానికి మాత్రము మానవుడు తనకు-తానే సాక్షిగా ఉంటున్నాడు: మానవుడు ఇట్టి ఆలోచనా విధానం నుండి బయటకు రానప్పటికీ, దేవుని పాదాలు మాత్రం ఎప్పుడూ కదులుతూ ఉన్నాయి మరియు పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన తన ధోరణిని మార్చుకుంటూనే ఉన్నాడు. ముగింపులో ఏ యుద్ధం లేకుండానే అపజయం పాలయ్యేది మాత్రం మానవుడే. అదేసమయంలో, అపజయం పాలైన తన అపహాసకులందరికీ గొప్ప విరోధిగానూ మరియు జయించి, అపజయము పొందక ఉన్న మానవులకు ఒక వీరునిగానూ తయారవుతాడు. దేవునితో పోటీపడి గెలవగలవాడెవడు? మానవుని భావనలన్నీ దేవుని నుండి వచ్చినట్లే కనిపిస్తాయి ఎందుకంటే, అందులో అధిక శాతం మొదట్లో దేవుడు చేసిన పనినుండి పుట్టుకొచ్చినవే. అయితే, ఈ ఒక్క కారణం చేత దేవుడు మానవుడిని క్షమించడు లేదా ప్రస్తుతం తన పని పరిధికి వెలుపల ఉంటూ తన ప్రారంభ పనిని ఆధారం చేసుకొని సమూహం వెంబడి సమూహాన్ని “దేవుని కొరకు” తయారు చేస్తున్నందుకు వారిని ఘనపరచడు కూడా. బదులుగా, దేవుడు మానవుని భావనలు మరియు పాత, మూఢ నమ్మకాలను తీవ్రంగా అసహ్యించుకుంటూ మొదట ఈ భావనలు ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయో ఆ తేదీని గుర్తించడానికి కూడా ఇష్టపడనివాడుగా ఉంటున్నాడు. ఈ భావనలన్నీ తన పని నుండి కలిగాయనే విషయాన్ని దేవుడేమాత్రమూ అంగీకరించడు ఎందుకంటే ఈ భావనలన్నిటినీ వ్యాప్తి చెందించింది మానవుడే; మానవుని ఆలోచన మరియు మనస్సును ఆధారంగా చేసుకునే ఈ భావనలన్నీ రూపుదిద్దుకున్నాయి—ఇవి దేవుని నుండి కాక సాతాను నుండి కలిగినవి. తన పని ఎప్పుడూ నూతనమైనదిగా మరియు తాజాగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం, పాతదిగా లేదా మృతమైనదిగా ఉండాలనేది ఆయన ఉద్దేశం కాదు, మానవుడు కట్టుబడి ఉండాలని దేవుడు విధించినది యుగకాలాదులతో మారుతుంటుంది, అది నిత్యము నిలుచునది లేదా మారనిది కాదు. సాతానైతే మనుష్యుడు మరణించడానికి, పాతబడటానికి కారణమవుతాడు కానీ ఆయన దేవుడై ఉండి తాను సృజించిన మనుష్యులు సజీవంగా, నూతనంగా ఉండేలా చేస్తాడు కాబట్టి ఇలా జరుగుతుంది. మీకు ఇది ఇంకా అర్థం కావట్లేదా? మీరు సంకుచిత మనసును కలిగిన వారు కాబట్టి దేవుని యెడల మీ స్వంత భావనలను కలిగి ఉంటూ వాటిని విడిచి పెట్టలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని పని దాదాపుగా అర్థరహితంగా ఉన్న కారణంచేతనో, లేదా దేవుని పని మానవుని కోరికలకు భిన్నంగా ఉండటం చేతనో లేదా ఇంకా తన విధులను నిర్వర్తించడంలో దేవుడు ఎల్లప్పుడూ నిర్లక్ష్యంగా ఉంటున్న కారణంచేతనో ఇలా జరగడం లేదు. మీకు విధేయత బొత్తిగా లోపించింది కాబట్టే, మీ స్వంత భావనలను విడిచిపెట్టలేకపోతున్నారు, మీలో దేవునిచే సృజించబడిన వారికుండే పోలికను ఏమాత్రమూ కలిగి లేరు; దేవుడు మీ కొరకు విషయాలను కఠినతరం చేస్తున్న కారణంగా ఇలా జరగడం లేదు. మీరే దీనంతటికీ కారణంగా ఉంటున్నారు, మరియు దేవునితో ఏ మాత్రమూ సంబంధం లేనివారుగా ఉంటున్నారు; శ్రమ మరియు దురదృష్టం అంతయూ మానవునిచే సృష్టించబడినదే. దేవుని ఆలోచనలు ఎల్లప్పుడూ మంచివే: మీరు భావనలు కల్పించుకునే వారిగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు కానీ, యుగములు గతించుచుండగా మార్పు చెందుతూ మిమ్మును మీరు నూతనపర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఇంకనూ మీకు మేలుకరమైనదేదో తెలియదు, అందుకే, మేలుకరమైనదేదో తెలుసుకోవడం కోసం ఇప్పటికీ ఎప్పుడూ వాటిని విశ్లేషిస్తున్నారు లేదా పరిశోధిస్తూనే ఉన్నారు. దేవుడు మీ పట్ల పరిస్థితులను క్లిష్టతరం చేస్తున్నాడనుకోవడానికి వీల్లేదు, మీరే దేవుని పట్ల భక్తిహీనులుగా ఉంటున్నారు మరియు మీ అవిధేయత మిక్కిలి గొప్పది. ఎందుకంటే, సృజింపబడిన చిన్న జీవియైన మీరు దేవుడు గతంలో చేసిన పనిలోని కొంత భాగాన్ని తీసుకొని దానినే ఆయుధంగా చేసుకొని దేవునిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు—ఇది మానవుని అవిధేయత కాదా? మానవులు దేవుని యెదుట తమ ఉద్దేశాలను వ్యక్తపరచుటకు ఏమాత్రమునూ అర్హత కలిగినవారు కాదని చెప్పడం సబబే, కానీ అంతంకంటే ఎక్కువగా వారు తమ పనికిమాలిన, పాతగిలి మురిగిపోయిన అలంకారభరితమైన భాషను ఇష్టప్రకారంగా ఉపయోగిస్తూ, దాని చుట్టూనే తిరుగుతూ ఉండటానికి—వారి బూజుపట్టిన భావనల గురించి దేనినైనా చెప్పడానికి అర్హతను కలిగి లేరు. వారు ఆఖరుకి మరింత పనికిమాలిన వారు కావడం లేదా?
దేవుని హృదయానుసారంగా ప్రవర్తించేవారే దేవుని నిజంగా సేవించేవారు, వీరినే దేవుడు వాడుకోగలడు, వీరే తమలోని మతపరమైన భావనలను విడిచిపెట్టగలిగేవారు. మీరు దేవుని వాక్కులను భుజించి పానము చేయడం మరింత ప్రభావవంతంగా ఉండాలని కోరుకుంటే మీరు మీకున్న మతపరమైన భావనలను విడిచిపెట్టాల్సిందే. మీరు దేవుని సేవించాలని కోరుకుంటే మొదట మీకున్న మతపరమైన భావనలను పక్కనపెట్టి, సమస్త విషయములలో దేవుని వాక్యముకు లోబడేవారుగా ఉండాలి. దేవుని సేవించేవారికుండాల్సిన లక్షణం ఇదే. మీరు ఈ వివేకాన్ని కలిగిలేకపోతే, మీరు సేవ చేయడం ప్రారంభించగానే ఆటంకాన్ని కలిగిస్తూ అలజడికి కారకులవుతారు, మీరు మీ స్వంత అభిప్రాయాలకే కట్టుబడి ఉంటే, ఇక తప్పనిసరిపరిస్థితుల్లో దేవునిచేత విసర్జించబడినవారై ఇక ఎప్పటికీ తిరిగి లేవని స్థితిలోనికి ప్రవేశిస్తారు. ఉదాహరణకు, ప్రస్తుత కాలాన్ని తీసుకుంటే: ఈరోజుల్లో మనం వింటున్న మాటలు మరియు చూస్తున్న పనులు బైబిల్లోని వాక్యముతో మరియు గతంలో దేవుడు చేసిన పనులతో సంబంధాన్ని కలిగి ఉండటం లేదు, అలాగే విధేయత చూపడానికి మీకు ఆసక్తి లేనట్లయితే మీరు ఎప్పుడైనా పడిపోయే అవకాశముంది. మీరు దేవుని చిత్త ప్రకారం దేవుని సేవ చేయాలనే కోరికను కలిగి ఉంటే, మీరు మొదట మీకున్న మతపరమైన భావనలను విడనాడి మీ స్వంత భావనలను సరిచేసుకోవాలి. పలుకబడబోవు వాటిలో అధికం ఇప్పటికే పలుకబడిన వాటితో సరిపోయేవిగా ఉండవు, అలాగే దేవునికి విధేయత చూపించాలనే ఆసక్తి ఇప్పుడు మీలో కొరవడినట్లయితే ముందున్న మార్గంలో మీరు ప్రయాణించలేరు. దేవుడు తన పనిని జరిగించే ఏదైనా నిర్దిష్ట విధానం మీ మనసులో నాటుకుపోయి, మీరు దానిని ఎప్పటికీ విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే ఆ విధానమే నెమ్మదిగా మీ మతపరమైన భావనగా వృద్ధి చెందుతుంది. దేవుడు ఏమై ఉన్నాడో అనేది మీలో పాతుకుపోయినట్లయితే, మీరు సత్యమును గ్రహించినట్లే లెక్క. దేవుని వాక్యము మరియు సత్యము మీ జీవితం కాగలిగితే అప్పుడు మీరు దేవుని గురించి మీ స్వంత భావనలను వేటినీ కలిగి ఉండరు. దేవుని గురించిన సత్య జ్ఞానమును ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏ విధమైన స్వీయ భావనలనూ కలిగి ఉండరు మరియు ఏ సిద్ధాంతాలకూ గుడ్డిగా కట్టుబడి ఉండరు.
మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోవడానికి ఈ ప్రశ్నలను సంధించుకోండి:
1. దేవుని పట్ల మీలో ఉన్న అవగాహనే మీరు దేవుని సేవించడంలో జోక్యం చేసుకుంటోందా (ఆటంకపరుస్తోందా)?
2. మీ అనుదిన జీవితంలో మీరు ఎన్ని మతపరమైన ఆచారాలను పాటిస్తున్నారు? మీరు కేవలం భక్తిగలవారిగా కనిపించినంత మాత్రాన మీ జీవితం తగినంత స్థాయికి ఎదిగినట్లేనా?
3. మీరు దేవుని వాక్కులను భుజించి పానము చేసినప్పుడు, మీరు మీ మతపరమైన భావనలను విడిచిపెట్టగలుగుతున్నారా?
4. మీరు ప్రార్ధించినప్పుడు మీరు మతపరమైన ఆచరణలను విడిచిపెట్టగలుగుతున్నారా?
5. మీరు దేవునిచే వాడబడేవారిగా ఉంటున్నారా?
6. దేవుని పట్ల మీకున్న జ్ఞానంలో మతపరమైన భావనలు ఎంత మేరకు ఉన్నాయి?